Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu
ఏపీ ఫలితాలపై సజ్జల కీలక వ్యాఖ్యలు

సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని.. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువే గెలుస్తామని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటింగ్‌ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు.‘‘చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం​ లేదు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్‌ క్యాంపెన్‌ చేశారు. జగన్‌ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కుప్పంలోనూ వైఎస్సార్‌సీపీ గెలవబోతోంది. కుట్రపూరితంగా కేంద్రం సహాయంతో కొందరు అధికారులను తప్పించారు. ల్యాండ్‌ టైట్లింగ్‌పై చంద్రబాబు అర్థంలేని ఆరోపణలు చేశారు. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం​ లేదు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘పోలీసులు పెద్దారెడ్డి ఇంట్లోని సీసీటీవీలు ధ్వంసం చేయడం అన్యాయం. పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు సీసీ కెమెరాలు ధ్వంసం చేయడమేంటి?. దాడిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం’’ అని సజ్జల చెప్పారు.‘‘కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతాయని అనుకోవడం లేదు.. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటాం. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. ఇప్పటికేనీ ఈసీ తప్పు సరిదిద్దుకుంటే మంచింది’’ అని సజ్జల హితవు పలికారు.మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. సాంప్రదాయ ఓటు బ్యాంక్ మావైపు ఉంది. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న తీరు చూస్తుంటే మళ్ళీ విజయం సాధిస్తాం. పొలింగ్ పర్సంటేజ్ పెరిగితే మేము ఓడిపోతామన్న భ్రమలో టీడీపీ ఉంది. మాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవు. ప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదు. వివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా. సీఎం జగన్‌ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు. నన్ను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారు. టీడీపీ గెలవడానికి ఉన్న ఒక్క కారణమైనా చెప్పగలరా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.‘‘చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పలేక పోతున్నారు. టీడీపీ కూటమి వలనే పోలింగ్ లో హింస జరిగింది. వారు చెప్పిన అధికారులే హింసకు కారణమయ్యారు. ఇప్పుడు వాళ్లనే ఈసీ తొలగించి చర్యలు తీసుకుంది. ఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందరు ఉన్నారు. పోలింగ్ కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారు. అల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లే. వీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లే. ఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్‌కు లేఖలు రాస్తున్నారు. రికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు రాస్తున్నారు’’ అని సజ్జల ధ్వజమెత్తారు.‘‘తాడిపత్రిలో పెద్ధారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ గురించి ఎన్నికల తరువాత టీడీపీ ఎందుకు మాట్లాడటం మానేసింది?. ల్యాండ్ టైటలింగ్ అమలు చేయాలని నీతి అయోగ్ చెప్పింది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలి. టీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుంది. ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాం. ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాం. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాల్లోనూ గెలుస్తాం. జగన్ పాలనలో లబ్ధి పొందని వర్గాలు, న్యాయం జరగని కుటుంబం అంటూ ఏమీ లేవు. అందరికీ మేలు చేసినందునే భారీ సీట్లతో గెలవబోతున్నాం’’ అని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.

KSR Comments On TDP Attacks In Elections
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ

ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన తీరు చూస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది. ఢిల్లీలో కూర్చున్న ఈసీ పెద్దలు తమ ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాల ఫలితమే రెండు, మూడు రోజుల పాటు జరిగిన హింస అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి వచ్చిన తర్వాత పోలీసు, పరిపాలన వ్యవస్థను తన చేతిలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వారు స్వతంత్రంగా కాకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు కోరిన రీతిలో పక్షపాతంగా వ్యవహరించారు. కూటమి కోరిన అధికారులను కోరిన చోట అప్పాయింట్ చేసింది. వారు కూటమికి విధేయతతో వ్యవహరించి అభాసు పాలయ్యారు. అంతిమంగా సస్పెన్షన్లు, బదిలీలకు గురి కావల్సి వచ్చింది.దీపక్ మిశ్ర అనే రిటైర్డ్ అధికారిని అబ్జర్వర్‌గా నియమిస్తే, ఆయన టీడీపీకి సంబంధించినవారు ఇచ్చిన విందులో పాల్గొన్నారట. ఆ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు బహిరంగంగానే చెప్పారు. ఇది ఎన్నికల సంఘానికి ఎంత సిగ్గుచేటైన విషయం. దీపక్ మిశ్ర ఎక్కడా గొడవలు జరగకుండా చూడాల్సింది పోయి తెలుగుదేశంకు అనుకూలంగా పనిచేయాలని పోలీసులపై ఒత్తిడి చేశారట. అలాగే సస్పెండైన ఒక పోలీసు ఉన్నతాదికారి టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని ఆయా నియోజకవర్గాలలో పోలీసులను ప్రభావితం చేయడానికి కృషి చేశారట.ఇవన్ని వింటుంటే పెత్తందార్లుగా ముద్రపడ్డ చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్‌ కల్యాణ్‌లు ఎన్నికలలో గెలుపుకోసం ఎన్ని కుట్రలు చేయడానికైనా వెనుకాడలేదని అర్ధం అవుతుంది. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో విద్వంసం సృష్టించడం, అది కనిపించకుండా ఉండాలని సీసీ కెమెరాలు పగులకొట్టడం వంటి సన్నివేశాలు చూసిన తర్వాత పోలీసు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం ఎలా ఉంటుంది? మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పోన్ చేస్తేనే కనీసం సమాధానం ఇవ్వని పోలీసు అధికారులను విశ్వసించడం ఎలా? దీని ఫలితంగానే పల్నాడు ప్రాంతంలో బలహీనవర్గాల ఇళ్లపై దాడులు, అనేక మంది గుడులలో, ఇతరత్రా తలదాచుకకోవలసి వచ్చింది. ఆ మహిళలు రోదించిన తీరుచూస్తే ఎవరికైనా బాద కలుగుతుంది.గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, దానిని బూతద్దంలో చూపుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నించింది. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా యజమానులు ఫ్యాక్షనిస్టులుగా మారి ప్రతి ఘటనకు రాజకీయ రంగు పులిమి, వైఎస్సార్‌సీపీకి అంటగడుతూ నీచమైన కధనాలు ఇస్తూ వచ్చారు. వారి అండ చూసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడు లోకేష్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లు నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు. పోలీసులను బెదిరించేవారు. అంగళ్లు, పుంగనూరుల వద్ద చంద్రబాబు రెచ్చగొట్టడంతో టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం, పోలీసు వాహనాన్ని కూడా వారు దగ్దం చేయడం, ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అంత చేసిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్‌లు అప్పటి చిత్తూరు ఎస్పి మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆయన పేరు రెడ్ బుక్‌లో రాసుకున్నామని, తాము అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత నీ సంగతి చూస్తామంటూ బెదిరించేవారు.ఇలా అనేక మంది అధికారులను తరచూ భయపెట్టే యత్నం చేసినా, దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా ఈ అంశంపై తగు నిర్ణయాలు చేయలేదు. దాంతో టీడీపీ, జనసేన నేతలు చెలరేగిపోతూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనంలోకి వెళ్లడంతో వాటికి పోటీగా ఏమి చెప్పినా, తమకు మద్దతు లబించదని భావించిన చంద్రబాబు, పవన్‌లు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యకు ఏదో ప్రమాదం వాటిల్లిందన్న ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ష్ట్రంలో సైకో పాలన సాగుతోందని పిచ్చి-పిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని యత్నించారు. పవన్‌ అయితే ఏకంగా ముప్పైవేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని, వలంటీర్లే దానికి బాధ్యులంటూ నీచమైన విమర్శలు కూడా చేశారు. నిప్పుకు వాయువు తోడైనట్లు, రామోజీరావు, రాధాకృష్ణలు ఉన్నవి, లేనివి కల్పించి గాలివార్తలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించడానికి యత్నించారు.ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవపడితే దానికి రాజకీయం పులిమి వీరు రాష్ట్రం అంతటా ప్రచారం చేసేవారు. వెంటనే చంద్రబాబో, లేక ఇతర టీడీపీ నేతలు అక్కడకు వెళ్లి హడావుడి చేసే యత్నం చేసేవారు. ఈ రకంగా గత ఐదేళ్లుగా ఏపీ ఇమేజీని దెబ్బతీయడానికి వీరు గట్టి కృషి చేశారు. ఏదైనా ఘటన జరిగితే రెండువైపులా ఉన్న వాదనలు, వాస్తవ పరిస్థితిని వివరిస్తూ వార్తలు ఇస్తే తప్పుకాదు. అలా కాకుండా టీడీపీ వారిని భుజాన వేసుకుని దారుణ కధనాలు ఇవ్వడం ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజల దృష్టిలో పరువు కోల్పోయాయి. అయినా ఎన్నికల సమయం వచ్చేసరికి వీరు మరింత రెచ్చిపోయారు. ప్రభుత్వపరంగా, లేదా వైఎస్సార్‌సీపీ పరంగా ఏవైనా తప్పులు ఉంటే చెప్పవచ్చు. కాని.. వైఎస్సార్‌సీపీని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవన్నట్లుగా వీరు ప్రవర్తించారు.టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే గెలుపు అవకాశాలు లేవన్న స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్‌ను తమ ట్రాప్‌లోకి తెచ్చుకుని తదుపరి బీజేపీని కాళ్లావేళ్లపడి పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తుకు ఎందుకు తహతహలాడుతున్నదన్నదానిపై అప్పుడే అంతా ఊహించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం అండతో జగన్ ప్రబుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగాన్ని భయపెట్టి తమదారిలోకి తెచ్చుకోవడానికి, వీరు పన్నాగం పన్నారు. అందుకు తగ్గట్లుగానే బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఈ పని పురమాయించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కోడ్ అమలుకు వస్తుంది కనుక సహజంగానే ఈసీకే విశేషాధికారాలు ఉంటాయి. దానిని తమకు అడ్వాంటేజ్‌గా మార్చుకున్నారు.ఎన్నికల సంఘం అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు కావల్సిన అదికారులను నియమించుకునే ప్రక్రియ ఆరంబించారు. పురందేశ్వరి ఏకంగా 22 మంది అధికారుల జాబితాను ఇచ్చి వారందరిని తొలగించి, తాము సూచించినవారిని నియమించాలని కోరడం సంచలనం అయింది. బహుశా దేశ చరిత్రలో ఇంతత ఘోరమైన లేఖ ఎవరూ రాసి ఉండరు. అలా ఉత్తరం రాసినందుకు సంబంధిత రాజకీయ నేతను మందలించవలసిన ఎన్నికల సంఘం ఆమె కోరిన చందంగానే అధికారులను బదిలీ చేయడం ఆరంభించింది. పలువురు జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను, ఇతర చిన్న అధికారులను కూడా బదిలీ చేయించారు. చివరికి డీజీపీని కూడా వదలిపెట్టలేదు. సిఎస్ ను కూడా బదిలీ చేయాలని గట్టిగానే కోరారు కాని ఎందుకో ఆ ఒక్క బదిలీ ఆగింది.ఈ బదిలీ అయిన వారిలో ఎవరికి ఫలానా తప్పు చేస్తున్నట్లు ఎక్కడా ఈసీ తెలపలేదు. కనీసం నోటీసు ఇవ్వలేదు. నేరుగా బీజేపీ నేతలు ఏమి చెబితే అదే చేశారన్న భావన ఏర్పడింది. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి గట్టిగా ఉండే అధికారులపై చెడరాశాయి. వారందరిని బదిలీ చేయాలని ఒకసారి, బదిలీ చేస్తున్నారని మరోసారి రాసేవారు. వారు రాయడం, టీడీపీ, బీజేపీలు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, మరుక్షణమే ఈసీ స్పందించడం మామూలు అయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఎక్కడా పెద్దగా విమర్ధలు చేయలేదు. 2019లో కేంద్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ పార్టీ నేతల ఇళ్లలో సోదాలు జరిపితేనే చంద్రబాబు రెచ్చిపోయి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసేవారు. ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేది కార్యాలయానికి వెళ్లి తగాదా ఆడారు.. ధర్నా చేశారు.. కాని జగన్ చాలా హుందాగా వ్యవహరించారు. రాజకీయ విమర్శలు చేశారే తప్ప ఎక్కడా స్థాయిని తగ్గించుకోలేదు.టీడీపీ, బీజేపీలు తాము కోరినట్లుగానే అధికారులను నియమించుకుని పెత్తనం చేశారు. అయినా జగన్ ఎక్కడా అదికారులను ఎవరిని తప్పుపట్టలేదు. జనాన్ని నమ్ముకుని తన ప్రచారం తాను చేసుకున్నారు. పోలింగ్ నాడు బలహీనవర్గాలు, పేద వర్గాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో టీడీపీ వర్గాలు ఆందోళన చెందాయి. కొంత ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న పల్నాడు వంటి ప్రాంతాలలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ కూటమి నేతలు ప్రయత్నించారు. అందువల్లే వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. లేదా బాగా ఆలస్యంగా స్పందించారు. అయినా ఆ రోజు అంతా చాలావరకు ప్రశాంతంగా ముగిసింది. తదుపరి పరిస్థితిని సమీక్షించుకున్న టీడీపీ క్యాడర్ ఓటమి భయమో మరేదో కారణం కాని, ఒక్కసారిగా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారనుకున్నవారిపై దాడులు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రిచంద్రగిరి మొదలైన చోట్ల వీరు నానా రభస చేశారు.ఎన్నికల సంఘం పనికట్టుకుని ఎక్కడైతే అధికారులను మార్చిందో అక్కడే ఈ గొడవలు జరగడంతో కుట్ర ఏమిటో బోధపడింది. ప్రత్యేకించి కొన్ని గ్రామాలలో దాడులు అమానుషంగా ఉన్నాయి. ఆ గ్రామాలలో మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సన్నివేశాలు కనిపించాయి. వీటిని మాత్రం ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా కప్పిపుచ్చి వైఎస్సార్‌సీపీనే దాడులు చేసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. ఒకవేళ వైఎస్సార్‌సీపీ వారిది కూడా ఏదైనా తప్పు ఉంటే రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా వీరు వార్తలు కవర్ చేస్తూ తామూ ఫ్యాక్షనిస్టులమేనని రామోజీ, రాధాకృష్ణలు రుజువు చేసుకుంటున్నారు. ఎన్నికలు వారం రోజులు ఉండగా, ఇక రెండు రోజులలో జరుగుతాయనగా కూడా కొందరు పోలీస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పలు చోట్ల తమకు కావల్సినవారిని కూటమి నియమింప చేసుకోగలిగింది. కొత్తగా వచ్చిన అధికారులకు అన్ని విషయాలపై అవగాహన తక్కువగా ఉంటటుంది. దానికి తోడు తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించడానికి సిద్దమై వచ్చినందున ఆయా ఘటనలపై సరిగా స్పందించలేదు. అందువల్లే పల్నాడు ప్రాంతంలో గొడవలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. బూత్ స్వాధీనం వంటివి జరిగినా చూసి, చూడనట్లు పోయారట.నిజానికి ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధికారులను నియమించినా ఉపయోగం ఉండదు. ఆ విషయం తెలిసి కూడా ఇలా వ్యవహరించడం అంటే కచ్చితంగా కూటమి పెత్తందార్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరిల ఒత్తిడికి ఈసీ లొంగిందని అర్దం. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే ఇంటిలో రచ్చ సృష్టించారు. అది మరీ ఘోరంగా ఉంది. అలాగే జెసి ప్రభాకరరెడ్డి ఇంటిలో కొందరు పోలీసులు గొడవ చేశారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. ఎక్కడ ఎవరు చేసినా ఖండించవలసిందే. చర్య తీసుకోవల్సిందే. తాడిపత్రిలో ఏ స్థాయికి గొడవలు వెళ్లాయంటే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేసే యత్నం వరకు. ఇది మంచిది కాదు. నిజంగానే ఈనాడు మీడియా రాసినట్లు టీడీపీ నేతలే ఘర్షణలలో దెబ్బతిని ఉన్నా, వైఎస్సార్‌సీపీవారు దాడులు చేశారన్న నిర్దిష్ట సమాచారం ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ పాటికి అక్కడకు వెళ్లి మరింత అగ్గి రాజేసేవారు. ఆయన ఎక్కడకు వెళ్లలేదు.పెత్తందార్ల కొమ్ము కాస్తున్న కూటమి నేతలు గాయపడ్డ పేదలను పలకరించడానికి ఎందుకు వెళతారు! ఇప్పుడు ఈసీ ఏపీ ఛీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచి వివరణ కోరినా ఏమి ప్రయోజనం ఉంటుంది. చేసిందంతా చేసి, తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి ఈసీ ఇలా వ్యవహరిస్తున్నదన్న అనుమానం వస్తోంది. కేవలం ఎన్నికల సంఘం కొత్త అధికారులను నియమించిన చోటే ఈ ఘర్షణలు జరిగాయని, దీనికి ఈసీనే బాధ్యత వహించాలని ఈ అధికారులు వివరణ ఇచ్చి ఉండాలి. లేదా ఎన్నికల కమిషన్ తో ఎందుకు తలనొప్పిలే అనుకుంటే వారి వాదన ఏదో చెప్పి వచ్చి ఉండాలి. అందుకే పలువురు అధికారులపై కమిషన్ చర్చ తీసుకోక తప్పలేదు. ఏది ఏమైనా స్వతంత్రంగా ఉండవలసిన ఎన్నికల సంఘం కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగడం, శాంతి భద్రతలకు వారి చర్యలే విఘాతం కల్గించడం వంటివి ఏ మాత్రం సమర్దనీయం కాదు. దీనివల్ల ఈసీ విశ్వసనీయతపై మచ్చ పడిందని చెప్పక తప్పదు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Nirmala Sitharaman Slams Arvind Kejriwal In Swati Maliwal Row
మలీవాల్‌పై దాడి.. కేజ్రీవాల్‌ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సహయకుడు దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మలీవాల్‌పై దాడిని ఆప్‌ సైతం ధృవీకరించింది. నిందితుడు బిభవ్‌ కుమార్‌పై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాగా కేజ్రీవాల్‌ సొంత ఇంట్లో ఈ దాడి జరగడం గమనార్హంఈ ఘటనపై కేజ్రీవాల్‌ను మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. దీంతో సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఆయన మౌనం కూడా ఎంతో చెస్తోందని, జైలు నుంచి విడుదలయ్యాక సీఎంగా కంటే గూండాలా వ్యవహరిస్తున్నారని బీజేపీ మండిపడింది. తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ స్పందించారు.తన నివాసంలోనే స్వాతి మలీవాల్‌పై జరిగిన దాడిపై కేజ్రీవాల్‌ మౌనం వహించడం దిగ్బ్రాంతికి సిగ్గుచేటని అన్నారు. అంతేగాక లక్నోలో నిందితుడైన బిభవ్‌ కుమార్‌తో సీఎం సిగ్గులేకుండా తిరుగుతున్నాడని ఆరోపించారు. ఇందుకు కేజ్రీవాల్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహిళా కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన ఆమెకు ఈ పరిస్థితి ఎదురుకావడం దారుణమని అన్నారు.‘సొంత నివాసంలోనే పార్టీ ఎంపీపై దాడి జరిగితే.. కేజ్రీవాల్‌ మాట్లాడకపోవడం షాక్‌కు గురిచేస్తోంది. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పాలి. లక్నో పర్యటనలో సీఎం వెంట నిందితుడు బిభవ్‌ కూడా ఉన్నాడని నాకు తెలిసింది. ఆమెకు ఎదురైన పరిస్థితి సిగ్గుచేటు. ఫిర్యాదు చేయడానికి రోజుల సమయం పట్టిందంటే.. ఆమెపై ఒత్తిడి ఉందని అనిపిస్తోంది’ అని సీతారామన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు.చదవండి: ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్‌ సంచలన ఆరోపణలు

Elon Musk claims aliens have never visited Earth
ఏలియన్స్‌ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్‌ ఏమన్నారంటే?

ఏలియన్స్‌.. ఎప్పుడైనా.. ఎవరికైనా ఇంట్రెస్ట్‌ కలిగించే టాపిక్‌. ఎలియన్స్‌ ఉన్నాయా..? లేవా అనేది ఎప్పటికీ తేలని ప్రశ్నే..! అయితే.. ఇప్పుడు ఇదే విషయంపై స్పందించారు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌. ఎలియన్స్‌ లేవని తేల్చేశారు. ఏలియన్స్‌ నిజంగానే ఉన్నాయా..? అవి భూమ్మిదకు వచ్చాయా..? అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే UFOలు ఏలియన్స్‌వేనా..? ఇవి ప్రశ్నలు కాదు..! కొన్ని దశాబ్దాలుగా అందరినీ వేధిస్తున్న అనుమానాలు..! ఏలియన్స్‌ ఉన్నాయని.. మనుషులతో కాంటాక్ట్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఏదో ఒక సమయంలో కచ్చితంగా భూమిపైకి వస్తాయని నమ్మేవారు కొందరైతే.. అసలు ఏలియన్సే లేవని ఈజీగా కొట్టిపారేసేవారు మరికొందరు. ఇప్పుడు ఈ సెకండ్‌ లిస్ట్‌లోకి యాడ్‌ అయ్యారు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌. ఏలియన్స్‌ ఉన్నాయనేందుకు అసలు ఆధారాలే లేవని తేల్చిపారేశారు.ఎలాన్‌ మస్క్‌..! ఈ జనరేషన్‌కు పరిచయం అవసరం లేని పేరు..! తన మాటలు.. తన చేతలు.. తన ప్రయోగాలు.. అన్ని సెన్సేషనే..! ఎప్పుడూ వార్తల్లో ఉండే ఎలాన్‌ మస్క్‌.. కొత్త ప్రయోగాలు చేస్తూ.. కొత్త కొత్త టెక్నాలజీలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టును చేపడుతూనే ఉంటారు. ఈ టెక్నాలజీలో కచ్చితంగా తన మార్క్‌ను చూపించిన ఘనత ఎలాన్‌ మస్క్‌కే దక్కింది. టెస్లా పేరుతో తయారు చేసిన కార్లు ఎంత పెద్ద హిట్టో.. మనిషి బ్రెయిన్‌లో చిప్‌ పెట్టేందుకు చేసిన ప్రయోగమూ అంతే సెన్సేషన్‌గా నిలిచింది. ఇదొక్కటే కాదు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..! స్పేస్‌ ఎక్స్‌ పేరుతో శాటిలైట్‌లు లాంచ్‌ చేసినా.. సోషల్‌ మీడియా సెన్సేషన్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసి ఎక్స్‌ అని పేరు మార్చినా అది.. ఎలాన్‌ మస్క్‌కే సాధ్యం.అలాంటి ఇలాన్‌ మస్క్‌.. ఏలియన్స్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి.. ఏలియన్స్‌ లేవని మస్క్‌ తేల్చిపారేశారు. ఏలియన్స్‌ ఉనికిపై తనకు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. HOW TO SAVE THE HUMANS పేరుతో జరిగిన డిబేట్‌లో పాల్గొన్న మస్క్‌.. ఏలియన్స్‌ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలియన్స్‌ అనే జీవులు ఏవీ భూమిపై కాలు పెట్టలేదని తేల్చేశారు. కక్షలో స్పేస్‌ ఎక్స్‌కు చెందిన వేలాది బ్రాడ్‌ బ్యాండ్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లు ఉన్నాయని.. కానీ ఎప్పుడూ ఏలియన్స్‌ ఉనికి కనిపించలేదని తన వాదనలు వినిపించారు. అయితే.. ఎవరైనా ఆధారాలు చూపిస్తే మాత్రం ఏలియన్స్‌పై ప్రయోగాలు చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అయితే.. ఆషామాషీగా కాకుండా.. సీరియస్‌ ఆధారాలతోనే రావాలని చెప్పారు. కానీ.. ఎవరూ అలాంటి ఆధారాలు తీసుకురాలేరని.. ఏలియన్స్‌ ఉనికే లేదని చెప్పేశారు.మరి నిజంగానే ఏలియన్స్‌ లేవా..? లేక మనషులకు దూరంగా ఉన్నాయా..? ఏలియన్స్‌ ఉంటే.. ఎప్పటికైనా భూమిపైకి వచ్చి మనుషులకు కనిపిస్తాయా..? ఎలన్‌ మస్క్‌ అవన్నీ ఉత్తమాటలే అని కొట్టిపారేసినా మిలియన్‌ డాలర్‌ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి..!

Doctor Saves Boy Lifes With CPR In Vijayawada
విద్యుత్‌ షాక్‌తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్‌ చేసి ప్రాణం పోసిన డాక్టర్‌

విజయవాడ: ఓ మహిళా డాక్టర్‌ మానవత్వం చాటుకున్నారు. విజయవాడలో ఓ బాలుడు విద్యుత్‌ షాక్‌కు గురై గుండె ఆగిన క్రమంలో సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు మహిళా డాక్టర్‌వివరాల్లోకి వెళితే.. నగరంలోని అయ్యప్పనగర్‌లో సాయి అనే ఆరేళ్ల బాలుడు రోడ్డుపై ఆడుకుంటూ విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. దాంతో ఆ బాలుడి గుండె ఆగి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న డాక్టర్‌ రవళి ఆ ఘటనను చూశారు. ఆ బాలుడి పరిస్థితిని గమనించిన ఆమె.. ఉన్నపళంగా సీపీఆర్‌ చేశారు. కొన్ని నిమిషాల పాటు సీపీఆర్‌ చేసిన అనంతరం ఆ బాలుడు స్పృహలోకి వచ్చాడు. దాంతో ఆ బాలుడు తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడున్న వారంతా డాక్టర్‌ చేసిన పెద్ద సాయానికి, ఆమె పెద్ద మనసుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ షాక్‌తో ఆగిన ఆరేళ్ల బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించిన డాక్డర్విజయవాడ - అయ్యప్పనగర్‌లో సాయి(6) అనే బాలుడు రోడ్డు మీద విద్యుత్ షాక్ తగిలి గుండె ఆగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.అటుగా వెళ్తున్న డాక్టర్ రవళి చూసి బాలుడికి సీపీఆర్ చేసి బాలుడి ప్రాణాలు… pic.twitter.com/qeLQ2tJRbv— Telugu Scribe (@TeluguScribe) May 17, 2024

AP BJP Goes Silent After Elections With Fear Of defeat
ఓటమి భయం.. ఏపీ బీజేపీలో నిశ్శబ్ద వాతావరణం

ఏపీ బీజేపీలో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు రాష్ట్రంలోని సీనియర్ నాయకులు ఎందుకు ప్రచారం చేయలేదు? సీనియర్లంతా ప్రచారానికి దూరం కావడానికి కారణం ఏంటి? ఈ విషయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలి పాత్ర ఏంటి? ఓటింగ్ ముగిసిన తర్వాత పార్టీ నాయకులు మీడియా ముందుకు ఎందుకు రాలేదు? పోలింగ్ తర్వాత ఏపీ బీజేపీలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడటానికి కారణం ఏంటి?బీజేపీ సీనియర్లు జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ధువర్ధన్ రెడ్డి లాంటి వాళ్లు ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. సీనియర్ నేతలంతా జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తి కారణంగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా, నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్ లాంటి అగ్రనేతలు ప్రచారం చేసినపుడు మాత్రం ఆయా సభలలో సీనియర్లు హాజరు వేయించుకుని వెళ్లిపోయారు. ఇలా సొంత పార్టీకి చెందిన సీనియర్లే ప్రచారానికి, పోల్ మేనేజ్ మెంట్ కి దూరంగా ఉండటం కూడా రాష్ట్ర బీజేపీని పూర్తిగా ఆత్మ రక్షణలో పడేసింది. ఇలా వరుస తప్పిదాలతో అవకాశాలున్న చోట కూడా బీజేపీ విజయావకాశాలని జార విడుచుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు కమలం పోటీ చేసిన చోట టీడీపీ, జనసేన ఓటు పూర్తిగా బదిలీ కాకపోవడం కూడా కొంప ముంచిందంటున్నారు.తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీలో చేరి పోటీ చేసిన చోట కాకుండా మిగిలిన స్ధానాలలో టీడీపీ నుంచి పూర్తిగా సహకారం కరువైదంటున్నారు. ఇక టీడీపీ నుంచి చివరి నిమిషంలో బీజేపీలో చేరి టికెట్‌ తెచ్చుకుని పోటీ చేసిన స్ధానాలలో ఒరిజనల్ బీజేపీ నేతలెవరూ కూడా మనస్పూర్తిగా పనిచేయలేదని, సొంత పార్టీ జెండాను ఇతర పార్టీ నేతలు లాక్కోవడాన్ని జీర్ణించుకోలేకపోయారని అంటున్నారు. ఇందుకోసమే కమల నేతల మధ్య అనైక్యతా రాగం, ఇతర పార్టీ నేతలు టిక్కెట్లు తెచ్చుకున్నచోట వారితో కలవలేకపోవడం, ఇవన్నీ పోలింగ్ రోజు తీవ్ర ప్రభావాన్నే చూపాయంటున్నారు. దీంతో పాటు చంద్రబాబు అబద్దపు అలవికాని హామీలతో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా కొంత నష్టం చేసిందంటున్నారు. ఈ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు ప్రచారం చేసినా ఓటర్లని ఆకట్టుకోలేకపోయామంటున్నారు.మేనిఫెస్టో విడుదల సమయంలో చంద్రబాబు ఇస్తున్న మేనిఫెస్టోని కనీసం చేతితో పట్టుకోవడానికి కూడా బీజేపీ ఇన్ చార్జి ఇష్టపడలేదు. అయితే టడీపీతో జతకట్టి బరిలోకి దిగిన తర్వాత ఆ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని ప్రకటించడం కూటమి మధ్య ఉన్న విభేదాలని బట్టబయలు చేసిందేగాని..ఎన్నికల సమయంలో ఓట్లని కురిపించలేకపోయిందని నేతలు భావిస్తున్నారు. దీంతో పాటు కొన్ని పార్లమెంట్ స్థానాల్లో క్రాస్ ఓటింగ్ భయం కూడా బిజెపిని వెన్నాడుతోంది. పోలింగ్‌కు ముందు పోల్ మేనేజ్ మెంట్ విషయంలో బిజెపి చేతులెత్తేయడం కూడా మైనస్‌గా మారిందంటున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం ఎంిపీ స్ధానాలతో పాటు మూడు లేదా నాలుగు అసెంబ్లీ స్ధానాలు తమకు గ్యారంటీ అని భావించిన బీజేపీ పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రం అంచనాలకు రాలేకపోతున్నారు. అధికార పార్టీపై ఆశించిన స్ధాయిలో వ్యతిరేకత కనిపించకపోవడం, మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేయడంతో బీజేపీ ని ఓటమి భయం వెన్నాడుతోంది. పోలింగ్ ముగిసి లెక్కలు వేసుకున్న తర్వాత కనీసం ఒక్క సీటు కూడా గెలవలేమనే ఆందోళన బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే పోలింగ్ ముగిసిన తర్వాత బీజేపీ నాయకుల్లో ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి ఫలానా సీట్లలో మేము గెలుస్తున్నామని ధైర్యంగా చెప్పలేకపోయారంటున్నారు. ఓటమి భయంతోనే ఏపీ బీజేపీ నైరాశ్యంతో కూడిన నిశ్శబ్ధం ఆవరించిందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

AP Elections 2024: May 17th Politics Latest News Updates In Telugu
May 17th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 17th AP Elections 2024 News Political Updates04:16 PM, May 17th, 2024మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే: : బొత్సటార్గెట్‌ 175 దగ్గరకు వస్తాంతొందరపాటు నియమాకాల వల్లే హింసాత్మక ఘటనలుఎక్కడ అధికారులను మార్చారో అక్కడే హింసాత్మక ఘటనలుఅధికారులను నియమించేటప్పుడు వాళ్ల పూర్వాపరాలు తెలుసుకోవాలిరాజకీయ కక్షతో హింసను ప్రేరేపిస్తున్నారుమాపై నిందలు వేయడం సరికాదు 04:13 PM, May 17th, 2024జనసేన డీలా.. నేతల్లో కనిపించని ఉత్సాహంపోలింగ్ తర్వాత నేతలలో నిరుత్సాహంపిఠాపురంలోనూ పవన్ గెలుపుపై అనుమానాలే....జనసేనకి దెబ్బకొట్టిన క్రాస్ ఓటింగ్ఎన్నికల తర్వాత పవన్ గప్ చుప్పోలింగ్ తర్వాత ప్యాకప్ చెప్పేసిన పవన్ఆదినుంచి పవన్ వైఖరే పార్టీకి కొంపముంచిందంటున్న నేతలుటీడీపీ కోసం సీట్లు వదులుకోవడమే పార్టీకి చేటుచేసిందనే వ్యాఖ్యలుకాపులు మినహా మిగిలిన సామాజిక వర్గాల ఓట్లని ఆకర్షించలేకపోయామని విశ్లేషణగోదావరి జిల్లాలలోనూ ఆశించిన ఫలితాలు కష్టమేనంటున్న నేతలుకూటమి నుంచి అందని సహకారంటీడీపీ ఓటు పూర్తిగా బదిలీ కాలేదనే అనుమానాలు 03:30 PM, May 17th, 2024విజయవాడఎన్నికల సమయంలో టీడీపీ అల్లర్లపై సిట్ ఏర్పాటుపై సీఎస్‌ కసరత్తుముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను పరిశీలిస్తున్న ప్రభుత్వంరవి ప్రకాష్, వినీత్ బ్రిజ్ లాల్, పిహెచ్‌డీ రామకృష్ణలలో ఒకరి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసే అవకాశం.రెండు రోజుల్లోగా పల్నాడు, అనంతపురం, తిరుపతి అల్లర్ల పై నివేదిక ఇవ్వనున్న సిట్.ఎన్నికల అనంతరం హింసలో భాగస్వామ్యం అయిన పోలీస్ అధికారులు, పోలీసుపైన నివేదిక ఇవ్వనున్న సిట్.03:00 PM, May 17th, 2024తాడేపల్లి :కుట్ర ప్రకారమే అల్లర్లు జరిగాయి: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డిప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో పాల్గొనటం చంద్రబాబుకు ఇష్టం లేదు.రౌడీయిజం చేసి, రిగ్గింగులు చేసి గెలుపొందాలనుకోవటం దారుణం.అరాచకాలకు వత్తాసు పలికిన ఇద్దరు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు పడింది.చంద్రబాబు ట్రాప్ లో పడి పోలీసు అధికారులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు.తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంట్లో సీసీకెమెరాలను పోలీసులే పగలకొట్టటం దేనికి సంకేతం?ఆధారాలు లేకుండా చేసే కుట్ర ఎవరు చేశారో తేలాలి.నరసరావుపేటలో ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి ఇంటిపై పట్టపగలే దాడి చేశారు.అక్కడి పోలీసు అధికారుల ప్రోద్బలంతోనే ఈ దాడులు జరిగాయి.టీడీపీకి మద్దతు ఇచ్చిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.జూన్‌ 4న వైఎస్‌ జగన్ సునామీ వస్తుంది.చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు?వ్యవస్థలను మేనేజ్ చేసే కట్రలతో చంద్రబాబు బిజీగా ఉన్నారు.పురంధేశ్వరి ఇచ్చిన లిస్టు ప్రకారం పోలీసు అధికారులను మార్చారు.ఆ మార్చిన చోటే హింస చెలరేగిందంటే అర్థం ఏంటి?ఒక కుట్ర ప్రకారమే ఈ అల్లర్లు జరిగాయి.02:40 PM, May 17th, 2024విజయవాడ:విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు, జరుగుతున్న దాడులపై సీపీ రామకృష్ణకు వినతిపత్రం అందజేతవైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ వినతి పత్రంపై సానుకూలంగా స్పందించిన సీపీసీపీని కలిసిన అనంతరం వైఎస్సార్‌సీపీ లీగ్‌ సెల్‌ నాయకులు మాట్లాడుతూ..ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగాయివైఎస్సార్‌సీపీ నేతల గొంతు నొక్కాలని చూస్తున్నారుకొంత మంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారుకావాలనే బైండోవర్‌లు పెట్టి వేధిస్తున్నారునిన్న సీఎం విజయవాడ పర్యటన సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులను స్టేషన్‌కు పిలిపించి నిర్భదించారువైఎస్సార్‌సీపీ నాయకులను అకారణంగా నిర్భందించిన పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలి 02:09 PM, May 17th, 2024విశాఖ జిల్లా: ఎన్నికల ఫలితాలకు ముందే చేతులెత్తేసిన టీడీపీవిశాఖ జిల్లాలో ఎన్నికల ఫలితాలపై గండి బాబ్జి జోస్యంగండి బాబ్జి జోస్యంతో కంగుతిన్న టీడీపీ శ్రేణులువిశాఖ జిల్లాలో పార్టీ ఓడిపోతుందిబీజేపీ పోటీ చేసిన విశాఖ నార్త్ నియోజక వర్గ ఫలితంపై నాకు డౌట్ ఉందిగెలుపుపై అనుమానం వ్యక్తం చేసిన గండి బాబ్జిజిల్లా పార్టీ అధ్యక్షుడే పార్టీ ఓడిపోతుందని మాట్లాడటంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన01:53 PM, May 17th, 2024మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం: సజ్జల రామకృష్ణారెడ్డిసాంప్రదాయ ఓటు బ్యాంక్ మావైపు ఉందిమాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదుప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న తీరు చూస్తుంటే మళ్ళీ విజయం సాధిస్తాంపొలింగ్ పర్సంటేజ్ పెరిగితే మేము ఓడిపోతామన్న భ్రమలో టీడీపీ ఉందిమాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవుప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదువివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా?సీఎం జగన్‌ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు నన్ను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారుటీడీపీ గెలవడానికి ఉన్న ఒక్క కారణమైనా చెప్పగలరా?చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పలేక పోతున్నారుటీడీపీ కూటమి వలనే పోలింగ్ లో హింస జరిగిందివారు చెప్పిన అధికారులే హింసకు కారణమయ్యారుఇప్పుడు వాళ్ళనే ఈసీ తొలగించి చర్యలు తీసుకుందిఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందు ఉన్నారుపోలింగ్‌కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారుఅల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లేవీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లేఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్ కు లేఖలు రాస్తున్నారురికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు రాస్తున్నారుతాడిపత్రిలో పెద్ధారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారుల్యాండ్ టైట్లింగ్ గురించి ఎన్నికల తరువాత టీడీపీ ఎందుకు మాట్లాడటం మానేసింది?ల్యాండ్ టైటలింగ్ అమలు చేయాలని నీతి అయోగ్ చెప్పిందికౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలిటీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుందిప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాంఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావుఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్ ను కోరుతున్నాంకుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాల్లోనూ గెలుస్తాంజగన్ పాలనలో లబ్ధి పొందని వర్గాలు, న్యాయం జరగని కుటుంబం అంటూ ఏమీ లేవుఅందరికీ మేలు చేసినందునే భారీ సీట్లతో గెలవబోతున్నాం11:25 AM, May 17th, 2024విజయనగరం పోస్టల్‌ బ్యాలెట్‌ స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద హైడ్రామాఆందోళనకు దిగిన టీడీపీ, ఇండిపెండింట్‌ అభ్యర్థులుజాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌పై ఈసీకి టీడీపీ కార్యకర్తల ఫిర్యాదుఅభ్యర్థుల ఏజెంట్‌లు లేకుండా తెరిచారని టీడీపీ అభియోగంఅభ్యర్థులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చామన్న జేసీవీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు పోలీసుల సమక్షంలో తీశాం11:14 AM, May 17th, 2024తాడిపత్రిలో టీడీపీ దాడులను ఖండించిన వైఎస్సార్‌సీపీ నేతలుతాడిపత్రిలో అల్లర్లను నియంత్రించడంలో పోలీసులు విఫలంజేసీ అనుచరులు దాడులు చేస్తే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారువైఎస్సార్‌సీ శ్రేణులపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదువైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు.ఎన్నికల కమిషన్‌ ఎన్డీఏ కమిషన్‌గా మారిపోయింది.ఎస్పీ అమిత్‌, ఏఎస్పీ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరించారుపోలీసుల సహకారంతోనే వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులురౌడీషీటర్లను టీడీపీ పోలింగ్‌ ఏజెంట్లుగా పెట్టారుఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణంతాడిపత్రిలో ఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలిఏఎస్పీ రామకృష్ణను కూడా సస్పెండ్‌ చేయాలి 10: 37 AM, May 17th, 2024చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదుఏలూరు జిల్లాదెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదుహత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుండి దౌర్జన్యంగా తీసుకువెళ్లిన చింతమనేనిఅధికారుల విధులకు ఆటంకం కలిగించడం, స్టేషన్‌లో దౌర్జన్యం చేయడంపై 224, 225, 353,143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు8: 04 AM, May 17th, 2024సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలతో వైసీపిలో ఫుల్ జోష్150 కిపైగా సీట్లలో గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన జగన్మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామన్న జగన్దేశమంతా మనవైపే చూస్తుందని వ్యాఖ్యలుగత 59 నెలలుగా చేసిన సుపరిపాలనతో జనం జగన్ కే అండగా నిలిచారంటున్న విశ్లేషకులుచంద్రబాబు కూటమి కుట్రలకు ప్రజలు ఛీకొట్టారన్న చర్చఈసారి మరింత మేలు చేసేలా పాలన సాగించే దిశగా సీఎం అడుగులు8: 01 AM, May 17th, 2024వెల్లివిరిసిన మహిళా చైతన్యంఏపీలో పురుషులకంటే ఓట్లు వేసిన మహిళల సంఖ్య 4.78 లక్షలు అధికంపోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి మొత్తం పోలింగ్‌ శాతం 81.86 శాతంఅసెంబ్లీకి అత్యధికంగా దర్శిలో 90.91 శాతం.. అత్యల్పంగా తిరుపతిలో 63.62 శాతంలోక్‌సభకు అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం.. విశాఖలో 71.11 శాతం ఓట్లుదేశంలో ఇప్పటివరకు జరిగిన 4 దశల ఎన్నికల్లో అత్యధిక పోలింగ్‌ రాష్ట్రంలోనేఎన్నికల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తాం33 చోట్ల 350 స్ట్రాంగ్‌ రూముల్లో మూడంచెల భధ్రత నడుమ ఈవీఎంలుహింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని రెండు రోజుల్లో అరెస్ట్‌ చేస్తాంఎన్నికల తర్వాత జరిగిన హింస అదుపులోకి వచ్చిందిహింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు715 పోలీస్‌ పికెట్స్‌తో గొడవలను అదుపులోకి తెచ్చాంరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా7: 07 AM, May 17th, 2024టీడీపీ చెప్పినట్లు ఆడినందుకేప్రజాస్వామ్య ప్రక్రియకు పాతరేసిన ఫలితం..విధి నిర్వహణలో అలసత్వమే ఈసీ వేటుకు కారణంరాజకీయ ఒత్తిళ్లతో పోలీస్‌ అధికారుల బదిలీ.. పురందేశ్వరి జాబితా ప్రకారం నియామకాలుఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు 7: 03 AM, May 17th, 2024నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకు వ్యూహంటీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు ఇల్లు కేంద్రంగా కుట్రగోపిరెడ్డి దొరక్కపోవడంతో ఆయన మామపై హత్యాయత్నంఅనంతరం అరవింద్‌బాబు హౌస్‌ అరెస్ట్‌పోలీసుల తనిఖీలో మారణాయుధాలు, పెట్రోల్‌ బాంబులు లభ్యం.. పోలింగ్‌కు ముందే పథకం ప్రకారం సమకూర్చుకున్న వైనంమారణాయుధాలకు సంబంధించి కేసు నమోదు చేయని పోలీసులు.. పల్నాడులో హత్యా రాజకీయాలనే నమ్ముకున్న టీడీపీ7: 02 AM, May 17th, 2024పాలన బాగుంటే పోలింగ్‌ పెరుగుతుందిఇది రాజకీయ విశ్లేషకుల మాట.. మాట నెరవేర్చిన ప్రభుత్వాలను మళ్లీ ఎన్నుకుంటారు..పోలింగ్‌ శాతం పెరగడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమనే ప్రచారం అవాస్తవం2004లో 69.8 శాతం పోలింగ్‌తో వైఎస్సార్‌కు అధికార పగ్గాలు.. 2009లో 72.7% పోలింగ్‌తో మళ్లీ సీఎంగా వైఎస్సార్‌తెలంగాణలో 2014లో 69.5 శాతం పోలింగ్‌తో అధికారంలోకి టీఆర్‌ఎస్‌2018లో 73.2 శాతం పోలింగ్‌తో మరోసారి సీఎంగా కేసీఆర్‌ఇప్పుడు ఏపీలోనూ అదే ట్రెండ్‌.. మరిన్ని సీట్లతో సీఎంగా మళ్లీ వైఎస్‌ జగన్‌6: 50 AM, May 17th, 2024మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాంపోలింగ్‌ సరళిపై తొలిసారిగా స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌2019కి మించి 2024లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనంజూన్‌ 4న ఘన విజయంతో దేశం మొత్తం మన వైపే చూస్తుంది59 నెలలుగా ప్రజలకు మంచి చేశాం.. వచ్చే ఐదేళ్లు మరింత మేలు చేద్దాంవిజయవాడలో ఐ–ప్యాక్‌ ప్రతినిధులతో సమావేశం

Keerthy Suresh Comments On Her Upcoming Movies
బోర్ కొట్టేస్తుంది.. అలాంటి సినిమాలు చేద్దామనుకుంటున్నా

కీర్తి సురేశ్ టాలెంట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'మహానటి' మూవీతో నేషనల్ అవార్డు అందుకుంది. తనెంటో ప్రూవ్ చేసింది. దీని తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలో వరస చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇన్ని సినిమాలు చేస్తున్నా గానీ ఓ విషయంలో సంతృప్తి పడకూడదని అంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమాలు గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా)''మహానటి' తర్వాత మరింత బాధ్యతగా సినిమాలు చేస్తున్నాను. కొన్ని కథా పాత్రలు నటీనటుల జీవితం, వృత్తి పరమైన ఇమేజ్‌ని మార్చేస్తాయి. ఇకపై మీ జర్నీ ఎలా ఉండాలనేది అవి డిసైడ్ చేస్తాయి. మంచి పాత్రలకు ఉండే బలం అది. 'మహానటి' విషయంలో నాకు అలాంటి అనుభవమే ఎదురైంది. దీని తర్వాత మంచి పాత్రలను ఎంపిక చేసుకుని నటించాలనే భావన కలిగింది''అయితే నేను చేసే అన్ని సినిమాలు అలాంటి ఫలితాన్ని అందిస్తాయని అనుకోవడం కరెక్ట్ కాదు. షూటింగ్‌ స్పాట్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పాత్రలోని ఎమోషనల్‌ వెంటాడుతుందంటే అది మంచి పాత్ర. అయితే అలాంటి మ్యాజిక్‌ కొన్నిసార్లే జరుగుతుంది. అలానే ఒకేలాంటి పాత్రలు చేస్తుంటే అభిమానులకు బోర్‌ కొడుతుంది. అందుకే ఛాలెంజింగ్‌ పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను' అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్)

SRH Nitish Reddy Becomes Most Expensive Player in APL His Reaction Viral
APL వేలంలో నితీశ్‌ కుమార్‌ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యువ సంచలనం, ఆంధ్ర క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి పట్టరాని సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ చేరడం ఇందుకు ఓ కారణమైతే.. ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో అతడు సరికొత్త చరిత్ర సృష్టించడం మరో కారణం.జోనల్‌ స్థాయి క్రీడాకారులకి గుర్తింపు తెచ్చేందుకు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ పేరిట గత రెండేళ్లుగా టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పేరెన్నికగన్న క్రికెటర్లతో పాటు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆటగాళ్లు కూడా ఈ లీగ్‌లో భాగమవుతున్నారు.బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ పేరిట ఆరు జట్లు ఏపీఎల్‌లో పాల్గొంటున్నాయి. ఇక ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఏపీఎల్‌.. మూడో సీజన్‌ కోసం సిద్ధమైంది.ఈ నేపథ్యంలో ఆటగాళ్ల కొనుగోలుకై గురువారం వేలం నిర్వహించారు. ఇందులో భాగంగా 76 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇక ఇప్పటికే 44 మంది ప్లేయర్లను ఆయా జట్లు రిటైన్‌ చేసుకున్నాయి.ఇక ఏ,బీ,సీ,డీ పేరిట నాలుగు కేటగిరీలుగా ఆటగాళ్లను విభజించారు. ‘ఏ’ కేటగిరీ కనీస ధర: లక్ష... బీ కేటగిరీ కనీస ధర: 50 వేలు.. సీ,డీ కేటగిరీ కనీస ధర: 25 వేలుగా నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో దుమ్ము లేపుతున్న పేస్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి కూడా ఈ వేలంలో పాల్గొన్నాడు.ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలోనే తొలిసారిగా ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 15.6 లక్షలకు నితీశ్‌ రెడ్డి అమ్ముడుపోయాడు. ఈ యంగ్‌ సెన్సేషన్‌ కోసం గోదావరి టైటాన్స్‌ యాజమాన్యం ఈ మేరకు భారీ మొత్తం వెచ్చించింది.ఈ విషయం తెలియగానే నితీశ్‌ కుమార్‌ రెడ్డి నమ్మలేకపోతున్నా అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.కాగా ఐపీఎల్‌-2024 వేలంలో భాగంగా వైజాగ్‌ కుర్రాడు నితీశ్‌ రెడ్డిని రూ. 20 లక్షల కనీస ధరకు సన్‌రైజర్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అంచనాలకు మించి రాణించిన 20 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ 7 ఇన్నింగ్స్‌ ఆడి 239 పరుగులు చేశాడు. అదే విధంగా.. 3 వికెట్లు కూడా తీశాడు. NITISH KUMAR REDDY - Highest paid player in Andhra Premier League. 💥IPL salary - 20 Lakhs. APL salary - 15.6 Lakhs. His reaction is priceless. 🫡 The future star. pic.twitter.com/33i0hT3F3a— Johns. (@CricCrazyJohns) May 16, 2024

Nagababu Leave Twitter Because Allu Arjun Fans
ట్విటర్‌ నుంచి నాగబాబు ఔట్‌.. వారిద్దరూ వార్నింగ్‌ ఇచ్చారా..?

మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరం కానున్నాడా..? మెగా బ్రదర్స్‌ నాగబాబు, పవన్‌లు ఇద్దరూ బన్నీపై గుర్రుగా ఉన్నారా..? అంటే సోషల్‌ మీడియాలో అవుననే జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ, బన్నీ మాత్రం మెగా బంధాలను తెంపుకునే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. స్నేహం కోసం ఎంతవరకైనా వెళ్లే గుణం అల్లు అర్జున్‌లో ఉందని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అలాంటి బన్నీపై నాగబాబు ఫైర్‌ అవుతున్నారని నెట్టింట వైరల్‌ అయింది. అసలు వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కడ వచ్చాయి అనేది చూద్దాం. స్నేహితుడి కోసం నిలబడిన అల్లు అర్జున్‌ఏపీ ఎన్నికల సమయంలో తన మిత్రుడి విజయం కోసం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్నేహ బంధాన్ని పాటించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నంద్యాల నియోజికవర్గంలో ఎన్నికల బరిలో నిల్చున్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయం సాధించాలని అల్లు అర్జున్‌ కోరుకున్నారు. ఈ క్రమంలో ఆయన నంద్యాలకు వెళ్లి తన మద్ధతును ప్రకటించారు. ఆ సమయంలో భారీగా బన్నీ ఫ్యాన్స్‌ శిల్పా రవి ఇంటి వద్దకు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. 2019లో కూడా అల్లు అర్జున్‌ శిల్పా రవికి మద్ధతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నాగబాబు ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఒక ట్వీట్‌ వేశాడు. అది అల్లు అర్జున్‌ గురించే అంటూ నెట్టింట వైరల్‌ అయింది.నాగబాబు ట్వీట్‌తో రగడఅల్లు, మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలను నాగబాబు ట్వీట్‌ బయటపెట్టిందన్న చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన సమయం నుంచి ఈ రచ్చ మొదలైంది. ఆపై, పోలింగ్‌ ముగిసిన కొద్ది గంటల్లోనే నాగబాబు చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. 'మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన కూడా మావాడే' అంటూ నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలతో తమ అభిమాన హీరో గురించే అంటున్నారని బన్నీ ఫ్యాన్స్‌ ఫైర్‌ అయ్యారు. బన్నీని పరోక్షంగా తమ వాడు కాదు అనడం సరైనది కాదని వారు తప్పుపట్టారు. ఇదే ట్వీట్ ఎన్నికల ముందు వేయాల్సిందని నాగబాబును ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. గతంలో జనసేనకు రూ. 2 కోట్లు విరాళం ఇవ్వలేదా అంటూ వారు గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా నాగబాబు అర్ధిక కష్టాల్లో వున్నపుడు 'నా పేరు సూర్య' సినిమాకు ప్రెజెంటర్‌గా తమరి పేరు వేయించి కొంత సాయం అందేలా బన్నీ చేయలేదా..? అంటూ చెప్పుకొస్తున్నారు. చిరంజీవి కూడా తన స్నేహితుల కోసం ఈ ఎన్నికల్లో మద్ధతుగా నిలబడాలని వీడియోలు చేయలేదా అని నెట్టింట బన్నీ ఫ్యాన్స్‌ ఫైర్‌ అయ్యారు.బన్నీ ఫ్యాన్స్‌, చిరంజీవి వల్లే నాగబాబు ఈ నిర్ణయం తీసుకున్నారా..?వాస్తవానికి బన్నీకి కూడా ఫ్యాన్‌ బేస్‌ భారీగానే ఉంది. తనకంటూ ఒక సపరేట్‌ అభిమానగనాన్ని ఆయన సంపాదించుకున్నారు. వారందరూ సోషల్‌ మీడియా వేదికగా నాగబాబును ఏకిపారేశారు. మరోవైపు చిరంజీవి కూడా నాగబాబు వద్ద బన్నీ విషయాన్ని ప్రస్తావించారని తెలుస్తోంది. ఇంతటితో ఈ వివాదం ఆపాలని ఆయన కోరినట్లు సమాచారం. ఒకవైపు బన్నీ అభిమానుల కామెంట్ల దాడి.. మరోవైపు అన్నయ్య సూచనలు వస్తుండటంతో తన ఎక్స్‌ పేజీని నాగబాబు క్లోజ్‌ చేశారని తెలుస్తోంది.కష్టాన్నే నమ్ముకున్న అల్లు అర్జున్‌అల్లు అర్జున్‌ సినిమా ఇండస్ట్రీలోకి అరవింద్‌ కుమారుడిగా.. మెగాస్టార్‌ మేనళ్లుడిగా ఎంట్రీ ఇచ్చారు. కానీ రెండో సినిమా నుంచే ఆయన తన కష్టాన్నే నమ్ముకున్నారు. ఒకరకంగా తన స్వయం కృషితో బన్నీ ఎదిగాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్టార్‌గా తనను తాను మలుచుకున్నాడు. పుష్ప సినిమా సమయానికి సుకుమార్‌, బన్నీ ఇద్దరూ టాలీవుడ్‌కే పరిమితం. కానీ, అల్లు అర్జున్‌ తన నటనతో పాన్‌ ఇండియాను మెప్పించాడు. అలా బన్నీ వల్ల సుకుమార్‌ పేరు కూడా దేశవ్యాప్తంగా తెలిసింది. ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యంత శక్తివంతమైన ఫ్యాన్‌ బేస్‌ కలిగిన హీరోల్లో అల్లు అర్జున్‌ టాప్‌లో ఉంటారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement