Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Watch Live AP CM Jagan Public Meeting At Narasapuram
Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

Big Relief For YS Avinash Reddy In Telangana High Court
Viveka Case: అవినాష్‌రెడ్డికి ఊరట

హైదరాబాద్‌, సాక్షి:  వివేకా కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి ఊరట లభించింది. కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి వేసిన పిటిషన్‌ను శుక్రవారం ఉదయం తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యులను అవినాష్‌ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని, కాబట్టి ఆయనకు ఇచ్చిన  ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలంటూ  దస్తగిరి ఓ  పిటిషన్‌ వేశాడు. అయితే దస్తగిరి వాదనను అవినాష్‌ తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే దస్తగిరి పిటిషన్‌దస్తగిరి ఆరోపణల్లో వాస్తవం లేదునిరాధార ఆరోపణలతో పిటిషన్‌ వేశారుసీబీఐ బెయిల్‌ రద్దు ఎప్పుడూ కోరలేదుహైకోర్టు షరతులను కూడా ఎక్కడా ఉల్లంఘించలేదుసాక్షులను బెదిరించినట్లు ఎక్కడా ఆధారాల్లేవ్‌వైఎస్‌ భాస్కర్‌రెడ్డి విషయంలో సైతం ఆధారాల్లేవ్‌ఇప్పటికే ఈ కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్‌ వేసిందిఅని అవినాష్‌ తరఫు న్యాయవాది నాగార్జునరెడ్డి వాదనలు వినిపించారు.  ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం దస్తగిరి పిటిషన్‌ను కొట్టేసింది.మరోవైపు  ఇదే కేసులో అరెస్టైన అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. అదే సమయంలో ఉదయ్‌కుమార్‌ రెడ్డి, సునీల్‌ యాదవ్‌ లకు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.ఇక.. ఈ కేసులో వివేకా కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతోందని ఎంపీ అవినాష్‌ రెడ్డి అంటున్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు  చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని, పైగా ఎన్నికల వేళ .. దురుద్దేశపూర్వకంగా వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చినా.. ఆయన్ను అప్రూవర్‌గా మార్చి కేసు నుంచి తప్పించారని, ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.ఈ కేసులో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు అవినాష్‌. షర్మిల రాజకీయ సభల్లో ఏం మాట్లాడుతుందో అందరు చూస్తున్నారులేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు సునీత పవర్ పాయింట్ ప్రజటేషన్ ఇస్తోందిఅసలు ఈ కేసులో మాట్లాడటం ఇష్టం లేదు, కేవలం వివరణ కోసమే మీడియా ముందుకు వచ్చానుదస్తగిరిని అప్రూవర్ చేసిన విధానం అందరు గమనించండిఈ కేసులో వాచ్ మెన్ రంగన్న ఐ విట్ నెస్ ...నలుగురి పేర్లు చెప్పాడురంగన్న చెప్పిన వారిని ఏ విచారణ సంస్ద అయిన అరెస్ట్ చేసి కస్టడీ అడిగి సమాచారం రాబట్టాలినెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చెయ్యలేదుదస్తగిరి హత్య చేశానని ఒప్పుకున్నా అరెస్ట్ చేయకుండా ఇంటికి పంపారుఅనంతరం దస్తగిరి యాంటిస్పేటరీ బెయిల్ అడిగాడుదస్తగిరి బెయిల్‌కు సునీత అభ్యంతరం చెప్పలేదుపక్కా ప్రణాళికతో దస్తగిరిని అప్రూవర్ చేశారు306- 4A ప్రకారం అప్రూవర్‌ను ట్రయల్‌ అయిపోయే వరకు బయటకు పంపకూడదుకానీ చట్టంలో లొసుగులను అధారంగా చేసుకుని.. అడిగినంత డబ్బు ఇస్తామని అప్రూవర్‌గా మార్చారుఅప్రూవర్ అనేది అనవాయితీగా మారితే న్యాయం ఎక్కడ జరుగుతుంది?సిబిఐతో సునీత, దస్తగిరి లాలూచీకి అనేక ఉదహరణలు ఉన్నాయిఇచ్చిన వాంగ్మూలన్నే నా వాంగ్మూలం కాదని సునీత చెబితే సిబిఐ ఎలా అంగీకరిస్తుంది.?హత్య జరిగిన పది రోజులకు సునీత ప్రెస్ మీట్ లో ఏం చెప్పిందో అందరికీ తెలుసుజమ్మలమడుగులో చనిపోయే ముందు రోజు వరకు అవినాష్ రెడ్డికి మద్దతుగా వివేకా ఎన్నికల ప్రచారం చేశారని సునీత చెప్పిందిఇంత స్పష్టంగా చెప్పి ఇప్పుడు ఎంపి టికెట్ కోసమని ఎలా మాట మార్చుతారు?నాకు బెయిల్ వచ్చాకా ఇప్పటివరకు 13 సార్లు వాంగ్మూలం ఇచ్చానుఎవరో ఫోన్ చేస్తే అవినాష్‌ వెళ్లి సాక్షాలు చెరిపానని సునీత బురద జల్లుతోందిఈ కేసులో శివప్రకాష్ రెడ్డి మూడవ వ్యక్తి అని సునీత ఎలా చెబుతుంది?వైఎస్ వివేకానందరెడ్డికి సొంత బావమరిది శివప్రకాష్‌ రెడ్డి, ఆయన మూడో మనిషి ఎలా అవుతాడు ?శివప్రకాష్ చెబితేనే నేను వివేకా ఇంటికి వెళ్లాను, అ తరువాతే నేను సమాచారం చెప్పానుమూడో వ్యక్తి కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని ఎలా అంటారు ?ఎవరైనా కాల్‌ చేస్తారని ముందే ఊహిస్తారా?నేను వెళ్లక ముందే క్రిష్ణారెడ్డి వివేకా ఇంటికి వెళ్లాడు, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో మాట్లాడాడునేను వెళ్లగానే పోలీసులకు కూడా చెప్పానువివేకా లెటర్ దాచిపెట్టడం పెద్ద నేరం, తప్పడు ఉద్దేశం ఉంటే అ రోజే  చెప్పి ఉండాలిఎర్రగంగిరెడ్డి 45 నిమిషాలు అలస్యంగా వచ్చాడుఎర్రగంగిరెడ్డికి శివప్రకాష్ రెడ్డే ఫోన్ చేశాడుసునీత ఏ రకంగా నిందలు వేస్తున్నారో అందరు గమనించాలిఎర్రగంగిరెడ్డి వివేకాకు ఎంత అప్తుడొ అందరికి తెలుసువివేకానందరెడ్డి చివరి రెండేళ్లు తీవ్ర దుర్బర పరిస్దితి అనుభవించారుచివరి రోజుల్లో ఎందుకు నిరాదరణకు గురిచేసారో చెప్పాలి ?బెంగుళూరులో సెటిల్ మెంట్ లో డబ్బు వస్తే రెండో కుటుంబానికి ఇవ్వాలని ప్రయత్నించారు.రెండో పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా వివేకాను సొంత కుటుంబ సభ్యులే నిరాదరణకు గురిచేశారుఇక సునీత తరచు చెబుతున్నట్టు గూగుల్ మ్యాప్, గూగుల్ టేక్ అవుట్ ఒకటి కాదుగూగుల్‌ టేక్‌ అవుట్‌కు శాస్త్రీయత లేదని గూగులే చెబుతోందివైఫై వాడితే ఒక రకంగా డేటా అయితే ఒక రకంగా చూపుతుంది100 మీటర్ల నుంచి కిలోమీటర్‌ అంత దూరం తేడా కనిపిస్తోందిఅది కూడా మూడేళ్ల తరువాత చూశారు?మొదట్లో గూగుల్ టేక్‌ ఔట్ ఎందుకు తప్పని అనిపించలేదు?గూగుల్ టేక్‌ ఔట్ అనేది తప్పుగా నమోదు చేశామని సిబిఐ ఎందుకు కోర్టుకు వివరణ ఇచ్చింది?గ్రీన్‌ విచ్‌ మీన్‌ టైం ప్రకారం 5.30గంటలు వెనక చూపించామని లిఖిత పూర్వకంగా ఎందుకు రాసిచ్చింది?ఇది వివాదం అవ్వడంతో దీంతో మళ్లీ సాకులు చెబుతు కౌంటర్ వేశారువారి కారణాలపైనే వారే అఫిడవిట్ వేశారు, అబద్దాన్ని ఏమి చేసినా నిజం కాదుచంద్రబాబు కుట్రలో సునీత భాగమై ఇలా మాట్లాడుతున్నారునేను ఏ తప్పు చెయ్యలేదు, ఎవ్వరికీ భయపడిదిలేదున్యాయవ్యవస్దపై పూర్తి నమ్మకం ఉందిఈ కేసులో తాము అనుసరిస్తోన్న తీరుకు సిబిఐ లెంపలేసుకుని వెనక్కి వెళ్లాల్సి వస్తుందినా ఫోన్‌లో వాట్సప్ యాక్టివ్‌ ఉన్నందుకు నిందితులతో మాట్లాడానని ఆరోపిస్తున్నారుఆరోపించే వారికి కనీసం వాట్సాప్‌ పట్ల అవగాహన అయినా ఉండాలినా నెంబర్‌ వాట్సాప్‌లో  ఎన్నో గ్రూపులున్నాయి.ఏ గ్రూపులో ఎవరు పోస్ట్‌ చేసినా.. వాట్సాప్‌లోకి వస్తుందినేను నిద్ర పోయినప్పుడు వచ్చే మెసెజ్‌లు ఎవరైనా చూస్తారా?మూడేళ్లుగా నన్ను అప్రతిష్టపాలు చేశారుఅనేక ఇబ్బందులకు గురిచేశారు74 యేళ్ల వయస్సులో మా తండ్రి జైలులో మగ్గుతున్నాడుటిడిపి, బిజేపి నాయకులను అడ్డుపెట్టుకుని కేసులు వేశారుహత్యని తెలిసింది ముందుగా వివేకా కుటుంబ సభ్యులకే.!వైఎస్అర్ చనిపోయాక షర్మిలకు ఎంపిగా ఉండాలనే ఆలోచన ఎందుకు రాలేదు?వీరే కదా నన్ను ఎంపీగా ఉండమని పిలిచిందికేవలం ఎంపీ పదవి చూపి విమర్శలు చెయ్యడం సరికాదు

AP Politics And Election Live Updates May 3rd
AP Election Updates May 3rd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Andhra Pradesh Election Updates 3rd May..టీడీపీ నేతల కారణంగానే వృద్దులకు ఇబ్బందులు..10:30 AM, May 3rd, 2024దేవినేని అవినాష్ కామెంట్స్‌..డివిజన్‌లోని ప్రతీ గడపలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారువైఎస్సార్‌సీపీకి ఓటు వేయడానికి సిద్ధం అని ప్రతీ మహిళా చెబుతున్నారుపెన్షన్ కోసం వృద్దుల ఇబ్బందులకు చంద్రబాబు కారణం కాదా?.టీడీపీ నేతల ఫిర్యాదు వలనే నేడు వృద్ధులకు ఇబ్బందులు.ఈనాడును అడ్డుపెట్టుకొని జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే టీడీపీ నేతల లక్ష్యంస్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో ప్రచారానికి వస్తే ప్రజలు తిరగబడుతున్నారుప్రజలు ఏం తప్పు చేశారని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారుటీడీపీ హయాంలో నియోజకవర్గంలో ప్రతీ కాంట్రాక్టు ఎంఎల్ఏ తమ్ముడు రమేష్‌వే కాంట్రాక్టులుకరకట్ట ప్రాంతంలో కూడా కమ్యూనిటీ హాల్ కట్టింది జగన్ ప్రభుత్వమేరానున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి 'జగన్ కోసం సిద్ధం' ప్రారంభం8:30 AM, May 3rd, 2024తాడేపల్లి :రాష్ట్ర వ్యాప్తంగా 'జగన్ కోసం సిద్ధం' ప్రారంభంఇంటింటికీ బూత్ స్థాయి కమిటీల విస్తృత ప్రచారంఐదేళ్లలో సీఎం జగన్ చేసిన మేలును మరోసారి ప్రజలకు వివరిస్తున్న పార్టీ శ్రేణులుపేదలే వైఎస్సార్‌సీపీ స్టార్ క్యాంపెయినర్లుఇప్పటికే 12 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేసిన వైఎస్సార్‌సీపీవారితో కలిసి ఇంటింటికీ మేనిఫెస్టో తీసుకెళ్తున్న పార్టీ బూత్ కమిటీలుపవన్‌కు పిచ్చి పీక్స్‌లో..7:45 AM, May 3rd, 2024పదవి వస్తుందో రాదో అని పవన్‌కళ్యాణ్‌ నిర్వేదంయువత గుండెల్లో నిప్పంటించడానికే వచ్చా..వైఎస్సార్‌సీపీ గూండాలను మోకాళ్లపై కొట్టి కూర్చోబెడతా‘నాకు తిక్కరేగితే ముఖ్యమంత్రి అమ్మమొగుడూ గుర్తుకురాడు’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలువిశాఖ ఎన్నికల సభలో పవన్‌కళ్యాణ్‌   హిందూపురంలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..7:25 AM, May 3rd, 2024హిందూపురంలో టీడీపీ నేతల దౌర్జన్యంవైఎస్ జగన్ పాటలు పెట్టారన్న కారణంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడిముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలుఆసుపత్రికి తరలింపుటీడీపీ నేతల దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు నేడు సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..7:10 AM, May 3rd, 2024మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న సీఎం జగన్‌ఉదయం 10 గంటలకు నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో ప్రచార సభమధ్యాహ్నం 12:30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానంలోని పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రచార సభమధ్యాహ్నం మూడు గంటలకు ఒంగోలు లోక్‌సభ స్థానంలోని కనిగిరిలో ప్రచారం.   దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’ నోట్లే7:00 AM, May 3rd, 2024 కదిరి టీడీపీ అభ్యర్థి వాహనంలో రూ.2 కోట్ల సీజ్‌తూ.గోదావరిలో దొరికిన కట్టల మూలాలూ టీడీపీలోనేలెక్కలు చెప్పలేని డబ్బుతో దొరికిపోయిన మార్గదర్శిబాపట్ల దేశం అభ్యర్థి కంటైనర్లలో భారీగా నగదు పట్టివేతతిరుపతిలో చీరలతో పాటు నోట్లు పంచుతూ దొరికిన ఎల్లో ముఠాబరితెగించి మరీ డబ్బును వరదలా పారిస్తున్న చంద్రబాబుఏకంగా ఈ ఎన్నికల కోసం రూ.13 వేల కోట్లతో భారీ స్కెచ్‌అవినీతి సొమ్ముతో పాటు తన వర్గీయులు, ఎన్నారైల ద్వారా సమీకరణఅసెంబ్లీ సెగ్మెంట్‌కు రూ.75 కోట్ల చొప్పున పంచాలని వ్యూహంమార్గదర్శి, నారాయణ, టీడీపీ నేతల కంపెనీల ద్వారా క్షేత్ర స్థాయికిఓటుకు రూ.5 వేలు ఇవ్వటానికైనా వెనకాడొద్దని నేతలకు హుకుంపంచాయతీ నేతకు రూ.50 లక్షలు.. మండల స్థాయి నేతకు రూ.కోటినియోజకవర్గస్థాయి నేత అయితే రూ.3 కోట్లు; దీనికోసం ప్రత్యేక టీమ్‌పోలీసుల సోదాల్లో దొరికిన ‘పచ్చ’కట్టలు జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే   మోసాల బాబు మరో అబద్ధం..6:50 AM, May 3rd, 2024ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తానంటున్న చంద్రబాబు 2023–24లో రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులు 71,77,637 మంది ఇంటర్‌ విద్యార్థులు మరో 10,52,221 మంది.. ఈ ఒక్క పథకానికే ఏటా రూ.1,234 వేల కోట్లు అవసరం  ఇంత మొత్తం ఇవ్వడం అసాధ్యమంటున్న నిపుణులు  ఇక జీఓ–117 రద్దుచేస్తే ప్రభుత్వ విద్య నిర్వీర్యం  పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు ఉపాధ్యాయ పోస్టులను సైతం రద్దుచేసేందుకు ఆస్కారం    ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రెస్‌ మీట్‌6:40 AM, May 3rd, 2024 రాష్ట్ర వ్యాప్తంగా 4,13,33,702 ఓటర్లు ఉన్నారుపురుషులు- 2,02,74,144, మహిళలు-2,10,56,137దీనికి అదనంగా సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారురాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ బూత్‌లు ఏర్పాటుమోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ లపై 864 ఎఫ్ఐఆర్‌లు నమోదు సీ విజిల్ కి 16,345 ఫిర్యాదులు వచ్చాయికొన్ని చోట్ల హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. 6 మందికి గాయాలుఇప్పటి వరకు 203 కోట్లు విలువైన నగదు, మద్యం సీజ్రాష్ట్ర వ్యాప్తంగా 29,897 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్.. దాదాపు 64% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయబోతున్నాం14 నియోజకవర్గాలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్‌తో పాటు పోలింగ్ నిర్వహణకి సెంట్రల్ ఫోర్సెస్ఎండ వేడిమి అధికంగా ఉన్న కారణంగా టెంట్లు, కూలర్లు, తాగునీళ్లు, మెడికల్ కిట్ల వంటి ప్రత్యేక చర్యలు85 ఏళ్ల పైబడిన వృద్దులు, వికలాంగులు తదితరులు ఇంటి దగ్గర వినియోగించుకోవడానికి 7,28,484 మందిలో కేవలం 28,591మంది అంగీకరించారుహైకోర్టు తీర్పు తర్వాత ఏడు ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్ధానాలలో గాజు గ్లాసు కేటాయించిన అభ్యర్ధులకి వేరే గుర్తులు కేటాయించవలసి వచ్చింది\విశాఖ ఎంపీ స్ధానానికి 33 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్న కారణంగా మూడు ఈవీఎం అవసరమవుతాయితిరుపతి, మంగళగిరిలలో  మూడు బ్యాలెట్ యూనిట్లు..మరో 20 నియోజకవర్గాలలో రెండేసి బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతున్నాయిఇందుకోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా 15 వేల ఈవీఎంలు తెప్పించాంరాష్ట్రంలో 50 మంది జనరల్ అబ్జర్వర్లు, 25 మంది పోలీస్ అబ్జర్వర్లు, 25 పార్లమెంటరీ వ్యయ పరిశీలకులు,  అసెంబ్లీ స్ధానాలకి 50 వ్యయ పరిశీలకులు ఉన్నారుపోలీస్ శాఖ రిపోర్ట్ మేరకు 384 ఎమ్మెల్యే, 64 మంది ఎంపి అభ్యర్ధులకి ప్రత్యేక భద్రత  కల్పించాంపెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల‌కమీషన్ మేరకు కొన్ని ఆదేశాలు జారీ చేశాంబ్యాంకు అకౌంట్లు ఉన్నవారికి డిబిటి ద్వారా....అకౌంట్లు లేని వారికి నేరుగా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నాంపెన్షన్ల పంపిణీపై రాజకీయ పార్టీల ప్రచారాలపై నేను స్పందించలేనునామినేషన్ల ఉప సంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితా సిద్ధం అయ్యిందిఅలాగే ఎన్నికల్లో ఓటు వేయనున్న ఓటర్ల  తుది జాబితాను కూడా సిద్ధం చేశాంప్రస్తుతం 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారుగతంతో పోలిస్తే 5,94,631 మంది ఓటర్లు పెరిగారుఇక రాష్ట్ర వ్యాప్తంగా అదనం గా పోలింగ్ కేంద్రాలు కూడా పెరిగాయిమొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కోసం సిద్ధం చేశాంఅలాగే మోడల్ కోడ్ లో భాగం గా విస్తృత తనిఖీలు చేస్తున్నాంఇప్పటి వరకూ 203 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాంఈసారి 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తాంఅలాగే రాష్ట్రంలోని 14 నియోజక వర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించాంమాచర్ల, పెదకూరపాడు ఒంగోలు, అల్లగడ్డ్ , తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ళపల్లి ల్లలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాంప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయిఅందుకే పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేలా చర్యలు, మెడికల్ కిట్ లు, ఏర్పాటు చేస్తున్నాంరాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది హోం ఓటింగ్‌కు సమ్మతి తెలిపారుజనసేన పోటీ చేస్తున్న లోక్ సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు లో గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయింపు లేదుఅలాగే శాసన సభ నియోజక వర్గాల పరిధిలో ఉన్న లోక్ సభ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎవరికీ ఇవ్వంఇప్పటికే కేటాయించిన 7 లోక్ సభ, 8 శాసన సభ నియోజక వర్గాల్లో గుర్తును మార్పు చేసి ఇతర అభ్యర్థులకు ఇచ్చాంఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటింగ్ మొదలు పెట్టాంపెరిగిన అభ్యర్థుల కారణంగా అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్ లు అవసరం అయ్యాయి. వీటిని తెప్పించి జిల్లాకు పంపించాం   చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల రామకృష్ణారెడ్డి6:30 AM, May 3rd, 2024 చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని ప్రజలకు తెలుసువైసీపీ బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తోందిరాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అమలు చేయగలిగినవే చెప్పాంకోవిడ్ సమయంలో ఆ రెండేళ్లు కూడా ఆగకుండా సంక్షేమం అమలు చేశాంజగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నారుఇప్పుడేమో మళ్ళీ అడ్డగోలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారుగతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారునిరుద్యోగులకు రూ.3 వేలు, రైతులకు రూ.20 వేలు సహాయం అని మేనిఫెస్టోలో పెట్టారుకానీ అర్హత ఏంటో చెప్పలేదుఅంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా?1999 లో కూడా కోటి మందికి ఉపాధి అని హామీ ఇచ్చారుకానీ అమలు చేయకుండా ఎగనామం పెట్టారుచంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వెయ్యి రూపాయలు చేశారుఅదికూడా సరిగా ఇచ్చారా అంటే అదీ లేదువృద్దులు, వికలాంగులకు ఏ ఇబ్బందీ లేకుండా జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారుఇప్పుడు కోర్టుకు వెళ్లి, ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకున్నారుచివరికి బ్యాంకులో పెన్షన్లు వేసేలా ఈసీ ద్వారా చేయించారుబ్యాంకుల దగ్గర పెన్షన్‌దారులు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోందిచంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఎలాంటి నరకం ఉంటుందో ముందే కనపడుతోందివృద్దులు, వికలాంగుల కష్టాలకు పూర్తి పాపం చంద్రబాబుదేవాలంటీర్ల వ్యవస్థను తొలగించి మళ్ళీ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తారు2019లో ప్రజలు చిత్తుగా ఓడించారన్న కోపం చంద్రబాబుకు ఉందిఅందుకే వారి జీవితాలతో చెలగాటమాడటానికి సిద్ధం అయ్యారుకూటమి మేనిఫెస్టోలో బీజేపీ ఫోటోలు ఎందుకు లేవు?అంటరానితనంగా ఎందుకు వ్యవహరించారు?సిక్కిం, అరుణాచలప్రదేశ్ లో కూటమి మేనిఫెస్టోలో మరి బీజేపీ, మోదీ బొమ్మలు ఎందుకు ఉన్నాయి?చంద్రబాబు హామీలు అమలు చేసేలా లేవని బీజేపీకి అర్థం అయిందిఅందుకే చంద్రబాబు మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పిందిల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విపరీతంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారుఆ యాక్టును బీజేపీ కేంద్ర  ప్రభుత్వమే అమలు చేయాలని చూస్తోందిఆ చట్టం మీద అనుమానాలు ఉంటే దానికి బాధ్యత బీజేపీదేతప్పుడు ప్రచారాలు చేసే చంద్రబాబు అసలు రాజకీయాలకే అనర్హుడుచంద్రబాబు మేనిఫెస్టో బూతుపత్రంల్యాండ్ టైటిల్ యాక్టు మీద బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలిబీజేపి రాష్ట్ర నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?చంద్రబాబు లెక్క ప్రకారం దేశంలోని భూములన్నీ మోదీ అమ్మకుంటున్నారా?దీనిపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు క్లారిటీ ఇవ్వాలి

Political Suspense Over AP BJP Senior Leaders
ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది.. వారంతా ఎక్కడ?

ఏపీలో ఎన్నికల ప్రచారంలో సీనియర్లు ఎందుకు కనిపించటం లేదు.. టిక్కెట్లు దక్కలేదని అలిగారా.. లేదంటే పురందేశ్వరి కుట్రా రాజకీయాలతో సీనియర్లు గుర్రుగా ఉన్నారా?. సొంత పార్టీని టీడీపీకి తాకట్టుపెట్టేసారని మండిపడుతున్నారా.. అందుకే ప్రచారాలకి దూరంగా ఉంటున్నారా?. ఎన్నికల వేళ ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది.ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారానికి సీనియర్లు దూరంగా ఉండటం పార్టీలో దుమారం రేపుతోంది. పురందేశ్వరి వైఖరితో విసుగెత్తిన సీనియర్లు పార్టీ ప్రచారంలో ఎక్కడా పాల్గొనడం లేదు. పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారికి కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి రాత్రికి రాత్రే బీజేపీలో చేరిన వారికి  సీట్లు ఇవ్వడంతో సీనియర్లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఏపీలో బీజేపీ, టీడీపీ, జేనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేస్తోంది. ఇక, ఎన్నికల్లో సీనియర్లు చాలా మంది ఒంటరి పోరే బీజేపీకి మంచిదని సూచించినా పురందేశ్వరితో పాటు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి నేతల లాబీయింగ్‌తో పొత్తు కుదరింది కానీ.. మొదట నుంచి పొత్తులో బీజేపీకి నష్టం కలిగేలా నిర్ణయాలు జరిగాయి.టిక్కెట్ల దగ్గర నుంచి అభ్యర్ధుల ఎంపిక వరకు అన్నీ టీడీపీ డైరక్షన్‌లో పురందేశ్వరి తీసుకున్న నిర్ణయాలు సీనియర్లకి రుచించలేదు. కనీసం 25 అసెంబ్లీ, ఎనిమిది ఎంపీ సీట్ల కోసం పోటీ పడిన బీజేపీకి కేవలం ఆరు పార్లమెంట్, పది అసెంబ్లీ స్ధానాలు దక్కాయి. ఈ స్ధానాలలో అయినా బీజేపీ అభ్యర్ధులకి అవకాశం ఇవ్వాలని.. పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారికి ప్రాదాన్యత ఉండాలని బీజేపీ సీనియర్లు ఆశించారు. అందులో భాగంగానే జీవీఎల్ విశాఖ ఎంపీ స్థానానికి, రాజమండ్రి స్థానానికి సోము వీర్రాజు, ఏలూరు పార్లమెంట్ స్థానానికి తపనా చౌదరి, హిందూపూర్‌కి విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు ప్రయత్నించారు. పార్టీ కోసం పనిచేసిన తమకు టిక్కెట్లు వస్తాయని భావించారు.అయితే, పురందేశ్వరి రాజకీయాలతో వీరెవరికీ టిక్కెట్లు దక్కకపోగా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లలో ప్రాధానత్య ఇచ్చి వారికే టికెట్లు కేటాయించారు. టీడీపీ సుధీర్ఘకాలంగా ఉండి గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి, కొత్తపల్లి గీతలకి టిక్కెట్లు దక్కాయి. ఇక గతేడాది బీజేపీ చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సైతం ఎంపీ టిక్కెట్లు దక్కించుకున్నారు. బీజేపీ పోటీ చేస్తున్న ఆరు ఎంపీ స్థానాల్లో ఐదు స్థానాలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే దక్కాయి.అంతేకాకుండా.. చివరి నిమిషంలో టీడీపీ నుంచి రోషన్నని చేర్చుకుని బద్వేలు టిక్కెట్ ఇవ్వడం.. అనపర్తిలో మొదట ప్రకటించిన మాజీ సైనికుడిని కాదని రాత్రికి రాత్రి టీడీపీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడంపైనా సీనియర్లు అసహనంగా ఉన్నారు. కాగా, పురందేశ్వరి తన స్వార్ధం కోసం బీజేపీని టీడీపీకి తాకట్టు పెట్టేయడంపై సీనియర్లంతా వ్యతిరేకంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పురందేశ్వరి వైఖరితో విసుగెత్తిన సీనియర్లు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇక, విశాఖ టిక్కెట్ ఆశించి చివరి వరకు ప్రయత్నించి భంగపడ్డ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు ఎక్కడా ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు. ఉత్తరాంధ్రలో బీజేపీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేసిన జీవీఎల్‌ తీవ్ర మనస్థాపంతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన ఢిల్లీకి పరిమితమైనట్లు తెలుస్తోంది. ఇక సోము వీర్రాజు రాజమండ్రి ఎంపీ స్ధానం కోసం పోటీ పడ్డారు. అయితే రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరికి ఆ టిక్కెట్ దక్కడంతో మౌనంగా ఉండిపోయారు. దాదాపు నాలుగన్నర దశాబ్ధాలగా పార్టీ కోసం పనిచేయడంతో పాటు స్ధానికుడైన తనను కాదని పురందేశ్వరికి టిక్కెట్ ఇవ్వడంపై ఆయన అసంతృప్తిగానే ఉన్నా కూడా పార్టీ ఆదేశాల మేరకు ఆమె నామినేషన్ కార్యక్రమంలో మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత పురందేశ్వరి తనతో దూరంగా ఉండటంతో ఎన్నికల ప్రచారానికి సోము వీర్రాజు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ఏలూరు ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నించిన తపనా చౌదరి కూడా చివరి వరకు రెబెల్ అభ్యర్ధిగా పోటీ చేయాలని భావించారు. అయితే, పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో వెనక్కి తగ్గిన తపనా చౌదరి ఎన్నికల ప్రచారానికి మాత్రం దూరంగా ఉన్నారు. జాతీయ స్ధాయి నాయకులు పాల్గొనే సభలలో మాత్రమే ఈ సీనియర్లంతా కనిపించి వెళ్లిపోతున్నారు. ఇక హిందూపూర్ టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమైన విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు. విష్ణు వర్ధన్ రెడ్డి కేవలం రాష్ట్ర కార్యాలయానికే పరిమితమయ్యారు.మరోవైపు శ్రీపీఠం పరిపూర్ణానందస్వామి రెబెల్ అభ్యర్ధిగా కదిరి అసెంబ్లీ, హిందూపూర్ పార్లమెంట్ బరిలో నిలబడటం కూటమి నేతలకి కలవరం కలిగిస్తోంది. ఇక గన్నవరం అసెంబ్లీ నుంచి బీజేపీ రెబెల్‌గా బరిలో ఉన్న కొరుప్రోలు శ్రీనివాసరావుపై పార్టీ అధిష్టానం వేటువేసినప్పటికీ కూటమి పేరుతో టీడీపీకి మేలు జరిగేలా తీసుకున్న నిర్ణయాలు బీజేపీని పూర్తిగా ముంచేసేలా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఏపీకి రానున్నారు. కొద్దిరోజుల్లోనే జాతీయ నాయకుల ప్రచారాలు ఉండటంతో సీనియర్లు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Rohit Sharma Finally Breaks Silence On Losing MI Captaincy To Hardik Pandya
చేజారిన కెప్టెన్సీ.. ఎట్టకేలకు మౌనం వీడిన రోహిత్‌ శర్మ

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా నియామకాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు రోహిత్‌ శర్మ అభిమానులు. రికార్డు స్థాయిలో ముంబైని ఏకంగా ఐదుసార్లు విజేతగా నిలిపిన హిట్‌మ్యాన్‌పై వేటు వేస్తూ ఫ్రాంఛైజీ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నారు.స్టేడియంలో లోపలా.. వెలుపలా పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు దిగుతున్నారు. హార్దిక్‌ పాండ్యాకు ప్రేక్షకుల నుంచి ఎదురవుతున్న చేదు అనుభవాలే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో గురువారం నాటి మీడియా సమావేశంలో రోహిత్‌ శర్మ తొలిసారిగా ఈ విషయంపై స్పందించాడు.టీ20 ప్రపంచకప్‌-2024కు సంబంధించిన జట్టు గురించి చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో కలిసి ముంబైలో రోహిత్‌ విలేకరులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ కోల్పోవడం గురించి ప్రశ్న ఎదురైంది.నాకు ఇదేమీ కొత్త కాదుఇందుకు బదులిస్తూ.. ‘‘జీవితంలో ఇదంతా భాగమే. అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవు. ఏదేమైనా వేరొకరి(హార్దిక్‌ పాండ్యాను ఉద్దేశించి) కెప్టెన్సీలో ఆడటం గొప్ప అనుభవం.ఇంతకు ముందు కూడా నేను చాలా మంది కెప్టెన్ల సారథ్యంలో ఆడాను. నాకు ఇదేమీ కొత్త కాదు. ఒక ఆటగాడిగా జట్టు కోసం ఏం చేయగలనో అది చేయడమే నాకు ముఖ్యం. గత నెల రోజులుగా నేను అదే పని చేస్తున్నాను’’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.కాగా గతంలో మహేంద్ర సింగ్‌ ధోని, వీరేంద్ర సెహ్వాగ్‌, విరాట్‌ కోహ్లి, ఆడం గిల్‌క్రిస్ట్‌(దక్కన్‌ చార్జర్స్‌), హర్భజన్‌ సింగ్‌(ముంబై ఇండియన్స్‌, రిక్కీ పాంటింగ్‌(ముంబై ఇండియన్స్‌) కెప్టెన్సీలో రోహిత్‌ శర్మ ఆడిన విషయం తెలిసిందే. హార్దిక్‌ పాండ్యా విఫలంఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2024లో ఇప్పటి వరకు ఆడిన 10 ఇన్నింగ్స్‌లో కలిపి రోహిత్‌ శర్మ 314 పరుగులు చేశాడు. ఇక ముంబై కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా మాత్రం ఆకట్టులేకపోతున్నాడు. అతడి నాయకత్వంలో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో కేవలం మూడింట మాత్రమే ముంబై గెలిచింది. అక్కడ రోల్‌ రివర్స్‌కాగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌ తర్వాత వరల్డ్‌కప్‌ టోర్నీతో రోహిత్‌ శర్మ బిజీ కానున్నాడు. రోహిత్‌ సారథ్యంలోని టీమిండియా జూన్‌ 5న న్యూయార్క్‌ వేదికగా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. తదుపరి జూన్‌ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ ఐసీసీ టోర్నీలో రోహిత్‌కు హార్దిక్‌  డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.చదవండి: T20 WC 2024: ఓపెనర్‌గా కోహ్లి.. రోహిత్‌ శర్మ ఏమన్నాడంటే?

Suhas Latest Movie Prasanna Vadanam Review In Telugu
సుహాస్ ప్రసన్న వదనం.. మరో హిట్‌ పడినట్టేనా?

టైటిల్: ప్రసన్న వదనంనటీనటులు: సుహాస్, పాయల్‌ రాధాకృష్ణ, రాశి సింగ్‌, నందు, వైవా హర్ష, నితిన్‌ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులుడైరెక్టర్‌: అర్జున్‌ వైకేనిర్మాతలు: మణికంఠ జేఎస్‌, ప్రసాద్‌రెడ్డి టీఆర్‌సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌సినిమాటోగ్రఫీ: ఎస్‌.చంద్రశేఖరన్‌ఎడిటింగ్‌: కార్తిక్‌ శ్రీనివాస్విడుదల తేదీ:  03-05-2024టాలీవుడ్‌లో యంగ్ హీరో సుహాస్ ప్రత్యేక శైలితో దూసుకెళ్తున్నారు. ఫ్యామిలీ డ్రామా, కలర్ ఫోటో, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు లాంటి డిఫరెంట్‌ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. తాజాగా మరోసారి ప్రసన్న వదనం అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. సుకుమార్ వద్ద పని చేసిన అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫేస్ అండ్ బ్లైండ్‌నెస్‌ కాన్సెప్ట్‌ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి సరికొత్త కాన్సెప్ట్ వర్కవుట్ అయ్యిందా? కొత్త దర్శకుడితో సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా? చూసేద్దాం పదండి.  అసలు కథేంటంటే...ఓ ప్రమాదంలో తల్లితండ్రులను కోల్పోతాడు సూర్య(సుహాస్). అసలే కష్టాల్లో ఉన్న అతనికి మరో వింత డిజార్డర్ కూడా వస్తుంది. తలకి బలంగా గాయం కావడంతో ఫేస్ బ్లైండ్‌నెస్ డిజార్డర్ వస్తుంది. అంటే అతను ఎవరినీ గుర్తించలేడు. ఓ ఎఫ్ఎం స్టేషన్‌లో ఆర్జేగా పని చేస్తున్న సూర్య ఓ అర్ధరాత్రి దారుణమైన ఘటనను ప్రత్యక్షంగా చూస్తాడు. అమృత(సాయి శ్వేత)అనే అమ్మాయిని ఎవరో లారీ కింద తోసేస్తారు. అయితే ఈ ఘటనని ప్రత్యక్షంగా చూసిన సూర్య..  తనకి ఫేస్ బ్లైండ్‌నెస్ ఉండటం వల్ల ఆ వ్యక్తి ఎవరనేది గుర్తుపట్టలేడు. మరుసటి రోజే అది యాక్సిడెంట్‌ అని  వార్తల్లో వస్తుంది. ఇది చూసిన సూర్య బాధితురాలికి న్యాయం చేయాలని భావించి పోలీసులకు ఫోన్ చేసి అసలు సంగతి చెబుతాడు. ఈ కేసుని ఏసీపీ వైదేహి(రాశి సింగ్) ఎస్ఐ( నితిన్ ప్రసన్న) చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అసలు పోలీసులు నిందితున్ని పట్టుకున్నారా? దర్యాప్తులో ఎలాంటి నిజాలు  రాబట్టారు? ఫేస్ బ్లైండ్‌నెస్‌తో సూర్య ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు ? అసలు అమృతని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ? అనేది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.ఎలా సాగిందంటే..  ఇలాంటి ఫేస్ బ్లైండ్‌నెస్‌ కాన్సెప్ట్‌తో తెలుగులో ఇప్పటివరకూ సినిమాలు రాలేదు. సరికొత్త పాయింట్‌ను తీసుకున్న డైరెక్టర్‌ అర్జున్ ఆ పాయింట్‌ను అంతే కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. సూర్య తల్లితండ్రులు ప్రమాదంలో చనిపోవడం.. సూర్యకి ఫేస్ బ్లైండ్ నెస్ రావడం.. ఆ తర్వాత అతను పడే ఇబ్బందులు, అధ్య(పాయల్ రాధకృష్ణ) రూపంలో ఓ క్యూట్ లవ్ స్టొరీతో కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లాడు. కథలోకి క్రైమ్ ఎలిమెంట్ వచ్చిన  తరవాత వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్‌ మాత్రం నిజంగానే బ్లైండ్‌నెస్‌ వచ్చేలా చేస్తుంది. అంటే అంతలా సస్పెన్ష్‌ ఉంటుందన్నమాట.సెకండాఫ్‌కు వచ్చేసరికి కథను మరింత గ్రిప్పింగ్‌గా నడిపించారు డైరెక్టర్‌. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేరు. కథను అంత పకడ్బందీగా రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ ఈ సినిమాకి మరో హైలెట్‌గా నిలిచింది. అప్పటివరకూ కాస్తా స్లో నేరేషన్‌  అనిపించినప్పటికీ ఈ కథకు ఇచ్చిన ముగింపు మాత్రం అదిరిపోయింది.ఎవరెలా చేశారంటే...సూర్య పాత్రలో సుహాస్ సహజంగా ఒదిగిపోయాడు .తనదైన నటనలో ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ సూపర్బ్ అనిపించాడు. పాయల్‌ తన అందంతో పాత్రలో ఒదిగిపోయింది. రాశి సింగ్, నితిన్ తమ పాత్రల పరిధి మేర నటించారు. హర్ష, సత్య కామెడీతో అదరగొట్టేశారు. ఓవరాల్‌గా నందుతో పాటు మిగిలిన నటీనటులు తమపాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే.. విజయ్ బుల్గానిన్ నేపధ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఫరవాలేదు. కార్తిక్‌ శ్రీనివాస్‌ ఎడిటింగ్‌లో తన కత్తెరకు కాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా తొలి సినిమాతోనే దర్శకుడు అర్జున్ తన మార్క్ చూపించారు.

Getting Angry Even For A Few Minutes Risk Of Heart Attack And Stroke
'కోపం' ఇంత ప్రమాదకరమైనదా? అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు!

"తన కోపమే తనకు శత్రవుతన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌతన సంతోషమె స్వర్గముతన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ"! అ‍న్న పద్యం చిన్నప్పుడు నేర్చుకున్నాం. చాలామంది దీన్ని పాటించలేరు. కోపం శక్తి అలాంటిది. మెరుపుదాడిలా వచ్చేస్తుంది. అయితే ఈ కోపం వల్ల శత్రవులు పెరుగుతారు అని తెలుసుకున్నాం గానీ ఇది ఆరోగ్యానికి కూడా అత్యంత ప్రమాదకరమైనదే అట. కోపం కారణంగా శత్రుత్వం ఏర్పడి మనఃశాంతి కరువయ్యి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని విన్నాం గానీ. కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈ కోపం గుండెపోటు, స్ట్రోక్‌లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని గుర్తించారు. అంతేగాదు ఆ పరిశోధనల్లో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..అమెరికన్‌ హార్ట్‌ అసోసీయేషన్‌ జర్నల్‌లో ఈ పరిశోధన గురించి ప్రచురితమయ్యింది. శాస్త్రవేత్తలు కేవలం కొన్ని నిమిషాల కోపం ఆరోగ్యానికి చేటని, అది రక్తనాళాల పనితీరుని మార్చగలదని గుర్తించారు. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్‌లు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందని వెల్లడించారు. కోపం తీవ్రతపై గుండెపోటు ప్రమాదం ఆధారపడి ఉందని పరిశోధనలో వెల్లడయ్యిందన్నారు. కొద్దిపాటి కోపం హృదయ ఆరోగ్యాన్ని దారుణంగా దిగజారుస్తాయని అన్నారు. అందుకోసం కొలంబియా యూనివర్సిటీ ఇర్వింగ్‌ మెడికల్‌ సెంటర్‌, యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, న్యూయార్క్‌లోని సెయింట్‌ జాన్స్‌ యూనివర్సిటీ తదితర పరిశోధక బృందం సుమారు 280 మంది ఆరోగ్యవంతమైన పెద్దలపై అధ్యయనం నిర్వహించారు. వారిని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక సముహాన్ని విచారం, ఆందోళన, కోపానికి గురయ్యే సంఘటనలకు గురి చేశారు. ఆ సముహం ఎనిమిది నిమిషాల వరకు ఈ స్థితిని ఫేస్‌ చేశారు. అలాగే వారందర్నీ కోపాన్ని కంట్రోల్‌ చేసుకునేలా ఒకటి నుంచి 100 అంకెలు లెక్కపెట్టమన్నారు. అయితే వారిలో కొందరు మాత్రం తీవ్ర కోపానికి గురయ్యి బ్యాలెన్స్‌ తప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయా వ్యక్తుల రక్త నమునాలను పరిశీలించగా..కోపాన్ని నియంత్రించుకున్న వారికంటే..కోపానికి గురయ్యిన వారిలో రక్తనాళాలు విస్తరించే సామర్థ్యం గణనీయంగా తగ్గడం గుర్తించారు పరిశోధకులు. అందులోనూ అప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ తీవ్ర కోపం కారణంగా గుండె సంబంధిత వ్యాధుల బారిన ఈజీగా పడుతున్నట్లు కూడా గుర్తించారు. ఈ భావోద్వేగాలు కార్డియోవాస్కులర్ ఫిజియాలజీని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పరిశోధనలో నిర్థారించారు. ఈ అధ్యయనం మానవుని మానసిక స్థితి, హృదయ ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందన్నారు పరిశోధకులు. అంతేగాదు ఈ పరిశోధన గుండె ఆరోగ్యం భావోద్వేగాలు, ఒత్తిడిని నిర్వహించడంపైనే ఆధారపడి ఉంటుందనేది హైలెట్‌ చేసిందని పరిశోధకులు తెలిపారు. (చదవండి: ఆ మహిళ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చిందా? నిపుణులు ఏమంటున్నారంటే..) 

Apple sets revenue records in India during March quarter
తగ్గిన ప్రపంచ నం1 కంపెనీ విక్రయాలు.. భారత్‌లో మాత్రం..

ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్‌ ఐఫోన్‌ విక్రయాలు తగ్గుతున్నట్లు తెలిసింది. మార్చి 2024తో ముగిసిన త్రైమాసికంలో యాపిల్ ఐఫోన్‌ విక్రయాలు 10 శాతం తగ్గినట్లు కంపెనీ చెప్పింది. దాంతో కంపెనీ ఆదాయం 4 శాతం క్షీణించిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ తెలిపారు.గడిచిన త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌ విక్రయాలు తగ్గుతుంటే ఇండియాలో మాత్రం వీటికి ఆదరణ పెరుగుతుందని చెప్పారు. ఇండియాలో రికార్డు స్థాయిలో విక్రయాలు పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియాలో యాపిల్‌ ఉత్పత్తులకు అద్భుతమైన మార్కెట్‌ ఉంది. భారత్‌లో స్థిరంగా రెండంకెల వృద్ధి నమోదవుతోంది. ఇక్కడ రికార్డుస్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. ముందుగా కంపెనీ ఆశించినమేరకు అంచనాలను అధిగమిస్తున్నాం’ అని అన్నారు.యాపిల్‌ సంస్థ ముంబై, దిల్లీలో రెండు అవుట్‌లెట్‌లను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్‌ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలిసింది. ఈ స్టోర్‌లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..ముంబై స్టోర్ యాపిల్‌ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్‌ సాకెట్‌ కంటే కొంచెం అధికంగా నమోదవుతోంది. త్వరలో భారత్‌లో మరో మూడు స్టోర్‌లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే గతేడాది జూన్‌లో వెలువడిన బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్‌ తన స్టోర్‌లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్‌లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

Elections 2024: Rahul Gandhi To Contest From Raebareli Officially Announced
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ

ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ట్విస్ట్‌ ఇచ్చారు. అమేథీ నుంచి పోటీకి మొదటి నిరాసక్తి కనబరుస్తూ వస్తున్న ఆయన.. చివరకు రాయ్‌బరేలీ నుంచి పోటీకి సిద్ధం అయ్యారు. కాసేపటి కిందట కాంగ్రెస్‌ పార్టీ రాయ్‌బరేలీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాహుల్‌ గాంధీ పేరును అధికారికంగా ప్రకటించింది. ఇక అమేథీ నుంచి కిషోరీలాల్‌ శర్మను బరిలో దించనుంది. సోనియా గాంధీ రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్న టైంలో కేఎల్‌ శర్మ అన్ని వ్యవహరాలను చూసుకునేవారు. రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తుండడంతో.. సోనియా గాంధీ తనయ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి  ప్రియాంక గాంధీ వాద్రా లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దాదాపు దూరం అయ్యారనే చెప్పాలి.రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు కంచుకోటే1952లో రాయ్‌ బరేలీ లోక్‌సభ స్థానానికి జరిగిన తొలి ఎన్నికల్లో, 1957లో జరిగిన ఎన్నికల్లోనూ ఫిరోజ్‌ గాంధీ(రాజీవ్‌ గాంధీ తండ్రి) ఎంపీగా నెగ్గారు. దాదాపు దశాబ్దం గ్యాప్‌ తర్వాత ఆయన సతీమణి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వరుసగా రెండు పర్యాయాలు నెగ్గారు. 1977లో జనతా పార్టీ తరఫున రాజ్‌ నారాయణ్‌ గెలుపొందారు. 1980లో మరోసారి కూడా ఆమె గెలిచారు. ఆ తర్వాత అరుణ్‌ నెహ్రూ, షీలా కౌల్‌ కాంగ్రెస్‌ తరఫునే చెరో రెండుసార్లు ఎంపీగా నెగ్గారు. 1996-98 టైంలో బీజేపీ అశోక్‌ సింగ్‌ ఎంపీగా గెలిచి కాంగ్రెస్‌ గెలుపు రికార్డుకు బ్రేకులు వేశారు. ఆ తర్వాత 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి సతీష్‌ శర్మ విజయం సాధించారు. 2004 నుంచి ఐదు పర్యాయాలు(2006 ఉప ఎన్నికతో సహా) సోనియా గాంధీ రాయ్‌బరేలీలో విజయం సాధిస్తూ  వచ్చారు.  ఇంకోవైపు ఈ రెండు లోక్‌సభ స్థానాల విషయంలో కాంగ్రెస్‌లో పెద్ద హైడ్రామానే నడిచింది. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ ఇప్పటికే వయనాడ్(కేరళ)‌ నుంచి పోటీ చేస్తున్నారు. అమేథీ, రాయ్‌ బరేలీ  ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో ఆయన దేని నుంచి పోటీ చేస్తారు?.. అసలు ఆయన ఈ సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తారా? లేదా? అనే సస్పెన్స్‌ కొనసాగింది.ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీలకు కాంగ్రెస్‌ కంచుకోటలుగా పేరుండేది. అమేథీలో రాహుల్‌ గాంధీ 2004 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. కానీ, 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే అదే ఎన్నికలో కేరళ వయనాడ్‌ నుంచి కూడా పోటీ చేయడం, అక్కడ నెగ్గడంతో కాంగ్రెస్‌ పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఇక ఈసారి కూడా ఆయన అమేథీ నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే..క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా పోటీకి ఆయన దూరం జరిగారు. కేవలం వయనాడ్‌ నుంచి మాత్రమే ఆయన నామినేషన్‌ వేశారు. ఇదే అదనుగా.. పోటీ చేయడానికి రాహుల్‌ జంకుతున్నారంటూ బీజేపీ ఎద్దేవా చేయడం మొదలుపెట్టింది.  దీంతో బీజేపీ విమర్శలను సవాల్‌గా తీసుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు.. రాహుల్‌ పోటీ చేయాల్సిందేనని నిరసనలు చేపట్టేదాకా పరిస్థితి చేరుకుంది.మరోవైపు కాంగ్రెస్‌ పెద్దలు రాహుల్‌ గాంధీతో ఎడతెరిపి లేకుండా చర్చలు జరిపారు. పోటీకి దూరంగా ఉండడం దేశం మొత్తం తప్పుడు సంకేతాలు పంపిస్తుందని వివరించే యత్నం చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే.. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని సోనియా గాంధీ నిర్ణయించుకోవడంతో.. అక్కడి కాంగ్రెస్‌ అభ్యర్థిపైనా ఉత్కంఠ నెలకొంది.  ఉప ఎన్నిక సహా ఐదుసార్లు ఆమె రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లిన నేపథ్యంలో ఆ స్థానంలో ఆమె తనయ, ఏఐసీసీ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయొచ్చనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి.ఈ రెండు స్థానాల అభ్యర్థిత్వం కోసం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ అన్నాచెల్లెళ్లతో  వరుసగా చర్చలు జరుపుతూ వచ్చారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను పోటీకి ఒప్పించేందుకు ఆయన తీవ్రంగా యత్నించారు. అయితే గురువారం అర్ధరాత్రి దాకా జరిగిన  చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి.  అమేథీ నుంచి కాకుండా రాయ్‌ బరేలీ నుంచి పోటీకి  రాహుల్‌   ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ రెండు స్థానాల నామినేషన్ల దాఖలుకు  ఇవాళే ఆఖరు తేదీ. దీంతో భారీ ర్యాలీగా రాహుల్‌ గాంధీ నామినేషన్‌ వేయబోతున్నారు.  తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు  రాహుల్‌  నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి  హాజరవుతారని సమాచారం. ఐదో ఫేజ్‌లో  అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు మే 20వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

Aishwarya Rajinikanth Bought New Home
సినిమా అట్ట‌ర్ ఫ్లాప్‌.. కొత్తిల్లు కొన్న ర‌జ‌నీ కూతురు

త‌మిళ సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య గ‌త కొద్ది రోజులుగా విడాకుల వ్య‌వ‌హారంతో వార్త‌ల్లో నిలుస్తోంది. రెండేళ్ల క్రిత‌మే హీరో ధ‌నుష్‌తో విడిపోయిన ఆమె అప్ప‌టినుంచి వేరుగా జీవిస్తోంది. మ‌ళ్లీ క‌లుస్తార‌ని మ‌ధ్య‌లో ఊహాగానాలు వెలువ‌డినా చివ‌ర‌కు విడాకులు తీసుకోవ‌డానికే ఇద్దరూ మొగ్గు చూపారు. ఇందుకోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.పిల్ల‌ల‌తో ఇదే ఇంట్లోఇదిలా ఉంటే ఐశ్వ‌ర్య కొత్తిల్లు కొన్న‌దంటూ గ‌త రెండు రోజులుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. చెన్నైలోని ఈ కొత్తింట్లోనే ఐశ్వ‌ర్య త‌న కుమారులిద్ద‌రితో క‌లిసుండ‌నుంది. ఇటీవ‌లే గృహ ప్ర‌వేశం జ‌ర‌గ్గా ఈ వేడుక‌కు త‌ల్లిదండ్రులు ల‌త‌-ర‌జ‌నీకాంత్ హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మం పెద్ద హ‌డావుడి లేకుండా ఎంతో సింపుల్‌గా జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.డిజాస్ట‌ర్‌కాగా ఐశ్వ‌ర్య.. ధ‌నుష్‌ను హీరోగా పెట్టి '3' సినిమా తీసింది. త‌ర్వాత 'వాయ్ రాజా వాయ్' మూవీకి ద‌ర్శ‌కుడ‌రాలిగా వ్య‌వ‌హ‌రించింది. చాలాకాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్న ఆమె 'లాల్ స‌లాం'తో మ‌రోసారి ద‌ర్శ‌కురాలి అవ‌తారం ఎత్తింది. త‌న తండ్రి ర‌జ‌నీకాంత్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది.చ‌ద‌వండి: న‌టుడి ఇంట మోగిన పెళ్లి బాజాలు.. వరుడి బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement


ఫోటో స్టోరీస్

View all