Top Stories
ప్రధాన వార్తలు
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు (నెల్లూరు జిల్లా)
పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఎన్నికల బరిలో తలపడుతున్న వైఎస్సార్సీపీ అభ్యర్ధి వంగా గీత చాలా వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆమె తన పార్టీ గురించి, తన గురించి, తన ప్రభుత్వ స్కీముల గురించి చెబుతున్నారే తప్ప పవన్‌ను ఏ విధంగాను విమర్శించడం లేదు. అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆమె తెలివిగా ప్రచారం చేపట్టారు. వంగా గీత.. గత మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నారు. విద్యార్ధి దశలో ఉన్నప్పుడే ఆమె రాజకీయాలపై ఆసక్తితో ఉండేవారు. సామాజిక స్పృహతో ఉండేవారు. పవన్‌తో పోల్చితే పెద్ద ధనికురాలు కూడా కాదు. అయినా స్వయంశక్తితో, రాజకీయాలలోకి వచ్చారు. 1994లో శాసనసభ సీటు కోసం ప్రయత్నించారు కాని సఫలం కాలేదు. తదుపరి కాలంలో జడ్పి చైర్ పర్సన్ గాను, రాజ్యసభ సభ్యురాలిగా, శాసనసభ సభ్యురాలిగా, 2019లో లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.ఆయా సందర్భంలో ఆమె ప్రజల సమస్యలపై శ్రద్ద వహించేవారు. సాధ్యమైన మేరకు ఆ సమస్యలను తీర్చే యత్నం చేసేవారు. ప్రజలలో కలిసిపోతుంటారు. ఆమె తమకు అందుబాటులో ఉండరన్న మాట రానివ్వరు. కరోనా సమయంలో జబ్బుబారిన పడ్డవారికి ఆమె భయపడకుండా సేవలందించారు. వ్యాధి సోకినవారిని స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే, వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రులకు పంపించడానికి కృషి చేసేవారు. ఇవన్ని ఆమెకు ఇప్పుడు పాజిటివ్ పాయింట్లుగా ఉన్నాయి. బాగా విద్యాధికురాలు. రెండు పీజీలు, న్యాయశాస్త్ర పట్టభద్రురాలుగా ఉన్నారు. ఆమె లాయర్‌గా కూడా పేదలకు సేవలందించారు. ఆమె భర్త విశ్వనాద్ కూడా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆమెకు చేదోడువాదోడుగా నిలబడడం కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎవరైనా ‘పవన్‌తో పోటీ పడుతున్నారు.. మరి గెలవడం సాధ్యమా?’ అని అడిగితే, 'ఆయనకు సినిమా రంగంలో పేరు ఉంది.. నాకు ప్రజాసేవ రంగంలో పేరు ఉంది. పవన్‌కు కూడా ప్రజా సేవ చేయాలని ఉండవచ్చు.. కాని ఆయనకు ఉన్న పరిస్థితులు అందుకు అవకాశం ఇవ్వవు" అని నేర్పుగా సమాధానం చెబుతున్నారు.పవన్ విద్య గురించి ఎవరైనా అడిగితే, దాని గురించి తాను మాట్లాడనని, ఆయన సినిమాలలో స్టార్ అయ్యారు కదా! అంటూ తనకు ఉన్న డిగ్రీలు, ఇతర అర్హతలను మాత్రమే వివరిస్తున్నారు. పవన్ చదువు తక్కువ అనే పాయింట్‌ను కూడా ప్రస్తావించడం లేదు. తాను ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తినని చెప్పడానికి పలు ఉదాహరణలు వివరిస్తుంటారు. ఎవరికైనా నియోజకవర్గ ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే, తాను పిఠాపురంలోనే అందుబాటులో ఉంటానని, అదే పవన్ అయితే ఎక్కడో షూటింగ్లలో బిజీగా ఉంటారని, అందువల్ల ఆయన చేయలేరని, ఆయన పీఏలను పెట్టుకున్నా ప్రజలకు సేవలందించడం కష్టమని అంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపట్ల ప్రజలు ఆకర్షితులయ్యారని, ముఖ్యంగా మహిళలు అయితే మరింతగా ఆదరిస్తున్నారని ఆమె చెబుతున్నారు. ప్రచారంలో ఎవరి ఇంటి వద్ద అన్నా ఆగకపోతే ప్రత్యేకించి పిలిచి మరీ తమ ఇళ్లవద్దకు తీసుకు వెళుతున్నారని ఆమె చెప్పారు. ఆయన ప్రచారానికి ఇప్పటికే నాగబాబు, జబర్దస్త్ టీమ్ తదితర నటులు వచ్చారని, బహుశా మెగాస్టార్ చిరంజీవి రాకపోవచ్చని అనుకుంటున్నానని గీత అభిప్రాయ పడ్డారు.లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని చెబుతున్న పవన్ వీరందరిని ఎందుకు తీసుకు వస్తున్నట్లు అని గీత ప్రశ్నిస్తున్నారు. మరో ఆసక్తికరమైన వాదన తెచ్చారు. పిఠాపురంలో ఏదైనా సమస్య ఉంటే తాను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించే అవకాశం ఉంటుందని, జనసేనకు ఆ అవకాశం ఉండదని, వారు వేరే పార్టీ వారి దగ్దరకు వెళ్లాల్సి ఉంటుందని, ఆ తేడాను కూడా ప్రజలు గుర్తించారని ఆమె చెబుతున్నారు. కాపు సామాజికవర్గం వారు పవన్ వైపు ఎక్కువగా ఉన్నారా అని ప్రశ్నిస్తే, అలా ఏమీ ఉండదని, తాను కాపువర్గానికి చెందిన వ్యక్తినే కదా అని అంటారు. తాను కాపు సామాజికవర్గానికి ఉపయోగపడే పనులు అనేకం చేయించానని, ప్రత్యేకించి కాపు కళ్యాణమండపాలు నిర్మించడానికి నిధులు సమకూర్చానని ఆమె గుర్తు చేస్తున్నారు. ఎవరైనా అన్ని సామాజికవర్గాల ఆదరణ పొందాలి తప్ప, ఏ ఒక్క వర్గమో సపోర్టు చేస్తే గెలిచే పరిస్థితి ఉండదని అన్నారు. కొంతమంది కావాలని బయట నుంచి వచ్చి అలజడులు సృష్టించడానికి యత్నిస్తున్నారని, ఇది చాలా ప్రశాంతమైన నియోజకవర్గమని, ప్రజలు వీటిని గమనిస్తున్నారని ఆమె అన్నారు.పవన్ కళ్యాణే పెద్ద సినిమా స్టార్ అయినప్పుడు, జబర్దస్త్ టీవీ నటులు వంటివారి ప్రచారంతో ఏమి అవసరం వచ్చిందోనని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా తాను విజయం సాధిస్తానన్న ధీమాను గీత వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో చాలామంది ఒక మాట చెబుతున్నారు. జగన్ చాలా తెలివిగా వంగా గీతను ఎంపిక చేసి పవన్‌ను ఆత్మరక్షణలో పడేశారని అంటున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వంటివారు ఆమెకు మద్దతు ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. పిఠాపురంలో సుమారు తొంభైవేల వరకు కాపుల ఓట్లు ఉండవచ్చని అంచనా. వాటి ఆధారంగా గెలవవచ్చన్న ఆశతో పవన్ అక్కడ పోటీలోకి దిగడం, వర్మ వంటి టీడీపీ నేతలను తనను గెలిపించాలని వేడుకున్న వైనం ఇవన్ని ఆయనకు కాస్త మైనస్ అయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తన అభ్యర్ధులను గెలిపించవలసిన నేత, తన గెలుపుకోసమే ఇతరులను అభ్యర్ధించవలసిన పరిస్థితి ఏర్పడడం చాలామందికి నచ్చడం లేదు.జనసేనకు స్వయంగా నియోజకవర్గం అంతటా పోల్ మేనేజ్ మెంట్ యంత్రాంగం లేదన్నది ఒక అభిప్రాయం. తెలుగుదేశం పార్టీవారి మద్దతు ఉన్నా, పిఠాపురాన్ని జనసేనకు ఇస్తారని ప్రకటన రాగానే, టీడీపీ శ్రేణులు భగ్గుమనడం కూడా పవన్‌కు నష్టం చేసింది. పవన్‌కు పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదని, అక్కడ ఉన్న సమస్యలు తెలియవని, తాను ఏమి చేస్తానో చెప్పలేకపోతున్నారని వైస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం సినిమా గ్లామర్ ఆకర్షణతో గెలవాలన్నది పవన్ వ్యూహం అయితే, ప్రజాసేవ ద్వారా వచ్చిన గ్లామర్‌తో పాటు జగన్ ప్రభుత్వం అమలు చేసిన స్కీముల ప్రభావంతో విజయం సాధించాలన్నది వంగా గీత వ్యూహంగా ఉంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
చిత్తూరు జిల్లా, సాక్షి: ‘‘ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్.. జగన్‌కు ఓటేస్తే.. పథకాలు కొనసాగింపు.. పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శనివారం మధ్యాహ్నం పలమనేరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుందన్నారు.‘‘పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్లే. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. రూ.2 లక్షల 70వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించాం. 59 నెలల్లోనే 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. పిల్లల చదువులు కోసం అమ్మఒడితో ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం’’ అని సీఎం జగన్ చెప్పారు‘‘రైతన్నల కోసం ఆర్బీకే వ్యవస్థ పనిచేస్తోంది. ఏ గ్రామానికి వెళ్లిన గ్రామ సచివాలయం కనిపిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాం. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచిపనైనా గుర్తుకొస్తుందా?. మన ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎప్పుడైనా ఇచ్చారా అని అడుగుతున్నా.. 14 ఏళ్లు సీఎంగా చేశాను అంటాడు చంద్రబాబు. ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు అబద్దాలు, మోసాలతో వస్తున్నాడు’’ అని సీఎం జగన్ దుయ్యబట్టారు.‘‘రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?. అర్హులకు 3 సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు.. చేశాడా?. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు.. చేశాడా?. సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?. ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చడా?. మళ్లీ ఈ మోసగాళ్లు సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నారు. కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తాననంటారు.. నమ్ముతారా?’’ అంటూ చంద్రబాబు మోసాలను సీఎం జగన్ ఎండగట్టారు.ప్రత్యేకహోదాను అమ్మేసిన బాబు లాంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా?• మోసగాళ్లతో మనం యుద్ధం చేస్తున్నాం• కొత్త హామీలతో మోసం చేసేందుకు మళ్లీ ముగ్గురు కలిసి వస్తున్నారు• 14 ఏళ్లపాటు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క మంచైనా చేశాడా?• అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు, మోసాలు• అధికారం దక్కిన తర్వాత చంద్రబాబు చంద్రముఖి మారిపోతాడు• బాబు తన హయాంలో పేద ప్రజలకు ఒక్క సెంటు భూమైనా ఇచ్చాడా? • ఈ 59 నెలల పాలనలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం• మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే సాంప్రదాయాన్ని పూర్తిగా మార్చేశాం• మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి 99 శాతం అమలు చేశాం• 59 నెలల పాలనలో రూ.2.70 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ• ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి• చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే• మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది• గ్రామ సచివాలయాల్లో ప్రజలకు 600 రకాల సేవలు అందుతున్నాయి• వర్షం రూపంలో దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తున్నారని భావిస్తున్నా
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఓ ఐదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా అనుకోకుండా చిన్న ఎల్ఈడీ బల్బు మింగాడు. కంగారుపడ్డ తల్లిదండ్రులు వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బల్బు బాలుడి ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు డాక్టర్లు గుర్తించారు.బాలుడు దగ్గుతుండడంతో పాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆపరేషన్ చేసి బల్బు తీయడానికి డాక్టర్లు ప్రయత్నించారు. రెండుసార్లు బ్రాంకోస్కోపి సర్జరీ చేసినప్పటికీ బల్బు బయటికి తీయడం వీలు కాలేదు. దీంతో డాక్టర్లు బాలుడి ఛాతి ఓపెన్ చేసి సర్జరీ చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు.మేజర్ సర్జరీ అని భయపడ్డ తల్లిదండ్రులు బాలుడిని శ్రీరామచంద్ర మిషన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు సీటీ స్కాన్‌తో బల్బును గుర్తించి బ్రాంకోస్కోపి సర్జరీ ద్వారా తీసివేశారు. దీంతో బాలుడి ఆరోగ్యం కుదుటపడింది. బాలుడు త్వరలోనే కోలుకుంటాడని డాక్టర్లు తెలిపారు.
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్, శ్రీలంక బౌలర్ మతీశ పతిరణ టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ధోని తనకు తండ్రిలాంటి వాడని పేర్కొన్నాడు. తన కన్న తండ్రి మాదిరే ధోని కూడా తనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడని తెలిపాడు.కాగా ఐపీఎల్-2022కు సిసంద మగల దూరం కాగా అతడి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్‌లో అడుగుపెట్టాడు పతిరణ. ఆ మరుసటి ఏడాది అంటే 2023లో 12 మ్యాచ్‌లలో కలిపి 19 వికెట్లు పడగొట్టాడు.ధోని నాయకత్వంలో సీఎస్కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. బేబీ మలింగగా ప్రశంసలు అందుకుంటూ ప్రస్తుతం సీఎస్కే ప్రధాన పేసర్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు.అయితే, దీనకంతటికి కారణం ధోనినే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యువ పేసర్ ఆరంభంలో తడబడ్డా తలా అతడికి అండగా నిలిచాడు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్న సమయంలోనూ నైతికంగా మద్దతునిచ్చాడు.ఈ నేపథ్యంలో తాజాగా సీఎస్కే ‘లయన్స్ అప్‌క్లోజ్’ చాట్‌లో మతీశ పతిరణ మాట్లాడుతూ ధోనితో తన అనుబంధం గురించి వివరించాడు. ‘‘మా నాన్న తర్వాత నా క్రికెట్ లైఫ్‌లో తండ్రి పాత్ర పోషించింది ధోనినే.నన్నొక చిన్నపిల్లాడిలా చూసుకుంటారు. నా పట్ల శ్రద్ధ వహిస్తారు. అవసరమైన సమయంలో సలహాలు, సూచనలు ఇస్తుంటారు. నేను ఎప్పుడు ఏం చేయాలో చెబుతూ ఉంటారు.ఇంట్లో మా నాన్న నాతో ఇలా ఉంటారో ఇక్కడ ధోని కూడా నాతో అలాగే ఉంటారు. చిన్న చిన్న విషయాలను కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తలు చెబుతారు. నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగేలా మోటివేట్ చేస్తారు.మైదానం వెలుపల మేము ఎక్కువగా మాట్లాడుకోము. అయితే, నన్ను కలిసిన ప్రతిసారీ.. ‘‘ఆటను ఆస్వాదించు. ఫిట్నెస్ కాపాడుకో’’ అని చెబుతారు.మహీ భాయ్.. మీరు వచ్చే సీజన్లోనూ ఆడాలి. ప్లీజ్ మాతో కలిసి ఆడండి.. అప్పటికీ నేనిక్కడ ఉంటే(నవ్వుతూ)’’ అంటూ పతిరణ ధోని పట్ల అభిమానం చాటుకున్నాడు.కాగా ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా.. ధోని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక పతిరణ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు కూల్చాడు. సీఎస్కే ఆడిన 10 మ్యాచ్‌లలో ఐదు గెలిచి పట్టికలో ఐదో స్థానంలో ఉంది.The bond beyond the field 💛🫂#LionsupClose Full video 🔗 - https://t.co/xt5t6K9SjR #WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/odZdVvlrF6— Chennai Super Kings (@ChennaiIPL) May 4, 2024
AP Election Updates May 4th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 4th May...5:10 PM, May 4th, 2024విశాఖ :గంటా శ్రీనివాస్ కాపు ద్రోహి: తోట రాజీవ్, కాపునాడు అధ్యక్షుడు, విశాఖరియల్ ఎస్టేట్ వ్యక్తులను ఎన్నికలకు గంటా వాడుకుంటున్నారుగంటా పోటీ చేసిన నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చెయ్యడుఅక్కడి ప్రజలకు అందుబాటులో ఉండడుగంటా ఏ నాడూ చట్ట సభలకు వెళ్ళింది లేదుగంటాకు పొలిటికల్ బ్రోకర్ పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాంగంటా మాకు అవసరం లేదని భీమిలి ప్రజలు అంటున్నారుగంటా మంత్రిగా ఉండి విశాఖకు ఏం చేశాడుగంటాను పవన్ కళ్యాణ్ పలుమార్లు తిట్టాడుఅలాంటి గంటాకు ఎంత డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారునోటికాడ కూడు లాక్కోవడం గంటాకు అలవాటుగంటా రాజకీయ బంధిపోటు దొంగ 3:46 PM, May 4th, 2024నన్ను అంతమొందించే ప్రయత్నం సీఎం రమేష్ చేస్తున్నారు: బుడి ముత్యాల నాయుడుతనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పోతున్నారునా ఇంటి మీద డ్రోన్ ఎగరేయవలసిన అవసరమేముంది?డ్రోన్‌తో నా కదలికలను పరిశీలిస్తున్నారురౌడీయిజం గుండాయిజం చేయాలని సీఎం రమేష్ చూస్తున్నారుప్రజాక్షేత్రంలో తనపై గెలవలేనని చెప్పి నన్ను అంతమొందించే కుట్రలు చేస్తున్నారువచ్చిన వారు కూడా సీఎం రమేష్ పంపితేనే వచ్చామని చెబుతున్నారుసీఎం రమేష్ చెబితేనే డ్రోన్ తో విజువల్స్ తీశామని వచ్చిన వారు చెబుతున్నారువారు మా ప్రాంతానికి చెందిన వ్యక్తుల కాదుఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తులతో రెక్కీ నిర్వహించాల్సిన అవసరమే ఉంది3:15 PM, May 4th, 2024పలమనేరు ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ప్రత్యేకహోదాను అమ్మేసిన బాబు లాంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా?మోసగాళ్లతో మనం యుద్ధం చేస్తున్నాంకొత్త హామీలతో మోసం చేసేందుకు మళ్లీ ముగ్గురు కలిసి వస్తున్నారు14 ఏళ్లపాటు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క మంచైనా చేశాడా?అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు, మోసాలు..అధికారం దక్కిన తర్వాత చంద్రబాబు చంద్రముఖి మారిపోతాడుబాబు తన హయాంలో పేద ప్రజలకు ఒక్క సెంటు భూమైనా ఇచ్చాడా?ఈ 59 నెలల పాలనలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాంమేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే సాంప్రదాయాన్ని పూర్తిగా మార్చేశాంమేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి 99 శాతం అమలు చేశాం59 నెలల పాలనలో రూ.2.70 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయిచంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమేమరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందిగ్రామ సచివాలయాల్లో ప్రజలకు 600 రకాల సేవలు అందుతున్నాయివర్షం రూపంలో దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తున్నారని భావిస్తున్నా 2:50 PM, May 4th, 2024విజయవాడమేము అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేశాం: దేవినేని అవినాష్విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్‌లో వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్10ఏళ్లలో అనేక మార్పులు, చేర్పులు జరిగాయి.. అనేక అనుభవాలు నేర్పిందితూర్పు నియోజకవర్గంలో గత ప్రభుత్వాలు, గత పాలకులు చేయలేని అభివృద్ధి పనులు చేశాం..2వ డివిజన్ నుండి 22 వ డివిజన్ వరకు అన్ని పనులు చేశాంటీడీపీ అధికారంలో ఉండి, మేయర్ ప్రజా ప్రతినిధులు అన్ని ఉన్నా అభివృద్ధి శూన్యంకొండ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించాం2019, 2020లో వరదలు వచ్చాయికృష్ణ లంక కరకట్ట ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ పూర్తిచేశాంరూ. 150 కోట్లు మొదటి విడతలోనే ఇచ్చాంమేము చేసిన పనిని టీడీపీ వాళ్ళు చేసారని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? వీడియోలు ఎలా తీయించుకోగలుతున్నారు?గద్దె రామ్మోహlన్‌రావు ఒక అసమర్థ ఎమ్మెల్యేకేవలం మాటలు, షో రాజకీయాలతో ప్రజలను గద్దె మోసం చేశాడువైఎస్సార్సీపీ కార్పోరేటర్లు గెలిచిన చోట టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదుమేము ఏ పార్టీ అభ్యర్థులు గెలిచారా అని చూడలేదు.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేశాం4 సంవత్సరాల కాలంలో ప్రతి గడపను 4 సార్లు తిరిగానుటీడీపీ ఒక్కసారి కూడా ప్రజల గడప తొక్కలేదురోడ్లు, మంచినీళ్లు, పార్కు లు ,డ్రైనేజ్ నిర్మించామని ప్రజలే చెపుతున్నారు.. ఇదే గా అభివృద్ధి- ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకున్న అభివృద్ధికి అడ్డాగా తూర్పు నియోజకవర్గాన్ని చూపిస్తాం2:42 PM, May 4th, 2024అనంతపురం:అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో భగ్గుమన్న టీడీపీ అసమ్మతిటీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయుల మధ్య ఘర్షణఐక్యత కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో రసాభాసపరస్పరం వాగ్వాదం, తోపులాటకు పాల్పడ్డ ఇరువర్గాలుటిక్కెట్ రాకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తి గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు 1:00 PM, May 4th, 2024చంద్రబాబుది క్రిమినల్ మైండ్: జోగి రమేష్చంద్రబాబుపై జోగి రమేష్ సీరియస్ కామెంట్స్‌రాజకీయ హాంతకుడు బాబు.డీబీటీ ద్వారా వచ్చే పథకాలను ఆపేయమన్నాడు.ఈసీకి ఫిర్యాదు చేయించిన దుర్మార్గుడు చంద్రబాబు.ఆసరా, చేయూత, విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ పథకాలు ఆపేయాలని ఈసీని కోరారు.అవ్వాతాతలను పొట్టన పెట్టుకున్న వ్యక్తి బాబు.చంద్రబాబు రాక్షసుడు మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు.బాబు నిజస్వరూపం ప్రజలు గమనించాలి.రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు.కుప్పంలో చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడించాలి.మంచి చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నాడు.ముఖ్యమంత్రి జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. 12:40 PM, May 4th, 2024బుడి ముత్యాల నాయుడు ఇంటిపై రెక్కీ! బీజేపీ నేతల ఓవరాక్షన్..డ్రోన్‌తో విజువల్స్ తీస్తున్న బీజేపీ నేతలు.అనుమానం వచ్చి ఆరా తీసిన స్థానికులు.పొంతన లేని సమాధానాలు ఇచ్చిన బీజేపీ నేతలు.విజువల్స్ తీస్తున్న వారిని పట్టుకున్న స్థానికులు.పట్టుకున్న వారిని పోలీసులకు అప్పగింత.నిందితులను విచారిస్తున్న పోలీసులు.విజువల్స్ తీసిన వారు స్థానికులు కాదంటున్న వైఎస్సార్సీపీ నేతలు.సీఎం రమేష్ ఆదేశాలతోనే విజువల్స్ తీశారంటున్న వైఎస్సార్సీపీ నేతలు, స్థానికులుదేవరపల్లి పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులుముగ్గురిని విచారిస్తున్న దేవరపల్లి పోలీసులుడ్రోన్ కెమెరాను ఎందుకు ఇంటిపై ఎగురవేస్తున్నారు అని ప్రశ్నించిన పోలీసులుముగ్గురి వద్ద బీజేపీ పార్టీ కండువాలు గుర్తించిన పోలీసులు 12:20 PM, May 4th, 2024సుజనా చౌదరికి వైఎస్సార్సీపీ నేతల కౌంటర్..కేశినేని నాని కామెంట్స్‌మైనారిటీలను, బీసీలను మోసం చేసి పక్క దారిలో పశ్చిమ నియోజకవర్గానికి వచ్చాడు. 12ఏళ్ళు రాజసభ సభ్యుడిగా, మూడేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న నీ వల్ల ఏమైనా అభివృద్ధి జరిగిందా?రాజ్యసభ సభ్యుడిగా 60కోట్లు నిధులు వస్తే ఒక్క అర్ధ రూపాయి అయినా ఖర్చు చేశావా?. పశ్చిమని బెస్ట్ చేస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారుఅసిఫ్, వైస్సార్సీపీ వెస్ట్ అభ్యర్థిచంద్రబాబు ఎలా మాయమాటలు చెప్పాడో.. అలాగే సుజనా కూడా మాయ మాటలు చెపుతున్నాడు.విజయవాడ ప్రజలకు సుజనా చౌదరి మొహం తెలుసా?డబ్బుంటే ఏదైనా చేయొచ్చని సుజనా భ్రమలో ఉన్నాడు.పశ్చిమలో తెలుగుదేశం కండువా కప్పుకొన్నాడు.. ఒక్కడు కూడా సుజనా వెనక లేరు.జెండాలు జత కట్టి వచ్చిన మమ్మల్ని ఢీకొట్టలేరు.. మా జెండా ఏ జెండా రెండు ఒకటే. 12:00 PM, May 4th, 2024గద్దెకు దేవినేని కౌంటర్ దేవినేని అవినాష్ కామెంట్స్.. జగన్ ప్రభుత్వం శంకుస్థాపనలే కాకుండా ప్రారంభోత్సవాలు కూడా చేసింది.రిటేనింగ్ ప్రారంభంతో గద్దె ఓటమి మొదలైందికరకట్టవాసుల కష్టాలు పట్టని టీడీపీ నేతలుప్రతీ ఇంటికే పథకాలు పంపిన జగన్ ప్రభుత్వానికే మా మద్దతు అని ప్రజలు అంటున్నారుటీడీపీ చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారుటీడీపీ నేతల లాగా కాల్ మనీ సెక్స్ రాకెట్ మా పార్టీ నేతలు లేరు670 కోట్లతో తూర్పు నియోజకవర్గ అభివృద్ధి జరిగిందిగంజాయికి పునాదులు వేసింది టీడీపీ ఎమ్మెల్యే కాదా?.విశాఖలో దొరికిన డ్రగ్స్‌కు గద్దె రామ్మోహన్ కుటుంబానికి సంబంధాలున్నాయినిజానిజాలు వెలికితీయాలిజగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని టీడీపీగా చెప్పుకోడానికి సిగ్గులేదా?.చిల్లర రాజకీయాలు చేయడం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కే దక్కుతుందిఅసమర్థ ఎమ్మెల్యే మాకు వద్దు అని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు 11:20 AM, May 4th, 2024బాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గనటీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన అప్పు ఆయన కడతారా?.75 ఏళ్లు దాటిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. కోట్ల సూర్యప్రకాశ్ ఒక్కరోజు నాతో పాటు వచ్చి డోన్‌లో తిరగండి. పుష్కర కాలం ఎంపీ పదవి అనుభవించి మీరేం సాధించారో చెప్పండి.ప్రతీ దానికి ట్యాక్స్‌లు కట్టిన నేడు ఆర్థిక నేరుస్థుడినా? అయితే మరి మిమ్మల్ని ఏమనాలి. ఎన్నికల్లో వేసిన నామినేషన్‌ను కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటారా?. ఆస్తులు సహా అని వివరాలు, దానికి సంబంధించిన పత్రాలను పక్కాగా రిటర్నింగ్ ఆఫీసర్‌కి సమర్పించాం. అప్లికేషన్లో రాయనంత మాత్రాన తప్పుడు నామినేషన్ అవుతుందా?. నాకు సంబంధించిన వివరాలన్నీ జతపరిచాం. రైల్వే సహాయ మంత్రిగా ఉండి.. పేకాట ఆడటమేనా అందుబాటులో ఉండటం అంటే? స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ ప్రతిపక్షాలకు మేలు జరిగేది కాదా?. డోన్‌ను కర్నూలులో కలుపుతారా అని అంటున్నారే నంద్యాలలో కలుస్తున్నప్పుడు ఏం చేశారు. మిమ్మల్ని, చంద్రబాబును ప్రజలు నమ్మేపరిస్థితి లేదు. 10:40 AM, May 4th, 2024బాబు నీకు పేదల ఉసురు తగులుతుంది: ఎంపీ విజయసాయిమానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెలా ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఈసీకి ఫిర్యాదుమొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు పంచాయతీ సెక్రటేరియట్లో సైతం పెన్షన్లు పంపిణీని అడ్డుకున్నారు. బ్యాంకుల్లో పెన్షన్ సొమ్ము జమ చేయించడంతో బ్యాంకుల దగ్గర పడిగాపులుకాస్తూ వడదెబ్బతో వయోవృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. బాబు ముఖంలో పశ్చాతాపానికి బదులు మందహాసం కనిపిస్తోంది. పేదల ఉసురు నీకు తప్పక తగులుతుంది బాబూ.మానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెల ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు తన నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదులు చేయించాడు. మొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 4, 2024 9:20 AM, May 4th, 2024మళ్లీ తప్పులో కాలేసిన లోకేశం! మళ్లీ తప్పులో కాలేసిన మంగళగిరి మాలోకం!ఏపీలో పోలింగ్ ఎప్పుడో కూడా తెలియనివాడు @JaiTDPలో ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వెళ్లి మార్చి 13న ఓటు వేసుకో @naralokesh.. ఏపీ ప్రజలంతా మే 13న ఓటు వేస్తారు మంగళగిరి ప్రజలారా ఇలాంటి బుర్రతక్కువ వాళ్ళు మీకు అవసరమా?#TDPJSPBJPCollapse#EndOfTDP pic.twitter.com/b2a2Xj64CR— YSR Congress Party (@YSRCParty) May 4, 2024 ఏపీలో ఎన్నికలు ఎప్పుడో కూడా తెలియని వ్యక్తి నారా లోకేష్మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ కామెడీ ట్రాక్‌మే 13న పోలింగ్ అయితే మార్చి 13న ఓటు వేయమన్న లోకేష్లోకేష్ మాటలతో ఒక్కసారిగా నవ్వుకున్న ప్రజలు 8:50 AM, May 4th, 2024చంద్రబాబు మరో కుట్ర..టీడీపీ అధినేత చంద్రబాబు మరో దారుణ కుట్రపేదలకు ప్రభుత్వ పథకాలు అందకుండా మోకాలడ్డుఇప్పటికే వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వనీయకపోవటంతో వృద్దులు, వికలాంగుల అవస్థలుబ్యాంకుల చుట్టూ మండుటెంటలో తిరుగుతున్న పెన్షన్ దారులుతాజాగా వైఎస్సార్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, విద్యాదీవెన, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ నిధులను ఇవ్వనీయకుండా అడ్డుఇవన్నీ గత ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలేఐనాసరే టీడీపీ ఫిర్యాదుతో నిధులను రిలీజ్ చేయనివ్వని ఎన్నికల సంఘంఇప్పటికే అనేకసార్లు ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరిన ప్రభుత్వంటీడీపీ ఫిర్యాదుతో ఇంకా అనుమతి ఇవ్వని ఈసీ 7:45 AM, May 4th, 2024ఓటమి భయంలో కూటమి నేతల ఓవరాక్షన్..ఓటమి భయంతో టీడీపీ, జనసేన కూటమి నేతల కుట్ర రాజకీయాలువైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక పోతున్న కూటమి నేతలుప్రచారాలలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులకి తెగబడుతున్న టీడీపీ, జనసేన కార్యకర్తలుసీఎం జగన్‌పై వ్యక్తిగత దూషణలతో కార్యకర్తలని రెచ్చగొట్టేలా ప్రచారంలో బాబు, పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు.వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పుతున్న టిడిపి, జనసేన నేతలుమచిలీపట్నంలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి పేర్ని కిట్టు ప్రచార సమయంలో దాడికి పాల్పడ్డ జనసేన, టీడీపీ నాయకులుదెందులూరు నియోజకవర్గంలో ప్రచారంలో ఉండగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లతో, కర్రలతో చింతమనేని అనుచరుల దాడిచిలకలూరిపేట నియోజకవర్గంలో ఈవూరివారిపాలెంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా కావటి మనోహర్ నాయుడుపై దాడికి ప్రయత్నం.అదే సమయంలో ప్రచార రథం ధ్వంసంమంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా మేకా వెంకట్ రెడ్డిపై దాడి.ఎన్నికల ప్రచారంలో నిలదీసిన మహిళని చెప్పుతో కొడతానంటూ రెచ్చిపోయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిసీఎం సభలకి పెరుగుతున్న జనాదరణతో కూటమి నేతలలో ఓటమి భయంఅందుకే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు.. అసహనంతో ప్రజలపై తిట్ల పురాణం 7:00 AM, May 4th, 2024నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..నేడు పలమనేరు నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గొనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్నేడు హిందూపురం, పలమనేరు, నెల్లూరులో బహిరంగ సభల్లో పాల్గొనున్న సీఎం జగన్సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి 12.10 నిమిషాలకు హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎంమధ్యాహ్నం ఒంటి గంటకు పలమనేరుకు చేరుకోనున్న సీఎం జగన్మధ్యాహ్నం 1.30 నుంచి 2.05 వరకు పలమనేరు బహిరంగ సభలో పాల్గొంటారు.మధ్యాహ్నం 2.30 పలమనేరు నుంచి బయలుదేరి 3.50 గంటలకు నెల్లూరు చేరుకోనున్న సీఎం జగన్మధ్యాహ్నం 3.50 నుంచి 4.35 గంటల వరకు నెల్లూరులో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. 6:45 AM, May 4th, 2024ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం: కేశినేని నానిచంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై పొత్తులో ఉన్న బీజేపీకి నమ్మకం లేదుఅందుకే మేనిఫెస్టోలో బీజేపీ నేతల ఫోటో ఒకటి కూడా లేదు.చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానీ మానిఫెస్టోఅందుకే మేనిఫెస్టోని పట్టుకోడానికి కూడా బీజేపీ నేతలు ఇష్టపడలేదురానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా సీఎం జగన్‌ను మరోసారి గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారుఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, పార్టీ కార్యాలయానికి తాళం వేయడం ఖాయంటీడీపీని బీజేపీలో విలీనం చేసి చంద్రబాబు హైదరాబాద్‌లో తన ఇంటికి వెళ్లిపోతారుఈ ఎన్నికలలో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందిదేవినేని ఉమా ఒక చచ్చిన పాము.. అతని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ఉమాకు సీటు రాకపోతే ఇంటికి వెళ్లి పరామర్శించలేని ద్రోహి తంగిరాల సౌమ్య 6:30 AM, May 4th, 2024జూనియర్‌ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని ఓడించాలి: కొడాలి నానిగుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నానిజూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలిపెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలపై నాకు, సీఎం జగన్‌కు అమితమైన ప్రేమఅందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాముపార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబుఅన్న ఎన్టీఆర్ వారసులు.. అభిమానులెవరు టీడీపీలో ఉండరు, చంద్రబాబు వెంట నడవరుపదిమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకొని టిడిపి కార్యక్రమాలకు వెళితే... ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాంమన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబు, లోకేష్ తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదుఅభిమానులందరూ కష్టపడి టిడిపిని గెలిపిస్తే.. ఎన్టీఆర్‌ను తుంగలో తొక్కుతారు. లోకేష్‌ను అందలం ఎక్కిస్తారుఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు పట్టుకున్నప్పుడే.. అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలిచంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తూ చిత్తుగా ఓడిస్తేనే.. పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కి వస్తాయిఎవరైతే పెద్ద ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారో.. పార్టీని కాపాడుకోవడానికి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరికి వస్తారుపెద్ద ఎన్టీఆర్‌కు దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారునేను పెద్ద ఎన్టీఆర్ భక్తుడిని.. నందమూరి హరికృష్ణ నా గురువు.. నేను వైసీపీలో ఉన్నా నాకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెబుతాను.నేను తిరిగే కారుకు ఎన్టీఆర్.. వైఎస్సార్ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను.ఎన్టీఆర్ కుటుంబంతో నాకు ఉన్న బాంధవ్యం విడదీయరానిది.. వారికోసం నేను.. నాకోసం వారు అనేక త్యాగాలు చేశారుఎన్టీఆర్, వైఎస్సార్ నాకు రెండు కళ్లుతెలుగుదేశం పార్టీ గౌడ.. యాదవ.. మత్స్యకార.. ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది.. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి.సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటుచేసి.. అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక రాజ్యసభ స్థానాలు ఇస్తూ.. ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించారు.ప్రజలను నమ్ముకుని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్‌కు, నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి.
సంజయ్‌లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
టైటిల్ : హీరామండి: ది డైమండ్ బజార్ (వెబ్‌సిరీస్)నటీనటులు: మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్, తదితరులునిర్మాణ సంస్థలు: భన్సాలీ ప్రొడక్షన్స్దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీసంగీతం: సంజయ్ లీలా భన్సాలీ,బెనెడిక్ట్ టేలర్,నరేన్ చందావర్కర్కథ: మొయిన్ బేగ్జానర్: చారిత్రక నాటకంఎపిసోడ్స్: 8 భాషలు: తెలుగుతో పాటు మొత్తంగా 14 భాషల్లో స్ట్రీమింగ్'హీరామండి: ది డైమండ్ బజార్' మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ పెద్ద సంచలనమే రేపుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా హీరామండి టాపిక్ నడుస్తూనే ఉంది. కథ నిడివి విషయం పక్కన పెడితే ఈ సిరీస్‌కు ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. బాలీవుడ్లో టాప్ డైరెక్టర్‌గా ముద్ర వేసిన సంజయ్ లీలా భన్సాలీ మొదటిసారిగా ఒక వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను తన నిర్మాణ సంస్థ నుంచే రూ. 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాడు. పీరియాడిక్ డ్రామా చిత్రాలకు పేరుగాంచిన సంజయ్ లీలా భన్సాలీ నుంచి ఇప్పటికే పద్మావత్, బాజీరావ్ మస్తానీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన తొలి వెబ్‌సిరీస్ 'హీరామండి' సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటంటే... బ్రిటీష్ పాలన సమయంలో లాహోర్‌లో ఉన్న వేశ్యావాటిక 'హీరామండి'లో ఎలాంటి ఆధిపత్య పోరు జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి సంఘర్షణ జరిగింది..? హీరామండిలో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరెన్ని కుట్రలు చేశారు..? స్వాతంత్య్ర ఉద్యమంలో వారి పాత్ర ఎంత..? ఈ కథలోకి వెళ్లాలంటే ముందుగా పాత్రల గురించి పరిచయం తప్పనిసరి. హీరామండిలో ఉండే షాహీ మహల్ నిర్వహణ మొత్తం మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) చేతిలో ఉంటుంది. ఆ ప్రాంతంలోని నవాబులంతా ఆమె కనుసన్నలలోనే ఉంటారు. అయితే అదే ప్రాంతంలో ఖ్వాభాగ్ అనే మరో మహల్ ఉంటుంది. అక్కడ ఫరీదాన్ (సోనాక్షి సిన్హా) ఉంటుంది. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో మరో మూడు పాత్రలు కీలకంగా ఉంటాయి. వహీదా (సంజీదా షేక్) మల్లికా జాన్‌కు సోదరి. బిబోజాన్ (అదితిరావ్ హైదరి), ఆలంజేబు (షర్మిన్ సెగల్) ఇద్దరూ కూడా మల్లికా జాన్‌కు కుమార్తెలు. లజ్జో (రిచా చద్దా) మల్లికా జాన్ దత్తత తీసుకున్న కూతురు.హీరామండిలో తన మాటకి తిరుగులేదనే స్థాయిలో మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) రాజ్యమేలుతూ ఉంటుంది. ఆమె కనుసన్నల్లో ఉన్న వేశ్యలపై ఆధిపత్యం చెలాయిస్తూ.. ఎవరైనా ప్రేమలో పడితే ప్రమాదంలో పడినట్టే అనే మాటతో హెచ్చరిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వేశ్యలుగా ఉంటూనే మల్లికా జాన్ మాట వినిపించుకోకుండా 'జొరావర్' అనే నవాబుతో లజ్జో, ఫిరోజ్ అనే నవాబుతో వహీదా, వలీ ఖాన్ అనే నవాబుతో బిబోజాన్ ప్రేమలో పడతారు. కానీ, మల్లికా జాన్ చిన్న కుమార్తె ఆలంజేబును కూడా వేశ్యలా మార్చాలని చూస్తుంది. అయితే, ఆమె బాలోచి నవాబు తాజ్దార్ (తాహా షా బహదూర్ షా)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మల్లికా జాన్‌తో పాటు తాజ్దార్ తండ్రికి నచ్చదు. ఆయన ఆంగ్లేయులకు బానిసగా ఉంటాడు. వారి నుంచి విముక్తి కోసం తాజ్ దార్ పోరాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆలంజేబును పెళ్లి చేసుకోవాలనే తాజ్ దార్ నిర్ణయాన్ని అతని తండ్రి వ్యతిరేకిస్తాడు. వేశ్య తమ ఇంటికి కోడలిగా రాలేదని తేల్చి చెబుతాడు. మరోవైపు కూతురు ప్రేమ వివాహాన్ని మల్లికా జాన్ కూడా వ్యతిరేఖిస్తుంది. ఈ క్రమంలో మల్లిక వ్యవహారశైలి నచ్చని తన సోదరి వహీదా ఆమెకు గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. దీంతో తన అక్కకు శత్రువుగా ఉన్న ఫరీదాన్ (సోనాక్షి సిన్హా)తో చేతులు కలుపుతుంది. ఇలా హీరామండిలో అనేక సంఘటనలు జరుగుతుండగా బిబోజాన్ (అదితిరావ్ హైదరి) బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జరిగే స్వాతంత్య్ర పోరాటంలో గూఢచారిగా ఉంటుంది. ఒక వేశ్యగా ఉన్న ఆమె ఈ పోరాటం ఎందుకు చేస్తుంది..? బ్రిటీషర్లతో సత్సంబంధాలు పెంచుకుని వారి రహస్యాలను ఎందుకు తెలుసుకుంటుంది..? ఫైనల్‌గా బిబోజాన్ ఒక గూఢచారి అని తెలిసిన తర్వాత బ్రిటీష్‌వాళ్లు ఏం చేశారు..? ఇదే సమయంలో షాహీ మహల్‌కు పెద్ద దిక్కుగా ఉన్న మల్లికా జాన్న్ అనచివేసేందుకు ఫరీదాన్ ఎలాంటి కుట్రలకు తెరలేపింది..? వేశ్య కుటుంబానికి చెందిన ఆరుగురు స్త్రీల చుట్టూ.. నవాబులు, బ్రిటీష్ పోలీస్ అధికారులు, తిరుగుబాటుదారుల మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయనేది తెలియాలంటే హీరామండి సిరీస్ చూడాల్సిందే..ఎలా ఉందంటే..పీరియాడిక్ డ్రామా చిత్రాలను డిఫరెంట్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. స్వాతంత్య్రానికి ముందు అంటే 1930, 1940ల కాలం బ్యాక్‌డ్రాప్‌లో హీరామండి వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాడు. 'హీరామండిలో తెల్లదొరల పెత్తనం కాదు.. మల్లికా జాన్ నాణేలు మాత్రమే చెలామణి అవుతాయి' అని మనీషా కొయిరాలా చెప్పిన ఒక్క డైలాగ్ చాలు.. ఈ సిరీస్ డెప్త్ ఏంటో చెప్పడానికి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఎందరో మహిళలు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ కొందరు చరిత్ర పుటల్లో కలిసిపోతే.. మరికొందరు మాత్రం నేటికి కూడా వినికిడిలో ఉన్నారు. లాహోర్ నగరంలోని హీరామండి ప్రాంతంలో పడుపు వృత్తి నిర్వహించే మల్లికా జాన్‌కు, బ్రిటీష్‌వాళ్లతో మొదలైన వైరాన్ని సంజయ్‌లీలా చక్కగా చూపించాడు. స్వాతంత్య్ర పోరాటంలో 'హీరామండి' పాత్ర ఎంతవరకు ఉందో చెప్పడానికి భారీగానే డైరెక్టర్ ప్లాన్ చేశాడు. మొత్తం 8 ఎపిసోడ్స్‌లలో తన విజువల్ ఫీస్ట్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. హీరామండిలో వేశ్యలుగా ఉన్న వారి జీవితాలను తెరపైన అద్బుతంగా క్రియేట్ చేశాడు. వేశ్యావృత్తితో సమాంతర వ్యవస్థను నడుపుతున్న ఆ మహిళలు స్వతంత్ర సంగ్రామంలోకి ఎందుకు దూకాల్సి వచ్చిందో అదిరిపోయే రేంజ్లో చూపించాడు. ఆంగ్లేయులపై తిరుగుబాటు జరిపి వాళ్ల వెన్నులో వణుకు పుట్టించిన వేశ్యలుగా వారందరినీ తెరపై చూపించి అద్భుతాన్ని ఆవిష్కరించడంలో సంజయ్‌లీలా భన్సాలీ సూపర్ సక్సెస్ అయ్యాడు.తన టేకింగ్, విజువల్ ఫీస్ట్‌తో ప్రతి ప్రేక్షకుడినీ హీరామండి ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఆ కాలంనాటి డిజైన్లను దృష్టిలో పెట్టుకుని అందంగా తీర్చిదిద్దిన భారీ సెట్లతో పాటు చక్కని ఫొటోగ్రఫీ తోడు కావడం ఆపై ప్రతి పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ఈ సిరీస్‌కు ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పచ్చు. ముఖ్యంగా పాటల చిత్రీకరణ మరిన్ని మార్కులు కొట్టేస్తుంది. ఒక వెబ్ సిరీస్ అంత భారీ స్థాయిలో పాటలు అవసరమా అనేలా ఉంటాయి. ప్రారంభంలో రెండు, మూడు ఎపిసోడ్స్‌లలో కథ పరంగా కాస్త నెమ్మదించినా చివరి రెండు ఎపిసోడ్స్ మాత్రం దుమ్మురేపుతాయి. మల్లికా జాన్ పాత్ర పరిచయం చేసిన ఒక ఎపిసోడ్ కూడా మెప్పిస్తుంది. సొంత కుమార్తెలతో సహా ఎవరిపైనా దయాదాక్షిణ్యాలు లేని కఠినాత్మురాలిగా ఆ పాత్రను క్రియేట్ చేసిన విధానం అందరినీ మెప్పిస్తుంది. వేశ్యల జీవితాల చుట్టూ తిరిగే కథనే అయినప్పటికీ, ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపించవు. ఈ వీకెండ్లో చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఈ సిరీస్ ఉంటుంది. బ్రిటీష్ పాలనను దిక్కరించిన హీరామండి చరిత్ర పుటల్లో పెద్దగా కనిపించదు. అలా కనుమరుగైన ఒక చాప్టర్‌ను 'హీరామండి'గా సంజయ్‌లీలా తీసుకొచ్చాడు.ఎవరెలా చేశారంటేరూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్‌లో టాప్ హీరోయిన్లను దర్శకుడు సెలక్ట్ చేసుకున్నాడు. మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్ వంటి స్టార్స్ ఇందులో ఉన్నారు. ఈ సిరీస్‌కు ప్రధాన బలం వారే అని చెప్పవచ్చు. షాహీమహల్‌కు పెద్ద దిక్కుగా మల్లికాజాన్ పాత్రలో మనీషా కొయిరాలా దుమ్మురేపిందని చెప్పవచ్చు. తన కడుపున పుట్టిన కూతుర్లను కూడా వేశ్యలుగా మార్చే అంత కఠినాత్మురాలిగా ఆమె చూపించిన నటన అద్భుతమని చెప్పవచ్చు. మరోవైపు ఫరీదాన్‌గా సోనాక్షి సిన్హా నెగెటివ్ పాత్రలో మెప్పించింది. వీరందరికీ ఏమాత్రం తగ్గకుండా అదితిరావు హైదరీ ఎలివేషన్ మామూలుగా ఉండదు. వేశ్యగా కనిపిస్తూనే గూఢచారిగా తన సత్తా ఎంటో చూపించింది. నటనలో ఆమె ఎక్కడా తగ్గలేదు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేసిందని చెప్పవచ్చు. ఈ సిరీస్‌కు ప్రధాన బలం విజువల్స్, కాస్ట్యూమ్స్,సినిమాటోగ్రఫీ. ఇవన్నీ కూడా ఓటీటీ స్థాయికి మించి ఉన్నాయి. కానీ, ఇందులో ఎక్కువగా యుద్ధ ఘట్టాలు లేకున్నా ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఆనాటి చరిత్రకు.. సమాజంలోని స్థితిగతులకు దర్పణం పట్టేలా సీన్స్ ఉన్నాయి. కాస్త నిడివి తగ్గించి ఉంటే బాగుండు అనే కామెట్లు కూడా వినిపిస్తున్నాయి.
Viral Video: స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్ దాడి
విద్యాసంస్థల్లో టీచర్లు, లెక్చరర్లు, ప్రిన్సిపల్స్ సభ్యత మరచి ప్రవర్తిస్తున్నారు. విద్యార్ధులు, తోటి ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో హెడ్మిస్ట్రెస్ ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో తీసినందుకు టీచర్‌పై దాడి చేసిన నిర్వాకం మరవక ముందే రాష్ట్రంలో ఆగ్రాలో మరో ఘటన చోటుచేసుకుంది.ఆగ్రాలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారనే నెపంతో ఓ ప్రిన్సిపల్-టీచర్‌పై దాడికి పాల్పడింది. బూతులు తిడుతూ, దుస్తులు చెరిగేలా భౌతిక దాడికి దిగింది. సీగానా గ్రామంలోని ప్రీ-సెకండరీ స్కూల్ టీచర్ గుంజన్ చౌదరి పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని ప్రిన్సిపాల్ గొడవకు దిగింది. అంతేగాక టీచర్‌పై దాడి చేసింది. ఈ ఘర్షణలో ఇద్దరు వస్త్రాలు చిరిగిపోయాయి.అంతటితో ఆగకుండా నోటికి కూడా పని చెప్పారు. బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. అక్కడే ఉన్న తోటి టీచర్లు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ప్రిన్సిపల్ డ్రైవర్ విడదీసే ప్రయత్నం చేసినా.. చివరికి టీచర్‌తో అతడు కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న కొందరు తమ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది.A Principal in Agra beat up a teacher this bad just because she came late to the school. Just look at her facial expressions. She's a PRINCIPAL 😭 @agrapolice pic.twitter.com/db8sKvnNvs— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 3, 2024
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
మాస్టర్‌బ్లాస్టర్, సచిన్ టెండూల్కర్ కుమార్తె, Gen-Z సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సారా టెండూల్కర్ గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో భారీ అభిమానులను సంపాదించుకున్న సారా, తన లైఫ్ స్టయిల్, ఇతర విషయాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల టీనేజ్ అమ్మాయిగా తాను ఎదుర్కొన్న సమస్యల గురించి బహిరంగా మాట్లాడింది. ముట్టుకుంటే కందిపోయే సున్నితంగా, మెరిసిసోయే చర్మంతో కనిపించే సారా పీసీఓఎస్‌తో చాలా ఇబ్బందులు పడిందట. విపరీతమైన మొటిమలతో బాధపడేదట. యుక్తవయస్సులో PCOSతో తన పోరాటం గురించి ప్రముఖ మ్యాగజీన్ వోగ్‌తో మాట్లాడింది. పీసీఓఎస్, ఇతర సమస్యల నుంచి విముక్తి పొందేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేదని, చివరికి జీవన శైలి మార్పులతోనే పరిష్కారం లభించిందని చెప్పుకొచ్చింది. ‘‘యాసిడ్, రెటినాల్ నుండి లేజర్ల వరకు అన్నీ ప్రయత్నించా. కానీ ఏవీ పని చేయలేదు"- సారాసాధారణ శిక్షణ తర్వాత, బరువు తగ్గడం, ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడంతో పాటు ఎక్కువగా నీళ్లు తాగడం లాంటివి చేసింది. ఫలితంగా తన స్కిన్ అద్భుతంగా మారి, పీసీఓఎస్ సమస్య కూడా తగ్గిందని వెల్లడించింది. మెడిసిన్ రంగంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన సారా మోడల్‌గా ఫ్యాషన్ ప్రపంచంలో కూడా రాణిస్తోంది. పలు బ్రాండ్లతో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే.పీపీఓఎస్ అనేది నేడు చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. హార్మోన్ల అసమతుల్యత వల్ల మొటిమలు, బరువు పెరగడం, ముఖంపై అవాంఛిత రోమాలు, పీరియడ్స్ సమస్యలు, సంతాన లేమి మొదలైన సమస్యలు వస్తాయి.
Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలలో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడం వంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ ఒకటి వెల్లడైంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి టెక్ కంపెనీలు.layoffs.fyi ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. టెక్నాలజీ రంగంలోని 50 కంపెనీల నుండి ఒక్క ఏప్రిల్ నెలలోనే 21,473 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ఈ ఏడాది లేఆఫ్‌ల ధోరణికి ఏప్రిల్ నెల తొలగింపులు అద్దం పడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కనీసం ఇప్పటి వరకూ 271 కంపెనీలు 78,572 మంది ఉద్యోగులను తొలగించాయి. జనవరిలో 122 కంపెనీలలో 34,107 ఉద్యోగాల కోతలు జరిగాయి. ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 మందిని తొలగించాయి. ఇక మార్చిలో 37 కంపెనీల్లో 7,403 మంది ఉద్యోగాలను కోల్పోయారు. మార్చి నుంచి ఏప్రిల్‌కు ఒక్క నెలలో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ఏప్రిల్‌లో టెక్ తొలగింపులుయాపిల్ ఇటీవల 614 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొదటి ప్రధాన రౌండ్ ఉద్యోగ కోత.పైథాన్, ఫ్లట్టర్, డార్ట్‌లో పనిచేస్తున్న వారితో సహా వివిధ టీమ్‌లలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను గూగుల్ తొలగించింది.అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది ఉద్యోగాలను తగ్గించింది.ఇంటెల్ దాని ప్రధాన కార్యాలయంలోని దాదాపు 62 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది. ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది.ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా అత్యధికంగా 14 వేల మందిని లేఆఫ్ చేసింది.ఓలా క్యాబ్స్ దాదాపు 200 ఉద్యోగాలను తొలగించింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీఫైమ్ దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించింది. గృహోపకరణాలను తయారు చేసే వర్ల్‌పూల్ సుమారు 1,000 మందిని లేఆఫ్ చేసింది.టేక్-టూ ఇంటరాక్టివ్ కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 5% మందిని తొలగించింది. నార్వేలోని టెలికాం కంపెనీ టెలినార్ 100 మంది ఉద్యోగులను తొలగించింది.
తప్పక చదవండి
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయుల అరెస్ట్
సినిమా
కలల సాకారం కోసం పోరాడితేనే 'స్టార్'
'ప్రతి ఒక్కరూ కలలు కనాలి, వాటి సాకారం కోసం కృషి చేయాలి' అనే అబ్దుల్ కలాం సూక్తి ఆధారంగా తీసిన సినిమా 'స్టార్'. ఇలన్ దర్శకుడు. 'దాదా' ఫేమ్ కవిన్ హీరో. అతిథి పొహంగర్, కీర్తీ మురుగన్ హీరోయిన్స్. రైస్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్, శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. ఈ నెల 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలు పంచుకున్నారు.(ఇదీ చదవండి: సమ్మర్ స్పెషల్.. ఓటీటీలో 100 సినిమాలు/ సిరీస్‌లు)1980ల్లో మధురైకు చెందిన ఓ కుర్రాడు.. సినిమా నటుడు కావాలనే కలతో చెన్నైకి చేరుకుంటాడు. అతడు తన కల నెరవేర్చుకోవడానికి చేసే పోరాటమే 'స్టార్' సినిమా. ఇకపోతే దర్శకుడు తనకు కథ చెప్పిన విధానం నచ్చిందని హీరోగా చెప్పగా.. ఈ చిత్రంపై తనకు పూర్తి నమ్మకం ఉందని దర్శకుడు ఇలన్ ధీమా వ్యక్తం చేశాడు.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్)
Barbie OTT Release: తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చేసిన హాలీవుడ్ హిట్ సినిమా
హాలీవుడ్ సినిమా 'బార్బీ' గతేడాది జూలై 21న రిలీజై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో చేరిపోయిన బార్బీ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో బార్బీ , ప్రపంచవ్యాప్తంగా రూ. 11వేల కోట్లకు పైగా వసూలు చేసింది. ఇండియాలో బార్బీ మూవీకి దాదాపు 150 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి తెలుగు వర్షన్ వచ్చేసింది.హాలీవుడ్ స్టార్స్ మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్, కేట్ మెక్ కిన్నన్, విల్ ఫెర్రెల్, అమెరికా ఫెరెరా, ఇస్సా రే, సిము లియులు బార్బీలో నటించారు. 96వ ఆస్కార్ అవార్డుల్లో ఎనిమిది నామినేషన్స్‌లలో చోటు దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మాత్రమే ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. ఇప్పుడు జియో సినిమా ఓటీటీలో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో అయితే రెంటల్ విధానంలో రూ. 149 రూపాయలు చెల్లించి చూడవచ్చు.
Salaar Japan Release: జపాన్‌లో రిలీజ్‌కు రెడీ అయిన సలార్.. ట్రైలర్ అదిరింది!
జపాన్‌లో ఇండియన్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అక్కడ భారతీయ సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాయి. గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్ తో పాటు కేజీయఫ్ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలు కూడా జపాన్‌లో రిలీజై మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా మరో ఇండియన్ చిత్రం జపాన్‌లో రిలీజ్ కాబోతుంది. అదే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’. కేజీయఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 22న విడుదలైన ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో ప్రభాస్‌కి ఓ మంచి హిట్ లభించింది. థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీలోనూ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి రెడీ అయ్యాడు ప్రభాస్. జులై 5న ఈ చిత్రాన్ని జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ.. ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం యాక్షన్ సీన్లతోనే కట్ చేసిన ఈ ట్రైలర్ గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ చిత్రంలో శృతీహాసన్ హీరోయిన్గా నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
రాజకీయాల్లోకి తననెవరూ ఆహ్వానించలేదని నటి జ్యోతిక పేర్కొన్నారు. దక్షిణాదిలో ప్రముఖ కథానాయికల్లో ఒకరిగా రాణించిన ఈమె హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత నటనను దూరం పెట్టి సంసార జీవితంపై పూర్తిగా దృష్టి పెట్టారు. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు కలిగారు. పిల్లలు కాస్త పెద్ద అయిన తరువాత జ్యోతిక మళ్లీ నటనపై దృష్టి సారించారు.శ్రీకాంత్ బయోపిక్‌లో..ఇటీవల జ్యోతిక కథానాయికగా హిందీలో నటించిన సైతాన్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆమె అంధుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్ల బయోపిక్ శ్రీకాంత్ మూవీలో టీచర్‌గా ముఖ్యపాత్రను పోషించారు. రాజ్‌కుమార్‌రావు టైటిల్ పాత్రను పోషించిన ఈ చిత్రం ఈ నెల 10వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.అప్పుడే భర్తతో నటిస్తాఈ సందర్భంగా శుక్రవారం ఉదయం చెన్నైలో జ్యోతిక మాట్లాడుతూ తనకు బాగా నచ్చిన చిత్రం శ్రీకాంత్ అని, ఇది తన కెరీర్లో చాలా ముఖ్యమైనదిగా నిలిచిపోతుందని తెలిపారు. దర్శకుడు ఈ చిత్రాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారన్నారు. శ్రీకాంత్ చిత్రంలో తాను భాగం కావడం ఘనతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సూర్యతో కలిసి మళ్లీ ఎప్పుడు నటిస్తారని అడుగుతున్నారని, అందుకు మంచి కథ కోసం ఎదురుచూస్తున్నట్లు జ్యోతిక చెప్పారు.రాజకీయాల్లోకి..మీ భర్త అగరం సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, మీరు కూడా సామాజికపరమైన సమస్యలపై స్పందిస్తున్నారని, అయితే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి జ్యోతిక స్పందిస్తూ.. నిజం చెప్పాలంటే తనని ఎవరూ రాజకీయాల్లోకి ఆహ్వానించలేదని, అయినా ప్రస్తుతం తనకు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.
ఫొటోలు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
Priyamani: ట్రెడిషనల్ డ్రెస్‌లో కవ్విస్తున్న ప్రియమణి.. లేటెస్ట్ ఫోటోలు వైరల్
CM Jagan In Hindupuram: మీ భూములకు జగన్ గ్యారెంటీ.. హిందూపురం సిద్ధం ప్రచారంలో జనసందోహం (ఫొటోలు)
అదిరే..అదిరే మాధురి స్టయిలే అదిరే!
Actor Nani HD Stills: వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
క్రీడలు
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్, శ్రీలంక బౌలర్ మతీశ పతిరణ టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ధోని తనకు తండ్రిలాంటి వాడని పేర్కొన్నాడు. తన కన్న తండ్రి మాదిరే ధోని కూడా తనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడని తెలిపాడు.కాగా ఐపీఎల్-2022కు సిసంద మగల దూరం కాగా అతడి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్‌లో అడుగుపెట్టాడు పతిరణ. ఆ మరుసటి ఏడాది అంటే 2023లో 12 మ్యాచ్‌లలో కలిపి 19 వికెట్లు పడగొట్టాడు.ధోని నాయకత్వంలో సీఎస్కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. బేబీ మలింగగా ప్రశంసలు అందుకుంటూ ప్రస్తుతం సీఎస్కే ప్రధాన పేసర్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు.అయితే, దీనకంతటికి కారణం ధోనినే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యువ పేసర్ ఆరంభంలో తడబడ్డా తలా అతడికి అండగా నిలిచాడు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్న సమయంలోనూ నైతికంగా మద్దతునిచ్చాడు.ఈ నేపథ్యంలో తాజాగా సీఎస్కే ‘లయన్స్ అప్‌క్లోజ్’ చాట్‌లో మతీశ పతిరణ మాట్లాడుతూ ధోనితో తన అనుబంధం గురించి వివరించాడు. ‘‘మా నాన్న తర్వాత నా క్రికెట్ లైఫ్‌లో తండ్రి పాత్ర పోషించింది ధోనినే.నన్నొక చిన్నపిల్లాడిలా చూసుకుంటారు. నా పట్ల శ్రద్ధ వహిస్తారు. అవసరమైన సమయంలో సలహాలు, సూచనలు ఇస్తుంటారు. నేను ఎప్పుడు ఏం చేయాలో చెబుతూ ఉంటారు.ఇంట్లో మా నాన్న నాతో ఇలా ఉంటారో ఇక్కడ ధోని కూడా నాతో అలాగే ఉంటారు. చిన్న చిన్న విషయాలను కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తలు చెబుతారు. నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగేలా మోటివేట్ చేస్తారు.మైదానం వెలుపల మేము ఎక్కువగా మాట్లాడుకోము. అయితే, నన్ను కలిసిన ప్రతిసారీ.. ‘‘ఆటను ఆస్వాదించు. ఫిట్నెస్ కాపాడుకో’’ అని చెబుతారు.మహీ భాయ్.. మీరు వచ్చే సీజన్లోనూ ఆడాలి. ప్లీజ్ మాతో కలిసి ఆడండి.. అప్పటికీ నేనిక్కడ ఉంటే(నవ్వుతూ)’’ అంటూ పతిరణ ధోని పట్ల అభిమానం చాటుకున్నాడు.కాగా ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా.. ధోని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక పతిరణ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు కూల్చాడు. సీఎస్కే ఆడిన 10 మ్యాచ్‌లలో ఐదు గెలిచి పట్టికలో ఐదో స్థానంలో ఉంది.The bond beyond the field 💛🫂#LionsupClose Full video 🔗 - https://t.co/xt5t6K9SjR #WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/odZdVvlrF6— Chennai Super Kings (@ChennaiIPL) May 4, 2024
‘అతడు 70 శాతం ఇండియన్.. 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్’
‘‘నేను కలిసిన అత్యంత నిస్వార్థమైన వ్యక్తుల్లో అతడూ ఒకడు. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికీ అతడు సమయం కేటాయించగలడు. సాయం చేయడానికి 24/7 అందుబాటులోనే ఉంటాడు.ఎక్కడి హోటల్‌కు వెళ్లినా నా గదికి రెండు గదుల అవతల అతడు ఉంటాడు. నాకు ఇష్టం వచ్చినప్పుడు అక్కడికి వెళ్లవచ్చు. ప్రతి రోజూ ఉదయం అక్కడే నేను కాఫీ తాగుతాను కూడా!ఇండియన్ అనడం బెటర్నిజం చెప్పాలంటే అతడు ఆస్ట్రేలియన్ అనడం కంటే ఇండియన్ అనడం బెటర్. అతడికి కూడా ఇదే మాట చెబుతూ ఉంటా. నా దృష్టిలో అతడు 70 శాతం ఇండియన్.కేవలం 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్‌గా ఉంటాడు’’ అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం, ఆసీస్ స్టార్ జేక్ ఫ్రేజర్-మెగర్క్ సహచర ఆటగాడు డేవిడ్ వార్నర్‌పై ప్రశంసలు కురిపించాడు.తనకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వెంటనే వార్నర్ దగ్గరికి వెళ్లి అడిగేంత చొరవ ఉందని తెలిపాడు. సీనియర్ అన్న పొగరు ఏమాత్రం చూపించడని.. అందరితోనూ సరదాగా ఉంటాడని మెగర్క్ చెప్పుకొచ్చాడు.హైదరాబాదీలతో బంధంకాగా ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ద్వారా భారతీయులకు చేరువైన విషయం తెలిసిందే. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన సమయంలో హైదరాబాదీలతో బంధం పెనవేసుకున్నాడు.టాలీవుడ్ స్టార్ హీరోల తెలుగు పాటలకు రీల్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వార్నర్ భాయ్.. ఇటీవలే దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ఓ యాడ్లోనూ నటించి మెప్పించాడు.ఈ నేపథ్యంలో మెగర్క్ వార్నర్ గురించి డీసీ(ఢిల్లీ క్యాపిటల్స్) పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీకి ఆడుతున్న సౌతాఫ్రికా స్టార్ ట్రిస్టన్ స్టబ్స్ సైతం వార్నర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని.. అతడితో కలిసి గోల్ఫ్ ఆడటం తనకు ఇష్టమని పేర్కొన్నాడు.ఐపీఎల్-2024లో ఇలాకాగా ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. మరోవైపు.. ఈ సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేసిన 22 ఏళ్ల జేక్ ఫ్రేజర్-మెగర్క్ 6 ఇన్నింగ్స్‌లో కలిపి 259 పరుగులు చేశాడు.ఇక ట్రిస్టన్ స్టబ్స్ 10 ఇన్నింగ్స్ ఆడి 277 రన్స్ చేయగా.. డేవిడ్ వార్నర్ కేవలం 7 మ్యాచ్‌లలో భాగమై 167 పరుగులు చేయగలిగాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు వార్నర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్, టీమిండియా కెప్టెన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగడం సందేహాలకు తావిచ్చింది. ఐపీఎల్-2024 ఆరంభం నుంచి ముంబై తరఫున అన్ని మ్యాచ్‌లలోనూ మైదానంలోకి దిగాడు హిట్‌మ్యాన్.అయితే, కేకేఆర్‌తో మ్యాచ్‌లో మాత్రం అతడు ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో విశ్రాంతి తీసుకున్న రోహిత్.. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చాడు.కానీ ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 12 బంతులు ఎదుర్కొని ఒక సిక్స్ సాయంతో 11 పరుగులు మాత్రమే చేసి.. సునిల్ నరైన్ బౌలింగ్‌లో మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ఆందోళనలో అభిమానులుఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై సందేహాలు తలెత్తాయి. అసలే టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి సమయం దగ్గరపడుతున్న తరుణంలో కెప్టెన్ సాబ్‌కు ఏమైందంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. క్లారిటీ ఇచ్చిన చావ్లాఈ క్రమంలో ముంబై ఇండియన్స్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘రోహిత్ తేలికపాటి వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది’’ అని రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపడానికి గల కారణం వెల్లడించాడు.అదే విధంగా.. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస వైఫల్యాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పేరు, ప్రఖ్యాతుల కోసం బరిలోకి దిగినపుడు.. పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి. ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధిస్తామా లేదా అన్నది పక్కనపెడితే.. జట్టు ప్రయోజనాల కోసం ఆడటమే ఆటగాళ్ల ప్రథమ కర్తవ్యం’’ అని పీయూశ్ చావ్లా చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో ముంబై ఎనిమిది ఓడిపోయింది.ఇదిలా ఉంటే.. జూన్ 1 నుంచి మొదలుకానున్న టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు.. ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఇటు కెప్టెన్‌గా.. అటు ఆల్‌రౌండర్ పాండ్యా విఫలమవుతున్నా బీసీసీఐ అతడిపై నమ్మకం ఉంచింది. గతేడాది అక్టోబరు తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా.. ఐసీసీ టోర్నీలో ఏకంగా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది.
మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అనుసరించిన వ్యూహాలను భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుబట్టాడు. హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా అంటూ మేనేజ్మెంట్కు చురకలు అంటించాడు.ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా కేకేఆర్‌తో తలపడిన ముంబై ఓడిపోయిన విషయం తెలిసిందే. సొంత మైదానంలో 24 పరుగుల తేడాతో ఓటమి ఈ సీజన్లో ఎనిమిదో పరాజయాన్ని నమోదు చేసింది.ఛేదనలో తడ‘బ్యా’టు టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై.. కేకేఆర్‌ను 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ చేసి ఫర్వాలేదనిపించింది. కానీ లక్ష్య ఛేదనలో మాత్రం తడ‘బ్యాటు’కు గురైంది. 18.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది.టాపార్డర్ మొత్తం చేతులెత్తేయగా.. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 56) ఒక్కడే రాణించాడు. మిగిలిన వాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఇలాంటి తరుణంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(1) ఏడు, టిమ్ డేవిడ్(24) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. తర్వాత టెయిలెండర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ముంబై కథ ముగిసింది.మరీ అంత చెత్తగా ఆడతారా?ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌ను ఎందుకు దాచిపెట్టిందో తెలియదు. అలా చేయడం వల్ల మీకు ఏం ప్రయోజనం చేకూరింది?ఇంకా బంతులు మిగిలే ఉన్నాయి. జట్టు మొత్తం ఆలౌట్ అయింది. నిజానికి హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌లను ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు పంపాల్సింది.కానీ ఛేజ్ చేస్తున్న సమయంలో వరుసగా వికెట్లు పడుతున్నా హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌లను ఏడు, ఎనిమిదో స్థానాల్లో ఎందుకు ఆడించారో అర్థం కాలేదు.లోయర్ ఆర్డర్లో వీళ్లు ఇంకాస్త ముందుగా వస్తే మరీ అంత చెత్తగా ఆడతారని అనుకున్నారా?’’ అని ముంబై మేనేజ్మెంట్ను ప్రశ్నించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఉన్నపుడు పాండ్యా నాలుగో స్థానంలో నిలకడగా రాణించిన విషయాన్ని సెహ్వాగ్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.చదవండి: T20 WC: హార్దిక్ బదులు అతడిని సెలక్ట్ చేయాల్సింది: పాక్ దిగ్గజం
బిజినెస్
అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
రూ.లక్షలు ఖర్చుపెట్టి ఇల్లు కట్టుకుంటాం. నచ్చిన విధంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటాం. భద్రంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగితే విలువైన వస్తువులు కాలిపోవడంతోపాటు కొన్నిసార్లు మనుషుల ప్రాణాలు పోవచ్చు. ఫైరింజన్ సిబ్బందికి సమాచారం అందించినా వారు వచ్చేలోపు ప్రమాదం మరింత తీవ్రస్థాయికి చేరవచ్చు. అసలే వేసవికాలం ఇలాంటి ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇళ్లు నిర్మించుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మరింత రక్షణగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంటితోపాటు కంపనీలు, షాపింగ్‌మాల్స్, భవనాల్లో తప్పకుండా ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉపయోగించాలంటున్నారు. వీటికోసం చేసే చిన్నపాటి ఖర్చుతో ఇంటికి మరింత భద్రత కల్పించవచ్చని చెబుతున్నారు. వాటిని ఎంచుకునేముందు కనీస అవగాహన తప్పనిసరని అభిప్రాయపడుతున్నారు.మంటలను ఆర్పేందుకు ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు చాలా రకాలుగా ఉంటాయి.స్టాండర్డ్ వాటర్: కాగితం, కార్డ్బోర్డ్, ప్లాస్టిక్, కలప, ఫ్యాబ్రిక్‌కు అంటిన మంటలను అదుపు చేయవచ్చు.డ్రైవాటర్ మిస్ట్: నీటి రేణువులను పొడి సూక్ష్మకణాలుగా మార్చి మంటపై చల్లుతుంది.వెట్ కెమికల్: మంటలపై సబ్బు ద్రావణాన్ని చల్లుతుంది. కొవ్వులు, వంట నూనెల వల్ల సంభవించే మంటలను అదుపు చేయవచ్చు. పౌడర్: పెట్రోల్, డీజిల్, గ్యాసోలిన్ నుంచి వచ్చే మంటలు, మీథేన్, ప్రొపేన్, బ్యూటేన్ వంటి వాయువుల వల్ల ఏర్పడే వాటినిక ఆర్పవచ్చు. కార్బన్ డైయాక్సైడ్: పెట్రో ఉత్పత్తులు, విద్యుత్తు వల్ల కలిగే మంటలు తగ్గించవచ్చు.వాటర్ మిస్ట్ టైప్ ఫైర్: వరండాలు, వంట గదిలో వాడుకోవచ్చు. ఇది మంటపై నీటిని స్ప్రే చేస్తుంది.
రూ.194 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ తన ఇన్వెస్టర్లకు రూ.10 ముఖవిలువ కలిగిన ప్రతి షేరుకు రూ.194 డివిడెండ్ ప్రకటించింది.2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎంఆర్ఎఫ్ నికరలాభం రూ.2081 కోట్లుగా నమోదైంది. 2022-23 నికరలాభం రూ.769 కోట్లుగా కంపెనీ పోస్ట్ చేసింది. కార్యకలాపాల ఆదాయం కూడా రూ.23,008 కోట్ల నుంచి రూ.25,169 కోట్లకు వృద్ధి చెందినట్లు చెప్పింది.మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.341 కోట్లతో పోలిస్తే ఇది 16% ఎక్కువ. కంపెనీ తాజాగా ప్రకటించిన డివిడెండ్‌తోపాటు ఇప్పటికే మధ్యంతర డివిడెండ్‌ను రెండుసార్లు రూ.3 చొప్పున సంస్థ అందించింది.ఇదీ చదవండి: నేపాల్‌లో నిలిచిన ఇంటర్నెట్ సేవలు.. కారణం..బ్రిటానియా రూ.73.50 డివిడెండ్బ్రిటానియా ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసికంలో రూ.536.61 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాలంలో నమోదుచేసిన లాభం రూ.557.60 కోట్ల కంటే ఇది తక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.4023.18 కోట్ల నుంచి 1.14% పెరిగి రూ.4069.36 కోట్లకు చేరింది. రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.73.50 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.
Income tax: నెల రోజుల్లో 6 లక్షల ఐటీ రిటర్న్స్
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ స్వీకరణ ప్రారంభమైన నెల రోజుల్లో దాదాపు 6 లక్షల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిని ఆదాయపన్ను శాఖ అంతే వేగంగా ప్రాసెస్ చేయడం విశేషం. వెరిఫై చేసిన రిటర్న్స్‌లో దాదాపు మూడింట రెండు వంతులు ఇప్పటికే ప్రాసెస్ అయినట్లు బిజినెస్ లైన్ నివేదించింది.2024-25 అసెస్మెంట్ ఇయర్ (FY25) మొదటి నెలలో ఏప్రిల్ 29 నాటికి 5.92 లక్షలకు పైగా రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిలో 5.38 లక్షలకు పైగా వెరిఫై కాగా 3.67 లక్షల వెరిఫైడ్ రిటర్న్స్‌ను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున అంటే ఏప్రిల్ 1న ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించింది.ముందస్తుగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు త్వరగా రీఫండ్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పెనాల్టీ లేకుండా రిటర్న్స్‌ను రివైజ్ చేయడానికి లేదా సరిచేయడానికి తగినంత సమయం లభిస్తుంది. అయితే, ఉద్యోగులు మాత్రం కొంత సమయం వేచి ఉంటే మంచిదని సూచిస్తున్నారు. కా 2024-25 అసెస్మెంట్ ఇయర్‌కు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ.
భారత్‌లో యాపిల్ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత్ మార్కెట్లో జోరు కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి త్రైమాసికంలో కంపెనీ 90.8 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 4% తగ్గినప్పటికీ భారత్‌లో మాత్రం బలమైన రెండంకెల వృద్ధితో సరికొత్త రికార్డు నమోదు చేయడం విశేషం. అంతర్జాతీయంగా మార్చి త్రైమాసికంలో ఐఫోన్ల విక్రయాలు 10.4 % క్షీణించి 45.9 బిలియన్ డాలర్లకు వచ్చి చేరాయి.
వీడియోలు
చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ
ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన
ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్
ఫ్యామిలీ
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
మాస్టర్‌బ్లాస్టర్, సచిన్ టెండూల్కర్ కుమార్తె, Gen-Z సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సారా టెండూల్కర్ గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో భారీ అభిమానులను సంపాదించుకున్న సారా, తన లైఫ్ స్టయిల్, ఇతర విషయాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల టీనేజ్ అమ్మాయిగా తాను ఎదుర్కొన్న సమస్యల గురించి బహిరంగా మాట్లాడింది. ముట్టుకుంటే కందిపోయే సున్నితంగా, మెరిసిసోయే చర్మంతో కనిపించే సారా పీసీఓఎస్‌తో చాలా ఇబ్బందులు పడిందట. విపరీతమైన మొటిమలతో బాధపడేదట. యుక్తవయస్సులో PCOSతో తన పోరాటం గురించి ప్రముఖ మ్యాగజీన్ వోగ్‌తో మాట్లాడింది. పీసీఓఎస్, ఇతర సమస్యల నుంచి విముక్తి పొందేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేదని, చివరికి జీవన శైలి మార్పులతోనే పరిష్కారం లభించిందని చెప్పుకొచ్చింది. ‘‘యాసిడ్, రెటినాల్ నుండి లేజర్ల వరకు అన్నీ ప్రయత్నించా. కానీ ఏవీ పని చేయలేదు"- సారాసాధారణ శిక్షణ తర్వాత, బరువు తగ్గడం, ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడంతో పాటు ఎక్కువగా నీళ్లు తాగడం లాంటివి చేసింది. ఫలితంగా తన స్కిన్ అద్భుతంగా మారి, పీసీఓఎస్ సమస్య కూడా తగ్గిందని వెల్లడించింది. మెడిసిన్ రంగంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన సారా మోడల్‌గా ఫ్యాషన్ ప్రపంచంలో కూడా రాణిస్తోంది. పలు బ్రాండ్లతో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే.పీపీఓఎస్ అనేది నేడు చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. హార్మోన్ల అసమతుల్యత వల్ల మొటిమలు, బరువు పెరగడం, ముఖంపై అవాంఛిత రోమాలు, పీరియడ్స్ సమస్యలు, సంతాన లేమి మొదలైన సమస్యలు వస్తాయి.
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
ప్రకృతి అపూర్వమైన సంపద, మూలికలకు నిలయం. ప్రకృతిలో మమేకమైన పక్షులకు జంతువులే ఈ విషయాన్ని ఎక్కువగా పసిగడతాయి. మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు, మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయి అనడానికి నిదర్శనంగా ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి వెలుగులో వచ్చింది. ఇండోనేషియాలో పరిశోధకులు తొలిసారిగా ఈ విషయాన్ని రికార్డు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయిసుమత్రన్ ఒరాంగుటాన్స్ అనే జాతికి చెందిని రాకుస్ అనే మగ కోతి (ఒరంగుటాన్) తనకు తనే వైద్యం చేసుకుంది. సుమత్రన్ ఒరంగుటాన్ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోని గునుంగ్ ల్యూజర్ నేషనల్ పార్క్‌లో ఈ దృశ్యాలను రికార్డుచేశారు. ఇండోనేషియాలోని నేషనల్ యూనివర్సిటీ, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ సంస్థలకు చెందిన పరిశోధకులు కొన్ని రోజులుగా ఈ తోక లేని కోతులపై అధ్యయనం చేస్తున్నారు.సైంటిఫిక్ రిపోర్ట్స్‌లోని ఒక అధ్యయనం ప్రకారం ఒక మగ కోతికి మరో కోతితో జరిగిన కొట్లాటలో ముఖానికి గాయమైంది. ఒక చెట్టు ఆకులోని ఔషధ గుణాలను గుర్తించింది రాకూస్. ఫైబ్రేరియా టింక్టోరియా" అనే శాస్త్రీయ నామంతో పిలిచే మొక్కల ఆకులతో వైద్యం చేసుకున్నది. ఈ ఆకులు నమిలి, వాటి పసరును దవడ గాయంపై రాసుకుంది. తర్వాత నమిలిన ఆకులను గాయంపై పెట్టుకుంది. అంతేకాదు గాయం మానేందుకు ఈ కోతి ఎక్కువ సేపు నిద్రపోయిందని కూడా పరిశోధకులు గుర్తించడం విశేషం.ఒక అడవి జంతువు చాలా శక్తివంతమైన ఔషధ మొక్కను నేరుగా గాయానికి పూయడాన్ని గమనించడం ఇదే తొలిసారి అని జర్మనీలోని కాన్స్టాంజ్లోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్, జీవశాస్త్రవేత్, ఈ స్టడీ సహ రచయిత ఇసాబెల్లె లామర్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ మొక్కలో నిజంగానే ఔషధ గుణాలు ఉంటాయని, మలేరియా, విరేచనాలు, డయాబెటిస్ చికిత్సలో ఈ మొక్కలు వాడుతారని పేర్కొన్నారు.
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
ప్రజలకు దారి చూపినవాడు నాయకుడవుతాడు. ప్రజలు నడిచే దారిలో తానూ నడిచినవాడే నాయకుడవుతాడు. ప్రజలు నాయకుడి వైపు ఎందుకు చూస్తారు? మా దారిలో కష్టం ఉంది తొలగించు... మా గింజలకు వెలితి ఉంది పూరించు... మాకు జబ్బు చేస్తే వైద్యానికి దోవ లేదు చూపించు... మా పిల్లలకు చదువు చెప్పించు... మా నెత్తిన ఒక నీడ పరువు... మా పిల్లలకు ఒక ఉపాధి చూపించు... ఇలా చెప్పుకోవడానికే కదా.అవి విన్నవాడే నాయకుడవుతాడు. నేను ఉన్నానని అనేవాడే పాలకుడవుతాడు.ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు, రెండు రాష్ట్రాలుగా విడిపోయాక వర్తమాన పరిణామాలకు మూలాలు ఏమిటో తెలియడం తెలుగు ప్రజలకు అవసరం. ఎందుకంటే ప్రజల నొసట రాత పాలకులే రాస్తారు. నాటి మద్రాసు రాష్ట్రంతో మొదలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, హైదరాబాద్ స్టేట్ ఆవిర్భావం, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రకటన, తెలంగాణ ఉద్యమాల దరిమిలా తెలుగు రాష్ట్రాల విభజన... వీటన్నింటిలో పాలకుల ఎత్తుగడలకు, ప్రజల ఆకాంక్షలకు జరిగిన ఘర్షణ ఒక క్రమానుగతంగా చదివితే ఎక్కడెక్కడ నాయకుడనేవాడవసరమో అక్కడక్కడ తెలుగు జాతి ఒక నాయకుణ్ణి తయారు చేసుకోగలిగింది అనిపిస్తుంది. అయితే ముందే చెప్పుకున్నట్టుగా ఈ నాయకుల్లో ప్రజల కోసం నిలిచే నాయకులూ ఉన్నారు. ప్రజలను వంచించే నాయకులూ ఉన్నారు.సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల విషయంలో ప్రదర్శించిన అహం, ప్రోత్సహించిన ముఠా రాజకీయాల సంస్కృతి ఆంధ్రరాష్ట్రాన్ని ఒక అనిశ్చితిలోనే ఉంచాయి. స్థిరంగా నిలిచి, బలంగా కొనసాగే నాయకుడు ఉన్నప్పుడే జాతి ముందుకు వెళ్లగలదు. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్‌కు సమర్థమైన నాయకత్వం వహించినా కుర్చీ కింద పెట్టే మంటలు వారిని కుర్చీ వదులుకునేలా చేశాయి. అసలు తెలుగువారికి ఒక ఆత్మాభిమానం ఉందా అనే సందేహం కలిగించాయి.ఈ సందర్భమే ఎన్.టి.రామారావు పుట్టుకకు కారణమైంది. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన నాయకుడిగా, చరిష్మా కలిగిన పాలకుడిగా, పేదవాడి గురించి ఆలోచన చేసిన అభిమాన నేతగా ఎన్.టి.రామారావు ప్రజల మెప్పును పొందారు. కాని ఆయన అహం, తొందరపాటు చర్యలు కుట్రలకు తెరలేపాయి. చంద్రబాబు నాయుడు తెలుగుజాతి అవమానపడే రీతిలో ఎన్.టి.ఆర్‌ను వెన్నుపోటు పొడిచి దొడ్డి దారిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీతో పాటు పార్టీ ఫండ్ ఉన్న అకౌంట్‌ను కూడా హస్తగతం చేసుకున్న వార్త అందిన రోజున ఎన్.టి.ఆర్. తీవ్ర మనస్తాపం చెందారు. అదే ఆయన మృతికి కారణమైందన్న భావన ఉంది.‘దేశమంటే మట్టి కాదోయ్.. మనుషులోయ్’ అన్నాడు గురజాడ. ఒక రాష్ట్రాన్ని ప్రజల వారసత్వంగా చూడాల్సిందిపోయి దానినో కార్పొరెట్ ఆఫీసుగా మార్చి, దానికి తాను సి.ఇ.ఓగా భావించి పాలించడం మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు పాలనలో తెలుగు ప్రజలు చులకనను ఎదుర్కొన్నారు. గుండు దెబ్బలు తిన్నారు. నీతి, రీతులే వ్యక్తిత్వమని భావించే మన సంస్కృతిలో వంచనతో వచ్చిన నాయకుడిని నమ్మి మోసపోతున్నామని తెలుగు ప్రజలకు పదేపదే అనిపించిన ఉదంతాలు ఉన్నాయి. వై.ఎస్.రాజశేఖర రెడ్డి వచ్చి పెద్ద గీత గీసే వరకూ చంద్రబాబు ఎంత చిన్న గీతో ప్రజలకు అర్థమైందని విశ్లేషకులు అంటారు.ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల చేత... పాలన చేస్తే ఎలా ఉంటుందో వై.ఎస్.రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు చూపారు. విశాలమైన హృదయం, దయ, ఆర్ద్రత ఉన్న నాయకుడు తన పాలనలో ప్రతి వ్యక్తి ఉన్నతి కోసం తపన పడతాడని, పడాలని వై.ఎస్.రాజశేఖరరెడ్డి చూపారు. ఆరోగ్యశ్రీ, ఫీజ్ రియింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత కరెంట్, జలయజ్ఞం... రాష్ట్రం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతున్నదని ప్రజలు పూర్తి సంతృప్తితో, సంతోషంగా ఉన్న కాలమది.కాని రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తెలుగుజాతిని స్థాణువును చేసింది. రాజశేఖర రెడ్డిని చూసిన కళ్లు అలాంటి నాయకుడి కోసమే వెతుకులాడాయి. ఆ నాయకుణ్ణి వై.ఎస్.జగన్‌లో చూసుకున్నాయి. అయితే రాజకీయ కుయుక్తులు పన్నడంలో తలపండిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, జగన్‌కు మధ్య సైంధవుడిలా నిలిచారు. టక్కుటమార విద్యలు ప్రదర్శించి, అబద్ధాల మేడలు కట్టి మరోసారి జనాన్ని నమ్మించి సి.ఎం. అయ్యారు. కాని చంద్రబాబు పరిపాలనా కాలంలో రాష్ట్రం మన్నుతిన్న పాములా ఉండిపోయింది. చిన్నా చితక పథకాల ప్రయోజనాల కోసం కూడా ప్రజలు అల్లల్లాడారు. ఒక వర్గం ప్రజలు రాజధాని నిర్మాణం వల్ల లబ్ధి పొందుతున్నారని సామన్యులకు అవగతమైంది. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుని కోసం వారు తిరగబడ్డారు. వై.ఎస్.జగన్‌ని తమ ముఖ్యమంత్రిని చేసుకున్నారు.రాష్ట్ర విభజన వల్ల అనేక వెసులుబాట్లు కోల్పోయి, నిధుల లోటులో రాష్ట్రం ఉన్నప్పటికీ జగన్ తన విశిష్ట సమర్థతతో ప్రజాహిత పాలన కోసం నవరత్నాలతో ముందుకు వచ్చారు. రెండేళ్ల కరోనా కాలం ప్రపంచాన్ని స్తంభింపచేసినా తెలుగు రాష్ట్రం ముందంజలో ఉండేలా చూసుకున్నారు. విద్య నుంచి వికాసం, వైద్య ఖర్చు నుంచి విముక్తి ప్రధాన అజెండాగా చేసుకున్న జగన్ విస్తృత తెలుగు సమూహాలను గట్టున పడేశారు. తెలుగు ప్రజలు ఎన్నడూ చూడని విధంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణి జరిగింది. రాజధానిలో పేదలకూ చోటుండాలని భావించిన జగన్ వంటి ముఖ్యమంత్రి ఉన్నారా?దారులు స్పష్టం. ప్రజలు ఏ దారిని ఎంచుకోవాలో తమకు తాముగా నిర్ణయించుకోవాలని అంటారు దేవులపల్లి అమర్. ఆయన రాసిన ‘మూడు దారులు’ గ్రంథం ఆంధ్ర రాష్ట్ర అవతరణ నుంచి మొదలయ్యి ప్రభావవంతమైన ముఖ్యమంత్రులుగా పని చేసిన ఎన్.టి.రామారావు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి ధోరణులను తెలియచేస్తూ ఇప్పుడు వై.ఎస్. జగన్‌తో తల పడుతున్న చంద్రబాబు ‘యూ టర్న్’లను, వెన్నుపోట్లను, నమ్మించి వచించిన సంఘటలను విపులంగా తెలియచేసి పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది.అనుభవజ్ఞుడైన జర్నలిస్టుగా మాత్రమే కాదు, చేయి తిరిగిన జర్నలిస్టుగా కూడా దేవులపల్లి అమర్ ఎంతో సులభంగా, సరళంగా చరిత్రని, వర్తమానాన్ని, తెలుగు నేలకు సంబంధించిన రాజకీయ ఘటనలను ఒక వరుసలో ఉంచి పాఠకులకు గొప్ప అవగాహన కలిగిస్తారు. కొన్ని ఘటనలు జరక్కపోయి ఉంటే తెలుగు జాతి మరింత ముందంజలో ఉండేది కదా అనిపించే విషయాలన్నో ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇది నేటి రాజకీయ కార్యకర్తలకు, నిపుణులకే కాదు భావి విద్యార్థులకు కూడా కీలకమైన రిఫరెన్స్ గ్రంథం.‘చరిత్రదేముంది... చింపేస్తే చిరిగి పోతుంది’ అనేది సినిమాలో డైలాగ్. కాని చరిత్ర చిరిగిపోదు. అలాగే ఉంటుంది. మళ్లీ మళ్లీ ఉజ్జీవనం చెందుతూనే ఉంటుంది. చరిత్ర నిర్మింపబడే కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విభజన అయ్యాక కాళ్లూ చేతులు ఊనుకుని ఒక గొప్ప పురోగమనానికి సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ ఈ సమయంలో ఎటువంటి నాయకుణ్ణి ఎన్నుకోవాలో, తద్వారా ఎటువంటి ఘన చరిత్రకు తెలుగు జాతి ఆలవాలంగా ఉండాలో ఈ ఎన్నికల కాలంలో నిర్ణయించుకోవాలి. దారి స్పష్టం కావాలంటే ఈ గ్రంథం చదవండి.మూడు దారులు– రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు; రచన– దేవులపల్లి అమర్; ప్రచురణ– రూప బుక్స్; పేజీలు: 210; వెల–395; ప్రతులకు–రూప పబ్లికేషన్స్, హైదరాబాద్.– వి.ఎన్.ప్రసాద్ (చదవండి: మూడు దారులు– రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు)
అదిరే..అదిరే మాధురి స్టయిలే అదిరే!
క్రైమ్
Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ స్ట్రీట్‌లైట్ విభాగం సిబ్బంది నిర్లక్ష్యం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. తనకు ఉద్యోగం వచి్చందన్న ఆనందాన్ని జీవిత భాగస్వామితో పంచుకునేందుకు వెళ్తున్న ఓ యువకుడిని కరెంటు స్తంభం రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన తుమ్మా భవానీ రుషి (35) హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆయన భార్య సుజాత స్లేట్ స్కూల్లో టీచర్. యూసుఫ్‌గూడ సమీపంలోని వెంకటగిరిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. గురువారం ఉదయం రుషి ఎక్కువ జీతంతో కూడిన మరో ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. సాయంత్రం తనకు కొత్త సంస్థలో ఉద్యోగం వచ్చిందని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. రాత్రి 10 గంటల సమయంలో కృష్ణానగర్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో మెయిన్ రోడ్డులోని మెట్రో ఫిల్లర్ నంబర్– 1546 వద్ద జీహెచ్ఎంసీ సర్కిల్– 19 వీధిదీపాల కరెంటు స్తంభానికి అతని చేయి తగిలింది. స్ట్రీట్‌లైట్ స్తంభానికి ఉన్న ఫ్యూజ్‌బాక్స్ ఓపెన్ చేసి ఉండడం, విద్యుత్ తీగలు వేలాడుతూ స్తంభానికి ఆనుకుని ఉండడంతో షాక్‌కు గురై రుషి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం కారణంగానే తన భర్త విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు పోలీసులకు రుషి భార్య సుజాత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ సర్కిల్–19 స్ట్రీట్‌లైట్ విభాగం అధికారులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. 2016 జనవరి 17వ తేదీన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి రోహిత్‌వేముల ఆత్మహత్యపై గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి శుక్రవారం పలు ఎల్రక్టానిక్, సోషల్ మీడియా చానళ్లలో రకరకాల వార్తలు, కథనాలు ప్రస్తారమయ్యాయి. దీనిపై స్పందించిన డీజీపీ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ‘ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా మాదాపూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన తుది నివేదిక గత సంవత్సరం అంటే నవంబర్ 2023 కన్నా ముందే నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా తయారు చేశారు. ఆ తుది నివేదికనే అధికారికంగా 21.03.2024న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంబంధిత కోర్టులో దాఖలు చేశారు. అయితే విచారణ, విచారణ జరిగిన విధానంపై రోహిత్ వేముల తల్లితోపాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో కేసు విషయంలో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించామని, తదుపరి దర్యాప్తును అనుమతించాలని మేజి్రస్టేట్‌ను అభ్యర్థిస్తూ సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం’అని డీజీపీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
రవి మృతదేహం కోసం..
ప్రజల కోసమే ప్రాణమిచ్చిండు 16 ఏళ్ల వయస్సులో విప్లవోద్యమంలోకి వెళ్లిన నా తమ్ముడు రవి 48 ఏళ్ల వయస్సులో ఎన్కౌంటర్లో చనిపోయిండు. ముప్పై ఏళ్లకు పైగా విప్లవోద్యమంలో పన్జేసిండు. ఉద్యమంలోకి పోయిన నుంచి ఒక్కసారి కూడా ఇంటి ముఖం చూడలె. ఎప్పటికై నా క్షేమంగా ఇంటికి వస్తడనుకున్నం. గిట్ల శవమై వస్తడనుకోలె. ప్రజల కోసం పోరుబాట పట్టిండు. ప్రజల కోసమే ప్రాణమిడిసిండు. నా తమ్ముని జన్మ ధన్యమైంది’ ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గత మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన దండకారణ్య కమిటీ సభ్యుడు కాసవేణ రవి పెద్దన్న వెంకటేశ్ కన్నీటి వేదన.బెల్లంపల్లి: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన దండకారణ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు, బెల్లంపల్లికి చెందిన కాసవేణ రవి అలియాస్ అశోక్ అలియాస్ వినయ్ (48) మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు పడిన యాతన అంతా ఇంతా కాదు. మంగళవారం ఉదయం ఎన్కౌంటర్ జరగగా శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు రవి మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్ పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత నారాయణపూర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి ఇబ్బందులేర్పడ్డాయి. రవి మృతదేహాన్ని తీసుకురావడానికి కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు బుధవారం మధ్యాహ్నం భీమదేవరపల్లి మండలం వంగర స్వస్థలం నుంచి ఛత్తీస్‌గఢ్‌కు బయల్దేరి వెళ్లారు. దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా, పోలీసుల తనిఖీల మధ్య 12 గంటల తర్వాత అక్కడికి చేరుకున్నారు. బుధవారం ఉదయం నారాయణపూర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మార్చురీలో భద్రపర్చిన రవి మృతదేహాన్ని సోదరుడు వెంకటేశ్, బంధువులు గుర్తించి బోరున విలపించారు.కిడ్నీ నుంచి తూటాలు..కుటుంబ సభ్యులు రవి మృతదేహాన్ని గుర్తించగా వైద్యులు స్కాన్ చేశారు. అతడి శరీరంలోని తూటాలను పరిశీలించిన నారాయణపూర్ ప్రభుత్వాస్పత్రి వైద్యులు పోస్టుమార్టం చేయడం సాధ్యంకాదని చెప్పారు. జగ్దల్పూర్ నుంచి ప్రత్యేక వైద్యులను శుక్రవారం ఉదయం రప్పించి మరోసారి రవి మృతదేహాన్ని స్కాన్ చేసి చూసిన తర్వాత పోస్టుమార్టం చేశారు. కాగా, కిడ్నీని ఆనుకుని మూడు తూటాలు ఉండటంతో నిపుణులైన వైద్యులతో పోస్టుమార్టం చేయించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించడంతో ప్రైవేట్ అంబులెన్స్‌లో స్వస్థలానికి చేరుకున్నారు. కాగా, శనివారం స్వగ్రామం వంగరలో రవి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అతడి సోదరుడు వెంకటేశ్ తెలిపారు.
రైలు నుంచి పడి గర్భిణి మృతి
కొరుక్కుపేట: చైన్నె నుంచి సీమంతం కోసం తమ స్వగ్రామానికి వవెళుతున్న ఓ గర్భిణి విరుదాచలం సమీపంలో రైలు నుంచి పడి మృతి చెందింది. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెన్‌కాశీ జిల్లా కరంకోవిల్ సమీపంలోని మేలనీలితనల్లూర్ తూర్పు వీధికి చెందిన సురేష్ కుమార్ (25) చైన్నెలోని ఓ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి చైన్నె పెరియార్ నగర్ త్రిశూలానికి చెందిన బిఎస్సీ పట్టభద్రురాలు కస్తూరి (22)తో 9 నెలల క్రితం వివాహమైంది. కస్తూరి ప్రస్తుతం 7 నెలల గర్భిణి. ఈ నేపథ్యంలో కస్తూరి కుటుంబ సభ్యులు సీమంతం చేయాలని నిర్ణయించారు. దీనికితోడు గ్రామంలో ఆలయ వేడుకలు జరుగుతున్నాయని, ఆదివారం సీమంతానికి ఏర్పాట్లు చేశారు. గురువారం సురేష్ కుమార్ తన భార్య, బంధువులు కొల్లాం ఎక్స్‌ప్రెస్ రైలులో స్వగ్రామానికి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేశారు. అందరూ ఆ రైలులో ఎస్–9 కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. ఈ రైలు రాత్రి 8 గంటలకు ఉలుందూరుపేట వద్దకు వెళ్లే సరికి కస్తూరికి వాంతులు అయ్యాయి. వెంటనే బంధువుల సాయంతో పెట్టెలో చేతులు కడుక్కోవడానికి వచ్చాడు. దానికి దగ్గరగా ప్రవేశ ద్వారం ఉంది. కస్తూరి వాంతులు చేసుకుంటూ అక్కడే నిలబడి ఉంది. ఆ సమయంలో రైలు వేగంగా వెళుతుండడంతో కదలిక రావడంతో కిందపడిపోయింది. ఇది చూసి షాక్‌కు గురైన మహిళ బంధువులు కేకలు వేశారు. వెంటనే బాక్స్‌లోని ప్రమాద గొలుసును లాగి రైలును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ గొలుసు పని చేయలేదు. తరువాత అత్యవసర లివర్ని లాగారు. అప్పటికి రైలు దాదాపు 7 కిలోమీటర్లు దూరం వెళ్లి ఆగింది. కుటుంబ సభ్యులందరూ దిగి ఽఆ ప్రాంతానికి నడిచి వెళ్లారు. కానీ రాత్రి సమయం కావడంతో కస్తూరి జాడ తెలియలేదు. అనంతరం రైలులో విరుదాచలం రైల్వేస్టేషన్‌కు వచ్చి, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కస్తూరి కోసం గాలిస్తున్నారు. దాదాపు 2 గంటల తర్వాత కస్తూరి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దక్షిణ రైల్వే సరైన విచారణకు ఆదేశించింది. కస్తూరికి వివాహమై 9 నెలలు కావస్తుండడంతో ఆర్డీఓ. విచారణకు సిఫారసు చేశారు.