Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

PM Modi Satirical Comments On Congress And BRS Party
తెలంగాణలో ‘RR’ ట్యాక్స్‌పై చర్చ నడుస్తోంది: ప్రధాని మోదీ

సాక్షి, వేములవాడ: బీజేపీకి నేషన్‌ ఫస్ట్‌ అయితే.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్‌ అని అన్నారు ప్రధాని మోదీ. అలాగే, మూడో దశ పోలింగ్‌ తర్వాత ఇండియా కూటమికి ఫ్యూజ్‌ ఎగిరిపోయిందని మోదీ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. ప్రజలు ఓటు వేసిన కారణంగానే బీజేపీ అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని స్పష్టం చేశారు.కాగా, ప్రధాని మోదీ వేములవాడలో పర్యటించారు. ఈ సందర్బంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం, వేములవాడలో బీజేపీ శ్రేణులు నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ..‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి విజయం పక్కాగా ఖాయమని కనిపిస్తోంది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ అడ్రస్‌ కూడా కనిపించడం లేదు.రేవంత్‌ రెడ్డి ట్యాక్స్‌..కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్‌. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు పెద్ద తేడా ఏమీ లేదు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లను అవినీతి కలుపుతోంది. తెలంగాణను బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి కాపాడాలి. ఓటుకు నోటు కేసుపై బీఆర్‌ఎస్‌ ఎందుకు విచారణ చేయించలేదు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతిపై కాంగ్రెస్‌ ఇంత వరకూ ఎందుకు విచారణకు ఆదేశించలేదు. తెలంగాణలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ గురించి బాగా చర్చ నడుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు వెయ్యి కోట్ల కలెక్షన్స్‌ వస్తే.. ఇప్పుడు 3-4 నెలల్లోనే ‘ఆర్‌ఆర్‌’ (రేవంత్‌ రెడ్డి) ట్యాక్స్‌ దాన్ని మించిపోయింది. ఇక్కడి వసూళ్లు ఢిల్లీకి పంపుతున్నారు. రాహుల్‌ గాంధీ నాలుగున్నరేళ్లుగా అంబానీ-అదానీ పేర్లు జపించారు. ఎన్నికలు ప్రారంభం కాగానే రాహుల్‌.. అంబానీ-అదానీ పేర్లు జపించడం మానేశారు. అంబానీ-అదానీ నుంచి కాంగ్రెస్‌ ఎంత తీసుకుంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ను ఎంఐఎంకు లీజ్‌కు ఇచ్చాయి. తొలిసారిగా ఎంఐఎంకు బీజేపీ సవాల్‌ విసురుతోంది. భారత్‌ ముందుకు సాగుతోంది..కాంగ్రెస్‌ అతి కష్టం మీద కరీంనగర్‌లో అభ్యర్థిని బరిలో నిలిపింది. పీవీని కాంగ్రెస్‌ పార్టీ ఎలా అవమానించిందో మనమంతా చూశాం. పీవీని భారతరత్నతో సన్మానించాము. నిన్ననే ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పీవీని ఎంతగానో గౌరవించాము. ఉదయం పది గంటలకే ఇంత పెద్ద సభ నిర్వహించడం.. నాకు గుజరాత్‌లో కూడా సాధ్యం కాదు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు.మన దేశంలో ఎంతో సమర్థత ఉన్నా.. ఇన్నేళ్లు కాంగ్రెస్‌ ఆ సామర్థ్యాన్ని నాశనం చేసి సమస్యలవలయంగా మార్చింది. బీజేపీ, ఎన్డీఏ హయాంలోనే ఈ దేశంలో సమగ్రాభివృద్ధి జరుగుతోంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయమందించి, బీమా అందిస్తూ లాభసాటిగా మార్చాం. పదేళ్లుగా నా పనితీరు ఎలా ఉందో మీరంతా గమనించారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించింది. రక్షణ రంగంలో దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి మన దేశం చేరింది. మీరంతా బీజేపీకి ఓటు వేసిన కారణంగానే.. దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. అయోధ్యకు రామమందిరం తలుపులు తెలంగాణ నుంచే వచ్చాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం కాకుండా కాంగ్రెస్‌ ప్రయత్నించింది. మాదిగలకు వ్యతిరేకంగా రిజర్వేషన్‌లన్నీ ముస్లింలకు చెందాలని కాంగ్రెస్‌ నేత అంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు లాక్కొని వాటిని ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్‌ భావిస్తోంది అంటూ కామెంట్స్‌ చేశారు.  

AP Elections 2024: May 8th Politics Latest News Updates Telugu
May 8th: ఏపీ ఎన్నికల సమాచారం

AP Political And Elections News Updates In Telugu10:00 AM, May 8th, 2024చంద్రబాబుపై మాట మార్చిన మోదీ..నాడు చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం మార్చుకున్నాడని మోదీ వ్యాఖ్యలునేడు చంద్రబాబుపై మోదీ ప్రశంసలు. వెన్నుపోటు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో బాబు నిపుణుడు.మోదీ కూడా చంద్రబాబులాగే మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో మన ఫ్యాన్‌ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి.  చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు మోడీ గారు ఏమన్నారో గుర్తుందా? పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని, వెన్నుపోట్లు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో చంద్రబాబు నిపుణుడని, అత్యంత అవినీతిపరుడని చెప్పారు. కానీ ఇప్పుడు అదే మోడీ గారు ఎన్డీయే గూటికి చేరిన చంద్రబాబుని ఇంతకంటే… pic.twitter.com/rSUlLqQzQB— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2024 08:45 AM, May 8th, 2024మోదీ, బాబుకు వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ప్రధాని మోదీ, చంద్రబాబుకి మాజీ మంత్రి వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌ని రద్దు చేయించగలరా?ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా?.ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌కి అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ మద్దతు పలకలేదా?టీడీపీ లోపల మద్దతు పలుకుతూ, పైకి మాటల గాంభీర్యం ప్రకటించడం కరెక్టేనా?ఈటీవీ, అన్నదాతల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకూల కథనాలు ప్రసారం చేయడం వాస్తవం కాదా?ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు మోదీని ప్రశ్నించాలి, నిలదీయాలి.మోదీ విజయవాడ పర్యటనలో ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ రద్దు చేయించే హామీని ఇవ్వగలవా చంద్రబాబు? 07:35 AM, May 8th, 2024టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు: తానేటి వనితహోంమంత్రి తానేటి వనిత కామెంట్స్‌.. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. మహిళ అని చూడకుండా దాడికి ప్రయత్నించారు. హోంమంత్రి దాడి చేయడమంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. 07:15 AM, May 8th, 2024తానేటి వనితపై టీడీపీ నేతల దాడి యత్నం..తూర్పుగోదావరిలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌నల్లజర్లలో టీడీపీ కార్యకర్తల బీభత్సంహోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నం. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది. హోంమంత్రిని సురక్షితంగా గదిలో ఉంచిన సెక్యూరిటీ. వైఎస్సార్‌సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల మూకుమ్మడి దాడి.టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్‌సీపీ నేతలకు తీవ్ర గాయాలు. టీడీపీ శ్రేణుల దాడిలో వాహనాలు, ఫర్నీచర్‌ ధ్వంసంసీసీ కెమెరాలో రికార్డయిన టీడీపీ నేతల దాడి దృశ్యాలు. నల్లజర్లలో భారీగా పోలీసుల మోహరింపు.  07:00 AM, May 8th, 2024గాజువాక  రోడ్‌షోలో సీఎం జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్‌కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యంప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్‌ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాంగతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా చేయడమే కాక జూన్‌ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయిసస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారునాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళవారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్‌ ప్లాంట్‌ ప్రేవేట్‌ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్‌ ఆమోదం లేదు కాబట్టే స్టీల్‌ ప్లాంట్‌ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్‌ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్‌కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్‌ ఇక్కడి నుంచి పంపండి 06:50 AM, May 8th, 2024నేడు ఏపీలో మోదీ ప్రచారంనేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంమధ్యాహ్నం ప్రత్యేక విమానం తిరుమలకు మోదీరాజంపేట లోక్‌సభ పరిధిలో కలికిరిలో ఎన్నికల ప్రచారంసాయంత్రం విజయవాడలో రోడ్‌ షో 06:40 AM, May 8th, 2024అప్పుడూ ఇప్పుడూ 'అంతే'పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా వికృతరూపం దాల్చిన బాబు పెత్తందారీ పోకడవారికి లబ్ధి జరిగేది ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యంఅప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లిష్‌ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లోగ్యాంగ్‌ చేయని ప్రయత్నంలేదు.. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీలకూ అడ్డంకులుతొలి నుంచీ పేదలకు మేలు జరగకుండా కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకున్న బాబు బ్యాచ్‌తాజాగా కోడ్‌ పేరుతో విద్యా దీవెన, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చముఠా.. ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలపైనా కుట్రలుతెలంగాణలో ఇన్‌పుట్‌ సబ్సిడీకి ఓకే చెప్పిన ఈసీ.. ఏపీలో మాత్రం నో 06:30 AM, May 8th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం

TDP Cadre Try To Attack AP Home Minister Taneti Vanitha
రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం​ మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం

తూర్పు గోదావరి, సాక్షి: మా నమ్మకం నువ్వే జగన్‌ అంటూ  ఏపీ ముక్తకంఠంతో చెబుతోంది. ఆ పిలుపు కూటమి పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వైఎస్సార్‌సీపీకి వస్తున్న ప్రజాదరణను భరించలేక దుశ్చర్యలకు పాల్పడుతోంది. తాజాగా సాక్షాత్తూ రాష్ట్ర  హోం మంత్రి తానేటి వనితపైన దాడికి టీడీపీ శ్రేణులు యత్నించారు.మంగళవారం అర్ధరాత్రి గోపాలపురం నల్లజర్లలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. హోం మంత్రి తానేటి వనిత స్థానికంగా ప్రచారం ముగించుకుని ఎక్స్‌ జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. YSRCP ప్రచార వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో గొడవకు దిగాయి. ఈలోపు టీడీపీ కార్యకర్తల్లో కొందరు తానేటి వనిత పైకి దూసుకెళ్లే యత్నం చేశారు.అయితే అప్రమత్తమైన ఆమె భద్రతా సిబ్బంది ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి భద్రత కల్పించారు. అయినా ఆగకుండా సుబ్రహ్మణ్యం ఇంటి ఫర్నీచర్‌ను, అక్కడున్న మరికొన్ని వాహనాల్ని ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కొందరు అడ్డుకునే యత్నం చేయగా.. వాళ్లనూ తీవ్రంగా గాయపరిచారు. టీడీపీ నేతలు దాడికి యత్నించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యాయి.  శాంతి భద్రతలను పర్యవేక్షించే హోం మంత్రిపై దాడికి యత్నించడాన్ని వైఎస్సార్‌సీపీ ముక్తకంఠంతో ఖండిస్తోంది. విషయం తెలిసిన ఎస్పీ జగదీష్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చిన పోలీసులు.. మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నల్లజర్లలో భారీగా మోహరించారు.హోం మంత్రి స్పందనటీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, పైగా మహిళ అని కూడా చూడకుండా తనపై దాడికి యత్నించారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ‘‘హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

AirIndia Express cancelled more than 70 flights due to a mass sick leave by its senior crew member
ఎయిరిండియా సిబ్బంది సిక్‌ లీవ్‌.. 70కి పైగా విమానాలు రద్దు

విమాన సేవలందిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ 70కి పైగా సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది. సిబ్బంది అనారోగ్యంతో ఉండడమే ఇందుకు కారణమని చెప్పింది. రద్దైన విమానాల్లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు ఉన్నాయి. దాంతో ఉన్న సర్వీసులు ఆలస్యంగా నడిచినట్లు తెలిసింది. ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని పౌర విమానయాన అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.సిబ్బంది అనారోగ్యంగా ఉన్నారని దాంతో విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత సంస్థ తన ‘ఎక్స్‌’ ప్లాట్‌ఫామ్‌ వేదికగా స్పందించింది. ‘మా క్యాబిన్ సిబ్బందిలోని ఒక విభాగానికి చెందిన ఉద్యోగులు చివరి నిమిషంలో ఏకకాలంలో అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. ఈ మేరకు మూకుమ్మడిగా ‘సిక్‌లీవ్‌’ దరఖాస్తులు అందాయి. దాంతో మంగళవారం రాత్రి నుంచి కొన్నివిమాన సర్వీసులు ఆలస్యం అయ్యాయి. మరికొన్నింటిని రద్దు చేశాం. ఈ సంఘటనకు గల కారణాలను అర్థం చేసుకోవడానికి మేము సిబ్బందితో మాట్లాడుతున్నాం. ఊహించని పరిణామం వల్ల ప్రయాణికులకు అంతరాయం కలిగిస్తే క్షమాపణలు కోరుతున్నాం. ఇకపై చేసే ప్రయాణాలకు సంబంధించి సదరు సర్వీసు అందుబాటులో ఉందో లేదో సరిచూసుకోవాలి కోరుతున్నాం’ అని తెలిపింది.ఇదీ  చదవండి: ట్రేడింగ్‌ వేళల పెంపునకు నో చెప్పిన సెబీరద్దు అయిన విమానసర్వీసుల టికెట్‌ డబ్బులు వాపసు చేస్తామని.. లేదంటే మరోతేదీకి రీషెడ్యుల్‌ చేసుకునే వీలుందని కంపెనీ పేర్కొంది. More than 70 international and domestic flights of Air India Express from Tuesday night till Wednesday morning have been cancelled after the senior crew member of the airline went on mass 'sick leave'. Civil Aviation authorities are looking into the issue: Aviation Sources— ANI (@ANI) May 8, 2024

సంజూ శాంసన్‌ అవుటైన తీరుపై వివాదం(PC: BCCI/Jio Cinema)
అవుటా? నాటౌటా?.. సంజూకు షాకిచ్చిన బీసీసీఐ

రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా సంజూ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి.. అతడికి జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే.. అరుణ్‌ జైట్లీ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌ ఢిల్లీతో మంగళవారం తలపడింది. టాస్‌ గెలిచిన రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌.. పంత్‌ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దంచికొట్టిన ఢిల్లీ ఓపెనర్లుఓపెనర్లు జేక్‌ ఫ్రేజర్‌-మెగర్క్‌(20 బంతుల్లో 50), అభిషేక్‌ పోరెల్‌(36 బంతుల్లో 65), ఆరో నంబర్‌ బ్యాటర్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌ (20 బంతుల్లో 41) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు.ఫలితంగా ఢిల్లీ జట్టు..నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోవడంతో వన్‌డౌన్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు.అవుటా? నాటౌటా?మొత్తంగా 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సంజూ అవుటైన తీరు వివాదానికి దారితీసింది.రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌లో పదహారో ఓవర్‌లో ఢిల్లీ పేసర్‌ ముకేశ్‌ కమార్‌ బౌలింగ్‌కు వచ్చాడు. అతడి బౌలింగ్‌లో షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన సంజూ.. బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్‌ వద్ద షాయీ హోప్‌ క్యాచ్‌ పట్టగా ఫీల్డ్‌ అంపైర్‌ అవుటిచ్చాడు.చిర్రెత్తిపోయిన సంజూ.. అంపైర్‌తో వాగ్వాదంఅయితే, ఆ సమయంలో షాయీ హోప్‌ బౌండరీ లైన్‌ తాకినట్టుగా కనిపించింది. రివ్యూ వెళ్లగా.. థర్డ్‌ అంపైర్‌ కూడా సంజూ అవుటైనట్లు ప్రకటించాడు. అదే సమయంలో ఢిల్లీ డగౌట్‌ నుంచి ఆ జట్టు యజమాని పార్థ్‌ జిందాల్‌ సైతం అవుట్‌ అంటూ అరుస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఈ క్రమంలో చిర్రెత్తిపోయిన సంజూ శాంసన్‌ అంపైర్లతో వాదనకు దిగాడు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల కింద బీసీసీఐ అతడి మ్యాచ్‌ ఫీజులో 30 శాతం మేర కోత విధించింది.  ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ మీద 20 పరుగుల తేడాతో గెలిచింది. ప్లే ఆఫ్స్‌ రేసులో తామూ ఉన్నామంటూ దూసుకువచ్చింది.చదవండి: యువీ, ధావన్‌ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే: ప్రీతి జింటాGame of margins! 😮A splendid catch that raises the 𝙃𝙊𝙋𝙀 for the Delhi Capitals 🙌Sanju Samson departs after an excellent 86(46) 👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/rhLhfBmyEZ— IndianPremierLeague (@IPL) May 7, 2024

Anchor Syamala Exclusive Interview about AP Politics
CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల

ఇచ్చిన హామీలు అమలు చేయడం ఆయనకే చెల్లు జగన్‌లోని పట్టుదల ఎందరికో స్ఫూర్తిదాయకం సాక్షి ఇంటర్వ్యూలో సినీనటి, యాంకర్‌ శ్యామల ‘వైఎస్సార్‌సీపీ నవరత్నాలు అమలు సాధ్యమేనా అన్న నోళ్లు మూతపడేలా అమలు చేసి చూపించారు సీఎం జగన్‌. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రతి ఒక్కరికీ ఓ లెసన్‌. ‘జగన్‌ గెలుపు అంటే జనం గెలుపు’ అన్నది ఈ ఎన్నికల్లో స్పష్టం కానుంది’ అని సినీనటి, ప్రముఖ బుల్లితెర యాంకర్‌ శ్యామల అన్నారు. కొంత కాలంగా వైఎస్‌ జగన్‌కు మద్దతుదారుగా ఉన్న ఆమె ఈ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ తరఫున చురుకుగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. జగన్‌పై తనకు అభిమానం కలగడానికి కారణాలను... తన భవిష్యత్తు రాజకీయ ప్రయాణాన్ని ఆమె తెలియజేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...వైఎస్‌ అంటే ఇష్టం.. జగన్‌పై అభిమానం... తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం సమీపంలోని ఇంద్రపాలెం మాది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నాకు రాజకీయ నేపథ్యం ఏమీ లేదు. ఎదుగుతున్న సమయంలో లీడర్స్‌ చేపట్టే పనులు మన మీద చాలా ప్రభావం చూపుతాయి కదా. అలా తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేసినప్పటి నుంచీ వైఎస్‌ అంటే నాకు చాలా ఇష్టం. కట్టు బొట్టు నుంచి ఆయన ఆహార్యం దాకా అన్నీ గమనిస్తుండేదాన్ని. ఆయన హుందాతనం, మందహాసం బాగా నచ్చేవి. కెరీర్‌ కోసం హైదరాబాద్‌ వచ్చేసిన తర్వాత.. వైఎస్సార్‌ మరణించిన సమయంలో ఉప్పల్‌లో ఓ ప్రైవేట్‌ చానల్‌లో పనిచేస్తున్నాను. ఎంతగానో బాధనిపించినా... ఆ సమయంలో ఎటూ కదలడానికి వీలు కాలేదు. వైఎస్‌ మరణం తర్వాత జగన్‌ను బాగా గమనిస్తూ ఉండేదాన్ని, ఆయన చేసిన పోరాటం, అడ్డంకులు ఎదుర్కొంటూ ఆయన వేసిన అడుగులు చూశాక ఆయనపైనా కొండంత అభిమానం కలిగింది. నా భర్త కూడా జగన్‌ అభిమాని కావడంతో... ఆయన్ను స్వయంగా కలవడం, ఆయన చేతుల మీదుగా వైఎస్సార్‌సీపీ కండువా ధరించడం జరిగిపోయాయి.  హామీల ఆమల్లో ఆయనకు ఆయనే సాటి ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలి? ప్రజలకు ఆపద వస్తే ఎలా స్పందించాలి? ఇలాంటివన్నీ జగన్‌ను చూసి నేర్చుకోవాలి. అందుకే భవిష్యత్తు రాజకీయ నేతలకు ఆయన పాలన ఒక పాఠం అంటాను నేను. ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి మొదట్లో విని... బాబోయ్‌ ఇన్ని పథకాలా? ఎలా ఇస్తారో అని భయపడిన మాట నిజం. కాని అవి పక్కాగా అందించడానికి గ్రామ వలంటీర్‌ పేరిట ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది కలిగిందీ అంటే ఫిర్యాదు చేసిన 10–20 రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారం అయిపోయేలా పక్కాగా నిర్వహించడం అద్భుతం అనిపించింది.కోవిడ్‌ సవాల్‌నూసమర్థంగా ఎదుర్కొని... ప్రపంచమే బిత్తరపోయిన సంక్షోభం కోవిడ్‌. మహామహులే ఆ సమయంలో చేతులెత్తేశారు. అలాంటిది ఒక కొత్త సీఎం, అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఇలాంటి తరుణంలో అనూహ్యమైన ఈ చాలెంజ్‌ ఎదురైనా.. జగన్‌  అద్భుతంగా హ్యాండిల్‌ చేశారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా రెండు వేవ్స్‌నూ సమర్థంగా ఎదుర్కొన్నా రు. అందుకే నేను ఫిదా అయ్యా. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లోని ప్రజల్ని కలిసినప్పుడు వారు చెబుతున్నదీ అదే. ‘కోవిడ్‌ టైమ్‌లో సొంత వారు కూడా మా మొహం చూడలేదమ్మా.. అలాంటిది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతీదీ మా చేతికి అందించింది’ అని.జగన్‌ గురించి తెలుసుకున్న కొద్దీ సంతోషం మా సొంత ఊరితో పాటు మా అత్తగారి ఊరు చీరాలకు రాకపోకలు సాగించినప్పుడు, షూటింగ్‌ కోసం గ్రామాలకు వెళ్లినప్పుడు... అక్కడి స్థితిగతుల గురించి కనుక్కునేదాన్ని. వీలైనంతమందితో మాట్లాడేదాన్ని. వాళ్లందరి స్పందన తెలుసుకుంటున్న కొద్దీ జగన్‌ మీద ఇష్టం పెరుగుతూ వచి్చంది. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన నాడు నేడు కార్యక్రమం నా ఆల్‌ౖ టెమ్‌ ఫేవరెట్‌. నేను కాకినాడ ప్రభుత్వ పాఠశాలలో చదువు కున్నా. ఆ స్కూల్లో 7వ తరగతి వరకూ అసలు ఇంగ్లిష్‌ మీడియం ఉండేది కాదు. ఇప్పుడు ఏకంగా డిజిటల్‌ బోధన, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్, స్కూల్‌ బ్యాగ్స్, షూస్, సాక్స్‌... ఇవన్నీ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇటీవల ఒక ప్రభుత్వ పాఠశాల విద్యారి్థని జగన్‌ ముందు అద్భుతమైన ఇంగ్లిష్ లో మాట్లాడితే షాక్‌ అయిపోయా. ఆ భాషా పరిజ్ఞానం నాకు కూడా లేదు. కేవలం రాజకీయాల కోసం ఓ పాపను దారుణంగా ట్రోల్‌ చేయడం దారుణం.అవకాశాలు పోతాయని వారించినా...అయితే నేను  ఇంకా సినీ–టీవీ కెరీర్‌ ప్రారంభంలోనే ఉండడంతో పార్టీ మనిషిగా ముద్ర వేసుకోవడం మంచిది కాదంటూ చాలా మంది హెచ్చరించారు. నిజానికి ఇప్పటికీ చాలా మంది అలాగే చెబుతుంటారు. అయితే ఏదో రాజకీయ పారీ్టలో ఉన్నానని ఒక క్యారెక్టర్‌కి నేను సరిపోతానని తెలిసినా పిలవకుండా ఉంటారా? అలా జరగదని నా నమ్మకం. ఇప్పటివరకూ అలాంటి అనుభవాలు కూడా ఎదురవ్వలేదు. నేను కేవలం టీవీ యాంకర్‌గానే కాకుండా మాచర్ల నియోజకవర్గం, బెంగాల్‌ టైగర్‌... తదితర సినిమాల్లో మంచి పాత్రల్లో చేశాను.   

Kareena Kapoor Appointed As UNICEF India National Ambassador Gets Emotional
యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా : భావోద్వేగం

2014 నుండి  యూనిసెఫ్‌ ఇండియాతో అనుబంధం కలిగి ఉంది  బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్. ఇద్దరు బిడ్డల తల్లిగా బాల్య అభివృద్ధి, ఆరోగ్యం, విద్య మరియు లింగ సమానత్వం కోసం ప్రతి పిల్లల హక్కును పెంపొందించడంలో సంస్థకు మద్దతు ఇస్తుంది. తాజాగా యునిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా కపూర్‌ ఎంపికైంది. ఈ సందర్బంగా ఆమె భావోద్వేగానికి లోనైంది.కరీనా కపూర్‌ అనగానే రంగుల ప్రపంచం కళ్ల ముందు ఆవిష్కారం అవుతుంది.అయితే ఈ అందాల నటికి మరో ప్రపంచం కూడా తెలుసు.స్త్రీ సాధికారత నుంచి మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ వరకు ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఎన్నో  ప్రాంతాలకు వెళుతోంది. పేదింటి బిడ్డలతో మాట్లాడుతోంది.తాజాగా యూనిసెఫ్‌ ఇండియా నేషనల్‌ అంబాసిడర్‌గా నియామకం అయిన కరీనా కపూర్‌లో ఫ్యాషన్‌ డిజైనర్, రైటర్, మోటివేషనల్‌ స్పీకర్, సోషల్‌ యాక్టివిస్ట్‌ ఉన్నారు...ఉత్తమనటిగా సుపరిచితమైన కరీనా కపూర్‌ సృజనాత్మకమైన డిజైనర్‌ కూడా. క్లాతింగ్‌ రిటైలర్‌ ‘గ్లోబస్‌’తో కలిసి పనిచేసింది. న్యూట్రిషనిస్ట్‌ రుజుత దివాకర్‌తో కలిసి తీసుకు వచ్చిన ‘డోంట్‌ లూజ్‌ యువర్‌ మైండ్, లూజ్‌ యువర్‌ వెయిట్‌’ పుస్తకం అమ్మకాల్లో రికార్డ్‌ సృష్టించింది. కరీనా కపూర్‌ వాయిస్‌తో ఈ పుస్తకం ఆడియో బుక్‌గా రావడం మరో విశేషం. ‘ది స్టైల్‌ డైరీ ఆఫ్‌ బాలీవుడ్‌ దివా’ పేరుతో తన జ్ఞాపకాల పుస్తకాన్ని తీసుకువచ్చింది. అదితి షా బీమ్జానీతో కలసి ప్రెగ్నెన్సీపై రాసిన పుస్తకం కమర్షియల్‌గా సక్సెస్‌ అయింది. రుజుత దివాకర్‌తో కలిసి న్యూట్రిషన్‌కు  సంబంధించి ‘ది ఇండియన్‌ ఫుడ్‌ విజ్‌డమ్‌ అండ్‌ ది ఆర్ట్‌ ఆఫ్‌ ఈటింగ్‌ రైట్‌’ డాక్యుమెంటరీపై పనిచేసింది. ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌పై వచ్చిన ‘గర్ల్‌ రైజింగ్‌’ అనే డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌కు వాయిస్‌–వోవర్‌ ఇచ్చింది.ఒకవైపు సినిమాల్లో బిజిగా ఉన్నప్పటికీ... పిల్లల విద్య, మహిళల భద్రతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. మహిళలపై హింసను నిరో«ధించడానికి ఎన్‌డీ టీవి ప్రారంభించిన శక్తి క్యాంపెయిన్‌కు  అంబాసిడర్‌గా పనిచేసింది. 2014 నుంచి బాలికల విద్యకు సంబంధించి యూనిసెఫ్‌తో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. రాజస్థాన్, మహారాష్ట్రలోని  పాఠశాలలకు వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేది. జాల్నా జిల్లాలో కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయం నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంది.నిరుపేద పిల్లల చదువు కోసం షర్మిలా ఠాగుర్‌తో కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. చైల్డ్‌–ఫ్రెండ్లీ స్కూల్‌ అండ్‌ సిస్టమ్స్‌ (సీఎఫ్‌ఎస్‌ఎస్‌) యాకేజీని లాంచ్‌ చేసింది. చత్తీస్‌ఘడ్‌లో చైల్డ్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ వీక్‌ çసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బాగా చదివే పిల్లలు,  పాఠాలు బాగా చెప్పే టీచర్‌లకు పురస్కారాలు అందజేసింది. మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌పై యూనిసెఫ్‌ లక్నోలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించింది. ‘నవజాత శిశువులను కాపాడుకుందాం’ పేరుతో కరీనా రాసిన వ్యాసానికి మంచి స్పందన  వచ్చింది. నవజాత శిశువులు, తల్లుల క్వాలిటీ హెల్త్‌ కేర్‌కు సంబంధించి ‘ఎవ్రీ చైల్డ్‌ అలైవ్‌’ అనే క్యాంపెయిన్‌ను నిర్వహించింది. మదర్స్‌ డే సందర్భంగా యూనిసెఫ్‌ దిల్లీలో నిర్వహించిన సమావేశంలో కరీనా ప్రధాన వక్త.ప్రకృతి వైపరీత్య బాధితుల కోసం, ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థల కోసం నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొంది కరీన. పిల్లల రోగనిరోధక శక్తి పెరుగుదలకు సంబంధించిన అంశాలపై పనిచేసే స్వస్థ్‌ ఇమ్యునైజేషన్‌ ఇండియాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేసింది.తాజా విషయానికి వస్తే.. ‘నేషనల్‌ అంబాసిడర్‌గా యూనిసెఫ్‌తో నా అనుబంధం కొనసాగడం గౌరవంగా భావిస్తున్నాను. పిల్లల చదువు, హక్కుల కోసం నా గొంతు వినిపిస్తాను’ అంటుంది కరీనా కపూర్‌.‘కరీనా కపూర్‌ ఎక్స్‌లెంట్‌ కమ్యూనికేటర్‌’ అని కితాబు ఇచ్చింది యూనిసెఫ్‌. చిన్న విజయం చాలు...  పెద్ద సంతోషానికిసోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ‘నేను ఎలా సాధించానంటే’లాంటి స్టోరీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేస్‌ మొదలైంది. ఆ రేస్‌లో భాగంగా యువతరం ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ రేసులో మెంటల్‌ హెల్త్‌ అనేది వెనక్కి వెళ్లిపోయింది. రేస్‌ అనేది శాంతి, సంతోషాల కోసం ఉండాలి. విద్యార్థులు తమ మానసిక శాంతిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. చిన్న విజయాన్ని కూడా పెద్ద విజయంగా భావించుకోవాలి. ‘ఇదీ ఒక విజయమేనా!’ అనుకున్నప్పుడు అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి నుంచి అశాంతి జనిస్తుంది –కరీనా కపూర్‌

YS Vivekananda Reddy PA Krishna Reddy on sunitha and Rajasekhar Reddy
నర్రెడ్డి సునీత, రాజశేఖర్‌రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు

పులివెందుల: నర్రెడ్డి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజ­శేఖర్‌­రెడ్డి చాలా నీచంగా మాట్లా­డుతున్నారని వైఎస్‌ వివేకా­నందరెడ్డి వద్ద పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నర్రెడ్డి దంపతులు ఓ పత్రి­కకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినవనీ అబద్ధా­లేనని తెలిపారు. కడుపుకు అన్నం తినేవాళ్లెవరూ ఇలా మాట్లాడరన్నారు. భార్యాభర్త రోజుకో అబద్ధపు స్టేట్‌­మెంట్లు ఇస్తున్నారన్నారు. నర్రెడ్డి బ్రదర్స్‌ నాటకాలాడుతు­న్నా­రని చెప్పారు. వైఎస్‌ వివేకా రక్తపు వాంతులతో చనిపో­యా­డని తాను నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డితో చెప్పలేద­న్నారు. రూము మొత్తం రక్తపు మరకలున్నాయని, తలపైన గాయం ఉందని, బాడీ మొత్తం రక్తంలో ఉందని, సైడు వాకిలి, బెడ్‌ రూము వాకిలి తెరచి ఉన్నాయని, ఏసీ ఆన్‌లో ఉందని చెప్పానని తెలిపారు. రక్తపు వాంతులని ఎర్ర గంగిరెడ్డి అనగా, ఇంత రక్తం ఉంటే వాంతులంటావేమిటని తాను ఆయనతో వాదించానన్నారు. అలాంటిది రాజశేఖర్‌­రెడ్డికి రక్తపు వాంతులని ఎలా చెబుతానని అన్నారు. అలాగే తాను వైఎస్‌ వివేకా లెటర్‌ను దాచిపెట్టడా­నికి ప్రయత్నం చేశానన్నారని, అదీ అబద్ధమేనని తెలిపారు. లెటర్‌ గురించి తాను రాజశేఖర్‌రెడ్డికి ఫోన్‌లో చెప్పగా ఆయనే దాచమ­న్నా­రని చెప్పారు. పోలీసులతో సమస్య కదా అని తాను అంటే  ఆ విషయం ఆయనే చూసుకుంటానని చెప్పారన్నా­రు.అవినాశ్‌రెడ్డి తనను మేనేజ్‌ చేశారనడం నిజం కాదన్నారు. నర్రెడ్డి దంపతులే తనను మేనేజ్‌ చేయాలని చూసి విఫలమయ్యారని చెప్పారు. లెటర్‌ దాచిపెట్టమని చెప్పిన వారిని కేసులో పెడతారని, కానీ వీరు అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నాయకులతో కలిసి పోలీసులను మేనేజ్‌ చేసి తనను, మరో అమాయకుడైన ప్రకాష్‌ను కేసులో ఇరికించారన్నారు. తనది చిన్న ప్రాణం కాబట్టి ఇరికించారని, వారి కారణంగా తాను ఉద్యోగా­నికి 9 నెలలు సస్పెన్షన్‌కు గురయ్యానని, ప్రమో­షన్, పాస్‌పోర్ట్‌ రెన్యువల్‌ ఆగిపోయాయన్నారు. తాను ఇప్పుడు 20 శాతం విషయాలే చెబుతున్నానని, మరలా మిగిలిన విషయాలు చెబుతానన్నారు.తాను వైఎస్‌ వివేకా దగ్గర 37 సంవత్సరాలు ఏ జీతం తీసుకోకుండా పని చేశానని తెలిపారు. వివేకాను తాను చూసుకున్నట్లు వారి ఇంట్లో వారు కూడా చూసుకోలేదన్నారు. వివేకా తన ముందరే ఎన్నోసార్లు వారిని ఛీ కొట్టారని తెలి­పారు. నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, శివప్రకాష్‌రెడ్డి వారి బావ వివేకా ద్వారా కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని, అయినా వారిలో ఆశ చావలేదన్నారు. వివేకా రెండో వివాహం కారణంగా వారికి ఆయనతో తీవ్ర మన­స్పర్థలు వచ్చాయన్నారు. వివేకా రెండో భార్య షమీమ్‌ కుమా­రుడికి ఆస్తులు పోకుండా రాజకీయంగా వివేకా ద్వా­రా ఎదగాలని విఫలమై ఈ రోజు వేరేవారిపై నిందలు వేస్తు­న్నారన్నారు. గతంలో డ్రైవర్‌గా దస్తగిరిని తొలగిస్తేనే పులివెందుల వస్తానని వివేకాకు రాజశేఖర్‌ గట్టిగా చెప్పడంతో ఆయన తొలగించారన్నారు. ఇప్పుడు అదే దస్తగిరిని ము­ందర పెట్టుకుని వీరు నాటకాలు ఆడుతున్నారని అన్నా­రు. రామ్‌సింగ్‌ చెప్పినట్లు వినాలని సునీత బెదిరించారుఓసారి సునీత దంపతులు తనను హైదరా­బా­ద్‌కు పిలిపించుకొని, రామ్‌సింగ్‌ చెప్పినట్లు వికపోతే కేసులో ఇరుక్కుంటావని బెదిరించారన్నారు. తాను అబద్ధం చెప్పనని కరా­ఖండిగా చెప్పా­న­న్నారు. ఆ సమయంలో కృష్ణారెడ్డి మన మాట వినకపోతే నువ్వు కేసులో ఇరుక్కుంటావని రాజశేఖ­ర్‌తో సునీత అన్నారని చెప్పారు. దీనికి అర్థమేమిటో మీడియా సోదరులే ఆలోచించుకోవాలని అన్నారు. ఎప్ప­టికైనా ఈ కేసులో రాజశేఖర్‌ జైలుకు వెళ్లక తప్పదన్నారు.వారి ముగ్గురు పేర్లు చెప్పాలని రామ్‌సింగ్‌ కొట్టాడుఢిల్లీలో సీబీఐ అధికారి రామ్‌సింగ్‌ నెలరోజుల పాటు తనను తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడన్నారు. హత్యలో వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి హస్తం ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని తీవ్రంగా కొట్టేవాడన్నారు. ఎంతకీ తాను ఒప్పుకోకపోవడంతో వదిలేశారన్నారు. ఆ­తర్వాత ఒకరోజు రామ్‌సింగ్‌ వాట్సప్‌ కాల్‌ చేసి తన కుమా­రుడిని తీసుకొని కడపకు రమ్మని చెప్పాడన్నారు.తామిద్ద­రం మరుసటిరోజు రామ్‌సింగ్‌ వద్దకు వెళ్లగా, వివేకా హత్యలో అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డిల హస్తం ఉన్నట్లు చెప్పాలంటూ తన కుమారుడి ఎదుటే కట్టె­తో కొట్టాడన్నారు. దస్తగిరి, రంగన్న చెప్పినట్లు విన్నారని, వారిని సేవ్‌ చేశామని, నువ్వు వినకపోతే కేసులో ఇరికి­స్తామని చెప్పాడన్నారు. తన బెయిల్‌ రద్దు చేసి మళ్లీ జైలుకు పంపిస్తామని బెదిరించాడన్నారు. తాను  అబద్ధం చెప్పనని గట్టిగా చెప్పడంతో పంపించేశాడన్నారు. కృష్ణారెడ్డి మాట వినలేదని సునీత దంపతులకు రామ్‌సింగ్‌ చెప్పగా.. తన కుమారుడితో వివాహం కుదుర్చుకున్న గుంటూరుకు చెందిన మా వియ్యంకుడికి సునీత ఫోన్‌ చేసి కృష్ణారెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేయిస్తామని, ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని, వివాహం రద్దు చేసుకోవాలని బెదిరించారని, దీంతో వారు భయపడి వివాహం రద్దు చేసుకు­న్నారని తెలిపారు.నాకేదైనా జరిగితే వారిదే బాధ్యతతనకు ఇప్పటికీ కొంతమంది నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని, వారి పేర్లు త్వరలో బయటపెడతానన్నారు. తన ప్రాణానికి ముప్పు ఉందని, తనకు ఏదైనా జరిగితే సునీత, రాజశేఖర్, శివప్రకాష్‌రెడ్డిలే బాధ్యులవుతారని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు స్పందించకపోవడంతో కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నానన్నారు. కేవలం రాజకీయ ఎదుగుదల కోసం సునీత దంపతులు అవినాశ్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని కృష్ణారెడ్డి తెలిపారు. 

Seven People Died At Bachupally Due To Heavy Rains
హైదరాబాద్‌లో విషాదం.. ఏడుగురు మృతి

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మంగళవారం కుండపోత వర్షం కురిసింది. అకాల వర్షాల నేపథ్యంలో ప్రమాదాల కారణంగా రెండు రాష్ట్రాల్లో పలువురు మృతిచెందారు.కాగా, హైదరాబాద్‌లోని బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెంట్రింగ్‌ పని కార్మికుల షెడ్‌పై కూలిన రిటైనింగ్‌ వాల్‌. భారీ వర్షానికి కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సీఎన్‌డీఆర్‌ఎఫ్‌, జీహెచ్ఎంసీ సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఇక, మృతులను ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఇక, ఏపీలో కూడా పిడుగుల కారణంగా ఏడుగురు మృత్యువాడపడ్డారు.  బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గోడకూలి ఏడుగురు చనిపోవడంపై సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోడ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలన్నారు.  #HyderabadRains #tankbund #Hussainsagar @CoreenaSuares2 @Rajani_Weather super duper rain. #scary pic.twitter.com/2xvWITJ3jt— sαмυεℓ ραυℓ🇮🇳 (@vikramsamuelp) May 7, 2024 

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all