Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YSRCP Navaratnalu Plus Manifesto More security for middle class
మధ్య తరగతికి మరింత భరోసా.. వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టో

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మధ్యతరగతి వర్గాల సంక్షేమానికి పలు చర్యలు చేపట్టి, ఆ వర్గాలను ఉన్నత స్థితికి తెస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘నవరత్నాలు ప్లస్‌’తో కూడిన మేనిఫెస్టోతో మరోసారి సంపూర్ణ భరోసా కల్పించారు. పట్టణాల్లోని మధ్య తరగతి కుటుంబాల దశాబ్దాల సొంతింటి కలను సాకారం చేసేలా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. 123 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేకంగా ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేసి, సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో ప్రతి ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయించి.. రూ.2 వేల కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటుకు నిర్ణయించారు. 17 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 29 నగర పంచాయతీల్లో దశలవారీగా ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేయనున్నారు. ఇదే కాకుండా, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపట్టారు. అవి..– ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు అండగా నిలవనున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువుల కోసం తీసుకునే రుణంలో రూ.10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యేంత వరకు చెల్లించనున్నారు. గరిష్టంగా ఐదేళ్ల పాటు వడ్డీ చెల్లింపుతో ఆర్థిక భరోసానిచ్చారు. – ప్రభుత్వ పాలనలో భాగస్వాములుగా ఉంటూ ఆప్కాస్, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబాలకు విద్య, వైద్యం, ఇళ్ల స్థలాలు సహా పూర్తి నవరత్న పథకాలను వర్తింజేయనున్నారు. దీనివల్ల రూ.25 వేల వరకు జీతం పొందుతున్న ఈ తరహా ఉద్యోగులందరికీ ఎంతో మేలు జరగనుంది. వీరితో పాటు ఇళ్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు వారి సొంత జిల్లాల్లోనే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు. ఆ స్థలం ఖరీదులో ప్రభుత్వం 60 శాతం ఖర్చును భరించనుంది.– వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ద్వారా మధ్యతరగతికి ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నారు. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. వీరికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించనున్నారు.– వైఎస్సార్‌ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ద్వారా గతంలో మాదిరిగానే ఏటా రూ.15 వేలు అందిస్తూ వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.60 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులైన అక్కచెల్లెమ్మల ఖాతాల్లో క్రమం తప్పకుండా ఈ ఆర్థిక సాయం జమ చేస్తారు.ఆర్యవైశ్యులకు అండగా..ఇప్పటికే ఓసీల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు నిధులను సైతం ఇస్తున్నారు తొలిసారిగా ఆర్య వైశ్యులకు ఒక కార్పొరేషన్‌ను తీసుకొచ్చి అండగా నిలిచారు. ఆర్యవైశ్య సత్రాలను సొంతంగా వారే నిర్వహించే హక్కులను కల్పించారు. ఇంతటి సంక్షేమాన్ని వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగిస్తామంటూ 2024 మేనిఫెస్టో ద్వారా మరోసారి భరోసా ఇచ్చారు.చెప్పినదానికంటే మిన్నగా..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజికవర్గాలకు మాత్రమే కాకుండా ఇతర వర్గాలకు సైతం నవరత్నాలు పథకాలతో డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా ఆర్థిక లబ్ధిని పెద్ద ఎత్తున అందించడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ రికార్డు సృష్టించారు. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాల  అక్కచెల్లెమ్మలను సంక్షేమ పథకాలతో ఆర్థికంగా బలోపేతం చేశారు. ఈ ఐదేళ్లలో ఆయా వర్గాలకు డీబీటీ ద్వారా 1,66,45,078 మందికి రూ.43,132.75 కోట్లు, నాన్‌ డీబీటీ ద్వారా 2,00,59,280 మందికి రూ.86,969.93 కోట్లు కలిపి మొత్తం 3,67,04,358 మందికి రూ.1,30,102.68 కోట్లు లబ్ధి చేకూర్చడం విశేషం.కాపుల అభివృద్ధికి..కాపుల సంక్షేమానికి గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నూరు శాతం అమలు చేశారు. మేనిఫేస్టోలో చెప్పినదానికి మించి భారీ ఆర్థిక సాయం అందించారు. ఏడాదికి రూ.2 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు సాయం చేస్తామని చెప్పగా.. ఐదేళ్లలో డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి మొత్తంగా రూ.34,005.12 కోట్లు సాయమందించడం విశేషం. ఇందులో డీబీటీ ద్వారానే 65,34,600 ప్రయోజనాల కింద కాపులకు రూ.26,232.84 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నాన్‌ డీబీటీ కింద మరో రూ.7,772.19 కోట్లు ప్రయోజనాలను కల్పించారు. వాస్తవానికి చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కాపుల సంక్షేమానికి కేటాయించింది కేవలం రూ.1,340 కోట్లే.  

CM YS Jagan Fires On Chandrababu At Bobbili Eluru Payakaraopeta
ఇవ్వడమే జగన్‌కు తెలుసు: సీఎం జగన్‌

జగన్‌ను చంపేస్తే తప్పేమిటంటున్నాడు..మీ బిడ్డ జగన్‌ను ఓడించలేమని, ఆ పేద అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, వారి కుటుంబ సభ్యులు మోసపోవడానికి సిద్ధంగా లేరని, ఎంత ప్రలోభపెట్టినా తన మాటలు నమ్మట్లేదని గ్రహించిన చంద్రబాబు నోట జగన్‌ను చంపేస్తే ఏమవుతుంది? అన్నమాట వినిపిస్తోంది. నాడు వైఎస్సార్‌ గాల్లో కలిసిపోతాడని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశాడు. నేడు జగన్‌ను చంపేస్తే తప్పేమిటని అంటున్నాడు. రాజకీయాల్లో ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా?– బొబ్బిలి సభలో సీఎం జగన్‌తట్టుకోలేకపోతున్నారు..పేదల గురించి జగన్‌ మాట్లాడుతుంటే పెత్తందారులైన చంద్రబాబు, ఈనాడు, ఆం«ధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు, వదినమ్మకు చాలా బాధగా, విపరీతమైన కోపంగా ఉంటుంది. జగన్‌ ఎప్పుడూ పేదలు.. పేదలు అంటుంటే విని తట్టుకోలేక­పోతున్నారు. ఈ రోజు జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. రాష్ట్రంలో క్లాస్‌ వార్‌ జరుగుతుంది. పేదలు ఒక ఒకవైపు, పెత్తందారులు మరోవైపు ఉన్నారు. కులం పరంగా, ఫలానా పార్టీ పట్ల అభిమానం వల్ల కావొచ్చు.. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంటికి వెళ్లాక మీ కుటుంబానికి ఎవరి వల్ల మంచి జరిగిందో మీ కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని చర్చించండి. ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుందో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా.– ఏలూరు సభలో  సీఎం జగన్‌దీవించండి..బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి చిన్నఅప్పలనాయుడు, విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్‌ యాదవ్, ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నానీని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా.  సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘జగన్‌ ఎలాంటివాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకూ తెలుసు చంద్రబాబూ! జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ నీలా భూములు లాక్కునేవాడు కాదు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అంటే చంద్రబాబుకు తెలియదు. వందేళ్ల క్రితం బ్రిటీష్‌ హయాంలో జరిగిన సర్వే తర్వాత ఇప్పుడు చేపట్టిన సర్వేతో పక్కాగా రికార్డులు సృష్టించి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయడమే దీని ఉద్దేశం. 15 వేల గ్రామ సచివాలయాల్లో 15 వేల మంది సర్వేయర్లను నియమించి ఇలా సర్వే చేసిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. రైతన్నలు కోర్టులు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చి ప్రతి ఒక్కరికీ వారి భూములపై సంపూర్ణ హక్కులు కల్పించాలనే లక్ష్యంతో రీ సర్వే ద్వారా సరిహద్దు రాళ్లను నాటించి రికార్డులు అప్‌డేట్‌ చేసి ఆ పత్రాలన్నీ రిజిస్ట్రేషన్‌ చేసి రైతన్నలకు ఇస్తున్నాం. ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలేగానీ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. మనం అమలు చేసిన పథకాల గురించి చెబుతుంటే చంద్రబాబుకు కోపం వస్తోంది. గత 59 నెలల కాలంలో ఎన్నడూ లేని విప్లవాత్మక సంస్కరణలను మీ బిడ్డ తెచ్చినందుకే ఆయనకు కోపం వస్తోంది. ఈ ఎన్నికల్లో బాబును ఓడించడమంటే పేదలను గెలిపించడమే’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. నేరప్రవృత్తికి చంద్రబాబు నిలువెత్తు నిదర్శనమని, వెన్నుపోట్లు, హత్యలతోనే ఆయన రాజకీయాలు ముడిపడి ఉంటాయని ధ్వజమెత్తారు. సొంతమామ ఎన్టీఆర్‌ను, వంగవీటి రంగాను, పింగళి దశరథరామ్‌ను, ఐఏఎస్‌ అధికారి రాఘవేంద్రరావును కుట్రలతోనే కడ తేర్చారన్నారు. బుధ­వారం విజయనగరం జిల్లా బొబ్బిలి, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, ఏలూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్‌ మాట్లాడారు. ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివిమరో 13 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది. ఇది జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు.. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. రాబోయే ఐదేళ్ల పాటు మీ ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి. ఓటుతో మీ తలరాతలు మారతాయి. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపే, మళ్లీ మోసపోవడమే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. బాబుకు ఓటు వేయడమంటే  కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే. పేదలంటే బాబు ముఠాకు కోపం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీతో నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. మీ బిడ్డ ఇచ్చింది ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలను అమలు చేశాం. నేను వరుసబెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్‌ల లిస్టు చదువుతుంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోంది. మీరంతా చూస్తున్నారు కదా ఆ కోపాన్ని.. ఆయనకు మనమీద ఎందుకంత పిచ్చికోపం వస్తోందంటే.. గతంలో ఎన్నడూ చూడని విధంగా మీ బిడ్డ విప్లవాలు తెచ్చాడు కాబట్టే. నేను చెబుతున్న విష­యాలు గతంలో ఎప్పుడైనా అమలు జరిగాయో లేదో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. జగన్‌ను చంపితే ఏమవుతుందంటున్న బాబుమీ జగన్‌ ప్రజలకు ఏం చేశాడో గుర్తుచేస్తూ ప్రచారం చేస్తున్నాడు. చంద్రబాబు మాత్రం ఏం మాట్లాడు­తున్నాడో మీరంతా గమనిస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లా బుచ్చి­రెడ్డి­పాలెంలో ఇదే పెద్దమనిషి రేపు జగన్‌ను చంపితే ఏం జరుగుతుంది? అని వ్యాఖ్యలు చేశాడు. ఆయన మానసిక పరిస్థితి, ఆ ఆలో­చనలు ఎలా ఉన్నాయో గమనించాలని కోరుతున్నా. ఏమయ్యా చంద్రబాబూ..! ప్రజలు నీకు ఎందుకు ఓటు వేయాలి? అని నేను అడుగుతుంటే నీ సమాధానం అదా?అక్కచెల్లెమ్మలే రక్షించుకుంటారు.. అయ్యా చంద్రబాబూ.. నువ్వు అనుకుంటే సరిపోదు. ఈ 59 నెలల్లో మంచి జరిగిన ఆ కోట్ల మంది అక్కచెల్లెమ్మల కుటుంబాలు జగన్‌కు తోడుగా ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ జగన్‌కు తోడుగా, అండగా ఉన్నారయ్యా చంద్రబాబూ! వారి జగన్‌ను వారే రక్షించుకుంటారు. నాకు నీ మాదిరిగా జడ్‌ ప్లస్, జడ్‌ డబుల్‌ ప్లస్‌ సెక్యూరిటీ అక్కర్లేదయ్యా. అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి చేస్తూ లంచాలు, వివక్ష లేకుండా ఇచ్చిన రూ.2.70 లక్షల కోట్ల డీబీటీ బటన్‌లే నాకు శ్రీరామరక్ష. పిల్లలు బాగుండాలని ఇచ్చిన అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, అక్కచెల్లెమ్మలు బాగుండాలని ఆరాటపడుతూ అందించిన చేయూత, ఆసరా, సున్నావడ్డీ, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం.. ఇవన్నీ నాకు రక్ష అని చంద్రబాబుకు చెబుతున్నా. నా అవ్వాతాతలకు మంచి చేస్తూ ఇంటివద్దే అందించిన పెన్షన్లతో దేవుడికి చేస్తున్న ప్రార్థనలే నాకు శ్రీరామ రక్ష. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల ప్రార్థనలే వారి బిడ్డ జగన్‌కు శ్రీరామరక్ష. మంచిని అందుకున్న నా రైతన్నలు ఆ భూమాత, పంచ భూతాల సాక్షిగా చేస్తున్న ప్రార్థనే నాకు శ్రీరామ రక్ష. జగన్‌ మార్కు సామాజిక న్యాయంఅసెంబ్లీ, ఎంపీ సీట్లు కలిపి మొత్తం 200 స్థానాలకుగానూ 100 స్థానాల్లో నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు,  మైనార్టీలకు టికెట్లు ఇచ్చాం. మంత్రి పదవుల్లో ఏకంగా 68 శాతం నా ఎస్సీ, ఎస్టీ,  బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటే నాలుగు పదవులు ఆ వర్గాలకే కేటాయించి గౌరవించాం. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు వారికే కల్పిస్తూ చట్టం తెచ్చాం. ఇంత సామాజిక న్యాయం, తోడుగా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? వలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా రెండు బటన్లు ఫ్యాను గుర్తు మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాల్లో గెలిపించాలి. మీ అందరికీ మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌ లోనే ఉండాలి. బాబు వ్యాఖ్యలు నేరప్రవృత్తికి నిదర్శనంఆ రోజు నా తండ్రి రాజశేఖరరెడ్డి చేస్తున్న మంచి పనులు, ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అక్కసుతో అసెంబ్లీ సాక్షిగా నాన్ననుద్దేశించి ‘నువ్వు ఆ గాలిలోనే కలిసిపోతావ్‌...!’ అన్న నీ వ్యాఖ్యలను నేను ఎప్పటికీ మర్చిపోలేను చంద్రబాబూ. నాడు నా తండ్రిని, నేడు నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక నువ్వు మాట్లాడుతున్న మాటలు నీ దిగజారుడుతనానికి, నీ నేర ప్రవృత్తికి అద్దం పడుతున్నాయి.పేదలకు పథకాలు అందాలా.. లేదా?చంద్రబాబును అడుగుతున్నా.. ఒక ముఖ్యమంత్రి, ఒక నిజమైన నాయకుడు, ఒక నిజమైన లీడర్‌ రాష్ట్రంలో 90 శాతం మంది పేదలకు ఈ రోజు మంచి చేయడం కొనసాగాలా.. వద్దా? ఎవరు మేలు చేశారు? నిజమైన నాయకుడు ఎవరో ఆలోచన చేయాలని అందరినీ కోరుతున్నా. రాష్ట్రంలో తెల్లరేషన్‌ కార్డులున్న కుటుంబాలు 1.44 కోట్లు. అంటే జనాభాలో 90 శాతం. వీరందరూ పేదలు కాదా? వీరికి పథకాలు అందాలా? లేదా? ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులున్న వారు జనాభాలో 95 శాతం ఉన్నారు. వీరికి పథకాలు అందాలా లేదా? ఉన్నత చదువులు చదువుతున్న 93 శాతం మందికి పూర్తి ఫీజుల చెల్లిస్తూ విద్యాదీవెన, ఖర్చులకు వసతి దీవెన అందాలా.. లేదా? పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న నా అక్కచెల్లెమ్మలు 1.05 కోట్ల మంది పేదలు కాదా? వీరందరికీ పథకాలు అందాలా.. లేదా? రాష్ట్రంలో అవ్వా­తాతలు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి అక్కలు 66 లక్షల మందికిపైగా పెన్షన్లు తీసుకుంటున్నారు. రైతు భరోసాతో 55 లక్షల మంది రైతన్నలకు అండగా నిలిచాం. మరో 60 లక్షల మంది అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన తీసుకుంటున్నారు. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చి 22 లక్షల గృహ నిర్మాణాలు చేపట్టాం. ఇప్పుడు చెప్పండి.. వీరంతా పేదలు కాదా? వీరికి పథకాలు అందాలా లేదా?ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ విషయంలో దుష్ప్రచారం జరుగుతోంది. జగన్‌ మీ భూములు కాజేస్తాడంటూ ప్రతి ఒక్కరికీ మెసేజ్‌లు పంపుతూ, ఫోన్లు చేసి చెబుతున్నారు. అయ్యా చంద్రబాబూ.. జగన్‌ ఎలాంటి వాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకూ తెలుసు. జగన్‌ భూములు ఇచ్చేవాడే కానీ నీలా భూములు లాక్కునేవాడు కాదు– పాయకరావుపేట సభలో సీఎం జగన్‌మీ బిడ్డ తెచ్చిన కొన్ని విప్లవాలివీ..⇒ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే రూ.3 వేల పెన్షన్‌ కానుక విప్లవమా? కాదా?⇒ గవర్నమెంట్‌ బడుల్లో నాడు–నేడు, ఇంగ్లీష్‌ మీడియం, బడి తెరిచే సమయానికే విద్యా­కానుక, బైజూస్‌ కంటెంట్, 3 తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, సబ్జెక్ట్‌ టీచర్లు, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, 6వ తరగతి నుంచి డిజిటల్‌ బోధన, ఐఎఫ్‌పీలు లాంటివి విప్లవమా? కాదా?⇒ తొలిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్యువల్‌ టెక్ట్స్‌బుక్స్, పూర్తి ఫీజులు చెల్లిస్తూ ఇంజనీరింగ్, డాక్టర్, డిగ్రీ లాంటి ఉన్నత చదువులు అభ్యసించే 93శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అంతర్జాతీయ వర్సిటీలు అందించే ఆన్‌లైన్‌ సర్టిఫైడ్‌ కోర్సులను మన కరిక్యులమ్‌లో భాగం చేయడం లాంటివి విప్లవాలు కాదా?⇒ మీ పిల్లలను బడికి పంపించండమ్మా.. మీకు తోడుగా మీబిడ్డ ఉన్నాడంటూ అమ్మఒడి అందిం­చడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? ⇒ అక్కచెల్లెమ్మలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయూత, కాపునేస్తం, సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, వైఎస్సార్‌ ఆసరా,  సున్నా­వడ్డీ­తో­­పాటు 31లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరిటే రిజిస్ట్రేషన్, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, గ్రామంలోనే మహిళా పోలీస్, భద్రత కోసం దిశ యాప్, నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది మీ జగన్‌ కాదా? ఇవన్నీ విప్లవాలు అవునా? కాదా? ⇒ మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఆర్బీకేలు, ఈ–క్రాప్, ఉచిత పంటల బీమా, పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, నష్టపోతే సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఆర్బీకేల ద్వారా మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు, జీఎల్‌టీ, ఆక్వా రైతులకు రూపా­యి­న్నరకే కరెంట్, ఆయిల్‌పామ్‌ రైతులకు మెరుగైన ధర ఇచ్చిందెవరు? ఇవన్నీ విప్లవాలు కాదా?⇒ వైద్యం కోసం అప్పులపాలు కాకుండా విస్తరించిన ఆరోగ్యశ్రీతో రూ.25 లక్షలదాకా ఉచిత వైద్యం, ఆపరేషన్‌ తరువాత విశ్రాంతి సమ­యంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా ఆరోగ్య ఆసరా, మన గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష లాంటివి అమలు చేసింది మీ బిడ్డ పాలనలో కాదా? ఇవన్నీ వైద్య రంగంలో విప్లవాలు కాదా? ⇒ మత్స్యకార భరోసా, నేతన్ననేస్తం, వాహన­మి­త్ర, చేదోడు, తోడు, ఎంఎస్‌ఎంఈలకు సంపూర్ణ మద్దతు, లా నేస్తం లాంటివి తెచ్చిందెవరు?⇒ గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఈరోజు ఊరిలోకి అడుగుపెట్టిన వెంటనే గ్రామ సచివాలయం కనిపిస్తోంది. ఏకంగా 600 రకాల సేవలు మన ఇంటివద్దే అందుతు­న్నాయి. వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ప్రతి 60–70 ఇళ్లకు పెన్షన్‌ నుంచి పౌరసేవలు, పథకాలు, రేషన్‌ దాకా డోర్‌ డెలివరీ అవుతు­న్నాయి. అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకేస్తే విలేజ్‌ క్లినిక్, నాడు–నేడుతో మారిన ఇంగ్లీష్‌ మీడియం బడులు, గ్రామానికే ఫైబర్‌ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ గతంలో ఉన్నాయా? ⇒ మీ బిడ్డ ప్రభుత్వం రాకముందు గవర్నమెంట్‌ ఇచ్చే డబ్బులు లంచాలు, తిరుగుళ్లు లేకుండా నేరుగా మీ చేతికే అందుతాయంటే ఎవరైనా నమ్మేవారా? నా అక్కచెల్లెమ్మలు, వాళ్ల కుటుంబాలు, పిల్లలు బాగుండాలని 130 సార్లు బటన్‌ నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు పారదర్శకంగా అందించడం ఓ విప్లవాత్మక చరిత్ర కాదా?అబద్ధాలకు రెక్కలు...చంద్రబాబు తన అబద్ధాలు, మోసాలకు రెక్కలు కడుతున్నాడు. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్‌ను అడ్డుకుని మనపై నెపం వేస్తున్నాడు. ఏ రోజైనా ఆయన అవ్వాతాతల బాధలు, కష్టాలను పట్టించుకున్నాడా? ఏనాడైనా ఇంటికే పెన్షన్‌ ఇచ్చాడా? తన మనిషి నిమ్మగడ్డ రమేశ్‌తో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాయించి ఇంటివద్దే అందిస్తున్న పెన్షన్లను అడ్డుకున్నాడు. ఆ అవ్వాతాతలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంతో మీబిడ్డపై నెపం మోపుతున్నాడు.ప్రపంచంలో ఎవరైనా నమ్ముతారా?⇒ 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్క మంచి పనిగానీ, పథకంగానీ గుర్తుకొస్తుందా? ఆ పెద్దమనిషి తన జీవిత కాలంలో ఏ రోజూ పేదలకు మంచి చేసిందిలేదు. 2014లోనూ ఇదే మాదిరిగా హామీలిచ్చి వంచించాడు. ఒక్కసారి వాటిని గుర్తుచేసుకుంటే ప్రపంచంలో ఎవరైనా చంద్రబాబును నమ్ముతారేమో మీరే చెప్పండి.⇒ రైతులకు రూ.87,612 కోట్ల రుణమాఫీ జరిగిందా? ⇒ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానంటూ ఏకంగా రూ.14,205కోట్లు  ఎగనామం పెట్టాడు. ⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు కాదు కదా ఎవరికైనా ఒక్క రూపాయి అయినా బ్యాంకులో జమ చేశాడా? ⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఏ ఒక్క ఇంటికైనా 60 నెలల్లో రూ.2వేలు చొప్పున రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు అన్నాడు. ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? ⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత పవర్‌ లూమ్స్‌ మాఫీ అన్నాడు. జరిగిందా? ⇒ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాడా? ⇒ సింగపూర్‌కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మాణం జరిగిందా? మన బొబ్బిలి, పాయకరావుపేటలో ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ⇒ ప్రత్యేక హోదా తీసుకురాకపోగా అమ్మేశాడు. ⇒ ఇప్పుడు మళ్లీ మోసగించేందుకు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు అంటూ నమ్మబలుకుతున్నారు. 

Kcr Response On Election Commission Ban
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్‌

హైదారబాద్‌,సాక్షి : ఎలక్షన్ కమిషన్ నోటీసులపై కేసీఆర్‌ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదని అన్నారు. స్థానిక భాషను అధికారులు అర్థం చేసుకోకుండా పై అధికారులకు నివేదికలు ఇచ్చినట్లు అర్థమవుతుందని తెలిపారు.‘కాంగ్రెస్ నేతలు నేను మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలను మాత్రమే ఎంపిక చేసి ఫిర్యాదులో పేర్కొన్నారు. నేను కాంగ్రెస్‌ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించాను. కానీ నా మాటల్ని కాంగ్రెస్‌ నేతలు ట్విస్ట్‌ చేశారు’ అని కేసీఆర్‌ తెలిపారు.ఇదెక్కడి అరాచకం?కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించడంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘ఇదెక్కడి అరాచకం? ఏకంగా కేసీఆర్‌ గొంతుపైనే నిషేధమా? మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? రేవంత్‌ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా? బడే భాయ్‌.. చోటే భాయ్‌ కలిసి చేసిన కుట్ర కాదా ఇది! అంటూ ట్వీట్‌ చేశారు. ఇదెక్కడి అరాచకం...? ఏకంగా Telangana ki Awaaz KCR గొంతు పైనే నిషేధమా..?మోడీ విద్వేష వ్యాఖ్యలుఈసీకి వినిపించలేదా..? Zero action against Modi despite thousands of citizens’ complaints రేవంత్ బూతులు EC కిప్రవచనాల్లాగా అనిపించాయా...? No action against the foul mouthed Cheap…— KTR (@KTRBRS) May 1, 2024

TDP Chandrababu Fake Promise To Unemployed Youth
‘భృతి’.. అంతా భ్రాంతి.. నిరుద్యోగులపై చంద్రబాబు మాయా వల

సాక్షి, అమరావతి:  ‘‘జాబు రావాలంటే బాబు రావాలి.. తమ్ముళ్లూ మీ కలలు సాకా­రం చేయబోతున్నా.. ఇంటికొక ఉద్యోగం ఇస్తా.. ఉద్యో­గం ఇవ్వకపోతే ఉపాధి కల్పిస్తా.. మీరేమీ చదువుకోకపోయినా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2 వేలిస్తా’’..  ఈ హామీ గుర్తుందా? 2014 ఎన్నికల్లో చంద్రబాబు సంతకంతో కూడిన కరపత్రాన్ని తెలుగుదేశం పార్టీ ఊరూరా పంచుతూ ప్రచారం చేసింది. సీన్‌ కట్‌చేస్తే ఆ ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. చెప్పినట్లుగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలుచేశారా అంటే అనేకానేక హామీల్లాగే అదీ బాబు అటకెక్కించేశారు. ఇప్పుడు మళ్లీ అలాంటి హామీతోనే ఆయన మరోసారి యువతకు వల విసురుతున్నారు. ఆయన మాయలో పడొద్దని.. భవిష్య­త్తును నాశనం చేసుకోవద్దని మేధావులు, విద్యావేత్తలు యువతకు సూచిస్తున్నారు.  నిరుద్యోగ భృతి ఇవ్వబోమన్న అచ్చెన్న.. ఇక అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్ల పాటు చంద్రబాబు ఆ ఊసే ఎత్తలేదు. కానీ, నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మాత్రం సందర్భం వచ్చిన ప్రతీసారి ఈ అంశంపై చంద్రబాబు సర్కారును నిలదీస్తూనే ఉన్నారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తానని యువతకు మాటిచ్చి ఎలా విస్మరిస్తారంటూ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నకు నిరుద్యోగ భృతి అనే పథకమేలేదని, ఈ ప్రశ్న ఉత్పన్నమే కాదంటూ నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చన్నాయుడు అసెంబ్లీలో అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. శిక్షణనిచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇవ్వబోమని, బాబు వస్తే జాబు వస్తుందనే నినాదంతో ఎన్నికల్లో వెళ్లిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. అయినా, నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో జగన్‌ పట్టువిడవకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుండడంతో 2017–18లో బడ్జెట్‌లో టీడీపీ ప్రభుత్వం కంటితుడుపుగా రూ.500 కోట్లు కేటాయించింది. దీనిపై జగన్‌ మండిపడుతూ.. జాబు రావాలంటే బాబు రావాలని, జాబు ఇవ్వకపోతే ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ ఎన్నికల ముందు ఇంటింటా ప్రచారం చేసి ఇప్పుడు గొప్పగా రూ.500 కోట్లు కేటాయించామని చెప్పడం నిరుద్యోగులను నిలువునా మోసం చేయడమేనని ఉతికి ఆరేశారు. అంతేకాక.. రాష్ట్రంలో 1.75 కోట్ల కుటుంబాలున్నాయని, ఒక్కో కుటుంబానికి నెలకు రెండువేల చొప్పున భృతి ఇవ్వాలని.. ఇందుకు నెలకు రూ.3,500 కోట్లు అవసరమని, అలాగే ఏడాదికి రూ.40 వేల కోట్లు అవసరమైతే రూ.500 కోట్లు ఏ మూలకు సరిపోతాయంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్‌ జగన్‌ చీల్చిచెండాడారు.  ఉన్న ఉద్యోగాలకు బాబు ఎసరు.. ఇలా నిరుద్యోగ భృతి ఇస్తానంటూ నాలుగున్నరేళ్ల పాటు ఎగమనామం పెట్టి ఎన్నికల ముందు ఆర్నెల్లపాటు యువతను మోసం చేయడానికి కంటితుడుపు చర్యగా ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో చంద్రబాబు ఎత్తుగడ వేశారు. కానీ, నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఆరోగ్య మిత్రలను, ఫీల్డ్‌ అసిస్టెంట్లను, గోపాల మిత్రలను ఉద్యోగాల నుంచి చంద్రబాబు తొలగించారు. దీంతో.. మళ్లీ ఇప్పుడు ఎన్నికల ముందు యువతను, నిరుద్యోగులను మోసం చేయడానికి చంద్రబాబు కుయుక్తులు, మోసపూరిత ప్రకటనలతో వస్తున్నారు తస్మాత్‌ జాగ్రత్త నిరుద్యోగులూ.. అంటూ మేధావులు, విద్యావేత్తలు యువతను అప్రమత్తం చేస్తున్నారు. నిరుద్యోగ భృతిపై 2014 ఎన్నికల ముందు ఇంటింటా ప్రచారం చేసి అధికారం దక్కాక ఎలా మోసం చేశారో అచ్చు అలాగే చంద్రబాబు మళ్లీ యువతకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి అంటూ అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నారని.. చంద్రబాబు వలలో పడి మరోసారి మోసపోవద్దని వారు సూచిస్తున్నారు.వైఎస్‌ జగన్‌ ఒత్తిడితో.. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు.. ఇక 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ చంద్రబాబు పైసా ఖర్చు పెట్టలేదు. ప్రతిపక్ష నేత జగన్‌ తన ఒత్తిడి కొనసాగిస్తుండడంతో ఇక 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నాలుగు నెలల కోసం నిరుద్యోగ భృతి కాదు ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగులకు నెలకు రూ.1,000 ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది. ఈ ఉపసంఘం సవాలక్ష ఆంక్షలు విధించి నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను భారీగా కుదించింది.  ⇒ టెన్త్, ఇంటర్‌ చదివిన వారు అనర్హులని ఆంక్షలు విధించింది.  ⇒ 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వారు డిగ్రీ చదివిన వారికే భృతి వర్తిస్తుందని, దారిద్య్ర రేఖకు దిగువనున్న వారు.. తెల్ల రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, ఓటరు ఐడీ కార్డు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని షరతులు విధించింది.  ⇒ దీంతో వచ్చిన దరఖాస్తుల్లో 12 లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతికి అర్హులుగా తేల్చింది.  ⇒ ఆ తరువాత అది పది లక్షలు, మళ్లీ మళ్లీ వడపోత తర్వాత 2.10 లక్షల మందే అర్హులంటూ వెల్లడించి మళ్లీ దానిని 1.62 లక్షలకు కుదించింది.  ⇒ అనంతరం 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల చేసి ఈ–కేవైసీ మెలిక పెట్టింది.  ⇒ అలాగే, ప్రతినెలా వేలిముద్ర వేస్తేనే నిరుద్యోగ భృతి అంటూ ఆంక్షలు పెట్టుకుంటూ పోయి ఎన్నికల వరకు తాత్సారం చేశారు. 

Sakshi Editorial On Deep Fake Videos In General Election Campaign
సత్యానికి సవాల్‌!

కంటికి కనిపిస్తున్నదంతా నిజమేనా? ఏది సత్యం? ఏదసత్యం? వేసవి తాపానికి తోడు సార్వత్రిక ఎన్నికల ప్రచారపు వేడి ఎక్కువై, నేతలు పరస్పరం మాటల ఈటెలు విసురుకుంటున్న వేళ... కృతిమ మేధ (ఏఐ) సాయంతో ఇష్టారాజ్యపు మార్పుచేర్పుల నకిలీ వీడియోలు సోషల్‌ మీడియాలో ప్రచార మవుతున్నందున... ఇప్పుడు అందరూ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి. సాక్షాత్తూ కేంద్ర హోమ్‌మంత్రి రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు వీడియో ప్రచారమవుతుంది. ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్‌ కాంగ్రెస్‌కు మద్దతుగా మాట్లాడినట్టు మరో వీడియో ప్రత్యక్షమవుతుంది. మరో ప్రముఖ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ కాశీలోని గంగాతీరంలో తన పుణ్యక్షేత్ర దర్శనానుభూతిని పంచుకుంటే ఆ మాటలు మోదీ, బీజేపీలకు మద్దతు పలికినట్టుగా నకిలీ వీడియోలో మారిపోతాయి. ఇదీ వర్తమాన ఎన్నికల్లో రాజకీయ వీడియోల వైచిత్రి. గడచిన 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు వాట్సప్‌ యూనివర్సిటీల్లో తప్పుడు సమాచారం వీరవిహారం చేస్తే, ఈసారి ఏఐ ఆధారిత విశ్వామిత్ర సృష్టి వీడియోలు నేతలకూ, ఓటర్లకూ సరికొత్త సవాళ్ళు విసురుతున్నాయి. నాటి ఐటీ బాట్ల నుంచి నేటి ఏఐ డీప్‌ఫేక్‌ల దాకా మన ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తి వెనక్కి రాలేనంత దూరం వెళ్ళిపోయింది.తాజాగా ఈ నకిలీ వీడియోల సెగ అధికార బీజేపీ నేతలకు గట్టిగానే తగిలింది. సాక్షాత్తూ ప్రధాని మోదీ, హోమ్‌ మంత్రి అమిత్‌షాలు ఈ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడమే అందుకు నిదర్శనం. రిజర్వేషన్ల అంశంపై హోమ్‌ మంత్రి అనని మాటలను అన్నట్టుగా మార్చి చూపించిన ఫేక్‌ వీడియో ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారమైంది. సంచలనం రేపింది. తమతో సహా పలువురు బీజేపీ నేతల నకిలీ వీడియోలను ప్రచారంలో పెట్టి, శాంతియుత ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయ డానికి ప్రతిపక్షాల వారు ప్రయత్నిస్తున్నారంటూ మోదీ ఆరోపించారు. ఎన్నికల వేళ పెద్ద తల నొప్పిగా మారిన ఈ అబద్ధపు వీడియోల వ్యాప్తిపై బీజేపీ ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. పోలీసులకూ ఫిర్యాదు చేసింది. అమిత్‌షాకు సంబంధించిన మార్ఫింగ్‌ వీడియోను ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌) ఖాతాలో షేర్‌ చేశారనే ఆరోపణపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సహా పలువురికి ఢిల్లీ పోలీసులు సమన్లు ఇవ్వడంపై సవాళ్ళు, ప్రతి సవాళ్ళ పర్వం నడుస్తోంది. మరోపక్క ఈ వీడియో వ్యవహారంపై అసోమ్‌లో ఒకరితో పలువురు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొత్తం ఏడు విడతల్లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మంత్రం ఆశించినంతగా ఫలించడం లేదనీ, ‘ఈసారి 400 సీట్ల పైనే’ (అబ్‌ కీ బార్‌ 400 పార్‌) అన్న బీజేపీ నినాదం మంచి కన్నా చెడు చేస్తోందనీ ఒక విశ్లేషణ. ఈ పరిస్థితుల్లో ఈ డీప్‌ ఫేక్‌ వీడియోలు మరిన్ని వర్గాలను అధికార పార్టీకి దూరం చేసే ప్రమాదం లేకపోలేదు. అయితే, ఈ నకిలీ వీడియోల ముప్పు అధికార పార్టీకే కాదు... ప్రతిపక్షం సహా అన్ని పార్టీలకూ ఉంది. ఇంకా చెప్పాలంటే, గడచిన 2019 ఎన్నికలు ‘సోషల్‌ మీడియా ఎన్నిక’లైతే, ఈ 2024 ఎన్నికలు ‘ఏఐ యుగపు ఎన్నికల’ని నిపుణులు అభివర్ణిస్తున్నారు. సగటు ఓటరుకు మునుపెన్నడూ లేనంతగా తప్పుడు సమాచారమందే ప్రమాదం ఈసారి పెరిగింది. చేతిలో ప్రపంచాన్ని ఇమిడ్చిన స్మార్ట్‌ఫోన్‌లో వస్తున్నదంతా నిజమని నమ్మే ధోరణిని మార్చుకోక పోతే కష్టమే. వాట్సప్‌ సహా వివిధ మాధ్యమాల్లో షేర్‌ అవుతున్న వాటిలో ఏది అసలో, ఏది ఏఐతో మార్చిన నకిలీయో తెలుసుకోవడం తెలీక సామాన్యులు మోసపోయే ప్రమాదం మరీ ఎక్కువైంది.  గతంలోనూ విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రత్యర్థిని దెబ్బతీసే ప్రచారాలు లేకపోలేదు. కాకపోతే ఫలానా వర్గం ఎక్కువ మంది పిల్లల్ని కంటోంది, ఫలానా పార్టీ అధికారంలోకి వస్తే మంగళ సూత్రాలను సైతం లాగేసుకుంటుంది లాంటి మాటలు ఈ తడవ మాత్రమే ఏలికల నోట విని పిస్తున్నాయి. సాంకేతికత వెర్రితలలు వేయడంతో ఈసారి మరింత చిక్కొచ్చి పడింది. మొత్తం మన రాజకీయ సమాచార ప్రసార, ప్రచారాలు శరవేగంతో మారిపోయాయి. 2019 ఎన్నికల ముందు మన ‘జనగణమన’ను ప్రపంచ అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో ప్రకటించిందనే మెసేజ్‌ వాట్సప్‌లో తెగ తిరిగితే... ఇప్పుడు జనరేటివ్‌ ఏఐ సాయంతో మోదీ పెదాల కదలికకు అచ్చు గుద్దినట్టు సరిపోయేలా మూడు భాషల్లో ఆయన ప్రసంగపు యూట్యూబ్‌ షార్ట్‌ వంతు వచ్చింది. జనాన్ని ఎలాగోలా బురిడీ కొట్టించి, బుట్టలో వేసుకోవాలనే తపన, తాపత్రయం గడచిన అయి దేళ్ళలో కొత్త పుంతలు తొక్కింది. నిజానికి, సోషల్‌ మీడియా సంస్థలు సైతం ఫేక్‌ న్యూస్, ప్రాపగాండాలను అరికట్టడానికి కిందా మీదా పడుతున్నాయి. ఆన్‌లైన్‌లోనూ డీప్‌ఫేక్‌ను అడ్డుకొనేందుకు ప్రస్తుత చట్టాలను నవీకరించేందుకు భారత ప్రభుత్వమూ ప్రయత్నిస్తోంది. ఓట్లు, సీట్లు, అధికారమే పరమావధిగా మారిన కాలంలో ప్రతి పార్టీ ఒక సోషల్‌ మీడియా సైన్యాన్ని పెంచి పోషిస్తోంది. ఆన్‌లైన్‌ అసత్య ప్రచారాన్ని సైతం ఎన్నికల వ్యూహంలో ఒక భాగంగా అందరూ అనుసరిస్తున్న రోజులొచ్చిపడ్డాయి. సమాచారాన్ని వైరల్‌ చేసే బాట్లకు ఇప్పుడు విశ్వామిత్ర సృష్టి జనరేటివ్‌ ఏఐ కూడా జతపడేసరికి అగ్నికి ఆజ్యం తోడైంది. ఉచితంగా, కాదంటే కారుచౌకగా ఏఐ సహా రకరకాల ఉపకరణాలు అందుబాటులోకి రావడం ఆకతాయిలకూ వరమైంది. ఓ డీప్‌ఫేక్‌ వీడియో సృష్టికి మూడేళ్ళ క్రితం పది రోజులు పడితే, ఇప్పుడు మూడు నిమి షాల్లో చేయగలుగుతున్నారు. ఇవన్నీ సత్యాన్వేషణలో నేటి సవాళ్ళు. ఎన్నికల్లో అనియంత్రిత ఏఐ వినియోగానికి తక్షణం అడ్డుకట్ట వేయకుంటే అనర్థం తప్పదు. నేతలు, జర్నలిస్టులు, నటీనటులు ప్రధాన లక్ష్యంగా సాగుతున్న విషం చిమ్ముడుకు విరుగుడు వెతకాలి. లేదంటే, వ్యవస్థపైనే నమ్మకం పోతుంది. యావత్‌ సమాజం, ప్రజాస్వామ్యం నకిలీలతో నిండిపోతుంది. 

Sakshi Guest Column On Andhra Pradesh Government employees
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!

ఏపీలో ప్రైవేటీకరణ అభిమాని చంద్రబాబు జాతీయ ప్రైవేటీకరణ అభిమాని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అన్ని ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటు ఏకస్వామ్య కంపెనీలకు అప్పజెప్పాలన్నది వారి ఆలోచన. ఇక్కడ రిజర్వేషన్లు అమలు కావు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ కూటమికి ఓటు వేయడమంటే, ప్రైవేటీకరణకు ఓటు వేయడమే. కానీ నిరుపేదలకు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మొదటి తరంలో చాలా ముఖ్యం. మన దేశ భవిష్య త్తుకు పునాది స్కూలు విద్యను పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి తెచ్చి, ప్రైవేట్‌ స్కూలు విద్యను రద్దు చెయ్యడంలో ఉంది. ఉద్యోగస్థులు మొత్తం సమాజ భవిష్యత్‌ గురించి ఆలోచించకుండా ప్రైవేటీకరణకు, మత తత్వానికి ఓటు వేస్తే ప్రజాస్వామ్యం కాదుకదా, మానవీయ విలువలు కూడా బతకవు.ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటీకరణ అభిమాని చంద్రబాబు నాయుడు జాతీయ ప్రైవేటీకరణ అభిమాని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. దేశంలోని మొత్తం కేంద్ర ప్రభుత్వ కంపెనీలను, అతి పెద్దదైన రైల్వేతో సహా ప్రైవేట్‌ ‘మోనోపలి’ (ఏకస్వామ్య) కంపెనీలకు అప్పజెప్పి ప్రభుత్వం కేవలం సూపర్‌వైజ్‌ చెయ్యాలనేది ఆరెస్సెస్‌/బీజేపీ సిద్ధాంతం. దేశంలో రిజర్వేషన్‌ వ్యవస్థను కూడా క్రమంగా రద్దు చెయ్యాలన్నది వారి సిద్ధాంతం. నరేంద్ర మోదీ ఓబీసీ పేరుతో ప్రధానమంత్రి అయ్యారు కనుక గత పదేండ్ల పాలనలో వాళ్ళు రిజర్వేషన్‌ పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ రిజర్వేషన్‌ వ్యతిరేక విధానం రిజర్వేషన్‌ ద్వారా కాక జనరల్‌ కోటాలో ఉద్యోగాలు తెచ్చుకున్న వారికి నచ్చ వచ్చు కూడా. కానీ విద్యా అసమాన వ్యవస్థ ఉండగా రిజర్వేషన్లు ఎత్తేస్తే దేశంలో అంతర్యుద్ధం జరుగుతుందని చాలామందికి అర్థం కాని విషయం. దేశంలోని ఉత్పత్తి కులాలు రిజర్వేషన్లు రద్దు చెయ్య డాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాయి.బీజేపీతో పొత్తుతో చంద్రబాబు అధికారంలోకి వస్తే మొట్ట మొదట ప్రైవేట్‌ స్టీల్‌ కంపెనీకి అప్పజెప్పే అతిపెద్ద స్టీల్‌ కంపెనీ ‘విశాఖ ఉక్కు’. ఆ తరువాత బీజేపీ తెలంగాణలోని బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్‌ వంటి అతిపెద్ద కంపెనీలను ప్రైవేట్‌ గుజరాతీ, ముంబై కంపెనీలకు అమ్మకానికి పెడుతుంది. బీజేపీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ చేతుల్లోని సంస్థల్లో దొడ్డిదారిన ఏ సెలక్షన్‌ కమిటీని ఫేస్‌ చెయ్యకుండా అధికారులను, యూనివర్సిటీ ప్రొఫెసర్లను సైతం నియమిస్తోంది.ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు బీజేపీకి ఓటు వేయడమంటే ప్రైవేటీకరణకు అనుకూలంగా ఓటు వేయడమే. చంద్ర బాబు 2014 నుండి 2019 వరకు చూపిన స్వతంత్రతను కూడా చూపలేడు. ఆయన పూర్తిగా బీజేపీ ఏమి చెబితే అది చెయ్యాల్సిందే. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు ఈ కూటమికి ఓటేస్తే ముందు ప్రైవేటీకరణ సమస్యను కొని తెచ్చుకుంటారు.బీజేపీ ప్రభుత్వ, ప్రైవేట్‌ సెక్టారు ఎంప్లాయిమెంట్‌ను అమెరికా మోడల్‌లోకి మార్చాలనే ఆలోచనతో ఉన్నట్లు వాళ్ళ ఆర్థికవేత్తల రచనలు చదివితే స్పష్టంగా అర్థమౌతుంది. ఆంధ్రప్రదేష్‌ సుదీర్ఘ తీర ప్రాంతం గల రాష్ట్రం. విశాఖ పోర్టు మాత్రమే కాక క్రమంగా ఇతర సీ–పోర్టులను అక్కడ అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని కొత్త పోర్టుల నిర్మాణం జరుగుతోంది. అయితే బీజేపీ ప్రభుత్వం వాటి నిర్మాణం మాత్రమే కాక వాటి మేనేజ్‌మెంట్‌ మొత్తాన్ని ప్రైవేట్‌ సెక్టా రుకు అప్పజెప్పే ఆలోచనలో ఉన్నది. ఈ పని ఇప్పటికే ఎయిర్‌పోర్టుల విషయంలో చేశారు. దేశంలోని పెద్ద, పెద్ద ఎయిర్‌పోర్టులన్నిటినీ ప్రైవేటు మేనేజ్‌మెంట్‌కు – అదీ పెద్ద పెద్ద మోనోపలి కంపెనీలకు అప్పజెప్పారు. ఇక్కడి ఉద్యోగాలన్నీ ప్రైవేట్‌ కంపెనీల చేతిలోనే ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగాలన్ని కాంట్రాక్ట్‌ ఉద్యోగాలే. అక్కడ పెద్ద ఉద్యోగాలన్నీ పెద్ద కంపెనీల బంధువులకు మాత్రమే వస్తాయి. యూపీఎస్సీ పరీక్షల్లో పోటీపడి ఎవరైనా ఉద్యోగం తెచ్చుకునేది అక్కడ ఉండదు. కమ్మ, రెడ్డి కులాలకు కూడా పెద్ద ఉద్యోగాలు రావు.ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకొని తీరాన్నంతా అభివృద్ధి చేసుకుంటే అది ముంబైకి మించిన నగరమయ్యే అవకాశ ముంది. కోల్‌కతా కూలిపోతున్న నగరం. ఇటు చెన్నై దేశపు చివరి మూలన ఉంది. దానికి ఇంకా అభివృద్ధి అవకాశం తక్కువ. ఇంగ్లిష్‌ విద్యలో ఆదివాసులు, దళితులు, బీసీలు, ఇతర బీద పిల్లలు చదువు కుంటే వైజాగ్‌ నగరాన్ని అత్యాధునిక నగరంగా మార్చే అవకాశం వారికొస్తుంది. ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్‌ విద్య నాణ్యంగా కొన సాగితే అడవుల్లోని ఆదివాసులు పక్షులుగా ఎదిగి విమానాలుగా మారుతారు. వారికి ఎంత పోడు భూమి ఇచ్చినా, ఎంత పంట సహాయం చేసినా ఒక్క తరంలో అడవి నుండి విశాఖ నగరంలోకి, అక్కడి నుండి అమెరికాకో, ఆస్ట్రేలియాకో పోలేరు. అయితే ఈ ఆదివాసులకు ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మొదటి తరంలో చాలా ముఖ్యం. ప్రైవేట్‌ సెక్టారు వీరికి అవకాశాలివ్వదు. వారిని ఉన్నత ఉద్యోగాల్లోకి రానివ్వదు. ఆంధ్రలో జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాణ్యమైన ఇంగ్లిష్‌ విద్య ఈ ఆదివాసుల్లో కొనసాగితే, 20–30 సంవత్సరాల్లో అమెరికాలో నల్లజాతీయులను మించిన మేధా వులు ఆదివాసుల నుండి వచ్చి విశాఖ పట్టణాన్ని ప్రపంచ నగరంగా మారుస్తారు. ఈ ఆదివాసుల నుండి ఎంతోమంది ఎలాన్‌ మస్క్‌లు వచ్చే అవకాశముంది. ఇటువంటి మార్పు భారతదేశపు గుజరాతీ క్యాపిటలిస్టులకు, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, ఆరెస్సెస్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. వీరికి ప్రభుత్వ ఉద్యోగులు ఓటువేసి గెలిపించే ప్రయత్నం చేస్తే వ్యవస్థనంతా గుజరాత్‌–ముంబై క్యాపిటలిస్టులకు అప్పజెప్పడమే.భారతదేశం అమెరికా కాదు, యూరప్‌ కాదు, ఆస్ట్రేలియా కాదు, కెనడా కాదు. ఇది 140 కోట్ల జనాభా కలిగిన చిన్న దేశం. దీన్ని చిన్న దేశం అని ఎందుకు అంటున్నానంటే భూపరిమాణంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, చైనాతో పోలిస్తే ఇది చాలా చిన్న భూమి కలిగిన దేశం. ఈ దేశ జనాభా ఇంకా ముందు, ముందు పెరుగుతుంది. ఆధునిక సైన్స్‌ను ఇంగ్లిష్‌ భాషతో ముడేసి గొప్ప, గొప్ప శాస్త్ర పరిశోధనల ద్వారానే మనం ఇంతమందికి తిండి, బట్ట, ఇల్లు ప్రపంచంలో తలెత్తుకుని బతికే ఆత్మ గౌరవాన్ని ఇవ్వగలం. అందుకు భావితరాలు – ముఖ్యంగా ఆదివాసులు, దళితులు, ఓబీసీలు – ఇంగ్లిష్‌లో చదువుకొని ప్రపంచ జ్ఞానాన్ని సాధించకుండా ఈ దేశానికి మనుగడ ఉండదు. మన దేశ భవిష్యత్తుకు పునాది స్కూలు విద్యను పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి తెచ్చి, ప్రైవేట్‌ స్కూలు విద్యను రద్దు చెయ్యడంలో ఉంది; అన్ని రకాల ఎంట్రన్స్‌లను, కోచింగ్‌లను రద్దు చేసి నేరుగా 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా, విద్యార్థి శ్రమ గౌరవ పనుల్లో పాల్గొన్న సర్టిఫికెట్ల ఆధారంగా ఉన్నత చదువులకు పోవడంలో ఉంది. అమెరికా, యూరప్‌ ఇదే చేస్తాయి. బీజేపీ, చంద్రబాబు ఇటువంటి విద్యకు పూర్తిగా వ్యతిరేకం. కనుక ఇప్పుడు ఉద్యోగాలు ఏ కులస్థులైనా మొత్తం సమాజ భవిష్యత్‌ గురించి ఆలో చించకుండా ప్రైవేటీకరణకు, కుల తత్వానికి, మత తత్వానికి, వర్గ తత్వానికి ఓటు వేసుకుంటే సమాజంలో తిరుగుబాటు మొదలైతే దేశం కుప్పకూలుతుంది.భారతదేశపు ప్రైవేట్‌ రంగం అమెరికాలో, యూరప్‌లో ఉన్నట్టు మానవతా విలువలతో ఏర్పడినది కాదు. గ్రామాల్లో రైతులను, కూలీలను దోచుకొని వారితో బడిలో, గుడిలో ప్రేమతో పెరిగిన మనుషులుగా కాక మేం కులానికి ఎక్కువ, మేం కంచం–మంచం పొత్తును అంగీకరించం అనే వారి చేతిలో పెరిగింది. ఈ దేశంలో అతిపెద్ద పెట్టుబడిదారులు కుష్ఠు రోగులకు, కుంటి వారికి, గుడ్డి వారికి ఒక ఆశ్రమం కట్టించి ఆదుకున్నట్టు చూశామా! అమెరికా తెల్లజాతి ధనవంతులు, నల్లజాతి స్త్రీలను తమ ఇంట్లో వంట మనిషిగా పెట్టుకొని వారి పిల్లలను చదివించి మేధావులను చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. నల్లవారికి ప్రత్యేక స్కూళ్ళు, కాలేజీలు పెట్టి ముందు చదివించింది తెల్లజాతి పెట్టుబడిదారులు. ఈ దేశంలో అతిపెద్ద పెట్టుబడిదారులు దళితుల కోసం, ఆదివాసుల కోసం ఒక్క స్కూలు కట్టి చదివించారా!అందుకే దిక్కులేని రోడ్డుమీద బతికే పిల్లల్ని దగ్గరకు తీసి ‘నిన్ను ఇంగ్లిష్‌ మీడియం బడిలో చదివిస్తాన’ని హామీ ఇచ్చిన వ్యక్తిని దింపేసి నారాయణ స్కూలును వెనుక ఉండి నడిపించే వ్యక్తికి ఓటు వేస్తే, ప్రజాస్వామ్యం కాదు గదా మానవ విలువలే బతకవు. అందరికంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేను చెప్పే ఈ మాట గురించి ఆలోచించండి.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

Google CEO Sundar Pichai Nears Billionaire Status
సాహో భారతీయుడా.. త్వరలోనే బిలియనీర్​గా సుందర్​ పిచాయ్​!

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ మరో అరుదైన ఘనతను సాధించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. చెన్నైలో రెండు గదుల ఇంటి నుంచి ప్రారంభమైన పిచాయ్‌ ప్రస్థానం 100 కోట్ల డాలర్ల సంపదతో బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ టాప్‌ టెన్‌ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకోనున్నారు. ఇదే విషయాన్ని బ్లూమ్‌ బెర్గ్‌ తెలిపింది.  ఇప్పటి వరకు టెక్నాలజీ కంపెనీ అధినేతలు మాత్రమే బ్లూమ్‌ బెర్గ్‌ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. కానీ తొలిసారి సాధారణ ఉద్యోగిలా గూగుల్‌లో చేరి తన అసాధారణమైన పనితీరుతో సీఈఓ స్థాయికి ఎదిగిన సుందర్ పిచాయ్ బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో చోటు దక్కించుకోనున్నారు.    గూగుల్‌లో ప్రొడక్ట్‌ మేనేజర్‌గాగూగుల్‌లో ప్రొడక్ట్‌ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించి సంస్థ అసాధారణమైన పనితీరుతో గూగుల్‌ యాజమాన్యం తనకు దాసోహమయ్యేలా చేసుకున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్స్​ను అందుబాటులోకి తెచ్చి ఔరా అనిపించుకున్నారు.సీఈఓ అనే సింహాసనం మీదఅందుకు ప్రతిఫలంగా సుందర్‌ పిచాయ్‌కు గూగుల్‌ యాజమాన్యం సీఈఓ అనే సింహాసనం మీద కూర్చోబెట్టింది. 2015లో గూగుల్‌లో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లైన ఎస్‌ అండ్‌ పీ 500, నాస్‌ డాక్‌లలో గూగుల్‌ షేర్లను పరుగులు పెట్టేలా చేశారు. అదే సమయంలో సుందర్‌ పిచాయ్‌కు గూగుల్‌ యాజమాన్యం అందించిన జీతాలు, ఇతర భత్యాలు, షేర్లు సైతం భారీ లాభాల్ని ఒడిసి పట్టుకున్నాయి. ఈ తొమ్మిదేళ్లలో సంస్థ విలువతో పాటు సుందర్‌ పిచాయ్‌ ఆదాయం భారీగా పెరిగింది.  త్వరలో  బిలీయనీర్పలు నివేదికల ప్రకారం.. గూగుల్‌తో పాటు గూగుల్‌ పేరెంట్ కంపెనీ ‘ఆల్ఫాబెట్' షేరు విలువ దాదాపు 400 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ప్రత్యేకించి గూగుల్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్‌‌ గత మూడు నెలల్లో అద్భుతంగా రాణించింది. దీనికి తోడు గూగుల్‌ ఏఐ టూల్స్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వెరసి ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యకాలానికి సంబంధించిన మొదటి త్రైమాసికంలో ఆల్ఫాబెట్ కంపెనీ అద్భుత ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ పరిణామాలన్నీ కలిసొచ్చి త్వరలోనే సుందర్ పిచాయ్ బిలీయనీర్ కాబోతున్నారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది.

prajwal revanna responds on hasan video controvercy First Time
Hasan Sex Scandal: తొలిసారి స్పందించిన ప్రజ్వల్‌ రేవణ్ణ

బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హసన్‌ సెక్స్‌ వీడియోల వివాదంపై ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ తొలిసారిగా స్పందించారు. లైంగిక వేధింపుల వీడియోలు బయటికిరాగానే ప్రజ్వల్‌ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి రేవణ్ణ తాజాగా సోషల్‌ మీడియాలో ఒక లేఖ పోస్టు చేశారు.సెక్స్‌ స్కాండల్‌ను దర్యాప్తు చేస్తున్న సిట్‌ ముందు వారం రోజుల్లో హాజరవుతానని తెలిపారు. నిజమే గెలుస్తుందన్నారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగియగానే మరుసటి రోజు ఏప్రిల్‌ 27న ప్రజ్వల్‌ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందే రేవణ్ణ సెక్స్‌ వీడియోలు హసన్‌ ప్రాంతంలో వైరల్‌ అయ్యాయి.ప్రజ్వల్‌ లోక్‌సభ ఎన్నికల్లో హసన్‌ నియోజకవర్గం నుంచి జేడీఎస్ పార్టీ తరపున బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆయనే హసన్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు. 2019 నుంచి 2022 వరకు హసన్‌, బెంగళూరుల్లోని ప్రజ్వల్‌ రేవణ్ణ ఇళ్లలో పలువురు మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తుండగా వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలున్న పెన్‌డ్రైవ్‌ బయటికి రావడంతో సెక్స్‌ స్కాండల్‌ వెలుగులోకి వచ్చింది. 

KSR Comment On Why BJP Distanced From TDP Jana Sena Manifesto
బీజేపీని డిఫెన్స్‌లో పడేసిన సీఎం జగన్‌!

మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం కూటమిని ముందుగానే క్లీన్ బౌల్ చేసేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు బీజేపీతో కలిసి అట్టహాసంగా విడుదల చేయాలని అనుకున్న మేనిఫెస్టో విడుదల తుస్సు మంది. దానికి కారణం భారతీయ జనతా పార్టీ ఆ మానిఫెస్టోని ముట్టుకోవడానికి ఇష్టపడక పోవడమే. ఇది జగన్ కొట్టిన దెబ్బే కదా!ఆయన గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో 2014 శాసనసభ ఎన్నికల సమయంలో ఈ మూడు పార్టీలు కలిసి విడుదల చేసిన మేనిఫెస్టో గురించి, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, ప్రధాని మోదీల ఫోటోలతో కూడిన కరపత్రాన్ని ప్రజలకు చూపుతూ అందులో ఇచ్చిన  వాగ్దానాల అమలు తీరు గురించి ప్రశ్నిస్తున్నారు. ప్రజలలో ఇది విస్తృతంగా చర్చనీయాంశం అయింది. అప్పుడు హామీలు అమలు చేయకుండా మోసం చేసిన ఈ ముగ్గురు మళ్లీ జనం ముందుకు వస్తున్నారని అంటూ అందులో ఉన్న అంశాలను చదివి వినిపించి ప్రజలతో సమాధానాలు ఇప్పిస్తున్నారు. అది ఈ మూడు  పార్టీలకు బాగా డ్యామేజీగా మారింది. వాటిలో ఒక్కదానికి కూడా చంద్రబాబు నాయుడు సమధానం ఇవ్వలేకపోతున్నారు. అంతేకాక తన సభలలోకాని, తన ఎన్నికల ప్రణాళిక విడుదలలో కాని జగన్ ఒక మాట చెబుతున్నారు.2019లో తాను ఇచ్చిన మానిఫెస్టోని, అమలు ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజలకు ఇస్తూ, 2024లో తాను చేయబోయే కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు.  పాతవాటిని కొనసాగిస్తూ,కొత్తవి పెద్దగా ఇవ్వకుండా  చాలా జాగ్రత్తగా మేనిఫెస్టోని రూపొందించి దానికి అయ్యే వ్యయాన్ని వివరిస్తున్నారు. అలాగే చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పేరుతో ప్రచారం చేసిన వాగ్దానాలకు అయ్యే ఖర్చును లెక్కేసి చెబుతున్నారు. వాటి ప్రకారం చూస్తే చంద్రబాబుది పూర్తిగా ఆచరణసాధ్యం కాని మేనిఫెస్టో అని తేలిపోతుంది. ఈ పరిస్థితిలోనే తమ పరువు చంద్రబాబు చేతిలో మరింతగా  పోగొట్టుకోవడం ఇష్టం లేక ప్రధాని మోదీ వంటి బీజేపీ నేతలు తమ పేర్లు టీడీపీ మేనిఫెస్టోలో పెట్టవద్దని చెప్పారట.  బీజేపీ పెద్దలు  ఈ మేనిఫెస్టోకి దూరం అయితే, పవన్ కల్యాణ్ పెద్దగా చదువుకోలేదు. కాబట్టి చంద్రబాబు ఏమి చెబితే దానికి ఊగొట్టే స్థితిలో ఉన్నారు.  చంద్రబాబు తన పాత మేనిఫెస్టో ఊసుకాని, జగన్ అమలు చేసిన మేనిఫెస్టో సంగతులు కాని చెప్పకుండా ఆకాశమే హద్దుగా కొత్త హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తన సభలలో మళ్లీ ఈ ముగ్గురూ  చంద్రబాబు, పవన్,మోదీ మళ్ళీ జనాన్ని మోసం చేయడానికి వస్తున్నారని,  ఇంటింటికి బెంజ్ కారు ఇస్తామంటున్నారని, కిలో బంగారం ఇస్తామని చెబుతున్నారని నమ్ముతారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇది బాగా క్యాచీ డైలాగుగా మారడంతో బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారింది.చంద్రబాబు ఇచ్చే తప్పుడు  వాగ్దానాలకు తాము కూడా బాధ్యులవుతున్నామని, ఏ రాష్ట్రంలో లేని  విధంగా ఏపీలో చంద్రబాబు వల్ల అప్రతిష్టపాలు అవుతున్నామని అనుకున్నారేమో  కాని, కనీసం మోదీ , జేపీ నడ్డా, అమిత్ షా ,దగ్గుబాటి పురందేశ్వరి వంటి ఏ ఒక్క నేత ఫోటో మానిఫెస్టో పై వేయలేదు. టీడీపీ,జనసేనల రెండు  పార్టీల మేనిఫెస్టోగానే ప్రకటించవలసి వచ్చింది. కాకపోతే బతిమలాడి బీజేపీ ఇన్ చార్జీ సిద్దార్ద్  నాధ్ సింగ్ ను తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆయనేమో మేనిఫెస్టో కాపీ పట్టుకోకుండా తిరస్కరించారు. పురందేశ్వరిని ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా బీజేపీ నిలువరించినట్లుగా ఉంది.లేకుంటే ఇంత ముఖ్యమైన  కార్యక్రమానికి రాకుండా ఉంటారా?  దీంతో మొత్తం ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన సందర్భం కాస్తా తుస్సు అంది.  ఇదంతా జగన్ ఎఫెక్ట్ అన్న అభిప్రాయం కలుగుతుంది.చంద్రబాబు ఇచ్చిన హామీల విలువ సుమారు 1.65 లక్షల కోట్ల విలువ అని ఒక అంచనా. అదే జగన్ ఇచ్చిన హామీల వ్యయం రూ. 70 వేల కోట్లు. ఇంతకాలం జగన్ బటన్ నొక్కుడుతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ లు ఇప్పుడు యు టర్న్ తీసుకుని ఇంకా తాము ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు. అప్పట్లో జగన్ పై అడ్డగోలుగా రాసిన రామోజీ,రాధాకృష్ణలు, ప్రస్తుతం చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై విశ్లేషించడానికే భయపడుతున్నారు. ఇంత మొత్తం డబ్బు ఎక్కడనుంచి వస్తుందని అడిగితే చంద్రబాబు కు ఇబ్బందిగా ఉంటుందని  భావించి వారు దానికి జోలికి పోవడం లేదు.  కానీ పేజీల కొద్ది ఆ వాగ్దానాలను పరిచి తాము టీడీపీ పక్కా ఏజెంట్లమని ప్రజలకు మరోసారి తెలియచేశారు.తెలంగాణ, కర్నాటక కాంగ్రెస్ మేనిఫెస్టోలతో పాటు ఏపీలో జగన్ అమలు చేస్తున్న స్కీముల్ని కాపీ కొట్టి కొంత అదనంగా ఇస్తామని చంద్రబాబు  చెప్పారు.  కర్నాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తాము ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయలేక సతమతం అవుతున్నాయి. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు చేసినా..  దానివల్ల ఆర్టీసీకి పెద్ద నష్టమే వస్తోంది. దానిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఎంత శ్రద్ద చూపుతుందన్నది అనుమానమే. ఈ పరిస్థితిలో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కూడా కష్టమే అవుతుంది.చంద్రబాబు ఇచ్చిన కొన్ని హామీలను చూద్దాం. వాటికి అయ్యే వ్యయం ఎంతో లెక్కగడదాం.ఉదాహరణకు ఏపీలో 19-59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకు 1,500 రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో రెండున్నర  కోట్ల మంది మహిళలు ఉన్నారనుకుంటే.. అందులో కోటి మంది 19 ఏళ్లలోపు వారు, 59 ఏళ్ల పైబడిన వారిని తీసివేస్తే దాదాపు కోటిన్నర మందికి ఈ  స్కీం అమలు చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెలకు రూ.2,250 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. అంటే ఏడాదికి 27వేల కోట్ల రూపాయల ఖర్చు అన్నమాట.నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయల చొప్పున ఇస్తామన్నారు. వారి సంఖ్య ఎంతో చెప్పలేదు. పోని ఆయన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నారు కనుక,ఆ సంఖ్యనే ఆధారంగా తీసుకుంటే నెలకు రూ.600 కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది. అంటే ఏడాదికి రూ. 7,200 కోట్లు అన్నమాట.రైతులకు రైతు భరోసా కింద జగన్ ప్రభుత్వం 13 వేల  రూపాయలు ఇస్తోంది. దానిని 16 వేలు చేశారు. కాని చంద్రబాబు ఏకంగా ఇరవైవేలు ఇస్తామని అంటున్నారు.  ఆ ప్రకారం ఏడాదికి రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయి. పోనీ ఇందులో సగం కేంద్రం వాటా అనుకున్నా, ఐదువేల కోట్ల రూపాయలు రాష్ట్రం ఖర్చు పెట్టాలి.అమ్మ ఒడి కింద ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున జగన్ ప్రభుత్వం ఇస్తోంది. దానిని 17వేలకు పెంచుతామని జగన్ తెలిపారు. చంద్రబాబు గతంలో తన ప్రభుత్వంలో ఈ స్కీమును  అమలు చేయకపోయినా, ఇప్పుడు ఇంటిలో ఎందరు పిల్లలు ఉంటే అందరికి 15వేల రూపాయలు ఇస్తానంటున్నారు. ఇద్దరు పిల్లలనే లెక్కవేసుకుంటే పదిహేనువేల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది.వృద్దాప్య పెన్షన్ లను నెలకు నాలుగువేలు చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాలకు ఈ స్కీం అర్హతకు వయోపరిమితిని 50 ఏళ్లకు తగ్గిస్తామని టీడీపీ  చెబుతోంది. ప్రస్తుతం ఉన్న 65లక్షల మంది పేదలకు వీరు తోడవుతారు. దీని ప్రకారం నెలకు రూ.2,600 కోట్లు వ్యయం అవుతుంది.అంటే సంవత్సరానికి రూ.31 వేల కోట్లు అన్నమాట.ల్యాండ్‌ టైటిలింగ్ చట్టంపై మళ్లీ అబద్దాలు ఆడారు. ఇది కేంద్ర ప్రతిపాదిత చట్టం అని పలువురు చెబుతున్నా వినకుండా చంద్రబాబు ఇదే ప్రచారం చేస్తున్నారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంత పాడుతున్నాయి. గతంలో పురందేశ్వరి  పొత్తు రాకముందు, టీడీపీ ఈ చట్టంపై చేస్తున్నది దుష్ప్రచారం అని స్పష్టంగా చెప్పారు. నిజంగానే  జగన్ ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఈ చట్టం తెచ్చి ఉంటే,  కేంద్రానికి లేఖ రాసి వివరణ కోరవచ్చు కదా!. ఏ ప్రభుత్వం అయినా ప్రజల ఆస్తులను  లాక్కోవడానికి చట్టాలు చేస్తుందా? ఈ చట్టం ద్వారా ప్రజలకు  మరింత సదుపాయం కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం అన్ని రాష్రాల కోసం  దీనిని ప్రతిపాదిస్తే, అంతతటిని జగన్ కు ఆపాదించి, నానా చెత్త ప్రచారం చేస్తున్నారు. దమ్ముంటే మోదీ ఉఏపీలో ఆస్తులను లాక్కోవడానికి ఈ చట్టం తెచ్చారని చంద్రబాబు అనాలి. ఒకప్పుడు తాను గొప్ప సంస్కరణవాదినని ప్రచారం చేసుకున్న  చంద్రబాబు నిజ స్వరూపం ఇది . కేంద్రాన్ని దీనిపై అడగకపోతేమానే.. సిద్దార్ద్ సింగ్ ,పురందేశ్వరిలలో ఎవరో ఒకరితో ఈ చట్టం గురించి మాట్లాడించి ఉండవచ్చు కదా! ఆయన అదేమీ చేయలేదంటే దాని అర్దం బీజేపీ ఇలాంటి పిచ్చి ఆరోపణలను పట్టించుకోదనే కదా! ఏదో మొక్కుబడికి  సిద్దార్ద్ నాద్ సింగ్ కూటమి మేనిఫెస్టోకి మద్దతు అని చెప్పారు. అది నిజమే అయితే ఎందుకు మోదీ ఫొటో ఈసారి వేయవద్దని ఎందుకు  చెప్పారో వివరణ ఇవ్వాలి కదా!చంద్రబాబు చేసిన అన్ని హామీలను అమలు చేస్తే అసాధ్యం కనుకే, మరోసారి నవ్వుల పాలు కాకుండా ఉండడానికి మోదీ తన ఫొటో ప్రచురించడానికి ఇష్టపడలేదని అనుకోవాలి. అందుకే జగన్ తన స్పీచ్ లలో ఢిల్లీ పెద్దలు, బీజేపీ వారు కూడా చంద్రబాబును నమ్మడం లేదని తేల్చేశారు. బీజేపీతో కలిశాం కనుక ప్రత్యేక హోదా,విభజన హామీలు, తెలంగాణ నుంచి రావల్సిన బకాయిలు, ఆస్తుల విభజన సాధిస్తామని ఒక్క మాట చెప్పకుండా ఎన్నికల ప్రణాళికను పూర్తి చేశారు. అంటే వాటి ఊసే టీడీపీ ఎత్తొద్దని బీజేపీ కండిషన్ పెట్టినట్లే కదా! ఏ రకంగా చూసినా, ఇది ప్రజల మేనిఫెస్టో కాదు. కేవలం అధికారం కోసం చంద్రబాబు ఆడే రాజకీయ నాటకపు మోసఫెస్టో తప్ప ఇంకొకటి కాదని ఘంటాపధంగా చెప్పవచ్చు. చంద్రబాబు మేనిఫెస్టోని ఏపీ మేలు కోరుకునేవారు ఎవరూ అంగీకరించకూడదు కూడా.విద్య రంగంలో అమలు లో ఉన్న సిలబస్ ను రివ్యూ చేస్తారట. అంటే దాని అర్ధం ఇప్పుడు ఉన్న ఇంగ్లీష్ మీడియం ను రద్దు చేస్తామని చెప్పడమా?. అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఇస్తున్న ఐబీ సిలబస్ ను ఎత్తివేస్తారా?. విద్యార్ధులకు టాబ్ లు వంటి వాటిని ఇవ్వడం ఆపివేస్తారా? మళ్లీ ప్రైవేటు స్కూళ్లకే పేదలు వెళ్లాల్సిన పరిస్థితి క్రియేట్ చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారా? .. .. ముస్లిం రిజర్వేషన్ లను కొనసాగిస్తారా?లేదా? బీజేపీ స్పష్టంగా రిజర్వేషన్ లు రద్దు చేస్తామని చెబుతుంటే.. దానిని చంద్రబాబు గట్టిగా ఖండించలేక పోతున్నారు. NDA కూటమి ఎజెండాలో ఇది ముఖ్యమైనదిగా ఉంది. దానిపై బీజేపీవాళ్లతో ఎందుకు మాట్లాడించడం లేదు.పోనీ తాను బీజేపీని ఎదిరించి రిజర్వేషన్ లను కొనసాగిస్తానని కూడా ప్రణాళికలో హామీ ఇవ్వలేదు.177 రకాల హామీలు ఇవ్వడం ద్వారా అన్ని వర్గాల వారి ఆదరణ చూరగొనాలన్నది చంద్రబాబు ఆలోచన. కాని అన్ని వర్గాల వారు టీడీపీ మేనిఫెస్టోని చూస్తే, పూర్తిగా వ్యతిరేకిస్తారు.  ఇంతకాలం ఈ పాయింట్ మీద జగన్‌ను వ్యతిరేకించేవారు.. ఇప్పుడు జగనే బెటర్ అనే పొజిషన్‌కు చంద్రబాబు తీసుకొచ్చారు.ఇలా.. కూటమి మేనిఫెస్టో వాగ్దానాలను గమనిస్తే, ఆకాశమే హద్దుగా చంద్రబాబు ఇచ్చేశారు. వీటిని అమలు చేయడానికి రెండు,మూడు రాష్ట్రాల బడ్జెట్ లు కూడా సరిపోవు. అంటే ఈ స్కీములను ఎగవేయడం తప్ప మరో దారి ఉండదు. లేదంటే ఈ స్కీము లబ్దిదారులలో జాబితాలో కోత పెట్టి వ్యయం అంచనాను బాగా తగ్గించుకోవాలి.దీనిపై లబ్దిదారులంతా మండిపడతారు. ఏ రకంగా చూసినా చంద్రబాబు మోసం చేసినట్లే అవుతుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

AP Politics: Babu Dirty Politics PCC Sharmila Audio Clip Viral
ఆడియోతో అడ్డంగా దొరికిపోయిన షర్మిల

అల్లూరి,సాక్షి: వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే విపక్షాల కుట్రగా కనిపిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్‌లో ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిల కూడా ఈ చీఫ్‌ ట్రిక్స్‌లో భాగం అయ్యారు. తాజాగా ఆమె ఆడియో క్లిప్‌ బయటకు రావడంతో  ఆ కుట్ర బయటకు వచ్చింది.అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున బుల్లిబాబు పోటీ చేస్తున్నాడు. అయితే ఈయన అభ్యర్థిత్వం కంటే ముందు ఇక్కడ రేసులో ఉంది వంతల సుబ్బారావు. బుల్లిబాబు వైఎస్సార్‌సీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరారు. చేరి చేరగానే బుల్లిబాబునే పాడేరు అభ్యర్థిగా షర్మిల ప్రకటించారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న సుబ్బారావు కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీలకే కాకుండా.. ఓటు బ్యాంకు ఏనాడో కనుమరుగైన కాంగ్రెస్‌లోనూ రెబల్స్‌ పోటు ఆసక్తికర చర్చకు దారి తీసింది. దీంతో వంతల సుబ్బారావుతో రాయబారానికి దిగారు.  మీరు సొంత అన్నమాదిరి అని, అర్థం చేసుకోవాలని, తర్వాతిసారి చూద్దాం అంటూ బతిమాలాడారామె. అయితే.. ఏనాడూ జెండా మోయనోడికి టికెట్‌ ఇవ్వడం తనను బాధించిందని, పైగా తనతో మాట కూడా చెప్పకుండా వేల మంది ముందు బుల్లిబాబును అభ్యర్థిగా ప్రకటించడం తనను నిరాశ పర్చిందని షర్మిలతో ఆయన అన్నారు.కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుతో పాటు వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు కలిసి వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు షర్మిల వంతల సుబ్బారావుకు స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే కాంగ్రెస్‌ గురించి మరిచిపోవాలంటూ బెదిరింపు స్వరంతో కోరారామె. చివర్లో.. కాంగ్రెస్‌కు డ్యామేజ్‌ చేయొద్దంటూ షర్మిల కోరగా.. తన భవిష్యత్తు ఆల్రెడీ డ్యామేజ్‌ అయ్యిందని ఆయన బదులిచ్చారు.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement


ఫోటో స్టోరీస్

View all