Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Jagan Kosam Siddham YSRCP Taking Manifesto To Every House
YSRCP మరో అడుగు.. ఇక ఇంటింటికీ మేనిఫెస్టో

గుంటూరు, సాక్షి: పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో.. ఏపీలో ఎన్నికల  ప్రచారం జోరందుకుంది. జనంలోకి చొచ్చుకుపోయేలా.. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష కూటమికి వెన్నులో వణుకు పుట్టించేలా  ఉంటున్నాయి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రచార ప్రసంగాలు. మరోవైపు పార్టీ అధినేత ఆదేశాలనుసారం పార్టీ శ్రేణులు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.జగన్‌ కోసం సిద్ధం.. ఇదీ ఇప్పుడు వైఎస్సార్‌సీపీ చేపట్టిన కొత్త కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఇంటికి వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో-2024ను చేరవేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా.. సీఎంగా జగన్‌ ఉంటేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, పేదల భవిష్యత్తు మారుతుందని ప్రచారం చేయనుంది. ఇవాళ పార్టీ కీలక నేతలు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు   మొదటి నుంచి తన ప్రసంగాల్లో, ఎన్నికల ప్రచారంలోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సంక్షేమం పొందిన సామాన్యులే తన స్టార్‌ క్యాంపెయినర్లంటూ సీఎం జగన్‌ చెబుతూ వస్తున్నారు. దీంతో ఆ సామాన్యుల్నే ఇప్పుడు జగన్‌ కోసం సిద్ధం కార్యక్రమంలో భాగం చేయబోతోంది పార్టీ.మేనిఫెస్టోను దాదాపుగా పూర్తి స్థాయిలో(99 శాతం పైనే) అమలు చేసింది వైఎ‍స్సార్‌సీపీనే కాబోలు!. అలవుగాని హామీలను ఇవ్వబోమని, చేయగలిగింది మాత్రమే చెబుతామని, చెప్పిందే చేస్తామని, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇంకా ఎక్కువే చేస్తామని మేనిఫెస్టో ప్రకటన సమయంలో సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అంతేకాదు.. మేనిఫెస్టోను ఓ ప్రొగ్రెస్‌ రిపోర్టులాగా.. 58 నెలల కాలంలో ఎప్పటికప్పుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ వస్తున్నామంటూ పేర్కొన్నారాయన.  దీంతో ఈ హామీలనే జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని, తద్వారా మరోసారి ప్రజల ఆదరణ చురగొనాలని  వైఎస్సార్‌సీపీ భావిస్తోంది.

AP Politics And Election Live Updates May 2nd
AP Election Updates May 2nd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Andhra Pradesh Election Updates 2nd May.. ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రెస్‌ మీట్‌5:24 PM, May 2nd, 2024 రాష్ట్ర వ్యాప్తంగా 4,13,33,702 ఓటర్లు ఉన్నారుపురుషులు- 2,02,74,144, మహిళలు-2,10,56,137దీనికి అదనంగా సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారురాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ బూత్‌లు ఏర్పాటుమోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ లపై 864 ఎఫ్ఐఆర్‌లు నమోదు సీ విజిల్ కి 16,345 ఫిర్యాదులు వచ్చాయికొన్ని చోట్ల హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. 6 మందికి గాయాలుఇప్పటి వరకు 203 కోట్లు విలువైన నగదు, మద్యం సీజ్రాష్ట్ర వ్యాప్తంగా 29,897 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్.. దాదాపు 64% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయబోతున్నాం14 నియోజకవర్గాలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్‌తో పాటు పోలింగ్ నిర్వహణకి సెంట్రల్ ఫోర్సెస్ఎండ వేడిమి అధికంగా ఉన్న కారణంగా టెంట్లు, కూలర్లు, తాగునీళ్లు, మెడికల్ కిట్ల వంటి ప్రత్యేక చర్యలు85 ఏళ్ల పైబడిన వృద్దులు, వికలాంగులు తదితరులు ఇంటి దగ్గర వినియోగించుకోవడానికి 7,28,484 మందిలో కేవలం 28,591మంది అంగీకరించారుహైకోర్టు తీర్పు తర్వాత ఏడు ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్ధానాలలో గాజు గ్లాసు కేటాయించిన అభ్యర్ధులకి వేరే గుర్తులు కేటాయించవలసి వచ్చింది\విశాఖ ఎంపీ స్ధానానికి 33 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్న కారణంగా మూడు ఈవీఎం అవసరమవుతాయితిరుపతి, మంగళగిరిలలో  మూడు బ్యాలెట్ యూనిట్లు..మరో 20 నియోజకవర్గాలలో రెండేసి బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతున్నాయిఇందుకోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా 15 వేల ఈవీఎంలు తెప్పించాంరాష్ట్రంలో 50 మంది జనరల్ అబ్జర్వర్లు, 25 మంది పోలీస్ అబ్జర్వర్లు, 25 పార్లమెంటరీ వ్యయ పరిశీలకులు,  అసెంబ్లీ స్ధానాలకి 50 వ్యయ పరిశీలకులు ఉన్నారుపోలీస్ శాఖ రిపోర్ట్ మేరకు 384 ఎమ్మెల్యే, 64 మంది ఎంపి అభ్యర్ధులకి ప్రత్యేక భద్రత  కల్పించాంపెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల‌కమీషన్ మేరకు కొన్ని ఆదేశాలు జారీ చేశాంబ్యాంకు అకౌంట్లు ఉన్నవారికి డిబిటి ద్వారా....అకౌంట్లు లేని వారికి నేరుగా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నాంపెన్షన్ల పంపిణీపై రాజకీయ పార్టీల ప్రచారాలపై నేను స్పందించలేనునామినేషన్ల ఉప సంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితా సిద్ధం అయ్యిందిఅలాగే ఎన్నికల్లో ఓటు వేయనున్న ఓటర్ల  తుది జాబితాను కూడా సిద్ధం చేశాంప్రస్తుతం 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారుగతంతో పోలిస్తే 5,94,631 మంది ఓటర్లు పెరిగారుఇక రాష్ట్ర వ్యాప్తంగా అదనం గా పోలింగ్ కేంద్రాలు కూడా పెరిగాయిమొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కోసం సిద్ధం చేశాంఅలాగే మోడల్ కోడ్ లో భాగం గా విస్తృత తనిఖీలు చేస్తున్నాంఇప్పటి వరకూ 203 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాంఈసారి 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తాంఅలాగే రాష్ట్రంలోని 14 నియోజక వర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించాంమాచర్ల, పెదకూరపాడు ఒంగోలు, అల్లగడ్డ్ , తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ళపల్లి ల్లలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాంప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయిఅందుకే పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేలా చర్యలు, మెడికల్ కిట్ లు, ఏర్పాటు చేస్తున్నాంరాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది హోం ఓటింగ్‌కు సమ్మతి తెలిపారుజనసేన పోటీ చేస్తున్న లోక్ సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు లో గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయింపు లేదుఅలాగే శాసన సభ నియోజక వర్గాల పరిధిలో ఉన్న లోక్ సభ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎవరికీ ఇవ్వంఇప్పటికే కేటాయించిన 7 లోక్ సభ, 8 శాసన సభ నియోజక వర్గాల్లో గుర్తును మార్పు చేసి ఇతర అభ్యర్థులకు ఇచ్చాంఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటింగ్ మొదలు పెట్టాంపెరిగిన అభ్యర్థుల కారణంగా అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్ లు అవసరం అయ్యాయి. వీటిని తెప్పించి జిల్లాకు పంపించాం చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల రామకృష్ణారెడ్డి4:43 PM, May 2nd, 2024 చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని ప్రజలకు తెలుసువైసీపీ బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తోందిరాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అమలు చేయగలిగినవే చెప్పాంకోవిడ్ సమయంలో ఆ రెండేళ్లు కూడా ఆగకుండా సంక్షేమం అమలు చేశాంజగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నారుఇప్పుడేమో మళ్ళీ అడ్డగోలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారుగతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారునిరుద్యోగులకు రూ.3 వేలు, రైతులకు రూ.20 వేలు సహాయం అని మేనిఫెస్టోలో పెట్టారుకానీ అర్హత ఏంటో చెప్పలేదుఅంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా?1999 లో కూడా కోటి మందికి ఉపాధి అని హామీ ఇచ్చారుకానీ అమలు చేయకుండా ఎగనామం పెట్టారుచంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వెయ్యి రూపాయలు చేశారుఅదికూడా సరిగా ఇచ్చారా అంటే అదీ లేదువృద్దులు, వికలాంగులకు ఏ ఇబ్బందీ లేకుండా జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారుఇప్పుడు కోర్టుకు వెళ్లి, ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకున్నారుచివరికి బ్యాంకులో పెన్షన్లు వేసేలా ఈసీ ద్వారా చేయించారుబ్యాంకుల దగ్గర పెన్షన్‌దారులు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోందిచంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఎలాంటి నరకం ఉంటుందో ముందే కనపడుతోందివృద్దులు, వికలాంగుల కష్టాలకు పూర్తి పాపం చంద్రబాబుదేవాలంటీర్ల వ్యవస్థను తొలగించి మళ్ళీ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తారు2019లో ప్రజలు చిత్తుగా ఓడించారన్న కోపం చంద్రబాబుకు ఉందిఅందుకే వారి జీవితాలతో చెలగాటమాడటానికి సిద్ధం అయ్యారుకూటమి మేనిఫెస్టోలో బీజేపీ ఫోటోలు ఎందుకు లేవు?అంటరానితనంగా ఎందుకు వ్యవహరించారు?సిక్కిం, అరుణాచలప్రదేశ్ లో కూటమి మేనిఫెస్టోలో మరి బీజేపీ, మోదీ బొమ్మలు ఎందుకు ఉన్నాయి?చంద్రబాబు హామీలు అమలు చేసేలా లేవని బీజేపీకి అర్థం అయిందిఅందుకే చంద్రబాబు మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పిందిల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విపరీతంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారుఆ యాక్టును బీజేపీ కేంద్ర  ప్రభుత్వమే అమలు చేయాలని చూస్తోందిఆ చట్టం మీద అనుమానాలు ఉంటే దానికి బాధ్యత బీజేపీదేతప్పుడు ప్రచారాలు చేసే చంద్రబాబు అసలు రాజకీయాలకే అనర్హుడుచంద్రబాబు మేనిఫెస్టో బూతుపత్రంల్యాండ్ టైటిల్ యాక్టు మీద బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలిబీజేపి రాష్ట్ర నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?చంద్రబాబు లెక్క ప్రకారం దేశంలోని భూములన్నీ మోదీ అమ్మకుంటున్నారా?దీనిపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు క్లారిటీ ఇవ్వాలిజనసేనకు ఈసీ ఝలక్‌1:45 PM, May 2nd, 2024ఏపీలో ఎన్నికల వేళ జనసేనకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల్లో గాజు గ్లాస్‌ గుర్తును రిజర్వ్‌ చేయలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు ఈసీ వెల్లడించింది.గాజు గ్లాస్‌ గుర్తును తమకు మాత్రమే రిజర్వ్‌ చేసేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో జనసేన పిటిషన్‌ దాఖలుఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఏపీవ్యాప్తంగా గాజు గ్లాస్‌ గుర్తును రిజర్వ్‌ చేయలేమని ఎన్నికల సంఘం.. హైకోర్టుకు తెలిపింది. అలాగే, ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్‌ మార్చలేమని ఈసీ కోర్టుకు వెల్లడించింది.జనసేన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఈసీ పేర్కొంది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని ఈసీ.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ బ్యాలెట్‌లను ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌కు పంపించినట్టు ఈసీ స్పష్టం చేసింది. అలాగే, జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై బుధవారమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకు ఈసీ పేర్కొంది.  బాబుపై అన్నా రాంబాబు ఫైర్‌12:30 PM, May 2nd, 2024ప్రకాశం జిల్లాచంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ మార్కాపురం అభ్యర్థి అన్నా రాంబాబు ఫైర్ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై చంద్రబాబు అనవసర అపోహలు సృష్టిస్తున్నాడుఅసలు లేని సమస్యను సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారుచంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితిలో జనం లేరు.14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకు ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నాడు.చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి  టీడీపీ మేనిఫెసో ఒక అబద్ధం: కైలే అనిల్‌ కుమార్‌11:30 AM, May 2nd, 2024పామర్రు నియోజకవర్గం నిడుమోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్ధి కైలే అనిల్ కుమార్అడుగడుగునా కైలేకు ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలుకైలే అనిల్ కుమార్ కామెంట్స్‌..ప్రజలంతా సీఎం జగన్‌ పాలనే మళ్లీ కావాలనుకుంటున్నారుఎంతమంది కలిసి వచ్చినా ముఖ్యమంత్రి జగన్‌ను ఏమీ చేయలేరని ప్రజలు విశ్వసిస్తున్నారుటీడీపీ మేనిఫెసో ఒక అబద్ధంజగన్ మోనిఫెస్టో నమ్మకంతో కూడిన ఒక నిజంఅబద్ధం, మోసంతో ఏదోరకంగా అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడుచంద్రబాబుపై బీజేపీకే నమ్మకం లేదుకలిసి ప్రయాణం చేస్తున్న బీజేపీనే నమ్మకపోతే.. ప్రజలు ఎలా నమ్ముతారుపామర్రులో నూటికి 99% శాతం ప్రజలకిచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాంమరో అవకాశం ఇస్తే మరింతగా పామర్రు ప్రజలకు సేవచేస్తాపామర్రులో నేను.. మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ అత్యధిక మెజార్టీతో గెలుస్తాం ‘జగన్‌ కోసం సిద్ధం’11:00 AM, May 2nd, 2024మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్‌సీపీ"జగన్ కోసం సిద్ధం" పేరుతో మరో ప్రచార కార్యక్రమంనేడు ప్రారంభించనున్న పార్టీ నేతలుమేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం  సిద్ధంపార్టీ స్టార్ క్యాంపెయినర్లతో కలిసి ఇంటిఇంటికీ మేనిఫెస్టో టీడీపీ నేతలకు దేవినేని అవినాష్ కౌంటర్‌10:00 AM, May 2nd, 202412వ డివిజన్‌ను 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాముస్థానిక టీడీపీ ఎంఎల్ఏ ఇంటి ముందు రోడ్ కూడా జగన్ ప్రభుత్వమే వేసిందిడివిజన్‌లో 20 కోట్లతో  సంక్షేమం చేసాముప్రతీ గడపలో సీఎం జగన్‌కే మా ఓటు అని చెబుతున్నారుజగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే అడ్డుకోవటానికి సిగ్గులేదా?స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు గద్దెకి పట్టవుతూర్పు నియోజకవర్గం ఏమైనా మీ జాగీరా?.ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాల చేయడం టీడీపీ నేతలకే దక్కిందిరెండుసార్లు ఎంఎల్ఏ ఒకసారి ఎంపీ అనుభవం అంటే ఇదేనా?రానున్న ఎన్నికలే గద్దెకు ఆఖరి ఎన్నికలుకాలనీల అభివృద్ధికి స్థానిక ప్రజల కాంట్రిబ్యూషన్ అడిగింది వాస్తవం కాదాప్రజానీకానికి మంచి చేస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గంప్రజలు మీ చిల్లర చేష్టలు గమనిస్తున్నారుఇంకా పూర్తి స్థాయిలో వృద్దులకు, వితంతువులకు పెన్షన్ అందలేదు  నేటి నుంచి కృష్ణా జిల్లాలో హోమ్ ఓటింగ్..9:30 AM, May 2nd, 2024ఇంటివద్దనే ఓటు హక్కు వినియోగించుకోనున్న వయోవృద్ధులు ,దివ్యాంగులుహోమ్ ఓటింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా 35 బృందాలు ఏర్పాటుగన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలలో 6 బృందాలు ఏర్పాటుపామర్రు నియోజకవర్గంలో 5 బృందాలు ఏర్పాటుమచిలీపట్నం, పెడన, గుడివాడ నియోజక వర్గాలలో 4 బృందాలు ఏర్పాటుఒక్కో హోమ్ ఓటింగ్ బృందంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ పోలింగ్ అధికారి, ఒక సూక్ష్మ పరిశీలకులు, ఒక వీడియో గ్రాఫర్,  పోలీస్ ఎస్కార్ట్ ఉండేలా చర్యలు ఉంటాయన్నారుహోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 9,114 మంది, దివ్యాంగులు 22,429 మంది  రెండు సార్లు జరుగనున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియ  నేటి నుంచి మే 6 వరకూ ఒకసారిమే 7 నుంచి 8 వరకూ రెండోసారి హోమ్ ఓటింగ్‌కు అవకాశం మహాసేన రాజేష్‌కు ఘోర అవమానం..8:20 AM, May 2nd, 2024అవనిగడ్డలో టీడీపీ నేత మహాసేన రాజేష్‌కు అవమానంఎన్నికల ప్రచారానికి మహాసేన రాజేష్‌తో పాటు అంబటి రాయుడిని ఆహ్వానించిన జనసేన నాయకులుమోపిదేవి నుంచి అవనిగడ్డ వరకూ ర్యాలీ.. బహిరంగ సభ ఏర్పాటు చేసిన జనసేన నాయకులుమోపిదేవి కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద స్వాగతం పలుకుతామని మహాసేన రాజేష్‌కు ఆహ్వానంమహాసేన రాజేష్ రాకుండానే అంబటి రాయుడితో కార్యక్రమం ప్రారంభించేసిన జనసేన నాయకులుతనను పిలిచి అవమానించడంతో జనసేన నేతల తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేష్చల్లపల్లి నుంచి వెనుదిరిగిన మహాసేన రాజేష్జనసేన పార్టీలో దళితులపై వివక్ష మారలేదని తన అనుచరుల వద్ద వాపోయిన రాజేష్తన సీటు విషయంలో జనసేన చేసిన యాగీ మరిచిపోయి పొత్తు ధర్మం కోసం జనసేన తరుపున ప్రచారానికి వస్తే అవమానించారని  సన్నిహితుల వద్ద వాపోయిన రాజేష్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెనుతిరిగిన రాజేష్రాజేష్‌ను పిలిచి అవమానించారంటూ జనసేన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు మధ్య తరగతికి మరింత భరోసా.. వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టో7:45 AM, May 2nd, 2024వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టోతో మరోసారి అండగా సీఎం జగన్‌పట్టణ ప్రాంతాల్లోని మధ్య ఆదాయ కుటుంబాలకు సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు123 పట్టణాల్లో ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధిరూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసారూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సహాయంకాపు, ఈబీసీ నేస్తం ద్వారా ఒక్కో కుటుంబానికి ఐదేళ్లలో రూ.60 వేల సాయంప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విదేశీ విద్యా దీవెనతో తోడ్పాటురూ.10 లక్షల వరకు రుణానికి కోర్సు ముగిసే వరకు పూర్తి వడ్డీ చెల్లింపుఆప్కాస్, ఆశ, అంగన్‌వాడీ, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నవరత్న పథకాలుప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాలోనే 60 శాతం ప్రభుత్వ ఖర్చుతో ఇంటి స్థలం ‘భృతి’.. అంతా భ్రాంతి.. నిరుద్యోగులపై చంద్రబాబు మాయా వల7:20 AM, May 2nd, 2024నిరుద్యోగులపై చంద్రబాబు మరోసారి మాయా వలజాబు రావాలంటే బాబు రావాలంటూ 2014 ఎన్నికల్లో ప్రచారంకరపత్రాలు వేసి ఊరూరా పంపిణీ ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ.. అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లపాటు ఆ ఊసేలేదుప్రతిపక్ష నేత అసెంబ్లీలో బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తే అసలా పథకమే లేదన్న అచ్చెన్నఆ ఒత్తిడి తట్టుకోలేక 2017–18 బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి రూ.500 కోట్లు కేటాయింపుఅయినా అమలుచేయని చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ఆరునెలల ముందు ముఖ్యమంత్రి యువ నేస్తం పేరుతో పథకంనెలకు రూ.1,000 చొప్పున ఇస్తామని ప్రకటనసవాలక్ష ఆంక్షలతో కేవలం 12 లక్షల మంది నిరుద్యోగులకు అర్హతకానీ, 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల చివరికి 1.62 లక్షల మంది మాత్రమే అర్హులని తేల్చిన బాబు1.70 కోట్ల నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన బాబుఎన్నికలు రావడంతో మళ్లీ యువతకు గేలం.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలుబాబు గత చరిత్ర చూడండి.. ఆయన్ను నమ్మొద్దంటూ యువతకు విద్యావేత్తలు, మేధావులు హితవు వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం7:00 AM, May 2nd, 2024పాడేరు కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థితో మంతనాలతో స్పష్టీకరణచంద్రబాబు నాయుడుకు మేలు చేయడమే అజెండాఆడియో లీక్‌తో అడ్డంగా దొరికిపోయిన వైనంపాడేరు కాంగ్రెస్‌ టికెట్‌ తొలుత వంతల సుబ్బారావుకుఆ తర్వాత వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిన బుల్లిబాబుకి కేటాయింపుపాడేరులో కాంగ్రెస్‌ రెబల్‌గా వంతల పోటీపోటీ నుంచి తప్పుకోవాలని వంతలను ఆదేశించిన షర్మిలవైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు కోసమే తాను బాధ్యతలు తీసుకున్నట్లు వెల్లడి  పచ్చ మంద కుట్రలతో పెన్షన్‌దారులకు కష్టాలు.. 6:30 AM, May 2nd, 2024చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్‌దారులకు మరిన్ని కష్టాలుబ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వృద్దులు, వికలాంగులువాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఇవ్వడాన్ని అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ఎన్నికల సంఘం ఆదేశాలతో బ్యాంకు ఖాతాలో పెన్షన్ వేసిన ప్రభుత్వండబ్బులు డ్రా చేసుకోవటానికి పెన్షన్‌దారుల అవస్థలునిన్న అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో ఇద్దరు మృతిగత నెలలో 39 మంది వృద్దులు మృతిఇంటికే వచ్చే పెన్షన్ ను అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ వైఖరిపై మండిపడుతున్న పెన్షన్‌దారులు

Heavy Rain In Tirumala
తిరుమలలో భారీ వర్షం.. భగభగల నుంచి భక్తులకు ఉపశమనం

సాక్షి, తిరుపతి: తిరుమలలో భారీ వర్షం కురవడంతో భక్తులు పులకించిపోయారు.. ఎండల నుంచి ఉపశమనం పొందారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. కాగా, గురువారం ఉదయం నుంచి తిరుమలలో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం ఒక్కసారిగా సుమారుగా అరగంట పాటు  భారీ వర్షం పడింది. శ్రీవారి ఆలయం, నాలుగు మాడ వీధులు చుట్టు పక్కల ఉన్న ప్రదేశాలలో వర్షం పడిందికాగా, ఏపీలో ఉష్ణోగ్రతలు,  తీవ్ర వడగాడ్పులు తీవ్ర­తరం కానున్నాయి. మూడోతేదీ నుంచి మరిం­త ఉధృతం కానున్నాయి. కొన్నిచోట్ల 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు, మూడురోజుల్లో ఇవి 47 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. 

Dont Do That In Team Game: Irfan Pathan Slams Dhoni Act Against PBKS
ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు

పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోని వ్యవహరించిన తీరును అభిమానులను ఆశ్చర్యపరిచింది. ధోని వంటి దిగ్గజ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదంటూ ఫ్యాన్స్‌తో పాటు ఇర్ఫాన్‌ పఠాన్‌ వంటి మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు.అసలేం జరిగిందంటే.. ఐపీఎల్‌-2024లో భాగంగా చెన్నై బుధవారం పంజాబ్‌ కింగ్స్‌తో తలపడిన విషయం తెలిసిందే. చెపాక్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ .. చెన్నైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి చెన్నై జట్టు 162 పరుగులు చేసింది. అయితే, పంజాబ్‌ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే టార్గెట్‌ పూర్తి చేసి.. ఏడు వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది.ఇదిలా ఉంటే.. చెన్నై ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆ సమయంలో... ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు ధోనికి.. ఎనిమిదో నంబర్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ మరో ఎండ్‌ నుంచి సహకారం అందించాడు.అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపిఅయితే, చివరి ఓవర్‌ మూడో బంతికి అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో ధోని షాట్‌ ఆడటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే, సింగిల్‌కు ఆస్కారం ఉన్న నేపథ్యంలో డారిల్‌ మిచెల్‌ పరుగు తీసి ధోని ఉన్న ఎండ్‌కు చేరుకున్నాడు.కానీ సింగిల్‌ తీసేందకు సిద్ధంగా లేని ధోని అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపించాడు. దీంతో వేగంగా కదిలిన మిచెల్‌ ఎట్టకేలకు సరైన సమయంలో క్రీజులోకి చేరుకోవడంతో రనౌట్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.ఆ తర్వాతి బంతికి సిక్స్‌ కొట్టిన ధోని.. ఆఖరి బంతికి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఘాటుగా స్పందించాడు.ధోని అలా చేయడం సరికాదు‘‘ఎంఎస్‌ ధోనికి భారీ అభిమాన గణం ఉందన్న విషయం గురించే అందరూ మాట్లాడుకుంటారు. అతడు కొట్టిన సిక్స్‌ గురించి కూడా మాట్లాడతారు. కానీ.. టీమ్‌ గేమ్‌లో ధోని ఇలా సింగిల్‌కు నిరాకరించకుండా ఉండాల్సింది.ఎదుట ఉన్న వ్యక్తి కూడా అంతర్జాతీయ స్థాయి ఆటగాడే. అతడు ఒకవేళ బౌలర్‌ అయి ఉంటే ధోని చేసిన పని సబబుగానే ఉండేది. కానీ... రవీంద్ర జడేజా, డారిల్‌ మిచెల్‌ లాంటి ఆటగాళ్లు ఉన్నపుడు అలా చేయడం సరికాదు’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ ధోని చర్యను తప్పుబట్టాడు.‌చదవండి: గిల్‌ విఫలమైనా చోటు.. అతడికి అన్యాయం: బీసీసీఐపై మండిపడ్డ దిగ్గజం MS Dhoni denied to run 👀Daryl Mitchell literally ran 2 Runs 😅Next Ball, MS hits a huge SIX 👏If this has been done by Virat Kohli or Rohit Sharma, then people start calling them Selfish 😳What's your take on this 🤔 #CSKvPBKS #CSKvsPBKS #SRHvsRR pic.twitter.com/ElvrInMDaI— Richard Kettleborough (@RichKettle07) May 2, 2024

gold price today rate down may 2
వామ్మో.. ఒక్క రోజులో ఇంత పెరిగిందా?

దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి. క్రితం రోజున భారీగా తగ్గి పసిడి ప్రియులకు ఆనందం కలిగించిన బంగారం ధరలు ఈరోజు (మే 2) భారీ స్థాయిలో పెరిగాయి. ఒక్క రోజులోనే రూ.870 మేర ఎగిశాయి.హైదరాబాద్‌, విశాఖపట్నం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ. 72,270 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లోి ఇలా..దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 ఎగిసి రూ.66,400 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.7600 పెరిగి రూ.72,420 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ.72,270 వద్దకు ఎగిసింది.చెన్నైలో అయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.800 పెరిగి రూ.67,150 ల​కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం అత్యధికంగా రూ.870 పెరిగి రూ.73,250 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.760 ఎగిసి రూ.72,270 లకు చేరుకుంది.

Vyshnavi House Warming ceremony Photos
Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

AP Pensioners facing Distribution Problems Infront of banks
ఏపీలో బ్యాంకుల వద్ద పెన్షన్‌దారుల కష్టాలు

గుంటూరు, సాక్షి: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్‌దారులు కష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల ఎదుట వృద్దులు, వికలాంగులు క్యూ కట్టారు. చంద్రబాబు అండ్‌ కో బ్యాచ్‌ చేసిన కుట్రలకు ఈసీ వలంటీర్లను పెన్షన్లు పంపిణీ చేయనీయకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే.  చంద్రబాబు క్షుద్రరాజకీయం పెన్షనర్ల పాలిట శాపంగా మారింది. గత నెలలో పెన్షన్‌ కష్టాల కారణంగా 30 మందికి పైగా మృతిచెందడం చూశాం. తాజాగా అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకు చెందిన ముద్రగడ సుబ్బన్న (80) అనే వృద్ధుడు మృతి చెందాడు. పింఛను డబ్బు కోసం రాయచోటిలోని కెనరా బ్యాంకుకు వెళ్లిన సుబ్బన్న.. బ్యాంకు ఎదుట నిలబడి ఉండగానే కింద పడిపోయాడు. దీంతో స్థానికులు గుర్తించి లేపే లోపు సుబ్బన్న మృతి చెందాడు. కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. గ్రామస్తులు వృద్ధుడి మృతి విషయం అధికారులకు తెలియజేశారు.Heartbreaking to see pensioners in Andhra Pradesh struggling after Chandra Babu's removal of the volunteer system. These are the very people who've contributed their entire lives to the state's growth. pic.twitter.com/buLKhTihU9— Let's X OTT GLOBAL (@LetsXOtt) May 2, 2024 చంద్రబాబు కుట్రలకు పెన్షన్‌దారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటింటి పంపిణీని చంద్రబాబు అండ్‌ కో అడ్డుకుంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో 49 లక్షల మందికి బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం నగదు జమ చేసింది.Pensioners reaching banks for withdrawal #PensionersVsTDP pic.twitter.com/Y55Sov3J0I— Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) May 2, 2024వాటిని తీసుకునేందుకు వృద్దుల క్యూలో నిలబడలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండవేడికి తాళలేక వృద్ధులు నీరసించిపోతున్నారు. ఏలూరు బ్యాంకుల వద్ద వృద్ధులు పెన్షన్‌ క కోసం పడిగాపులు కాస్తున్నారు. నెల్లూరు జిల్లాలో  పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.  కొందరి అకౌంట్లు పని చేయని పరిస్థితి నెలకొంది.Enough is enough! @JaiTDP must answer for their mistreatment of pensioners. Join the call for accountability! #PensionersVsTDP pic.twitter.com/uRPpHOOnSW— Prabal (@Prabal8_) May 2, 2024చంద్రబాబు తెచ్చిన తంటాతో పెన్షనర్ల అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ఫిర్యాదుతో పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు నుండి దూరం అయింది. ఇంటింటికీ పెన్షన్ పంపిణీని చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడ్డుకున్నారు. ఈసీ ఆదేశాలతో పెన్షన్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో  అధికారులు జమ చేశారు.బ్యాంకుల వద్ద డబ్బులు తీసుకోవడానికి పెన్షనర్ల పాట్లు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల వద్ద పెన్షనర్ల క్యూ లైన్లతో నిల్చొని  ఇబ్బందులు పడుతున్నారు.

This Weekend Ott Release Movies List Goes Viral
ఓటీటీలో సినిమాల జాతర.. ఒక్క రోజే 8 చిత్రాలు స్ట్రీమింగ్!

మరో వీకెండ్ రానే వచ్చింది. ఇక ఈ శుక్రవారం థియేటర్లలో సందడి  చేసేందుకు చిన్న సినిమాలు రెడీ అయిపోయాయి. ఈ వారంలో థియేటర్లలో సందడి చేసేందుకు అల్లరి నరేశ్ ఆ ఒక్కటీ అడక్కు, సుహాస్ చిత్రం ప్రసన్నవదనం, జితేందర్ రెడ్డి. తమన్నా,రాశి ఖన్నా నటించిన బాక్‌(అరణ్మనై-4) లాంటి చిత్రాలు వచ్చేస్తున్నాయి.ఇక ఓటీటీల విషయానికొస్తే హిట్‌ చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారాంతంలో అజయ్‌ దేవగణ్ సైతాన్, మలయాళ హిట్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్‌ కాస్తా ఆసక్తి పెంచేస్తున్నాయి. వీటితో పాటు పలు ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. మరీ మీరు ఈ వీకెండ్‌లో ఏ యే సినిమా చూడాలనుకుంటున్నారో ఓ లుక్కేయండి. ఏ సినిమా ఎ‍క్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేయండి.నెట్‌ఫ్లిక్స్   సైతాన్ (హిందీ సినిమా) - మే 03   ద అటిపికల్ ఫ్యామిలీ (కొరియన్ సిరీస్) - మే 04 అమెజాన్ ప్రైమ్   క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03   ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మే 03డిస్నీ ప్లస్ హాట్‌స్టార్   మంజుమ్మెల్ బాయ్స్ (మలయాళ డబ్బింగ్ సినిమా) - మే 05   మాన్‌స్టర్స్ ఎట్ వర్క్ సీజన్- 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 05జియో సినిమా   హ్యాక్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03   ద టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 03   వోంకా (ఇంగ్లీష్ మూవీ) - మే 03జీ5ది బ్రోకెన్ న్యూస్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- మే 03లయన్స్‌ గేట్ ప్లేబ్లాక్ మాఫియా ఫ్యామిలీ సీజన్-3- మే 03 

Election Commission Key Comments Over Janasena Glass Tumbler
AP High Court: జనసేనకు ఈసీ ఝలక్‌

సాక్షి, గుంటూరు: ఏపీలో ఎన్నికల వేళ జనసేనకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల్లో గాజు గ్లాస్‌ గుర్తును రిజర్వ్‌ చేయలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు ఈసీ వెల్లడించింది.కాగా, ఎన్నికల్లో గాజు గ్లాస్‌ గుర్తును తమకు మాత్రమే రిజర్వ్‌ చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో జనసేన పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీవ్యాప్తంగా గాజు గ్లాస్‌ గుర్తును రిజర్వ్‌ చేయలేమని ఎన్నికల సంఘం.. హైకోర్టుకు తెలిపింది. అలాగే, ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్‌ మార్చలేమని ఈసీ.. కోర్టుకు వెల్లడించింది.ఇదే సమయంలో జనసేన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఈసీ పేర్కొంది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని ఈసీ.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ బ్యాలెట్‌లను ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌కు పంపించినట్టు ఈసీ స్పష్టం చేసింది. అలాగే, జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై బుధవారమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకు ఈసీ తెలిపింది.   

Rowdy Sheeter Laxman Enters Into GHMC Mayor Vijayalakshmi's House
GHMC: మేయర్‌ విజయలక్ష్మి ఇంట్లో చొరబడిన రౌడీషీటర్‌..

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్ఎంసీ మేయర్  గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి ఓ రౌడీ షీటర్‌ చొరబడటం తీవ్ర కలకలం సృష్టించింది. సదరు వ్యక్తి నేరుగా మేయర్‌ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం, పోలీసులు మేయర్‌ ఇంటికి వచ్చిన రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడకు చెందిన రౌడీ షీటర్‌ లక్ష్మణ్‌ మంగళవారం మేయర్‌ విజయలక్ష్మి ఇంట్లోకి చొరబడ్డాడు. నేరుగా వచ్చి ఆమె వ్యక్తిగత గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె సిబ్బంది అడ్డుకున్నారు. సిబ్బంది వారించినా అతను పట్టించుకోలేదు. దీంతో, అతడిని సిబ్బంది అడ్డుకుని బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఇక, ఆ సమయంలో మేయర్‌ ఇంట్లో లేరు.వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే, లక్ష్మణ్‌కు మతిస్థిమితం సరిగా లేనట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. లక్ష్మణ్‌ గత రెండు రోజులుగా మేయర్‌ ఇంటి చుట్టే తిరిగినట్టు పోలీసులు తెలిపారు.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement


ఫోటో స్టోరీస్

View all