Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page
Advertisement

ప్రధాన వార్తలు

AP Election Results 2024: YS Jagan Reacts On YSRCP Lost
ఎంతో మంచి చేశాం.. ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: కోట్ల మందికి సంక్షేమం అందించినా.. గతంలో జరగనంత మంచి చేసినా.. అన్ని వర్గాల మంచి కోసం ప్రతీ అడుగు వేసిన తమ ప్రభుత్వానికి ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించనే లేదని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమిపై మంగళవారం సాయంత్రం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయి. యాభై మూడు లక్షల మంది తల్లులకు, మంచి చేసిన పిల్లలకు, వాళ్ల పిల్లలు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి ఆ అక్కచెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల విషయంలో మంచి చేశాం. వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే ఫించన్‌ పంపిచే వ్యవస్థను తీసుకొచ్చాం. చాలీచాలని పెన్షన్ల నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపించిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. ఇలాంటి ఫలితాల్ని ఊహించలేదు. పరిస్థితులు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. 54 లక్షల మంది రైతులకు మంచి చేశాం. రైతన్నలకు తోడుగా రైతు భరోసా ఇచ్చాం. కోటి ఐదు లక్షల మందికి సంక్షేమం అందించాం. ఇచ్చిన మాట తప్పకుండా పేదలకు అండగా నిలబడ్డాం. పిల్లలు బాగుండాలని అడుగులు వేశాం. అందరికీ మంచి జరగాలని ఆరాటపడ్డాం. ఆ ఆప్యాయత ఏమైందో అర్థం కావడం లేదు. ఆశ్చర్యంగా ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.సామాజిక న్యాయం చేసి ప్రపంచానికి చూపించాం. మేనిఫెస్టోను పవిత్రంగా భావించాం. చిత్తశుద్ధితో మేనిఫెస్టోను అమలు చేశాం. ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రయపడ్డాం. మరి ఇంత చేసినా ఆ ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదు. చేయగలిగిన మంచి చేశాం. ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం. కానీ, పేదవాడికి తోడుగా.. అండగా ఎప్పుడూ నిలబడతాం’’ అని వైఎస్‌ జగన్‌ గద్గద స్వరంతో చెప్పారు.పెద్ద పెద్ద నేతల కూటమి ఇది. బీజేపీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.. గొప్ప విజయానికి కూటమి నేతలకు అభినందనలు. నా తోడుగా నిలబడిన ప్రతీ నాయకుడికి, కార్యకర్తకి, స్టార్‌ క్యాంపెయినర్‌ నా అక్కచెల్లెమ్మలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏం జరిగిందో తెలియదుగానీ.. ఏం చేసినా, ఎంత చేసినా ఇంక 40 శాతం ఓటు బ్యాంకుని తగ్గించలేకపోయారు. కిందపడినా గుండె ధైర్యంతో పైకి లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం పోరాటాలు చేయడం నాకు కొత్త కాదు. ఎవరూ అనుభవించని రాజకీయ కష్టాలు అనుభవించా. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినా దేనికైనా సిద్ధం. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే వాళ్లకు ఆల్‌ ది వెరీ బెస్ట్‌’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Unexpected results in Lok Sabha elections Reduced NDA strength
తగ్గిన ఎన్డీఏ బలం.. పవర్‌ ఖాయం! హ్యాట్రిక్‌!

న్యూఢిల్లీ: పాలక ఎన్డీఏ కూటమి పదేళ్ల జోరుకు బ్రేకులు ఎన్డీఏ సారథి బీజేపీ దూకుడుకు ముకుతాడు విపక్ష ఇండియా కూటమికి నైతిక విజయం కూటమి సారథి కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పు వెలువరించారు. గత రెండు ఎన్నికల ఆనవాయితీకి భిన్నంగా బీజేపీని ఈసారి మెజారిటీకి ఓ 32 స్థానాల దూరంలోనే ఉంచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సొంతగానే 303 సీట్లు కైవసం చేసుకున్న కమలం పార్టీ ఏకంగా 63 స్థానాలు తగ్గి 240కే పరిమితమైంది. దాంతో నరేంద్ర మోదీ శకం మొదలయ్యాక తొలిసారిగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ భాగస్వాములపై ఆధారపడాల్సిన పరిస్థితిలో పడింది. ఎన్డీఏ కూటమి కూడా కనాకష్టంగా మెజారిటీ మార్కు 272ను దాటింది. 2019లో 353 సీట్లు రాగా ఈసారి 293కే పరిమితమైంది. మరోవైపు 2019లో కేవలం 52 సీట్లతో కుదేలైన కాంగ్రెస్‌ బలం ఈసారి దాదాపు రెట్టింపైంది. 99 సీట్లలో గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్‌ సారథ్యంలో ఇండియా కూటమి కూడా అంచనాలకూ మించి రాణించింది. 233 సీట్లు కైవసం చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో నిలిచింది. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి అనూహ్యంగా కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. 2019లో 62 సీట్లు నెగ్గిన పార్టీ ఈసారి ఏకంగా సగానికి సగం సీట్లు కోల్పోయి 33కే పరిమితమైంది. గత ఎన్నికల్లో చతికిలపడ్డ అఖిలేశ్‌ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ అక్కడ 38 స్థానాలతో దుమ్ము రేపింది. పశ్చిమబెంగాల్లో కూడా బీజేపీ అంచనాలను అందుకోలేక 12 స్థానాలతో సరిపెట్టుకుంది. మమతా సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ 29 సీట్లతో సత్తా చాటింది. స్మృతీ ఇరానీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఓటమి చవిచూశారు. ఈసారి లోక్‌సభ ఫలితాలను ఏ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే కూడా ప్రతిఫలించలేకపోవడం విశేషం. మొత్తమ్మీద కేంద్రంలో పదేళ్ల ఏక పార్టీ పాలనకు కాలం చెల్లి తిరిగి నిజమైన సంకీర్ణ శకానికి తెర లేచింది. విపక్ష కూటమి కూడా పదేళ్ల తర్వాత గణనీయ శక్తిగా రూపుదిద్దుకుంది. అంతటితో ఆగకుండా కేంద్రంలో అధికారంపైనా కన్నేసినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి...! ఆకట్టుకున్న ఇండియా కూటమి ఏడు విడతల్లో సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ జూన్‌ 1తో ముగియడం తెలిసిందే. దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసిన ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు మొదలైంది. ఎన్డీఏ కూటమి ఆధిపత్యం 300లోపు స్థానాలకు పరిమితం కాగా ఇండియా కూటమి తొలి రౌండ్‌ నుంచే అనూహ్య రీతిలో ముందంజ వేసింది. క్రమంగా పుంజుకుంటూ 200 స్థానాలు దాటేసింది. చూస్తుండగానే 233కు చేరి పరిశీలకులను కూడా ఆశ్చర్యపరిచింది. ప్రధాని మోదీ వారణాసిలో తొలి రౌండ్లో వెనకబడ్డారు! చివరికి ఆయన నెగ్గినా మెజారిటీ మాత్రం బాగా తగ్గింది. 2019లో 4.79 లక్షల మెజారిటీ రాగా ఈసారి లక్షన్నర పై చిలుకుతో సరిపెట్టుకున్నారు. బీజేపీలో మోదీ కంటే కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌లకు ఎక్కువ మెజారిటీ రావడం విశేషం. మరోవైపు రాహుల్‌గాంధీ మాత్రం పోటీ చేసిన రెండు స్థానాల నుంచీ భారీ విజయం సాధించారు. ఆయనకు కేరళలోని వాయనాడ్‌లో 3.64 లక్షలు, యూపీలోని రాయ్‌బరేలీలో 3.9 లక్షల మెజారిటీ రావడం విశేషం. కీలక రాష్ట్రాల్లో బీజేపీ కుదేలు కీలకమైన యూపీలో ఈసారి బీజేపీకి ఏకంగా 29 సీట్లకు కోత పడింది! మహారాష్ట్రలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి 48 స్థానాల్లో 2019లో 43 సీట్లు ఒడిసిపట్టిన ఎన్డీఏ ఈసారి కేవలం 17కు పరిమితమైంది! బీజేపీ బలం 23 నుంచి ఏకంగా 10కి తగ్గింది. అక్కడ కాంగ్రెస్‌ సీట్ల సంఖ్య 1 నుంచి ఏకంగా 13కు పెరిగింది. దాని భాగస్వాములైన శివసేన (యూబీటీ) 9, ఎన్సీపీ (ఎస్‌పీ) 7 సీట్లు గెలుచుకున్నాయి! బిహార్లోనూ ఎన్డీఏకు 9 సీట్లకు కోతపడింది. బీజేపీ 12, భాగస్వాములు జేడీ(యూ) 12, ఎల్జేపీ(ఆర్‌వీ) 5 సీట్లలో నెగ్గాయి. 2019లో క్లీన్‌స్వీప్‌ చేసిన రాజస్తాన్‌ (25)లో కూడా బీజేపీకి ఈసారి 11 సీట్లకు కోత పడింది. కర్నాటకలోనూ పార్టీ బలం 25 నుంచి 17కు తగ్గింది. బెంగాల్లో 6 స్థానాలు తగ్గాయి. మరో క్లీన్‌స్వీప్‌ రాష్ట్రం హరియాణా (10)లోనూ ఈసారి బీజేపీ ఐదే గెలిచింది. మధ్యప్రదేశ్‌లో మాత్రం మొత్తం 29 సీట్లూ నెగ్గి క్లీన్‌స్వీప్‌ చేసింది. గుజరాత్‌లో ఒక్కటి మినహా 24 సీట్లు గెలుచుకుంది. తూర్పు రాష్ట్రం ఒడిశా బీజేపీ నెత్తిన పాలు పోసింది. అక్కడి 21 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి ఏకంగా 20 దక్కాయి! ఏపీలో కూడా ఎన్డీఏ కూటమికి 21 సీట్లు దక్కాయి. తెలంగాణలోనూ 2019లో 4 సీట్లలో నెగ్గిన బీజేపీ ఈసారి 8 స్థానాలు గెలుచుకుంది. అయితే కేరళలో తొలిసారి బోణీ కొట్టినా తమిళనాట మాత్రం సున్నా చుట్టింది. మరోవైపు ఇండియా కూటమి కీలక రాష్ట్రాల్లో దుమ్ము రేపింది. తమిళనాట మొత్తం 39 స్థానాలూ కూటమి ఖాతాలోనే పడ్డాయి! యూపీలో 2019లో కేవలం 5 స్థానాలతో సరిపెట్టుకున్న ఎస్పీ ఈసారి ఏకంగా 37 సీట్లు ఒడిసిపట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలం కూడా 1 నుంచి 7కు పెరిగింది. బెంగాల్లో టీఎంసీకి 7 సీట్లు, బిహార్లో కూటమికి 9 స్థానాలు పెరిగాయి. రాజస్తాన్లో 2019లో సున్నా చుట్టిన కాంగ్రెస్‌ ఈసారి 8 సీట్లు నెగ్గింది. హరియాణాలోనూ 5 స్థానాలు దక్కించుకుంది. కర్నాటకలో పార్టీ స్థానాలు ఒకటి నుంచి 8కి పెరిగాయి. ఓట్ల శాతం ఇలా... బీజేపీ ఈసారి 36.58 శాతం ఓట్లు సాధించింది. ఇది 2019తో పోలిస్తే 0.72 శాతం తక్కువ. 2019 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినా పార్టీ ఓట్ల శాతం తగ్గిపోవడం విశేషం. కాంగ్రెస్‌ ఓట్ల శాతం మాత్రం 19.46 నుంచి 21.22కు పెరిగింది. యూపీలో దుమ్ము రేపిన సమాజ్‌వాదీ పార్టీ ఓట్ల శాతం 2.55 నుంచి 4.59కు పెరిగింది. మాయావతి సారథ్యంలోని బీఎస్పీ ఓట్లు మాత్రం 2.04 నుంచి 1.58కు తగ్గిపోయింది. పశ్చిమబెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓట్ల శాతం 4.06 నుంచి 4.38కు పెరిగింది. జేడీ(యూ) ఓట్ల శాతం 1.45 నుంచి 1.25కి తగ్గింది. ఆప్‌ ఓట్ల శాతం 0.44 నుంచి 1.11కు పెరిగింది. దక్షిణాదిన తమిళనాడులో పాలక డీఎంకే ఓట్ల శాతం 2.34 నుంచి 1.82కు తగ్గింది. హస్తినలో నంబర్‌గేమ్‌! మోదీ కాళ్ల కిందకు నీళ్లు? ఆయనపై ఎన్డీఏలో అభ్యంతరాలు జాతీయ మీడియాలో వార్తలు దేశవ్యాప్తంగా సాధించిన అనూహ్య ఫలితాలతో జోష్‌లో ఉన్న ఇండియా కూటమి ఏకంగా కేంద్రంలో అధికారంపై కన్నేసినట్టు వార్తలొస్తున్నాయి! ఈ దిశగా జేడీ(యూ)తో పాటు పలు ఇతర ఎన్డీఏ భాగస్వాములతో ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు మంతనాలు జరుపుతున్నట్టు చెబుతున్నారు. బీజేపీ కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోందని సమాచారం. ఎన్డీఏ కూటమి సుస్థిరత కోసం పలు ఇండియా కూటమిలోని పక్షాలతో పాటు స్వతంత్రులు, ఇతర పార్టీలతోనూ బీజేపీ పెద్దలు ఇప్పటికే జోరుగా సంప్రదింపులకు సాగిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తమ్మీద హస్తినలో జోరుగా నంబర్‌గేమ్‌ సాగుతోందంటూ వస్తున్న వార్తలతో జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా రంజుగా మారాయి. ఎన్డీఏనే వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినా, ప్రధానిగా మోదీ అభ్యర్ధిత్వానికి జేడీ(యూ) వంటి భాగస్వామ్య పక్షాలు సుతరామూ అంగీకరించకపోవచ్చని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి! ఈ నేపథ్యంలో హస్తినలో రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. 18వ లోక్‌సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 543) ఎన్డీఏ 291 (రంగు మార్చాలి. లేదంటే ఎన్డీఏ, ఇండియా కూటమి పక్కపక్కన విడిగా పెట్టుకోవాలి) బీజేపీ 241 టీడీపీ 16 జేడీ(యూ) 12 శివసేన 7 ఎల్జేపీ (ఆర్‌వీ) 5 జనసేన 2 జేడీ(ఎస్‌) 2 ఆరెల్డీ 2 ఎన్సీపీ 1 అప్నాదళ్‌ 1 ఏజీపీ 1 యూపీపీఎల్‌ 1 ఏజేఎస్‌యూపీ 1 హెచ్‌ఏఎం(ఎస్‌) 1 ఇండియా కూటమి 233 కాంగ్రెస్‌ 99 ఎస్పీ 37 టీఎంసీ 29 డీఎంకే 22 శివసేన (యూబీటీ) 9 ఎన్సీపీ (ఎస్‌పీ) 7 ఆర్జేడీ 4 సీపీఎం 4 ఆప్‌ 3 జేఎంఎం 3 ఐయూఎంఎల్‌ 3 సీపీఐ 2 సీపీఐ(ఎంఎల్‌)(ఎల్‌) 2 ఎన్‌సీ 2 వీసీకే 2 ఆరెస్పీ 1 కేసీ 1 ఆరెలీ్టపీ 1 బీఏడీవీపీ 1 ఎండీఎంకే 1 ఇతరులు 17 వైఎస్సార్‌సీపీ 4 మజ్లిస్‌ 1 అకాలీదళ్‌ 1 ఏఎస్‌పీకేఆర్‌ 1 వీఓటీపీపీ 1 జెడ్‌పీఎం 1 ఎస్‌కేఎం 1 స్వతంత్రులు 7

Analysis Of Ap Election Wins And Losses
ఏపీలో ఎన్నికలు ఏం చెబుతున్నాయి?

మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకోవడం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమిలో ఉండడం.. ఆర్థికంగా పరిపుష్టమైన వనరులు ఉండడం.. అన్ని వ్యవస్థల నుంచి సహకారం అందడం వంటి అంశాలు టీడీపీకి కలిసివచ్చాయి. టీడీపీ+జనసేన+బీజేపీల గెలుపునకు గల కారణాలను విశ్లేషిస్తే.. టీడీపీ ఎక్కువగా ప్రచారం చేసిన అంశాలు:లాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ వల్ల మీ భూములు కొట్టేస్తారని బాబు పదే పదే ప్రకటించడంసూపర్‌ సిక్స్‌ పేరుతో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను ఏపీలో ప్రకటించడంవైఎస్సార్‌సిపి ప్రకటించిన ప్రతీ హామీకి అదనంగా కలిపి తామిస్తామని చెప్పడంవలంటీర్ల వ్యవస్థను ముందు తప్పుబట్టిన వాళ్లే.. తర్వాత వాలంటీర్లకు 5వేల వేతనం బదులు పదివేలిస్తామని ప్రకటించడంఅమరావతిని అభివృద్ధి చేసి రాజధానిగా నిలబెడతామని చెప్పడంమెగా డీఎస్సీతో పాటు ప్రతీ ఏటా జాబ్‌ కాలెండర్‌ ఇస్తామనడం2014లో రైతు రుణమాఫీ తరహలో పెన్షన్‌ను ఏకంగా రూ.4000 చేస్తామనడం50 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తామని ప్రకటించడం

Modi Claims Victory For His Alliance In India General Election
మూడోసారి NDA కూటమి అధికారం చేపట్టబోతుంది: ప్రధాని మోదీ

2024 ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి 290 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సందర్భంగా ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ సంబరాలు నిర్వహించింది. ఈ సంబరాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.మోదీ మాట్లాడుతూ దేశం గర్వించేలా ఎన్నికల్ని నిర్వహించిన ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. సబ్‌కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ మంత్రం గెలిచింది. మూడసారి అధికారంలోకి రాబోతున్నామన్న మోదీ.. ఈ విజయం 140 కోట్ల మంది ప్రజలదని అన్నారు. ఎన్డీఏ కూటమిలోని కార్యకర్తలకు అభినందనలు. జమ్మూ కాశ్మీర్‌ ఓటర్లు కొత్త చరిత్ర సృష్టించారు. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శమని ప్రశంసలు కురిపించారు. అరుణాల్‌ ప్రదేశ్‌, సిక్కింలో కాంగ్రెస్‌ తుడిచి పెట్టుకుపోయింది. ఒడిశాలో కూడా అద్భుత ప్రదర్శన చేశాం. మూడో సారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతుంది. మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీగడ్‌,ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌. కేరళలో తొలిసారి బీజేపీ ఒకసీటు గెలిచింది. బీహార్‌లో ఎన్డీయే కూటమి గెలిచిందని మోదీ తెలిపారు.

Telangana Lok Sabha Election Results 2024 Live Updates
తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు.. ఘన విజయం సాధించినవారు వీరే..

Updates తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌-8, బీజేపీ-8, ఎంఐఎం-1 స్థానాల్లో విజయం సాధించాయి. వరంగల్ పార్లమెంట్ సభ్యులురాలిగా ఎన్నికైన కాంగ్రెస్‌ అభ్యర్థిని డాక్టర్ కడియం కావ్యకు ధ్రువీకరణ పత్రం అందచేస్తున్న రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యపాల్గొన్న మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే లు కడియం శ్రీహరి, రేవురి ప్రకాష్ రెడ్డి,నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ కెఆర్ నాగరాజు, తదితరులు మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ గెలుపుకాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ 3.24లక్షల మెజార్టీతో ఘన విజయం నాగర్‌కర్నూలులో కాంగ్రెస్‌ గెలుపుకాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి 85వేలకు పైగా మెజార్టీతో విజయంపెద్దపల్లిలో కాంగ్రెస్‌ గెలుపుకాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1.31లక్షలకు పైగా మెజార్టీతో విజయం భువనగిరిలో కాంగ్రెస్‌ గెలుపులోక్‌సభ ఎంపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి 2,10,000 మెజార్టీతో విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అధికారికంగా ఫలితాన్ని ప్రకటించాల్సి ఉంది. కరీంగనగర్‌లో బండి సంజయ్‌ విజయంబండి సంజయ్ కు సర్టిఫికెట్ అందజేతకరీంనగర్ ఎంపీగా భారీ మెజార్టీతో బండి సంజయ్ విజయం సాధించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సర్టిఫికెట్ ను బండి సంజయ్ కు అందజేశారు.మల్కాజిగిరిలో బీజేపీ గెలుపుమల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయంవరంగల్‌లో కాంగ్రెస్‌ గెలుపువరంగల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య విజయంజహీరాబాద్ కాంగ్రెస్‌ విజయంజహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ విజయం సాధించారు. సుమారు 51 వేల కోట్ల మెజారిటీతో బిజెపి అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పై గెలుపొందారు. టిఆర్ఎస్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం హోరా హోరీగా సాగిన మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. అధికారికంగా ఫలితాలు వెలువడవలసి ఉంది.మహబూబ్‌నగర్‌ లోకసభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 5,059 మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిపై విజయం మెదక్‌ పార్లమెంట్‌లో బీజేపీ గెలుపుబీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు విజయం సాధించారు. కరీంనగర్ పార్లమెంట్‌లో బండి సంజయ్ ఆల్ టైం రికార్డ్ మెజారిటీకేసీఆర్, వినోద్ కుమార్ పేరిట ఉన్న అత్యధిక రికార్డును బ్రేక్ చేసిన బీజేపీ ఎంపీ బండి సంజయ్..2006 ఉపఎన్నికలో 2 లక్షల 1వేయి 582 ఓట్ల ఆధిక్యంతో కేసీఆర్ విజయం..2014లో వినోద్ కు 2 లక్షల 5 వేల 7 ఓట్ల మెజారిటీ..ఇంకా తుది ఫలితం వెలువడకముందే 2 లక్షల 10 వేల 322 ఓట్ల మెజారిటీతో రికార్డ్ బద్ధలు కొట్టిన సంజయ్.మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌లో టెన్షన్‌ నెలకొందిఈవీఎం లెక్కింపుల్లో డీకే అరుణ కేవలం 1800 మెజార్టీలో ముందంజలో ఉంది.ప్రస్తుతం పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు జరుగుతోంది.పోస్ట్‌ బ్యాలెట్‌ ఓట్లు 8000 వేలు ఉ‍న్నాయి. ఆదిలాబాద్‌లో బీజేపీ గెలుపుఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్‌ ఘన విజయంకాంగ్రెస్ అభ్యర్థిపై 90 వేల 932 ఓట్ల మెజార్టీతో ఘన విజయంనిజామాబాద్‌లో బీజేపీ గెలుపునిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ విజయం1,09,241 ఓట్ల మెజారిటీలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సమీప కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి మీద విజయం సాధించారు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పూర్తి అయిన కౌంటింగ్లక్ష 20 వేల ఓట్ల అధిక్యంలో బీజేపీ అభ్యర్థి అర్వింద్అధికారిక ప్రకటనే తరువాయికొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ బీజేపీ ఎంపీ అరవింద్ కామెంట్స్ఇది మోదీ కుటుంబ సభ్యుల విజయంఇది ప్రజల విజయంనా గెలుపు కోసం కష్ట పడ్డ కార్యకర్తలకు ధన్య వాదాలుమూడో సారి ప్రధాని అవుతున్న మోదీ నేతృత్వంలో దేశం మరింత అభివృద్ధి పురోగతి సాధిస్తుంది.పెద్దపల్లి పార్లమెంట్‌:రామగిరి జేఎన్టీయూ పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణసుమారు లక్షకుపైగా ఓట్ల ఆధిక్యంతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణగత పది సంవత్సరాల కాలంలో పెద్దపెల్లి పార్లమెంటు అభివృద్ధిలో వెనుకబడిపోయిందిపెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అభివృద్ధికి కృషి చేస్తాతన గెలుపుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మంత్రి శ్రీధర్ బాబుకు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపిన వంశీకృష్ణనల్లగొండ పార్లమెంట్‌రికార్డ్ మెజార్టీతో గెలుపు దిశగా కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి23వ రౌండ్ ముగిసేసరికి 5,51,168 ఓట్ల ఆధిక్యం లో రఘువీర్ రెడ్డికాంగ్రెస్ రఘువీర్ రెడ్డి - 7,70,512రెండవ స్థానం - బిజెపి - శానంపూడి సైదిరెడ్డి - 2,19,344మూడవ స్థానం - బీఆర్ఎస్ - కంచర్ల కృష్ణారెడ్డి - 2,16,050 నాగర్ కర్నూల్ పార్లమెంట్ (రౌండ్ 14)కాంగ్రెస్ 24,427బీజేపీ 21,814బీఆర్ఎస్ 14,099కాంగ్రెస్ మొత్తం లీడ్‌ 49,986భువనగిరి పార్లమెంట్‌(రౌండ్: 12)బీజేపీ: 22292కాంగ్రెస్: 31512బీఆర్ ఎస్: 13380రౌండ్ లీడ్: 9220మొత్తం లీడ్ 117308ఖమ్మం పార్లమెంట్‌ఖమ్మం లోక్‌సభలో 4, 48, 209 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌కాంగ్రెస్-735697బీఆర్‌ఎస్‌-287488బీజేపీ-114957మెదక్ పార్లమెంట్‌12వ రౌండ్. పూర్తి అయ్యే సరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 29,300 ఓట్ల ఆధిక్యంకాంగ్రెస్ 2,45,089బీజేపీ =2,74,389బీఆర్‌ఎస్‌- 2,24,831 మెదక్ పార్లమెంట్‌10 రౌండ్లు పూర్తి అయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 19739 ఓట్ల ఆధిక్యంకాంగ్రెస్ 203632బిజెపి 223371బి ఆర్ ఎస్ 192533చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్లిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ఓటమిని అంగీకరిస్తూ.. కొండ విశ్వేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన గడ్డం రంజిత్ రెడ్డిప్రజలు ఏకధాటిగా వెళ్లిన విషయంపై ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపిన రంజిత్ రెడ్డి నల్లగొండ పార్లమెంట్‌రికార్డ్ మెజార్టీ దిశగా నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి5 లక్షల 18 వేల ఓట్ల ఆధిక్యంలో విజయం దిశగా రఘువీర్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంట్‌పెద్దపల్లి పార్లమెంటు నియోజవర్గ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం సందర్శించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీమల్కాజిగిరి పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 2 లక్షల ఓట్ల ఆధిక్యంజహీరాబాద్ పార్లమెంటు ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ( 31, 236 ఓట్ల లీడ్) కాంగ్రెస్ - 416927బీజేపీ.. బీబీ పాటిల్- 385301బీఆర్ఎస్... గాలి అనిల్ - 140006కాంగ్రెస్‌ తొలి విజయంతెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తొలి విజయం నమోదైంది.ఖమ్మం పార్లమెంట్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రామసహాయం రఘురామిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. కరీంనగర్ పార్లమెంట్‌ 11 రౌండ్లు లెక్కింపు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 1,25,575 ఓట్ల ఆధిక్యతబిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 3,02,109కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 1,76,623బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 1,44,541 నల్లగొండ పార్లమెంట్‌నల్లగొండలో విజయం దిశగా కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి24 వ రౌండ్ ముగిసే సమయానికి 3,55,674 ఓట్లతో రఘువీర్ రెడ్డి అధిక్యం నిజామాబాద్ పార్లమెంట్‌10వ రౌండ్ ముగిసే సరికి 60,000 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్అధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, కోరుట్లలో బీజేపీ ఆధిక్యం.జగిత్యాల, బోధన్, నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి స్వల్ప ఆధిక్యం ఆదిలాబాద్ పార్లమెంట్బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్‌ 50,913 లీడింగ్‌బీజేపీ: 2, 81, 004కాంగ్రెస్ : 2,30,091బిఆర్ఎస్ : 68, 43111 రౌండ్ల కౌంటింగ్‌ పూర్తిమహబూబ్ నగర్ పార్లమెంటుబీజేపీ అభ్యర్థి డీకే అరుణ 15, 571 ఓట్ల ఆధిక్యంబీజేపీ 2,58,932కాంగ్రెస్ 2,43,361బీఆర్ఎస్ 86,86810 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి పెద్దపల్లి పార్లమెంట్63,507 ఓట్ల ఆదిక్యంతో గడ్డం వంశీకృష్ణ ముందంజబీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు (95,959).కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు (2,51,127).బిజెపి అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ కు (1,87,620).10వ రౌండ్ల కౌంటింగ్‌ పూర్తి ఖమ్మం పార్లమెంట్‌3,06,090 ఓట్ల కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి భారీ ఆధిక్యంలో ఉన్నారు.కాంగ్రెస్: 510057భారాస: 203967భాజపా: 80562నల్లగొండ పార్లమెంట్‌నల్లగొండ పార్లమెంట్ 22వ రౌండ్ ఫలితాలు3,28,534 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం.కాంగ్రెస్ 4,82,305బీజేపీ 1,53,771బీఆర్ఎస్ 1,36,268భువనగిరి పార్లమెంట్‌1,01,814 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యంకాంగ్రెస్ 2,97,419బీజేపీ 1,95,605బీఆర్ఎస్ 1,29,07117వ రౌండ్ల కౌంటింగ్‌ పూర్తి నల్గొండ పార్లమెంట్20వ రౌండ్లు పూర్తి అయ్యేసరికి 3,03,645 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యంకాంగ్రెస్ - 4,48,198బీజేపీ... 1,44,553బీఆర్ఎస్... 1,24,247 వరంగల్ పార్లమెంట్‌10 రౌండ్లు పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య 85,193 లీడ్‌బీజేపీ: 1,51,212కాంగ్రెస్: 2,36,405బీఆర్ఎస్: 96,839 ఆదిలాబాద్‌.. గోడం నగేశ్‌ (భాజపా) 47,301 లీడ్‌చేవెళ్ల.. కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (భాజపా) 61,783 లీడ్‌హైదరాబాద్‌.. అసదుద్దీన్‌ ఓవైసీ (ఎంఐఎం) 38,424 ఓట్ల ఆధిక్యంకరీంనగర్.. బండి సంజయ్ (భాజపా) 92,350 ఆధిక్యంఖమ్మం.. రామసహాయం రఘురామ్‌ రెడ్డి (కాంగ్రెస్‌) 2,56,407 లీడ్‌మహబూబాబాద్‌.. బలరాం నాయక్‌ (కాంగ్రెస్) 1,42,229 లీడ్‌సికింద్రాబాద్.. జి కిషన్‌ రెడ్డి (భాజపా) 43,569 ఓట్ల లీడ్‌మహబూబ్‌ నగర్‌.. డీకే అరుణ (భాజపా) 10,714 లీడ్‌మల్కాజిగిరి.. ఈటల రాజేందర్ (భాజపా) 1, 47,229 లీడ్‌నాగర్‌ కర్నూల్‌.. మల్లు రవి (కాంగ్రెస్) 24,274 లీడ్‌నిజామాబాద్‌.. ధర్మపురి అర్వింద్ (భాజపా) 28,969 లీడ్‌మెదక్‌.. రఘునందన్‌ రావు (భాజపా) 10,714 లీడ్‌పెద్దపల్లి.. గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్) 37,171 లీడ్‌వరంగల్‌.. కడియం కావ్య (కాంగ్రెస్) 77,094 ఓట్ల లీడ్‌జహీరాబాద్‌.. సురేశ్‌ షెట్కార్ (కాంగ్రెస్) 12,574 ఓట్ల లీడ్‌ పెద్దపల్లి పార్లమెంట్‌ఏడు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 37,481 ఆధిక్యంకాంగ్రెస్... 174522బీజేపీ... 137041బీఅర్ఎస్... 67435నల్లగొండ పార్లమెంట్‌16వ రౌండ్లు పూర్తి అయ్యేసరికి 2,56,293 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యంకాంగ్రెస్ 3,75,969బీజేపీ 1,19,676బీఆర్ఎస్ 103717భువనగిరి పార్లమెంట్‌12 రౌండ్లు పూర్తి ఆయ్యేసరికి 84,013 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యంకాంగ్రెస్ 2,38,118బీజేపీ 1,54,105బీఆర్ఎస్ 1,02,155నల్లగొండ పార్లమెంట్‌14వ రౌండ్లు పూర్తి అయ్యేసరికి 2,44,952 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యంకాంగ్రెస్ 3,59,298బీజేపీ 1,14,346బీఆర్ఎస్ 98,295తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గం ఫలితాల వివరాలు...నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థుల లీడ్.37వేల ఆధిక్యంలో కొనసాగుతున్న ఆదిలాబాద్ బిజెపి అభ్యర్థి గోదాం నగేష్.59 వేల మెజారిటీతో కొనసాగుతున్న భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి శ్యామల కిరణ్.33000 ఆదిత్యంలో కొనసాగుతున్న చేవెళ్ల బిజెపి పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.ముప్పై నాలుగువేల ఆధిక్యంలో కొనసాగుతున్న హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం అభ్యర్థి ఓవైసీ.72,000 ఆదిత్యంలో కొనసాగుతున్న కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ఒక లక్ష 74 వేల ఆదిత్యంలో కొనసాగుతున్న ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి.లక్ష ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్.9000 ఓట్ల ఆదిత్యంలో కొనసాగుతున్న మహబూబ్నగర్ బిజెపి అభ్యర్థి డీకే అరుణ.ఒక లక్ష తొమ్మిది వేల ఆదిత్యంలో కొనసాగుతున్న మల్కాజిగిరి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్.3000 ఓట్ల ఆదిత్యంతో కొనసాగుతున్న మెదక్ బి ఆర్ ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి.21 వేల ఓట్ల ఆదిత్యంతో కొనసాగుతున్న నాగర్కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి.1,98,000 ఆదిక్యంలో కొనసాగుతున్న నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్.16 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నిజామాబాద్ బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్.32వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.43 వేల ఓట్ల ఆదిత్యంలో కొనసాగుతున్న సికింద్రాబాద్ బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి.56 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య.పదివేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్టికారి.ఆదిలాబాద్‌ పార్లమెంట్‌గోడెం నగేశ్‌ (బీజేపీ) 38,283 ఓట్ల ఆధిక్యంచేవెళ్ల పార్లమెంట్‌బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి 33,086 ఓ‍ట్ల లీడ్‌మల్కాజిగిరి పార్లమెంట్‌ ఈటా రాజేందర్‌ (బీజేపీ) 1, 05,472 లీడ్‌ హైదరాబాద్‌ పార్లమెంట్‌34,125 ఓట్ల లీడింగ్‌లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ ఖమ్మం పార్లమెంట్‌ 10 వ రౌండ్ ముగిసేసరికి 1,68,922 ఆధిక్యంలో కాంగ్రెస్కాంగ్రెస్.. 2, 85905బీఆర్‌ఎస్‌.. 118983బీజేపీ.. 39105నల్లగొండ పార్లమెంట్‌1,70,783 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం.కాంగ్రెస్...2,47,930బీజేపీ....77,147బీఆర్ఎస్... 71,984నల్లగొండ లోక్‌సభ ఆరు రౌండ్లు పూర్తిమహబూబ్‌ నగర్‌: మూడో రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి డీ. కే. అరుణకు 6,984 ఓట్ల ఆధిక్యతమెదక్‌ పార్లమెంట్‌బీఆర్‌ఎస్‌ ముందంజబీఆర్‌ఎస్‌ అభ్యర్థి పరిపాటి వెంకట్రామిరెడ్డి 109931 ఓట్ల ఆధిక్యంపెద్దపల్లి పార్లమెంట్:నాలుగు రౌండ్లు పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్‌ 24511 లీడ్‌లో కొనసాగుతోందికాంగ్రెస్:103344బీజేపీ:78833బీఆర్ఎస్:39145 భువనగిరి పార్లమెంట్‌భువనగిరి పార్లమెంట్ ఆరో రౌండ్ పూర్తి అయ్యేసరికి 48,622 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యం.కాంగ్రెస్ 1,43,167బీజేపీ 94,545బీఆర్ఎస్ 64,241సీపీఐఎం 11,772 పెద్దపెల్లి పార్లమెంట్‌3వ రౌండ్ తర్వాత ముందంజలో కాంగ్రెస్12700 ఓట్ల మెజారిటీలో గడ్డం వంశీకృష్ణ కరీంనగర్‌ పార్లమెంట్‌4 రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 51,770 ఓట్ల ఆధిక్యతబిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 11,4779కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 63,009బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 52,432 ఆదిలాబాద్ పార్లమెంట్ : నాలుగొవ రౌండ్ పూర్తి అయ్యేసరికి బీజేపీ 31965 లీడ్‌బీజేపీ:- 1,09,766కాంగ్రెస్ : 77801బిఆర్ఎస్ : 25198 ఖమ్మం పార్లమెంట్‌కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఖమ్మం పార్లమెంట్6వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 1,26,000 ఓట్ల మెజారిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసాహాయం రఘురాం రెడ్డి వరంగల్‌ పార్లమెంట్‌మూడు రౌండ్లు ముగిసేసరికి వరంగల్‌ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 34,522 లీడ్నిజామాబాద్‌ పార్లమెంట్‌మొదటి రౌండ్ ముగిసేసరికి జగిత్యాల్ తప్ప మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ ఆదిక్యత మొత్తం 11606 ఓట్ల ఆదిక్యంలో బీజేపీఖమ్మం పార్లమెంట్కాంగ్రెస్ లీడ్ : 24130 ( 3వ రౌండ్ )బీఆర్ఎస్ : 18206కాంగ్రెస్ : 42336బీజీపీ : 4841 ఖమ్మం పార్లమెంట్6వ రౌండ్ వరకు 1,25,360 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్ధి మెజారిటీ నల్లగొండ జిల్లాకౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన నల్లగొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డికరీంనగర్ పార్లమెంట్ 26 వేల 208 ఓట్లతో ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్2 రౌండ్లు పూర్తి నాగర్‌ కర్నూల్‌లో బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్‌ ఆధిక్యంమహబూబ్‌నగర్‌లో డీకే ఆరుణ (బీజేపీ) ముందంజపెద్దపల్లిలో గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్‌)‌ ముందంజజహీరాబాద్‌లో సురేష్‌ షెట్కార్‌ (కాంగ్రెస్‌) ఆధిక్యంభువనగిరిలో చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి( కాంగ్రెస్‌) ముందంజ వరంగల్‌లో కడియం కవ్య (కాంగ్రెస్‌) ఆధిక్యం సికింద్రాబాద్ పార్లమెంట్ 7113 ఓట్ల ఆదిక్యoలో కొనసాగుతున్న బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిజహీరాబాద్ పార్లమెంట్‌కాంగ్రెస్ అభ్యర్తి సురేష్ షెట్కార్ లీడ్ 7,501రెండో రౌండ్ లెక్కింపు పూర్తికాంగ్రెస్ 27,508 బీబీ పాటిల్ - బిజెపి 23,350 గాలి అనిల్‌కుమార్ టిఆర్ఎస్ - 8,363 వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 2009 ఓట్ల ఆధక్యతనిజామాబాద్ పార్లమెంట్‌బీజేపీ అభ్యర్థి అరవింద్ ఆధిక్యంరెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి14156 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అరవింద్.కనీస పోటీ ఇవ్వలేక పోతున్న బీఆర్‌ఎస్‌కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోతున్న బీఆర్‌ఎస్‌ ఏజెంట్లుజహీరాబాద్ పార్లమెంట్‌ రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 7,501 ఓట్ల ఆదిత్యం చేవెళ్ల పార్లమెంట్రెండు రౌండ్లు ముగిసే సరికి 14169 ఓట్లతో బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ముందంజనల్లగొండ పార్లమెంట్‌భారీ ఆధిక్యం దిశగా నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిఐదో రౌండ్ ముగిసేసరికి 91 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి భువనగిరి పార్లమెంట్‌భువనగిరి లోక్ సభ 4వ రౌండ్ ముగిసేసరికి 20 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంట్‌కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ 5094 లీడ్పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో 1వ రౌండ్ పూర్తి.గోమాస్ శ్రీనివాస్ బీజేపి:- 18401గడ్డం వంశీ కృష్ణ కాంగ్రెస్:- 23495కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్:- 9312 నల్లగొండ జిల్లాభారీ ఆధిక్యం దిశగా నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిమూడో రౌండ్ ముగిసేసరికి 70 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి ఆదిలాబాద్ పార్లమెంట్ మొదటి రౌండ్లో బిజెపి అభ్యర్థి గోడం నగేష్ 8806 ఓట్లతో ఆధిక్యంబీజేపీ :- 28429కాంగ్రెస్ : 19623బిఆర్ఎస్ : 5660 మహబూబ్‌ నగర్‌ మొదటి రౌండ్ 874 ఓట్ల ఆదిక్యంలో బీజేపీ బీజేపీ - డీకే అరుణ దేవరకద్రలో పోలైన ఓట్లు 4648కాంగ్రెస్ - చల్లా వంశీచంద్ రెడ్డి దేవరకద్రలో పోలైన ఓట్లు 3774బీఆర్ఎస్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి దేవరకద్ర లో పోలైన ఓట్లు 1700. నల్లగొండ జిల్లానల్లగొండ, భువనగిరి రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజ మెదక్‌ పార్లమెంట్‌బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు ఆధిక్యం నిజామాబాద్నిజామాబాద్ లోక్ సభలో మొదటి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ ఏడు వేల ఓట్ల ఆధిక్యం వరంగల్ పార్లమెంట్మొదటి రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య అధిక్యంకాంగ్రెస్: 30123బీజేపీ: 21719బీఆర్ఎస్: 14683లీడ్: 8404 (కాంగ్రెస్) మెదక్ పార్లమెంట్ ఫస్ట్ రౌండ్ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు ఆధిక్యంనీలం మధు కాంగ్రెస్ 3888రఘునందన్ రావు బీజేపీ 1538వెంకటరామిరెడ్డి టిఆర్ఎస్ 2213 నిజామాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరిలో బీజేపీ ఆధిక్యం ఖమ్మం పార్లమెంట్కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ఆధిక్యం2వ రౌండ్ (కాంగ్రెస్ లీడ్ : 26008)బీఆర్ఎస్ : 20041కాంగ్రెస్ : 46049బీజీపీ : 5216రెండు రౌండ్లు పూర్తి అయేసరికి 42,710 లీడ్‌ యాదాద్రి భువనగిరి జిల్లాభువనగిరి రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ భువనగిరి రెండో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 4000కు పైగా ఓట్ల ముందంజమహబూబ్ నగర్ బీజేపీ లీడ్ 874ఖమ్మంలో నామా ఔట్..!కౌంటింగ్‌ కేంద్రం నుంచి ఇంటికి వెళ్లిపో‌యిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వర్‌ రావు నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌ రెడ్డి ఆధిక్యం నల్లగొండ మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం2777 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికాంగ్రెస్-6001భాజపా-3224బీఆర్‌ఎస్‌ -1264యాదాద్రి భువనగిరి జిల్లామొదటి రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యంకాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 4204 ఆధిక్యత భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ ఆధిక్యం కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ లీడ్‌ మహబూబాబాద్ పార్లమెంటు ఓట్ల లెక్కింపులో 14, 526 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ముందుంజ ఆదిలాబాద్ పార్లమెంట్ముధోల్ నియోజకవర్గంమొదటి రౌండ్లీడ్ : 3091(బీజేపీ)కాంగ్రెస్: 2363బిజెపి : 5464బిఆర్ఎస్ : 715 నల్లగొండమొదటి రౌండ్లో కాంగ్రెస్ 2777 మెజారిటీకాంగ్రెస్ ... 6001బిజెపి .... 3224టిఆర్ఎస్.... 1264 మహబూబాబాద్ పార్లమెంటు ఓట్ల లెక్కింపులో 11406 ఓట్ల మెజార్టీ మహబూబ్ నగర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో డీకే అరుణ లీడ్నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ లీడ్కరీంనగర్ పార్లమెంట్‌లో బీజేపీ ఆధిక్యంమొదటి రౌండ్‌లో 1400 ఓట్లు ఆధిక్యంలో బండి సంజయ్ మహబూబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 10283 ఓట్ల మెజార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 5644 ఓట్ల మెజార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్: లీడ్ (బిజెపి): 1168నిర్మల్ నియోజకవర్గ: మొదటి రౌండ్ : బిజెపి 3872కాంగ్రెస్ 2643బీఆర్ఎస్ 585నిజామాబాద్ పార్లమెంటుపోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం వరంగల్ పార్లమెంట్ ( 1వ రౌండ్)బిజెపి లీడ్ : 240బీఆర్ఎస్ : 3870కాంగ్రెస్ :6494బీజీపీ : 6726మహబుబాబాద్నర్సంపేట నియోజకవర్గంలో మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ 1083 ఓట్ల ఆధిక్యం ఖమ్మం పార్లమెంట్ (1వ రౌండ్)కాంగ్రెస్ లీడ్ : 16702బీఆర్ఎస్ : 18794కాంగ్రెస్ :35496బీజీపీ :4351 మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ ఆధిక్యం భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 2000 పైచిలుకు ముందంజ నల్లగొండ మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ ముందంజ జహీరాబాద్: తొలి రౌండులో ఆదిత్యంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కార్ కరీంనగర్‌లో బండి సంజయ్‌ ఆధిక్యం యాదాద్రి భువనగిరిభువనగిరి సెగ్మెంట్‌లో మొదటి రౌండ్‌లో బూర నర్సయ్య గౌడ్ లీడ్తొలి రౌండ్ లో 117ఓట్ల ఆధిక్యంలో బీజేపీబీజేపీ 3976కాంగ్రెస్ 3859బీఆర్ఎస్ 2681 వరంగల్‌లో కడియం కావ్య ఆధిక్యం కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ప్రారంభమైన ఈవీఎం కౌంటింగ్ ప్రక్రియఆదిలాబాద్ పార్లమెంట్: ఖానాపూర్ నియోజకవర్గం:మొదటి రౌండ్: కాంగ్రెస్: 3,297బిజెపి : 3902బిఆర్ఎస్ : 859లీడ్ : 605(బీజేపీ) సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి ఆధిక్యం నల్లగొండ జిల్లానల్లగొండ లోక్ సభ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి ఆధిక్యం ఖమ్మంఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రాఘురం రెడ్డి ముందంజ ముషీరాబాద్ నియోజకవర్గం AV కాలేజీ లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తిబీజేపీ 4733 కాంగ్రెస్ 1318బీఆర్ఎస్ 10973325 ఓట్ల లీడ్ లో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్‌లో మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ లీడ్816 ఓట్ల తో ముందంజ మహబూబ్‌ నగర్‌లో డీకే అరుణ ఆధిక్యంఖమ్మంలో కాంగ్రెస్‌ ఆధిక్యంమల్కాజిగిరిమల్కాజిగిరి పార్లమెంట్ పరిధి ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెట్‌లో మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 6330 ఓట్లతో ఆధిక్యంబీజేపీ :-8811కాంగ్రెస్ :2581బిఆర్ఎస్ :1418కరీంనగర్ జిల్లా: బీజేపీ ముందంజమొత్తం పోస్టల్ బ్యాలెట్: 108479287 (ఎంప్లాయిస్ + సర్వీస్ ఓటర్లు)1560 (హోం ఓటింగ్) యాదాద్రి భువనగిరి జిల్లాభువనగిరి పట్టణ పరిధిలో అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైంన కౌంటింగ్ ప్రక్రియ ఖమ్మంలోని కిట్స్ కాలేజీలో ప్రారంభమైన కౌంటింగ్మంచిర్యాల జిల్లాలో ఐజ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ పెద్దపెల్లి జిల్లా :ప్రారంభమైన పెద్ద పెల్లి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది,పోస్టల్‌ బ్యాలెట్‌ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపునిజామాబాద్నిజామాబాద్ లోక్ సభ కౌంటింగ్ ప్రారంభంకౌంటింగ్ సెంటర్‌లో అపశ్రుతికౌంటింగ్ సూపర్ వైజర్‌కు అస్వస్థతకళ్ళుతిరిగి పడిపోవడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు నల్లగొండ జిల్లాలో మొదలైన కౌంటింగ్ ప్రక్రియనల్లగొండ పార్లమెంటుకు సంబంధించి దుప్పలపల్లిలోనే వేర్ హౌసింగ్ గోదాముల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపుమొదట పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఆ తర్వాత ఈవీఎం లలోని ఓట్లను లెక్కిస్తున్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్‌లో మొదలైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకరీంనగర్ జిల్లా:ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కిస్తున్న సిబ్బందిపోస్టల్‌ బ్యాలెట్‌ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పూజలుఅమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలుకేంద్రంలో మూడోసారి ఎన్డీయే కూటమిదే విజయంతెలంగాణలో బీజేపీ అధిక సీట్లు గెలుచుకుంటుంది#WATCH | Union Minister & BJP's Telangana President G Kishan Reddy says, "PM Narendra Modi will take oath in the second week of this month with the blessings of the people..."He says, "People from all over the world are watching our Lok Sabha elections. I have full faith that… pic.twitter.com/2a3r4wxlW8— ANI (@ANI) June 4, 2024మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుస్ట్రాంగ్ రూం నుంచి ఈవీఎం లను లెక్కింపు కేంద్రాలకు తరలింపు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించిన అధికారులుకోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం గ్రౌండ్స్, ఏవి కాలేజ్ మాసబ్ ట్యాంక్ లలో కౌంటింగ్ ప్రారంభించిన అధికారులుహైదరాబాద్:సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పార్లమెంట్ కౌంటింగ్ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కలు వేయనున్న అధికారులుఎనిమిదిన్నరకు ఈవీఎంల లెక్కలను ప్రారంభించనున్న సిబ్బందికంటోన్మెంట్ లో మాత్రం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో పాటు ఈవీఎంల లెక్కింపు ప్రారంభం నల్లగొండ జిల్లానల్లగొండ లోక్ సభ స్థానంలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుయాదాద్రి భువనగిరి జిల్లాభువనగిరి లోక్ సభ స్థానంలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునిజామాబాద్: ఓట్ల లెక్కింపు ప్రారంభం8హాళ్లలో మొదలైన కౌంటింగ్తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది నిజామాబాద్: డిచ్‌పల్లి సిఎంసిలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధంపార్లమెంట్ పరిధిలోనీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే చోట కౌంటింగ్.8 హళ్ల లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్న అధికారులునిజామాబాద్ రూరల్ & అర్బన్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 20 టేబుళ్ళుబోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్ల కు 18 చొప్పున టేబుళ్ళ ఏర్పాటు.15 రౌండ్లు లో మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తి.మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఫలితంఓట్ల లెక్కింపు కోసం 558 మంది కౌంటింగ్ సిబ్బంది,అభ్యర్థులు ఉదయం 6 గంటల వరకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలనీ అధికారుల సూచనరిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఎంట్రీ పాస్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి.మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.కౌంటింగ్ కేంద్రం చుట్టూ ,5 కిలో మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలుమూడు అంచెల్లో భద్రత ఏర్పాట్లు1000 మంది పోలీసులతో బందో బస్తుపోలైన పోస్టల్ ఓట్లు 7414మొత్తం సర్వీస్ ఓట్లు 724మొత్తం ఓట్లు 17,4867పోలైన ఓట్లు 12, 26 133పోలింగ్ శాతం. 71.9240 నిమిషాల్లో తొలి రౌండ్ పలితంఖమ్మంలోకసభ ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ఖమ్మం రూరల్ మండలం, పొన్నెకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రంఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంపోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక కౌంటింగ్ హాల్ఖమ్మం పార్లమెంటు పరిధిలో ని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లు7 అసెంబ్లీ సెగ్మెంట్ లలో తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ కోసం ప్రత్యేక కౌంటింగ్ హాల్ ఏర్పాటుప్రతి కౌంటింగ్ హాల్ లో 14 కౌంటింగ్ టేబుల్స్, ఏర్పాటుఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి 18 టేబుళ్లు ఏర్పాటుకౌంటింగ్ విధుల నిర్వహణకు ప్రతి కౌంటింగ్ హాల్ వద్దఒక్కో టేబుల్ కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో పరిశీలకులు ఉంటారుఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ లో 20 రౌండ్లుపాలేరు, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో 21 రౌండ్లుమధిర లో 19, వైరాలో 18, కొత్తగూడెం లో 18, అశ్వారావుపేట సెగ్మెంట్ లో 13 రౌండ్లు లెక్కింపు చేపడుతారుపోస్టల్ బ్యాలెట్ ఓట్లు తో కౌంటింగ్ మొదలు అవుతుంది.వీ వీ ప్యాట్ల స్లిప్ లు ప్రామాణికంగా తీసుకుంటారు.పోస్టల్ బ్యాలెట్ ఇటిపిబిఎస్ లతో కలిపి 2 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తారుకంట్రోల్ యూనిట్ల లోని ఓట్లు లెక్కించిన తరువాతగెలుపొందిన పార్టీ అభ్యర్థి ని కౌంటింగ్ సూపర్ వైజర్ నిర్ధారించాల్సి ఉంటుందిఅనంతరం సదరు అభ్యర్థి కి అర్ ఓ ద్రువపత్రం అందజేస్తారు..దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది కాసేపట్లో కౌంటింగ్‌ ప్రారంభంఫలితాలపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ లీడర్లలో టెన్షన్‌హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ కేంద్రాల్లో 14-15 రౌండ్లలో ఓట్ల లెక్కింపుచొప్పదండి, దేవరకొండ అసెంబ్లీ స్థానాల్లో 21 రౌండ్లలో కౌంటింగ్‌మంచిర్యాల, మంథని, పెద్దపల్లిలో 21 రౌండ్ల ఓట్ల లెక్కింపు కరీంనగర్‌:ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ అండ్‌ పీజీ కాలేజీలో ఓట్లు లెక్కింపునకు సర్వం సిద్ధంహైదరాబాద్మల్కాజీగిరి పార్లమెంట్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధంమొత్తం 158 టేబుల్స్19 లక్షల ఓట్ల లెక్కింపుపోస్టల్ బ్యాలెట్ కోసం మరో 20 అదనంగా టేబుల్స్ఏడు నియోజకవర్గాలకు 9 కౌంటింగ్ హాల్స్బోగారం హోలీ మేరీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రంమొత్తం 178 టేబుల్స్ ఏర్పాటువీటిలో 20 టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం ఏర్పాటు చేసారుమొత్తం 37 లక్షల 79 వేల 596 ఓటర్లు ఉండగా వీరిలో 19 లక్షల 19 వేల 131 ఓట్లు పోలయ్యాయిమొత్తంగా 50.78 శాతం ఓట్లు నమోదయ్యాయిఈ ఓట్లను 575 మంది సిబ్బంది లెక్కించనున్నారు నల్గొండ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధంనల్లగొండ స్థానానికి దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్స్‌లో కౌంటింగ్భువనగిరి స్థానానికి అరోరా కాలేజ్ లో కౌంటింగ్ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల ఏర్పాటునల్లగొండ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 17, 25, 465పోలైన ఓట్లు 12,77, 137నల్లగొండ లోక్ సభ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు: 22భువనగిరి లోక్ సభ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు: 39నల్లగొండ వివరాలుఅసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్ లు, రౌండ్లుమిర్యాలగూడ 264(19)సూర్యాపేట 271(20)నల్లగొండ288(21)కోదాడ296(22)హుజూర్ నగర్ 308(22)నాగార్జునసాగర్ 306(22)దేవరకొండ 328(24) నల్లగొండ లోక్ సభ పరిధిలో తొలుత పూర్తి కానున్న మిర్యాలగూడ నియోజకవర్గం ఓట్ల లెక్కింపుచివరగా పూర్తి కానున్న దేవరకొండ నియోజకవర్గ ఓట్లుభువనగిరి లోక్ సభ స్థానంమొత్తం ఓటర్లు 18,08, 585పోలైన ఓట్లు 13,88,680అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూతులు రౌండ్లుఇబ్రహీంపట్నం 348(18 రౌండ్లు, 20 టేబుల్స్)మునుగోడు 317(18 రౌండ్లు, 18 టేబుల్స్)తుంగతుర్తి 326 (19, 18 టేబుల్స్)భువనగిరి 257(19)నకిరేకల్ 311(23 రౌండ్లు)ఆలేరు 309(23)జనగామ 278(20)భువనగిరి స్థానంలో పోలింగ్‌ బూతులు ఎక్కువగా ఉన్నా తొలుత పూర్తికానున్న ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి, మునుగోడుహైదరాబాద్‌బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతఫలితాలు కోసం ఎదురు చూస్తున్నాబీజేపీ 400 సీట్లు గెలుస్తాం#WATCH | BJP candidate from Hyderabad, Madhavi Latha says, "I am pretty excited and all of them who have voted for BJP in the entire country are looking forward for especially this particular seat that we win and bring justice to Hyderabad. We all know that PM Modi in the entire… pic.twitter.com/tqz0YMhjwf— ANI (@ANI) June 4, 2024 నాగర్ కర్నూల్ జిల్లా:నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ఎర్పాట్లు పూర్తినాగర్ కర్నూల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్ కుమార్ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు7 అసెంబ్లీలో సెగ్మెంట్ లలో - 17,38,254 ఓటర్లు7 సెంబ్లీలలో 2057 పోలింగ్ కేంద్రాలుఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లు - 12,07,471 (69.46%)పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 14,491. (85.95%)ఉదయం. 8-00 గంటలనుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంమొదట పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుకౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన మూడంచెల భద్రతా ఏర్పాట్లుప్రతీ కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌కౌంటింగ్‌ అసిస్టెంట్‌, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటుపోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన 12455 ఓట్ల లెక్కింపుకు ప్రత్యేకంగా 14 టేబుల్స్‌ మహబూబ్ నగర్పాలమూరు యూనివర్సిటీలో మహబూబ్ నగర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు.ఏడు సెగ్మెంట్లలోని 1937 ఈవీఎంల కౌంటింగ్బరిలో 31 మంది అభ్యర్థులు.నాగర్ కర్నూల్వ్యవసాయ మార్కెట్ కమిటీ లో నాగర్ కర్నూల్ ఓట్ల లెక్కింపుఏడు సెగ్మెంట్లలోని 2057 ఈవీఎంల కౌంటింగ్బరిలో 19 మంది అభ్యర్థులు ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించి కౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుందిఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లోని మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయిఖమ్మం నియోజకవర్గం సంబంధించి మాత్రం 18 టేబుల్స్ ఏర్పాటు చేయగా మిగతా ఆరు నియోజకవర్గాలకు సంబంధించి 14 టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారుప్రతి టేబుల్ దగ్గర ముగ్గురు అధికారుల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో కౌంటింగ్ కోసం కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి..ఉదయం 8 గంట నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్..బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు..మొత్తం 17 లక్షల 97 వేల 150 మంది ఓటర్లు..పోలైన ఓట్లు 13 లక్షల 3 వేల 691..పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కు వేర్వేరుగా హాల్స్ ఏర్పాటు..కరీంనగర్ నియోజకవర్గానికి 18 టేబుల్స్ ఏర్పాటు..మిగిలిన 6 నియోజకవర్గాలకు 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు..రౌండ్స్ వారీగా కొనసాగనున్న లెక్కింపు ప్రక్రియ..కరీంనగర్ 22, చొప్పదండి 24, వేములవాడ 19, సిరిసిల్ల 21, మానకొండూరు 23, హుజూరాబాద్ 22, హుస్నాబాద్ 22 రౌండ్లవారీగా కొనసాగనున్న లెక్కింపు..ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభం కానున్న ప్రక్రియ..పోస్టల్ బ్యాలెట్ కోసం 14 టేబుల్స్ ఏర్పాటు..కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మొత్తం 9 వేల 287 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు..నేటి నుంచి రేపు ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షల కొనసాగింపు, 144 సెక్షన్ అమలు..ఒక్క రౌండ్ ఫలితం వెల్లడి కావడానికి అరగంట సమయం..మధ్యాహ్నం వరకు విజేత ఎవరనేది స్పష్టత వచ్చే అవకాశం..ఒక్కో నియోజకవర్గంలో ర్యాండమ్ గా 5 ఈవీఎంలకు సంబంధించిన 5 వీవీ ప్యాట్ల లెక్కింపు చేయనున్న అధికారులు..ఈవీఎంలు, వీవీప్యాట్లలో లెక్క సరిపోతేనే అధికారికంగా అభ్యర్థి ప్రకటన..ఒక్కో టేబుల్ కు ముగ్గురు సిబ్బంది చొప్పున 124 మంది కౌంటింగ్ సూపర్ వైజర్స్, 124 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్, 124 మంది మైక్రో అబ్జర్వర్స్ ఏర్పాటు.పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం(SC)అభ్యర్థులు 42 మందిఅసెంబ్లీ నియోజకవర్గం టేబుల్స్ రౌండ్స్ చెన్నూర్ నియోజకవర్గం 14 16 బెల్లంపల్లి నియోజకవర్గం 14 16మంచిర్యాల నియోజకవర్గం 14 21 ధర్మపురి నియోజకవర్గం 14 19రామగుండం నియోజకవర్గం 14 19మంథని నియోజకవర్గం 14 21పెద్దపల్లి నియోజకవర్గం 14 21పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్ టేబుల్స్ 98, రౌండ్స్ 132#WATCH | BJP candidate from Hyderabad, Madhavi Latha says, "I am pretty excited and all of them who have voted for BJP in the entire country are looking forward for especially this particular seat that we win and bring justice to Hyderabad. We all know that PM Modi in the entire… pic.twitter.com/tqz0YMhjwf— ANI (@ANI) June 4, 2024 రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని లోక్‌సభ సీట్లు సాధిస్తుందన్న ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది.మంగళవారం ఉదయమే ఓట్ల లెక్కింపు మొదలుకానుంది.ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ ప్రకటించారు.గత నెల 13న రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన విషయంతెలిసిందే.కంటోన్మెంట్‌ సీటు ఓట్లను సైతం మంగళవారం లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.మొత్తంగా 525 మంది అభ్యర్థులు పోటీపడగా.. 2,18,14,025 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.65.67శాతం పోలింగ్‌ నమోదైంది.లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో.. మొత్తం 139 కౌంటింగ్‌ హాల్స్‌ ఏర్పాటు చేశారు.ఇందులో 120 హాళ్లలో ఈవీఎం ఓట్లు, 19 హాళ్లలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించనున్నారు.ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఒక కౌంటింగ్‌ హాల్‌ ఉంటుంది. ఒక్కో హాల్‌లో 24 టేబుల్స్‌ ఉంటాయి.మహేశ్వరం స్థానం పరిధిలో 28 టేబుల్స్‌ ఏర్పాటు చేయాల్సి రావడంతో రెండు హాళ్లలో ఓట్లను లెక్కించనున్నారు.దీంతో ఈవీఎం ఓట్ల కౌంటింగ్‌ హాళ్ల సంఖ్య 120కి పెరిగింది. మొత్తం 10వేల మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొననున్నారు.చొప్పదండి, యాకూత్‌పుర, దేవరకొండ అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన లోక్‌సభ ఓట్లను అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కించనున్నారు.ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన ఓట్లను అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కిస్తారు.చాలా స్థానాల పరిధిలో 18 నుంచి 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది.ఒక్కో టేబుల్‌ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, ఒక ఏఆర్‌ఓ, ఇద్దరు సహాయకులు, అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లు ఉంటారు.ప్రతి రౌండ్‌ ఓట్ల లెక్కింపును మైక్రో అబ్జర్వర్‌ పర్యవేక్షిస్తారు. ఏకకాలంలో అన్ని టేబుళ్లలో నిర్వహించే లెక్కింపును ఒక రౌండ్‌గా పరిగణిస్తారు.అలా రౌండ్ల వారీగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి రౌండ్‌ వివరాలను కేంద్రం నుంచి వచి్చన పరిశీలకుడి పరిశీలనకు పంపిస్తారు.పరిశీలకుల ఆమోదం తర్వాత తదుపరి రౌండ్‌ లెక్కింపును ప్రారంభిస్తారు.అదే సమయంలో ఒక్కో రౌండ్‌ లెక్కింపు పూర్తయిన కొద్దీ.. స్థానిక ఆర్వో/ఏఆర్వో మీడియా రూమ్‌ వద్దకు వచ్చి ఫలితాలను ప్రకటిస్తారు.రౌండ్ల వారీగా ఫలితాలపై ఫారం–17సీ మీద కౌంటింగ్‌ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు.ప్రతి శాసనసభ స్థానం పరిధిలో ర్యాండమ్‌గా ఐదు పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేసి.. ఈవీఎంలలోని ఓట్లను, వీవీ ప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చి చూస్తారు.ఎన్నికల ఫలితాలను ప్రదర్శించడానికి 78 ప్రాంతాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు.కౌంటింగ్‌ కేంద్రంలోకి ఎన్నికల సంఘం అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే రానిస్తారు.నేడు మద్యం షాపులు బంద్‌లోక్‌సభ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం రోజున తెలంగాణలో మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.ఇక ఫలితాలు వచి్చన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదు.స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు ముందుగా అనుమతిస్తే ర్యాలీలు చేసుకోవచ్చు.ఉదయం 10.30 కల్లా ఆధిక్యతపై స్పష్టత!మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.2.18లక్షల పోస్టల్‌ బ్యాలెట్లు పోలైన నేపథ్యంలో లెక్కింపునకు ఎక్కువే సమయం పట్టే అవకాశం ఉంది.ఇక 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 గంటల కల్లా చాలా లోక్‌సభ స్థానాల్లో ఎవరు ఆధిక్యతలో ఉన్నారనేది తేలే అవకాశం ఉంది.మధ్యాహ్నం 12.30 గంటలకల్లా విజయావకాశాలపై స్పష్టత వచ్చే చాన్స్‌ ఉంది.

Deputy PM Post For Nitish  Special Status For AP: INDIA Bloc Attempt To Poach NDA allies
ఎన్టీయే మిత్రపక్షాలకు గాలం.. ఇండియా కూటమి మాస్టర్‌ప్లాన్‌!

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు బోల్తా పడ్డాయి. జాతీయ సర్వే సంస్థలు ఏకపక్షంగా ఎన్డీయేకు మెజారిటీ కట్టబెడితే.. ఫలితాల్లో మాత్రం ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోంది. ఇక.. ఫలితాల లెక్కింపు ముగింపు దశకు చేరుకుంటున్న వేళ పార్టీల సరళిలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి కూడా ఒక మాస్టర్‌ప్లాన్‌ రూపొందించుకుని దాన్నే అనుసరించే ప్ర యత్నాల్లో ఉన్నట్లు సమాచారం.లోక్‌సభ ఎన్నికల్లో కీలక రాష్ట్రాల్లో ఫలితాలు తారుమారవుతున్నాయి. '400 సీట్లకు పైనే' అనే నినాదంతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే జస్ట్‌ మెజారిటీకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్రలో ఈసారి చతికిలపడింది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష ఇండియా కూటమి ఆధిక్య స్థానాల్లో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య సీట్ల వ్యత్యాసం ఎక్కువగా లేకపోవడంతో ఇరు కూటమిలు ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. నేటి సాయంత్రం మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం కానుండగా.. రేపు ఎన్డీయే మిత్రపక్షాలు భేటీ కానున్నాయి. ఎన్టీయే కూటమి తన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నాయి.ఇక.. ఇండియా కూటమి మరో అడుగు ముందుకు వేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు పుంజుకోవడంతో ఎన్డీయే కూటమిలోని బీజేపీ భాగస్వామ్య పక్షాలకు గాలం వేయడాన్ని ప్రారంభించాయి. ఈ క్రమంలో బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌పై ఇండియా కూటమి కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎన్డీయే కూటమిలో ఉన్న నితిష్‌ను ఇండియా కూటమి తమ వైపు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. నితీష్‌కు ఉప ప్రధాని పదవిని కూడా ఆఫర్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అదే విధంగా ఏపీలో చంద్రబాబు నాయుడిని ఇండియా కూటమిలోకి ఆహ్వానించినట్లు భోగట్టా. బాబు తమ కూటమిలో చేరితో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆశచూపెట్టబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌.. నితీష్‌ కుమార్‌, చంద్రబాబు నాయుడితో మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే.. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండేతోనూ ఇండియా కూటమి ప్రతినిధులు సంప్రదింపులు జరపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల ముందే జేడీయూ, టీడీపీలు ఎన్డీయే కూటమితో కలిశాయికాగా బిహార్‌లో 16 లోక్‌సభ స్థానాలకు గానూ నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ 14 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇటు టీడీపీ కూడా 14 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీయూ, టీడీపీ దాదాపు 28 లోక్‌సభ స్థానాలను కలిగి ఉండటంతో.. వీరు ఇండియా కూటమికి మారితే కింగ్‌మేకర్‌లుగా మారే అవకాశం ఉంది. ఈ లెక్కన మున్ముందు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

Reasons For Ysrcp Defeat In Ap Elections
ఎదురుగాలి ఎందుకంటే?

గత ఎన్నికల్లో 151 సీట్లతో ఘనవిజయం సాధించిన వైఎస్సార్‌సిపికి ఈ సారి అనూహ్యమైన ఫలితాలను చవి చూసింది. సంక్షేమం, అభివృద్ధి అన్న రెండు అంశాలతో ఎన్నికలకు వెళ్లిన వైఎస్సార్‌సిపి తాను అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లోనూ ఫ్యాన్‌కు ఎదురుగాలి వీచింది.వైఎస్సార్‌సీపీ ఓటమికి కారణాలు:వైఎస్సార్‌సిపికి వ్యతిరేకంగా మూడు పార్టీలు ఒక్కతాటిపైకి వస్తే.. వాటికి తోడ్పాటుగా మిగతా పార్టీలు మారడంకూటమి ఇచ్చినన్ని హామీలు ఇవ్వలేకపోవడం, నెరవేర్చలేని హామీని ఇవ్వలేనని చెప్పడంల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ మీద కూటమి నేతలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టలేకపోవడంసచివాలయాలు ఏర్పాటు చేసి లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇవ్వలేదన్న విమర్శను ఎదుర్కోలేకపోవడంకరోనా సమయంలో అందించిన ప్రభుత్వ సాయాన్ని ఓట్లుగా మలుచుకోలేకపోవడంపార్టీలు, వర్గాలు అన్న తేడా లేకుండా అందరికీ అన్ని పథకాలు ఇవ్వడం, ఎన్నికల వేళ సంక్షేమంపై ఎక్కువగా ఆధారపడడంఅందరికీ ఇవ్వాలన్న తాపత్రయమే తప్ప.. వాటిని ఓటు బ్యాంకుగా మార్చుకోలేకపోవడంసామాజిక సమీకరణంలో భాగంగా వెనకబడిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంమూడు రాజధానుల ఏర్పాటు విషయంలో న్యాయపరమైన పరిధులు దాటలేకపోవడం

Stock Market Rally On Today Closing
అంచనాలు తారుమారు..మార్కెట్‌లో బ్లడ్‌బాత్‌..రూ.30లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం భారీగా పడిపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 1379 పాయింట్లు పడిపోయి 21,884 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 4389 పాయింట్లు దిగజారి 72,079 వద్ద ముగిసింది. చరిత్రలో ఎప్పడూలేని విధంగా మార్కెట్‌సమయంలో నిఫ్టీ దాదాపు ఒక్కరోజులో 8శాతం మేర తగ్గింది. చివరకు 5.92 శాతం నష్టంతో ముగిసింది. ఈ ఒక్కరోజు మదుపర్ల సంపద రూ.30లక్షల కోట్లు ఆవిరైంది.సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌యూఎల్‌, నెస్లే మినహా అన్ని స్టాక్‌లు నష్లాల్లో ముగిశాయి. భారీగా నష్టపోయిన స్టాక్‌ల్లో ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఎల్‌ అండ్‌ టీ, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతీఎయిర్‌టెల్‌ స్లాక్‌లున్నాయి.అదానీ స్టాక్స్‌లో అమ్మకాలు..ఎన్‌డీఏ కూటమికి అంచనాల ప్రకారం ఆధిక్యత రావడంలేదని మార్కెట్‌ వర్గాలు భావించాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 350 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని.. 150 సీట్లకు కాస్త అటూఇటూగా ఇండియా కూటమి పరిమితం అవుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా కనిపిస్తున్నాయి. దాంతో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 19.80 శాతం, అదానీ పవర్‌ షేర్లు 19.76 శాతం, అంబుజా సిమెంట్స్ 19.20 శాతం పతనమయ్యాయి. అదానీ గ్రూప్‌ ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 19.13 శాతం పడిపోయాయి.అంచనాలు తలకిందులు..స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే మార్కెట్లు పుంజుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకు భిన్నంగా ఫలితాలు వెలువడితే మాత్రం సూచీలు మరింత దిగజారే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. తిరిగి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రభుత్వరంగ సంస్థల్లో తీసుకున్న నిర్ణయాల్లో భారీ మార్పులు చేయవచ్చనే వాదనలున్నాయి. మరోవైపు అంచనాలకు భిన్నంగా ఇండియా కూటమి పుంజుకోవడంతో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మదుపర్ల అంచనాలు తప్పాయి.ఇప్పుడేం చేయాలి..మార్కెట్‌లు ఇంతలాపడుతుంటే కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తున్నవారు కంగారుపడిపోకుండా దీన్నో అవకాశంగా చూడాలని నిపుణులు చెబుతున్నారు. ఫండమెంటల్స్‌ బలంగా ఉన్న స్టాక్స్‌లో పెట్టుబడిపెట్టిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఇలా మార్కెట్‌ పడిపోతున్న సమయంలో మరిన్ని స్టాక్‌లు కొనుగోలు చేయాలంటున్నారు. గతంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఆరు నెలల వ్యవధిలో మార్కెట్‌లు పడిపోయిన దానికంటే చాలా పాయింట్లు పెరిగినట్లు రుజువైంది. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా మంచి కంపెనీల్లో పెట్టుబడి పెట్టినవారు కొంతసమయం వేచిచూస్తే లాభాలు పొందవచ్చని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Tdp Leaders Attack On Vidadala Rajini Office
పచ్చమూకల విధ్వంసం.. గెలుపు మత్తులో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు

సాక్షి, గుంటూరు: గెలుపు మత్తులో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పచ్చమూకల విధ్వంసం సృష్టించారు. గుంటూరు విద్యానగర్‌లోని విడదల రజని కార్యాలయంపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంపై రాళ్లు విసిరిన ఎల్లో గూండాలు కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ- జనసేన రౌడీమూకలు రాళ్లు విసురుతూ కార్యాలయ అద్దాలు ధ్వంసం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు.వైఎస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. పర్నిచర్‌ను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. విజయవాడ వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్శిటీ నేమ్‌ బోర్డును పచ్చమూక ధ్వంసం చేశారు.పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. బొల్లా బ్రహ్మనాయుడు కల్యాణ మండపంపై దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు.. కారును ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అచ్చంపేట మండలం కొండూరులో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నాయకులు బరితెగించి దాడులకు దిగారు. ఈ ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు.

Telangana Lok Sabha Results 2024: Reason Behind Madhavi Latha Lost
మాధవీలత ఓడిపోలేదు.. చిత్తుగా ఓడించిందెవరు?

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణపై ఢిల్లీ పెద్దలు పెట్టిన ఫోకస్‌ మొత్తానికి ఫలించింది. 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఎనిమిది సీట్లలో గెలుపొంది తన విజయం శాతాన్ని మెరుగుపర్చుకుంది. అయితే గెలుపు సంగతి పక్కనపెడితే హాట్‌ టాపిక్‌గా మారిన హైదరాబాద్‌ ఎంపీ సీటులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది.ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు బీజేపీ పెద్ద ప్లానే చేసింది. హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొంపెళ్ల మాధవీలతను ఎంచుకుంది. తద్వారా ఎంఐఎం అడ్డాలో నారీశక్తిని అస్త్రంగా ప్రయోగించినట్లు సంకేతాలు పంపింది. కానీ, ఆ వ్యూహం కాషాయ పార్టీకి ప్రతికూలంగా మారరి బెడిసి కొట్టింది. విరించి హాస్పిటల్స్ ఛైర్ పర్సన్‌గా ఉన్న మాధవీలత.. హిందుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలిగే మాధవీలత.. రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. పాతబస్తీలో కాషాయ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో మాధవీలతను బీజేపీ అధిష్ఠానం బరిలోకి దింపింది.ఇక అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే మాధవీలత మీడియాకు ఎక్కడం ప్రారంభించారు. పతంగి పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆమె చిత్రవిచిత్రమైన చేష్టలకు దిగారు. ఆ విన్యాసాలతో సోషల్‌ మీడియాకు ఎక్కిన ఆమెపై విపరీతమైన ట్రోలింగ్‌ కూడా నడిచింది. ఇదంతా ఓటర్లకు చిరాకు తెప్పించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే హిందుత్వ ఎజెండాతో సాగిన ఆమె ప్రచారంలో నగరంలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను భాగం చేయకపోవడమూ పెద్ద మైనస్‌గా మారింది. మరోవైపు పోలింగ్‌ టైంలో హిజాబ్‌లు తొలగించి మరీ ఓటర్లను పరిశీలించడం జాతీయ మీడియాకు ఎక్కి.. వివాదాస్పదంగా మారింది కూడా.కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు.. మొత్తంగా ఎన్నికల వేళ ఆమె చేసిన హడావుడి ఏమాత్రం సహకరించకపోగా, బీజేపీ అభ్యర్థి హోదాతో నవ్వుల పాలు అయ్యిందనేది విశ్లేషకుల మాట.హైదరాబాద్‌ ఎంపీగా ఎంఐఎం అధినేత, అసదుద్దీన్‌ ఒవైసీ 3.35 లక్షల భారీ మెజారిటీతో మాధవీలతపై ఘనవిజయం సాధించారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement