Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM YS Jagan Powerful Speech At Machilipatnam
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్‌

సాక్షి, కృష్ణా: ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ఎవరి భూములపై వారికే హక్కులు కల్పించడమే ఈ యాక్ట్‌ ఉద్ధేశమని తెలిపారు. భూ వివాదాలు పెరిగి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని.. వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ.. సంస్కరణ తీసుకురావాలనేది మీ బిడ్డ ఆలోచన అని సీఎం జగన్‌ తెలిపారు. సర్వేలన్నీ పూర్తి చేసి రికార్డులన్నీ అప్‌డేట్‌ చేస్తున్నామని, రైతన్నలకు భూ హక్కు పత్రాలను పదిలంగా అందిస్తామని స్పష్టం చేశారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన భారీ‌ బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ యాక్ట్‌ గొప్పదని టీడీపీ నేత పయ్యావులే అసెంబ్లీలో చెప్పాడని ప్రస్తావించారు. మంచి సంస్కరణను ఆపేందుకు బాబు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంటికొచ్చే పెన్షన్‌ను అడ్డుకుంది చంద్రబాబేనని దుయ్యబట్టారు. బాబు తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రల వల్లే పెన్షర్లు అగచాట్లు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌ గోయింగ్‌ స్కీమ్స్‌ను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నాడని, లబ్దిదారులకు డబ్బులు వెళ్లకుండా కుట్రలు పన్నుతున్నాడని నిప్పులు చెరిగారు.సీఎం జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్‌జగన్‌కు ఓటేస్తే..పథకాలు కొనసాగింపు, ఇంటింటా అభివృద్ధిపొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లే తలపెట్టడమేచంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది.పేదల శత్రువులంతా ఒక్కటయ్యారుచంద్రబాబువి అన్నీ అబద్ధాలు, మోసాలు, కుట్రలే14 ఏళ్లో చంద్రబాబు ఒక్క మంచిపనైననా చేశాడా?చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?ఎన్నికలు వచ్చేసరికి బాబు దుష్ప్రచారాలు మొదలు పెట్టాడు2 లక్షల కోట్ల డ్రగ్స్‌ తీసుకొచ్చామని దుష్ప్రచారం చేశాడుఆ డ్రగ్స్‌ తీసుకొచ్చింది వదినమ్మ బంధువులేనని తేలింది.తమ వారేనని బయటకు రావడంతో బాబు కూటమి గప్‌చుప్‌59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం130 సార్లు బటన్‌ నొక్కి వివిధ పథకాల ద్వారా మంచి చేశాంపేదలకు నేరుగా రూ. 2 లక్షల 70 వేల కోట్లు అందించాం2 లక్షల 31 వేలకుపైగా ఉద్యోగాలిచ్చాంనాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాంప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాంప్రభుత్వ బడుల్లో 3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులుప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్‌ బోధనవిద్యార్థులకు బైలింగువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌, బైజూస్‌ కంటెంట్‌బడులు తెరిచే నాటికే విద్యాకానుక, గోరుముద్దఉన్నత చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెనవిద్యారంగంలో మేం చేసిన అభివృద్ధి బాబు హయాంలో జరిగిందా?అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ, చేయూతఅక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తంఅక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాంగతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్‌ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలుపెట్టుబడి సాయంతో రైతులకు అండగా నిలబడ్డాంరైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాంసకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నాంవిత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాంజగనన్న చేదోడు ద్వారా చిరు వ్యాపారులకు ఆర్ధిక సాయంమత్స్యకార భరోసా, లా నేస్తం, వాహనమిత్ర ద్వారా ఆదుకున్నాంగతంలో ఎప్పుడైనా ఇంత మంచి కార్యక్రమాలూ చూశారామచిలీపట్నంలో మెడికల్‌ కాలేజ్‌ నిర్మాణం పూర్తి చేశాంబందర్‌లో రూ. 350 కోట్ల ఫిషింగ్‌ హార్బర్‌మచిలీపట్నం అభివృద్ధికి బాటలు వేసింది మీ బిడ్డ జగనే.రూ.5100 కోట్లతో పోర్టు నిర్మాణం జరుగుతుందిమచిలీపట్నంలో మెడికల్‌ కాలేజ్‌ నిర్మాణం పూర్తి చేశాంబందర్‌లో రూ. 350 కోట్ల ఫిషింగ్‌ హార్బర్‌గతంలో ఇంత మంచి ఎప్పుడైనా మీరు చూశారా?

Perni Nani Slams PV Ramesh Tweet On Land Titling Act
చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా పీవీ రమేష్..?

సాక్షి, కృష్ణా: చంద్రబాబు కోసం ఇంతలా దిగజారాలా అంటూ రిటైర్డ్‌ ఐఏఎస్‌ పీవీ రమేష్‌పై‌ మాజీ మంత్రి పేర్నినాని ధ్వజమెత్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి పచ్చ మీడియా సరిపోవన్నట్లు మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను కూడా చంద్రబాబు జత కట్టుకుంటున్నారని మంపడిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విపరీతమైన విషం చిమ్మి కుట్రతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు.మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వల్ల తన పొలం మ్యుటేషన్‌ జరగట్లేదని చేసిన ట్వీట్‌ను ప్రస్తావించారు. పెద్ద పెద్ద చదువులు చదువున్న మీరు ఇంత అసహ్యంగా, దిగజారి మీరు ప్రవర్తించాలా?  అని ప్రశ్నించారు. పీవీ రమేష్‌ది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామమమని తెలిపారు. ఈ గ్రామంలో తన తండ్రి పేరుపై ఉన్న పొలం తన పేరుపైకి మార్చడం లేదంటూ అన్యాయంగా, కిరాతకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రమేష్‌ తండ్రి సుబ్బారావు మాస్టారుతో పాటు అదే గ్రామంలో ఉన్న ఇతర ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల కుటుంబాలు, స్థానికులు మొత్తం కలిసి 25 ఎకరాల భూమిని కొని చెరువును తవ్వారని చెప్పారు.25 మంది కలిసి 70 ఎకరాలు కొని దానిలో ఒక చెరువు తవ్వి లీజుకు ఇస్తూ వస్తున్నారన్నారు పేర్ని నాని. ఏడాది క్రితం రమేష్‌ తండ్రి సుబ్బారావు మరణించారని, ఆయన మరణించిన తర్వాత రమేష్‌ మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేశారని, అప్పటి నుంచీ విచారణలు జరుగుతున్నాయని చెప్పారు. గాలంకి నాగేంద్ర అనే వ్యక్తి కూడా ఈ చెరువులో భాగస్వామి. ఆయనకు, రమేష్‌కు కోర్టులో కేసులు నడుస్తున్నాయని తెలిపారు.వివాదాల వల్లే..ఆ చెరువులో వీళ్లకి సంబంధించిన పొలం ఎంతో కొంత ఉంది.దీనికోసమే జనవరి నెలలో జాయింట్‌ కలెక్టర్, ఆర్డీవోలు అక్కడ విచారణ నిర్వహించారు. ఆ విచారణకు అందరు రైతుల్ని ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తీసుకుని రమ్మని చెప్పారు. అయితే పీవీ రమేష్‌ మాత్రం తన గుమస్తాకు ఫోటోస్టాట్‌ కాపీలిచ్చి పంపారట. ఫోటోస్టాట్‌ కాదు..ఒరిజినల్స్‌ పంపండి అని చెప్పారు. ఆయన రాడు..సరే గుమస్తాను పంపినా ఒరిజినల్స్‌ కావాలి కదా?క్కడ ఉన్న వివాదాన్ని తీర్చడం కోసమే మూడు నెలలుగా ఆ చెరువును అధికారులు ఎండబెడుతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సరిహద్దులు ఫిక్స్‌ చేసి ఎవరి భూమి వారికి ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.ఇంత కథ నడుస్తుంటే ఇంత విషం చిమ్మడం ధర్మమా పీవీ రమేష్‌?మీ వివాదానికి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధం ఏమిటి?అక్కడున్న రైతులందరికీ, మీకు తగాదా ఉండటం ఏంటి? అక్కడున్న ల్యాండ్‌ కన్నా మీరు అదనంగా లీజు పొందుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.ఎవరి పొలం ఎక్కడో కూడా తెలియని పరిస్థితి. చెరువు పూర్తిగా ఎండిపోయిన తర్వాత కదా కొలతలు వేసి ఎవరి హద్దు ఏంటో చెప్పేది?.ఎటువంటి వివాదం లేకపోతే, అది వ్యవసాయ భూమి అయి హద్దులు క్లియర్‌గా ఉంటే..ప్రభుత్వాన్ని విమర్శించినా ఒక అర్ధం ఉంది.  ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు మీ పొలానికి సంబంధం ఏంటి?చంద్రబాబు పంచన చేరి ఐఏఎస్‌ చదువుకుని పచ్చిగా రాజకీయాల కోసం దిగజారడం అవసరమా? చంద్రబాబు కోసం మీరు ఏ డాన్స్‌ కట్టమంటే ఆ డాన్స్‌ కడుతున్నారు. ఏ ట్వీట్‌ చేయమంటే ఆ ట్వీట్‌ చేస్తున్నారు. చంద్రబాబుకు అధికారం సంపాదించడం కోసం మీరు ఇలా తప్పుడు ప్రకటనలు చేసి జగన్‌గారి ప్రభుత్వంపై విషం చిమ్మడం దుర్మార్గమైన చర్య. మీరు విన్నకోట గ్రామం రండి.. అక్కడేం జరుగుతుందో చూడండి.మీ కోసమే.. ఆ వివాదం తేల్చడం కోసమే మూడు నెలలుగా వీఆర్వోలను కాపలా పెట్టి మరీ చెరువును కాళీ చేయిస్తున్నారు.పోలింగ్‌ అయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని రైతులకు, మీ గుమస్తాకి కూడా సమాచారం అందించారు. ఆ చెరువు మధ్యలోనే ఆవుల దొడ్డి కింద ఓ 3.5 ఎకరాల వివాదాస్పద భూమి కూడా ఉంది. మీతో ఉన్న ఆ 25 మంది రైతులు కూడా ఆ ఆవుల దొడ్డి భూమి మాదంటే మాది అని క్లెయిమ్‌ చేస్తున్నారు.ఇలాంటి చరిత్ర కలిగిన భూమిని మీ నాన్నగారు మీకు అప్పజెప్పారు.ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వల్ల నాకు మ్యుటేషన్‌ అవ్వడం లేదని ఇంతగా దిగజారడం అవసరమా? ’ అని మండిపడ్డారు పేర్ని నాని. 

Mumbai win Toss to bowl vs Sun Risers Hyderabad
ఎస్ఆర్‌హెచ్‌తో ముంబై కీల‌క పోరు.. కొత్త ప్లేయ‌ర్ ఎంట్రీ

ఐపీఎల్‌-2024లో మ‌రో ఆస‌క్తిక‌ర స‌మ‌రానికి రంగం సిద్ద‌మైంది. వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు చెరో మార్పుతో బ‌రిలోకి దిగాయి. ముంబై ఇండియ‌న్స్ త‌రపున అన్షుల్ కాంబోజ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. మ‌రోవైపు ఎస్ఆర్‌హెచ్ తుది జ‌ట్టులోకి మ‌యాంక్ అగ‌ర్వాల్ వ‌చ్చాడు.ఈ మ్యాచ్ ముంబై ఇండియ‌న్స్‌కు చాలా కీల‌కం. ఈమ్యాచ్‌లో ముంబై ఓట‌మి పాలైతే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మిస్తోంది.తుది జ‌ట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార 

Escaped Indian Fishermen Reached Kochi From Iran
ఇరాన్‌ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు

కొచ్చి: ఇరాన్‌లో చేపలుపట్టే పని చేసేందుకు వెళ్లిన భారతీయులను యజమాని వేధించాడు. సరైన జీవన సౌకర్యాలు కల్పించలేదు. దీంతో యజమాని సయ్యద్‌ అన్సారీ నుంచి తప్పించుకోవాలని ఆరుగురు కన్యాకుమారికి చెందిన మత్స్యకారులు డిసైడయ్యారు.ఇంకేముంది చేపలు పట్టేందుకు యజమాని ఇచ్చిన బోట్‌లోనే ఇరాన్‌ నుంచి పారిపోయి సముద్రంలో ప్రయాణించి భారత్‌లోని కొచ్చి తీరాని వచ్చారు. కొచ్చి తీరానికి వీరి బోట్‌ చేరుకున్న వెంటనే తీరంలోకి కోస్ట్‌గార్డ్‌ గుర్తించి అడ్డుకున్నారు. ఆరా తీస్తే ఇరాన్‌ యజమాని తమను మోసం చేశాడని,అందుకే పారిపోయి వచ్చామని మత్స్యకారులు చెప్పారు. 

Rebal Star Prabhas in Kannappa Movie Schedule Only For Three days
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్‌ స్టార్‌ ఎంట్రీ!

మంచువిష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ప్రముఖులు నటిస్తోన్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్ సైతం ఓ అతిథి పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అతడు నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.కన్నప్పలో ప్రభాస్అయితే కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్‌ ఎప్పుడు జాయిన్ అవుతారనే విషయంపై నెట్టింట టాక్ నడుస్తోంది. ది రాజాసాబ్‌, కల్కి సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్..  కన్నప్ప కోసం కేవలం మూడు రోజుల సమయం మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. మే సెకండ్‌ వీక్‌లో ప్రభాస్ పాల్గొననున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అక్షయ్ కుమార్ తన సీన్లకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని విష్ణు మంచు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.అయితే మొదట శివుడి పాత్రలో ప్రభాస్‌ను తీసుకోవాలనుకున్నారు. కానీ అక్షయ్ ఎంట్రీతో ప్రభాస్ నందీశ్వరుడి పాత్ర పోషించనున్నాడు. దీంతో ప్రభాస్‌తో షూటింగ్ పూర్తి చేయడానికి ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాను మంచు విష్ణు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్ కూడా కీలకపాత్రలు పోషించనున్నారు. ఇక సినిమాలో పార్వతిగా అనుష్క శెట్టి నటిస్తోంది. 

Rythu bandhu Funds Released By Telangana Government
తెలంగాణ రైతులకు గుడ్‌ న్యూస్‌.. ఖాతాల్లోకి నగదు

సాక్షి,హైదరాబాద్‌: ఐదు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం(మే 6)రైతు బంధు నిధులు విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకుగాను రూ.2 వేల కోట్ల దాకా ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం. మూడు రోజుల్లో మొత్తం రైతుబంధు చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు రైతు బంధు నిధులు ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా ఐదెకరాల పైన ఉన్నవారికి నగదు బదిలీ ప్రారంభించారు. 

Election Commission Appointed Ap New Dgp Harishkumar Gupta
ఏపీ కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా.. నియమించిన ‘ఈసీ’

సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తాను ఎన్నికల కమిషన్‌(ఈసీ) నియమించింది. సోమవారం(మే6) సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని  గుప్తాను ఈసీ ఆదేశించింది. ఇప్పటివరకు డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదివారం ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఏపీ చీఫ్‌ సెక్రటరీ(సీఎస్‌) ముగ్గురు సీనియర్‌ అధికారులతో జాబితాను పంపగా అందులో నుంచి హరీ‌ష్‌కుమార్‌గుప్తాను డీజీపీగా ఈసీ నియమించింది.

Lg Ordered Nia Probe On Kejriwal
కేజ్రీవాల్‌కు మరో షాక్‌.. ‘ఎల్‌జీ’ సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: ఎన్నికల వేళ అరవింద్‌ కేజ్రీవాల్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే లిక్కర్‌ కేసులో అరెస్టయి తీహార్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా షాకిచ్చారు.ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతిస్తున్న‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’అనే సంస్థ నుంచి ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ నిధులు స్వీకరించారనే అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణకు గవర్నర్‌ సోమవారం(మే6)  సిఫారసు చేశారు.ఆమ్‌ఆద్మీపార్టీకి సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థ నుంచి ఆప్‌కు 16 మిలియన్‌ డాలర్ల నిధులు వచ్చాయన్న ఫిర్యాదు ఆధారంగా ఎన్‌ఐఏ విచారణకు ఆదేశించినట్లు గవర్నర్‌ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును వరల్డ్‌ హిందూ ఫెడరేషన్‌ అశూ మోంగియా ఇచ్చినట్లు తెలిపారు. 

East and South India To Get Relief From Heatwave By Tomorrow Says IMD
హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ

ఢిల్లీ: దేశంలోని ప్రధాన నగరాల్లో ఎండ తీవ్రత రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. ప్రజలు భానుడి వేడి తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో భారత వాతావరణ శాఖ తీవ్రమైన వేడిగాలులు త్వరలో తగ్గుముఖం పట్టబోతున్నాయని ఓ శుభవార్త చెప్పింది.తూర్పు, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో వేడిగాలులు తగ్గుముఖం పట్టబోతున్నాయి. తూర్పు ప్రాంతానికి ఈ రోజులో ఉపశమనం లభించవచ్చు. దక్షిణాది రాష్ట్రాలు కూడా త్వరకలోనే వేడి తీవ్రతలు తగ్గుతాయని ఐఎండీ పేర్కొంది. మే 10 వరకు ఈ ప్రాంతాలలో ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.గత నెల నుంచి భారతదేశంలో పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వ్యాపించడంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువ అవుతున్నాయి. ఏప్రిల్ చివరి రోజున కోల్‌కతాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది, కోల్‌కతాలో దశాబ్దాలుగా ఇంతటి ఉష్ణోగ్రత నమోదు కాలేదు.రాబోయే ఐదు రోజుల్లో గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లను ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, ఈశాన్య రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మేఘాలయలోని ఖాసీ-జైంతియా హిల్స్ ప్రాంతంలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. 400 మందికి పైగా ప్రజలు నష్టపోయినట్లు.. మరో 48 గంటల పాటు ఈ వర్షం కొనసాగుతుందని వాతావరణ సఖ పేర్కొంది.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all