Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

Jagan Mohan Reddy is implementing the Navaratnalu Scheme in AP
సర్కారు ఊతంతో పూల బాట

నవరత్నాల పేరుతో రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగు రేఖలు నింపుతు న్నాయి. లక్షలాది మంది జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి.  తిరుపతి జీవకోనలోని రాఘవేంద్ర నగర్‌కు చెందిన వెంకటేష్, మునీశ్వరి కుటుంబమే ఇందుకు నిదర్శనం  వెంకటేష్‌ 2019కి ముందు భవన నిర్మాణ సెంట్రింగ్‌ కార్మికుడిగా పనిచేస్తూ చాలీ చాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తుండేవారు. పని దొరికిన రోజు వచ్చే  కూలి రూ.400తో ఆ కుటుంబంలోని ఆరుగురు జీవించాల్సి వచ్చేది. ఆయన భార్య మునీశ్వరి గృహిణి. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ముగ్గురు పిల్లలను చదివించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు. గత ప్రభుత్వంలో రేషన్‌ కార్డు తప్ప ఎలాంటి పథకాలు అందలేదు. మునీశ్వరి అత్తమ్మకు పింఛన్‌ కూడా వచ్చేది కాదు. జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగే లా తిరిగినా ఫలితం లేకపోయింది. పిల్లలను చది వించగలమా అనే బెంగతో ఉండేవారు. 2019లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త ప్రవేశపెట్టిన నవరత్నాలతో ఆ కుటుంబానికి భరోసా లభించింది.  వైఎస్‌ఆర్‌ ఆసరా, జగనన్న తోడు, ముగ్గురు పిల్లలకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌­మెంట్, అమ్మ ఒడి, కుటుంబంలోని మునీశ్వరి అత్తమ్మకు వృద్ధాప్య పింఛన్‌ లభిస్తోంది. ప్రస్తుతం ఒక కుమార్తె ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది, మరో కుమార్తె డిగ్రీ పూర్తి చేసింది. వీరిద్ధరూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కూలిపని మానేసి చెన్నై నుంచి ముడిసరుకు తెప్పించుకుని  గృహాలకు ప్లాస్టిక్‌ పూల తోరణాలు, దేవుని చిత్రపటాలకు అవసరమైన పలు రకాల రంగులతో మాలలు, ప్లాస్టిక్‌ పూలతో షోకేజ్‌ డెకరేషన్‌ బొకేలు తయారు చేస్తూ మరో ఆరు మంది మహిళలకు ఉపాధి కబ్ధి స్తున్నారు.     –తిరుపతి సిటీ\తలసరి ఆదాయం పెరిగింది గతంలో నిరుపేద మహిళలు కూలి పనులు చేసుకుంటూ లేదా ఇళ్లల్లో   పనిచేసుకుంటూ   కుటుంబా­న్ని పోషించేవారు.   పిల్లలను చదివించలేక పోవడంతో వారు షాపుల్లో పనులు చేసుకుంటూ మంచి భవిష్యత్తు కోల్పోయి జీవితాలను సర్వనాశనం చేసుకునేవారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు పేదల పాలిట వరాలుగా మారాయి.  వారి జీవన ప్రమాణాలు పెరిగాయి. తలసరి ఆదాయం పెరిగింది. ఇది కాదనలేని నిజం.   అమ్మ ఒడి, ఫీజురియింబర్స్‌మెంట్, విద్యాదీవెన, వసతి దీవెనతో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు.    –జి సవరయ్య, రిటైర్డ్‌ ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌ ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతివైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మునీశ్వరి కుటుంబానికి కలిగిన లబ్ధి వైఎస్సార్‌ ఆసరా    రూ.68,000 వైఎస్సార్‌ చేయూత    రూ.75,000 జగనన్న విద్యాదీవెన    రూ.28,000 వసతి దీవెన    రూ.20,000 అమ్మ ఒడి    రూ.30,000 సున్న వడ్డీ    రూ.2,250 పింఛన్‌ కానుక    రూ.96,000 మొత్తం    రూ.3,19,250 

Kona Venkat Exclusive Interview With Sakshi
జగన్‌ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం

ఊరూరా కళ్లెదుటే మార్పు ‘ప్రభుత్వ ఆస్పత్రులు బాగుండవని చాలా మంది అనుకుంటారు. మా బాపట్ల ప్రభుత్వాస్పత్రిని చూస్తే ఆ ఆలోచన కచ్చితంగా మారిపోతుంది. ఆపరేషన్‌ థియేటర్స్‌లో కూడా అత్యాధునిక ఎక్విప్‌మెంట్, అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం ఇన్ఫాంట్‌ స్పెషల్‌ ఐసీయూ, సొంత ఆక్సిజన్‌ ప్లాంట్‌ కూడా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఆ సౌకర్యం చాలా ప్రైవేటు ఆస్పత్రులకు ఇప్పటికీ లేదు’ అంటున్నారు సినీ దర్శకుడు, రచయిత కోన వెంకట్‌. చిన్న చిన్న గ్రామాల్లో కూడా హెల్త్‌ క్లినిక్స్, రూపురేఖలు మారిపోయిన పాఠశాలలు, డిజిటల్‌ బోధన కళ్లెదుటే కనిపిస్తోందని స్పష్టం చేస్తున్నారు. కళ్లెదుటే ఇంత మార్పునకు కారణం ముమ్మాటికీ సీఎం జగనే అని నొక్కి చెబుతున్నారు.  ‘చెడు త్వరగా ప్రచారంలోకి వస్తుంది. అది వినడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడతారు. మంచి చెబితే ఏదో ఆశించి భజన చేస్తున్నాం అంటారు. అంటే అనుకోనీయండి. కానీ నిజం చెప్పకపోవడం అంటే అబద్ధాన్ని ప్రోత్సహించడమే అని నా అభిప్రాయం. అందుకే నేను నిజాలు చెబుతున్నాను’ అంటున్నారు సినీ దర్శక, రచయిత కోన వెంకట్‌. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా పరిశీలించి, వాటి గురించి ససాక్ష్యంగా వరుసగా ట్వీట్స్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాక్షితో ఆయన తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..    –సత్యార్థ్‌  బాపట్ల జిల్లా కర్రపాలెం మండలంలోని మారుమూల గణపవరం అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించా. అక్కడి పిల్లలతో కలిసి నిమ్మకాయ పులిహోర తిన్నా. రాగిజావ తాగా. ఉచితం అంటే ఎలా ఉంటాయో అని మనం అనుకుంటాం. కానీ మన అంచనాలన్నీ తప్పని అక్కడ ఆహారం తిన్నాక స్పష్టమైంది. అక్కడి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వడ్డించే పదార్థాలు ఎంతో రుచికరంగా ఉన్నాయి. అంతేకాదు ట్యాబ్స్, స్కూల్‌ బ్యాగ్స్, యూనిఫామ్స్, షూ, సాక్స్‌... అన్నీ నాణ్యమైనవే ఇచ్చారు. పాఠశాల వాతావరణం బాగుంటే సానుకూల ఫలితాలు వస్తాయి కదా... అదే ఇప్పుడు కనిపిస్తోంది. మేం చదువుకున్నప్పుడు ఇలాంటి వసతులు, సౌకర్యాలు ఉంటే మరింత బాగా రాణించేవాళ్లం కదా అనిపించింది. టీచర్లు, సిబ్బంది కూడా కొత్త ఉత్సాహంతో కనిపించారు. నాకు ఎంత ఆనందం కలిగిందంటే అప్పటికప్పుడు ఆ టీచర్లు అందరికీ శాలువాలు తెప్పించి సన్మానించాను. పల్లెలకు చికిత్స ప్రభుత్వ ఆస్పత్రులు.. అదీ మారుమూల గ్రామంలో ఎలా ఉంటాయో అనే దానిపై మనం ఒక మైండ్‌ సెట్‌తో ఉంటాం. అయితే మా బాపట్ల ప్రభుత్వాస్పత్రిని చూస్తే ఆ ఆలోచన కచ్చితంగా మారిపోతుంది. ఆపరేషన్‌ థియేటర్స్‌లో కూడా అత్యాధునిక ఎక్విప్‌మెంట్, అప్పుడే పుట్టిన చిన్నారుల కోసం ఇన్ఫాంట్‌ స్పెషల్‌ ఐసీయూ. అంతేకాదు.. సొంత ఆక్సిజన్‌ ప్లాంట్‌ కూడా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి ఆ సౌకర్యం చాలా ప్రైవేటు ఆస్పత్రులకు ఇప్పటికీ లేదు. నేను వచ్చింది ప్రభుత్వ ఆస్పత్రికా, లేక కార్పొరేట్‌ ఆస్పత్రికా అన్న ఆశ్చర్యం కలిగింది. కొన్నేళ్ల క్రితం వరకూ గర్భిణులు సైతం డెలివరీల కోసం చీరాల, తెనాలి అంటూ పొరుగూళ్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడిక ఆ సమస్య లేదు. ఇక మరో మారుమూల ఉన్న కొత్త నందాయపాలెం అనే చిన్న గ్రామంలో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ చూశా. అదీ అద్భుతం అనే చెప్పాలి. ఆ హెల్త్‌ క్లినిక్‌లో ల్యాబ్‌ కూడా పెట్టారు. అక్కడికక్కడ రక్త పరీక్షలు, బీపీ, షుగర్‌ టెస్ట్‌లు చేస్తూ మందులు ఇస్తున్నారు. అక్కడ సేవలందించే డాక్టర్స్‌ విశ్రాంతి తీసుకోవడానికి క్వార్టర్స్‌ కూడా ఏర్పాటు చేశారంటే ఎంత పక్కా ప్రణాళికతో ఈ విలేజ్‌ క్లినిక్స్‌ని డిజైన్‌ చేశారో ఆలోచించండి. నా కళ్లు నేనే నమ్మలేనంత గొప్పగా ఇళ్లు పేదలకిచ్చిన ఇళ్లను గమనించడానికి మాకు సమీపంలో ఉన్న జగనన్న కాలనీలను సందర్శించా. చెబుతుంటే అతిశయోక్తిలా ఉంటుందేమో. హైదరాబాద్‌లోని గచ్చి»ౌలిలో ఉన్న విల్లా కమ్యూనిటీలాగా అనిపించింది. అది కూడా ఎక్కడో ఊరికి దూరంగా విసిరేసినట్టు కట్టిన కాలనీ కాదు. బాపట్ల ఎంట్రన్స్‌లో హైవే పక్కనే కట్టించి ఇచ్చారు. కేవలం ఇళ్లు ఇవ్వడమే కాదు చక్కగా, పరిశుభ్రంగా అన్ని వసతులతో నిర్వహిస్తున్నారు. అక్కడ తాపీ పనిచేసే ఒక ముస్లిం కుటుంబంతో పాటు అనేక మందితో ముచ్చటించినప్పుడు వాళ్ల కళ్లల్లోని ఆనందాన్ని చూస్తే పేదలకు ఇంతకన్నా మేలు చేసే ప్రభుత్వం ఉంటుందా? అనిపించింది. ఎందుకంటే వాళ్ల జీవితంలో ఇలాంటి ఇళ్లు కట్టుకోవడం అసాధ్యం. నాకు కూడా అలాంటి చోట ఒక ఇల్లు ఉంటే బాగుండు అన్నంత బాగుంది. రోడ్లపై జరుగుతోంది దు్రష్పచారమే...రహదారుల విషయంలో కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం జరుగుతోంది. దీనిని నిర్ధారించుకోవడానికి నేను మా ఊరి చుట్టుపక్కల రహదారుల్ని సర్వే చేశాను. అదంతా అబద్ధమేనని తేలింది. మీరు నమ్ముతారా? మా బాపట్లకి అవుటర్‌ రింగ్‌ రోడ్‌ కూడా ఉంది. ఇక గ్రామ సెక్రటేరియట్స్, రైతు భరోసా కేంద్రాలు కూడా త్వరలో సందర్శిస్తాను. ఆం«ధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మంచిని కనపడనీయకుండా, వినపడనీయకుండా చేయాలనే ఆలోచనతో విపక్షాలు, జగన్‌ శత్రువులు కుట్ర చేస్తున్నారు. నేను రాష్ట్రం మంచి కోరుకునే ఆంధ్రప్రదేశ్‌ పౌరుడ్ని. వృత్తి, వ్యాపకాల రీత్యా నేనెక్కడ స్థిరపడినా నా ఊరు బాగుపడుతుంటే ఆ ఊరంటే ప్రేమ ఉన్న నేనెందుకు గర్వంగా చెప్పుకోకూడదు? ఎవరేమనుకున్నా సరే.. నాకు కనపడిన మంచిని ప్రజలతో పంచుకుంటా. చిత్తశుద్ధి ఉన్న సీఎం గెలవాలి... వైఎస్సార్‌సీపీయా... బీజేపీయా... కాదు. పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్న జగన్‌ లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఆయనకు ఆ అవసరం లేకపోవచ్చు. నాన్న వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని తప్ప మరో కోరిక ఉండకపోవచ్చు. కానీ ఆయన సీఎంగా ఉండడం, మళ్లీ గెలవడం ఈ రాష్ట్రానికి... ముఖ్యంగా పేదలకు అవసరం. ఇలాంటి పాలన నిజంగా పేదలకు ఓ వరం.  

List of star campaigners for Election Commission with 12 commoners
సామాన్యులే స్టార్‌ క్యాంపెయినర్లు

సాక్షి, అమరావతి: స్టార్‌ క్యాంపెయినర్లు.. ప్రతి పార్టీలోనూ ప్రముఖ నాయ­కులు వీళ్లు.. సభలకు వ­స్తారు.. చేతులూపుతారు.. ఏదేదో చెప్పే­స్తారు.. వారి పార్టీ వారికి ఓటేయమని కోరుతూ ఓ దండం పెట్టేసి హెలికాప్టరో, విమానమో ఎక్కేసి వెళ్లిపోతారు. కానీ,  జగన్‌ నేతృత్వంలోని ప్రజల పార్టీ అయిన వైఎస్సార్‌సీపీకి స్టార్లు, స్టార్‌ క్యాంపెయినర్లు కూడా సామాన్య ప్రజలే.  జగన్‌ ప్రభుత్వం అందించిన చేయూతతో అభివృద్ధి సాధించి, కుటుంబ జీవన ప్రమాణాలను పెంచుకున్న సాధారణ ప్రజలే. చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా ఈ సామాన్యులే స్టార్‌ క్యాంపెయినర్లుగా  వైఎస్సార్‌సీపీ ఎన్నికల సమారానికి సిద్ధమైంది.ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారే తన స్టార్‌ క్యాంపెయినర్‌లంటూ సీఎం జగన్‌ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. దీనినే కార్యరూపంలోకి తెస్తూ దేశంలో ఏ పార్టీ కనీసం ఆలోచన కూడా చేయలేని సాహసోపేత నిర్ణయం తీసుకుని, వైఎస్సార్‌సీపీ 12 మంది సామాన్యులతో తన రాష్ట్రస్థాయి స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల కమిషన్‌కు అందజేసింది. వీరంతా జిల్లా, నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవుతారు.  సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయాన్ని వీరు సందర్శించారు. సీఎం వైఎస్‌ జగన్‌కు స్టార్‌ క్యాంపెనర్‌లుగా ఏ విధంగా మారారో వారిలో కొందరు వివరించారు.  50 ఇళ్లకు నేనే ఎమ్మెల్యేగా పనిచేశా ఈ ప్రభుత్వంలో వలంటీర్‌గా పనిచేశా. నా 50 ఇళ్లకు నేనే ఎమ్మెల్యే అన్నట్లు పనిచేశా. ప్రతి ఇంటికి వారికి ఏ పథకాలు అందాలో వాటన్నింటినీ పక్కాగా అందించాం. అదే ఊరికి చెందిన నాకు ఆ కటుంబాలు గతంలో ఎలా ఉండేవి, నవరత్నాలతో ఆర్థిక భరోసా అందిన తరువాత ఎలా మారాయో నాకు స్పష్టంగా కనిపించింది. ఈ ఐదేళ్లలో నిజమైన అభివృద్ధిని చూశా. ఆర్థిక కారణాలతో పిల్లలను చదువించుకోలేని ప్రతి కుటుంబానికీ సీఎం వైఎస్‌ జగన్‌ అండగా నిలిచారు. భర్త సంపాదన మీద మాత్రమే బతికే ప్రతి అక్కకు, చెల్లెమ్మకు సీఎం జగనన్న అండగా నిలిచి ఆర్థిక భరోసా కల్పించారు. ఏదో ఒక చిరు వ్యాపారం చేసుకునేలా తీర్చిదిద్దారు. ఈ ప్రభుత్వం మహిళలను నిజమైన ఇంటి యజమానిని చేసింది. నా క్లస్టర్‌లోని సగం కుటుంబాలు స్థానికంగా, పక్కనే ఉన్న పట్టణాల్లో సొంత వ్యాపారాలు ప్రారంభించాయి. తద్వారా ప్రతిరోజూ రూ. 1,000 వరకు సంపాదించుకుంటున్నాయి. వారి జీవితాల్లో చాలా మార్పు వచి్చంది.  ఒక తల్లిగా ఆలోచిస్తే మా పిల్లలకు అవసరమైన చదువులు, అవసరాలు అన్నీ పాఠశాలల్లో లభిస్తున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తున్న నాయకుడని నేను నమ్ముతున్నాను. – ఈశ్వరి, కొండపల్లి, ఎన్టీఆర్‌ జిల్లాసీఎం జగన్‌ చలవతో నా కుమారుడు అమెరికాలో చదువుతున్నాడు నాకు ఇద్దరు కుమా­రులు. పెద్దబ్బాయి కిషోర్‌ డిగ్రీ పూర్తి చేసి డిల్లీలోని మారుతి సుజుకీలో ఉద్యోగం చేసే­వాడు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్‌ ఇన్‌ పొలిటికల్‌ అఫైర్స్‌లో సీటు సంపాదించాడు. కోర్సు ఫీజు రూ.1.36 కోట్లు అవుతుందన్నారు. ఈ మాట నాకు చెప్పగానే కనీసం రూ. లక్ష అయినా మనం కట్టలేం.. మంచి ఉద్యోగం చూసుకో అని చెప్పా. ఆ తరువాత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో విదేశీ విద్య పథకం గురించి తెలుసుకుని దరఖాస్తు చేశాం.నా కొడుకు చదువుకు కావాల్సిన డబ్బు విదేశీ విద్య కింద మంజూరైంది. ఇప్పటికే రెండు సెమిస్టర్లు పూర్తి చేసిన నా కుమారుడికి రెండు దఫాలుగా రూ. 50 లక్షలు అందింది. ఇది చూసిన నాకు లక్ష రూపాయలు కట్టలేని నా కుమారుడు ఇంత పెద్ద మొత్తం ఫీజుతో విదేశీ విశ్వవిద్యాలయంలో చదవగలుగుతున్నాడని గర్వంగా అనిపించింది. ఒక్క నా కుమారుడే కాదు.. ఇలా చాలా మంది పేదల పిల్లలు విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఉన్నత విద్య చదువుతున్నారు. ఇదంతా సీఎం వైఎస్‌ జగన్‌ చలవే. అందుకే సీఎం జగన్‌ కోసం స్టార్‌ క్యాంపెయినర్‌ అయ్యాను.       – పండలనేని శివప్రసాద్, మోపిదేవి మండలం, కృష్ణా జిల్లాసీఎం జగన్‌ ఆలోచనలకు సంపూర్ణ మద్దతు జగనన్న చేదోడు అందుకున్న మా ఇంటి పక్కనే నివాసం ఉండే శారద బట్టల షాపు ఏర్పాటు చేసుకుని కుటుంబానికి అండగా నిలుస్తోంది. దాసరి మహాలక్ష్మి అనే మహిళకు భర్త మరణిస్తే రూ. 2 లక్షల బీమా అందింది. దీంతోపాటు పెన్షన్, ఆసరా, అమ్మఒడి పథకాలూ అందుతున్నాయి. మాది కూడా నిరుపేద కుటుంబం. జగననన్న ప్రభుత్వంలో అందిన నవరత్నాలతో రోజు గడవడమే కష్టంగా ఉండే దుస్థితి నుంచి నిలకడ ఆదాయం అందుకునే స్థితికి వచి్చంది. మా కుటుంబాలను ఆర్థికంగా నిలబడేలా ఆదుకున్న ప్రభుత్వానికి మేమెందుకు అండగా నిలవకూడదు? పేదలను పేదరికం నుంచి తప్పించి మెరుగైన జీవితం కల్పించాలనే సీఎం జగన్‌ ఆలోచనకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. అందుకే సీఎం జగన్‌ కోసం స్టార్‌ క్యాంపెయినర్‌గా పనిచేసేందుకు ముందుకు వచ్చా.      – ఎ. అనంతలక్ష్మి, రాజమండ్రి సిటీ నియోజకవర్గం, తూర్పు గోదావరి జిల్లాప్రభుత్వ పాఠశాలల్ని చూస్తే తేడా తెలుస్తుంది సీఎం జగన్‌ పరిపాలన ఏమిటో చెప్పేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలే ఉదాహరణ. నేను డిగ్రీ పూర్తి చేసి ఐదేళ్లే అయ్యింది. మేం చదువుకునే సమయంలో ప్రభుత్వ పాఠశాలలి్న, ఇప్పడు నాడు – నేడు కింద పూర్తిగా మారిన ప్రభుత్వ పాఠశాలలను చూస్తే తేడా అర్ధమవుతుంది. అప్పటి ప్రభుత్వ పాఠశాలలు తలుపులు లేక గేట్లు లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేవి. కనీసం బాలికలకు టాయిలెట్లు కూడా లేని దుస్థితి. ఇలాంటి స్కూళ్లలో బాలికల విద్య ఎలా ఉంటుందో మనం ఒక్కసారి ఆలోచిస్తే అర్ధమ­వుతుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే అంతర్జాతీయ స్థాయి. సకల సౌకర్యాలు, డిజిటల్‌ క్లాస్‌ రూంలు, ట్యాబ్‌లతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యను బోధిస్తున్నారు. మరో పదేళ్లలో ఈ ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటికి వచ్చే వారితో రాష్ట్రం మరో ఎత్తుకు ఎదుగుతుంది. ఇంగ్లిష్‌ చదువులతో  కొన్ని లక్షల కుటుంబాల తలరాత మారిపోతుంది. సీఎం జగన్‌ ప్రభుత్వాన్ని ప్రతి గ్రామానికి తీసుకొచ్చారు.  వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తాను.      – అన్వర్, నెల్లూరు జిల్లాఒక అడుగు ముందుకు వేశాం ద్విచక్ర వాహనాలకు సీట్‌ కవర్లు కుట్టే ఒక చిన్న షాపు నాది. రోడ్డు పక్కన పెట్టుకున్నాను. నాకు ముగ్గురు పిల్లలు. నా రోజువారీ సంపాదన కుటుంబ పోషణకే సరిపోతుంది. పిల్లలను బాగా చదివించాలని ఆశ ఉన్నా చదివించే ఆర్థిక స్థోమత లేదు. 2019లో సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇంజనీరింగ్‌లో చేరిన నా కొడుకుకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలతో ఆదుకున్నారు. నా కుమారుడు బాగా చదువుకున్నాడు. రెండో కొడుకు కూడా ఫీజు రియింబర్స్‌మెంట్‌ డబ్బుతో డిగ్రీ చదువుతున్నాడు. మూడో కొడుకుకి అమ్మఒడి అందుతోంది. నా సంపాదన అరకొరే అయినా, నా పిల్లల చదువు ఏ ఆటంకం లేకుండా సాగుతోంది. పెద్ద కొడుకు ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగం సాధించాడు. సీఎం జగన్‌ ఇచ్చిన ఒక్క పథకం కింద చదువుకున్న నా కొడుకు నా కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చాడు. మేము సమాజంలో ఒక అడుగు ముందుకు వేసినట్లైంది. ఇలాంటి వేలాది పేదింటి పిల్లలకు సీఎం జగన్‌ చదువులు చెప్పిస్తున్నారు.      – కటారి జగదీష్ , మల్లవీధి, అనకాపల్లి

YS Jaganmohan Reddy visit to Ongolu and Tanguturu on april 30
నేడు సీఎం జగన్‌ ప్రచార సభలు ఇలా..

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ షెడ్యూల్‌ను సోమవారం ఆయన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 10 గంటలకు ఒంగోలు లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరులో జరిగే ప్రచార సభ­లో.. మధ్యాహ్నం 12.30 గంటలకు కడప లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న మైదుకూరు నియోజకవర్గంలోని మైదుకూరు నాలుగు రోడ్ల జంక్షన్‌లో జరిగే సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యా­హ్నం 3 గంటలకు రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.  

46 degrees temperature registered in Nandyala district
సెగలు.. భగభగలు

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.  సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సింహాద్రిపురం (వైఎస్సార్‌)లో 45.9, రామభద్రపురం (విజయనగరం) 45.1, కోడుమూరు (కర్నూలు) 44.8, సాలూరు (పార్వతీపురం మన్యం) 44.5, రాపూరు (నెల్లూరు) 44.4, లక్ష్మీనర్సుపేట (శ్రీకాకుళం) 44.3, మార్కాపురం (ప్రకాశం)లో 44.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా 59 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 78 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. మంగళవారం 61 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 173 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. వీటిలో శ్రీకాకుళంలో 13, విజయనగరం 24, పార్వతీపురం మన్యం 14, అనకాపల్లి 9, విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలంలోనూ తీవ్ర వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కోస్తా జిల్లాలోని పలు మండలాల్లో   వడగాడ్పులు వీస్తాయని వివరించింది.

Lok sabha elections 2024: Narendra Modi win is victory for Digital India
మోదీ 2.0

పెద్ద నోట్ల రద్దు. దేశవ్యాప్తంగా బ్యాంకులు,  ఏటీఎంల ముందు జనం బారులు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)తో యావద్దేశం ఒకే మార్కెట్‌గా మారిన వైనం. సామాన్యులు, వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన రెండు  నిర్ణయాలు. అయినా వాటి ఉద్దేశాన్ని ప్రజలకు  వివరించడంలో మోదీ సఫలమయ్యారు. ఉగ్రవాదంపై  ఉక్కుపాదం మోపడమే గాక దేశ ఆర్థిక పురోగతి కోసం దూర దృష్టితో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. డిజిటైజేషన్‌కు ఊతమిచ్చారు. దాంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని మరింత మెజారిటీతో ఆశీర్వదించారు. కాంగ్రెస్‌ వరుసగా రెండోసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది...  బీజేపీతో నేరుగా తలపడుతున్న రాష్ట్రాలు మినహా మిగతా చోట్ల ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంది. కశీ్మర్, బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, కేరళల్లో వాటితో సీట్ల సర్దుబాటు చేసుకుంది. యూపీలో ఎవరూ ఊహించని విధంగా బీఎస్పీ, ఎస్పీ కలసి పోటీ చేశాయి! విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మళ్లీ ఎన్డీఏదే అధికారమన్న  మెజారిటీ ఒపీనియన్‌ పోల్స్‌ అంచనాలే నిజమయ్యాయి. బీజేపీ బలం 282 నుంచి 303కు పెరిగింది! ఓట్ల శాతం కూడా 31 నుంచి 37.3 శాతానికి పెరిగింది. ఎన్డీఏకు 353 మంది ఎంపీలు సమకూరారు. కాంగ్రెస్‌ 44 సీట్ల నుంచి కనాకష్టంగా 52 దాకా ఎగబాకింది. పెద్ద నోట్ల రద్దు 2016 నవంబర్‌ 8 రాత్రిని దేశ ప్రజలు ఎన్నిటికీ మర్చిపోలేరు! ప్రధాని మోదీ టీవీ ముందుకొచ్చి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు సంచలనాత్మక ప్రకటన చేశారు. నల్లధనం, నకిలీ నోట్ల ఏరివేత, ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అరికట్టే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతివ్వాలని కోరారు. వాటి స్థానే కొత్త రూ.500తో పాటు రూ.2,000 నోట్లు తేనున్నట్టు చెప్పారు. నిరీ్ణత గడువులోపు పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరి పడ్డ ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు! ఇంతా చేసి... రూ.15.41 లక్షల కోట్ల విలువైన రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయగా దాదాపుగా ఆ మొత్తమంతా (రూ.15.3 లక్షల కోట్లు) తిరిగి బ్యాంకుల్లోకి రావడం గమనార్హం.విశేషాలు... ⇒ ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశీ్మర్లోని పుల్వామాలో జరిగిన జైషే ఉగ్ర సంస్థ దాడిలో ఏకంగా 40 మంది జవాన్లు ప్రాణాలు విడిచారు. దీనికి మోదీ సర్కారు సర్జికల్‌ స్ట్రయిక్స్‌తో బదులిచి్చంది. పాక్‌లోని బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలను మన వాయుసేన విమానాలు బాంబులతో నేలమట్టం చేశాయి. ఈ ఉదంతం  బీజేపీకి బాగా  కలిసొచి్చంది. ⇒ ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎన్డీఏ సర్కారు ధ్వంసం చేస్తోందన్న విమర్శలు కాంగ్రెస్, ఇతర విపక్షాలకు పెద్దగా లాభించలేదు. ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.72,000, ఇల్లులేని వారందరికీ ఇంటి స్థలం, ఉచిత వైద్య పరీక్షలు, ఔషధాలు, ఉచిత వైద్యం వంటి కాంగ్రెస్‌ హామీలను జనం పట్టించుకోలేదు. ⇒ సీబీఐ, కాగ్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థలన్నీ కాంగ్రెస్‌ హయాంలోనే నిర్వీర్యమయ్యాయని, విపక్షాలవి కుటుంబ రాజకీయాలని, కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యమే లేదని మోదీ చేసిన విమర్శలు ప్రజలను ఆకట్టుకున్నాయి.జీఎస్‌టీ2017 దాకా ఒకే ఉత్పత్తి, ఒకే సేవపై దేశవ్యాప్తంగా రకరకాల ధరలుండేవి.  రాష్ట్రానికో రీతిలో వ్యాట్, ఎక్సైజ్‌ సుంకాలు దీనికి కారణం. రాష్ట్రాల స్థాయిలో పన్నుల ఎగవేతా  ఎక్కువగా ఉండేది. వీటికి పరిష్కారంగా దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్, ఒకే పన్ను సంకల్పంతో మోదీ సర్కారు 2017 జూలై 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తెచి్చంది. తొలుత పెద్దగా ప్రభావం కనిపించకున్నా కొన్నేళ్లుగా పన్నుల ఆదాయం భారీగా పెరుగుతోంది.17వ లోక్‌సభలో  పార్టీల బలాబలాలు (మొత్తం సీట్లు 543) పార్టీ    స్థానాలు  బీజేపీ    303 కాంగ్రెస్‌    52 డీఎంకే    24 వైఎస్సార్‌సీపీ    22 టీఎంసీ    22 శివసేన    18 జేడీ(యూ)    16 బిజూ జనతాదళ్‌    12 బీఎస్పీ    10 టీఆర్‌ఎస్‌    9 స్వతంత్రులు    51 ఇతరులు    4  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

CM YS Jagan Fires On Chandrababu At Election Campaign
మళ్ళీ విషసర్పం నోట్లో తల పెట్టొద్దు.. బాబు చరిత్రే మోసం: సీఎం జగన్‌

బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుందో చంద్రబాబును నమ్మితే కూడా అదే అవుతుంది. అక్కడ బిందెడు పన్నీరు గోవిందా.. ఇక్కడ పథకాలూ గోవిందా! గతంలో బాబును నమ్మి ఓటు వేసినందుకు బంగారు రుణాలు గోవిందా...! డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాల మాఫీ గోవిందా...! ప్రత్యేక హోదా, ఉమ్మడి రాజధాని, ప్రత్యేక ప్యాకేజీ గోవిందా.. గోవిందా! తిరుమల వెంకన్న స్వామిని తలచుకుని చెప్పే గోవిందా గోవిందాలు కావు ఇవి. బాబును నమ్మితే అన్నీ గోవిందా..! – చోడవరం సభలో సీఎం జగన్‌జగన్‌ను ఎందుకు ఓడించాలని అడగండి. పేదలకు ఇచ్చిన మాట తప్పనందుకా? ఇంటింటికీ సంక్షేమాన్ని అందిస్తూ మంచి చేస్తున్నందుకా? చంద్రబాబు, రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, దత్తపుత్రుడు,జన్మభూమి కమిటీల దోపిడీ ముఠాకు అధికారం కోసం జగన్‌ను ఓడించాలా? వీరంతా కలిసి రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకోవడం కోసమా..? దోచుకున్నది పంచుకోవడం కోసమా? మరి జగన్‌ను ఎందుకు ఓడించాలయ్యా చంద్రబాబూ? – అంబాజీపేట సభలో సీఎం జగన్‌మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కేవలం 58 నెలల పాలన చేసిన నన్ను ‘‘బచ్చా..’’ అని అంటూనే భయపడుతున్నారు. చంద్రబాబూ నువ్వు నిజంగా అంత పుడింగే అయితే నన్ను ఎదుర్కొనేందుకు ఇన్ని పార్టీలతో పొత్తులెందుకయ్యా? 14 ఏళ్లలో ఏ ఒక్క మంచీ చేయకపోగా ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు జగన్‌ ఐదేళ్లలో చేసిన పథకాలనే అమలు చేస్తానని చెబుతున్నావంటే దాని అర్థం ఏమిటి? మరి ఇప్పుడు ఎవరు బచ్చా? ఎవరు లీడర్‌? చెప్పు చంద్రబాబూ..! – పొన్నూరు సభలో సీఎం జగన్‌సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి, కాకినాడ, సాక్షి ప్రతినిధి, గుంటూరు:  చంద్రబాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టిన­ట్లేనని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. 2014 ఎన్నికల హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చని చంద్ర­బాబుకు అసలు ఓటు ఎందుకు వేయాలని ప్రజలంతా గట్టిగా నిలదీయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ఓటు వేస్తే జరిగే నష్టాన్ని తెలుసుకోవాలన్నారు. సోమవారం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తూరు జంక్షన్, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట జంక్షన్, గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. చరిత్ర చెబుతున్న సత్యం.. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగనుంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. మనం వేసే ఓటుతో రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతలను నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ సజావుగా కొనసాగుతాయి. పొర­పాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లకలకా అంటూ మీ రక్తం తాగేందుకు మరో ఐదేళ్లు మీ ఇంటి తలుపులు కొడుతుంది. ఇది చంద్రబాబు గురించి చరిత్ర చెబు­తున్న సత్యం. బాబును నమ్మడం అంటే విషసర్పాన్ని నమ్మడమేనని గుర్తుంచుకోండి. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చేసిందేమిటంటే.. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబుకు ఇంత, దత్తపుత్రుడికి ఇంత, ఓ రామోజీ ఈనాడుకు ఇంత, ఆంధ్రజ్యోతికి, టీవీ 5కి ఇంత.. అంటూ అంతా కలసి రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడమే! బాబు డబ్బులిస్తే తీసుకోండి.. మీ బిడ్డ ఈరోజు బటన్‌ నొక్కితే రూ.2.70 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా వెళ్లాయి. చంద్రబాబు హయాంలో అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డబ్బులు ఇవ్వకుండా దోచుకుని పంచుకున్నారు. చంద్రబాబు దగ్గర దోచుకున్న సొమ్ము చాలా ఉంది. ఈసారి ఎన్నికల్లో ఓటుకు రూ.2 వేలు.. రూ.3 వేలు.. రూ.4 వేలు.. రూ.5 వేలు కూడా ఇస్తానంటాడు. చంద్రబాబు డబ్బులిస్తే వద్దు అనొద్దండీ...! తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మనదే. మనల్ని దోచేసిన డబ్బే అదంతా. కాబట్టి వద్దు అనకుండా తీసుకోండి. కానీ ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఎవరి వల్ల మనకు మంచి జరిగింది? ఎవరు అధికారంలో ఉంటే ఆ మంచి కొనసాగుతుంది? అనేది మీ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. మనం ఉంటేనే.... మీ జగన్‌ అధికారంలో ఉంటేనే పెంచిన అమ్మ ఒడి, చేయూత, సున్నా వడ్డీ, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్నతోడు, జగనన్న చేదోడు, లా నేస్తం లాంటివి సజావుగా కొనసాగుతాయి. పూర్తిగా ఫీజురీయింబర్స్‌మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన, కల్యాణమస్తు, షాదీ తోఫా, సున్నా వడ్డీకే పంట రుణాలు, ఉచిత పంటల బీమా, ఇన్‌ పుట్‌ సబ్సిడీ, రైతు భరోసా, ఆర్బీకే వ్యవస్థలు, విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష... ఇవన్నీ మీ జగన్‌ అధికారంలో ఉంటేనే జరుగుతాయన్నది గుర్తుంచుకోండి. ఇంటికే రూ.3 వేల పెన్షన్, మళ్లీ పెంచనున్న పెన్షన్, ఇంటి ముంగిటికే రేషన్, పౌర సేవలు, పథకాలన్నీ అందుతాయని గమనించాలని కోరుతున్నా. ఏ నెలలో ఏ పథకం అనేది ముందే క్యాలెండర్‌ ప్రకటించి మరీ మీ బిడ్డ లబ్ధి చేకూరుస్తున్నాడు.  రెండు బటన్లూ ఫ్యాన్‌కే... వలంటీర్లు మళ్లీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా... అవి ఇంటికే రావాలన్నా... లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు బాగుండాలన్నా, మన వ్యవసాయం, ఆస్పత్రులు మెరుగ్గా ఉండాలన్నా రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులను గెలిపించాలి. సామాజిక న్యాయంలో నువ్వెక్కడ?ఈరోజు కేబినెట్‌లో 68 శాతం నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలే కనిపిస్తున్నారు. 130 సార్లు బటన్లు నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీతో అందిస్తే ఏకంగా 75 శాతం నేను ‘‘నా’’ అని పిలుచుకునే పేద వర్గాలకే దక్కింది. 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ఏకంగా 80 శాతం పైచిలుకు ఆ సామాజిక వర్గాల పిల్లలకే దక్కాయి. నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో ఆ వర్గాలకు ఏకంగా 50శాతం రిజర్వేషన్లతో చట్టం చేసి మరీ ఆత్మగౌరవం నిలబెట్టింది మీ జగన్‌ పాలనలోనే. 175 అసెంబ్లీ, 25 ఎంపీ కలిపి మొత్తం 200 స్థానాలకు గానూ ఏకంగా 50 శాతం అంటే వంద సీట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చి సామాజిక న్యాయం, రాజకీయ సాధికారతకు అర్థం చెప్పింది నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్‌ కాదా? సామాజిక న్యాయంలో నువ్వు చేసింది ఏందయ్యా చంద్రబాబూ? ఓ మోసాల బాబూ.. ఓ మోసాలయ్యా..! నువ్వు ఎలాంటి వాడివో, నీ కూటమి ఎలాంటిదో చెప్పటానికి 2014లో మీరిచ్చిన పాంప్లెట్‌ సరిపోదా? కోనసీమను కోరుతున్నా..కోనసీమలో మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. గత ఎన్నికల్లో కులపరంగా లేదా పార్టీలతో ఉన్న సంబంధాల వల్ల నాకు ఓటు వేయని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే తరాల భవిష్యత్తు మీరు వేసే ఓటుపై ఆధారపడి ఉంది. రాబోయే ఐదేళ్లలో మీ ఇంటికి పథకాలు, అభివృద్ధి అనేది నిర్ణయించేది మీ ఓటే. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో చర్చించండి. పిల్లలకు ఓటు హక్కు లేదని వారిని పక్కన పెట్టొద్దు. వాళ్ల అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఎవరి వల్ల ఈ మంచి కొనసాగుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.  చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ ఎలా ఉండేది?చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది? మీ బిడ్డ వచ్చిన తర్వాత చోటు చేసుకున్న మార్పులేమిటో మీరంతా చూస్తున్నారు కదా.  ఎవరు హీరో? ఎవరు విలన్‌?  ఈ యుద్ధంలో అటువైపు ఉన్నది కౌరవ సైన్యం, దుష్ట చతుష్టయం. చంద్రబాబుకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు, ఒక వదినమ్మ, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5.. వీరందరూ సరిపోరు అన్నట్టుగా కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అబద్ధాలు! పేదవాడికి ఎప్పుడూ ఎలాంటి మంచి చేసిన చరిత్ర లేని వీళ్లంతా కూటమిగా మీ బిడ్డపై యుద్ధం చేస్తున్నారు. ప్రజలను మోసం చేసేందుకు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం,  బెంజ్‌ కారు అంటున్నారు. మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని, పైనున్న ఆ దేవుడిని. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత మాదిరిగా భావిస్తూ 99 శాతం హామీలను అమలు చేసి మళ్లీ మీ ఆశీర్వాదం కోసం మీ బిడ్డ వచ్చాడు. పేదలకు మరింత మంచి చేస్తూ ఇంటింటి అభివృద్ధి, పౌరసేవలు, ఇంటికే పథకాలు కొనసాగింపుగా వైఎస్సార్‌ సీపీ 2024 మేనిఫెస్టోను రూపొందించాం.  సినిమాకు వెళ్లినప్పుడు హీరో మంచి చేస్తాడు కాబట్టి అందరికీ నచ్చుతాడు. హీరోలో మానవత్వం ఉంది కాబట్టి నచ్చుతాడు. విలన్‌ ఎందుకు నచ్చడు? విలన్‌ మోసాలు, అబద్ధాలు, కుట్రలు చేస్తాడు కాబట్టి నచ్చడు. నిజ జీవితంలో కూడా ఆలోచన చేయండి ఎవరు హీరో? ఎవరు విలన్‌?దీవించండి...అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి కరణం ధర్మశ్రీ, పి.గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు, అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య, పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణలను మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన.  ఇవన్నీ నువ్వెందుకు చేయలేకపోయావ్‌?⇒ నువ్వు అంటున్నట్లుగా నేను బచ్చానే అయితే ఇంటింటికీ సేవలందిస్తూ నేను తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు, 60–70 ఇళ్లకు వలంటీర్‌ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, గ్రామంలో విలేజ్‌ క్లినిక్స్, నాడు – నేడుతో బాగుపడిన ఇంగ్లీషు మీడియం బడులు, డిజిటల్‌ బోధన, ట్యాబ్‌లు, గ్రామంలోనే మహిళా పోలీసు, గ్రామానికే ఫైబర్‌ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీలు.. ఇవన్నీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నువ్వు ఎందుకయ్యా తేలేకపోయావు చంద్రబాబూ? ⇒ చంద్రబాబూ.. నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్‌ 58 నెలల పాలనలో ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా ఏకంగా 130 సార్లు బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీతో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా అందించాడు.  నేను బచ్చా అయితే.. మరి ఇవన్నీ నువ్వెందుకు చేయలేకపోయావయ్యా చంద్రబాబూ? నువ్వెందుకు ఇన్ని బటన్లు నొక్కలేకపోయావు? ⇒ నేను బచ్చాను అయితే ఒక అమ్మ ఒడి, చేయూ­త, ఆసరా, సున్నావడ్డీ, రైతు భరోసా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, వాహనమిత్ర, ఇంటికే రూ.3 వేల పెన్షన్, నేతన్న నేస్తం, విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న తోడు, జగనన్న చేదోడు, మత్స్యకార భరోసా... ఇలాంటి పథకాలన్నీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండీ ఒక్కటంటే ఒక్కటీ ఎందుకు చేయలేకపోయావు చంద్రబాబూ?2014లో గోవిందా గోవిందా..!⇒ 2014లో చంద్రబాబును నమ్మి ఓటేసినందుకు నెలకు రూ.2 వేలు చొప్పున ఐదేళ్లలో ఒక్కో నిరుద్యోగికి ఇవ్వాల్సిన  రూ.1.20 లక్షల నిరుద్యోగ భృతి గోవిందా! ⇒ రూ.87,612 కోట్ల రైతు రుణాల మాఫీ గోవిందా! ⇒ రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ గోవిందా! ⇒ అప్పటి దాకా ఇస్తున్న సున్నా వడ్డీ కూడా గోవిందా గోవింద.  ⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద మీ బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్‌ చేస్తామన్న  రూ.25 వేలు గోవిందా! ⇒ ప్రతి పేదవాడికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు గోవిందా! ⇒ ఓటుకు కోట్లు కేసులో చిక్కడంతో మన ఉమ్మడి రాజధాని గోవిందా.. గోవింద!  ⇒ బాబును నమ్మి ఓటు వేసినందుకు ప్రత్యేక హోదా గోవిందా! ⇒ ప్రత్యేక ప్యాకేజీ కూడా గోవిందా...గోవిందా! ⇒ విభజన హామీలూ గోవిందా.  ⇒ సింగపూర్‌కు మించిన రాజధాని గోవిందా! ⇒ గ్రాఫిక్స్‌ రాజధాని గోవిందా.. గోవిందా! ⇒ ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ హామీ గోవిందా.. గోవిందా! ⇒ బాబు అధికారంలోకి వస్తే వర్షాలు గోవిందా!  ⇒ బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా!  ⇒ సింగపూర్‌కు మించిన రాజధాని కడతానంటూ పక్కనే అన్ని హంగులతో కనిపిస్తున్న మన విశాఖను విస్మరించారు. ⇒ బాబు మాటలు నమ్మితే అంతా గోవిందా.. గోవింద!జగన్‌ను ఓడించాలట.. ఇందుకా!⇒ 77 ఏళ్ల స్వతంత్ర దేశ చర్రితలో ఏప్రభుత్వాలూ చేయనంత మంచిని మీ బిడ్డ ఐదేళ్లలో చేసినందుకు ఓడించాలా?  ⇒ 130 సార్లు బటన్లు నొక్కి లంచాలు లేకుండా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా డీబీటీతో అందించినందుకా? ⇒ ఈ పథకాలేవీ చంద్రబాబు అమలు చేయలేదు కాబట్టి జగన్‌ను ఓడించాలా?  ⇒ ఐదేళ్లలో చంద్రబాబు కేవలం 32 వేల గవర్నమెంట్‌ ఉద్యోగాలిస్తే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో ఏకంగా 2.31 లక్షల  ఉద్యోగాలు ఇచ్చినందుకా?  ⇒ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏకంగా 53 లక్షల మంది తల్లులకు బిడ్డలను బడులకు పంపిస్తే చాలంటూ  అమ్మ ఒడి ఇచ్చినందుకా? ⇒  ఏ ప్రభుత్వం చేయని విధంగా 66 లక్షల మందికి ఇంటివద్దే పెన్షన్లు ఇచ్చినందుకా? ⇒ అవ్వాతాతలకు రూ.3 వేల పెన్షన్‌ చిరునవ్వుతో ఇస్తున్నందుకా? ⇒ మానవత్వం లేకుండా ఇంటివద్దే పెన్షన్లను అడ్డుకున్న చంద్రబాబుకు సంతోషం కలిగించేందుకా? ⇒ ఏకంగా 55 లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా అందిస్తున్నందుకా? ⇒ చరిత్ర ఎరుగని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలను నా అక్కచెల్లెమ్మలకు వారి పేరిట రిజి్రస్టేషన్‌ చేసి మరీ ఇచ్చినందుకా? ⇒ 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టినందుకా? ⇒ మరి జగన్‌ను ఎందుకు ఓడించాలి? బాబుకు ఎందుకు ఓటు వేయాలనేది మీరే చెప్పాలని అందరినీ అడుగుతున్నా.పోయేకాలం వచ్చినప్పుడు..విలువలు, విశ్వసనీయత లేని చంద్రబాబు ఎలా నోరు పారేసుకుంటున్నారో అంతా చూస్తున్నారు. తన హయాంలో ఏం చేశాడో చెప్పుకుని ఓట్లు అడగాల్సింది పోయి మీటింగుల్లో జగన్‌ను తిడుతున్నాడు. ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడు. ఓడిపోయే కాలం వచ్చినప్పుడు, హైదరాబాద్‌కు వెనక్కు పోయే కాలం వచ్చినప్పుడు, పోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు. అయ్యా చంద్రబాబూ..! నువ్వు బచ్చా అంటున్న నేను ప్రతి ఇంటికీ మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా, ధైర్యంగా నిలబడి ప్రజల్ని ఓటు అడుగుతున్నా. మరి నువ్వు 14 ఏళ్లు సీఎంగా ఉన్నానంటావ్‌. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకొస్తుందా?  

TDP, Janasena and BJP Alliance being challenged by rebel candidates
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ‘తిరుగు’పాట్లు!

సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని తిరుగుబాటు అభ్యర్థులు హడలెత్తి­స్తున్నారు. 16 నియోజకవర్గాల్లో రెబల్స్‌ పోటీ­లో ఉండడంతో కూటమి అభ్యర్థులకు కునుకు కరువైంది. వాస్తవానికి 30కిపైగా నియోజక­వర్గాల్లో ఈ పరిస్థితి నెలకొనగా నయానో భయానో కొందరిని రేసు నుంచి తప్పించారు. 16 నియోజక వర్గాల్లో మాత్రం రెబల్స్‌ కూటమి పార్టీలను ధిక్కరించి తాడో పేడో తేల్చుకోవ­డానికి సిద్ధమయ్యారు. ఇందులో తొమ్మిది చోట్ల టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులు ఉండగా.. ఏడు చోట్ల బీజేపీ, జనసేన తిరుగు­బాటు అభ్యర్థులు రంగంలో నిలిచారు. తిరుగుబాటు అభ్యర్థులు కొందరికి గాజు గ్లాసు గుర్తు కేటాయించడం గమనార్హం. రాప్తాడులో రెబల్‌ పోటు శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులో సాకే రాజేష్‌ కుమార్‌ రెబల్‌గా పోటీలో నిలిచారు. నామి­నేషన్‌ ఉపసంహరించుకోవాలని ఆయన­పై తీవ్ర ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గలేదు. దీంతో అక్కడ టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ఓట్లకు గండి పడటం ఖాయమనే భయం టీడీపీని కలవరపెడుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ రెబల్‌ పసుపులేటి సుధాకర్‌ బరిలో ది­గారు. సుధాకర్‌కు గాజు గ్లాసు గుర్తు కేటా­యిం­­చడం టీడీపీకి సంకటంగా మారింది. చిత్తూరు జిల్లా సత్యవేడు స్థానాన్ని మొదటి నుంచి కష్టపడిన తనకు కాకుండా ఫిరాయింపు నేత ఆదిమూలానికి ఇవ్వడంతో జేడీ రాజశేఖర్‌ తిరుగుబాటు చేసి బరిలో నిలిచారు. అక్కడ అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఆ నియోజకవర్గంలోనే టీడీపీని మరో రెబల్‌ అభ్యర్థి యాతాటి రమేష్‌బాబు బెంబేలెత్తిస్తు­న్నా­­రు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌­నాథ్‌రెడ్డి ఓటమే ధ్యేయంగా దామోదర్‌నాయుడు పోటీలో ఉన్నారు.రఘురామ గుండెల్లో రైళ్లు అనేక మలుపులు తిరిగిన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి స్థానంలోనూ టీడీపీకి రెబల్‌ బెడద తప్పలేదు. ఇక్కడ రఘురామకృష్ణంరాజుకు పోటీగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పోటీలో ఉన్నారు. ఆయన్ను బరిలో నుంచి తప్పించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. టీడీపీ ఓటమే లక్ష్యంగా శివరామరాజు మొదటి నుంచి ప్రచారం చేస్తూ ఆ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరం సీటును జనసేనకు ఇవ్వడంతో మొడియం శ్రీనివాస్‌ రెబల్‌గా బరిలోకి దిగారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో సీటు దక్కలేదనే అసంతృప్తితో పరమట శ్యామ్‌కుమార్‌ పోటీలో నిలిచారు.టీడీపీ రెబల్‌ మీసాల గీతకు గాజు గ్లాస్‌ గుర్తువిజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా రేసులో నిలవడంతోపాటు ఆమెకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో కూటమి నేతలు కంగు తిన్నారు. తనకు సీటు ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారంటూ మీసాల గీత రెబల్‌గా నామినేషన్‌ వేశారు. అశోక్‌గజపతిరాజు కుమార్తె అతిథికి సీటు ఇచ్చి తనను అవమానించారని, ఆమెను ఎలాగైనా ఓడిస్తానని మీసాల గీత శపథం చేశారు. గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ సోమవారం సాయంత్రం నుంచే గుర్తుతో కూడిన కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేయడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. అరకులో టీడీపీ రెబెల్‌గా సివేరి అబ్రహం పోటీలో ఉండడంతో కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు.బాలయ్యకు పరిపూర్ణానంద ఝలక్‌ కూటమి సీటు దక్కకపోవడంతో హిందూపురం నుంచి స్వామి పరిపూర్ణానంద బీజేపీ రెబల్‌గా బరిలో నిలిచారు. చంద్రబాబు పిలిచి మాట్లాడినా ఆయన వెనక్కి తగ్గగకుండా కూటమికి చెమటలు పట్టిస్తున్నారు. ఇక్కడ నుంచి బాలకృష్ణ పోటీ చేస్తున్న నేపథ్యంలో పరిపూర్ణానంద దెబ్బ ఏ స్థాయిలో ఉంటుందోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎచ్చెర్ల, టెక్కలి, గన్నవరం, మాచర్ల, పోలవరంలోనూ బీజేపీ రెబల్స్‌ పోటీలో ఉన్నారు. పెడన, జగ్గంపేటలో జనసేన సీటు దక్కని నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు.ఫలించని సీఎం రమేష్‌ పైరవీలుఅనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పాయకరావుపేట అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగలపూడి అనిత తమ స్థానాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించకుండా చేసిన పైరవీలు ఫలించలేదు. సీఎం రమేష్‌ తన పలుకుబడి ఉపయోగించి కేంద్ర పెద్దల ద్వారా చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఎన్నికల అధికారులు గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లు కోరిన చోట వారికి కేటాయించారు. జనసేన పోటీ చేసిన చోట్ల గాజు గ్లాస్‌ గుర్తును ఆ పార్టీకి కేటాయించాలని, పోటీ చేయని చోట ఫ్రీ సింబల్‌గా ప్రకటించి ఇండిపెండెంట్లకు  కేటాయించవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. పాయకరావుపేట అసెంబ్లీ, అనకాపల్లి ఎంపీ స్థానానికి వడ్లమాని కృష్ణ స్వరూప్‌ దళిత బహుజన పార్టీ తరఫున నామినేషన్‌ వేశారు. తనకు గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించాలని కోరారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిత ఆర్‌వో కార్యాలయానికి చేరుకుని అభ్యంతరం తెలిపినా ఫలితం దక్కలేదు. తాను కోర్టును ఆశ్రయిస్తానని కృష్ణ స్వరూప్‌ స్పష్టం చేయడంతో అధికారులు నిబంధనల ప్రకారం ఆయనకు గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించారు.   

CM YS Jagan Manifesto Trusted By AP People With His Welfare Govt
విశ్వసనీయతే విజయానికి మెట్టు

సాక్షి, అమరావతి:  ఎన్నికల్లో ప్రభుత్వానికి లేదా పార్టీకి నాయకత్వం వహిస్తున్న నాయకుడికి ప్రజల్లో ఉన్న విశ్వసనీయతే ఆ పార్టీని విజయతీరాలకు చేరుస్తుంది. ఇది రాజకీయ విశ్లేషకులో.. సర్వే సంస్థలో చెబుతున్న మాటకాదు. చరిత్ర చెబుతున్న వాస్తవం. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలుచేసిన సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లో విశ్వసనీయతను చాటుకున్నారు. గొంతులేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు మరింతగా ఆర్థిక సాధికారత సాధించడమే లక్ష్యంగా గత ఎన్నికల మేనిఫెస్టోలోని నవరత్నాల పథకాలను మరింతగా పెంచి వచ్చే ఐదేళ్లూ కొనసాగిస్తామని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలను కొనసాగిస్తూ.. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి, రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని అందులో ఆయన  స్పష్టంచేశారు. ఇక 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టుకట్టి 650కి పైగా హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. ఏ ఒక్క హామీని అమలుచేయకుండా ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టిన చంద్రబాబు.. కర్ణాటక, తెలంగాణలలో నీరుగారిపోయిన హామీలకే ‘సూపర్‌ సిక్స్‌’ అని ముసుగేసి.. తల్లికి వందనం పథకం కింద ఒకరు.. ఇద్దరు.. ముగ్గురు.. నలుగురు.. ఐదుగురు.. ఇలా ఎంతమంది పిల్లలున్నా అంతమందికి ఆ తల్లి ఖాతాలో డబ్బులు వేస్తామంటూ రోజూ హామీల పాట పాడుతున్నారు. చంద్రబాబు మోసం చేస్తాడనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో పది నెలలుగా ఆయన ఊదరగొడుతున్న ఈ హామీలను ఎవరూ పట్టించుకోవడంలేదు. అదే సమయంలో.. సీఎం జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. దీంతో 2024 ఎన్నికల్లో ఈ నమ్మకమే వైఎస్సార్‌సీపీ ఘనవిజయానికి బాటలు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. ఇందుకు 2009 ఎన్నికల ఫలితాలే నిదర్శనమని గుర్తుచేస్తున్నారు. వైఎస్‌ విశ్వసనీయతకే పెద్దపీట.. 2004 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన మాట మేరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించడం, వ్యవసాయ విద్యుత్‌ బకాయిలను మాఫీచేస్తూ సీఎంగా తొలి సంతకం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, అర్హులందరికీ ఇళ్లు వంటి ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడంతోపాటు.. ఆరోగ్యశ్రీ వంటి ఇవ్వని హామీలను కూడా అమలుచేసి ప్రజల్లో విశ్వసనీయతను చాటుకున్నారు. 2009 ఎన్నికల్లో.. 2004 నాటి  హామీల అమలును కొనసాగిస్తూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను 7 నుంచి 9 గంటలకు పెంచుతామని.. ప్రతినెలా ఒకరికి నాలుగు కేజీల చొప్పున ఇస్తున్న రేషన్‌ బియ్యాన్ని ఆరు కేజీలకు పెంచి ఇస్తామంటూ కొత్తగా రెండే హామీలిచ్చారు. ఎన్నికల్లో పార్టీ ఓడినా గెలిచినా తనదే బాధ్యత అంటూ ప్రజాక్షేత్రంలోకి ఒంటరిగా దిగారు. వైఎస్‌కు ఉన్న ప్రజాబలం చూసి 2009 ఎన్నికల్లో చంద్రబాబు.. టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంలతో మహాకూటమిగా ఏర్పడి పోటీకి దిగారు. అన్నీ ఉచితంగా ఇచ్చేస్తామంటూ అడ్డగోలుగా హామీలిచ్చి పారేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో కుటుంబం ఖాతాలో ప్రతినెలా రూ.2 వేల చొప్పున నగదు బదిలీ (డీబీటీ) కింద జమచేస్తామన్నారు. కానీ, 1995–2004 వరకూ బాబు మోసాలు, అరాచకాలను గుర్తుంచుకున్న ప్రజలు వైఎస్‌ రాజశేఖరరెడ్డికే పట్టంకట్టారు.   చరిత్ర పునరావృతం ఖాయం.. విభజన తర్వాత 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కూటమి కట్టిన చంద్రబాబు.. రైతుల రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీచేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు నిరుద్యోగభృతిగా రూ.2 వేలు ఇస్తానంటూ 650కి పైగా హామీలను ఎడాపెడా గుప్పించారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి మేనిఫెస్టోను మాయంచేశారు. అందులోని ఒక్కదాన్నీ అమలుచేయకుండా వంచించిన చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు చావుదెబ్బ కొట్టారు. ఆ ఎన్నికల్లో రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక 99 శాతం హామీలను అమలుచేశారు. నవరత్నాలు పథకాలు కింద డీబీటీ రూపంలో 58 నెలల్లో రూ.2.70 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమచేశారు. ఫలితంగా రాష్ట్రంలో పేదరికం 2015–16లో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గింది. ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలైన విద్యాకానుక, గోరుముద్ద, వసతిదీవెన వంటి హామీలను అమలుచేసిన సీఎం జగన్‌ ప్రజల్లో విశ్వసనీయతను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు మరింతగా ఆర్థిక సాధికారత సాధించేందుకు వచ్చే ఐదేళ్లూ నవరత్నాల పథకాలను విస్తరించి, కొనసాగిస్తామని 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అమ్మఒడిని రూ.15 వేలను రూ.17 వేలకు.. రైతుభరోసాను రూ.13,500లను రూ.16 వేలకు.. పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రూ.3,500లకు పెంచుతామని హామీనిస్తూ మళ్లీ రెండే పేజీలతో 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనేందుకు భయపడిన చంద్రబాబు.. బీజేపీ, జనసేనలతో మళ్లీ జట్టుకట్టి సూపర్‌ సిక్స్‌ అంటూ మేనిఫెస్టో పాట పాడుతున్నారు. కానీ, ఇందులో చంద్రబాబు పేర్కొన్న హామీలన్నీ కర్ణాటక, తెలంగాణలలో నీరుగారిపోవడాన్ని ప్రజలు తెలుసుకున్నారు. దీంతో అడ్డగోలు హామీలిచ్చేస్తున్నారు. అయినా.. వివేకవంతులైన రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మాటపై నిలబడే సీఎం వైఎస్‌ జగన్‌కే మరోసారి పట్టం కట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు తేలి్చచెబుతున్నారు. 2009 నాటి చరిత్ర పునరావృతం కావడం ఖాయమంటున్నారు.   

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలకు నోటీసులిస్తున్న ఢిల్లీ పోలీస్‌లు
అమిత్‌ షా డీప్‌ఫేక్‌ వీడియో కేసులో రేవంత్‌కు నోటీసులు.. సీఎంకు ఫేక్‌ ‘షా’క్‌

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, న్యూఢిల్లీ:  కేంద్రంలో బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దుచేస్తుందని కేంద్ర హోం మం­త్రి అమిత్‌ షా అన్నట్టుగా వైరల్‌ అయిన డీప్‌ ఫేక్‌ వీడియో వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్‌ కావడంతో తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం శాఖ.. ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ) ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వీడియోను సో­షల్‌ మీడియాలో పెట్టిన, షేర్‌ చేసిన వారిపై చర్యలు చేపట్టారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్, సీఎం ఎను­ముల రేవంత్‌రెడ్డికి, పలువురు కాంగ్రెస్‌ నేతలకు ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు నోటీసులు జా­రీ చేశారు. వీడియోను షేర్‌ చేసిన ఎలక్ట్రానిక్‌ డివైస్‌ (మొబైల్‌/ల్యాప్‌టాప్‌/­ట్యాబ్లెట్‌)తో సహా మే 1వ తేదీన స్పెషల్‌ సెల్‌ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్నవారిలో టీపీసీసీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె సతీష్, శివకుమార్‌ అంబాలా, నవీన్, ఆస్మా తస్లీం ఉన్నారు. వీరికి సంబంధించిన నోటీసులను గాందీభవన్‌లో కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ ఇన్‌చార్జి రామచంద్రారెడ్డికి ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. రేవంత్‌కు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడి పేరిట 91/160 సీఆర్‌పీసీ కింద నోటీసులను ఆయన నివాసంలో ఇచ్చినట్టు తెలిసింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రేవంత్‌..  తనకు నోటీసులు వచ్చిన విషయాన్ని వెల్లడించారు కూడా. సిద్దిపేటలో మాట్లాడిన వీడియో డీప్‌ ఫేక్‌తో.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల సిద్దిపేటలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ.. మతపరంగా ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేస్తామని.. వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని వ్యాఖ్యానించారు. అయితే కొందరు ఆ వీడియోను డీప్‌ఫేక్‌తో మార్ఫింగ్‌ చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్‌షా అన్నట్టుగా ఎడిట్‌ చేసి.. సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ వీడియో విపరీతంగా వైరల్‌ అయింది. ఫేస్‌బుక్, ఎక్స్‌ (ట్విట్టర్‌)లో కాంగ్రెస్‌ పార్టీ, టీపీసీసీ, రేవంత్‌ పేరిట ఉన్న ఖాతాల నుంచి కూడా ఈ వీడియో షేర్‌ అయింది. దీనిపై బీజేపీ రాష్ట్ర శాఖ ఇక్కడి పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది కూడా. అయితే ఈ వీడియో దేశవ్యాప్తంగా కూడా వైరల్‌ అవుతుండటం.. ముఖ్యంగా కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా విస్తృత ప్రచారంలోకి రావడంతో కేంద్రం హోం శాఖ అలర్ట్‌ అయింది. ఉదయమే గాంధీభవన్‌కు సమాచారం అమిత్‌ షా డీప్‌ఫేక్‌ వీడియో వ్యవహారానికి సంబంధించి నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులు వస్తున్నారని సోమవారం ఉదయమే గాం«దీభవన్‌కు సమాచారం అందింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఐఎఫ్‌ఎస్‌ఓ స్పెషల్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ నీరజ్‌ చౌదరి నేతృత్వంలోని బృందం గాం«దీభవన్‌కు చేరుకుంది. టీపీసీసీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె సతీష్, శివకుమార్‌ అంబాలా, నవీన్, ఆస్మా తస్లీంలకు నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. వారి తరఫున కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ ఇన్‌చార్జి, అడ్వొకేట్‌ రామచంద్రారెడ్డి ఆ నోటీసులను తీసుకున్నారు. ఎవరి ఫిర్యాదు మేరకు నోటీసులు ఇచ్చారని రామచంద్రారెడ్డి ప్రశ్నించగా.. కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన ఫిర్యాదు అని ఇన్‌స్పెక్టర్‌ వివరించారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని తమకు పంపాలని.. పూర్వాపరాలు పరిశీలించి ముందుకు వెళ్తామని, ఇందుకోసం 15 రోజుల గడువు కావాలని ఇన్‌స్పెక్టర్‌ను రామచంద్రారెడ్డి కోరారు. ఈ మేరకు రాతపూర్వకంగా విజ్ఞప్తిని అందజేశారు. దీనితో ఢిల్లీ పోలీసులు వెళ్లిపోయారు. కాంగ్రెస్‌ నేతల ఆగ్రహం ఢిల్లీ పోలీసులు గాం«దీభవన్‌కు వచ్చిన విషయం తెలిసి మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, పార్టీ నాయకురాలు శోభారాణి తదితరులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసుల తీరును తప్పు పట్టారు. ఏ వీడియోను ఎవరు, ఎందుకు సోషల్‌ మీడియాలో పెట్టారో తెలియకుండా, ఎఫ్‌ఐఆర్‌ కాపీ కూడా లేకుండా గాం«దీభవన్‌కు వచ్చి నోటీసులు ఇవ్వడం శోచనీయమని పేర్కొన్నారు. ఐటీ చట్టం, సీఆర్‌పీసీల కింద కేసు నమోదు చేసి.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా డీప్‌ఫేక్‌ వీడియో విషయంలో తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ ‘ఇండియన్‌ సైబర్‌ క్రైం కో–ఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ)’ని ఆదేశించింది. ఐ4సీ డిప్యూటీ కమిషనర్‌ సింకూ శరణ్‌ సింగ్‌ ఆదివారమే ఢిల్లీ ‘ఇంటెలిజెన్స్‌ ఫ్యూజియన్‌ స్ట్రాటజిక్‌ ఆపరేషన్స్‌ (ఐఎఫ్‌ఎస్‌ఓ)’ స్పెషల్‌ సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టం సెక్షన్‌ 66సీ, ఐపీసీలోని 153/153ఏ/465/469/171జీ సెక్షన్ల కింద కేసు (ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 177/24) నమోదు చేసింది. అమిత్‌ షా వీడియోను డీప్‌ఫేక్‌ మార్ఫింగ్‌ చేసిందెవరు? ‘ఎక్స్‌’, ఫేస్‌బుక్, ఇతర సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా వైరల్‌ చేసిందెవరనే దానిపై దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా 91/160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ వీడియోను వైరల్‌ చేసిన వారిపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ చర్యలు చేపట్టారు.  ఫేస్‌బుక్, ‘ఎక్స్‌’లకూ నోటీసులు ఈ వీడియో వ్యవహారానికి సంబంధించి ఫేస్‌బుక్, ఎక్స్‌ (ట్విట్టర్‌) సంస్థలకు కూడా స్పెషల్‌ సెల్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎవరు ఆ వీడియోను మొదట పోస్ట్‌ చేశారు? ఇప్పటివరకు ఎందరు ఆ వీడియోను సర్క్యులేట్‌ చేశారనే వివరాలను వెబ్‌ లింకులతో సహా ఇవ్వాలని ఆదేశించారు. స్పెషల్‌ సెల్‌కు చేసిన ఫిర్యాదులో ఏముంది? ‘‘ఒక సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రసంగించిన వీడియోను మార్చేసి (డీప్‌ఫేక్, ఎడిట్, బోగస్‌ చేసి) కొందరు వ్యక్తులు ఎక్స్, ఫేస్‌బుక్‌ పేజీల్లో పోస్ట్‌ చేశారు. వాస్తవానికి అమిత్‌ షా మాట్లాడినది వేరు, వాళ్లు పోస్ట్‌ చేసిన ప్రసంగం వేరు. ఏయే పేజీల్లో (ఎక్స్, ఫేస్‌బుక్‌) ఆ వీడియోను పోస్ట్‌ చేశారనేది లింకులతో సహా ఇస్తున్నాం. సమాజాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కొందరు భావిస్తున్నారు. అందుకే వాళ్లు అమిత్‌ షా ప్రసంగాన్ని మార్ఫింగ్‌ చేసి పోస్ట్‌ చేశారు. ఆ అసత్య వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆ ఎక్స్, ఫేస్‌బుక్‌ ఖాతాలను నిర్వహిస్తున్న వారిని, వాటికి సంబంధించిన ఇన్‌చార్జులు, నకిలీ వీడియోతో ప్రచారానికి శ్రీకారం చుట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని స్పెషల్‌ సెల్‌కు చేసిన ఫిర్యాదులో ఐ4సీ డిప్యూటీ కమిషనర్‌ సింకూ శరణ్‌ సింగ్‌ పేర్కొన్నారు. మరోవైపు అమిత్‌ షా ఫేక్‌ వీడియో వ్యవహారానికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement