Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Watch Live AP CM YS Jagan Public Meeting at Bobbili
Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

several Schools Send Children Home After Bomb Threat Emails in delhi
ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదింపులు

ఢిల్లీ: దేశ రాజధాని పరిధిలో బుధవారం ఉదయం ఒక్కసారిగా అలజడి రేగింది.  పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే పిల్లలను బయటకు పంపించి తనీఖలు చేపట్టింది. మరో వైపు ఈ సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆందోళనతో స్కూళ్ల వద్దకు  చేరుకుంటున్నారు.ఇప్పటివరకు 12 పాఠశాలల్లో బాంబు ఉన్నట్లు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్, ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌, చాణిక్య పురిలోని సంస్కృతి స్కూల్, అమిటి సాకేత్ స్కూల్, నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వార్డ్స్,పోలీసులు స్కూల్స్‌కు వద్దకు చేరుకొని వాటి ఖాళీ చేయించి తనిఖీలు చేశారు. అయితే ఇప్పటి వరకు తనిఖీలు చేసిన పాఠశాలల్లో ఎలాంటి బాంబు లేవని, వచ్చింది నకిలీ బాంబు మెయిల్‌గా పోలీసులు గుర్తించారు. బయట దేశం నుంచి వీపీఎన్‌ మోడ్‌లో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బాంబు బెందిరింపుల నేపథ్యంలో స్కూల్స్ నుంచి విద్యార్థులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. బాంబు బెదిరింపు ఈ మెయిల్స్‌పై ఢిల్లీ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

IPL 2024: Hardik Pandya And Other Mumbai Indians Fined For Slow Over Rate Against Lucknow Super Giants
వరుస ఓటములు ఎదుర్కొంటున్న హార్దిక్‌ సేనకు మరో బిగ్‌ షాక్‌

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో వరుస ఓటములు ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. నిన్న (ఏప్రిల్‌ 30) లక్నోతో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ మెయింటైన్‌ చేసినందుకు గాను కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మ్యాచ్‌ ఫీజ్‌లో 24 లక్షల కోత పడింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సహా జట్టు సభ్యులందరికి 6 లక్షల జరిమానా విధించారు. హార్దిక్‌ ఈ సీజన్‌లో రెండో సారి స్లో ఓవర్‌ రేట్‌కు కారుకుడు కావడంతో అతనికి భారీ జరిమానా పడింది.కాగా, లక్నో సూపర్‌ జెయింట్స్‌తో నిన్న జరిగిన లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై.. లక్నో బౌలర్లు రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసింది.ఇషాన్‌ కిషన్‌ (32), నేహల్‌ వధేరా (46), టిమ్‌ డేవిడ్‌ (35 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్‌ శర్మ (4), సూర్యకుమార్‌ (10), తిలక్‌ వర్మ (7), హార్దిక్‌ పాండ్యా (0), మొహమ్మద్‌ నబీ (1) విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో మొహిసిన్‌ ఖాన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, మయాంక్‌ యాదవ్‌, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. ఆపసోపాలు పడి 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్టోయినిస్‌ (62) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడి లక్నోను గెలిపించాడు. రాహుల్‌ (28), దీపక్‌ హూడా (18), పూరన్‌ (14 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా.. నువాన్‌ తుషార, గెరాల్డ్‌ కొయెట్జీ, నబీ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్‌ అవకాశాలు గల్లంతు కాగా.. లక్నో ఈ సీజన్‌ ఆరో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.

know your sim cards status in Govt website and will update
మీపేరుపై ఎన్ని సిమ్‌కార్డులున్నాయో తెలుసుకోండిలా..

ప్రస్తుతకాలంలో చాలామంది ఒకటికంటే ఎక్కువ ఫోన్లు వాడుతున్నారు. వాటిలో రెండు కంటే ఎక్కువ సిమ్‌కార్డులు వినియోగిస్తున్నారు. అయితే గతంలో మీపేరుతో ఎప్పుడో ఒకపుడు సిమ్‌కార్డులు తీసుకునే ఉంటారు. కేంద్రం నిబంధనల ప్రకారం ఒకరి పేరుమీద గరిష్ఠంగా 9 సిమ్‌కార్డులే ఉండాలి.ప్రభుత్వ వెబ్‌సైట్‌ సంచార్‌సాతి వెబ్‌సైట్‌ ద్వారా మీరు గతంలో తీసుకున్న నంబర్లు, ప్రస్తుతం వాడుతున్న సిమ్‌కార్డుల వివరాలు తెలుసుకోవచ్చు. దీనిద్వారా గతంలో తీసుకుని వినియోగంలోలేని సిమ్‌కార్డులను నేరుగా ఆన్‌లైన్‌లోనే బ్లాక్‌ చేసుకునే సౌకర్యం ఉంది. అది ఎలాగో తెలుసుకుందాం.బ్రౌజర్‌లో https://sancharsaathi.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.కింద సిటిజన్‌ సెంట్రిక్‌ సర్వీసెస్‌ కేటగిరీలో ‘Know Your Mobile Connections’ క్లిక్‌ చేయాలి. ఈ సర్వీస్‌ టెలికాం అనలిటిక్స్‌ ఫర్‌ ఫ్రాడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌(టీఏఎఫ్‌సీఓపీ) అందిస్తోంది.‘Know Your Mobile Connections’పై క్లిక్‌ చేసిన వెంటనే కొత్త విండో ఓపెనె అవుతుంది. అందులో ప్రస్తుతం వాడుతున్న మొబైల్‌నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. కింద క్యాప్చా కోడ్‌ను ఇవ్వాలి. ‘వాలిడేట్‌ క్యాప్చా’ బటన్‌ ప్రెస్‌ చేయాలి.పైన ఇచ్చిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని కింద తెలిపిన బ్లాక్‌లో ఎంటర్‌చేసి లాగిన్‌ అవ్వాలి. మన పేరుతో ఏ నంబర్లు రిజిస్ట్రర్‌ అయ్యాయో వాటి వివరాలతో లిస్ట్‌ వస్తుంది.ఇదీ చదవండి:  రోజులో ఒకసారైనా ఓపెన్‌ చేసే ఈ యాప్‌ గురించి తెలుసా..?ఒకవేళ ఏదేని నంబర్‌ను నిలిపేయాలంటే పక్కనే ఆప్షన్లు ఉంటాయి. వాటిపై క్లిక్‌ చేసి సబ్మిట్‌ చేయాలి. చివరగా లాగ్‌అవుట్‌ చేయాలి.

May day international labour day 2024 special story
May Day: ఖరీదు కట్టే షరాబు లేడు

ప్రతి శ్రమకూ ఒక విలువ ఉంటుంది.పురుషుడు విలువ కలిగిన శ్రమే చేస్తాడు. అతడిది ఉద్యోగం.స్త్రీ విలువ కట్టని ఇంటి పని చేస్తుంది.ఆమెది చాకిరి.భారతదేశంలో స్త్రీ, పురుషుల్లో స్త్రీలుఅత్యధిక గంటలు ఏ ఖరీదూ లేనిఇంటి పనుల్లో మునిగి ఉంటున్నారనిసర్వేలు చెబుతున్నాయి.దేశ యంత్రాంగాలు అంతరాయంలేకుండా ముందుకు సాగడంలోఈ శ్రమ నిశ్శబ్ద ΄ాత్ర వహిస్తోంది.స్త్రీల శ్రమకు విలువ కట్టలేక΄ోతేకనీసం గౌరవం ఇవ్వడమైనా నేర్వాలి. ఇంతకు ముందు వివరించి చెప్పడం కొంత కష్టమయ్యేది. ఇప్పుడు అర్బన్‌ క్లాప్‌ వంటి సంస్థలు వచ్చాయి కనుక సులువు. అర్బన్‌ క్లాప్‌ వారికి బాత్‌రూమ్‌ల క్లీనింగ్‌ కోసం కాల్‌ చేస్తే వాళ్లు ఒక్కో బాత్‌రూమ్‌కు ఇంతని చార్జ్‌ చేస్తారు. ఇంట్లో రెండుంటే రెంటికీ చార్జ్‌ పడుతుంది. అదీ ఒకసారికి. అమ్మ వారంలో రెండు సార్లు, నెలలో ఏడెనిమిది సార్లు రెండు బాత్‌రూమ్‌లు కడుగుతుంది. ఆమెకు ఆ చార్జ్‌ మొత్తం ఇవ్వాలి లెక్క ప్రకారం. అలాగే కిచెన్‌ క్లీన్‌ చేయాలంటే కూడా ఒక చార్జ్‌ ఉంటుంది. అమ్మ రోజూ వంటిల్లు సర్దిసర్ది, ΄్లాట్‌ఫామ్‌ కడిగి, స్టవ్‌ రుద్ది క్లీన్‌ చేస్తుంది. ఆ చార్జ్‌ కూడా ఆమెకు ఇవ్వాలి. అమ్మ శ్రమకు కనీసం విలువ కట్టాలని కొన్ని సందర్భాలలో కోర్టులు కూడా అంటున్నాయి. కొన్ని సంస్థలు అమ్మ శ్రమను ఎలా విలువ కట్టవచ్చో కూడా చెబుతున్నాయి.1. ఆపర్చునిటీ కాస్ట్‌ మెథడ్‌: అంటే అమ్మ బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తే నలభై వేలు వస్తాయనుకుంటే, ఆమె  ఆ ఉద్యోగం మానుకుని ఇంట్లో ఉండి΄ోతే ఆమె శ్రమ విలువను నెలకు నలభై వేలుగా గుర్తించాలి. (అమ్మ ఉద్యోగం చేసి కూడా అంత శ్రమా చేస్తుంటే నలభైకి మరో నలభై కలిపి ఇంటికి ఇస్తున్నట్టు).2. రీప్లేస్‌మెంట్‌ కాస్ట్‌ మెథడ్‌: ఇల్లు చిమ్మడం, బట్టలుతకడం, ఆరిన బట్టల్ని మడత పెట్టడం, ఇస్త్రీ చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం, కూరగాయలు, సరుకులు తెచ్చుకోవడం, బిల్లులు కట్టడం, వంట చేయడం, ఇంటిని కనిపెట్టుకుని ఉండటం... వీటన్నింటినీ బయట వ్యక్తులతో సర్వీసుగా తీసుకుంటే (అర్బన్‌ క్లాప్‌ మాదిరిగా) ఎంత అవుతుందో లెక్కగట్టి అది అమ్మ చేసే పని శ్రమగా గుర్తించడం.3. ఇన్‌పుట్‌/అవుట్‌పుట్‌ కాస్ట్‌ మెథడ్‌: అలా కాకుండా ఈ పనులన్నింటికీ ఒక యోగ్యమైన ఉద్యోగిని పెట్టుకుంటే మార్కెట్‌ అంచనాను బట్టి ఎంత జీతం ఇవ్వాల్సి వస్తుందో అంత జీతం ఇవ్వడం.అవన్నీ సరే. కంటికి కనిపించే పనులకు కట్టే విలువ. కాని పిల్లవాడు స్కూల్లో పడి దెబ్బ తగిలించుకుని ఇంటికి వస్తే అమ్మ దగ్గరకు తీసుకుని, మందు రాసి, ధైర్యం చెప్పి, వాడి పక్కన కూచుని కబుర్లు చెపుతుందే... ఆ ప్రేమకు విలువ కట్టే షరాబు ఉన్నాడా? మే డే రోజున ప్రపంచ కార్మికురాలా ఏకం కండి అనే నినాదాలు వినిపిస్తుంటాయి. కాని ఇంటి పని చేస్తూ, అది ఎక్కువైనా చేస్తూ, కుటుంబమంతా ఆ పనిలో భాగం కావాలన్న సంగతిని చెప్పడానికి కూడా తటపటాయిస్తూ, అది వద్దనుకుంటే ఆ ఆప్షన్‌ లేక, తప్పించుకోవడానికి వీల్లేని ఆ పనిని చేస్తూ కూడా విలువ లేని పని చేస్తున్నామన్న న్యూనతను అనుభవిస్తూ తమ హక్కులు ఏమిటో తమకే తెలియని తల్లి, భార్య, కుమార్తె, చెల్లెళ్లను కార్మికులుగా గుర్తించాలని ఎవరూ అనుకోరు.స్త్రీల ఇంటి శ్రమ దేశంలోని యంత్రాంగం సజావుగా పనిచేయడంలో కీలకమైనది. వారు... దేశం కోసం పని చేసి రిటైరైన వృద్ధుల సేవలో ఉంటారు.  దేశానికి ఆదాయం తెచ్చిపెట్టే యువత సేవలో ఉంటారు. దేశానికి భవిష్యత్తులో అంది రావాల్సిన పిల్లల సేవలో ఉంటారు.  ‘కుటుంబం’ అనే బంధంలోకి వచ్చి కూతురిగా, కోడలిగా, భార్యగా వీరు ‘ప్రేమ’తో, ‘బాధ్యత’తో, ‘బంధం’తో ఈ సేవ చేస్తారు. అంత మాత్రం చేత ఈ సేవను నిరాకరించడానికి వీల్లేదు. శ్రమగా చూడక్కర్లేదని భావించకూడదు. ఇంత చేస్తున్నా ‘ఇంట్లో కూచుని ఏం చేస్తుంటావ్‌?’ అనే మాటను వాళ్లు పడాలా?ఉద్యోగం చేసినా చేయక΄ోయినా ఒక గృహిణి రోజుకు సగటున మూడున్నర గంటలు ఇంటి పని చేస్తుంటే పురుషుడు కేవలం గంటన్నర ఇంటి పని చేస్తున్నాడు.స్త్రీలు తమ ఇంటి పనిని ఒక్కరోజు మానేసి సహాయనిరాకరణ చేస్తే దేశం స్తంభిస్తుంది. అందుకే స్త్రీల శ్రమను గౌరవించే మే డే రోజున వారికి కృతజ్ఞతలు తెలియచేయాలి. విలువైన శ్రమ చేస్తున్నందుకు సమాజం వారికి హర్షధ్వానాలు తెలియచేయాలి.      

BJP Key Announcement Over Muslim Reservations
చంద్రబాబు, పవన్‌కు పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ కీలక ప్రకటన!

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో ఎ​న్నికల వేళ కూటమిలో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. టీడీపీ, జనసేనకు బీజేపీ ఊహించని షాకిచ్చింది. ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ కట్టుబడి ఉంటుందని.. తెలుగుదేశం, జససేన ని​ర్ణయాలకు అనుకూలంగా ఉండలేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది.ఇక, ముస్లిం రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే డీప్‌ ఫేక్‌ వీడియోల వ్యవహారం సోషల్‌ మీడియా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ముస్లిం రిజర్వేషన్లపై ట్విట్టర్‌ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పార్టీ నిర్ణయాన్ని ఏపీ బీజేపీ మరోసారి పునర్ఘటించింది. ఈ క్రమంలో ముస్లిం రిజర్వేషన్ల రద్దుకే కట్టుబడి ఉన్నామని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో.. టీడీపీ, జనసేన నిర్ణయాలకు తాము అనుకూలంగా లేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది. Truth: If BJP comes into power, we will make an end of the unconstitutional Muslim reservations. Meanwhile it's the right of SC, ST & OBC people of Telangana. We will ensure them that they get it. Therefore, We will end the Muslim Reservations.Fake Video: If BJP comes to power,… pic.twitter.com/4OxR8LP9Z9— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) April 30, 2024బాబును నమ్మని బీజేపీ ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడినప్పటికీ, ఆ పార్టీ జాతీయ నాయకత్వం తొలుత అంగీకరించలేదు. చంద్రబాబు ఢిల్లీలోని తన ఏజెంట్లు, బీజేపీలో ఉన్న తన అనుంగులు, ఇతరత్రా పైరవీలు చేశారు. అయినా బీజేపీ పెద్దలు ఆయన్ని నమ్మలేదు. ఢిల్లీలో రాత్రింబవళ్లు పడిగాపులు గాసి, కాళ్లా వేళ్లా పడి చిట్టచివరకు పొత్తు పెట్టుకోగలిగారు. బీజేపీ పొత్తయితే పెట్టుకొంది కానీ, చంద్రబాబును ఆ పార్టీ పెద్దలు నమ్మడంలేదన్న విషయం ప్రతి సందర్భంలోనూ బయటపడుతోంది. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన గెలుపే అసాధ్యమైతే, మేనిఫెస్టో విషయంలోనూ మరోసారి అభాసుపాలు కాకూడదని బీజేపీ అధిష్ఠానం భావించింది. దీంతో ఈసారి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఓ పరిశీలకుడిని మాత్రమే పంపి మమ అనిపించింది. కనీసం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర నాయకులు కూడా హాజరుకాలేదు.అంతేకాదు.. మేనిఫెస్టోలో కనీసం ప్రధాని మోదీ ఫొటోగానీ, కమలం గుర్తు గానీ ముద్రించేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్‌షా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటోలు ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే, చంద్రబాబు తెలివిగా మేనిఫెస్టో కాపీలపై మోదీ, ఇతర నాయకుల ఫొటోలు లేకుండా, కమలం గుర్తును మాత్రం వేయించారు. బీజేపీ దీనికీ అంగీకరించలేదు. దాన్ని మార్చాల్సిందేనని పరిశీలకుడు సిద్ధార్థనాథ్‌సింగ్‌ పట్టుబట్టారు. దీంతో మేనిఫెస్టో ముఖచిత్రంలో అప్పటికప్పుడు మార్పులు చేశారు.

International Criminal Court may Issue arrest warrant To Benjamin Netanyahu
ఇజ్రాయెల్‌ నెతన్యాహుకు ఊహించని షాక్‌!

టెల్‌ అవీవ్‌: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. యుద్ధ నేరాలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇతర అగ్రనేతలకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ త్వరలో అరెస్ట్ వారెంట్లు జారీ చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. దీంతో, ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమెన్‌ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. నెతన్యాహు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. హమాస్‌తో కాల్పుల విరమణ చర్చలు కొనసాగుతున్నాయి. చర్చల్లో భాగంగా ఒప్పందం కుదరినా, కుదరకపోయినా.. హమాస్‌లను అంతం చేయడానికి ఇజ్రాయెల్‌ దళాలు రఫాలోకి ప్రవేశిస్తాయన్నారు. మా లక్ష్యాలను సాధించకుండా యుద్ధం నిలిపివేసే సమస్యే లేదు. హమాస్‌ దళాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌ తప్పకుండా విజయం సాధిస్తుందని కామెంట్స్‌ చేశారు.The International Criminal Court may soon issue arrest warrants for Israeli Prime Minister Benjamin Netanyahu and other top leaders for war crimes. That's according to press reports out of Israel. Capitol Hill Correspondent @ErikRosalesNews reports. pic.twitter.com/lFuboZN6oK— EWTN News Nightly (@EWTNNewsNightly) May 1, 2024 మరోవైపు.. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం కారణంగా వేలాది మంది పాలస్తీనియన్లు రఫా నగరంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో బందీల విడుదలకు, కొంత ఉపశమనం పొందడానికి రెండు దేశాల మధ్య కాల్పుల ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇక.. రఫా నగరంపైకి ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి జరిపిన దాడుల్లో మూడు కుటుంబాల్లోని ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదు రోజుల వయసున్న పసికందు ఉందని పాలస్తీనా అధికారులు తెలిపారు.

Indraja Sankar Respond Negative Comments On Her Wedding
పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన నటి

ప్రముఖ నటి ఇంద్రజ శంకర్.. సోషల్ మీడియా దెబ్బకు బలైపోయింది. తమిళ నటుడు రోబో శంకర్ కూతురు ఈమె. దళపతి విజయ్ 'విజిల్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఆ తర్వాత పలు మూవీస్ చేసింది. నెల క్రితం చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి జరిగి నెల రోజులు కావొస్తున్నా గానీ వివాదాలు మాత్రం ఎక్కువయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భర్తతో కలిసి పాల్గొన్న ఇంద్రజ.. ఆ వివాదాలపై క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్‌తో భార్య సర్‌ప్రైజ్)కార్తీక్ అనే వ్యక్తిని ఇంద్రజ శంకర్ పెళ్లి చేసుకుంది. ఈ వివాహ వేడుకలకు తమిళ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల దగ్గర చాలామంది సెలబ్రిటీల వరకు హాజరయ్యారు. అయితే పెళ్లిలో ఇంద్రజ తన తండ్రికి ముద్దు పెట్టడం, కార్తీక్.. ఇంద్రజ తల్లితో డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే వాటిని దురుద్దేశంతో చూడొద్దని ఇంద్రజ శంకర్ చెప్పుకొచ్చింది.అలానే భర్తతో కలిసి తాను ఓ ఫొటోని పోస్ట్ చేయగా.. దానికి అసహ్యకరమైన కామెంట్స్ వచ్చాయని ఇంద్రజ శంకర్ చెప్పుకొచ్చింది. 'నా మీద ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. అతడి పేరు సరిగా గుర్తులేదు. 'ఇప్పుడు కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ ఎక్కువరోజులు కలిసుండలేరు. కొన్నిరోజులు ఆగితే విడివిడిగా ఇంటర్వ్యూ ఇస్తారు. త్వరలో విడాకులు తీసుకుంటారు' అని ఆ వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఇలా కామెంట్స్ పెట్టడంతో నేను చాలా బాధపడ్డాను. అయినా వేరొకరి గురించి అలా ఎలా కామెంట్ చేస్తారు?' అని ఇంద్రజ తన ఆవేదనని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)

BJP Not involved At ap Alliance Manifesto Release Modi stamp missing
టచ్ మీ నాట్... దూరం జరగండమ్మా

మొత్తానికి రాష్ట్రంలో టీడీపీ సారధ్యంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి మనసులు కలవని బలవంతపు కాపురం అని తేలిపోయింది. తప్పనిసరి తంతు తప్ప అందులో తమకేం పెద్ద పాత్ర లేదని బీజేపీ భావిస్తోంది. అందుకే మీ పాట్లేవో మీరు పడండి... అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి నాయుడుగారు అని స్పష్టంగా చెబుతోంది. వాస్తవానికి టీడీపీ.. జనసేన... బీజేపీల కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమానికి చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.దీనికి జాతీయ బీజేపీ నేత సిద్దార్థ నాథ్ సింగ్ సైతం ఢిల్లీ నుంచి వచ్చారు. అయితే ఆ మ్యానిఫెస్టో కాపీ మీద ఎక్కడా మోడీ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ఆ మ్యానిఫెస్టో కాపీని విడుదల చేసే సమయంలో వరుసగా ఈ ముగ్గురు నాయకులూ నిలబడి ఫోటోలకు.. పత్రికలకు ఫోజులిచ్చారు. అయితే ఆ సందర్భంగా ఆ కాపీని చేత్తో పట్టుకుని బాబు, పవన్ పక్కన నిలబడేందుకు సైతం సింగ్ విముఖత చూపించారు. ఎవరో వచ్చి ఆ కాపీని సింగ్‌కు ఇస్తుండగా అక్కర్లేదు.. అంటూ నేను దాన్ని తాకను అనేలా సంజ్ఞ చేసారు. ఆ తరువాత అయన మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యానిఫెస్టో ఈ ఇద్దరిదే.. మా బీజెపికి ఏమీ సంబంధం లేదని చెప్పేసారు. అంతేకాకుండా రాష్ట్ర బిజెపి నుంచి సైతం ఈ కార్యక్రమానికి ఎవరూ.. ఆఖరుకు అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం హాజరు కాలేదు. దీంతో ఇది జస్ట్ పవన్... జనసేనల పొత్తు అని తేలిపోయింది.అసలేం జరిగింది ?గతంలో 2014 లో సైతం ఇలాగే మూడు పార్టీలు పొత్తులో ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు చంద్రబాబు దాదాపు ఆరువందల హామీలు ఇచ్చి.. ఆ తరువాత మాటతప్పి.. మ్యానిఫెస్టోను పార్టీ వెబ్‌సైట్‌ నుంచి మాయం చేసారు. ఇప్పుడు ఆ మ్యానిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ బయటకు తీసి.. ఒక్కో హామీని ప్రజలకు గుర్తు చేస్తూ ఈ హామీ ఇచ్చారు. అమలు చేసారా అక్కా.. రుణమాఫీ చేసారా అన్నా.. పెన్షన్ ఇచ్చారా తాతా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేసారా చెల్లి.. ఉద్యోగాలు ఇచ్చారా తమ్ముడూ.. చూడండి ఈ హామీలకు అప్పట్లో మోడీ.. పవన్ సైతం గ్యారెంటీలుగా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు సైతం ఉన్నాయ్. మళ్ళీ అలాంటి వాళ్లకు ఓట్లెద్దామా అంటూ ఊరూరా ప్రచారం చేయడంతో.. చంద్రబాబు ఇచ్చే అమలుసాధ్యం కానీ హామీలవల్ల మేమెందుకు ప్రజలకు జవాబుదారీ కావాలి...? మేమెందుకు పరువుపోగొట్టుకోవాలని భావించిన బీజేపీ ఈసారి ఆ హామీల విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దు నాయుడుగారు.. మీరు మీరు.. ఏదోలా తగలడండి అనేసింది. అంతేకాకుండా దానిమీద మోదీ ఫోటో సైతం వేసేందుకు కేంద్రం ఒప్పుకోలేదని తెలిసింది. అందుకే ఈసారి మ్యానిఫెస్టో మీద కేవలం.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయ్. మరోవైపు బాబు ఇస్తున్న హామీలకు మా కేంద్రానికి, బీజేపీకి ఎలాంటి బాధ్యత లేదని వాళ్ళు తేల్చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల విషయంలో కూడా చంద్రబాబు తమను మోసం చేసినట్లు కేంద్రం గుర్తించింది. పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు వంటివాళ్లకు టిక్కెట్లు ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులనే బీజెపి నేతలుగా చూపించి టిక్కెట్లు ఇచ్చుకుని అసలైన బీజెపి నేతలను మోసం చేసారని అధిష్టానం గమనించింది. అంటే ఎన్ని చేసినా.. ఎంత చేసినా కుక్కతోక వంకరే అని.. చంద్రబాబులోని మోసపూరిత గుణం మారదని స్పష్టతకు వచ్చిన కేంద్రం.. అసలు ఈ దరిద్రమే మాకువద్దు. మీ చావు మీరు చావండి. మీ ఎన్నికలు.. మ్యానిఫెస్టోలో మాకు ఏమీ సంబంధం లేదని తేల్చేసింది.:::: సిమ్మాదిరప్పన్న 

Cricket Australia Announced Their Squad For T20 World Cup 2024
టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్‌

వెస్టిండీస్‌, యూఎస్‌ఏ వేదికగా జూన్‌ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌‍కప్‌ 2024 కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. విధ్వంసకర వీరులతో నిండిన ఈ జట్టుకు మిచెల్‌ మార్ష్‌ సారథ్యం వహించనున్నాడు. ముందుగా ప్రచారం జరిగినట్లుగా స్టార్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఎలాగైనా జట్టులోకి వస్తాడనుకున్న ఐపీఎల్‌ విధ్వంసకర బ్యాటర్‌ జేక్‌ ఫ్రేసర్‌ మెక్‌గుర్క్‌ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మాట్‌ షార్ట్‌, జేసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌, ఆరోన్‌ హార్డీ, స్పెన్సర్ జాన్సన్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌ లాంటి ఆశావహులకు కూడా మొండిచెయ్యే ఎదురైంది. చివరి వరల్డ్‌కప్‌ అని ముందుగానే ప్రకటించిన డేవిడ్‌ వార్నర్‌ను సెలెక్టర్లు కరుణించారు. ఎండ్‌ ఓవర్స్‌ స్పెషలిస్ట్‌ నాథన్‌ ఎల్లిస్‌ ఎట్టకేలకు జట్టులోకి వచ్చాడు. దాదాపు 18 నెలలుగా టీ20 జట్టుకు దూరంగా ఉన్న ఆస్టన్‌ అగర్‌, కెమరూన్‌ గ్రీన్‌లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. జోష్‌ ఇంగ్లిస్‌కు ప్రత్యామ్నాయ వికెట్‌కీపర్‌గా మాథ్యూ వేడ్‌ జట్టులోకి వచ్చాడు.  పేస్‌  బౌలింగ్‌ త్రయం పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ కొనసాగనున్నారు. మిచ్‌ మార్ష్‌తో పాటు ట్రవిస్‌ హెడ్‌, టిమ్‌ డేవిడ్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌ ఆల్‌రౌండర్లుగా ఎంపికయ్యారు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కోటా ఆడమ్‌ జంపా జట్టులోకి వచ్చాడు. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ప్రయాణం జూన్‌ 5న మొదలవుతుంది. ఆసీస్‌ తమ తొలి మ్యాచ్‌లో పసికూన ఒమన్‌తో తలపడుతుంది. గ్రూప్‌-బిలో ఆసీస్‌.. ఇంగ్లండ్‌, నమీబియా, స్కాట్లాండ్‌, ఒమన్‌లతో పోటీపడుతుంది.టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు: మిచెల్‌ మార్ష్ (కెప్టెన్‌), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా Cricket Australia invited the World Cup 2007 winners to announce the T20I World Cup 2024 squad including the children of Andrew Symonds. 🫡- Great initiative by Australia...!!!! pic.twitter.com/l8mhzxu7ww— Johns. (@CricCrazyJohns) May 1, 2024 వరల్డ్‌కప్‌ విన్నర్లతో..క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ వరల్డ్‌కప్‌ జట్టును వినూత్నంగా ప్రకటించింది. 2007 వన్డే వరల్డ్‌కప్‌ విన్నర్లు ఆసీస్‌ టీ20 వరల్డ్‌కప్‌ జట్టును అనౌన్స్‌ చేశారు. జట్టును ప్రకటించిన వారిలో దివంగత ఆండ్రూ సైమండ్స్‌ కొడుకు, కూతురు ఉండటం విశేషం. 

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement