Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM YS Jagan Election Campaign Schedule At Repalle
నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6న(సోమవారం) మూడు నియోజకవ­ర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని రేపల్లెలో ఉన్న డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని మాచర్లలో ఉన్న శ్రీనివాస్‌ మహల్‌ సెంటర్‌లో జరిగే సభకు సీఎం హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.  

‘ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంతో మీ భూమికి భద్రత’  అంటూ రామోజీరావు(రారా)కు చెందిన ఈటీవీ అన్నదాత ప్రసారం చేసిన కార్యక్రమం
మాయం నారా మేనిఫెస్టో.. రారా టీవీ వీడియో ‘మాయ’గాళ్లు

సాక్షి, అమరావతి: ఒకరు నారా... మరొకరు రారా (రామోజీరావు)! ఒకరికి 75... మరొకరికి 87. ఇద్దరికీ ఏళ్లు వచ్చినా బుద్ధి మాత్రం రాలేదు! ముందొక మాట చెప్పి.. ఆ వెంటనే నాలుక మడత పెట్టడంలో ఇద్దరూ ఆరితేరిపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా... మళ్లీ ఎన్నికలొచ్చేసరికి కొత్త వాగ్దానాలు, రంగురంగుల మేనిఫెస్టోతో తయారైపోవటం చంద్రబాబు సహజ లక్షణం. 2014లో వందల హామీలిచ్చేసిన బాబు... ఎన్నికల్లో గెలిచిన వెంటనే వాటిని నెరవేర్చటం తన తరం కాదని తెలిసి ఏకంగా మేనిఫెస్టోనే కనపడకుండా చేసేశారు. ఆఖరికి తన పార్టీ వెబ్‌సైట్లో నుంచి కూడా తీసేశారు. రామోజీరావూ సేమ్‌ టూ సేమ్‌! కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రామోజీ గతంలో బాగా ప్రశంసించారు. దీన్లో ఉన్న అంశాలను వివరిస్తూ... ఈ చట్టంతో రైతుల భూమికి భద్రత ఉంటుందని, ఎక్కడైనా ఇబ్బందులొస్తే ప్రభుత్వమే వారికి పరిహారమిచ్చేలా గ్యారంటీ ఇస్తుంది కనుక ఇది చాలా మంచి చట్టమంటూ తన ఈటీవీ ‘అన్నదాత’ కార్యక్రమంలో ఓ స్టోరీని ప్రసారం చేశారు. ఇపుడు ఎన్నికల వేళ సీఎం జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేక... ఇంకా అమల్లోకే రాని ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం వచ్చేసిందంటూ, ప్రభుత్వం అందరి భూములూ లాక్కుంటోందంటూ టీడీపీ విష ప్రచారం మొదలెట్టింది. టీడీపీ కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన ‘ఈనాడు’ శక్తి మేరకు విషం చిమ్ముతోంది. ఈ చట్టం వస్తే ‘మీ భూములు మీవి కావు’ అంటూ విషపూరిత కథనాలు ప్రచురిస్తోంది. ఇక చంద్రబాబు, లోకేశ్‌ అయితే ‘మీ భూములు జగన్‌ ప్రభుత్వం లాక్కుంటుంది జాగ్రత్త..!’ అంటూ ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఈటీవీ’ గతంలో ప్రసారం చేసిన కథనాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు ఆదివారం బయటపెట్టారు. వీడియో లింక్‌ను అందరికీ షేర్‌ చేశారు. దీంతో తన బండారం బయటపడి పోయిందని గ్రహించిన రామోజీరావు.. క్షణాల్లో ఆ వీడియోను యూట్యూబ్‌ నుంచి డిలీట్‌ చేయించారు. ఇపుడు ఆ లింకుపై క్లిక్‌ చేసిన వారికి... ‘దిసీజ్‌ ప్రైవేట్‌ వీడియో’ అనే మెసేజ్‌ కనిపిస్తోంది. ఇది చూసినవారు బాబు, రామోజీ ఇద్దరూ ఇద్దరే అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీని పబ్లిక్‌గా ప్రసారం చేస్తున్నపుడు దాన్లోని వీడియోలు ప్రైవేట్‌వి ఎలా అవుతాయి? ఈ ప్రశ్నకు రామోజీ దగ్గర సమాధానం లేదు.  గుడ్డలిప్పిన గురుశిష్యులు! కొద్దిరోజులుగా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గురించి అడ్డూ అదుపూ లేకుండా విషం చిమ్ముతున్న ఎల్లో మీడియా, చంద్రబాబు పరివారం బట్టలు విప్పుకుని బరి తెగించి చెబుతున్న మాయమాటలు కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పన్నిన మాయోపాయాలేనని తేలిపోయింది. భూ హక్కు చట్టంపై చెబుతున్న బూటకపు కబుర్లన్నీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే కారు కూతలేనని బయటపడింది. ఈ చట్టం చాలా మంచిదని, రాష్ట్రంలోని రైతులకు ఎంతో మేలు చేస్తుందంటూ స్వయంగా రామోజీ మీడియానే గతంలో అనేక కథనాలు అచ్చేసింది. ఈటీవీలోనూ పలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయగా, చట్టం అద్భుతమని కితాబిస్తూ ఈనాడులోనూ కథనాలు రాశారు. రాష్ట్రంలో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గురించి ఈటీవీ అన్నదాతలో నాలుగు నెలల క్రితం ‘టైటిల్‌ గ్యారంటీ చట్టంతో మీ భూమికి భద్రత’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయడం గమనార్హం. ప్రముఖ భూ చట్టాల నిపుణుడు, హైదరాబాద్‌లోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఎం.సునీల్‌కుమార్‌ ఈ చట్టం వస్తే రాష్ట్రంలోని భూముల వ్యవస్థ ఎంతగా మారిపోతుందో చాలా కూలంకషంగా వివరించారు.   చంద్రబాబు కోసం హఠాత్తుగా యూటర్న్‌ రామోజీ గతంలో తాను ఈ చట్టానికి అనుకూలంగా ప్రసారం చేసిన వీడియోకి విరుద్ధంగా ఎన్నికల్లో చంద్రబాబు లబ్ధి కోసం తాజాగా యూటర్న్‌ తీసుకున్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టానికి వ్యతిరేకంగా బురద జల్లే బాధ్యత తనపై వేసుకున్నారు. ఈ చట్టం ద్వారా రైతుల భూములకు భద్రత ఉంటుందని చెప్పిన నోటితోనే అది దుర్మార్గమంటూ నిస్సిగ్గుగా నాలుక మడతేశారు. రైతుల భూములు తెల్లారేసరికల్లా ఇతరుల పేరు మీదకు మారిపోతాయని, సీఎం జగన్‌ ప్రజల స్థిరాస్తులు లాక్కునేందుకే ఈ చట్టం తెచ్చారంటూ బరితెగించి దుష్ప్రచారానికి తెగబడ్డారు. ఈ అడ్డగోలు ప్రచారంతో ప్రజల మెదళ్లను విషపూరితం చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం చాలా మంచిదంటూ ఈటీవీ ప్రసారం చేసిన వీడియో తాజాగా వైరల్‌ కావడంతో పచ్చ మంద నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. అందులో ఈ చట్టాన్ని సమర్థిస్తూ ఇది రాష్ట్రానికి అవసరమని, ఎంతో ప్రయోజనకరమని చెప్పిన అంశాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. భూ హక్కుల చట్టం గురించి అంత గొప్పగా చెప్పి అది వస్తే భూములకు భరోసా వస్తుందని కితాబిచ్చిన రామోజీ ఇప్పుడు సిగ్గు విడిచి భూములు పోతాయని కల్లబొల్లి మాటలు చెప్పడం ఏమిటని అంతా విస్తుపోతున్నారు. చంద్రబాబు హయాంలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించి వదిలేసిన భూదార్‌ ప్రాజెక్టుకు ఈ చట్టం కొనసాగింపు అంటూ అదే కథనంలో ఈటీవీ కార్యక్రమంలో ప్రసారం చేశారు. అది అబద్ధమే అయినా సీఎం జగన్‌ హయాం­లో వచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గురించి చెప్పే క్రమంలో చంద్రబాబు చేయలేక వదిలేసిన భూదార్‌ గురించి ప్రస్తావించారు. ఈ ప్రత్యేక కథనంలో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గొప్పదనం, దాని ఆవశ్యకత, రైతులకు చేకూరే  ప్రయోజనాలు, భూముల వ్యవస్థలో వచ్చే మార్పుల గురించి సోదాహరణంగా వివరించారు. ఎంతో మంచి చట్టమని కితాబిచ్చిన రామోజీ ఎన్నికల వేళ ఈ స్థాయికి దిగజారడంపై ప్రజ­ల్లో విస్మయం వ్యక్తమవుతోంది. దీనిబట్టి ఈనాడు, ఈటీవీ కార్యక్రమాలన్నీ ప్రజలను మభ్యపుచ్చడం, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమేనని మరోసారి స్పష్టమైందని పేర్కొంటున్నారు.   ఆదరాబాదరాగా అదృశ్యం.. ఈ వీడియోతో తమ పరువు బజారున పడిందని గ్రహించడంతో నాలుక కరుచుకున్న రామోజీ ఆదరబాదరగా యూట్యూబ్‌లోని ఈటీవీ ఛానల్‌లో దాన్ని ఎవరూ చూడకుండా చేశారు. 2014 ఎన్నికల్లోనూ ప్రజలను మాయ చేసేందుకు చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చి మేనిఫెస్టో విడుదల చేశాడు. అనంతరం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయాలని ప్రజలు కోరుతుండడంతో వాటి గురించి ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించి తన దొంగ బుద్ధిని చాటుకున్నారు. ఇప్పుడు రామోజీ కూడా ఎంతో మంచిదని తాను ప్రసారం చేసిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం వీడియోను ఈటీవీ యూట్యూబ్‌ ఛానల్‌లో కనపడకుండా మాయం చేశారు. తద్వారా రామోజీ, చంద్రబాబు ప్రజా ప్రయోజనాలు పట్టని గురు శిష్యులని మరోసారి స్పష్టంగా రుజువైంది. కాగా 2019లో ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం బిల్లుకు అసెంబ్లీలో టీడీపీ మద్దతివ్వడం గమనార్హం. ఈ చట్టంతో భూ కబ్జాలకు తెర పడుతుందన్న టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ పూర్తిగా సమర్థిస్తోందంటూ బిల్లుకు మద్దతు పలికారు. ఇప్పుడు ఎన్నికల ప్రయోజనాల కోసం ‘యూటర్న్‌’ తీసుకుని మీ భూములు లాక్కుంటారంటూ ప్రతి సభలోనూ చంద్రబాబు పెడబొబ్బలు పెడుతుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అసలు అమల్లోకి రాని చట్టంపై ఇంత దుష్ప్రచారమెందుకని నిపుణులు ప్రశి్నస్తున్నారు.   ఈటీవీలో ఏం చెప్పారంటే.. భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్‌ గ్యారంటీ చట్టం భవిష్యత్తులో రాబోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది. మీకు భూమి ఉంటే అది పట్టాదార్‌ పాస్‌ పుస్తకంలోగానీ ఆన్‌లైన్‌ రికార్డులోగానీ నమోదై ఉంటుంది. ప్రస్తుత విధానంలో భూములున్నా సరైన పాస్‌ పుస్తకాలు, ఇతర హక్కు పత్రాలు లేక రికార్డుల్లో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఒక్కోసారి ఇబ్బందులు పడుతున్నారు. కొత్త చట్టాన్ని అనుసరించి భూ యజమానులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టైటిల్‌ రిజిష్టర్‌లో ఎవరి పేరు ఉంటే ఆ వ్యక్తినే భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది.  

Sakshi Guest Column On AP CM YS Jagan
జగన్‌ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...

పేదరికం అత్యంత బాధాక రమైనది. ప్రపంచంలో అత్యధి కులు పేదవారే. వారిని పేద రికం నుండి బయట పడేయ గలదీ, అభివృద్ధి వైపు నడప గలిగేదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే. దీనిని అర్థం చేసుకొన్నారు కాబట్టే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. ప్రజల విశ్వసనీయతను చూరగొన్నారు. ఇప్పుడు మరోమారు ప్రజా సేవ చేయడానికి అవకాశం ఇవ్వమని ఎన్నికల బరిలో దిగారు. పలు పబ్లిక్‌ మీటింగులూ, సుదీర్ఘ రాజకీయ యాత్రలతో విజయం వైపు నడుస్తున్నారు.ఇక ప్రతిపక్ష కూటమి నాయకుడు చంద్రబాబు మాత్రం అభద్రతా భావంతో ఎన్నికల్లో నానా తిప్పలు పడుతున్నారు. చెప్పుకోవడానికి ప్రజలకు తాను చేసింది ఏమీ లేదు కాబట్టి జగన్‌ ప్రభుత్వంపై దుష్ప్ర చారాలు చేస్తున్నారు. ఆయనకు ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు. జనసేన – బీజేపీ నాయకులూ, ఆ యా పార్టీల పరిస్థితీ కూడా ఇదే. అందుకే, టీడీపీ 2024 ఎన్నికల్లో ఘోరంగా మరలా ఓడిపోవడం తథ్యం. పెన్షనర్లలో 90 శాతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ఆర్థిక లాభాలు పొందుతున్న 40–60 ఏళ్ల వయస్సు స్త్రీలలో 90 శాతం, డ్వాక్రా మహిళల్లో 80 శాతం, మొత్తంగా స్త్రీలలో 90 శాతం వైఎస్సార్‌సీపీకే ఓటు వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎస్సీ, ఎస్టీలు, క్రిస్టియన్‌లు, ముస్లింలు, రెడ్లు, బ్రాహ్మణులు, అత్యధిక మంది బీసీలు వైఎస్సార్‌సీపీకే ఓట్లు వేసే పరిస్థితి ఉంది. కొంతమంది మధ్యతరగతి అర్బన్‌ ఓటర్లు మాత్రమే టీడీపీ కూటమికి ఓట్లు వేస్తారని అంటున్నారు. కాంగ్రెస్‌కు గతం కంటే అర శాతం మాత్రమే ఓట్లు పెరగవవచ్చు.అయోధ్యలో గుడి నిర్మాణం, కొన్ని జాతీయ రహదారులను నిర్మించడం తప్ప బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఏపీకి సంబంధించి... ఏపీకి స్పెషల్‌ స్టేటస్, రాయలసీమ – ఉత్తరాంధ్రకు ప్యాకేజీ, పోల వరానికి  ని«ధులు వంటి అనేక వాగ్దానాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నెరవేర్చలేదు. ఇదీ బీజేపీ క్రెడిబిలిటీ!జVýæన్‌ మాత్రం పేదల ముఖ్య అవసరాల్ని తీరుస్తూ, అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని కూడా చేపడుతున్నారు. పేదల కొనుగోలు శక్తిని కోవిడ్‌ లాంటి క్లిష్ట సమయాల్లో కూడా పెంచగలిగారు. అందుకే 2019లో 12 శాతం ఉన్న పేదరికం 2024 నాటికి దాదాపు 4 శాతానికి తగ్గిపోయింది. జీఎస్టీ చెల్లింపుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచారు జగన్‌. జగన్‌ ప్రభుత్వం పేదలకు డీబీటీ కింద రూ. 2,70,000 కోట్లను, నాన్‌–డీబీటీ కింద ఇండ్లు, స్థలాలు వంటి రూపాల్లో రూ. 1,00,000 కోట్లకు పైగా ఇచ్చారు. మొత్తంగా నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది జగన్‌ ప్రభుత్వం. అంతేగాక పాలనా వ్యవస్థలో, సంక్షేమ సేవల్లో, అభివృద్ధిలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిచేట్లు చేశారు వైఎస్‌ జగన్‌. ముఖ్యంగా గ్రామ/వార్డు సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ, ఆరోగ్య శ్రీకి రూ. 25 లక్షల వరకూ ప్రభుత్వ సాయాన్ని పెంచడం, వృద్ధాప్య పింఛన్‌ను రూ. 3 వేల వరకు పెంచడం, స్త్రీ సాధికారత కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడం; రాజకీయాల్లోనూ, ప్రభుత్వ నామినేటెడ్‌ పోస్టుల్లోనూ... మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం; వలంటీర్‌ వ్యవస్థ, రైతుభరోసా, ఉచిత పంటల భీమా, ఆక్వా రైతులకు తక్కువ ధరకు విద్యుత్, అమూల్‌ ద్వారా ఎక్కువ పాల ధర ఇవ్వడం, భూముల సర్వే, భూపట్టాల ధ్రువీకరణ, నాడు – నేడుతో పాఠశాలల రూపు మార్చడం, ఇంగ్లీష్‌ మీడియం విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, విద్యా కానుక... ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల మనసులను జగన్‌ దోచుకున్నారు.మరి చంద్రబాబు ఇలాంటి వేటినీ చేపట్టలేదు. ఇలాంటివి ఏ ఒక్కటీ చేశానని ఆయన చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఆయన ప్రతి ఎన్నికలప్పుడూ పలు పథకాల్ని ప్రకటించడం, ఎన్నికలు అయిపోయాక వాటి అమలు మరచిపోవడం చేసేవారు. అంతేగాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల విషయంలో మాట్లాడ కూడని మాటలు మాట్లాడేవారు. అందుకే ఆయన జనంతో సంబంధాల్ని మానసికంగా కోల్పోయారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయక పోవడం, పొదుపు సంఘాలకు రుణమాఫీ అమలు పరచక పోవడం, కొత్తగా జన్మించిన ఆడబిడ్డకు ‘మహాలక్ష్మి’ పథకం కింద ఇస్తానన్న డబ్బు ఇవ్వక పోవడం, ఇంటింటికీ ఒక ఉద్యోగం – ఉద్యోగం ఇవ్వలేకుంటే నెలకు రూ. 2 వేలు ఇస్తానని ఇవ్వక పోవడం; పేదలకు మూడు సెంట్ల నేల, ఇల్లు, బీసీలకు సబ్‌ ప్లాన్, స్త్రీ రక్షణ ఫోర్స్‌ ఏర్పాటు, పసుపు–కుంకుమ పథకం లాంటి వాటిని అమలు చేయకుండా జనాన్ని మోసగించారు. విద్యను, వైద్యాన్ని వ్యాపారీకరణ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు వైఫల్యాలు ఎన్నో!బాబు ఘోర వైఫల్యం చెందిన అనంతరం పరి పాలనా పగ్గాలు చేపట్టిన జగన్‌ ఏపీలోని ప్రతి కుటుంబానికీ ఏదో ఒక రూపంలో మేలు చేశారు. అందుకే తాను ఏదైనా మేలు చేశానని నమ్మితేనే తనకు ఓటు వేయమని ఆయన ధైర్యంగా ప్రజలను అడుగు తున్నారు.ప్రొ‘‘ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి వ్యాసకర్త ఎస్వీ యూనివర్సిటీ చరిత్ర శాఖవిశ్రాంత ఆచార్యులు ‘ 98495 84324

Sakshi Editorial On Mayabazar Movie Summer
వేసవి అభ్యాసం

‘జాగ్రత్తమ్మా సుభద్ర... అక్కడకు వెళ్లాక ఆ వైభోగంలో మమ్మల్ని మర్చిపోతావేమో’ అంటుంది రేవతి పాత్రధారి ఛాయాదేవి సుభద్ర పాత్రధారైన ఋష్యేంద్రమణితో ‘మాయాబజార్‌’లో. అప్పటికి పాండవుల స్థితి చెడలేదు. ఇంద్రప్రస్థం నుంచి పుట్టిల్లైన ద్వారకకు సుభద్ర రాకపోకలు సాగుతున్నాయి. సోదరులైన బలరాముడు, కృష్ణుడు ఆదరిస్తున్నారు. మేనకోడలైన శశిరేఖను తన కుమారుడైన అభిమన్యుడికి చేసుకోవాలని సుభద్ర తలపోస్తోంది. రేవతి ఉబలాటపడుతోంది. పిల్లలు ముచ్చటపడి ఆశ కూడా పెట్టుకున్నారు. కాని ఒక్కసారిగా పరిస్థితి మారి జూదంలో పాండవుల రాజ్యం పోయింది. అడవుల పాలు కావాల్సి వచ్చింది. ఒకనాడు సుభద్ర రాకకోసం వేయికళ్లతో ఎదురు చూసిన రేవతి ఇప్పుడామె చెడి పుట్టింటికి చేరితే ఏం చేసింది? దొంగ శిరోభారంతో పడకేసింది. పొడ గిట్టనట్టుగా చూసింది. మనుషులు అలా ఉంటారు.పాండవులకు అన్యాయం జరిగిందని తెలిసి బలరామ పాత్రధారి గుమ్మడి వీరావేశంతో కౌరవుల భరతం పట్టడానికి బయలుదేరినప్పుడు భయంతో దుర్యోధన పాత్రధారి ముక్కామల కంపిస్తే, శకుని పాత్రధారి సి.ఎస్‌.ఆర్‌. ‘భయమెందుకు? ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అని ఊరుకోబెడతాడు. వేంచేసిన బలరాముడిపై పూలవర్షం కురిపించి, కన్యకామణుల చేత పన్నీరు చిలకరింపచేసి ప్రసన్నం చేసుకుంటాడు. భరతం పడతానన్న బలరాముడే ‘ధర్మజూదంలో జయించడం ధర్మయుద్ధంలో జయించినంత పుణ్యమే’ అని రాజ్యం లాక్కున్న కౌరవులను ప్రశంసిస్తాడు. అంతేనా? దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడికి తన కుమార్తె శశిరేఖను కట్టబెట్టే వరం ఇస్తాడు– చెల్లెలు సుభద్రకు ఇచ్చిన మాట మరిచి. మనుషులు అలా కూడా ఉంటారు.ధర్మరాజు రాజసూయం చేయడం, మయసభ కట్టడం దుర్యోధనుడికి కంటగింపు అయ్యింది. కయ్యానికి అసలు కారణం అదే. ద్రౌపది నవ్వు మిష. అది గమనించిన శకుని ‘తలలో ఆలోచనలు చేతిలో పాచికలు... వీటితో పాండవులను సర్వనాశనం చేస్తాను’ అన్నప్పుడు ప్రకృతి కలవరపడి వెర్రిగాలితో వద్దు వద్దు అని సంకేతం ఇస్తుంది. కాని దుర్యోధనుడు వినడు. శకుని విననివ్వడు. సిరిని ప్రదర్శనకు పెట్టి ధర్మరాజు చెడ్డాడు. అది చూసి అసూయతో దుర్యోధనుడు మునిగాడు. ‘రాజ్యాలు పోయినా పరాక్రమాలు ఎక్కడికి పోతాయి’ అని సుభద్ర అంటుంది కాని పరాక్రమం లేకపోయినా అందలం ఎక్కాలనుకునేవారు ఉంటారు. వారికి భజన చేసి పబ్బం గడుపుకునేవారూ ఉంటారు. లక్ష్మణ కుమారుడు రేలంగి ఎప్పుడూ అద్దం ముందే ఉంటాడు. అలంకరణప్రియుడు వీరుడే కాదు. మరి ఇతని గొప్పతనమో? ‘అటు ఇద్దరె ఇటు ఇద్దరె అభిమన్యుని బాబాయిలు. నూటికి ఒక్కరు తక్కువ బాబాయిల సేన తమకు’. ఇతనికి స్తోత్రాలు వల్లించే శర్మ, శాస్త్రులు ఉద్దండ పండితులేగాని ‘ప్రభువుల ముందు పరాయి వారిని పొగడకూడదనే’ ఇంగితం లేని వారు. అందుకే శకుని ‘మీకు పాండిత్యం ఉంది కాని బుద్ధి లేదయ్యా’ అని చివాట్లు పెడతాడు. బుద్ధి లేని మనుషులు బుద్ధి ఉన్న మనుషుల్ని పితలాటకంలో పెట్టడమే లోకమంటే.స్వభావరీత్యా చెడ్డవాళ్లు, పరిస్థితుల రీత్యా చెడ్డతనం ప్రదర్శించేవాళ్లు... వీళ్లు మాత్రమే కిటకిటలాడితే జనులు నిండిన ఈ భూమి భ్రమణాలు చేయకపోవును. కష్టంలో ఉన్నప్పుడు సాయానికి వచ్చే మనుషులు తప్పక ఉంటారు. అడవులు పట్టిన సుభద్ర, అభిమన్యుల కోసం హిడింబి, ఘటోత్కచుడు, చిన్నమయ్య, లంబు, జంబు వీరితోపాటు దుందుభి, దుందుభ, ఉగ్ర, భగ్ర, గందరగోళక, గగ్గోలక తదితర అసుర సేన పరిగెత్తుకొని రాలేదూ? వీరందరి కంటే అందరి మొర వినే మురారి ఉండనే ఉన్నాడాయె. చివరకు కౌరవుల ఆటకట్టి సుభద్ర పౌరుషం నిలిచి శశిరేఖ ఆమె కోడలు కావడంతో ‘మాయాబజార్‌’ ముగుస్తుంది.తెలుగు వారికి మాత్రమే దొరికిన అమూల్యమైన వ్యక్తిత్వ వికాస సంగ్రహం ‘మాయాబజార్‌’ చిత్రం. అస్మదీయులను కలుపుకు వెళ్లి, తస్మదీయులతో జాగ్రత్తగా మెసలి, పైకి ఒకలాగా ఆంతర్యాలు వేరొకలాగా ఉండేవారిని కనిపెట్టుకుంటూ, ప్రగల్భాలరాయుళ్లను గమనించుకుంటూ, ఉబ్బేసే వాళ్ల ఊబిలో పడకుండా, దుష్ట పన్నాగాలతో బతికే వారితో దూరంగా ఉంటూ, అనూహ్యంగా మారిపోతూ ఉండే మనుషుల చిత్తాలను అర్థం చేసుకుంటూ, చిన మాయల పెను మాయల నడుమ ముందుకు సాగడం ఎలాగో ఈ సినిమా చెబుతుంది. అది కూడా ఏదో శాస్త్రం చెప్పినట్టుగా ‘నిష్కర్షగానూ కర్కశంగానూ’ కాదు. ‘సౌమ్యంగా సారాంశం’ అందేలాగానే. వేసవి వచ్చింది. నెల సెలవులున్నాయి. పిల్లలకు అందాల్సిన చాలా వాటిని నాశనం చేశాం. దుంప తెంచి ధూపం వేశాం. కనీసం ఈ సినిమా చూపించండి. వారు ఘటోత్కచుణ్ణి చూసి ‘హై హై నాయకా’ అంటారు. భక్ష్యాలకూ చిత్రాన్నాలకు తేడా తెలుసుకుంటారు. శాకాంబరీ దేవి ప్రసాదాన్ని నాలుక మీద వేసి ‘ఠ’ అంటూ లొట్టలు వేస్తారు. తల్పం గిల్పం కంబళి గింబళి చూసి కిలకిలా నవ్వుతారు. ఆ రోజుల్లోనే వీడియో కాల్‌ చేయగలిగిన ‘ప్రియదర్శిని’ పెట్టెకు నోళ్లు తెరుస్తారు. ‘సత్యపీఠం’ అను ‘లైడిటెక్టర్‌’తో సైన్స్ ఊహలు చేస్తారు. ‘ముక్కుకు తగలకుండా నత్తును కొట్టే’ ప్రావీణ్యం విద్యలో కలిగి ఉండాలని తెలుసుకుంటారు. తియ్యటి తెలుగుల ధారలలో లాహిరీ విహారం చేస్తారు.  తెలుగు నేల మీద ఎప్పుడు వేసవి వచ్చినా పిల్లలకు ప్రిస్క్రయిబ్‌ చేయాల్సిన తొలి అభ్యాసం ‘మాయాబజార్‌’. అది చూసిన పిల్లలకు ఒక వీరతాడు, చూపించిన తల్లిదండ్రులకు రెండు వీరతాళ్లు. మాయాబజార్‌... నమో నమః 

CM YS Jagan wife YS Bharathi Reddy Election campaign At Vemula
అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి భారతమ్మ

వేముల: వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి భారతమ్మ ప్రజలను కోరారు. వైఎస్సార్‌ జిల్లా వేములలో ఆదివారం ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వైఎస్‌ జగన్, వైఎస్‌ అవినాశ్‌రెడ్డిలను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్‌ భారతమ్మ, ఆమె సోదరుడు, ప్రముఖ వైద్యుడు ఈసీ దినేశ్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి భారతమ్మపై అభిమానం చూపారు. ఆమెను చూడగానే చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ, తమ ఇంటిలోకి ఆహ్వానించి అభిమానాన్ని చాటుకున్నారు. చాలా రోజుల తర్వాత ఆమెను చూడటంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు. వేముల మెయిన్‌ రోడ్డు, ఎస్సీ కాలనీ, శేషన్నగారిపల్లె, బచ్చయ్యగారిపల్లెల్లో భారతమ్మ, ఈసీ దినేశ్‌రెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి సోదరి శ్వేతారెడ్డి.. జెడ్పీటీసీ వెంకట బయపురెడ్డి, ఎంపీపీ చల్లా గంగాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ లింగాల ఉషారాణి, వైఎస్సార్‌సీపీ మండల ఇన్‌చార్జి నాగెళ్ల సాంబశివారెడ్డి, మండల పరిశీలకులు లింగాల రామలింగారెడ్డి, పీసీబీ డైరెక్టర్‌ మరక శివకృష్ణారెడ్డిలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక టీసీసీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రచారంలో అవ్వాతాతలను, మహిళలు, పెద్దలను ‘అన్న బాగున్నారా.. అవ్వా బాగున్నారా’  అంటూ భారతమ్మ ఆప్యాయంగా పలకరించారు. ప్రతి ఇంటి వద్ద వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులను ఆప్యాయంగా ఎత్తుకున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. పేదల సంక్షేమం కోసం సీఎం వైఎస్‌ జగన్‌ పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని భారతమ్మ చెప్పారు. పేదలు ఉన్నత చదువులు చదివితే ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతాయని నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చివేశారన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధనను గ్రామీణ విద్యార్థులకు చేరువ చేశారని తెలిపారు. పేదల సంక్షేమ పథకాలు కొనసాగడానికి మరోసారి వైఎస్‌ జగన్‌ను సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. సీఎం జగన్‌కు మెండుగా ప్రజల ఆశీస్సులు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాలపై దృష్టి సారించిందని భారతమ్మ తెలిపారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పాలనను ప్రజల వద్దకే తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేశారన్నారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వైఎస్‌ జగన్‌ను ప్రజలు మళ్లీ సీఎంగా కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్‌ విజయాన్ని ఆపలేరన్నారు. ఎన్నికల ప్రచారంలో పలువురు నేతలు పాల్గొన్నారు.  

Kolkata Knight Riders Beat by LSG 98 runs
ల‌క్నోను చిత్తు చేసిన కేకేఆర్‌.. 98 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం

ఐపీఎల్‌-2024లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జైత్ర యాత్ర కొన‌సాగుతోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఏక్నా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 98 ప‌రుగుల తేడాతో కేకేఆర్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో కేకేఆర్ త‌మ ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకున్న‌ట్లే. కేకేఆర్ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానానికి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో 236 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ల‌క్నో 16.1 ఓవర్లలో 137 ప‌రుగుల‌కే ఆలౌటైంది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌లా మూడు వికెట్ల ప‌డ‌గొట్ట‌గా.. ర‌స్సెల్ రెండు, స్టార్క్‌, న‌రైన్ చెరో వికెట్ సాధించారు. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో మార్క‌స్ స్టోయినిష్‌(36) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. మిగితా బ్యాట‌ర్లు ఎవ‌రూ చెప్పుకోద‌గ్గ ప్ర‌దర్శ‌న చేయ‌లేక‌పోయారు.ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫిల్ సాల్ట్‌(32), రఘువంశీ(32), రమణ్ దీప్ సింగ్‌(6 బంతుల్లో 25) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్- హాక్ మూడు వికెట్లు పడగొట్టగా.. బిష్ణోయ్‌, యుద్దవీర్‌, యష్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు. 

Chandrababu Naidu Frauds With Manifesto
మేనిఫెస్టో మోసగాడు చంద్రబాబు

సాక్షి, అమరావతి: చంద్రబాబుకు అధికారమే పరమావధి.. అందుకోసం వందల హామీలిచ్చి అందలమెక్కుతాడు.. తనను నమ్మి ఓటేసిన ప్రజలను నిలువునా వంచిస్తాడు. హామీలన్నీ చెత్తబుట్టలో పడేస్తాడు. హామీలిస్తే అమలు చేయాలా? అని సమాధానమిస్తాడు. మోసానికి నిలువెత్తు రూపం చంద్రబాబు..  మాయమాటలతో ఎన్నికల ముందు తిమ్మిని బమ్మి చేసి కిచిడీ మేనిఫెస్టోతో ప్రజల నమ్మకంతో ఆడుకుంటాడు. ‘చంద్రబాబుకు ఒక శాపముంది.. ‘నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుంది’ అని ఆనాడు అసెంబ్లీలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అన్న మాటలు ఎప్పటికీ అక్షరసత్యం.. అందుకే చంద్రబాబు మేనిఫెస్టో అబద్ధాల పుట్ట.. అబద్ధాలు తప్ప నిజం మాట్లాడడు.అలాంటి వ్యక్తికి ఓటుతో బుద్ధి చెప్పాల్సిందే. ఇప్పుడా సమయం ఆసన్నమైంది. చంద్రబాబు పాలనలో మహిళలు, వృద్ధుల కష్టాలు, రైతుల కన్నీళ్లను గుర్తు చేసుకోవాలి. బాబొస్తే జాబన్నాడు. ఇంటికో ఉద్యోగమన్నాడు. కొడుక్కి మంత్రి పదవే కట్టబెట్టి నిరుద్యోగులకు మాత్రం కుచ్చుటోపీ పెట్టాడు. ఇప్పుడు మళ్లీ 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. మన భవిష్యత్‌ను గుర్తు చేసుకుని.. మన కోసం ఒక మంచి బాట వేసిన జననేతను మళ్లీ గెలిపించుకోవాలి. ఒక్క ఓటుతో చంద్రబాబు అబద్ధాల ప్రపంచాన్ని పటాపంచలు చేయాలి.   హామీలతో వంచించే నేతను విశ్వసిస్తే భవిత నాశనమే.. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీకి అమ్ముడపోయి.. ఇప్పుడు ఆ పారీ్టతోనే చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే నేతకు మేనిఫెస్టో కేవలం ఒక కాగితం మాత్రమే.. జగన్‌ దృష్టిలో మేనిఫెస్టో అంటే ప్రజలకు ఇచ్చే మాట.. ఐదేళ్ల పాలనను చాటిచెప్పే పవిత్ర వాగ్దానం. ఏరు దాటే వరకూ ఓడ మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా చంద్రబాబు తాను గెలిచిన ప్రతీసారి ప్రజలను మోసగిస్తూనే ఉన్నారు. 2014లో పదవి కోసం చంద్రబాబు 600కు పైగా హామీలు గుప్పించారు. అందులో ఒక్కటీ అమలు కాలేదు. అధికారంలోకి వచ్చాక ఆయన రూటే వేరు. హామీల మాటే మరిచిపోతారు.జనంలోకెళ్తే ఎక్కడ తన్ని తరిమేస్తారోనని మేనిఫెస్టోను తన వెబ్‌సైట్‌ నుంచి మాయం చేస్తారు. ఎన్నికలప్పుడు అబద్ధాలకు రెక్కలు తొడుగుతూ అలవికాని హామీలతో మేనిఫెస్టోను విడుదల చేయడం.. అధికారంలోకి వచ్చాక దాన్ని తుంగలో తొక్కడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకూ.. ఎప్పుడూ మేనిఫెస్టోను అమలుచేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఇప్పుడు మరోసారి.. సూపర్‌ సిక్స్‌తో కలిపి ఇతర హామీలు ఇస్తూ మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు మరోసారి ప్రజలను మోసగించేందుకు సిద్ధమయ్యారు.   రుణమాఫీ పేరుతో టోపీ 2014 ఎన్నికల్లో బీజేపీ, పవన్‌ కల్యాణ్‌లో కలిసి చంద్రబాబు ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ప్రధాన హామీలు 1. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం  2. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాల మాఫీ  3. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి  4. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకంలో రూ.25 వేల డిపాజిట్‌  5. అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం.. పక్కా ఇళ్ల నిర్మాణం 6. ఏడాదికి రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్‌ అమలు  7. చేనేత, పవర్‌ లూమ్స్‌ రుణాల మాఫీ  8. సింగపూర్‌ను మించి అభివృద్ధి 9. ప్రతి జిల్లా కేంద్రంలో హైటెక్‌ సిటీ నిర్మాణం ఇలా 650కిపైగా హామీలు ఇచ్చారు. మోదీ ప్రభంజనంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ హామీల అమలును తుంగలో తొక్కారు. ఇదేంటని ప్రశి్నస్తే.. కేంద్రం సహకరించలేదంటూ బుకాయించి.. హామీలిస్తే అమలు చేయాలా? అని ఎదురు ప్రశి్నంచారు.  ఎన్టీఆర్‌ హామీలకు బాబు వెన్నుపోటు ఉమ్మడి రాష్ట్రంలో 1994 ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌కు బాబు వెన్నుపోటు పోడిచి.. అధికారంతోపాటు టీడీపీని కబ్జా చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన సంపూర్ణ మద్యపాన నిషేధం, రూ.2 కే కిలో బియ్యం హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారు. మద్యపాన నిషేదాన్ని ఎత్తేయడంతో పాటు రూ.2కే కిలో బియ్యాన్ని రూ.5.50కు పెంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు.   1999లో అరచేతిలో స్వర్గం  1999 ఎన్నికల సమయంలో చంద్రబాబు తన విశ్వరూపం చూపించాడు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారు. 1. కోటి మందికి ఉపాధి 2. 35 లక్షల ఇళ్లు నిర్మాణం 3. దారిద్య్ర నిర్మూలనకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు 4. పట్టణాల్లో మహిళలకు వంట గ్యాస్‌ కనెక్షన్లు  5. 25 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీటి సౌకర్యం ఇలా పదుల సంఖ్యలో హామీలిచ్చారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయిపై సానుభూతి కలిసొచ్చి ఆ ఎన్నికల్లో చంద్రబాబు గట్టెక్కారు. ఆ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. హామీల అమలును మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. కేంద్రం సహకరించలేదని బుకాయించారు.  ఉచిత విద్యుత్‌పై పరిహాసం అలిపిరి ఘటన నుంచి సానుభూతి పొందడం ద్వారా అధికారంలోకి రావాలన్న ఎత్తుగడతో 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని.. వ్యవసాయ విద్యుత్‌ బకాయిలను రద్దు చేస్తామని మహానేత వైఎస్సార్‌ హామీ ఇస్తే అపహాస్యం చేశారు. సేద్యానికి ఉచితంగా విద్యుత్‌ ఇస్తే.. తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని చంద్రబాబు పరిహాసమాడారు. చంద్రబాబు మోసాన్ని గుర్తించిన జనం అతని పాలనకు చరమగీతం పాడారు.   2009లో తారాస్థాయికి బాబు అబద్ధాలు 2009 ఎన్నికల్లో రాష్ట్ర విభజనకు ఆమోదం తెలుపుతూ టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంలతో చంద్రబాబు మహాకూటమిగా బరిలోకి దిగారు.  ఆ ఎన్నికల్లో హామీలు 1. అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి రూ.2 వేల నగదు బదిలీ  2. 50 లక్షల ఉద్యోగాలు  3. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌  4. 25 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం.. అలా పదుల కొద్దీ హామీలతో ప్రచారంలో ఊదరగొట్టినా అతని నైజం తెలిసి ప్రజలు చిత్తుగా ఓడించారు. ఎన్నికల హామీలన్నీ అమలు చేసిన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని పార్టీని జనం గెలిపించారు. వ్యవసాయానికి ఏడు గంటలకు బదులు 9 గంటలు ఉచితంగా విద్యుత్‌ ఇస్తామని, రేషన్‌ బియ్యం ఒక్కొక్కరికి 4 కేజీలు కాకుండా 6 కేజీలకు పెంచి ఇస్తామని రెండే హామీలు ఇచ్చిన మహానేత వైఎస్‌ను విశ్వసనీయతకు జనం పట్టం కట్టారు.  ప్రత్యేక హోదా అంటూ 2019లో మోసం 2018లో బీజేపీతో విడిపోయి 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగారు. కమిషన్ల కోసం పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకోవడం కోసం ప్రత్యేక హోదాను 2016లో కేంద్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబు.. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా సాధిస్తానని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి 12 గంటల ఉచిత విద్యుత్‌ పగటిపూటే సరఫరా చేస్తామని.. 2 కోట్ల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తామని.. అన్నదాత సుఖీభవలో రైతులకు ఏటా రూ.15 వేలు, మహిళలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతానని హామీలు ఇచ్చారు. చంద్రబాబు మోసానికి భయపడిన జనం ఆ ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించారు.   కర్ణాటక, తెలంగాణలో విఫలమైన హామీలతో ‘సూపర్‌ సిక్స్‌’ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్‌.. నవరత్నాలు–సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లను జమ చేశారు. సీఎం జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ప్రజాక్షేత్రంలో ఒంటరిగా సీఎం జగన్‌ను ఎదుర్కోవడానికి భయపడిన చంద్రబాబు.. మళ్లీ బీజేపీ, జనసేనతో జట్టుకట్టారు. కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమల్లో నీరుగారిపోయినా వాటికే సూపర్‌ సిక్స్‌ ముసుగేసి ఎన్నికల మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేయడం గమనార్హం. తెలంగాణలో ఇంతవరకూ ఉచిత బస్సు హామీ తప్ప ఏదీ అమలు కాలేదు. మిగతా అమలవుతాయో లేదో తెలియదు.

Narendhra Modi to visit AP on May 6
నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ

సాక్షి, అమరావతి/సాక్షి, అనకాపల్లి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజమండ్రి, అనకాపల్లిల్లో జరిగే ఎన్నికల ప్రచార బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2.55 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని 3.30 గంటలకు వేమగిరిలో, 5.45 గంటలకు రాజుపాలెంలో జరిగే బహిరంగసభల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి విశాఖ విమానాశ్రయానికి వెళ్లి అహ్మదాబాద్‌ వెళతారు. ఈ సభల్లో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ పాల్గొంటారు.  8న మళ్లీ రాష్ట్రానికి.. ప్రధానమంత్రి మోదీ ఈనెల 8వ తేదీ (బుధవారం) మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని రాజంపేట సమీపంలోని కలికిరి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.45 గంటల నుంచి సాయంత్రం 4.35 గంటల వరకు అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం 6.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు విజయవాడలో రోడ్‌షో నిర్వహిస్తారు. తరువాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళతారు. 

Samantha Ruth Prabhu Shocking Pic Trending In Twitter
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?

ఉన్నఫలంగా హీరోయిన్ సమంత గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ఓ మహిళ నగ్నంగా ఉన్న ఫొటోని వైరల్ చేస్తున్న నెటిజన్స్.. ఇందులో ఉన్న సమంతనే అంటున్నారు. ఈ ఫొటోని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసి, ఆ వెంటనే డిలీట్ చేసిందని అంటున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. ఇంతకీ అసలేం జరిగింది?హీరోయిన్‌గా స్టార్ హోదా అనుభవించిన సమంత.. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన విషయాన్ని మూడేళ్ల క్రితం బయటపెట్టింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి, దాన్ని నుంచి కోలుకోవడానికి అవసరమైన చికిత్సలు తీసుకుంటోంది. కొన్నాళ్ల క్రితం అమెరికా కూడా వెళ్లొచ్చిందని అన్నారు. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య)తాజాగా సమంత.. 'ఫార్ ఇన్ఫ‍్రారెడ్ సౌనా' అనే చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతూ ఇన్ స్టాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. అలానే దీని వల్ల ఎలాంటి  ఉపయోగాలు ఉంటాయనేది కూడా రాసుకొచ్చింది. ఇదే టైంలో సమంత.. నగ్నంగా ఉన్న ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసి, వెంటనే డిలీట్ చేసిందని కొందరు నెటిజన్స్ అంటున్నారు. అది ఇదేనంటూ ఓ పిక్ వైరల్ చేశారు.అయితే ఇందులో ఎవరో ఓ మహిళ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అది సమంతనా కాదా అనేది మాత్రం తెలియలేదు. మెడలో ఉన్న చైన్ ఒక్కటే అని అంటున్నారు. కానీ ఆ ఫొటో ఫేక్ అని సామ్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో అసలు నిజమేంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all