Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YSRCP Navaratnalu Plus Manifesto More security for middle class
మధ్య తరగతికి మరింత భరోసా.. వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టో

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మధ్యతరగతి వర్గాల సంక్షేమానికి పలు చర్యలు చేపట్టి, ఆ వర్గాలను ఉన్నత స్థితికి తెస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘నవరత్నాలు ప్లస్‌’తో కూడిన మేనిఫెస్టోతో మరోసారి సంపూర్ణ భరోసా కల్పించారు. పట్టణాల్లోని మధ్య తరగతి కుటుంబాల దశాబ్దాల సొంతింటి కలను సాకారం చేసేలా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. 123 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేకంగా ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేసి, సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో ప్రతి ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయించి.. రూ.2 వేల కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటుకు నిర్ణయించారు. 17 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 29 నగర పంచాయతీల్లో దశలవారీగా ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేయనున్నారు. ఇదే కాకుండా, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపట్టారు. అవి..– ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు అండగా నిలవనున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువుల కోసం తీసుకునే రుణంలో రూ.10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యేంత వరకు చెల్లించనున్నారు. గరిష్టంగా ఐదేళ్ల పాటు వడ్డీ చెల్లింపుతో ఆర్థిక భరోసానిచ్చారు. – ప్రభుత్వ పాలనలో భాగస్వాములుగా ఉంటూ ఆప్కాస్, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబాలకు విద్య, వైద్యం, ఇళ్ల స్థలాలు సహా పూర్తి నవరత్న పథకాలను వర్తింజేయనున్నారు. దీనివల్ల రూ.25 వేల వరకు జీతం పొందుతున్న ఈ తరహా ఉద్యోగులందరికీ ఎంతో మేలు జరగనుంది. వీరితో పాటు ఇళ్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు వారి సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు. ఆ స్థలం ఖరీదులో ప్రభుత్వం 60 శాతం ఖర్చును భరించనుంది.– వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ద్వారా మధ్యతరగతికి ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నారు. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. వీరికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించనున్నారు.– వైఎస్సార్‌ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ద్వారా గతంలో మాదిరిగానే ఏటా రూ.15 వేలు అందిస్తూ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.60 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులైన అక్కచెల్లెమ్మల ఖాతాల్లో క్రమం తప్పకుండా ఈ ఆర్థిక సాయం జమ చేస్తారు.ఆర్యవైశ్యులకు అండగా..ఇప్పటికే ఓసీల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు నిధులను సైతం ఇస్తున్నారు తొలిసారిగా ఆర్య వైశ్యులకు ఒక కార్పొరేషన్‌ను తీసుకొచ్చి అండగా నిలిచారు. ఆర్యవైశ్య సత్రాలను సొంతంగా వారే నిర్వహించే హక్కులను కల్పించారు. ఇంతటి సంక్షేమాన్ని వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగిస్తామంటూ 2024 మేనిఫెస్టో ద్వారా మరోసారి భరోసా ఇచ్చారు.చెప్పినదానికంటే మిన్నగా..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజికవర్గాలకు మాత్రమే కాకుండా ఇతర వర్గాలకు సైతం నవరత్నాలు పథకాలతో డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా ఆర్థిక లబ్ధిని పెద్ద ఎత్తున అందించడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ రికార్డు సృష్టించారు. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాల  అక్కచెల్లెమ్మలను సంక్షేమ పథకాలతో ఆర్థికంగా బలోపేతం చేశారు. ఈ ఐదేళ్లలో ఆయా వర్గాలకు డీబీటీ ద్వారా 1,66,45,078 మందికి రూ.43,132.75 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా 2,00,59,280 మందికి రూ.86,969.93 కోట్లు కలిపి మొత్తం 3,67,04,358 మందికి రూ.1,30,102.68 కోట్లు లబ్ధి చేకూర్చడం విశేషం.కాపుల అభివృద్ధికి..కాపుల సంక్షేమానికి గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నూరు శాతం అమలు చేశారు. మేనిఫేస్టోలో చెప్పినదానికి మించి భారీ ఆర్థిక సాయం అందించారు. ఏడాదికి రూ.2 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు సాయం చేస్తామని చెప్పగా.. ఐదేళ్లలో డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి మొత్తంగా రూ.34,005.12 కోట్లు సాయమందించడం విశేషం. ఇందులో డీబీటీ ద్వారానే 65,34,600 ప్రయోజనాల కింద కాపులకు రూ.26,232.84 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నాన్‌ డీబీటీ కింద మరో రూ.7,772.19 కోట్లు ప్రయోజనాలను కల్పించారు. వాస్తవానికి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కాపుల సంక్షేమానికి కేటాయించింది కేవలం రూ.1,340 కోట్లే.  

AP Politics And Election Live Updates May 2nd
AP Election Updates May 2nd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Andhra Pradesh Election Updates 2nd May..మధ్య తరగతికి మరింత భరోసా.. వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టో7:45 AM, May 2nd, 2024వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టోతో మరోసారి అండగా సీఎం జగన్‌పట్టణ ప్రాంతాల్లోని మధ్య ఆదాయ కుటుంబాలకు సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు123 పట్టణాల్లో ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధిరూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసారూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సహాయంకాపు, ఈబీసీ నేస్తం ద్వారా ఒక్కో కుటుంబానికి ఐదేళ్లలో రూ.60 వేల సాయంప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విదేశీ విద్యా దీవెనతో తోడ్పాటురూ.10 లక్షల వరకు రుణానికి కోర్సు ముగిసే వరకు పూర్తి వడ్డీ చెల్లింపుఆప్కాస్, ఆశ, అంగన్‌వాడీ, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నవరత్న పథకాలుప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాలోనే 60 శాతం ప్రభుత్వ ఖర్చుతో ఇంటి స్థలం ‘భృతి’.. అంతా భ్రాంతి.. నిరుద్యోగులపై చంద్రబాబు మాయా వల7:20 AM, May 2nd, 2024నిరుద్యోగులపై చంద్రబాబు మరోసారి మాయా వలజాబు రావాలంటే బాబు రావాలంటూ 2014 ఎన్నికల్లో ప్రచారంకరపత్రాలు వేసి ఊరూరా పంపిణీ ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ.. అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లపాటు ఆ ఊసేలేదుప్రతిపక్ష నేత అసెంబ్లీలో బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తే అసలా పథకమే లేదన్న అచ్చెన్నఆ ఒత్తిడి తట్టుకోలేక 2017–18 బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి రూ.500 కోట్లు కేటాయింపుఅయినా అమలుచేయని చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ఆరునెలల ముందు ముఖ్యమంత్రి యువ నేస్తం పేరుతో పథకంనెలకు రూ.1,000 చొప్పున ఇస్తామని ప్రకటనసవాలక్ష ఆంక్షలతో కేవలం 12 లక్షల మంది నిరుద్యోగులకు అర్హతకానీ, 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల చివరికి 1.62 లక్షల మంది మాత్రమే అర్హులని తేల్చిన బాబు1.70 కోట్ల నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన బాబుఎన్నికలు రావడంతో మళ్లీ యువతకు గేలం.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలుబాబు గత చరిత్ర చూడండి.. ఆయన్ను నమ్మొద్దంటూ యువతకు విద్యావేత్తలు, మేధావులు హితవు వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం7:00 AM, May 2nd, 2024పాడేరు కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థితో మంతనాలతో స్పష్టీకరణచంద్రబాబు నాయుడుకు మేలు చేయడమే అజెండాఆడియో లీక్‌తో అడ్డంగా దొరికిపోయిన వైనంపాడేరు కాంగ్రెస్‌ టికెట్‌ తొలుత వంతల సుబ్బారావుకుఆ తర్వాత వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిన బుల్లిబాబుకి కేటాయింపుపాడేరులో కాంగ్రెస్‌ రెబల్‌గా వంతల పోటీపోటీ నుంచి తప్పుకోవాలని వంతలను ఆదేశించిన షర్మిలవైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు కోసమే తాను బాధ్యతలు తీసుకున్నట్లు వెల్లడి  పచ్చ మంద కుట్రలతో పెన్షన్‌దారులకు కష్టాలు.. 6:30 AM, May 2nd, 2024చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్‌దారులకు మరిన్ని కష్టాలుబ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వృద్దులు, వికలాంగులువాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఇవ్వడాన్ని అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ఎన్నికల సంఘం ఆదేశాలతో బ్యాంకు ఖాతాలో పెన్షన్ వేసిన ప్రభుత్వండబ్బులు డ్రా చేసుకోవటానికి పెన్షన్‌దారుల అవస్థలునిన్న అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో ఇద్దరు మృతిగత నెలలో 39 మంది వృద్దులు మృతిఇంటికే వచ్చే పెన్షన్ ను అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ వైఖరిపై మండిపడుతున్న పెన్షన్‌దారులు

CM YS Jagan Fires On Chandrababu At Bobbili Eluru Payakaraopeta
ఇవ్వడమే జగన్‌కు తెలుసు: సీఎం జగన్‌

జగన్‌ను చంపేస్తే తప్పేమిటంటున్నాడు..మీ బిడ్డ జగన్‌ను ఓడించలేమని, ఆ పేద అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, వారి కుటుంబ సభ్యులు మోసపోవడానికి సిద్ధంగా లేరని, ఎంత ప్రలోభపెట్టినా తన మాటలు నమ్మట్లేదని గ్రహించిన చంద్రబాబు నోట జగన్‌ను చంపేస్తే ఏమవుతుంది? అన్నమాట వినిపిస్తోంది. నాడు వైఎస్సార్‌ గాల్లో కలిసిపోతాడని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశాడు. నేడు జగన్‌ను చంపేస్తే తప్పేమిటని అంటున్నాడు. రాజకీయాల్లో ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా?– బొబ్బిలి సభలో సీఎం జగన్‌తట్టుకోలేకపోతున్నారు..పేదల గురించి జగన్‌ మాట్లాడుతుంటే పెత్తందారులైన చంద్రబాబు, ఈనాడు, ఆం«ధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు, వదినమ్మకు చాలా బాధగా, విపరీతమైన కోపంగా ఉంటుంది. జగన్‌ ఎప్పుడూ పేదలు.. పేదలు అంటుంటే విని తట్టుకోలేక­పోతున్నారు. ఈ రోజు జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. రాష్ట్రంలో క్లాస్‌ వార్‌ జరుగుతుంది. పేదలు ఒక ఒకవైపు, పెత్తందారులు మరోవైపు ఉన్నారు. కులం పరంగా, ఫలానా పార్టీ పట్ల అభిమానం వల్ల కావొచ్చు.. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంటికి వెళ్లాక మీ కుటుంబానికి ఎవరి వల్ల మంచి జరిగిందో మీ కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని చర్చించండి. ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుందో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా.– ఏలూరు సభలో  సీఎం జగన్‌దీవించండి..బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి చిన్నఅప్పలనాయుడు, విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్‌ యాదవ్, ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నానీని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా.  సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘జగన్‌ ఎలాంటివాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకూ తెలుసు చంద్రబాబూ! జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ నీలా భూములు లాక్కునేవాడు కాదు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అంటే చంద్రబాబుకు తెలియదు. వందేళ్ల క్రితం బ్రిటీష్‌ హయాంలో జరిగిన సర్వే తర్వాత ఇప్పుడు చేపట్టిన సర్వేతో పక్కాగా రికార్డులు సృష్టించి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయడమే దీని ఉద్దేశం. 15 వేల గ్రామ సచివాలయాల్లో 15 వేల మంది సర్వేయర్లను నియమించి ఇలా సర్వే చేసిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. రైతన్నలు కోర్టులు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చి ప్రతి ఒక్కరికీ వారి భూములపై సంపూర్ణ హక్కులు కల్పించాలనే లక్ష్యంతో రీ సర్వే ద్వారా సరిహద్దు రాళ్లను నాటించి రికార్డులు అప్‌డేట్‌ చేసి ఆ పత్రాలన్నీ రిజిస్ట్రేషన్‌ చేసి రైతన్నలకు ఇస్తున్నాం. ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలేగానీ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. మనం అమలు చేసిన పథకాల గురించి చెబుతుంటే చంద్రబాబుకు కోపం వస్తోంది. గత 59 నెలల కాలంలో ఎన్నడూ లేని విప్లవాత్మక సంస్కరణలను మీ బిడ్డ తెచ్చినందుకే ఆయనకు కోపం వస్తోంది. ఈ ఎన్నికల్లో బాబును ఓడించడమంటే పేదలను గెలిపించడమే’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. నేరప్రవృత్తికి చంద్రబాబు నిలువెత్తు నిదర్శనమని, వెన్నుపోట్లు, హత్యలతోనే ఆయన రాజకీయాలు ముడిపడి ఉంటాయని ధ్వజమెత్తారు. సొంతమామ ఎన్టీఆర్‌ను, వంగవీటి రంగాను, పింగళి దశరథరామ్‌ను, ఐఏఎస్‌ అధికారి రాఘవేంద్రరావును కుట్రలతోనే కడ తేర్చారన్నారు. బుధ­వారం విజయనగరం జిల్లా బొబ్బిలి, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, ఏలూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్‌ మాట్లాడారు. ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివిమరో 13 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది. ఇది జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు.. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. రాబోయే ఐదేళ్ల పాటు మీ ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి. ఓటుతో మీ తలరాతలు మారతాయి. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపే, మళ్లీ మోసపోవడమే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. బాబుకు ఓటు వేయడమంటే  కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే. పేదలంటే బాబు ముఠాకు కోపం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీతో నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. మీ బిడ్డ ఇచ్చింది ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలను అమలు చేశాం. నేను వరుసబెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్‌ల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోంది. మీరంతా చూస్తున్నారు కదా ఆ కోపాన్ని.. ఆయనకు మనమీద ఎందుకంత పిచ్చికోపం వస్తోందంటే.. గతంలో ఎన్నడూ చూడని విధంగా మీ బిడ్డ విప్లవాలు తెచ్చాడు కాబట్టే. నేను చెబుతున్న విష­యాలు గతంలో ఎప్పుడైనా అమలు జరిగాయో లేదో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. జగన్‌ను చంపితే ఏమవుతుందంటున్న బాబుమీ జగన్‌ ప్రజలకు ఏం చేశాడో గుర్తుచేస్తూ ప్రచారం చేస్తున్నాడు. చంద్రబాబు మాత్రం ఏం మాట్లాడు­తున్నాడో మీరంతా గమనిస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లా బుచ్చి­రెడ్డి­పాలెంలో ఇదే పెద్దమనిషి రేపు జగన్‌ను చంపితే ఏం జరుగుతుంది? అని వ్యాఖ్యలు చేశాడు. ఆయన మానసిక పరిస్థితి, ఆ ఆలో­చనలు ఎలా ఉన్నాయో గమనించాలని కోరుతున్నా. ఏమయ్యా చంద్రబాబూ..! ప్రజలు నీకు ఎందుకు ఓటు వేయాలి? అని నేను అడుగుతుంటే నీ సమాధానం అదా?అక్కచెల్లెమ్మలే రక్షించుకుంటారు.. అయ్యా చంద్రబాబూ.. నువ్వు అనుకుంటే సరిపోదు. ఈ 59 నెలల్లో మంచి జరిగిన ఆ కోట్ల మంది అక్కచెల్లెమ్మల కుటుంబాలు జగన్‌కు తోడుగా ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ జగన్‌కు తోడుగా, అండగా ఉన్నారయ్యా చంద్రబాబూ! వారి జగన్‌ను వారే రక్షించుకుంటారు. నాకు నీ మాదిరిగా జడ్‌ ప్లస్, జడ్‌ డబుల్‌ ప్లస్‌ సెక్యూరిటీ అక్కర్లేదయ్యా. అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ లంచాలు, వివక్ష లేకుండా ఇచ్చిన రూ.2.70 లక్షల కోట్ల డీబీటీ బటన్‌లే నాకు శ్రీరామరక్ష. పిల్లలు బాగుండాలని ఇచ్చిన అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, అక్కచెల్లెమ్మలు బాగుండాలని ఆరాటపడుతూ అందించిన చేయూత, ఆసరా, సున్నావడ్డీ, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం.. ఇవన్నీ నాకు రక్ష అని చంద్రబాబుకు చెబుతున్నా. నా అవ్వాతాతలకు మంచి చేస్తూ ఇంటివద్దే అందించిన పెన్షన్లతో దేవుడికి చేస్తున్న ప్రార్థనలే నాకు శ్రీరామ రక్ష. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల ప్రార్థనలే వారి బిడ్డ జగన్‌కు శ్రీరామరక్ష. మంచిని అందుకున్న నా రైతన్నలు ఆ భూమాత, పంచ భూతాల సాక్షిగా చేస్తున్న ప్రార్థనే నాకు శ్రీరామ రక్ష. జగన్‌ మార్కు సామాజిక న్యాయంఅసెంబ్లీ, ఎంపీ సీట్లు కలిపి మొత్తం 200 స్థానాలకుగానూ 100 స్థానాల్లో నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు,  మైనార్టీలకు టికెట్లు ఇచ్చాం. మంత్రి పదవుల్లో ఏకంగా 68 శాతం నా ఎస్సీ, ఎస్టీ,  బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటే నాలుగు పదవులు ఆ వర్గాలకే కేటాయించి గౌరవించాం. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు వారికే కల్పిస్తూ చట్టం తెచ్చాం. ఇంత సామాజిక న్యాయం, తోడుగా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? వలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా రెండు బటన్లు ఫ్యాను గుర్తు మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాల్లో గెలిపించాలి. మీ అందరికీ మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌ లోనే ఉండాలి. బాబు వ్యాఖ్యలు నేరప్రవృత్తికి నిదర్శనంఆ రోజు నా తండ్రి రాజశేఖరరెడ్డి చేస్తున్న మంచి పనులు, ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అక్కసుతో అసెంబ్లీ సాక్షిగా నాన్ననుద్దేశించి ‘నువ్వు ఆ గాలిలోనే కలిసిపోతావ్‌...!’ అన్న నీ వ్యాఖ్యలను నేను ఎప్పటికీ మర్చిపోలేను చంద్రబాబూ. నాడు నా తండ్రిని, నేడు నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక నువ్వు మాట్లాడుతున్న మాటలు నీ దిగజారుడుతనానికి, నీ నేర ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి.పేదలకు పథకాలు అందాలా.. లేదా?చంద్రబాబును అడుగుతున్నా.. ఒక ముఖ్యమంత్రి, ఒక నిజమైన నాయకుడు, ఒక నిజమైన లీడర్‌ రాష్ట్రంలో 90 శాతం మంది పేదలకు ఈ రోజు మంచి చేయడం కొనసాగాలా.. వద్దా? ఎవరు మేలు చేశారు? నిజమైన నాయకుడు ఎవరో ఆలోచన చేయాలని అందరినీ కోరుతున్నా. రాష్ట్రంలో తెల్లరేషన్‌ కార్డులున్న కుటుంబాలు 1.44 కోట్లు. అంటే జనాభాలో 90 శాతం. వీరందరూ పేదలు కాదా? వీరికి పథకాలు అందాలా? లేదా? ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులున్న వారు జనాభాలో 95 శాతం ఉన్నారు. వీరికి పథకాలు అందాలా లేదా? ఉన్నత చదువులు చదువుతున్న 93 శాతం మందికి పూర్తి ఫీజుల చెల్లిస్తూ విద్యాదీవెన, ఖర్చులకు వసతి దీవెన అందాలా.. లేదా? పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న నా అక్కచెల్లెమ్మలు 1.05 కోట్ల మంది పేదలు కాదా? వీరందరికీ పథకాలు అందాలా.. లేదా? రాష్ట్రంలో అవ్వా­తాతలు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి అక్కలు 66 లక్షల మందికిపైగా పెన్షన్లు తీసుకుంటున్నారు. రైతు భరోసాతో 55 లక్షల మంది రైతన్నలకు అండగా నిలిచాం. మరో 60 లక్షల మంది అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన తీసుకుంటున్నారు. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చి 22 లక్షల గృహ నిర్మాణాలు చేపట్టాం. ఇప్పుడు చెప్పండి.. వీరంతా పేదలు కాదా? వీరికి పథకాలు అందాలా లేదా?ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ విషయంలో దుష్ప్రచారం జరుగుతోంది. జగన్‌ మీ భూములు కాజేస్తాడంటూ ప్రతి ఒక్కరికీ మెసేజ్‌లు పంపుతూ, ఫోన్లు చేసి చెబుతున్నారు. అయ్యా చంద్రబాబూ.. జగన్‌ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకూ తెలుసు. జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ నీలా భూములు లాక్కునేవాడు కాదు– పాయకరావుపేట సభలో సీఎం జగన్‌మీ బిడ్డ తెచ్చిన కొన్ని విప్లవాలివీ..⇒ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే రూ.3 వేల పెన్షన్‌ కానుక విప్లవమా? కాదా?⇒ గవర్నమెంట్‌ బడుల్లో నాడు–నేడు, ఇంగ్లీష్‌ మీడియం, బడి తెరిచే సమయానికే విద్యా­కానుక, బైజూస్‌ కంటెంట్, 3 తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, సబ్జెక్ట్‌ టీచర్లు, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, 6వ తరగతి నుంచి డిజిటల్‌ బోధన, ఐఎఫ్‌పీలు లాంటివి విప్లవమా? కాదా?⇒ తొలిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్యువల్‌ టెక్ట్స్‌బుక్స్, పూర్తి ఫీజులు చెల్లిస్తూ ఇంజనీరింగ్, డాక్టర్, డిగ్రీ లాంటి ఉన్నత చదువులు అభ్యసించే 93శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అంతర్జాతీయ వర్సిటీలు అందించే ఆన్‌లైన్‌ సర్టిఫైడ్‌ కోర్సులను మన కరిక్యులమ్‌లో భాగం చేయడం లాంటివి విప్లవాలు కాదా?⇒ మీ పిల్లలను బడికి పంపించండమ్మా.. మీకు తోడుగా మీబిడ్డ ఉన్నాడంటూ అమ్మఒడి అందిం­చడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? ⇒ అక్కచెల్లెమ్మలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయూత, కాపునేస్తం, సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, వైఎస్సార్‌ ఆసరా,  సున్నా­వడ్డీ­తో­­పాటు 31లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరిటే రిజిస్ట్రేషన్, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, గ్రామంలోనే మహిళా పోలీస్, భద్రత కోసం దిశ యాప్, నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది మీ జగన్‌ కాదా? ఇవన్నీ విప్లవాలు అవునా? కాదా? ⇒ మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఆర్బీకేలు, ఈ–క్రాప్, ఉచిత పంటల బీమా, పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, నష్టపోతే సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఆర్బీకేల ద్వారా మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు, జీఎల్‌టీ, ఆక్వా రైతులకు రూపా­యి­న్నరకే కరెంట్, ఆయిల్‌పామ్‌ రైతులకు మెరుగైన ధర ఇచ్చిందెవరు? ఇవన్నీ విప్లవాలు కాదా?⇒ వైద్యం కోసం అప్పులపాలు కాకుండా విస్తరించిన ఆరోగ్యశ్రీతో రూ.25 లక్షలదాకా ఉచిత వైద్యం, ఆపరేషన్‌ తరువాత విశ్రాంతి సమ­యంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా ఆరోగ్య ఆసరా, మన గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష లాంటివి అమలు చేసింది మీ బిడ్డ పాలనలో కాదా? ఇవన్నీ వైద్య రంగంలో విప్లవాలు కాదా? ⇒ మత్స్యకార భరోసా, నేతన్ననేస్తం, వాహన­మి­త్ర, చేదోడు, తోడు, ఎంఎస్‌ఎంఈలకు సంపూర్ణ మద్దతు, లా నేస్తం లాంటివి తెచ్చిందెవరు?⇒ గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఈరోజు ఊరిలోకి అడుగుపెట్టిన వెంటనే గ్రామ సచివాలయం కనిపిస్తోంది. ఏకంగా 600 రకాల సేవలు మన ఇంటివద్దే అందుతు­న్నాయి. వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ప్రతి 60–70 ఇళ్లకు పెన్షన్‌ నుంచి పౌరసేవలు, పథకాలు, రేషన్‌ దాకా డోర్‌ డెలివరీ అవుతు­న్నాయి. అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకేస్తే విలేజ్‌ క్లినిక్, నాడు–నేడుతో మారిన ఇంగ్లీష్‌ మీడియం బడులు, గ్రామానికే ఫైబర్‌ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ గతంలో ఉన్నాయా? ⇒ మీ బిడ్డ ప్రభుత్వం రాకముందు గవర్నమెంట్‌ ఇచ్చే డబ్బులు లంచాలు, తిరుగుళ్లు లేకుండా నేరుగా మీ చేతికే అందుతాయంటే ఎవరైనా నమ్మేవారా? నా అక్కచెల్లెమ్మలు, వాళ్ల కుటుంబాలు, పిల్లలు బాగుండాలని 130 సార్లు బటన్‌ నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు పారదర్శకంగా అందించడం ఓ విప్లవాత్మక చరిత్ర కాదా?అబద్ధాలకు రెక్కలు...చంద్రబాబు తన అబద్ధాలు, మోసాలకు రెక్కలు కడుతున్నాడు. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్‌ను అడ్డుకుని మనపై నెపం వేస్తున్నాడు. ఏ రోజైనా ఆయన అవ్వాతాతల బాధలు, కష్టాలను పట్టించుకున్నాడా? ఏనాడైనా ఇంటికే పెన్షన్‌ ఇచ్చాడా? తన మనిషి నిమ్మగడ్డ రమేశ్‌తో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాయించి ఇంటివద్దే అందిస్తున్న పెన్షన్లను అడ్డుకున్నాడు. ఆ అవ్వాతాతలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంతో మీబిడ్డపై నెపం మోపుతున్నాడు.ప్రపంచంలో ఎవరైనా నమ్ముతారా?⇒ 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్క మంచి పనిగానీ, పథకంగానీ గుర్తుకొస్తుందా? ఆ పెద్దమనిషి తన జీవిత కాలంలో ఏ రోజూ పేదలకు మంచి చేసిందిలేదు. 2014లోనూ ఇదే మాదిరిగా హామీలిచ్చి వంచించాడు. ఒక్కసారి వాటిని గుర్తుచేసుకుంటే ప్రపంచంలో ఎవరైనా చంద్రబాబును నమ్ముతారేమో మీరే చెప్పండి.⇒ రైతులకు రూ.87,612 కోట్ల రుణమాఫీ జరిగిందా? ⇒ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానంటూ ఏకంగా రూ.14,205కోట్లు  ఎగనామం పెట్టాడు. ⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు కాదు కదా ఎవరికైనా ఒక్క రూపాయి అయినా బ్యాంకులో జమ చేశాడా? ⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఏ ఒక్క ఇంటికైనా 60 నెలల్లో రూ.2వేలు చొప్పున రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు అన్నాడు. ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? ⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత పవర్‌ లూమ్స్‌ మాఫీ అన్నాడు. జరిగిందా? ⇒ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాడా? ⇒ సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మాణం జరిగిందా? మన బొబ్బిలి, పాయకరావుపేటలో ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ⇒ ప్రత్యేక హోదా తీసుకురాకపోగా అమ్మేశాడు. ⇒ ఇప్పుడు మళ్లీ మోసగించేందుకు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు అంటూ నమ్మబలుకుతున్నారు. 

TDP Chandrababu Fake Promise To Unemployed Youth
‘భృతి’.. అంతా భ్రాంతి.. నిరుద్యోగులపై చంద్రబాబు మాయా వల

సాక్షి, అమరావతి:  ‘‘జాబు రావాలంటే బాబు రావాలి.. తమ్ముళ్లూ మీ కలలు సాకా­రం చేయబోతున్నా.. ఇంటికొక ఉద్యోగం ఇస్తా.. ఉద్యో­గం ఇవ్వకపోతే ఉపాధి కల్పిస్తా.. మీరేమీ చదువుకోకపోయినా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2 వేలిస్తా’’..  ఈ హామీ గుర్తుందా? 2014 ఎన్నికల్లో చంద్రబాబు సంతకంతో కూడిన కరపత్రాన్ని తెలుగుదేశం పార్టీ ఊరూరా పంచుతూ ప్రచారం చేసింది. సీన్‌ కట్‌చేస్తే ఆ ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. చెప్పినట్లుగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలుచేశారా అంటే అనేకానేక హామీల్లాగే అదీ బాబు అటకెక్కించేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి హామీతోనే ఆయన మరోసారి యువతకు వల విసురుతున్నారు. ఆయన మాయలో పడొద్దని.. భవిష్య­త్తును నాశనం చేసుకోవద్దని మేధావులు, విద్యావేత్తలు యువతకు సూచిస్తున్నారు.  నిరుద్యోగ భృతి ఇవ్వబోమన్న అచ్చెన్న.. ఇక అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్ల పాటు చంద్రబాబు ఆ ఊసే ఎత్తలేదు. కానీ, నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మాత్రం సందర్భం వచ్చిన ప్రతీసారి ఈ అంశంపై చంద్రబాబు సర్కారును నిలదీస్తూనే ఉన్నారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తానని యువతకు మాటిచ్చి ఎలా విస్మరిస్తారంటూ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నకు నిరుద్యోగ భృతి అనే పథకమేలేదని, ఈ ప్రశ్న ఉత్పన్నమే కాదంటూ నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చన్నాయుడు అసెంబ్లీలో అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. శిక్షణనిచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇవ్వబోమని, బాబు వస్తే జాబు వస్తుందనే నినాదంతో ఎన్నికల్లో వెళ్లిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. అయినా, నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో జగన్‌ పట్టువిడవకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుండడంతో 2017–18లో బడ్జెట్‌లో టీడీపీ ప్రభుత్వం కంటితుడుపుగా రూ.500 కోట్లు కేటాయించింది. దీనిపై జగన్‌ మండిపడుతూ.. జాబు రావాలంటే బాబు రావాలని, జాబు ఇవ్వకపోతే ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ ఎన్నికల ముందు ఇంటింటా ప్రచారం చేసి ఇప్పుడు గొప్పగా రూ.500 కోట్లు కేటాయించామని చెప్పడం నిరుద్యోగులను నిలువునా మోసం చేయడమేనని ఉతికి ఆరేశారు. అంతేకాక.. రాష్ట్రంలో 1.75 కోట్ల కుటుంబాలున్నాయని, ఒక్కో కుటుంబానికి నెలకు రెండువేల చొప్పున భృతి ఇవ్వాలని.. ఇందుకు నెలకు రూ.3,500 కోట్లు అవసరమని, అలాగే ఏడాదికి రూ.40 వేల కోట్లు అవసరమైతే రూ.500 కోట్లు ఏ మూలకు సరిపోతాయంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్‌ జగన్‌ చీల్చిచెండాడారు.  ఉన్న ఉద్యోగాలకు బాబు ఎసరు.. ఇలా నిరుద్యోగ భృతి ఇస్తానంటూ నాలుగున్నరేళ్ల పాటు ఎగమనామం పెట్టి ఎన్నికల ముందు ఆర్నెల్లపాటు యువతను మోసం చేయడానికి కంటితుడుపు చర్యగా ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో చంద్రబాబు ఎత్తుగడ వేశారు. కానీ, నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఆరోగ్య మిత్రలను, ఫీల్డ్‌ అసిస్టెంట్లను, గోపాల మిత్రలను ఉద్యోగాల నుంచి చంద్రబాబు తొలగించారు. దీంతో.. మళ్లీ ఇప్పుడు ఎన్నికల ముందు యువతను, నిరుద్యోగులను మోసం చేయడానికి చంద్రబాబు కుయుక్తులు, మోసపూరిత ప్రకటనలతో వస్తున్నారు తస్మాత్‌ జాగ్రత్త నిరుద్యోగులూ.. అంటూ మేధావులు, విద్యావేత్తలు యువతను అప్రమత్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతిపై 2014 ఎన్నికల ముందు ఇంటింటా ప్రచారం చేసి అధికారం దక్కాక ఎలా మోసం చేశారో అచ్చు అలాగే చంద్రబాబు మళ్లీ యువతకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి అంటూ అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నారని.. చంద్రబాబు వలలో పడి మరోసారి మోసపోవద్దని వారు సూచిస్తున్నారు.వైఎస్‌ జగన్‌ ఒత్తిడితో.. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు.. ఇక 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ చంద్రబాబు పైసా ఖర్చు పెట్టలేదు. ప్రతిపక్ష నేత జగన్‌ తన ఒత్తిడి కొనసాగిస్తుండడంతో ఇక 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నాలుగు నెలల కోసం నిరుద్యోగ భృతి కాదు ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగులకు నెలకు రూ.1,000 ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది. ఈ ఉపసంఘం సవాలక్ష ఆంక్షలు విధించి నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను భారీగా కుదించింది.  ⇒ టెన్త్, ఇంటర్‌ చదివిన వారు అనర్హులని ఆంక్షలు విధించింది.  ⇒ 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వారు డిగ్రీ చదివిన వారికే భృతి వర్తిస్తుందని, దారిద్య్ర రేఖకు దిగువనున్న వారు.. తెల్ల రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ఓటరు ఐడీ కార్డు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని షరతులు విధించింది.  ⇒ దీంతో వచ్చిన దరఖాస్తుల్లో 12 లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతికి అర్హులుగా తేల్చింది.  ⇒ ఆ తరువాత అది పది లక్షలు, మళ్లీ మళ్లీ వడపోత తర్వాత 2.10 లక్షల మందే అర్హులంటూ వెల్లడించి మళ్లీ దానిని 1.62 లక్షలకు కుదించింది.  ⇒ అనంతరం 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల చేసి ఈ–కేవైసీ మెలిక పెట్టింది.  ⇒ అలాగే, ప్రతినెలా వేలిముద్ర వేస్తేనే నిరుద్యోగ భృతి అంటూ ఆంక్షలు పెట్టుకుంటూ పోయి ఎన్నికల వరకు తాత్సారం చేశారు. 

Israel-Hamas war: Protesters clash on UCLA campus
Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలో ఉద్రిక్తత

లాస్‌ఏంజెలిస్‌: పాలస్తీనా–ఇజ్రాయెల్‌ రగడ అమెరికాలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. లాస్‌ ఏంజెలిస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియాలో పాలస్తీనా, ఇజ్రాయెల్‌ అనుకూల వర్గాల విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బైడెన్‌ ప్రభుత్వ ఇజ్రాయెల్‌ అనుకూల విధానాలను నిరసిస్తూ పాలస్తీనా వర్గం వర్సిటీలో టెంట్లు వేసుకుని నిరసనలను సాగిస్తున్న విషయం తెలిసిందే. హెల్మెట్లు, మాస్కులు ధరించిన కొందరు కర్రలు చేతబట్టుకుని మంగళవారం అర్ధరాత్రి టెంట్లపైకి దాడికి దిగారు. బాణసంచా కూడా కాల్చినట్టు లాస్‌ఏంజెలెస్‌ టైమ్స్‌ తెలిపింది. ఈ సందర్భంగా ఇరువర్గాల వారు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కుర్చీలతోపాటు అందిన వస్తువులను విసురుకున్నారు. వర్సిటీని పాలస్తీనా అనుకూల వర్గాలు ఆక్రమించుకుని తమను లోపలికి రానివ్వడం లేదన్న ఇజ్రాయెల్‌ అనుకూల విద్యార్థుల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. హింసాత్మక ఘటనల కారణంగా వర్సిటీలో బుధవారం తరగతులు రద్దయ్యాయి. సోమవారం కొలంబియా వర్సిటీ కూడా ఈ ఘర్షణలకు వేదికవడం తెలిసిందే. హామిల్టన్‌ హాల్‌లో దాదాపు 20 గంటలపాటు తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులను పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు. వర్సిటీతోపాటు సిటీ కాలేజీలో ఆందోళనలకు దిగిన దాదాపు 300 మందిని అరెస్టు చేశారు. నార్తర్న్‌ ఆరిజోనా యూనివర్సిటీలో టెంట్లు వేసి నిరసన సాగిస్తున్న పాలస్తీనా అనుకూల విద్యార్థులను పోలీసులు ఖాళీ చేయించారు. కొద్ది వారాలుగా అమెరికాలో పాలస్తీనా, ఇజ్రాయెల్‌ విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు వర్సిటీలకు విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్‌ ఐలాండ్స్‌ క్యాంపస్‌లో ఆందోళన చేస్తున్న పాలస్తీనా అనుకూల విద్యార్థి వర్గంతో బ్రౌన్‌ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే అక్టోబర్‌ నుంచి వర్సిటీలోకి ఇజ్రాయెల్‌ వ్యక్తుల పెట్టుబడులను స్వీకరించరాదనేది వారిలో ప్రధాన షరతు. ఆందోళనకారుల డిమాండ్‌కు ఇలా ఒక యూనివర్సిటీ తలొగ్గడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారని చెబుతున్నారు! 

AP Politics: Babu Dirty Politics PCC Sharmila Audio Clip Viral
ఆడియోతో అడ్డంగా దొరికిపోయిన షర్మిల

అల్లూరి,సాక్షి: వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే విపక్షాల కుట్రగా కనిపిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్‌లో ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల కూడా ఈ చీఫ్‌ ట్రిక్స్‌లో భాగం అయ్యారు. తాజాగా ఆమె ఆడియో క్లిప్‌ బయటకు రావడంతో  ఆ కుట్ర బయటకు వచ్చింది.అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున బుల్లిబాబు పోటీ చేస్తున్నాడు. అయితే ఈయన అభ్యర్థిత్వం కంటే ముందు ఇక్కడ రేసులో ఉంది వంతల సుబ్బారావు. బుల్లిబాబు వైఎస్సార్‌సీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరారు. చేరి చేరగానే బుల్లిబాబునే పాడేరు అభ్యర్థిగా షర్మిల ప్రకటించారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న సుబ్బారావు కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీలకే కాకుండా.. ఓటు బ్యాంకు ఏనాడో కనుమరుగైన కాంగ్రెస్‌లోనూ రెబల్స్‌ పోటు ఆసక్తికర చర్చకు దారి తీసింది. దీంతో వంతల సుబ్బారావుతో రాయబారానికి దిగారు.  మీరు సొంత అన్నమాదిరి అని, అర్థం చేసుకోవాలని, తర్వాతిసారి చూద్దాం అంటూ బతిమాలాడారామె. అయితే.. ఏనాడూ జెండా మోయనోడికి టికెట్‌ ఇవ్వడం తనను బాధించిందని, పైగా తనతో మాట కూడా చెప్పకుండా వేల మంది ముందు బుల్లిబాబును అభ్యర్థిగా ప్రకటించడం తనను నిరాశ పర్చిందని షర్మిలతో ఆయన అన్నారు.కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుతో పాటు వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు కలిసి వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు షర్మిల వంతల సుబ్బారావుకు స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే కాంగ్రెస్‌ గురించి మరిచిపోవాలంటూ బెదిరింపు స్వరంతో కోరారామె. చివర్లో.. కాంగ్రెస్‌కు డ్యామేజ్‌ చేయొద్దంటూ షర్మిల కోరగా.. తన భవిష్యత్తు ఆల్రెడీ డ్యామేజ్‌ అయ్యిందని ఆయన బదులిచ్చారు.

Lok sabha elections 2024: BJP is failing to refute the allegations of the opposition
Lok sabha elections 2024: కమలానికి పెనుసవాళ్లు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా కృషిచేస్తున్న కమల దళానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనా«థ్‌ తదితర కీలక నేతలు సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు విపక్షం నుంచి ఎదురుదాడి, మిత్రపక్షాల కారణంగా తలెత్తుతున్న చిక్కులు, కొన్ని వర్గాల్లో నానాటికీ పెరుగుతున్న అసంతృప్తి వంటివి బీజేపీలో అలజడి సృష్టిస్తున్నాయి.  రిజర్వేషన్ల రద్దు అంశంపై రగడ  ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఇప్పటిదాకా సొంతంగా 432 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. మరో పది నుంచి పదిహేను మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. మొత్తం 445 మంది అభ్యర్థులను బరిలో నిలిపినా, 370 సీట్ల లక్ష్యం సాధించాలంటే 80 శాతానికి పైగా స్థానాల్లో కచి్చతంగా నెగ్గాల్సి ఉంటుంది. కానీ, అందుకు ప్రతిబంధకాలు లేకపోలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. రిజర్వేషన్లు, అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకమని పదేపదే ఆరోపిస్తున్నాయి. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక, ఆప్‌ నేత సంజయ్‌ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్, ఆర్‌జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్‌ రిజర్వేషన్లు, రాజ్యాంగంపై బీజేపీని ఇరుకున పెడుతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్‌ ఇటీవల వైరల్‌ చేసిన అమిత్‌ షా డీప్‌ఫేక్‌ వీడియో తర్వాత రిజర్వేషన్ల రద్దు అంశంపై జనంలో చర్చ మొదలైంది. రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని, అలాంటి ఆలోచనే లేదని నరేంద్ర మోదీ, అమిత్‌ షా ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇస్తున్నప్పటికీ, దేశంలో 80 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల్లో అనుమానాలు పూర్తిగా తొలగిపోవడం లేదు. మరో ఐదు విడతల్లో 350కి పైగా స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. రిజర్వేషన్ల రద్దు వ్యవహారం ఓటర్లపై తప్పనిసరిగా ప్రభావం చూపుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.  అందుకేనా 400 సీట్లు?   మళ్లీ బీజేపీని గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చేయడం ఖాయం అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. రాజ్యాంగంతోపాటు కీలకమైన చట్టాలను మార్చడానికే ‘అబ్‌కీ బార్‌ చార్‌ సౌ పార్‌’ నినాదాన్ని బీజేపీ తెరపైకి తెచి్చందని కాంగెరస్‌  అధ్యక్షుడు ఖర్గే సహా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. న్యాయం, సమానత్వం, పౌర హక్కులు, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ద్వేషిస్తోందని, నియంతృత్వ పాలన తీసుకురావడమే ఆ పార్టీ లక్ష్యమని విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపైనా ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాల్సి వచి్చంది. సాక్షాత్తూ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ దిగివచి్చనా రాజ్యాంగాన్ని మార్చలేరని ఆయన పలు సభల్లో చెప్పారు. అయినప్పటికీ రాజ్యాంగ మార్పుపై బీజేపీ నేతలు అనంతకుమార్‌ హెగ్డే, అరుణ్‌ గోవిల్‌ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి సంకటంగా మారాయి. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం తమకు లేదని మోదీ పదేపదే స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా విపక్షాల దాడిని సమర్థంగా తిప్పికొట్టడంలో బీజేపీ విఫలమవుతోంది. రాజ్యాంగం మార్పుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొన్ని వర్గాల ప్రజలు నమ్ముతున్నట్లే కనిపిస్తోంది. ఇంకోవైపు రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో తమ జనాభా ఉన్న స్థానాల్లోనూ తమ వర్గం వారికి టిక్కెట్లు ఇవ్వలేదని రాజ్‌పుత్‌లు బీజేపీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. మహాపంచాయతీలు నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా తీర్మానాలు         చేస్తున్నారు. ప్రజ్వల్‌ రేవణ్ణ వీడియోలతో వివాదం  కర్ణాటకలో బీజేపీ మిత్రపక్షమైన జేడీ(ఎస్‌) సిట్టింగ్‌ ఎంపీ,  మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సంబంధిత వీడియోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కర్ణాటకలో రెండో విడత పోలింగ్‌కు రెండు రోజుల ముందు ప్రజ్వల్‌ రేవణ్ణ వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతోంది. ప్రజ్వల్‌ రేవణ్ణను జేడీ(ఎస్‌) నుంచి బహిష్కరించినప్పటికీ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు.  

SS Rajamouli Speech at Krishnamma Pre Release Event
కృష్ణమ్మతో సత్యదేవ్‌ స్టార్‌ అవుతాడు: రాజమౌళి

‘‘చిన్న చిన్న హావభావాలతో అన్ని రకాల నటనని చూపించగల నటుల్లో సత్యదేవ్‌ కూడా ఒకడు. తను మంచి నటుడు అని ఇటు ఇండస్ట్రీకి అటు ప్రేక్షకులకు తెలుసు. కానీ, ఒక్క సినిమా సడెన్‌గా స్టార్‌ని  చేస్తుంది.. నాకు తెలిసి ‘కృష్ణమ్మ’ మూవీ తనని స్టార్‌ చేస్తుందనుకుంటున్నాను’’ అని దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి అన్నారు. సత్యదేవ్, అతీరా రాజ్‌ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకుడు. డైరెక్టర్‌ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్‌ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్‌ షో ఎంటర్‌టై¯Œ మెంట్స్‌ విడుదల చేస్తున్నాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన  ‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ– ‘‘కృష్ణమ్మ’ టైటిల్‌ నాతో పాటు అందర్నీ ఆకర్షించిందంటే కారణం కొరటాల శివగారు సమర్పించడమే. ఆయన సమర్పిస్తున్న తొలి సినిమాతోనే పెద్ద విజయం  అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ టీజర్, ట్రైలర్‌ చూస్తే సినిమాని కచ్చితంగా థియేటర్లోనే చూడాలనిపించేలా తీశాడు  గోపాలకృష్ణ. కాలభైరవని చూస్తుంటే గర్వంగా ఉంది. ‘కృష్ణమ్మ’ టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.  కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘గోపాల్‌ చెప్పిన ‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో నేను కూడా భాగస్వామ్యం అవుతానని అడిగాను.. అంతే కానీ, ఈ కథలో నేను కల్పించుకోలేదు. నేను చూసిన మంచి నటుల్లో సత్యదేవ్‌ ఒకడు.. మంచి ప్రతిభ ఉంది. ఈ మూవీతో తన కెరీర్‌ మరో మెట్టు పైకి ఎక్కుతుందని నమ్ముతున్నాను. అలాగే నిర్మాత కృష్ణగారికి పెద్ద విజయం రావాలి’’ అన్నారు. ‘‘కొరటాల శివగారు తీసే సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఆయన సమర్పిస్తున్న ‘కృష్ణమ్మ’ కూడా అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు గోపీచంద్‌ మలినేని.‘‘సత్యదేవ్‌ హీరోగా బిజీగా ఉన్నా ‘సరిలేరు నీకెవ్వరు’లో ఓ చిన్న పాత్ర చేశాడు.. ఎందుకంటే సినిమా అంటే  అంత గౌరవం. ఈ వేసవిలో ‘కృష్ణమ్మ’ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అనిల్‌ రావిపూడి. సత్యదేవ్‌ మాట్లాడుతూ– ‘‘రాజమౌళి, కొరటాల శివ, గోపీచంద్‌ మలినేని, అనిల్‌ రావిపూడిగార్లు ఉన్న ఈ వేదికపై నేను మాట్లాడటం ప్రపంచంలోనే ఖరీదైన వేదికగా భావిస్తున్నాను. ‘కృష్ణమ్మ’ విడుదల తర్వాత నేను బయట ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు ఈ మూవీ గురించే నాతో మాట్లాడతారు.. అందుకు నాదీ గ్యారంటీ. క్రికెట్‌కి సచిన్‌ టెండూల్కర్‌గారు ఎలాగో.. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి రాజమౌళి సార్‌ అలాగే. తెలుగు సినిమాని (ఆర్‌ఆర్‌ఆర్‌) అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి.. ఆస్కార్‌ తీసుకొచ్చారు’’ అన్నారు. వీవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ–  ‘‘కృష్ణమ్మ’ కథ నచ్చడంతో మమ్మల్ని ్ర΄ోత్సహించిన కొరటాలశివగారికి థ్యాంక్స్‌. మా ట్రైలర్‌ నచ్చిన వారు మూవీని థియేటర్లో చూడండి’’అన్నారు. 

Punjab Kings won by 7 wickets on chennai
‘కింగ్స్‌’ పోరులో పంజాబ్‌దే గెలుపు

చెన్నై: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన పంజాబ్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ టోర్నీలో మరో సంచలనం సృష్టించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును వారి సొంతగడ్డపైనే ఓడించింది. గత శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన పంజాబ్‌ కింగ్స్‌ ఈ మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంది. బుధవారం ఎంఎ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 7 వికెట్లతో గెలిచింది. పంజాబ్‌ కింగ్స్‌ కెపె్టన్‌ స్యామ్‌ కరన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (48 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో రాణించాడు. పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్నర్లు హర్‌ప్రీత్‌ బ్రార్‌ (2/17), రాహుల్‌ చహర్‌ (2/16) చెన్నై జట్టును కట్టడి చేశారు. అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి విజయం సాధించింది. బెయిర్‌స్టో (30 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్‌), రిలీ రోసో (23 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి రెండో వికెట్‌కు 37 బంతుల్లో 64 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక శశాంక్‌ సింగ్‌ (26 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌), స్యామ్‌ కరన్‌ (20 బంతుల్లో 26 నాటౌట్‌; 3 ఫోర్లు) పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చారు. గత మూడు సీజన్‌లలో చెన్నైపై పంజాబ్‌ కింగ్స్‌కిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. 2022లో చెన్నైతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన పంజాబ్‌ 2023లో చెన్నైలోనే జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో గెలిచింది.  కట్టడి చేసిన బ్రార్, చహర్‌ చెన్నైకు ఓపెనర్లు రుతురాజ్, రహానే శుభారంభాన్నిచ్చారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి చెన్నై వికెట్‌ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. పవర్‌ప్లే ముగిశాక చెన్నై ఇన్నింగ్స్‌ తడబడింది. పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్నర్లు హర్‌ప్రీత్‌ బ్రార్, రాహుల్‌ చహర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో బ్రార్‌ మూడు బంతుల తేడాలో రహానే, శివమ్‌ దూబే (0)లను పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత పదో ఓవర్లో జడేజాను చహర్‌ అవుట్‌ చేశాడు. దాంతో చెన్నై జట్టు 64/0 నుంచి 70/3తో కష్టాల్లో పడింది. బ్రార్, చహర్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డ చెన్నై జట్టు బ్యాటర్లు వరుసగా ఎనిమిది ఓవర్లపాటు ఒక్క బౌండరీ కూడా బాదలేకపోయారు. రబడ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ రెండో బంతికి రిజ్వీ బౌండరీ కొట్టి ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. స్యామ్‌ కరన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ రెండో బంతిని బౌండరీ దాటించిన రుతురాజ్, మూడో బంతికి సిక్స్‌ కొట్టి 44 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్‌ చివరి బంతిని రుతురాజ్‌ సిక్స్‌గా మలచడంతో ఈ ఓవర్లో చెన్నైకి 20 పరుగులు వచ్చాయి. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేసిన అర్‌‡్షదీప్‌ లయ తప్పి మూడు వైడ్‌లు వేసినా రుతురాజ్‌ను బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత అర్‌‡్షదీప్‌ ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లోనూ రెండు వైడ్‌లతో కలిపి ఎనిమిది బంతులు వేశాడు. ఈ ఓవర్లో ధోని ఒక ఫోర్, ఒక సిక్స్‌ కొట్టి చివరి బంతికి రనౌట్‌ అయ్యాడు. పంజాబ్‌ స్పిన్నర్లు బ్రార్, చహర్‌ ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం.  స్కోరు వివరాలు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: అజింక్య రహానే (సి) రోసో (బి) హర్‌ప్రీత్‌ బ్రార్‌ 29; రుతురాజ్‌ గైక్వాడ్‌ (బి) అర్‌‡్షదీప్‌ సింగ్‌ 62; శివమ్‌ దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్‌ప్రీత్‌ బ్రార్‌ 0; రవీంద్ర జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) రాహుల్‌ చహర్‌ 2; సమీర్‌ రిజ్వీ (సి) హర్షల్‌ పటేల్‌ (బి) రబడ 21; మొయిన్‌ అలీ (బి) రాహుల్‌ చహర్‌ 15; ధోని (రనౌట్‌) 14; డరైల్‌ మిచెల్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–64, 2–65, 3–70, 4–107, 5–145,  6–147, 7–162. బౌలింగ్‌: రబడ 4–0–23–1, అర్‌‡్షదీప్‌ సింగ్‌ 4–0–52–1, స్యామ్‌ కరన్‌ 3–0–37–0, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4–0–17–2, రాహుల్‌ చహర్‌ 4–0–16–2, హర్షల్‌ పటేల్‌ 1–0–12–0. పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (సి) రుతురాజ్‌ (బి) గ్లీసన్‌ 13; బెయిర్‌స్టో (సి) ధోని (బి) దూబే 46; రిలీ రోసో (బి) శార్దుల్‌ 43; శశాంక్‌ సింగ్‌ (నాటౌట్‌) 25; స్యామ్‌ కరన్‌ (నాటౌట్‌) 26; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (17.5 ఓవర్లలో 3 వికెట్లకు) 163; వికెట్ల పతనం: 1–19, 2–83, 3–113. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 0.2–0–4–0, శార్దుల్‌ ఠాకూర్‌ 3.4–0–48–1, గ్లీసన్‌ 3.5–0–30–1, ముస్తఫిజుర్‌ 4–1–22–0, జడేజా 3–0–22–0, మొయిన్‌ అలీ 2–0–22–0, శివమ్‌ దూబే 1–0–14–1. ఐపీఎల్‌లో నేడుహైదరాబాద్‌  X  రాజస్తాన్‌వేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

Lok sabha elections 2024: Auto mobile sales growth flat in April due to high base effect, elections
ఏప్రిల్‌లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే

న్యూఢిల్లీ: దేశవాప్తంగా ఏప్రిల్‌లో వాహన విక్రయాలు అంతంత మాత్రంగా సాగాయి. 2024–25 తొలి నెలలో మొత్తం 3.38 లక్షల ఆటో మొబైల్‌ అమ్మకాలు జరిగాయి. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 3.32 లక్షల యూనిట్లతో పోలిస్తే 1.77% మాత్రమే అధికంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిమాండ్‌ తగ్గడం, అంతకు ముందు రెండేళ్ల అధిక బేస్‌ ప్రభావం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.  ⇒ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఏప్రిల్‌లో 168,089 కార్లు విక్రయించింది. గత ఏడాది ఇదేనెలలో అమ్మకాలు 1,60,529 కార్లతో పోల్చితే 5% వృద్ధిని నమోదు చేసింది.  ⇒ హ్యుందాయ్‌ గతేడాది ఏప్రిల్‌లో మొత్తం 58,201 వాహనాలను విక్రయించగా, ఈ సంఖ్య 9.5% పెరిగి 63,701 యూనిట్లకి చేరింది. ⇒ టాటా మోటార్స్‌ వాహన విక్రయాలు 11.5% వృద్ధి సాధించాయి. ఏప్రిల్‌లో 77,521 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇవి ఏడాది ఏప్రిల్‌లో 69,599 యూనిట్లుగా ఉన్నాయి.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement


ఫోటో స్టోరీస్

View all