Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ksr Comments On Telangana And Andhra Pradesh Joint Capital Hyderabad
ఏపీకి హైదరాబాద్‌ అసలు ఎంత దూరం?

ఏపీ, తెలంగాణల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇక కొనసాగే అవకాశం లేనట్లేనా! బై బై చెప్పిసినట్లేనా! పంజాబ్, హర్యానాలకు చండీఘడ్ దశాబ్దాల తరబడి ఉమ్మడి రాజధానిగా ఉంటోంది. కానీ హైదరాబాద్‌ను మాత్రం ఏపీ ప్రజలు పదేళ్లకే వదలుకోకతప్పదన్న అభిప్రాయం కలుగుతోంది. ఏపీ మాత్రం మరో పదేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరుకుంటోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు సిద్ధపడడం లేదు. ఇప్పటికీ హైదరాబాద్‌లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీకి ఇంతవరకు కేటాయించిన లేక్ వ్యూ అతిథి గృహం వంటి భవనాలను తెలంగాణ తీసేసుకుంటుందన్నమాట.అలాగే తెలంగాణలోని వైద్య కాలేజీలలో ఉన్న అన్ రిజర్వుడ్ కోటా సీట్లను ఇకపై కేవలం తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇదే రూల్ ఏపీకి కూడా వర్తిస్తుంది. విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల కోసం పదిహేను శాతం సీట్లను ఉంచారు. వాటికి ఎవరైనా పోటీపడవచ్చు. ఏపీ విద్యార్థులకు దక్కకుండా అన్నీ సీట్లను తెలంగాణకే ఇవ్వాలని ఆయన అంటున్నారు. నిజానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ సాంకేతికంగా కొనసాగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక విభజన అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. దీనిపై చొరవ చూపవలసిన కేంద్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా సమావేశాలు జరుపుతూ కాలయాపన చేసింది తప్ప, చిత్తశుద్ధితో నిర్ణయాలు చేయలేకపోయింది. దానికి కారణం రాజకీయాలే అని చెప్పాలి.తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు రెండిటికి రాజకీయ ప్రయోజనాలున్నాయి. ఇక్కడ మొన్నటివరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌తో పాటు ఈ రెండు పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. అందువల్ల తెలంగాణ యాంగిల్‌లోనే వీరు ఆలోచిస్తున్నారు తప్ప ఏపీని పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. పొరపాటున తెలంగాణ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని ఏపీతో తగాదా లేకుండా చేసుకుంది అనుకోండి.. వెంటనే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తెలంగాణకు అన్యాయం జరిగిందని రాజకీయం చేస్తున్నాయి. ఉదాహరణకు కృష్ణా నది జలాలపై ఎంత రగడ చేశారో చూడండి. రాయలసీమకు వరద జలాలను తరలించినా, తెలంగాణకు నష్టం జరుగుతున్నట్లుగా వివిధ పార్టీలు విమర్శలు చేశాయి. చివరికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద సీఆర్‌పీఎఫ్‌తో కాపలా పెట్టవలసి వస్తోంది. ఆరు నెలల క్రితం ఏపీ ప్రభుత్వం బలవంతంగా తనకు రావల్సిన నీటి కోటాను తీసుకువెళ్లింది కనుక సరిపోయిందికానీ, లేకుంటే ఏపీకి నీళ్లు రావడమే కష్టం అయ్యేదేమో! నదీజలాల యాజమాన్య బోర్డులున్నా.. వాటికున్న అధికారాలు అంతంతమాత్రమేనని చెప్పాలి. ఈ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి ఏపీ సిద్ధపడినా, తెలంగాణ వెనుకడుగు వేస్తోంది. దానికి కారణం రాజకీయ విమర్శలు వస్తాయన్న భయంతోనే. పైగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలు మొత్తం తమకే కేటాయించాలన్నంతగా డిమాండ్ పెట్టింది. ట్రిబ్యునల్ నదిలో 811 టీఎమ్‌సీల నీరు పారుతుందని అంచనా వేస్తే, తెలంగాణ ప్రభుత్వం 798 టీఎమ్‌సీల నీరు తమకే అవసరం అని చెబుతోంది. ఒకపక్క నదిలో వరదలు తగ్గుతున్నాయి. ఇంకో పక్క రెండు రాష్ట్రాలు తమ వాస్తవ అవసరాల ప్రాతిపదికన కాకుండా రాజకీయాల దృష్టితో బేసిస్ నీటి వాటాను కోరుతున్నాయి. ఉమ్మడి ఏపీ విభజన సమయంలో ఏపీకి రాజధాని లేదు కనుక హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా వాడుకోవచ్చని నిర్ణయించారు. ఆ టైమ్‌లో కొందరు ఎంపీలు చండీఘడ్ మాదిరి సుదీర్ఘకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు. 2014 లో విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కూడా అదే తీరులో హైదరాబాద్‌లో ఉన్నారు. సచివాలయ భవనాలకు వందల కోట్లు వెచ్చించారు. ఎవరైనా అడిగితే హైదరాబాద్ రాజధానిగా చాలాకాలం ఉంటుందని అనేవారు. కానీ ఆయన ఓటుకు నోటు కేసులో పట్టుబడడంతో టీఆర్ఎస్‌తో రాజీలో భాగంగా హైదరాబాద్‌ను వదలి ఏపీకి వెళ్లిపోయారు. దాంతో మొత్తం పరిస్థితి తలకిందులైంది.ఏపీ ప్రజలు దీనివల్ల బాగా నష్టపోయారు. ఆ కేసు సమయంలో చంద్రబాబు ఏకంగా హైదరాబాద్‌లో కేసులు పెట్టే అధికారం తమకు కూడా ఉంటుందన్నంతవరకు వివాదాస్పదంగా మాట్లాడారు. ఆయన రాత్రికి రాత్రే పెట్టె, బెడ సర్దుకుని వెళ్లడంతో సచివాలయ భవనాలన్నీ వృధా అయిపోయాయి. ఆ బిల్డింగ్‌లు పాడైపోతున్నందున తమకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరితే ప్రస్తుత ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ వాడుతున్న ఇతర భవనాలను స్వాధీనం చేయాలని కోరుతోంది. దీనివల్ల హైదరాబాద్‌లో ఏపీకి స్టేక్ లేకుండా పోతుంది. హైదరాబాద్ ఉమ్మడి ఏపీ ప్రజలు అంతా కలిసి అభివృద్ది చేసుకున్న నగరం. కానీ ఇప్పుడు ఒక ప్రాంతానికే పరిమితం అవడం వల్ల ఏపీ ప్రజలకు నష్టం జరగవచ్చు. విభజన సమయంలో మాబోటి వాళ్లం ఏపీకి హైదరాబాద్‌లో విద్య, ఉపాధి, నివాస అవకాశాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా చట్టం ఉండాలని సూచించినా, రాజకీయ పార్టీలు పట్టించుకోలేదు. దాని ఫలితంగా విద్యపరంగాకానీ, ఉపాధి అవకాశాలలో కానీ మున్ముందు ఏపీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణకు నష్టం చేయాలని, ఇక్కడ ప్రజలకు అన్యాయం జరగాలని ఎవరూ కోరడం లేదు. కానీ ఏపీకి న్యాయం జరగాలన్నదే అందరి అభిప్రాయం. హైదరాబాద్‌లో కానీ, ఇతరత్రా కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. ఉదాహరణకు ఆర్టీసీ ఆస్తులు రెండురాష్ట్రాలకు వర్తిస్తాయి. ఆ ఆస్తుల విభజన ఇంకా జరగలేదు. అలాగే ఇతర సంస్థల ఆస్తులు కూడా పెండింగులోనే ఉన్నాయి. బ్యాంకులలో కూడా ఉమ్మడి ఖాతాలలో డబ్బు ఉంది. దానిపై వివాదం వస్తే ఏపీ తెలుగు అకాడమీ సుప్రింకోర్టువరకు వెళ్లి తన వాటాను సాధించుకుంది.అలాగే ఇతర సంస్థల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను పంచవలసి ఉంటుంది. మొత్తం సుమారు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఏపీకి రావాలన్నది ఒక అంచనా. అది తేలలేదు. ప్రభుత్వరంగ సంస్థల విషయం పరిష్కారం కాలేదు. ఉద్యోగుల విభజనపై విద్యుత్ బోర్డు వంటి సంస్థలలో ఏళ్ల తరబడి కోర్టులలో కేసులు సాగాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగకపోతే, ఏపీకి హైదరాబాద్ పూర్తిగా పరాయిదైపోతుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ అందుకు అనుగుణంగా వ్యవహరిస్తుందా అనే సందేహం ఉంది. దానికి కారణం హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని నిర్ణయిస్తే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు పెద్ద దుమారం లేవదీస్తాయి. దానివల్ల బీజేపీకి తెలంగాణలో నష్టం జరుగుతుందన్న భయం ఉంటుంది. అలాగే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కూడా ఈ విషయంలో నోరు మెదపకపోవచ్చు. ఎందుకంటే వారికి తెలంగాణలో అధికారం ఉంది. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా రావడం లేదు కనుక. పైగా ఈ రెండు పార్టీలకు ఏపీలో ఉన్న ఓట్లు ఒకశాతం లోపే. ఏపీ లోని పార్టీలు దీనిపై ఎంతవరకు డిమాండ్ చేస్తాయో చూడాలి.అధికార వైఎస్సార్‌సీపీ దీనిపై కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసిందని సమాచారం. ప్రతిపక్ష టీడీపీ దీనిపై నోరు మెదిపే అవకాశం తక్కువే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని బతిమలాడుకుని మళ్లీ టీడీపీ ఎన్‌డీఏలో చేరింది. అందువల్ల బీజేపీకి అసంతృప్తి కలిగించే ప్రత్యేక హోదాతో సహా ఏ డిమాండ్లు ఏవీ టీడీపీ పెట్టదు. కాంగ్రెస్, బీజేపీల ఏపీ శాఖలు కూడా దీనిపై నోరెత్తకపోవచ్చు. ఈ పరిస్థితి తెలంగాణకు అడ్వాంటేజ్‌గా మారుతుంది. ఏపీకి నష్టం కలిగినా ఏమి చేయలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని చెప్పకతప్పదు. కానీ ధర్మంగా అయితే మరో పదేళ్లు లేదా విభజన సమస్యలు పరిష్కారం అయ్యేవరకైనా ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం అవశ్యం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Kejriwal Interim Bail Extension Judgement Reserved
రేపు మళ్లీ జైలుకు కేజ్రీవాల్‌..కోర్టులో నో రిలీఫ్‌

న్యూఢిల్లీ: లిక్కర్‌ స్కామ్‌ కేసులో మధ్యంతర బెయిల్ పొడిగింపుపై ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్‌ఎవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. జూన్‌ 5న తీర్పు వెలువరిస్తామని తెలిపింది. దీంతో కేజ్రీవాల్ రేపు(జూన్‌2) తీహార్‌ జైలులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం అత్యున్నత కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. జూన్‌ 2న కేజ్రీవాల్‌ తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. మధ్యంతర బెయిల్‌ గడువు ముగియడంతో బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ రౌస్‌ఎవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శనివారం(జూన్‌1) విచారణ జరిగింది. విచారణ సమయంలో కేజ్రీవాల్‌ మధ్యంత బెయిల్‌ పొడిగింపును ఈడీ వ్యతిరేకించింది.

Lawrence Bishnoi Gang Again Plan To Salman Khan
టార్గెట్‌ సల్మాన్‌ ఖాన్‌.. విస్తుపోయే విషయాలు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ ఇంటి ముందు ఏప్రిల్‌ 14న కాల్పులు జరిగాయి. ముంబయిలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ ​సైకిల్​ ద్వారా పారిపోయారు. వారిని ముంబై పోలీసులు అరెస్ట్‌ కూడా చేశారు. నిందితుల్లో ఒకరైన అనూజ్ థాపన్‌ కస్టడీలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ కూడా సల్మాన్‌పై నిఘా పెట్టింది. ముందే వార్నింగ్‌ ఇచ్చినట్లుగా సల్మాన్‌ ఖాన్‌ను హత్య చేసేందుకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పక్కా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ప్రతిరోజు సల్మాన్‌ ఎక్కడెక్కడ ఉంటాడో నిత్యం ఆయన కదలికలపై నిఘా పెట్టింది.కారుపై కాల్పులు జరిపేందుకు స్కెచ్‌సల్మాన్‌ ఇంటిపై కాల్పులు జరిగిన సమయం నుంచి ముంబై పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు. కేసులో దర్యాప్తు చేస్తుంటే పోలీసులకు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్‌ ఖాన్‌ కారుపై ఏకే-47 తుపాకులతో దాడి చేసేందుకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్లాన్‌ చేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అందుకు అవసరమయ్యే ఏకే-47 తుపాకులను పాకిస్థాన్‌కు చెందిన ఒక గ్యాంగ్‌ నుంచి వారు కొనుగోలు చేసినట్లు పోలీసులు ఆధారాలు గుర్తించారట. వాటితో పాటు ఏకే-92, అధునాతనమైన ఆయుధాలను తెప్పించుకున్నట్లు సమాచారం. సల్మాన్‌ ఖాన్‌ కారులో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా చుట్టుముట్టి కాల్పులు జరపాలని స్కెచ్‌ వేశారట. ఒకవేళ ఆ అవకాశం కుదరకపోతే ఆయన ఉంటున్న ఫామ్‌హోస్‌లోకి చొచ్చుకుపోయి కాల్పులు జరపాలని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పక్కా ప్లాన్‌ రచించిందట.కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో తాజాగా బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన నలుగురు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ధనంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్, గౌరవ్ భాటియా అలియాస్ నహ్వీ, వాస్పీ ఖాన్ అలియాస్ వసీం చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్ ఉన్నారు. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌తో పాటు ఆయన సోదరుడు అన్మోల్‌, గోల్డీబ్రార్‌ సహా 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ గ్యాంగ్‌కు చెందిన సుమారు 20 మంది పన్వేల్‌లో ఉన్న సల్మాన్‌ ఫామ్‌హోస్‌ చుట్టూ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు ఆధారాలు గుర్తించారు. వారందరినీ అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు జల్లెడ పడుతున్నారు.గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి సల్మాన్‌ ఖాన్‌కు ప్రాణహాని ఉంది. ఇప్పటికే చాలాసార్లు ఆయనపై దాడి చేసే ప్లాన్స్‌ వారు వేశారు కూడా.. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో వారి నుంచి ఎక్కువగానే వార్నింగ్‌లు వచ్చాయి. కృష్ణజింకలను వేటాడటం ద్వారా బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్‌ఖాన్‌ దెబ్బతీశారంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ వ్యాఖ్యానించాడు. చివరకు ఈ కేసులో సల్మాన్‌ నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ వారు మాత్రం ఆయనపై రివేంజ్‌ తీర్చుకోవాలని ఉన్నారు.

Satyanash Kar Diya Hai: Ex PCB Chief On Pakistan Ahead Of T20 WC 2024
‘జట్టును సర్వనాశనం చేశారు.. వాళ్లను విడదీశారు’

టీ20 ప్రపంచకప్‌-2024 ఆరంభానికి ముందు పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0తో ఓటమిపాలైంది. రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా.. మిగిలిన రెండింటిలో బట్లర్‌ బృందం చేతిలో ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది.కాగా వన్డే ప్రపంచకప్‌-2023లో కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే పాకిస్తాన్‌ నిష్క్రమించడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కెప్టెన్‌ బాబర్‌ ఆజం నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాడు.ఫలితంగా అతడి స్థానంలో టీ20లకు పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది, టెస్టులకు షాన్‌ మసూద్‌ను కెప్టెన్లుగా నియమించింది అప్పటి పాక్‌ క్రికెట్‌ బోర్డు. అయితే, వీరిద్దరి సారథ్యంలో పాక్‌ ఆస్ట్రేలియా(టెస్టు), న్యూజిలాండ్‌(టీ20) వైట్‌వాష్‌కు గురైంది.తిరిగి కెప్టెన్‌గామరోవైపు.. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డులోనూ ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో వన్డే, టీ20లకు బాబర్‌ ఆజం తిరిగి కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ప్రపంచకప్‌-2024లోనూ జట్టును ముందుండి నడిపించనున్నాడు.అయితే, అంతకంటే మందు మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్‌ చేతిలో పాక్‌ ఇలా పరాభావానికి గురైంది. ఈ నేపథ్యంలో పీసీబీ మాజీ చైర్మన్‌ రమీజ్‌ రాజా మేనేజ్‌మెంట్‌ తీరుపై మండిపడ్డాడు. ప్రయోగాలకు పోయి జట్టును సర్వనాశనం చేశారంటూ తీవ్రస్థాయిలో విమర్శించాడు.ఇప్పటికే జట్టును సర్వనాశనం చేసేశారు‘‘ఇప్పటికైనా ప్రయోగాలు ఆపండి. సరైన కూర్పుతో జట్టును బరిలోకి దించండి. స్ట్రైక్‌రేటు అనే ఫోబియా నుంచి బయటపడండి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు అంతగా దంచికొట్టే ఆటగాళ్లు లేరు.ఇప్పటికే జట్టును సర్వనాశనం చేసేశారు. అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీ(బాబర్‌ ఆజం- మహ్మద్‌ రిజ్వాన్‌)ను విడదీశారు. మిడిలార్డర్‌లో ఎవరిని ఆడించాలో మీకే స్పష్టత లేదు.ఇద్దరు వికెట్‌ కీపర్లు ఎందుకు?ఆల్‌రౌండర్లందరినీ తెచ్చి మిడిలార్డర్‌లో కుక్కేశారు. ఇద్దరు వికెట్‌ కీపర్లు తుదిజట్టులో ఆడుతున్నారు. ఫాస్ట్‌ బౌలర్లను తరచూ మారుస్తున్నారు. మీ స్పిన్నర్లు బంతిని ఏమాత్రం స్పిన్‌ చేయడం లేదు.వాళ్లలో అసలు ఆత్మవిశ్వాసం కనబడటం లేదు. తుదిజట్టు నుంచి ఇమాద్‌ వసీం(స్పిన్నర్‌)ను ఎందుకు తప్పించారు?.. మిగతా వాళ్ల స్థానాల విషయంలోనూ క్లారిటీ లేదు. ఏదేమైనా టీ20 ప్రపంచకప్‌ వంటి మెగా ఈవెంట్‌కు ముందు జట్టును మొత్తం భ్రష్టుపట్టించారు’’ అని మాజీ బ్యాటర్‌ రమీజ్‌ రాజా పాక్‌ బోర్డు తీరును తూర్పారబట్టాడు.కాగా కివీస్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా సయీమ్‌ ఆయుబ్‌ను ఓపెనర్‌గా ప్రమోట్‌ చేసిన పీసీబీ.. బాబర్‌ను వన్‌డౌన్‌లో ఆడించింది. 21 ఏళ్ల ఆయుబ్‌ న్యూజిలాండ్‌తో సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం 52 పరుగులు చేశాడు. కాగా టీ20లలో పాక్‌ అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీగా బాబర్‌- రిజ్వాన్‌ రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. గత టీ20 ప్రపంచకప్‌-2022లో 105 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇక ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ జూన్‌ 6న యూఎస్‌ఏతో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి టీమిండియాను జూన్‌ 9న ఢీకొట్టనుంది.చదవండి: రోహిత్‌, విరాట్‌ భార్యలను గమనిస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ

 In Battle For 11000 Crore Tobacco Empire Son Accuses Mother Of Assault
రూ. 11వేల కోట్ల టుబాకో సామ్రాజ్యం : ముదిరిన తల్లీ కొడుకుల పోరు

పాపులర్‌ సిగరెట్‌ కంపెనీ గాడ్‌ఫ్రే ఫిలిప్స్ మధ్య రగిలిన ఫ్యామిలీ వార్‌ మరింత ముదురుతోంది. గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ మోడీ తల్లి తనపై దాడికి పాల్పడిందని ఆరోపించారు. ఢిల్లీలోని జసోలా ఆఫీస్‌లో జరగాల్సిన బోర్డు మీటింగ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించినందుకు గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌కు చెందిన పలువురు డైరెక్టర్లు, తన తల్లి బీనా మోడీ వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్‌ఓ) పలువురు డైరెక్టర్లు తనను తీవ్రంగా గాయపరిచారని ఆరోపిస్తూ సమీర్ శుక్రవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూ. 11,000 కోట్ల వారసత్వంపై కొనసాగుతున్న ఫ్యామిలీ వార్‌ మరింత తీవ్రమైంది.బోర్డ్‌ మీటింగ్‌కి హాజరయ్యే ప్రయత్నంలో, తల్లి బీనా పీఎస్‌ఓవో నెట్టివేయడంతో తన చూపుడి వేలుకి తీవ్ర గాయమైందనీ, అదిక పూర్తిగా పనిచేయదని వైద్యులు తెలిపారంటూ సరితా విహార్ పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదులో మోడీ పేర్కొన్నారు.‘‘నా సొంత కార్యాలయంలోనే దాడి జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. "షేర్ల సెటిల్‌మెంట్‌పై కోర్టు కేసు పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు నా వాటాను విక్రయించను. నన్ను బోర్డు నుండి తొలగించే ప్రయత్నాన్ని అడ్డుకుంటాను’’ అంటూ సమీర్ మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ప్రతినిధి ఆరోపణలను ఖండించారు. ఇవి పూర్తిగా అబద్ధం, దారుణమైన ఆరోపణలని పేర్కొన్నారు. ఈ ఘటన ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని, అవి చూస్తే ఈ ఘటనపై స్పష్టత వస్తుందన్నారు.కాగా 2019లో గాడ్‌ఫ్రే ఫిలిప్స్ అధినేత కేకే మోడీ మరణంతర్వాత కుటుంబం వారసత్వ సంపదపై వివాదం మొదలైంది. అప్పటినుంచి కలహాలుకొనసాగుతున్నాయి.గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ప్రస్తుత సీఈఓ బీనా మోడీ ట్రస్ట్ డీడ్ నిబంధనలను ఉల్లంఘించి కంపెనీని తన ఆధీనంలోకి తీసుకున్నారని సమీర్ ఆరోపిస్తూ దావా వేశారు. అయితే మొదట తల్లి బీనా నిర్ణయానికి సమీర్, అతని సోదరి, చారు మోడీ మద్దతు ఇచ్చారు. అయితే, దీనిని వ్యతిరేకించిన లలిత్ మోడీ ట్రస్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.దీంతో అతని వాటా అతని కిచ్చేశారు. తరువాత కుటుంబ సంపదను పంచమని కోరడంతో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఈ వివాదం ప్రస్తుం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. సమీర్ మోడీ 1933లో తన తాత గుజర్మల్ మోడీ స్థాపించిన మోడీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలాగే గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా.

Minister Jogi Ramesh Satirical Comments On Chandrababu Foreign Tour
బాబు.. దోచుకుంది దాచుకునేందుకు విదేశాలకు వెళ్లావా?: జోగి రమేష్‌

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్‌. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు.కాగా, మంత్రి జోగి రమేష్‌ శనివారం మీడియాతో​ మాట్లాడుతూ..‘చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మొదట హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లారని అన్నారు. ఆ తర్వాత అక్కడ్నుండి‌ ఎక్కడకు వెళ్లారు?. వైద్యం కోసం అమెరికా వెళ్లాడని ఎల్లోమీడియా రాసింది. అబ్బే ఆయన అమెరికా రాలేదని ఆయన పార్టీ నేతలే అన్నారు. అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు? ఎక్కడకు వెళ్లారు?. చంద్రబాబుకు ప్రచార పిచ్చి బాగా మురిదిపోయింది.ఈ రహస్య పర్యటన వెనుక‌ కారణం ఏంటి?. దోచుకున్న డబ్బుని దాచుకోవటానికి వెళ్లారా?. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలి. ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు.. ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదు?. అసలు ఈ పది రోజులు ఎక్కడకు వెళ్లారో ఎందుకు చెప్పటం లేదు?. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన పర్యటన గురించి ప్రజలకు అవసరం. మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లండన్ వెళ్తాడని టైంతో సహా మేము చెప్పాం. మరి చంద్రబాబు పర్యటనపై ఎందుకంత గోప్యత?. ఇప్పటికైనా చంద్రబాబు పర్యటన వివరాలను ప్రజలకు వివరించాలి.అవినీతిపరుడైన ఏబీ వెంకటేశ్వరరావును టీడీపీ నేతలు అక్కున చేర్చుకున్నారు. దేవినేని ఉమా సహా అందరూ వెళ్లి అవినీతిపరుడిని సత్కరించారు. ఈరోజు వచ్చే ఎగ్జిట్ పోల్స్ దెబ్బకి టీడీపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. నాలుగో తేదీన ఫలితాలు చూసిన తర్వాత చంద్రబాబుకు మూర్చ వస్తుంది. ఆ రోజున కూటమి కుదేలవుతుంది. వైఎస్సార్‌సీపీ​ శ్రేణులంతా సంబరాలకు సిద్ధం కావాలి. పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకోవాలి. సీఎం జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వాలని పిలుపునిస్తున్నాం’ అంటూ కామెంట్స్‌ చేశారు.

Lok Sabha Elections 2024 Phase 7 Voting Live Updates
ముగిసిన లోక్‌సభ ఎన్నికల తుది దశ పోలింగ్‌

Lok Sabha Election 2024 Phase 7 Updates.. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్‌ 58.34 శాతంబీహార్ లో 8 లోక్ సభ స్థానాల పరిధిలో 48.86 శాతం పోలింగ్ నమోదుఛండీఘడ్ లో 62.80 శాతం పోలింగ్ నమోదుహిమాచల్ ప్రదేశ్ లో నాలుగు లోక్ సభ స్థానాల పరిధిలో 66.56 శాతం పోలింగ్ నమోదుజార్ఖండ్ లో మూడు లోక్ సభ స్థానాల్లో 67.95 శాతం పోలింగ్ నమోదుఒడిస్సా లో 6 లోక్ సభ స్థానాల్లో 62.46 శాతం పోలింగ్ నమోదుపంజాబ్ లో 13 స్థానాల్లో 55.20 శాతం పోలింగ్ నమోదుఉత్తరప్రదేశ్ 13 స్థానాల్లో 54. శాతం పోలింగ్ నమోదుపశ్చిమ బెంగాల్ 9 లోక్ సభ స్థానాల్లో 68.98 శాతం పోలింగ్ నమోదు👉 మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.09 శాతం పోలింగ్‌ నమోదు ఢిల్లీ:7వ విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో మధ్యాహ్నం 1 గంట వరకు నమోదయిన పోలింగ్ శాతం 40.09బీహార్(8)-35.65ఛండీఘడ్(1)-40.14హిమాచల్ ప్రదేశ్(4)-48.63జార్ఖండ్(3)-46.80ఒడిస్సా(6)-37.64పంజాబ్(13)-37.80ఉత్తరప్రదేశ్ (13)- 39.31పశ్చిమ బెంగాల్( 9)-45.07 👉ఓటు వేసిన నటి, టీఎంసీ ఎంపీ మిమీ చక్రవర్తి. కోల్‌కత్తాలోని పోలింగ్‌ బూత్‌ ఓటు వేసిన మిమీ చక్రవర్తి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటు వేసి నా బాధ్యత తీర్చుకున్నాను. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాను. #WATCH | West Bengal: Actor and former TMC MP Mimi Chakraborty casts her vote at a polling booth in Kolkata. #LokSabhaElections2024 pic.twitter.com/lt8L6GSZJO— ANI (@ANI) June 1, 2024 👉ఎన్నికల వేళ విషాదం.. మనోరంజన్‌ సాహో మృతిఓడిషాలో బింజర్‌హర్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌-157లో బూత్‌ లెవన్‌ ఆఫీసర్‌ మనోరంజన్‌ సాహో మృతిచెందారు. ఎన్నికల విధుల్లోనే ఆయన మరణించినట్టు కలెక్టర్‌ నిఖిల్‌ పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. Odisha | One BLO (Block Level Officer), Manoranjan Sahoo (58) of booth no-157 under Binjharpur Assembly Constituency of Jajpur district died while on election duty: Collector & DM cum DEO, Nikhil Pavan Kalyan#LokSabhaElections2024— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన నటుడు ఆయూష్‌మాన్‌ ఖురానా. ఛండీగఢ్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు వేశాడు. ఈ సందర్భంగా అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.#WATCH | Actor Ayushmann Khurrana shows the indelible ink mark on his finger after voting at a polling booth in Chandigarh.He says, "I came back to my city to cast my vote and exercise my right...Mumbai recorded a very low voter turnout this time but we should cast our… pic.twitter.com/7UTPNGCMl1— ANI (@ANI) June 1, 2024 👉ఓటుపై అవగాహన కోసం వినూత్న ప్రయోగం.. యూపీకి చెందిన ఓ వ్యక్తి గుర్రంపై కుషీనగర్‌ పోలింగ్‌ బూత్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఈ సందర్భంగా అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తాను 2012 నుంచి ఎలాంటి ఎన్నికలు జరిగినా గుర్రంపై వచ్చి ఓటు వేస్తున్నట్టు తెలిపాడు. #WATCH | To create voter awareness, a man arrives on a horse at a polling station to cast his vote in Kushinagar, Uttar PradeshHe says, "In the 2012, 2017 & 2022 Assembly elections and 2014 & 2019 Lok Sabha polls also I had arrived on horse to cast my vote." pic.twitter.com/Qw2vlivoM1— ANI (@ANI) June 1, 2024 👉ఓటు హక్కు వినియోగించుకున్న బెంగాల్‌ బీజేపీ నేత దిలీప్‌ ఘోష్‌.#WATCH | On clash during Lok Sabha elections in West Bengal today, BJP leader & MP Dilip Ghosh says, "...TMC is doing al this due to fear of losing, but voting will be completed." pic.twitter.com/VNFPikOiGR— ANI (@ANI) June 1, 2024👉ఓటు వేసిన శిరోమణి అకాళీదల్‌ నేత బిక్రమ్‌ సింగ్‌ మజితియా. 👉 ఓటు హక్కు వినియోగించుకున్న రేఖా పాత. బసిర్‌హట్‌లోని పోలింగ్‌ బూత్‌లో​ ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రేఖా. #WATCH | North 24 Parganas, West Bengal: BJP Lok Sabha Candidate from Basirhat, Rekha Patra shows her inked finger after casting her vote for #LokSabhaElections2024TMC has fielded Haji Nurul Islam from Basirhat. pic.twitter.com/eNN5bg4OkI— ANI (@ANI) June 1, 2024 👉 11 గంటల వరకు 26.30 పోలింగ్‌ శాతం నమోదు. ఢిల్లీ:7వ విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో ఉదయం 11 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం 26.30బీహార్(8)-24.25ఛండీఘడ్(1)-25.03హిమాచల్ ప్రదేశ్(4)-31.92జార్ఖండ్(3)-29.50ఒడిస్సా(6)-22.64పంజాబ్(13)-23.91ఉత్తరప్రదేశ్ (13)- 28.02పశ్చిమ బెంగాల్( 9)-28.10 👉ఓటు వేసిన హిమాచల్‌ సీఎం సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖూ. హర్మీర్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు వేశారు. #WATCH | Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu casts his vote at a polling station in Hamirpur for the seventh phase of #LokSabhaElections2024 pic.twitter.com/c7zzjs6SnO— ANI (@ANI) June 1, 2024 👉ఎన్నికల్లో ఓటు వేసిన బీహార్‌ సీఎం నితిశ్‌ కుమార్‌. భక్తియార్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఆయన వేశారు.#WATCH | Bihar CM Nitish Kumar leaves after casting his vote at a polling booth in Bakhtiyarpur. #LokSabhaElections2024 pic.twitter.com/2qogPy72zU— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన జమ్మూ కశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా. యూపీలోని గాజీపూర్‌లో వేశారు. #WATCH | Uttar Pradesh | Jammu and Kashmir Lieutenant Governor Manoj Sinha casts his vote for #LokSabhaElections2024 in Mohanpura village, Ghazipur. pic.twitter.com/LV5N4AoNjU— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన శిరోమణి అకాళీదల్‌ ప్రెసిడెంట్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌, ఎస్‌ఏడీ నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌. ఫిరోజ్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో వీరు ఓటు వేశారు. #WATCH | Sri Muktsar Sahib, Punjab: Shiromani Akali Dal (SAD) leader Harsimrat Kaur Badal casts her vote at a polling booth in Badal village under the Firozpur Lok Sabha constituency SAD has fielded Nardev Singh Bobby Mann from this seat. BJP has fielded Gurmit Singh Sodhi,… https://t.co/BhwLlKUElF pic.twitter.com/FGxN45jioQ— ANI (@ANI) June 1, 2024 👉పోలింగ్‌ వేళ బెంగాల్‌లో ఉద్రిక్తతలు..సౌత్‌ పరగాణా-24లో పోలింగ్‌ బూత్‌ వద్ద ఉద్రిక్తకర పరిస్థితులు. ఈవీఎంలు, వీవీప్యాట్స్‌ను మురికి కాల్వలో పడేసిన దుండగులు. VIDEO | Lok Sabha Elections 2024: EVM and VVPAT machine were reportedly thrown in water by a mob at booth number 40, 41 in Kultai, South 24 Parganas, #WestBengal. (Source: Third Party)#LSPolls2024WithPTI #LokSabhaElections2024 pic.twitter.com/saFiNcG3e4— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు వేసిన పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, రవిశంకర్‌ ప్రసాద్‌. VIDEO | Lok Sabha Elections 2024: Punjab CM Bhagwant Mann interacts with media after casting vote.#LSPolls2024WithPTI #LokSabhaElections2024(Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/1YxNaPwBQ5— Press Trust of India (@PTI_News) June 1, 2024 VIDEO | Lok Sabha Elections 2024: "I hope there will be record voting. I am confident that the excitement in the seventh phase will be more that what we have witnessed in the last six phases of elections. There will be bumper voting and then later bumper victory," says Anurag… pic.twitter.com/RbDCOPjfY4— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న కంగనా రనౌత్‌. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.VIDEO | Lok Sabha Election 2024: "I want to appeal to everyone to exercise their Constitutional rights and participate in this festival of democracy," says actor and BJP candidate from Himachal Pradesh's Mandi seat Kangana Ranaut (@KanganaTeam) after casting vote.… pic.twitter.com/7womwYt3xV— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 ఓటు వేసిన బీజేపీ నేత తరుణ్‌చుగ్‌. పంజాబ్‌లో అమృత్‌సర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. VIDEO | Lok Sabha Elections 2024: "We have been given the right by the Constitution to choose who will rule for the next five years and who will decide the country's strategies. We should all exercise this right. I am feeling very proud and happy that I have come here along with… pic.twitter.com/zSElxK3PEd— Press Trust of India (@PTI_News) June 1, 2024 👉 తొమ్మిది గంటల వరకు 11.31 శాతం పోలింగ్‌ నమోదు.. ఢిల్లీ:చివరి విడతలో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 8 రాష్ట్రాల్లో 57 నియోజకవర్గాల పరిధిలో ఉదయం 9 గంటల వరకు నమోదయిన పోలింగ్ శాతం 11.31బీహార్(8)-10.58ఛండీఘడ్(1)-11.64హిమాచల్ ప్రదేశ్(4)-14.35జార్ఖండ్(3)-12.15ఒడిస్సా(6)- 7.69పంజాబ్(13)-9.64ఉత్తరప్రదేశ్ (13)- 12.94పశ్చిమ బెంగాల్( 9)- 12.63 👉 ఓటు హక్కు వినియోగించుకున్న హిమాచల్‌ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా. గోరఖ్‌పూర్‌లో ఓటు వేసిన శుక్లా. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. #WATCH | Uttar Pradesh: After casting his vote in Gorakhpur, Himachal Pradesh Governor Shiv Pratap Shukla says, "I have cast my vote today. All the voters should cast their votes today and vote for a government that can carry forward development work..."#LokSabhaElections2024 pic.twitter.com/WFVlID9xh3— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన లాలూ ఫ్యామిలీ. సరన్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్రీదేవీ, ఆర్జేజీ అభ్యర్థి రోహిణీ ఆచార్య. #WATCH | Bihar: RJD chief Lalu Prasad Yadav, Rabri Devi and their daughter & party candidate from Saran Lok Sabha seat Rohini Acharya leave from a polling booth in Patna after casting their vote. #LokSabhaElections2024 pic.twitter.com/LTmGnXM4BH— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన సిక్కిం గవర్నర్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య. యూపీలో వారణాసిలోని రామ్‌నగర్‌లో ఆచార్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Uttar Pradesh | Sikkim Governor Lakshman Prasad Acharya says, "I am happy to take part in this festival of democracy. I think that voting is a duty along with being a constitutional right and everyone should perform their duty and exercise their right..." https://t.co/qwNLm28hP9 pic.twitter.com/V2EMlKNxMu— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ క్రికెటర్‌, ఆప్‌ ఎంపీ హర్బజన్‌ సింగ్‌. జలంధర్‌లోని పోలింగ్‌ బూత్‌ ఓటు వేసిన బజ్జీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. ఓటు వేయడం మన బాధ్యత అని కామెంట్స్‌ చేశారు. #WATCH | Punjab: Former Indian cricketer and AAP Rajya Sabha MP Harbhajan Singh casts his vote at a polling booth in Jalandhar#LokSabhaElections2024 pic.twitter.com/Ph55BxqFbp— ANI (@ANI) June 1, 2024 👉ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రవి కిషన్‌. గోరఖ్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌ వేసిన రవి కిషన్‌, ఆయన కుటుంబ సభ్యులు. #WATCH | Uttar Pradesh: BJP MP and candidate from Gorakhpur, Ravi Kishan & his wife Preeti Kishan cast their votes at a polling booth in the constituency. The Gorakhpur seat sees a contest amid BJP's Ravi Kishan, SP's Kajal Nishad and BSP's Javed Ashraf.#LokSabhaElections2024 pic.twitter.com/bTC51NMa3E— ANI (@ANI) June 1, 2024 👉ఓటు హక్కు వినియోగించుకున్న యూపీ సీఎం యోగి ఆద్యితనాథ్‌. గోరఖ్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసిన యోగి. గోరఖ్‌పూర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో రవి కిషన్‌. #WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath casts his vote at a polling booth in Gorakhnath, Gorakhpur.The Gorakhpur seat sees a contest amid BJP's Ravi Kishan, SP's Kajal Nishad and BSP's Javed Ashraf. #LokSabhaElections2024 pic.twitter.com/2Ao7uC7slU— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా #WATCH | BJP national president JP Nadda cast his vote at a polling booth in Bilaspur, Himachal Pradesh. His wife Mallika Nadda also cast her vote here. #LokSabhaElections2024 pic.twitter.com/7XZC3pU2zw— ANI (@ANI) June 1, 2024 👉 ఓటు వేసిన ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా..👉 ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన రాఘవ్‌ చద్దా.. #WATCH | After casting his vote for the seventh phase of #LokSabhaElections2024, AAP MP Raghav Chadha says, "Today is the grand festival of India...Every vote by the citizen will decide the direction & condition of the country...I request everyone to exercise their right to… pic.twitter.com/tBqPTEdBci— ANI (@ANI) June 1, 2024 👉 చివరి దశలో 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. Voting for the seventh - the last - phase of #LokSabhaElections2024 begins. Polling being held in 57 constituencies across 8 states and Union Territories (UTs) today.Simultaneous polling being held in 42 Assembly constituencies in Odisha. pic.twitter.com/BkcIZxkmYC— ANI (@ANI) June 1, 2024 👉 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్‌ ప్రారంభమైంది. 👉 కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌పాటు బీహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. 👉 వీటితో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం పోలింగ్‌ కొనసాగుతోంది. అంతేకాకుండా బీహార్‌లో ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో ఒకటి, బెంగాల్‌లో ఒకటి, హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉపఎన్నిక జరుగుతోంది.👉 చివరి విడతలోని 57 లోక్‌సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 32, యూపీఏ 9 సీట్లు దక్కించుకున్నాయి. మిగతా స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. అంటే సగానికి పైగా ఎన్డీయే సిట్టింగ్‌ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 19న ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన ఆరు దశల్లో 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యింది. కాగా మొత్తం ఏడు దశల్లోని 543 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ జూన్‌ 4న ప్రారంభం కానుంది. అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ జూన్‌ 2న ప్రారంభమవుతుంది.

Mother Died Before Voting Begins Son Says
‘ముందు ఓటు.. తర్వాతే తల్లి అంత్యక్రియలు’

దేశంలో లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్‌ నేడు(శనివారం) జరుగుతోంది. దీనిలో భాగంగా బీహార్‌లోని జెహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి కూడా పోలింగ్‌ కొనసాగుతోంది. అయితే ఈ నియోజక వర్గంలో ఒక విచ్రిత ఉదంతం వెలుగు చూసింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా ఓటర్లకు ఆదర్శంగా నిలుస్తోంది.జెహనాబాద్‌లోని బూత్ నంబర్ 151 పరిధిలోని దేవ్ కులీ గ్రామానికి చెందిన మిథిలేష్‌ యాదవ్‌, మనోజ్‌ యాదవ్‌ల తల్లి వృద్ధాప్య సమస్యలతో మృతి చెందింది. అయితే కుటుంబ సభ్యులు ఓటు వేసి, వచ్చాకనే ఆ మహిళకు దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా మృతురాలి కుమారుడు మనోజ్‌యాదవ్‌ మాట్లాడుతూ ఐదేళ్లకోసారి ఓటింగ్ వస్తుందని, ఇవి ఎంతో ముఖ్యమైనవని, అందుకే తామంతా ముందుగా ఓటువేయాలనుకున్నామని తెలిపారు. ఓటింగ్‌ పూర్తయ్యాకనే తల్లికి దహన సంస్కారాలు చేస్తామన్నారు.మృతురాలి కుటుంబానికి చెందిన ఉషాదేవి మాట్లాడుతూ ఓటింగ్ అనేది తప్పనిసరి అని, అందుకే ముందుగా ఓటు వేయబోతున్నామని తెలిపారు. వారంతా క్యూలో నిలుచుని, తమ వంతు వచ్చాక ఓటువేశారు. ఆ తర్వాత తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Gold rates on today commodity market in various places in country
తగ్గిన బంగారం, వెండి ధర.. ఎంతో తెలుసా..?

ఈక్విటీమార్కెట్‌లు ఇటీవల భారీగా పడిపోయాయి. దాంతో బంగారం ధరలు పుంజుకున్నాయి. శుక్రవారం మార్కెట్‌లో స్టాక్‌సూచీలు తీవ్రఒడిదుడుకులతో చివరకు స్వల్పలాభాలతో ముగిశాయి. దాంతో బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వివిధ ప్రాంతాల్లో శనివారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,500 (22 క్యారెట్స్), రూ.72,550 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.200, రూ.210 తగ్గింది.చెన్నైలో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,200 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,650.. 24 క్యారెట్ల ధర రూ.72,700కు చేరాయి. మార్కెట్‌లో శనివారం కేజీ వెండి ధర ఏకంగా రూ.2000 తగ్గి రూ.98,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

CM Jagan Arrived From Foreign Tour Grand Welcome From YSRCP
ముగిసిన సీఎం జగన్‌ విదేశీ పర్యటన

కృష్ణా, సాక్షి: ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ దగ్గర సీఎం జగన్‌కు ఘన స్వాగతం లభించింది. ఎంపీలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. పార్టీ కేడర్‌ పెద్ద ఎత్తున తరలివచ్చింది. అక్కడి నుంచి నేరుగా ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. 👉ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండిఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మే నెల 17వ తేదీన సీఎం జగన్‌ విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. లండన్, స్విట్జర్లాండ్‌ దేశాల్లో కుటుంబసమేతంగా ఆయన పర్యటించారు. పదిహేను రోజుల తర్వాత తిరిగి ఇవాళ స్వదేశానికి విచ్చేశారు. జూన్‌ 4వ తేదీన ఏపీకి జడ్జిమెంట్‌ డే. ఈ నేపథ్యంలో నేడో, రేపో ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement