Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Watch Live AP CM YS Jagan Public Meeting at Bobbili
Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

several Schools Send Children Home After Bomb Threat Emails in delhi
ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదింపులు

ఢిల్లీ: దేశ రాజధాని పరిధిలో బుధవారం ఉదయం ఒక్కసారిగా అలజడి రేగింది.  పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే పిల్లలను బయటకు పంపించి తనీఖలు చేపట్టింది. మరో వైపు ఈ సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆందోళనతో స్కూళ్ల వద్దకు  చేరుకుంటున్నారు.ఇప్పటివరకు 12 పాఠశాలల్లో బాంబు ఉన్నట్లు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్, ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌, చాణిక్య పురిలోని సంస్కృతి స్కూల్, అమిటి సాకేత్ స్కూల్, నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వార్డ్స్,పోలీసులు స్కూల్స్‌కు వద్దకు చేరుకొని వాటి ఖాళీ చేయించి తనిఖీలు చేశారు. అయితే ఇప్పటి వరకు తనిఖీలు చేసిన పాఠశాలల్లో ఎలాంటి బాంబు లేవని, వచ్చింది నకిలీ బాంబు మెయిల్‌గా పోలీసులు గుర్తించారు. బయట దేశం నుంచి వీపీఎన్‌ మోడ్‌లో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బాంబు బెందిరింపుల నేపథ్యంలో స్కూల్స్ నుంచి విద్యార్థులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. బాంబు బెదిరింపు ఈ మెయిల్స్‌పై ఢిల్లీ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

May day international labour day 2024 special story
May Day: ఖరీదు కట్టే షరాబు లేడు

ప్రతి శ్రమకూ ఒక విలువ ఉంటుంది.పురుషుడు విలువ కలిగిన శ్రమే చేస్తాడు. అతడిది ఉద్యోగం.స్త్రీ విలువ కట్టని ఇంటి పని చేస్తుంది.ఆమెది చాకిరి.భారతదేశంలో స్త్రీ, పురుషుల్లో స్త్రీలుఅత్యధిక గంటలు ఏ ఖరీదూ లేనిఇంటి పనుల్లో మునిగి ఉంటున్నారనిసర్వేలు చెబుతున్నాయి.దేశ యంత్రాంగాలు అంతరాయంలేకుండా ముందుకు సాగడంలోఈ శ్రమ నిశ్శబ్ద ΄ాత్ర వహిస్తోంది.స్త్రీల శ్రమకు విలువ కట్టలేక΄ోతేకనీసం గౌరవం ఇవ్వడమైనా నేర్వాలి. ఇంతకు ముందు వివరించి చెప్పడం కొంత కష్టమయ్యేది. ఇప్పుడు అర్బన్‌ క్లాప్‌ వంటి సంస్థలు వచ్చాయి కనుక సులువు. అర్బన్‌ క్లాప్‌ వారికి బాత్‌రూమ్‌ల క్లీనింగ్‌ కోసం కాల్‌ చేస్తే వాళ్లు ఒక్కో బాత్‌రూమ్‌కు ఇంతని చార్జ్‌ చేస్తారు. ఇంట్లో రెండుంటే రెంటికీ చార్జ్‌ పడుతుంది. అదీ ఒకసారికి. అమ్మ వారంలో రెండు సార్లు, నెలలో ఏడెనిమిది సార్లు రెండు బాత్‌రూమ్‌లు కడుగుతుంది. ఆమెకు ఆ చార్జ్‌ మొత్తం ఇవ్వాలి లెక్క ప్రకారం. అలాగే కిచెన్‌ క్లీన్‌ చేయాలంటే కూడా ఒక చార్జ్‌ ఉంటుంది. అమ్మ రోజూ వంటిల్లు సర్దిసర్ది, ΄్లాట్‌ఫామ్‌ కడిగి, స్టవ్‌ రుద్ది క్లీన్‌ చేస్తుంది. ఆ చార్జ్‌ కూడా ఆమెకు ఇవ్వాలి. అమ్మ శ్రమకు కనీసం విలువ కట్టాలని కొన్ని సందర్భాలలో కోర్టులు కూడా అంటున్నాయి. కొన్ని సంస్థలు అమ్మ శ్రమను ఎలా విలువ కట్టవచ్చో కూడా చెబుతున్నాయి.1. ఆపర్చునిటీ కాస్ట్‌ మెథడ్‌: అంటే అమ్మ బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తే నలభై వేలు వస్తాయనుకుంటే, ఆమె  ఆ ఉద్యోగం మానుకుని ఇంట్లో ఉండి΄ోతే ఆమె శ్రమ విలువను నెలకు నలభై వేలుగా గుర్తించాలి. (అమ్మ ఉద్యోగం చేసి కూడా అంత శ్రమా చేస్తుంటే నలభైకి మరో నలభై కలిపి ఇంటికి ఇస్తున్నట్టు).2. రీప్లేస్‌మెంట్‌ కాస్ట్‌ మెథడ్‌: ఇల్లు చిమ్మడం, బట్టలుతకడం, ఆరిన బట్టల్ని మడత పెట్టడం, ఇస్త్రీ చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం, కూరగాయలు, సరుకులు తెచ్చుకోవడం, బిల్లులు కట్టడం, వంట చేయడం, ఇంటిని కనిపెట్టుకుని ఉండటం... వీటన్నింటినీ బయట వ్యక్తులతో సర్వీసుగా తీసుకుంటే (అర్బన్‌ క్లాప్‌ మాదిరిగా) ఎంత అవుతుందో లెక్కగట్టి అది అమ్మ చేసే పని శ్రమగా గుర్తించడం.3. ఇన్‌పుట్‌/అవుట్‌పుట్‌ కాస్ట్‌ మెథడ్‌: అలా కాకుండా ఈ పనులన్నింటికీ ఒక యోగ్యమైన ఉద్యోగిని పెట్టుకుంటే మార్కెట్‌ అంచనాను బట్టి ఎంత జీతం ఇవ్వాల్సి వస్తుందో అంత జీతం ఇవ్వడం.అవన్నీ సరే. కంటికి కనిపించే పనులకు కట్టే విలువ. కాని పిల్లవాడు స్కూల్లో పడి దెబ్బ తగిలించుకుని ఇంటికి వస్తే అమ్మ దగ్గరకు తీసుకుని, మందు రాసి, ధైర్యం చెప్పి, వాడి పక్కన కూచుని కబుర్లు చెపుతుందే... ఆ ప్రేమకు విలువ కట్టే షరాబు ఉన్నాడా? మే డే రోజున ప్రపంచ కార్మికురాలా ఏకం కండి అనే నినాదాలు వినిపిస్తుంటాయి. కాని ఇంటి పని చేస్తూ, అది ఎక్కువైనా చేస్తూ, కుటుంబమంతా ఆ పనిలో భాగం కావాలన్న సంగతిని చెప్పడానికి కూడా తటపటాయిస్తూ, అది వద్దనుకుంటే ఆ ఆప్షన్‌ లేక, తప్పించుకోవడానికి వీల్లేని ఆ పనిని చేస్తూ కూడా విలువ లేని పని చేస్తున్నామన్న న్యూనతను అనుభవిస్తూ తమ హక్కులు ఏమిటో తమకే తెలియని తల్లి, భార్య, కుమార్తె, చెల్లెళ్లను కార్మికులుగా గుర్తించాలని ఎవరూ అనుకోరు.స్త్రీల ఇంటి శ్రమ దేశంలోని యంత్రాంగం సజావుగా పనిచేయడంలో కీలకమైనది. వారు... దేశం కోసం పని చేసి రిటైరైన వృద్ధుల సేవలో ఉంటారు.  దేశానికి ఆదాయం తెచ్చిపెట్టే యువత సేవలో ఉంటారు. దేశానికి భవిష్యత్తులో అంది రావాల్సిన పిల్లల సేవలో ఉంటారు.  ‘కుటుంబం’ అనే బంధంలోకి వచ్చి కూతురిగా, కోడలిగా, భార్యగా వీరు ‘ప్రేమ’తో, ‘బాధ్యత’తో, ‘బంధం’తో ఈ సేవ చేస్తారు. అంత మాత్రం చేత ఈ సేవను నిరాకరించడానికి వీల్లేదు. శ్రమగా చూడక్కర్లేదని భావించకూడదు. ఇంత చేస్తున్నా ‘ఇంట్లో కూచుని ఏం చేస్తుంటావ్‌?’ అనే మాటను వాళ్లు పడాలా?ఉద్యోగం చేసినా చేయక΄ోయినా ఒక గృహిణి రోజుకు సగటున మూడున్నర గంటలు ఇంటి పని చేస్తుంటే పురుషుడు కేవలం గంటన్నర ఇంటి పని చేస్తున్నాడు.స్త్రీలు తమ ఇంటి పనిని ఒక్కరోజు మానేసి సహాయనిరాకరణ చేస్తే దేశం స్తంభిస్తుంది. అందుకే స్త్రీల శ్రమను గౌరవించే మే డే రోజున వారికి కృతజ్ఞతలు తెలియచేయాలి. విలువైన శ్రమ చేస్తున్నందుకు సమాజం వారికి హర్షధ్వానాలు తెలియచేయాలి.      

BJP Key Announcement Over Muslim Reservations
చంద్రబాబు, పవన్‌కు పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ కీలక ప్రకటన!

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో ఎ​న్నికల వేళ కూటమిలో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. టీడీపీ, జనసేనకు బీజేపీ ఊహించని షాకిచ్చింది. ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ కట్టుబడి ఉంటుందని.. తెలుగుదేశం, జససేన ని​ర్ణయాలకు అనుకూలంగా ఉండలేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది.ఇక, ముస్లిం రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే డీప్‌ ఫేక్‌ వీడియోల వ్యవహారం సోషల్‌ మీడియా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ముస్లిం రిజర్వేషన్లపై ట్విట్టర్‌ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పార్టీ నిర్ణయాన్ని ఏపీ బీజేపీ మరోసారి పునర్ఘటించింది. ఈ క్రమంలో ముస్లిం రిజర్వేషన్ల రద్దుకే కట్టుబడి ఉన్నామని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో.. టీడీపీ, జనసేన నిర్ణయాలకు తాము అనుకూలంగా లేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది. Truth: If BJP comes into power, we will make an end of the unconstitutional Muslim reservations. Meanwhile it's the right of SC, ST & OBC people of Telangana. We will ensure them that they get it. Therefore, We will end the Muslim Reservations.Fake Video: If BJP comes to power,… pic.twitter.com/4OxR8LP9Z9— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) April 30, 2024బాబును నమ్మని బీజేపీ ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడినప్పటికీ, ఆ పార్టీ జాతీయ నాయకత్వం తొలుత అంగీకరించలేదు. చంద్రబాబు ఢిల్లీలోని తన ఏజెంట్లు, బీజేపీలో ఉన్న తన అనుంగులు, ఇతరత్రా పైరవీలు చేశారు. అయినా బీజేపీ పెద్దలు ఆయన్ని నమ్మలేదు. ఢిల్లీలో రాత్రింబవళ్లు పడిగాపులు గాసి, కాళ్లా వేళ్లా పడి చిట్టచివరకు పొత్తు పెట్టుకోగలిగారు. బీజేపీ పొత్తయితే పెట్టుకొంది కానీ, చంద్రబాబును ఆ పార్టీ పెద్దలు నమ్మడంలేదన్న విషయం ప్రతి సందర్భంలోనూ బయటపడుతోంది. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన గెలుపే అసాధ్యమైతే, మేనిఫెస్టో విషయంలోనూ మరోసారి అభాసుపాలు కాకూడదని బీజేపీ అధిష్ఠానం భావించింది. దీంతో ఈసారి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఓ పరిశీలకుడిని మాత్రమే పంపి మమ అనిపించింది. కనీసం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర నాయకులు కూడా హాజరుకాలేదు.అంతేకాదు.. మేనిఫెస్టోలో కనీసం ప్రధాని మోదీ ఫొటోగానీ, కమలం గుర్తు గానీ ముద్రించేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్‌షా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటోలు ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే, చంద్రబాబు తెలివిగా మేనిఫెస్టో కాపీలపై మోదీ, ఇతర నాయకుల ఫొటోలు లేకుండా, కమలం గుర్తును మాత్రం వేయించారు. బీజేపీ దీనికీ అంగీకరించలేదు. దాన్ని మార్చాల్సిందేనని పరిశీలకుడు సిద్ధార్థనాథ్‌సింగ్‌ పట్టుబట్టారు. దీంతో మేనిఫెస్టో ముఖచిత్రంలో అప్పటికప్పుడు మార్పులు చేశారు.

Cricket Australia Announced Their Squad For T20 World Cup 2024
టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్‌

వెస్టిండీస్‌, యూఎస్‌ఏ వేదికగా జూన్‌ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌‍కప్‌ 2024 కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. విధ్వంసకర వీరులతో నిండిన ఈ జట్టుకు మిచెల్‌ మార్ష్‌ సారథ్యం వహించనున్నాడు. ముందుగా ప్రచారం జరిగినట్లుగా స్టార్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఎలాగైనా జట్టులోకి వస్తాడనుకున్న ఐపీఎల్‌ విధ్వంసకర బ్యాటర్‌ జేక్‌ ఫ్రేసర్‌ మెక్‌గుర్క్‌ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మాట్‌ షార్ట్‌, జేసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌, ఆరోన్‌ హార్డీ, స్పెన్సర్ జాన్సన్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌ లాంటి ఆశావహులకు కూడా మొండిచెయ్యే ఎదురైంది. చివరి వరల్డ్‌కప్‌ అని ముందుగానే ప్రకటించిన డేవిడ్‌ వార్నర్‌ను సెలెక్టర్లు కరుణించారు. ఎండ్‌ ఓవర్స్‌ స్పెషలిస్ట్‌ నాథన్‌ ఎల్లిస్‌ ఎట్టకేలకు జట్టులోకి వచ్చాడు. దాదాపు 18 నెలలుగా టీ20 జట్టుకు దూరంగా ఉన్న ఆస్టన్‌ అగర్‌, కెమరూన్‌ గ్రీన్‌లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. జోష్‌ ఇంగ్లిస్‌కు ప్రత్యామ్నాయ వికెట్‌కీపర్‌గా మాథ్యూ వేడ్‌ జట్టులోకి వచ్చాడు.  పేస్‌  బౌలింగ్‌ త్రయం పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ కొనసాగనున్నారు. మిచ్‌ మార్ష్‌తో పాటు ట్రవిస్‌ హెడ్‌, టిమ్‌ డేవిడ్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌ ఆల్‌రౌండర్లుగా ఎంపికయ్యారు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కోటా ఆడమ్‌ జంపా జట్టులోకి వచ్చాడు. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ప్రయాణం జూన్‌ 5న మొదలవుతుంది. ఆసీస్‌ తమ తొలి మ్యాచ్‌లో పసికూన ఒమన్‌తో తలపడుతుంది. గ్రూప్‌-బిలో ఆసీస్‌.. ఇంగ్లండ్‌, నమీబియా, స్కాట్లాండ్‌, ఒమన్‌లతో పోటీపడుతుంది.టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు: మిచెల్‌ మార్ష్ (కెప్టెన్‌), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా Cricket Australia invited the World Cup 2007 winners to announce the T20I World Cup 2024 squad including the children of Andrew Symonds. 🫡- Great initiative by Australia...!!!! pic.twitter.com/l8mhzxu7ww— Johns. (@CricCrazyJohns) May 1, 2024 వరల్డ్‌కప్‌ విన్నర్లతో..క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ వరల్డ్‌కప్‌ జట్టును వినూత్నంగా ప్రకటించింది. 2007 వన్డే వరల్డ్‌కప్‌ విన్నర్లు ఆసీస్‌ టీ20 వరల్డ్‌కప్‌ జట్టును అనౌన్స్‌ చేశారు. జట్టును ప్రకటించిన వారిలో దివంగత ఆండ్రూ సైమండ్స్‌ కొడుకు, కూతురు ఉండటం విశేషం. 

International Criminal Court may Issue arrest warrant To Benjamin Netanyahu
ఇజ్రాయెల్‌ నెతన్యాహుకు ఊహించని షాక్‌!

టెల్‌ అవీవ్‌: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. యుద్ధ నేరాలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇతర అగ్రనేతలకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ త్వరలో అరెస్ట్ వారెంట్లు జారీ చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. దీంతో, ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమెన్‌ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. నెతన్యాహు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. హమాస్‌తో కాల్పుల విరమణ చర్చలు కొనసాగుతున్నాయి. చర్చల్లో భాగంగా ఒప్పందం కుదరినా, కుదరకపోయినా.. హమాస్‌లను అంతం చేయడానికి ఇజ్రాయెల్‌ దళాలు రఫాలోకి ప్రవేశిస్తాయన్నారు. మా లక్ష్యాలను సాధించకుండా యుద్ధం నిలిపివేసే సమస్యే లేదు. హమాస్‌ దళాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌ తప్పకుండా విజయం సాధిస్తుందని కామెంట్స్‌ చేశారు.The International Criminal Court may soon issue arrest warrants for Israeli Prime Minister Benjamin Netanyahu and other top leaders for war crimes. That's according to press reports out of Israel. Capitol Hill Correspondent @ErikRosalesNews reports. pic.twitter.com/lFuboZN6oK— EWTN News Nightly (@EWTNNewsNightly) May 1, 2024 మరోవైపు.. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం కారణంగా వేలాది మంది పాలస్తీనియన్లు రఫా నగరంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో బందీల విడుదలకు, కొంత ఉపశమనం పొందడానికి రెండు దేశాల మధ్య కాల్పుల ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇక.. రఫా నగరంపైకి ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి జరిపిన దాడుల్లో మూడు కుటుంబాల్లోని ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదు రోజుల వయసున్న పసికందు ఉందని పాలస్తీనా అధికారులు తెలిపారు.

BJP Not involved At ap Alliance Manifesto Release Modi stamp missing
టచ్ మీ నాట్... దూరం జరగండమ్మా

మొత్తానికి రాష్ట్రంలో టీడీపీ సారధ్యంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి మనసులు కలవని బలవంతపు కాపురం అని తేలిపోయింది. తప్పనిసరి తంతు తప్ప అందులో తమకేం పెద్ద పాత్ర లేదని బీజేపీ భావిస్తోంది. అందుకే మీ పాట్లేవో మీరు పడండి... అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి నాయుడుగారు అని స్పష్టంగా చెబుతోంది. వాస్తవానికి టీడీపీ.. జనసేన... బీజేపీల కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమానికి చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.దీనికి జాతీయ బీజేపీ నేత సిద్దార్థ నాథ్ సింగ్ సైతం ఢిల్లీ నుంచి వచ్చారు. అయితే ఆ మ్యానిఫెస్టో కాపీ మీద ఎక్కడా మోడీ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ఆ మ్యానిఫెస్టో కాపీని విడుదల చేసే సమయంలో వరుసగా ఈ ముగ్గురు నాయకులూ నిలబడి ఫోటోలకు.. పత్రికలకు ఫోజులిచ్చారు. అయితే ఆ సందర్భంగా ఆ కాపీని చేత్తో పట్టుకుని బాబు, పవన్ పక్కన నిలబడేందుకు సైతం సింగ్ విముఖత చూపించారు. ఎవరో వచ్చి ఆ కాపీని సింగ్‌కు ఇస్తుండగా అక్కర్లేదు.. అంటూ నేను దాన్ని తాకను అనేలా సంజ్ఞ చేసారు. ఆ తరువాత అయన మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యానిఫెస్టో ఈ ఇద్దరిదే.. మా బీజెపికి ఏమీ సంబంధం లేదని చెప్పేసారు. అంతేకాకుండా రాష్ట్ర బిజెపి నుంచి సైతం ఈ కార్యక్రమానికి ఎవరూ.. ఆఖరుకు అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం హాజరు కాలేదు. దీంతో ఇది జస్ట్ పవన్... జనసేనల పొత్తు అని తేలిపోయింది.అసలేం జరిగింది ?గతంలో 2014 లో సైతం ఇలాగే మూడు పార్టీలు పొత్తులో ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు చంద్రబాబు దాదాపు ఆరువందల హామీలు ఇచ్చి.. ఆ తరువాత మాటతప్పి.. మ్యానిఫెస్టోను పార్టీ వెబ్‌సైట్‌ నుంచి మాయం చేసారు. ఇప్పుడు ఆ మ్యానిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ బయటకు తీసి.. ఒక్కో హామీని ప్రజలకు గుర్తు చేస్తూ ఈ హామీ ఇచ్చారు. అమలు చేసారా అక్కా.. రుణమాఫీ చేసారా అన్నా.. పెన్షన్ ఇచ్చారా తాతా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేసారా చెల్లి.. ఉద్యోగాలు ఇచ్చారా తమ్ముడూ.. చూడండి ఈ హామీలకు అప్పట్లో మోడీ.. పవన్ సైతం గ్యారెంటీలుగా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు సైతం ఉన్నాయ్. మళ్ళీ అలాంటి వాళ్లకు ఓట్లెద్దామా అంటూ ఊరూరా ప్రచారం చేయడంతో.. చంద్రబాబు ఇచ్చే అమలుసాధ్యం కానీ హామీలవల్ల మేమెందుకు ప్రజలకు జవాబుదారీ కావాలి...? మేమెందుకు పరువుపోగొట్టుకోవాలని భావించిన బీజేపీ ఈసారి ఆ హామీల విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దు నాయుడుగారు.. మీరు మీరు.. ఏదోలా తగలడండి అనేసింది. అంతేకాకుండా దానిమీద మోదీ ఫోటో సైతం వేసేందుకు కేంద్రం ఒప్పుకోలేదని తెలిసింది. అందుకే ఈసారి మ్యానిఫెస్టో మీద కేవలం.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయ్. మరోవైపు బాబు ఇస్తున్న హామీలకు మా కేంద్రానికి, బీజేపీకి ఎలాంటి బాధ్యత లేదని వాళ్ళు తేల్చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల విషయంలో కూడా చంద్రబాబు తమను మోసం చేసినట్లు కేంద్రం గుర్తించింది. పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు వంటివాళ్లకు టిక్కెట్లు ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులనే బీజెపి నేతలుగా చూపించి టిక్కెట్లు ఇచ్చుకుని అసలైన బీజెపి నేతలను మోసం చేసారని అధిష్టానం గమనించింది. అంటే ఎన్ని చేసినా.. ఎంత చేసినా కుక్కతోక వంకరే అని.. చంద్రబాబులోని మోసపూరిత గుణం మారదని స్పష్టతకు వచ్చిన కేంద్రం.. అసలు ఈ దరిద్రమే మాకువద్దు. మీ చావు మీరు చావండి. మీ ఎన్నికలు.. మ్యానిఫెస్టోలో మాకు ఏమీ సంబంధం లేదని తేల్చేసింది.:::: సిమ్మాదిరప్పన్న 

Manipur women paraded case CBI reveals shocking facts in chargesheet
పోలీసుల కళ్లెదుటే ‘మణిపూర్‌ ఘోరం’

మణిపుర్‌లో మైతీ తెగకు చెందిన మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ తెగ మహిళను నగ్నంగా ఊరేగించి.. లైంగిక హింసకు పాల్పడిన ఘటన దేశంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఛార్జిషీట్‌లో షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. బాధిత మహిళలు సాయం చేయమని కోరినా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, వారు ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిగుంపుకే సహకరించేలా వ్యవహరించారని తెలిపింది.కాంగ్‌పోక్పీ జిల్లాలో మైతీ అల్లరిగుంపు చేతికి చిక్కిన ఇద్దరు కుకీ మహిళలు ఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసు జీపు వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరారు. అయితే పోలీసులే స్వయంగా బాధితులను ఆ అల్లరిగుంపకు అప్పగించినట్లు ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది. దీంతో ఆ అల్లరి మూక​ ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వరిపొలాల్లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వివరించింది.బాధితురాళ్లలో ఒక మహిళ తమను కాపాడి, సురక్షిత ప్రాంతాని తీసుకుళ్లాలని పోలీసులను కోరారు. అయితే జీపు తాళాలు తమ వద్ద లేవని పోలీసులు అబద్దాలు చెప్పినట్లు సీబీఐ ఛార్జిషీట్‌ పేర్కొంది. మరోవైపు.. అల్లరిగుంపు చేతికి చిక్కిన మూడో మహిళ వారి నుంచి త్రుటిలో తప్పించుకొంది.గతేడాది మే 4న జరిగిన ఈ ఘటన రెండు నెలల తర్వాత జులై నెలలో వైరల్‌గా మారి దేశమంతా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరుగురు నిందితులతోపాటు ఓ బాల నేరస్థుడిపై గౌహతి సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో అక్టోబరు 16న ఛార్జిషీటు దాఖలు  అయింది.ఈ దాడుల్లో అల్లరిగుంపు చేతిలో మృతిచెందిన కుకీ తెగకు చెందిన తండ్రీకొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరులేని నదిలోకి విసిరేసినట్లు తెలిపింది. మైతీ గుంపు జీపు వద్దకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి.. పోలీసులు పారిపోయినట్లు సీబీఐ మూడు పేజీల ఛార్జిషీటులో పేర్కొంది.

Veteran actor Krishna Alluri Sitaramaraj 50 years completes in tollywood
అల్లూరికి అర్ధ శతాబ్దం

‘మా మన్యం దొర సీతారామరాజు వచ్చాడు’.... ప్రజల్లో సంబరం. దొరకు పాదాభివందనం చేశారు. కానీ... అతను నిజమైన దొర కాదు. మన్యం దొర  అల్లూరి సీతారామ రాజు గెటప్‌ వేసుకున్న నటుడు. అప్పటికి నిజమైన అల్లూరి సీతారామరాజుని చూసిన కొందరు వృద్ధులు లొకేషన్లో ఆ గెటప్‌లో ఉన్న నటుడికి పాదాభివందనం చేశారు. వెండితెరపై సీతారామరాజుగా కనిపించక ముందే అలా షూటింగ్‌ లొకేషన్లో ప్రజల చేత ‘భేష్‌’ అనిపించుకున్నారు కృష్ణ. అల్లూరి సీతారామరాజు గెటప్‌ అంటే కృష్ణ తప్ప వేరే ఏ నటుడికీ నప్పదు అనేంతగా ఆ పాత్రలో ఒదిగిపోయారు సూపర్‌ స్టార్‌. 1974 మే 1న విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం... ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘అగ్గిరాముడు’ సినిమా 1954 ఆగస్టు 5న విడుదలైంది. బుర్రిపాలెంకు చెందిన కృష్ణ తెనాలిలో ఆ సినిమా చూశారు. అందులో అల్లూరి గురించి బుర్రకథగా చెప్పే సీన్‌ కృష్ణను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ నటించిన ‘జై సింహ’ని కూడా చూశారు కృష్ణ. ఆ సినిమా పాటల పుస్తకం చివరి పేజీలో ఎన్టీఆర్‌ తర్వాతి చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ అనే ప్రకటనతో పాటు అల్లూరి గెటప్‌లో స్కెచ్‌తో గీసిన ఎన్టీఆర్‌ బొమ్మ ఉంది. ఆ సినిమా కోసం కృష్ణ ఎదురు చూశారు. అయితే ఆ సినిమా ప్రారంభమైనా తర్వాత ఆగిపోయింది. పై చదువుల కోసం ఏలూరు వెళ్లిన కృష్ణకి నాటకాలపై ఆసక్తి కలిగింది. అది కాస్తా సినిమాలవైపు మళ్లడంతో చెన్నైకి చేరుకున్నారు. అప్పుడు ప్రజా నాట్యమండలి రాజారావు బృందం ప్రదర్శించిన ‘అల్లూరి సీతారామరాజు’ నాటకానికి మంత్రముగ్దుడయ్యారు కృష్ణ. ఆ తర్వాత హీరో అయిన కృష్ణ ‘అసాధ్యుడు’లో (1968) అంతర్నాటకంలో భాగంగా సీతారామరాజు వేషం వేశారు. ఆ వేషంలో చక్కగా ఉన్నారంటూ జనాలు కితాబిచ్చారు. దీంతో తాను హీరోగా అల్లూరి చరిత్రతో సినిమా తీస్తే బాగుంటుందనుకున్నారు కృష్ణ. అయితే 1972లో శోభన్‌బాబు హీరోగా సీతారామరాజు మూవీ నిర్మించనున్నట్లు డి. లక్ష్మీ నారాయణ (డీఎల్‌) ప్రకటించారు. కానీ అనారోగ్యం వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నారాయన. కృష్ణ హీరోగా ‘పెద్దలు మారాలి’ సినిమా తీశారు డీఎల్‌. ఆ చనువుతో సీతారామరాజు కథని కృష్ణకి ఇచ్చి, ఆసక్తి ఉంటే సినిమా తీసుకోమన్నారు. అలా ‘అల్లూరి సీతారామరాజు’ చేసే అవకాశం కృష్ణకి వచ్చింది. డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ కృష్ణ కృష్ణకు ‘డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌’ అని పేరు. ‘అల్లూరి సీతారామరాజు’ కథలో వాణిజ్యపరమైన అంశాలు ఉండవని, పైగా హీరో చనిపోతాడని ఫైనాన్స్‌ ఇవ్వడానికి ఫైనాన్షియర్లు, పంపిణీ చేయడానికి కూడా ఎవరూ సాహసించలేదు. ‘ఇంత రిస్క్‌ అవసరమా.. ఈ సినిమా వద్దు’ అని శ్రేయోభిలాషులు కృష్ణకు చె΄్పారు. ఎన్టీఆర్‌ కూడా వద్దనే అన్నారు. అయినా తాను ఓ హీరోగా రూపొందిన ‘దేవుడు చేసిన మనుషులు’ శత దినోత్సవంలో అల్లూరి సీతారామరాజు సినిమా తీస్తున్నానని, అది తన నూరో చిత్రంగా ఉంటుందని కృష్ణ ప్రకటించారు. 1973 డిసెంబరులో మద్రాస్‌ వాహినీ స్టూడియోలో షూటింగ్‌ ఆరంభమైంది. అల్లూరి సీతారామరాజు గెటప్‌లో ఉన్న కృష్ణపై ఫస్ట్‌ షాట్‌ తీశారు. సినిమా మొదలుపెట్టినప్పట్నుంచి అనేక ఇబ్బందులు. చింతపల్లి అడవిలో షూటింగ్‌ కాబట్టి అక్కడ గెస్ట్‌ హౌస్‌లు లేకపోవడంతో యూనిట్‌లోని దాదాపు ఐదువందల మందికి ఒక కాలనీలా తాత్కాలిక బస ఏర్పాటు చేశారు. సముద్ర మట్టానికి నాలుగువేల అడుగుల ఎత్తులో కొండ ప్రాంతంలో షూటింగ్‌. భయంకరమైన చలి. దాదాపు 40 రోజుల పాటు షూటింగ్‌ చేశారు. దర్శకుడు రామచంద్రరావు అస్వస్థతకి గురి కావడం ఓ ఊహించని షాక్‌. ఆయన్ను చెన్నైకి తీసుకెళ్లి, మెరుగైన వైద్యం చేయించినా కోలుకోలేదు. ఫిబ్రవరి 14న తుది శ్వాస విడిచారు. మిగతా భాగాన్ని కృష్ణ తెరకెక్కించారు. యుద్ధ సన్నివేశాలను దర్శకుడు కేఎస్‌ఆర్‌ దాస్‌ రూపొందించారు. రామచంద్రరావు మీద గౌరవంతో దర్శకుడిగా ఆయన పేరే ఉంచేశారు కృష్ణ. సినిమా స్కోప్‌.. ఈజీ కాదు తెలుగులో పూర్తి స్థాయిలో రూపొందిన తొలి సినిమా స్కోప్‌ ఈస్ట్‌మన్‌ కలర్‌ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. అయితే అప్పుడు సినిమా స్కోప్‌ అంత ఈజీ కాదు. ఈ మూవీకి వీఎస్‌ఆర్‌ స్వామి ఛాయాగ్రాహకుడు. అప్పట్లో సినిమా స్కోప్‌ ఫార్మాట్‌లో తీసేందుకు రెండే లెన్స్‌లు ఉండేవట. కాగా సినిమా స్కోప్‌ ఫార్మాట్‌లో తీసే లెన్స్‌కి కెమెరా వ్యూఫైండర్స్‌ ఉండవట. దీంతో ఊహించుకుని ఫ్రేమ్‌ సెట్‌ చేసుకునేవారట. ఈ ప్రక్రియను వీఎస్‌ఆర్‌ స్వామి ముంబైలో అధ్యయనం చేసి రావడంతో ‘అల్లూరి సీతారామరాజు’ ఈజీగా చేయగలిగారు.   అల్లూరి పాటలు అజరామరం ‘అల్లూరి సీతారామరాజు’లోని పాటలన్నీ సూపర్‌ హిట్‌. పి. ఆదినారాయణరావు ఈ సినిమాకు సంగీతదర్శకుడు. సినిమా ఆరంభంలో వచ్చే ‘రగిలింది విప్లవాగ్ని..’, సినిమా చివర్లో వచ్చే.. ‘ఓ విప్లవజ్యోతి...’ పాటలకు ఆరుద్ర సాహిత్యం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ‘వస్తాడు నా రాజు..’ పాటను నారాయణరెడ్డి రాయగా,  ‘హైలెస్సా.. హైలెస్సా..’, ‘కొండ దేవతా నిన్ను కొలిచేవమ్మా..’ పాటలను కొసరాజు రాశారు.‘తెలుగు వీర లేవరా..’ పాటను శ్రీశ్రీ రాశారు. ఈ పాటను ఘంటసాలతోనే పాడించాలన్నది కృష్ణ సంకల్పం. ఆ సమయానికి ఘంటసాల ఆరోగ్యం సరిగా లేదు. ఆ తర్వాత ఘంటసాల ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఆయన ఈ పాట పాడారు. కానీ ఈ సినిమా విడుదల కాకముందే ఘంటసాల కాలం చేశారు. ఈ పాటకు వి. రామకృష్ణ గొంతు కలిపారు. ఈ పాటకుగాను జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డు శ్రీశ్రీని వరించింది. ఓ తెలుగు సినిమాలోని పాటకు జాతీయ పురస్కారం రావడం అదే తొలిసారి. అలాగే ఇదే సినిమాలోని ‘వందేమాతరం అంటూ నినదించిన..’, ‘హ్యాపీ క్రిస్మస్‌..’ పాట, ‘అరుణాయ శరణ్యాయ..’ శ్లోకం వంటివి కూడా వీనుల విందుగా ఉంటాయి.రికార్డులు భళా ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 19 కేంద్రాల్లో (బెంగళూరుతో కలుపుకుని) వందరోజులు, 2 కేంద్రాల్లో 25 వారాలు, హైదరాబాద్‌లోని సంగం థియేటర్‌లో రజతోత్సవం, అలాగే షిఫ్టింగులతో ఏడాది పాటు ఆడటం విశేషం. ఈ చిత్రం స్వర్ణోత్సవం చెన్నైలోని ఉడ్‌ల్యాండ్స్‌ హోటల్‌లో ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర సమరయోధులు ఇంటూరి వెంకటేశ్వరరావు, అనిసెట్టి సుబ్బారావు, దాశరథి, సుంకర సత్యనారాయణ, కేఎస్‌ గోపాలకృష్ణన్‌ వంటి వారిని సత్కరించారు. అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం రూ. పదివేలతో ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, అందుకు సంబంధించిన పత్రాలను సీతారామరాజు సోదరుడు సత్యనారాయణరాజుకి అందించారు కృష్ణ. ఇలా ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయి.అల్లూరి చేయనన్న ఎన్టీఆర్‌ అల్లూరి సీతారామరాజు సినిమా మొదలుపెట్టి, ఆపినా ఆ సినిమా తీయాలన్న ఎన్టీఆర్‌ ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ వచ్చిన చాలా ఏళ్లకు ఆ సినిమా తీద్దామని పరుచూరి బ్రదర్స్‌తో అన్నారు ఎన్టీఆర్‌. కానీ సోదరులు వద్దని సలహా ఇచ్చి, కృష్ణ చేసిన సినిమా చూడమన్నారు. ఎన్టీఆర్‌ కోరిక మేరకు ‘అల్లూరి సీతారామరాజు’ని ప్రత్యేకంగా చూపించారు కృష్ణ.  ‘‘అద్భుతంగా తీశారు. నేను ‘అల్లూరి సీతారామరాజు’  తీయను’’ అన్నారు ఎన్టీఆర్‌.మహారథి చేతికి స్క్రిప్ట్‌ త్రిపురనేని మహారథి చేతిలో డీఎల్‌ ఇచ్చిన స్క్రిప్ట్‌ పెట్టి, ‘ఈ సబ్జెక్ట్‌లో సినిమా తీయడానికి కావాల్సినంత దమ్ము ఉందా’ అడిగారు కృష్ణ సోదరుడు హనుమంతరావు. ‘చాలా ఉంది’ అన్నారు మహారథి. కానీ, తనకు ఇచ్చిన స్క్రిప్ట్‌లో ఒక్క సన్నివేశం తప్ప మహారథికి వేరే ఏదీ నచ్చలేదు. పరిశోధనలు చేసి, స్క్రిప్ట్‌ తయారు చేశారు. దర్శకుడిగా వి. రామచంద్రరావును తీసుకున్నారు. సినిమా స్కోప్‌  ఈస్ట్‌మన్‌ కలర్‌లో తీయాలని నిర్ణయించింది పద్మాలయా స్టూడియోస్‌ సంస్థ (కృష్ణ సొంత నిర్మాణ సంస్థ). ‘అల్లూరి...’ తర్వాత ‘పాడి పంటలు’తోనే హిట్‌... ‘అల్లూరి సీతారామరాజు’ చూసిన  విజయా వాహిని సంస్థ అధినేతల్లో ఒకరైన దర్శక–నిర్మాత చక్రపాణి అభినందించారు. కానీ ‘ఈ సినిమా తర్వాత నీ సినిమాలు ఆడటం కష్టం’ అని కూడా కృష్ణతో అన్నారు. ఆయన అన్న మాటలు నిజమయ్యాయి. ‘అల్లూరి సీతారామరాజు’ తర్వాత కృష్ణ చేసిన ప్రతి చిత్రాన్నీ ఈ సినిమాతో పోల్చారు ప్రేక్షకులు. దాంతో ఆ తర్వాత కృష్ణ నటించిన çపది సినిమాలకు పైగా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. చివరికి పద్మాలయా స్టూడియోస్‌ నిర్మించిన ‘పాడి పంటలు’ (1976) విజయంతో హీరోగా కృష్ణ పూర్వ వైభవాన్ని పొందారు. 

Gold And Silver Prices Hit Record Highs
ధర పెరిగినా బంగారమే

న్యూఢిల్లీ: భారత్‌ కుటుంబాల్లో బంగారానికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. దీనిని ప్రతిబింబిస్తూ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 2023 ఇదే కాలంతో  పోలి్చతే భారత్‌ పసిడి డిమాండ్‌ 8 శాతం పెరిగి 136.6 టన్నులకు (ఆభరణాలు, పెట్టుబడులు) పెరిగింది. ధర తీవ్రంగా ఉన్నా ఈ స్థాయి డిమాండ్‌ నెలకొనడం గమనార్హం. సమీక్షా కాలంలో త్రైమాసిక సగటు ధర  (దిగుమతి సుంకం, జీఎస్‌టీ మినహా) 10 గ్రాములకు రూ.49,943.80 నుంచి రూ.55,247.20కి ఎగసింది.  ఇక భారత్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఇదే కాలంలో ఏకంగా 19 టన్నులు కొనుగోలు చేసింది. 2023 క్యాలెండర్‌ ఇయర్‌ మొత్తంలో ఆర్‌బీఐ కొనుగోళ్లు 16 టన్నులే కావడం గమనార్హం. తాజా ‘క్యూ1 2024, గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ నివేదికలో  ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఈ అంశాలను తెలిపింది.ప్రపంచ వ్యాప్తంగా 3 శాతం అప్‌ మార్చి త్రైమాసికంలో ప్రపంచ పసిడి డిమాండ్‌ 3% పెరిగి 1,238 టన్నులకు చేరింది. 2016 తర్వాత ఈ స్థాయి డిమాండ్‌ పటిష్టత ఇదే తొలిసారి. సగటు త్రైమాసిక ధర ఔన్స్‌కు (31.1 గ్రాములు) 2,070 డాలర్లు. వార్షికంగా ఈ రేటు 10% అధికమైతే, త్రైమాసికంగా  5 % ఎక్కువ. సెంట్రల్‌ బ్యాంకులు తమ హోల్డింగ్స్‌ను ఈ కాలంలో 290 టన్నులు పెంచుకున్నాయి.  ∗ మార్చి త్రైమాసికంలో భారత్‌ పసిడి డిమాండ్‌ విలువ రూపాయల్లో వార్షిక ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ.75,470 కోట్లకు చేరింది.∗సమీక్షా కాలం మొత్తం పసిడి డిమాండ్‌లో ఆభరణాల డిమాండ్‌ 4 శాతం పెరిగి 95.5 టన్నులకు చేరగా, పెట్టుబడుల (కడ్డీలు, నాణేల వంటివి) విలువ 19 శాతం పెరిగి 41.1 టన్నులుగా నమోదైంది.∗ విలువల్లో చూస్తే ఆభరణాలకు డిమాండ్‌ 15% పెరిగి రూ.52,750 కోట్లకు చేరింది. పెట్టుబడుల్లో  విలువ 32% పెరిగి రూ.22,720కి ఎగసింది. ∗ మార్చి త్రైమాసికంలో పసిడి దిగుమతులు 25 % పెరిగి 179.4 టన్నులుగా నమోదయ్యాయి.  ∗గోల్డ్‌ రీసైక్లింగ్‌ విలువ 10% పెరిగి 38.3 టన్నులుగా నమోదైంది.∗2024లో 700 నుంచి 800 టన్నుల కొనుగోళ్లు జరుగుతాయన్నది అంచనా. 

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement