Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YS Jagan Tweet On TDP Attacks In AP
టీడీపీ అరాచకాలపై వైఎస్ జగన్ ట్వీట్

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘‘ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి’’ అని వైఎస్‌ జగన్‌ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.గౌరవ గవర్నర్‌ గారు @governorap వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు,…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2024

How TDP got majority in villages where YSRCP is doing well
మా ఓట్లు ఏమయ్యాయి? టీడీపీ ఓడిపోతుందనుకున్న చోట భారీ మెజారిటీలా..?

ఈ ఫలితాలపై ఎన్నో అనుమానాలు ఈ ఫలితాలపై ఎవ్వరికీ నమ్మకం కలగడం లేదు. మా గ్రామంలో అత్యధిక శాతం మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేశారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత చూస్తే తారుమారైనట్లు కనిపించింది. సంక్షేమ పథకాలు అందుకున్న అనేక కుటుంబాలు వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశాయి. కానీ ప్రతిరౌండులోనూ మెజార్టీ ఓట్లు ఏకపక్షంగా టీడీపీకి వచ్చాయి. జగన్‌ను అధికంగా అభిమానించే గ్రామాల్లోనే ఇలా టీడీపీకి ఓట్లు పడటం చూస్తుంటే ఎన్నో అనుమానాలున్నాయి. – దుంపల ఉమ (రైతు), కమలనాభపురం, కోట»ొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లాసాక్షి, అమరావతి: ‘‘మేం జగన్‌కే ఓటేశాం.. మా ఓట్లన్నీ ఏమైపోయాయి.. ఏదో జరిగింది.. లేకపోతే అధికార పార్టీకి ఇంత దారుణంగా సీట్లు రావడమేంటి? బంపర్‌ మెజారిటీతో గెలుపొందుతాం అనుకున్న చోట టీడీపీకి మెజారిటీ రావడం ఏమిటి? వైఎస్సార్‌సీపీ ఓట్లు పక్కాగా 90 శాతంపైగా ఉన్న ఒక బూత్‌ పరిధిలో టీడీపీకి మెజారిటీ రావడాన్ని ఏమనుకోవాలి? ఏదో జరిగింది.. ఆ ఓటింగ్‌ మిషన్లను ఏదో చేశారు.. లేకపోతే ఇంత దారుణంగా ఫలితాలెలా వస్తాయి?’’ అని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ చర్చే నడుస్తోంది. ఇంతలా ఫలితాలను తాము కలలో కూడా ఊహించలేదని టీడీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారంటే ఏం జరిగి ఉంటుందనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. కూటమి గెలిచిందనే ఆనందం కంటే జగన్‌ ఓడిపోయారనే బాధ అత్యధికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ‘మా గ్రామంలో 3 వేల ఓట్లు ఉంటే అందులో కనీసం 2100 ఓట్లు వైఎస్సార్‌సీపీకే పడ్డాయి.. ఇలా ఒక నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ జరిగితే జగన్‌ ఓడిపోవడమేంటి’ అంటూ అనేక గ్రామాల్లో ప్రజలు లెక్కలు వేస్తున్నారు. పలువురు రైతులు పల్లెల్లో ఒక చోట చేరి ‘మనకు ఎంతో మేలు చేసిన జగన్‌కే కదా మనం ఓటేశాం. ఇలా అన్ని ఊళ్లలోనూ జరిగింది.. మరి మనందరి ఓట్లు ఏమైపోయాయి?’ అని ఆవేదన పంచుకుంటున్నారు. జగనన్నకే మేమూ ఓటేశాం అన్నకు మరీ ఇంత తక్కువ సీట్లు రావడమేంటంటూ అక్కచెల్లెమ్మలు కన్నీరు మున్నీరవుతున్నారు. బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వారికి ఫోన్లు చేసి ఏం జరిగి ఉంటుందంటూ ఆరా తీస్తున్నారు. ఉద్యోగులు సైతం ఈ ఫలితాల పట్ల విస్మయం చెందుతున్నారు. సచివాలయాల ఉద్యోగులు, కొన్ని సామాజిక వర్గాల ఉద్యోగులు, వలంటీర్లు వైఎస్సార్‌పార్టీకి ఓటేశారని, వీరందరి ఓట్ల వల్ల అనేక సీట్లు వచ్చే అవకాశం ఉందని వారు చర్చించుకుంటున్నారు.

Gudivada Amarnath Comments On AP Election Results
ప్రజల పక్షాన పోరాటాలకు మేం ఎప్పుడూ సిద్ధమే: గుడివాడ అమర్‌నాథ్‌

సాక్షి, విశాఖపట్నం: ప్రజల పక్షాన పోరాటాలకు మేం ఎప్పుడూ సిద్ధమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిందేనని.. కేంద్రంలో కూటమికి భిన్నమైన అవకాశం వచ్చిందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజా తీర్పునకు అనుగుణంగా కూటమి పని చేయాలన్నారుచంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకుండానే కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి.. వీటిపై కొత్త ప్రభుత్వం ఆలోచించాలి.. ఈ దాడులు ప్రజాస్వామ్యం కాదు. గెలిచిన వారు బలవంతులు కాదు.. ఓడిన వారు బలహీనులు కాదు.. విశాఖలో పుట్టిన వ్యక్తిగా మేం ప్రజలకు అండగా ఉంటాం వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్‌గా పని చేస్తాం కూటమి ప్రభుత్వానికి సమయమిస్తాం... ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. సీఎం జగన్‌ ఎప్పుడూ అందరిని సమానంగా చూడాలన్న భావంతో పని చేశారు’’ అని అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.ప్రజలకు ఇంటి దగ్గరికే పథకాలు వచ్చేలా చేశారు. గాజువాక అభివృద్ధి కోసం గెలిచిన అభ్యర్థికి సహకరిస్తా. ఏపీకి విశాఖ కీలకం.. ఆ విషయంలో కూటమి దృష్టి పెట్టాలి విశాఖ నగరానికి ఉన్న అంశాలు, అవకాశాల్ని కూటమి గుర్తించాలి. రామయ్య పట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టు పనులు అఖరి దశకు వచ్చాయి. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు ఈ కొత్త ప్రభుత్వం త్వరగా పూర్తి చేస్తుందని ఆశిస్తున్నాం. అమరావతి వద్దు.. విశాఖ ఒకటే అనలేదు. విశాఖతో పాటు కర్నూలు, అమరావతిని అభివృద్ధి చేస్తామని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చెప్పింది’’ అని గుడివాడ అమర్‌నాథ్‌ గుర్తు చేశారు.

AP Congress Leaders Protest Against Chief Sharmila In Vijayawada
భ్రష్టు పట్టించారు.. షర్మిలపై సొంతపార్టీ నేతల ఆగ్రహం

సాక్షి, విజయవాడ: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ చీఫ్ షర్మిలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. షర్మిల కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించిందని వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు.. షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మీడియాతో మాట్లాడారు.‘‘ రాహుల్ గాంధీకి విలువ ఇచ్చి షర్మిలను ఏమీ అనకుండా వదిలేశాం. కక్షపూరిత చర్యల కోసమే షర్మిల ఏపీకి వచ్చిందా?. పార్టీ ఇచ్చిన ఫండ్ దాచుకుని షర్మిల అభ్యర్ధుల్ని గాలికి వదిలేసింది. షర్మిల క్యాడర్‌ను గాలికి వదిలేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యాను. పీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన షర్మిల నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేయాలి. పార్టీ అభ్యర్థులకు కనీసం జెండాలు కూడా అందించలేదు. రాహుల్ గాంధీ ధైర్యంగా మోదీకి ఎదురుగా నిలబడ్డారు’’ అని ఆమె అన్నారు.

YSRCP social media convenor is a victim of TDP harassment
టీడీపీ వేధింపులకువైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ బలి

పెదవేగి: టీడీపీ కార్యకర్తల వేధింపులు తట్టు­కో­లేక తీవ్ర మనస్తాపానికి గురైన వైఎస్సార్‌­సీపీ సోషల్‌ మీడియా మండల కన్వీనర్‌ యలమంచిలి ప్రవీణ్‌ (30) ఆత్మహత్య చేసుకు­న్నాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ సూర్యా­­రావుపేటకి చెందిన ప్రవీణ్‌ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దుర్ఘటన మండలంలో విషాదం నింపింది. స్థానికులు తెలి­పిన వివ­రాల ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజ­యా­నికి అహర్నిశలు శ్రమించాడ­న్న కక్షతో ఓట్ల లెక్కింపు రోజు (ఈనెల 4న) సాయంత్రం ప్రవీణ్‌ ఇంటి మీద తెలుగుదేశం కార్య­కర్తలు దాడిచేశారు. రాళ్లు, బీరు సీసాలు విసిరి, దుర్భాషలా­డు­తూ చంపేస్తామని బెదిరించారు. పెదవేగి పెట్రోల్‌ బంక్‌ వైపు వస్తే కొడతా­మని, బైక్, కారు తగల­బెట్టే­స్తామని హెచ్చరించారు. బుధ­­వారం ఉదయం ప్రవీణ్‌ విజయరాయి పెట్రో­ల్‌ బంక్‌కి వెళ్లగా.. బండిపై మాజీ ఎమ్మెల్యే అబ్బ­య్య­చౌదరి ఫొటోతో ఉన్న వైఎస్సార్‌సీపీ స్టిక్కర్‌ తీసే­వరకు బీభ­త్సం సృష్టించి దాడిచేశారు. టీడీపీ వారి బెదిరింపులకు భయ­పడి, వేధింపులు భరించలేక ప్రవీ­ణ్‌.. తన ఇంటి సమీపంలోని తోట­లో చెట్టుకు ఉరే­ç­Üుకుని ఆత్మ­హత్య చేసు­కున్నాడు. ప్రవీణ్‌ తల్లి­దండ్రులు యలమంచిలి ఝన్సీరాణి, ప్రకాశ­రావు, కుటుంబ­సభ్యులు కన్నీరు­మున్నీ­రుగా విలపిస్తున్నా­రు. దాడుల సంస్కృతి కొనసాగితే ఉరుకోం టీడీపీ వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసు­కున్న ప్రవీణ్‌ భౌతికకాయానికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి నివాళులర్పించారు. కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్‌ను బలి­తీసుకున్న టీడీపీ కార్యకర్తల అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్య­కర్తలను టార్గెట్‌ చేస్తున్నారని, వారి ఇళ్ల మీదకు వెళ్లి భౌతికదాడులు చేస్తూ, వాహనాలు, ఇంట్లో వస్తు­వులు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల సంస్కృతి కొనసాగితే ఊరుకునేదిలేదని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా సంయమనం పాటించాలని కోరారు.

Today Gold and Silver Price 6th May 2024
మళ్ళీ ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి: నేటి కొత్త ధరలు ఇవే..

జూన్ ప్రారంభం నుంచి స్వల్ప తగ్గుదలను నమోదు చేసిన పసిడి ధరలు మళ్ళీ పుంజుకుంటున్నాయి. ఈ రోజు (జూన్ 6) కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 820 వరకు పెరిగింది. కాబట్టి నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.67300 (22 క్యారెట్స్), రూ.72110 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 440 తగ్గాయి.చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 750 నుంచి రూ. 820 వరకు పెరిగాయి. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 68000 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 74180 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు ధరలు పెరిగాయని అవగతమవుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67450 (10 గ్రా), 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73570 (10 గ్రా) వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 770 పెరిగింది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పెరిగాయి. నిన్న (జూన్ 6) రూ. 2300 తగ్గిన వెండి ధర.. ఈ రోజు (జూన్ 7) రూ. 1800 పెరిగింది. దీంతో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 93500లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

TDP and Janasena attacks on YSRCP ranks
టీడీపీ, జనసేన విధ్వంసం.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో టీడీపీ, జనసేన శ్రేణులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. యథేచ్ఛగా విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు తెగబడు­తు­న్నాయి. వాహనా­లను ధ్వంసం చేస్తు­న్నాయి. మంగళవారం మొదలు­పెట్టిన ఈ అరాచకప­ర్వాన్ని టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు బుధవారం కూడా కొనసాగించారు. ఈ రెండురోజులు ప్రభుత్వ భవనాల వద్ద ఫలకాలను చిత్రపటాలను ధ్వంసం చేస్తూ స్వైరవిహారం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మహానేత వైఎస్సార్‌ విగ్రహాలను ధ్వంసం చేసి, విగ్రహాల వద్ద కూటమి జెండాలు ఏర్పాటు చేశారు.ఇప్పటంలో ప్రజల భాగస్వా­మ్యంతో నిర్మించిన దివగంత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా పేరుతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్‌ భవనం పైభాగంలో జన­సేన, టీడీపీ జెండాలను ఏర్పాటు చేశారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును తొలగించారు. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో 1, 2 సచివాలయాల వద్ద వైఎస్‌ జగన్‌ డిజి­­టల్‌ బోర్డులను తొలగించి రోడ్డుపై పడవేసి చిత్ర­పటంపై రాళ్లు వేశారు. నూతన సచివాలయం శిలా­ఫలకంలో ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రప­టాన్ని చిన్నపిల్లలతో పగులగొట్టించారు. రైతు­భరోసా కేంద్రంపై నవరత్నాల బోర్డును ధ్వంసం చేశారు. పల్నాడు జిల్లా గోళ్ళపాడులో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ శిలాఫలకాన్ని పగులగొ­ట్టారు. తిరుపతి జిల్లా పుత్తూరులో పలు ఆలయాల వద్ద వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆర్కే రోజా పేరిట ఉన్న శిలా­ఫలకాలను బుధవారం సాయంత్రం తెలుగు­దేశం­ నాయకులు ధ్వంసం చేశారు. శ్రీకామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరస్వామి ఆలయం లోపల ఏర్పాటు చేసిన అన్నదాన, కళ్యాణోత్సవ మండప శిలాఫల­కాన్ని, ఆరేటమ్మ ఆలయం వద్ద పలు అభివృద్ధి పనుల పేరిట ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని, గేట్‌పు­త్తూరులోని గోవిందమ్మ ఆల­యం వద్ద ప్రారంభించిన జగనన్న సమావేశమందిర శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. తెలుగుదేశం నాయకులు డి.జి.ధన­పాల్, బి.శ్రీనివాసులు చేసిన ఈ విధ్వంసంపై పుత్తూరు సెంగుంధర్‌ మక్కల్‌ నల సంఘం ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎస్‌.ఎన్‌.­గోపిరమణ, టి.జి.శక్తివేలు, ఎం.ఎస్‌.తిరు­నా­వక్క­ర్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా దగ­దర్తి మండలంలోని యలమంచిపాడులో వైఎస్సార్‌­సీపీ కార్యకర్త షేక్‌ మస్తాన్‌పై టీడీపీ నాయకులు దాడిచేశారు. అడ్డుకోబోయిన ఆయన తల్లి షేక్‌ బీబీ తలపైకొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఆమెను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తడక­లూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త యలమా వెంకటే­శ్వర్లు ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్‌ పోసి తగుల­బెట్టారు. మరికొన్ని గ్రామాల్లో కూడా కవ్వింపు చర్య­లకు దిగుతున్నారు. గ్రామాల్లో వివాదాలు జర­గ­కుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కావ­లి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కోరారు. పంచాయతీలో ఫైళ్ల అపహరణ ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు సచి­వా­­లయం, హెల్త్‌క్లినిక్‌ ఆవరణలోని శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైఎస్‌ జగన్‌­మోహన్‌రెడ్డి, అబ్బయ్యచౌదరి ఫొటోలను సుత్తితో పగులగొట్టారు. తన కార్యాలయంలో వస్తువుల్ని ధ్వంసంచేసి ఫైళ్లు అపహరించారని సర్పంచ్‌ జిజ్జువరపు నాగరాజు చెప్పారు. కొప్పులవారి­గూడెంలోని సచివాలయ ఆవవరణలోని శిలాఫలకా­లను, ప్రభుత్వ సామగ్రిని ధ్వంసం చేశారు. సచి­వాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగుర­వేసే స్థూపానికి టీడీపీ జెండా కట్టారు. ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో బొర్రా నారాయణ­రావు చికెన్‌ దుకాణాన్ని టీడీపీ, జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీనిపై నారాయణరావు పోలీసు­లకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం సచివా­ల­యం–1పై ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు. వార్డు సభ్యులు ముప్పిడి లక్ష్మణరావు, లక్ష్మణ­రావులపై దౌర్జన్యానికి దిగారు. నంద్యాల జిల్లా అవుకు మండలం సంగపట్నంలో సచివా­లయం, హెల్త్‌క్లినిక్‌ పైలాన్లను ధ్వంసం చేశారు. టీడీపీ, జనసేన శ్రేణులు విధ్వంసాలకు పాల్పడుతుండగా సమాచారం ఇచ్చినా పోలీసులు స్పందించలేదని పలు గ్రామాల్లో బాధితులు తెలిపారు.కైకలూరులో వైఎస్సార్‌విగ్రహం ధ్వంసంకైకలూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఏలూరు జిల్లా కైకలూరు మండ­లం వడ్లకూటితిప్పలోని ఆంజనేయస్వామి ఆల­య­ం వద్ద 2010లో వైఎస్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆకతాయిలు కూలగొట్టారు.ఈ ఘటనను వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే డీఎన్నార్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఖండించారు. విగ్రహాల కూలి్చవేత ఘటనలపై పోలీ­సులు విచారణ చేస్తున్నారు.నీ జీవితం నా చేతుల్లో..వలంటీర్‌కు టీడీపీ నేత బెదిరింపుపల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరు గ్రామానికి చెందిన వలంటీర్‌ బాబురావును గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తీవ్రంగా బెదిరించారు. ‘అరేయ్‌ బాబురావుగా నీ పతనం స్టార్ట్‌ కాబోతుంది.. ఇక నువ్వు ఫిక్స్‌ అయిపో.. ఇప్పుడు నీ జీవితం నా చేతుల్లో ఉందిరా.. నిన్ను నువ్వు కాపాడుకోవా­లనుకున్నా.. నిన్ను వేరే వాళ్ళు కాపాడాలన్నా.. నీ జీవితాన్ని నేను తిరగరాసినా ఇప్పుడు. నీకు భయం అంటే ఏంటో చూయిస్తారా.. నా కొడకా. అరేయ్‌ బాబురావుగా.. ఇప్పుడు నీ జీవితం నా చేతుల్లో ఉంది రా.. నీ తలరాత బ్రహ్మ రాసినా ఇప్పుడు నీ జీవి­తాన్ని నేను తిరగరాస్తా.. కొడకా..’ అంటూ స్టేటస్‌ పెట్టి మరీ హెచ్చరించారు. మరోవైపు పెద­మక్కెన గ్రామంలోని ఎస్సీ కాలనీలో దళితుల ఇళ్లపై టీడీపీ వారు రాళ్లు, సీసాలు విసిరారు. అజయ్‌­కుమార్‌ జీవనాధారమైన ఆటోను ధ్వంసం చేశారు.వైఎస్సార్‌సీపీ నేతలు,కార్యకర్తలపై దాడులు ఏలూరు జిల్లా దెందులూరు నియోజక­వ­ర్గంలో టీడీపీ నేతలు, కార్య­కర్తలు.. వైఎస్సా­ర్‌­సీపీ వర్గీయులపై కర్రలు, రాళ్లతో దాడులు చేస్తున్నారు. అడ్డొచ్చినవారిని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఏలూరు రూర­ల్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాసరాజు, రాష్ట్ర వడ్డికుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ముంగర సంజీవ్‌కుమార్, గార్లమడుగు వైఎస్సార్‌సీపీ నాయకుడు కృష్ణ కారులో వెళుతుండగా విజయరాయి వద్ద టీడీపీ వారు దాడిచేశారు. ‘గెలిచింది మేమే.. మాకు తిరుగులేదు.. రండి ఇప్పుడు..’ అంటూ కర్రలు, రాళ్లతో కారు అద్దాలు పగులగొట్టారు. కారులో ఉన్న కృష్ణను బలవంతంగా బయటకు లాగి పిడిగుద్దులు గుద్ది రోడ్డుపై పడేశారు. కొంతదూరం లాక్కెళ్లి కొట్టారు. గతంలో చింతమనేని ప్రభాకర్‌పై చేసిన విమర్శలకు క్షమాపణలు చెబుతున్నా అంటూ కృష్ణతో చెప్పించి వీడియో రికార్డు చేశారు. అడ్డుపడేందుకు ప్రయత్నించిన శ్రీనివాసరాజు, సంజీవ్‌కుమార్‌లను తోసేశారు. కారు అద్దాలు పగలడంతో వైఎస్సార్‌సీపీ నాయకులకు గాయా­లయ్యాయి. ఈ దాడిని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కొచ్చెర్లకోట పంచాయతీ సిద్ధాయ­పాలెంలో సింహం లలిత, ఆమె తండ్రి చొప్పరపు బాలస్వామిపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన బాలస్వా­మి­ని తొలుత మార్కాపురం జిల్లా వైద్యశా­లకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమి­త్తం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో వైఎస్సార్‌­సీపీ సోషల్‌ మీడియా యూట్యూబర్‌ సుంకేసుల ఆదిశేషు ఇంటిపై టీడీపీ వర్గీయులు కొడవళ్లతో దాడిచేశారు. ఆ సమయంలో ఆదిశేషు ఇంట్లో లేకపోవడంతో వారు మహిళలతో దురుసుగా మాట్లాడి సామగ్రిని చిందరవందర చేశారు. ఆదిశేషు భార్య, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

T20 World Cup 2024: David Warner Surpassed Chris Gayle In Most T20 50 Plus Scores In T20 Cricket
T20 World Cup 2024: క్రిస్‌ గేల్‌ రికార్డును బద్దలు కొట్టిన డేవిడ్‌ వార్నర్‌

ఆసీస్‌ వెటరన్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన కెరీర్‌ చరమాంకంలో ఓ అద్భుత రికార్డు నెలకొల్పాడు. పొట్టి క్రికెట్‌లో అత్యధిక 50 ప్లస్‌ స్కోర్లు (సెంచరీలు కలుపుకుని) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా ఒమన్‌తో ఇవాళ (జూన్‌ 6) జరిగిన మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీతో (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్సర్‌) మెరిసిన వార్నర్.. టీ20ల్లో అత్యధిక ఫిఫ్టి ప్లస్‌ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ రికార్డు సాధించే క్రమంలో వార్నర్‌ విండీస్‌ విధ్వంసకర వీరుడు క్రిస్‌ గేల్‌ను అధిగమించాడు. ఒమన్‌పై హాఫ్‌ సెంచరీ కలుపుకుని వార్నర్‌ ఖాతాలో 111 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు ఉండగా.. గేల్‌ పేరిట 110 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు నమోదై ఉన్నాయి. వార్నర్‌ కేవలం 378 ఇన్నింగ్స్‌ల్లో 111 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్ల మార్కు తాకగా.. గేల్‌కు 110 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేసేందుకు 455 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ జాబితాలో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి మూడో స్థానంలో (105), పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ నాలుగో స్థానంలో (101) ఉన్నారు.కాగా, బార్బడోస్‌ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. స్టోయినిస్‌ (36 బంతుల్లో 67 నాటౌట్‌; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్‌ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్‌.. ఆసీస్‌ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆసీస్‌ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత బ్యాట్‌తో చెలరేగిన స్టోయినిస్‌ బంతితోనూ (3-0-19-3) రాణించాడు. స్టోయినిస్‌తో పాటు జంపా (4-0-24-2), ఇల్లిస్‌ (4-0-28-2), స్టార్క్‌ (3-0-20-2) కూడా సత్తా చాటడంతో ఒమన్‌ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 36 పరుగులు చేసిన అయాన్‌ ఖాన్‌ ఒమన్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Bangalore Rave Party: MAA President Manchu Vishnu To Suspend Actress Hema
Bangalore Rave Party: ‘మా’ నుంచి హేమ సస్పెండ్‌

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన టాలీవుడ్‌ నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ (మా) సస్పెషన్‌ వేటు వేసింది. హేమను ‘మా’ నుంచి సస్పెండ్‌ చేయడానికి సభ్యుల అభిప్రాయాలు కోరుతూ ప్రెసిడెంట్ మంచు విష్ణు బుధవారం మా అసోసియేషన్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. అయితే సభ్యులంతా హేమను సస్పెండ్‌ చేయాల్సిందే అంటూ రిప్లయ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో హేమను సస్పెండ్‌ చేయాలని మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. హేమకు క్లీన్‌ చిట్‌ వచ్చేవరకు ఈ సస్పెన్షన్‌ కొనసాగుతుందని ప్రకటించారు. కాగా.. బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో హేమ దొరికిపోయారు. వైద్య పరీక్షల్లోనూ ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే ఆమెను అరెస్ట్‌ చేసిన బెంగళూరు పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Dozens Dead as Israel Attacks
హమాస్‌ స్థావరంపై ఇజ్రాయెల్‌ దాడి.. 39 మంది మృతి!

ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ నిరంతరం హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. తాజాగా గాజా స్ట్రిప్‌లోని ఒక పాఠశాలలోగల హమాస్ స్థావరం లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 39 మంది మృతి చెందారని, పలువురు గాయపడ్డారని సమాచారం.హమాస్‌కు చెందిన అల్-అక్సా టెలివిజన్ ఒక ప్రకటనలో ఇజ్రాయెల్ దాడిలో 39 మంది మృతి చెందారని తెలిపింది. అయితే పాలస్తీనియన్ న్యూస్ ఏజెన్సీ ఇజ్రాయెల్‌ దాడుల్లో 32 మంది మృతి చెందారని పేర్కొంది. పాలస్తీనియన్లకు సహాయం అందించే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ నిర్వహిస్తున్న పాఠశాలపై తమ యుద్ధ విమానాలు దాడి చేశాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ‘హమాస్’, ‘ఇస్లామిక్ జిహాద్’ సంస్థలు తమ కార్యకలాపాలకు ఈ పాఠశాలను స్థావరంగా ఉపయోగించుకున్నాయని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను చూపలేదు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement