Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

kejriwal judicial Remand Extended Till May 20th
కేజ్రీవాల్‌ కస్టడీ పొడిగింపు.. బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

న్యూఢిల్లీ: లిక్కర్‌ కేసులో తీహార్‌ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌  కస్టడీని మే 20దాకా రౌస్‌ న్యూ కోర్టు పొడిగించింది. గతంలో విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా కేజ్రీవాల్‌ కస్టడీని పొడిగించారు. మరోపక్క కేజ్రీవాల్‌కు మధ్యంత బెయిల్‌ ఇచ్చే అంశాన్ని సుప్రీంకోర్టు మంగళవారం(మే7) విచారించింది. ఈ అంశంపై మళ్లీ మే 9వ తేదీన విచారిస్తామని లేదంటే వచ్చే వారం లిస్ట్‌ చేయాలని రిజిస్ట్రీకి అత్యున్నత కోర్టు సూచించింది.  

AP Elections 2024: May 7th Politics Latest News Updates Telugu
May 7th: ఏపీ ఎన్నికల సమాచారం

AP Political And Elections News Updates In Telugu02:49 PM, May 7th, 2024విజయవాడ: సెంట్రల్‌ నియోజకవర్గంలో ఆగని  బోండా ఉమా కుమారుల అరాచకాలువైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార ఆటో వాహనాన్ని అడ్డుకున్న బోండా ఉమా పెద్ద కుమారుడుసింగ్‌నగర్‌, నందమూరి నగర్‌లలో ప్రచార ఆటోలకు అడ్డంగా కారు పెట్టిన బోండా సిద్ధార్థ, బోండా ఉమా సోదరుడు బోండా శ్రీనుఆటోలో పెన్‌డ్రైవ్‌ను లాక్కున్న బోండా సిద్ధార్థ, శ్రీనువిషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులువైఎస్సార్‌సీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగిన బోండా అనుచరులుఘటనా స్థలికి చేరుకున్న పోలీసులుఅజిత్‌ సింగ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు02:02 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం01:54 PM, May 7th, 2024ప్రధాని మోదీకి మంత్రి బొత్స కౌంటర్బీజేపీ ఏపీలో రాదు.. బంగాళాఖాతంలో వస్తుంది: మంత్రి బొత్స కేంద్రంలో మా పార్టీపై ఆధారపడే ప్రభుత్వం రావాలి: మంత్రి బొత్సమోదీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు: మంత్రి బొత్సరైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు: మంత్రి బొత్సటీడీపీ, జనసేన, బీజేపీ తోడు దొంగలు: మంత్రి బొత్సఒకడు తానా అంటే ఇంకొకడు తందనా అంటున్నారు: మంత్రి బొత్సమోదీకి స్థానిక సమస్యలు అవసరం లేదు.. అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్ళిపోయారు: మంత్రి బొత్సఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి.. దేశ చరిత్రలో ఏ పార్టీ చెయ్యలేదు: మంత్రి బొత్సనా రాజకీయ జీవితంలో బీజేపీ అంత అవినీతి పార్టీని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సమోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారు: మంత్రి బొత్సమోదీ అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సరాష్ట్ర ప్రయోజనాల మేరకే బిల్లులకు ఆమోదం తెలిపాం: మంత్రి బొత్స01:32 PM, May 7th, 2024కూటమిది దుర్మార్గపు ఆలోచన: ఏపీ మంత్రి బొత్స2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చింది మేము అడ్డుకోలేదుకూటమి దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనించాలిటీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయిఎన్నికలు అయిన వెంటనే.. లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయికూటమికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెప్తారుచంద్రబాబు మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయిఒక వేలు నువ్వు చూపిస్తే.. మిగిలిన వేళ్ళు నిన్ను చూపిస్తాయని మర్చిపోవద్దు బాబుబాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారుచంద్రబాబుది మనిషి పుట్టుకేనా..?చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉందిఎన్నికల నిబంధనలకు మేము వ్యతిరేకం కాదుఎన్నికల కమిషన్ వాస్తవాలు పరిగనించాలిరైతులకు ఇన్పుట్ సబ్సిడీ అంధక రైతులు నష్టపోతే బాద్యులు ఎవరు..?రీయంబర్స్ మెంట్ అందక విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాద్యులు ఎవరు?వీటన్నింటికి కూటమే బాధ్యత వహించాలిపింఛను లబ్ధిదారులు కలుగుతున్న ఇబ్బందుల పట్ల ఓపిక పట్టండి15 రోజుల తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవుభవిష్యత్తులో హక్కుగా పథకాలు అందిస్తాంచంద్రబాబు ఏం చేసాడని ఉద్యోగస్తులు టీడీపీకి ఓటేస్తారు..బాబు ఉద్యోగస్తులను మోసం చేశారుఉద్యోగస్తులు ఎవరి పక్షాన ఉన్నారో జూన్ 4న తెలుస్తుంది 01:11 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనా  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో 3,20,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాం.హోం ఓటింగ్ కు 28,000 మంది దరఖాస్తు చేశారు.అత్యవసర సర్వీసులు కింద 31,000 మందికి అవకాశం ఇచ్చాంపోలీసులు 40,000,ఇతరులు కలిపి మొత్తం 4,30,000 మంది ఉన్నారు.3,03,000 మంది ఇప్పటివరకూ ఓటు వేశారుపలు కారణాల తో ఓటు వేయలేని వారి కోసం ఈ రోజు,రేపు మరో అవకాశం ఇచ్చాంఓటు వేయలేకపోయిన ఉద్యోగులు వారి సొంత నియోజకవర్గానికి వెళ్లి పోస్టల్ ఓటు వేయవచ్చుపోస్టల్ బ్యాలెట్ వేసే వారికి నగదు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చిందిఉద్యోగులు నగదు తీసుకోవడం చాలా దారుణంపశ్చిమ గోదావరి లో నగదు పంపిణీ చేస్తున్న నలుగురిని అరెస్టు చేశాం01:08 PM, May 7th, 2024ఎన్నికలప్పుడే బాబుకు కాపులు గుర్తొస్తారు: కాపు నేత అడపా శేషుడీబీటీ ద్వారా ఇచ్చే నిధులను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పథకాలు నిధులు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారు.ఎన్నికల కమిషన్ చంద్ర బాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోందికల్లబొల్లి కబుర్లు చెప్పే చంద్రబాబును పవన్ కళ్యాణ్ భుజాన వేసుకుని తిరుగుతున్నాడు.పేదలకు పథకాలు అందడం టీడీపీకి ఇష్టం లేదుపథకాలు ఇళ్లకు చేరకుండా ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెస్తున్నారు.ఉన్నత వర్గాలకు పవన్ కళ్యాణ్, చంద్ర బాబు దోచిపెట్టడానికి మళ్ళీ సిద్ధం అయ్యారు.పవన్‌ కల్యాణ్‌  చివరికి చంద్రబాబు రాజకీయ క్రీనిడలో  బలిపశువు అయ్యారు.కాపులు ఎదగడం పవన్‌ కల్యాణ్‌ , చంద్రబాబులకు ఇష్టం లేదు.కాపుల్లో ముద్రగడ, వంగవీటి మోహనరంగా కుటుంబాన్ని నాశనం వ్యక్తి చంద్రబాబు.ఒకవైపు వంగవీటి రాధని, మరోవైపు పవన్‌ను అడ్డుపెట్టుకుని కాపులను మోసం చేస్తున్నారు.ఎన్నికలప్పుడే చంద్రబాబుకు కాపులు గుర్తుకు వస్తారుపేదలకు సెంట్ భూమి ఇవ్వని చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి మాట్లాడే అర్హత లేదు.01:04 PM, May 7th, 2024ఈసీ ఎవరి కోసం పని చేస్తున్నట్లు?:  MLC లేళ్ల అప్పిరెడ్డిఏపీలో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందిఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారుఇంకొక‌పార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారుఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు?అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటాన్ని కూడా ఈసీ అడ్డుకుందిఅదే వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చెప్పిందికానీ ఏపీలో మాత్రం ఇవ్వటానికి వీల్లేదని ఈసీ చెప్తోందిఎన్నికల కమిషన్ ఒక్కోచోట ఒకోలా ఎందుకు వ్యవహరిస్తోంది?విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యాదీవెన, అక్కచెల్లెళ్ళకు ఇవ్వాల్సిన చేయూత నిధులను కూడా ఆపేశారుచంద్రబాబు కూటమిలో చేరగానే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారువాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని ఆపేసి వృద్దుల మరణాలకు కారణమయ్యారుచంద్రబాబు ట్రాప్ లో పడవద్దని ఈసీకి హితవు పలుకుతున్నాంల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు, పవన్ నిన్న మోదీని ఎందుకు ప్రశ్నించలేదు?12:48 PM, May 7th, 2024ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ షాక్టీడీపీ వీడి వైస్సార్‌సీపీలో  చేరిన 50 మంది టీడీపీ కార్యకర్తలుపార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్12:43 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్‌•    క్రమం తప్పకుండా ఇన్ని రోజులు పథకాలిచ్చిన జగన్‌కు ఇప్పుడే ఇబ్బందులు..•    మీ బిడ్డ జగన్‌ను ఇబ్బందులు పెడితే నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా?•    ఓటు అనే అస్త్రంతో చంద్రబాబు చేస్తున్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పండి..•    వీళ్లు ఎవ్వరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు..•    జూన్ 4న అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో ఈ బటన్లన్నీ క్లియర్ చేస్తాం..12:36 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్‌•    చంద్రబాబు ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ పథకాలు ఆపుతున్నారు..•    జగన్‌ను బటన్లు నొక్కిన పథకాల సొమ్మును ప్రజలకు అందకుండా చేస్తున్నారు..•    జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసేలా ప్రజాస్వామ్యం దిగజారిపోయింది..•    ఆన్‌గోయింగ్ స్కీమ్స్ కు మాత్రమే జగన్ బటన్లు నొక్కాడు.. అవేమీ కొత్తవి కాదు..•    అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఈ పథకాలకు ఆమోదం కూడా తెలిపారు..•    జగన్‌ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితిరాజానగరంలో సీఎం జగన్‌ పూర్తి ప్రసంగం కోసం క్లిక్‌ చేయండి 12:28 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్‌•    2019లో బాబుపై ప్రతీకారంగా ప్రజలంతా సైకిల్‌ను ముక్కలుగా విరిచి పక్కకు పడేశారు•    ఆ తుప్పు పట్టిన సైకిల్‌కు రిపేర్లు చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడు•    రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్లారు.. ఫలితం లేదు•    దత్తపుత్రుడి సైకిల్ క్యారేజ్‌పై మాత్రమే కూర్చుంటా.. టీ గ్లాస్ పట్టుకుంటా అన్నాడు•    ఆ తర్వాత వదినమ్మను ఢిల్లీ పంపించాడు.. అక్కడి మెకానిక్స్‌ను ఇక్కడికి దింపారు•    ఢిల్లీ మెకానిక్స్ అంతా ఏపీకి వచ్చి తుప్పుపట్టిన సైకిల్ చూశారు•    సైకిల్‌కు హ్యాండిల్, సీటు, పెడల్స్, చక్రాలు లేదని ఢిల్లీ మెకానిక్స్ గుర్తించారు•    ఇంత తుప్పు పట్టిన సైకిల్‌ను ఎలా బాగుచేస్తామని ఢిల్తీ మెకానిక్స్ అడిగారు•    చంద్రబాబు పిచ్చి చూపులు చూసి బెల్ ఒక్కటే మిగిలిందని కొట్టడం మొదలు పెట్టాడు•    చంద్రబాబు కొడుతున్న ఆ బెల్ పేరే అబద్ధాల మేనిఫెస్టో 11:49 AM, May 7th, 2024బోండా ఉమా కొడుకి దౌర్జన్యంYSRCP ఎస్సీ మహిళా కార్యకర్తల పై టీడీపీ అభ్యర్ధి బోండా ఉమా కుమారుడు దాడి  ప్రచారం చేస్తున్న వైస్సార్‌సీపీ మహిళా కార్యకర్తలను దుర్భాషలాడిన బోండా కుమారుడు రవితేజ.నున్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుబాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ,ఎమ్మెల్సీ రుహుల్లాతన ఓటమి ఖాయమని బొండా ఉమా తెలుసుకున్నాడు: వెలంపల్లి శ్రీనివాసరావుగెలుపు కోసం అరాచకాలకు పాల్పడుతున్న బోండా వర్గీయులుప్రజాభిమానం కోల్పోవడంతో గుండాగిరిని నమ్ముకుంటున్న టీడీపీసెంట్రల్ నియోజకవర్గంలో వైసిపి పై టీడీపీ చేసిన రెండో దాడిటీడీపీని చీదరించుకుంటున్న ఓటర్లువైస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ.దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు 11:37 AM, May 7th, 2024జననేత కోసం జనంఎన్నికల ప్రచారంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండకు చేరుకున్న సీఎం జగన్సీఎం జగన్ సభకు పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు కార్యకర్తలుమరి కొద్దిసేపట్లో సభ స్థలానికి చేరుకున్న సీఎం జగన్హెలిపాడ్ నుండి సభాస్తలికి మధ్య కిలోమీటర్ రోడ్డు షోసీఎం జగన్ చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా నిలబడి బారులు తీరిన అభిమానులు11:11 AM, May 7th, 2024పచ్చ కుట్రలు! ఏపీ కోర్టులో పిటిషన్‌అమల్లో డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులువిద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై కోర్టుకు ఎక్కిన విద్యార్థులు, రైతులుచేయూత కింద నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యుల పిటిషన్లంచ్‌ మోషన్‌ కింద విచారించనున్న ఏపీ హైకోర్టుచంద్రబాబే ఇలా చేయించాడని మండిపడుతున్న లబ్ధిదారులు11:02 AM, May 7th, 2024షర్మిలపై కేసు నమోదుఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పై కేసు నమోదైంది. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసు ప్రస్తావన కేసు నమోదు చేసిన వైఎస్సార్‌ జిల్లా బద్వేలు పోలీసులు ఎన్నికల వేళ వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల షర్మిలను ఆదేశించిన  కడప కోర్టు10:32 AM, May 7th, 2024నంద్యాలలో టీడీపీ శ్రేణుల బరితెగింపుబనగానపల్లె పట్టణంలో బరితెగించిన టీడీపీ నాయకులువైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార రథం తిరగొద్దు అంటూ టీడీపీ నాయకులు బెదిరింపులు  బనగానపల్లె పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణుల మీద టీడీపీ శ్రేణుల జులుంవైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఆయన సతీమణి కాటసాని జయమ్మ, కోడలు మేధా శ్రీ రెడ్డిఅదే సమయంలో కూరగాయల మార్కెట్ లో ప్రచారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డివైఎస్సార్‌సీపీ ప్రచార రథాలు ఇక్కడ తిరగొద్దంటూ గొడవగాయపడ్డ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలింపు10:29 AM, May 7th, 2024మరోసారి పేదల గొంతు నొక్కిన చంద్రబాబు!ఈసీకి ఫిర్యాదులు చేసిన చంద్రబాబు.ఇప్పటివరకూ కొనసాగుతున్న‌ సంక్షేమ పధకాలైన వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ ఈబీసీ నేస్తం, రైతులకి ఇన్‌పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లకు ఈసీ బ్రేక్‌మొన్నటికి మొన్న వాలంటీర్లను అడ్డుకుని అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటం. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులకి సాయం అందకుండా వారి జీవితాలతో ఆడుకునే కుట్ర.పేదలన్నా.. సంక్షేమ పథకాలన్నా చంద్రబాబుకి ఎంత కడుపుమంటో చూడండి!పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే పేదలకి ఇప్పుడు అందుతున్న ఏ సంక్షేమ పథకం కూడా అందదు!పేదవాళ్లంటే నీకు ఎందుకు అంత కడుపుమంట చంద్రబాబూ?10:19 AM, May 7th, 2024ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌.. TDPకి ఏపీ బీజేపీ షాక్‌ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఏపీ బీజేపీ!ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై బీజేపీ హాట్ కామెంట్స్దేశంలో భూహక్కుల పరిరక్షణకోసం నీతి అయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ కు తప్పుడు భాష్యం చెప్పడం ద్వారా సాధించేమీ లేదుఎన్నికల వేళ ఇలాంటివి సృష్టించడం వల్ల కూటమికి ప్రయోజనం కంటే నష్టమే జరుగుతుందని విజ్ణులు గుర్తించాలికూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టం అమలు చేయాల్సి ఉంటుందిఎక్స్ లో ట్వీట్ చేసిన‌ బీజేపీ సీనియర్ నేత లక్ష్మిపతిరాజు10:00 AM, May 7th, 2024మొన్న వృద్ధుల కడుపు.. ఇవాళ రైతుల కడుపు కొట్టిన చంద్రబాబుచంద్రబాబు మొన్న వృద్ధుల కడుపు కొట్టాడు.. ఇప్పుడు రైతుల కడుపు కొట్టాడు..రైతుల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. ఫీజు రియంబర్స్ రాకుండా అడ్డుకుని విద్యార్థులను రోడ్డున పడేశాడు..ఇంటికొచ్చే పింఛను చంద్రబాబు అడ్డుకున్నారు.. చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు..కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి 420..  అయన చేయని అక్రమాలు లేవు..ప్రభుత్వ భూముల కబ్జా దగ్గర నుంచి.. బ్లాక్ మెయిలింగ్ దాకా ఆయన సిద్ధహస్తుడుతెలుగుదేశం పార్టీ కుట్రలపై కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఫైర్9:49 AM, May 7th, 2024ఏపీలో ఈసీ పని తీరుపై వైస్సార్‌సీపీ ఆగ్రహంకొనసాగుతున్న పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరణలెఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే దాకా నిధుల విడుదలకు నోఈసీ అనుమతి ఇవ్వకపోవడం ఏంటి?: YSRCPతెలంగాణలో సబ్సిడీ ఇన్‌ఫుట్‌కు అనుమతి ఈసీ ఎలా ఇచ్చింది అంటూ ప్రశ్నఏపీలో మాత్రమే ఈసీ ఎందుకు వివక్ష చూపుతోంది9:39 AM, May 7th, 2024అన్నమయ్య రాజంపేటలో టీడీపీకి ఎదురుదెబ్బఅన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని ఊటుకూరు గ్రామంలో టిడిపికి గట్టి ఎదురు దెబ్బ...టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన వంద కుటుంబాలుతెలుగు తమ్ముళ్లకు YSRCP కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే అభ్యర్థి అకేపాటి అమరనాథ్ రెడ్డిజగనన్న అందిస్తున్న జనరంజక పాలన మెచ్చి వైఎస్సార్‌సీపీలో చేరామన్న స్థానికులు9:23 AM, May 7th, 2024డబ్బుతో పట్టుబడ్డ టీడీపీ నేతపెందుర్తి నియోజకవర్గ పరిధిలోని వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ వద్ద నగదుతో దొరికిన టీడీపీ నేతటీడీపీ నేత దంతులూరి వెంకట దుర్గ ప్రశాంత్ వర్మ నేతృత్వంలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు  ⁠ప్రధాని మోదీ సభకు జనాలను తరలించిన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు!జనాలకు నగదు పంపిణీ చేయడానికే తరలిస్తున్నారనే సమాచారంతో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు⁠తనిఖీల్లో వర్మ వద్ద లభించిన రూ.10 లక్షలకు ఎటువంటి ఆధారం లేకపోవడంతో సీజ్ చేసి పెందుర్తి పోలీసులకు అప్పగింత8:50 AM, May 7th, 2024జనంలోకి జగన్‌ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డినేడు మూడు జిల్లాల్లో ప్రచార భేరీరాజమండ్రి రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరుకొండ జంక్షన్‌లో ప్రచారంమధ్యాహ్నం శ్రీకాకుళం ఇచ్ఛాపురం మున్సిపల్‌ ఆఫీస్‌ సెంటర్‌లో ప్రచారంవిశాఖపట్నం లోక్‌సభ పరిధిలోని గాజువాక నియోజకవర్గం గాజువాక సెంటర్‌లో ప్రచారం8:23 AM, May 7th, 2024నేడు పవన్‌  ప్రచారం ఇలా..ప్రకాశం దర్శిలో పవన్‌ కల్యాణ్‌ ప్రచారంసాయంత్రం తిరుపతిలో చంద్రబాబుతో కలిసి బహిరంగ సభలో పాల్గొననున్న పవన్‌8:01 AM, May 7th, 2024హవ్వా.. ఇదేంది బాబూ!తీవ్రరూపం దాల్చిన చంద్రబాబు బూతు పురాణంపూర్తిగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న చంద్రబాబుతనను ప్రజలు నమ్మట్లేదని  ప్రచారంలో బూతుల పర్వం అందుకున్న టీడీపీ అధినేతసీఎం జగన్ ను కొట్టండి అనే దగ్గర నుంచి.. ఇప్పుడు చంపండి, నరకండి అనే స్థాయికి చేరిన చంద్రబాబుఓటమి భయంతో చంద్రబాబుకు మతి చెడిందన్న అనుమానంలో ప్రజలుబాబు బూతు పురాణంపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైస్సార్‌సీపీచంద్రబాబుపై చర్యలకు వెనుకడుగు వేస్తున్న ఎన్నికల కమిషన్7:25 AM, May 7th, 2024తప్పుడు పోస్టులపై ఈసీ సీరియస్‌.. కీలక ఆదేశాలుసోషల్ మీడియా లో తప్పుడు పోస్టులపై ఎన్నికల సంఘం సీరియస్‌ కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీమహిళల్ని కించపరచడం,మైనర్లతో ప్రచారం,జంతువులకు హాని తలపెడుతున్న వీడియోలు,ఫోటోలు నిషేధం.అలాంటి పోస్టులు ఈసీ నోటీసుకు వచ్చిన మూడు గంటల్లో గా తొలగించాలినిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల నాయకులపై కేసులు పెడతామని హెచ్చరిక. 6:59 AM, May 7th, 2024చిలకటూరిపేట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌.. ఈసీ సీరియస్‌ చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో నిర్లక్ష్యంగా  వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశాలు.ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్(టెండర్ బ్యాలెట్) పేపర్లను ఇచ్చిన అధికారులు.అధికారుల నిర్లక్ష్యంతో 1219 మంది ఉద్యోగుల ఓట్లు చెల్లని వైనం.వీరందరికీ తిరిగి రెండు రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు.సంబంధిత అధికారులపై ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలకు ఈసీ ఆదేశాలు6:45 AM, May 7th, 2024చంద్రబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్సీఎం  జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై సీఈసీ ఆగ్రహంఎన్నికల్ కోడ్ ను అతిక్రమించటంపై సీరియస్బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్ఏప్రిల్ 6న పెదకూరపాడు, 10న నిడదవోలు, తణుకు, 11న అమలాపురం, 15న పలాస, 17న పెడనలో జరిగిన సభల్లో సీఎంని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మాట్లాడిన చంద్రబాబు6:37 AM, May 7th, 2024భీమవరంలో టీడీపీ, జనసేన మధ్య రగడ..భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడసర్దిచెప్పేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల ముందే బాహాబాహీ.చేతికి దొరికిన వాటితో చితక్కొట్టిన జనసైనికులుఈ దెబ్బతో భీమవరంలో జనసేన గెలుపుపై ఆశలు గల్లంతు!6:30 AM, May 7th, 2024అబద్దం.. వాస్తవంఎన్నికల వేళ కూటమి కుట్రలుఏపీపై ఢిల్లీ పెద్దల తప్పుడు ప్రకటనలువాస్తవాలతో వివరించే యత్నం వీడియో పోస్ట్‌ చేసిన వైస్సార్‌సీపీమన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! 💥#FactCheck#ProgressiveAP#YSJaganDevelopsAP #DevelopmentInAP pic.twitter.com/G2KbNXK9Pl— YSR Congress Party (@YSRCParty) May 6, 2024 

 Gold Rate Today In India
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?

దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. మంగళవారం పసిడి ధర మరోసారి పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.300, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.330 పెరిగింది.దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయిహైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380గా ఉందివిజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందివైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందిబెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందిచెన్నైలో  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,430 గా ఉందిముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందిఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉందికోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉంది 

AP Elections 2024: CM YS Jagan Speech At Korukonda Junction
తుప్పు పట్టిన సైకిల్‌లో మిగిలింది బెల్‌ మాత్రమే: సీఎం జగన్‌

తూర్పు గోదావరి, సాక్షి: మాములుగా ఒక ప్రభుత్వం 60 నెలల పాటు పని చేస్తుంది.ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేస్తారు. అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బ తీయడం కోసం, ఇబ్బందులు పెట్టడం కోసం టీడీపీ- చంద్రబాబునాయడు ఢిల్లీ పెద్దలతో కలిసి ఎలాంటి కుట్రలు చేస్తున్నారో గమనించాలని ఏపీ ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జంక్షన్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.రాజానగరం సిద్ధమా? ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల చూపిస్తున్న ప్రతీ అక్కకూ, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు మీ జగన్‌ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఇవి ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. మరో 6 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం.  చంద్రబాబును నమ్మితే ఏమౌతుంది. మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది.  చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఈ 59 నెలల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకువచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ తీసుకురాగలిగాడు. ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా సంక్షేమ పథకాలు అందించాం. రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. నేరుగా వారి చేతికే డబ్బులు వెళ్లిపోతాయి. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.మీ బిడ్డ పాలన కంటే ముందు ఈ మాదిరిగా బటన్లునొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా?.  గతంలో ఎప్పుడూ చూడని విధంగా..  రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ఉంటే.. మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో 2.31 లక్షల ఉద్యోగాలు... కేవలం ఈ 59 నెలల కాలంలోనే వచ్చాయి.మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99 శాతం హామీలు అమలు చేసి.. ప్రతీ ఇంటికి ఆ మేనిఫెస్టోను పంపించి ఇందులో చెప్పినవి జరిగాయా? లేదా? అని అక్కచెల్లెమ్మల ద్వారా టిక్కు పెట్టిస్తూ ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం గతంలో జరిగిందా?. ఇప్పుడు నేను గడగడా మచ్చుకు కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ ఎవరైనా చేశారా? అని మీరే ఆలోచించండి.నాడు నేడు బాగుపడ్డ గవర్నమెంట్‌ బడులు.  పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బైలింగువల్‌ టెక్స్ట్‌ బుక్స్‌,  బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా జరిగాయా?..  నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని, ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్. అందులో కడుతున్నవి మరో 22 లక్షల ఇళ్లు. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం..మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా?నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్‌ గతంలో ఎప్పుడైనా జరిగిందా?. ఇంటికే అందించడం ఎప్పుడైనా జరిగిందా?. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి అండగా.. తోడుగా ఉంటూ సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్‌. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతున్నాను.గ్రామ సచివాలయ వ్యవస్ధతో సమూల మార్పులు. గ్రామంలో అడుగు పెడుతూనే ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం. పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం. పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు. రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అని అడుగుతున్నాను.ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్‌. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల భద్రతకు తోడుగా ఫోన్‌లోనే దిశ యాప్. ఇవన్నీ గతంలో ఉన్నాయా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.మరో పక్క 14 ఏళ్లు సీఎంగా చేసానంటాడు చంద్రబాబు. మూడు సార్లు సీఎం అంటాడు. చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఆయన చేసిన ఒక్క స్కీమ్‌ అయినా గుర్తుకు వస్తుందా? అని అడుగుతున్నాను. సైకిల్‌ డ్యామేజ్‌ ఎంతలా అంటే..  ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేదు. ప్రతీకారంగానే 2019లో రైతన్నలు, ఆడపడుచులు, అన్ని సామాజిక వర్గాలు.. పల్లె పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్‌ను ఏ ముక్కకు ఆ ముక్క విరిసి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్‌కు చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు. ఆ రిపేర్‌ చేసే క్రమంలో ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్తే.. ఫలితం రాలేదు. ఆ తర్వాత దత్త పుత్రుడ్ని పిలుచుకున్నారు. తుప్పు పట్టింది.. నేను క్యారేజీ మీద మాత్రమే ఎక్కుతాను. టీ గ్లాస్‌ పట్టుకుని తాగుతా అని దత్త పుత్రుడు అన్నాడు. ఆ తర్వాత బాబు తన వదినమ్మను ఢిల్లీ పంపించారు. ఆమె ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి సైకిల్‌ రిపేర్‌ కోసం మెకానిక్‌లను పిలిపించుకున్నారు. వాళ్లొచ్చి..  తుప్పు పట్టిన ఆ సైకిల్‌ను చూశారు. ఆ సైకిల్‌కు సీటు లేదు. చక్రాల్లేవ్‌. సైకిల్‌కు పెడెల్‌ లేదు. ట్యూబ్‌లు ల్లేవ్‌‌. మధ్యలో ఫ్రేమ్‌ కూడా లేదు. మరి ఇంతలా తుప్పు పడితే ఎలా బాగు చేస్తామయ్యా అని అడిగారు. పిచ్చి చూపులు చూసి బెల్‌ కొట్టడం మొదలుపెట్టాడు. ఆ బెల్‌ పేరే అబద్ధాల మేనిఫెస్టో.ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు చెబుతారు. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో...ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను. ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) 2014లో ముఖ్యమైన మేనిఫెస్టో పేరుతో ఇదే పెద్ద మనిషి.. ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్‌ ఇచ్చారు. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి.. ఇంటింటికి పంపించారు.  నేను ఇవాళ అడుగుతున్నాను. ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి. మొదలుపెట్టమంటారా?  రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. అక్కా పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు, చెల్లెమ్మా  ఏకంగా రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇందులో ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? . ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను.. రూ.25 వేల కథ దేవుడెరుగు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కదా? మీ అకౌంట్లలో చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ వేశాడా?. ఇంటింటికీ ఉద్యోగం.. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చాడా?. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు కదా. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌, చేనేత పవర్‌ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా?. విమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా? రాజానగరంలో కనిపిస్తోందా? మరి నేను ఒక్కటే అడుగుతున్నాను. ఇదే ముగ్గురు 2014లో పంపించి.. ఆ తర్వాత ఐదేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు. అయినా ఇందులో ఒక్కటైనా జరిగిందా?ఇప్పుడు మళ్లీ ఇదే ముగ్గురు మళ్లీ కూటమిగా ఏర్పడ్డారు. మేనిఫెస్టో డ్రామాలాడుతున్నారు. సూపర్‌ సిక్స్‌ అంట నమ్ముతారా?, సూపర్‌ సెవెన్‌ అంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట నమ్ముతారా? అక్కా నమ్ముతారా? ఏమ్మా నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.ఢిల్లీతో కుట్రలు పన్ని..ఎన్నికలకు రెండు నెలల ముందు అవ్వాతాతలకు ఇంటికి పెన్షన్‌ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. అలాంటప్పుడు రెట్టించిన ఉత్సాహంతో అవ్వాతాతలు జగన్‌కు ఓటు వేయరా?. జగన్‌ ఏదైనా బటన్‌లు నొక్కాడో.. ఆ బటన్‌లు నొక్కిన సొమ్ముకూడా రాకుండా కలిసి ఢిల్లీ వాళ్లతో కుట్రలు చేస్తున్నారు. స్వయానా  ఒక సీఎం కోర్టుకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే స్థాయికి రాజకీయం దిగజారింది. ఈ బటన్‌లు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కింది రాదు. ఈ ఐదేళ్లలో క్రమం తప్పకుండా నొక్కుతూ వస్తున్న పథకాలకు సంబంధించినవే. అసెంబ్లీలో ఆమోదం తెలిపినవే ఇవి. క్యాలెండర్‌ ప్రకారం ఇస్తూ వస్తున్నవే. జగన్‌ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితి. ఓటనే అస్త్రంతో చంద్రబాబుకి, ఆయన కుట్రలకు సమాధానం చెప్పమని కోరుతున్నా. పథకాలను ఆపగలరేమోగానీ.. మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు. మళ్లీ మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు. జూన్‌ 4వ తేదీ తర్వాత..  ఒక వారంలోనే ఆ బటన్‌లు అన్నీ క్లియర్‌ చేస్తాడు.  👉కుట్రలు చేస్తున్న చంద్రబాబు దగ్గర డబ్బు ఉంది. ఎందుకంటే  జగన్‌లాగా బాబు బటన్‌లు నొక్కలేదు. ప్రజల కోసం అక్కచెల్లెమ్మల కోసం డబ్బులు ఇవ్వలేదు. ఏ పథకం లేదు. మీ బిడ్డ అలా కాదు. 59 నెలల కాలంలో 130 బటన్‌లు నొక్కాడు. రూ.2 లక్షల 70 వేల కోట్లు జమ చేశాడు. చంద్రబాబు దగ్గర దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఎన్నికల కోసం ఆ డబ్బు పంచే ప్రయత్నం చేస్తాడు. ఆ డబ్బు చంద్రబాబు ఇచ్చేది మనదే.. మన దగ్గర దోచేసిన సొమ్ము. కాబట్టి, ఏ ఒక్కరూ వద్దు అని చెప్పకండి. కానీ, ఓటేసేటప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి.👉ఇది కులాల మధ్య యుద్ధం కాదు. ఇది క్లాస్‌ వార్‌. పేదవాడు ఒకవైపు. పెత్తందారు మరోవైపున జరుగుతున్న యుద్ధం. ఇంట్లోవాళ్లతో అందరితో మాట్లాడండి. అభిప్రాయం తీసుకోండి. ఎవరి వల్ల మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగిందనేది చూడండి. జాగ్రత్తగా ఓటేయండి. ఈ విషయం చెప్పడం అవసరం.👉ఈ ప్రాంతంలో భూముల సమస్య గురించి తెలుసు.  అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కరించి.. మీ ముందుకు మళ్లీ వస్తా. మీ అందరిని కోరేది ఒక్కటే. జరగబోయే కురుక్షేత్రంలో 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి.రాజానగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా జక్కంపూడి రాజాకి ఓటేయండి. ఛీటింగ్‌ కేసుల్లో ఉన్న వ్యక్తికి ఓటేయకండి. అలాగే.. ఎంపీ అభ్యర్థిగా డా. గూడురి శ్రీనివాసులను గొప్ప మెజారిటీతో గెలిపించాలని పేరుపేరున ప్రార్థిస్తున్నా అని సీఎం జగన్‌ తన ప్రసంగం ముగించారు.

IPL 2024: KKR Diverted To Guwahati First And Then Varanasi After Failing To Land In Rainy Kolkata
IPL 2024: కేకేఆర్‌ బృందానికి చేదు అనుభవం

కేకేఆర్‌ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. ఎల్‌ఎస్‌జీతో మ్యాచ్‌ ముగించుకుని కోల్‌కతాకు బయల్దేరిన వీరికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి.Travel update: KKR's charter flight from Lucknow to Kolkata diverted to Guwahati due to bad weather ⛈️Flight currently standing at the Guwahati Airport tarmac. More updates soon pic.twitter.com/XFPTHgM2FJ— KolkataKnightRiders (@KKRiders) May 6, 2024రెండు సార్లు వీరు ప్రయాణిస్తున్న చార్టర్‌ విమానం దారి మళ్లింపునకు గురైంది. నిన్న సాయంత్రం నుంచి కేకేఆర్‌ బృందం గాల్లో అటూ ఇటూ చక్కర్లు కొడుతుంది. పలు ట్విస్ట్‌ల అనంతరం ఇవాళ (మే 7) తెల్లవారుజామున కేకేఆర్‌ టీమ్‌ వారణాసిలో ల్యాండైంది.Update at 1:20 AM: Flight diverted to Varanasi after another failed attempt at landing in Kolkata due to bad weather. Current status: At the Lal Bahadur Shastri International airport tarmac— KolkataKnightRiders (@KKRiders) May 6, 2024పూర్తి వివరాల్లోకి వెళితే.. కేకేఆర్‌ టీమ్‌ మే 5న ఎల్‌ఎస్‌జీతో మ్యాచ్‌ ముగించుకుని నిన్న (మే 6) సాయంత్రం 5:45కు లక్నో నుంచి కోల్‌కతాకు బయల్దేరింది. వీరు రాత్రి 7:25 గంటలకంతా కోల్‌కతాలో ల్యాండ్‌ కావాల్సి ఉండింది.అయితే నిన్న సాయంత్రం నుంచి కోల్‌కతాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కేకేఆర్‌ బృందం సేఫ్‌గా ల్యాండింగ్‌ కావడానికి కుదర్లేదు. రాత్రి 8:45 వరకు వీరు గాల్లోనే చక్కర్లు కొట్టారు. 8:46కు వీరి విమానం గౌహతికి డైవర్ట్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. 9:30 ఆ మధ్యలో వీరు గౌహతిలో ల్యాండ్‌ అయ్యారు.ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్న కేకేఆర్‌ బృందానికి రాత్రి 9:43 గంటలకు మరో మెసేజ్‌ వచ్చింది. కోల్‌కతాలో ల్యాండ్‌ అవ్వడానికి క్లియరెన్స్‌ వచ్చింది. రాత్రి 11 గంటల్లోపు అక్కడ ల్యాండవుతామన్నది ఆ మెసేజ్‌ సారాంశం.అయితే కేకేఆర్‌ బృందానికి ఈసారి కూడా చుక్కెదురైంది. కోల్‌కతాలో మరోసారి వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడ ల్యాండింగ్‌ కుదర్లేదు. దీంతో వీరు గాల్లోనే యూ టర్న్‌ తీసుకుని ఇవాళ తెల్లవారుజామున వారణాసికి చేరుకున్నారు. ఉదయం 3 గంటల ప్రాంతలో కేకేఆర్‌ టీమ్‌ వారణాసిలోని తాజ్‌ హోటల్‌లో దిగినట్లు కేకేఆర్‌ యాజమాన్యం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ఇవాళ (మే 8) మధ్యాహ్నం 1:15 గంటలకు వీరు మరోసారి కోల్‌కతాలో ల్యాండ్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తారు. మరి ఈసారైనా విజయవంతంగా ల్యాండ్‌ అవుతారో లేదో వేచి చూడాలి.ఇదిలా ఉంటే, కేకేఆర్‌ టీమ్‌ మొన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగుల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ సీజన్‌లో ఈ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 11న ముంబైతో.. 13న గుజరాత్‌.. 19న రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడాల్సి ఉంది. కేకేఆర్‌ టీమ్‌ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌పై కర్చీఫ్‌ వేసుకుని కూర్చుంది. ఈ జట్టుతో పాటు రాయల్స్‌కు కూడా ప్లే ఆఫ్స్‌కు క్లియరెన్స్‌ సాధించింది.  

Ksr Comments On AP Power Projects
బెడిసి కొట్టిన ఈనాడు స్టోరీ.. రామోజీ షాక్స్‌!

ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయా? ఇంత అభివృద్దికి అడుగులు పడుతున్నాయా? నిజంగా ఏపీ ప్రజలకు వీటి గురించి పూర్తి వివరాలు తెలియవంటే ఆశ్చర్యం కాదు. కాని ద్వేష భావంతో, ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించడం కోసం ఈనాడు మీడియా రాసిన ఒక స్టోరీ అందరూ చదవవలసిందే. బహుశా ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఇంత వివరంగా తన ప్రభుత్వం ఇన్ని కొత్త పరిశ్రమలను  తీసుకు వస్తున్న సంగతి ప్రజలకు చెప్పినట్లు అనిపించదు. శుక్రవారం నాడు ఈనాడు దినపత్రికలో "అంతా.. ఆ ఏడు చేపలకే" అంటూ ఒక స్టోరీ ఇచ్చారు. ఈనాడు లక్ష్యం ఏమిటంటే ఏడు పెద్ద కంపెనీలకు జగన్ లబ్ది చేకూర్చే యత్నం చేశారని, ఏపీలో వాటికి పలు భారీ పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఇచ్చారని ప్రజలు అనుకోవాలని వారు ఈ కథనాన్ని ఇచ్చారు. అది చదివిన తర్వాత నాకైతే జగన్‌పై మరింత గౌరవం పెరిగింది. ఎందుకంటే ఏపీకి ఇన్ని ముఖ్యమైన పరిశ్రమలు తీసుకు రావడానికి జగన్ చేసిన కృషి ఈ కథనం ద్వారా తెలిసింది. మరి ఇంతకాలం ఇదే ఈనాడు మీడియా ఏమని ప్రచారం చేసింది? ఏపీకి అసలు పరిశ్రమలు రావడం లేదని కదా! పారిశ్రామికవేత్తలు రావడం లేదని కదా? పెట్టుబడులు రావడం లేదని కదా! ఈనాడు తాజాగా ఇచ్చిన కథనం ప్రకారం 2.63 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఏడు కంపెనీలవారు చేపట్టారని. ఇది మంచిదే కదా? అసలే పరిశ్రమలే రావడం లేదని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రావడం, అవన్ని పురోగతిలో ఉండడం స్వాగతించవలసిన విషయం కదా! ఈనాడు మీడియాకు, దాని అధిపతి రామోజీరావుకు ఏపీలో పరిశ్రమలు, కొత్త ప్రాజెక్టులు రావడం ఇష్టం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొన్ని ఎస్‌ఈజెడ్‌లు వచ్చాయి. అప్పుడు ఈ మీడియా కాని, తెలుగుదేశం కాని చేయని యాగీ లేదు. విదేశాలకు ఎగుమతులు చేసే ఉత్పత్తులు తయారు చేసే కంపెనీల ఏర్పాటుకు వీటిని కేంద్రం ప్రతిపాదించింది. అందుకోసం భూములు సేకరిస్తుంటే విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేశాయి.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రకరకాలుగా అడ్డంకులు సృష్టించేవారు. సోనియాగాంధీ, చంద్రబాబు, సీబిఐ కుమ్మక్కై వాన్‌పిక్ రాకుండా చేశారు. చీరాల, రేపల్లె ప్రాంతంలో వాన్‌పిక్ పారిశ్రామికవాడను ఏర్పాటు చేయాలని పదమూడు వేల ఎకరాల భూములను ఆ సంస్థ కొనుగోలు చేసింది. అందులో ఎక్కువ భాగం వ్యవసాయానికి పనికిరాని భూములే. కొంత ప్రభుత్వ భూమి. కాని ఆ భూమిని సేకరించిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను జగన్‌పై ఉన్న ద్వేషంతో వీరు కేసులలో ఇరికించి జైలులో పెట్టారు. ఆ భూములలో కొత్త పరిశ్రమలు పెట్టడానికి అడ్డు పడకుండా ఉంటే ఈపాటికి ఆ ప్రాంతం బ్రహ్మాండంగా తయారై ఉండేదేమో! వైఎస్ హయాంలో సూళ్లూరు పేట సమీపంలో శ్రీసిటీ పేరుతో ఒక పారిశ్రామికవాడ నిర్మించాలని తలపెట్టారు. అప్పట్లో ఇదే ఈనాడు మీడియా భూ సేకరణను దోపిడీ కింద అభివర్ణించి పలు కధనాలు రాసేది. సెజ్‌లలో ఉద్యోగాలు ఏవి అంటూ దిక్కుమాలిన విమర్శలు చేసేది. అయినా వైఎస్ రాజశేఖరరెడ్డి వెనక్కి తగ్గకుండా శ్రీసిటీ ఏర్పాటుకు సహకరించారు. ఆ సంస్థ యజమానులు స్థానిక రైతుల సహకారంతో పారిశ్రామిక వాడను రూపొందించారు.ఇప్పుడు అది నిజంగానే శ్రీసిటీ అయింది. అక్కడి ప్రజలకు ఎంతగానో మేలు చేస్తోంది. 2016లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే ఈనాడు మీడియా ఏమని రాసిందో తెలుసా?బతుకు చిత్రాన్ని మార్చిన సిరుల సీమ శ్రీసిటీ అని రాశారు. అంటే వైఎస్ అధికారంలో ఉంటే వ్యతిరేకించడం, చంద్రబాబు సీఎంగా ఉంటే భజన చేయడం. ఇదే ఈనాడు నైజం. ఇప్పుడు కూడా ఏపీలో కొత్త పరిశ్రమలు వస్తుంటే ఈ మీడియా ఏడ్చిపోతోంది. షిర్డి సాయి ఎలక్ట్రికల్ సంస్థ సుమారు 18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు మీటర్లు పెట్టడం వీటిలో ఒకటి. కేంద్ర ప్రుభుత్వం చేసిన సూచనల ప్రకారం స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే, దానివల్ల రైతులకు ఏదో నష్టం జరిగిపోతుందని ఇదే మీడియా ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు అయితే ఈ మీటర్లు రైతులకు ఉరి అంటూ తప్పుడు ప్రచారం చేశారు. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. దానివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని, ప్రభుత్వం సరపరా చేసే విద్యుత్‌కు లెక్కలు ఉంటాయని, రైతులకు డబ్బు జమ చేస్తామని చెప్పి ముందుకు వెళ్లారు.ఈ ప్రాజెక్టు పై ఎంత అబద్దపు ప్రచారం చేసినా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ శాఖ అధికారులు వివరణలు ఇచ్చినా, ఈనాడు ఆరోపణలను ఖండించినా, వీరి పద్దతి మాత్రం మారలేదు. అదే సమయంలో ఈ మీటర్లు బిగించాలని చెప్పిన బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఆయన రెండు నాలుకల ధోరణికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టులో 478 కోట్లతో రెండు అదనపు యూనిట్లు స్థాపిస్తున్నారు. ఇది టెండర్ ఆధారంగానే ప్రాజెక్టుల కేటాయింపు జరుగుతుంది.అయినా ఈనాడుకు ఇష్టం లేదు. అలాగే వైఎస్‌ఆర్ కడప జిల్లా సోమశిల వద్ద 900 మెగావాట్ల, ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. కంపెనీ వారే పెట్టుబడి పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇందులో రామోజీకి వచ్చిన బాధ ఏమిటో తెలియదు. రామోజీ ఫిలింసిటీ స్థాపించినప్పుడు వేల ఎకరాలను కొనుగోలు చేశారు. దానికి ఎవరు అనుమతించారు. అసలు ఆ ప్రాజెక్టు స్థాపనకు ఏమైనా టెండర్ పిలిచారా? అయినా స్థాపించలేదా? అందులో తప్పు లేదు.కాని ఇతర కంపెనీలు ఏవైనా పరిశ్రమలు పెడుతుంటే మాత్రం ఈ మీడియా అడ్డం పడుతుంటుంది. ఈనాడు మీడియా అభివృద్ది నిరోధకంగా మారింది. విచిత్రం ఏమిటంటే షిర్డిసాయి ఎలక్టికల్ కంపెనీ తెలుగుదేశం పార్టీకి నలబై కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. ఈ విషయం మాత్రం గోప్యంగా ఉంచారు. అదే మెఘా కంపెనీ వైఎస్సార్సీపీకి 37 కోట్ల విరాళం ఇచ్చింది. దానిని మాత్రం రాసేశారు. మరి అదే సంస్థ తెలుగుదేశంకు పాతిక కోట్లు ఇచ్చింది. దానిని కప్పిపుచ్చారు. అసలు గుర్తింపేలేని జనసేనకు ఐదు కోట్లు ఇచ్చారు. మరి దీనిని ఏమంటారో రామోజీనే చెప్పాలి. జిందాల్ కంపెనీ 42500 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టడానికి ముందుకు వచ్చింది. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం వద్ద రెండు కాప్టివ్ బెర్తుల నిర్మాణం, అనంతపురం, వైఎస్‌ఆర్ కడప జిల్లా. నంద్యాల ప్రాంతాలలో 2500 మెగావాట్ల సౌర విద్యుత్ పదివేల మెగావాట్ల పవన విద్యుత్, 1500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఈ సంస్థ చేపడితే దానిపైన విమర్శలు చేశారు. వీరికి మైనింగ్ లీజులు కేటాయించారన్నది ఈనాడు ఏడుపు. ఖనిజం లేకుండా స్టీల్ ప్లాంట్ ఎలా వస్తుందో వీరే చెప్పాలి.మెఘా కంపెనీ 30445 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపడుతోంది. సీలేరు వద్ద 12264 కోట్లతో పిఎస్‌పి ప్రాజెక్టును ఈ సంస్థ స్థాపిస్తోంది. అది వీరికి కడుపునొప్పిగా మారింది. జెన్‌కో టెండర్ ద్వారానే దీనిని కేటాయించినా, తప్పే నట. మచిలీపట్నం పోర్టు పనులు కూడా టెండర్ ద్వారానే ఈ సంస్థ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టును, జల విద్యుత్ ప్రాజెక్టును కూడా నిర్మిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా ఈ కంపెనీ అమలు చేస్తోంది. ఇంత అభివృద్ది జరుగుతుంటే, ఈనాడుకు ఇదంతా మింగుడుపడడం లేదు. అందుకే ఇంత బురదచల్లుతూ స్టోరీలు ఇస్తోంది. విశాఖలో అదానికి డేటా సెంటర్ నిర్మాణానికి భూమి ఇవ్వడం కూడా నేరమేనట. అదాని బిజినెస్ పార్క్ ఏర్పాటు చేస్తుంటే వీరు కుళ్ళుతున్నారు. అదే అమరావతి గ్రామాలలో సింగపూర్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములను చంద్రబాబు ఇస్తే మాత్రం గొప్ప విషయం అని రామోజీ ప్రచారం చేశారు. తీరా చూస్తే ఈ కంపెనీలను పట్టుకువచ్చిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి ఆరోపణలతో పదవి పోగొట్టుకున్నారు. అలాగే దుబాయికి చెందిన ఒక సంస్థ పేరుతో వంద ఎకరాలు ఆస్పత్రి నిమిత్తం ఇచ్చారు. ఆస్పత్రి రాలేదు కాని, ఆ కంపెనీ యజమాని అక్కడ చేసిన నేరాలకు జైలుకు వెళ్లారు.ఇలాంటి వాళ్లు చంద్రబాబుకు స్నేహితులు. దేశంలోనే పెద్ద కంపెనీలకు వివిధ ప్రాజెక్టులను అప్పగిస్తే నేరం చేసినట్లు ఈనాడు రామోజీ రాయించేస్తున్నారు. అంటే ఈ కంపెనీలు ఏవీ రాకుండా ఉంటే, ఏపీలో ఉద్యోగాలు పెరగకుండా ఉంటే వీరికి సంతోషం అన్నమాట. ఈ ప్రాజెక్టులను కనుక చంద్రబాబు టైమ్‌లో చేపట్టి ఉంటే అబ్బో అంత గొప్ప, ఇంత గొప్ప అని ప్రచారం చేసేవారు. రామాయపట్నం ఓడరేవు వద్ద ఇండోసోల్ సంస్థ సోలార్‌పానెల్ ప్రాజెక్టును ఆరంభిస్తే, ఎంత దారుణమైన కథనాలు ఈనాడు మీడియా ఇచ్చిందో గమనిస్తే వీళ్లు అసలు మనుషులేనా అన్న అనుమానం వస్తుంది. 43 వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఈ కంపెనీ ఏర్పాటు అవుతుంటే సంతోషించాల్సింది పోయి విషం చిమ్ముతున్నారు. పైగా వారి ఖర్చుతో భూములు కొనుగోలు చేస్తుంటే వీరికి తీటగానే ఉంది.అక్కడ రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి భూములు అమ్ముతున్నారు. అది వీరికి గిట్టడం లేదన్నమాట. అలాగే అరవిందో సంస్థ పలు ప్రాజెక్టులను నిర్మిస్తోంది. వాటిపై కూడా విషం చిమ్మారు. ఈ ప్రాజెక్టులు అన్నీ ప్రజలకు ఉపయోగపడేవి. ప్రభుత్వం ఖర్చు కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేవి. అయినా ఈనాడు మీడియా అదేదో ఘోరం జరిగినట్లు దారుణమైన కథనాలు ప్రచురిస్తోంది. ఈ మొత్తం కధనం చదివితే ఇన్ని వివరాలను నెగిటివ్‌గా ఇచ్చినా ఈ స్థాయిలో పరిశ్రమలు వస్తున్నాయని తనకు తెలియకుండానే ఈనాడు మీడియా అంగీకరించింది. నిజంగా ఇవన్ని ఆచరణలోకి వస్తే ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. అందుకు ముఖ్యమంత్రి జగన్‌ను అభినందించాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Actress Ileana Comments On Telugu Movie Chances
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా

కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మన కెరీర్‌ని డిసైడ్ చేస్తాయి. సినిమా యాక్టర్స్ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ ఇలియానా పరిస్థితి ఇలాంటిదే అని చెప్పొచ్చు. 'దేవదాస్‌' అనే తెలుగు మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహేశ్‌ బాబుతో చేసిన 'పోకిరి' హిట్ కావడంతో ఫేట్ మారిపోయింది. స్టార్‌ హీరోలతో కలిసి మూవీస్ చేసింది. తమిళంలో చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ హిందీలో చేసిన ఓ మూవీ ఈమె కెరీర్ ఖతమయ్యేలా చేసింది!(ఇదీ చదవండి: RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్‌ ఏంటో తెలుసా..?)దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఉన్న టైంలో ఇలియానా.. బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 'బర్ఫీ' మూవీ చేసింది. హిందీ చిత్రాలు చేస్తే చేసింది గానీ దక్షిణాది దర్శకులని కించపరచేలా కామెంట్స్ చేసింది. దీంతో ఈమెని తెలుగు, తమిళ దర్శకులు పట్టించుకోవడం మానేశారు. మరోవైపు మైకేల్‌ టోలన్‌ అనే విదేశీయుడితో ప్రేమలో పడి, చాన్నాళ్లు అతడితో సహజీవనం చేసి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. రీసెంట్‌గానే వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.ఇకపోతే ప్రస్తుతం హిందీ సినిమాల్లో మాత్రమే చేస్తున్న ఇలియానా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దక్షిణాదిలో ఛాన్సులు ఆగిపోవడం గురించి మాట్లాడింది.  తెలుగు, తమిళ సినిమాల్లో చేస్తున్నప్పుడు హిందీలో 'బర్ఫీ'లో ఛాన్స్ వచ్చింది. అది మంచి కథ కావడంతో వదులుకోలేకపోయాను. దీంతో హిందీ చిత్రాల్లోనే నటిస్తున్నానని.. దక్షిణాది చిత్రాల్లో నటించననే తప్పుడు అభిప్రాయం దర్శక నిర్మాతలు వచ్చింది. అందుకే సౌత్‌లో అవకాశాలు రావడం లేదని ఇలియానా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)

This is the story behind Raghu Ramakrishna Raju Assembly seat
రఘరామలీలలు కన్నెత్తి చూడరు.. పట్టించుకోరు

స్వస్థలం ఉండి నియోజకవర్గమైనా.. ఉండేది మాత్రం రాజధానుల్లోనే..  సంక్రాంతి కోడిపందాల సమయంలో హడావుడి తప్ప మిగిలిన రోజుల్లో నియోజకవర్గానికి వచ్చింది అరుదే.. రచ్చబండంటూ.. అందలమెక్కించిన వారిపై నోరుపారేసుకోవడం తప్ప ఎంపీగా తనను గెలిపించిన ప్రజల వైపు కన్నెత్తి చూసింది లేదు.. ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదు.. ఆయనే మాజీ ఎంపీ, టీడీపీ ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణరాజు. ఢిల్లీలో తన బిల్డప్‌ పాచికలు పారకపోవడంతో ఉండిలో టీడీపీ అభ్యర్థిగా గెలుపు కోసం ఆపసోపాలు పడుతున్నారు.  సాక్షి, భీమవరం: బ్యాంకు అప్పులకు సంబంధించిన వ్యవహారాలు, సీబీఐ కేసుల నేపథ్యంలో ఢిల్లీలోనే ఉంటూ లాబీయింగ్‌ చేసుకునేందుకు ఎంపీ సీటుపై చాలానే ఆశలు పెట్టుకున్నారు రఘు రామకృష్ణరాజు. తానే నరసాపురం కూటమి అభ్యర్థినంటూ తాడేపల్లిగూడెం జెండా సభలో స్వయంగా ప్రకటించేసుకున్నారు. ఇంతకన్నా భారీ సభ ఏర్పాటు చేస్తానంటూ బిల్డప్‌లూ ఇచ్చారు. అంతలోనే సీన్‌ రివర్స్‌ అయ్యింది. కేంద్రంలో ఆయన పలుకుబడి ఏ పాటిదో సీట్ల కేటాయింపుల్లోనే తేలిపోయింది. బీజేపీ సీటు మరొకరికి ఇవ్వడంతో ఏం చేయాలో పాలుపోలేదు. మరికొద్ది రోజుల్లో మంచి మాట వింటారంటూ మీడియా ముందు బిల్డప్‌లు ఇస్తూ ఎన్ని పైరవీలు చేసినా, జిల్లాలోని కూటమి అసెంబ్లీ అభ్యర్థులందరితో సంప్రదింపులు చేయించినా బీజేపీ నిర్ణయాన్ని మార్చలేకపోయారు. ఏదో క చోట నుంచి పోటీ చేయకపోతే తన బిల్డప్‌లు పనిచేయవనుకున్నారేమో ఉండి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజు సీటుకు ఎసరుపెట్టి ఉండి అసెంబ్లీ నుంచి పోటీలో నిలిచారు.  గెలుపు కోసం ఆపసోపాలు  గత ఎన్నికల ప్రచారంలో తప్ప స్వతహాగా రఘురామకృష్ణరాజు ప్రజల మధ్య తిరిగింది ఏమీలేదు. నియోజకవర్గానికి వచ్చినా సొంత సామాజికవర్గంలోని కొందరితో తప్ప మిగిలిన సామాజిక వర్గాల వారిని పట్టించుకున్నది లేదు. నిత్యం తన సొంత వ్య వహారాల్లో తలమునకలై ఉండే ఆయనకు, నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలు, వారి కష్టాలు, మౌలిక పరమైన అవసరాల గురించి అవగాహన ఏ మేరకు ఉందనేది ప్రశ్నార్థకమే. ఇప్పుడు ఆయనకు అదే పెద్ద సమస్యగా తయారైందని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఎల్లప్పుడూ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి అహరి్నశలు పాటుపడిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పీవీఎల్‌ నరసింహరాజు, మరోపక్క రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కలిగి, ప్రస్తుతం టీడీపీ రెబల్‌గా బరిలో నిలిచిన వేటుకూరి వెంకట శివరామరాజు నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం అధికారపక్ష అభ్యర్థి పీవీఎల్‌కు లాభించే అంశం కావడంతో పాటు ఇప్పటికే ఆయన ప్రచారంలో ముందంజలో ఉన్నారు.  దళితులు, క్రైస్తవులపై చిన్నచూపు దళితులు, క్రైస్తవులు టీడీపీకి ఓట్లే వేయరన్న భావనలో రఘురామకృష్ణరాజు వారిని చిన్నచూపు చూస్తున్నారన్న ప్రచారం ఎక్కువగానే ఉంది. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి ఆయన పెద్దగా ప్రాధాన్యమివ్వడం లేదంటున్నారు. ఎప్పు డూ ఢిల్లీ, హైదరాబాద్‌లో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులో ఉండరని, సామాన్యులకు అపాయింట్‌మెంట్‌ దొరకడం కష్టమేనంటూ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం రఘురామను ఇరకాటంలో పడేస్తుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. తన ఎన్నికల ప్రచారానికి పెద్దగా స్పందన లేకపోవడం, రోజురోజుకూ విజయావకాశాలు సన్నగిల్లుతుండటంతో నిరాశకు లోనై చిన్నపాటి విషయాలకు కేడర్‌పై ఆయన చిర్రుబుర్రులాడుతున్నారని సమాచారం.  అసమ్మతి సెగలు  టీడీపీకి చెందిన కొందరు నేతలు పార్టీని వీడి రెబల్‌గా పోటీలో ఉన్న శివరామరాజు వెంట వెళ్లిపో గా మిగిలిన వారిలో అధిక శాతం మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజు వర్గమే. సీటు మార్చొద్దంటూ రామరాజుకు మద్దతుగా ఆందోళన చేసిన టీడీపీ నాయకులను బెట్టింగ్‌రాయుళ్లని రఘురామ అనుచిత వ్యాఖ్యలు చేయడం పార్టీలో అంతర్గతంగా అసమ్మతి జ్వాలలు రగిలిస్తూనే ఉంది. పైకి రామరాజుతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్నా సిట్టింగ్‌ సీటును లాక్కోవడంపై ఆయన వర్గం ఎంత వరకు తనకు సహకరిస్తారనే అనుమానం రఘురామను వెంటాడుతోందంటున్నారు. జనసేన కేడర్‌పైనే ఆయన నమ్మకం పెట్టుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కాపులను ఉద్దేశించి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, కాపు యువకులపై కేసులు పెట్టి స్టేషన్‌లో పెట్టించిన సంఘటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘మీరు కాపు కాసేవారు మీ పని మీరు చేసుకోండి.. నార తీసే వృత్తి వేరు, తాట తీసే వృత్తి వేరంటూ’ ఆయన చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన కేడర్‌ అన్నీ మర్చిపోయి ఆయనకు ఎంతవరకు కలిసివస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all