Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Elections 2024: May 15th Politics Latest News Updates Telugu
May 15th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 15th AP Elections 2024 News Political Updates9:40 AM, May 15th, 2024టీడీపీ నాయకుల దాష్టీకం..పల్నాడు జిల్లా..దాచేపల్లి మండలం మాదినపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాష్టీకంకర్రలు, ఇనుప రాడులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులుబత్తుల ఆదినారాయణ రెడ్డి అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులుతీవ్ర గాయాల కారణంగా ఆసుపత్రికి తరలింపు.గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్‌ చేసిన పోలీసులు 8:51 AM, May 15th, 2024ఏలూరులోనూ టీడీపీ దౌర్జన్యకాండఏలూరు చేపల తూము సెంటర్ 40 డివిజన్ లో రెచ్చిపోయిన టీడీపీ మూకలువైఎస్ఆర్సిపి కార్యకర్తలపై కత్తులతో దాడిగణేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలుపోలింగ్ కేంద్రాల వద్ద ఇరువర్గాల మధ్య చెలరేగిన గొడవ.. తాజా కొట్లాటకు దారి తీసిన వైనంగాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అర్ధరాత్రి టెన్షన్ వాతావరణంప్రభుత్వ ఆసుపత్రి వద్ద మళ్లీ దాడిరంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులుకొనసాగుతున్న పోలీస్‌ పహారా 8:25 AM, May 15th, 2024కడపలో అభ్యర్థులకు హైసెక్యూరిటీవైయస్సార్ జిల్లా జమ్మలమడుగులో కొనసాగుతున్న 144 సెక్షన్పట్టణంలో జనాలు ఎక్కువగా గుమికూడి ఉండకూడదంటూ పోలీసుల ఆదేశాలువైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డితో పాటు కూటమి అభ్యర్ది ఆదినారాయణ రెడ్డి, కడప టిడిపి ఎంపీ అభ్యర్ది భూపేష్ రెడ్డి లకు 2+2 నుండి 4+4 భద్రత పెంపు 7:59 AM, May 15th, 2024ఏపీలో పోలింగ్‌ శాతం మొత్తంగా ఇలా.. ఏపీలో మొత్తంగా 81.69 శాతం పోలింగ్ నమోదు.ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ నమోదు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతం నమోదు.అల్లూరి : 70.20అనకాపల్లి : 83.84అనంతపురం : 81.08అన్నమయ్య : 77.83బాపట్ల : 85.15చిత్తూరు : 87.09కోనసీమ : 83.84తూ.గో : 80.93ఏలూరు : 83.67గుంటూరు : 78.81కాకినాడ: 80.31కృష్ణా: 84.05కర్నూలు : 76.42నంద్యాల: 82.09ఎన్టీఆర్: 79.36పల్నాడు : 85.65పార్వతిపురం మన్యం : 77.10ప్రకాశం : 87.09నెల్లూరు : 79.63సత్యసాయి : 84.63శ్రీకాకుళం : 75.59తిరుపతి : 78.63విశాఖ : 68.63విజయనగరం : 81.33ప.గో : 82.59కడప : 79.58 7:45 AM, May 15th, 2024టీడీపీ నేతల దాడులు..పల్నాడు జిల్లామాచవరం గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ గుండాలు దాడి.మాచవరం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు చౌదరి సింగరయ్య పార్టీ నాయకుడు దారం లక్ష్మీ రెడ్డిపై టీడీపీ నాయకుల దాడి.ఇద్దరి కాళ్లు, చేతులపై దాడి. గాయపడిని వారిని స్థానిక ఆసుపత్రికి తరలింపు. 7:20 AM, May 15th, 2024శాంతి భద్రతలకు సహకరిస్తాం: కేతిరెడ్డి పెద్దారెడ్డిఅనంతపురం:ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్‌..టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాంతాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమన్వయంతో ఉండాలిశాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తాం. 7:00 AM, May 15th, 2024తాడిపత్రిలో ఉద్రిక్తతలు..అనంతపురం:తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాల మోహరింపుతాడిపత్రిలో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన జేసీ వర్గీయులుఅల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులుపోలీసుల విజ్ఞప్తితో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితాడిపత్రిని వీడిన టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో పరిస్థితి ని అదుపులోకి తెచ్చిన పోలీసులునగరంలో 144 సెక్షన్ కొనసాగింపు 6:45 AM, May 15th, 2024డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్ టీడీపీ దౌర్జన్యకారుల మీద చర్యలకు డిమాండ్ఏపీ డీజీపీ హరీష్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన వనిత. చంద్రగిరి, గురజాల, తాడిపత్రి, గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తల హింసాకాండ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని వనిత సీరియస్‌. దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు. 6:30 AM, May 15th, 2024విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్‌ గాలి బ్రహ్మాండంగా వీచింది: బొత్సఅన్ని ప్రాంతాల్లోని ఫ్యాన్‌ గాలి కనిపించిందిమహిళలు, పెద్ద ఎత్తున బారులు తీరి ఓటింగ్‌లో పాల్గొన్నారుతమకు గౌరవం పెరిగిందని వృద్దులు భావించి ఓటు వేశారు.ఎన్నికల్లో టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నిందిప్రజలు సంక్షేమ పథకాలను అడ్డుకుంది.ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయివైఎస్‌ .జగన్‌ గెలుస్తారు.. వైజాగ్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారుఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నెరవేర్చుతారుమాయ మాటలను ప్రలోభాలను ప్రజలు నమ్మలేదునేను రాజీనామా చేస్తున్నట్లు ఒక మాయ లేఖ సృష్టించిందిఈ లేఖ కూటమి దిగజారుడు రాజకీయాలకు ఒక పరాకాష్టమాయ మాటలతో అధికారంలోకి రావాలని చంద్రబాబు చూశారుచంద్రబాబు మాయ మాటలు ప్రజలు అందరికి తెలుసుమాట ఇస్తే మడమ తిప్పని నేతలు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్సీఎం జగన్ మీద నమ్మకంతో మళ్ళీ ప్రజలు ఓట్లు వేశారుటీడీపీ నేతలు సహనం కోల్పోయారుమా నాయకులు, కార్యకర్తలు ఉద్రేకపడొద్దని సూచన చేశాంఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు

Supreme Court Orders Release Of NewsClick Founder Details
NewsClick Row: ప్రబీర్‌ తక్షణ రిలీజ్‌కు సుప్రీం కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ అరెస్ట్‌ చెల్లదని, ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ న్యూస్‌ పోర్టల్‌కు విదేశీ నిధులు అందుతున్నాయంటూ.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద కిందటి ఏడాది అక్టోబర్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే.. అరెస్టుకు సరైన కారణాలు చెబుతూ రిమాండ్‌ కాపీని సమర్పించడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారు. దీంతో.. రిమాండ్‌ కాపీ తమకు అందకపోవడంతో ఈ అరెస్ట్‌ చెల్లదని, వెంటనే ఆయన్ని రిలీజ్‌ చేయాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా పంకజ్‌ బన్సాల్‌ కేసును కోర్టు ప్రస్తావించింది. అరెస్టుకు గల కారణాలేంటో నిందితులకు కూడా రాతపూర్వకంగా పోలీసులు తెలియజేయాల్సి ఉంటుందని పంకజ్‌ బన్సాల్‌ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ కేసులోనూ అదే వర్తిస్తుంది అని బెంచ్‌ స్పష్టం చేసింది. చైనా అనుకూల ప్రచారానికి నిధులు అందుకున్నారనే ఆరోపణలు రావడంతో ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అక్టోబర్‌ 3వ తేదీన న్యూస్‌క్లిక్‌పోర్టల్‌లో పని చేసే జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేశారు. డిజిటల్‌ పరికరాలు, పలు డాక్యుమెంట్లను సీజ్‌ చేశారు. అదే రోజు ప్రబీర్‌ పుర్కాయస్థతో పాటు ఆ సంస్థ హెచ్‌ఆర్‌ హెడ్‌ అమిత్ చక్రవర్తిని అరెస్టు చేసినట్టు ఢిల్లీ పోలీస్‌ అధికార ప్రతినిధి సుమన్‌ నల్వా వెల్లడించారు. ‘న్యూస్‌క్లిక్‌’ సంస్థకు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ గత ఏడాది ఆగస్టులో ‘న్యూయార్క్‌ టైమ్స్’లో కథనం ప్రచురితమైంది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికా మిలియనీర్‌ నెవిల్‌ రాయ్‌సింగం నుంచి గ్లోబల్‌ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్న న్యూస్‌క్లిక్‌ నిధులు పొందినట్టు ఆ కథనంలో పేర్కొంది. దీంతో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు దిల్లీ పోలీసులు.ఈ క్రమంలోనే న్యూస్‌క్లిక్‌ ఆఫీస్‌తో పాటు ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లు సహా మొత్తం 30 చోట్ల సోదాలు జరిపి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసుల తీరుపై ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇంకోవైపు.. ‘న్యూస్‌క్లిక్‌’పై దాడులను విపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు మాట్లాడేవారి గళాన్ని అణచివేసేందుకే కేంద్రం సోదాలు చేపట్టిందని విమర్శించారు. బిహార్‌లో కులగణనలో బయటపడిన విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేంద్రం న్యూస్‌క్లిక్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని విపక్షాలు ఆ సమయంలో మండిపడ్డాయి.

AP Elections 2024: TDP Attacks YSRCP Cadre May 15 News Updates
టీడీపీ రాక్షస మూకల రక్తదాహం

హైదరాబాద్‌, సాక్షి: పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా తెలుగు దేశం పార్టీ రాక్షస మూకల రక్తదాహం తీరలేదు. మంగళవారం రెండో రోజూ రాష్ట్రంలో అనేక చోట్ల తీవ్ర స్థాయిలో హింసాకాండకు, విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులకు దిగారు. బుధవారం కూడా బీతావాహ వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు, తాడిపత్రి లాంటి చోట్ల తెలుగు దేశం ముఖ్య నేతలను ముందుండి.. తమ శ్రేణులను, అరాచక మూకలను రెచ్చగొడుతూ దాడులు చేయించి, బీభత్సం సృష్టించారు. ఎన్నికల్లో తమకు ఓటేయలేదన్న కక్షతో.. దొరికినవారిని దొరికినట్లుగా తీవ్రంగా కొట్టారు. రక్తాలు కారేలా గాయపరిచారు. ఆస్తులు ధ్వంసం చేశారు.టీడీపీ మూకలు పేట్రేగిపోవడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో పాటు, స్థానిక ప్రజలూ భీతావహులయ్యారు. అంత విధ్వంసం జరుగుతుంటే... వారిని అడ్డుకోవడంలోనూ పోలీస్‌ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది.పల్నాడుదాచేపల్లి మండలం మాదినపాడు లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాస్టికంకర్రలు ఇనుప రాడులతో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలపై దాడులుబత్తుల ఆదినారాయణ రెడ్డి అనే కార్యకర్తపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులుతీవ్ర గాయాలు హాస్పిటల్ తరలింపుకాళ్లు చేతులు నరికేశారు!పల్నాడు మాచవరంలో టీడీపీ శ్రేణులు కత్తులతో విచక్షణా రహితంగా దాడులు చేశాయి. వైఎస్సార్‌సీపీ నేతలు సింగరయ్య, లక్ష్మీరెడ్డి కాళ్లు చేతులు నరికేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.తాడిపత్రిలోనూ ఉద్రిక్తతలుతాడిపత్రి లో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలు. జేసీ వర్గీయులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసుల విజ్ఞప్తి తో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. మరోవైపు పోలీసుల ఆదేశాల మేరకు.. టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం తాడిపత్రి వదిలి బయటకు వెళ్లారు. తాడిపత్రి లో 144 సెక్షన్ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. జేసీ దౌర్జన్యాల్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాంతాడిపత్రి ఉద్రిక్తతలకు కారణమైన జేసీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబంపై పెద్దారెడ్డి మండిపడ్డారు. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని, తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంయమనం పాటించలని పిలుపు ఇచ్చారు. అలాగే.. నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరిస్తామని తెలిపారాయన.పల్నాడులో 144పోలింగ్‌ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు కొనసాగుతుండడం.. విమర్శలు వెల్లువెత్తడంతో అధికార యంత్రాంగం కదిలింది. పల్నాడు వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలుకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్‌ పోలీసు శాఖకు ఉత్తర్వులిచ్చారు. నరసరావుపేట లోక్‌సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమికూడొద్దని, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు.

BJP Full Focus On MLC By Election In Telangana
ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌.. మరో కొత్త ప్లాన్‌!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోపు ఉప ఎన్నికకు రంగం సిద్థమైంది. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఇక, బీజేపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవ‍ర్గాలవారీగా ఇన్‌చార్జ్‌లను నియమించనున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జ్‌ల నియామకం చేపట్టనున్నారు. ఇక, ఇన్‌చార్జ్‌లను నియమించే బాధ్యతను రాష్ట్ర నేతలకు అప్పగించింది బీజేపీ హైకమాండ్‌. దీంతో, ఇన్‌చార్జ్‌లు ఎవరు అనే అంశంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ప్రేమందర్‌ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగుల రాకేష్‌ రెడ్డి పోటీలో నిలిచారు. ఇక, ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఉపఎన్నికపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీ కాలం 2027 మార్చి వరకు ఉంది. మరోవైపు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 63 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగియడంతో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Rahul Dravid Was Asked To Stay As Head Coach He Turned Down Ricky Ponting In Race
BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?

భారత పురుషుల సీనియర్‌ క్రికెట్‌ జట్టుకు కొత్త హెడ్‌ కోచ్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ అత్యున్నత పదవి కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగలవారు ఈనెల 27వ తేదీలోపు తమ దరఖాస్తులు పంపించాలి.ఎంపికైన కొత్త హెడ్‌ కోచ్‌ పదవీకాలం మూడేన్నరేళ్లపాటు (1 జూలై 2024 నుంచి 31 డిసెంబర్‌ 2027 వరకు) ఉంటుంది. ప్రస్తుత హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం గత ఏడాది నవంబర్‌లో వన్డే వరల్డ్‌కప్‌ అనంతరం ముగిసింది.అయితే టి20 ప్రపంచకప్‌ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్‌ ముగిసేవరకు టీమిండియాకు తాత్కాలిక కోచ్‌గా కొనసాగాలని బీసీసీఐ కోరడంతో ద్రవిడ్‌ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో కొత్త హెడ్‌ కోచ్‌ పదవి కోసం ద్రవిడ్‌ కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. నో చెప్పిన ద్రవిడ్‌అయితే, ఇందుకు ద్రవిడ్‌ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరికొంత కాలం పాటు అతడిని కోచ్‌గా కొనసాగాలని టీమిండియా ప్రధాన ఆటగాళ్లలో కొందరు అభ్యర్థించినట్లు సమాచారం. కనీసం టెస్టు జట్టుకైనా ద్రవిడ్‌ మార్గదర్శకుడిగా ఉంటే బాగుంటుందని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.కానీ వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌ల నియామకంపై క్రికెట్‌ అడ్వైజరీ కమిటీదే తుది నిర్ణయం అని.. ఏదేమైనా ఇలాంటి ప్రతిపాదనలు ఆమోదం పొందకపోవచ్చని జై షా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు.. రాహుల్‌ ద్రవిడ్‌ సైతం హెడ్‌ కోచ్‌ పదవికి గుడ్‌బై చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.లక్ష్మణ్‌కు ఆ ఛాన్స్‌ లేదుమరోవైపు.. ద్రవిడ్‌ గైర్హాజరీలో టీమిండియా కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ పనులతో బిజీగా ఉన్నాడు. అయితే, బీసీసీఐ అతడిని అక్కడి నుంచి కదిలించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.ఫ్లెమింగ్‌ లేదంటే రిక్కీ పాంటింగ్‌?ఈ నేపథ్యంలో.. ఈసారి విదేశీ కోచ్‌ను రంగంలోకి తీసుకువచ్చేందుకు బీసీసీఐ సుముఖంగానే ఉన్నట్లు జై షా హింట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు రాగా.. మరో పేరు కూడా తెర మీదకు వచ్చింది.ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రిక్కీ పాంటింగ్‌ కూడా టీమిండియా హెడ్‌కోచ్‌ పదవి రేసులో ఉన్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా వీరిద్దరు ప్రస్తుతం ఐపీఎల్‌ జట్లకు హెడ్‌కోచ్‌లుగా ఉన్నారు. చెన్నై సూపర్‌ కింగ్స్ కోచ్‌గా స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఆ జట్టును ఐదుసార్లు విజేతగా నిలపడంలో కృషి చేయగా.. ‌ ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌(ప్రస్తుతం) జట్లకు కోచ్‌గా పనిచేసిన అనుభవం పాంటింగ్‌కు ఉంది.అది సాధ్యం కాదన్న పాంటింగ్‌అయితే, వీళ్లిద్దరు కూడా టీమిండియా హెడ్‌కోచ్‌ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే వరుస సిరీస్‌లతో బిజీగా ఉండే టీమిండియా కోసం కోచ్‌ ఏడాదిలో దాదాపు 10 నెలల పాటు అంకితం కావాల్సి ఉంటుంది.కాబట్టి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే వీలుండదు. అందుకే భారత జట్టు హెడ్‌కోచ్‌ పదవి ఆఫర్‌ వచ్చినా తాను చేపట్టలేదని రిక్కీ పాంటింగ్‌ గతం(2021)లో వెల్లడించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా కొత్త కోచ్‌గా ఎవరు వస్తారో? అంటూ క్రికెట్‌ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది.చదవండి: సీజన్‌ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్‌ రాహుల్‌

IndiGo discussions with ATR Embraer and Airbus to acquire at least 100 smaller planes
100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..

ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలందించేలా ఇండిగో సంస్థ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దానికోసం మూడు విమాన తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది.ఇండిగో సంస్థ ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. స్థానికంగా ప్రయాణికులకు రవాణా సేవలందించి లాభాలు పొందాలని యోచిస్తోంది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. అయితే వీటి తయారీకి ఏటీఆర్‌, ఎంబ్రాయిర్‌, ఎయిర్‌బస్‌ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా 50 విమానాలకు ఆర్డరు పెట్టి, తర్వాత మరో 50 విమానాలు కొనుగోలు చేయాలనుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండిగో 45 ఏటీఆర్‌-72 విమానాలను నడుపుతోంది. అందులో ప్రతి విమానంలో 78 సీట్లు ఉంటాయి. ఈ ఏడాదిలో మరో 5 కొత్త విమానాలు కంపెనీలో చేరనున్నాయి.ఇదీ చదవండి: తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్‌ జ్యూస్‌ ఫ్యూచర్లపై ‍ప్రభావంఏటీఆర్‌తోపాటు ఎయిర్‌బస్ ఏ220, ఎంబ్రేయర్ ఈ-175 రకం విమానాలను కంపెనీ పరిశీలిస్తోంది. ఇటీవల అంతర్జాతీయ మార్గాలను చేరుకునేందుకు వీలుగా ఏప్రిల్‌లో 30 ఎయిర్‌బస్ ఏ350-900 విమానాల కోసం ఆర్డర్‌ చేసింది.

Ram Pothineni Double Ismart Teaser Telugu
రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?

'లైగర్' దెబ్బకు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. 'డబుల్ ఇస్మార్ట్'తో ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయిపోయాడు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు? ఇంతకీ ఎలా ఉంది? హిట్ కొడతారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)2019లో రిలీజైన 'ఇస్మార్ట్ శంకర్'.. ఊహించిన విధంగా హిట్ అయింది. పూరీ జగన్నాథ్‌కి చాన్నాళ్ల తర్వాత సక్సెస్ రుచి చూపించింది. రామ్ కూడా ఫుల్ ఖుషీ అయిపోయాడు. కానీ దీని తర్వాత పూరీకి 'లైగర్' రూపంలో ఘోరమైన డిజాస్టర్ ఎదురైంది. రామ్‌ది ఇదే పరిస్థితి. చేసిన సినిమా చేసినట్లే ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో వీళ్లిద్దరూ కలిసి 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ చేశారు. అదే 'డబుల్ ఇస్మార్ట్'. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.పూరీ జగన్నాథ్ సినిమాలంటే పంచ్ డైలాగ్స్, మాస్ మూమెంట్స్‌ని ఆడియెన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ ఈ టీజర్‪‌లో ఆ రెండూ మిస్ అయ్యాయి. టీజర్ అంతా కూడా పాత్రల పరిచయానికే ఉపయోగించినట్లు కనిపిస్తుంది. 'డబుల్ ఇస్మార్ట్'లో రామ్ తనదైన మేనరిజమ్ చూపించగా.. హీరోయిన్‌గా కావ్య థాపర్ కనిపించింది. అలీకి ఆది మానవుడి తరహా కామెడీ పాత్ర ఇచ్చినట్లు ఉన్నారు. సంజయ్ దత్ గన్స్‌తో కనిపించాడు. రామ్ రెండు డైలాగ్స్ చెప్పాడు గానీ వీటిలో పంచ్ అయితే లేదు. ఎప్పటిలానే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆకట్టుకోగా.. చివర్లో శివ లింగాన్ని చూపించి సినిమాలో డివోషనల్ టచ్ కూడా ఉందని చెప్పకనే చెప్పారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్‌పై అలా)

EAM S Jaishankar slams on Western media over Indian elections
అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరికలపై స్పందించిన జైశంకర్‌

కోల్‌కతా: భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల గురించి విదేశీ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ మండిపడ్డారు. భారత్‌లోని ఎన్నికల గురించి వ్యతిరేక కథనాలు ప్రచురిస్తోందన్నారు. తాను రాసిన ‘‘వై భారత్‌ మాటర్స్‌’’ బుక్‌ బంగ్లా ఎడిషన్‌ను జైశంకర్‌.. కోల్‌కతాలో రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జైశంకర్‌ మాట్లాడారు.‘‘విదేశీ మీడియా మన దేశాన్ని ప్రభావితం చేయాలనుకుంటోంది. ఎందుకుంటే ఈ ప్రపంచాన్ని వాల్లు గత 70-80 ఏళ్ల నుంచి ప్రభావం చేస్తున్నామని భావిస్తున్నాయి. కొన్ని పాశ్చాత్య దేశాలు సైతం వాళ్లు ప్రపంచాన్ని 200 ఏళ్ల నుంచి ప్రభావితం చేస్తున్నామని భావిస్తున్నాయి. వాళ్లు తమ అలవాట్లను మార్చుకోవటం అంత సులువైన పని కాదు...విదేశీ మీడియా ఎందుకు భారత్‌కు వ్యతిరేకంగ కథనాలు ప్రచురిస్తోంది?. ఎందుకంటే దేశంలో ఒక వర్గం వారు పాలించాలని ఆరాటపడుతోంది. అందుకే ప్రభావితం చేయలానుకుంటోంది. కానీ, భారతీయ ప్రజలంతా అలా భావించటం లేదు. అదీకాక విదేశీ మీడియా రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సైతం బహిరం‍గంగా ఆమోదం తెలుపుతోంది. వారు తమ ప్రాధాన్యతను దాచుకోవటం లేదు. చాలా తెలివిగా ప్రవర్తిస్తోంది. కొంతమంది ఇలానే 300 ఏళ్ల నుంచి ప్రవర్తిస్తూ చాలా అనుభవం పొందారు. ..కొన్ని న్యూస్‌పేపర్లు తరచూ దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తుంటాయి. పలు ఇండెక్స్‌ల్లో తక్కువగా చూపుతారు. తమ ఎన్నికల ఫలితాలను నిర్ణయించుకోవడానికి కోర్టుకు వెళ్లే దేశాలు సైతం.. మనకు ఎన్నికలు నిర్వహించటం గురించి తెలియజేయటం చాలా విడ్డూరం’’ అని జైశంకర్‌ అన్నారు.ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టుకు సంబంధించి భారత్‌ ఒ‍ప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఒప్పందంపై అమెరికా చేసిన ఆంక్షల హెచ్చరికలపై మంత్రి శంకర్‌ స్పందించారు.‘ఈ ప్రాజెక్టు ఆ ప్రాంతం మొత్తం ప్రయోజనం చేకూర్చుతుంది. ఈ విషయంలో సంకుచితంగా ప్రవర్తించటం మానుకోవాలి. గతంలో ఇదే చాబహార్‌ పోర్టు గురించి అమెరికా ప్రశంసలు కురిపించింది. అమెరికా చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇది అందరీ ప్రయోజనం కోసం చేపట్టిన ఒప్పందం. ఈ విషయాన్ని కూడా సంకుచితం స్వభావంతో చూడవద్దు’ అని జైశంక్‌ అన్నారు.

road accident at chilakaluripet palnadu district
పల్నాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం

పల్నాడు: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరి పేట-పర్చూరు జాతీయరహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట ఈవూరవారిపాలెంలో జరిగిన ఈ ప్రమాదంలో ట్రవెల్స్‌ బస్సును టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు, టిప్పర్‌ పూర్తిగా తగలబడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌, టిప్పర్‌ డ్రైవర్‌, నాలుగురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. 32 మందికి గాయాలు అయ్యాయి. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి ఉంది. గాయపడి వారిని గుంటూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.చినగంజాం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు బాపట్ల జిల్లా చినగంజాం మండలం నీలాయపాలెం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఎన్నికలలో ఓటువేసి తిరిగి హైదరాబాదు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రమాద ఘటన సమాచారాన్ని 108, పోలీసులకు చేరవేయటంతో వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. బైపాస్‌ పనులు జరుగుతుండటం.. తారురోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవటం వల్ల టిప్పర్‌ వేగంగా దుసుకువచ్చింది. టిప్పర్‌ డ్రైవర్‌ వేగాన్ని కంట్రోల్‌ చేయకపోవటమే ప్రమాదానికి కారమైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.మృతుల వివరాలు..అంజి (35) డ్రైవర్, చీరాల, బాపట్ల జిల్లాఉప్పుగుండూరు కాశీ (65), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లాఉప్పుగుండూరు లక్ష్మి (55), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లాముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ (8), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement