Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

TDP Leaders Attack Mangalagiri Man
చంద్రబాబు చెప్పినా.. ఏపీలో ఆగని టీడీపీ దాష్టీకం

అమరావతి, సాక్షి: నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించినట్లుంది టీడీపీ తీరు. కవ్వింపు చర్యలకు దిగొద్దని చంద్రబాబు నాయుడు చెబుతున్నా.. అదేదో అధిష్టానం ఇచ్చిన మొక్కుబడి హెచ్చరికగా భావిస్తూ రెచ్చిపోతున్నాయి టీడీపీ శ్రేణులు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులతో సహా ఎవరినీ వదలకుండా.. దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెదవడ్లపూడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త పట్ల టీడీపీ నాయకులు దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్త కృష్ణవేణి భర్త పాలేటి రాజ్‌కుమార్‌ను గ్రామానికి టీడీపీ నాయకుడు జవ్వాది కిరణ్‌చంద్‌ ఆదివారం తన అనుచరుల ద్వారా ఊరి మధ్యకు రప్పించాడు. అందరూ చూస్తుండగా దారుణంగా దాడి చేశారు. ఒంటిపై దుస్తులు విప్పి మరీ చితకబాదారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు లోకేశ్‌ ఫొటో ఉన్న ఫ్లెక్సీ చేత్తో పట్టుకోగా, విలపిస్తున్న రాజ్‌కుమార్‌ను దాని ఎదురుగా మోకాళ్లపై కూర్చోబెట్టారు. ‘నన్ను క్షమించండి.. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, ఇతరుల గురించి ఏరోజూ ఏం మాట్లాడను’ అని చెప్పించారు. అనంతరం రాజ్‌కుమార్‌.. తనను మన్నించమని టీడీపీ నేత కిరణ్‌చంద్‌ కాళ్లు పట్టుకున్నాడు. అయితే తన కాళ్లు కాదని.. ఫ్లెక్సీలో లోకేశ్‌ కాళ్లు కూడా పట్టుకోమని ఆ టీడీపీ నేత ఆదేశించాడు. బాధితుడు వారు చెప్పినట్లే చేశాడు. తన కుటుంబాన్ని క్షమించాలని పదే పదే విజ్ఞప్తి చేశాడు. పెద్దవడ్లపూడి నుంచి ఐదు వాహనాల్లో బొప్పుడి గ్రామానికి వెళ్లి ఆ భార్యాభర్తల పై దాడి చేసింది జవ్వాది కిరణ్ కుమార్, అతని అనుచరులుగా స్పష్టంగా తేలింది. అంతేకాదు.. బలవంతంగా కారులో ఎక్కించుకుని రాత్రంతా రాజకుమార్ పైన దాడి చేస్తూ తెల్లవారుజామున బోయిపాలెం రోడ్ లో వదిలేసి వెళ్లిపోయారు తెలుగుదేశం నాయకులు. తీవ్రంగా గాయపడిన రాజ్‌ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్‌ అయినప్పటికీ పోలీసుల నుంచి ఎలాంటి చర్యలూ లేకపోవడం గమనార్హం. అంతేకాదు రాజ్‌కుమార్‌ గతంలో చేసిన పోస్టులంటూ కొన్నింటిని వైరల్‌ చేస్తూ.. దాడిని సమర్థిస్తున్నారు టీడీపీ సానుభూతిపరులు.This is the situation in Andhra Pradesh!Heart-wrenching visuals from Mangalagiri, Andhra Pradesh.@JaiTDP leaders are targeting Dalits in the state who raise their voices against them. They are literally threatening the lives of Dalits, forcing them to apologize to @naralokesh… pic.twitter.com/6Id1s8Lwxt— YSR Congress Party (@YSRCParty) June 9, 2024

T20 World Cup 2024: Match Winning Spell By Bumrah Gives Team India Sensational Victory Against Pakistan
T20 WC 2024 IND VS PAK: మ్యాచ్‌ రూపురేఖల్ని మార్చేసిన బుమ్రా

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో నిన్న (జూన్‌ 9) జరిగిన ఉ‍త్కంఠ పోరులో టీమిండియా 6 పరుగుల స్వల్ప తేడాతో అద్భుత విజయం సాధించింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో బుమ్రా తన ప్రతాపాన్ని చూపి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు (బాబర్‌ ఆజమ్‌, మొహమ్మద్‌ రిజ్వాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌) తీశాడు. భారత్‌ విజయావకాశాలు పూర్తిగా అడుగంటిన వేళ బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ మ్యాచ్‌ రూపురేఖల్నే మార్చేసింది. ఆ ఓవర్‌లో బుమ్రా కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రమాదకారిగా కనిపించిన ఇఫ్తికార్‌ అహ్మద్‌ను ఔట్‌ చేశాడు. తన మ్యాచ్‌ విన్నింగ్‌ పెర్ఫార్మెన్స్‌ కారణంగా బుమ్రా వరుసగా రెండో మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేసి టీమిండియాను గెలిపించాడు. పాక్‌తో మ్యాచ్‌ విషయానికొస్తే.. 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్‌ చేసుకునే క్రమంలో భారత బౌలర్లు ఆదిలో విఫలమయ్యారు. 4 ఓవర్లలో పాక్‌ వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసి లక్ష్యంగా దిశగా సాగుతుండింది. ఈ దశలో (ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో) బుమ్రా తన అనుభవాన్నంతా రంగరించి పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ను ఔట్‌ చేశాడు. అనంతరం ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో మరోసారి బంతిని అందుకున్న బుమ్రా ఈ సారి అప్పటికే క్రీజ్‌లో సెట్‌ అయిపోయిన రిజ్వాన్‌ను ఔట్‌ను చేసి భారత శిబిరంలో గెలుపుపై ఆశలకు బీజం పోశాడు. ఈ మధ్యలో హార్దిక్‌ పాండ్యా (4-0-24-2) రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను రక్తి కట్టించగా.. బుమ్రా 19వ ఓవర్‌లో మరోసారి తన ప్రతాపాన్ని చూపాడు. పాక్‌ గెలుపు ఖాయమనుకున్న వేళ బుమ్రా పొదుపుగా బౌలింగ్‌ చేయడమే కాకుండా కీలకమైన ఇఫ్తికార్‌ వికెట్‌ తీసి పాక్‌ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. పాక్‌ గెలుపుకు చివరి ఓవర్‌లో 18 పరుగులు అవసరం కాగా.. అర్ష్‌దీప్‌ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. చివరి ఓవర్‌ నాలుగు, ఐదు బంతులకు నసీం షా బౌండరీలు బాదినప్పటికీ పాక్‌ ఓటమి అప్పటికే ఖరారైపోయింది. బుమ్రా ప్రదర్శన కారణంగా ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి, సూపర్‌-8 బెర్త్‌ ఖరారు చేసుకుంది. టీ20ల్లో భారత్‌ డిఫెండ్‌ చేసుకున్న అత్యల్ప స్కోర్‌ (120), టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీల్లో ఏ జట్టైనా డిఫెండ్‌ చేసుకున్న అత్యల్ప స్కోర్‌ ఇదే కావడం విశేషం. పాక్‌పై ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్‌ టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీల్లో దాయాదిపై తమ రికార్డును (7-1) మరింత మెరుగుపర్చుకుంది. గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనూ బుమ్రా పాక్‌పై ఇలాంటి మ్యాచ్‌ విన్నింగ్స్‌ పెర్ఫార్మెన్సే (2/19) కనబర్చి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్‌ చేసుకునే క్రమంలో బుమ్రాతో పాటు హార్దిక్‌ చూపిన పట్టుదలకు క్రికెట్‌ ప్రపంచం మొత్తం జేజేలు పలుకుతుంది. గెలుపు సునాయాసమనుకున్న మ్యాచ్‌లో ఓడటంతో పాక్‌ ఆటగాళ్లు, అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. పాక్‌పై గెలుపు అనంతరం న్యూయార్క్‌ మైదానంలో భారత అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. పాక్‌ పేసర్లు చెలరేగడంతో 19 ఓవర్లలో 119 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం భారత పేసర్లు సైతం విజృంభించి పాక్‌కు సాధ్యమైంది తమకెందుకు సాధ్యం కాదన్న రీతిలో ప్రతిఘటించి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించారు. భారత బౌలర్ల దెబ్బకు పాక్‌ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్‌ చేసినప్పటికీ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు చేతిలో ఇంకా 3 వికెట్లు ఉన్నాయి. బుమ్రా, హార్దిక్‌తో పాటు సిరాజ్‌ (4-0-19-0), అర్ష్‌దీప్‌ (4-0-31-1), అక్షర్‌ (2-0-11-1) కూడా రాణించారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్‌ (31) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు పంత్‌ (42) రాణించడంతో భారత్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పాక్‌ బౌలర్లలో నసీం షా, హరీస్‌ రౌఫ్‌ తలో 3 వికెట్లు, మొహమ్మద్‌ ఆమిర్‌ 2, షాహిన్‌ అఫ్రిది ఓ వికెట్‌ పడగొట్టారు. ఈ ఓటమితో ప్రస్తుత ప్రపంచకప్‌లో పాక్‌ సూపర్‌-8 అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే.

Can the old Modi be the new Modi
పాత మోదీపై ‘కొత్త మోదీ’ నెగ్గగలరా?

నరేంద్ర మోదీ నిస్సందేహంగా తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆయన ఊహించిన దానికి భిన్నమైన నాటకీయ పరిస్థితుల్లో ఆ రావటం అన్నది జరిగింది. కీలకమైన ప్రశ్న ఏమిటంటే – ప్రధాన మంత్రిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న పూర్తి భిన్నమైన పరిస్థితులను మోదీ స్వాభావికంగా, మానసికంగా ఎలా సర్దుబాటు చేసుకోగలరన్నదే! సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపేందుకు మిత్రపక్షాలను దగ్గర చేసుకోవటం, తరచూ వారికి లోబడి ఉండటం, నిరంతరం వారిని సంతుష్టులుగా ఉంచటం వంటి వాటికి ఆయన సంసిద్ధతను కలిగి ఉంటారా? గుజరాత్‌ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, భారత ప్రధానిగా 10 సంవత్సరాలు ఆయనకు ఇలా చేసే అవసరం లేకపోయింది. అందుకు భిన్నంగా పాత మోదీ ఇప్పుడు కొత్త మోదీ కాగలరా?మునుపు మీరీ నానుడిని నిస్సందేహంగా విని ఉంటారు. ఎంచేతనంటే ఇదొక కాదనలేని సత్యం. కొరుకుడు పడనివిగా కనిపించే పరిస్థితులను ఓటర్ల సమష్టి విజ్ఞత చక్కబెట్టగలగటమే ప్రజాస్వామ్యంలోని అద్భుతమైన విషయం. 1977లో ఇలా జరిగింది. మళ్లీ ఈ జూన్‌ 4న ఇది సంభవించింది. ఫలితాల్లో పై విధమైన అద్భుతాన్ని చాలామందే ఆశించినప్పటికీ, నిజానికి కొద్దిమందే అది కార్యరూపం దాల్చుతుందని భావించారు. నరేంద్ర మోదీ నిస్సందేహంగా తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆయన ఊహించిన దానికి భిన్నమైన నాటకీయ పరిస్థితుల్లో ఆ రావటం అన్నది జరిగింది. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత దారుణమైన ఫలితాలను ఈ ఎన్నికల్లో బీజేపీ చవి చూసింది. మెజారిటీకి 30కి పైగా తక్కువ సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి, విశ్వసనీయత ఎల్లప్పుడూ ప్రశ్నార్థకమైన మిత్ర పక్షాల మద్దతు అవసరం. గతంలో వారు బీజేపీని విడిచి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వారు మళ్లీ అలా చేస్తారనటాన్ని తోసిపుచ్చలేము. ఇది ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి పాలనపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇప్పటికైతే వాటికి మన దగ్గర సమాధానాలు లేవు. బహుశా మోదీకి కూడా అవి తెలియక పోవటానికే అవకాశం ఎక్కువ. కానీ ఆ ప్రశ్నలు ఆయన ఎదుర్కొనే సవాలును సూచిస్తాయి. ఆ ప్రశ్నల సమాధానాలు ఆయన గురించి ఎన్నో విషయాలు వెల్లడిస్తాయి. భారతదేశానికి ఎదురవనున్న ప్రమాదాలను, లేదంటే కనీసం సమస్యలను అవి బయటపెడతాయి. బీజేపీ 370 సీట్లు గెలుచుకుంటుందని మోదీ మొదటి నుంచి జోస్యం చెబుతూ వచ్చారు. ఐదో విడత పోలింగ్‌ అయ్యాక ‘ఎకనమిక్‌ టైమ్స్‌’తో మాట్లాడుతూ తమ పార్టీ అప్పటికే 272 మార్కును దాటేసిందని అన్నారు. కానీ, చివరికి అది 240 సీట్లతోనే ముగిసింది. మెజారిటీకి చాలా తక్కువ. కనుక, ఇవాళ ఆయన... కలవరపడే మనిషా లేక దులిపేసుకుని వెళ్లగలిగినంత మొద్దు చర్మం ఉన్నవారా?వారణాసిలో ఆయనకు వచ్చిన ఓట్ల మాటేమిటి? 2019లో ఆయనకు 4 లక్షల 80 వేల మెజారిటీ వచ్చింది. అదిప్పుడు కేవలం లక్షా ఐదు వేలకు పరిమితం అయింది. ‘‘గంగా మేరీ మా హై, ముఝే గంగా నే గోద్‌ లియా హై’’ (గంగానది నా మాతృమూర్తి. గంగమ్మ తల్లి నన్ను దత్తత తీసుకుంది) అని గత నెలలో చెప్పుకున్న ఒక మనిషి.. పూర్తి వ్యక్తిగతమైన ఈ తిరోగమనాన్ని ఎలా తీసుకుంటారు?ఏదేమైనా కీలకమైన ప్రశ్న ఏమిటంటే – ప్రధాన మంత్రిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న పూర్తి భిన్నమైన పరిస్థితులను మోదీ స్వాభావికంగా, మానసికంగా ఎలా సర్దుబాటు చేసుకోగలరు? లేదా, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపేందుకు మిత్రపక్షాలను దగ్గర చేసుకోవటం, తరచూ వారికి లోబడి ఉండటం, నిరంతరం వారిని సంతుష్టులుగా ఉంచటం వంటి వాటికి ఆయన సంసిద్ధంగా కలిగి ఉన్నారా?గుర్తు చేసుకోండి. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, భారత ప్రధానిగా 10 సంవత్సరాలు ఆయనకు ఇలా చేసే అవసరం లేకపోయింది. బదులుగా ఆయన అభీష్టం ప్రతి ఒక్కరికీ ఆదేశం అయింది. ఆయన కేంద్రీకృత ప్రభుత్వాన్ని నడిపారు. ప్రధాని కార్యాలయం కోరినట్లే మంత్రులు నడుచుకున్నారు. ఒక్కరు కూడా ఇదేమిటి అని అడిగే సాహసం చేయలేదు.పార్లమెంటు, జ్యుడీషియరీ, మీడియా వంటి స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థల పట్ల ఆయన వైఖరి గురించి ఏమిటి? శ్రీ ‘పాత మోదీ’ పార్లమెంటును పలుమార్లు విస్మరించారు. న్యాయశాఖలోని నియామకాలను నిలిపివేశారు. మీడియాను తీసిపడేశారు. కానీ ఇప్పుడు శ్రీ ‘బలహీన మోదీ’ మరింతగా ఏకాభిప్రాయ విధానాన్ని అవలంబించవలసిన అవసరం ఉంటుంది. లేదంటే తన మిత్రపక్షాలకు ఆయన కోపం తెప్పించవచ్చు. తన సంకీర్ణాన్ని ప్రమాదంలోకి నెట్టేసుకోవచ్చు. అలా చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటారా? ఇక విమర్శలకు, అసమ్మతికి ఆయన స్పందించే ధోరణి ఒకటి ఉంటుంది. శ్రీ పాత మోదీకి ఆ రెండూ నచ్చవన్నది రహస్యమేం కాదు. కనుక శ్రీ కొత్త మోదీ సహించటాన్ని, సమ్మతించటాన్ని మాత్రమే కాదు... రెండింటితో కలిసి ముందుకు సాగటాన్ని కూడా నేర్చుకోవాలి. అది అంత సులభమేనా?మరికొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇటీవల ఆయన చేసిన ప్రకటనలకు సంబంధించినవి. వాటిని ప్రజలు మరిచిపోయి ఉంటారని ఆయన అనుకోవచ్చు. ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ వాతావరణంలో కాకపోవచ్చు కానీ, మొత్తానికైతే నేననుకోవటం అవి గుర్తుండే ఉంటాయని! మొదటిగా, ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన కనుక నవ్వటాన్ని, తేలిగ్గా తీసుకోవటాన్ని అలవరచుకోకపోతే అవి ఆయన్ని వెంటాడగలిగినవి. కానీ ఆయన అలా చేయగలరా? తనది దైవాంశ జననం అని ఆయన చెప్పుకోవడంపై అవహేళనలు ఎదురైతే ఆయన నవ్వుతూ, వాటిని పట్టించుకోకుండా ఉండగలరా? నా మాట గుర్తుపెట్టుకోండి. అవహేళనలు ఉంటాయి. అది జరిగినప్పుడు ఆయన కోపం తెచ్చుకుంటారా?మరీ ముఖ్యంగా, ముస్లింలను దయ్యాలుగా చూపించకుండా ఉండలేకపోవటాన్ని నిలువరించుకోగలరా? ముస్లింలను చొరబాటు దారులుగా; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి రిజర్వేషన్‌లను లాక్కుని లబ్ధి పొందేవారిగా చూపే తదుపరి సందర్భాలలో మిత్రపక్షాలు అందుకు అంగీకరించే అవకాశం లేదు. కానీ అలాంటి భాష తన నుంచి స్వభావసిద్ధంగా బయటికి రాకుండా తనను తాను సంబాళించుకోగలరా? ఇది 2001 నుండి ఆయన వాక్చాతుర్యంలోని ఒక భాగమని గుర్తుంచుకోండి. నిజానికి నేను లేవనెత్తిన ప్రతిదాన్నీ ఒకే ఒక సాధారణ ప్రశ్నగా కుదించవచ్చు: శ్రీ పాత మోదీ ఇప్పుడు శ్రీ కొత్త మోదీ కాగలరా? ఆయన ప్రభుత్వం దాని పైనే ఆధారపడి ఉంటుంది. మన పాలన దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా! కానీ ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? - వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌- కరణ్‌ థాపర్‌

Terror Attack On Pilgrims In J and K PM Modi Assures All Help Leaders Condemn
కశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం: ప్రధాని మోదీ సహా ఖండించిన నేతలు.. 10కి చేరిన మృతుల సంఖ్య

శ్రీనగర్‌: జమ్ము-కశ్మీర్‌ రియాసి జిల్లాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. జమ్ములోని రాయసి జిల్లాలో ఉన్న శివఖోడి గుహను సందర్శించుకొని తిగిగి వస్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విచక్షణా రహితంగా కాల్పులు తెగపడ్డారు. ఆదివారం సాయంత్రం 6.10 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. 53 మంది యాత్రికులు ఉన్న బస్సు శివ్‌ ఖోరి నుంచి కాట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయం వైళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో డ్రైవర్ గాయపడటంతో బస్సు పదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.#WATCH | Security heightened in Jammu & Kashmir's Reasi.Morning visuals from the area where a bus carrying pilgrims was attacked by terrorists led to the loss of 10 lives. pic.twitter.com/9i93KKbhzc— ANI (@ANI) June 10, 2024 రాజౌరి, పూంచ్‌న, రియాసి ప్రాంతాల్లో దాగి ఉ‍న్న ఉగ్రవాదులపై దాడి చేసేందుకు.. పోలీసులు, ఇండియన్‌ ఆర్మీ , సీఆర్‌పీఎఫ్‌ జాయింట్‌ ఆపరేషన్‌​ ఏర్పాటు చేశారు. యాత్రికులపై ఉగ్రవాదుల దాడిన జమ్మూకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ మనోజ్‌ సిన్హా ‘ఎక్స్‌’ వేదికగా తీవ్రంగా ఖండిచారు.‘ప్రధాని మోదీ దాడి ఘటపై స్పందించారు. ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షించాలన్నారు. బాధితులు, వారి కుటుంబాలకు సాయం అందిచాలని మోదీ ఆదేశించారు. ఈ దాడికి పాల్పడినవారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. గాయపడినవారికి మెడికల్‌ సాయం అందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. మృతి చెందిన వారికి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా’ అని అన్నారు.దాడిపై స్పందించిన రాష్ట్రపతి‘జమ్ము కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన నన్ను కలచివేసింది. ఈ ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు, బాధితులకు నా సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్‌లో స్పందించారు.I am anguished by the terrorist attack on a bus carrying pilgrims in Reasi district of Jammu and Kashmir. This dastardly act is a crime against humanity, and must be condemned in the strongest words. The nation stands with the families of the victims. I pray for the speedy…— President of India (@rashtrapatibhvn) June 9, 2024 కేంద్రమంత్రి అమిత్‌ షా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ‘జమ్ము కశ్మీర్ ఎల్జీ, డీజీపీ ద్వారా ఉగ్రదాడి పరిస్థితిని తెలుసుకున్నా. ఈ దాడికి పాల్పడినవారిని వదిపెట్టము. వారిపై కచ్చింతంగా చర్యలు తీసుకుంటాం. మృతిచెందినవారి కుటుంబాలుకు సానుభూతి తెలుపుతున్నా’అని అమిత్‌ షా ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.ఉగ్రవాద దాడి పరికిపంద చర్య అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా ఖండిచారు. ‘చాలా విషాదకరమైన ఘటన. ఈ దాడితో జమ్ము కశ్మీర్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయే తెలస్తోంది’అని ఎక్స్‌లో స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్రంగా ఖండిచారు.जम्मू-कश्मीर के रियासी ज़िले में, शिवखोड़ी मंदिर से तीर्थयात्रियों को ले जा रही बस पर हुआ कायरतापूर्ण आतंकी हमला अत्यंत दुखद है।यह शर्मनाक घटना जम्मू-कश्मीर के चिंताजनक सुरक्षा हालातों की असली तस्वीर है।मैं सभी शोक संतप्त परिजनों को अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं और…— Rahul Gandhi (@RahulGandhi) June 9, 2024యాత్రికుల బస్సుపై ఉగ్రవాదలు దాడి చేయటం ఇది రెండోసారి. 2017లో అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 7 మంది మృతి చెందగా.. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Telangana police arrested Hawkeye app hacker
‘పోలీస్‌’ హ్యాకర్‌..20 ఏళ్ల విద్యార్థి

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ పోలీస్‌యాప్‌లు హాక్‌ఐ, టీఎస్‌కాప్‌లను హ్యాక్‌ చేసిన నిందితుడిని ఢిల్లీలో శనివారం అరెస్టు చేశారు. నిందితుడు యూపీలోని ఝాన్సీకి చెందిన విద్యార్థి జతిన్‌కుమార్‌(20) అని డీజీపీ రవిగుప్తా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీస్‌ యాప్‌ల హ్యాకింగ్‌తో ఏ వినియోగదారుడికి సంబంధించిన సున్నితమైన, ఆర్థిక పరమైన సమాచారం లీక్‌ కాలేదని డీజీపీ స్పష్టం చేశారు. నిందితుడిని ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించినట్టు తెలిపారు. హాక్‌ఐ యాప్‌ హ్యాక్‌ అయినట్టు గుర్తించిన వెంటనే తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగిందన్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. హ్యాకర్‌ పోలీస్‌ యాప్‌లలోని సమాచారాన్ని పబ్లిక్‌ ప్లాట్‌పారంలలో అమ్మకానికి పెట్టినట్టు ఉంచిన పోస్టులను ఆధారంగా చేసుకొని దర్యాప్తులో ముందుకు వెళ్లారని, పక్కా సమాచారంతో టీజీసీఎస్‌బీ అధికారులు ఢిల్లీకి వెళ్లి, అక్కడ హ్యాకర్‌ జతిన్‌కుమార్‌ను గుర్తించి అరెస్టు చేశారని డీజీపీ తెలిపారు. నిందితుడికి సైబర్‌ నేరచరిత్ర ఉందని, గతంలో ఇలాంటి హ్యాకింగ్‌ కేసులో ప్రమేయం ఉందన్నారు.న్యూఢిల్లీలోని స్పెషల్‌ సెల్‌ ద్వారక పోలీస్సే్టషన్‌లో క్రైం. నంబర్‌ 291/2023లో ఇంతకముందు అక్కడి పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. నిందితుడు ఆధార్‌ కార్డులకు సంబంధించిన డేటా, ఇతర ఏజెన్సీలకు సంబంధించిన క్లిష్టమైన సమాచారాన్ని కూడా లీక్‌ చేశారని డీజీపీ వెల్లడించారు. తెలంగాణ పోలీస్‌యాప్‌ల డేటా చోరీ కేసులో ప్రమేయమున్న అదనపు నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో గుర్తింపు హ్యాకింగ్‌ సమాచారం అందిన వెంటనే టీజీసీఎస్‌బీ అధికారులు రంగంలోకి దిగారని, అధునాతన సాధనాలను ఉపయోగించి, హ్యాకర్‌ జాడను విజయవంతంగా తెలుసుకోగలిగారని డీజీపీ రవిగుప్తా తెలిపారు. హ్యాకర్‌ పోలీస్‌ యాప్‌ల నుంచి చోరీ చేసిన వివరాలను databreachforum.st లో పోస్ట్‌ చేశాడని, చోరీ చేసిన డేటాను ు150 డాలర్లకు అమ్మకానికి పెట్టాడని పేర్కొన్నారు. ఆసక్తిగల కొనుగోలుదారులు హాక్‌ ఐ ,టీఎస్‌కాప్‌ డేటాను కొనేందుకు తనను సంప్రదించవచ్చని టెలిగ్రామ్‌ ఐడీలు Adm1nfr1end , Adm1nfr1 ends ఇచ్చాడని తెలిపారు. సోషల్‌ ఇంజినీరింగ్‌ పద్ధతులను ఉపయోగించి నిందితుడి వివరాలు తెలుసుకున్నామన్నారు. పౌరుల సమాచారం సురక్షితం హాక్‌ఐ, టీఎస్‌కాప్‌ యాప్‌లు హ్యాకింగ్‌ గురైనా పౌరులందరి సమాచారం సురక్షితంగానే ఉందని, ఎలాంటి ఆందోళన వద్దని డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. డేటా లీక్‌ అయినట్టు మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవం కాదని పేర్కొన్నారు. హాక్‌ఐ యాప్‌లో డేటా రిపోజిటరీలో భాగంగా మొబైల్‌ నంబర్లు, చిరునామాలు, ఈమెయిల్‌ ఐడీల వంటి వినియోగదారు సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటుందని డీజీపీ తెలిపారు. అయితే బలహీనమైన పాస్‌వర్డ్‌ల కారణంగా హ్యాకర్‌ హాక్‌ఐ డేటాలోకి యాక్సెస్‌ పొంది ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు తెలిపారు.టీఎస్‌కాప్‌ యాప్‌ అనేది పూర్తిగా పోలీస్‌ విధుల్లో అంతర్గత పనుల కోసం వాడతామని తెలిపారు. ఇందులో సందర్శకులు, హోటళ్ల డేటా సేకరిస్తారన్నది అవాస్తవం అని డీజీపీ తెలిపారు. టీస్‌కాప్‌ ద్వారా థర్డ్‌పారీ్టలకు డేటా వెళ్లే ఆస్కారమే లేదన్నారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ ఎస్‌ఎంస్‌ సర్వర్‌ యూఆర్‌ఎల్‌ విషయంలో, చొరబాటుదారుడి క్లెయిమ్‌లు పూర్తిగా అబద్ధమని, ఈ యూఆర్‌ఎల్‌ ఏప్రిల్‌ 2022 నుంచి పనిచేయలేదని స్పష్టం చేశారు. హ్యాక్‌ అయినట్టు చెబుతున్న యూఆర్‌ఎల్‌ను హైదరాబాద్‌ సిటీ పోలీసులు చాలా కాలం ముందు నిలిపివేశారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు అన్ని పోలీసు అంతర్గత, బాహ్య నెట్‌వర్క్‌లు, వెబ్, మొబైల్‌ అప్లికేషన్లు, క్లౌడ్‌ , ఎండ్‌ పాయింట్‌లలో ఏవైనా సైబర్‌ సెక్యూరిటీ లోపాలు ఉంటే గుర్తించి పరిష్కరిస్తామని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషయంలో ఎవరైనా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే వారిపై పోలీస్‌శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని డీజీపీ హెచ్చరించారు. పోలీస్‌యాప్‌ల హ్యాకింగ్‌ కేసును టీజీసీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖాగోయల్‌ పర్యవేక్షణలో రికార్డు సమయంలోనే అధికారులు ఛేదించారన్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన ఎస్పీలు భాస్కరన్, విశ్వజిత్‌ కంపాటి, డీఎస్పీలు, కేవీఎం ప్రసాద్, ఏ.సంపత్, ఇన్‌స్పెక్టర్‌ ఆశిషిరెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ సురే‹Ùలను డీజీపీ రవిగుప్తా ప్రత్యేకంగా అభినందించారు.

Imran Khan Hul Chul At India vs Pakistan T20 WC Match New York Video
పాక్‌-భారత్‌ మ్యాచ్‌లో అనూహ్య పరిణామం

న్యూయార్క్‌: దాయాది దేశాల మధ్య పోరులో మరోసారి భారత్‌దే పైచేయి అయ్యింది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టీమిండియా విజయం సాధించింది. అయితే.. మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో జరిగిన ఓ అనూహ్య పరిణామం అందరి దృష్టిని ఆకర్షించింది.మ్యాచ్‌ జరుగుతున్న టైంలో స్టేడియంపై ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎగిరింది. అది ఓ బ్యానర్ ను ప్రదర్శిస్తూ వెళ్లింది. ఆ బ్యానర్ పై ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి (Release Imran Khan) అని రాసి ఉంది. మరోవైపు మ్యాచ్‌ జరుగుతున్న టైంలో స్టేడియంలో కొందరు ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటోలతో జిందాబాద్‌ నినాదాలు చేయడమూ కనిపించింది.A plane with the message "Release Imran Khan" flies over the stadium during the India vs. Pakistan T20 World Cup match. #Imrankhan #T20WC24 #viral #BreakingPedia pic.twitter.com/OHlCuQUFRZ— Breakingpedia (@breakingpediaBP) June 10, 2024 Credits: Breakingpedia VIDEO CREDITS: TOP POSTఅయితే.. పాక్‌-భారత్‌ మ్యాచ్‌కు గట్టి భద్రత ఉంటుందని న్యూయార్క్‌ పోలీసులు ఇదివరకే ప్రకటించారు. ఈ తరుణంలో ఆ విమానాన్ని స్టేడియం మీద ఎగరడానికి ఎలా అనుమతించారు?. దానిని నడిపిందెవరు?. దీనంతటి వెనుక ఉంది ఎవరు? ఇలాంటి అంశాలపై అక్కడి అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Horoscope Today: Rasi Phalalu On 10-06-2024 In Telugu
Rasi Phalalu: ఈ రాశివారికి దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.చవితి సా.4.48 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: పుష్యమి రా.10.35 వరకు, తదుపరి ఆశ్రేష, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.17 వరకు, తదుపరి ప.3.02 నుండి 3.54 వరకు, అమృతఘడియలు: ప.3.55 నుండి 5.36 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.29. మేషం: కుటుంబంలో వివాదాలు, సమస్యలు. ధనవ్యయం. శ్రమా«ధిక్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం.వృషభం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.మిథునం: మిత్రులతో అకారణంగా వివాదాలు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఇంటాబయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.కర్కాటకం: త్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగయత్నాలలో అనుకూలత. ఆలయాలు సందర్శిస్తారు.సింహం: ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.కన్య: పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఉద్యోగయోగం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.తుల: ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి. సంఘంలో కీర్తి దక్కుతుంది. ఆహ్వానాలు రాగలవు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.వృశ్చికం: దూరప్రయాణాలు. రుణఒత్తిడులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. నిర్ణయాలలో మార్చుకుంటారు. అదనపు ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.ధనుస్సు: శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.మకరం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.కుంభం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాల్లో విజయం. పరిచయాలు పెరుగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మీనం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

Five thousand is the only number that should be banned in Telugu literature
అత్యున్నత ఐదువేలు

దాదాపు నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో ఒక పదకొండు వేల మంది తలా వంద రూపాయలు ఇస్తే ఎంతవుతుంది? పోనీ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల నుంచి, ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజల నుంచి కలిపి వేయిమంది తలా వంద రూపాయలు ఇస్తే ఎంతవుతుంది? లెక్క తరువాత మాట్లాడుదాం.‘సినిమా రంగంలో రచయితకు అత్యంత తక్కువగా డబ్బు ఇవ్వాలని నిర్మాతకు ఎందుకనిపిస్తుందంటే అతను ఖాళీ చేతులతో వస్తాడు కనుక’ అని రచయిత సౌదా అంటాడు. నిజమే. మేకప్‌ వేసేవాడు పెద్ద కిట్‌ తెస్తాడు. విగ్గులకు డబ్బు అడుగుతాడు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ బోలెడన్ని బట్టలు కొనాలి కనుక బిల్లు ఎక్కువ. సినిమాటోగ్రాఫర్‌ కెమెరాలు, లెన్సులు, క్రేన్లు, భారీ పరికరాలు... ఇన్ని వాడుతున్నాడంటే అతనికి ఎంతిచ్చినా తక్కువే. కళా దర్శకుడు వేసే సెట్‌ కనిపిస్తుంది.మ్యూజిక్‌ డైరెక్టర్‌ దగ్గర వాద్యాల బృందం కనిపిస్తుంది. మరి రచయిత దగ్గరో? ఒక తెల్లకాగితం, పెన్ను. ఐదు రూపాయల పెన్ను జేబులో పెట్టుకుని వచ్చేవాడికి, కాగితం మీద అప్పటికప్పుడు రాసిచ్చి వెళ్లేవాడికి డబ్బు ఇవ్వడం అవసరమా అని నిర్మాతకేం ఖర్మ, ఎవరికైనా అనిపిస్తుంది. చిత్రమేమిటంటే సినిమా ‘సీన్ పేపర్‌’ నుంచే మొదలవుతుంది. దానిని రచయితే రాయాలి.తన దగ్గరకు వచ్చిన ఆసామీకి టీ ఇచ్చి, అతను తాగి కప్పు దించే లోపలే పాట రాసి ఇచ్చాడట ఆత్రేయ. ‘ఐదు నిమిషాల్లో రాశారు. దీనికింత డబ్బు ఇవ్వడం అవసరమా’ అన్నాడట ఆసామీ లాల్చీ జేబులో చేయి పెట్టి నసుగుతూ. ఆత్రేయ మొహమాటపడక డబ్బు అందుకుని ‘ఈ ఐదు నిమిషాల వెనుక ముప్పై ఏళ్ల తపస్సు ఉంది నాయనా’ అన్నాడట. రచయిత చేతికి పని చెప్పే మెదడు ఉందే, అది రాతకు తయారుగా ఉందే, ఆ మెదడు అలా తయారు కావడానికి రచయిత ఏమేమి చేసి ఉంటాడు? ఎన్ని రాత్రులను పుస్తకాలు చదువుతూ తగలెట్టి ఉంటాడు? ఎన్ని తావుల్లో తిరుగుతూ మనుషుల్లో పాత్రలను వెతుకుతూ వారి చెమట, కన్నీరు, రక్తపు చారికలు పూసుకుని ఉంటాడు? వారి సద్బుద్ధుల చందనంలో, దుర్బుద్ధుల దుర్గంధంలో వారే తానై బతికి ఉంటాడు? ఆ రాత్రి ఉదయించిన సంపూర్ణ చంద్రుడి రంగును సరైన మాటల్లో వర్ణించడానికి ఎన్ని గుప్పుల పొగను తాగి ఊపిరిని నలుపు చేసుకుని ఉంటాడు? ఒక గొప్ప వాక్యం కోసం ఎన్ని వందల కాగితాలను చించి ఉంటాడు? ఒక కావ్యజన్మ కోసం ఎన్ని ఊహా పరిష్వంగాలలో పదేపదే సొమ్మసిల్లి ఉంటాడు?లాల్చీ, పైజామా, జేబులో పెన్నుతో అతడు ఎదురు పడినప్పుడు– అవశ్యం– అతని మేధాశ్రమ ఏదీ కనిపించదు. కనుక కలం పట్టి అతను రాసే రాతకు అత్యల్ప రుసుము ఇవ్వవచ్చనే ఆనవాయితీ ఎవరైనా పాటించవచ్చు. కథకు, కవితకు 500 రూపాయల పారితోషికం ఇవ్వొచ్చు. ఇవ్వక ఎగ్గొట్ట వచ్చు. పదుగురిని అడిగో, పి.ఎఫ్‌ బద్దలు కొట్టో పుస్తకం వేస్తే అమ్మిన ప్రతుల సొమ్ము అమ్మకందారు ఇవ్వొచ్చు. ఇవ్వక పోవచ్చు. పబ్లిషర్లు ఎవరైనా ఉంటే వారు రాయల్టీ ఇవ్వొచ్చు. ఇవ్వకపోనూవచ్చు. ఒకసారి రచయిత పుస్తకం వేశాక వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్‌ తదితరాలలో ఉండే సాహితీ సూక్ష్మక్రిములు అది తమ సొంతంగా భావించి వందలాది పి.డి.ఎఫ్‌లు పంచొచ్చు... పుస్తకం కొనకనే చదువుకోవచ్చు.ఇవన్నీ ఇలాగుంటే తెలుగునాట సాహితీకారులను ప్రోత్సహించడానికి ‘ఐదు వేలు’ అనే అచ్చొచ్చిన నంబర్‌ ఒకటి ఉంది. పాతిక, ముప్పై ఏళ్ల క్రితం మొదలైన ‘ఐదు వేల రూపాయల’ అవార్డు/బహుమతి తెలుగు సాహితీజాతికి లక్ష్మణరేఖ. నేటికీ, 2024లో కూడా, ‘చార్జీలతో కలిపి 5000 రూపాయల’ అవార్డు ప్రకటిస్తే అదే పదివేలనుకుని భార్యాపిల్లలను వెంటబెట్టుకువెళ్లే దుఃస్థితి తెలుగు రచయితది. తెలుగు నేలన ఎక్కడ పట్టినా నేటికీ ‘మొదటి బహుమతి 5 వేలు, రెండవ బహుమతి 3 వేలు, మూడవ బహుమతి వేయి రూపాయల’ దిక్కుమాలిన కథాపోటీలు. వాటికి రాసే సీనియర్‌ రచయితలు! సాహితీ అకాడెమీ పురస్కార గ్రహీతలు! వెయ్యి రూపాయల లిస్ట్‌లో వీరి పేర్లు! రూపాయి ఊసెత్తక తలపాగా, ముఖం తుడవను పనికిరాని శాలువాతో ఇచ్చే అవార్డులు కొల్ల. వీటికి తోడు 116 డాలర్లు మొహానకొట్టే ఎన్ .ఆర్‌.ఐ వితరణశీలత ఏమని చెప్పుట? ఇంటికి చెద పట్టిందని ఫోన్ చేస్తే ఐదు వేలకు తక్కువగా ఎవరూ రావడం లేదు. గంట కార్పెంటర్‌ పని చేస్తే రెండు వేలు నిలబెట్టి వసూలు చేస్తాడు. ప్లంబర్‌ వచ్చి వాష్‌బేసిన్ వైపు చూడాలంటే కనీస వెల వెయ్యి. కాని తెలుగు రచయిత మాత్రం తన దశాబ్దాల తపస్సుకు ‘బాబూ... ఒక్క ఐదు వేలు’ అంటున్నాడు. తెలుగు సాహితీవరణంలో నిషేధించాల్సిన ఒకే ఒక నంబర్‌– ఐదు వేలు!140 కోట్ల భారతీయులలో పదకొండు వేల మంది వంద రూపాయలు ఇస్తే పదకొండు లక్షలు అవుతాయి. అది మన జ్ఞానపీట్అ వార్డు నగదు బహుమతి! 9 కోట్ల తెలుగువారిలో వెయ్యి మంది వంద రూపాయలు ఇస్తే లక్ష అవుతుంది. అది సాహిత్య అకాడెమీ నగదు బహుమతి. జీవితంలో ఒకసారి పొందే వీటి నగదులే ఇలా ఉంటే ఐదు వేల అవార్డుకు వంకలేల అంటారా? ఆ అత్యున్నత అంకెతో అత్యల్పంగా బతికేద్దాం!

State students who have excelled in JEE Advanced results
అడ్వాన్స్‌డ్‌లో ఏపీ మెరుపులు

సాక్షి, అమరావతి : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం ఐఐటీ మద్రాస్‌ విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో టాప్‌–10లో నలుగురు ఏపీ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. వంద ర్యాంకుల్లో 20 మంది తెలుగు రాష్ట్రానికి చెందిన వాళ్లే ఉన్నారు. మొత్తంగా అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 12 వేల మంది వరకు ఉన్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్‌కు చెందిన భోగలపల్లి సందేశ్‌ 360కి గాను 338 మార్కులతో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. అనంతపురం జిల్లాకు చెందిన పుట్టి కుశాల్‌ కుమార్‌ 334 మార్కులతో 5వ ర్యాంకు, కర్నూలు జిల్లాకు చెందిన కోడూరు తేజేశ్వర్‌ 331 మార్కులతో 8వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అల్లడబోయిన ఎస్‌ఎస్‌డీబీ సిద్విక్‌ సుహాస్‌ 329 మార్కులతో 10వ ర్యాంకుతో మెరిశారు. ఏపీకి చెందిన మత బాలాదిత్య (ఐఐటీ భువనేశ్వర్‌ జోన్‌)కు 11వ ర్యాంకు రాగా, ఓబీసీ కేటగిరీలో మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ టాపర్‌గా ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్‌ లహోటి 355 మార్కులతో సత్తా చాటాడు. తొలి పది ర్యాంకుల్లో ఐఐటీ రూర్కీ జోన్‌కు ఒకటి, ఐఐటీ ఢిల్లీ జోన్‌కు రెండు, ఐఐటీ బాంబే జోన్‌కు మూడు, అత్యధికంగా ఐఐటీ మద్రాస్‌ జోన్‌కు నాలుగు ర్యాంకులు దక్కడం విశేషం. ఇక ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేష్‌ కుమార్‌ పటేల్‌ జాతీయ స్థాయిలో 332 మార్కులతో 7వ ర్యాంకు సాధించడమే కాకుండా బాలికల విభాగంలో టాపర్‌గా నిలిచింది. గతేడాది తొలి పది స్థానాల్లో ఆరుగురు హైదరాబాద్‌ జోన్‌కు చెందిన విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఆ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. పెరిగిన ఉత్తీర్ణత దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఏటా 2.50 లక్షల మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది 1,86,584 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,80,200 మంది పరీక్షకు హాజరవ్వగా 48,248 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇది 2023లో 43,773గా ఉంది. అడ్వాన్స్‌డ్‌ ఉత్తీర్ణతలో బాలికల సంఖ్య కూడా పెరిగింది. 2023లో 7,509 మంది ఉంటే తాజాగా 7,964 మంది ఉత్తీర్ణులయ్యారు. 331 మంది ఓవర్‌సీస్‌ ఇండియన్స్‌ పరీక్ష రాస్తే 179 మంది, 158 విదేశీ విద్యార్థులు పరీక్షకు హాజరైతే కేవలం 7 మంది మాత్రమే అర్హత సాధించడం గమనార్హం.నేటి నుంచి జోసా కౌన్సెలింగ్‌ ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్‌ఐటీలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) సోమవారం (నేడు) నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించనుంది. విద్యార్థులకు అవగాహన నిమిత్తం 17వ తేదీ వరకు మాక్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. మొత్తం ఐదు దశల్లో కౌన్సెలింగ్‌ను పూర్తి చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పిస్తోంది. అనంతరం 20న తొలి దశ, 27న రెండో దశ, జూలై 4న మూడో దశ, జూలై 10న నాల్గవ దశ, జూలై 17న తుది విడత సీట్లను కేటాయించనుంది. జూలై 23న మిగిలిన సీట్లు ఉంటే వాటికి కూడా కౌన్సెలింగ్‌ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది.నా లక్ష్యం ఐఏఎస్‌మాది నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్‌ గ్రామం. అమ్మ వి.రాజేశ్వరి, నాన్న బి.రామ సుబ్బారెడ్డి.. ఇద్దరూ ప్రభు­త్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 10/10 పాయింట్లు వచ్చాయి. ఇంటర్‌లో 987 మార్కు­లు సాధించాను. జేఈఈ మెయిన్స్‌లో 99.99 పర్సెంటెల్‌తో ఆల్‌ ఇండియా లెవెల్‌లో 252వ ర్యాంకు వచ్చింది. జెఈఈ అడ్వాన్స్‌డ్‌లో 368 మార్కులకు 338 వచ్చాయి. ఓపెన్‌ క్యాటగిరీలో ఆలిండియాలో 3వ ర్యాంక్, సౌత్‌ ఇండియాలో మొదటి ర్యాంక్‌ రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి. ముంబయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదివి, సివిల్స్‌ పరీక్ష రాసి ఐఏఎస్‌ కావాలనేది నా లక్ష్యం. – బొగ్గులపల్లి సందేశ్, 3వ ర్యాంకు ముందస్తు ప్రణాళికతో చదివా మాది కర్నూలు జిల్లా కృష్ణగిరి గ్రామం. అమ్మానాన్నలు కృష్ణవేణి, శేఖర్‌.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 570, ఇంటర్‌లో 981 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్‌లో ఆల్‌ ఇండియా లెవెల్‌లో 83వ ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్‌డ్‌లో ఆల్‌ ఇండియా లెవెల్‌లో 8వ ర్యాంకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఐఐటీ ముంబైలో సీఎస్‌ఈ చదవాలని ఉంది. ముందస్తు ప్రణాళికతో చదవడం వల్లే ఉత్తమ ర్యాంకు సాధించాను. – కె.తేజేశ్వర్, 8వ ర్యాంకుపెరిగిన కటాఫ్‌ మార్కులుజేఈఈ అడ్వాన్స్‌డ్‌ అర్హులుగా పరిగణనలోకి తీసుకునేందుకు ఈసారి కటాఫ్‌ మార్కులు పెరిగాయి. గతేడాది జనరల్‌ ర్యాంకు కటాఫ్‌ 86 ఉండగా ఇప్పుడు 109కి పెరిగింది. ఓబీసీ 98, ఈడబ్ల్యూఎస్‌ 98, ఎస్సీ, ఎస్టీ, వివిధ పీడబ్ల్యూడీ విభాగాల్లో 54గా ఉండటం గమనార్హం. 2017 తర్వాత భారీ స్థాయిలో కటాఫ్‌ మార్కులు పెరిగాయి. సత్తా చాటిన లారీ డ్రైవర్‌ కుమారుడునరసన్నపేట: ఒక సాధారణ లారీ డ్రైవర్‌ కుమారుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో 803వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 118 వ ర్యాంకు సాధించాడు. నరసన్నపేట మండలం దూకులపాడుకు చెందిన అల్లు ప్రసాదరావు కుమారుడు రామలింగన్నాయుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అదరగొట్టాడు. పేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థి మొదటి నుంచి పట్టుదలతో చదివేవాడు. ఆరో తరగతి నుంచి వెన్నెలవలస నవోదయలో చదువుకున్నాడు. తండ్రి ప్రసాదరావు లారీ డ్రైవర్‌ అయినప్పటికీ, కుమారుడికి చదువుపై ఉన్న మక్కువను గుర్తించి ప్రోత్సహించారు. విద్యార్థి తల్లి సుగుణ గృహిణి. కోర్సు పూర్తి చేసి సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతానని రామలింగన్నాయుడు తెలిపారు.

Ananya Panday Request Movie Chance With Vijay
ఆ హీరోతో ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తున్న లైగర్‌ బ్యూటీ

అనుకున్నవన్నీ జరగవు.. అయినా అనుకోవడం మానుకోలేం. అలాగే మనసులోని కోరికను వ్యక్తం చేయడం కూడా తప్పు కాదు. నటి అనన్య పాండే కూడా తన మనసులోని కోరికను ఇలానే వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్లామరస్‌ నటిగా రాణిస్తున్న బాలీవుడ్‌ బ్యూటీ ఈమె. ఈమె ఇంతకుముందు స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2, కాలీ పీవీ, డ్రీమ్‌ గర్ల్‌ 2, తెలుగు చిత్రం లైగర్‌ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ప్రస్తుతం హిందీ లో కంట్రోల్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. సీనియర్‌ రాజకీయ నాయకుడు, న్యాయవాది సి శంకరన్‌ నాయర్‌ బయోపిక్‌లోనూ నటిస్తున్నారు. సహజంగానే ఛాలెంజింగ్‌ పాత్రల్లో నటించాలని కోరుకునే నటి ఈమె. ఇప్పటికే తెలుగులో లైగర్‌ చిత్రంలో నటించిన ఈమె ఇప్పుడు కోలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టీవ్‌గా ఉండే అనన్య పాండే ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ కోలీవుడ్‌లో నటుడు విజయ్‌ సరసన నటించాలనే కోరిక ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఆమె కోరిక నెరవేరే చాన్సే లేదనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయ పార్టీని నెలకొల్పిన నటుడు విజయ్‌ త్వరలో రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈయన ప్రస్తుతం గోట్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. దీని తర్వాత తన 69వ చిత్రంలో నటించి ఆ తర్వాత నటనకు స్వస్తి పలకబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే విజయ్‌ నటించే చివరి చిత్రంలో అనన్య పాండే అవకాశాన్ని ఎదురుచూస్తున్నారేమో. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆమె తన మనసులోని కోరికను వ్యక్తం చేశారా? అని అనిపిస్తుంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement