Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Elections 2024: May 17th Politics Latest News Updates In Telugu
May 17th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 17th AP Elections 2024 News Political Updates8: 04 AM, May 17th, 2024సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలతో వైసీపిలో ఫుల్ జోష్150 కిపైగా సీట్లలో గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన జగన్మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామన్న జగన్దేశమంతా మనవైపే చూస్తుందని వ్యాఖ్యలుగత 59 నెలలుగా చేసిన సుపరిపాలనతో జనం జగన్ కే అండగా నిలిచారంటున్న విశ్లేషకులుచంద్రబాబు కూటమి కుట్రలకు ప్రజలు ఛీకొట్టారన్న చర్చఈసారి మరింత మేలు చేసేలా పాలన సాగించే దిశగా సీఎం అడుగులు8: 01 AM, May 17th, 2024వెల్లివిరిసిన మహిళా చైతన్యంఏపీలో పురుషులకంటే ఓట్లు వేసిన మహిళల సంఖ్య 4.78 లక్షలు అధికంపోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి మొత్తం పోలింగ్‌ శాతం 81.86 శాతంఅసెంబ్లీకి అత్యధికంగా దర్శిలో 90.91 శాతం.. అత్యల్పంగా తిరుపతిలో 63.62 శాతంలోక్‌సభకు అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం.. విశాఖలో 71.11 శాతం ఓట్లుదేశంలో ఇప్పటివరకు జరిగిన 4 దశల ఎన్నికల్లో అత్యధిక పోలింగ్‌ రాష్ట్రంలోనేఎన్నికల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తాం33 చోట్ల 350 స్ట్రాంగ్‌ రూముల్లో మూడంచెల భధ్రత నడుమ ఈవీఎంలుహింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని రెండు రోజుల్లో అరెస్ట్‌ చేస్తాంఎన్నికల తర్వాత జరిగిన హింస అదుపులోకి వచ్చిందిహింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు715 పోలీస్‌ పికెట్స్‌తో గొడవలను అదుపులోకి తెచ్చాంరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా7: 07 AM, May 17th, 2024టీడీపీ చెప్పినట్లు ఆడినందుకేప్రజాస్వామ్య ప్రక్రియకు పాతరేసిన ఫలితం..విధి నిర్వహణలో అలసత్వమే ఈసీ వేటుకు కారణంరాజకీయ ఒత్తిళ్లతో పోలీస్‌ అధికారుల బదిలీ.. పురందేశ్వరి జాబితా ప్రకారం నియామకాలుఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు 7: 03 AM, May 17th, 2024నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకు వ్యూహంటీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు ఇల్లు కేంద్రంగా కుట్రగోపిరెడ్డి దొరక్కపోవడంతో ఆయన మామపై హత్యాయత్నంఅనంతరం అరవింద్‌బాబు హౌస్‌ అరెస్ట్‌పోలీసుల తనిఖీలో మారణాయుధాలు, పెట్రోల్‌ బాంబులు లభ్యం.. పోలింగ్‌కు ముందే పథకం ప్రకారం సమకూర్చుకున్న వైనంమారణాయుధాలకు సంబంధించి కేసు నమోదు చేయని పోలీసులు.. పల్నాడులో హత్యా రాజకీయాలనే నమ్ముకున్న టీడీపీ7: 02 AM, May 17th, 2024పాలన బాగుంటే పోలింగ్‌ పెరుగుతుందిఇది రాజకీయ విశ్లేషకుల మాట.. మాట నెరవేర్చిన ప్రభుత్వాలను మళ్లీ ఎన్నుకుంటారు..పోలింగ్‌ శాతం పెరగడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమనే ప్రచారం అవాస్తవం2004లో 69.8 శాతం పోలింగ్‌తో వైఎస్సార్‌కు అధికార పగ్గాలు.. 2009లో 72.7% పోలింగ్‌తో మళ్లీ సీఎంగా వైఎస్సార్‌తెలంగాణలో 2014లో 69.5 శాతం పోలింగ్‌తో అధికారంలోకి టీఆర్‌ఎస్‌2018లో 73.2 శాతం పోలింగ్‌తో మరోసారి సీఎంగా కేసీఆర్‌ఇప్పుడు ఏపీలోనూ అదే ట్రెండ్‌.. మరిన్ని సీట్లతో సీఎంగా మళ్లీ వైఎస్‌ జగన్‌6: 50 AM, May 17th, 2024మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాంపోలింగ్‌ సరళిపై తొలిసారిగా స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌2019కి మించి 2024లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనంజూన్‌ 4న ఘన విజయంతో దేశం మొత్తం మన వైపే చూస్తుంది59 నెలలుగా ప్రజలకు మంచి చేశాం.. వచ్చే ఐదేళ్లు మరింత మేలు చేద్దాంవిజయవాడలో ఐ–ప్యాక్‌ ప్రతినిధులతో సమావేశం

Political analysts on polling percentage
AP: పాలన బాగుంటే పోలింగ్‌ పెరుగుతుంది

సాక్షి, అమరావతి: పరిపాలన నచ్చితే ప్రజలు తమ మద్దతు ఓట్ల రూపంలో చూపిస్తారని, అందుకు అనుగుణంగానే పోలింగ్‌ శాతం పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్‌కు, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కేసీఆర్‌కు ప్రజలు వరు­సగా రెండుసార్లు అధికారం కట్టబెట్టటాన్ని ఇందుకు నిదర్శ­నంగా ఉదహరి­స్తున్నారు. ఇప్పుడు ఏపీ­లోనూ అదే ట్రెండ్‌ కనిపిస్తోందని, ప్రజలకు ఇచ్చిన మాట నిల­బెట్టుకున్న జగన్‌ ప్రభుత్వానికి మరోసారి పట్టం గట్టడం ఖాయమని, అందుకనే పోలింగ్‌ శాతం పెరిగిందని విశే­్లషిç­Ü్తున్నారు. పోలింగ్‌ శాతం పెరగడం ప్రభుత్వంపై వ్యతిరేకతను సూచిస్తోందనే ప్రచారంలో నిజం లేదని సీని­యర్‌ రాజకీయ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చితే నిస్సంకోచంగా మళ్లీ అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని పేర్కొంటున్నారు.ఈ మంచి కొనసాగేలా..ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 99 శాతం హామీలను అమలు చేయడంతోపాటు పథకాలన్నీ కొనసాగిస్తామని ప్రజల్లో విశ్వాసం కల్పించడంతో పెద్ద ఎత్తున పోలింగ్‌కు తరలి వచ్చారని, ఈ మంచి కొనసాగాలని కోరుకుంటున్నారనేందుకు పోలింగ్‌ శాతం పెరగడమే రుజువని సీనియర్‌ రాజకీయవేత్తలు స్పష్టం చేస్తున్నారు. 2019లో కంటే 2024లో పోలింగ్‌ శాతం పెరగడం వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎంగా చూడాలన్న ఆకాంక్షలకు సంకేతమని పేర్కొంటున్నారు.వైఎస్సార్‌ పాలనే రుజువు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో 69.8 శాతం పోలింగ్‌తో దివంగత వైఎస్సార్‌ అధికారం చేపట్టారు. 2004 నుంచి 2009 వరకు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈ క్రమంలో 2009 ఎన్నికల్లో 72.7 శాతం పోలింగ్‌తో ప్రజలు మరోసారి వైఎస్సార్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు.విద్య, వైద్య రంగాలలో తొలిసారిగా పెను మార్పులు తెచ్చిన వైఎస్సార్‌కు జేజేలు పలికారు. పోలింగ్‌ శాతం పెరగడం వల్ల వైఎస్సార్‌కు ప్రజల మద్దతు పెరిగినట్లు స్పష్టంగా కళ్లెదుట కనిపించిన వాస్తవమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2004కు మించి 2009లో పోలింగ్‌ 2.9 శాతం పెరిగింది.కేసీఆర్‌కు రెండుసార్లు అధికార పగ్గాలు..రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో 2014 ఎన్నికల్లో 69.5 శాతం పోలింగ్‌ నమోదు కాగా కేసీఆర్‌ అధికారం చేపట్టారు. కేసీఆర్‌ పాలన నచ్చడంతో 2018 ఎన్నికల్లో 73.2 శాతం పోలింగ్‌తో మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేశారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.సానుకూల ప్రచారంతో..ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో 79.77 శాతం పోలింగ్‌తో ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా దీవించారు. ఐదేళ్ల సీఎం జగన్‌ పాలన నచ్చడంతో పాటు పథకాలన్నీ కొనసాగాలని ప్రజలు కోరుకోవడంతో ఈదఫా పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చి ఓట్లు వేశారని, అందుకే పోలింగ్‌ శాతం 81.86 శాతానికి పెరిగిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మళ్లీ సీఎంగా జగనే ఉండాలని ప్రజలు భావిస్తున్నారనేందుకు గత ఎన్నికల కంటే పోలింగ్‌ అదనంగా 2.09 శాతం పెరగడం సంకేతమని స్పష్టం చేస్తున్నారు. ఐదేళ్లుగా మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగిందని భావిస్తే ఓటుతో ఆశీర్వదించాలని, సైనికులుగా తోడుగా నిలవాలని, పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని సీఎం జగన్‌ ఎన్నికల్లో సానుకూల ప్రచారం చేయడం ప్రజలకు నచ్చిందని, అందుకే ఓట్ల రూపంలో జేజేలు పలికారని సీనియర్‌ రాజకీయ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

Palnadu And Anantapur Sps Have Been Suspended By The Ec
పచ్చ కుట్రపై ఈసీ యాక్షన్‌

సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఎన్నికల అనంతరం హింసపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. హింసపై దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటు చేసింది. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఈసీ ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేసింది. పల్నాడు కలెక్టర్‌, తిరుపతి ఎస్పీపై ఈసీ బదిలీ వేటు వేయగా, పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెన్షన్‌ చేసింది.పల్నాడు, అనంతపురం, తిరుపతి లోని 12 మంది సబ్బార్డినేట్ పోలీస్ అధికారులను సస్పెండ్‌ చేసిన ఈసీ.. శాఖపరమైన విచారణ చేపట్టాలని ఆదేశించింది. అల్లర్లకు పాల్పడిన వారిపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని ఈసీ ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించిన ఈసీ.. 25 కంపెనీల పారా మిలటరీ బలగాలను కొనసాగించాలని పేర్కొంది.అనంతపురం: జేసీ వర్గానికి వత్తాసు పలికి..తాడిపత్రిలో జేసీ వర్గానికి వత్తాసు పలికిన అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్‌ను ఈసీ సస్పెండ్‌ చేసింది. ఎన్నికల పోలింగ్ సమయంలో ఎస్పీ వివాదాస్పదంగా వ్యవహరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వందల మంది టీడీపీ కార్యకర్తలతో సంచరిస్తున్నా ఎస్పీ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడి చేసినా కానీ ఎస్పీ అమిత్ బర్దర్ సకాలంలో స్పందించలేదు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసేలా ఎస్పీ ఆదేశాలను చేసిన ఎస్పీ.. ఎన్నికల వేళ రౌడీషీటర్లను కూడా బైండోవర్ చేయలేదు.తిరుపతి: సర్పంచ్ ఇంటికి టీడీపీ మూకలు నిప్పు.. స్పందించని ఎస్పీచంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలపై ఈసీ సీరియస్ అయ్యింది. తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. చంద్రగిరి మండలం రామిరెడ్డిగారి పల్లి పంచాయితీ కూచి వారి పల్లి లో సర్పంచ్ కోటాల చంద్ర శేఖర్ రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు దాడి చేశారు. సర్పంచ్ ఇంటికి టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టి.. దాడి చేసినా కానీ సకాలంలో ఎస్పీ స్పందించలేదు.కాగా, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో పోలింగ్‌ రోజు, ఆ తరువాత హింసాత్మక ఘటనలు చోటు చేసు­కోవ­టాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వా­లని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి ఈసీకి వివరణ ఇచ్చారు.పోలింగ్‌ అనంతరం పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరించినా స్థానిక పోలీ­సులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా పరి­గ­ణించిన ఈసీ బాధ్యులపై చర్యలు చేపట్టింది.

Jr NTR Approach To High Court For Land Issue
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌

హైదరాబాద్‌, సాక్షి: టాలీవుడ్‌ అగ్రనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నగరంలో భూవివాదానికి సంబంధించిన ఆయన కోర్టులో పిటిషన్‌ వేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్‌‌ హౌసింగ్‌‌ సొసైటీలో ల్యాండ్‌కు సంబంధించిన వివాదంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో తనకు సంబంధించిన ప్లాట్ విషయంలో వివాదం తలెత్తడంతో ఆయన కోర్టుకు వెళ్లారు. 2003లో గీత లక్ష్మీ అనే వ్యక్తి నుంచి ఒక ప్లాట్‌ను ఎన్టీఆర్ కొన్నారు. అయితే,ఆ ల్యాండ్‌పై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డీఆర్‌‌టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌‌) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ హైకోర్టును ఆశ్రయించారు.1996లో ఆ ల్యాండ్‌ మీద పలు బ్యాంకుల వద్ద ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా గీత లక్ష్మి కుటుంబం లోన్స్ పొందింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌కు అమ్మే సమయంలో ఆ విషయాన్ని గీత లక్ష్మి దాచిపెట్టింది. ఫేక్‌ డాక్యుమెంట్స్ ద్వారా ఇదే ల్యాండ్‌ మీద ఐదు బ్యాంకుల నుంచి గీత లక్ష్మి లోన్స్ తీసుకుంది. కానీ, ల్యాండ్‌ అమ్మే సమయంలో కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్‌కు గీత లక్ష్మి చెప్పింది. ఆ సమయంలో చెన్నైలోని ఒక బ్యాంక్‌లో లోన్ క్లియర్ చేసి ఆ డాక్యుమెంట్స్‌ను ఎన్టీఆర్‌ తీసుకున్నారు. 2003 నుంచి ఆ ప్లాట్ ఒనర్‌గా తారక్ ఉన్నారు.అయితే 1996లోనే ఈ స్థలాన్ని తనఖా పెట్టి రుణం చెల్లించని కారణంగా ఆ ఆస్తిపై హక్కులు తమవేనని పేర్కొంటూ పలు బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. వీటిని రద్దు చేయాలంటూ ఎన్టీఆర్‌ కోర్టును ఆశ్రయించారు. ల్యాండ్‌ విషయంలో సమగ్ర విచారణ చేయకుండానే డీఆర్‌‌టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌‌) ఆదేశాలు ఇచ్చిందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. స్థలాన్ని అమ్మిన వారిపై కేసు పెట్టినట్లు తారక్‌‌ లాయర్‌‌ తెలిపారు. అయితే డాకెట్‌‌ ఆదేశాలు అందాల్సి ఉందని, కొంత సమయం ఇస్తే వాటి వివరాలు సమర్పిస్తామని చెప్పారు. జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

Daily Horoscope: Rasi Phalalu 17-05-2024 In Telugu
Today Horoscope: ఈ రాశివారికి అనుకోని ఆర్థిక లాభాలు

శ్రీ∙క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: శు.నవమి ఉ.9.09 వరకు, తదుపరి దశమి నక్షత్రం: పుబ్బ రా.9.40 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: లేదు దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.52 వరకు, తదుపరి ప.12.22 నుండి 1.10 వరకు, అమృతఘడియలు: ప.2.54 నుండి 4.28 వరకు.సూర్యోదయం : 5.31సూర్యాస్తమయం : 6.21రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం: ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. మిత్రుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.వృషభం: వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధికం. మిత్రులతో స్వల్ప వివాదాలు. అనుకోని ఖర్చులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.మిథునం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి.కర్కాటకం: కుటుంబంలో చికాకులు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.సింహం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.కన్య: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు.వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.తుల: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.వృశ్చికం: పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. సంఘంలో గౌరవం. చర్చలు సఫలం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.ధనుస్సు: చేపట్టిన కార్యక్రమాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా. శ్రమాధికం. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.మకరం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.కుంభం: కొత్త పనులు చేపడతారు. బంధువుల కలయిక. విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఉత్సాహం.మీనం: అనుకోని ఆర్థిక లాభాలు. ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగులకు అనుకూలం.

Heavy rain and thunderstorms disrupt normal life in Hyderabad: TS
దంచి.. ముంచి

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి నెట్‌వర్క్‌: నైరుతి రుతుపవనాలు రాకముందే రాష్ట్రంలో భారీ వర్షం కురిసింది. గురువారం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షం కురవగా... రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం వరకు ఎండవేడితో ఉక్కిరిబిక్కిరైన గ్రేటర్‌ ప్రజలకు మధ్యాహ్నం 3.30గంటల సమయంలో మొదలైన వాన ఉపశమనాన్ని ఇచ్చింది. గ్రేటర్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని గంటకుపైగా ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. కుండపోత వానతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.ప్రధాన రహదారుల వెంట ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సికింద్రాబాద్‌లో అత్యధికంగా 11.6 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, కృష్ణానగర్‌లో 9, షేక్‌పేటలో 8.65, అంబర్‌పేట్‌లో 8.45, నాంపల్లిలో 8.3, ఖైరతాబాద్‌లో 7.73 సెం.మీ. నమోదైంది. హైదరాబాద్‌ జిల్లాతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. అదేవిధంగా సిద్దిపేట, కరీంనగర్, మెదక్, వనపర్తి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కామారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, మహబూబ్‌నగర్, జగిత్యాల, జనగామ, పెద్దపల్లి, సిరిసిల్ల, భువనగిరి, నిజామాబాద్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 199 ప్రాంతాల్లో ఒక సెంటీమీటర్‌ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళికా విభాగం వెల్లడించింది. సాధారణంగా మే నెల మధ్యలో ఇంత పెద్ద వాన కురవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరో రెండు రోజులు.. తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఉపరితల ఆవర్తనం గురువారం మధ్యప్రదేశ్‌ నైరుతి ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు చెప్పింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు సైతం కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్, జనగామ, నాగర్‌కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. గురువారం రాష్ట్రంలో చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో... ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దుబ్బాక మార్కెట్‌ యార్డులో తూకానికి సిద్ధం చేసిన 3 వేల క్వింటాళ్ల ధాన్యం, మిరుదొడ్డి, అక్బర్‌పేట–భూంపల్లి, ములుగు మండలాల పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. పాపన్నపేట మండలం ఆరెపల్లిలో పిడుగుపడి 10 మేకలు మృతి చెందాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసింది. అడ్డాకుల, మిడ్జిల్, మూసపేట, ధరూర్, జడ్చర్ల, భూత్పూర్, వెల్దండ తదితర మండలాల్లో వర్షప్రభావం ఉంది. జడ్చర్ల మార్కెట్‌లో విక్రయానికి వచి్చన ధాన్యం, సరీ్వస్‌ రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌లో, బొమ్మలరామారంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల్లోకి వర్షపు నీరు చేరింది. తూకం వేసిన ధాన్యం బస్తాలు కూడా తడిసిపోయాయి. సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డలో ఈదురుగాలుల కారణంగా హోర్డింగ్‌ కూలిపోయింది. పిడుగుపాటుతో ముగ్గురు మృతి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ముగ్గురు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని భరత్‌నగర్‌కు చెందిన రైతు రుద్రారపు చంద్రయ్య (42) పొలంలో సాగు చేస్తుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మరణించాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని శాత్రాజుపల్లికి చెందిన కంబోళ్ల శ్రీనివాస్‌ (32) చెట్టుపైకి ఎక్కి చింతకాయ తెంపుతుండగా పిడుగుపడి మృతిచెందాడు. చెట్టు కింద ఉన్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనివాస్‌కు తల్లిదండ్రులు, భార్య, మూడు నెలల కుమారుడు ఉన్నారు. కడ్తాల్‌ మండలం కలకొండకు చెందిన కార్పెంటర్‌ పసునూరి ప్రవీణ్‌చారి (30) తన మామ నాగోజు జంగయ్యచారితో కలిసి పని నిమిత్తం బైక్‌పై కడ్తాల్‌ వచ్చారు. పని ముగించుకుని సాయంత్రం స్వగ్రామాలకు వెళ్తుండగా వాస్‌దేవ్‌పూర్‌ గేట్‌ వద్దకు చేరుకోగానే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. బైక్‌ను నడుపుతున్న జంగయ్య వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేశాడు. వెనకాల కూర్చున్న ప్రవీణ్‌ బైక్‌ దిగి బస్‌ షెల్టర్‌లోకి వెళ్తుండగా.. సమీపంలో ఒక్కసారిగా పిడుగు పడింది. ప్రవీణ్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. జంగయ్యకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. జంగయ్యచారి కూతురు మౌనికతో ప్రవీణ్‌చారికి ఏడాది క్రితమే వివాహమైంది. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌లలో) కేంద్రం గరిష్టం ఆదిలాబాద్‌ 39.8 రామగుండం 39.0 నిజామాబాద్‌ 38.8 ఖమ్మం 38.4 భద్రాచలం 38.2 మహబూబ్‌నగర్‌ 38.1 నల్లగొండ 38.0 హన్మకొండ 36.0 హైదరాబాద్‌ 35.6 హకీంపేట్‌ 35.4 దుండిగల్‌ 35.2 మెదక్‌ 35.2

Growth in tax revenue at Telangana
అంచనాలకు మించి..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పన్ను ఆదాయం ఏటేటా పెరుగుతోంది. వరుసగా మూడో ఏడాది పన్ను రాబడుల్లో వృద్ధి నమోదు అయ్యింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) లెక్కల ప్రకారం మార్చి 2024 నాటికి రూ.1.35 లక్షల కోట్లు పన్ను ఆదాయం కింద సమకూరాయి. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, అమ్మకపు పన్ను, కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర పన్నుల రూపేణా ఈ మొత్తం సమకూరిందని కాగ్‌ తెలిపింది.బడ్జెట్‌ ప్రతిపాదనల కంటే రూ.4 వేల కోట్లు ఎక్కువగా, సవరించిన అంచనాల కంటే రూ.17 వేల కోట్లు ఎక్కువగా ఈ ఏడాది పన్ను రాబడులు రావడం గమనార్హం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పన్ను రాబడుల వ్యవస్థ సజావుగానే ముందుకెళుతోందని కాగ్‌ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రాష్ట్రంలో రూ.48 వేల కోట్ల పన్ను ఆదాయం వచ్చింది. గత మూడేళ్లుగా.. పన్ను రాబడులు తొలిసారిగా 2021–22లో బడ్జెట్‌ ప్రతిపాదనలకు మించి వచ్చాయి. ఆ ఏడాదిలో రూ.1.06 లక్షల కోట్లు పన్ను రాబడుల కింద వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా, రూ.1.09 లక్షల కోట్ల వాస్తవిక రాబడులు వచ్చాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆ ఏడాది పన్ను వసూళ్లలో ఏకంగా రూ.30 వేల కోట్ల పెరుగుదల చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి పూర్తిగా కోలుకుని, సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆదాయంలో మంచి వృద్ధి కనిపించింది.ఆ తర్వాతి ఏడాది కూడా బడ్జెట్‌ ప్రతిపాదనలతో పోల్చితే స్వల్ప పెరుగుదలే నమోదయ్యింది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో రూ.1.31 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనల్లో చూపెట్టారు. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ పన్ను రాబడులు రూ.1.18 లక్షల కోట్లు వచ్చే అవకాశముందని సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనల కంటే రూ.4 వేల కోట్లు అదనంగా రూ.1.35 లక్షల కోట్ల పన్ను ఆదాయం సమకూరింది. శాఖల వారీగా ఇలా...! శాఖల వారీగా పరిశీలిస్తే.. 2022–23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే జీఎస్టీ రాబడులు రూ.5 వేల కోట్ల వరకు పెరిగాయి. 2022–23లో రూ.41,888 కోట్లు జీఎస్టీ కింద రాగా, 2023–24లో రూ.46,500 కోట్లు వచ్చాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో అంతకుముందు ఏడాది రూ.14,228 కోట్లు రాగా, గత ఏడాదిలో రూ.14,295 కోట్లు వచ్చాయి. ఇక అమ్మకపు పన్ను ద్వారా 2022–23లో రూ.29,604 కోట్లు రాగా, గత ఏడాది కొంచెం ఎక్కువగా రూ.29,989 కోట్లు సమకూరాయి.ఇక ఎక్సైజ్‌ ద్వారా అంతకు ముందు సంవత్సరం రూ.18740 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది 20,298.89 కోట్లు వచ్చింది. కేంద్ర పన్నుల్లో వాటా కింద 2022–23లో రూ.13,394 కోట్లు రాగా, 2023–24లో రూ.16,536.65 కోట్లు వచ్చాయి. ఇతర పన్నుల రూపంలో అంతకుముందు ఏడాది రూ. 8,430 కోట్లు రాగా, ఈసారి రూ.7,918.74 కోట్లు మాత్రమే వచ్చాయి. గత ఐదు నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పన్ను ఆదాయ రాబడులు పెరిగాయని కాగ్‌ లెక్కలు చెబుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ నెల నాటికి రూ. 80,853 కోట్ల పన్ను ఆదాయం వచ్చింది. ఆ తర్వాతి నాలుగు నెలల్లో మరో రూ.46 వేల కోట్లు రాగా, మొత్తం ఆ ఏడాది పన్ను ఆదాయం రూ. 1.26 లక్షల కోట్లకు చేరింది. 2023–24లో నవంబర్‌ నెల నాటికి రూ.87,083 కోట్లుగా నమోదైన పన్ను ఆదాయం ఏడాది చివరి నాటికి (మార్చి 2024 ) రూ. 1.35 లక్షల కోట్లకు చేరింది. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతి 4 నెలల్లో వచ్చిన పన్ను ఆదాయం రూ. 48 వేల కోట్లన్నమాట. గత ఏడాది చివరి నాలుగు నెలలతో పోలిస్తే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో పన్ను ఆదాయం రూ.2వేల కోట్లు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.

SunRisers Hyderabad Qualify For Playoffs,Delhi Capitals Eliminated
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఔట్‌..

ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కథ ముగిసింది. ఈ ఏడాది సీజ‌న్‌లో ఎలాగైనా టైటిల్‌ సాధించి త‌మ 17 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించాల‌ని భావించిన ఢిల్లీకు మ‌రోసారి నిరాశే ఎదురైంది. ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిట‌ల్స్ అధికారికంగా నిష్క్ర‌మించింది.ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, గుజ‌రాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది. దీంతో ఇరు జ‌ట్లకు చెరో పాయింట్ ల‌భించింది. ఈ క్ర‌మంలో ఎస్ఆర్‌హెచ్ 15 పాయింట్ల‌తో ప్లే ఆఫ్స్‌కు ఆర్హ‌త సాధించింది.ఎస్ఆర్‌హెచ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకోవ‌డంతో ఢిల్లీ ఆశ‌లు ఆడియాశలు అయ్యాయి. ఒక ఈ మ్యాచ్ జ‌రిగి ఎస్ఆర్‌హెచ్ ఓట‌మి పాలై ఉంటే మాథ్య‌మేటిక‌ల్‌గా ఢిల్లీకి ప్లే ఆఫ్స్ చేరే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో పంత్ సేన ఇంటిముఖం ప‌ట్టింది. ఈ ఏడాది సీజ‌న్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ ఏడింట విజ‌యాలు, ఏడింట ఓట‌మి పాలైంది. పాయింట్ల ప‌ట్టిక‌లో 5వ స్ధానంతో స‌రిపెట్టుకుంది.

Revanth Reddy: Revise Market Value of Lands in Telangana
భూమి విలువ పెంచండి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూముల విలువల పెంపునకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. భూముల రిజిస్ట్రేషన్‌ విలువకు, వాస్తవ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని.. అందువల్ల భూముల మార్కెట్‌ విలువను సవరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2021లో గత ప్రభుత్వం భూముల విలువను, రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచిందని, అయినా ఇప్పటికీ చాలాచోట్ల భూముల మార్కెట్‌ విలువకు, క్రయ విక్రయ ధరలకు మధ్య భారీ తేడా అలాగే కొనసాగుతోందని అన్నారు.నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్‌ విలువను సవరించాల్సి ఉందని గుర్తు చేశారు. గురువారం సచివాలయంలో.. రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే ప్రధాన శాఖలైన వాణిజ్య పన్నులు, స్టాంపులు.. రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, గనులు, రవాణా శాఖలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో కలిసి ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో అన్నిచోట్లా భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. స్టాంప్‌ డ్యూటీపై అధ్యయనం చేయండి ‘ఏయే ప్రాంతాల్లో ధరలను సవరించాలి. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు.. వేటికి ఎంత సవరించాలనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలి. రిజిస్ట్రేషన్‌ స్టాంపుల విభాగం నిబంధనలను పక్కాగా పాటించాలి. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలా భూముల మార్కెట్‌ ధరల సవరణ ఉండాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్‌ డ్యూటీ ఎంత మేరకు ఉంది.. తగ్గించాలా.. పెంచాలా..అనేది కూడా అధ్యయనం చేయాలి.సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు చాలాచోట్ల అద్దె భవనాల్లో ఉన్నాయి. ప్రజోపయోగాల కోసం సేకరించిన స్థలాలను గుర్తించి అధునాతన మోడల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు నిర్మించాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. పన్ను ఎగవేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి ‘రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలి. అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా పన్నుల ఎగవేతదారులపై కఠిన చర్యలు చేపట్టాలి. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. అవసరమైన సంస్కరణలు చేపట్టాలి. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలి. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదు. ఆదాయం పెంపుపై ఇకపై ప్రతినెలా ఆదాయం సమకూర్చే శాఖల ఉన్నతాధికారులంతా సమీక్షలు జరపాలి. తనిఖీలు, ఆడిటింగ్‌ పక్కాగా జరగాలి బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకానెల లక్ష్యాలను నిర్దేశించుకుని ఆదాయం సమకూరేలా కృషి చేయాలి. ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలి. క్షేత్రస్థాయిలో తనిఖీలు, ఆడిటింగ్‌ పక్కాగా జరగాలి. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించకుండా, నిక్కచి్చగా పన్ను వసూలు చేయాలి. జీఎస్టీ రిటర్న్స్‌ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలి. సామాన్యులకు, చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలి. ఇసుక నుంచి వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలి..’ అని సీఎం ఆదేశించారు ఆదాయం ఎందుకు పెరగలేదు? గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్‌ కారణంగా మద్యం అమ్మకాలు, ఇతర వస్తు విక్రయాలు ఎక్కువగా జరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవటానికి కారణాలు చెప్పాలంటూ అధికారులను రేవంత్‌రెడ్డి నిలదీశారు. మద్యం అక్రమ రవాణా, పన్ను ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Zoho Corp to venture into chip making
సెమీకండక్టర్స్‌ తయారీలోకి జోహో

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ జోహో తాజాగా సెమీకండక్టర్ల తయారీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీనిపై 700 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టే యోచనలో సంస్థ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి కంపెనీ ప్రోత్సాహకాలు కోరుతోందని పేర్కొన్నాయి. ప్రస్తుతం జోహో ప్రతిపాదనను ఐటీ శాఖ కమిటీ పరిశీలిస్తోందని, వ్యాపార ప్రణాళికలపై మరింత స్పష్టతనివ్వాలని కంపెనీని కోరిందని వివరించాయి. జోహో ఇప్పటికే టెక్నాలజీ భాగస్వామిని కూడా ఎంచుకున్నట్లు తెలిపాయి. 1996లో ఏర్పాటైన జోహో .. గత ఆర్థిక సంవత్సరం 1 బిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయం నమోదు చేసింది. తమిళనాడులో చిప్‌ డిజైన్‌ తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్‌ వెంబు మార్చిలో వెల్లడించిన నేపథ్యంలో తాజా వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశీయంగా 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో సెమీకండక్టర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్, సీజీ పవర్‌ తదితర సంస్థలకు కేంద్రం ఫిబ్రవరిలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచి్చన సంగతి తెలిసిందే. భారత్‌లో సెమీకండక్టర్ల మార్కెట్‌ 2026 నాటికి 63 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement