Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Sajjala Ramakrishna Reddy Comments On Polling
ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తింది: సజ్జల

సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్‌ పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని.. ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందుగానే ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారన్నారు.ప్రజలు ఓటు వేసేందుకు వెల్లువెత్తారు. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు సానుకూల ఓటుతో క్యూ కట్టారు. ఇంకా పోలింగ్‌ బూత్‌ల దగ్గర క్యూలైన్‌లో ఓటర్లున్నారని సజ్జల అన్నారు.‘‘చిత్తూరు జిల్లాలో ఉదయం కత్తిపోట్లతో టీడీపీ నేతలు ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలు, గూండాలు రెచ్చిపోయి దాడులు చేశారు. అద్దంకి, పీలేరు, సత్తెనపల్లిలో హింసాకాండకు పాల్పడ్డారు. టీడీపీ మూకలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఈవీఎంలు ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారు. పేద ప్రజల అభివృద్ధే.. రాష్ట్రాభివృద్ధికి దారి తీస్తుంది’’ అని సజ్జల చెప్పారు.‘‘కేంద్ర ప్రభుత్వం అండతో పోలింగ్‌ డే వరుకూ టీడీపీ నాటకాలు, దాడులు అన్ని చూశాం. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై కూడా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేశారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేశాం’’అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

Tdp Leaders Attacked With Petrol Bombs In Dachepalle
పెట్రోల్‌ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు

సాక్షి, పల్నాడు జిల్లా: దాచేపల్లిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పెట్రోల్‌ బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 2 షాపులు, నాలుగు బైక్‌లు దగ్ధమయ్యాయి. పలువురు గాయపడ్డారు.పల్నాడు జిల్లా చాగంటివారిపాలెంలో కన్నా లక్ష్మీనారాయణ దౌర్జన్యానికి దిగారు. పోలింగ్‌ బూత్‌ దగ్గర పెద్ద సంఖ్యలో మహిళలు వేచి ఉండగా, 20 మంది రౌడీలతో పోలింగ్‌ బూత్‌కు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ.. మహిళలను వెనక్కి పంపి పోలింగ్‌ ఆపాలంటూ జూలుం ప్రదర్శించారు.

Ap Ceo Mukesh Kumar Meena Press Meet On Voting
ఏపీలో పోలింగ్‌ శాతం పెరిగింది: ఏపీ సీఈవో

సాక్షి, విజయవాడ: ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్దసంఖ్యలో పోలింగ్‌ నమోదైందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశామని చెప్పారు.పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి. పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈవీఎంలోని చిప్‌లో డేటా భద్రంగా ఉంది. ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్‌ ప్రారంభించాం. కొన్ని చోట్ల ఇంకా పోలింగ్‌ కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ మిషన్లు మార్చి పోలింగ్‌ పునరుద్ధరించాం. పల్నాడు, అనంతపురం, తెనాలిలో కొందరిని గృహ నిర్బంధం చేశారు’’ అని ఏపీ సీఈవో వెల్లడించారు.11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఎక్కడా రీ పొలింగ్‌ అవసరం పడలేదు. కొన్ని ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం. ఇప్పటివరకు 75 శాతం పోలింగ్‌ నమోదైంది. స్ట్రాంగ్‌ రూమ్‌లోకి ఈవీఎంల తరలింపు జరుగుతుందని ఎంకే మీనా వెల్లడించారు.

Jogi Ramesh Angry At The Attacks Of Tdp Leaders
టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్‌ ఆగ్రహం

సాక్షి, కృష్ణా జిల్లా: పోరంకిలో టీడీపీ అరాచకం సృష్టించింది. టీడీపీ గూండాలు దాదాగిరికి పాల్పడ్డారు. దొంగ ఓట్లు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు గుర్తించాయి. ప్రశ్నించినందుకు జోగి రమేష్‌ అనుచరుడు ఆరేపల్లి రాముపై కర్రలతో దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.నెల్లూరు: ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరులో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన అభ్యర్థి మేరీగా మురళిపై దాడికి యత్నించారు. సంగం మండలం చెన్నవరప్పాడులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఢిల్లీ బాబు గాయపడ్డారు. కావలి నియోజకవర్గంలోని అల్లూరు, ముసునూరులో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.

Tdp Leaders Vandalized Evms In Macherla Constituency
పల్నాడు: ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు

సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. రెంటచింతల మండలం తుమ్మూరు కోటలో మొత్తం ఆరు పోలింగ్ బూతులను అధికారులు ఏర్పాటు చేశారు.203, 204, 206 పోలింగ్ బూత్‌ల్లో మూడు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. 205 నెంబర్ బూత్‌లో ఈవీఎం స్వల్పంగా పగిలింది. దీంతో పాటు జెట్టిపాలెంలో 215 పోలింగ్‌ బూత్‌లో మరొక ఈవీఎంని టీడీపీ నేతలు పగలగొట్టారు. తుమ్మూరు కోటలో నాలుగు పోలింగ్ బూత్‌లో రెండు గంటల నుంచి పోలింగ్ నిలిచిపోయింది.ఓటమి భయంతో పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద తెలుగు దేశం నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్‌ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు.. పల్నాడు ఉద్రిక్తతలపై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్‌ సారించింది.

Sajjala Ramakrishna Reddy Comments On Tdp
టీడీపీ నైరాశ్యంలోకి వెళ్లి హింసను ప్రేరేపిస్తోంది: సజ్జల

సాక్షి, గుంటూరు: టీడీపీ ఓటమి నైరాశ్యంలోకి వెళ్లిపోయి హింసను రెచ్చగొట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుప్పం, మాచర్ల, తాడిపత్రి, చిత్తూరు, దర్శి నియోజకవర్గాల్లో టీడీపీ హింసాత్మక ఘటనలను ఈసీ దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు.‘‘ఓటమి భయంతో టీడీపీ దాడులకు దిగుతోంది. వైఎస్సార్సీపీ శ్రేణులు వీటిని పట్టించుకోకుండా సంయమనంతో, శాంతియుతంగా వ్యవహరించి పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేందుకు సహకరించాలి. ఓటు వేసేందుకు వచ్చిన మహిళలపై దుర్భాషలు ఆడుతూ.. బెదిరిస్తూ.. దాడులకు దిగుతున్నారు. అయినా చెదరని సంకల్పంతో మహిళలు భారీగా ఓటు వేసేందుకు తరలివస్తున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు.గంగాధర నెల్లూరు, విశాఖ వెస్ట్ నియోజకవర్గాల్లో బౌన్సర్లతో టీడీపీ నేతల హల్చల్పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా బౌన్సర్లను దించిన చరిత్ర టీడీపీది. పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం లేదా నెమ్మదిగా పనియచేయడం వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లాం’’ అని సజ్జల తెలిపారు.‘‘ఎండ వేడిమి భరించలేక, క్యూలో నిలబడలేక వృద్ధులను ఇబ్బందులను పడుతున్నారన్నవిషయాన్ని ఈసీకి తెలిపాం. కొందరు సిబ్బంది నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నందున ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని సజ్జల చెప్పారు.

Ap Assembly Elections 2024: TDP Cadre Goons Attacks On Polling Day
టీడీపీ నేతల దౌర్జన్యాలు.. ఏపీలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌. ఓటమి భయంతో పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద తెలుగు దేశం నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్‌ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు.. పల్నాడు ఉద్రిక్తతలపై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్‌ సారించింది.పల్నాడుమాచర్లలో ఘర్షణలను ప్రేరేపించింది టీడీపీనే: మల్లాది విష్ణుపోలీస్‌ అధికారులు ప్రేక్షకపాత్ర వహించారుకుప్పం, మాచర్ల, తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారువైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేసి తిరిగి మాపైనే ఫిర్యాదులు పల్నాడుమాచర్లలో రెచ్చిపోయిన టీడీపీ నేతలువైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి కుమారుడిపై టీడీపీ నేతల దాడిపాల్వాయి గేట్‌లో టీడీపీ నేతలు ఓటర్లను అడ్డుకున్నారువిషయం తెలిసి పాల్వాయి గేట్‌ వద్దకు వెళ్లాం: గౌతంరెడ్డిపిన్నెల్లిపై టీడీపీ నేతలు దాడికి యత్నించారుఅడ్డుకున్న మాపై విచక్షణారహితంగా దాడి చేశారుటీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి సోదరుడు మాపై దాడి చేశారుదాడి జరిగినా కారంపూడి సీఐ స్పందించలేదు కృష్ణా:పోరంకిలో టీడీపీ గూండాల దాడిదొంగ ఓట్లు వేయడాన్ని గుర్తించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులుప్రశ్నించిన జోగి రమేష్‌ అనుచరుడిపై కర్రలతో దాడిఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్‌పై టీడీపీ నేత దాడిఎమ్మెల్యేగా మాల, మాదిగ వర్గాలకు కొమ్ము కాస్తున్నారంటూ గొట్టి ముక్కల సుధాకర్‌ దూషించాడు: అన్నా బత్తుని శివకుమార్‌నా భార్య ఎదుటే అసభ్యంగా దూషించాడుబూత్‌లోకి వెళ్తుండగా తిడుతూనే ఉన్నాడునువ్వు అసలు కమ్మవాడివేనా అంటూ అసభ్యంగా మాట్లాడాడుపోలింగ్‌ బూత్‌ వద్ద మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించాడుపోలింగ్‌ బూత్‌ వద్ద దౌర్జన్యం చేస్తున్నట్లు ఓటర్లే చెప్పారుటీడీపీ, జనసేన నేతలు వేరే ప్రాంతాల నుంచి వాళ్ల మనుషులను దింపారువైఎ‍స్సార్‌సీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారు అనంతపురంతాడిపత్రి లో ఉద్రిక్తతవైఎస్సార్ సీపీ శ్రేణులపై జేసీ వర్గీయుల రాళ్ల దాడిమూడు వాహనాలు ధ్వంసంఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులుపల్నాడు: మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు వద్ద వైఎస్ఆర్సిపి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై టీడీపీ దాడికర్రలు రాడ్లు మారణాయుధాలతో దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలుపదిమంది వైఎస్ఆర్సిపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలుతలలు పగిలిపోవడంతో తీవ్ర రక్తస్రావంరోడ్డుపైన పడిపోయిన వైఎస్ఆర్సిపీ కార్యకర్తలుపిల్లలు రామకృష్ణారెడ్డి వాహన శ్రేణి పూర్తిగా ధ్వంసంపోలింగ్ బూత్ పరిశీలనకు వెళ్ళిన సమయంలో ఒక్కసారిగా పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి పై దాడి చేసిన టీడీపీ మూకలుకృష్ణాపెనమలూరు నియోజకవర్గం పోరంకి హై స్కూల్ పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను ప్రలోభపెడుతున్న టీడీపీటీడీపీకి ఓటు వెయ్యాలని పార్టీ గుర్తు చూపిస్తున్న కార్యకర్తలుటీడీపీ ప్రలోభాల పై నిలదీసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుటీడీపీ పై పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుప్రకాశంఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ 10 వాహనాల కాన్వాయ్ తో హల్చల్,ఎన్నికల నిబంధనలు కు విరుద్ధంగా కాన్వాయ్పట్టించుకోని పోలీసులు ,ఎన్నికల అధికారులుఎస్పీ సుమిత్ కి పిర్యాదు చేసిన బాలినేనిబాపట్ల పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలం పెదనక్కలపాలెంలో టీడీపీ అరాచకంబాపట్ల వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ కారుపై దాడిదాడి సమయంలో కారులో లేని నందిగం సురేష్ఏజెంట్లు మాత్రమే కారులో ఉండడంతో కారుపై దాడి చేసి నందిగం సురేష్ ను దుర్భాషలాడిన టీడీపీ కార్యకర్తలుఏజెంట్ల ను బెదిరించిన టీడీపీ కార్యకర్తలుమూడురోజుల క్రితమే యద్దన పూడి మండలం చింతపల్లిపాడులో సురేష్ పై దాడి చేసిన టీడీపీ శ్రేణులుకాకినాడగొల్లప్రోలు టౌన్ లో ఉద్రిక్తత.మహిళలను ఏడిపించిన జనసేన కార్యకర్తలుఅడ్డుకోబోయిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలువైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు దాడిపరిస్తితి ఉద్రిక్తంప్రకాశందర్శి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలుదర్శి మండలం బొట్లపాలెం ఘర్షణ, వైస్సార్సీపీ ,టీడీపీ కార్యకర్తలు కొట్లాట, పరిస్థితి ఉద్రిక్తంఏజెంట్ల తలెత్తిన వివాదంకిందపడిన ఈవీఎంవైస్సార్సీపీ కార్యకర్తలు పై టీడీపీ కార్యకర్తలు దాడిదేవవరంలోనూ ఘర్షణ, ఏజెంట్ ల మధ్య గొడవప్రకాశందర్శి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలుదర్శి మండలం బొట్లపాలెం ఘర్షణ, వైస్సార్సీపీ ,టీడీపీ కార్యకర్తలు కొట్లాట, పరిస్థితి ఉద్రిక్తంఏజెంట్ల తలెత్తిన వివాదంకిందపడిన ఈవీఎంవైస్సార్సీపీ కార్యకర్తలు పై టీడీపీ కార్యకర్తలు దాడిదేవవరంలోనూ ఘర్షణ, ఏజెంట్ ల మధ్య గొడవఅనంతపురంతాడిపత్రి లో ఎదురుపడ్డ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి - జేసీ ప్రభాకర్ రెడ్డితాడిపత్రి లో టీడీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అభ్యంతరంఅనుమతి లేకుండా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, టీడీపీ రౌడీషీటర్ పొట్టి రవిఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితాడిపత్రి పట్టణంలో జేసీ ఇరువర్గాల మొహరింపులాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులుపల్నాడుమాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ వద్ద టీడీపీ కార్యకర్తల దౌర్జన్యంపోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితాము లోపలికి వెళ్తామని టీడీపీ కార్యకర్తల ఆందోళనపోలింగ్ కేంద్రం గేట్ల‌ను తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నంఅడ్డుకున్న పోలీసులతో వాగ్వివాదంపోలీసులను నెట్టేసిన టీడీపీ కార్యకర్తలుఅనంతపురంగుత్తిలో టీడీపీ నేతల దౌర్జన్యంపోలింగ్ కేంద్రం లో ప్రచారం నిర్వహించిన టీడీపీ నేతలుప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలుకర్నూలుకర్నూలు 17వ వార్డు టిడిపి పార్టీ కార్పోరేటర్ పద్మలతా రెడ్డి ప్రలోభాలు...పోలింగ్ కేంద్రం వద్ద చేరుకొని టిడిపికి ఓటు వేయాలని ఓటర్లను ప్రభావితం చేస్తున్న కార్పొరేటర్..ఎన్నికల నిబంధన ఉల్లంఘించి ప్రచారానికి పాల్పడుతున్న టిడిపి కార్పొరేటర్ పద్మలత రెడ్డిచిత్తూరుకుప్పం నియోజవర్గంలో దొంగ ఓటర్లుకుప్పం మున్సిపాలిటీ పాతపేట 163 పోలింగ్ బూత్ లో తన ఓటు వేరే ఎవరో దొంగ ఓటు వేశారని ఆవేదన వ్యక్తం చేసిన గాయత్రీ అనే ఓటర్మొదటి సారి ఓటు హక్కు వినయోగించుకోవాలని చూసిన యువతీ తన ఓటు వేరొకరు వేసేయడంతో కన్నీళ్లు పెట్టుకొన్న యువతీకృష్ణాబాపులపాడులో జనసేన,టీడీపీ నాయకులు ఓవర్ యాక్షన్.పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న జనసేన,టీడీపీ నాయకులు.జనసేన నాయకుడు చలమలశెట్టి రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేత గోసుల శివ భరత్ రెడ్డి.ఏలూరు దెందులూరు నియోజకవర్గం పెదవేగి గ్రామంలో టిడిపి నాయకుల దౌర్జన్యం.పోలింగ్ బూత్ నెంబర్ 54 లోకి ఒక్కసారిగా చొచ్చుకుని వెళ్ళే ప్రయత్నం చింతమనేని అనుచరులు.ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భయభ్రాంతులకు గురైన ఓటర్లువిధుల్లో ఉన్న పోలీసుల అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడిన టిడిపి నాయకులుపారా మిలిటరీ బలగాలు రంగ ప్రవేశం చేయటంతో సద్దుమణిగిన పరిస్థితులు.నంద్యాలనందికొట్కూరు పట్టణంలోని 46,47,48 పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేత మాండ్రా శివనంద రెడ్డి హాల్ చల్ క్యూలైన్లో ఉన్న ఓటర్లపై ఒత్తిడి తెచ్చి ప్రలోభాల పర్వంక్యూలైన్లలో ఉన్న ఓటర్లను పక్కకు పిలిచి ఓటు వేయాలని భయబ్రాంతులకు గురి చేస్తున్న టీడీపీ నేత మాండ్రా శివానంద రెడ్డి,ఓటర్లను ప్రభావితం చేస్తున్న టీడీపీ శివానంద రెడ్డికి పోలీసుల వార్నింగ్‌ 100 మీటర్లు బయటఉండాలని సూచనపోలీసుల మాట లెక్క చేయకుండా నేను చీఫ్ ఎలక్షన్ ఏజంట్ అని బూత్ పరిశీలించి వెళ్తానని పోలీసులతో వాదించారు టీడీపీ నేత చిత్తూరు టీడీపీ గుండాల రౌడీయిజంమండికృష్ణాపురం పంచాయతీ లో టిడిపి గుండాల అరాచకంవైఎస్ఆర్సీపీ బూత్ ఏజెంట్స్ పై కత్తితో దాడి ఆపై పరారీ ఓటమి భయంతో నీచ రాజకీయాలకు తెరతీసిన చిత్తూరు టీడీపీ శ్రేణులువైఎస్సార్‌ జిల్లాబద్వేల్ టీడీపీ కార్యాలయం వద్ద కూటమి నాయకుల ఘర్షణ అగ్రహారం గ్రామానికి సంబంధించి ఓటర్లకు డబ్బు మేము పంచుతాము అంటే మేము పంచుతాము అంటూ గొడవ జనసేన నేత వేలును టీడీపీ నాయకుడు ఇరు వర్గాలు పోలీసుల అదుపులో

AP Assembly Elections 2024 Voting Live Updates And Highlights Telugu
AP Elections 2024 Polling: ఏపీ పోలింగ్‌ డే అప్‌డేట్స్‌

AP Elections 2024 Polling Updatesఏపీ ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు..

Telangana Lok Sabha Elections 2024 Voting Live Updates And Highlights Telugu
TS Lok Sabha Polling 2024 Updates: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ అప్‌డేట్స్‌..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ అప్‌డేట్స్‌

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all