Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM YS Jagan Viajayawada To Visit IPac Office Updates
మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్‌

ఎన్టీఆర్‌, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ అధికారంలోకి రాబోతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నాం ఐప్యాక్‌ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్‌ ఎన్నికల ఫలితాల్ని అంచనా వేశారు. ‘‘మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి గతంలో కంటే ఎక్కువ ట్లే గెలుస్తాం. ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది. జూన్‌4వ తేదీన రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్‌ అవుతుంది. ఫలితాల తర్వాత దేశం మొత్తం మనవైపే చూస్తుంది. ‘‘ప్రశాంత్‌ కిషోర్‌ ఆలోచించలేనన్ని సీట్లు వస్తాయి. ప్రశాంత్‌ కిషోర్‌ చేసేది ఏమీ లేదు. అంతా టీమే చేస్తుంది. వచ్చే ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేద్దాం. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది’’ అని ఐప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ అన్నారు.ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కోసం పొలిటికల్‌ కన్సల్టెన్సీగా ఐప్యాక్‌ పని చేసిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నాం బెంజిసర్కిల్‌లో ఉన్న ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ(I-Pac) కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్‌.. సుమారు అరగంటపాటు అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐ-ప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ టీం సభ్యులతో సెల్ఫీలు దిగుతూ కాసేపు సరదాగా గడిపారు.

CM YS Jagan Says YSRCP Will Big Win AP Elections
‘ఫ్యాన్’‌దే ప్రభంజనం.. సీఎం జగన్‌ సరికొత్త రికార్డ్‌!

ఏపీ రాజకీయ చరిత్రలోనే వైఎస్సార్‌సీపీ సరికొత్త చరిత్ర లిఖించబోతుంది. ‘ఫ్యాన్‌’ ప్రభంజనం సృష్టించబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఐదేళ్ల పాలనకు ప్రజలు జైకొట్టారు. ప్రతిపక్షాలు, పచ్చ బ్యాచ్‌ దిమ్మతిరిగిపోయే విధంగా ప్రజలు తీర్పునిచ్చినట్టు సీఎం జగన్‌ ప్రకటన చేశారు.సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ప్రజలే తనకు స్టార్‌ క్యాంపైనయిర్స్‌ అని చెప్పారు. తాను నమ్మకుంది ఆ దేవుడు, ప్రజలనేని అన్ని వేదికలపైనా ప్రస్తావించారు. ఇక, సీఎం జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందితేనే వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని కోరారు. ఆయన మాటలు ప్రతీ ఒక్క కుటుంబాన్ని చేరుకున్నాయి. సీఎం జగన్‌ చేసిన సాయాన్ని ఎవరూ మరిచిపోలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వం పట్ల, పాలన పట్ల నమ్మకం ఉంచారు.అందుకే 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకే భారీగా ఓట్లు వేశారు. రాష్ట్రంలో పోలింగ్‌ శాతం పెరగడం కూడా ఇందుకు ఒక ఉదాహారణ. ఇక, 2019లో వచ్చిన సీట్లు కన్నా ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయని సీఎం జగన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, సీఎం జగన్‌ ఇప్పటి వరకు చేసిన ఏ ప్రకటన అయినా ఆచితూచి మాత్రమే చేశారు.పేదలు వర్సెస్‌ పెత్తందారులు అన్న ఎన్నికల నినాదాన్ని ముందుకు తీసుకెళ్లిన సీఎం జగన్‌.. ఈసారి వచ్చే ఫలితాలు ప్రభంజనం సృష్టిస్తాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా విజయంపై కచ్చితమైన సమాచారంతోనే ఆయన ఇలాంటి ప్రకటన చేశారని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.ఇక, ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన ఫస్ట్‌ రియాక్షన్‌ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు టైట్‌ ఫైట్‌, ఎవరికి ఎడ్జ్‌ తెలియదన్నట్టుగా వార్తలు రాసుకొచ్చిన మీడియా సంస్థలు కూడా.. సీఎం జగన్‌ చేసిన ప్రకటన పట్ల షాక్‌ తిన్నాయి. ఒక నాయకుడు.. ఎంతో నమ్మకంగా చేసిన ఒక ధృడమైన ప్రకటన.. వైనాట్‌ 175 నినాదాన్ని చర్చనీయాంశం చేశాయి.

AP Elections 2024: May 16th Politics Latest News Updates In Telugu
May 16th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 16th AP Elections 2024 News Political Updates12:20 PM, May 16th, 2024గవర్నర్‌ను కలవనున్న వైఎస్సార్‌సీపీ బృందంతాడేపల్లి :సాయంత్రం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలవనున్న వైఎస్సార్‌సీపీ బృందంపోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్‌సీపీ నేతలుసీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలవనున్న నేతలుహింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరనున్న వైఎస్సార్‌సీపీ బృందం12:00 PM, May 16th, 2024అల్లర్లు సృష్టించిన టీడీపీ నేతలపై కేసు నమోదుఅనంతపురం:తాడిపత్రిలో అల్లర్లు సృష్టించిన టీడీపీ నేతలపై కేసు నమోదుతాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 526 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడిన టీడీపీ నేతలుపరారీలో టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిఇప్పటిదాకా 55 మందిని అరెస్టు చేసిన పోలీసులుఉరవకొండ కోర్టులో నిందితులను హాజరుపరిచిన పోలీసులుజేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన వర్గీయులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు11:45 AM, May 16th, 2024టీడీపీ నాయకుడి దాష్టీకంకృష్ణా జిల్లా..ఉంగుటూరు మండలం ఆత్కూరులో టీడీపీ నాయకుడు దాష్టీకంఫ్యాన్‌కు ఓటు వేసిందని మహిళను ట్రాక్టర్‌తో ఢీకొట్టిన టీడీపీ నాయకుడు ఏడుకొండలుఆత్కూరు గ్రామానికి చెందిన వేముల సంధ్యారాణికి తీవ్ర గాయాలు.సంధ్యారాణి రెండు కాళ్ళకు తీవ్ర గాయాలుపిన్నమనేని హాస్పిటల్‌కు తరలింపుహాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంధ్యారాణిని పరామర్శించిన వల్లభనేని వంశీఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు 10:25 AM, May 16th, 2024ఎన్నికల హింసపై గవర్నర్‌కు ఫిర్యాదుఏపీలో ఎన్నికల హింసపై గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుఇవాళ సాయంత్రం రాజ్‌భవన్‌ వెళ్లనున్న వైఎస్సార్‌సీపీ బృందంమంత్రి బొత్స నేతృత్వంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు కలవనున్న వైఎస్సార్‌సీపీ బృందంపోలింగ్‌ సందర్భంగా టీడీపీ అరాచకాలపై, పోలీసులు వ్యవహరించిన తీరును గవర్నర్‌కు వివరించే అవకాశంహింసకు బాధ్యులైన వాళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్న వైఎస్సార్‌సీపీ నేతలు 9:40 AM, May 16th, 2024రాష్ట్రంలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల..డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభంనిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1480,జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్‌మెంట్‌కు రూ.502 కోట్లు విడుదలమిగిలిన పథకలకూ విడుదల కానున్న నిధులురెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను పూర్తిచేయనున్న ప్రభుత్వంటీడీపీ ఫిర్యాదులతో పోలింగ్‌కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను అడ్డుకున్న ఎన్నికల సంఘంఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంతవరకూ అనుమతిపై ఎటూ తేల్చని ఎన్నికల సంఘంఎన్నికల సంఘం తీరుపై హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వంఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో హైకోర్టు ఆగ్రహంసమయం ముగిసిపోవడంతో పోలింగ్‌కు ముందు విడుదల కాని నిధులుపోలింగ్ ముగిసిన తర్వాత నిధుల విడుదల ప్రారంభం 9:00 AM, May 16th, 2024అనంతలో సెక్షన్‌ 144 కొనసాగింపు..అనంతపురం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగింపుఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ వినోద్ కుమార్ఎన్నికల సందర్భంగా అనంతలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పచ్చ మూకలు దాడులు చేశారు. 8:20 AM, May 16th, 2024ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటువిజయవాడఫిరాయింపు ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటుఅనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్న శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుటీడీపీలో చేరిన జాంగా కృష్ణ మూర్తివైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి అనర్హుడిగా ప్రకటించిన శాసన మండలి చైర్మన్ 7:45 AM, May 16th, 2024వైఎస్సార్‌సీపీ అనుకూల వర్గాలే టార్గెట్‌.. మహిళలపై పచ్చ మూకల దాష్టీకాలునర్సీపట్నంలో దుశ్శాసన పర్వం ఒంటరి మహిళను జుట్టు పట్టుకొని ఈడ్చి కాళ్లతో తన్నిన అయ్యన్న అనుచరులుకృష్ణా జిల్లాలో దమనకాండమహిళను ట్రాక్టర్‌తో తొక్కి చంపడానికి ప్రయత్నించిన టీడీపీ నేతమహిళలపై హత్యాయత్నాలు చేస్తున్నా ఏమీ పట్టనట్లు ఈసీ నిర్లిప్తత గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపు దాకా కొనసాగించేలా చంద్రబాబు పన్నాగం.. రాష్ట్రవ్యాప్తంగా దాడులకు పురిగొల్పుతూ భయానక వాతావరణం రాజకీయ ప్రత్యర్థులపై గ్రామాల్లో విచ్చలవిడిగా దాడులు.. కౌంటింగ్‌కు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను దూరంగా ఉంచడమే లక్ష్యం 7:20 AM, May 16th, 2024నేడు విజయవాడకు సీఎం జగన్‌ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేడు విజయవాడకు రానున్నారు.ఈ సందర్భంగా బెంజి సర్కిల్‌లో ఉన్న ఐ-ప్యాక్‌ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. సుమారు అర గంట పాటు ఐ-‍ప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. 7:00 AM, May 16th, 2024నేడు ఈసీఐని కలవనున్న ఏపీ సీఎస్‌ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీఎస్, డీజీపీని నివేదిక కోరిన ఈసీఐఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్న సీఎస్, డీజీపీఎన్నికల పోలింగ్‌కు కొద్దీ రోజులు ముందే డీజీపీ, ఐజీ, ఎస్పీలను మార్చిన ఎన్నికల కమిషన్అకస్మాత్తుగా పోలీస్ అధికారులను మార్చడంతో పెరిగిన హింసాత్మక ఘటనలుపల్నాడు ఎస్పీ, ఐజీ, డీజీపీని పోలింగ్‌కు ముందు మార్చిన ఈసీఐఈసీ ఆకస్మిక నిర్ణయాలతో హింస పెరిగిందని భావిస్తున్న అధికారులు 6:50 AM, May 16th, 2024ఏపీ పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుటీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపినట్లు దీపక్‌ మిశ్రాపై సీఈవో, డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుపోలింగ్‌ రోజు కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై దీపక్‌ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీపోలింగ్‌కు 3 రోజుల ముందు టీడీపీ నేత విష్ణువర్థన్‌ ఇచ్చిన పార్టీకి దీపక్‌ మిశ్రా హాజరైనట్లు గుర్తింపుఆ తర్వాత నుంచి పోలీస్‌ అధికారుల మార్పులపై అనుమానాలుమాచర్ల,గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్‌ఐల మార్పులుచివరికి సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా దీపక్‌ మిశ్రా జోక్యం చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుఈ కేసులో ఏ2 నిందితుడిని అరెస్ట్‌చేయొద్దని విచారణ అధికారిపై దీపక్‌ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీఆధారాలతో సహా డీజీపీ, ఈసీలకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ 6:40 AM, May 16th, 2024రిగ్గింగ్‌ చేయాలనే ఆలోచనతోనే దాడులకు తెగబడ్డారు: సజ్జల రామకృష్ణారెడ్డిటీడీపీ అరాచక శక్తులు పోలింగ్ సరిగ్గా జరగకుండా చేయాలని చూశాయిరిగ్గింగ్ చేయాలనీ, మా వారిని అడ్డుకోవాలనీ చూశారుటీడీపీ నేతలు చేసిన అరాచకాలపై ఈసీ, డీజీపీలకు ఫిర్యాదు చేశాంఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరిందిపురంధేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారువారు కోరిన అధికారులను వేశారుమొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారువిష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారువిష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషిఅలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసిందిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరసపెట్టి ట్రాన్సఫర్ చేశారుఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారుప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారుఅక్కడే ఎక్కువ హింస చెలరేగిందిజరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయిమంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారుఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదువెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలిఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలిసంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందికౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోందికచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోందిసీఎస్, డీజీపిని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణంపోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాంపురంధేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాంపోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉందిలేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్ గా నియమించటం ఏంటి?ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారురిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?ఓటర్లు తమ బాధ్యతగా తీసుకుని పోలింగులో పాల్గొన్నారు. 6:30 AM, May 16th, 2024మైదుకూరులో టీడీపీ గుండాల దాడివిశ్వనాథ పురానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం ఎన్నికల రోజు పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చున్నాడని కోపంతో ఓబుల్ రెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలుదాడిలో తీవ్ర గాయాలు.. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఆసుపత్రిలో ఓబుల్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి

Delhi High Court Hearing BRS MLC Kavitha Bail Petition Over Liquor Scam
కవిత బయటకు వచ్చేనా?.. కాసేపట్లో బెయిల్‌పై విచారణ

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్‌ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె బెయిల్‌ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ జరుగనుంది. కవిత బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఈరోజైన కవిత బెయిల్‌ దొరుకుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. కాగా, లిక్కర్‌ స్కాం కేసులో భాగంగా ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్‌ కోసం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ఇదే ధర్మాసనం గత శుక్రవారం విచారించి ఈడీ సమాధానం కోరుతూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ను తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు సౌత్‌ గ్రూప్‌ తరఫున కవిత ఆప్‌ అగ్ర నేతలకు రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారన్న కారణంతో ఈడీ మార్చి 15న, సీబీఐ ఏప్రిల్‌ 11న ఆమెను అరెస్ట్‌ చేశాయి. జ్యుడిషియల్‌ కస్టడీలో భాగంగా ఆమె ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్నారు. ఈ రెండు కేసుల్లో బెయిల్‌ కోరుతూ కవిత చేసుకున్న దరఖాస్తులను రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా కొట్టివేశారు. ఈ క్రమంలో ఈనెల 6న తీర్పునిచ్చారు. ఈ మొత్తం కుంభకోణంలో ఈమెదే ప్రధానపాత్ర అని, బెయిలిస్తే సాక్ష్యాధారాలను, సాక్షులను ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థలు చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి బెయిల్‌ పిటిషన్లను కొట్టివేశారు. దీంతో, రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

CAA Is Modi Guarantee, No One Can Remove It: PM At Azamgarh
‘CAA మోదీ గ్యారెంటీ.. ఎవరూ చెరపలేరు’

లక్నో: మోదీ వెళ్లిపోతే.. సీఏఏ కూడా వెళ్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, సీఏఏ మోదీ గ్యారెంటీ అనిర, దానిని ఎవరూ తొలగించలేరని బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ఉత్తర ప్రదేశ్‌ అజాంఘడ్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మోదీ గ్యారెంటీలపై ప్రజలకు నమ్మకం ఉంది. సీఏఏ(CAA) చట్టమే మోదీ గ్యారెంటీకి తాజా ఉదాహరణ. సీఏఏ కింద భారత పౌర సత్వం ఇవ్వడం మొదలైంది. దేశంలో వీరంతా చాలా ఏళ్లుగా శరణార్థులుగా ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోనూ లక్షలమంది శరణార్థులు ఉన్నారు. వాళ్లందరికీ కూడా పౌరసత్వం లభిస్తుంది. మోదీ వెళ్తే సీఏఏ కూడా వెళ్లిపోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, మోదీ గ్యారెంటీని ఎవరూ చెరపలేరు. విపక్ష కూటమి ఓటు బ్యాంక్‌ రాజకీయం చేస్తోంది. కానీ, ప్రజలంతా బీజేపీ, ఎన్డీయే కూటమితోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఒక్కటే మాట వినిపిస్తోంది. అదే ఫిర్‌ ఏక్‌ బార్‌.. 400 పార్‌. మోదీ గ్యారెంటీ కశ్మీర్‌లోనూ కనిపిస్తోంది. కశ్మీర్‌లో శాంతికి గ్యారెంటీ ఇచ్చాం. కశ్మీర్‌లో తీసుకున్న చర్యలతో విపక్షాల నోళ్లు మూతలు పడ్డాయి. మోదీ వెళ్తే ఆర్టికల్‌ 370 రద్దు కూడా పోతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ, నాల్గొ దశలో జరిగిన పోలింగ్‌లో శ్రీనగర్‌ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు అని ప్రధాని మోదీ అన్నారు.దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా ఆజాంఘడ్‌ గురింంచి చర్చ వచ్చేది. స్లీపర్‌సెల్స్‌ గురించి చర్చ జరిగేది. సమాజ్‌వాదీ పార్టీ ఎప్పుడూ ఆజాంఘడ్‌ గురించి ఆలోచించలేదు. ఆజాంఘడ్‌లో కమలం వికసిస్తేనే.. అభివృద్ధి జరుగుతుంది అని ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇండియా కూటమి రిజర్వేషన్లతో రాజకీయం చేస్తోంది. 50 శాతం బడ్జెట్‌ను మైనారిటీలకు కేటాయించాలనుకుంటోంది. 70 ఏళ్లుగా హిందూ, ముస్లిం అంటూ మతాల పేరిట వాళ్లు విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు దేశమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. రామమందిర ప్రారంభం నాడు ఇండియా కూటమి ఎన్నో విమర్శలు చేసింది. పేదల అభివృద్ధి కోసం పగలు రాత్రి కష్టపడుతున్నా. మీ బాధలన్నింటిని తొలగిస్తున్నాం. వివిధ పథకాలతో పేదలను ఆదుకుంటున్నాం అని మోదీ తెలిపారు.

'Once I Am Done, I Will Be Gone': Virat Kohli On Post Retirement Plans, Video Viral
Virat Kohli: ఒక్కసారి క్రికెట్‌కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్‌ మాట!

‘‘క్రీడాకారులుగా మన కెరీర్‌కు కచ్చితంగా ఆఖరి తేదీ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి నేను నా ఆటలో లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవడంపైనే ఎల్లప్పుడూ దృష్టి సారిస్తాను.కెరీర్‌ ముగిసి పోయిన తర్వాత.. ‘ఓహ్‌.. ఆరోజు నేను అలా చేస్తే బాగుండు.. ఇలా చేస్తే ఇంకా మెరుగ్గా ఉండేది’ అని పశ్చాత్తాపపడాలని అనుకోవడం లేదు. కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ఎల్లకాలం గతం గురించే ఆలోచిస్తూ కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ప్రతీ పని ఇప్పుడే పూర్తి చేసుకుంటాను.పశ్చాత్తాపపడేందుకు ఏదీ మిగలనివ్వను. కచ్చితంగా నేను ఇది సాధిస్తాననే అనుకుంటున్నా’’ అంటూ టీమిండియా స్టార్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి ధీమా వ్యక్తం చేశాడు.మీ కంటికి కూడా కనిపించనుఆర్సీబీ రాయల్‌ గాలా డిన్నర్‌ నేపథ్యంలో రిటైర్మెంట్‌ తర్వాత తాను చేయాలనుకుంటున్న పనుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒక్కసారి క్రికెట్‌కు వీడ్కోలు పలికితే.. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు మీ కంటికి కూడా కనిపించను(నవ్వుతూ).అందుకే ఇక్కడ ఉన్నంతసేపు నా శాయశక్తులా, అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు తపిస్తున్నా. ఆ తపనే నన్ను ఇప్పుడు ముందుకు నడిపిస్తోంది’’ అని విరాట్‌ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా 2008లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కోహ్లి జట్టులో కీలక సభ్యుడిగా మారాడు.రికార్డుల రారాజుగా పేరొంది కెప్టెన్‌ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లి.. 2008 నుంచి ఇప్పటిదాకా ఐపీఎల్‌లో ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.అత్యధిక పరుగుల వీరుడుపదహారేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఒక్కసారి కూడా గాయాల బెడదతో కోహ్లి జట్టుకు దూరం కాలేదంటే ఫిట్‌నెస్‌ మీద అతడికి ఉన్న శ్రద్ధ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక 35 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌.. ప్రస్తుతం ఐపీఎల్‌-2024తో బిజీగా ఉన్నాడు.ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లలో ఆడి 661 పరుగులు సాధించిన విరాట్‌ కోహ్లి.. అత్యధిక పరుగుల వీరుడి(ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌)గా కొనసాగుతున్నాడు. లీగ్‌ దశలో ఆర్సీబీ తమ ఆఖరి మ్యాచ్‌లో మే 18న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ఆర్సీబీ ఇంటిబాట పడుతుంది. కాగా బెంగళూరు జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ ట్రోఫీ సాధించలేదన్న సంగతి తెలిసిందే.చదవండి: IPL 2024: సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్‌ ఫైర్‌ View this post on Instagram A post shared by Royal Challengers Bengaluru (@royalchallengers.bengaluru)

Actor Chandrakanth Emotional Over Pavithra Jayaram Lost Her Life
రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!

త్రినయని సీరియల్‌ నటి పవిత్ర గౌడ రెండు రోజుల క్రితం మరణించింది. అయితే తను యాక్సిడెంట్‌లో మరణించలేదంటున్నాడు నటుడు చంద్రకాంత్‌. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పవిత్ర గురించి చెప్తూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. 'కన్నడలో ఓ సినిమాకు సంతకం చేసేందుకు మేమంతా బెంగళూరు వెళ్లాం. అక్కడ ప్రాజెక్టుకు ఒప్పుకుని కొంత అడ్వాన్స్‌ తీసుకుని హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యాము. నటికి గాయాలవలేదు!కారులో నేను, పవిత్ర వెనకాల కూర్చున్నాం. ముందు డ్రైవర్‌ పక్కన పవిత్ర సోదరి కూతురు ఉంది. అందరమూ గాఢ నిద్రలో ఉన్నాం. బస్‌ మమ్మల్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో మా కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. అప్పుడు నా ఒక్కడికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. పవిత్రకు ఒక్క దెబ్బ కూడా తగల్లేదు. నన్ను రక్తపు మడుగులో చూసేసరికి నాన్నా ఏమైందంటూ షాక్‌లోకి వెళ్లిపోయింది. అంబులెన్స్‌ ఆలస్యంగా రావడం వల్లే తను మరణించింది. అంబులెన్స్‌ సమయానికి వచ్చుంటే తను బతికేది. గుండెపోటు వల్లే తన ఊపిరి ఆగిపోయిందని వైద్యులు పేర్కొన్నారు.ఇంతలోనే..మేము భార్యాభర్తలమన్న విషయాన్ని అధికారికంగా చెప్దామనుకున్నాము. ఇంతలోనే తను నన్ను మోసం చేసి వెళ్లిపోయింది. నా జీవితం ఎటు కాకుండా పోయింది. ఆ దేవుడు తనను అలాగే ఉంచి నన్ను తీసుకెళ్లినా బాగుండేది. నా పవిత్ర గురించి తప్పుడుగా ప్రచారం చేయకండి.. అది చాలా మంచి మనిషి అని చంద్రకాంత్‌ కన్నీరుమున్నీరుగా విలపించాడు.చదవండి: గాయపడిన ఐశ్వర్య రాయ్‌.. అయినా అక్కడికి ప్రయాణం

Australian Doctor Claims He Beat Brain Cancer With Self Invented Treatment
వైద్యుడి ఘనత! తాను కనిపెట్టిన వైద్యంతో బ్రెయిన్‌ కేన్సర్‌ని జయించాడు!

కేన్సర్‌ అంటేనే.. ఎలాంటి వాళ్లు అయినా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఏ స్టేజ్‌లో ఉందో? నయం అవుతుందో? లేదా? అన్న భయాలు మొదలైపోతుంటాయి. ఎంతటి వాడినైనా కుదేలయ్యిపోయేలా చేస్తుంది. అలాంటి కేన్సర్‌ మహ్మమ్మారిని తను కనిపెట్టిన వైద్య విధానంతో స్వీయ చికిత్స తీసుకుని జయించి చరిత్ర సృష్టించాడు ఓ వైద్యుడు. తన జీవితాన్ని పొడిగించుకున్నందకు సంబరపడిపోతున్నాడు.ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ప్రముఖ ఆస్ట్రేలియా వైద్యుడు ప్రొఫెసర్‌ రిచర్డ్‌ స్కోలియర్‌ బ్రెయిన్‌ కేన్సర్‌ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. అప్పుడు ఆయనకు 57 ఏళ్లు. నిజానికి ఈ వ్యాధి వచ్చిన వాళ్లు 12 నెలలకు మించి బతకరు. దీంతో ఈ వ్యాధిపై అవగాహన ఉన్న రిచర్డ్‌ ..తన స్నేహితుడు ప్రొఫెసర్‌ జార్జినా లాంగ్‌ సాయంతో కొత్త చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు. దాన్ని తనపైనే ప్రయోగం చేసుకున్నాడు రిచర్డ్‌. ఈ చికిత్స విధానం సర్జరీ రహితం. ఆశ్చర్యకరంగా ఆ చికిత్స బాగా పనిచేసి మెదడులోని కణుతులన్నీ మాయమైపోయాయి. తాజాగా ఎమ్మారై తీయగా కణితులు కనిపించకపోవడంతో రిచర్డ్‌ ఆనందం వ్యక్తం చేశారు. తానిప్పుడు చెప్పలేనంత భావోద్వేగానికి గురవ్వుతున్నానని అన్నారు. తన జీవితకాలాన్ని పొడిగించుకున్నాని, తన భార్య, పిల్లలతో కలిసి మరికొంత కాలం కలిసి జీవించే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు రిచర్డ్‌. ఈ చికిత్స విధానం సుమారు మూడు లక్షల మందికి ఉపయోగపడుతుందని చెప్పారు. సర్జరీ లేకుండా చేసే ఈ "ఇమ్యూనో థెరపీ' పెద్ద సంఖ్యలో ఉపయోగడుతుందని ధీమాగా చెబుతున్నారు. అంతేగాక ఈ చికిత్సలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తెచ్చి మరింతగా అభివృద్ధి చేయడమే గాక విస్తృతమైన క్లినకల్‌ ట్రయల్స్‌ నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని జార్జిన్‌ లాంగ్‌ అన్నారు. (చదవండి: 'ఇడియట్‌ సిండ్రోమ్‌' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?)

gold price today rate may 16
కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..

బంగారం ధరల మోత కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 16) ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. నాలుగు రోజుల తగ్గుదలకు బ్రేకిచ్చి క్రితం రోజున ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు మరింత ఎగిశాయి. తులం బంగారం రూ.700 పైగా పెరిగి రూ. 74,000 మార్కును దాటేసింది.హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.700 పెరిగి ప్రస్తుతం రూ.67,850 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.770 పెరిగి రూ. 74,020 లను తాకింది.ఇతర నగరాల్లో ధరలుఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.68,000 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.770 ఎగిసి రూ.74,170 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.67,850లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.770 పెరిగి రూ.74,020 లకు చేరుకుంది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.67,950ల​కు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.770 ఎగిసి రూ.74,130 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.67,850 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.770 పెరిగి రూ.74,020 లకు ఎగిసింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి ఏకంగా రూ.1500 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.92,500 లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Slovakia PM Robert Fico Shot: Latest News
స్లోవేక్‌ ప్రధానిపై హత్యాయత్నం ఎందుకు జరిగిందంటే..

ప్రేగ్‌: స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్‌ ఫికో (59)పై జరిగిన హత్యాయత్నాన్ని ప్రపంచ దేశాల అధినేతలు ముక్తకంఠంతో ఖండించారు. అయితే ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తైందని, ప్రాణాపాయ స్థితి తప్పిందని ఆ దేశ ఉప ప్రధాని, పర్యావరణ శాఖ మంత్రి టోమస్‌ తరాబా మీడియాకు తెలిపారు.దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలోని హాండ్లోవా పట్టణంలో నిన్న మధ్యాహ్నాం ఫికో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. సమావేశ ముగిశాక బయటకు వచ్చిన ఆయన.. అక్కడ బారికేడ్ల వద్ద ఉన్న కొందరు వృద్ధులతో కరచలనం చేశారు. ఈలోపు ఓ వృద్ధుడు ఆయనపై కాల్పులు జరుపుతూ మెరుపు దాడికి దిగాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బందిని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. Assassination attempt on #Slovakia PM Robert Fico caught on camera. Considered as close to @KremlinRussia_E he opposed #Ukraine bid for @NATO. He is battling for life in hospital. pic.twitter.com/YsZHRZHVcu— Neeraj Rajput (@neeraj_rajput) May 15, 2024 Assassination attempt on #Slovakia PM Robert Fico caught on camera. Considered as close to @KremlinRussia_E he opposed #Ukraine bid for @NATO. He is battling for life in hospital. pic.twitter.com/YsZHRZHVcu— Neeraj Rajput (@neeraj_rajput) May 15, 2024 ఆ వెంటనే ఆలస్యం చేయకుండా ప్రధాని ఫికోను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. బన్‌స్కా బైస్ట్రికాలోని ఓ ఆసుపత్రిలో ఫికోను సర్జరీ జరిగింది. మొత్తం ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని, ప్రధాని కడుపులో బుల్లెట్లు దిగి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. Assassination attempt on #Slovakia PM Robert Fico caught on camera. Considered as close to @KremlinRussia_E he opposed #Ukraine bid for @NATO. He is battling for life in hospital. pic.twitter.com/YsZHRZHVcu— Neeraj Rajput (@neeraj_rajput) May 15, 2024ఇక కాల్పులకు సంబంధించి స్పాట్‌లోనే నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మీడియా సంస్థల కథనం ప్రకారం.. నిందితుడ్ని జురాజ్‌ సింటులా(71)గా నిర్ధారించారు. అయితే దాడికి ఎందుకు పాల్పడ్డాడనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. గత నెలలో జరిగిన స్లోవేకియా అధ్యక్ష ఎన్నికలు, ఇతరత్ర రాజకీయ కారణాలు హత్యాయత్నానికి కారణాలై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాబర్ట్‌ ఫికో గురించి.. 1964 చెకోస్లోవేకియాలో రాబర్ట్‌ ఫికో జన్మించారు.ఫికోకు భార్యా, కొడుకు ఉన్నారు. ఫికో రష్యా అనుకూలవాది. ఉక్రెయిన్‌ యుద్ధం నుంచి పుతిన్‌కు మద్దతు ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నాలుగో దఫా ప్రధాని పీఠంపై కొనసాగుతున్నారు.కమ్యూనిస్ట్‌ భావజాలానికి ఆకర్షితుడై.. 1992లో డెమొక్రటిక్‌ లెఫ్ట్‌ పార్టీ తరఫున తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యాడు. 1990లో.. యూరోపియన్‌ మానవ హక్కుల సంఘాలకు స్లోవేకియా తరఫున ప్రాతినిధ్యం వహించారు. 1999లో.. స్మెర్‌(Direction – Social Democracy) పార్టీని నెలకొల్పారు. అప్పటి నుంచి ఆ పార్టీకి ఆయనే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. 2006 నుంచి 2010 దాకా, ఆపై 2012 నుంచి 2016, 2016 నుంచి 2018 ప్రధానిగా పని చేశారు. 2014లో అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేసి ఓడారు.ఈయన హయాంలోనే స్లోవేకియా నాటోతో పాటు యూరోపియన్‌ యూనియన్‌లో సభ్య దేశంగా మారింది. అధికారంలో ఉండగా.. పత్రికా స్వేచ్ఛను అణగదొక్కారనే విమర్శ ఒకటి ఫికోపై బలంగా వినిపిస్తుంది. జర్నలిస్టులపై దాడులు చేసేందుకు క్రిమినల్‌ గ్యాంగ్‌లను సైతం ప్రొత్సహించారనే అభియోగాలు ఆయనపై నమోదు అయ్యాయి కూడా. అధికారం కోసం సిద్ధాంతాలు మార్చుకునే అవకాశవాదంటూ ప్రతిపక్షాలు ఆయన్ని విమర్శిస్తుంటాయి. స్లోవేకియా ఇన్వెస్టిగేషన్‌ జర్నలిస్ట్‌ జాన్‌ కుసియాక్‌తో పాటు అతనికి కాబోయే భార్య హత్య కేసు దుమారం రేపడంతో.. 2018లో ఫికో ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో కొనసాగిన ఫికో.. కిందటి ఏడాది జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో రష్యా అనుకూలవాదం, అమెరికా వ్యతిరేక నినాదాలతో జనంలోకి వెళ్లి ఘన విజయం సాధించారు. ఆ సమయంలో తాను అధికారంలోకి వస్తే.. ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం అందించడం ఆపేస్తానని చెబుతూ.. ఈ యుద్ధ సంక్షోభానికి నాటో, అమెరికాకే కారణమంటూ విమర్శలు గుప్పించారు. రాజకీయ హింస స్లోవేకియాకు కొత్తేం కాదు. అందుకే ఆ దేశ ప్రజలకు ప్రధానిపై జరిగిన దాడి పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయలేదు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement