Top Stories
ప్రధాన వార్తలు
ఏపీ ఫలితాలపై సజ్జల కీలక వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని.. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువే గెలుస్తామని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు.‘‘చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెన్ చేశారు. జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కుప్పంలోనూ వైఎస్సార్సీపీ గెలవబోతోంది. కుట్రపూరితంగా కేంద్రం సహాయంతో కొందరు అధికారులను తప్పించారు. ల్యాండ్ టైట్లింగ్‌పై చంద్రబాబు అర్థంలేని ఆరోపణలు చేశారు. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘పోలీసులు పెద్దారెడ్డి ఇంట్లోని సీసీటీవీలు ధ్వంసం చేయడం అన్యాయం. పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు సీసీ కెమెరాలు ధ్వంసం చేయడమేంటి?. దాడిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం’’ అని సజ్జల చెప్పారు.‘‘కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతాయని అనుకోవడం లేదు.. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటాం. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. ఇప్పటికేనీ ఈసీ తప్పు సరిదిద్దుకుంటే మంచింది’’ అని సజ్జల హితవు పలికారు.మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. సాంప్రదాయ ఓటు బ్యాంక్ మావైపు ఉంది. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న తీరు చూస్తుంటే మళ్ళీ విజయం సాధిస్తాం. పొలింగ్ పర్సంటేజ్ పెరిగితే మేము ఓడిపోతామన్న భ్రమలో టీడీపీ ఉంది. మాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవు. ప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదు. వివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా. సీఎం జగన్ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు. నన్ను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారు. టీడీపీ గెలవడానికి ఉన్న ఒక్క కారణమైనా చెప్పగలరా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.‘‘చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పలేక పోతున్నారు. టీడీపీ కూటమి వలనే పోలింగ్ లో హింస జరిగింది. వారు చెప్పిన అధికారులే హింసకు కారణమయ్యారు. ఇప్పుడు వాళ్లనే ఈసీ తొలగించి చర్యలు తీసుకుంది. ఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందరు ఉన్నారు. పోలింగ్ కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారు. అల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లే. వీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లే. ఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్‌కు లేఖలు రాస్తున్నారు. రికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు రాస్తున్నారు’’ అని సజ్జల ధ్వజమెత్తారు.‘‘తాడిపత్రిలో పెద్ధారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ గురించి ఎన్నికల తరువాత టీడీపీ ఎందుకు మాట్లాడటం మానేసింది?. ల్యాండ్ టైటలింగ్ అమలు చేయాలని నీతి అయోగ్ చెప్పింది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలి. టీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుంది. ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాం. ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాం. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాల్లోనూ గెలుస్తాం. జగన్ పాలనలో లబ్ధి పొందని వర్గాలు, న్యాయం జరగని కుటుంబం అంటూ ఏమీ లేవు. అందరికీ మేలు చేసినందునే భారీ సీట్లతో గెలవబోతున్నాం’’ అని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన తీరు చూస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది. ఢిల్లీలో కూర్చున్న ఈసీ పెద్దలు తమ ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాల ఫలితమే రెండు, మూడు రోజుల పాటు జరిగిన హింస అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి వచ్చిన తర్వాత పోలీసు, పరిపాలన వ్యవస్థను తన చేతిలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వారు స్వతంత్రంగా కాకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు కోరిన రీతిలో పక్షపాతంగా వ్యవహరించారు. కూటమి కోరిన అధికారులను కోరిన చోట అప్పాయింట్ చేసింది. వారు కూటమికి విధేయతతో వ్యవహరించి అభాసు పాలయ్యారు. అంతిమంగా సస్పెన్షన్లు, బదిలీలకు గురి కావల్సి వచ్చింది.దీపక్ మిశ్ర అనే రిటైర్డ్ అధికారిని అబ్జర్వర్‌గా నియమిస్తే, ఆయన టీడీపీకి సంబంధించినవారు ఇచ్చిన విందులో పాల్గొన్నారట. ఆ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు బహిరంగంగానే చెప్పారు. ఇది ఎన్నికల సంఘానికి ఎంత సిగ్గుచేటైన విషయం. దీపక్ మిశ్ర ఎక్కడా గొడవలు జరగకుండా చూడాల్సింది పోయి తెలుగుదేశంకు అనుకూలంగా పనిచేయాలని పోలీసులపై ఒత్తిడి చేశారట. అలాగే సస్పెండైన ఒక పోలీసు ఉన్నతాదికారి టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని ఆయా నియోజకవర్గాలలో పోలీసులను ప్రభావితం చేయడానికి కృషి చేశారట.ఇవన్ని వింటుంటే పెత్తందార్లుగా ముద్రపడ్డ చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్‌లు ఎన్నికలలో గెలుపుకోసం ఎన్ని కుట్రలు చేయడానికైనా వెనుకాడలేదని అర్ధం అవుతుంది. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో విద్వంసం సృష్టించడం, అది కనిపించకుండా ఉండాలని సీసీ కెమెరాలు పగులకొట్టడం వంటి సన్నివేశాలు చూసిన తర్వాత పోలీసు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం ఎలా ఉంటుంది? మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పోన్ చేస్తేనే కనీసం సమాధానం ఇవ్వని పోలీసు అధికారులను విశ్వసించడం ఎలా? దీని ఫలితంగానే పల్నాడు ప్రాంతంలో బలహీనవర్గాల ఇళ్లపై దాడులు, అనేక మంది గుడులలో, ఇతరత్రా తలదాచుకకోవలసి వచ్చింది. ఆ మహిళలు రోదించిన తీరుచూస్తే ఎవరికైనా బాద కలుగుతుంది.గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, దానిని బూతద్దంలో చూపుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నించింది. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా యజమానులు ఫ్యాక్షనిస్టులుగా మారి ప్రతి ఘటనకు రాజకీయ రంగు పులిమి, వైఎస్సార్సీపీకి అంటగడుతూ నీచమైన కధనాలు ఇస్తూ వచ్చారు. వారి అండ చూసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు. పోలీసులను బెదిరించేవారు. అంగళ్లు, పుంగనూరుల వద్ద చంద్రబాబు రెచ్చగొట్టడంతో టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం, పోలీసు వాహనాన్ని కూడా వారు దగ్దం చేయడం, ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అంత చేసిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్‌లు అప్పటి చిత్తూరు ఎస్పి మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆయన పేరు రెడ్ బుక్‌లో రాసుకున్నామని, తాము అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత నీ సంగతి చూస్తామంటూ బెదిరించేవారు.ఇలా అనేక మంది అధికారులను తరచూ భయపెట్టే యత్నం చేసినా, దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా ఈ అంశంపై తగు నిర్ణయాలు చేయలేదు. దాంతో టీడీపీ, జనసేన నేతలు చెలరేగిపోతూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనంలోకి వెళ్లడంతో వాటికి పోటీగా ఏమి చెప్పినా, తమకు మద్దతు లబించదని భావించిన చంద్రబాబు, పవన్‌లు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యకు ఏదో ప్రమాదం వాటిల్లిందన్న ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ష్ట్రంలో సైకో పాలన సాగుతోందని పిచ్చి-పిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని యత్నించారు. పవన్ అయితే ఏకంగా ముప్పైవేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని, వలంటీర్లే దానికి బాధ్యులంటూ నీచమైన విమర్శలు కూడా చేశారు. నిప్పుకు వాయువు తోడైనట్లు, రామోజీరావు, రాధాకృష్ణలు ఉన్నవి, లేనివి కల్పించి గాలివార్తలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించడానికి యత్నించారు.ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవపడితే దానికి రాజకీయం పులిమి వీరు రాష్ట్రం అంతటా ప్రచారం చేసేవారు. వెంటనే చంద్రబాబో, లేక ఇతర టీడీపీ నేతలు అక్కడకు వెళ్లి హడావుడి చేసే యత్నం చేసేవారు. ఈ రకంగా గత ఐదేళ్లుగా ఏపీ ఇమేజీని దెబ్బతీయడానికి వీరు గట్టి కృషి చేశారు. ఏదైనా ఘటన జరిగితే రెండువైపులా ఉన్న వాదనలు, వాస్తవ పరిస్థితిని వివరిస్తూ వార్తలు ఇస్తే తప్పుకాదు. అలా కాకుండా టీడీపీ వారిని భుజాన వేసుకుని దారుణ కధనాలు ఇవ్వడం ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజల దృష్టిలో పరువు కోల్పోయాయి. అయినా ఎన్నికల సమయం వచ్చేసరికి వీరు మరింత రెచ్చిపోయారు. ప్రభుత్వపరంగా, లేదా వైఎస్సార్సీపీ పరంగా ఏవైనా తప్పులు ఉంటే చెప్పవచ్చు. కాని.. వైఎస్సార్సీపీని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవన్నట్లుగా వీరు ప్రవర్తించారు.టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే గెలుపు అవకాశాలు లేవన్న స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్‌ను తమ ట్రాప్‌లోకి తెచ్చుకుని తదుపరి బీజేపీని కాళ్లావేళ్లపడి పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తుకు ఎందుకు తహతహలాడుతున్నదన్నదానిపై అప్పుడే అంతా ఊహించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం అండతో జగన్ ప్రబుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగాన్ని భయపెట్టి తమదారిలోకి తెచ్చుకోవడానికి, వీరు పన్నాగం పన్నారు. అందుకు తగ్గట్లుగానే బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఈ పని పురమాయించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కోడ్ అమలుకు వస్తుంది కనుక సహజంగానే ఈసీకే విశేషాధికారాలు ఉంటాయి. దానిని తమకు అడ్వాంటేజ్‌గా మార్చుకున్నారు.ఎన్నికల సంఘం అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు కావల్సిన అదికారులను నియమించుకునే ప్రక్రియ ఆరంబించారు. పురందేశ్వరి ఏకంగా 22 మంది అధికారుల జాబితాను ఇచ్చి వారందరిని తొలగించి, తాము సూచించినవారిని నియమించాలని కోరడం సంచలనం అయింది. బహుశా దేశ చరిత్రలో ఇంతత ఘోరమైన లేఖ ఎవరూ రాసి ఉండరు. అలా ఉత్తరం రాసినందుకు సంబంధిత రాజకీయ నేతను మందలించవలసిన ఎన్నికల సంఘం ఆమె కోరిన చందంగానే అధికారులను బదిలీ చేయడం ఆరంభించింది. పలువురు జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను, ఇతర చిన్న అధికారులను కూడా బదిలీ చేయించారు. చివరికి డీజీపీని కూడా వదలిపెట్టలేదు. సిఎస్ ను కూడా బదిలీ చేయాలని గట్టిగానే కోరారు కాని ఎందుకో ఆ ఒక్క బదిలీ ఆగింది.ఈ బదిలీ అయిన వారిలో ఎవరికి ఫలానా తప్పు చేస్తున్నట్లు ఎక్కడా ఈసీ తెలపలేదు. కనీసం నోటీసు ఇవ్వలేదు. నేరుగా బీజేపీ నేతలు ఏమి చెబితే అదే చేశారన్న భావన ఏర్పడింది. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి గట్టిగా ఉండే అధికారులపై చెడరాశాయి. వారందరిని బదిలీ చేయాలని ఒకసారి, బదిలీ చేస్తున్నారని మరోసారి రాసేవారు. వారు రాయడం, టీడీపీ, బీజేపీలు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, మరుక్షణమే ఈసీ స్పందించడం మామూలు అయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఎక్కడా పెద్దగా విమర్ధలు చేయలేదు. 2019లో కేంద్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ పార్టీ నేతల ఇళ్లలో సోదాలు జరిపితేనే చంద్రబాబు రెచ్చిపోయి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసేవారు. ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేది కార్యాలయానికి వెళ్లి తగాదా ఆడారు.. ధర్నా చేశారు.. కాని జగన్ చాలా హుందాగా వ్యవహరించారు. రాజకీయ విమర్శలు చేశారే తప్ప ఎక్కడా స్థాయిని తగ్గించుకోలేదు.టీడీపీ, బీజేపీలు తాము కోరినట్లుగానే అధికారులను నియమించుకుని పెత్తనం చేశారు. అయినా జగన్ ఎక్కడా అదికారులను ఎవరిని తప్పుపట్టలేదు. జనాన్ని నమ్ముకుని తన ప్రచారం తాను చేసుకున్నారు. పోలింగ్ నాడు బలహీనవర్గాలు, పేద వర్గాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో టీడీపీ వర్గాలు ఆందోళన చెందాయి. కొంత ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న పల్నాడు వంటి ప్రాంతాలలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ కూటమి నేతలు ప్రయత్నించారు. అందువల్లే వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. లేదా బాగా ఆలస్యంగా స్పందించారు. అయినా ఆ రోజు అంతా చాలావరకు ప్రశాంతంగా ముగిసింది. తదుపరి పరిస్థితిని సమీక్షించుకున్న టీడీపీ క్యాడర్ ఓటమి భయమో మరేదో కారణం కాని, ఒక్కసారిగా వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనుకున్నవారిపై దాడులు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రిచంద్రగిరి మొదలైన చోట్ల వీరు నానా రభస చేశారు.ఎన్నికల సంఘం పనికట్టుకుని ఎక్కడైతే అధికారులను మార్చిందో అక్కడే ఈ గొడవలు జరగడంతో కుట్ర ఏమిటో బోధపడింది. ప్రత్యేకించి కొన్ని గ్రామాలలో దాడులు అమానుషంగా ఉన్నాయి. ఆ గ్రామాలలో మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సన్నివేశాలు కనిపించాయి. వీటిని మాత్రం ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా కప్పిపుచ్చి వైఎస్సార్సీపీనే దాడులు చేసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. ఒకవేళ వైఎస్సార్సీపీ వారిది కూడా ఏదైనా తప్పు ఉంటే రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా వీరు వార్తలు కవర్ చేస్తూ తామూ ఫ్యాక్షనిస్టులమేనని రామోజీ, రాధాకృష్ణలు రుజువు చేసుకుంటున్నారు. ఎన్నికలు వారం రోజులు ఉండగా, ఇక రెండు రోజులలో జరుగుతాయనగా కూడా కొందరు పోలీస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పలు చోట్ల తమకు కావల్సినవారిని కూటమి నియమింప చేసుకోగలిగింది. కొత్తగా వచ్చిన అధికారులకు అన్ని విషయాలపై అవగాహన తక్కువగా ఉంటటుంది. దానికి తోడు తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించడానికి సిద్దమై వచ్చినందున ఆయా ఘటనలపై సరిగా స్పందించలేదు. అందువల్లే పల్నాడు ప్రాంతంలో గొడవలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. బూత్ స్వాధీనం వంటివి జరిగినా చూసి, చూడనట్లు పోయారట.నిజానికి ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధికారులను నియమించినా ఉపయోగం ఉండదు. ఆ విషయం తెలిసి కూడా ఇలా వ్యవహరించడం అంటే కచ్చితంగా కూటమి పెత్తందార్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరిల ఒత్తిడికి ఈసీ లొంగిందని అర్దం. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే ఇంటిలో రచ్చ సృష్టించారు. అది మరీ ఘోరంగా ఉంది. అలాగే జెసి ప్రభాకరరెడ్డి ఇంటిలో కొందరు పోలీసులు గొడవ చేశారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. ఎక్కడ ఎవరు చేసినా ఖండించవలసిందే. చర్య తీసుకోవల్సిందే. తాడిపత్రిలో ఏ స్థాయికి గొడవలు వెళ్లాయంటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేసే యత్నం వరకు. ఇది మంచిది కాదు. నిజంగానే ఈనాడు మీడియా రాసినట్లు టీడీపీ నేతలే ఘర్షణలలో దెబ్బతిని ఉన్నా, వైఎస్సార్‌సీపీవారు దాడులు చేశారన్న నిర్దిష్ట సమాచారం ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ పాటికి అక్కడకు వెళ్లి మరింత అగ్గి రాజేసేవారు. ఆయన ఎక్కడకు వెళ్లలేదు.పెత్తందార్ల కొమ్ము కాస్తున్న కూటమి నేతలు గాయపడ్డ పేదలను పలకరించడానికి ఎందుకు వెళతారు! ఇప్పుడు ఈసీ ఏపీ ఛీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచి వివరణ కోరినా ఏమి ప్రయోజనం ఉంటుంది. చేసిందంతా చేసి, తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి ఈసీ ఇలా వ్యవహరిస్తున్నదన్న అనుమానం వస్తోంది. కేవలం ఎన్నికల సంఘం కొత్త అధికారులను నియమించిన చోటే ఈ ఘర్షణలు జరిగాయని, దీనికి ఈసీనే బాధ్యత వహించాలని ఈ అధికారులు వివరణ ఇచ్చి ఉండాలి. లేదా ఎన్నికల కమిషన్ తో ఎందుకు తలనొప్పిలే అనుకుంటే వారి వాదన ఏదో చెప్పి వచ్చి ఉండాలి. అందుకే పలువురు అధికారులపై కమిషన్ చర్చ తీసుకోక తప్పలేదు. ఏది ఏమైనా స్వతంత్రంగా ఉండవలసిన ఎన్నికల సంఘం కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగడం, శాంతి భద్రతలకు వారి చర్యలే విఘాతం కల్గించడం వంటివి ఏ మాత్రం సమర్దనీయం కాదు. దీనివల్ల ఈసీ విశ్వసనీయతపై మచ్చ పడిందని చెప్పక తప్పదు. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
May 17th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 17th AP Elections 2024 News Political Updates02:40 PM, May 17th, 2024విజయవాడ:విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ లీగల్ సెల్వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు, జరుగుతున్న దాడులపై సీపీ రామకృష్ణకు వినతిపత్రం అందజేతవైఎస్సార్సీపీ లీగల్ సెల్ వినతి పత్రంపై సానుకూలంగా స్పందించిన సీపీసీపీని కలిసిన అనంతరం వైఎస్సార్సీపీ లీగ్ సెల్ నాయకులు మాట్లాడుతూ..ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగాయివైఎస్సార్సీపీ నేతల గొంతు నొక్కాలని చూస్తున్నారుకొంత మంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారుకావాలనే బైండోవర్లు పెట్టి వేధిస్తున్నారునిన్న సీఎం విజయవాడ పర్యటన సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులను స్టేషన్‌కు పిలిపించి నిర్భదించారువైఎస్సార్సీపీ నాయకులను అకారణంగా నిర్భందించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి 02:09 PM, May 17th, 2024విశాఖ జిల్లా: ఎన్నికల ఫలితాలకు ముందే చేతులెత్తేసిన టీడీపీవిశాఖ జిల్లాలో ఎన్నికల ఫలితాలపై గండి బాబ్జి జోస్యంగండి బాబ్జి జోస్యంతో కంగుతిన్న టీడీపీ శ్రేణులువిశాఖ జిల్లాలో పార్టీ ఓడిపోతుందిబీజేపీ పోటీ చేసిన విశాఖ నార్త్ నియోజక వర్గ ఫలితంపై నాకు డౌట్ ఉందిగెలుపుపై అనుమానం వ్యక్తం చేసిన గండి బాబ్జిజిల్లా పార్టీ అధ్యక్షుడే పార్టీ ఓడిపోతుందని మాట్లాడటంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన01:53 PM, May 17th, 2024మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం: సజ్జల రామకృష్ణారెడ్డిసాంప్రదాయ ఓటు బ్యాంక్ మావైపు ఉందిమాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదుప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న తీరు చూస్తుంటే మళ్ళీ విజయం సాధిస్తాంపొలింగ్ పర్సంటేజ్ పెరిగితే మేము ఓడిపోతామన్న భ్రమలో టీడీపీ ఉందిమాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవుప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదువివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా?సీఎం జగన్ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు నన్ను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారుటీడీపీ గెలవడానికి ఉన్న ఒక్క కారణమైనా చెప్పగలరా?చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పలేక పోతున్నారుటీడీపీ కూటమి వలనే పోలింగ్ లో హింస జరిగిందివారు చెప్పిన అధికారులే హింసకు కారణమయ్యారుఇప్పుడు వాళ్ళనే ఈసీ తొలగించి చర్యలు తీసుకుందిఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందు ఉన్నారుపోలింగ్‌కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారుఅల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లేవీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లేఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్ కు లేఖలు రాస్తున్నారురికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు రాస్తున్నారుతాడిపత్రిలో పెద్ధారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారుల్యాండ్ టైట్లింగ్ గురించి ఎన్నికల తరువాత టీడీపీ ఎందుకు మాట్లాడటం మానేసింది?ల్యాండ్ టైటలింగ్ అమలు చేయాలని నీతి అయోగ్ చెప్పిందికౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలిటీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుందిప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాంఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావుఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్ ను కోరుతున్నాంకుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాల్లోనూ గెలుస్తాంజగన్ పాలనలో లబ్ధి పొందని వర్గాలు, న్యాయం జరగని కుటుంబం అంటూ ఏమీ లేవుఅందరికీ మేలు చేసినందునే భారీ సీట్లతో గెలవబోతున్నాం11:25 AM, May 17th, 2024విజయనగరం పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ వద్ద హైడ్రామాఆందోళనకు దిగిన టీడీపీ, ఇండిపెండింట్ అభ్యర్థులుజాయింట్ కలెక్టర్ కార్తీక్‌పై ఈసీకి టీడీపీ కార్యకర్తల ఫిర్యాదుఅభ్యర్థుల ఏజెంట్లు లేకుండా తెరిచారని టీడీపీ అభియోగంఅభ్యర్థులకు ఫోన్లో సమాచారం ఇచ్చామన్న జేసీవీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు పోలీసుల సమక్షంలో తీశాం11:14 AM, May 17th, 2024తాడిపత్రిలో టీడీపీ దాడులను ఖండించిన వైఎస్సార్సీపీ నేతలుతాడిపత్రిలో అల్లర్లను నియంత్రించడంలో పోలీసులు విఫలంజేసీ అనుచరులు దాడులు చేస్తే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారువైఎస్సార్‌సీ శ్రేణులపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదువైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు.ఎన్నికల కమిషన్ ఎన్డీఏ కమిషన్‌గా మారిపోయింది.ఎస్పీ అమిత్, ఏఎస్పీ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరించారుపోలీసుల సహకారంతోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడులురౌడీషీటర్లను టీడీపీ పోలింగ్ ఏజెంట్లుగా పెట్టారుఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణంతాడిపత్రిలో ఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలిఏఎస్పీ రామకృష్ణను కూడా సస్పెండ్ చేయాలి 10: 37 AM, May 17th, 2024చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదుఏలూరు జిల్లాదెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదుహత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుండి దౌర్జన్యంగా తీసుకువెళ్లిన చింతమనేనిఅధికారుల విధులకు ఆటంకం కలిగించడం, స్టేషన్లో దౌర్జన్యం చేయడంపై 224, 225, 353,143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు8: 04 AM, May 17th, 2024సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలతో వైసీపిలో ఫుల్ జోష్150 కిపైగా సీట్లలో గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన జగన్మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామన్న జగన్దేశమంతా మనవైపే చూస్తుందని వ్యాఖ్యలుగత 59 నెలలుగా చేసిన సుపరిపాలనతో జనం జగన్ కే అండగా నిలిచారంటున్న విశ్లేషకులుచంద్రబాబు కూటమి కుట్రలకు ప్రజలు ఛీకొట్టారన్న చర్చఈసారి మరింత మేలు చేసేలా పాలన సాగించే దిశగా సీఎం అడుగులు8: 01 AM, May 17th, 2024వెల్లివిరిసిన మహిళా చైతన్యంఏపీలో పురుషులకంటే ఓట్లు వేసిన మహిళల సంఖ్య 4.78 లక్షలు అధికంపోస్టల్ బ్యాలెట్‌తో కలిపి మొత్తం పోలింగ్ శాతం 81.86 శాతంఅసెంబ్లీకి అత్యధికంగా దర్శిలో 90.91 శాతం.. అత్యల్పంగా తిరుపతిలో 63.62 శాతంలోక్‌సభకు అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం.. విశాఖలో 71.11 శాతం ఓట్లుదేశంలో ఇప్పటివరకు జరిగిన 4 దశల ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ రాష్ట్రంలోనేఎన్నికల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం33 చోట్ల 350 స్ట్రాంగ్ రూముల్లో మూడంచెల భధ్రత నడుమ ఈవీఎంలుహింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తాంఎన్నికల తర్వాత జరిగిన హింస అదుపులోకి వచ్చిందిహింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు715 పోలీస్ పికెట్స్‌తో గొడవలను అదుపులోకి తెచ్చాంరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా7: 07 AM, May 17th, 2024టీడీపీ చెప్పినట్లు ఆడినందుకేప్రజాస్వామ్య ప్రక్రియకు పాతరేసిన ఫలితం..విధి నిర్వహణలో అలసత్వమే ఈసీ వేటుకు కారణంరాజకీయ ఒత్తిళ్లతో పోలీస్ అధికారుల బదిలీ.. పురందేశ్వరి జాబితా ప్రకారం నియామకాలుఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు 7: 03 AM, May 17th, 2024నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకు వ్యూహంటీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు ఇల్లు కేంద్రంగా కుట్రగోపిరెడ్డి దొరక్కపోవడంతో ఆయన మామపై హత్యాయత్నంఅనంతరం అరవింద్‌బాబు హౌస్ అరెస్ట్‌పోలీసుల తనిఖీలో మారణాయుధాలు, పెట్రోల్ బాంబులు లభ్యం.. పోలింగ్‌కు ముందే పథకం ప్రకారం సమకూర్చుకున్న వైనంమారణాయుధాలకు సంబంధించి కేసు నమోదు చేయని పోలీసులు.. పల్నాడులో హత్యా రాజకీయాలనే నమ్ముకున్న టీడీపీ7: 02 AM, May 17th, 2024పాలన బాగుంటే పోలింగ్ పెరుగుతుందిఇది రాజకీయ విశ్లేషకుల మాట.. మాట నెరవేర్చిన ప్రభుత్వాలను మళ్లీ ఎన్నుకుంటారు..పోలింగ్ శాతం పెరగడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమనే ప్రచారం అవాస్తవం2004లో 69.8 శాతం పోలింగ్‌తో వైఎస్సార్‌కు అధికార పగ్గాలు.. 2009లో 72.7% పోలింగ్‌తో మళ్లీ సీఎంగా వైఎస్సార్‌తెలంగాణలో 2014లో 69.5 శాతం పోలింగ్‌తో అధికారంలోకి టీఆర్ఎస్2018లో 73.2 శాతం పోలింగ్‌తో మరోసారి సీఎంగా కేసీఆర్ఇప్పుడు ఏపీలోనూ అదే ట్రెండ్.. మరిన్ని సీట్లతో సీఎంగా మళ్లీ వైఎస్ జగన్6: 50 AM, May 17th, 2024మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాంపోలింగ్ సరళిపై తొలిసారిగా స్పందించిన సీఎం వైఎస్ జగన్2019కి మించి 2024లో వైఎస్సార్సీపీ ప్రభంజనంజూన్ 4న ఘన విజయంతో దేశం మొత్తం మన వైపే చూస్తుంది59 నెలలుగా ప్రజలకు మంచి చేశాం.. వచ్చే ఐదేళ్లు మరింత మేలు చేద్దాంవిజయవాడలో ఐ–ప్యాక్ ప్రతినిధులతో సమావేశం
ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్‌పై జరిగిన దాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై విచక్షణరహితంగా దాడి చేసినట్లు తాజాగా స్వాతి మలీవాల్ ఆరోపించారు. సీఎం నివాసంలోని డ్రాయింగ్ రూమ్‌లో ఉన్న కుమార్ తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడని, చెంపదెబ్బ కొట్టాడని, ఛాతిపై తన్నాడని, లాగి పడేసినట్లు ఆమె ఆరోపించారు. ఆసమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని పేర్కొన్నారు.కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సోమవారం ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి ఆరోపించిన ఉదంతం తెలిసిందే. దీన్ని ఆప్ కూడా ధ్రువీకరించి, బిభవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.ఈ విషయంలో స్వాతి మలీవాల్ పోలీసులకు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బిభవ్ కుమార్‌ను నిందితుడిగా పేర్కొంటూ గురువారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఇంటికి వెళ్లి వాంగ్మూలాన్ని కూడా రికార్డుచేశారు.పోలీసులు ఎఫ్ఐఆర్లో ఆమె వాంగ్మూలాన్ని పొందుపరిచారు. దీని ప్రకారం.. సివిల్ లైన్స్‌లోని మలివాల్ సోమవారం సాయంత్ర ఆరు గంటలకు సీఎం నివాసానికి చేరుకుంది. ముఖ్యమంత్రి సహాయకుడిని సంప్రదించడానికి ప్రయత్నించగా. ఎలాంటి స్పందన రాలేదు. అనంతరం డ్రాయింగ్ రూమ్‌లో వేచి ఉన్న సమయంలో బిభవ్ కుమార్ గదిలోకి చొరబడి తనను దూషించడం ప్రారంభించాడని ఆమె ఆరోపించారు.‘కుమార్ నా ముఖంపై ఏడు,ఎనిమిది సార్లు కొట్టాడు. ‘నన్ను వెళ్లనివ్వండి’ అని చెప్పినప్పటికీ ఆయన వదలకుండా ఛాతీ, పొట్ట, సున్నితమైన భాగాలపై పలుమార్లు కొట్టాడు. హిందీలో దుర్భాషలాడాడు. 'నీ సంగతి చూస్తాం’ అంటూ బెదిరించాడు. కడుపులో నొప్పి వస్తుందని, నన్ను వదిలేయాలని వేడుకున్నాను.బిభవ్ చర్యలతో పూర్తిగా షాక్‌కు గురయ్యాను. సహయం కోసం గట్టిగా అరిచాను. నన్ను నేను రక్షించుకోవడానికి అతన్ని కాలితో తన్ని దూరంగా నెట్టేశాను. నేను బయటక పరుగెడుతుంటే నాపైకి దూసుకొచ్చాడు. నా చొక్కా పట్టుకొని వెనక్కి లాగాడు. ఛాతీ, కడుపు వంటి సున్నితమైన శరీరభాగాలపై పలుమార్లు దాడి చేశాడు. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో నడవలేకపోయా. ఎలాగో తన నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేశా’’ అని స్వాతి మలీవాల్వె ల్లడించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.ఈ ఘటనపై మలీవాల్ గురువారం తొలిసారి స్పందిస్తూ.. ఈ దాడితో తాను తీవ్ర దిగ్భ్రాంతికి, మనోవేదనకు గురయ్యాను పేర్కొన్నారు. 112 నంబర్‌కు కాల్ చేసి సంఘటనను నివేదించానని చెప్పారు. తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. దాడి ఆరోపణల నేపథ్యంలో ఆప్ ఎంపీకి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు ఈ పరీక్షలో తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి.
కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?: ప్రధాని మోదీ
ఢిల్లీ, సాక్షి: దేశం కోసం పని చేసే ఎన్డీయే, దేశంలో అస్థిరత్వం పెంచే ఇండియా కూటమికి మధ్య పోరు జరుగుతోందని.. ఈ పోరులో ఎన్డీయే సర్కార్ హ్యాట్రిక్ కొట్టబోతోందని బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ‘‘ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతు ఇస్తామని మమత(మమతా బెనర్జీ) చెప్పారు. రాయ్‌బరేలీ ప్రజలు దేశ ప్రధానిని ఎదుర్కొంటారని కొందరు అంటున్నారు. ఇలాంటి కిచిడీ కూటమికి ఎవరైనా ఓటేస్తారా?. ఓటేసి ఎవరైనా ఓటు వృథా చేసుకుంటారా?. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే.. వాళ్లకు మోదీని తిట్టడమే పనిగా ఇస్తారు. తిట్టడం కోసం మనం ఎరినైనా ఎన్నుకుంటామా?. అలాంటి వాళ్ల వల్ల మీకు పనులు జరుగుతాయా?. మనకు పనులు చేసే వ్యక్తి కావాలి. ఎన్డీయే హ్యాట్రిక్ విజయం తప్పక సాధిస్తుంది. గెలిచాక.. పేదల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. .. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత రామమందిరం కల సాకారమైంది. ఎందరో బలిదానాలు చేసిన తర్వాత మందిర నిర్మాణం జరిగింది. రామ్‌లల్లాను టెంట్‌కింద చూసి ఎందరో బాధపడ్డారు. మీ ఓటు వల్లే రామ మందిర నిర్మాణం జరిగింది. బలమైన ప్రబుత్వం ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైంది అని మోదీ అన్నారు. .. ఒకవైపు రామ మందిర నిర్మాణం జరుగుతుంటే వాళ్ల కడుపు మండిపోయింది. ఆలయ ప్రారంభోత్సవాన్ని వాళ్లు బహిష్కరించారు. రాముడితో వాళ్ల శత్రుత్వం ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. రామ మందిరంపై సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్ మార్చాలనుకుంది. కాంగ్రెస్ వస్తే రామ్ లల్లాను మళ్లీ టెంట్ కిందకే మారుస్తారు. వాళ్లు ఎంతటికైనా దిగజారుతారు. వాళ్లకు పరివార్, పవార్.. ఇవే ముఖ్యం’’ అని మోదీ విపక్ష కూటమిపై మండిపడ్డారు. .. బుల్డోజర్ను ఎక్కడికి తీసుకెళ్లాలి.. ఎక్కడకు తీసుకెళ్లొద్దు అనేది యోగి దగ్గర ట్యూషన్ తీసుకోండి. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని అంబేద్కర్ అన్నారు. మత నిర్జవ్స్త్రన్లకు ల్యాబ్‌గా కర్ణాటకను మార్చాలనుకున్నారు. ఓబీసీల నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్పీ, ఎస్టీ, ఓబీసీల హక్కులు కాలరాస్తే సహిస్తారా?. హిందూ ముస్లిం అంటూ రాజకీయాలు చేస్తున్నారు. తిరిగి నాపై ఆరోపనలు చేస్తున్నారు. ఆ కుట్రలను గమనించి.. తిప్పి కొట్టి బీజేపీని గెలిపించాలి’’అని యూపీ ఓటర్లను ప్రధాని మోదీ కోరారు.
ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరం కానున్నాడా..? మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్‌లు ఇద్దరూ బన్నీపై గుర్రుగా ఉన్నారా..? అంటే సోషల్ మీడియాలో అవుననే జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ, బన్నీ మాత్రం మెగా బంధాలను తెంపుకునే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. స్నేహం కోసం ఎంతవరకైనా వెళ్లే గుణం అల్లు అర్జున్‌లో ఉందని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అలాంటి బన్నీపై నాగబాబు ఫైర్ అవుతున్నారని నెట్టింట వైరల్ అయింది. అసలు వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కడ వచ్చాయి అనేది చూద్దాం. స్నేహితుడి కోసం నిలబడిన అల్లు అర్జున్ఏపీ ఎన్నికల సమయంలో తన మిత్రుడి విజయం కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ బంధాన్ని పాటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల నియోజికవర్గంలో ఎన్నికల బరిలో నిల్చున్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయం సాధించాలని అల్లు అర్జున్ కోరుకున్నారు. ఈ క్రమంలో ఆయన నంద్యాలకు వెళ్లి తన మద్ధతును ప్రకటించారు. ఆ సమయంలో భారీగా బన్నీ ఫ్యాన్స్ శిల్పా రవి ఇంటి వద్దకు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. 2019లో కూడా అల్లు అర్జున్ శిల్పా రవికి మద్ధతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నాగబాబు ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఒక ట్వీట్ వేశాడు. అది అల్లు అర్జున్ గురించే అంటూ నెట్టింట వైరల్ అయింది.నాగబాబు ట్వీట్‌తో రగడఅల్లు, మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలను నాగబాబు ట్వీట్ బయటపెట్టిందన్న చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన సమయం నుంచి ఈ రచ్చ మొదలైంది. ఆపై, పోలింగ్ ముగిసిన కొద్ది గంటల్లోనే నాగబాబు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. 'మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన కూడా మావాడే' అంటూ నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలతో తమ అభిమాన హీరో గురించే అంటున్నారని బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. బన్నీని పరోక్షంగా తమ వాడు కాదు అనడం సరైనది కాదని వారు తప్పుపట్టారు. ఇదే ట్వీట్ ఎన్నికల ముందు వేయాల్సిందని నాగబాబును ట్యాగ్ చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. గతంలో జనసేనకు రూ. 2 కోట్లు విరాళం ఇవ్వలేదా అంటూ వారు గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా నాగబాబు అర్ధిక కష్టాల్లో వున్నపుడు 'నా పేరు సూర్య' సినిమాకు ప్రెజెంటర్‌గా తమరి పేరు వేయించి కొంత సాయం అందేలా బన్నీ చేయలేదా..? అంటూ చెప్పుకొస్తున్నారు. చిరంజీవి కూడా తన స్నేహితుల కోసం ఈ ఎన్నికల్లో మద్ధతుగా నిలబడాలని వీడియోలు చేయలేదా అని నెట్టింట బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.బన్నీ ఫ్యాన్స్, చిరంజీవి వల్లే నాగబాబు ఈ నిర్ణయం తీసుకున్నారా..?వాస్తవానికి బన్నీకి కూడా ఫ్యాన్ బేస్ భారీగానే ఉంది. తనకంటూ ఒక సపరేట్ అభిమానగనాన్ని ఆయన సంపాదించుకున్నారు. వారందరూ సోషల్ మీడియా వేదికగా నాగబాబును ఏకిపారేశారు. మరోవైపు చిరంజీవి కూడా నాగబాబు వద్ద బన్నీ విషయాన్ని ప్రస్తావించారని తెలుస్తోంది. ఇంతటితో ఈ వివాదం ఆపాలని ఆయన కోరినట్లు సమాచారం. ఒకవైపు బన్నీ అభిమానుల కామెంట్ల దాడి.. మరోవైపు అన్నయ్య సూచనలు వస్తుండటంతో తన ఎక్స్ పేజీని నాగబాబు క్లోజ్ చేశారని తెలుస్తోంది.కష్టాన్నే నమ్ముకున్న అల్లు అర్జున్అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలోకి అరవింద్ కుమారుడిగా.. మెగాస్టార్ మేనళ్లుడిగా ఎంట్రీ ఇచ్చారు. కానీ రెండో సినిమా నుంచే ఆయన తన కష్టాన్నే నమ్ముకున్నారు. ఒకరకంగా తన స్వయం కృషితో బన్నీ ఎదిగాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్టార్‌గా తనను తాను మలుచుకున్నాడు. పుష్ప సినిమా సమయానికి సుకుమార్, బన్నీ ఇద్దరూ టాలీవుడ్‌కే పరిమితం. కానీ, అల్లు అర్జున్ తన నటనతో పాన్ ఇండియాను మెప్పించాడు. అలా బన్నీ వల్ల సుకుమార్ పేరు కూడా దేశవ్యాప్తంగా తెలిసింది. ఇప్పుడు టాలీవుడ్లో అత్యంత శక్తివంతమైన ఫ్యాన్ బేస్ కలిగిన హీరోల్లో అల్లు అర్జున్ టాప్‌లో ఉంటారు.
IPL 2024: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరదు! అదెలా?
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్‌లో మూడో బెర్తు కూడా ఖరారైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ టేబుల్ టాపర్‌గా ముందుగానే టాప్-4లో తిష్ట వేయగా.. రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా అర్హత సాధించాయి.లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం(మే 14)తో ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా రాజస్తాన్.. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌లో నేరుగా చోటు దక్కించుకున్నాయి.ఆ మూడు జట్ల మధ్య పోటీఇక ప్లే ఆఫ్స్‌లో మిగిలిన ఒక్క స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పోటీపడుతున్నాయి. నిజానికి రన్‌రేటు పరంగా ఈ రెండు జట్ల కంటే వెనుకబడి ఉన్న లక్నో(12 పాయింట్లు, నెట్ రన్‌రేటు -0.787) ఈ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్లే!ఒకవేళ ఆశలు సజీవం చేసుకోవాలంటే.. ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో భారీ తేడాతో లక్నో గెలవాలి. అయినప్పటికీ సీఎస్కే- ఆర్సీబీ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. అందులోనూ ఆర్సీబీని సీఎస్కే కచ్చితంగా.. అది కూడా స్వల్ప తేడాతో ఓడిస్తేనే లక్నోకు అవకాశం ఉంటుంది.సీఎస్కే- ఆర్సీబీ ఫలితంపై సర్వత్రా ఆసక్తిఈ నేపథ్యంలో.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లక్నో వరుసగా మూడోసారి ప్లే ఆఫ్స్ చేరడం సాధ్యంకాదు. కాబట్టి ప్రధానంగా పోటీలో ఉన్నది సీఎస్కే- ఆర్సీబీ మాత్రమే అని చెప్పవచ్చు.ఈ రెండు జట్లలోనూ చెన్నై(14 పాయింట్లు, రన్‌రేటు 0.528) ఆర్సీబీ(12 పాయింట్లు 0.387) కంటే ఓ మెట్టు పైనే ఉంది. అయినప్పటికీ ఆర్సీబీ సీఎస్కేను దాటి ప్లే ఆఫ్స్ చేరాలంటే..? సాధ్యమయ్యే రెండు సమీకరణలు ఇలా!అలా చెన్నైపై గెలిచినా సాధ్యం కాదు1. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసి 200 పరుగులకు తక్కువ కాకుండా స్కోరు చేయాలి. అంతేకాదు 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాలి. అంతకంటే ఒక్క పరుగు తక్కువ తేడాతో చెన్నైని ఓడించినా ఫలితం ఉండదు. నెట్ రన్‌రేటు ఆధారంగా చెన్నై ప్లే ఆఫ్స్ చేరితే.. ఆర్సీబీ మాత్రం ఇంటిబాట పడుతుంది.2. ఒకవేళ ఆర్సీబీ గనుక సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చి.. చెన్నై విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని.. 11 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ పూర్తి చేయాలి. చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్
ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
డార్లింగ్ ప్రభాస్ నుంచి సడన్ సర్ప్రైజ్ వచ్చింది. స్వతహాగా ఇంట్రావర్ట్ అయిన ఇతడు.. బయటకు కనిపించడం తక్కువ. ఇక మాట్లాడటం అయితే గగనం అని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఇన్ స్టాలో అందరూ అవాక్కయ్యేలా ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నామని అంటున్నాడు. ఇంతకీ ఏంటి విషయం? ఏమై ఉండొచ్చు?(ఇదీ చదవండి: అది ఫేక్ న్యూస్.. రూమర్స్‌పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ)'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. ఊపిరి సలపనంత బిజీగా మారిపోయాడు. గతేడాది 'సలార్'తో హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ అందుకున్నాడు. త్వరలో 'కల్కి'గా రాబోతున్నాడు. జూన్ 27న థియేటర్లలోకి రాబోతుంది. రిలీజ్‌కి మరో 40 రోజులు కూడా లేదు. ఇంకా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలుపెడతారా అని అందరూ వెయిట్ చేస్తుండగా.. ప్రభాస్ ఇన్ స్టాలో ఇంట్రెస్టింగ్ స్టోరీ పెట్టాడు.'డార్లింగ్స్.. ఫైనల్లీ నా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి' అని ప్రభాస్ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అయితే ఇది పెళ్లి గురించే అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు బిజీ షెడ్యూల్లో ప్రభాస్ పెళ్లి చేసుకోవడం అసాధ్యం. కాబట్టి కొత్త మూవీ ప్రమోషన్ లేదా అంటే ఇంకేదైనా అయ్యిండొచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదేంటో ప్రభాస్ చెప్పేవరకు వెయిట్ అండ్ సీ.(ఇదీ చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్)
ఆకాశవీధిలో 41.8 కోట్లమంది.. ఇక్రా నివేదిక
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అదే సమయంలో విమాన సంస్థల ఆదాయాలు 15-17 శాతం పెరుగుతాయని చెప్పింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధీనంలోని విమానాశ్రయాలతో పాటు దిల్లీ, హైదరాబాద్, కోచి అంతర్జాతీయ విమానాశ్రయాలను నమూనాగా తీసుకుని ఇక్రా ఈ నివేదిక విడుదల చేసింది.ఇక్రా నివేదిక ప్రకారం..కరోనా కంటే ముందు నమోదైన విమాన ప్రయాణాలతో పోలిస్తే 10 శాతం అధికంగా ఫ్లైట్‌జర్నీ చేస్తున్నారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 37.6 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. విమానాల రద్దీ ఏటా 8-11 శాతం పెరుగుతోంది. 2023 క్యాలెండర్ ఏడాదిలో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో భారత్ వాటా 4.2 శాతంగా ఉంది. 2019లోని 3.8 శాతంతో పోలిస్తే అధికం. 2023లో గ్లోబల్‌గా ప్రయాణికుల రద్దీ 96 శాతం పుంజుకుంది. అదే భారత్‌లో మాత్రం 106 శాతం రికవరీ అయింది. దేశీయంగా కొత్త మార్గాలు, విమానాశ్రయాల సంఖ్య పెరగడంతో ఇది సాధ్యపడినట్లు ఇక్రా తెలిపింది.ఇదీ చదవండి: పెరగనున్న వస్తు ఎగుమతులు.. ఎంతంటే..ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ కుమార్ మాట్లాడుతూ..‘విరామం కోసం, వృత్తి వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణాలు అధికంగా చేస్తున్నారు. కొత్త గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభం కావడమూ కలిసొస్తోంది’ అన్నారు.
అలాంటి పదబంధాలను ఉపయోగించొద్దు! నటి పద్మాలక్ష్మి
ఇటీవల మన తెలుగు వాడుక భాషలో ఆంగ్ల పదాలు అలవొకగా చేరిపోయాయి. మనం కూడా వాటికే అలవాటు పడిపోయాం. తెలుగు, ఆంగ్లం మిక్స్ కొట్టినట్లుగా మాట్లాడుతున్నాం. ఆ క్రమంలో కొన్ని అర్థరహితమైన పదబంధాలను వినియోగిస్తున్నాం. వాటినే గుర్తు చేసి అవి ఎంత అర్థ రహితమో వివరిస్తున్నారు భారత సంతతి అమెరికన్, రచయిత్రి టీవీ నటి పద్మాలక్ష్మి. తప్పుగా ఉపయోగిస్తున్న గమ్మత్తైన పదబంధాలేంటో చూద్దామా..!చాలామంది 'చాయ్ టీ'కి పోదామా అంటుంటారని పద్మాలక్ష్మి చెబుతున్నారు. అస్సలు ఇది ఎంత చెత్త పదబంధమో ఒక్కసారి చూడండంటూ వాటి అర్థం గురించి వివరించారు. నిజానికి చాయ్ అంటే టీ మళ్లీ దానికి టీ అనే పదాన్ని కూడా జోడిస్తున్నాం. అంటే టీ టీ అని అర్థం వస్తుంది. అందుకే చాయ్ టీ వద్దు. ఆ పదం లేదు. అని సవివరంగా చెప్పారు. అలాగే ఘుమఘమలాడే 'అల్లం టీ' కావాలంటే మసాలా టీ అనండి చాలు అంటున్నారు. అలాగే చాలామంది 'గీ బట్టర్' అని అంటారు ఇది కూడా తప్పే ఎందుకంటే.. వెన్న, నెయ్యి వేరువేరు అది గుర్తించుకోండి అని చెబుతున్నారు పద్మాలక్ష్మి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తాము కూడా విన్న అలాంటి పదబంధాల గురించి చెప్పుకొచ్చారు. ఓ నెటిజన్ చాలామంది ఏటీఎం మిషన్ అని పిలుస్తుంటారు. ఇది కూడా చాలా తప్పు పదబంధం. ఏటీఎం అంటేనే(ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్). అలాంటప్పుడు మళ్లా మిషన్ ఎందుకు వ్యాఖ్యానించడం అని కామెంట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. మరో నెటిజన్ ఇలాంటి తప్పు పదబంధాలు భారత్‌లోని స్టార్‌బక్స్ మెనూలో కూడా ఉందని చెప్పుకొచ్చాడు. అక్కడ ఆహార మెనులో ఇలానే 'చాయ్ టీ' ఉండటం విచారకరం అంటూ పోస్ట్ పెట్టాడు. (చదవండి: బ్లింకిట్ సీఈవోను కదిలించిన సామాన్యుడి తల్లి సూచన.. అదేంటంటే!)
తప్పక చదవండి
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ‘తీహార్ జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు’
- ఆ డైరెక్టర్ నన్ను చంపుతానని బెదిరించాడు.. నా వెంటే ఎయిర్‌పోర్టుకు..
- ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా.. అసలు నిజం ఇదే..
- కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లి అంత్యక్రియలు జరపకుండా..
- కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచకం.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్
- రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
- అమెరికాలో గంజాయి బ్యాచ్‌లకు ఊరట!
- నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
సినిమా
కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇల్లు పోలీసుల రక్షణలో ఉంది. ఇలా రెండున్నరేళ్ల నుంచి ఆయన ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో పోలీసు రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై తమిళనాట చర్చ జరుగుతుంది. సూర్య కుటుంబం ప్రస్తుతం చెన్నైలో లేదు.. అయినా కూడా ఆ ఇంటికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది తెలుసుకుందాం.జై భీమ్‌తో వివాదంసూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్ కలిసి నిర్మించిన చిత్రం జై భీమ్. 2021లో అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదలైంది. జైభీమ్‌లోని కొన్ని సన్నివేశాలు తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని 'రుద్ర వన్నియర్ సేన' సంఘం ఆరోపించింది. ఇరులార్ కమ్యూనిటీ (ఆదివాసీలు) సభ్యులకు కస్టోడియల్ టార్చర్ వెనుక తమ వర్గానికి చెందిన సభ్యులు ఉన్నట్లు సినిమాలో చూపించడాన్ని వారు తప్పుపట్టారు. సూర్యపై దాడి చేసిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని ఆ సంఘం తెలిపింది. 'రుద్ర వన్నియర్ సేన' సంఘానికి సూర్య బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో టీ నగర్‌లోని సూర్య ఇంటి వెలుపల ఐదుగురు సాయుధ పోలీసులను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇప్పటికీ పోలీసుల రక్షణ ఎందుకు..?జై భీమ్ సినిమా సమస్య కొన్ని నెలల తర్వాత ముగిసినప్పటికీ, సూర్య ఇంటికి గత రెండున్నరేళ్లుగా నలుగురు పోలీసులు రక్షణగా ఉన్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో సూర్య కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. వారందరూ ఇప్పుడు ముంబైలో ఉన్న విషయం తెలిసిందే. అయినా ఆ ఇంటికి పోలీసుల రక్షణ ఎందుకు అనే ప్రశ్న తలెత్తింది. ఈ పరిస్థితిలో, నటుడు సూర్య ఇంటికి పోలీసు రక్షణ ఎవరి ఆదేశాల మేరకు కొనసాగుతుందని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించారు. పోలీస్ కమిషనర్ వివరణపోలీస్ కమిషనర్ ఆదేశం మేరకు నవంబర్ 15, 2021న తాత్కాలిక భద్రత కల్పించామని, సూర్యకు ముప్పు పొంచి ఉన్నందున భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయం మేరకు భద్రతను ఇప్పటికీ కొనసాగిస్తున్నామని సమాధానమిచ్చారు. సాధారణంగా బెదిరింపులకు గురైన వ్యక్తులకు పోలీసు రక్షణ కల్పించినప్పుడు సంబంధిత వ్యక్తి తప్పనిసరిగా పోలీసు శాఖకు రుసుము చెల్లించాలి. అలా అయితే, ప్రస్తుత పోలీసు రక్షణ కోసం సూర్య ఏమైనా డబ్బు చెల్లిస్తున్నారా అనే ప్రశ్న కూడా తలెత్తింది, దానికి సమాధానం లేదు. దీంతో గత రెండున్నరేళ్లుగా సూర్య ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో భద్రత కల్పిస్తున్నట్లు తేలింది. ఇది ఎంతవరకు న్యాయమని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఇందులో తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆయన అన్నారు.
ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
డార్లింగ్ ప్రభాస్ నుంచి సడన్ సర్ప్రైజ్ వచ్చింది. స్వతహాగా ఇంట్రావర్ట్ అయిన ఇతడు.. బయటకు కనిపించడం తక్కువ. ఇక మాట్లాడటం అయితే గగనం అని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఇన్ స్టాలో అందరూ అవాక్కయ్యేలా ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నామని అంటున్నాడు. ఇంతకీ ఏంటి విషయం? ఏమై ఉండొచ్చు?(ఇదీ చదవండి: అది ఫేక్ న్యూస్.. రూమర్స్‌పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ)'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. ఊపిరి సలపనంత బిజీగా మారిపోయాడు. గతేడాది 'సలార్'తో హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ అందుకున్నాడు. త్వరలో 'కల్కి'గా రాబోతున్నాడు. జూన్ 27న థియేటర్లలోకి రాబోతుంది. రిలీజ్‌కి మరో 40 రోజులు కూడా లేదు. ఇంకా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలుపెడతారా అని అందరూ వెయిట్ చేస్తుండగా.. ప్రభాస్ ఇన్ స్టాలో ఇంట్రెస్టింగ్ స్టోరీ పెట్టాడు.'డార్లింగ్స్.. ఫైనల్లీ నా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి' అని ప్రభాస్ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అయితే ఇది పెళ్లి గురించే అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు బిజీ షెడ్యూల్లో ప్రభాస్ పెళ్లి చేసుకోవడం అసాధ్యం. కాబట్టి కొత్త మూవీ ప్రమోషన్ లేదా అంటే ఇంకేదైనా అయ్యిండొచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదేంటో ప్రభాస్ చెప్పేవరకు వెయిట్ అండ్ సీ.(ఇదీ చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్)
అది ఫేక్ న్యూస్.. రూమర్స్‌పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' దర్శకుడు రాజమౌళి.. నెక్స్ట్ మూవీ మహేశ్ బాబుతో తీయనున్నాడు. ఇప్పటికే దీని గురించి అందరికీ తెలుసు. కాకపోతే ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా సస్పెన్స్. మరోవైపు ఈ మూవీ మొదలవడానికి ముందే బోలెడన్ని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాటిలో ఒక దానిపై నిర్మాతలే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏంటది?(ఇదీ చదవండి: వారంలోపే ఓటీటీలోకి వచ్చేసిన 'కృష్ణమ్మ' సినిమా)మహేశ్‌తో మూవీ ఉంటుందని చాన్నాళ్ల క్రితమే రాజమౌళి బయటపెట్టాడు. ప్రస్తుతం ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే నడుస్తోంది. కానీ హీరోయిన్లు, ఇతర నటీనటుల గురించి బోలెడన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇండోనేసియా నటిని హీరోయిన్ గా తీసుకున్నారని, ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కూడా నటించబోతుందని అన్నారు. అలానే నాగార్జున కీలక పాత్ర చేయబోతున్నాడని కూడా టాక్ వినిపించింది.అయితే పైన వచ్చిన రూమర్స్ వేటికి స్పందించని నిర్మాణ సంస్థ.. వీరేన్ స్వామి అనే క్యాస్టింగ్ డైరెక్టర్ తమతో కలిసి పనిచేయట్లేదని క్లారిటీ ఇచ్చింది. అసలు ఈ రూమర్స్ ఎప్పుడొచ్చాయా అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మిగతా విషయాల కంటే పర్టిక్యూలర్‌గా ఈ విషయం కోసం ఎందుకు నోట్ రిలీజ్ చేసిందనేది మాత్రం అర్థం కాలేదు. చేస్తే చేశారు గానీ అలానే మూవీ ఎప్పుడు మొదలవుతుందో అనే అప్డేట్ ఇస్తే కాస్త ఫ్యాన్స్ అయిన ఖుషీ అయ్యేవారు!(ఇదీ చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్)
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్, సాక్షి: టాలీవుడ్ అగ్రనటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నగరంలో భూవివాదానికి సంబంధించిన ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ల్యాండ్‌కు సంబంధించిన వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో తనకు సంబంధించిన ప్లాట్ విషయంలో వివాదం తలెత్తడంతో ఆయన కోర్టుకు వెళ్లారు. 2003లో గీత లక్ష్మీ అనే వ్యక్తి నుంచి ఒక ప్లాట్‌ను ఎన్టీఆర్ కొన్నారు. అయితే,ఆ ల్యాండ్‌పై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డీఆర్టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.1996లో ఆ ల్యాండ్ మీద పలు బ్యాంకుల వద్ద ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా గీత లక్ష్మి కుటుంబం లోన్స్ పొందింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌కు అమ్మే సమయంలో ఆ విషయాన్ని గీత లక్ష్మి దాచిపెట్టింది. ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఇదే ల్యాండ్ మీద ఐదు బ్యాంకుల నుంచి గీత లక్ష్మి లోన్స్ తీసుకుంది. కానీ, ల్యాండ్ అమ్మే సమయంలో కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్‌కు గీత లక్ష్మి చెప్పింది. ఆ సమయంలో చెన్నైలోని ఒక బ్యాంక్‌లో లోన్ క్లియర్ చేసి ఆ డాక్యుమెంట్స్‌ను ఎన్టీఆర్ తీసుకున్నారు. 2003 నుంచి ఆ ప్లాట్ ఒనర్‌గా తారక్ ఉన్నారు.అయితే 1996లోనే ఈ స్థలాన్ని తనఖా పెట్టి రుణం చెల్లించని కారణంగా ఆ ఆస్తిపై హక్కులు తమవేనని పేర్కొంటూ పలు బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. వీటిని రద్దు చేయాలంటూ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించారు. ల్యాండ్ విషయంలో సమగ్ర విచారణ చేయకుండానే డీఆర్టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్) ఆదేశాలు ఇచ్చిందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. స్థలాన్ని అమ్మిన వారిపై కేసు పెట్టినట్లు తారక్ లాయర్ తెలిపారు. అయితే డాకెట్ ఆదేశాలు అందాల్సి ఉందని, కొంత సమయం ఇస్తే వాటి వివరాలు సమర్పిస్తామని చెప్పారు. జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
ఫొటోలు
క్రీడలు
MI: రోహిత్, హార్దిక్ వద్దు.. వాళ్లిద్దరినే రిటైన్ చేసుకోండి: సెహ్వాగ్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ‘స్టార్’ క్రికెటర్ల ఆట తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. వచ్చే ఏడాది వేలంలో సోకాల్డ్ ‘స్టార్ల’ను వదిలేయాలని మేనేజ్మెంట్కు సూచించాడు.కాగా ముంబై ఇండియన్స్‌లో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, టీ20 వరల్డ్ నంబర్ వన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ తదితరులు ఉన్నారు.ఇక రోహిత్ శర్మ ఈ జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించినా.. ఐపీఎల్-2024 సీజన్లో కెప్టెన్‌గా అతడిని తప్పించింది యాజమాన్యం. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.రెండు వర్గాలుగా విడిపోయిన జట్టు?ఈ నేపథ్యంలో వేదనకు గురైన రోహిత్ శర్మతో పాటు బుమ్రా, సూర్య తదితరులు ఒక బృందంగా.. పాండ్యా, ఇషాన్‌లతో కూడిన మరికొందరు మరో బృందంగా ఏర్పడ్డారని.. జట్టులో విభేదాలు తారస్థాయికి చేరాయనే వార్తలు వినిపిస్తున్నాయి.జట్టు ప్రదర్శనపై ఇది ప్రభావం చూపిందని.. అందుకే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలిచిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఎడిషన్ లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా ముంబై శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ముంబై మేనేజ్మెంట్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2025 వేలానికి ముందే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్‌లను వదిలేయాలని సూచించాడు.షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఉంటే సరిపోదుఇందుకు సినిమాను ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఈ మేరకు ‘‘షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ కలిసి ఒకే సినిమాలో నటించినా.. అది హిట్టవుతుందనే గ్యారెంటీ లేదు. సినిమాలో స్టార్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.మంచి స్క్రిప్టు ఉండాలి. అందరూ బాగా నటించగలగాలి. ఇలా ఇంకెన్నో అంశాలు కలిసిరావాలి. అలాగే జట్టులో పేరున్న ఆటగాళ్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.అసలు రోహిత్ శర్మ ఏం చేశాడు?మైదానంలో వాళ్లు సరిగ్గా ఆడితేనే అనుకున్న ఫలితాలు వస్తాయి. రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. కానీ ఆ మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. మరి మిగతా మ్యాచ్‌లలో అతడి ప్రదర్శన మాటేమిటి?ఇక ఇషాన్ కిషన్.. ఈ సీజన్ మొత్తంలో ఒక్కసారి కూడా కనీసం పవర్ ప్లే ముగిసే వరకైనా ఉన్నాడా?.. నా దృష్టిలో ముంబై ఇండియన్స్ కేవలం జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లనే నమ్ముకోవాలిక! వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకోవాలివచ్చే సీజన్ కోసం వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకుంటే బాగుంటుంది. మిగతా వాళ్లు అసలు అవసరమే లేదు’’ అని సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఈ సీజన్లో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ 349, ఇషాన్ కిషన్ 306 పరుగులు చేశారు. మరోవైపు గాయం కారణంగా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ 345 పరుగులు సాధించాడు. ఇక బుమ్రా 20 వికెట్లు తీయగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 11 వికెట్లు తీయడంతో పాటు 200 పరుగులు చేశాడు. చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్
IPL 2024: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరదు! అదెలా?
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్‌లో మూడో బెర్తు కూడా ఖరారైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ టేబుల్ టాపర్‌గా ముందుగానే టాప్-4లో తిష్ట వేయగా.. రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా అర్హత సాధించాయి.లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం(మే 14)తో ఎలాంటి సమీకరణలతో పనిలేకుండా రాజస్తాన్.. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌లో నేరుగా చోటు దక్కించుకున్నాయి.ఆ మూడు జట్ల మధ్య పోటీఇక ప్లే ఆఫ్స్‌లో మిగిలిన ఒక్క స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పోటీపడుతున్నాయి. నిజానికి రన్‌రేటు పరంగా ఈ రెండు జట్ల కంటే వెనుకబడి ఉన్న లక్నో(12 పాయింట్లు, నెట్ రన్‌రేటు -0.787) ఈ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్లే!ఒకవేళ ఆశలు సజీవం చేసుకోవాలంటే.. ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో భారీ తేడాతో లక్నో గెలవాలి. అయినప్పటికీ సీఎస్కే- ఆర్సీబీ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. అందులోనూ ఆర్సీబీని సీఎస్కే కచ్చితంగా.. అది కూడా స్వల్ప తేడాతో ఓడిస్తేనే లక్నోకు అవకాశం ఉంటుంది.సీఎస్కే- ఆర్సీబీ ఫలితంపై సర్వత్రా ఆసక్తిఈ నేపథ్యంలో.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప లక్నో వరుసగా మూడోసారి ప్లే ఆఫ్స్ చేరడం సాధ్యంకాదు. కాబట్టి ప్రధానంగా పోటీలో ఉన్నది సీఎస్కే- ఆర్సీబీ మాత్రమే అని చెప్పవచ్చు.ఈ రెండు జట్లలోనూ చెన్నై(14 పాయింట్లు, రన్‌రేటు 0.528) ఆర్సీబీ(12 పాయింట్లు 0.387) కంటే ఓ మెట్టు పైనే ఉంది. అయినప్పటికీ ఆర్సీబీ సీఎస్కేను దాటి ప్లే ఆఫ్స్ చేరాలంటే..? సాధ్యమయ్యే రెండు సమీకరణలు ఇలా!అలా చెన్నైపై గెలిచినా సాధ్యం కాదు1. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసి 200 పరుగులకు తక్కువ కాకుండా స్కోరు చేయాలి. అంతేకాదు 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాలి. అంతకంటే ఒక్క పరుగు తక్కువ తేడాతో చెన్నైని ఓడించినా ఫలితం ఉండదు. నెట్ రన్‌రేటు ఆధారంగా చెన్నై ప్లే ఆఫ్స్ చేరితే.. ఆర్సీబీ మాత్రం ఇంటిబాట పడుతుంది.2. ఒకవేళ ఆర్సీబీ గనుక సెకండ్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చి.. చెన్నై విధించిన 201 పరుగుల లక్ష్యాన్ని.. 11 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ పూర్తి చేయాలి. చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్
ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వైరల్
ఐపీఎల్- 2021, 2022, 2023లో పాయింట్ల పట్టికలో వరుసగా 8, 8, 10వ స్థానాలు.. పేలవ ప్రదర్శన కారణంగా విమర్శలపాలైన జట్టు.. అయితే, ఈ ఏడాది ఆ జట్టు రాత పూర్తిగా మారింది.కొత్త కెప్టెన్ వచ్చాడు... అదిరిపోయే ఓపెనింగ్ కాంబినేషన్ కుదిరింది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్లోనూ మెరుపులు మెరిపించగల ఆటగాళ్లు.. వీరికి తోడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థిని కట్టడి చేయగల బౌలర్లు.. వెరసి లీగ్ దశలో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్‌నకు అర్హత. అర్థమైంది కదా! అవును ఆరెంజ్ ఆర్మీ గురించే ఇదంతా! సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరిసారిగా 2020లో టాప్-4లో అడుగుపెట్టింది. ఇదిగో మళ్లీ ఇప్పుడే ఈ ఘనత సాధించడం. వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో అభిషేక్ శర్మ- ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ జోడీకి తోడు హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ చెలరేగడం.. అవసరమైన సమయంలో నితీశ్‌కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్.. కమిన్స్‌తో పాటు భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే రాణించడం జట్టుకు సానుకూలాంశాలుగా మారాయి.సమిష్టి కృషితో టాప్-4 వరకుఈ క్రమంలో విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిపోయిన సన్‌రైజర్స్.. ఈసారి ప్లే ఆఫ్స్ చేరడం పక్కా అని అభిమానులు మురిసిపోయారు. అందుకు తగ్గట్లుగానే అన్ని విభాగాల్లో రాణిస్తూ సమిష్టి కృషితో టాప్-4 వరకు చేరింది సన్‌రైజర్స్.గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ రద్దైన నేపథ్యంలో నేరుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. నిజానికి ఫామ్ దృష్ట్యా ఈ మ్యాచ్‌లో రైజర్స్ గెలిచేదే! కానీ వర్షం కారణంగా ఇలా పెద్దగా కష్టపడకుండానే అర్హత సాధించింది.పట్టరాని సంతోషంలో కావ్యా మారన్దీంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాల్లో మునిగిపోయింది. ఇక ఆ జట్టు సహ యజమాని కావ్యా మారన్ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఐపీఎల్-2024 వేలంలో తాను అనుసరించిన వ్యూహాలు ఇలా ఫలితాలు ఇస్తుండటంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు.కేన్ మామను హత్తుకున్న సన్‌రైజర్స్ ఓనర్ఇలా ఆనందంలో ఉన్న కావ్యా మారన్‌కు ‘పాత చుట్టం’ ఎదురయ్యారు. అతడిని ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరించడమే గాకుండా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.అతడు మరెవరో కాదు గుజరాత్ టైటాన్స్ ఆటగాడు కేన్ విలియమ్సన్. అదేనండీ ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ముద్దుగా కేన్ మామగా పిలుచుకునే న్యూజిలాండ్ కెప్టెన్. 2021, 2022లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు విలియమ్సన్. పాత ఓనర్‌ను కలుసుకునిఅయితే, ఆ రెండు సీజన్లలో జట్టు దారుణ వైఫల్యాల నేపథ్యంలో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని రిలీజ్ చేయగా.. 2023 వేలంలో గుజరాత్ కొనుక్కుంది. ఇప్పుడిలా తన పాత జట్టు.. ప్రస్తుత జట్టుతో మ్యాచ్ రద్దు కావడం వల్ల ప్లే ఆఫ్స్ చేరడం... ఆ సమయంలో పాత ఓనర్‌ను విలియమ్సన్ కలుసుకోవడం విశేషంగా నిలిచింది. చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్ 🧡 pic.twitter.com/QVyGH6KdNP— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024
ఫైనల్లో నిఖత్ జరీన్
ఎలోర్డా కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ నిఖత్ జరీన్ (52 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లింది. కజకిస్తాన్‌లోని అస్తానా నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ నిఖత్ 5–0తో తొమిరిస్ మిర్జాకుల్ (కజకిస్తాన్)పై ఘన విజయం సాధించింది. భారత్‌కే చెందిన మీనాక్షి (48 కేజీలు), అనామిక (50 కేజీలు), మనీషా (60 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్‌లో మీనాక్షి 5–0తో గుల్నాజ్ బురిబయేవా (కజకిస్తాన్)పై, మనీషా 5–0తో టాంగటార్ అసెమ్ (కజకిస్తాన్)పై గెలిచారు. మరోవైపు సోనూ (63 కేజీలు), మంజు బంబోరియా (66 కేజీలు) సెమీఫైనల్లో నిష్క్రమించి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. పురుషుల విభాగంలో భారత బాక్సర్లు సొయిబమ్ సింగ్ (48 కేజీలు), అభిషేక్ యాదవ్ (67 కేజీలు), విశాల్ (86 కేజీలు), గౌరవ్ చౌహాన్ (ప్లస్ 92 కేజీలు) నేడు సెమీఫైనల్స్‌లో పోటీపడనున్నారు.
బిజినెస్
ట్రక్‌ట్యాక్సీను ఢీకొట్టిన 180 మంది ప్రయాణిస్తున్న విమానం!
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్ టగ్ట్రక్ ట్యాక్సీను ఢీకొన్న సంఘటన బుధవారం పుణె ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు చెప్పాయి.గ్రౌండ్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..పుణె నుంచి దిల్లీకి బయలుదేరిన విమానం టగ్ట్రక్ ట్యాక్సీను ఢీకొట్టింది. విమానం ముందు భాగంతోపాటు ట్రక్ దిబ్బతింది. ఫ్లైట్ కిందిభాగం ట్రక్కు తగలడంతో ల్యాండింగ్ గేర్ వద్ద టైర్ పాడయ్యింది. ఘటన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. అయితే వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్పోర్ట్ వర్గాలు చెప్పాయి. భూమిపై విమానాన్ని నడిపేందుకు టగ్ ట్రక్ టాక్సీని ఉపయోగిస్తారు.ఇదీ చదవండి: ఆకాశవీధిలో 41.8 కోట్లమంది.. ఇక్రా నివేదికఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ ప్రారంభించినట్లు సమాచారం. పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికులను ప్రమాదం జరిగిన విమానంలో నుంచి దింపేసి వారి గమ్యస్థానాలు చేరేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు చెప్పాయి.
రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
బంగారం ధరల మోతకు బ్రేక్ పడింది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 17) కాస్త దిగొచ్చాయి. రెండు రోజులుగా ఆకాశాన్నంటిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. తులం బంగారం రూ.280 మేర తగ్గి ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి కాస్త ఉపశమనం కలిగించింది.తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.250 తగ్గి రూ.67,600 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ. 73,750 లకు దిగొచ్చింది.ఇతర నగరాల్లో.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.67,750 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.270 దిగొచ్చి రూ.73,900 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.67,600లకు, 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ.73,750 లకు క్షీణించింది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.67,950 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.280 తగ్గి రూ.73,850 లకు దిగొచ్చింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.250 క్షీణించి రూ.67,600 వద్దకు తగ్గగా 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ.73,750 లకు దిగొచ్చింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు (మే 17) స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.92,500లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
ఆకాశవీధిలో 41.8 కోట్లమంది.. ఇక్రా నివేదిక
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అదే సమయంలో విమాన సంస్థల ఆదాయాలు 15-17 శాతం పెరుగుతాయని చెప్పింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధీనంలోని విమానాశ్రయాలతో పాటు దిల్లీ, హైదరాబాద్, కోచి అంతర్జాతీయ విమానాశ్రయాలను నమూనాగా తీసుకుని ఇక్రా ఈ నివేదిక విడుదల చేసింది.ఇక్రా నివేదిక ప్రకారం..కరోనా కంటే ముందు నమోదైన విమాన ప్రయాణాలతో పోలిస్తే 10 శాతం అధికంగా ఫ్లైట్‌జర్నీ చేస్తున్నారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 37.6 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. విమానాల రద్దీ ఏటా 8-11 శాతం పెరుగుతోంది. 2023 క్యాలెండర్ ఏడాదిలో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీలో భారత్ వాటా 4.2 శాతంగా ఉంది. 2019లోని 3.8 శాతంతో పోలిస్తే అధికం. 2023లో గ్లోబల్‌గా ప్రయాణికుల రద్దీ 96 శాతం పుంజుకుంది. అదే భారత్‌లో మాత్రం 106 శాతం రికవరీ అయింది. దేశీయంగా కొత్త మార్గాలు, విమానాశ్రయాల సంఖ్య పెరగడంతో ఇది సాధ్యపడినట్లు ఇక్రా తెలిపింది.ఇదీ చదవండి: పెరగనున్న వస్తు ఎగుమతులు.. ఎంతంటే..ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ కుమార్ మాట్లాడుతూ..‘విరామం కోసం, వృత్తి వ్యాపార అవసరాల రీత్యా ప్రయాణాలు అధికంగా చేస్తున్నారు. కొత్త గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభం కావడమూ కలిసొస్తోంది’ అన్నారు.
నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 22,361కు చేరింది. సెన్సెక్స్ 113 పాయింట్లు దిగజారి 73,553 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 83.32 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.38 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లోకి వెళ్లాయి. ఎస్ అండ్ పీ 0.2 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.3 శాతం దిగజారింది.అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు గురువారం దాదాపు ఒకశాతం ర్యాలీ అయ్యాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే తక్కువగానే నమోదవడంతో ఈ ఏడాదిలో ఫెడ్ రిజర్వ్ కనీసం రెండు సార్లు వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు తెరపైకి వచ్చాయి. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావం చూపింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
వీడియోలు
ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎటాక్...పారిపోయిన నాగబాబు
టీడీపీ నాయకుల హౌస్ అరెస్ట్ మూలపేట పోర్టుకు గట్టి భద్రత
ఎన్నికల్లో విజయంపై మేం ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాం
హింసా రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు..
వాటే స్కెచ్.. ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య..
ఓటమి భయం
గులాబీ పార్టీ బలం పెరిగిందా ?..తగ్గిందా ?
ఏపీ బీజేపీని వెంటాడుతున్న ఓటమి భయం..
వైఎస్ జగన్ విస్పష్ట సందేశం
ఫ్యామిలీ
Gaming: యుద్ధంలో ఒకరోజు...
ఆన్లైన్లో గేమ్స్ ఆడుతుంటే ఆ ఉల్లాసమే వేరు. అందులో ఆ గేమ్ అడ్వెంచర్, థ్రిల్లర్, యాక్షన్‌ని కలిగి ఉంటే అబ్బో చెప్పనక్కర్లేదు. అలాంటి రకాలనే ఈ గేమ్ కూడా కలిగి ఉంది. మరి అదేంటో ఆడేద్దామా!రియల్–టైమ్ టాక్టిక్స్, రియల్–టైమ్ స్ట్రాటజీ గేమ్ మెన్ ఆఫ్ వార్–2. 2011లో వచ్చిన మెన్ ఆఫ్ వార్: అసల్ట్ స్వా్కడ్ సీక్వేల్‌గా వస్తున్న ఈ గేమ్ వరల్డ్ వార్–2 నేపథ్యంలో సాగుతుంది. 2016లో వచ్చిన ‘మెన్ ఆఫ్ వార్’కు ఇది మోడ్రన్ రీమాస్టర్. లార్జ్ స్కేల్ టాంక్ కంబాట్ చేసే ప్లేయర్స్ కోసం స్కీమిష్ మోడ్ ఉంది.ఇంజిన్: జెమ్ 2ప్లాట్‌ఫామ్: మైక్రోసాఫ్ట్ విండోస్జానర్స్: రియల్–టైమ్ టాక్టిక్స్, రియల్–టైమ్ స్ట్రాటజీ మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ఇవి చదవండి: ‘దేశీ థ్రిల్’ మ్యూజిక్ బ్యాండ్‌లోని ఈ ముగ్గురి పాట.. వావ్ అనాల్సిందే..!
నువ్వుల నూనెతో మాయ చేద్దాం రండి!
వేసవి వచ్చిందంటే పచ్చళ్ల సీజన్ మొదలవుతుంది. పచ్చళ్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది నువ్వుల నూనె. అద్భుతమైన రుచితోపాటు, ఏడాది పాటు నిల్వ ఉండే పచ్చళ్ల కోసం నువ్వుల నూనెను ఎక్కువగా వాడతారు. అమ్మమ్మల కాలంలో ముఖ్యంగా ఎదిగే అమ్మాయిలకు, బాలింతలకు నువ్వులతో చేసిన వంటకాలను, పదార్థాలను ఇచ్చే వారు. దాదాపు ఆరు నెలల వరకు బాలింతలకు నువ్వుల నూనెతో వండిన ఆహారాలను అందించే వారంటే దీని విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. ఇక పండుగలు పబ్బాలు వచ్చాయింటే నువ్వుల నూనెతో నలుగులు, మసాజ్‌లు ఆ సందడే వేరుగా ఉండేది. వేల ఏళ్లుగా మన సంస్కృతిలో, మన ఆహార పదార్థాల్లో కీలకమైనవి నువ్వులు. నువ్వులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఉదాహరణకు గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ నుండి రక్షణ పొందవచ్చు. నువ్వుల నూనెను కేవలం ఆరోగ్యం కోసమే కాదు, సౌందర్యపోషణలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బీ, ఈ కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి.ఫైబర్ ఎక్కువనువ్వుల గింజలలో పైబర్ ఎక్కువగా లభిస్తుంది. కొన్ని అధ్యయనాలు క్రమం తప్పకుండా నువ్వులు తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్లను తగ్గించుకోవచ్చని తెలుస్తోంది. కండరాల నుండి హార్మోన్ల వరకు ప్రోటీన్ చాలా అవసరం. ఆ కొరతను నువ్వుల ద్వారా తీర్చుకోవచ్చు. రక్తపోటును తగ్గించడంలోనువ్వులలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయ పడుతుంది అధిక రక్తపోటు అనేది గుండె జబ్బులు , స్ట్రోక్‌లకు ప్రధాన ప్రమాద కారకం. అలాగే కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. ఇది ఎముకలకు మంచి శక్తినిస్తుంది. సౌందర్య పోషణలోనువ్వుల నూనెను చర్మానికి మర్దనా చేసుకోవడం వల్ల.. యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. నువ్వుల నూనెతో ముఖానికి, కాళ్లు, చేతులకు రాసుకుని మాసాజ్ చేసుకుంటే మృత కణాలు తొలగిపోతాయి. రక్త ప్రసరణ బాగా జరిగి ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. నువ్వుల నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల చర్మానికి ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. నువ్వుల నూనెను జుట్టు రాసుకుని తలస్నానం చేయడం వల్ల జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంటుంది. ఈ నూనెతో మాడును మసాజ్ చేస్తే కుదుళ్లు బలంగా తయారవుతాయి. రోజూ నువ్వుల నూనెను మర్దనా చేసుకుని స్నానం చేస్తే మేని ఛాయ మెరిసిపోతుంది.
ఓటింగ్ శాతం పెంచేలా..రెస్టారెంట్ల అసోసీయేషన్ కస్టమర్లకు భలే ఆపర్ అందించింది!
ప్రజలు తమ ఓటు హక్కును వినయోగించుకునేలా స్వయం సహాయక బృందాల నుంచి ఆఫీసర్ల వరకు వినూత్న పద్ధతిలో అవగాహన కల్పించే యత్నం చేశారు. అలానే నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) కూడా చేరి తన వంతుగా ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించింది. ఓటు వేస్తే మా రెస్టారెంట్లలో తక్కువ బిల్లుకే మంచి భోజనం తినొచ్చు అంటూ చక్కటి 'డెమోక్రసీ డిస్కౌంట్'ని అందిచింది కస్టమర్లకు. ఎక్కడంటే..ముంభైలోని నేషనల్ రెస్టారెంట్ అసోసీయేషన్ ఆప్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) ఈ ఆఫర్ అందిస్తోంది. ఈ ఎన్నికల సీజన్లో బయటకు వెళ్లేందుకు కారణం కోసం చూస్తున్నారా! ఐతే ఇది మీకు మంచి అవకాశం. ఈ ఎన్నికల్లో ఓటు వేయండి. ఓటువేసినట్లు సిరా చుక్క వేయించకున్నా.. మీ వేలుని చూపించి ముంబై నగరంలోని రెస్టారెంట్లో చక్కటి భోజనం ఆస్వాదించి బిల్లులో 20% డిస్కౌంట్ పొందండి అంటూ ప్రచారం చేస్తోంది ఎన్ఆర్ఏఐ. నగరంలో దాదాపు వంద రెస్తారెంట్లు ఈ ఆఫర్‌ని అందిస్తున్నాయిని ఎన్ఆర్ఏఐ పేర్కొంది. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య వేడుకలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యేలా చూసేందుకు తమ వంతుగా చేస్తున్న ప్రయత్నం అని ముంబై ఎన్ఆర్ఏఐ సీఈవో రాచెల్ గోయెంకా చెప్పారు. మహారాష్ట్రలో మే 20, 21వ తేదీల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలా వినూత్నమైన రీతీలో ప్రచారం చేస్తోంది ఎన్ఆర్ఏఐ. ఇప్పటికే ముంభైలో సుమారు 150 రెస్టారెంట్లు ఈ ఆపర్లను అందిస్తున్నాయని చెప్పారు. అందుకు సంబంధించిన డెమోక్రసీ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చే రెస్టారెంట్ల పూర్తి జాబితాను కూడా వెల్లడించారు. మీ సమీపంలో ఉన్న రెస్టారెంట్‌ని ఎంచుకుని చక్కగా ఓటు వేసి 20% డిస్కౌంట్లో చక్కటి భోజనం ఆస్వాదించడని చెబుతున్నారు గోయెంకా. (చదవండి: వైద్యుడి నిర్లక్ష్యం..నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది!)
ఆవురావురుగా... కమ్మని ఆవకాయ!
ఎండాకాలం... మే నెల సగం అయిపోయింది. మామిడి కాయలు టెంక కట్టి ఎదురు చూస్తున్నాయి. జాడీలు స్నానాలు చేసి ఎండలో సేదదీరుతుంటాయి. ఇంట్లో మిక్సీలు గిర్ర్ర్ అంటూ గోల చేస్తుంటాయి. మామిడి కాయలు కొట్టే కత్తి పుల్లబారి పదునుదేలింది. ముక్కలు కొట్టండి... పళ్లెంలో వేయండి... కారం కలపండి. జాడీలకెత్తండి... పళ్లెంలో వేడి వేడి అన్నం వేసి కలపండి. ఇంటిల్లిపాదీ ఆవురావురుమని తినకపోతే అడగండి.ఆంధ్రా ఆవకాయ..కావలసినవి..పచ్చి మామిడి ముక్కలు – కేజీ;పచ్చి శనగలు – 50 గ్రాములు;సన్న ఆవాలు –పావు కేజీ;మెంతులు – రెండు టేబుల్ స్పూన్లు;గుంటూరు మిరపపొడి –పావు కేజీ;ఉప్పు – నూట యాభై గ్రాములు;పసుపు – టేబుల్ స్పూన్;నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె –పావు కేజీ.తయారీ..ఆవకాయ పెట్టడానికి ముందు రోజు మిరపకాయలు, ఆవాలు, మెంతులను విడిగా ఎండబెట్టాలి. మరునాడు ఉదయం ఆవాలను మిక్సీలో పొడి చేయాలి. మిరపపొడి రెడీమేడ్ది కూడా తీసుకోవచ్చు. కానీ ఆవాలు స్వయంగా చేసుకోవాలి.మామిడి కాయలను కడిగి తేమపోయే వరకు తుడిచి ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత కాయలకున్న తొడిమ తొలగించాలి.అప్పటికీ సొన కారుతుంటే శుభ్రమైన నూలు వస్త్రంతో తుడిచేయాలి. ఇలా సిద్ధం చేసుకున్న మామిడికాయలను టెంకతో సహా చిన్న ముక్కలు చేసుకోవాలి.శనగలను శుభ్రమైన వస్త్రంతో తుడిచి పక్కన పెట్టాలి.వెడల్పుగా ఉన్న పెద్దపాత్రలో మామిడి ముక్కలు వేయాలి. అందులో శనగలు, ఆవాల పొడి, మిరపపొడి, ఉప్పు, పసుపు వేసి అట్లకాడతో బాగా కలపాలి.మెంతులు కూడా వేసి బాగా కలపాలి. చివరగా నూనెపోసి ముక్కలకు ఒత్తిడికి కలగకుండా అడుగు నుంచి కలిపితే ఆవకాయ రెడీ. దీనిని పింగాణి జాడీలో పెట్టి అంచులకు తెల్లని శుభ్రమైన నూలు వస్త్రాన్ని కట్టాలి.ఆ పైన మూత పెట్టాలి. ఈ జాడీలోని ఆవకాయను రోజూ మూత తీయకూడదు. రోజువారీ వాడుకకు అవసరమైనంత చిన్న జాడీలోకి తీసుకుంటూ ఉంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.బెల్లం ఆవకాయ..కావలసినవి..మామిడి ముక్కలు – అర కేజీ; బెల్లం – అర కేజీ;మిరపపొడి– 200 గ్రాములు;ఉప్పు – 200 గ్రాములు;ఆవపిండి– 100 గ్రాములు;నూనె – 200 గ్రాములు.తయారీ..మామిడి కాయలను శుభ్రంగా కడిగి తుడిచి టెంకతో సహా ముక్కలు చేసుకోవాలి.బెల్లాన్ని తురిమి వెడల్పుపాత్రలో వేసి అందులో మామిడికాయ ముక్కలు, ఆవపిండి, మిరపపొడి, ఉప్పు, కప్పు నూనె వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని రెండు రోజులపాటు ఎండలో పెట్టాలి. బెల్లం కరిగిపాకంలా జిగురుగా వచ్చినట్లనిపిస్తే సరే, లేకపోతే మూడవ రోజు కూడా ఎండలో పెట్టాలి.పాకం వచ్చిన తర్వాత మిగిలిన నూనె కూడా వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి.ఈ బెల్లం ఆవకాయను పిల్లలు బాగా ఇష్టపడతారు. ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి మహిళలు రోజూ తీసుకోవచ్చు.నువ్వుల ఆవకాయ..కావలసినవి..మామిడి కాయ ముక్కలు – 3 కప్పులు;నువ్వులు – ఒకటిన్నర కప్పులు;మిరపపొడి– ముప్పావు కప్పు;ఉప్పు–పావు కప్పు;పసుపు – అర టీ స్పూన్;వేరు శనగ నూనె – ఒకటిన్నర కప్పులు.తయారీ..నువ్వులను తయారీ దోరగా వేయించి చల్లారిన పొడి చేయాలి.మామిడి ముక్కలను వెడల్పుపాత్రలో వేసి అందులో నువ్వుల పొడి, మిరపపొడి, ఉప్పు, పసుపు వేసి అట్లకాడతో బాగా కలపాలి.ఉప్పు, కారం, నువ్వుపిండి సమంగా కలిసిన తర్వాత కప్పు నూనెపోసి మళ్లీ కలపాలి.ఈ మిశ్రమాన్ని జాడీలోకి తీసుకుని, మిగిలిన నూనెను పైన తేలేటట్లుపోయాలి.ఇందులో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెల్లుల్లి ఆవకాయ..కావలసినవి..మామిడి కాయ ముక్కలు –పావు కేజీ లేదా (మీడియం సైజు కాయలు 3);వెల్లుల్లి – 200 గ్రాములు;ఉప్పు – 100 గ్రాములు;మిరపపొడి– 200 గ్రాములు;ఆవాలు – 150 గ్రాములు (ఎండబెట్టి పొడి చేయాలి);పసుపు – టీ స్పూన్;మెంతులు – టేబుల్ స్పూన్;నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె – కిలో.తయారీ..ఒకపాత్రలో నూనెపోసి మామిడి ముక్కలను వస్త్రంతో తుడిచి నూనెలో వేయాలి.వెల్లుల్లిపాయలను పొట్టు వలిచి ఒక ప్లేట్లో వేసి గాలికి ఆరనివ్వాలి.మరొకపాత్రలో మిరపపొడి, ఆవపిండి, ఉప్పు, పసుపు, మెంతులు వేసి సమంగా కలిసేవరకు కలపాలి. ఇప్పుడు వెల్లుల్లి రేకలను వేసి కలపాలి.మామిడి ముక్కల లోని నూనెను ఒక జాడీలోకి వంపాలి. ఇప్పుడు మామిడి ముక్కలలో ముందుగా కలిపి సిద్ధంగా ఉంచిన ఉప్పు, వెల్లుల్లి ఇతర పొడుల మిశ్రమాన్ని వేసి పొడులన్నీ మామిడి ముక్కలకు పట్టేలా కలపాలి.మామిడి ముక్కలను పట్టి ఉన్న నూనె ఈ పొడులను పీల్చుకుని కొంత తడి పొడిగా మారుతుంది.ఈ మిశ్రమాన్ని నూనె వంపుకున్న జాడీలో వేసి అదమాలి.నూనె పైకి తేలుతుంది. వెల్లుల్లి బ్లడ్ థిన్నర్. రక్తాన్ని పలచబరిచి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా నివారిస్తుంది. కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ హాయిగా తినవచ్చు.
న్యూస్ పాడ్‌కాస్ట్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
క్రైమ్
నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట టౌన్ :నరసరావుపేటలో రాజకీయాలను ‘పచ్చ’ దండు వ్యక్తిగత కక్షగా మార్చి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఓటమి భయంతో టీడీపీ అరాచకం సృష్టిస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు.. చివరకు ఓటు వేసిన వారి ఇళ్లపై విధ్వంసానికి పూనుకుంది. పల్నాడు ప్రాంతంలో ఎన్నికలప్పుడు ప్రధాన పార్టీల మధ్య గొడవలు ఎన్నో ఏళ్లుగా రగులుతూనే ఉంటాయి. ఎన్నికల అనంతరం ఆ పగలు చల్లారి, అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉంటారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వం సరికొత్త ప్రతీకారానికి తెర తీసింది.గత ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకుని మరోసారి పోటీకి దిగిన నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుకు మళ్లీ ఓటమి ఖాయమని పోలింగ్‌కు ముందే అన్ని సర్వేలు తేల్చాయి. దీంతో ఆయన వెన్నులో వణుకు పుట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్థిని అడ్డు తొలగించుకుంటే తన గెలుపు ఖాయమని భావించి, నరసరావుపేటలో విధ్వంసానికి ప్రణాళిక రచించారని సమాచారం. ఇందులో భాగంగా పోలింగ్ రోజున నరసరావుపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపైకి సుమారు 200 మంది టీడీపీ రౌడీలు మారణాయుధాలతో పట్టపగలు దాడికి వెళ్లారు. ఆ సమయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన మామ కంజుల రామకోటిరెడ్డిపై దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనపై అరవింద్‌బాబుతో పాటు మరో 30 మందిపై నరసరావుపేట టూటౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మట్టుబెట్టాలనే పథకంతోనే ఆయన ఇంటిపైకి దాడికి వచ్చినట్లు తెలిసింది. ఈ దాడికి ఇతర రాష్ట్రాల నుంచి బౌన్సర్లు, కిరాయి రౌడీలను అరవింద్ బాబు పోలింగ్ ముందు రోజు రాత్రికే రప్పించినట్టు సమాచారం.అరవింద బాబు ఇంట్లో పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్లు గొడవల నేపథ్యంలో పోలింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థి అరవింద బాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆ సయమంలో ఆయన ఇంట్లో (ఇల్లు, ఆస్పత్రి ఒకచోటే) సోదాలు నిర్వహించగా.. పెట్రోల్ బాంబులు, ఇనుప రాడ్లు, వేట కొడÐ] ళ్లు, కంకర రాళ్లు, ఇతర మారణాయుధాలు దొరికాయి. పోలింగ్‌కు ముందుగానే వీటిని తీసుకొచ్చి ఉంచినట్లు సమాచారం.ఈ ఎన్నికల్లోనూ ఓటమి ఖాయమని తేలడంతో గోపిరెడ్డిని అడ్డు తొలగించుకోవాలనే మారణాయుధాలు తెప్పించినట్లు తెలిసింది. మారణాయుధాలకు సంబంధించిన వీడియోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయినా పోలీసులు ఇందుకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం గమనర్హం. పోలీసు పెద్దల అనుమతి రాకపోవడం వల్లే అరవింద్బాబుపై కేసు నమోదు కాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నరసరావుపేటలో అల్లర్ల కారణంగా రెండు రోజుల పాటు దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాగైతే తామెలా బతకాలని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
యశవంతపుర: గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్యకు వీడియో కాల్ చేసి తిరిగి రావాలని అర్థించాడు ఓ భర్త. దీనికి ఆమె నిరాకరించడంతో బెదిరించాలని ఉరేసుకోబోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు బాగలగుంటెలో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన అమిత్‌కుమార్ సాహ (28) దాసరహళ్లిలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం హసన్‌కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చదువు నిమిత్తం భార్యను నర్సింగ్ కోర్సులో చేర్చాడు. ఆమె నిరంతరం ఫోన్లో స్నేహితులతో మాట్లాడుతూ తనను పట్టించుకోకపోవడంతో భార్యతో గొడపడేవాడు. ఇద్దరి మధ్య గొడవలు పెరగడంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో గురువారం అమిత్ భార్యకు వీడియో కాల్ చేసి ఇంటికి రావాలని బతిమాలాడు. రాకపోతే ఉరి వేసుకొని చనిపోతానని బెదిరించాడు. ఇంతలో చేతిలోని మొబైల్ ఫోన్ కింద పడటంతో పాటు గొంతుకు ఉరి బిగిసి మృత్యువాత పడ్డాడు.
జిమ్ చేస్తూ కుప్పకూలి 17 ఏళ్ల మైనర్ కన్నుమూత
జీవితంలో మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభం తరువాత ఆరోగ్యం ఉన్నవారు వ్యాయామం చేస్తూ పలు ఆకస్మిక మరణాలు ఆందోళన రేపుతున్నాయి. జిమ్‌లో వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల బాలుడు మరణించిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్పూర్లోఈ విషాదం చోటు చేసుకుంది. భాన్‌పురిలోని స్పేస్ జిమ్‌లో బుధవారం వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల మైనర్ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. రోజు మాదిరిగానే ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతూ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల సమాచారం ప్రకారం సత్యం (17) రహంగ్‌డేల్ భన్‌పురిలోని ధనలక్ష్మి నగర్లో నివాసముంటున్నాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతున్న అతడు ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపో యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేదు. అయితే అతని మరణానికి గల కారణాలను ఇంకా అధికారికంగా వెల్లడిరచలేదు. పోస్టుమార్టం నివేదిక తరువాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.సత్యం తండ్రి సుభాష్ రహంగ్‌డేల్ చిరు వ్యాపారం చేసుకునేవాడు. ఇద్దరు కుమారుల్లో సత్యం పెద్దవాడు. ఇటీవల ధనలక్ష్మి నగర్‌లోని కృష్ణ ఇంగ్లీషు మీడియం స్కూల్లో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కానీ ఈ సంతోషం వారికి ఎంతోకాలం నిలవలేదు. ఎదిగిన కొడుకు ఆకస్మికంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
పోలీసు కాల్పుల్లో రౌడీ షీటర్ మృతి
దొడ్డబళ్లాపురం: హత్యకేసులో నిందితుడైన రౌడీ షీటర్ పోలసుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈఘటన దొడ్డ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుడు రౌడీషీటర్ నరసింహమూర్తి ఈనెల 10వ తేదీన హేమంత్ గౌడ అనే యువకుడిని చర్చలకు పిలిచాడు. అనంతరం అనుచరులతో కలిసి మారణాయుధాలతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. ఆ రోజు రాత్రి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం దొడ్డ పట్టణ శివారులో ఒక చోట నిందితుడు నరసింహమూర్తి దాక్కున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే నిందితుడు పోలీసులపై దాడికి యతి్నంచాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ నరసింహమమూర్తికి తగలడంతో మృతి చెందాడు. కేసు దర్యాపులో ఉంది.