Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM YS Jagan Viajayawada To Visit IPac Office Updates
మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్‌

ఎన్టీఆర్‌, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ అధికారంలోకి రాబోతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నాం ఐప్యాక్‌ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్‌ ఎన్నికల ఫలితాల్ని అంచనా వేశారు. ‘‘మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి గతంలో కంటే ఎక్కువ ట్లే గెలుస్తాం. ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది. జూన్‌4వ తేదీన రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్‌ అవుతుంది. ఫలితాల తర్వాత దేశం మొత్తం మనవైపే చూస్తుంది. ‘‘ప్రశాంత్‌ కిషోర్‌ ఆలోచించలేనన్ని సీట్లు వస్తాయి. ప్రశాంత్‌ కిషోర్‌ చేసేది ఏమీ లేదు. అంతా టీమే చేస్తుంది. వచ్చే ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేద్దాం. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది’’ అని ఐప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ అన్నారు.ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కోసం పొలిటికల్‌ కన్సల్టెన్సీగా ఐప్యాక్‌ పని చేసిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నాం బెంజిసర్కిల్‌లో ఉన్న ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ(I-Pac) కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్‌.. సుమారు అరగంటపాటు అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐ-ప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ టీం సభ్యులతో సెల్ఫీలు దిగుతూ కాసేపు సరదాగా గడిపారు.

CM YS Jagan Says YSRCP Will Big Win AP Elections
‘ఫ్యాన్’‌దే ప్రభంజనం.. సీఎం జగన్‌ సరికొత్త రికార్డ్‌!

ఏపీ రాజకీయ చరిత్రలోనే వైఎస్సార్‌సీపీ సరికొత్త చరిత్ర లిఖించబోతుంది. ‘ఫ్యాన్‌’ ప్రభంజనం సృష్టించబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఐదేళ్ల పాలనకు ప్రజలు జైకొట్టారు. ప్రతిపక్షాలు, పచ్చ బ్యాచ్‌ దిమ్మతిరిగిపోయే విధంగా ప్రజలు తీర్పునిచ్చినట్టు సీఎం జగన్‌ ప్రకటన చేశారు.సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ప్రజలే తనకు స్టార్‌ క్యాంపైనయిర్స్‌ అని చెప్పారు. తాను నమ్మకుంది ఆ దేవుడు, ప్రజలనేనని అన్ని వేదికలపైనా ప్రస్తావించారు. ఇక, సీఎం జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందితేనే వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని కోరారు. ఆయన మాటలు ప్రతీ ఒక్క కుటుంబాన్ని చేరుకున్నాయి. సీఎం జగన్‌ చేసిన సాయాన్ని ఎవరూ మరిచిపోలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వం పట్ల, పాలన పట్ల నమ్మకం ఉంచారు.అందుకే 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకే భారీగా ఓట్లు వేశారు. రాష్ట్రంలో పోలింగ్‌ శాతం పెరగడం కూడా ఇందుకు ఒక ఉదాహారణ. ఇక, 2019లో వచ్చిన సీట్ల కన్నా ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయని సీఎం జగన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, సీఎం జగన్‌ ఇప్పటి వరకు చేసిన ఏ ప్రకటన అయినా ఆచితూచి మాత్రమే చేశారు.పేదలు వర్సెస్‌ పెత్తందారులు అన్న ఎన్నికల నినాదాన్ని ముందుకు తీసుకెళ్లిన సీఎం జగన్‌.. ఈసారి వచ్చే ఫలితాలు ప్రభంజనం సృష్టిస్తాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా విజయంపై కచ్చితమైన సమాచారంతోనే ఆయన ఇలాంటి ప్రకటన చేశారని రాజకీయ వర్గాలు సైతం చెబుతున్నాయి. సీఎం జగన్‌ సంచలన ప్రకటనతో కూటమి నేతలు డీలా పడినట్టు తెలుస్తోంది.అయితే, ముఖ్యమంత్రి జగన్‌ పూర్తిగా ప్రాక్టికల్‌గా ఉండే వ్యక్తి. ఆయన ఏ పని చేసినా పూర్తి పారదర్శకంగా ఉంటారు. వేర్వేరు సమీకరణాలు అన్నీ పరిశీలించి ముందడుగు వేస్తారు. ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మార్పు సమయంలో కూడా కచ్చితమైన నిర్ణయాలే తీసుకున్నారు. ప్రతిపక్షాలు, సీఎం జగన్‌ అంటే గిట్టని వారు ఎన్ని కామెంట్స్‌ చేసినా ఆయన అవేవీ పట్టించుకోకుండా ముందుకుసాగారు. ఎంతో దమ్ము, ధైర్యంతో అభ్యర్థులను మార్చారు. ఒక నాయకుడిగా తన నాయకత్వం మీద, పార్టీ మీద, పాలన మీద ఉన్న నమ్మకాన్ని ఈ ప్రకటన సాంకేతంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన ఫస్ట్‌ రియాక్షన్‌ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు టైట్‌ ఫైట్‌, ఎవరికి ఎడ్జ్‌ తెలియదన్నట్టుగా వార్తలు రాసుకొచ్చిన మీడియా సంస్థలు కూడా.. సీఎం జగన్‌ చేసిన ప్రకటన పట్ల షాక్‌ తిన్నాయి. ఒక నాయకుడు.. ఎంతో నమ్మకంగా చేసిన ఒక ధృడమైన ప్రకటన.. వైనాట్‌ 175 నినాదాన్ని చర్చనీయాంశం చేశాయి.

AP Elections 2024: May 16th Politics Latest News Updates In Telugu
May 16th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 16th AP Elections 2024 News Political Updates1:50 PM, May 16th, 2024ఢిల్లీ చేరుకున్న సీఎస్‌, డీజీపీఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎస్‌ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తామధ్యాహ్నం మూడు గంటలకు ఈసీ ముందు హాజరు కానున్న సీఎస్, డీజీపీఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై వివరణ కోరిన ఈసీ1:30 PM, May 16th, 2024పెదవేగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతఏలూరు జిల్లాపెదవేగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతహత్యాయత్నం కేసులో ఉన్న ముద్దాయిని టీడీపీ కార్యకర్త కావడంతో పోలీస్ స్టేషన్ నుండి బలవంతంగా తీసుకువెళ్లిన చింతమనేని ప్రభాకర్.మరోసారి బయటపడ్డ చింతమనేని ప్రభాకర్ గుండా గిరిపోలీసులు అడ్డుకోవడంతో చింతమనేని ప్రభాకర్‌తో పాటు వారి అనుచరులు పోలీసులపై దాడికి ప్రయత్నం.కొప్పులవారిగూడెం ఎలక్షన్ రోజున బూత్‌లో ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు రవిపై దాడి చేసిన ముద్దాయి తాలూరి రాజశేఖర్పెదవేగి పీఎస్‌లో ఉన్న అతనిని చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యంగా లాక్కొని తన కారులో వేసుకొని తన అనుచరులతో పారిపోయాడు. హత్యాయత్నం చేసిన ముద్దాయిని చింతమనేని తీసుకువెళ్లిపోవటంతో పీఎస్‌ ఎదుట బైఠాయించి వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసన. 12:50 PM, May 16th, 2024టీడీపీ అభ్యర్థి అనుచరుడి దౌర్జన్యం.నెల్లూరు..సామాన్యులపై కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అనుచరుడు మురళి దౌర్జన్యం.డబ్బులు తీసుకుని తమకు ఓటు వేయలేదని.. డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగిన మురళి.కావ్య కృష్ణారెడ్డి డబ్బులు తీసుకొని రమ్మన్నాడంటూ ఫోన్ చేసి బెదిరించిన టీడీపీ నాయకుడు నున్నా మురళి.సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన టీడీపీ నేత మురళి బెదిరింపుల ఆడియో.కావ్య కృష్ణారెడ్డి అనుచరుల బలవంతపు వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓటర్లు. 12:20 PM, May 16th, 2024గవర్నర్‌ను కలవనున్న వైఎస్సార్‌సీపీ బృందంతాడేపల్లి :సాయంత్రం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలవనున్న వైఎస్సార్‌సీపీ బృందంపోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్‌సీపీ నేతలుసీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలవనున్న నేతలుహింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరనున్న వైఎస్సార్‌సీపీ బృందం12:00 PM, May 16th, 2024అల్లర్లు సృష్టించిన టీడీపీ నేతలపై కేసు నమోదుఅనంతపురం:తాడిపత్రిలో అల్లర్లు సృష్టించిన టీడీపీ నేతలపై కేసు నమోదుతాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 526 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడిన టీడీపీ నేతలుపరారీలో టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిఇప్పటిదాకా 55 మందిని అరెస్టు చేసిన పోలీసులుఉరవకొండ కోర్టులో నిందితులను హాజరుపరిచిన పోలీసులుజేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన వర్గీయులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు11:45 AM, May 16th, 2024టీడీపీ నాయకుడి దాష్టీకంకృష్ణా జిల్లా..ఉంగుటూరు మండలం ఆత్కూరులో టీడీపీ నాయకుడు దాష్టీకంఫ్యాన్‌కు ఓటు వేసిందని మహిళను ట్రాక్టర్‌తో ఢీకొట్టిన టీడీపీ నాయకుడు ఏడుకొండలుఆత్కూరు గ్రామానికి చెందిన వేముల సంధ్యారాణికి తీవ్ర గాయాలు.సంధ్యారాణి రెండు కాళ్ళకు తీవ్ర గాయాలుపిన్నమనేని హాస్పిటల్‌కు తరలింపుహాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంధ్యారాణిని పరామర్శించిన వల్లభనేని వంశీఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు 10:25 AM, May 16th, 2024ఎన్నికల హింసపై గవర్నర్‌కు ఫిర్యాదుఏపీలో ఎన్నికల హింసపై గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుఇవాళ సాయంత్రం రాజ్‌భవన్‌ వెళ్లనున్న వైఎస్సార్‌సీపీ బృందంమంత్రి బొత్స నేతృత్వంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు కలవనున్న వైఎస్సార్‌సీపీ బృందంపోలింగ్‌ సందర్భంగా టీడీపీ అరాచకాలపై, పోలీసులు వ్యవహరించిన తీరును గవర్నర్‌కు వివరించే అవకాశంహింసకు బాధ్యులైన వాళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్న వైఎస్సార్‌సీపీ నేతలు 9:40 AM, May 16th, 2024రాష్ట్రంలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల..డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభంనిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1480,జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్‌మెంట్‌కు రూ.502 కోట్లు విడుదలమిగిలిన పథకలకూ విడుదల కానున్న నిధులురెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను పూర్తిచేయనున్న ప్రభుత్వంటీడీపీ ఫిర్యాదులతో పోలింగ్‌కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను అడ్డుకున్న ఎన్నికల సంఘంఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంతవరకూ అనుమతిపై ఎటూ తేల్చని ఎన్నికల సంఘంఎన్నికల సంఘం తీరుపై హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వంఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో హైకోర్టు ఆగ్రహంసమయం ముగిసిపోవడంతో పోలింగ్‌కు ముందు విడుదల కాని నిధులుపోలింగ్ ముగిసిన తర్వాత నిధుల విడుదల ప్రారంభం 9:00 AM, May 16th, 2024అనంతలో సెక్షన్‌ 144 కొనసాగింపు..అనంతపురం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగింపుఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ వినోద్ కుమార్ఎన్నికల సందర్భంగా అనంతలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పచ్చ మూకలు దాడులు చేశారు. 8:20 AM, May 16th, 2024ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటువిజయవాడఫిరాయింపు ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటుఅనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్న శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుటీడీపీలో చేరిన జాంగా కృష్ణ మూర్తివైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి అనర్హుడిగా ప్రకటించిన శాసన మండలి చైర్మన్ 7:45 AM, May 16th, 2024వైఎస్సార్‌సీపీ అనుకూల వర్గాలే టార్గెట్‌.. మహిళలపై పచ్చ మూకల దాష్టీకాలునర్సీపట్నంలో దుశ్శాసన పర్వం ఒంటరి మహిళను జుట్టు పట్టుకొని ఈడ్చి కాళ్లతో తన్నిన అయ్యన్న అనుచరులుకృష్ణా జిల్లాలో దమనకాండమహిళను ట్రాక్టర్‌తో తొక్కి చంపడానికి ప్రయత్నించిన టీడీపీ నేతమహిళలపై హత్యాయత్నాలు చేస్తున్నా ఏమీ పట్టనట్లు ఈసీ నిర్లిప్తత గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపు దాకా కొనసాగించేలా చంద్రబాబు పన్నాగం.. రాష్ట్రవ్యాప్తంగా దాడులకు పురిగొల్పుతూ భయానక వాతావరణం రాజకీయ ప్రత్యర్థులపై గ్రామాల్లో విచ్చలవిడిగా దాడులు.. కౌంటింగ్‌కు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను దూరంగా ఉంచడమే లక్ష్యం 7:20 AM, May 16th, 2024నేడు విజయవాడకు సీఎం జగన్‌ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేడు విజయవాడకు రానున్నారు.ఈ సందర్భంగా బెంజి సర్కిల్‌లో ఉన్న ఐ-ప్యాక్‌ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. సుమారు అర గంట పాటు ఐ-‍ప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. 7:00 AM, May 16th, 2024నేడు ఈసీఐని కలవనున్న ఏపీ సీఎస్‌ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీఎస్, డీజీపీని నివేదిక కోరిన ఈసీఐఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్న సీఎస్, డీజీపీఎన్నికల పోలింగ్‌కు కొద్దీ రోజులు ముందే డీజీపీ, ఐజీ, ఎస్పీలను మార్చిన ఎన్నికల కమిషన్అకస్మాత్తుగా పోలీస్ అధికారులను మార్చడంతో పెరిగిన హింసాత్మక ఘటనలుపల్నాడు ఎస్పీ, ఐజీ, డీజీపీని పోలింగ్‌కు ముందు మార్చిన ఈసీఐఈసీ ఆకస్మిక నిర్ణయాలతో హింస పెరిగిందని భావిస్తున్న అధికారులు 6:50 AM, May 16th, 2024ఏపీ పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుటీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపినట్లు దీపక్‌ మిశ్రాపై సీఈవో, డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుపోలింగ్‌ రోజు కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై దీపక్‌ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీపోలింగ్‌కు 3 రోజుల ముందు టీడీపీ నేత విష్ణువర్థన్‌ ఇచ్చిన పార్టీకి దీపక్‌ మిశ్రా హాజరైనట్లు గుర్తింపుఆ తర్వాత నుంచి పోలీస్‌ అధికారుల మార్పులపై అనుమానాలుమాచర్ల,గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్‌ఐల మార్పులుచివరికి సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా దీపక్‌ మిశ్రా జోక్యం చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుఈ కేసులో ఏ2 నిందితుడిని అరెస్ట్‌చేయొద్దని విచారణ అధికారిపై దీపక్‌ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్‌సీపీఆధారాలతో సహా డీజీపీ, ఈసీలకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ 6:40 AM, May 16th, 2024రిగ్గింగ్‌ చేయాలనే ఆలోచనతోనే దాడులకు తెగబడ్డారు: సజ్జల రామకృష్ణారెడ్డిటీడీపీ అరాచక శక్తులు పోలింగ్ సరిగ్గా జరగకుండా చేయాలని చూశాయిరిగ్గింగ్ చేయాలనీ, మా వారిని అడ్డుకోవాలనీ చూశారుటీడీపీ నేతలు చేసిన అరాచకాలపై ఈసీ, డీజీపీలకు ఫిర్యాదు చేశాంఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరిందిపురంధేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారువారు కోరిన అధికారులను వేశారుమొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారువిష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారువిష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషిఅలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసిందిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరసపెట్టి ట్రాన్సఫర్ చేశారుఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారుప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారుఅక్కడే ఎక్కువ హింస చెలరేగిందిజరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయిమంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారుఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదువెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలిఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలిసంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందికౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోందికచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోందిసీఎస్, డీజీపిని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణంపోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాంపురంధేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాంపోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉందిలేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్ గా నియమించటం ఏంటి?ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారురిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?ఓటర్లు తమ బాధ్యతగా తీసుకుని పోలింగులో పాల్గొన్నారు. 6:30 AM, May 16th, 2024మైదుకూరులో టీడీపీ గుండాల దాడివిశ్వనాథ పురానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం ఎన్నికల రోజు పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చున్నాడని కోపంతో ఓబుల్ రెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలుదాడిలో తీవ్ర గాయాలు.. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఆసుపత్రిలో ఓబుల్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి

Political Twist Over AP BJP For Election Result
కూటమిలో కొత్త ట్విస్ట్‌.. ఏపీ బీజేపీలో ఓటమి భయం!

ఏపీ బీజేపీలో ఓటమి భయం పట్టుకుంది. పోలింగ్ ముందు ఒక లెక్క.. పోలింగ్ తర్వాత మరో లెక్కతో బీజేపీ అంచనాలు పూర్తిగా రివర్స్‌ అయిపోయాయి. టీడీపీ, జనసేన నుంచి సరైన సహకారం లేకపోవడం, మరోవైపు సొంత పార్టీ సీనియర్ నేతలు దూరంగా ఉండటంతో ఘోర ఓటమి తప్పదనే భావన ఏపీ బీజేపీలో కనిపిస్తోంది.మొత్తంగా కూటమిలో చేరి పూర్తిగా నష్టపోయామనే భావనలో బీజేపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కాషాయపార్టీ నేతలెవరూ మీడియా ముందుకు రాలేని పరిస్ధితి. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర బీజేపీలో ప్రస్తుతం నిశ్శబ్ధ వాతావరణం కనిపిస్తోంది. పోలింగ్ తర్వాత ఎందుకు బీజేపీ నేతలందరూ సైలెంట్‌ అయ్యారు.ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత వింత పరిస్ఙితి కనిపిస్తోంది. పోలింగ్ ముందు వరకు ఉన్న ఉత్సాహం.. ఆ తర్వాత బీజేపీ నేతలలో కనిపించటం లేదు. కూటమిలో చేరి పూర్తిగా తప్పు చేశామనే భావన కమలనాథుల్లో కనిపిస్తోంది. టీడీపీ, జనసేనతో కూటమిగా జత కట్టిన బీజేపీ ఆరు ఎంపీ స్ధానాలకు, పది అసెంబ్లీ స్ధానాలకు పోటీ చేసింది. వాస్తవానికి కూటమిలో చేరడాన్ని ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ల అంతా వ్యతిరేకించారు.రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కుమ్మక్కు రాజకీయాలతో రాజీ పడాల్సిన దుస్థితి బీజేపీకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్ధితులలో కూటమిలో చేరిన తర్వాత సీట్లపై మొదట పెద్ద పంచాయితీనే నడిచింది. బీజేపీ పట్టున్న ఎనిమిది ఎంపీ స్ధానాలు, కనీసం 25 అసెంబ్లీ స్దానాలలో పోటీ చేయాలని సీనియర్లు ఒత్తిడి తెచ్చారు. అయితే చంద్రబాబుతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేసిన పురందేశ్వరి కేవలం ఆరు ఎంపీ, పది ఎమ్మెల్యే స్ధానాలతో సరిపెట్టింది. ఆ తర్వాత టిక్కెట్ల కేటాయింపులలో సీనియర్లకి ప్రాధాన్యత ఇవ్వాలని సీనియర్ నేతలు ఢిల్లీ వరకు వెళ్లారు.ఇక విశాఖ ఎంపీ స్ధానం కోసం రాజ్యసభ సభ్యులు జీవీఎల్ తీవ్రంగా ప్రయత్నించారు. గత రెండేళ్లగా అధిష్టానం ఆదేశాలతో జీవీఎల్ విశాఖలోనే ఇల్లు కొనుక్కుని అక్కడే ఉంటూ పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో జీవీఎల్‌కి వెన్నుపోటు పొడుస్తూ తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కోసం పురందేశ్వరి విశాఖ సీటుని వదులుకున్నారు. ఇక విశాఖ దక్కకపోవడంతో కనీసం అనకాపల్లి అయినా దక్కుతుందని జీవీఎల్ భావించినా అక్కడా నిరాశే ఎదురైంది.ఇక, అనకాపల్లి సీటు కోసం ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్‌కు చుక్కెదురైంది. అలాగే ఏలూరు సీటు కోసం దశాబ్ధకాలంగా కష్టపడుతున్న తపనా చౌదరి ఎన్నో ఆశలు పెట్టుకుంటే కూటమి తరపున టీడీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ బరిలోకి దిగారు. ఇక రాజమండ్రిలో పుట్టి నాలుగున్నర దశాబ్ధకాలంగా బీజేపీలో ఉన్న ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుని కాదని పురందేశ్వరి రాజమండ్రి నుంచి బరిలోకి దిగారు. అటు, హిందూపూర్ ఎంపీ లేదా కదిరి స్ధానం కోసం ప్రయత్నించిన విష్టు వర్ధన్ రెడ్డి వంటి నేతకు అవకాశాలు దక్కలేదు.ఇలా సొంత పార్టీని నమ్ముకుని దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్న నేతలను కాదనుకుని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకి అవకాశం ఇవ్వడం కూడా బీజేపీలోనే అంతర్గత కుమ్ములాటలకి కారణమైంది. అనకాపల్లి ఎంపీ స్ధానాన్ని స్ధానిక నేతలకు కాకుండా టీడీపీ నుంచి గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన కడప జిల్లావాసి సీఎం రమేష్‌ను బరిలోకి దింపడం ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెంచిందని భావిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు కూడా అనకాపల్లి సీటు తమదేనని డబ్బాలు కొట్టుకున్న నేతలు పోలింగ్ ముగిసిన తర్వాత చడీచప్పుడూ లేకుండా గప్ చుప్ అయ్యారు. లెక్కలు వేసుకున్న తర్వాత సీఎం రమేష్‌ను బరిలోకి దింపి తప్పు చేశామని బీజేపీ నేతలు భావిస్తున్నారట.అసలు అనకాపల్లి సీటు కాకుండా విశాక సీటు తీసుకుని ఉంటే గెలుపుపై ధీమా ఉండేదని కూడా ఇపుడు గగ్గోలు పెడుతున్నారట. ఇక విజయవాడ వెస్ట్ నుంచి బ్యాంకులని బురిడీ కొట్టించిన సుజన్ చౌదరిని రంగంలోకి దింపడం ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్ పంపేలా చేసిందంటున్నారు. ఇక్కడ సుజానా చౌదరి దింపడం వల్లే దెబ్బ పడిందని భావిస్తున్నారట.ఇక అనపర్తి, బద్వేలు లాంటి చోట్ల రాత్రికి రాత్రి టీడీపీ నేతలను బీజేపీలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడంపైనా కాషాయ పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేశారు. అనపర్తిలో మొదటగా మాజీ సైనికుడు శివరామకృష్ణంరాజుకి కేటాయించారు. ఆ తర్వాత సీటుని అనపర్తి టీడీపీ ఇన్‌చార్జ్‌ నల్లమిల్లి రామకృష్ణరెడ్డిని రాత్రికి రాత్రి తన కారులోనే స్వయంగా పురందేశ్వరి విజయవాడ బీజేపీ కార్యాలయానికి తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుని అప్పటికపుడు టిక్కెట్ ప్రకటించారు. కేవలం తన గెలుపుకోసమే పురందేశ్వరి ఈ విధంగా చేశారని బీజేపీ సీనియర్లు మండిపడ్డారు. ఇలా చాలా వరకు సీట్ల ఎంపికలో పురందేశ్వరి.. టీడీపీకి సహకరించారు.ఇక, అనపర్తి అభ్యర్ధిగా బరిలోకి దిగిన టీడీపీ నేత నల్లమిల్లి కనీసం బీజేపీ కండువా కప్పుకోవడానికి కూడా ఇష్టపడకుండా పలుసార్లు ప్రచారం చేయడం కూడా బీజేపీని అయోమయానికి గురిచేసింది. ఇదే సమయంలో కమలదల సీనియర్లు జీవీఎల్, సోము వీర్రాజు, విష్ధువర్ధన్ రెడ్డి లాంటి వాళ్లు ఎక్కడా ప్రచారంలో కనిపించలేదు. సీనియర్ నేతలంతా కూడా జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొలేదని తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా, నడ్డా లాంటి అగ్రనేతలు ప్రచారం చేసినపుడు మాత్రం సభలలో కనిపించి సీనియర్లు మమా అనిపించారు. దీంతో, బీజేపీ పూర్తిగా ఆత్మ రక్షణలో పడింది. ఇలా వరుస తప్పిదాలతో అవకాశాలున్న చోట కూడా బీజేపీ విజయావకాశాలను జార విడుచుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, కొన్ని స్థానాల్లో బీజేసీకి క్రాస్‌ ఓటింగ్‌ భయం కూడా పట్టుకుంది.దీనికి తోడు బీజేపీ పోటీ చేసిన చోట టీడీపీ, జనసేన ఓటు పూర్తిగా బదిలీ కాకపోవడం కూడా కొంపముంచిందంటున్నారు. తమకు టికెట్‌ ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్‌ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో, ఎన్నికలపై కమలనాథులు ఎవరూ మనస్పూర్తిగా పనిచేయలేదు. అంతేకాకుండా చంద్రబాబు అబద్దపు అలవుకాని హామీలతో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా కొంత కొంప ముంచిందంటున్నారు. ఈ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు ప్రచారం చేసినా ఓటర్లని ఆకట్టుకోలేకపోయామంటున్నారు. ఆఖరికి మేనిఫెస్టో విడుదల సమయంలో చంద్రబాబు ఇస్తున్న మేనిఫెస్టోని పట్టుకోవడానికి బీజేపీ ఇన్‌చార్జ్‌ ఇష్టపడలేదు.ఇదిలాఉండగా.. ఎన్నికల ప్రచార సమయంలో అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం ఎంపీ స్ధానాలతో పాటు మరో మూడు, నాలుగు అసెంబ్లీ స్ధానాలు తమకు గ్యారంటీ అని భావించినా పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రం తగిన అంచనాలకు రాలేకపోతున్నారు. అధికార పార్టీపై ఆశించిన స్ధాయిలో వ్యతిరేకత కనిపించకపోవడం, మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేయడంతో బీజేపీని ఓటమి భయం వెంటాడుతోంది. పోలింగ్ ముగిసి లెక్కలు వేసుకున్న తర్వాత కనీసం ఒక్క సీటు కూడా రాదేమోననే ఆందోళన కాషాయ పార్టీ నేతలలో కనిపిస్తోంది. ఈ క్రమంలో ఒక్క నాయకుడు కూడా మీడియా ముందుకు వచ్చి తాము గెలుస్తామని చెప్పలేకపోతున్నారనే టాక్‌ నడుస్తో​ంది.

IPL 2024: RR or SRH Which Team Has Better Chance Of Finishing In Top 2
ఇంకొక్కటి.. అలా అయితే టాప్‌-2లో సన్‌రైజర్స్‌! నేరుగా..

ఐపీఎల్‌-2024 ఆరంభం నుంచి వరుస విజయాలతో దూసుకుపోయిన రాజస్తాన్‌ రాయల్స్‌ పరిస్థితి ఇప్పుడు తారుమారైంది. పంజాబ్‌ కింగ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఓటమితో వరుసగా నాలుగో పరాజయం నమోదు చేసింది.ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనేలీగ్‌ దశలో రాజస్తాన్‌కు ఇంకొక్క మ్యాచ్‌ మాత్రం మిగిలి ఉంది. టేబుల్‌ టాపర్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో సంజూ సేన మే 19న తలపడనుంది. అయితే, కేకేఆర్‌తో పాటు రాజస్తాన్‌ కూడా ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ చేరినా.. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే రాజస్తాన్‌ రెండో స్థానంలో నిలవగలుగుతుంది.అప్పుడు నేరుగా కేకేఆర్‌తో క్వాలిఫయర్‌-1 ఆడుకోవచ్చు. లేదంటే ఎలిమినేటర్‌ గండం దాటాల్సి ఉంటుంది. ఇక రాజస్తాన్‌ ఇలా చిక్కుల్లో పడటం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పాలిట వరంలా మారింది.సన్‌రైజర్స్‌ పాలిట వరం.. ఎందుకంటే?లీగ్‌ దశలో హైదరాబాద్‌ జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. గుజరాత్‌ టైటాన్స్‌(మే 16), పంజాబ్‌ కింగ్స్‌(మే 19)న ఎస్‌ఆర్‌హెచ్‌ తలపడనుంది. ఈ రెండింటికి రెండూ గెలిస్తే రైజర్స్‌ ఖాతాలో 18 పాయింట్లు చేరతాయి.సొంతమైదానం ఉప్పల్‌లో ఈ మ్యాచ్‌లు జరుగనుండటం, ఇప్పటికే సొంతగడ్డపై ఆరెంజ్‌ ఆర్మీకి ఉన్న విధ్వంసకర రికార్డు చూస్తే ఇది సాధ్యమే అనిపిస్తోంది.ఒక్కటి ఓడినా కూడాఅలా కాకుండా.. రాజస్తాన్‌ తమ ఆఖరి మ్యాచ్‌లో ఓడి.. సన్‌రైజర్స్‌ కూడా ఈ రెండింటిలో ఒకటి ఓడితే.. అప్పుడు కూడా హైదరాబాద్‌ జట్టు టాప్‌-2తో ముగించే అవకాశం ఉంటుంది.ఈ నేపథ్యంలో రెండు జట్లకు సమానంగా పాయింట్లు(16) వచ్చినా రన్‌రేటు పరంగా సన్‌రైజర్స్‌ ముందుంటే రాజస్తాన్‌ను వెనక్కినెట్టడం ఖాయం. అప్పుడు పట్టికలో సన్‌రైజర్స్‌ రెండో స్థానానికి చేరితే క్వాలిఫయర్‌-1కు అర్హత సాధిస్తుంది.అలా అయితే మొదటికే మోసం మరి!అలా కాకుండా ఆఖరి రెండు మ్యాచ్‌లూ ఓడిపోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ప్లే ఆఫ్స్‌ చేరాలంటే.. కేకేఆర్‌- రాజస్తాన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌- ఆర్సీబీ మ్యాచ్‌ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అదీ సంగతి!ఐపీఎల్‌-2024 పాయింట్ల పట్టిక(మే 15 నాటికి)లో టాప్‌-5 ఇలా:1. కేకేఆర్‌- ఆడినవి 13.. గెలిచినవి 9.. పాయింట్లు 19.. నెట్‌ రన్‌రేటు 1.428(ప్లే ఆఫ్స్‌నకు అర్హత)2. రాజస్తాన్‌- ఆడినవి 13.. గెలిచినవి 8.. పాయింట్లు 16.. నెట్‌ రన్‌రేటు 0.273(ప్లే ఆఫ్స్‌నకు అర్హత)3. చెన్నై సూపర్‌ కింగ్స్‌- ఆడినవి 13.. గెలిచినవి 7.. పాయింట్లు 14.. నెట్‌ రన్‌రేటు 0.5284. సన్‌రైజర్స్‌- ఆడినవి 12.. గెలిచినవి 7.. పాయింట్లు 14.. నెట్‌ రన్‌రేటు.. 0.406.5. ఆర్సీబీ- ఆడినవి 13.. గెలిచినవి 6.. పాయింట్లు 12.. నెట్‌ రన్‌రేటు.. 0.387.విజేతకు దారిలా👉 క్వాలిఫయర్‌-1(మే 21): టాప్‌-2 జట్ల మధ్య.. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లోకి..👉ఎలిమినేటర్‌(మే 22): టాప్‌-3, 4 లో ఉన్న జట్ల మధ్య.. ఓడిన జట్టు ఇంటికి.. 👉గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టుతో క్వాలిఫయర్‌-2 ఆడుతుంది.👉క్వాలిఫయర్‌-2(మే 24): గెలిచిన జట్టు ఫైనల్‌లో అడుగుపెడుతుంది.👉ఫైనల్‌(మే 26): క్వాలిఫయర్‌-1- క్వాలిఫయర్‌-2 మధ్య పోరు. గెలిచిన జట్టు చాంపియన్‌.చదవండి: Virat Kohli: కోహ్లి నోట రిటైర్మెంట్‌ మాట.. ఒక్కసారి క్రికెట్‌కు వీడ్కోలు పలికితే!

War One Side in Minister Amarnath Predicts On AP Election Results
‘ఏపీలో వార్‌ వన్‌ సైడే.. YSRCPదే గెలుపు’

విశాఖపట్నం, సాక్షి: పోలింగ్‌ పర్సంటేజ్‌ పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమనే అభిప్రాయం తప్పని.. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలనే ఏపీలో ఓటర్లు పోటెత్తారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అంటున్నారు. గురువారం విశాఖలో వైఎస్సార్‌సీపీ నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో కష్టపడి పని చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు. గ్రామీణ ఓటర్లు మన పార్టీ వైపే నిలబడ్డారు. అన్ని ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. సీఎం జగన్ తో మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. సంక్షేమం అభివృద్ధికే ప్రజలు ఓటేసి పట్టం కట్టబోతున్నారు.. ..గతంలో ఓటింగ్‌ పెరిగినప్పుడు కూడా ఉన్న ప్రభుత్వాలే గెలిచిన దాఖలాలు ఉన్నాయి. గతంలో.. మహాకూటమి జత కట్టిన సమయంలో దివంగత మహానేత వైఎస్సార్‌ ఘన విజయం సాధించారు. ఇప్పుడు కూడా సీఎం జగన్‌ విజయం సాధిస్తారు. గతంలో కంటే వైఎస్సార్‌సీపీకి ఎక్కువ సీట్లే వస్తాయి. .. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలబడింది. అందుకే వార్‌ వన్‌సైడ్‌ కాబోతోంది. ఏకపక్షంగా విజయం సాధించబోతున్నాం. వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం కాబోతున్నారు. .. ప్రతిపక్ష పార్టీలు ప్రెస్టేషన్ లో గొడవలకు దిగుతున్నారు. ప్రతిపక్షాలు తాము చేస్తున్న అల్లర్లకు, హింసకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకూడదు. కేంద్రంలో ఏ పార్టీకి, కూటమికి మెజారిటీ రాకూడదు. మన పార్టీల అవసరం వాళ్లకు పడాలి. పనికిమాలిన పార్టీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు షర్మిలకు డిపాజిట్ వస్తుందో లేదో చూసుకోమనండి’’ అంటూ అమర్నాథ్‌ ప్రసంగించారు.

Delhi High Court Hearing BRS MLC Kavitha Bail Petition Over Liquor Scam
కవిత బయటకు వచ్చేనా?.. కాసేపట్లో బెయిల్‌పై విచారణ

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్‌ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె బెయిల్‌ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ జరుగనుంది. కవిత బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఈరోజైన కవిత బెయిల్‌ దొరుకుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. కాగా, లిక్కర్‌ స్కాం కేసులో భాగంగా ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్‌ కోసం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ఇదే ధర్మాసనం గత శుక్రవారం విచారించి ఈడీ సమాధానం కోరుతూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ను తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు సౌత్‌ గ్రూప్‌ తరఫున కవిత ఆప్‌ అగ్ర నేతలకు రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారన్న కారణంతో ఈడీ మార్చి 15న, సీబీఐ ఏప్రిల్‌ 11న ఆమెను అరెస్ట్‌ చేశాయి. జ్యుడిషియల్‌ కస్టడీలో భాగంగా ఆమె ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్నారు. ఈ రెండు కేసుల్లో బెయిల్‌ కోరుతూ కవిత చేసుకున్న దరఖాస్తులను రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా కొట్టివేశారు. ఈ క్రమంలో ఈనెల 6న తీర్పునిచ్చారు. ఈ మొత్తం కుంభకోణంలో ఈమెదే ప్రధానపాత్ర అని, బెయిలిస్తే సాక్ష్యాధారాలను, సాక్షులను ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థలు చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి బెయిల్‌ పిటిషన్లను కొట్టివేశారు. దీంతో, రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

CAA Is Modi Guarantee, No One Can Remove It: PM At Azamgarh
‘CAA మోదీ గ్యారెంటీ.. ఎవరూ చెరపలేరు’

లక్నో: మోదీ వెళ్లిపోతే.. సీఏఏ కూడా వెళ్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, సీఏఏ మోదీ గ్యారెంటీ అనిర, దానిని ఎవరూ తొలగించలేరని బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ఉత్తర ప్రదేశ్‌ అజాంఘడ్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మోదీ గ్యారెంటీలపై ప్రజలకు నమ్మకం ఉంది. సీఏఏ(CAA) చట్టమే మోదీ గ్యారెంటీకి తాజా ఉదాహరణ. సీఏఏ కింద భారత పౌర సత్వం ఇవ్వడం మొదలైంది. దేశంలో వీరంతా చాలా ఏళ్లుగా శరణార్థులుగా ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోనూ లక్షలమంది శరణార్థులు ఉన్నారు. వాళ్లందరికీ కూడా పౌరసత్వం లభిస్తుంది. మోదీ వెళ్తే సీఏఏ కూడా వెళ్లిపోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, మోదీ గ్యారెంటీని ఎవరూ చెరపలేరు. విపక్ష కూటమి ఓటు బ్యాంక్‌ రాజకీయం చేస్తోంది. కానీ, ప్రజలంతా బీజేపీ, ఎన్డీయే కూటమితోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఒక్కటే మాట వినిపిస్తోంది. అదే ఫిర్‌ ఏక్‌ బార్‌.. 400 పార్‌. మోదీ గ్యారెంటీ కశ్మీర్‌లోనూ కనిపిస్తోంది. కశ్మీర్‌లో శాంతికి గ్యారెంటీ ఇచ్చాం. కశ్మీర్‌లో తీసుకున్న చర్యలతో విపక్షాల నోళ్లు మూతలు పడ్డాయి. మోదీ వెళ్తే ఆర్టికల్‌ 370 రద్దు కూడా పోతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ, నాల్గొ దశలో జరిగిన పోలింగ్‌లో శ్రీనగర్‌ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు అని ప్రధాని మోదీ అన్నారు.దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా ఆజాంఘడ్‌ గురింంచి చర్చ వచ్చేది. స్లీపర్‌సెల్స్‌ గురించి చర్చ జరిగేది. సమాజ్‌వాదీ పార్టీ ఎప్పుడూ ఆజాంఘడ్‌ గురించి ఆలోచించలేదు. ఆజాంఘడ్‌లో కమలం వికసిస్తేనే.. అభివృద్ధి జరుగుతుంది అని ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇండియా కూటమి రిజర్వేషన్లతో రాజకీయం చేస్తోంది. 50 శాతం బడ్జెట్‌ను మైనారిటీలకు కేటాయించాలనుకుంటోంది. 70 ఏళ్లుగా హిందూ, ముస్లిం అంటూ మతాల పేరిట వాళ్లు విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు దేశమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. రామమందిర ప్రారంభం నాడు ఇండియా కూటమి ఎన్నో విమర్శలు చేసింది. పేదల అభివృద్ధి కోసం పగలు రాత్రి కష్టపడుతున్నా. మీ బాధలన్నింటిని తొలగిస్తున్నాం. వివిధ పథకాలతో పేదలను ఆదుకుంటున్నాం అని మోదీ తెలిపారు.

Actor Chandrakanth Emotional Over Pavithra Jayaram Lost Her Life
రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!

త్రినయని సీరియల్‌ నటి పవిత్ర గౌడ రెండు రోజుల క్రితం మరణించింది. అయితే తను యాక్సిడెంట్‌లో మరణించలేదంటున్నాడు నటుడు చంద్రకాంత్‌. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పవిత్ర గురించి చెప్తూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. 'కన్నడలో ఓ సినిమాకు సంతకం చేసేందుకు మేమంతా బెంగళూరు వెళ్లాం. అక్కడ ప్రాజెక్టుకు ఒప్పుకుని కొంత అడ్వాన్స్‌ తీసుకుని హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యాము. నటికి గాయాలవలేదు!కారులో నేను, పవిత్ర వెనకాల కూర్చున్నాం. ముందు డ్రైవర్‌ పక్కన పవిత్ర సోదరి కూతురు ఉంది. అందరమూ గాఢ నిద్రలో ఉన్నాం. బస్‌ మమ్మల్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో మా కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. అప్పుడు నా ఒక్కడికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. పవిత్రకు ఒక్క దెబ్బ కూడా తగల్లేదు. నన్ను రక్తపు మడుగులో చూసేసరికి నాన్నా ఏమైందంటూ షాక్‌లోకి వెళ్లిపోయింది. అంబులెన్స్‌ ఆలస్యంగా రావడం వల్లే తను మరణించింది. అంబులెన్స్‌ సమయానికి వచ్చుంటే తను బతికేది. గుండెపోటు వల్లే తన ఊపిరి ఆగిపోయిందని వైద్యులు పేర్కొన్నారు.ఇంతలోనే..మేము భార్యాభర్తలమన్న విషయాన్ని అధికారికంగా చెప్దామనుకున్నాము. ఇంతలోనే తను నన్ను మోసం చేసి వెళ్లిపోయింది. నా జీవితం ఎటు కాకుండా పోయింది. ఆ దేవుడు తనను అలాగే ఉంచి నన్ను తీసుకెళ్లినా బాగుండేది. నా పవిత్ర గురించి తప్పుడుగా ప్రచారం చేయకండి.. అది చాలా మంచి మనిషి' అని చంద్రకాంత్‌ కన్నీరుమున్నీరుగా విలపించాడు.చదవండి: గాయపడిన ఐశ్వర్య రాయ్‌.. అయినా అక్కడికి ప్రయాణం

Australian Doctor Claims He Beat Brain Cancer With Self Invented Treatment
వైద్యుడి ఘనత! తాను కనిపెట్టిన వైద్యంతో బ్రెయిన్‌ కేన్సర్‌ని జయించాడు!

కేన్సర్‌ అంటేనే.. ఎలాంటి వాళ్లు అయినా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. ఏ స్టేజ్‌లో ఉందో? నయం అవుతుందో? లేదా? అన్న భయాలు మొదలైపోతుంటాయి. ఎంతటి వాడినైనా కుదేలయ్యిపోయేలా చేస్తుంది. అలాంటి కేన్సర్‌ మహ్మమ్మారిని తను కనిపెట్టిన వైద్య విధానంతో స్వీయ చికిత్స తీసుకుని జయించి చరిత్ర సృష్టించాడు ఓ వైద్యుడు. తన జీవితాన్ని పొడిగించుకున్నందకు సంబరపడిపోతున్నాడు.ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ప్రముఖ ఆస్ట్రేలియా వైద్యుడు ప్రొఫెసర్‌ రిచర్డ్‌ స్కోలియర్‌ బ్రెయిన్‌ కేన్సర్‌ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. అప్పుడు ఆయనకు 57 ఏళ్లు. నిజానికి ఈ వ్యాధి వచ్చిన వాళ్లు 12 నెలలకు మించి బతకరు. దీంతో ఈ వ్యాధిపై అవగాహన ఉన్న రిచర్డ్‌ ..తన స్నేహితుడు ప్రొఫెసర్‌ జార్జినా లాంగ్‌ సాయంతో కొత్త చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు. దాన్ని తనపైనే ప్రయోగం చేసుకున్నాడు రిచర్డ్‌. ఈ చికిత్స విధానం సర్జరీ రహితం. ఆశ్చర్యకరంగా ఆ చికిత్స బాగా పనిచేసి మెదడులోని కణుతులన్నీ మాయమైపోయాయి. తాజాగా ఎమ్మారై తీయగా కణితులు కనిపించకపోవడంతో రిచర్డ్‌ ఆనందం వ్యక్తం చేశారు. తానిప్పుడు చెప్పలేనంత భావోద్వేగానికి గురవ్వుతున్నానని అన్నారు. తన జీవితకాలాన్ని పొడిగించుకున్నాని, తన భార్య, పిల్లలతో కలిసి మరికొంత కాలం కలిసి జీవించే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు రిచర్డ్‌. ఈ చికిత్స విధానం సుమారు మూడు లక్షల మందికి ఉపయోగపడుతుందని చెప్పారు. సర్జరీ లేకుండా చేసే ఈ "ఇమ్యూనో థెరపీ' పెద్ద సంఖ్యలో ఉపయోగడుతుందని ధీమాగా చెబుతున్నారు. అంతేగాక ఈ చికిత్సలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తెచ్చి మరింతగా అభివృద్ధి చేయడమే గాక విస్తృతమైన క్లినకల్‌ ట్రయల్స్‌ నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని జార్జిన్‌ లాంగ్‌ అన్నారు. (చదవండి: 'ఇడియట్‌ సిండ్రోమ్‌' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?)

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement