Top Stories
ప్రధాన వార్తలు
దత్తపుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉండడు: సీఎం జగన్
సాక్షి, కాకినాడ జిల్లా: సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని.. పొరపాటున బాబుకు ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్టేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన పిఠాపురంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కూటమి మోసాలను ఎండగట్టారు. ఇంటింటి అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైఎస్సార్సీపీని గెలిపించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇదే..‘‘చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇదే. చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే. కూటమికి ఓటేస్తే పథకాలన్నిటింకీ ముగింపే. 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం జమ చేసింది. రాబోయే ఐదేళ్ల ఇంటింటి అభివృద్ది, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు. ఐదేళ్లు లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. ఇంటి వద్దకే పెన్షన్, పౌరసేవలు, పథకాలు ఇస్తున్నాం. గతంలో ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను కూటమి నేతలు చెత్తబుట్టలో వేశారు’’ సీఎం జగన్ మండిపడ్డారు.ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా..‘‘2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలు అమలు చేశాం. గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు చూశారా. అక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉన్నాం. డ్రైవర్ అన్నదమ్ములకు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం. జగనన్న తోడు, చేదోడుతో చిరు వ్యాపారులకు తోడుగా నిలిచాం’’ అని సీఎం పేర్కొన్నారు.మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే‘‘స్వయం ఉపాధికి గతంలో ఈ పథకాలు ఉన్నాయా?. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం. మన మేనిఫెస్టోను నేరుగా ఇళ్లకే పంపి ఆశీస్సులు తీసుకున్నాం. మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే’’ అని సీఎం చెప్పారు.మీ ఇద్దరినీ అడుగుతున్నా..‘‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదే దత్తపుత్రుడు మంగళగిరి వెళ్లి భూములు కొన్నాడు.. బాలకృష్ణ మొన్ననే విశాఖలో రిషికొండలో భూమలు కొన్నాడు.. మీ ఇద్దరినీ అడుగుతున్నా.. మీకు ఒరిజినల్ డీడ్స్ ఇచ్చారా? జిరాక్స్ ఇచ్చారా?. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 9 లక్షల మందికి ఒరిజినల్ డీడ్స్ ఇచ్చాం’’ అని సీఎం జగన్ వివరించారు.దత్తపుత్రుడికి ఓటేస్తే ఇక్కడే ఉంటాడా? హైదరాబాద్ వెళ్తాడా?‘‘వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా.. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న దత్తపుత్రుడికి ఓటు వేయకండి.. దత్తపుత్రుడికి ఓటేస్తే ఇక్కడే ఉంటాడా? హైదరాబాద్ వెళ్తాడా?. గాజువాక, భీమవరం అయిపోయింది.. ఇప్పుడు పిఠాపురం అంటున్నారు. దత్తపుత్రుడిని మహిళలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఐదేళ్లకోసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మారుస్తున్నాడు’’ అంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది.ఏపీ, తెలంగాణలో మైక్‌లు మూగబోయాయి. ఎల్లుండి(సోమవారం) పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏపీవ్యాప్తంగా 26 జిల్లాల్లో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో 5,26,010 మంది సిబ్బంది పాల్గొంటారు. పోలింగ్ కోసం 1.60 లక్షల ఈవీఎంలను వినియోగించనున్నారు.ఏపీలో పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. 74. 70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించనున్నారు. 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 454 మంది ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు.417 మంది పురుష, 37 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడనున్నారు.175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,387 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ పడనున్నారు.ఏపీ: రేపు పోలింగ్ కేంద్రాలకు చేరనున్న ఈవీఎంలు26 జిల్లాల్లో 46,389 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ కి ఏర్పాట్లు12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తింపురాష్ట్ర వ్యాప్తంగా 34,651 పోలింగ్ కేంద్రాల్లో కెమెరాలతో వెబ్ కాస్టింగ్ కి ఏర్పాట్లుసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా74.70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్25 లోక్ సభ నియోజకవర్గాల్లో 454 మంది ఎంపీ అభ్యర్థుల పోటీ417 మంది పురుష, 37 మంది మహిళా అభ్యర్థులు పోటీ175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2387 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పోటీ2,154 మంది పురుష అభ్యర్థులు, 231 మహిళా అభ్యర్థులు పోటీఏపీలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 4 కోట్ల 14 లక్షల 1887 మంది ఓటర్లుఏపీలో మహిళా ఓటర్లే అధికంఓటు హక్కు వినియోగించుకోనున్న 2 కోట్ల 10 లక్షల 58 వేల 615 మహిళా ఓటర్లుఓటు హక్కు వినియోగించుకోనున్న 2 కోట్ల 3 లక్సల 39వేల మంది పురుష ఓటర్లుఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన ఉద్యోగులు, సర్వీస్ ఓటర్లుసోమవారం 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగింపురంపచోడవరం, పాడేరు, అరకు నియోజకవర్గాల్లో 4 గంటలకు ముగియనున్న పోలింగ్ఎన్నికల విధులకు 5 లక్షల 26 వేల మంది సిబ్బందిని నియమించిన ఎన్నికల కమిషన్పోలింగ్ నాడు ఉదయం 7 గంటలలోపు మాక్ పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలుఅన్ని నియోజకవర్గాల్లోనూ అమలులోకి వచ్చిన 144 సెక్షన్48 గంటల పాటు మద్యం షాపులు, బార్లు మూసివేతరాజకీయ పార్టీల బల్క్ మెసేజ్ ల ప్రచారాన్ని నిషేధించిన ఈసీప్రచారానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు వెల్లిపోవాలని పోలీసుల ఆదేశంపోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు భారీగా బందోబస్త్ ఏర్పాటు చేసిన ఈసీఏపీ పోలీస్ తో పాటు తమిళనాడు, కర్నాటక, ఏపీఎస్పీ, ప్రత్యేక దళాలు మోహరింపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన ప్రచార పర్వంరాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ, కంటోన్మెంట్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి17 పార్లమెంటు స్థానాలకు బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులురేపు రాత్రి 10 గంటల వరకు డోర్ టు డోర్ ప్రచారం చేసుకోవచ్చని అనుమతిచ్చిన ఈసీ13న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే ముగియనున్న పోలింగ్పోలింగ్ పెంచేందుకు 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 525 మంది అభ్యర్థులు, 475మంది పురుషులు, 50 మంది మహిళా అభ్యర్థులుసికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో 45 మంది అభ్యర్థులుఎన్నికల విధుల్లో 2లక్షల 80వేల మంది సిబ్బంది విధుల నిర్వహణ160 కేంద్ర కంపెనీల CAPF బలగాలు రాష్ట్రంలో మోహరింపుఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి 20వేల మంది పోలీస్ బలగాలురాష్ట్ర వ్యాప్తంగా 3కోట్ల 32లక్షల 32వేల మంది ఓటర్లుపురుష ఓటర్లు-1కోటి 65లక్షల 28వేలు, 1కోటి 67లక్షల మహిళా ఓటర్లు18-19 ఏళ్ల వయసు కలిగిన యువ ఓటర్లు 9లక్షల 20వేలు, వికలాంగులు 5లక్షల 27వేలుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 808 పోలింగ్ కేంద్రాలుఅత్యధికంగా మల్కాజ్‌గిరిలో 3226 పోలింగ్ కేంద్రాలు1లక్ష 9వేల 941 బ్యాలెట్ యూనిట్లు, 44906 కంట్రోల్ యూనిట్లుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9900 ఉన్నట్లు గుర్తించిన ఈసీజూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు
లాండ్ టైట్లింగ్ చట్టం - అబద్దాలు vs నిజాలు
“మీ దస్తావేజు మీకు ఇవ్వరు” అనేది పూర్తి సత్యదూరం-గత సంవత్సర కాలంగా 9,58,296 క్రయ విక్రయ దస్తావేజులు రిజిస్టర్ చేసి రైతులకు అందజేయడం జరిగింది.అలాగే 15,91,814 ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసి పత్రాలను లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఇంకా 17,5,000 లబ్ధిదారులకు TIDCO HOUSES రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మిగిలిన రిజిస్ట్రేషన్స్ కూడా చేయడం జరుగుతుందిe.Stamping 2016 లోనే మొదలైంది. 2016 నుంచి 2019 వరకు 2,27,492 డాక్యుమెంట్స్ జారీ చేయడం జరిగింది. 2019 నుంచి ఇప్పటివరకు 60,66,490 డాక్యుమెంట్స్ జారీ చేయబడ్డాయి.ఇవి ఏవి జిరాక్స్ కాపీలు కాదు అన్నీ ఒరిజినల్సే.“మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారు. న్యాయం కోసం స్థానిక కోర్టులకు వెళ్లలేరు”మీ వారసులను అధికారులే నిర్ణయిస్తారు అనేది చట్టానికి వక్ర భాష్యం చెప్పే వాళ్ల మాట. ఇంకా అమలులోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ Section 25 (3) ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి సదరు వారసత్వ నిర్ధారణ లో ఏదేని డిస్ప్యూట్ ఉందని తలచిన సంబంధిత సివిల్ కోర్టుకు వారే రిఫర్ చేస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్నరికార్డ్ ఆఫ్ రైట్స్(RoR) చట్ట ప్రకారం వారసత్వ నిర్ధారణలో డిస్ప్యూట్ ఉన్నట్లయితే దరఖాస్తుదారులు కోర్టుకు వెళ్లి కేసును ఫైల్ చేయవలసి ఉంటుంది. కానీ ల్యాండ్ టైటిలింగ్ చట్ట ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి సంబంధిత సివిల్ కోర్టుకు రిఫర్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా వారసులకు వెసులుబాటుగా ఉంటుంది. 2. “మీ ఆస్తి మీది కాదు అని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ చెప్తే మీరు ఏమి చేయలేరు”ప్రస్తుతం చేస్తున్నటువంటి రీ సర్వే ప్రకారం రికార్డుల్లో ఒక సారి రైతు పేరు వస్తే ల్యాండ్ టైటిల్ ఆక్ట్ ప్రకారం వారు ఏ రకమైనటువంటి రికార్డు సమర్పించ వలసిన అవసరం లేదు. ఈ రకంగా నిర్ధారించిన డేటా పై ఆ గ్రామంలో నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత 90 రోజుల వరకు క్లైమ్స్, objections సమర్పించవచ్చు ఆ రకంగా నిర్ధారించబడిన వారి పేర్లు టైటిల్ రిజిస్టర్లో నమోదు చేయబడతాయి. అప్పుడు వాటికి Presumptive Title ఉంటుంది ఈ రకం గా నమోదు చేయబడిన పేర్లపై రెండు సంవత్సరంలోగా ఏ రకమైనటువంటి ఆపిల్ గాని డిస్ప్యూట్ కానీ రాకపోతే అప్పుడు Conclusive titile నిర్ధారణ చేయడం జరుగుతుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (TRO) ఇచ్చిన ఆర్డర్ పై ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్‌కు (LTAO) అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. వీరి ఉత్తర్వులపై సంతృప్తి చెందకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది.3. “సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెట్టవచ్చు.” “తాతల నాటి భూములైన నేతల దయ ఉండాల్సిందే.” “జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చు.”ఇవన్నీ చట్టాలకు వక్రభాష్యాలు చెప్పేవారు మాట్లాడే మాటలు. సరైన పత్రాలు లేవని యజమానులను జైల్లో పెట్టే స్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ప్రజల్లో ఒక రకమైన భయానక స్థితిని కల్పించాలనే ఉద్దేశంతో చేసే ప్రకటనలు. ఇంతకుముందే IVR calls / Voice Recordings ద్వారా ఈరకంగా తప్పుడు ప్రచారం చేస్తే ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వులు Memo No 974/Elecs. Spl.cell.2/A5/2024-48 of Addl. Chief Election Officer, & E.O. Joint Secretary to the Government of AP, Dt. 04.05.2024 ప్రకారం సిఐడి కేసు రిజిస్టర్ చేశారు. దీనిపై విచారణ జరుగుతూ ఉంది. ఈ రకమైన ప్రచారం ప్రింట్ మీడియాలో చేస్తే ఎలక్షన్ కమిషన్ Media Certification and Monitoring Committees(MCMC) పర్మిషన్ అవసరం లేదు అనేటువంటి లొసుగును అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పై బురద చల్లేందుకు చేసేటటువంటి ప్రయత్నం ఇది. ఇది ఎంతవరకు సమంజసం?చట్టం తయారీ, రాష్ట్రపతి ఆమోదం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టం తయారీ కోసం లీగల్ అడ్వైజర్ గా నల్సార్ యూనివర్సిటీ (NALSAR) వారిని నియమించుకోవడం జరిగింది . నల్సార్ యూనివర్సిటీ వారి ఈ చట్టం యొక్క డ్రాఫ్ట్ ప్రిపరేషన్ కి సహకరించారు. 2011 నుండి 2019 వరకు తయారుచేసిన వివిధ నమూనా చట్టాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ చట్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లును 2019 లో మన రాష్ట్ర శాసనసభ లో ప్రవేశపెట్టినప్పుడు సుదీర్ఘ చర్చ జరిగిన తరువాత టిడిపి కూడా పూర్తి మద్దతు ప్రకటించింది. ఆ తరువాత ఆమోదించి గౌరవ రాష్ట్రపతి ఆమోదముద్రకు పంపించబడింది. భారత ప్రభుత్వం లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, లా డిపార్ట్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, సాంఘిక సంక్షేమ శాఖ మొదలైన డిపార్ట్మెంట్లన్నీ మూడు సంవత్సరాలు జాగ్రత్తగా పరీక్షించి, వారు చేసిన సూచనల మేరకు మార్పులు చేర్పులు చేసి మరలా రాష్ట్ర శాసనసభ లో ఆమోదింపబడిన తరువాత తిరిగి రాష్ట్రపతి ఆమోదమునకు పంపడం జరిగింది. ఈ చట్టం భారత ప్రభుత్వానికి సంబంధించిన ఏ చట్టంతోను విభేదించటం లేదు అని నిర్ధారించిన తర్వాత మాత్రమే భారత రాష్ట్రపతి వారి ఆమోదం ఇవ్వడం జరిగింది. కనుక ఈ చట్టము కూలంకషంగా చర్చ జరిగిన తరువాత తెచ్చిన చట్టము. చట్టం అమలు – ప్రస్తుత స్తితి:ఈ చట్టానికి సంబంధించి ఇంకా రూల్స్ తయారు చేసి ఉండలేదు. ఈ చట్టం యొక్క పరిధి (Areas Covered) ని ఇంకా నిర్ధారించి ఉండలేదు. ఈ చట్టంలో డిజిగ్నేట్ చేయబడిన అధికారులను ఇంకా అపాయింట్ చేసి కూడా ఉండలేదు. ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలను, సూచనలను తీసుకొని అవసరమైనటువంటి మార్పులను, చేర్పులను చేయుటకు సిద్ధంగా ఉంది. రూల్స్ తయారు చేసి, కాంపిటెంట్ అథారిటీ అనుమతి పొందిన తర్వాత, ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరుగుతుంది. న్యాయవాదుల సంఘాలు, వ్యక్తులు, గౌరవ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు లో రిట్ పీటీషన్స్, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలు చేయగా సదరు పిటిషన్ లన్నింటిని విచారించి, ఈ చట్టాన్ని ప్రస్తుతం అమలుపరచడం లేదు కనుక, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న కేసులను విచారించుచూ, కొత్త కేసులను కూడా తీసుకోవాల్సిందిగా సివిల్ కోర్టులను ఆదేశించి ఉన్నారు.( No. WP(PIL).Nos.215, 216 of 2023, WP.No.33763 of 2023, WP(PIL). Nos.2 & 3 of 2024 and W.P.Nos. 22 & 23 of 2024). జగనన్న భూహక్కు, భూరక్షఈ ప్రభుత్వం వంద సంవత్సరాల తర్వాత రీ సర్వే అనే బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. Survey and Boundaries Act 1923 ప్రకారం ముందస్తు నోటీసు ద్వారా భూయజమానికి సర్వే గురించి తెలియపరిచి భూయజమాని సమక్షంలోనే సర్వే చేయడం జరుగుతుంది. సర్వే సమయం లో పట్టాదారు నకు ఈ క్రింది నోటీసులు ఇవ్వటం జరిగింది.Notice in form 14 (Ground Truthing)Notice in form 33A (Ground Validation)Notice in form 42 (Providing copy of LPM)Notice in form 43 (Section 10(2)ఈ సర్వే కోసం డ్రోన్ టెక్నాలజీని వాడడం జరిగింది. ఈ సరిహద్దులు నిర్ధారించే క్రమంలో ఏర్పడిన వివాదాలను పరిష్కరించడం జరిగింది. GPS టెక్నాలజీని ఉపయోగించి సరిహద్దు రాళ్ళు పాతడం కూడా జరిగింది. ఈ రకంగా సరిహద్దులు నిర్ధారించిన తర్వాత Land Parcel Maps (LPMs) తయారు చేయడం జరిగింది. ఈ రకంగా మొత్తం రెవిన్యూ రికార్డ్స్ ను అప్డేట్ చేయడం జరిగింది. ఇంతవరకు రాష్ట్రంలోని మొత్తం 17,460 గ్రామాలకు గాను 6000 గ్రామాలు సర్వే పూర్తి అయ్యింది. ఈ రీ సర్వే వలన పూర్తి అయిన 6000 గ్రామాల్లో సరిహద్దు భూవివాదాలు చాలా మట్టుకు తగ్గాయి.సమగ్ర రీ సర్వే పూర్తి అయిన తర్వాతే ఏపీ ఎల్ టి చట్టం అమలులోకి వస్తుంది. ఈ చట్టం అమలు లోకి వస్తే ప్రజల నుంచి ముఖ్యంగా అమరావతిలో, విశాఖపట్నంలో, తిరుపతిలో బలవంతంగా లాక్కున్న, బినామీ పేర్ల పై పెట్టిన ఆస్తులు ఎక్కడ బయటికి వస్తాయో అనే భయంతో ఈ చట్టాన్ని కామన్ పబ్లిక్ కి ముడిపెట్టి అమలు చేయకుండా ఉండేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చట్టాలను చేస్తూ ఉంటాయి. ఆ చట్టాలవల్ల ప్రజలకు ఏ రకంగా అయినా ఇబ్బంది కలిగించేలా ఉంటే వాటిలో సవరణలు తెచ్చేందుకు ప్రతిపాదిస్తారు కాని, ఫలానా చట్టాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం మనం ఎప్పుడైనా చూసామా? విపక్షాలు మేనిఫెస్టోలో అనేక అమలు చెయ్యలేని హామీలు ఇవ్వడం జరిగింది.ఈ ఒక్క హామీపై ఇంత దృష్టి పెట్టి గందరగోళం సృష్టించాలి అనేటువంటి ప్రయత్నాన్ని చూస్తే, పసుపు బ్యాచ్ వారు దాచుకున్న, దోచుకున్న, ఆక్రమించిన బినామీ భూములు, ఆస్తులు ఎక్కడ బయట పడతాయో అనేటువంటి భయం స్పష్టంగా కనబడుతోంది. ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకత్వం లో ఎవ్వరైనా ఈ చట్టం మంచిది కాదు అని ఒక్క మాటైనా చెప్పారా? ఇప్పుటి దాకా అనేకసార్లు ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్, అనేక ముఖ్య బిజేపి నేతలు మన రాష్ట్రానికి వచ్చి ప్రసంగాలు చేసినప్పుడు ఈ చట్టం గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? పసుపు బ్యాచ్‌కి ఇప్పుడు ఒక ముఖ్య ప్రశ్న.ఇప్పుడైనా ఈ ఎలక్షన్లో వారితో కలిసి ముందుకు వెళుతున్న బీజేపీ నాయకత్వం చేత “ఈ చట్టం మంచిది కాదు” అని ఒక్క మాటైనా చెప్పించగలరా? ఈ పరిస్థితి చూస్తేనే ఇక్కడి పసుపు పార్టీ నాయకులకు ఈ చట్టం అంటే ఎంత భయం ఉందో తెలుస్తోంది. కేవలం వాళ్ళ బినామీ ఆస్తులను రక్షించుకోవడం కోసం చేసే గందరగోళం ఇది కాదా? ఇప్పటికైనా విస్తృతమైన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, బుద్ధి తెచ్చుకుని ప్రజలకు మంచి జరిగే ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపక పోయినా పర్వాలేదు కానీ మోకాలు అడ్డ కుండా ఉండే విజ్ఞతను ఆ దేవుడు వీరికి ప్రసాదించాలి.Sl. Noనాడు(2014 – 19)నేడు(2019 – 24)1అమరావతిలో అసైన్డ్ ల్యాండ్స్ లబ్ధిదారులను, బెదిరించి, తెల్ల కాగితాలపై అసైనీల సంతకాలు తీసుకుని, వారి భూములు బలవంతంగా లాక్కుని ప్రభుత్వం ద్వారా APAL (POT) యాక్ట్ ప్రొవిజన్స్ కు విరుద్ధంగా ఉత్తర్వులు ఇచ్చి లబ్ధిదారులకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. దీనికి సంబంధించి కేసులు కూడా చేయడం జరిగింది Details of FIRs:14/2020 of CID PS AP Mangalagiri.15/2020 of CID PS AP Mangalagiri.5/2021 of CID PS AP Mangalagiri.20 సంవత్సరములు నిండిన తర్వాత అసైన్మెంట్ పొందిన లబ్ధిదారులకు వారి వారసులకు ఆ భూములపై పూర్తి హక్కులను కల్పించడం జరిగింది. దీనివలన 15,21,160 మంది లబ్ధిదారులకు 27,41,698 ఎకరాల భూమి పై పూర్తి హక్కులు లభిస్తున్నాయి.2ఒక్క సెంటు ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు31,65,315 మంది లబ్ధిదారులకు 71,811 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. 17005 జగనన్న లేఅవుట్ లు అభివృద్ధి చేయడం జరుగుతోంది.3నాడు చుక్కల భూములన్నీ కూడా చుక్కల భూముల చట్టానికి వ్యతిరేకంగా 22A కింద పెట్టి రైతులను ఇబ్బంది పెట్టి నాటి ప్రభుత్వం బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేసింది.1,07,134 మంది రైతులకు సంబంధించిన 2,06,315 ఎకరాల చుక్కల భూమిని 22A నుండి తీసివేసి వారికి సంపూర్ణ హక్కులు ఇవ్వడం జరిగింది.4పేదలకు సంబంధించిన సర్వీస్ ఈనామ్ భూములను 22A లో పెట్టి వారిని చాలా ఇబ్బంది పెట్టి నాటి ప్రభుత్వ బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేసింది.1,61,584 మంది ఈనామ్ దారుల 1,58,113 ఎకరాల విలేజ్ సర్వీస్ ఈనామ్ భూములను 22 A నుండి తొలగించి సర్వహక్కులు కల్పించడం జరిగింది.5బ్రిటిష్ కాలం నుండి ఉన్న రైతులకు సంబంధించిన షరతులు గల పట్టాలను 22A లో పెట్టి బలవంతంగా లాక్కున్నారు.22,042 మంది రైతులకు సంబంధించి 33,394 ఎకరాల షరతులు గల పట్టాల భూమిని 22 ఏ నుంచి తీసివేసి వారికి సర్వహక్కులు కల్పించడం జరిగింది.6భూమిలేని నిరు పేదలకు ఒక్క ఎకరా భూమి కూడా పంచలేదు.42,307 మంది భూమిలేని నిరుపేదలకు 46,463 ఎకరాలు సాగుభూమి పంచడం జరిగింది.7గిరిజనులకు ప్రభుత్వ భూమి అసైన్మెంట్ ఒక్క ఎకరా కూడా చేయలేదు.26,287 మంది గిరిజనులకు 39,272 ఎకరాల్లో DKT పట్టాలు ఇవ్వడం జరిగింది8గిరిజనులకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ (RoFR) కింద పట్టా ఒక్కటి కూడా ఇచ్చి ఉండలేదు1,30,368 మంది గిరిజనులకు 2,87,710 ఎకరాల్లో ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు ఇచ్చారు.9ఒక్క ఎకరా లంక ల్యాండ్స్ కు పట్టా కానీ లీజు గాని ఇవ్వలేదు17,768 మంది లబ్ధిదారులకు 9,064 ఎకరాలలో పట్టాలు / లీజులు ఇవ్వడం జరిగింది.10ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసి ఎస్సీ లబ్ధిదారులకు ఇచ్చిన భూములను 22A లో పెట్టి బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారు.ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసి 22,346 మంది లబ్ధిదారులకు ఇచ్చిన 22,837ఎకరాల భూములను 22a నుండి తీసివేసి వారికి పూర్తి హక్కులను కల్పించారు
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
పిఠాపురం : ప్రత్యర్ధులు నన్ను అవమానిస్తున్నారు.. అవహేళన చేస్తున్నరని వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత అన్నారు. పిఠాపురం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ‘ కొంగు చాచి అడుగుతున్నాను.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురం అభివృద్ధి చేస్తాను. మళ్లీ జన్మలో పిఠాపురంలో పుడతాను. కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా. నేను పిఠాపురం వదిలి వెళ్లను. నా అంతిమయాత్ర పిఠాపురంలోనే జరగాలి. మళ్లీ జన్మలో పిఠాపురంలోనే పుడతా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా’ అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటరిచ్చారు వంగా గీత. ‘వంగా గీతాను నిలదీయండి అని పవన్ అంటున్నాడు. పిఠాపురంలో పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చినందుకు నన్ను అడగాలా? కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి తెచ్చినందుకా? కరోనా సమయంలో ప్రజల్లో ఉన్నది నేను. నాకు అనారోగ్యం వస్తే.. అవమానించేలా మాట్లాడారు. నాటకాలు ఆడాల్సిన అవసరం రాలేదు. .. జ్వరం వస్తే హైదరాబాదు పారిపోలేదు. ఆడవాళ్ళ అనారోగ్యాన్ని అవమానిస్తారా?. వర్మ వాఖ్యలపై కంటతడి పెట్టుకున్నారు. ను పిఠాపురంలో పుట్టలేదని వర్మ అంటున్నాడు.వర్మ మాత్రం పిఠాపురంలో పుట్టాడా?’ అని వంగా గీతా మండిపడ్డారు.
పిఠాపురంలో ప్రచారం.. చిరంజీవి అందుకే వెనకడుగు వేశారా?
జనసేన పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ కోసం మెగాస్టార్ చిరంజీవి ఎందుకని ప్రచారం చేయడం లేదు? ఆయన పిఠాపురం వస్తారని కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. కానీ హఠాత్తుగా తన తమ్ముడు మంచి వాడని చెబుతూ చిరంజీవి ఒక వీడియా క్లిపింగ్ ను విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారు. ఆయన పిఠాపురం వచ్చి ఎందుకని ప్రచారం చేయడం లేదన్నది ఇపుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమన్న సంకేతాలు అందడం వల్లనే చిరంజీవి నేరుగా వచ్చి ప్రచారం చేయడానికి జంకారని అంటున్నారు.2019 ఎన్నికల్లో జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నియోజక వర్గాల నుండి పోటీ చేశారు. రెండు నియోజక వర్గాల్లోనూ ఆయన భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని జనసేన కార్యకర్తలు, అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. అటు పవన్ కల్యాణ్ కూడా రెండింట్లో గెలిచిన తర్వాత ఏ నియోజక వర్గానికి రాజీనామా చేయాలన్న ఆలోచన కూడా చేసి పెట్టుకున్నారు. అయితే ఫ్యాన్ ప్రభంజనంలో పవన్ కు ఎదురు గాలి తగిలేసింది. పోటీచేసిన రెండు చోట్లా పవన్ కల్యాణ్ ఓటమి చెందారు. దాన్ని జనసేన నేతలు అవమానంగా భావించారు. ఓటమిని చాలా కాలం పాటు పవన్ జీర్ణించుకోలేకపోయారు. చాలా పెద్ద షాకే కొట్టింది పరాజయం.తన ఓటమికి కారణాలపై పవన్ కల్యాణ్ ఆత్మపరిశీలన చేసుకోవాలని శ్రేయోభిలాషులు అప్పట్లోనే సలహా ఇచ్చారు. రెండు చోట్ల ఓడినా పవన్ కల్యాణ్ కొంతకాలానికే కేంద్రంలోని బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత జనసేన-బిజెపిల జట్టులోకి టిడిపిని తీసుకురావడానికి బిజెపి అగ్రనేతలతో పదే పదే చర్చలు చేశారు.ఈ సందర్భంగానే ఆయన ఆ పార్టీ అగ్రనేతల నుండి తిట్లు తినాల్సి వచ్చింది కూడా. వాటన్నింటినీ భరిస్తూనే మొత్తానికి మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. టిడిపి,బిజెపిలతో జట్టు కట్టడంతో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యి తీరాలని పవన్ పంతంగా ఉన్నారు.ఈ సారి కూడా భీమవరం నుండి పోటీ చేస్తారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే ఎందుకో కానీ ఆయన దాన్ని వదులుకున్నారు. తమ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న పిఠాపురం నియోజక వర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడి నుండే నామినేషన్ వేశారు. పవన్ కల్యాణ్ పై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. నియోజక వర్గంలో ఆమెకు మంచి పేరు ఉండడంతో పాటు ఇంటింటా పరిచయాలు ఉన్నాయి. అందుకే పవన్ కల్యాణ్ కు గట్టి పోటీ ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ పిఠాపురంపైనే దృష్టి సారించారు. తనకు మద్దతుగా కుటుంబానికి చెందిన వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లచేత ప్రచారం చేయించారు. అదే విధంగా జబర్దస్త్ టీం కూడా పవన్ తరపున ప్రచారం చేస్తోంది.అందరూ చేస్తున్నారు కానీ పవన్ కల్యాణ్ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలే అన్నాయి. ఈ నెల 5న ప్రచారానికి వస్తారని ముందుగా అన్నారు. ఆ తర్వాత లేదు లేదు 10 తేదీన వస్తారని అన్నారు. అయితే చివరకు చిరంజీవి పిఠాపురం వచ్చి ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నారు. అలాగని పూర్తిగా ప్రచారం చేయకపోతే పవన్ కల్యాణ్ ఫీల్ అవుతారు కాబట్టి పవన్ గెలిస్తే మంచి చేస్తాడంటూ ఒక వీడియోలో చిరంజీవి తన సందేశాన్ని రికార్డు చేసి విడుదల చేశారు. అదే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి ఎందుకు డ్రాప్ అయ్యారన్న అంశంపై చర్చ జరుగుతోంది.విశ్వసనీయ వర్గాల భోగట్టా ప్రకారం చిరంజీవి పిఠాపురం వచ్చి రోడ్ షో నిర్వహించి పవన్ కల్యాణ్ గెలుపు కోసం విస్తృతంగానే ప్రచారం చేయాలని ముందుగా అనుకున్నారట. అయితే ఆ తర్వాత పిఠాపురంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయన ఆరా తీస్తే వంగా గీత విజయం ఖాయమని తేలిందట. తాను నేరుగా వచ్చి ప్రచారం చేసినా పవన్ గెలిచే పరిస్థితి లేదని తేలడంతోనే ఊరికే ప్రచారం చేసి తన పరువు తీసుకోవడం ఎందుకని చిరంజీవి భావించారని అంటున్నారు.ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు పవన్ కల్యాణ్ పార్టీ కోసం తిరిగారు కాబట్టి.. పవన్ కల్యాణ్ పార్టీ కోసం తాను ప్రచారం చేయకపోతే బాగుండదని అందరూ అనడంతో ప్రచారం చేద్దామనుకున్నారట. కనీసం పవన్ పోటీ చేసే నియోజక వర్గానికే ప్రచారాన్ని పరిమితం చేయాలనుకున్నారట. తీరా పవన్‌కు విజయవకాశాలు లేవని సంకేతాలు అందడం వల్లనే చిరంజీవి ప్లాన్ మార్చి వెనకడుగు వేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే దీన్ని మెగా అనుచరులు కొట్టి పారేస్తున్నారు. చిరంజీవి వీడియో క్లిపింగ్‌కే పరిమితం కావడంతో పవన్ కల్యాణ్‌లోలోన గుర్రుగా ఉన్నారని అంటున్నారు
బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించబోతోంది: కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించబోతోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో శనివారం(మే11) తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.‘ప్రజాగ్రహం కాంగ్రెస్‌ను ముంచేయబోతోంది. కరెంటు విషయంలో ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. రెండు జాతీయ పార్టీలను మించి సీట్లు గెలవబోతున్నాం. చిల్లర రాజకీయాల కోసం టైమ్ వేస్ట్ చేశారు. కరెంట్‌ను ఎందుకు దెబ్బతీశారో అర్థం కావడం లేదు. నేనుండే చోట 7-8సార్లు కరెంటు పోయింది.పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాం గ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తారా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళతారా చూద్దాం. పైన తథాస్తు దేవతలు ఉంటారు. ఏదైనా జరగొచ్చు. కేసులు అటు ఇటైతే రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళతాడు. 26 నుంచి 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా వాళ్లతో టచ్‌లో ఉన్నారు. ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫాం చేద్దామంటున్నరు.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కొన్ని అద్భుత పథకాలు తీసుకొచ్చారు. మహానుభావుడు చనిపోయి ఏ లోకంలో ఉన్నాడో తెలియదు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, సీఎం రిలీఫ్ ఫండ్ పథకాలను ప్రవేశ పెట్టారు’ అని కొనియాడారు.
May 11th: ఏపీ ఎన్నికల సమాచారం
ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం..
చంద్రబాబుకు చివరి పంచ్.. బాంబు పేల్చిన శర్మాజీ!
ఎన్నో వైద్యాలు చేస్తున్నాం.. హోమియోపతి.. అల్లోపతి.. నేచురోపతి.. ఆయుర్వేదం.. కేరళ మూలికావైద్యం.. ప్రకృతివైద్యం.. అన్నీ చూశాం. ఎన్ని చేస్తున్నా రోగిలో చలనం లేదు.. కళ్ళలో కళ లేదు.. కాళ్ళూ చేతులూ కదలడం లేదు.. శ్వాస కష్టంగానే ఉంది. నాడీ అందడం లేదు.. గుండె కూడా నీరసంగా కొట్టుకుంటోంది.. నాకైతే నమ్మకంలేదు.. దగ్గరోళ్ళు.. రావాల్సినవాళ్లు ఉంటే పిలిపించుకోండి. పనిలోపనిగా అటు కట్టెలు.. కుండ.. పాడె.. చిల్లర పైసలు సిద్ధం చేసుకోండి.. అని డాక్టర్ చెప్పినమాదిరిగానే టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ కూడా చంద్రబాబుకు చెప్పేశాడట.మీకోసం ఎన్నో ప్రోగ్రాములు డిజైన్ చేశాం. బాదుడే బాదుడు.. వస్తున్నా మీకోసం.. సైకో పోవాలి-సైకిల్ రావాలి. ఇదేం ఖర్మ, యువగళం వంటి ఎన్ని ప్రోగ్రాములు చేసినా పార్టీకి మైలేజి రాకపోగా బాబు విశ్వసనీయత మీద ప్రజల్లో సందేహాలు పెరుగుతూ వచ్చాయి తప్ప తగ్గడం లేదు. మరోవైపు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ఆయన చెప్పిందే చేస్తారు అనే అంశాన్ని ప్రజలు బాగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఏది చెప్పినా అబద్ధమే అనేది ఒక బ్రాండ్ ప్రజల్లో ఉండిపోయింది.దీంతో ఆయన ఎన్ని హామీలు ఇస్తున్నా నమ్మడం లేదు.. దానికితోడు కూటమి కట్టిన బీజేపీ.. జనసేన మధ్య కెమిస్ట్రీ కూడా కుదిరినట్లు లేదు.. ఎక్కడికక్కడ విభేదాలు పొడసూపుతున్నాయి. లోకేష్ పార్టీకి బలం అని అనుకుంటున్నారు.. తప్ప అయన ఎక్సట్రా లగేజ్ అనే విషయం కూడా రాబిన్ శర్మ చెప్పేసారు. ఇటు తమ పార్టీ ప్రోగ్రాములు డ్యామేజ్ అయిపోగా అటు వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకు.. వాలంటీర్లు.. పెన్షన్ల వంటి అంశాలను టీడీపీ నెత్తికి ఎత్తుకుంది. అది కూడా నెత్తి బొప్పి కట్టింది తప్ప ప్రయోజనం లేకపోయింది. ఆసరా... విద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలకు నిధులు విడుదల చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను సైతం కోర్టులో కేసువేసి అడ్డుకున్న చంద్రబాబు బొక్కబోర్లా పడ్డారు. దీంతో ఇక ప్లెయిన్ రోడ్లో డ్రైవింగ్ కష్టం అనుకున్న చంద్రబాబు వెనుకడోర్ నుంచి యుద్ధానికి తెగబడ్డారు. కేవలం దుష్ప్రచారం ద్వారా ఓటర్లకు తికమకపెట్టి గెలవాలన్నదే వాళ్ళ ప్లాన్. అందుకే దేశంలో ఎక్కడా.. ఏ రాష్ట్రంలోనూ ఇబ్బందిలేని ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరిట ప్రజలను భయపెట్టి జనాన్ని తమవైపునకు తిప్పుకోవాలన్నది అయన పార్టీ ప్లాన్‌గా మారింది. చంద్రబాబు ఏమి చేస్తాడు.. ఏమి చేయలేదు.. అనేది చెప్పినా ప్రజలు నమ్మేలా లేరు. అందుకే ఇక మ్యానిఫెస్టోను మడిచి పొయ్యిలో పెట్టిన టీడీపీ ఇప్పుడు ఏకంగా కేవలం ల్యాండ్ టైట్లింగ్ చట్టం పేరిట ప్రజలను భయపెట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పదిరోజులుగా అన్ని పత్రికలూ.. ఛానెళ్లలో అదే అంశం మీద తప్పుడు సమాచారంతో పేజీల కొద్దీ ప్రకటనలు కుమ్ముతున్నారు. ఇక గత ఇరవయ్యేళ్ళుగా తెలుగుదేశానికి వచ్చిన సీట్లు చూస్తే ఇలా ఉన్నాయ్.. 2004 - 34 సీట్లు2009 - 54 సీట్లు2014 - 102 సీట్లు2019 - 23 సీట్లుఆంటే జనసేన.. బీజేపీలతో పొత్తుపెట్టుకున్న 2014 లో మాత్రమే మూడంకెల స్కోర్ వచ్చింది తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకి 294 సీట్లు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం మూడంకెల స్కోర్ చేరలేదు.. అంటే టీడీపీ బలం ఎప్పుడూ యాభై సీట్లకు అటు ఇటుగా ఉంది తప్ప గొప్పగా ఏమి లేదు. ఇప్పుడు కూడా సేమ్ ఆలాగే సీట్లు వస్తాయి తప్ప అధికారం దక్కడం అసాధ్యం అనేది విశ్లేషకుల అంచనాగా ఉంది.
చంద్రబాబు కొత్త రాగం.. మరో డ్రామాకు పచ్చ బ్యాచ్ రెడీ!
ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన పోలింగ్ ఘట్టానికి రంగం సిద్దమైంది. ఒక రకంగా ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు అని చెప్పాలి. ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిమోహన్ రెడ్డికి మళ్లీ ఓటు వేయవలసిన అవసరం ఉందా? లేదా? అన్నదే కీలకమైన చర్చ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లు చేసిన కార్యక్రమాలు, విపక్ష నేతగా చంద్రబాబు అనుసరించిన విధానాలు, ఇద్దరి మధ్య ఉన్న వత్యాసాలు, ప్రజల పట్ల వీరికి ఉండే నిబద్దత, చెప్పిన మాటపై నిలబడే తత్వం మొదలైనవన్నీ ప్రజల ముందుకు పరీక్షకు వస్తాయి. వీటన్నిటిని ఆలోచించి ఓటర్లు ఒక నిర్ణయానికి వస్తే సముచితంగా ఉంటుంది.⇒ బహుశా ఏపీలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు గురించి చర్చించుకుంటున్నారు. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుల మధ్య ఉన్న తేడా గురించి ఆలోచిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విశ్వసనీయతకు నిలువుటద్దంగా కనిపిస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు విశ్వసనీయత అన్న పదమే తన నిఘంటువులో లేనట్లు ప్రజల ముందు నిలబడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికు అబద్దాలు చెప్పడం చాతకాదు.. చంద్రబాబుకు నిజాలు చెప్పడం చాతకాదు అంటే ఆశ్చర్యం కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి వచ్చిన మనిషి అయితే చంద్రబాబు నాయుడు మానిప్యులేషన్స్, మానేజ్మెంట్ నైపుణ్యం ద్వారా ఎదిగిన వ్యక్తి.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డికు పేదల పట్ల అపారమైన అనురక్తి ఉందని పలుమార్లు రుజువైంది. తన పాదయాత్రలో కానీ, ముఖ్యమంత్రి అయ్యాక తన టూర్లలో కానీ ఆయన పేదలు, వృద్దులు, అనారోగ్యానికి గురైనవారిని దగ్గరకు తీసుకునే తీరు ఇందుకు అద్దం పడుతుంది. అదే చంద్రబాబు నాయుడు అయితే పెత్తందార్లకు ప్రతినిధిగా పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత పేదలకు ఇవ్వరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల పట్ల ఎప్పుడూ, ఎక్కడా అనుచితంగా వ్యవహరించలేదు. వ్యాఖ్యలు చేయలేదు. పైగా వారందరిని నా.. నా.. నా.. అని పిలుచుకుంటారు. అదే చంద్రబాబు నాయుడు ఎస్సీలలో ఎవరైనా పుడతారా? అంటూ ప్రశ్నించారు.⇒ నాయి బ్రాహ్మణులు సచివాలయానికి వస్తే పవిత్ర ఆలయంలోకి వచ్చి ప్రశ్నిస్తారా అని మండిపడ్డారు. మత్స్యకారుల తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాగ్దానం ఇస్తే నిలబెట్టుకోవడానికి తాపత్రయపడతారు. చంద్రబాబు అయితే ఎన్నికల తర్వాత అసలు ఆ వాగ్దానం తానెప్పుడు చేశానన్నట్లు మాట్లాడతారు. అవసరమైతే అన్ని హామీలు ఎక్కడ అమలు చేస్తామని ప్రశ్నిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను మంచి చేశానని అనుకుంటే ఓటు వేయండని ధైర్యంగా ప్రజలకు పిలుపు ఇస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటర్లను బెదిరించి ఓటు అడుగుతారు. తాను వేసిన రోడ్డు మీద నడుస్తారు.. తాను ఇచ్చిన టాయిలెట్ వాడతారు.. ఇంకొకరికి ఎలా ఓటు వేస్తారు? అని ప్రశ్నించి అందరిని ఆశ్చర్యపరుస్తారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు కోట్ల మంది ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో ఉన్న రాజధాని 29 గ్రామాలలోని తన వర్గం వాళ్లకు, తన పార్టీ వారికి ఎలా ఉపయోగపడాలా? అని ఆలోచిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిది రియల్ డెవలప్ మెంట్ విజన్ అయితే చంద్రబాబుది రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ విజన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముప్పై ఒక్క లక్షలమందికి ఇళ్ళ స్థలాలు, ఇరవై లక్షల ఇళ్లునిర్మించడం ద్వారా సుమారు పది లక్షల కోట్ల సంపదను పేదవారికి సృష్టిస్తే, చంద్రబాబు అమరావతిలో కొద్దివేల మందికి ఇన్ సైడ్ ట్రేడింగ్ ద్వారా కోట్ల రూపాయల సంపద సృష్టించి, అదంతా ఏపీకోసమే అని బుకాయిస్తారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత' రాష్ట్రం కష్టాలలో ఉంది.. నేను అది చేయలేను.. ఇది చేయలేను.. నేను చాలా కష్టపడుతున్నాను.." అంటూ ఇలాంటి సానుభూతి మాటలు చెప్పలేదు. తాను చేయగలిగింది చేసుకుంటూ ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపారు. అదే చంద్రబాబు విభజిత ఏపీలో తన ఐదేళ్ల పాలనలో నిత్యం రాష్ట్రం ఆర్ధిక కష్టాలలో ఉంది.. తాను ఇరవైనాలుగు గంటలు శ్రమిస్తున్నాను.. ప్రజలు సహకరించాలి.. విరాళాలు ఇవ్వాలి. రాజధానికి ఇటుకలు కొనాలి.. అంటూ ఎప్పుడూ ఆయన ఏడుపుకొట్టు మాటలు మాట్లాడి ప్రజలను విసిగించేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అభివృద్ది ద్వారా మూడు ప్రాంతాలు వికసించాలని చెబుతారు. చంద్రబాబు ఒక్క అమరావతి గ్రామాలలోనే లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని అంటారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా రాజధానులపై తన అభిప్రాయాన్ని ఒకే రకంగా చెబుతారు. అదే చంద్రబాబు అయితే ఒక్కోచోట ఒకరకంగా వ్యవహరిస్తారు. ప్రధాని మోదీ వచ్చినప్పుడు కలల రాజధాని అమరావతిని రక్షించడానికే వచ్చారని చంద్రబాబు విజయవాడ పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. విశాఖ, తిరుపతి ప్రాంతాలలో మాత్రం అమరావతి ఊసే లేకుండా జాగ్రత్తపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వలంటీర్ల వ్యవస్థను తెచ్చి దానిపైనే కట్టుబడి ఉండి ప్రజలందరికి ఇళ్ల వద్దే సేవలు అందించారు. చంద్రబాబు వలంటీర్లపైన నీచమైన విమర్శలు చేశారు. ఇప్పుడు అదే వలంటీర్ల వ్యవస్తను కొనసాగిస్తానని అంటారు. పైగా పదివేల రూపాయల వేతనం ఇస్తానని మభ్య పెట్టే యత్నం చేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చే హామీలకు ఎంత వ్యయం అవుతుందో స్పష్టంగా వివరించారు. చంద్రబాబు పొరపాటున కూడా తన హామీలకు ఎంత వ్యయం అయ్యేది చెప్పకుండా జనాన్ని మాయ చేయాలని చూస్తారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానిఫెస్టోని అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేస్తారు. ఎన్నికల సమయం వచ్చేసరికి తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినదానికన్నా మూడు రెట్లు అదనంగా ఇస్తానని ప్రజలను నమ్మించాలని చూస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 2019 మానిఫెస్టో, కొత్త మానిఫెస్టో చూపించి తాను ఏమి చేసింది వివరించుతారు. చంద్రబాబు ఎప్పుడూ 2014 నాటి మానిఫెస్టో ఊసే ఎత్తరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరిని దూషించరు. ఉదాహరణకు చంద్రబాబుతో కుమ్మక్కై సోనియాగాంధీ దారుణమైన అక్రమ కేసులు పెట్టించినా ఎన్నడూ ఆమెను ఒక్క మాట అనలేదు. అలాగే ప్రధాని మోదీతో కూడా సత్సంబంధాలే కోరుకుంటారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యం అని అంటారు. చంద్రబాబు మాత్రం తాను జాతీయ నాయకుడనని భ్రమపడుతుంటారు.⇒ ఆయా రాష్ట్రాలు ప్రత్యేక విమానాలలో తిరిగి మోదీకి పోటీగా కాంగ్రెస్ తో కలిసి కూటమి కడతారు. కూటమి ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్‌ను గాలికి వదలివేస్తారు. మోదీని టెర్రరిస్టు అని, భార్యను ఏలుకోలేనివాడు దేశాన్ని ఎలా ఎలుతాడని అంటారు. విదేశాలలో సైతం మోదీ వల్ల పరువు పోయిందని చెపబుతారు. కానీ మోదీనే మళ్లీ ప్రధాని అయ్యేసరికి యుటర్న్ తీసుకుని కాళ్లావేళ్లపడి ఆయనతో పొత్తు పెట్టుకుంటారు. అప్పుడు మోదీ విశ్వగురు అయ్యారని పొగుడుతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను చేసిన అభివృద్దిని పూర్తి స్థాయిలో చెప్పుకోరు. ఉదాహరణకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాలుగు ఓడరేవులు, పది ఫిషింగ్ హార్బర్లు, కొప్పర్తి పారిశ్రామికవాడ, శ్రీసిటీలో ఏసీ తయారి ప్లాంట్, బద్వేల్ లో సెంచరీ ప్లై వుడ్ ప్లాంట్, విశాఖలో అదానీ డేటా సెంటర్.. ఇలా అనేక పరిశ్రమలు వచ్చినా ఆయన రోజూ ప్రచారం చేసుకోరు. కానీ చంద్రబాబు మాత్రం అసలు పరిశ్రమలే రాలేదని, అభివృద్ది లేదని డబాయించి ప్రచారం చేస్తుంటారు.⇒ ఆయన టైమ్‌లో వచ్చిన ఒక్క కియా ప్లాంట్‌నే ఎల్లవేళలా ప్రచారం చేసుకుంటారు. చంద్రబాబు టైమ్ లో ఉద్దానం కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపే యత్నం జరగలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ఆస్పత్రి, నిపుణుల నియామకం, పరిశోధనతో పాటు 700 కోట్లతో శుద్ది చేసిన సురక్షిత నీరు సరఫరా స్కీమ్ అమలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తానిచ్చిన వాగ్దానాలకు కొనసాగింపుగా మరికొన్ని హామీలు ఇస్తే, చంద్రబాబు ఆకాశమే హద్దుగా ఎన్నికల ప్రణాళికను ప్రకటించి దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టారు. అందులో కూడా అత్యధికం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన స్కీములనే కొనసాగించి అదనంగా మరింత ఇస్తానని చెబుతారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల విద్యకు, ప్రభుత్వ స్కూళ్ల బాగుచేతకు ప్రాధాన్యం ఇస్తుంటే, చంద్రబాబు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు సరఫరా చేస్తానని చెబుతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చి దిద్దితే, చంద్రబాబు వాటిని పట్టించుకోలేదు. విద్య, వైద్యం ప్రైవేటు రంగానికి అప్పగించి వారికి లాభాలు సమకూర్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినన్ని స్కీములు, కొత్త వ్యవస్థలు మరే ముఖ్యమంత్రి తీసుకు రాలేకపోయారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, ఆరోగ్య శిబిరాలు, ఫ్యామిలీ డాక్టర్ విధానం వంటివి తీసుకువస్తే చంద్రబాబు ఎన్నడూ ఆ దిశగా యోచించలేదు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అంత విజన్ ఉంది.. ఇంత విజన్ ఉంది అని గొప్పలు చెప్పుకోకపోయినా, అనేక వ్యవస్థలను సృష్టించి తన విజన్ ఏమిటో ప్రజలకు తెలియచేశారు. చంద్రబాబు తనకు 2020 విజన్, 2037 విజన్ అంటూ ఆయా చోట్ల కాపీ కొట్టిన విషయాలను తనవిగా ప్రచారం చేసుకుంటూ తాను చాలా గొప్పవాడినని భ్రమపడుతుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను తీసుకు వచ్చిన స్కీములన్నిటిని ఆయనే చెప్పలేరు. ఎందుకంటే ఆ స్థాయిలో, అంత సంఖ్యలో పథకాలు తెచ్చి అమలు చేసి తన సమర్థత ఏమిటో ఏపీ ప్రజలకు చూపించారు. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, తదితర స్కీముల ప్రస్తావన వస్తే ఠక్కున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుకు వస్తారు. కానీ చంద్రబాబు తనది ఫలానా స్కీము అని చెప్పుకునే పరిస్థితి లేదు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్లపాటు ప్రశాంతంగా పాలన సాగితే, చంద్రబాబు కక్షపూరిత పాలన అని, విధ్వంసం అని, వినాశనం అని దుర్మార్గ ప్రచారం చేస్తుంటారు. తన టైమ్‌లో అమరావతి పేరుతో ముప్పై ఐదు వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని విధ్వంసం చేస్తే మాత్రం అది గొప్ప విషయం అని ఊదర గొడుతుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరకంగా స్వయం ప్రకాశం అయితే చంద్రబాబు ఎవరో ఒకరిపై ఆధారపడి పదవిలోకి వస్తుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టాలు, నష్టాలకు ఓర్చి, పెద్ద, పెద్ద రాజకీయ తిమింగలాలను ఎదుర్కుని నిలబడితే, చంద్రబాబు కుట్రలు, కుయుక్తులు, కూటమి ఎత్తులు, జిత్తులపై ఆధారపడి రాజకీయం చేస్తుంటారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కష్ట జీవి అయితే, చంద్రబాబు కష్టపడుతున్నట్లు నటించే జీవి అని చెప్పాలి. అబద్దాలు ఆడడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇష్టపడరు. చంద్రబాబు అలవోకగా అబద్దాలు ఆడగలరు. అసత్యాలను సృష్టించగలరు. అందుకు ఉదాహరణే లాండ్ టైటిలింగ్ చట్టంపై లేనిపోని ఒక మోసపూరిత కల్పిత వదంతులను సృష్టించి జనంలోకి వదిలారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థులను కూడా దూషించరు. చంద్రబాబు ప్రతి చోట తన ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతలను నోటికి వచ్చినట్లు దూషిస్తుంటారు. అదే టైమ్‌లో తనను ఎవరైనా ఏదైనా అంటే ప్రజల కోసం పడతానంటూ కొత్త డ్రామా ఆడుతారు. రాజకీయ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు. ఎవరితో నైనా కలవడానికి, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానకి సిగ్గుపడరు. అంతకు ముందు బండబూతులు తిట్టుకున్నా, ఏ మాత్రం ఫీల్ కారు.⇒ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు, లేదా వ్యక్తుల మేనేజ్మెంట్ తెలియని వ్యక్తి అయితే, చంద్రబాబు అచ్చంగా వ్యవస్థలు, మీడియాను మేనేజ్ చేసే నిపుణుడుగా పేరొందారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి.. చంద్రబాబు మీడియాపై ఆధారపడే మనిషి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిను ఓడించలేమని భయపడే చంద్రబాబు నాయుడు జనసేన, బీజేపీలతో పొత్తుపెట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ధైర్యంగా తన పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని జనంతోనే తన పొత్తు అని ధైర్యంగా ప్రకటించి ఎన్నికల బరిలో నిలబడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య వయస్కుడైతే, చంద్రబాబు 75 ఏళ్ల వృద్దుడు. ప్రజలు తమకు ఎవరు కావాలో నిర్ణయించుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
సినిమా
స్టార్ హీరోయిన్‌కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?
కొన్నిసార్లు ఊహించని విధంగా చిక్కులు ఎదురవుతుంటాయి. అలా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌కి మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓ విషయంలో చిన్న పదం ఉపయోగించినందుకుగానూ ఈ పరిస్థితి ఎదురైంది. ఇప్పుడీ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది?(ఇదీ చదవండి: చిక్కుల్లో హీరో శింబు.. కమల్ హాసన్ మూవీలో నటించడానికి వీల్లేదంటూ..)బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లయింది. ఈ క్రమంలోనే తన ప్రెగ్నెన్సీ అనుభవాలతో 'కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్' పేరుతో ఓ పుస్తకం రాసింది. అయితే ఈ బుక్ టైటిల్లో 'బైబిల్' పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ లాయర్ క్రిస్టోఫర్ ఆంథోని కోర్టుని ఆశ్రయించారు. జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ కరీనాకు నోటీసు జారీ చేసింది. ఆ పదం వాడటానికి గల కారణమేంటని ప్రశ్నించింది.కరీనా కపూర్‌పై కేసు కూడా నమోదు చేయాలని క్రిస్టోపర్ పిటిషన్ వేశారు. ఈ పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. బుక్ టైటిల్లోని 'బైబిల్' పదం వల్ల క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని ఆంథోనీ తన పిటీషన్లో పేర్కొన్నారు. క్రైస్తవులకు బైబిల్ అనేది పవిత్ర గ్రంథం అని, కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీని బైబిల్‌తో పోల్చడం సరికాదు అని ఆయన చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఇదెక్కడి క్రేజ్ రా మావ)
సూర్య.. 1000 కోట్లు వసూలు చేస్తాడా?
ప్రస్తుతం స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా పాన్ ఇండియా సినిమాల జోరు కొనసాగుతుంది. ఇక మన టాలీవుడ్ నుంచి అయితే చాలా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా బ్రాండ్ తోనే తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. పక్కనే ఉన్న కోలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు మనవాళ్లనే ఫాలో అవుతున్నారు. తమ సినిమాలను కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఎలాగైనా పాన్ ఇండియా పోటీలో తాము కూడా పై చేయి సాధించాలని కసిగా ఉన్నారు. ఇప్పటి వరకు పాన్ ఇండియా స్థాయిలో రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో టాలీవుడ్ పాటు కన్నడ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ కోలీవుడ్ నుంచి ఒక్క సినిమా కూడా లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు రూ. 1000 కోట్ల క్లబ్లో చేరాయి. ఇక కన్నడ నుంచి కేజీయఫ్, కేజీయఫ్ 2 చిత్రాలు కూడా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కోలీవుడ్ నుంచి జైలర్ కచ్చితంగా రూ. 1000 కోట్లు సాధిస్తుందని అంతా భావించారు. కానీ అది రూ. 600 కోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇక ఇప్పుడు కోలీవుడ్ ఆశలన్నీ సూర్యపైనే ఉన్నాయి. ఆయన నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం కంగువా రూ. 1000 కోట్లు సాధించి, అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని ధీమాగా ఉన్నారు. ఈ మధ్య విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ చూస్తుంటే కచ్చితంగా 1000 కోట్లు కలెక్ట్ చేసే మొట్టమొదటి చిత్రం అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చిత్ర నిర్మాతలు కూడా రూ. 1000 కోట్లే టార్గెట్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ శివ రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కంగువా పార్ట్ 1 ఈ ఏడాదిలో విడుదల కానుంది. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇప్పటికే ఇందులోని పిరియడ్ కాల పాత్రకు సంబంధించిన ఆయన గెటప్, టీజర్ విడుదల చేయగా విశేష ఆదరణ పొందాయి. కాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, యోగిబాబు, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, వెట్రి పళనిసామి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 38 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అక్కను రౌడీలా వేధించా.. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది
ఎంత గొడవపడ్డా సరే అక్కాచెల్లెళ్లు వెంటనే కలిసిపోతారు. అయితే వారి మధ్య పోట్లాటలు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. ఒకరు హైపర్ అయిపోతే మరొకరేమో అన్నింటినీ ఓపికగా భరిస్తూ ఉంటారు. బాలీవుడ్ నటి రత్న పాఠక్ షా మొదటి రకం. తన సోదరిని ఎమోషనల్‌గా టార్చర్ పెట్టిందట! ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించింది.రౌడీలా ప్రవర్తించా'సుప్రియ అక్క, నేను చిన్నగా ఉన్నప్పుడు తెగ పోట్లాడుకునేవాళ్లం. తనకు నేను మంచి చెల్లినైతే కాదు. ఒక రౌడీలా ప్రవర్తించేదాన్ని. ఏది పడితే అది అనేసి బాధపెట్టేదాన్ని. అది గుర్తు చేసుకుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. తన మనసును బాధపెట్టినందుకు ఆమెకు సారీ చెప్పాను. తను నన్ను క్షమించిందనే అనుకుంటున్నాను. ప్రస్తుతం మేము బాగానే ఉన్నాం' అని తెలిపింది.అందంగా లేనేమోననిసినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు నేనంత అందంగా లేనేమోనని భయపడేదాన్ని. నా పళ్లు, పెదాలు బాగోవని.. అలాగే నా కళ్లు కూడా అంత పెద్దవి కావని ఫీలయ్యేదాన్ని. కానీ సుప్రితకు అందమైన కళ్లుండేవి. అలా అని తను నాకన్నా అందంగా ఉందని నేనేమీ ఈర్ష్య పడేదాన్ని కాదు. నా ప్రవర్తన, క్రమశిక్షణ, టాలెంట్‌పై ఫోకస్ పెట్టేదాన్ని' అని చెప్పుకొచ్చింది. కాగా రత్న పాఠక్ 2023లో వచ్చిన ధక్ ధక్ అనే సినిమాలో చివరిసారిగా నటించింది. సుప్రియ పాఠక్.. సత్యప్రేమ్కీ కథ చిత్రంలో మెరిసింది.చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ సినిమా
Allu Arjun At Nandyal: వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్
ఇద్దరు వ్యక్తుల మధ్య చెదరని మమతకు శ్రీకారం స్నేహం.. చెలిమి బంధానికి మరేదీ సాటిరాదని ఎన్నెన్నో పురాణ కథలు ప్రబోధిస్తున్నాయి. అందుకే ఈ ప్రపంచంలో స్నేహానికి అత్యంత విలువ ఉంది. ఎన్నికల సమయంలో తన మిత్రుడి విజయం కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ బంధాన్ని పాటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల నియోజికవర్గంలో ఎన్నికల బరిలో నిల్చున్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయం సాధించాలని అల్లు అర్జున్ కోరుకున్నారు.తాజాగా అల్లు అర్జున్ తన సతీమణి స్నేహా రెడ్డితో కలిసి నంద్యాల చేరుకున్నారు. వారికి పూలమాలలతో శిల్పా రవిచంద్రారెడ్డి దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ను చూసేందుకు ఆయన అభిమానులు శిల్పా రవి ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. 2019 ఎన్నికల్లో తొలిసారి నంద్యాల నుంచే శిల్పా రవిచంద్రారెడ్డి పోటీచేశారు. ఆ సమయంలో కూడా బన్ని తన మిత్రుడు విజయం సాధించాలని మద్ధతు తెలిపారు.శిల్పా రవిని ప్రజాసేవలో చూడటం తనకు చాలా గర్వంగా ఉందని బన్ని అప్పట్లో తెలిపారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మనంద రెడ్డిపై 35 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. మళ్లీ ఇప్పుడు కూడా శిల్పా రవి నంద్యాల నుంచే ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో తన మిత్రుడిని గెలిపించాలని అల్లు అర్జున్ తన మద్ధతు తెలిపారు. శిల్పా రవిచంద్రారెడ్డి చేతిని పట్టుకుని తన అభిమానులకు చూపించారు.శిల్పా రవిచంద్రారెడ్డి సతీమణి నాగిని రెడ్డి, అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఇద్దరు మంచి స్నేహితులు. వారిద్దరూ క్లాస్‌మెట్స్ కూడా.. అనంతరం రవిచంద్రారెడ్డి, అల్లు అర్జున్ మంచి స్నేహితులు అయ్యారు. ఇరు కుటుంబాల్లో జరుగుతున్న శుభకార్యాల్లో కూడా వారు పాల్గొంటారు. స్నేహానికి అత్యంత విలువ ఇచ్చే వ్యక్తి అల్లు అర్జున్ అని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వార రవిచంద్రారెడ్డి తెలిపారు.అల్లు అర్జున్ ఏమన్నారంటే..'శిల్పా రవిచంద్రారెడ్డి నాకు గత 15 ఏళ్లుగా మంచి మిత్రుడు. రాజకీయాలకు ముందు ఇద్దరం రెగ్యులర్‌గా కలిసేవాళ్లం. ఎప్పుడైతే రవి పాలిటిక్స్‌లోకి వచ్చారో ఆ సమయం నుంచి మేము తక్కువగా కలిసే వాళ్లం. 2019లో రవిచంద్రారెడ్డి గెలుపు కోసం ఒక ట్వీట్ చేశాను. కానీ, నాకు అది చాలా తక్కువే అనిపించింది. రవి ఈ ఐదేళ్లలో చాలా కష్టపడ్డాడు. అందుకే నేనే నంద్యాలకు వచ్చాను. ఈ ఎన్నికల్లో రవి విజయం సాధించి ఇక్కడి ప్రజలకు మరిన్ని మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను.' అని బన్ని అన్నారు. View this post on Instagram A post shared by వై.యస్.ఆర్ కుటుంబం (@_ysrkutumbam)Grateful to the people of Nandyal for the warm reception. Thank you, @SilpaRaviReddy garu, for the hospitality. Wishing you the very best in the elections and beyond. You have my unwavering love and support pic.twitter.com/n34ra9qpMO— Allu Arjun (@alluarjun) May 11, 2024
క్రీడలు
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్..
ఐపీఎల్-2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ కీలక పోరుకు సిద్దమైంది. ఆదివారం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఢిల్లీ ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌కు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ దూరమయ్యాడు.ఈ ఏడాది సీజన్లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ యాజమాన్యం అతడిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలో ఆర్సీబీతో మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించాడు."ఆదివారం ఆర్సీబీతో మ్యాచ్‌లో మా జట్టు కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. అతడు గత రెండు సీజన్ల నుంచి ఢిల్లీ ఫ్రాంచైజీకి వైస్-కెప్టెన్‌గా ఉన్నాడు. అతడికి అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో కూడా చాలా అనుభవం ఉంది. గేమ్‌ను బాగా అర్థం చేసుకుంటాడు. కెప్టెన్సీ చేసే అవకాశం రావడంతో అతడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక రిషబ్ పంత్ దూరం కావడం మా దురదృష్టం. మేము అతడి బ్యాన్పై అప్పీల్ చేశాము. కానీ ఫలితం మాత్రం మాకు అనుకూలంగా రాలేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాంటింగ్ పేర్కొన్నాడు.
'హార్దిక్ ఒక అద్బుతమైన కెప్టెన్.. అందరి కంటే డిఫరెంట్'
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించింది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై 9వ స్ధానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. ముంబై కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్ధానంలో బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా..తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా హార్దిక్ నిరాశపరుస్తున్నాడు. అదే విధంగా ముంబై డ్రెస్సింగ్ రూమ్ రెండు గ్రూపులుగా విడిపోయినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఉద్దేశించి ముంబై యువ పేసర్ గెరాల్డ్ కోయెట్జీ కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా అద్భుతమైన కెప్టెన్ అంటూ కోయెట్జీ పొగడ్తలతో ముంచెత్తాడు."హార్దిక్ పాండ్యా నిజంగా సూపర్ కెప్టెన్. అతడికి అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. ప్రతీ కెప్టెన్‌కు ఒక స్టైల్ ఉంటుంది. ఏ కెప్టెన్ కూడా ఒకేలా ఉండడు. హార్దిక్ జట్టులో ప్రతీఒక్క ఆటగాడికి సపోర్ట్‌గా ఉంటాడు. ఫీల్డ్‌లో సరైన ప్రణాళికలలు రచించడంలో హార్దిక్ దిట్ట.నా వరకు అయితే అతడొక అసాధారణమైన కెప్టెన్. ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో ఎటువంటి విభేదాలు లేవు. అందరం కలిసే ఉన్నాం. మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధించి టోర్నీ ఘనంగా ముగించేందుకు ప్రయత్నిస్తామని" ఓ ఇంటర్వ్యూలో కోయెట్జీ పేర్కొన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. రిషబ్ పంత్‌పై సస్పెన్షన్ వేటు
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఈ ఏడాది సీజన్లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ యాజమాన్యం అతడిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాకుండా రూ. 30 లక్షల జరిమానా కూడా విధించింది. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ నిర్ణీత సమయంలో తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. ఢిల్లీ స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేయడం ఇది మూడో సారి. అయితే ఐపీఎల్ నియమావళి ప్రకారం వరుసగా మూడో సారి స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేస్తే.. ఆ జట్టు కెప్టెన్‌పై 100 శాతం మ్యాచ్ ఫీజును జరిమానా విధించడంతో పాటు మ్యాచ్ రిఫరీ విచక్షణ మేరకు ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. ఏప్రిల్ 4న వైజాగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు రిషబ్ పంత్‌కు రూ.24 లక్షల జరిమానా విధించారు. అంతకుముందు వైజాగ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించిన పంత్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి నియమావళి ఉల్లంఘించినందుకు పంత్‌పై ఐపీఎల్ మెనెజ్‌మెంట్ చర్యలు తీసుకుంది. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్‌కు పంత్ దూరం కానున్నాడు. కాగా ఢిల్లీ ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే ఆర్సీబీతో జరిగే మ్యాచ్ చాలా కీలకం.
కేఎల్ రాహుల్‌కు సారీ.. లక్నోతోనే టీమిండియా స్టార్?!
భారత స్టార్ క్రికెటర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌ను వీడనున్నాడనే వార్తల నేపథ్యంలో ఆ జట్టు సన్నిహిత వర్గాలు కీలక అప్డేట్ అందించాయి. కెప్టెన్- యాజమాన్యం మధ్య అంతాబాగానే ఉందని స్పష్టం చేశాయి. కాగా ఐపీఎల్-2024లో హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌తో ఘోర ఓటమి నేపథ్యంలో కేఎల్ రాహుల్‌కు ఘోర అవమానం జరిగిన విషయం తెలిసిందే. లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా మైదానంలోకి వచ్చి రాహుల్‌పై తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. రాహుల్‌పై గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫలితంగా.. ఫ్రాంచైజీ అసంతృప్తి నేపథ్యంలో రాహుల్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో పగ్గాలు వదిలేసి పూర్తిగా బ్యాటింగ్‌పై శ్రద్ధ పెడతాడా లేదా ఫ్రాంఛైజీకి గుడ్‌బై చెబుతాడా? అనేవి చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో.. ‘లక్నో ఈ నెల 14న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఇందుకు ఇంకా గడువు ఉండటంతో ఏ నిర్ణయం తీసుకోలేదు. మేనేజ్మెంట్ తప్పిస్తుందా లేదంటే కెప్టెన్ రాహులే వైదొలగుతాడా అనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుంది’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.తాజాగా ఈ విషయం గురించి లక్నో వర్గాలు స్పందిస్తూ.. ‘‘కేఎల్ రాహుల్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడమే గాక... వచ్చే వేలంలో కూడా అతడిని లక్నో తీసుకోదు అని వస్తున్నవి కేవలం వదంతులు మాత్రమే.గత మ్యాచ్ ఫలితం మాకు అనుకూలంగా లేదనే బాధ ఉంది. అయితే, జట్టు, ఓనర్ల మధ్య అంతా బాగానే ఉంది. రాహుల్ కూడా బాగున్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడంతే!’’ అని వార్తా సంస్థ IANSకు తెలిపాయి. కాగా సంజీవ్ గోయెంకా తీరుతో రాహుల్ తీవ్ర మనస్తాపం చెందడం, సోషల్ మీడియాలో తనపై పెద్ద ఎత్తున నెగటివిటీ రావడంతో ఆయన అతడిని క్షమాపణ కోరినట్లు వదంతులు వినిపిస్తున్నాయి.చదవండి: ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే.. సన్‌రైజర్స్ చేయాల్సిందిదే! ఆ రెండు జట్లు కన్ఫామ్!?
బిజినెస్
జియో గుడ్‌న్యూస్.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా 15 ఓటీటీ యాప్స్
జియో ఫైబర్ తమ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్‌స్టార్ ప్రాథమిక సబ్‌స్క్రిప్షన్‌తో సహా 15 యాప్‌ల ప్రీమియం సేవలను రూ. 888 మంత్లీ ప్లాన్‌కే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇది 30 ఎంబీపీఎస్ ఎంట్రీ లెవల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్.నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ గతంలో రూ. 1,499 ప్లాన్‌ని కలిగి ఉన్న జియోఫైబర్ (JioFiber) కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఎంట్రీ లెవల్ 30 ఎంబీపీఎస్ ప్లాన్‌తో కస్టమర్లకు ఎంటర్టైన్మెంట్ యాప్‌ల యాక్సెస్ ఉండేది కాదు. అదేవిధంగా, ఎయిర్ ఫైబర్ (AirFiber) కస్టమర్ల కోసం రూ. 1499 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్లాన్లలో మాత్రమే నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్ అందుబాటులో ఉంది.కంపెనీ సమాచారం ప్రకారం.. జియో రూ.888 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ అందిస్తున్న 15 ఓటీటీ యాప్‌ల సేవల్లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్, డిస్కవరీ ప్లస్, ఆల్ట్‌బాలాజీ వంటివి ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో పోటీ నెలకొన్న నేపథ్యంలో తమ కొత్త ప్లాన్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయన్న నమ్మకంతో జియో ఉంది.
పసిడికి అక్షయ తృతీయ శోభ
ముంబై: అక్షయ తృతీయ పండుగ సందర్భంగా డిమాండ్ పెరగడంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. ముంబైలో పసిడి రూ.1,506 పెరిగి రూ.73,008 చేరింది. కిలో వెండి ధర రూ. 1873 ఎగసి రూ.84,215 కి చేరింది.పసిడి దిగుమతులు 30 శాతం అప్ కాగా భారత్ పసిడి దిగుమతులు మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో 30 శాతం పెరిగాయి. విలువలో 45.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దేశీయ పటిష్ట డిమాండ్ దీనికి కారణం. భారత్‌కు దిగుమతుల విషయంలో స్విట్జర్లాండ్ (40%) మొదటి స్థానంలో నిలుస్తుండగా, తరువాతి స్థానాల్లో యూఏఈ (16%), దక్షిణాఫ్రికా (10%) ఉన్నాయి. దేశం మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా దాదాపు 5 శాతం. పసిడిపై ప్రస్తుతం 15శాతం దిగుమతుల సుంకం అమలవుతోంది. చైనా తర్వాత భారత్ అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉంది. కాగా, 2023–24లో వెండి దిగుమతుల విలువ 2.72 శాతం పెరిగి 5.4 బిలియన్ డాల ర్లుగా నమోదైంది.
వరుస నష్టాలకు బ్రేక్
ముంబై: స్టాక్ సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. ఎన్నికల అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూలతలున్నా.., అధిక వెయిటేజీ రిలయన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్ల రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడి 72,664 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 22,055 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్టాలకు దిగివచి్చన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. లండన్ మెటల్ ఎక్సే్చంజీలో బేస్ మెటల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. అలాగే యుటిలిటీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, కమోడిటీ, టెలికం, ఆటో షేర్లు రాణించాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 542 పాయింట్లు ఎగసి 72,947 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు బలపడి 22,131 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. మరోవైపు ఐటీ, బ్యాంకులు, టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా ఆర్థిక గణాంకాలు ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, ప్రతి రెండు షేర్లకు ఒక షేరు బోనస్ ప్రకటించడంతో బీపీసీఎల్ షేరు 4.5% లాభపడి రూ.619 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% పెరిగి రూ.622 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.8 శాతం
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2023–24 ఆర్థిక సంవత్సరంలో (2022–23తో పోల్చి) 5.8 శాతం పురోగమించింది. మార్చిలో 4.9 శాతంగా నమోదైంది. 2023 ఫిబ్రవరి (5.6 శాతం) కన్నా మార్చితో స్పీడ్ తగ్గినప్పటికీ, 2023 మార్చి కన్నా (1.9 శాతం) పురోగమించడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే వృద్ధి స్వల్పంగా 5.2 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగింది. భారత్ ఎకానమీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 18.4 శాతం. పారిశ్రామిక రంగం వాటా 28.3 శాతం. సేవల రంగం వాటా 53.3 శాతం. పారిశ్రామిక రంగంలో ఒక్క తయారీ రంగం వాటా దాదాపు 70 శాతం. రంగాల వారీగా..(శాతాల్లో) విభాగం 2024 2023 మార్చి మార్చి తయారీ 5.2 1.5 మైనింగ్ 1.2 6.8 విద్యుత్ ఉత్పత్తి 8.6 – 1.6 క్యాపిటల్ గూడ్స్ 6.1 10 కన్జూమర్ డ్యూరబుల్స్ 9.5 – 8.0 కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ 4.9 –1.9 ఇన్ఫ్రా/నిర్మాణం 6.9 7.2 ప్రైమరీ గూడ్స్ 2.5 3.3 ఇంటరీ్మడియట్ గూడ్స్ 5.1 1.8
వీడియోలు
జగన్ పాటకు ఊగిపోయిన పిఠాపురం ప్రజలు
డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురానికి పంపుతా
"గీతమ్మను గెలిపిస్తే.." పిఠాపురం ప్రజలకి బంపర్ ఆఫర్
బాలయ్య బాబు కి బలమైన కౌంటర్లు పిఠాపురం సాక్షిగా దత్తపుత్రుడి పరువు..!
గీతమ్మను, సునీల్ ను ఆశీర్వదించండి..
పిఠాపురంలో దత్తపుత్రుడిపై సీఎం జగన్ పవర్ పంచ్..
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
జగన్ కి ఓటు వేస్తే ఇంటింటి అభివృద్ధి, కూటమికి ఓటు వేస్తే పథకాలు ముగింపు
నా అంతిమ యాత్ర ..! వంగా గీత ఎమోషనల్ స్పీచ్
వంగా గీత గూస్ బంప్స్ స్పీచ్.. దద్దరిల్లిన పిఠాపురం
ఫ్యామిలీ
కుందనపు బొమ్మలా ప్రియాంకా జైన్ ఫొటోలు
మదర్స్ డే స్పెషల్: మీ అమ్మని ఇలా సర్ ప్రైజ్ చేయండి..!
‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట.. అది ఎన్నెన్నో తెలియని మమతల మూట’’, ‘‘అమ్మను మించిన దైవమున్నదా..‘‘ పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ’’ ఇలా ఎలా పాడుకున్నా..అమ్మకు సాటి పోటీ ఏమీ ఉండదు. పొత్తిళ్లలో బిడ్డను చూసింది మొదలు తన చివరి శ్వాసదాకా బిడ్డను ప్రేమిస్తూనే ఉంటుంది. అంతటి ప్రేమమూర్తి అమ్మ. నిస్వార్థ ప్రేమకు చిరునామా అమ్మ. ప్రపంచమంతా మదర్స్ డే శుభాకాంక్షలు అందించే వేళ మీరు మీ అమ్మకు విషెస్ ఇలా చెప్పండి.నిజానికి అమ్మ ప్రేమను ఒకరోజుకో, ఒక్క క్షణానికో పరిమితం చేయడం అసాధ్యం. ప్రతీ రోజూ ప్రతీక్షణం అమ్మను ప్రేమించాలి. మనకు జీవితాన్నిచ్చిన అమ్మకు జీవితాంతం రుణ పడి ఉండాల్సిందే.ఈ మాతృ దినోత్సవం రోజున అమ్మను సర్ ప్రైజ్ చేద్దామాపొద్దున్న లేవగానే హ్యాపీ మదర్స్ డే అంటూ అమ్మకు విషెస్ చెప్పండి. ఆనందంగా ఆలింగనం చేసుకోండి. హృదయపూర్వకంగా ముద్దుపెట్టుకోండి. మామ్.. నాకు లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ..లవ్యూ అని చెప్పండి. అంతే అపుడు అమ్మ చూపించే మీప్రేమకు మీ కన్నీళ్లు ఆగవు అంతే. అమ్మ ప్రేమ అలాంటిది మరి. అమ్మకిష్టమైన వంటఅమ్మ రోజూ మనకోసం ఎన్నో చేసి పెడుతుంటుంది. స్కూలుకు, కాలేజీకి, పట్టుకెళ్లిన బాక్స్ పూర్తిగా తినలేదని కోప్పడుతుంది కదా. అందుకే మదర్స్ డే రోజు తనకోసం, తన ఇష్టాఇష్టాలను గురించి, అమ్మకోసం మంచి వంటకం చేసి పెట్టండి. అమ్మకోరిక తెలుసుకోండినిరతరం మనకోసం ఆలోచించే అమ్మ తన గురించి, తన కోరికలు గురించి అస్సలు పట్టించుకోదు. అందుకే ఆమెకు ఏది ఇష్టమో బాగా ఆలోచించండి. స్పెషల్ గిఫ్ట్‌తో సర్ప్రైజ్ చేయండి. మంచి పుస్తకం, చీర, మొక్కలు లాంటివి కొనివ్వండి. లేదంటే వంట ఇంటి పనిలో భాగంగా ఇది ఉంటే బావుండు ఎపుడూ ఆలోచిస్తూ ఉంటుందో దాని గుర్తించి ఆ వస్తువును ఆమెకు అందుబాటులోకి తీసుకురండి. అమ్మ సంబరం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అమ్మకు ప్రేమించడం మాత్రమే తెలుసు.అమ్మతో బయటికికుటుంబంకోసం ఆలోచిస్తూ తన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని పక్కన బెట్టే అమ్మను సరదాగా అలా బయటికి తీసుకెళ్లండి. అది మూవీ కావచ్చు, హోటల్‌కి కావచ్చు, మ్యూజిక్ కన్సర్ట్కి కావచ్చు. లేదంటే అమ్మకెంతో ఇష్టమైన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లండి.స్పాకి తీసుకెళ్లండిసంవత్సరమంతా బిడ్డల కోసం కష్టపడే అమ్మను ఆమెను స్పాకి తీసుకెళ్లండి. తల్లికి అలసట నుండి ఉపశమనం కలిగించే ప్రత్యేక స్పా ప్యాకేజీని తీసుకోండి. కొత్త ఉత్సాహం వచ్చేలా ఏదైనా గ్రూమింగ్‌కి ప్లాన్ చేయండి. తన కోసం ఆలోచించే బిడ్డలు ఉన్నారనే తృప్తి మిమ్మల్ని మరింత ప్రేమించేలా చేస్తుంది. దూరంగా ఉన్నారా..అమ్మకు దూరంగా ఉన్నా పరవాలేదు. అమ్మకు దగ్గరగా లేనని ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. కాల్ చేయండి. ఎలా ఉన్నావు? అమ్మా అని ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడండి. ఆమె మనసులో ఏముందో తెలిసుకునే ప్రయత్నం చేయండి. నీను నేను న్నాను అనే భరోసా ఇవ్వండి. ఆమె సంతోషానికి అవధులు ఉండవు. మీరు చేసే ఏ చిన్నపని అయినా ఆమెకు కొండంత సంతోషాన్నిస్తుంది.అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే! అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే!!
Northern Lights Photos: అరోరా వెలుగులు, నెట్టింట వైరల్ ( ఫోటోలు)
అద్భుతమైన అరోరా...ఔరా అనేలా : నెట్టింట హల్ చల్
ప్రపంచ వ్యాప్తంగా అరుదుగా కనిపించే అరోరా అద్భుతంగా ఆవిష్కృతమైంది. ఐరోపాలోని చాలా ప్రాంతాల్లో గులాబీ, పర్పుల్ రంగుల్లో అద్భుతమైన ఖగోళ కాంతి ప్రదర్శన, అరోరా బొరియాలిస్ ఆకాశంలో ప్రకాశించింది. దీంతో నెటిజన్లు తెగ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎక్స్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.Strongest Aurora in last 20 years was visible last evening. This was how it looked on top of Jungfraujoch, Switzerland Video via webcams on https://t.co/BwS7eM6IEY#solarstorm pic.twitter.com/rqG5S2poKb— Backpacking Daku (@outofofficedaku) May 11, 2024 రెండు దశాబ్దాల తరువాత అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకిన తర్వాత శుక్రవారం నాడు నార్తర్న్ లైట్లు ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా కనిపించాయి. భూ అయస్కాంత తుఫాను, భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు అరోరా ఏర్పడుతుంది. సూర్యుడు, భూ అయస్కాంత క్షేత్రాల ప్లాస్మా కణాల మధ్య పరస్పర చర్యల వల్ల ఇవి ఆవిష్కృతమవుతాయి. Guys I’m actually in tears I thought I’d never get to see the northern lights 😍😭 pic.twitter.com/kk8unLfhwE— Jimin’s Toof (B-ChimChim) Semi-IA (@ForeverPurple07) May 11, 2024 చాలామంది యూజర్లు అరోరాను వీక్షించిన తరువాత తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలతోపాటు, ఇటలీ, ఫ్రాన్స్. రష్యా అంతటా, ప్రత్యేకించి మాస్కో ప్రాంతంలో ఇవి దర్శనమిచ్చాయి. అలాగే సరాటోవ్ , వొరోనెజ్లో, దక్షిణ సైబీరియాలో కూడా కనిపించాయి. ఉత్తర జార్జియాకు చెందిన యూజర్ కూడా అరోరా బొరియాలిస్ అద్భుత చిత్రాలను పంచుకున్నారు. ఈ అందమైన దృశ్యాన్ని చూసిన వారు "చాలా చాలా అదృష్టవంతులు" అని ఒకరు, నాకు కన్నీళ్లు ఆగడం లేదంటూ మరొకరు భావోద్వేగానికి లోను కావడం విశేషం. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్, అలాస్కా వంటి భూమి, అయస్కాంత ధ్రువాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో నార్తర్న్ లైట్లు సాధారణంగా కనిపిస్తాయి. మరోవైపు భూమి అయస్కాంత క్షేత్రంలో మార్పులతో వచ్చే పరిణామాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఉపగ్రహ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు , పవర్ గ్రిడ్లకు సూచించారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
అవ్వాతాతల పెన్షన్లపై చంద్రబాబు పాపిష్టి కళ్లు.. నరసాపురం, క్రోసూరు, కనిగిరి ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పాకిస్తాన్ ఆరాటం.. గుజరాత్ ప్రచారంలో ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
Swimming Pool: అయ్యో శివశౌర్య
మొయినాబాద్: వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని.. ఆటలో మెలకువలు నేర్చుకుందామని వెళ్లిన చిన్నారి విగతజీవిగా మారాడు. స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి ఒకటో తరగతి చిన్నారి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మొయినాబాద్ మండలం సుజాత స్కూల్లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సురంగల్‌కు చెందిన గాండ్ల విక్రమ్ చిన్న కుమారుడు గాండ్ల శివశౌర్య (7) నాగిరెడ్డిగూడ రెవెన్యూ పరిధిలోని సుజాత స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో స్కూల్లో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు క్రికెట్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, యోగాతో పాటు స్విమ్మింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. విక్రమ్ తన కుమారుడు శివశౌర్యను బ్యాడ్మింటన్ నేరి్పంచేందుకు క్యాంపులో చేరి్పంచాడు. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో శివÔౌర్య స్విమ్మింగ్ చేస్తూ నీటిలో మునిగాడు. సిబ్బంది గమనించి విద్యారి్థని బయటకు తీశారు. నీళ్లు మింగి అపస్మారకస్థితిలో ఉండటంతో వెంటనే స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే.. పిల్లలకు, పెద్దలకు వేర్వేరుగా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. నాలుగు రోజులుగా పిల్లల స్విమ్మింగ్ పూల్ రిపేర్‌లో ఉంది. దీంతో పెద్దల స్విమ్మింగ్ పూల్‌లోనే పిల్లలను స్విమ్మింగ్ చేయిస్తున్నారు. పిల్లలకు సేఫ్టీ బెలూన్స్ లేవని.. అవి తేవాలని కోచర్లు యాజమాన్యానికి సూచించినా వారు పట్టించుకోలేదని తెలిసింది. గుండెలు బాదుకున్న తల్లిదండ్రులు సమ్మర్ క్యాంపులో భాగంగా బ్యాడ్మింటన్ శిక్షణకు పంపామని.. స్విమ్మింగ్ చేయిస్తున్నట్లు తమకు తెలియదని చిన్నారి తండ్రి విక్రమ్ రోదించారు. తమ కుమారుడి మరణానికి పాఠశాల యాజమాన్యమే కారణమని వాపోయారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.
మన్యంలో మోసగాడిగా.. పచ్చ నేత! యథేచ్ఛగా మేత!!
పాడేరు: మఠం భాస్కర్.. రంపచోడవరం నియోజకవర్గంలో ఈయన పేరు తెలియని వారండరు.. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో సిద్ధహస్తుడు. సొంతూరు రాజవొమ్మంగి మండలం అనంతగిరి. రంపచోడవరం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మిరియాల శిరీషాదేవికి భర్త. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు రూ.కోటి వరకు గతంలో వసూలు చేశాడు.. ఆ సొమ్ముకోసం ఇప్పటికీ బాధితులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఆయన నేరచరిత్ర కూడా పెద్దదే. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడిన పలు కేసుల్లో నిందితుడు. నిరుద్యోగులకు మంచి జరగాలంటే భార్య శిరీషాదేవికి ఓటేయాలని ఇప్పుడు అభ్యర్థిస్తున్నాడు. అతను మాటలు నమ్మితే మన్యాన్ని మడత పెట్టేస్తాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల్లో రంపచోడవరం అసెంబ్లీకి పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి మఠం భాస్కర్ రాజవొమ్మంగి పోలీసు స్టేషన్లో నమోదైన పలు కేసుల్లో నిందితుడు. ఏజెన్సీలో గిరిజన యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని రెండేళ్ల క్రితం వారి నుంచి సుమారు రూ.కోటి వరకు డబ్బులు వసూలు చేశాడు. నియోజకవర్గంలోని రాజవొమ్మంగి, జడ్డంగి, దేవీపట్నం, వీఆర్‌పురం, డొంకరాయి, అడ్డతీగల గ్రామాల్లో ఆయన ఉచ్చులో పడి మోసపోయిన బాధితులు ఎంతోమంది ఉన్నారని ప్రచారం జరుగుతోంది.రాజవొమ్మంగి మండలం చికిలింత గ్రామానికి చెందిన గిరిజన యువకుడికి ఓ ఎయిడెడ్ స్కూల్లో టీచర్ పోస్టు ఇప్పిస్తానని రూ.3 లక్షల వరకు తన ఖాతాకు నగదు బదిలీ చేయించుకున్నట్టు సమాచారం. ఇందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన టీడీపీకి చెందిన ఓ నాయకుడు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని అడిగినట్టు సమాచారం. డబ్బులు ఇచ్చే వరకు అడగవద్దని హెచ్చరించినట్టు తెలిసింది.అడ్డతీగల మండలం దుప్పులపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు గిరిజన యువకుల నుంచి సీఆర్టీ పోస్టు ఇప్పిస్తానని ఒకొక్కరి నుంచి రూ.లక్ష చొప్పన మూడు లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా మరో యువకుడి నుంచి టీచర్ పోస్టు ఇప్పిస్తానని రూ.లక్ష, గుమస్తా పోస్టుకు రూ. 60 వేలు మధ్యవర్తుల సమక్షంలో వసూలు చేసినట్టు సమాచారం. ఇలా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించేందుకు ఒప్పుకున్న మఠం భాస్కర్ పూర్తిగా చెల్లించిన దాఖల్లాలేవు. ఉద్యోగాలు మాట దేవుడెరుగు మా డబ్బులు మాకివ్వండి అంటూ గిరిజన యువత గగ్గోలు పెట్టిన ఫలితం లేకుండా పోయింది. అయితే ఎప్పటికైనా ఎంతో కొంత మొత్తం ఇస్తాడన్న ఆశతో వారు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పేందుకు రాలేకపోతున్నారు.అసెంబ్లీ అభ్యర్థి శిరీషాదేవి భర్త మఠం భాస్కర్‌కు నేర చరిత్ర కూడా ఉంది. రాజవొమ్మంగి పోలీసుస్టేషన్లో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.2016లో రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్Œ వద్ద విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఏకే దొరపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. వాహనాలను తనిఖీ చేస్తున్న అతనిపై దాడికి దిగడంతో (ఎఫ్ఐఆర్: 50/2017) అదే పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. 2017లో అతని స్వగ్రామం అనంతగిరిలో జీడిమామిడి తోటను దగ్ధం చేశాడు. గ్రామస్తుల సమక్షంలో బాధిత రైతుకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామపెద్దలు చెప్పినప్పటికీ అందుకు అంగీకరించనట్టు తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు (ఎఫ్ఐఆర్: 15/2017) రాజవొమ్మంగి పోలీసుస్టేషన్లో కేసు నమోదు అయింది.2019లో జరిగిన ఎన్నికల సమయంలో రాజవొమ్మంగిలో గొడవకు దిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడన్న అభియోగంపై (ఎఫ్ఐఆర్:47/2019) కేసు నమోదైంది.2022లో అనంతగిరి గ్రామ సమీపంలో అశ్లీల నృత్య ప్రదర్శన, పేకాట, గుండాట నిర్వహించాడన్న అభియోగం మేరకు అతనిపై రాజవొమ్మంగి పోలీసులు (ఎఫ్ఐఆర్: 10/2022) కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులన్నీ కోర్టులో విచారణ దశలో ఉన్నాయి.ఇవి చదవండి: కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్ కళ్యాణ్
చికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం ఆందోళనలో తల్లిదండ్రులు
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం కావడం కలకల రేపుతోంది. ఉన్నత విద్య కోసం చికాగో వెళ్లిన తెలంగాణకు చెందిన 25 ఏళ్ల రూపేష్ చంద్ర చింతకింది అదృశ్యం అయ్యాడు. అతని అచూకీ కోసం కుటుంబ సభ్యులు భారత రాయబార వర్గాలను సంప్రదించారు. చికాగోలోని ఎన్ షెరిడాన్ రోడ్ 4300 బ్లాక్ నుంచి అతను తప్పిపోయినట్లు తెలుస్తోంది. టెక్సాస్ నుండి కలవడానికి వచ్చిన ఒకరిని కలవబోతున్నాడని చెప్పినట్లు సమాచారం.‘‘మే 2 మధ్యాహ్నం వాట్సాప్‌లో మాట్లాడాను. ఏదో పని మీద ఉన్నా అని చెప్పాడు. అంతే అప్పటినుంచి ఆఫ్‌లైన్‌లో ఉన్నాడు" రూపేష్ తండ్రి సదానందం తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేశ్ విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. వారం రోజులుగా రూపేశ్ ఆచూకీ లభించకపోవడంతో హైదరాబాద్‌లోఉంటున్న అతని తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగా శాఖను కోరింది. త్వరలోనే రూపేశ్ అచూకీ తెలుస్తుందని ఆశిస్తున్నామని చికాగోలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.The Consulate is deeply concerned learning that Indian student Rupesh Chandra Chintakindi is incommunicado since 2nd May. Consulate is in touch with the police and the Indian diaspora hoping to locate/reestablish contact with Rupesh.@IndianEmbassyUS @MEAIndia— India in Chicago (@IndiainChicago) May 8, 2024మే 2 నుంచి రూపేశ్ మిస్సయినట్లు చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. అతడి ఆచూకి కోసం పోలీసులు ప్రవాస భారతీయులతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. రూపేష్ ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని స్థానిక పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
రాసలీలల రామ్మోహన్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం బట్టబయలైంది. పలువురు మహిళలతో అసభ్యకరంగా చాటింగ్ చేసినట్టు వెల్లడైంది. ప్రస్తుతం వాట్సప్ చాటింగ్, స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయవాడలోని వివిధ వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ పేజీల్లో, ఇన్‌స్ట్రాగాం వేదికల్లో అవి చక్కెర్లు కొడుతుండటంతో ఆయన లీలలపై తూర్పు నియోజకవర్గ ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. మహిళా ఓటర్లయితే గద్దెకు గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లకు గద్దె నిజ స్వరూపం బట్ట బయలైందని టీడీపీ వర్గీయులే వ్యాఖ్యానించిడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు 15 ఏళ్లుగా అనుచరుడిగా ఉన్న ఒకరు ఆయన రాసలీలల వ్యవహారాలను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విజయవాడ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల గద్దె ప్రధాన అనుచరుడు మహిళలను వేధింపులకు గురిచేసి, దాడి చేయడంతో పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా గద్దె వాట్సప్ చాటింగ్ వెలుగులోకి రావడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే తూర్పు నియోజక వర్గంలో గద్దె గ్రాఫ్ పడిపోవడంతో తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వాట్సప్ చాటింగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నాయకులే తేల్చిచెబుతున్నారు.