Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

 IPL 2024: RCB Won The Toss And Choose To Field, Maxwell Returns
IPL 2024: గుజరాత్‌-ఆర్సీబీ మ్యాచ్‌.. విధ్వంసకర బ్యాటర్‌ రీఎంట్రీ

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 28 మధ్యాహ్నం) జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ఆర్సీబీ విధ్వంసకర బ్యాటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ రీఎంట్రీ ఇచ్చాడు. మ్యాక్సీ కొన్ని మ్యాచ్‌లకు ముందు ఫామ్‌ లేమి కారణంగా స్వతహాగా జట్టు నుంచి తప్పుకున్నాడు. మూడు మ్యాచ్‌ల విరామం అనంతరం మ్యాక్సీ తిరిగి జట్టులోకి వచ్చాడు. మ్యాక్సీ జట్టులోకి రావడంతో ఫెర్గూసన్‌పై వేటు పడింది. ఈ ఒక్క మార్పుతో ఆర్సీబీ నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగుతుంది. మరోవైపు గుజరాత్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. ఈ మ్యాచ్‌ గుజరాత్‌ హోం గ్రౌండ్‌ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్‌ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్‌కు ఈ మ్యాచ్‌ చాలా కీలకం కానుంది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలబడాలంటే గుజరాత్‌ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్‌ పడదు.హెడ్‌ టు హెడ్‌ ఫైట్స్‌ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్‌ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి.తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్‌), శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్‌), విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(w), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్

Today Gold and Silver Price 28 April 2024
స్థిరంగా బంగారం, వెండి.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?

ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఉలుకూ.. పలుకూ లేకుండా అన్నట్లు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66850 (22 క్యారెట్స్), రూ.72930 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 200 నుంచి రూ. 200 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 67000 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 73080 రూపాయల వద్దే ఉంది. నిన్న రూ.200, రూ.220 వరకు పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు ఏ మాత్రం పెరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి.దేశంలోని ఇతర నగరాలలో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 67700 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 72760 రూపాయల వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా ఈ రోజు ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు (ఏప్రిల్ 28) ఒక కేజీ వెండి ధర 84000 రూపాయల వద్ద నిలిచింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేదు.

Watch Live AP CM YS Jagan Speech In Public Meeting At Venkatgiri Tirupathi District
Watch Live: వెంకటగిరిలో సీఎం జగన్ బహిరంగ సభ

Watch Live: వెంకటగిరిలో సీఎం జగన్ బహిరంగ సభ

జురెల్‌- సంజూ (PC: BCCI)
అక్కడ బ్యాటింగ్‌ చేయడం కష్టం.. అతడు అద్భుతం!

ఐపీఎల్‌-2024లో వరుస విజయాలతో అదరగొడుతున్న రాజస్తాన్‌ రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. అందరి కంటే ముందుగానే టాప్‌-4లో బెర్తు ఖరారు చేసుకునే పనిలో పడింది.ఈ నేపథ్యంలో రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ హర్షం వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శన పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించాడు. అదే విధంగా రాయల్స్‌ను గెలుపుతీరాలకు చేర్చడంలో తనకు అండగా నిలిచిన ధ్రువ్‌ జురెల్‌పై ప్రశంసలు కురిపించాడు.ఫామ్‌లేమితోగతేడాది ఐపీఎల్‌లో అదరగొట్టి టీమిండియా తరఫున టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌కు.. ఐపీఎల్‌-2024 ఆరంభంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఫామ్‌లేమితో సతమతమైన అతడు లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌ కంటే ముందు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 50 పరుగులే చేశాడు.అయితే, శనివారం నాటి మ్యాచ్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ సంజూ శాంసన్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌(33 బంతుల్లో 71 నాటౌట్‌)తో విరుచుకుపడగా మరో ఎండ్‌ నుంచి అతడికి సహకారం అందించాడు.మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 52 పరుగులు రాబట్టాడు. తద్వారా సంజూ శాంసన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 121 పరుగులు జోడించి ఇంకా ఆరు బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌ మాట్లాడుతూ.. ‘‘ఫామ్‌ టెంపరరీ. నిజానికి టీ20 క్రికెట్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం. అయితే, ధ్రువ్‌ జురెల్‌ వంటి యువ ఆటగాళ్లు పిచ్‌ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని రాణిస్తుండటం సానుకూలాంశం.టీమిండియా తరఫున టెస్టుల్లో తన ప్రదర్శన మనం చూశాం. ఆరంభంలో తడబడ్డా అతడిపై మా నమ్మకం సడలలేదు. నెట్స్‌లో రెండు నుంచి మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించాడు. అతడు తప్పక రాణిస్తాడని మాకు తెలుసు. అదే జరిగింది కూడా’’ అని ధ్రువ్‌ జురెల్‌ ఆట తీరును కొనియాడాడు.రాజస్తాన్‌ వర్సెస్‌ లక్నో స్కోర్లు:వేదిక: లక్నోటాస్‌: రాజస్తాన్‌.. బౌలింగ్‌లక్నో స్కోరు: 196/5 (20)రాజస్తాన్‌ స్కోరు: 199/3 (19)ఫలితం: లక్నోపై ఏడు వికెట్ల తేడాతో రాజస్తాన్‌ విజయంప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: సంజూ శాంసన్‌.చదవండి: డీకే అవసరమా?: యువీ Winning streak continues 🩷A Sanju Samson special & Dhruv Jurel's attractive innings propel Rajasthan Royals to their 8th win this season🙌Scorecard ▶️ https://t.co/Dkm7eJqwRj#TATAIPL | #LSGvRR | @rajasthanroyals pic.twitter.com/cam0GepXVo— IndianPremierLeague (@IPL) April 27, 2024

India Secured One Of Its Biggest Wins In Archery As The Mens Recurve Team Stunned Reigning Olympic Champion South Korea
సంచలనం సృష్టించిన భారత ఆర్చరీ జట్టు.. ఒలింపిక్ ఛాంపియన్లకు షాక్‌

భారత ఆర్చరీ జట్టు సంచలనం సృష్టించింది. చైనా వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌ స్టేజ్‌ 1 పోటీల్లో డిఫెండింగ్‌ ఒలింపిక్‌ ఛాంపియన్‌ సౌత్‌ కొరియాకు ఊహించని షాకిచ్చింది.  🚨 India secured one of its biggest wins in archery as the men's recurve team stunned reigning Olympic champion South Korea to win the gold medal at the ongoing World Cup Stage 1. 🇮🇳🥇👏 pic.twitter.com/hZkHdOicqo— Indian Tech & Infra (@IndianTechGuide) April 28, 2024 ధీరజ్‌ బొమ్మదేవర, తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్‌ జాదవ్‌లతో కూడిన భారత పురుషుల రికర్వ్‌ జట్టు.. దక్షిణ కొరియాపై 5-1 తేడాతో చారిత్రక విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అర్చరీ వరల్డ్‌కప్‌లో 14 ఏళ్ల తర్వాత భారత్‌కు లభించిన తొలి స్వర్ణ పతకం ఇది. ఈ విజయంతో భారత్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు ఖరారయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి.   

The Green Children Of Woolpit Village Mistory Story Of England
మిస్టరీ.. దగ్గరకు వెళ్లేకొద్దీ.. అస్పష్టంగా పిల్లల స్వరం వినిపించసాగింది..

అది 12వ శతాబ్దం. వారసత్వ సంక్షోభంతో ఇంగ్లండ్‌ సింహాసనం కోసం అంతర్యుద్ధం జరుగుతున్న కాలమది. దాన్ని చరిత్రలో ‘ది అనార్కీ’ అని పిలుస్తారు. ఆ అరాచక పరిస్థితుల్లో జరిగిన ఓ వింత.. నేటికీ మిస్టరీయే!సఫెక్‌లోని వూల్‌పిట్‌ అనే గ్రామంలో కొందరు పొలం పనులు చేసుకుంటున్నారు. అప్పుడే ఉన్నట్టుండి, సమీపంలో తోడేళ్ల కోసం తవ్విన గుంతలో ఎండుటాకుల అలికిడి బాగా పెరిగింది. ‘అబ్బ.. తోడేళ్లు పడినట్లు ఉన్నాయి. ఈ రోజుకి మన పంట పండింది’ అనుకున్నారు. వారంతా నెమ్మదిగా తోడేళ్ల గుంత వైపు నడిచారు. దగ్గరకు వెళ్లేకొద్దీ.. అస్పష్టంగా పిల్లల స్వరం వినిపించసాగింది. ఆ అస్పష్టతకు కారణం స్వరం కాదు, భాష. ఆ పిల్లలు ఏం మాట్లాడుతున్నారో అక్కడున్నవారెవ్వరికీ అర్థంకాలేదు.దగ్గరకు వెళ్లి పరిశీలనగా చూస్తే ఆ గుంతలో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. చూస్తుంటే వారిద్దరూ అక్కా, తమ్ముడు అని అర్థమవుతోంది. కానీ ఇద్దరూ ఆకుపచ్చ చర్మంతో ఉన్నారు. వారి ఒంటి మీద దుస్తులు అసాధారణంగా, వింతగా కనిపించాయి. మానవులు కాదనే అనుమానం ఓ వైపు.. పసివాళ్లు అనే జాలి మరోవైపు.. పెనుగులాడుతుంటే.. చివరికి జాలే గెలిచింది. ఆ పిల్లల్ని జాగ్రత్తగా పైకి తీసి, ‘రిచర్డ్‌ డి కాల్నే’ అనే ఊరిపెద్ద ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడే పిల్లలకు ఆవాసం ఏర్పాటు చేశారు. అయితే తినడానికి ఏం పెట్టినా పిల్లలు వద్దన్నారు. వాళ్లు చెప్పిన మాటలు పిల్లలకు అర్థం కాలేదు. పిల్లల అవసరం పెద్దలకు బోధపడలేదు.ఆకుపచ్చ రంగులో ఉన్న ఆ ఇద్దరు చిన్నారులు.. చాలారోజుల పాటు తిండి తినలేదట. అయితే కొంత కాలానికి.. ‘కాల్నే’ తోటలో పెరుగుతున్న బఠాణీ మొక్కల నుంచి బఠాణీలను తెంపుకుని తినడం మొదలుపెట్టారు. అలా కొన్ని నెలల పాటు వాటి మీదే బతకారు వాళ్లు.  దాంతో ఆ పిల్లలు వేరే లోకం నుంచి వచ్చి పడ్డారన్న వాదన స్థానికుల్లో బలపడింది. తర్వాత కొంత కాలానికి.. ‘కాల్నే’ ఇంట్లో కాల్చిన రొట్టెలను తినడం మొదలుపెట్టారా పిల్లలు. దానివల్ల క్రమంగా వారి చర్మం రంగు మారుతూ వచ్చింది. పిల్లలు స్థానిక భాషను నేర్చుకుని.. మాట్లాడటం ప్రారంభించారు. అలా నెమ్మదిగా వాళ్లు సాధారణ మనుషులుగా మారుతున్న తరుణంలో.. ఉన్నట్టుండి పిల్లాడు చనిపోయాడు.తమ్ముడి మరణంతో ఆ పాప చాలా కుంగిపోయింది. తేరుకోవడానికి నెలలు పట్టింది. ఆ బాధలో చుట్టుపక్కలవారితో అనుబంధం పెరిగి.. అమ్మాయి మాటల్లో స్పష్టత వచ్చింది. ఆమె ఇంగ్లిష్‌ మాట్లాడటం నేర్చుకుంది. భాష పూర్తిగా నేర్చుకున్న తర్వాత.. ఆ అమ్మాయి మాటలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ‘నేను, నా సోదరుడు గతంలో ఉన్న చోటకి.. ఇప్పుడు ఉంటున్న చోటికి చాలా తేడా ఉంది. అది వేరే గ్రహంలా అనిపిస్తోంది.మేము ఇక్కడికి ఎలా వచ్చామో మాకు తెలియదు. మేము తోడేళ్ల గుంతలో పడకముందు వరకూ మా నాన్నతోనే ఉన్నాం. ఉన్నట్టుండి పెద్ద గంటల మోత వినిపించింది. మేము ఆ సమీపంలో పెద్ద నదిని కూడా చూశాం. ఆ క్షణంలో మాకేమైందో తెలియదు. కళ్లు తెరిచేసరికి మీ ముందు ఉన్నాం’ అని చెప్పుకొచ్చింది ఆ అమ్మాయి. ఆ పిల్ల అంత చెప్పుకొచ్చినా ఆ అక్క, తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారనేది అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు.అలా ‘కాల్నే’ ఇంట్లోనే పెరిగిన ఆ అమ్మాయికి.. ‘ఆగ్నెస్‌ బారే’ అనే పేరుపెట్టారు. దగ్గర్లోని కింగ్స్‌ లిన్‌ పట్టణానికి చెందిన ‘ఆర్చ్‌డీకన్‌ రిచర్డ్‌’ని పెళ్లి చేసుకుంది. నివేదికల ప్రకారం ఆమెకు పిల్లలు కూడా పుట్టారు. అయితే  ఆమె వంశస్థుల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. ఆమెకు పుట్టిన పిల్లలు ఆకుపచ్చరంగులో పుట్టారని, వారు తిరిగి తమ పూర్వీకులను వెతుక్కుంటూ వెళ్లిపోయారంటూ ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. ఆనాడు ఆ పిల్లల్ని చూసిన కొందరు చిత్రకారులు.. కొన్ని చిత్రాలను గీసి భద్రపరచారట.అయితే తర్వాత కాలంలో .. ఈ అక్కా తమ్ముళ్లిద్దరూ బెల్జియంలోని ఫ్లాండర్స్‌కి చెందిన ఫ్లెమిష్‌ వలసదారుల పిల్లలు కావచ్చు అనే ఓ వాదన పుట్టుకొచ్చింది. 12వ శతాబ్దంలో అనేక మంది ఫ్లెమిష్‌ వలసదారులు.. వూల్‌పిట్‌ సమీపంలోని ఫోర్న్‌హామ్‌ సెయింట్‌ మార్టిన్‌ పట్టణానికి చేరుకున్నారనే ఆధారాలూ దొరికాయి. ఫోర్న్‌హామ్‌ను, పూల్‌పిట్‌లను.. లార్క్‌ నది వేరు చేస్తుంది. ఆ పాప చెప్పిన నది అదే కావచ్చని అంచనా వేశారు.కింగ్‌ హెన్రీ ఐఐ పాలనలో, ఫోర్న్‌హామ్‌ యుద్ధంలో చాలామంది ఫ్లెమిష్‌ వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ యుద్ధం కారణంగా ఆ అక్కాతమ్ముళ్లిద్దరూ తమ వాళ్లను కోల్పోయి అనాథలుగా మారి ఉండొచ్చు. పాప విన్న పెద్ద గంటల చప్పుడు .. యుద్ధానికి సంబంధించిందే అయ్యుండొచ్చు. అలా అనాథలైన ఈ పిల్లలు.. అడవి బాటలో పడి పోషకాహారం కరవై అనారోగ్యానికి గురై ఉండొచ్చని, పిల్లల్ని కాపాడినవారికి వీరి డచ్‌ భాష అర్థమై ఉండకపోవచ్చని అంచనా వేశారు.ఈ అంచనా నిజమైతే.. పిల్లల చర్మం ఎందుకు ఆకుపచ్చగా ఉంది? అనే ప్రశ్న.. మరింత లోతుగా ఆలోచించేలా చేసింది. పోషకాహారం అందకుంటే చర్మం ఆకుపచ్చ రంగులోకి మారే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. అందుకే సమతుల ఆహారం తీసుకున్నా కొద్ది రోజులకే వాళ్ల చర్మం తిరిగి పూర్వ స్థితికి చేరిందని గుర్తుచేస్తూ.. పై వాదనకు బలాన్నిచ్చారు  నిపుణులు.ఇదిలా ఉండగా..  ఆర్సెనిక్‌ పాయిజనింగ్‌ వల్ల కూడా చర్మం ఆకుపచ్చగా మారుతుందనే మరో వాదన వచ్చి షాక్‌నిచ్చింది అందరికీ! పిల్లలపై ఆ విషప్రయోగం జరిగి ఉంటుందా? కావాలనే పిల్లలకు ఈ విషం ఇచ్చి.. అడవిలో వదిలేసి వెళ్లారా? అనే ప్రశ్నలు ఈ కథను ఉత్కంఠగా మార్చాయి.అయితే ఆ ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు దొరకలేదు. ఆ దిశలో అన్వేషణ కొనసాగుతుండగానే.. ఆ పిల్లలు ఏలియ¯Œ ్స అని కొందరు నమ్మసాగారు. పిల్లలు దొరకడం నిజమే. కానీ ఎలా దొరికారు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే ఊహాజనితమైన ఈ కథనాన్ని ప్రేరణగా తీసుకుని.. ఎన్నో నవలలు, పద్యాలు, నాటకాలు, సినిమాలు, డ్రామాలు పుట్టుకొచ్చాయి. దాదాపు ఎనిమిది శతాబ్దాలకు పైగా ఈస్టోరీ మిస్టరీగా కొనసాగుతునే ఉంది. — సంహిత నిమ్మనఇవి చదవండి: Funday Story: చిన్నమ్మ!! ‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’?

CM YS Jagan Full Speech At Tadipatri Public Meeting
బాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్‌

సాక్షి, తాడిపత్రి: టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టినట్టేనని గుర్తు పెట్టుకోవాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అలాగే, చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపినట్టేనని సీఎం జగన్‌ వ్యాఖ్యలు చేశారు.కాగా, సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రి సభలో మాట్లాడుతూ.. ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధమేనా? తాడిపత్రి సిద్ధమేనా?. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల భవిష్యత​్‌ను నిర్ణయించే ఎన్నికలు. జెండాలు జతకట్టుకుని వారంతా వస్తున్నారు. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టినట్టేనని గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్టే. జగన్‌కు ఓటు వేస్తే.. పథకాలన్నీ కొనసాగింపు.పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలకు ముగింపే. చంద్రబాబు సాధ్యం కానీ హామీలిస్తున్నారు.నా మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశాను. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాం. రూ.2.70 లక్షల కోట్లు నేరుగా మీ ఖాతాల్లో జమ చేశాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. 58 నెలల కాలంలో 2.31లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. పౌరసేవల్లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం​. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. ప్రతీ గ్రామం, పట్టణంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. రైతు భరోసా కేంద్రం.. గ్రామాల్లోనే కనిపిస్తుంది. ఇంటి వద్దకే రేషన్‌ వస్తోంది. పెన్షన్లు నేరుగా మీ ఇంటి వద్దకే వస్తున్నాయి. మీ బిడ్డ పాలనలో ఇంటి వద్దకే వైద్య సేవలు అందుతున్నాయి. మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే వస్తే మీ జీవితాలు ఎంతగా బాగుపడతాయో ఊహించండి. నాడు-నేడుతో స్కూళ్ల రూపరేఖలను మార్చాం. టాప్‌ యూనివర్సిటీలతో మన డిగ్రీ కాలేజీలను అనుసంధానం చేశాం. ప్రభుత్వ స్కూల్స్‌లో హక్కుగా ఇంగ్లీష్‌ మీడియం చదువుతున్నారు. మరో 10, 15 ఏళ్లలో ఇలాంటి పాలనే ఉంటే ప్రజల జీవితాలు ఎంతగా బాగుపడతాయో ఊహించండి. గతంలో ఎప్పుడైనా మహిళా సాధికారత చూశారా?.చట్టం చేసి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి నామినేటెడ్‌ పదవులు ఇచ్చాం. గతంలో ఎప్పుడైనా 31 లక్షల ఇళ్ల పట్టాలు చూశారా?.రైతు భరోసా పథకాన్ని ఎప్పుడైనా చూశారా?.80 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో సగం స్థానాలు కేటాయించాం. మోసాలు, కుట్రలను నమ్ముకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క స్కీమ్‌ అయినా ఉందా?. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి ఇదే కూటమి గతంలో ప్రజలను మోసం చేసింది.రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారు. డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశాడు. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు.  ఆడపిల్ల పుట్టగానే బ్యాంకుల్లో రూ.25వేలు డిపాజిట్‌ చేస్తానన్న చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారా?. అర్హుందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు అన్న చంద్రబాబు ఎవరికైనా ఇచ్చారా?. ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల పేరుతో మరో డ్రామా ఆడుతున్నారుసంక్షేమ పాలన కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలితాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణను అఖండ మెజారిటీతో గెలిపించాలిహామీలు నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సులు కోరతున్నాడు. ప్రజలకు మంచి చేశాకే మీ బిడ్డ మీ దీవెనలు కోరుతున్నాడు అని కామెంట్స్‌ చేశారు. 

IPL 2024: RCB To Take On Gujarat And CSK Fight With SRH On Big Sunday
ఐపీఎల్‌లో ఇవాళ (Apr 28) రెండు మ్యాచ్‌లు.. రెండూ భారీ సమరాలే..!

ఐపీఎల్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 28) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం (3:30 గంటలకు) మ్యాచ్‌లో గుజరాత్‌, ఆర్సీబీ.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌, సీఎస్‌కే జట్లు తలపడనున్నాయి. ఆదివారం కావడంతో ఐపీఎల్‌ ఇవాళ రెండూ భారీ మ్యాచ్‌లనే షెడ్యూల్‌ చేసింది.మధ్యాహ్నం మ్యాచ్‌ విషయానికొస్తే..పేపర్‌పై పటిష్టంగా కనిపించే ఆర్సీబీ.. అడపాదడపా ప్రదర్శనలతో నెట్టుకొస్తున్న గుజరాత్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌ గుజరాత్‌ హోం గ్రౌండ్‌ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్‌ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్‌కు ఈ మ్యాచ్‌ చాలా కీలకంగా మారింది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలబడాలంటే గుజరాత్‌ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్‌ పడదు.హెడ్‌ టు హెడ్‌ ఫైట్స్‌ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్‌ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి. తుది జట్లు (అంచనా)..గుజరాత్‌: వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్‌), శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్‌ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్‌), విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్‌కీపర్‌), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్రాత్రి మ్యాచ్‌ విషయానికొస్తే.. సీఎస్‌కే తమ సొంత మైదానమైన చెపాక్‌లో పటిష్టమైన సన్‌రైజర్స్‌ను ఢీకొట్టనుంది. ఈ సీజన్‌లోనే ఇది బిగ్‌ ఫైట్‌గా చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్‌ మూడో స్థానంలో.. సీఎస్‌కే ఆరో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ చాలా కీలకంగా మారింది.హెడ్‌ టు హెడ్‌ రికార్డ్‌ విషయానికొస్తే.. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్‌కే 14, సన్‌రైజర్స్‌ 6 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తుది జట్లు (అంచనా)..సన్‌రైజర్స్‌: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ [ఇంపాక్ట్‌ సబ్: టి నటరాజన్]సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, ఎంఎస్‌ ధోని, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీషా పతిరణ [ఇంపాక్ట్‌ సబ్: శార్దూల్ ఠాకూర్]

Actor Sahil Khan Arrested In Mahadev Betting App Case
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌ని  ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇతడిని ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. అంతకుముందు సాహిల్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ని బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ బెట్టింగ్ కేసు ఏంటి? సాహిల్‌ని ఎందుకు అరెస్ట్ చేశారు?  బాలీవుడ్ నటుడిగా సాహిల్ ఖాన్ పరిచయమే. 'స్టైల్', 'ఎక్స్యూజ్ మీ' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఫిట్‌నెస్ ట్రైనర్‌, ఇన్ఫ్లూయెన్సర్‌గా చేస్తున్నాడు. కొన్నేళ్ల ముందు మహేదేవ్ బెట్టింగ్ యాప్‪‌ని ప్రమోట్ చేశాడు. అయితే ఈ యాప్ ద్వారా రూ.15,000 కోట్ల అవినీతి జరిగింది. దాదాపు 67 బెట్టింగ్ సైట్లు సృష్టించారు. ఈ విషయమై సామాజిక కార్యకర్త ప్రకాశ్ బంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023 నవంబరులో మాతుంగ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా డిసెంబరులో దీన్ని ప్రమోట్ చేస్తున్న సాహిల్ ఖాన్‌కి నోటీసులు జారీ చేశారు.(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్)అయితే విచారణకు హాజరు కాకుండా సాహిల్.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుని ఆశ్రయించాడు. సెలబ్రిటీగా తాను కేవలం ప్రమోట్ చేశానని చెప్పుకొచ్చాడు. యాప్‌లో జరిగే వాటితో తనకు సంబంధం లేదని పేర్కొన్నాడు. కానీ పోలీసులు మాత్రమే ఇతడిని బెట్టింగ్ యాప్ కో-ఓనర్ అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా అవినీతి జరిగిన డబ్బంతా కూడా హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. సాహిల్‌తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలని కూడా పోలీసులు ఈ కేసులో విచారించే అవకాశాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?)

Guntur TDP MP Pemmasani Chandrasekhar said that he would remove the hand that hit him
నన్ను కొట్టిన వాడి చేయి తీసేస్తా..

సాక్షి, గుంటూరు: ‘కొట్టడం అనేది ఎగైనెస్ట్‌ ది లా... పొరపాటున ఎవడైనా చేస్తే ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది. కొట్టినవాడి చెయ్యి తీసేస్తా.. ఎవడైతే చేశాడో.. ఏదో ఒకరోజు ఐదేళ్లకో, పదేళ్లకో, పదిహేనేళ్లకో.. వాడు ఎంత చేస్తే అంతకు డబుల్‌ చేస్తా....’  ‘ఇదే అమెరికాలో అయితే కాల్చేస్తారు... ’ ‘వైఎస్సార్‌ సీపీ నాయకులు సద్దాం హుస్సేన్‌లా వ్యవహరిస్తున్నారు. సద్దాం హుస్సేన్‌ కూడా తన ఇష్టారీతిగా వ్యవహరించినందునే బంకర్‌లో దాగి ఉన్నా లాక్కొచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టి చంపారు.’పై వ్యాఖ్యలు ఎవరో రౌడీనో, గుండానో, చదువుకోని వ్యక్తో చేసినవి కాదు. డాక్టర్‌ చదివి అమెరికాలో వ్యాపారాలు చేసి గుంటూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ పలు సందర్భాలలో చేసినవి. రెండు రోజుల క్రితం ఒక పచ్చ మీడియా అధినేతతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక వేళ మీపై కేసులు పెడితే, కొడితే ఏం చేస్తారు అని ప్రశి్నస్తే తనను కొట్టడం చట్టానికి విరుద్దం అని చెబుతూనే తనను కొట్టిన వారిని మాత్రం చెయ్యి తీసేస్తానంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడటం గమనార్హం. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా పార్లమెంట్‌ ఎన్నికల బరిలోకి దిగిన చంద్రశేఖర్‌ మొదటి నుంచి డబ్బుందన్న అహంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు. చంద్రశేఖర్‌ అనాలోచితంగా చేస్తున్న వ్యాఖ్యలు పారీ్టకి చేటు తెస్తున్నాయని వారు అంటున్నారు.ఇప్పటికే ఆయన తీరుపై కాపు సామాజిక వర్గం నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఆయన గుంటూరు బరిలోకి దిగిన తర్వాత  ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క కాపు వర్గం నేతకు కూడా సీటు దక్కలేదు. అయినా పార్టీ కోసం పనిచేయడానికి వెళ్లిన వారికి ఛీత్కారాలే ఎదురయ్యాయి. తమ పారీ్టతో పాటు మిత్రపక్షాలలో ఉన్న కాపు నేతలు కూడా కూటమికి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారు. ఇటీవల కాలంలో బీజేపీ ఇంటలెక్చువల్‌ సెల్‌ స్టేట్‌ కో–కనీ్వనర్‌ డాక్టర్‌ టి.వి.రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు పార్టీని వీడారు. మరికొంత మంది పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.  అమెరికాలో రూ.వందల కోట్లు సంపాదించి గుంటూరులో రాజకీయం చేయాలని డిసైడైన చంద్రశేఖర్‌ కనీసం నియోజకవర్గానికి ఏం చేస్తాడో కూడా చెప్పడం లేదు. తాను గెలిచిన తర్వాత అభివృద్ధి చేసి చూపిస్తానని చెబుతున్నాడు. 2014, 2019 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్‌ టిక్కెట్‌ కోసం ప్రయత్నించిన చంద్రశేఖర్, అనుకోని పరిస్థితుల్లో 2024లో గుంటూరు పార్లమెంట్‌ నుంచి బరిలోకి దిగారు. గెలిస్తేనే ఇక్కడ ఉంటారని, ఓడిపోతే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోతారని తెలుగుదేశం నేతలు అభిప్రాయపడుతున్నారు. 2014, 2019లో చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన గల్లా జయదేవ్‌ను గెలిపిస్తే నియోజకవర్గానికి సేవ చేయకపోగా చివరి నాలుగు సంవత్సరాలు అసలు కనపడకుండా పోయాడు.వరసగా రెండుసార్లు గుంటూరు పార్లమెంట్‌ స్థానం నుంచి విజయం సాధించినా గల్లా   ప్రజలకు చేసిందేమి లేదనే చెప్పాలి. మొదటిసారి 2014లో ఇంటికో ఉద్యోగం వచ్చేలా చేస్తానని, 2019లో తన పరిశ్రమలను గుంటూరు చుట్టుపక్కల స్థాపించి ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీలు గుప్పించారు. హామీలు అమలు చేయకపోగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చూసుకున్నారు. తన వద్ద డబ్బు ఉంది కాబట్టి డబ్బు కుమ్మరించి  గెలవగలననే ధీమా పెమ్మసాని వ్యక్తం చేస్తున్నారు. తనకు భారీ మెజారిటీ వస్తుందంటూ ప్రగల్భాలు పలుకుతుండటం, నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుండటంతో అసలుకే ఎసరు వస్తుందన్న భయం తెలుగుదేశం నేతల్లో కనపడుతోంది.

తప్పక చదవండి

Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all
Advertisement
Advertisement
Advertisement