Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

How to deal with kidney problems
ఈ ఎండల్లో కిడ్నీ ఎమర్జెన్సీల నివారణ ఇలా..! 

ఈ ఎండలతో దేహానికి వడదెబ్బ లాంటి ప్రమాదాలు పొంచి ఉన్నట్టే మూత్రపిండాల (కిడ్నీల)కు సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.  ‘అక్యూట్‌ కిడ్నీ ఇంజ్యూరీ’ (ఏకేఐ), మూత్రవ్యవస్థలో రాళ్లు ఏర్పడే‘యూరో లిథియాసిస్‌’, కొన్నిరకాల మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు, వడదెబ్బ కారణంగా ఏర్పడే కిడ్నీ సమస్యలు ఇందులో కొన్ని. ఈ మెడికల్‌ ఎమర్జెన్సీ సమయాల్లో ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి వంటి వాటి గురించి తెలిపే కథనమిది. ఏప్రిల్‌ నెల ఇంకా ముగియక ముందే... నమోదవుతున్న ఉష్ణోగ్రతల తీవ్రత 40 డిగ్రీలకు పైమాటే. దాంతో డీహైడ్రేషన్‌ వల్ల సమస్యలకు గురయ్యే కీలక అవయవాల్లో కిడ్నీలు ముఖ్యమైనవి. కిడ్నీపై దుష్ప్రభావాలిలా... అక్యూట్‌ కిడ్నీ ఇంజ్యూరీ (ఏకేఐ) : దేహంలో నీరు తగ్గినప్పుడు రక్తం చిక్కబడి, రక్తప్రవాహ వేగమూ మందగిస్తుంది. ఫలితంగా అన్ని అవయవాలకు లాగే కిడ్నీకి అందే రక్త పరిమాణం కూడా తగ్గుతుంది. దాంతో దేహంలో పేరుకు పోయే వ్యర్థాలను బయటకు పంపే వేగమూ తగ్గుతుంది. దాంతో కిడ్నీల పనితీరులో ఆకస్మికంగా మార్పులు వచ్చి, అస్తవ్యస్తంగా పని చేస్తాయి. ఈ కండిషన్‌ పేరే ‘అక్యూట్‌ కిడ్నీ ఇంజ్యూరీ’. దీని దశలు:ఆలిగ్యూరిక్‌ ఫేజ్‌: ఈ దశలో యూరిన్‌ ఔట్‌పుట్‌ బాగా తగ్గి, కిడ్నీల్లోని రీనల్‌ ట్యూబ్యూల్స్‌ అనే సన్నటి నాళాలు దెబ్బతింటాయి. డైయూరెటిక్‌ ఫేజ్‌: ఈ దశలో కిడ్నీ తనను తాను రిపేర్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. రికవరీ ఫేజ్‌: ఒకవేళ తగినన్ని నీళ్లు, ద్రవాహారం అంది రీ–హైడ్రేషన్‌ జరిగితే...కిడ్నీల పనితీరు మెరుగయ్యే అవకాశం ఉంది. ఏకేఐ లక్షణాలు...► మూత్రం తక్కువగా రావడం.► ఒంట్లో వాపు ► వికారం ∙తీవ్రమైన నిస్సత్తువ, అలసట► శ్వాస వేగంగా తీసుకుంటూ ఉండటం... సరిగా అందకపోవడం. చికిత్స... ఇది పరిస్థితి తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా సెలైన్‌ పెట్టి, దేహానికి తగినంత రీహైడ్రేషన్‌ జరిగేలా చూడటం. ∙అవసరాన్ని బట్టి యాంటిబయాటిక్స్‌ వాడటం. ∙కిడ్నీలు తాత్కాలికంగా పనిచేయక దేహంలో బాగా వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు అవసరాన్ని బట్టి డయాలసిస్‌ చేయాల్సి రావడం. కిడ్నీలో రాళ్లు (యూరోలిథియాసిస్‌): మూత్ర వ్యవస్థలో లవణాల స్ఫటికాలతో రాళ్లు ఏర్పడటాన్ని ‘యూరోలిథియాసిస్‌’ అంటారు. దీన్నే వాడుక భాషలో మూత్రపిండాల్లో రాళ్లు రావడంగా చెబుతారు. తీవ్రమైన నడుము నొప్పి, మూత్రంలో రక్తం వంటి లక్షణాలతో వ్యక్తమయ్యే ఈ సమస్యలో రాళ్లు చిన్నగా ఉంటే మందులతో పాటు, తగినన్ని నీళ్లు, ద్రవాహారం తీసుకోవడం, రాళ్లు ఏర్పడేందుకు అవకాశం ఉండే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలను సూచిస్తారు. రాయి పరిమాణాన్ని బట్టి కొన్ని ప్రక్రియలతో చూర్ణమయ్యేలా చేసి, మూత్రంతో పాటు పోయేలా చూస్తారు. కుదరనప్పుడు  శస్త్రచికిత్స చేస్తారు.మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు : వ్యర్థాలు బయటకు పోని సందర్భాల్లో... అవి దేహంలో పేరుకు పోయి, బ్యాక్టీరియా పెరిగిపోయి, మూత్రవ్యవస్థలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో మూత్ర విసర్జనలో తీవ్ర ఇబ్బంది, నొప్పి, మూత్రం బొట్లు బొట్లుగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తారు.  నివారణ కోసం... ►సాధ్యమైనంతవరకు నీడపట్టునే ఉండటం.►తేలికపాటి రంగులతో కూడిన, గాలి తగిలేలా సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం, ఎండలోకి వెళ్లేటప్పుడు గొడుగు, బ్రిమ్‌ హ్యాట్, స్కార్ఫ్‌ వంటివి వాడటం.► తగినన్ని నీళ్లు తాగుతూ, లవణాలు (ఎలక్ట్రోలైట్స్‌) అందేలా చూసుకోవడం.►డాక్టర్‌ సూచన లేకుండా డై–యూరెటిక్స్, నొప్పి నివారణ మందుల్ని వాడకపోవడం.                                        ∙

Kalki 2898 AD Announced New Release Date
శక్తులన్నీ ఏకమయ్యాయి 

థియేటర్స్‌లో ‘కల్కి’ రాక ఖరారైంది. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఫ్యూచరిస్ట్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898 ఏడీ’ ఈ ఏడాది జూన్‌ 27న విడుదల కానుంది. ‘‘మెరుగైన భవిష్యత్‌ కోసం అన్ని శక్తులు ఏకమయ్యాయి’’ అనే క్యాప్షన్‌తో ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు మేకర్స్‌.మహాభారతం కాలంలో ఆరంభమై 2898 ఏడీలో ఈ సినిమా ముగుస్తుందనీ, ఆరువేల ఏళ్ల కాలమానంలో ఈ కథ సాగుతుందనీ సమాచారం. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. సి. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:  సంతోష్‌ నారాయణన్‌.

CM YS Jagan Election Campaign Starts From Tadipatri
సీఎం జగన్‌ మలివిడత ప్రచారం నేటి నుంచే...

సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరోసారి చారిత్రక విజ­యంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌ మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్సార్‌ సర్కిల్‌లో ఆదివారం ఉ.10 గంటలకు నిర్వహించే బహిరంగసభతో ఈ ప్రచార భేరి మోగిం­చనున్నారు. అనంతరం.. మ.12.30కు తిరు­పతి లోక్‌సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్‌లో నిర్వహించే బహిరంగసభలోనూ.. అలాగే, మ.3 గంటలకు నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్‌లో జరిగే సభలోనూ సీఎం జగన్‌ పాల్గొంటారు. సార్వ­త్రిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్వహించిన సిద్ధం సభలకు జనం సునామీలా పోటెత్తారు. రాప్తాడు, మేదరమెట్ల సభలు ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతిపెద్ద ప్రజాసభలుగా నిలిచాయి.   రేపటి ప్రచారం ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 29న (సోమవారం) అనకాపల్లి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన షెడ్యూల్‌ విడుదల చేశారు. 29 ఉ.10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలో.. అదేరోజు మ.12.30కు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో.. సా.3.00 గంటలకు గుంటూరు జిల్లా పొన్నూ­రు సభల్లో సీఎం జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారన్నారు.  కూటమి కకావికలు...మరోవైపు.. టీడీపీ–జనసేన–బీజేపీ మూడు పార్టీలు కూటమిగా జట్టుకట్టాక తాడేపల్లిగూడెం, చిలకలూరిపేటలో నిర్వహించిన సభలతోపాటు చంద్రబాబు, పవన్‌ ఎన్నికల ప్రచారానికి జనస్పందన కన్పించకపోవడంతో కూటమి శ్రేణులు డీలాపడ్డాయి. 2014 ఇదే కూటమి ఎడాపెడా హామీలిచ్చేసి, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన మోసంపై ఇప్పటికీ ప్రజలు రగిలిపోతున్నారు. 2019 ఎన్నికల్లో విడిపోయి మళ్లీ ఇప్పుడు మరోసారి జనసేన, బీజేపీతో టీడీపీ జట్టుకట్టడాన్ని పచ్చి అవకాశవాదంగా ప్రజలు పరిగణిస్తున్నారని.. అందుకే కూటమి సభలకు జనం మొహం చాటేస్తున్నారని రాజకీయ పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు. ఇది కూటమి శ్రేణులను కకావికలం చేస్తోంది.   వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నయాజోష్‌.. ఇక సిద్ధం సభలు గ్రాండ్‌ సక్సెస్‌ కావడం.. బస్సుయాత్ర చరిత్ర సృష్టించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం జగన్‌ ఎన్నికల మలివిడత ప్రచారానికి శ్రీకారం చుడుతుండటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నయాజోష్‌ నెలకొంది.   ఉప్పొంగుతున్న అభిమాన సంద్రం.. ఎన్నికల తొలివిడత ప్రచా­రంలో భాగంగా గతనెల 27న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో మహా­నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నుంచి సీఎం జగన్‌ ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర  23 జిల్లాల్లో 86 నియోజకవర్గాల్లో 2,188 కిలోమీటర్ల దూరం సాగి, ఈనెల 24న శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద ముగిసింది. ఈ యాత్రకు జనం తండోపతండాలుగా పోటెత్తడంతో నైతిక స్థైర్యం దెబ్బతిన్న కూటమి శ్రేణులు కుదేలయ్యాయి. బస్సుయాత్రలో మండుటెండైనా.. అర్థరాత్రయినా అభిమాన సంద్రం ఉప్పొంగింది. ఇక ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడం.. సుపరిపాలన అందించడం ద్వారా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపిన సీఎం జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో బలమైన నమ్మకాన్ని బస్సుయాత్ర ప్రతిబింబించిదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో పాదయాత్ర తరహాలో ఇప్పుడు బస్సుయాత్ర ద్వారా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా సీఎం జగన్‌ మార్చేశారని తేల్చిచెబుతున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని జాతీయ, ప్రతిష్టాత్మక పొలిటికల్‌ కన్సల్టెన్సీలు నిర్వహించిన 20కి పైగా సర్వేలు తేల్చిచెప్పడమే అందుకు తార్కాణం.   

Why is your WhatsApp app green now
వాట్సప్‌లో మారిన రంగులు.. కారణం అదేనంటూ

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ మరో అప్‌డేట్‌తో యూజర్లను అలరించింది. నిన్న మొన్నటి వరకు వాట్సప్‌ యాప్‌ మొత్తం బ్లూ కలర్‌ థీమ్‌లో ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో గ్రీన్‌ ఇంటర్‌ ఫేస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రశాంతత, స్థిరత్వం, ఇన్ప్పిరేషన్‌కు మారుపేరైన బ్లూ కలర్‌ను స్థానంలో గ్రీన్‌ కలర్‌ ఇంటర్‌ ఫేస్‌ను ఎందుకు అందుబాటులోకి తెచ్చిందా అని యూజర్లు చర్చించుకుంటున్నారు.వాట్సప్‌ గ్రీన్‌ కలర్‌లోకి ఎందుకు మారింది?వాట్సప్‌ మాతృసంస్థ మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ యూజర్లకు ఆధునిక, కొత్త అనుభవాన్నిఅందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తద్వారా వినియోగం సైతం మరింత సులభతరం కానుందన్నారు. ఇక, ఇంటర్‌ పేస్‌, రంగులు, చిహ్నాల రంగుల్ని సైతం మార్చినట్లు  వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.  రంగులు మార్చడానికి కారణం?రంగు మార్పు కంటే వాట్సప్‌ వినియోగించే యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగు పరిచేందుకు యాప్‌లో మార్పులు చేపట్టినట్లు వాట్సప్‌ వెల్లడించింది.  దీంతో పాటు వాట్సప్ తన మెసేజ్‌ కీబోర్డ్‌లలో కొన్ని పదాలను క్యాపిటలైజ్ చేసింది. కొంతమంది వినియోగదారులు ఆన్‌లైన్, టైపింగ్ మొదటి అక్షరాలను  క్యాపిటలైజ్ చేసిన మార్పును గమనించారు. ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటిలోనూ గమనించిన ఈ మార్పు ఆన్‌లైన్‌లో ముఖ్యమైన చర్చలకు దారితీసింది. 

IPL 2024 DC VS MI: Tristan Stubbs Hits 4,4,6,4,4,4 In A Over Against Luke Wood
IPL 2024 DC VS MI: ట్రిస్టన్‌ స్టబ్స్‌ ఊచకోత.. బెంబేలెత్తిపోయిన వుడ్‌

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు శివాలెత్తిపోయారు. తొలుత జేక్‌ ఫ్రేసర్‌ (27 బంతుల్లో 84; 11 ఫోర్లు, 6 సిక్సర్లు), షాయ్‌ హోప్‌ (17 బంతుల్లో 41; 5 సిక్సర్లు), ఆఖర్లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (25 బంతుల్లో 48 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోయారు. ఫలితంగా ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఐపీఎల్‌లో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోర్‌. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ పోరెల్‌ (27 బంతుల్లో 36; 3 ఫోర్లు, సిక్స్‌), రిషబ్‌ పంత్‌ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌ (6 బంతుల్లో 11 నాటౌట్‌; సిక్స్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ముంబై బౌలర్లలో లూక్‌ వుడ్‌, బుమ్రా, పియూశ్‌ చావ్లా, నబీ తలో వికెట్‌ పడగొట్టారు. ట్రిస్టన్‌ స్టబ్స్‌ ఊచకోతలూక్‌ వుడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఈ ఓవర్‌లో స్టబ్స్‌ ఐదు బౌండీరలు, ఓ సిక్సర్‌ కొట్టి (4,4,6,4,4,4) 26 పరుగులు పిండుకున్నాడు. స్టబ్స్‌ ధాటికి కేవలం రెండో మ్యాచ్‌ ఆడుతున్న వుడ్‌ బెంబేలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లు వేసిన వుడ్‌ ఓ వికెట్‌ తీసి 68 పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా వుడ్‌ ఐపీఎల్‌ చరిత్రలో ఐదో చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత చెత్త బౌలింగ్‌ గణాంకాల రికార్డు మోహిత్‌ శర్మ పేరిట నమోదై ఉంది. మోహిత్‌ ఇదే సీజన్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో వికెట్‌ లేకుండా 73 పరుగులు సమర్పించుకున్నాడు.

Senior Tdp Leader Yanamala Krishnudu Joined Ysrcp
సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి యనమల కృష్ణుడు

సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్‌ నేత యనమల కృష్ణుడు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. యనమల కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరిక్రిష్ణ, ఎల్‌.భాస్కర్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో తుని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దాడిశెట్టి రాజా, కాకినాడ వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్‌ పాల్గొన్నారు.ఐదేళ్ల సీఎం జగన్ పాలన చూసి వైఎస్సార్‌సీపీలో చేరా..సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ, టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టిక్కెట్లిచ్చారని.. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీలో 42 సంవత్సరాలుగా ఉన్నా. చంద్రబాబు, యనమల మోసం వల్లే నాకు అన్యాయం జరిగింది. చంద్రబాబు బీసీలను మోసం చేశారనడానికి నేనే ఉదాహరణ. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లో ఉన్నా. నాకు తుని టిక్కెట్ ఇవ్వకపోగా.. నన్ను ఘోరంగా అవమానించారు. తునిలో ఏరోజూ యనమల రామకృష్ణుడు లేరు’’ అంటూ కృష్ణుడు ధ్వజమెత్తారు.‘‘42 సంవత్సరాలగా ప్రజల‌ మధ్య ఉన్నది నేనే.. ఐదేళ్ల సీఎం జగన్ పాలన చూసి వైఎస్సార్‌సీపీలో చేరా. సీఎం వైఎస్ జగన్‌ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేస్తా. కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్, తుని ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా గెలుపునకు కృషి చేస్తా’’ అని కృష్ణుడు తెలిపారు.

IPL 2024 DC VS MI: Jake Fraser Has Fourth And Fifth Highest Percentage Of Runs In Boundaries In An IPL Innings
Jake Fraser: కొడితే బౌండరీ లేకపోతే సిక్సర్‌..!

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 27) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనింగ్‌ బ్యాటర్‌ జేక్‌ ఫ్రేసర్‌ మెక్‌గుర్క్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 27 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో జేక్‌ పడిన బంతిని పడినట్లు చితక బాదాడు. కొడితే బౌండరీ లేకపోతే సిక్సర్‌ అన్నట్లు జేక్‌ ఇన్నింగ్స్‌ సాగింది.ముంబై బౌలర్ల అదృష్టం కొద్ది జేక్‌ పియూశ్‌ చావ్లా బౌలింగ్‌లో నబీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. లేకపోతే ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు పడరాని పాట్లు పడాల్సి వచ్చేది. ఔట్‌ కాక ముందు జేక్‌ ఊపు చూస్తే క్రిస్‌ గేల్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు కూడా బద్దలయ్యేలా కనిపించింది. ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన జేక్‌.. ఈ సీజన్‌లో ఈ ఘనత సాధించడం ఇది రెండోసారి. సన్‌రైజర్స్‌తో జరిగిన తన అరంగ్రేటం మ్యాచ్‌లోనూ జేక్‌ 15 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. 95.23 శాతం పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో..జేక్‌ ఇన్నింగ్స్‌లో ఆసక్తికర విషయమేమిటంటే.. అతను చేసిన 84 పరుగుల స్కోర్‌లో 95.23 శాతం పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో వచ్చాయి. అంటే జేక్‌ సాధించిన 84 పరుగుల్లో 80 పరుగులు బౌండరీలు, సిక్సర్ల ద్వారా వచ్చాయి. కేవలం 4 పరుగులు మాత్రమే సింగిల్స్‌ రూపంలో వచ్చాయి. జేక్‌ ఇదే సీజన్లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే తరహాలోనే (90 శాతానికి పైగా పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో) రెచ్చిపోయాడు.ఆ మ్యాచ్‌లో జేక్‌ చేసిన 65 పరుగుల్లో 62 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో వచ్చాయి. ఐపీఎల్‌లో అత్యధిక శాతం పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో సాధించిన రికార్డు మిస్టర్‌ ఐపీఎల్‌ సురేశ్‌ రైనా పేరిట ఉంది. 2014 సీజన్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రైనా తాను చేసిన 87 పరుగుల్లో 84 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో సాధించాడు. తన 87 పరుగుల ఇన్నింగ్స్‌లో బౌండరీలు, సిక్సర్ల శాతం 96.55గా ఉంది. మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181పరుగులు చేసింది. జేక్‌ (84), అభిషేక్‌ (36), షాయ్‌ హోప్‌ (41) ఔట్‌ కాగా.. పంత్‌ (16), స్టబ్స్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో జేక్‌ చేసిన స్కోర్లు..- 55(35).- 20(10).- 65(18).- 23(14).- 84(27).

Jake Fraser McGurk smashes 15-ball fifty against Mumbai Indians
ఇదెక్కడి ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! ప్ర‌పంచంలోనే

ఐపీఎల్‌-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్‌గా వచ్చిన మెక్‌గుర్క్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.  ముంబై బౌలర్లను మెక్‌గుర్క్ ఊచకోత కోశాడు.ఆఖరికి ముంబై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సైతం జేక్ ఫ్రేజర్ చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 27 బంతులు ఎదుర్కొన్న మెక్‌గర్క్‌.. 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు.ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 15 బంతుల లోపు  రెండు సార్లు హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న మూడో క్రికెటర్‌గా మెక్‌గర్క్ నిలిచాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ మెక్‌గర్క్‌ 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు.దీంతో ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో మెక్‌గర్క్‌ కంటే ముందు వెస్టిండీస్‌ దిగ్గజాలు ఆండ్రీ రస్సెల్‌, సునీల్‌ నరైన్‌ ఉన్నారు.

Great Day Out With Family in Hyderabad SRH Pat Cummins Enjoy Biryani
హైదరాబాదీ బిర్యానీకి కమిన్స్‌ ఫిదా.. తొలిసారి ఇలా!

సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ హైదరాబాదీ బిర్యానీకి ఫిదా అయ్యాడు. కమ్మని బిర్యానీ రుచితో కడుపు నిండిపోయిందని.. మరో వారం రోజుల పాటు తాము ఇంకేమీ తినాల్సిన పనిలేదంటూ చమత్కరించాడు.తన కుటుంబం తొలిసారి భారత్‌కు వచ్చిందని.. వారితో కలిసి హైదరాబాద్‌లో పర్యటించడం సంతోషంగా ఉందని కమిన్స్‌ హర్షం వ్యక్తం చేశాడు. తమకు రుచికరమైన భోజనం అందించిన హోటల్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు.కుటుంబంతో కలిసి అక్కడ దిగిన ఫొటోలను కమిన్స్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయి. కాగా ఐపీఎల్‌-2024 సీజన్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ను సన్‌రైజర్స్‌ ఫ్రాంఛైజీ తమ సారథిగా ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే, టీ20లలో నాయకుడిగా పెద్దగా అనుభవం లేని ఈ వన్డే వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ను ఎంపిక చేసి రైజర్స్‌ రిస్క్‌ తీసుకుందని చాలా మంది భావించారు. కానీ.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ సన్‌రైజర్స్‌ను విజయపథంలో నడిపిస్తున్నాడు కమిన్స్‌.ఇప్పటి వరకు ఈ ఎడిషన్‌లో సన్‌రైజర్స్‌ ఎనిమిదింట ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏకంగా మూడుసార్లు 250కి పైగా స్కోర్లు నమోదు చేసి రికార్డులు సృష్టించింది. కెప్టెన్‌గా భేష్‌ అనిపిస్తున్న ఈ పేస్‌ బౌలర్‌.. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి పది వికెట్లు పడగొట్టాడు.కాగా గురువారం నాటి ఉప్పల్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో సన్‌రైజర్స్‌ ఓడిపోయింది. తదుపరి ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో చెపాక్‌ వేదికగా కమిన్స్‌ బృందం తలపడనుంది.చదవండి: రోహిత్‌, స్కై కాదు!.. వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టేది ఇతడే: యువీ

Nepal Beat West Indies A By 4 Wickets In First T20 Of Five Match Series In Kirtipur
రోహిత్‌ వీరోచిత శతకం.. విండీస్‌కు షాకిచ్చిన నేపాల్‌

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం వెస్టిండీస్‌-ఏ క్రికెట్‌ జట్టు నేపాల్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 27) తొలి టీ20 జరిగింది. కిరీటీపూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య నేపాల్‌ తమకంటే చాలా రెట్లు మెరుగైన విండీస్‌-ఏకు ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ విండీస్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో నేపాల్‌ కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ వీరోచిత శతకం బాదాడు. ఫలితంగా నేపాల్‌ విండీస్‌పై సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. అలిక్‌ అథనాజ్‌ (47), కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ (74), కీసీ మెక్‌కార్తీ (38) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నేపాల్‌ బౌలర్లలో కమల్‌, దీపేంద్ర, రోహిత్‌, అభినాష్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్‌.. కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (54 బంతుల్లో 112; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత శతకంతో విరుచుకుపడటంతో మరో రెండు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రోహిత్‌కు సహచరుల నుంచి ఎలాంటి సహకారం లభించప్పటికీ ఒంటిచేత్తో తన జట్టును గెలిపించుకున్నాడు. నేపాల్‌ బ్యాటర్లలో దీపేంద్ర (24), కుశాల్‌ మల్లా (16), కుశాల్‌ భుర్టెల్‌ (16) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్‌ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్‌, మెక్‌కాయ్‌ తలో రెండు వికెట్లు, కీమో పాల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. రెండో టీ20 ఇదే వేదికగా రేపు జరుగనుంది. 

Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement