Top Stories
ప్రధాన వార్తలు
రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
తూర్పు గోదావరి, సాక్షి: మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఏపీ ముక్తకంఠంతో చెబుతోంది. ఆ పిలుపు కూటమి పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రజాదరణను భరించలేక దుశ్చర్యలకు పాల్పడుతోంది. తాజాగా సాక్షాత్తూ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపైన దాడికి టీడీపీ శ్రేణులు యత్నించారు.మంగళవారం అర్ధరాత్రి గోపాలపురం నల్లజర్లలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. హోం మంత్రి తానేటి వనిత స్థానికంగా ప్రచారం ముగించుకుని ఎక్స్ జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. YSRCP ప్రచార వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలతో గొడవకు దిగాయి. ఈలోపు టీడీపీ కార్యకర్తల్లో కొందరు తానేటి వనిత పైకి దూసుకెళ్లే యత్నం చేశారు.అయితే అప్రమత్తమైన ఆమె భద్రతా సిబ్బంది ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి భద్రత కల్పించారు. అయినా ఆగకుండా సుబ్రహ్మణ్యం ఇంటి ఫర్నీచర్‌ను, అక్కడున్న మరికొన్ని వాహనాల్ని ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొందరు అడ్డుకునే యత్నం చేయగా.. వాళ్లనూ తీవ్రంగా గాయపరిచారు. టీడీపీ నేతలు దాడికి యత్నించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యాయి. శాంతి భద్రతలను పర్యవేక్షించే హోం మంత్రిపై దాడికి యత్నించడాన్ని వైఎస్సార్సీపీ ముక్తకంఠంతో ఖండిస్తోంది. విషయం తెలిసిన ఎస్పీ జగదీష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చిన పోలీసులు.. మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నల్లజర్లలో భారీగా మోహరించారు.హోం మంత్రి స్పందనటీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, పైగా మహిళ అని కూడా చూడకుండా తనపై దాడికి యత్నించారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ‘‘హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో విషాదం.. ఏడుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మంగళవారం కుండపోత వర్షం కురిసింది. అకాల వర్షాల నేపథ్యంలో ప్రమాదాల కారణంగా రెండు రాష్ట్రాల్లో పలువురు మృతిచెందారు.కాగా, హైదరాబాద్‌లోని బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెంట్రింగ్ పని కార్మికుల షెడ్‌పై కూలిన రిటైనింగ్ వాల్. భారీ వర్షానికి కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సీఎన్‌డీఆర్‌ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఇక, మృతులను ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఇక, ఏపీలో కూడా పిడుగుల కారణంగా ఏడుగురు మృత్యువాడపడ్డారు. బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గోడకూలి ఏడుగురు చనిపోవడంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోడ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలన్నారు. #HyderabadRains #tankbund #Hussainsagar @CoreenaSuares2 @Rajani_Weather super duper rain. #scary pic.twitter.com/2xvWITJ3jt— sαмυεℓ ραυℓ🇮🇳 (@vikramsamuelp) May 7, 2024
May 8th: ఏపీ ఎన్నికల సమాచారం
AP Political And Elections News Updates In Telugu07:35 AM, May 8th, 2024టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు: తానేటి వనితహోంమంత్రి తానేటి వనిత కామెంట్స్.. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. మహిళ అని చూడకుండా దాడికి ప్రయత్నించారు. హోంమంత్రి దాడి చేయడమంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. 07:15 AM, May 8th, 2024తానేటి వనితపై టీడీపీ నేతల దాడి యత్నం..తూర్పుగోదావరిలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌నల్లజర్లలో టీడీపీ కార్యకర్తల బీభత్సంహోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నం. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది. హోంమంత్రిని సురక్షితంగా గదిలో ఉంచిన సెక్యూరిటీ. వైఎస్సార్సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల మూకుమ్మడి దాడి.టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్సీపీ నేతలకు తీవ్ర గాయాలు. టీడీపీ శ్రేణుల దాడిలో వాహనాలు, ఫర్నీచర్ ధ్వంసంసీసీ కెమెరాలో రికార్డయిన టీడీపీ నేతల దాడి దృశ్యాలు. నల్లజర్లలో భారీగా పోలీసుల మోహరింపు. 07:00 AM, May 8th, 2024గాజువాక రోడ్‌షోలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్‌కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యంప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాంగతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడమే కాక జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారునాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళవారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్‌కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి 06:50 AM, May 8th, 2024నేడు ఏపీలో మోదీ ప్రచారంనేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంమధ్యాహ్నం ప్రత్యేక విమానం తిరుమలకు మోదీరాజంపేట లోక్‌సభ పరిధిలో కలికిరిలో ఎన్నికల ప్రచారంసాయంత్రం విజయవాడలో రోడ్ షో 06:40 AM, May 8th, 2024అప్పుడూ ఇప్పుడూ 'అంతే'పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా వికృతరూపం దాల్చిన బాబు పెత్తందారీ పోకడవారికి లబ్ధి జరిగేది ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యంఅప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లిష్ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లోగ్యాంగ్ చేయని ప్రయత్నంలేదు.. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీలకూ అడ్డంకులుతొలి నుంచీ పేదలకు మేలు జరగకుండా కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకున్న బాబు బ్యాచ్‌తాజాగా కోడ్ పేరుతో విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చముఠా.. ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలపైనా కుట్రలుతెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీకి ఓకే చెప్పిన ఈసీ.. ఏపీలో మాత్రం నో 06:30 AM, May 8th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం
ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
సాక్షి, అమరావతి: ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండటంతో చంద్రబాబు గ్యాంగ్ పిచ్చెత్తిపోయి ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేక వైఎస్ జగన్‌పైన, ఆయన ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసి, ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రజల భూములపై వారికే హక్కులు కల్పించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై నీచమైన ప్రచారం చేస్తోంది. భూముల వ్యవస్థను సమూలంగా మార్చడం ద్వారా ప్రజలకు.. తద్వారా సమాజానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ఈ చట్టాన్ని స్వలాభం కోసం వివాదాస్పదంగా మారుస్తోంది. అసలు ఈ చట్టంపై కూటమి నేతల ఆరోపణలు.., వాస్తవాలేమిటో తెలుసుకుందాం..కూటమి నేతల ఆరోపణలు–వాస్తవాలుఆరోపణ: ప్రజల ఆస్తులు లాక్కోవడానికే ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది.వాస్తవం: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అసలు లక్ష్యమే ప్రజల ఆస్తులు కాపాడటం, వాటికి పూర్తి భద్రత కల్పించడం. ప్రభుత్వమే గ్యారెంటీ సర్టిఫికెట్ ఇవ్వడం. భూ యజమానులకు నష్టం కలిగితే పూర్తి పరిహారం చెల్లించడం. భూములు లాక్కోవడం అనేది ఈ చట్టంతో సాధ్యం కాదు.ఆరోపణ: భూ పత్రాలు ప్రభుత్వం వద్దే ఉంటాయి.వాస్తవం : భూ పత్రాలు ప్రభుత్వం చేతిలో ఉండవు. మీ వద్ద ఉన్న పత్రాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోదు. కేవలం రికార్డులు పరిశీలించి, ప్రజలకు గ్యారెంటీ సర్టిఫికెట్ ఇస్తుంది. ఇదే తుది కాపీ అవుతుంది. భవిష్యత్తులో 30 రకాల పత్రాల అవసరం ఉండదు.ఆరోపణ: కొత్త చట్టం అమల్లోకి వస్తే యాజమాన్య హక్కులను నిరూపించుకోవాలి.వాస్తవం : మీ వద్ద భూములు ఉంటే వాటి హక్కులను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వం వద్ద ఆ వివరాలు ఉంటాయి. ఆ వివరాల ప్రకారమే గ్యారెంటీ సర్టిఫికెట్ జారీ చేస్తారు. అందులో అభ్యంతరాలు ఉంటే రెండేళ్ల పాటు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్పీళ్లను పరిశీలించి శాశ్వత రిజిస్టర్లో నమోదు చేస్తారు.ఆరోపణ: కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు.వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లను అప్పిలేట్ అథారటీ పరిష్కరిస్తుంది. అక్కడ న్యాయం జరగకుంటే హైకోర్టులోని ప్రత్యేక బెంచ్‌ని ఆశ్రయించవచ్చు. ఆ బెంచ్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చు. కోర్టు ఇచ్చిన తుది తీర్పునే అప్పిలేట్ అథారిటీ అమలు చేస్తుంది. దీనిని మార్చే అధికారం మళ్లీ కోర్టుకే ఉంటుంది.ఆరోపణ: కోర్టుల్లో కేసులు వేసేందుకు టీఆర్‌ఓకు సమాచారమివ్వాలి.వాస్తవం : సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ, మీరు కోర్టులో కేసు వేసినట్లు సంబంధింత అధికారులకు తెలపాలి. తద్వారా మీ భూమి ఎక్కడికీ పోకుండా ఉంటుంది.ఆరోపణ: కొత్త చట్టం కింద భూహక్కుల నిర్ధారణ ఎవరు చేస్తారు?వాస్తవం : ఇప్పటికే ఉన్న భూమి వివరాలతో ఒక టైటిల్ రిజిస్టర్ మీ గ్రామానికి లేదా పట్టణానికి వస్తుంది. ఆ రిజిస్టర్‌లోని రికార్డులకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుంది. ఒకవేళ మీకు నష్టం కలిగితే ప్రభుత్వమే పూర్తి నష్ట పరిహారం చెల్లిస్తుంది. మీకు అధికారుల ద్వారా జరిగిన మార్పుల్లో అభ్యంతరాలుంటే కోర్టుల్లో సవాల్ చేయొచ్చు.ఆరోపణ: వారసత్వ హక్కుల వివాదాలు వస్తాయి.వాస్తవం : వారసత్వంగా సంక్రమించే ఆస్తులను టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా మీ పేరు మీద బదిలీ చేసుకోవచ్చు. వారసత్వం విషయంలో వివాదాలు ఉంటే కోర్టుకు వెళ్లాలి. కోర్టు తీర్పు ఆధారంగా రిజిస్టర్లో మీ పేర్లను నమోదు చేస్తారు.ఆరోపణ: ఈ చట్టం ఎక్కడా అమల్లో లేదు. ఏపీలోనే ఉంది.వాస్తవం : ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో అమల్లో ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, ఆఫ్రికా దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది. తద్వారా అక్కడి భూముల హక్కులకు భద్రత పెరిగింది. ఆయా దేశాల్లో ఈ వ్యవస్థ విజయవంతంగా నడుస్తోంది.ఆరోపణ: ఇది రాష్ట్ర ప్రభుత్వ చట్టమే. కేంద్రానిది కాదు.వాస్తవం : ల్యాండ్ టైట్లింగ్ చట్టం కోసం 1986లో ప్రొఫెసర్ డి.సి.వాధ్వా ఏకసభ్య కమిషన్‌ను కేంద్రం నియమించింది. ఈ కమిటీ 1989లో టైటిల్ గ్యారెంటీ చట్టం అమలును సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత 2008, 2011, 2015, 2019లో నాలుగుసార్లు ఇందుకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని రాష్ట్రాలకు పంపారు. 2019లో నీతి ఆయోగ్ కమిటీ కొత్త ముసాయిదాను రాష్ట్రాలకు పంపింది. 2024 డిసెంబర్‌లోపు అమలు చేయాలని ఆదేశించింది.ఆరోపణ: కొత్త చట్టం ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చింది.వాస్తవం : ఇంకా అమల్లోకి పూర్తిస్థాయిలో రాలేదు. చట్టం అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇందుకు సంబంధించిన నిబంధనలు తయారు కావాలి. గెజిట్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రూపొందించలేదు.ఆరోపణ: ఈ చట్టం వల్ల రైతులకు నష్టం.వాస్తవం : ఈ చట్టం వల్ల రైతులకు పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. 30 రకాల పత్రాల అవసరం ఉండదు. భూ వివాదాలు, సర్వే నంబర్లు, సరిహద్దుల సమస్యలు పరిష్కారం అవుతాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగాల్సిన అవసరం ఉండదు. మీ భూమిపై మీకు శాశ్వత హక్కులు వస్తాయి. భూకబ్జాల పీడ వదులుతుంది. మీ భూమిపై ఇతరులు దౌర్జన్యం చేసే అవకాశం ఉండదు. బ్యాంకులు సైతం సులువుగా లోన్లు జారీ చేస్తాయి.ఆరోపణ : ప్రజల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు చెల్లకుండా పోతాయి.వాస్తవం : ఈ చట్టం జాతీయ స్థాయిలో చర్చించి నీతి ఆయోగ్ సిఫారసు చేసిన చట్టం. అసెంబ్లీలో కూడా ఆమోదముద్ర పడింది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా మద్దతు ఇచ్చింది. రాష్ట్రమంతటా ఈ చట్టం ఒక్కరోజే అమల్లోకి రాదు. భూముల సర్వే తర్వాత అభ్యంతరాలను పరిష్కరించాక తుది రిజిస్టర్ రూపొందించిన ప్రదేశాల్లో కాలానుగుణంగా చట్టం అమల్లోకి వస్తుంది. అప్పటివరకు రైతుల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు చెల్లుబాటులోనే ఉంటాయి. ఒక్కసారి తుది రిజిస్టర్ ద్వారా ప్రభుత్వం టైటిల్ గ్యారెంటీ ఇచ్చాక పాత రికార్డులు చెల్లవు.ఆరోపణ : వందల చట్టాలు అమల్లో ఉండగా ఈ కొత్త చట్టం ఎందుకు?వాస్తవం : భూ రికార్డులకు సంబంధించి ఏపీలో 124 రకాల చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాలేవీ ఇవ్వని భరోసా కొత్త చట్టం ఇస్తుంది. ఆర్వోఆర్ చట్టం ద్వారా కేవలం రికార్డు మాత్రమే ఉంటుంది. ఆ రికార్డు ద్వారా సంక్రమించే హక్కులకు గ్యారెంటీ ఉండదు. కానీ కొత్త చట్టం హక్కులకు గ్యారంటీ ఇస్తుంది.ఆరోపణ : స్టాంపు కాగితాలకు బదులు జిరాక్సులు ఇస్తున్నారు.వాస్తవం : గత వంద సంవత్సరాలుగా స్టాంపు కాగితాలపైనే లావాదేవీలు నడిచాయి. కానీ, ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీ సర్టిఫికెట్ స్టాంపు కాగితాలకంటే విలువైనది. వీటిని జిరాక్స్ కాపీలు అని అనడం నీచమైన చర్య. ఒకవేళ గ్యారెంటీ సర్టిఫికెట్ పోగొట్టుకున్నా, టైట్లింగ్ ఆఫీసర్ వద్ద మీ వివరాలు పదిలంగా ఉంటాయి. మళ్లీ సర్టిఫికెట్ పొందవచ్చు.ఆరోపణ: న్యాయవాదులకు అన్యాయం జరుగుతుంది.వాస్తవం : ఈ చట్టం అమల్లోకి వస్తే భూ వివాదాలు తగ్గిపోతాయి. తద్వారా సివిల్ కేసులు కూడా భారీగా తగ్గుతాయి. అందువల్లే న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు. కానీ, ఈ చట్టం వల్ల పూర్తి పారదర్శకత లభిస్తుంది. ప్రజలకు మంచి జరుగుతుంది. హైకోర్టులో అప్పీల్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక న్యాయవాదులకు సివిల్ కేసులు కూడా వస్తాయి.ఆరోపణ : పాస్ పుస్తకాలపై సీఎం బొమ్మ ఉంది కాబట్టి ఆ భూమి మీది కాదు.వాస్తవం : ఇది దిక్కుమాలిన వాదన. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, రాజకీయ లబ్ధి పొందేందుకు కొన్ని అరాచక శక్తులు చేస్తున్న ఆరోపణ ఇది. కొత్త పాస్ పుస్తకాలను ప్రభుత్వం గ్యారెంటీతో ఇస్తుంది. ఈ పుస్తకాల ద్వారా రైతు లేదా భూ యజమానికి పంట సాయం వస్తుంది. సబ్సిడీలు వస్తాయి. బ్యాంకుల ద్వారా రుణాలొస్తాయి. పరిహారం వస్తుంది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు ఈ పుస్తకం ఆధారం. చాలా ప్రభుత్వ పథకాల అమలు సందర్భంగా ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రుల బొమ్మలు పెడుతుంటారు. కరోనా వేక్సినేషన్ సర్టిఫికెట్ల మీద ప్రధాని బొమ్మ ముద్రించారు. ముఖ్యమంత్రి బొమ్మ ఉన్నంత మాత్రాన ఏమీ జరగదు.
రాజమౌళికి వివాదాస్పద ప్రశ్న.. ఆయన ఏమన్నారంటే?
దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈసారి బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ అంటూ యానిమేషన్ సిరీస్‌ను పరిచయం చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ యానిమేషన్ సిరీస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రాజమౌళి. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అయితే అదే సమయంలో రాజమౌళికి ఓ ఊహించని ప్రశ్న ఎదురైంది. దానికి తనదైన శైలి ఆన్సరిచ్చారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఒక హీరోను ఎక్కువగా.. మరొకరిని తక్కువగా చేశారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది..దీనిపై మీరు క్లారిటీ ఇవ్వండి? అంటూ రాజమౌళిని ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. అసలు ఈ ప్రశ్నకు సందర్భమే కాదని కొట్టిపారేశారు. సింపుల్‌గా ఈ ప్రశ్నను తిరస్కరించారు. కాగా.. రాజమౌళి తదుపరి చిత్రం మహేశ్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా.. మే 17న బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీమిండియా స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్(అంతర్జాతీయ క్రికెట్, లీగ్‌లు)లో 350 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి భారత బౌలర్‌గా చాహల్ రికార్డులకెక్కాడు.ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను ఔట్ చేసిన చాహల్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. చాహల్ ఇప్పటివరకు 350 వికెట్లు పడగొట్టాడు. చాహల్ తర్వాత స్ధానంలో భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా 310 వికెట్లతో ఉన్నాడు.ఇక ఐపీఎల్లో సైతం అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చాహల్(201) కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్ ఫ్రెజర్ మెక్ గర్క్(20 బంతుల్లో 50), అభిషేర్ పోరెల్(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్ స్టబ్స్ మెరుపులు మెరిపించాడు.20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్.. 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు.
అప్పుడూ ఇప్పుడూ 'అంతే'
సాక్షి, అమరావతి: పేదలంటే ఏమాత్రం పట్టని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పదం వింటేనే అగ్గిమీద గుగ్గిలమవుతారు. ఇక వారికి ఏదైనా మేలు జరిగితే.. గుండెలు బాదుకోవడం.. గగ్గోలు పెట్టడం.. పెడబొబ్బలు.. ఆర్తనాదాలే. పుట్టుకతో సహజసిద్ధంగా ఆయనకు అబ్బిన ఈ లక్షణాలు ఇప్పుడు మరీ వికృతరూపం దాల్చి కరాళ నృత్యం చేస్తున్నాయి. పేదలకు అందాల్సిన పథకాలను ఎన్నికల కోడ్ ముసుగులో ఎన్నికల సంఘం ద్వారా అడ్డుకోవడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అసలు ఎన్నికల కోడ్ లేని సమయంలోనే పేదల చదువుల కోసం సీఎం వైఎస్ జగన్ సర్కారు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెడితే దానిపై ‘పచ్చ’ముఠా పెట్టిన గగ్గోలు అంతాఇంతా కాదు. ఆ విధానాన్ని అమలుచేయకుండా చేయని కుట్రలులేవు. అలాగే, అప్పట్లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూములను సేకరిస్తే వాటిపైనా న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుకుంది. ఆఖరికి అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందంటూ తమ పెత్తందారీ ధోరణిని ప్రదర్శించింది. ఇలా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పేదలకు ఇళ్ల స్థలాలివ్వకుండా కోర్టుల్లో కేసులు వేసింది. కానీ, సీఎం జగన్ సర్కారు వీటన్నింటినీ ఛేదించుకుని తన యజ్ఞాన్ని నిర్వఘ్నంగా కొనసాగించింది. ఇందుకు సుప్రీంకోర్టుకూ వెళ్లి పచ్చ మాఫియాపై విజయం సాధించింది. కానీ, ఎల్లో గ్యాంగ్ ఇప్పుడు ఎన్నికల కోడ్‌ను అడ్డుపెట్టుకుని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వలంటీర్లు ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయకుండా అడ్డుకుంది. దీంతో మండుటెండల్లో వృద్ధులు, వికలాంగులు సచివాలయాల చుట్టూ, బ్యాంకులు చుట్టూ తిరిగేలా చేసి అనేకమంది మృతికి ఈ పెత్తందార్లు కారణమయ్యారు. తమ రాజకీయాల కోసం వృద్ధులు, వికలాంగుల ప్రాణాలుపోయినా పర్వాలేదనే ధోరణిలో చంద్రబాబు బ్యాచ్ వ్యవహరించింది.ఎప్పటినుంచో కొనసాగుతున్న పథకాలకూ బ్రేకులు..నిజానికి.. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ అన్నది కొత్త కార్యక్రమమేమీ కాదు. ఎప్పటి నుంచో వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సూర్యోదయంలోపే వైఎస్సార్ పెన్షన్ కానుకను అందిస్తున్నారు. ఇలా కొనసాగుతున్న విధానానికి ఎన్నికల కోడ్ వర్తించకపోయినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘానికి బాబు బృందం ఫిర్యాదు చేసి వృద్ధులు, వికలాంగులు, వితంతవులును రోడ్డుపాల్జేసింది. అలాగే.. పేద విద్యార్థుల చివరి త్రైమాసికం విద్యాదీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందకుండా చేసింది. అసలివి ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీ పథకాలే. లబ్ధిదారులు సైతం పాత వారే తప్ప కొత్తగా ఎవ్వరినీ ఎంపిక చేయలేదు. అయినాసరే, చంద్రసేన ఒత్తిడితో పోలింగ్ పూర్తయ్యే వరకు ఇవి చెల్లించవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. వాస్తవానికి.. 2023లో కరువు కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమనేది ఇప్పటికే కొనసాగుతున్న ప్రక్రియే. చంద్రబాబు కుట్రల కారణంగా.. కరువుతో పంటలు కోల్పోయిన రైతులు ఇప్పుడు ఖరీఫ్‌లో విత్తనాల కొనుగోళ్లకు, ఇతర ఖర్చులకు డబ్బుల్లేక అప్పులు పాలవుతారనే కనీస ఆలోచన కూడా లేకుండా రైతులపట్ల కర్కశంగా, నిర్దయగా వ్యవహరించింది. ఇలా బాబు నిర్వాకంతో రాష్ట్రంలో 6,95,897 కరువు బాధిత రైతులకు చెల్లించాల్సిన రూ.847.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులు నిలిచిపోయాయి.తెలంగాణలో ఓకే.. ఏపీలో మాత్రం నో..కానీ, తెలంగాణలో వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం ‘నో’ చెప్పింది. ఈ విషయంలో ఏపీపట్ల ఎన్నికల సంఘం వివక్ష చూపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, పేద విద్యార్థుల పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ గత ఐదేళ్ల నుంచి విద్యాదీవెన పథకం కింద డీబీటీ రూపంలో బటన్‌నొక్కి ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోంది. విద్యాదీవెన కింద చివరి విడత కిస్తీని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే ప్రభుత్వం ప్రారంభించింది. ఇది కూడా ఇప్పటికే కొనసాగుతున్న పథకం అయినప్పటకి చంద్రబాబు బృందం ఒత్తిడితో ఎన్నికల సంఘం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.610.79 కోట్ల విద్యాదీవెన చెల్లింపులను నిలుపుదల చేసింది. విద్యార్థులు కాలేజీలకు ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వరనే కనీస జ్ఞానం కూడా లేకుండా రాజకీయానికే బాబు బ్యాచ్ ప్రాధాన్యతనిచ్చింది. దీంతో అప్పులుచేసి పేద విద్యార్థులు ఫీజులు చెల్లించే స్థితికి బాబు తీసుకొచ్చారు.‘చేయూత’ నిధులకూ చెక్..ఇక మరోపక్క.. పేద అక్కచెల్లమ్మలకు ‘చేయూత’ కింద ఆఖరి విడత నిధులను ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే ప్రారంభించినప్పటికీ బాబు బృందం ఒత్తిడితో ఆ నిధుల చెల్లింపులకూ ఎన్నికల సంఘం మొకాలడ్డింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు పేద మహిళల జీవనోపాధికి సాయం అందించే ‘చేయూత’ పథకం అమలు కూడా ఎప్పుడో ప్రారంభమైంది. ఇప్పటికే మూడు విడతల్లో ప్రభుత్వం అమలుచేసింది కూడా. ఇప్పుడు చివరి విడత కింద 29 లక్షల మంది పేద మహిళలకు సాయం అందాలి. దీనికి కూడా బాబు బృందం ఒత్తిడితో కేంద్ర ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. గత ఐదేళ్ల నుంచి కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కోడ్ సాకుతో చంద్రబాబు కోటరీ పెత్తందారీ పోకడలతో అడ్డుకోవడం ద్వారా పేద విద్యార్థులు, రైతులు, మహిళల పొట్టకొట్టి తమ వికృతరూపాన్ని ఆ ముఠా చాటుకుంది.
పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
ఓటు అనే ఆయుధంతో ఢిల్లీ పీఠం కదలాలివీళ్లు ఎన్ని కుట్రలు చేసినా.. దేవుడు అంతా గమనిస్తున్నాడు. మీ బిడ్డకు ప్రజల దీవెనలున్నాయి. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నల చేతుల్లో ఓటు అనే బలమైన ఆయుధం ఉంది. ఆ ఓటు అనే ఆయుధంతో వీళ్లను కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కూడా కదులుతుందని గట్టిగా చెబుతున్నా.విశాఖలోనే ప్రమాణ స్వీకారం..జూన్ 4 తర్వాత మీ బిడ్డ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తాడు. అదే రోజు పరిపాలనా రాజధానిగా విశాఖ నుంచే పాలన చేయబోతున్నానని గర్వంగా చెబుతున్నా. మూడు రాజధానుల్లో విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నాం. మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తూ మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా చేసింది మీ బిడ్డ ప్రభుత్వమే. ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు ఎస్పీలతో పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు పాలన చేరువ చేశాం. శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయి. ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వస్తోంది. రూ.4,400 కోట్లతో మూలపేట పోర్టు పనులు వాయువేగంతో జరుగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను శరవేగంగా చేస్తున్నాం, విశాఖ–భోగాపురం 6 లేన్ల రహదారిని నిర్మిస్తున్నాం. విశాఖలో అదాని డేటా సెంటర్, ఇన్ఫోసిస్ మొదలైంది కూడా మీ బిడ్డ పాలనలోనే.– ఇచ్ఛాపురం సభలో సీఎం జగన్సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, విశాఖపట్నం: ‘దేవుడి దీవెనలు, మీ ఆశీస్సులున్నంత వరకూ మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కరూ ఆపలేరు. జూన్ 4న మనందరి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుంది. మనం నొక్కిన బటన్లు అన్నీ వారం రోజుల్లోనే క్లియర్ చేస్తాం. ఢిల్లీతో కలిసి మీ బిడ్డ ప్రభుత్వాన్ని దెబ్బ తీసే కుట్రలు చేస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు సీఎంగా చేశానంటాడు. అన్నేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే పేదలకు ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా? జగన్ అంటే పథకాలు.. చంద్రబాబు అంటే మోసాలు, కుట్రలు, కుతంత్రాలే గుర్తుకొస్తాయి’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలు, కుతంత్రాలకు ఓటు అనే వజ్రాయుధంతో మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంతలా దిగజారిపోయారు..కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ జగన్ నొక్కిన బటన్ల సొమ్ము నా అక్కచెల్లెమ్మలకు అందకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. సాక్షాత్తూ మీ జగన్ ఓ ముఖ్యమంత్రిగా కోర్టుకు వెళ్లి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కేసులు వేసే పరిస్థితిలోకి ప్రజాస్వామ్యం దిగజారిపోయిందంటే వీళ్లను ఏమనాలి? మీ జగన్ బటన్ నొక్కిన పథకాలన్నీ ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా తెచ్చినవి కాదు. గత ఐదేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా ఇస్తున్న పథకాలకే మీ జగన్ బటన్ నొక్కాడు. ఈ స్కీములు ఇవాళ ఏదో కొత్తగా తెచ్చినవి కాదు. ఇవన్నీ ఆన్ గోయింగ్ స్కీమ్స్. బడ్జెట్ కేటాయింపులున్నవే. అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినవే. 58 నెలలుగా ఇస్తున్న పథకాలకు అడ్డుపడుతూ జగన్‌ను కట్టడి చేసేందుకు ఢిల్లీతో కలసి కుట్రలు పన్నుతున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కిన సొమ్మును అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అందకుండా అడ్డు తగిలే దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వీళ్లు దిగజారిపోయారు. గత ఐదేళ్లుగా క్యాలండర్లో చెప్పిన విధంగా క్రమం తప్పకుండా ఇస్తూ పోతున్న మీ జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి కుట్రలు పన్నుతున్నారు. చివరిలో అడ్డుపడితే నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా? పెన్షన్ సొమ్ము ఇన్నేళ్ల పాటు మీ బిడ్డ ఇంటికే పంపించిన తర్వాత చివరి రెండు నెలలు ఆ డబ్బులు ఇంటికి రాకపోతే ఏం జరిగిందో ఆ అవ్వాతాతలు గ్రహించలేరనుకున్నారా? ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతున్నా. జూన్ 4న అధికారంలోకి వచ్చిన వెంటనే ఓ వారం రోజుల్లోనే ఈ బటన్లు అన్నీ మీ బిడ్డ క్లియర్ చేస్తాడు. బాబు ఒక్క బటనూ నొక్కలేదు..మనపై ఇన్ని కుట్రలు చేస్తున్న చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మీ జగన్ మాదిరిగా ఎన్నడూ బటన్లు నొక్కలేదు. ఏ రోజూ ఏ ఒక్క అక్కచెల్లెమ్మకూ డబ్బులు, పథకాలు ఇవ్వలేదు. మీ బిడ్డ జగన్ ఈ 59 నెలల కాలంలో 130 సార్లు బటన్లు నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపాడు. చంద్రబాబు దగ్గర ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఆ దోచేసిన సొమ్ముతో లోబర్చుకునేందుకు ఎన్నికల రోజు రూ.2 వేలు, రూ.3 వేలు, కొన్ని చోట్ల రూ.4 వేలు, రూ.5 వేలు కూడా ఇస్తాడు. చంద్రబాబు ఎన్నికల రోజు ఇచ్చే ఆ డబ్బంతా మనదే. మన దగ్గర దోచేసిన డబ్బే అది. కాబట్టి ఆయన ఇస్తే ఏ ఒక్కరూ వద్దు అనొద్దు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీకు, మీ కుటుంబానికి ఎవరి వల్ల మంచి జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ అభివృద్ధి, పథకాలను కొనసాగిద్దాం..మరో ఆరు రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపటమే. రాష్ట్రంలో గతంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ వచ్చాక ఏకంగా మరో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాడు. మేనిఫెస్టో హామీల్లో 99 శాతం అమలు చేసి చిత్తశుద్ధి చాటుకున్నాం. గడప గడపకూ మేనిఫెస్టోతో వెళ్లి మరోసారి ఆశీర్వదించాలని కోరాం. మన పథకాలు.. మచ్చుకు కొన్ని‘నాడు–నేడు’తో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు, ఇంగ్లిష్ మీడియం, 6వ తరగతి నుంచే క్లాస్ రూముల్లో డిజిటల్ బోధన, 8వ తరగతికి రాగానే ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబ్‌లు, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, పిల్లల చేతుల్లో బైలింగ్యువల్ టెక్టŠస్ బుక్స్ (ద్విభాషా పాఠ్య పుస్తకాలు), బడులు తెరవగానే పిల్లలకు విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి, పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెన, ఖర్చులకు ఇబ్బంది పడకుండా వసతి దీవెన, అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులతో భాగస్వామ్యం, తప్పనిసరి ఇంటర్న్‌షిప్... ఇలాంటి విద్యా విప్లవాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? మహిళా సాధికారత.. వినూత్న వ్యవస్థలుఅక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, 22 లక్షల గృహ నిర్మాణాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అవ్వాతాతలకు ఇంటికే రూ.3 వేలు పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు, రేషన్, పథకాలు.. ఇలా నేరుగా డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వాలు గతంలో ఉన్నాయా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకేలు, సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలు గతంలో ఉన్నాయా?స్వయం ఉపాధికి అండగా..వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, చిరువ్యాపారులకు తోడు, చేదోడు, లా నేస్తం లాంటి పథకాలతో స్వయం ఉపాధికి అండగా నిలిచిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? రూ.25 లక్షల వరకూ విస్తరించిన ఉచిత ఆరోగ్యశ్రీ, జీవన భృతి అందిస్తూ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజల ఆరోగ్యంపై ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? ఏ గ్రామానికి వెళ్లినా 600 రకాల సేవలందిస్తున్న సచివాలయం, ఫైబర్‌గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, అక్కచెల్లెమ్మల భద్రత కోసం గ్రామంలోనే మహిళా పోలీసు, దిశా యాప్ లాంటివి ఇంతకు ముందెప్పుడైనా చూశారా? నాడూ నేడూ అదే రాష్ట్రం.. అదే బడ్జెట్. చంద్రబాబు ఏ రోజూ పేదల కోసం బటన్లు నొక్కలేదు. అప్పుల గ్రోత్ రేట్ కూడా గతంలో కంటే ఇప్పుడే తక్కువ. ఇది కాదా అభివృద్ధి..?మీ జగన్ పేరు చెబితే ఎన్నో పథకాలు గుర్తుకొస్తాయి. బాబు పేరు చెబితే ఏ స్కీమూ గుర్తు రాదు కాబట్టి జగన్ హయాంలో అభివృద్ధి లేదంటూ అబద్ధాలు చెబుతున్నాడు. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.32,000 కోట్లు అయితే మీ బిడ్డ జగన్ పాలనలో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయంటే అంటే ఇది అభివృద్ధి పాలన కాదా? మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ మీ బిడ్డ హయాంలోనే వస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీని వరుసగా ఏటా నంబర్ వన్‌గా నిలబెట్టాం. కొత్తగా 4 సీ పోర్టులు నిర్మిస్తున్నాం. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం తీసుకొచ్చాం. 15,000 గ్రామ సచివాలయాలు, 11,000 విలేజ్, వార్డు క్లినిక్‌లు, 11,000 ఆర్బీకేలు నెలకొల్పాం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61% ఉంటే మన రాష్ట్రంలో మాత్రం 3.95% మాత్రమే ఉంది. వైద్య ఆరోగ్యశాఖలో 54 వేల మందికిపైగా సిబ్బందిని నియమించాం. మీ బిడ్డ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 కాగా కొత్తగా మరో 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది మన ప్రభుత్వమే.మన అభ్యర్థులను దీవించండి..నాకు సొంత తమ్ముడు లేడనే బాధ ఉండేది. రాజాను (రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా) చూశాక ఆ బాధ పోయింది. నా తమ్ముడిని గొప్ప మెజార్టీతో గెలిపించాలి. మీరు రాజాకు ఓటేస్తే గణేష్, అమ్మ (జక్కంపూడి విజయలక్ష్మి), రాజా భార్య అంతా కలిసి మీ మంచి కోసం ఇంకా ఎక్కువగా కృషి చేస్తారు. మంచి వైద్యుడిగా పేరున్న శ్రీను అన్న (రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్)ను గొప్ప మెజార్టీతో ఆశీర్వదించండి. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థి విజయమ్మ, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ను దీవించాలని కోరుతున్నా. గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, నాకు అక్క లాంటి విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని భారీ మెజార్టీతో గెలిపించండి.మీ కుటుంబంతో చర్చించండి..ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. అది క్లాస్ వార్. పేదవాడు ఒకవైపు, పెత్తందార్లు మరోవైపున నిలిచి ఈ యుద్ధం జరుగుతోంది. మీరంతా ఓటేసేముందు మీ కుటుంబంతో కలసి కూర్చొని చర్చించండి. చిన్న పిల్లల అభిప్రాయాన్ని కూడా తీసుకోండి. ఏ ప్రభుత్వం వల్ల, ఎవరి వల్ల మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగిందో ఆలోచించండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందో గమనించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. మంచి చేసే ఫ్యాను ఇంట్లో ఉండాలి. చెడు చేసే సైకిల్ ఎక్కడ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ మారాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి చదువులు, వారి బడులు బాగుపడాలన్నా.. మన వ్యవసాయం, హాస్పిటళ్లు మెరుగ్గా ఉండాలన్నా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించాలి.ఉద్దానం కిడ్నీ కష్టాలకు విముక్తిదశాబ్దాలుగా ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ సమస్యల పరిష్కారం కోసం రూ.780 కోట్లతో హిరమండలం నుంచి తాగునీటిని తరలించింది మీ బిడ్డ ప్రభుత్వమే. రూ.80 కోట్లతో కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్‌ను నిర్మించింది మన ప్రభుత్వమే. ఉత్తరాంధ్రలో కొత్తగా మెడికల్ కళాశాలలు కడుతున్నాం. పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇవి ఏర్పాటవుతున్నాయి. సాలూరులో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నది మన ప్రభుత్వమే. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల కడుతున్నది మన ప్రభుత్వమే. ఐటీడీఏల పరిధిలో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయంటే కారణం మీ బిడ్డే. సెల్‌ఫోన్ కనెక్టివిటీ లేని గిరిజన ప్రాంతాల్లో రూ.400 కోట్ల వ్యయంతో టవర్లను ఏర్పాటు చేశాం. 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3,23,000 ఎకరాల పట్టాలిచ్చి వారికి రైతు భరోసా అందిస్తూ జీవనోపాధి చూపించింది కూడా మీ బిడ్డే.కోరుకొండ భూముల సమస్య పరిష్కరిస్తా..కోరుకొండ భూముల గురించి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గుర్తుచేశాడు. ఫైల్ ప్రాసెస్‌లో ఉన్న సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మళ్లీ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూముల సమస్యను పరిష్కరిస్తామని సవినయంగా తెలియజేస్తున్నా.తుప్పు సైకిల్.. ఢిల్లీ మెకానిక్స్!ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు గుప్పించే చంద్రబాబు వాటిని అమలు చేయకపోవడం వల్ల తమకు కలిగిన నష్టానికి ప్రతీకారంగా రైతన్నలు, నిరుద్యోగులు, అక్కచెల్లెమ్మలు, వివిధ సామాజిక వర్గాలు, పల్లెలు, పట్టణాల వాసులు అంతా కలసి సైకిల్‌ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్‌కు రిపేరు చేయాలని చంద్రబాబు తంటాలు పడుతున్నాడు. ముందుగా ఎర్రచొక్కాల దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఫలితం లేకపోవడంతో దత్తపుత్రుడి దగ్గరకు వెళ్లాడు. తుప్పు పట్టిన సైకిల్ కేరియర్ మీద మాత్రమే కూర్చుంటా! టీ గ్లాస్ పట్టుకుని తాగుతా! మిగిలింది నావల్ల కాదని దత్తపుత్రుడు చెప్పాడు. దీంతో వదినమ్మను ఢిల్లీకి పంపాడు. అక్కడి మెకానిక్స్‌ను ఇక్కడికి దింపి సైకిల్‌ను ఓ షేపులోకి తేవాలని కోరాడు. ఆ ఢిల్లీ మెకానిక్స్ ఇక్కడికి వచ్చి తుప్పు పట్టిన సైకిల్‌ను చూసి... హ్యాండిల్ లేదు! సీటు లేదు! పెడల్స్ లేవు! చక్రాలు, ట్యూబులు లేవు! మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు! ఇంత తుప్పు పట్టిన సైకిల్‌ను ఎలా బాగు చేస్తాం చంద్రబాబూ! అని అడిగితే పిచ్చి చూపులు చూస్తూ.. ఇదొక్కటే మిగిలిందంటూ ట్రింగ్ ట్రింగ్‌మని బెల్లు మోగిస్తున్నాడు. ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో!2014లో బాబు ముఖ్యమైన మోసాలు..⇒ రైతులకు రూ.87,612 కోట్ల రుణమాఫీ జరిగిందా? ⇒ డ్వాక్రా సంఘాలకు రూ.14,205 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని రూపాయైనా మాఫీ చేశాడా?⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి స్కీమ్ కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్ చేస్తామన్నాడు. మరి ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి ఇచ్చాడా?⇒ ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నాడు. ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇల్లు ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా?⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? ⇒ ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? ⇒ సింగపూర్‌ను మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? ⇒ రాజానగరంలో ఎవరికైనా కనిపిస్తోందా? ⇒ ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. ⇒ అదే ముగ్గురు మరోసారి కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్ అంటూ నమ్మబలుకుతున్నారు.
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: అమావాస్య ఉ.8.55 వరకు, తదుపరి వైశాఖ శు.పాడ్యమి, నక్షత్రం: భరణి ప.2.02 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: రా.1.34 నుండి 3.05 వరకు, దుర్ముహూర్తం: ప.11.29 నుండి 12.20 వరకు, అమృత ఘడియలు: ఉ.9.28 నుండి 10.44 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.17. మేషం: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. విందువినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.వృషభం: బంధువర్గంతో తగాదాలు. వృథా ఖర్చులు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.మిథునం: పనులు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక ప్రగతి. రుణబాధలు తొలగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. దైవదర్శనాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.కర్కాటకం: శుభవర్తమానాలు అందుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. వ్యాపార విస్తరణయత్నాలు .. ఉద్యోగులకు అనుకూల మార్పులు.సింహం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. ఆస్తి తగాదాలు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీలు.కన్య: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణయత్నాలు. ఇంటాబయటా చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు. అనారోగ్యం.తుల: నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. కొత్త పనులకు శ్రీకారం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సేవలకు గుర్తింపు.వృశ్చికం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆస్తిలాభం. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కీలక బాధ్యతలు.ధనుస్సు: కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు చికాకులు.మకరం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆ«ధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు.కుంభం: నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహంగా గడుస్తుంది.మీనం: వ్యయప్రయాసలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు చిక్కులు.
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
సినిమా
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చాడు. చాన్నాళ్లు కష్టపడి డైరెక్టర్ అయ్యాడు. హిట్ కొట్టాడు. అలా అటు నటుడిగా ఇటు దర్శకుడిగా అడపాదడపా మూవీస్ చేశాడు. కానీ రెండేళ్ల క్రితం ఓ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఎంతలా అంటే ప్రాంతీయ హీరో కాస్త పాన్ ఇండియా హీరో అయ్యేంతలా. కోట్లాదిమంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. మరి ఇంతలా చెప్పాం కదా.. ఇతడు ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)పైన ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడి పేరు రిషభ్ శెట్టి. హా అవును మీరు ఊహించింది కరెక్టే. 'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించాడు. రూ.15 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తీయగా.. ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దీనిబట్టి ఈ మూవీ ఏ రేంజ్ హిట్ అయ్యిందో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ప్రస్తుతం 'కాంతార' ప్రీక్వెల్ తీస్తూ బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది రిలీజ్ ఉండొచ్చు.రిషభ్ శెట్టి విషయానికొస్తే.. కర్ణాటకలోని కుందాపుర అనే ఊరిలో పుట్టాడు. జూ.ఎన్టీఆర్ అమ్మది కూడా ఈ ఊరే. అందుకేనేమో తారక్ అంటే రిషభ్ శెట్టి చాలా ఇష్టం. ఈ విషయాన్ని పలుమార్లు చెప్పాడు కూడా. 2012 నుంచి శాండల్ వుడ్లో ఉన్న రిషభ్ శెట్టి.. 'కాంతార' మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇక ఫ్యామిలీ విషయానికొస్తే.. ప్రగతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 'కాంతార'తో సంచలన హిట్ కొట్టిన ఇతడు.. ప్రీక్వెల్తో ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో?(ఇదీ చదవండి: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!)
డీప్ ఫేక్ బారిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!
సినిమా ఇండస్ట్రీ వాళ్లను డీప్ ఫేక్ వదలడం లేదు. రష్మిక డీప్ ఫేక్ వీడియో అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ మరోసారి డీప్‌ఫేక్ బాధితురాలిగా మారింది. అలియా ముఖాన్ని మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియో మరో నటి వామికా గబ్బికి సంబంధించినదిగా తెలుస్తోంది.గత నెలలో 27న వామిక గబ్బి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె ఎర్రటి చీరను ధరించి స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో కనిపించింది. తాజాగా ఆ వీడియోలో ఆలియా భట్ ఫేస్‌ను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ డీప్‌ఫేక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెటిజన్ షేర్ చేయగా.. కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది.కాగా.. అలియా డీప్‌ఫేక్ ముప్పు బారిన పడడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది నవంబర్‌లో ఆమె ఫేస్‌ను మార్ఫ్ చేసిన వీడియో వైరలైంది. అంతుకుముందే రష్మిక మందన్న, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, నోరా ఫతేహి, అమీర్ ఖాన్, కాజోల్ లాంటి ప్రముఖ తారలు డీప్ ఫేక్ బారిన పడ్డారు. View this post on Instagram A post shared by Unfixface (@unfixface) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi)
బుల్లితెర నటికి వేధింపులు.. వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు!
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. స్టార్ నటీమణులు సైతం ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. తాజాగా మరో నటి క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిన సంఘటన జరిగింది. ఓ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని అసభ్యకరమై సందేశాలు పంపించారని కన్నడ నటి అమూల్య గౌడ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారుతనను ఆడిషన్‌కు పిలిచి లైంగిక వేధింపులకు గురి చేసిన సూర్యపై పోలీసులకు నటి ఫిర్యాదు చేసింది . సినిమా పేరుతో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై అతన్ని నిలదీస్తే వెళ్లి పోలీసుకు చెప్పుకోమంటూ దారుణంగా మాట్లాడారని నటి తెలిపింది. కాస్టింగ్ డైరెక్టర్ అంటూ పరిచయం చేసుకుని వేధింపులకు గురి చేశాడంటూ వెల్లడించింది. కాగా.. అమూల్య కన్నడతో పాటు తెలుగు సీరియల్స్‌లోనూ నటిస్తోంది. కన్నడ బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది.
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
ఐస్‌లా కూల్ లుక్‌తో హాట్ బ్యూటీ అషూరెడ్డిటైట్ ఫిట్ డ్రస్సులో మెంటలెక్కిస్తున్న రితికఓరకంట చూస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన తృప్తి దిమ్రితెగ కష్టపడుతున్న సీరియల్ బ్యూటీ జ్యోతి రాయ్వంగి మరీ అందాల విందు చేస్తున్న అనన్య పాండేబుక్ చదువుతూ వయ్యారాలు ఒలకబోస్తున్న మాళవిక View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Shivani Narayanan (@shivani_narayanan) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Pooja Bhalekar (@ipoojabhalekar) View this post on Instagram A post shared by Meenakshi Dixit (@meenakshidixit) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by சாய் தன்ஷிகா (@saidhanshika) View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee)
ఫొటోలు
Venkatesh Election Campaign: ఖమ్మం లో సినీ హీరో వెంకటేష్ ఎన్నికల ప్రచారం (ఫొటోలు)
Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
Hyderabad Rain Photos: హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
గాజువాకలో సీఎం జగన్ రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
క్రీడలు
ఢిల్లీ రేసులోకొచ్చింది!
న్యూఢిల్లీ: జోరుమీదున్న రాజస్తాన్ రాయల్స్‌పై కీలకమైన విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులో పడింది. మంగళవారం జరిగిన ఐపీఎల్ పోరులో ఢిల్లీ 20 పరుగుల తేడాతో గెలిచింది. ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెగర్క్ (20 బంతుల్లో 50; 7 ఫోర్లు; 3 సిక్స్‌లు), అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి ఓడింది. కెపె్టన్ సంజూ సామ్సన్ (46 బంతుల్లో 86; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. ఖలీల్, ముకేశ్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ తలా 2 వికెట్లు తీశారు. 4,4,4,6,4,6... ఓపెనర్లు ఫ్రేజర్, పోరెల్ ఒకరి తర్వాత ఒకరు రాయల్స్ బౌలర్లను చితగ్గొట్టారు. ముందుగా ఫ్రేజర్... బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో ఒక సిక్స్, 2 బౌండరీలతో 15 పరుగులు రాబట్టాడు. అవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 4, 4, 4, 6, 4, 6లతో 28 పరుగులు పిండుకోవడంతో ఫ్రేజర్ ఫిఫ్టీ 19 బంతుల్లోనే పూర్తయ్యింది. అతని దూకుడును అశ్విన్ తన తొలి ఓవర్లోనే అడ్డుకున్నాడు. అనంతరం అక్షర్ పటేల్ అండతో పోరెల్ బాదడం మొదలుపెట్టాడు. 9వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. మరుసటి ఓవర్లోనే అక్షర్ (15)ను అశ్విన్ బోల్తా కొట్టించగా, పోరెల్ సిక్సర్‌తో 28 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. వరుస ఓవర్లలో పోరెల్‌ను అశ్విన్... రిషభ్ పంత్ (15)ను చహల్ పెవిలియన్ పంపారు. మిడిలార్డర్లో స్టబ్స్ (20 బంతుల్లో 41; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో ఢిల్లీ 200 పైచిలుకు స్కోరు చేసింది. కెప్టెన్ పోరాడినా... క్లిష్టమైన లక్ష్యం ముందరుంటే ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (4), బట్లర్ (19) గట్టి పునాది వేయలేకపోయారు. ఈ దశలో కెపె్టన్ సామ్సన్, రియాన్ పరాగ్ (22 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు) అండతో రాయల్స్‌ను నడిపించాడు. 11వ ఓవర్లో జట్టు స్కోరు 100 పరుగులు దాటాక అదే ఓవర్ ఆఖరి బంతికి పరాగ్‌ను రసిఖ్ బౌల్డ్ చేశాడు. అయితే శుభమ్ దూబే వచ్చాక సామ్సన్ 28 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సామ్సన్ను ముకేశ్ అవుట్ చేయడం రాజస్తాన్‌ను కుదిపేసింది. శుభమ్‌తో నాలుగో వికెట్‌కు 59 పరుగులు జోడించాక భారీ షాట్‌కు ప్రయత్నించి సామ్సన్ నిష్క్రమించగా... తర్వాత ఓవర్‌కు ఒకటి, రెండు చొప్పున వికెట్లను కోల్పోయిన రాయల్స్ ఓటమి పాలైంది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: ఫ్రేజర్ (సి) ఫెరీరా (బి) అశ్విన్ 50; పోరెల్ (సి) సందీప్ (బి) అశ్విన్ 65; షై హోప్ (రనౌట్) 1; అక్షర్ (సి) పరాగ్ (బి) అశ్విన్ 15; పంత్ (సి) బౌల్ట్ (బి) చహల్ 15; స్టబ్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సందీప్ 41; గుల్బదిన్ (సి) అశ్విన్ (బి) బౌల్ట్ 19; రసిఖ్ (రనౌట్) 9; కుల్దీప్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–60, 2–68, 3–110, 4–144, 5–150, 6–195, 7–215, 8–221. బౌలింగ్: బౌల్ట్ 4–0–48–1, సందీప్ శర్మ 4–0–42–1, అవేశ్ 2–0–42–0, అశి్వన్ 4–0–24–3, పరాగ్ 2–0–17–0, చహల్ 4–0–48–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) అక్షర్ (బి) ఖలీల్ 4; బట్లర్ (బి) అక్షర్ 19; సామ్సన్ (సి) హోప్ (బి) ముకేశ్ 86; పరాగ్ (బి) రసిఖ్ 27; శుభమ్ (సి) స్టబ్స్ (బి) ఖలీల్ 25; పావెల్ (బి) ముకేశ్ 13; ఫెరీరా (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 1; అశి్వన్ (సి) హోప్ (బి) కుల్దీప్ 2; బౌల్ట్ (నాటౌట్) 2; అవేశ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–4, 2–67, 3–103, 4–162, 5–180, 6–181, 7–185, 8–194. బౌలింగ్: ఖలీల్ 4–0–47–2, ఇషాంత్ 3–0–34–0, ముకేశ్ 3–0–30–2, అక్షర్ 3–0–25 –1, కుల్దీప్ 4–0–25–2, రసిఖ్ 3–0–36–1. ఐపీఎల్లో నేడుహైదరాబాద్ X లక్నో వేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
వేలంలో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ
అర్జెంటీనా దివంగత దిగ్గజ ఫుట్‌బాలర్ డీగో మారడోనా 1986లో గెల్చుకున్న ‘గోల్డెన్ బాల్’ ట్రోఫీ వేలానికి రానుంది. జూన్ 6వ తేదీన పారిస్‌లోని అగుటెస్ ఆక్షన్ హౌజ్‌లో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ వేలం జరుగుతుందని, దీనికి కనీస ధరను ఇంకా నిర్ణయించలేదని వేలం నిర్వాహకులు తెలిపారు. మెక్సికో ఆతిథ్యమిచ్చిన 1986 ప్రపంచకప్ లో మారడోనా సారథ్యంలో అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోరీ్నలో మారడోనా ఐదు గోల్స్ చేయడంతోపాటు ఉత్తమ ప్లేయర్‌కు అందించే ‘గోల్డెన్ బాల్’ ట్రోఫీని సాధించాడు.
భారత బాక్సర్ల పసిడి పంచ్
అస్తానా (కజకిస్తాన్): ఆసియా అండర్–22 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఏడు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల విభాగంలో ప్రీతి (54 కేజీలు), పూనమ్ పూనియా (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు)... విశ్వనాథ్ సురేశ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్ఖా (60 కేజీలు) పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు.ఫైనల్స్‌లో ప్రీతి 3–0తో బజరోవా ఎలీనా (కజకిస్తాన్)పై, పూనమ్ 4–1తో సకిష్ అనెల్ (కజకిస్తాన్)పై, ప్రాచి 4–1తో అనర్ తుసిన్బెక్ (కజకిస్తాన్)పై, ముస్కాన్ 3–2తో జకిరోవా అజీజియా (ఉజ్బెకిస్తాన్)పై గెలిచారు.విశ్వనాథ్ సురేశ్ 5–0తో కరాప్ యెర్నర్ (కజకిస్తాన్)పై, సబీర్ యెర్బోలత్ (కజకిస్తాన్)పై నిఖిల్, ఆకాశ్ 4–1తో రుస్లాన్ (కజకిస్తాన్)పై విజయం సాధించారు. ఓవరాల్‌గా ఆసియా అండర్–22, యూత్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు 12 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్యాలతో కలిపి మొత్తం 43 పతకాలు సంపాదించారు.
బంగ్లాదేశ్‌దే టి20 సిరీస్
జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ జట్టు 3–0తో సొంతం చేసుకుంది. చట్టోగ్రామ్‌లో మంగళవారం జరిగిన మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొమ్మిది పరుగుల తేడాతో నెగ్గింది. మొదట బంగ్లాదేశ్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తౌహిద్ హృదయ్ (38 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాకిర్ అలీ (34 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసి ఓడిపోయింది.
బిజినెస్
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న ఆంద్రప్రదేశ్ 'బ్లూ ఎకానమీ' (ఓషన్ ఎకానమీ)లో కూడా ఓ కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే కోస్తాంధ్రలోని ప్రతి 50 కిలోమీటర్లకు ఓడరేవు, ఫిష్ ల్యాండర్లు, ఫిషింగ్ హోరోబర్‌లలో ఏదో ఒకదాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఆంధ్రప్రదేశ్ రెండవ అతిపెద్ద తీరప్రాంతాన్ని కలిగి ఉండటం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం బ్లూ ఎకానమీపై దృష్టి సారించింది. ఇప్పటికే వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం 4 కొత్త ఓడరేవులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను నిర్మించింది. ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను ఎక్కడ నిర్మించారు. వాటికైన ఖర్చు వివరాలు కింద గమనించవచ్చు.ఓడరేవులురామాయపట్నం పోర్టు: రూ. 3,736.14 కోట్లుమచిలీపట్నం పోర్టు: రూ. 5,115.73 కోట్లుమూలపేట పోర్టు: రూ. 4,361.91 కోట్లుకాకినాడ గేట్‌వే పోర్ట్: రూ. 2,123.43 కోట్లుఫిషింగ్ హార్బర్లుజువ్వాలదిన్నె: రూ. 288.80 కోట్లునిజాంపట్నం: రూ. 451 కోట్లుమచిలీపట్నం: రూ. 422 కోట్లుఉప్పాడ: రూ. 361 కోట్లుబుడగట్లపాలెం: రూ. 365.81 కోట్లుపూడిమడక: రూ. 392.53 కోట్లుబియ్యపుతిప్ప: రూ. 428.43 కోట్లువొడరేవు: రూ. 417.55 కోట్లుకొత్తపట్నం: రూ. 392.45 కోట్లుమంచినీళ్లపేట: అప్గ్రేడేషన్ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలుచింతపల్లి: రూ. 23.74 కోట్లుభీమిలి: రూ. 24.86 కోట్లురాజయ్యపేట: రూ. 24.73 కోట్లుదొండవాక: రూ. 23.90 కోట్లుఉప్పలంక: రూ. 5.74 కోట్లురాయదరువు: రూ. 23.90 కోట్లువైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్మించిన ఈ కేంద్రాల వల్ల ఎంతోమంది ఉపాధి పొందగలిగారు. పోర్ట్‌లు ద్వారా 75000 కంటే ఎక్కువమంది ఉపాధి పొందారు. ఫిషింగ్ హార్బర్ల ద్వారా 65000 కంటే ఎక్కువ, ఫిష్ ల్యాండర్ల ద్వారా 39000 కంటే ఎక్కువమంది ఉపాధి అవకాశాలను పొందగలిగారు.ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఎగుమతులు కూడా పెరిగాయి. ఎగుమతుల్లో 12వ సంఖ్య దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ కేంద్రాల నిర్మాణం తరువాత ఆరో స్థానానికి చేరింది. 2014-19లో ఎగుమతుల విలువ రూ. 90829 కోట్లు, కాగా 2019-23 మధ్య రూ. 159368 కోట్లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బ్లూ ఎకానమీలో రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే గత వారం ఇలాన్ మస్క్ (Elon Musk) టెస్లాలో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.ఇటీవల టెస్లా తొలగించిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరు సూపర్‌చార్జర్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్‌గా పని చేస్తున్న 'రెబెక్కా టినుచీ', మరొకరు న్యూ వెహికల్ ప్రోగ్రామ్ హెడ్ 'డేనియల్ హో' ఉన్నారు. వీరితో పాటు పలువురు ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు పేర్కొన్నారు. తమకు అందిన ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను లింక్డిన్లో షేర్ చేయడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.టెస్లా సీఈఓ మస్క్ ఏప్రిల్ 14న కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతానికంటే ఎక్కువ మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రిక్రూట్మెంట్, మార్కెటింగ్, సూపర్‌చార్జింగ్ టీమ్‌తో సహా వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. ఒక్క సూపర్‌చార్జింగ్ టీమ్‌లోనే సుమారు 500 మంది ఉద్యోగాలను తొలగించినట్లు సమాచారం.ఇప్పటికే మూడు సార్లు లేఆప్స్ ప్రకటించిన టెస్లా మరోమారు ఉద్యోగులను తొలగించడానికి పూనుకుంది. దీంతో ఉద్యోగుల్లో లేఆప్స్ భయం నిండిపోయింది. కంపెనీ ఉద్యోగులను తగ్గించడానికి ప్రధాన కారణం.. అంచనాల కంటే తక్కువ డెలివరీ సంఖ్యలు నమోదు చేయడమనే తెలుస్తోంది.
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 141 పాయింట్లు నష్టపోయి 22,301 వద్దకు చేరింది. సెన్సెక్స్ 383 పాయింట్లు దిగజారి 73,511 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌యూఎల్, టెక్‌మహీంద్రా, నెస్లే, విప్రో, టీసీఎస్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్‌ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్టెల్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, యాక్సిస్‌బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
డీప్‌ఫేక్ టెక్నాలజీకోసం ఇంటెల్‌తో జతకట్టనున్న ప్రముఖ కంపెనీ
యూఎస్ ఆధారిత సైబర్ సెక్యూరిటీ కంపెనీ మెకాఫీ అమెరికన్ చిప్ తయరీ సంస్థ ఇంటెల్ సహకారంతో డీప్‌ఫేక్ డిటెక్షన్ టెక్నాలజీను రూపొందిస్తుంది. మీడియా సంస్థల కథనం ప్రకారం.. మెకాఫీ డీప్‌ఫేక్ డిటెక్టర్ సింథటిక్ కంటెంట్‌ను గుర్తించడానికి ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్లలోని న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (ఎన్పీయూ)ను వాడుకుంటూ ఏఐ అల్గారిథమ్‌లను అమలు చేస్తుంది.డీప్‌ఫేక్ ప్రాసెసింగ్ కోసం వ్యక్తిగత డేటాను క్లౌడ్‌కు పంపాల్సిన అవసరం లేకుండా విశ్లేషణ మొత్తం డివైజ్‌లోనే జరుగుతుందని మెకాఫీ తెలిపింది. ఈ ప్రక్రియ వినియోగదారు గోప్యతకు ప్రధాన్యం ఇస్తుందని చెప్పింది. ఈ టెక్నాలజీ పనితీరును 300 శాతం మెరుగుపరిచేలా కొత్త విధానం ఉపయోగపడుతుందని తెలిపింది. రానున్న కొన్ని నెలల్లో డీప్‌ఫేక్ సంబంధించిన వీడియోలను కనుగొనేందుకు మరిన్ని ల్యాంగ్వేజీలను వినియోగించనున్నట్లు చెప్పింది.మెకాఫీ డీప్ ఫేక్ డిటెక్టర్ ఏఐ ఆధారిత డిటెక్షన్ టెక్నిక్లను వినియోగిస్తుంది. ఏఐ ట్రాన్స్ఫామ్ ఆధారిత ‘డీప్ న్యూరల్ నెట్వర్క్’ మోడల్‌లతో ఇది పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా మెకాఫీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ స్టీవ్ గ్రోబ్‌మాన్ మాట్లాడుతూ..‘ఇంటెల్‌తో కలిసి పనిచేయడం గొప్పఅనుభవాన్నిస్తుంది. ఏఐ రూపొందించిన డీప్‌ఫేక్‌ల్లో నకిలీ వాటిని గుర్తించేలా కొత్త టెక్నాలజీను వాడుతున్నాం. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ టెక్నాలజీకు చెందిన ఎన్‌పీయూను ఉపయోగిస్తున్నాం. దాంతో వినియోగదారులకు శక్తివంతమైన ఏఐ డీప్‌ఫేక్ డిటెక్షన్ సామర్థ్యాలను అందించనున్నాం’ అన్నారు.
వీడియోలు
టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్
ఆంధ్రా అతలాకుతలం..
విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..
ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు
అకాల వర్షం..అపార నష్టం
హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
ఇచ్చాపురం జనసంద్రం..
పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్
ఫ్యామిలీ
సడెన్‌గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..
గతేడాది 2023లో మిస్ యూఎస్ఏ విజేతగా ఎంపికైన నోలియా వోయిగ్ట్ సడెన్‌గా తన స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తన కిరీటాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు ఆమె అభిమానులు. మానసిక ఆరోగ్యం కారణంగానే తాను ఈ అత్యున్నత స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. ఆరోగ్యమే మహా సంపద అని అందువల్ల ముందు తన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. అలాగే మిస్ యూఎస్ఏగా తన జర్నీ చాలా అర్థవంతంగా సాగిందని చెప్పింది. మిస్ యూఎస్ఏ టైటిల్‌ని గెలుచుకున్న తొలి మెనిజులా అమెరికన్ మహిళ. తాను మిస్ యూఎస్ఏ 2023 టైటిల్‌కు రాజీనామా చేయాలన కఠినమైన నిర్ణయం తీసుకున్నాని వోయిగ్ట్ పేర్కొన్నారు. ఇది నాకు కొత్త అధ్యయనం అని తెలుసని, అందువల్ల స్థిరంగా ఉండేందుకు యత్నిస్తా. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మిస్ యూఎస్ఏ ఆర్గనైజేషన్ ప్రతినిధి మాట్లాడుతూ..వోయిగ్ట్ తన విధుల నుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తాం. మా టైటిల్ హోల్డర్లకు ముందు ప్రాధన్యత ఇస్తాం. ఈ సమయంలో ఆమెకు తనకు తానుగా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మేము గుర్తించాం. తన భాద్యతలకు వారసునిగా చేయడం కోసం చూస్తున్నారని అర్థమయ్యింది.త్వరలో ఆమె కోరుకున్నట్లుగానే కొత్తమిస్ యూఎస్ఏని ప్రకటించడం కూడా జరుగుతుంది. అని అన్నారు. ఇన్‌స్టాగ్రాంలో సంస్థ మోడల్‌కి మద్దతను ఇవ్వడమే గాక ఆమె చేసిన సేవకు ధన్యావాదాలు తెలిపింది. కాగా, హవాయికి చెందిన సవన్నా గాంకీవిచ్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఆమె తదుపరి కొత్త యూఎస్ఏ కిరీటాన్ని పొందే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఇక వోయిగ్ట్ మిస్ యూఎస్ఏగా డేటింగ్ హింసకు వ్యతిరేకంగా, ఇమ్మిగ్రేషన్ హక్కులు, లాభప్రేక్ష లేని స్మైల్ ట్రైన్‌తో పనిచేయడం వంటి పలు సేవలందించారు. ఈ వేదిక తన కలను సాకారం చేసుకునేలా చేసింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అయ్యేలా చేసిందని అందుకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటానని సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది.(చదవండి: సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ)
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
హైదరాబాద్ కుమారాంటీ తరహాలో సంచలనం రేపిన వడా పావ్ గర్ల్ మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఖరీదైన కారుతో కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. లగ్జరీ, దాదాపు కోటి రూపాయల అద్భుతమైన ఫోర్డ్ మస్టాంగ్లో వడా పావ్ అమ్ముతూ కనిపించిన వీడియో వైరల్‌గా మారింది.ఢిల్లీకి చెందిన "వడా పావ్ గర్ల్" చంద్రికా దీక్షిత్ మంగోల్‌పురి ప్రాంతంలో ఒక ఫాస్ట్ ఫుడ్ స్టాల్‌ను నిర్వహిస్తుంది. రోజూ వందల మందికి వడ పావ్‌ను విక్రయిస్తుంది. అలా వడా పావ్ గర్ల్‌గా బాగా ఫేమస్ అయింది. ఇన్‌స్టాలో 31 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.తాజాగా ఫోర్డ్ ముస్టాంగ్ కారులో వడాపావ్ అమ్ముతానంటూ ఇన్‌స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. "వడ పావ్ అమ్మాయి ముస్తాంగ్ కారులో వడా పావ్ అమ్మడం ప్రారంభించింది." అని ప్రకటించింది. అంతేకాదు వెయట్ చేయండి.. వడాపావ్‌తో పాటు త్వరలో ఒక పెద్ద ప్రకటన రాబోతోంది అని కామెంట్ చేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్నవారంతా చప్పట్ల మోత మోగించారు. అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ ఇండియాలో ఉత్పత్తిని నిలిపివేసింది. భారత మార్కెట్లో ఈ కారులే టెస్ట్ వెర్షన్ ధర సుమారు 75 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. View this post on Instagram A post shared by Chandrika Gera Dixit official (@chandrika.dixit) కాగా ఇటీవల తనను పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఒకవీడియో వైరల్ అయింది. అయితే ఆమెను అరెస్ట్ చేయలేదని ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం పోస్ట్ చేసిన వీడియోలో, ముస్తాంగ్ కారు నుండి బయటికి రావడం, సరికొత్త ఐఫోన్, ఐవాచ్, ఎయిర్పాడ్లను కొనుగోలు చేయడానికి దుకాణంలోకి వెళ్లిన రీల్స్ చేసింది. అలాగే పోర్స్చేతో సహా ఖరీదైన కార్లతో పోజులిచ్చింది.
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
ఇంతవరకు పలు సంస్థల్లో పలు రకాల డ్రెస్ కోడ్లు ఉండేవి. కార్పోరేట్ సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు శుక్రవారాల్లో ఫార్మల్ దుస్తులకు దూరంగా ఉంటారు. ఆ రోజుల్లో కేవలం సెమీ ఫార్మల్తో రిలాక్స్డ్గా పనిచేస్తారు. వాటిల్లోనే 'థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే' లేదా 'క్యాజువల్ ఫ్రైడే' వంటి డ్రెస్ కోడ్లను విన్నాం. ఇప్పుడూ అతిపెద్ద పరిశోధన సంస్థ సీఎస్ఐఆర్ అలాంటి డ్రెస్ కోడ్ విధానాన్నే కాస్త వెరైటీగా తీసుకొచ్చింది. అది కూడా క్యాజువల్ డ్రెస్ కూడా కాకుండా మరీ నలిగిన బట్టలు వేసుకురమ్మని చెబుతుడటం విశేషం. ఎందుకంటే ఇలా..డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెక్రటరీ, సీఎస్ఐఆర్ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ అయిన డాక్టర్ ఎన్ కలైసెల్వి, సోమవారాల్లో ఇస్త్రీ చేయని బట్టలు ధరించమని తన సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. పైగా "ముడతలు అచ్చే హై"(ముడతలు బాగుంటాయి) అని ప్రచారం చేస్తోన్నారు కూడా. ఇది వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రతి సోమవారం ఐరన్ చేయని దుస్తులు ధరించేలా చేయడమే ఈ డ్రెస్ కోడ్ ముఖ్యోద్దేశం. ఇలాంటి డ్రెస్ వేసుకునేందుకు అందరూ సహకరించాలని సీఎస్ఆర్ కోరింది. ప్రతి బట్టల సెట్‌ను ఇస్త్రీ చేయడం వల్ల సుమారు 200 గ్రాములు కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందని పేర్కొంది. కాబట్టి ఇస్త్రీ చేయని బట్టలు ధరించడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిరోధించవచ్చని సీఎస్ఆర్ డైరెక్టర్ జనరల్ కలైసెల్వి అన్నారు. మే 1 నుంచి 15 వరకు 'స్వచ్ఛతా పఖ్వాడా'లో భాగంగా 'ముడతలు అచ్చే హై' ప్రచారాన్ని ప్రారంభించింది. ఎనర్జీని ఆదా చేసే చొరవలో భాగంతా సీఎస్ఐఆర్ దేశంలోని అన్ని ల్యాబ్‌లలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి కొన్ని ప్రామాణిక రేటింగ్ విధానాలను కూడా అమలు చేస్తోంది. ప్రస్తుతం సీఎస్ఐఆర్ కార్యాలయంలో విద్యుత్ ఛార్జీలను సుమారు 10% తగ్గించడమే ప్రారంభ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టులోపు దీన్ని అమలు చేయనుంది. అంతేగాదు ఇటీవలే ఢిల్లీలోని రఫీ మార్గ్‌లోని సీఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయ భవనంలో దేశంలోనే అతిపెద్ద వాతావరణ గడియారాన్ని ఏర్పాటు చేసింది కూడా. తన మాతృభూమిని, ఈ గ్రహాన్ని(భూమి) రక్షించడానికి సీఎస్ఐఆర్ చేస్తున్న చిన్న ప్రయత్నం అని డాక్టర్ కలైసెల్వి అన్నారు.(చదవండి: 27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!)
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నా లాగా కష్టపడకుండా నా బిడ్డలు పెరగాలి.. చదువుకోవాలి. ఉన్నత స్థితిలోకి రావాలని అని తల్లిదండ్రులు పిల్లల అభివృద్ధికోసం కష్టపడతారు.వారి బంగారు భవిష్యత్తుకోసం కలగంటారు. అలాగే పిలలు అమ్మా నాన్నల్ని కాలు కిందపెట్టకుండా చూసుకోవాలి. మంచి కారు కొనాలి.. ఇల్లు కొనాలి.. ఇలా రకరకాలుగా ఊహించుకుంటారు. తమ ఆశయ సాధన కోసం పట్టుదలగా చదువుతారు. అచ్చం ఇలాగే చెన్నైలోని ఒక అమ్మాయి ఆలోచించింది. తన తల్లిదండ్రులు ఏ వస్తువునైనా ధర ట్యాగ్ చూడకుండా నచ్చింది కొనుక్కోవాలి అని కలగంది ఓ ఆటో డ్రైవర్ కూతురు. దాన్ని సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ స్టోరీ పూర్తిగా అర్థం కావాలంటే వివరాలను తెలుసుకుందాం రండి!I want to be at a place where my parents don’t see the price tag when they go to a shop,says Poongodhai, daughter of an auto-driver, who came first among GCC schools scoring 578 in the class XII board exams. Speaking in fluent English, Poongodhai of Perambur GCC school said she… pic.twitter.com/2T1Mbnz8vB— Omjasvin M D (@omjasvinTOI) May 6, 2024తాజాగా తమిళనాడు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచింది ఆటోడ్రైవర్ కుమార్తె పూంగోధయ్. పెరంబూర్ జీసీసీ స్కూల్‌కు చెందిన పూంగోధయ్ 578 స్కోరుతో పాఠశాల టాపర్‌గా నిలిచింది. తన కుటుంబం, సోదరి కాలేజీ, సిబ్బంది, తన ఇలా ప్రతీ ఒక్కరూ బాగా సహక రించారంటూ ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూ బికామ్, సీఏ చదవాలని కోరుకుంటోంది.Her sister Shobana breaks down responding to her sister’s success coming first among GCC schools in the 12th board examinations. Both of them are daughters of auto driver pic.twitter.com/qSS6EffAbP— Omjasvin M D (@omjasvinTOI) May 6, 2024ఒక చిన్న అద్దే ఇంట్లో నివసించే ఆమె తండ్రి ఒక ఆటో డ్రైవర్. తల్లి డొమెస్టిక్ హెల్పర్‌గా పని చేస్తుంది. తండ్రి ఆరోగ్యం అంతంత మాత్రమే. సోదరి బి.ఫార్మ్ చేస్తోంది. తండ్రి అనారోగ్యం రీత్యా కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. తండ్రి పడుతున్న కష్టాన్ని గమనించిన అక్కా చెల్లెళ్లిద్దరూ చదువుల్లో రాణించారు. సోదరి స్కూలు ఫస్ట్ రావడంపై శోభన భావోద్వేగానికి లోనయింది. తమ బిడ్డలు రాణించడం సంతోషంగా ఉందంటూ ఆనందం ప్రకటించారు తల్లి దండ్రులు.అటు ఇది తమ టీచర్ల ఘనత అని పెరంబూర్‌లోని పాఠశాల హెచ్ఎం కూడా ఆనందాన్ని ప్రకటించారు. 6వ తరగతి నుంచి ఇంగ్లీషు నేర్పుతామని, దీంతో విద్యార్థులు అనర్గళంగా మాట్లాడుతారని చెప్పారు. స్పోకెన్ ఇంగ్లీష్‌లో తామిచ్చిన శిక్షణే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
అవ్వాతాతల పెన్షన్లపై చంద్రబాబు పాపిష్టి కళ్లు.. నరసాపురం, క్రోసూరు, కనిగిరి ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ ఆరాటం.. గుజరాత్ ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. జగన్‌ది ప్రోగ్రెస్ రిపోర్ట్... టంగుటూరు, మైదుకూరు, కలికిరి ఎన్నికల సభల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నేత చంద్రబాబును నమ్మితే అధోగతే.. చోడవరం, అంబాజీపేట, పొన్నూరు ప్రచార సభల్లో ప్రజలను అప్రమత్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో ఈ నెల 14వ తేదీ వరకు.. సీబీఐ కేసులో ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల్లో ఇంతకు ముందు విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో.. అధికారులు కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ మట్టా కోరారు.కుంభకోణంలో కవిత పాత్రపై ఒకట్రెండు రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని కోర్టుకు వివరించారు. మరోవైపు సీబీఐ కేసులో న్యాయవాది పంకజ్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. కవితతో సంబంధాలు ఉన్న మరికొందరిని విచారించాల్సి ఉందని, దర్యాప్తు సజావుగా సాగాలంటే జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోరారు. ఇక ఈడీ కేసులో కవిత తరఫు న్యాయవాది నితీశ్‌రాణా వాదనలు వినిపిస్తూ.. కుటుంబ సభ్యులు కవితతో 15 నిమిషాలు మాట్లాడటానికి అనుమతించాలని కోరారు. కోర్టు లాకప్‌లో పిటిషనర్ భర్త తీసుకొచ్చిన ఆహారాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. జైలుకు పంపుతున్న ఇంటి భోజనాన్ని కూడా జైలు సూపరింటెండెంట్ ఒక్కరే తనిఖీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. కవితకు ఇంటి భోజనం నిలిపివేశాక కూడా మళ్లీ ఎందుకు అడుగుతున్నారని, దీనిపై జైలు సూపరింటెండెంట్ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తర్వాత కవిత జ్యుడీషి యల్ కస్టడీలను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కవితకు చదువుకోవ డానికి పది పుస్తకా లను అనుమతించాల ని జైలు అధికారులకు సూచించారు. ఈడీ, సీబీఐ కేసులలో ప్రత్యేక కోర్టుకు కవితకు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో.. ఆమె న్యాయవా దులు బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిసింది.నా అరెస్టు అన్యాయం: కవితఅధికారులు ప్రత్యేక కోర్టు ప్రాంగణంలోకి కవితను తీసుకువచ్చినప్పుడు.. ‘జైతెలంగాణ.. జై భారత్’ అంటూ నినాదాలు చేశారు. కోర్టు హాల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ప్రజ్వల్ రేవణ్ణ వంటి వాళ్లను దేశం దాటించి, తనలాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయమని కవిత వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.
బిడ్డను చూడకుండానే కన్నుమూసిన తల్లి
మంచిర్యాలక్రైం: నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కళ్లనిండా చూసుకోకుండానే కాటికి చేరుకున్న ఘటన సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బెల్లంపల్లికి చెందిన బొల్లు వెంకటేశ్ భార్య రవళిక (26) సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నందిని ఆస్పత్రిలో ప్రసవం నిమిత్తం చేరింది. ఆస్పత్రి వైద్యురాలు సాధారణ డెలివరీ చేయడంతో బాబుకు జన్మనిచ్చింది. సదరు మహిళకు అధిక రక్తస్రావం కావడంతో వైద్యురాలు అర్జంటుగా రక్తం కావాలని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంకటేశ్ బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తం తీసుకు వచ్చే లోగానే వైద్యురాలు నందిని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మహిళను సమీపంలోని మెడిలైఫ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవళిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యురాలు నందిని, మెడిలైఫ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రవళిక మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న సీఐ బన్సీలాల్ సిబ్బందితో కలిసి ఆసుపత్రి వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి నవజీత్ సంధుని పలుమార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన విషాదాన్ని నింపింది. ఏడాదిన్నర క్రితం స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ మెల్బోర్న్లో ఉంటున్నాడు. ఈ ఘటనపై మెల్బోర్న్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, హర్యానా, కర్నాల్‌లోని గగ్సినా గ్రామానికి చెందిన నవజీత్ స్టడీ వీసాపై ఎంటెక్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. కర్నాల్, బస్తాడా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా మూడు నెలల క్రితం చదువుకోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. నవజీత్ స్నేహితుడు శ్రవణ్ మరో ఇద్దరితో కలిసి ఒకే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల, శ్రవణ్ అక్కడి నుండి వేరే ప్రాంతానికి మారాలని నిర్ణయించు కున్నాడు. ఈ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో నవజీత్ కారులో సామాన్లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులు మళ్లీ శ్రవణ్‌తో గొడవకు దిగారు. వారిని నివారించినందుకు గాను నవజీత్‌పై కత్తితో దాడిచేశారు. ఛాతీపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శ్రవణ్ కూడా గాయపడ్డాడు.అయితే గొడవ పడవద్దు అన్నందుకే నవజీత్‌పై దాడి చేశారని బాధితురాలి మేనమామ, ఆర్మీ అధికారి యశ్వీర్ తెలిపారు. నవజీత్ తెలివైన విద్యార్థి అనీ, సెలవుల కోసం జూలైలో ఇండియాకు రావాల్సి ఉందని తెలిపారు. రైతు అయిన అతని తండ్రి, నవజీత్ చదువుకోసం ఒకటిన్నర ఎకరాల భూమిని విక్రయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్ట్రేలియా నుంచి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని మృతుడి కుటుంబం భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.
Karachi Bakery:హోటల్స్, బేకరీల్లో తనిఖీ
హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు హోటల్స్, బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఎంజేమార్కెట్ చౌరస్తాలోని అంతర్జాతీయ గుర్తింపు పొందిన కరాచీ బేకరీలో గడువు తేదీ ముగిసిన పదార్థాలను గుర్తించారు. ఇందులో రూ.5200 వేల విలువైన బిస్కెట్లు, మిఠాయిలు, చాక్లెట్ కేకులు, రస్క్, బన్నులు ఉన్నాయి. అంతేగాకుండా పలు ఆహార పదార్థాలపై లేబుల్ లేని ఉత్పత్తులను గుర్తించారు. ఫుడ్‌సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో కరాచీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.