Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Information About How To Cast Vote
మీ ఓటు పడిందా? ఇలా కన్మర్ఫ్‌ చేస్కోండి

AP Assembly Elections 2024 Voting Live Updates And Highlights Telugu
AP Elections 2024 Polling: ఏపీ పోలింగ్‌ డే అప్‌డేట్స్‌

AP Elections 2024 Polling Updatesఏపీ ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు..

Elections 2024: Sakshi Selfie Challange Updates
ఓటేయండి.. సెల్ఫీ పంపండి

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ, అలాగే తెలంగాణలోనూ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలకు పోలింగ్‌ జరుగుతోంది. తమ రాష్ట్రం కోసం, తమ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సవ్యంగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని ఎన్నికల సంఘాలు కోరుతున్నాయి. మేం ఓటేశాం.. మరి మీరో?(ఫొటోలు)అలాగే.. సాక్షి సైతం తన వంతుగా ఓటర్లను చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలోనే సెల్ఫీ ఛాలెంజ్‌ను నిర్వహిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్‌కు (9182729310) మీ వివరాలతో వాట్సాప్‌ చేయడమే. అందులోంచి నాణ్యత ఉన్న ఫోటోలను ఎంపిక చేసి సాక్షి. కామ్‌లో పోస్ట్‌ చేయడం జరుగుతుంది. ‘‘నా ఉనికి ఓటుతోనే.., నా ఓటు వజ్రాయుధం’’ అని మీరు సందేశం ఇస్తే.. మీ బాధ్యతను చూపించి మరో నలుగురిని ఓటేసేలా ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నం చేస్తాం.‌

Telangana Lok Sabha Elections 2024 Voting Live Updates And Highlights Telugu
TS Lok Sabha Polling 2024 Updates: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ అప్‌డేట్స్‌..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ అప్‌డేట్స్‌

Lok sabha elections 2024: 4th phase polling updates In Telugu
Lok sabha elections 2024: కొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్‌

Updates ఉత్తర ప్రదేశ్‌:యూపీ మంత్రి జితిన్‌ ప్రసాదా ఓటు హక్కు వినియోగించకున్నారు.షహజాన్‌పూర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు చేశారు.#WATCH | Uttar Pradesh Minister Jitin Prasada casts his vote at a polling booth in ShahjahanpurINDIA Alliance has fielded SP's Jyotsna Gond here. She faces BJP's sitting MP & candidate Arun Kumar Sagar & BSP's Dod Ram Verma. #LokSabhaElections2024 pic.twitter.com/a933KBvJWW— ANI (@ANI) May 13, 2024 జమ్మూ కశ్మీర్‌:శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా, వైఎస్‌ ప్రెసిడెంట్‌ ఒమర్‌ అబ్దుల్లా ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Srinagar, J&K: JKNC Chief Farooq Abdullah and JKNC Vice President Omar Abdullah show their inked fingers after casting their votes for the #LokSabhaElections2024 pic.twitter.com/arYMBqgxBm— ANI (@ANI) May 13, 2024 యూపీ:ఉన్నావ్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాక్షి మహారాజ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Uttar Pradesh: BJP MP and candidate from Unnao, Sakshi Maharaj casts his vote at a polling booth in the constituency.Samajwadi Party (SP) has fielded Annu Tandon and BSP has fielded Ashok Kumar Pandey here. #LokSabhaElections2024 pic.twitter.com/gW1oFBrui7— ANI (@ANI) May 13, 2024 జమ్మూ కశ్మీర్‌:శ్రీనగర్‌లో నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతోందిపెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారుLok Sabha elections 2024: Polling underway in SrinagarRead @ANI Story | https://t.co/gDgPtt9ffZ#JammuKashmir #Srinagar #LokSabhaElection2024 pic.twitter.com/2B9fFIibHg— ANI Digital (@ani_digital) May 13, 2024 తెలంగాణఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిబర్కత్‌పూరా పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.నాలుగోవిడత పోలింగ్‌ కొనసాగుతోందిUnion Minister G Kishan Reddy casts his vote in Telangana's BarkatpuraRead @ANI Story | https://t.co/vmoYK3dewi#GKishanReddy #LokSabhaElection2024 #Telangana pic.twitter.com/Xiwl8pYjcJ— ANI Digital (@ani_digital) May 13, 2024 మధ్యప్రదేశ్‌మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఉజ్జయినిలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Madhya Pradesh CM Mohan Yadav casts his vote at a polling station in Ujjain. #LokSabhaElections2024 pic.twitter.com/FxzdPbdYja— ANI (@ANI) May 13, 2024 ఢిల్లీ:కొనసాగుతున్న నాలుగో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్దేశవ్యాప్తంగా సాధారణ వాతావరణ పరిస్థితులు, హీట్ వేవ్ లేదని వెల్లడించిన ఐఎండిపోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లుపది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికలుఎన్నికల బరిలో 1717 మంది అభ్యర్థులుప్రతి పార్లమెంటులో సగటున 18 మంది అభ్యర్థులు1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న 17.7 కోట్ల మంది ఓటర్లు85 ఏళ్లు దాటిన ఓటర్లు12.49 లక్షల మంది, 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లుఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలుతెలంగాణలో పోలింగ్ సమయం పెంపు; ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న 19లక్షల మంది సిబ్బందిఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లు1016 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దులలో నిఘాపోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు తెలంగాణఓటు హక్కు వినియోగించుకున్న ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ#WATCH | Telangana: AIMIM candidate from Hyderabad, Asaduddin Owaisi shows his inked finger after casting his vote at a polling booth in Hyderabad. #LokSabhaElections2024 pic.twitter.com/aEg4psMI8A— ANI (@ANI) May 13, 2024 తెలంగాణకేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఈఓ వికాస్ రాజ్‌కు ఫిర్యాధు చేసిన కాంగ్రెస్ఓటు వేసి మీడియాతో మాట్లాడుతూ మోడీ పేరును ప్రస్తావించినందుకు ఫిర్యాధుపోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందన్న కాంగ్రెస్కిషన్ రెడ్డి పై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని ECని కోరిన కాంగ్రెస్ మహారాష్ట్ర:కేంద్ర మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఓటు హక్కు వినియోగించుకున్నారు.జాల్నా పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Union Minister and BJP's candidate from Jalna Lok Sabha seat, Raosaheb Patil Danve casts his vote at a polling booth in Jalna, Maharashtra Danve is sitting MP from this seat. INDIA alliance has fielded Congress leader Kalyan Vaijinathrao Kale from this seat.… pic.twitter.com/cRvRTK4B8b— ANI (@ANI) May 13, 2024 జమ్మూ కశ్మీర్‌:పుల్వామా పోలింగ్‌ కేంద్రంలో బారులు తీరిన ఓటర్లు#WATCH | Jammu and Kashmir: Voters queue up outside a polling booth in PulwamaNational Conference (NC) has fielded Aga Syed Ruhullah Mehdi from the Srinagar Lok Sabha seat, PDP fielded Waheed-ur-Rehman Para, and J&K Apni Party’s fielded Mohammad Ashraf Mir.… pic.twitter.com/VSgGZs9Vki— ANI (@ANI) May 13, 2024 తెలంగాణ:త్రిపురా గవర్నర్‌ ఎన్‌ ఇంద్రసేనా రెడ్డి ఓటు వేశారు.హైదరాబాద్‌ సలీంనగర్‌ పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ కొనసాగుతోంది#WATCH | Telangana: Tripura Governor N Indrasena Reddy, along with his family, casts his vote at a polling booth in Saleem Nagar, Hyderabad. #LokSabhaElections2024 pic.twitter.com/tdl5oYHbrs— ANI (@ANI) May 13, 2024 తెలంగాణ:ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులుహైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓటు వేశారు.నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతోంది#WATCH | Telangana: Former Vice President M Venkaiah Naidu and his wife Usha Naidu show the indelible ink mark on their fingers after casting their vote at a polling booth in Jubilee Hills, Hyderabad.#LokSabhaElections2024 pic.twitter.com/gUN3v2Ekf2— ANI (@ANI) May 13, 2024 ఢిల్లీ:ఓటు వేయటం ప్రజాస్వామ్య హక్కు: ప్రధాని మోదీకొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్‌Lok Sabha election: PM Modi calls for 'democracy duty' as voting begins in fourth phaseRead @ANI Story | https://t.co/6N8RRsDrTD#LokSabaElections2024 #PMModi #democracy pic.twitter.com/IhZJO6sRzR— ANI Digital (@ani_digital) May 13, 2024 తెలంగాణ: హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Telangana: BJP candidate from Hyderabad, Madhavi Latha casts her vote at a polling booth in the constituency.She faces sitting MP and AIMIM candidate Asaduddin Owaisi and BRS' Gaddam Srinivas Yadav here. #LokSabhaElections2024 pic.twitter.com/E7sMVEZOrj— ANI (@ANI) May 13, 2024 బిహార్‌:కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.లఖిసారి పోలింగ్‌ కేంద్రంలో ఓటు చేశారు.పోలింగ్‌ కేంద్రానికి ఓటర్లు తరలి వస్తున్నారు.#WATCH | Bihar: After casting his vote in Lakhisari, Union Minister and BJP candidate from Begusarai, Giriraj Singh says, "I want to appeal to the voters of Bihar that they must go out and vote. One vote can cause the fall of the Atal Bihari Vajpayee government and every vote can… pic.twitter.com/X6IiXHe8Qu— ANI (@ANI) May 13, 2024 యూపీ:ఉత్తరప్రదేశ్‌ మంత్రి సురేష్‌ ఖన్నా ఓటు హక్కు వినియోగించుకున్నారు.షహజాన్‌పూర్‌లో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేయడానికి ప్రజలు తరలి వస్తున్నారు.ఓటర్లు క్యూలైన్‌లో నిల్చుంటున్నారు. #WATCH | Uttar Pradesh Minister Suresh Khanna casts his vote at a polling booth in Shahjahanpur. INDIA Alliance has fielded SP's Jyotsna Gond here. She faces BJP's sitting MP & candidate Arun Kumar Sagar & BSP's Dod Ram Verma. #LokSabhaElections2024 pic.twitter.com/fpFLtROJ11— ANI (@ANI) May 13, 2024 ఒడిశా:నాబారంగాపూర్‌లో ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్‌ ఏర్పాటు.#WATCH | Nabarangpur, Odisha: An eco-friendly polling station has been established at the Dandamunda village in Chandahandi Block of the Nabarangpur Lok Sabha constituency.BJP's Balabhadra Majhi, BJD's Pradeep Majhi and Congress' Bhujabala Majhi are contesting the… pic.twitter.com/tWfKsAon3B— ANI (@ANI) May 13, 2024 ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్‌పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు పోలింగ్‌ ప్రారంభమైంది.క్యూలైన్‌లో నిల్చున్న ఓటర్లుVoting for the fourth phase of #LokSabhaElections2024 begins. Polling being held in 96 constituencies across 10 states and Union Territories (UTs) today. 1717 candidates in fray. pic.twitter.com/GXFjsWMsdQ— ANI (@ANI) May 13, 2024 తెలంగాణతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన మాక్ పోలింగ్రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ17 పార్లమెంటు స్థానాలకు బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులుఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే ముగియనున్న పోలింగ్పోలింగ్ పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 525 మంది అభ్యర్థులు, 475మంది పురుషులు, 50 మంది మహిళా అభ్యర్థులుఎన్నికల విధుల్లో 2లక్షల 80వేల మంది సిబ్బంది విధుల నిర్వహణ160 కేంద్ర కంపెనీల CAPF బలగాలతో బందోబస్తుఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి 20వేల మంది పోలీస్ బలగాలురాష్ట్ర వ్యాప్తంగా 3కోట్ల 32లక్షల 32వేల మంది ఓటర్లుపురుష ఓటర్లు - 1కోటి 65లక్షల 28వేలు, 1కోటి 67లక్షల మహిళా ఓటర్లు18-19 ఏళ్ల వయసు కలిగిన యువ ఓటర్లు 9లక్షల 20వేలు, వికలాంగులు 5లక్షల 27వేలుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 808 పోలింగ్ కేంద్రాలుఅత్యధికంగా మల్కాజ్గిరిలో 3226 పోలింగ్ కేంద్రాలు1లక్ష 9వేల 941 బ్యాలెట్ యూనిట్లు, 44906 కంట్రోల్ యూనిట్లుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9900 ఉన్నట్లు గుర్తించిన ఈసీజూన్ 4వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు#WATCH | Hyderabad, Telangana: Mock polling begins at the Jubilee Hills Public School polling booth nos. 163, 164 and 165 from Secundrabad Lok Sabha Constituency. BJP's G Kishan Reddy, Congress' Danam Nagender and BRS' T. Padma Rao Goud are contesting elections from here. G… pic.twitter.com/Q50qyruJ3B— ANI (@ANI) May 13, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నాలుగో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 1717 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రతి పార్లమెంటులో సగటున 18 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17.7 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లు12.49 లక్షలు ఉండగా, 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణలో పోలింగ్ సమయం పెంచడంతో ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియలో 19 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లను నియమించారు. 1016 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దులలో ఈసీ నిఘా ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు చేశారు.

AP Elections 2024: handicap Woman Emotional Word About CM YS Jagan
జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..

నెల్లూరు, సాక్షి: పోలింగ్‌తో ఏపీలో జన జాతర నడుస్తోంది. దూర సుదూర ప్రాంతాల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో చెన్నై నుంచి కావలికి వచ్చిన ఓ దివ్యంగురాలి మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.విశ్వోదయ బాయ్స్ హై స్కూల్ లో పోలింగ్ స్టేషన్ వద్ద ఓటేయడానికి కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో ఆ దివ్యాంగురాలు భావోద్వేగంగా మాట్లాడారు. జగనన్న ద్వారా తాను లబ్ధి పొందానని.. అందుకే కృతజ్ఞతతో జగన్ అన్నకు ఓటు వేసేందుకు ఇక్కడికి వచ్చానని ఆమె తెలిపారు.అన్నా.. సాయం అంటే చాలూ.. అప్పటికప్పుడే అధికారుల్ని పిలిపించుకుని గంటల వ్యవధిలోనే సాయం అందేలా చూడడం సీఎం జగన్‌ నైజం. అలా ఈ 59 నెలల్లో లక్షల మంది వ్యధలను సీఎం జగన్‌ స్వయంగా విని.. వాళ్లకు ప్రభుత్వం తరఫున సాయం అందించడం చూశాం కూడా.

AP Assembly Elections 2024: Allu Arjun Gives Clartiy On Nandyal Tour
అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఎన్నికతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌ సభ స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఉదయం 7.30 గంటలకే తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ ఉదయం 7.30 గంటలకే ఓటేశాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చాడు. నంద్యాల అంసెబ్లీ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్తి శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి తన స్నేహితుడని.. అందుకే ఆయనకు మద్దతుగా నంద్యాల వెళ్లాలని చెప్పాడు. ‘శిల్పా రవి నాకు 15 ఏళ్లుగా మిత్రుడు. అతనికి మద్దతు ఇస్తానని గతంలో మాట ఇచ్చాను. రాజకీయాలతో సంబంధం లేకుండా స్నేహితుడిగా మాత్రమే శిల్పారవికి మద్దతుగా నంద్యాల వెళ్లాను. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను’అని బన్నీ అన్నారు.

TDP and Janasena and BJP alliance will be shocked again
పెత్తందారులకు మళ్లీ షాకే!

సాక్షి, అమరావతి : పెత్తందార్లకు మళ్లీ షాక్‌ ఇచ్చేందుకు పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలంతా సిద్ధమయ్యారు. ఇంటింటా అభివృద్ధి కొనసాగాలని.. రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. మళ్లీ జగన్‌ వస్తేనే సంక్షేమాభివృద్ధి పథకాలు కొనసాగుతాయని బలంగా నమ్ముతున్నారు. సాధికారత కోసం ఎన్నికల మహా సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్‌ ప్రక్రియలో ఫ్యాన్‌ గుర్తుపై రెండు బటన్‌లు నొక్కి ఓట్లేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు పేదలంతా సిద్ధమయ్యారు.గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించి, వైఎస్సార్‌సీపీకి ప్రజలు చారిత్రక విజయాన్ని అందించారు. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలు అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు సరైన నిర్వచనం చెప్పారు. 59 నెలల్లో 99 శాతం హామీలు అమలు చేశారు. ఎలాంటి వివక్ష చూపకుండా, లంచాలకు తావులేకుండా.. అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించారు.సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. నాన్‌ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి పేదలకు మొత్తం రూ.4.49 లక్షల కోట్ల లబ్ధి చేకూరింది. వాటిని సది్వనియోగం చేసుకున్న పేదలు.. జీవనోపాధులను మెరుగుపర్చుకుని తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు. రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు హయాంలో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి అది 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. సాధికారత కోసం పేదలంతా సిద్ధం విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని.. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానంటూ 650కిపైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది. 2019 ఎన్నికల్లో వేరుపడిన ఆ పార్టీలు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తూ అలవికాని హామీలు ఇచ్చాయి.ఆ హామీల అమలు సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చిన బీజేపీ.. టీడీపీ కూటమి మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా వెనుకంజ వేసింది. సీఎం జగన్‌ గత ఎన్నికల తరహాలోనే అమలు చేయదగిన హామీలతోనే కేవలం రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. కూటమికి ఇక్కడ సారథ్యం వహిస్తున్న చంద్రబాబు.. చెప్పిన మాటపై నిలబడడని, మోసం చేస్తారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకు పోయింది. చెప్పిన హామీలన్నీ అమలు చేసిన సీఎం జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం కుదిరింది. దీంతో సాధికారత కోసం మళ్లీ జగనే రావాలని పేదలంతా బలంగా కోరుకుంటున్నారు. భవిష్యత్తు మరింత గొప్పగా మార్చుకునేందుకు..⇒ రాష్ట్రంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. సీఎం జగన్‌ గ్రామాల్లో ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లను ఏర్పాటు చేసి, విత్తు నుంచి విక్రయం దాకా రైతుల చేయిపట్టి నడిపిస్తున్నారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయం.. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. రైతులపై ఎలాంటి భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చారు. పండించిన పంటల ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే.. ఆ సీజన్‌ ముగిసేలోగా పరిహారాన్ని అందించి రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. తద్వారా వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. ⇒ గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలు సొంత ఊళ్లోనే సులభంగా అన్ని పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం.. జగనన్న సురక్ష, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ద్వారా ప్రజల ఆరోగ్యానికి సీఎం జగన్‌ భరోసా కల్పించారు. పునర్‌ వ్యవస్థీకరణ ద్వారా 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. ⇒వైఎస్సార్‌ చేయూత, ఆసారాతో మహిళలకు సీఎం జగన్‌ అండగా నిలిచారు. ఆ పథకాల ద్వారా అందించిన ఆర్థిక సాయంతో⇒‘పేదలంటే మారుమూల పల్లెల్లో, పట్టణాల్లోని మురికి వాడల్లోనే ఉండాలి.. పెత్తందారుల ఇళ్లలో పనులు చేస్తూ, వాళ్లు తినగా మిగిలింది తింటూ బతకాలి.. పిల్లలను స్కూల్‌ లెవల్‌ వరకు తెలుగు మీడియంలో మాత్రమే చదివించాలి.. ఇంగ్లిష్‌ మీడియంలో చదివించాలనే ఆలోచనే రాకూడదు.. టెన్త్‌ తర్వాత పెత్తందారుల ఫ్యాక్టరీలో ప్యాకింగ్‌ విభాగంలో, లోడింగ్‌.. అన్‌లోడింగ్‌ సెక్షన్‌లో, సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకోమని బతిమిలాడాలి..అమరావతిలో పేదలనే వారు అసలు ఉండకూడదు.. ఎన్నో ఏళ్లుగా ఇలా కొనసాగుతోంటే ఈ సీఎం జగన్‌ వచ్చాక, ఆ పరిస్థితి మార్చేస్తున్నారు.. సీఎం ఇలా చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా.. కోర్టుల్లో కేసులేశాం.. లేని వివాదాలు సృష్టించాం.. భయాందోళనలు పెంచేశాం.. డబ్బు సంచులతో ఎన్‌ఆర్‌ఐలను దింపాం.. పనోళ్లను పనోళ్లుగా ఉంచకుండా పేదరికాన్ని తగ్గించేస్తే మేమంతా ఏమైపోవాలి?’ అని చంద్రబాబు ఆయన పెత్తందారుల గ్యాంగ్‌ ఊగిపోతోంది. ⇒ ఈనాడు రామోజీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని మందులు వాడినా హిస్టీరియా తగ్గడం లేదు. రాత్రిళ్లు ఉన్నట్లుండి లేచి కూర్చుంటున్నారట. అదిగో జగన్‌.. జగన్‌.. మళ్లీ వస్తున్నాడు అంటూ కలవరిస్తున్నారట! తప్పకుండా ఆయన కల నెరవేరుతుంది. పేదరికంపై, పేదలపై, దిగువ మధ్యతరగతి వర్గాలపై విషం నింపుకున్న ఈ పెత్తందారులు ఫలానా మంచి పని చేశామని ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోలేని దుస్థితిలో నిస్సిగ్గుగా మంచి చేస్తున్న ప్రభుత్వంపై దుర్మార్గంగా నిందలు వేస్తున్నారు. దు్రష్పచారాలు చేస్తున్నారు. వీరందరి వలువలూడదీసి తరమడానికి ఓటర్లంతా సిద్ధంగా ఉన్నారు. ఊరూరా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు బారులు తీరి కనిపిస్తున్నారు. ఆ రెండు బటన్లు ఎప్పుడెప్పుడు నొక్కుదామా అని వేచి చూస్తున్నారు.

CM YS Jagan Will Win In Election says 22 national media surveys
వన్స్‌ మోర్‌.. 22 జాతీయ మీడియా సర్వేల్లోనూ ‘ఫ్యాన్‌’కే పట్టం

సాక్షి, అమరావతి: గత 59 నెలలుగా సుపరి­పాలనతో ఇంటింటి ప్రగతి, సమ్మిళిత అభివృద్ధిని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాక్షాత్కారం చేశారు. సుపరి­పాలన.. ఇంటింటి అభివృద్ధి.. సుస్థి­రాభివృద్ధి మరింత ఉద్ధృతంగా కొనసాగాలంటే మళ్లీ వైఎస్‌ జగనే రావాలని ప్రజలు బలంగా కోరుకుంటు­న్నారు. ఫ్యాన్‌ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓట్లేసి వైఎస్సార్‌­సీపీకి మరోసారి అఖండ విజయాన్ని అందించేందుకు సిద్ధ­మయ్యారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టడం.. టీడీపీ–­జనసేన–­బీజేపీ కూట­మి సభ­లకు ప్రజాస్పందన లేకపోవడాన్ని బట్టి వైఎస్సార్‌­సీపీ మరోసారి ఘన విజయం సాధించడం తథ్య­మని రాజకీయ పరి­శీలకులు తేల్చిచెబు­తు­న్నారు. జాతీయ మీడియా సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్వ­హించిన 22కుపైగా సర్వే­ల్లోనూ వైఎస్సార్‌­సీపీ తిరిగి అఖండ విజయం సాధి­స్తుందని వెల్లడైంది. సీఎం జగన్‌ సుపరిపాలనపై సాను­­కూల పవనాలు ప్రచండంగా వీస్తుండడంతో అనుకూల (పాజిటివ్‌) ఓటు­తో వైఎస్సార్‌సీపీ మరో­సారి చారి­త్రక విజయం సాధించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంటింటి భవిష్యత్తు మరింత గొప్పగా మారాలంటే..గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో సీఎం జగన్‌ 99 శాతం అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లు నేరుగా జమ చేశారు. నాన్‌ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూ­ర్చా­రు. వాటిని సద్వినియోగం చేసుకున్న ప్రజలు తమ జీవనోపాధులను మెరుగుపర్చుకు­న్నారు. బాబు హ­యాంలో 2018–19లో రాష్ట్రంలో పేద­రికం 11.77 శాతం ఉంటే 2022–23 నాటికి సీఎం జగన్‌ పాల­నలో 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. మళ్లీ జగన్‌ వస్తేనే ఇంటింటి భవి­ష్యత్తు మరింతగా మారుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సాగు మరింత లాభసాటిగా మారాలంటే..సీఎం జగన్‌ విప్లవాత్మక సంస్కరణలతో వ్యవసాయ రంగాన్ని చక్కదిద్దారు. గ్రామాల్లో వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తు నుంచి విక్రయం వర­కూ రైతన్నలను చేయిపట్టుకుని నడిపిస్తున్నారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం, సున్నా వడ్డీకే పంట రుణాలు, ఉచిత పంటల బీమా అందిస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ, విపత్తుల వల్ల పంట నష్టపోతే ఆ సీజన్‌ ముగిసేలోగా రైతులకు పరిహారం అందిస్తున్నారు. వ్యవసాయాన్ని లాభ­సా­టి­గా మార్చారు. బాబు హయాంలో వ్యవసాయ రంగంలో రాష్ట్ర వృద్ధి రేటు 2018–19లో 8.3 శాతంతో దేశంలో 12వ స్థానంలో ఉంటే 2023–24 నాటికి 13 శాతానికి వృద్ధి రేటు పెరిగింది. వ్యవసాయ వృద్ధి రేటులో ఏపీ ఆరో స్థానంలో నిలిచింది. మళ్లీ జగన్‌ వ­స్తేనే వ్యవసాయం మరింత లాభసాటిగా మారు­తుందని రైతన్నలు, కౌలు రైతులు విశ్వసిస్తున్నారు. విద్యా ప్రమాణాలు మరింత ఉన్నతంగా మారాలంటే..ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు ద్వారా కార్పొరేట్‌ స్థాయికి అభివృద్ధి చేసిన సీఎం జగన్‌ పేదింటి బిడ్డలకు ఇంగ్లీషు మీడియం బోధన అందుబాటులోకి తెచ్చారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ తీసు­కొచ్చారు. అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద లాంటి పథకాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా­ర్థుల సగటు నమోదు నిష్పత్తి రేటు వంద శాతానికి చేరుకుంది. మూడో తరగతి నుంచే విద్యార్థులకు టోఫెల్‌ శిక్షణ ఇస్తున్నారు. 2025–26 నుంచి ఐబీ (ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌) సిలబస్‌ ప్రవేశ­పెట్టనున్నారు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువు­తున్న విద్యార్థులు 2035 నాటికి పదో తరగతి పరీక్షలు ఐబీ సిలబస్‌తో రాయనున్నారు. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, కేంబ్రిడ్జి, ఎంఐటీ భాగస్వామ్యంతో ఆన్‌­లైన్‌ సర్టిఫైడ్‌ కోర్సులను అందిస్తున్నారు. ఉన్నత ప్రమాణాలతో చదువులు పూర్తి చేసుకుని బయ­టకు వచ్చిన మన విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్‌ సంస్థలు ఉద్యోగాలు ఇచ్చేందుకు పోటీ పడే వాతావరణాన్ని కల్పిస్తున్నారు. మళ్లీ జగన్‌ వస్తేనే విద్యా సంస్కరణలు కొనసాగి ఉన్నత విద్యా ప్రమాణాలతో తమ పిల్లల భవిత బాగుంటుందని తల్లితండ్రులు బలంగా భావిస్తున్నారు. వైద్యరంగంలో సంస్కరణలు కొనసాగాలంటే..వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి సీఎం జగన్‌ వైద్య సేవలను పేదల చెంతకు చేర్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్సలు పేద, మధ్య తరగతికి అందుతు­న్నాయి. విస్తరించిన ఆరోగ్యశ్రీతో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తూ ప్రజారోగ్యానికి భరోసా కల్పించారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ దిశగా అడుగులు పడ్డాయి. నాడు–నేడు ద్వారా ప్రభుత్వా­సుపత్రులను బలోపేతం చేయడంతో పాటు 17 కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కొనసాగి నాణ్యమైన వైద్యం ఉచితంగా పేదలకు, మధ్య తరగతికి అందాలంటే మళ్లీ ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు.సుస్థిరాభివృద్ధి దిశగా రాష్ట్రం దూసుకెళ్లాలంటే..విభజిత ఆంధ్రప్రదేశ్‌ను 2014–19 మధ్య అవినీతి పాలనతో చంద్రబాబు అధోగతి పాలు చేశారు. సీఎం జగన్‌ అధికారం చేపట్టాక ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రాష్ట్రాన్ని సుస్థిరాభివృద్ధి వైపు నడిపించారు. రాష్ట్ర అప్పులు కాంపౌండెడ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌(సీఏజీఆర్‌) చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య 21.87 శాతం ఉంటే.. సీఎం జగన్‌ హయాంలో 12.13 శాతానికి తగ్గింది. దేశ జీడీపీలో మన వాటా చంద్రబాబు హయాంలో 4.47 శాతం ఉండగా సీఎం జగన్‌ హయాంలో 4.83 శాతానికి పెరిగింది. దేశ జీడీపీలో రాష్ట్ర జీ­ఎస్‌డీపీ చంద్రబాబు హయాంలో 2018–19లో 11 శాతం ఉంటే.. సీఎం జగన్‌ హయాంలో 2023–24 నాటికి 16.2 శాతానికి పెరిగింది. దేశ జీడీపీలో అత్యధిక జీఎస్‌డీపీ వాటా ఉన్న రాష్ట్రాల్లో ఏపీది నాలుగో స్థానం కావడం గమ­నార్హం. బాబు హ­యాంలో ఏపీ 14వ స్థానంలో ఉండేది. ఇక తలసరి ఆదాయం చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.1,54,031 మాత్రమే ఉంటే 2023–24 నాటికి ఏకంగా రూ.2,19,518కి పెరిగింది. మళ్లీ జగన్‌ వస్తేనే రాష్ట్రం సుస్థిరాభివృద్ధి వైపు దూసుకెళుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.ఉద్యోగ, ఉపాధి విప్లవం మరింత గొప్పగా కొనసాగాలంటే..పారదర్శక పారిశ్రామిక విధానంతో సులభతర వాణిజ్యం(ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో సీఎం జగన్‌ ఏటా రాష్ట్రాన్ని దేశంలో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపారు. విశాఖలో 2023 మార్చిలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో రూ.13,08,887 కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఒ­ప్పందాలు చేసుకున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చే­స్తూ 59 నెలల్లో రూ.3,02,085 కోట్ల పెట్టుబడి పె­ట్టారు. ఎంఎస్‌ఎంఈలకు పోత్సాహకాలు ఇవ్వ­డంతో వాటి సంఖ్య 1.9 లక్షల నుంచి 7 ల­క్షలకు పెరి­గింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 58.22 లక్షల మంది ఉపాధి పొందారు. మళ్లీ జగన్‌ వస్తేనే భారీ పరిశ్రమలు వస్తాయని, ఉపాధి అవకా­శాలు భారీగా ఉంటాయని యువత బలంగా విశ్వసిస్తోంది.మహాస్వప్నం సాకారం కావాలంటే..విశాఖపట్నం సమీపంలో రూ.5 వేల కోట్లతో భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును సీఎం జగన్‌ నిర్మిస్తున్నారు. ఒకవైపు విదేశీ వర్సిటీల నుంచి ప్రతిష్టాత్మక కోర్సులు పూర్తి చేసిన రాష్ట్ర యువత.. బలమైన గ్రోత్‌ ఇంజిన్‌ లాంటి విశాఖ నగరం.. ఐకానిక్‌ బిల్డింగ్‌లు.. పెద్ద ఎత్తున వచ్చే ఐటీ, ఇతర పరిశ్రమలు.. కోస్తా తీరమంతటా విరాజిల్లేలా ‘బ్లూ’ ఎకానమీని ఆవిష్కరించడానికి సీఎం జగన్‌ నడుం బిగించారు. మళ్లీ జగన్‌ వస్తేనే ఆ మహాస్వప్నం సాకారమై రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలో అగ్రగామిగా నిలుస్తుందని సామన్యుల నుంచి మేధావుల వరకూ బలంగా విశ్వసిస్తున్నారు. రాష్ట్రం రూపురేఖలు సమూలంగా మారాలంటే..సువిశాలమైన 974 కి.మీ.ల పొడవైన తీర ప్రాంతం రాష్ట్రం సొంతం. తీరం మన బలం అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు దాన్ని ఎన్నడూ ఉపయోగించుకోవాలనే ఆలోచన చేయలేదు. సీఎం జగన్‌ రూ.16,500 కోట్లతో నాలుగు పోర్టులు­(కాకినాడ గేట్‌వే, మూలపేట, రామా­య­­పట్నం, మచిలీపట్నం) నిర్మిస్తున్నారు. పది ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను నెలకొల్పుతున్నారు. ఇవన్నీ పూర్తయితే పోర్టు ఆధారిత పరిశ్రమలు స్థాపించేందుకు దిగ్గ­జాలు క్యూ కట్టడం ఖాయం. రామా­య­పట్నం పోర్టు వద్ద ఇండోసోల్‌ పరిశ్రమ అప్పు­డే ఉత్ప­త్తులను ప్రారంభించడమే అందుకు నిదర్శనం. మళ్లీ జగన్‌ వస్తేనే పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తాయని, రాష్ట్రం రూపురేఖలు సమూలంగా మారుతాయని యువత బలంగా నమ్ముతోంది.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all