Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

YS Jaganmohan Reddy visit to Ongolu and Tanguturu on april 30
నేడు సీఎం జగన్‌ ప్రచార సభలు ఇలా..

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ షెడ్యూల్‌ను సోమవారం ఆయన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 10 గంటలకు ఒంగోలు లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరులో జరిగే ప్రచార సభ­లో.. మధ్యాహ్నం 12.30 గంటలకు కడప లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న మైదుకూరు నియోజకవర్గంలోని మైదుకూరు నాలుగు రోడ్ల జంక్షన్‌లో జరిగే సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యా­హ్నం 3 గంటలకు రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.  

Tenth Class Results Out Today
నేడే టెన్త్‌ ఫలితాలు..

సాక్షి, హైదరాబాద్‌: పదవ తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలవుతాయి. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం 11 గంటలకు ఫలితాలను అధికారి కంగా విడుదల చేస్తారు. టెన్త్‌ పరీక్షల విభా గం డైరెక్టర్‌ కృష్ణారావు ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఫలితాలను  http:// results. bse.telangana.gov.in,   http://results.bsetela అనే వెబ్‌సైట్లలో చూడవచ్చని తెలిపారు.‘సాక్షి’లో వేగంగా ఫలితాలు ఇంటర్‌మీడియెట్‌ ఫలితాలను అందించిన విధంగానే టెన్త్‌ ఫలితాలను శరవేగంగా అందించేందుకు ‘సాక్షి’ దినపత్రిక ఏర్పాట్లు చేసింది. అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను అందిపుచ్చుకుంది.www.sakshieducation.com వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి ఫలితాలను చూడవచ్చు. 

Kadiri MLA Candidate Kandikunta Venkata Prasad Kabza
కబ్జాల కందికుంట

కదిరి: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ పేరు వినగానే కదిరి నియోజకవర్గ ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఆయన కన్ను పడితే విలువైన స్థలాలు, పొలాలు కబ్జా కావాల్సిందేనన్న విమర్శలు ఉన్నాయి. బాధితుల్లో ఎంతోమంది ముస్లింలు, ఇతర సామాజిక వర్గం వారు ఉన్నారు. కబ్జాలను ఎవరైనా ప్రశ్నిస్తే అనుచరులతో దాడులు, దౌర్జన్యాలు చేయించడం ఆయన నైజంగా ఉంది. ప్రజాకంఠకుడిగా ఉన్న ఈయనకే ప్రతి ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్‌ కేటాయిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. మీడియా ముందు మాత్రం కందికుంట నీతి సూక్తులు చెబుతుండడం చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు.బొరుగులమ్మి సంపాదించిన స్థలం.. కదిరి పట్టణంలోని జామియా మసీదు వీధికి చెందిన పి.ఖాజామోద్దీన్‌ అలియాస్‌ బొరుగుల ఖాజా కొన్నేళ్ల క్రితం ఊరూరా తిరిగి బొరుగులు అమ్మేవాడు. ఈ వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో కదిరి–హిందూపురం రోడ్‌లో అప్పట్లో సర్వే నంబరు 70/3–3లో 4.50 ఎకరాల పొలం కొన్నాడు. కుటుంబ అవసరాల కోసం అందులో 1.50 ఎకరాలు అమ్మేయగా.. మూడెకరాలు అలానే ఉంది. ఖాజామోద్దీన్‌కు ఐదుగురు సంతానం. ఆయన మరణానంతరం ఆ పొలాన్ని కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా సాగుచేస్తూ వచ్చారు. ఆడ పిల్లలందరూ పెళ్లీడుకు రావడంతో వారికి పెళ్లి చేసేందుకు ఆ మూడెకరాల భూమిని అమ్మాలని కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.డబ్బు చెల్లించకుండానే ఇతరులకు రిజిస్ట్రేషన్ఆ భూమిని అమ్ముతారనే విషయం తన అనుచరుల ద్వారా కందికుంటకు తెలిసింది. వెంటనే వారిని పిలిపించి సెంటు రూ.80 వేల చొప్పున బేరం కుదుర్చుకొని వెంటనే రూ.లక్ష అడ్వాన్స్‌గా ఇచ్చారు. తర్వాత ఆ మిగిలిన డబ్బు ఇచ్చి భూమి రిజి్రస్టేషన్‌ చేయించుకోండని ఖాజామోద్దీన్‌ కుటుంబ సభ్యులు కందికుంట ఇంటి దగ్గర వేచి ఉండటం దినచర్యగా మారింది. కొన్ని రోజులు గడిచాక ఓ రోజు ‘ఆ భూమితో మీకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆ భూమి మాది. ఇదిగో మా బంధువుల పేరు మీద ఆ భూమికి సంబంధించి కదిరి రెవెన్యూ వారు మంజూరు చేసిన పట్టాదారు పాసుపుస్తకం’ అంటూ కందికుంట తెలపడంతో వారికి గుండె ఆగినంత పనైంది. ప్రశ్నించే ధైర్యం లేక, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఇంటి దారి పట్టక తప్పలేదు. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.20 కోట్లు చేస్తుంది.బాధిత యువకుడిపై హత్యాయత్నం ఖాజామోద్దీన్‌ మనవడు అమీర్‌ఖాన్‌ 2018 జూలై 14న జేసీబీని తీసుకెళ్లి పొలం చదును చేయిస్తున్నాడు. ఈ విషయం కందికుంటకు తెలిసి వెంటనే తన అనుచరులను అక్కడికి పంపి ఆ యువకుడిపై రాళ్ల దాడి చేయించాడు. గుండెలపై బండ రాళ్లతో  కొట్టి చంపడానికి కూడా ప్రయత్నించారు. ఈలోగా వారి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ఏడుస్తుంటే జనం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆరోజు నుంచి ఈరోజు వరకు ఆ స్థలం వైపు బాధితులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడుతున్నారు.  కందికుంట మాత్రం ఆ స్థలం తమదేనని బుకాయించడంతో పాటు మీడియా ముందు తాను సచీ్చలుడినంటూ నీతి సూక్తులు వల్లిస్తున్నాడు.చిత్తుగా ఓడించండి అమాయక ప్రజల భూమిని ఆక్రమించి, దానికి తప్పుడు పత్రాలు సృష్టించి ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి అందులోకి ఇతరులెవ్వరూ ప్రవేశించకుండా కందికుంట ప్రస్తుతం దానికి పెద్ద గేట్‌ కూడా ఏర్పాటు చేయించాడు. ఆ స్థలం యజమానులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులే కాకుండా ఆ దారిగుండా వెళ్లే ప్రతి ఒక్కరూ కందికుంటకు శాపనార్థాలు పెడుతున్నారు. ఇలాంటి వ్యక్తికి     చంద్రబాబు ప్రతిసారీ ఎందుకు టికెట్‌ ఇస్తున్నాడో అర్థం కావడం లేదని జనం తప్పుబడుతున్నారు. పేదల స్థలాలు కబ్జా చేసే కందికుంటను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.  

Daily Horoscope Rasi Phalalu April 30-04-2024 Telugu
Horoscope Today: ఈ రాశులవారు శుభవార్తలు వింటారు..

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.సప్తమి రా.2.52 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: ఉత్తరాషాఢ రా.1.39 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ఉ.10.13 నుండి 11.45 వరకు, తదుపరి తె.5.28 నుండి 6.56 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం: ఉ.8.08 నుండి 8.56 వరకు, తదుపరి రా.10.50 నుండి 11.38 వరకు, అమృతఘడియలు: రా.7.25 నుండి 8.46 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.39, సూర్యాస్తమయం: 6.14. మేషం: నూతన ఉద్యోగాలు. ఆకస్మిక ధనలాభం. వ్యవహారాలలో విజయం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.వృషభం: ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. పనుల్లో అవరోధాలు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు.మిథునం: వ్యయప్రయాసలు.. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు ముందుకు సాగవు. వృత్తి,వ్యాపారాలలో మార్పులు.కర్కాటకం: వ్యవహారాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలత.కన్య: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. సోదరులు, సోదరీలతో కలహాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.తుల: కుటుంబసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. అనారోగ్య సూచనలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.వృశ్చికం: శుభవార్తలు వింటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహమే.మకరం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.కుంభం: రాబడి నిరాశ పరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.మీనం: ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకర సమాచారం.  

Road Accident at Yanam Amalapuram Road
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టినరోజు వేడుక

అనుబంధం తెగిపోయి.. ఆనందం ఆవిరి.. ఆ ఘోర ప్రమాదం..  ఆశలను చిదిమేసింది.. అనుబంధాలను చెరిపేసింది.. జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఆ కుటుంబాలకు ఆసరా లేకుండా మార్చింది.. చేయి పట్టుకుని నడిచే పిల్లలకు తండ్రి లేకుండా చేసింది.. కట్టుకున్నవాడిని భార్యకు దూరం చేసింది.. తోడుగా ఉంటాడనుకున్న కుటుంబానికి కుమారుడిని లేకుండా చేసింది. అమలాపురం రూరల్‌ మండలం భట్నవిల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు మిగిలిన వేదన ఇది.అమలాపురం రూరల్‌/ మామిడికుదురు: వారంతా స్నేహితులు... హ్యాపీ హ్యాపీగా సహచరుడి ముందస్తు పుట్టినరోజు వేడుకకు బయలు దేరారు.. జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు.. కేక్‌ కట్‌ చేసుకుని సందడి చేశారు.. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో దారి కాచిన మృత్యువు లారీ రూపంలో వారి ఆనందాన్ని ఆవిరి చేసింది.. అమలాపురం రూరల్‌ మండలం భట్నవిల్లిలోని వనువులమ్మ ఆలయం వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం..  మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్‌ (26) పుట్టినరోజు సోమవారం కావడంతో ముందస్తు వేడుకలు జరుపుకొనేందుకు స్నేహితులు నిర్ణయించుకున్నారు. మొత్తం ఎనిమిది మంది పుదుచ్చేరి ప్రాంతం యానాంకు నెల్లి నవీన్‌కుమార్‌ ఆటోలో ఆదివారం రాత్రి 8 గంటలకు బయలు దేరారు. యానాంలో విందు ముగిశాక అర్ధరాత్రి సమయంలో తిరుగు పయనమయ్యారు. భట్నవిల్లి వచ్చేసరికి కాకినాడ వైపు ఒడిశాకు చేపల లోడుతో వెళుతున్న లారీ వారి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన సాపే నవీన్‌ (22), అదే గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్‌ (26), అదే మండలం పాశర్లపూడికి చెందిన నెల్లి నవీన్‌కుమార్‌ (27), పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్‌ (18) అక్కడికక్కడే చనిపోయారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి శివారు కొండాలమ్మ చింతకు చెందిన మల్లవరపు వినయ్‌బాబు (17), అదే గ్రామానికి చెందిన మార్లపూడి లోకేష్‌ (17), పెదపటా్ననికి చెందిన జాలెం శ్రీనివాసరెడ్డి (17), నగరం శివారు పితానివారి మెరక గ్రామానికి చెందిన మాదాసి ప్రశాంత్‌కుమార్‌ (17)లు  తీవ్రంగా గాయపడి అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో జాలెం శ్రీనివాసరెడ్డి, మాదిసి ప్రశాంత్‌కుమార్‌ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.  తరుక్కుపోయిన గుండెలుచేతికందివచ్చిన తమ పిల్లలు మృత్యవాత పడి విగత జీవులుగా పడి ఉండడం చూసి మృతుల తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. తన కుటుంబానికి దిక్కెవరంటూ జతిన్‌ భార్య ఆశాదేవి బంధువులను దీనంగా అడుగుతుంటే చూపురుల గుండెలు తరుక్కుపోయాయి. కువైట్‌లో ఉంటున్న తల్లులకు పిల్లల మృత్యు వార్త ఎలా చెప్పాలంటూ నవీన్, అజయ్‌ కుటుంబీకులు ఆందోళన చెందారు. ప్రమాద వార్త తెలియగానే మృతుల, క్షతగాత్రుల కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ కుటుంబాలన్నీ రొక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఆటో నడుపుకొంటూ, ఎల్రక్టీíÙయన్‌గా పనిచేస్తూ నవీన్‌కుమార్, జతిన్‌ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. మిగిలిన వారంతా డిగ్రీ, ఇంటరీ్మడియెట్‌ చదువుకుంటూ భవిష్యత్‌ కోసం బాటలు వేసుకుంటున్నారు. అమలాపురం రూరల్‌ సీఐ పి.వీరబాబు, రూరల్‌ ఎస్సై శేఖర్‌బాబు ప్రమాద స్థలిని తక్షణమే సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రికి తరలించి వేగంగా వైద్యం అందేలా సీఐ, ఎస్సైలు శ్రమించారు.పుట్టిన రోజునే పరలోకానికి..  నగరం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్‌ (26) ఎలక్ట్రీయన్‌గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సోమవారం అతని పుట్టిన రోజు. పుట్టిన రోజు వేడుకకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కొత్త దుస్తులు కొనుక్కున్నాడు. సరదాగా స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు ఆదివారం రాత్రి అంతా కలసి బయటకు వెళ్లారు. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చి తనువు చాలించాడు. జతిన్‌కు ఆరేళ్ల కిందట వివాహమైంది. అతనికి భార్య ఆశాదేవి, ఐదేళ్ల కుమార్తె ఆత్య, ఏడు నెలల కొడుకు ఉన్నారు. జతిన్‌ మృతితో భార్య ఆశాదేవి, తండ్రి వెంకటేష్‌, తల్లి దివ్య కన్నీరు మున్నీరవుతున్నారు. అభం, శుభం తెలియని పిల్లలకు నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలంటూ వారు విలపిస్తున్నారు.  ఒక్కగానొక్క కుమారుడి మృతితో.. నగరం కోటమెరకకు చెందిన సాపే నవీన్‌ (22) డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్నా డు. తండ్రి శ్రీనివాసు రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి రత్న కుమారి కువైట్‌లో ఉంది. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో అతని కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది. నవీన్‌ అమ్మమ్మ బత్తుల మేరీరత్నం తన మనవడి వద్దే ఉంటూ అతడిని అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. చదువుకుని ఎంతో ప్రయోజకుడవుతాడని ఆశించిన నవీన్‌ దుర్మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు.  కిరాయికి వెళ్లి.. మృత్యుఒడికి చేరి పాశర్లపూడి నెల్లివారిపేటకు చెందిన నెల్లి నవీన్‌కుమార్‌ (27) అవివాహితుడు. ఐదు నెలల కిందట కొత్త ఆటో కొనుక్కున్నాడు. తండ్రి ట్రక్కు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నవీన్‌కుమార్‌ తల్లి మంగాదేవి పదేళ్ల నుంచి మస్కట్‌లో ఉంటున్నారు. తండ్రి, కొడుకు ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. స్నేహితుడి పుట్టినరోజు, ఆటో కిరాయికి వెళ్లిన నవీన్‌కుమార్‌ రోడ్డు ప్రమాదంలో మ్యత్యువాత పడడం స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.సరదాగా వెళ్లి.. పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్‌ (18) ఇంటర్‌ పూర్తి చేశాడు. తండ్రి శ్రీనివాసరావు నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. అతను గల్ఫ్‌లో ఉంటున్నాడు. తల్లి కుమారి ఇటీవల గల్ఫ్‌ నుంచి వచ్చారు. కొడుకును ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అందివచ్చిన కొడుకు స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లి ఇలా విగతజీవిగా మారతాడని కలలో కూడా ఊహించలేదని ఆమె విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది.    

46 degrees temperature registered in Nandyala district
సెగలు.. భగభగలు

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.  సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సింహాద్రిపురం (వైఎస్సార్‌)లో 45.9, రామభద్రపురం (విజయనగరం) 45.1, కోడుమూరు (కర్నూలు) 44.8, సాలూరు (పార్వతీపురం మన్యం) 44.5, రాపూరు (నెల్లూరు) 44.4, లక్ష్మీనర్సుపేట (శ్రీకాకుళం) 44.3, మార్కాపురం (ప్రకాశం)లో 44.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా 59 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 78 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. మంగళవారం 61 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 173 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. వీటిలో శ్రీకాకుళంలో 13, విజయనగరం 24, పార్వతీపురం మన్యం 14, అనకాపల్లి 9, విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలంలోనూ తీవ్ర వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కోస్తా జిల్లాలోని పలు మండలాల్లో   వడగాడ్పులు వీస్తాయని వివరించింది.

Sundhara Travels Actress Radha attack on Real estate man
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని చితకబాదిన నటి రాధ

సుందరా ట్రావెల్స్‌ చిత్ర కథానాయకి మరో వివాదంలో చిక్కుకున్నారు. దీంతో పోలీసులు కేసు గురించి విచారణ జరుపుతున్నారు. వివరాలు చూస్తే.. చెన్నై, నెర్కుం  డ్రం, పల్లవన్‌నగర్‌ సమీపంలోని ఏరిక్కరై వీధికి చెందిన వ్యక్తి మురళీకృష్ణన్‌ (48) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో పాటు, ఎల్‌ఐసీ ఏజెంట్‌గానూ వ్యవహరిస్తున్నారు. మురళీకృష్ణన్‌ మాట్లాడుతూ ద్వారకేశ్‌ అనే తన మిత్రుడికి నటి రాధ పరిచయం చేశానన్నారు. దీంతో ఆమె రెండేళ్ల క్రితం 90 వేలు బిట్‌ కాయిన్స్‌ పె ట్టుబడి పెట్టారన్నారు. అయితే అప్పటినుంచి అత ను ఆ బిట్‌ కాయిన్స్‌ను నటి రాధకు తిరిగి చెల్లించలేదన్నారు. దీంతో నటి రాధ ద్వారకేశ్‌ను పరిచయం చేసిన తనను ఆ బిట్‌ కాయిన్స్‌ తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేశారన్నారు. అలా రాధ, ఆమె తల్లి పల్లవి, కొడుకు మరో ముగ్గురు స్థానిక చూలైమేడులోని తన కార్యాలయానికి వచ్చి గొడవ చేశారన్నారు. వాగ్వాదం తరువాత నటి రాధ తనను కిందకు పడేసి కొట్టారన్నారు. దీంతో తన అనుచరు లు స్థానిక రాయపేటలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్చారని, తన తలకు మూడు కుట్లు పడ్డాయని చె ప్పారు. అనంతరం తాను స్థానిక వడపళనిలో పోలీస్‌స్టేషన్‌లో నటి రాధ, ఆమె కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాగా పోలీసులు ఈ వ్యహారంపై విచారణ జరుపుతున్నారు.    

List of star campaigners for Election Commission with 12 commoners
సామాన్యులే స్టార్‌ క్యాంపెయినర్లు

సాక్షి, అమరావతి: స్టార్‌ క్యాంపెయినర్లు.. ప్రతి పార్టీలోనూ ప్రముఖ నాయ­కులు వీళ్లు.. సభలకు వ­స్తారు.. చేతులూపుతారు.. ఏదేదో చెప్పే­స్తారు.. వారి పార్టీ వారికి ఓటేయమని కోరుతూ ఓ దండం పెట్టేసి హెలికాప్టరో, విమానమో ఎక్కేసి వెళ్లిపోతారు. కానీ,  జగన్‌ నేతృత్వంలోని ప్రజల పార్టీ అయిన వైఎస్సార్‌సీపీకి స్టార్లు, స్టార్‌ క్యాంపెయినర్లు కూడా సామాన్య ప్రజలే.  జగన్‌ ప్రభుత్వం అందించిన చేయూతతో అభివృద్ధి సాధించి, కుటుంబ జీవన ప్రమాణాలను పెంచుకున్న సాధారణ ప్రజలే. చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా ఈ సామాన్యులే స్టార్‌ క్యాంపెయినర్లుగా  వైఎస్సార్‌సీపీ ఎన్నికల సమారానికి సిద్ధమైంది.ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారే తన స్టార్‌ క్యాంపెయినర్‌లంటూ సీఎం జగన్‌ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. దీనినే కార్యరూపంలోకి తెస్తూ దేశంలో ఏ పార్టీ కనీసం ఆలోచన కూడా చేయలేని సాహసోపేత నిర్ణయం తీసుకుని, వైఎస్సార్‌సీపీ 12 మంది సామాన్యులతో తన రాష్ట్రస్థాయి స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల కమిషన్‌కు అందజేసింది. వీరంతా జిల్లా, నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవుతారు.  సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయాన్ని వీరు సందర్శించారు. సీఎం వైఎస్‌ జగన్‌కు స్టార్‌ క్యాంపెనర్‌లుగా ఏ విధంగా మారారో వారిలో కొందరు వివరించారు.  50 ఇళ్లకు నేనే ఎమ్మెల్యేగా పనిచేశా ఈ ప్రభుత్వంలో వలంటీర్‌గా పనిచేశా. నా 50 ఇళ్లకు నేనే ఎమ్మెల్యే అన్నట్లు పనిచేశా. ప్రతి ఇంటికి వారికి ఏ పథకాలు అందాలో వాటన్నింటినీ పక్కాగా అందించాం. అదే ఊరికి చెందిన నాకు ఆ కటుంబాలు గతంలో ఎలా ఉండేవి, నవరత్నాలతో ఆర్థిక భరోసా అందిన తరువాత ఎలా మారాయో నాకు స్పష్టంగా కనిపించింది. ఈ ఐదేళ్లలో నిజమైన అభివృద్ధిని చూశా. ఆర్థిక కారణాలతో పిల్లలను చదువించుకోలేని ప్రతి కుటుంబానికీ సీఎం వైఎస్‌ జగన్‌ అండగా నిలిచారు. భర్త సంపాదన మీద మాత్రమే బతికే ప్రతి అక్కకు, చెల్లెమ్మకు సీఎం జగనన్న అండగా నిలిచి ఆర్థిక భరోసా కల్పించారు. ఏదో ఒక చిరు వ్యాపారం చేసుకునేలా తీర్చిదిద్దారు. ఈ ప్రభుత్వం మహిళలను నిజమైన ఇంటి యజమానిని చేసింది. నా క్లస్టర్‌లోని సగం కుటుంబాలు స్థానికంగా, పక్కనే ఉన్న పట్టణాల్లో సొంత వ్యాపారాలు ప్రారంభించాయి. తద్వారా ప్రతిరోజూ రూ. 1,000 వరకు సంపాదించుకుంటున్నాయి. వారి జీవితాల్లో చాలా మార్పు వచి్చంది.  ఒక తల్లిగా ఆలోచిస్తే మా పిల్లలకు అవసరమైన చదువులు, అవసరాలు అన్నీ పాఠశాలల్లో లభిస్తున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తున్న నాయకుడని నేను నమ్ముతున్నాను. – ఈశ్వరి, కొండపల్లి, ఎన్టీఆర్‌ జిల్లాసీఎం జగన్‌ చలవతో నా కుమారుడు అమెరికాలో చదువుతున్నాడు నాకు ఇద్దరు కుమా­రులు. పెద్దబ్బాయి కిషోర్‌ డిగ్రీ పూర్తి చేసి డిల్లీలోని మారుతి సుజుకీలో ఉద్యోగం చేసే­వాడు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్‌ ఇన్‌ పొలిటికల్‌ అఫైర్స్‌లో సీటు సంపాదించాడు. కోర్సు ఫీజు రూ.1.36 కోట్లు అవుతుందన్నారు. ఈ మాట నాకు చెప్పగానే కనీసం రూ. లక్ష అయినా మనం కట్టలేం.. మంచి ఉద్యోగం చూసుకో అని చెప్పా. ఆ తరువాత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో విదేశీ విద్య పథకం గురించి తెలుసుకుని దరఖాస్తు చేశాం.నా కొడుకు చదువుకు కావాల్సిన డబ్బు విదేశీ విద్య కింద మంజూరైంది. ఇప్పటికే రెండు సెమిస్టర్లు పూర్తి చేసిన నా కుమారుడికి రెండు దఫాలుగా రూ. 50 లక్షలు అందింది. ఇది చూసిన నాకు లక్ష రూపాయలు కట్టలేని నా కుమారుడు ఇంత పెద్ద మొత్తం ఫీజుతో విదేశీ విశ్వవిద్యాలయంలో చదవగలుగుతున్నాడని గర్వంగా అనిపించింది. ఒక్క నా కుమారుడే కాదు.. ఇలా చాలా మంది పేదల పిల్లలు విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఉన్నత విద్య చదువుతున్నారు. ఇదంతా సీఎం వైఎస్‌ జగన్‌ చలవే. అందుకే సీఎం జగన్‌ కోసం స్టార్‌ క్యాంపెయినర్‌ అయ్యాను.       – పండలనేని శివప్రసాద్, మోపిదేవి మండలం, కృష్ణా జిల్లాసీఎం జగన్‌ ఆలోచనలకు సంపూర్ణ మద్దతు జగనన్న చేదోడు అందుకున్న మా ఇంటి పక్కనే నివాసం ఉండే శారద బట్టల షాపు ఏర్పాటు చేసుకుని కుటుంబానికి అండగా నిలుస్తోంది. దాసరి మహాలక్ష్మి అనే మహిళకు భర్త మరణిస్తే రూ. 2 లక్షల బీమా అందింది. దీంతోపాటు పెన్షన్, ఆసరా, అమ్మఒడి పథకాలూ అందుతున్నాయి. మాది కూడా నిరుపేద కుటుంబం. జగననన్న ప్రభుత్వంలో అందిన నవరత్నాలతో రోజు గడవడమే కష్టంగా ఉండే దుస్థితి నుంచి నిలకడ ఆదాయం అందుకునే స్థితికి వచి్చంది. మా కుటుంబాలను ఆర్థికంగా నిలబడేలా ఆదుకున్న ప్రభుత్వానికి మేమెందుకు అండగా నిలవకూడదు? పేదలను పేదరికం నుంచి తప్పించి మెరుగైన జీవితం కల్పించాలనే సీఎం జగన్‌ ఆలోచనకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. అందుకే సీఎం జగన్‌ కోసం స్టార్‌ క్యాంపెయినర్‌గా పనిచేసేందుకు ముందుకు వచ్చా.      – ఎ. అనంతలక్ష్మి, రాజమండ్రి సిటీ నియోజకవర్గం, తూర్పు గోదావరి జిల్లాప్రభుత్వ పాఠశాలల్ని చూస్తే తేడా తెలుస్తుంది సీఎం జగన్‌ పరిపాలన ఏమిటో చెప్పేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలే ఉదాహరణ. నేను డిగ్రీ పూర్తి చేసి ఐదేళ్లే అయ్యింది. మేం చదువుకునే సమయంలో ప్రభుత్వ పాఠశాలలి్న, ఇప్పడు నాడు – నేడు కింద పూర్తిగా మారిన ప్రభుత్వ పాఠశాలలను చూస్తే తేడా అర్ధమవుతుంది. అప్పటి ప్రభుత్వ పాఠశాలలు తలుపులు లేక గేట్లు లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేవి. కనీసం బాలికలకు టాయిలెట్లు కూడా లేని దుస్థితి. ఇలాంటి స్కూళ్లలో బాలికల విద్య ఎలా ఉంటుందో మనం ఒక్కసారి ఆలోచిస్తే అర్ధమ­వుతుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే అంతర్జాతీయ స్థాయి. సకల సౌకర్యాలు, డిజిటల్‌ క్లాస్‌ రూంలు, ట్యాబ్‌లతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యను బోధిస్తున్నారు. మరో పదేళ్లలో ఈ ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటికి వచ్చే వారితో రాష్ట్రం మరో ఎత్తుకు ఎదుగుతుంది. ఇంగ్లిష్‌ చదువులతో  కొన్ని లక్షల కుటుంబాల తలరాత మారిపోతుంది. సీఎం జగన్‌ ప్రభుత్వాన్ని ప్రతి గ్రామానికి తీసుకొచ్చారు.  వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తాను.      – అన్వర్, నెల్లూరు జిల్లాఒక అడుగు ముందుకు వేశాం ద్విచక్ర వాహనాలకు సీట్‌ కవర్లు కుట్టే ఒక చిన్న షాపు నాది. రోడ్డు పక్కన పెట్టుకున్నాను. నాకు ముగ్గురు పిల్లలు. నా రోజువారీ సంపాదన కుటుంబ పోషణకే సరిపోతుంది. పిల్లలను బాగా చదివించాలని ఆశ ఉన్నా చదివించే ఆర్థిక స్థోమత లేదు. 2019లో సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇంజనీరింగ్‌లో చేరిన నా కొడుకుకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలతో ఆదుకున్నారు. నా కుమారుడు బాగా చదువుకున్నాడు. రెండో కొడుకు కూడా ఫీజు రియింబర్స్‌మెంట్‌ డబ్బుతో డిగ్రీ చదువుతున్నాడు. మూడో కొడుకుకి అమ్మఒడి అందుతోంది. నా సంపాదన అరకొరే అయినా, నా పిల్లల చదువు ఏ ఆటంకం లేకుండా సాగుతోంది. పెద్ద కొడుకు ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగం సాధించాడు. సీఎం జగన్‌ ఇచ్చిన ఒక్క పథకం కింద చదువుకున్న నా కొడుకు నా కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చాడు. మేము సమాజంలో ఒక అడుగు ముందుకు వేసినట్లైంది. ఇలాంటి వేలాది పేదింటి పిల్లలకు సీఎం జగన్‌ చదువులు చెప్పిస్తున్నారు.      – కటారి జగదీష్ , మల్లవీధి, అనకాపల్లి

YSRCP complains to Chief Electoral Officer of AP
అమల్లోలేని ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారం

సాక్షి, అమరావతి: ‘అమల్లో లేని ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ గురించి తెలుగుదేశం పార్టీ ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లను తప్పుదారి పట్టిస్తోంది. ఇది ఎన్నికల మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌కు విరుద్ధం. టీడీపీపై తగిన చర్యలు తీసుకోండి’ అని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాకు వైఎస్సార్‌సీపీ సోమవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు ఎ.నారాయణ­మూర్తి, న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదుతోపాటు తగిన ఆధారాలను అందజేశారు. అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ నెల 28వ తేదీన కోడు­మూరు, మంత్రాలయంలలో జరిగిన ప్రచార సభల్లో ప్రసంగిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌పై వ్యక్తి­గతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఆయనపై తగిన చర్యలు తీసు­కోవాలని ఫిర్యాదు చేశారు.జనసేన అధ్య­క్షుడు పవన్‌కళ్యాణ్‌ ఈ నెల 28న ప్రత్తిపాడు నియో­జకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్నికల నియమావళికి విరు­ద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరి­స్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

TDP, Janasena and BJP Alliance being challenged by rebel candidates
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ‘తిరుగు’పాట్లు!

సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని తిరుగుబాటు అభ్యర్థులు హడలెత్తి­స్తున్నారు. 16 నియోజకవర్గాల్లో రెబల్స్‌ పోటీ­లో ఉండడంతో కూటమి అభ్యర్థులకు కునుకు కరువైంది. వాస్తవానికి 30కిపైగా నియోజక­వర్గాల్లో ఈ పరిస్థితి నెలకొనగా నయానో భయానో కొందరిని రేసు నుంచి తప్పించారు. 16 నియోజక వర్గాల్లో మాత్రం రెబల్స్‌ కూటమి పార్టీలను ధిక్కరించి తాడో పేడో తేల్చుకోవ­డానికి సిద్ధమయ్యారు. ఇందులో తొమ్మిది చోట్ల టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులు ఉండగా.. ఏడు చోట్ల బీజేపీ, జనసేన తిరుగు­బాటు అభ్యర్థులు రంగంలో నిలిచారు. తిరుగుబాటు అభ్యర్థులు కొందరికి గాజు గ్లాసు గుర్తు కేటాయించడం గమనార్హం. రాప్తాడులో రెబల్‌ పోటు శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులో సాకే రాజేష్‌ కుమార్‌ రెబల్‌గా పోటీలో నిలిచారు. నామి­నేషన్‌ ఉపసంహరించుకోవాలని ఆయన­పై తీవ్ర ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గలేదు. దీంతో అక్కడ టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ఓట్లకు గండి పడటం ఖాయమనే భయం టీడీపీని కలవరపెడుతోంది. నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ రెబల్‌ పసుపులేటి సుధాకర్‌ బరిలో ది­గారు. సుధాకర్‌కు గాజు గ్లాసు గుర్తు కేటా­యిం­­చడం టీడీపీకి సంకటంగా మారింది. చిత్తూరు జిల్లా సత్యవేడు స్థానాన్ని మొదటి నుంచి కష్టపడిన తనకు కాకుండా ఫిరాయింపు నేత ఆదిమూలానికి ఇవ్వడంతో జేడీ రాజశేఖర్‌ తిరుగుబాటు చేసి బరిలో నిలిచారు. అక్కడ అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఆ నియోజకవర్గంలోనే టీడీపీని మరో రెబల్‌ అభ్యర్థి యాతాటి రమేష్‌బాబు బెంబేలెత్తిస్తు­న్నా­­రు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌­నాథ్‌రెడ్డి ఓటమే ధ్యేయంగా దామోదర్‌నాయుడు పోటీలో ఉన్నారు.రఘురామ గుండెల్లో రైళ్లు అనేక మలుపులు తిరిగిన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి స్థానంలోనూ టీడీపీకి రెబల్‌ బెడద తప్పలేదు. ఇక్కడ రఘురామకృష్ణంరాజుకు పోటీగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పోటీలో ఉన్నారు. ఆయన్ను బరిలో నుంచి తప్పించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. టీడీపీ ఓటమే లక్ష్యంగా శివరామరాజు మొదటి నుంచి ప్రచారం చేస్తూ ఆ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరం సీటును జనసేనకు ఇవ్వడంతో మొడియం శ్రీనివాస్‌ రెబల్‌గా బరిలోకి దిగారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో సీటు దక్కలేదనే అసంతృప్తితో పరమట శ్యామ్‌కుమార్‌ పోటీలో నిలిచారు.టీడీపీ రెబల్‌ మీసాల గీతకు గాజు గ్లాస్‌ గుర్తువిజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా రేసులో నిలవడంతోపాటు ఆమెకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో కూటమి నేతలు కంగు తిన్నారు. తనకు సీటు ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారంటూ మీసాల గీత రెబల్‌గా నామినేషన్‌ వేశారు. అశోక్‌గజపతిరాజు కుమార్తె అతిథికి సీటు ఇచ్చి తనను అవమానించారని, ఆమెను ఎలాగైనా ఓడిస్తానని మీసాల గీత శపథం చేశారు. గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ సోమవారం సాయంత్రం నుంచే గుర్తుతో కూడిన కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేయడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. అరకులో టీడీపీ రెబెల్‌గా సివేరి అబ్రహం పోటీలో ఉండడంతో కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు.బాలయ్యకు పరిపూర్ణానంద ఝలక్‌ కూటమి సీటు దక్కకపోవడంతో హిందూపురం నుంచి స్వామి పరిపూర్ణానంద బీజేపీ రెబల్‌గా బరిలో నిలిచారు. చంద్రబాబు పిలిచి మాట్లాడినా ఆయన వెనక్కి తగ్గగకుండా కూటమికి చెమటలు పట్టిస్తున్నారు. ఇక్కడ నుంచి బాలకృష్ణ పోటీ చేస్తున్న నేపథ్యంలో పరిపూర్ణానంద దెబ్బ ఏ స్థాయిలో ఉంటుందోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎచ్చెర్ల, టెక్కలి, గన్నవరం, మాచర్ల, పోలవరంలోనూ బీజేపీ రెబల్స్‌ పోటీలో ఉన్నారు. పెడన, జగ్గంపేటలో జనసేన సీటు దక్కని నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు.ఫలించని సీఎం రమేష్‌ పైరవీలుఅనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పాయకరావుపేట అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగలపూడి అనిత తమ స్థానాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు కేటాయించకుండా చేసిన పైరవీలు ఫలించలేదు. సీఎం రమేష్‌ తన పలుకుబడి ఉపయోగించి కేంద్ర పెద్దల ద్వారా చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఎన్నికల అధికారులు గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్లు కోరిన చోట వారికి కేటాయించారు. జనసేన పోటీ చేసిన చోట్ల గాజు గ్లాస్‌ గుర్తును ఆ పార్టీకి కేటాయించాలని, పోటీ చేయని చోట ఫ్రీ సింబల్‌గా ప్రకటించి ఇండిపెండెంట్లకు  కేటాయించవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. పాయకరావుపేట అసెంబ్లీ, అనకాపల్లి ఎంపీ స్థానానికి వడ్లమాని కృష్ణ స్వరూప్‌ దళిత బహుజన పార్టీ తరఫున నామినేషన్‌ వేశారు. తనకు గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించాలని కోరారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిత ఆర్‌వో కార్యాలయానికి చేరుకుని అభ్యంతరం తెలిపినా ఫలితం దక్కలేదు. తాను కోర్టును ఆశ్రయిస్తానని కృష్ణ స్వరూప్‌ స్పష్టం చేయడంతో అధికారులు నిబంధనల ప్రకారం ఆయనకు గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించారు.   

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement