Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

Telangana SSC Result 2024 Released
తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఫాస్ట్‌గా రిజల్ట్‌ను చూసుకునేందుకు సాక్షి ఎడ్యుకేషన్‌ వెసులుబాటు కల్పిస్తోంది.ఫలితాల కోసం క్లిక్‌ చేయండిఈ ఏడాదికిగానూ ఐదు లక్షల మంది పరీక్ష రాసినట్లు ఎడ్యుకేషన్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలదే పైచేయి అని ఎడ్యుకేషన్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాంత ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. 3927 పాఠశాలలు ఉత్తీర్ణత సాధించాయని.. నిర్మల్ జిల్లా 99.05 శాతంతో మొదటి స్థానం, వికారాబాద్ జిల్లా 65.10 శాతం చివరి స్థానంలో నిలిచిందని చెప్పారు. 4లక్షల 94 వేల 207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, ఇందులో 4,51, 272 మంది ఉత్తీర్ణత  సాధించారు. జూన్ 3 నుండి 13 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు.  

Watch Live: AP CM YS Jagan Public Meeting at Tangutur
Watch Live: టంగుటూరులో సీఎం జగన్‌ ప్రచార సభ

Watch Live: టంగుటూరులో సీఎం జగన్‌ ప్రచార సభ

Rishabh Got it wrong: Michael Clarke Slams Pant After Heavy Loss vs KKR
రిషభ్‌ పంత్‌దే తప్పు.. అతడి వల్లే ఓటమి!

ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ తీరును ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ తప్పుబట్టాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో ఓటమి అనంతరం అతడు చేసిన వ్యాఖ్యలను విమర్శించాడు. ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌పై పరుగులు రాబట్టడంలో విఫలమైన తరుణంలో పంత్‌ తన నిర్ణయాన్ని సమర్థించుకోవడం ఏమీ బాలేదన్నాడు.పవర్‌ప్లే ముగిసేసరికిఐపీఎల్‌-2024లో సోమవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ కేకేఆర్‌ను ఢీకొట్టింది. టాస్‌ గెలిచిన పంత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కేకేఆర్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌  వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లతో మొదలు పెట్టినా... పృథ్వీ షా (13) ఎక్కువసేపు నిలవలేదు.స్టార్క్‌ తర్వాతి ఓవర్లోనే వరుసగా 6, 4 కొట్టిన జేక్‌ ఫ్రేజర్‌ (12) తర్వాతి బంతికి వెనుదిరగడంతో ఢిల్లీకి ఆశించిన ఆరంభం లభించలేదు. షై హోప్‌ (6) విఫలం కాగా... హర్షిత్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన అభిషేక్‌ పొరేల్‌ (18) కూడా జోరు కొనసాగించలేకపోయాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 67 పరుగులకు చేరింది.కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (20 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా తనదైన శైలిలో ఆడలేకపోవడంతో క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో ఎలాంటి మెరుపులు కనిపించలేదు. 18 పరుగుల వద్ద తాను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను హర్షిత్‌ వదిలేయడంతో బతికిపోయిన పంత్‌ దానిని వాడుకోలేకపోయాడు.కుల్దీప్‌ చక్కటి షాట్లుఎనిమిది పరుగుల వ్యవధిలో పంత్, స్టబ్స్‌ (4), అక్షర్‌ (15) వెనుదిరగ్గా... 101/7 వద్ద ఢిల్లీ ఇన్నింగ్స్‌ ముగిసేలా కనిపించింది. అయితే కుల్దీప్‌ కొన్ని చక్కటి షాట్ల(26 బంతుల్లో 35)తో చివరి వరకు నిలబడటంతో క్యాపిటల్స్‌ 150 పరుగులు దాటగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌.. కేవలం మూడు వికెట్లు నష్టపోయి 16.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీని మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సారథి పంత్‌ మాట్లాడుతూ.. ‘‘తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోవడం మంచి ఆప్షనే. కాకపోతే మా బ్యాటింగ్‌ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.రిషభ్‌ పంత్‌దే తప్పు.. అతడి వల్లే ఓటమి!ఇక్కడ 180 -210 పరుగులు స్కోరు చేయవచ్చు. కాకపోతే ఈరోజు మాత్రం కాస్త పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేది’’ అని పేర్కొన్నాడు.ఈ మేరకు పంత్‌ చేసిన వ్యాఖ్యలపై మైకేల్‌ క్లార్క్‌ స్పందిస్తూ.. ‘‘ఓటమి తర్వాత పంత్‌ మాట్లాడిన తీరుతో నేను ఏకీభవించను. ఒకవేళ గెలిచి ఉంటే ఆ నిర్ణయం(టాస్‌) సరైందిగా ఉండేది.ఓడిపోయారు కాబట్టి తప్పును అంగీకరించాల్సిందే. ఇలాంటి పిచ్‌పై పంత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని కచ్చితంగా తప్పు చేశాడనే నా అభిప్రాయం. వాళ్లు కేవలం పది పరుగులు కాదు.. తక్కువలో తక్కువ యాభై పరుగులు వెనుకబడి ఉన్నారు.ఎందుకంటే లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు ఇంకా 3.3 ఓవర్లు మిగిలే ఉన్నాయన్న విషయం మరవొద్దు. చేతిలో ఏడు వికెట్లు కూడా ఉన్నాయి. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ కనీసం 200 పరుగులు చేయాల్సింది’’ అని అభిప్రాయపడ్డాడు.  A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024

Road Accident at Yanam Amalapuram Road
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టినరోజు వేడుక

అనుబంధం తెగిపోయి.. ఆనందం ఆవిరి.. ఆ ఘోర ప్రమాదం..  ఆశలను చిదిమేసింది.. అనుబంధాలను చెరిపేసింది.. జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఆ కుటుంబాలకు ఆసరా లేకుండా మార్చింది.. చేయి పట్టుకుని నడిచే పిల్లలకు తండ్రి లేకుండా చేసింది.. కట్టుకున్నవాడిని భార్యకు దూరం చేసింది.. తోడుగా ఉంటాడనుకున్న కుటుంబానికి కుమారుడిని లేకుండా చేసింది. అమలాపురం రూరల్‌ మండలం భట్నవిల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు మిగిలిన వేదన ఇది.అమలాపురం రూరల్‌/ మామిడికుదురు: వారంతా స్నేహితులు... హ్యాపీ హ్యాపీగా సహచరుడి ముందస్తు పుట్టినరోజు వేడుకకు బయలు దేరారు.. జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు.. కేక్‌ కట్‌ చేసుకుని సందడి చేశారు.. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో దారి కాచిన మృత్యువు లారీ రూపంలో వారి ఆనందాన్ని ఆవిరి చేసింది.. అమలాపురం రూరల్‌ మండలం భట్నవిల్లిలోని వనువులమ్మ ఆలయం వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం..  మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్‌ (26) పుట్టినరోజు సోమవారం కావడంతో ముందస్తు వేడుకలు జరుపుకొనేందుకు స్నేహితులు నిర్ణయించుకున్నారు. మొత్తం ఎనిమిది మంది పుదుచ్చేరి ప్రాంతం యానాంకు నెల్లి నవీన్‌కుమార్‌ ఆటోలో ఆదివారం రాత్రి 8 గంటలకు బయలు దేరారు. యానాంలో విందు ముగిశాక అర్ధరాత్రి సమయంలో తిరుగు పయనమయ్యారు. భట్నవిల్లి వచ్చేసరికి కాకినాడ వైపు ఒడిశాకు చేపల లోడుతో వెళుతున్న లారీ వారి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన సాపే నవీన్‌ (22), అదే గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్‌ (26), అదే మండలం పాశర్లపూడికి చెందిన నెల్లి నవీన్‌కుమార్‌ (27), పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్‌ (18) అక్కడికక్కడే చనిపోయారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి శివారు కొండాలమ్మ చింతకు చెందిన మల్లవరపు వినయ్‌బాబు (17), అదే గ్రామానికి చెందిన మార్లపూడి లోకేష్‌ (17), పెదపటా్ననికి చెందిన జాలెం శ్రీనివాసరెడ్డి (17), నగరం శివారు పితానివారి మెరక గ్రామానికి చెందిన మాదాసి ప్రశాంత్‌కుమార్‌ (17)లు  తీవ్రంగా గాయపడి అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో జాలెం శ్రీనివాసరెడ్డి, మాదిసి ప్రశాంత్‌కుమార్‌ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.  తరుక్కుపోయిన గుండెలుచేతికందివచ్చిన తమ పిల్లలు మృత్యవాత పడి విగత జీవులుగా పడి ఉండడం చూసి మృతుల తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. తన కుటుంబానికి దిక్కెవరంటూ జతిన్‌ భార్య ఆశాదేవి బంధువులను దీనంగా అడుగుతుంటే చూపురుల గుండెలు తరుక్కుపోయాయి. కువైట్‌లో ఉంటున్న తల్లులకు పిల్లల మృత్యు వార్త ఎలా చెప్పాలంటూ నవీన్, అజయ్‌ కుటుంబీకులు ఆందోళన చెందారు. ప్రమాద వార్త తెలియగానే మృతుల, క్షతగాత్రుల కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ కుటుంబాలన్నీ రొక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఆటో నడుపుకొంటూ, ఎల్రక్టీíÙయన్‌గా పనిచేస్తూ నవీన్‌కుమార్, జతిన్‌ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. మిగిలిన వారంతా డిగ్రీ, ఇంటరీ్మడియెట్‌ చదువుకుంటూ భవిష్యత్‌ కోసం బాటలు వేసుకుంటున్నారు. అమలాపురం రూరల్‌ సీఐ పి.వీరబాబు, రూరల్‌ ఎస్సై శేఖర్‌బాబు ప్రమాద స్థలిని తక్షణమే సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రికి తరలించి వేగంగా వైద్యం అందేలా సీఐ, ఎస్సైలు శ్రమించారు.పుట్టిన రోజునే పరలోకానికి..  నగరం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్‌ (26) ఎలక్ట్రీయన్‌గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సోమవారం అతని పుట్టిన రోజు. పుట్టిన రోజు వేడుకకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కొత్త దుస్తులు కొనుక్కున్నాడు. సరదాగా స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు ఆదివారం రాత్రి అంతా కలసి బయటకు వెళ్లారు. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చి తనువు చాలించాడు. జతిన్‌కు ఆరేళ్ల కిందట వివాహమైంది. అతనికి భార్య ఆశాదేవి, ఐదేళ్ల కుమార్తె ఆత్య, ఏడు నెలల కొడుకు ఉన్నారు. జతిన్‌ మృతితో భార్య ఆశాదేవి, తండ్రి వెంకటేష్‌, తల్లి దివ్య కన్నీరు మున్నీరవుతున్నారు. అభం, శుభం తెలియని పిల్లలకు నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలంటూ వారు విలపిస్తున్నారు.  ఒక్కగానొక్క కుమారుడి మృతితో.. నగరం కోటమెరకకు చెందిన సాపే నవీన్‌ (22) డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్నా డు. తండ్రి శ్రీనివాసు రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి రత్న కుమారి కువైట్‌లో ఉంది. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో అతని కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది. నవీన్‌ అమ్మమ్మ బత్తుల మేరీరత్నం తన మనవడి వద్దే ఉంటూ అతడిని అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. చదువుకుని ఎంతో ప్రయోజకుడవుతాడని ఆశించిన నవీన్‌ దుర్మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు.  కిరాయికి వెళ్లి.. మృత్యుఒడికి చేరి పాశర్లపూడి నెల్లివారిపేటకు చెందిన నెల్లి నవీన్‌కుమార్‌ (27) అవివాహితుడు. ఐదు నెలల కిందట కొత్త ఆటో కొనుక్కున్నాడు. తండ్రి ట్రక్కు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నవీన్‌కుమార్‌ తల్లి మంగాదేవి పదేళ్ల నుంచి మస్కట్‌లో ఉంటున్నారు. తండ్రి, కొడుకు ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. స్నేహితుడి పుట్టినరోజు, ఆటో కిరాయికి వెళ్లిన నవీన్‌కుమార్‌ రోడ్డు ప్రమాదంలో మ్యత్యువాత పడడం స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.సరదాగా వెళ్లి.. పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్‌ (18) ఇంటర్‌ పూర్తి చేశాడు. తండ్రి శ్రీనివాసరావు నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. అతను గల్ఫ్‌లో ఉంటున్నాడు. తల్లి కుమారి ఇటీవల గల్ఫ్‌ నుంచి వచ్చారు. కొడుకును ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అందివచ్చిన కొడుకు స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లి ఇలా విగతజీవిగా మారతాడని కలలో కూడా ఊహించలేదని ఆమె విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది.    

Kadiri MLA Candidate Kandikunta Venkata Prasad Kabza
కబ్జాల కందికుంట

కదిరి: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ పేరు వినగానే కదిరి నియోజకవర్గ ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఆయన కన్ను పడితే విలువైన స్థలాలు, పొలాలు కబ్జా కావాల్సిందేనన్న విమర్శలు ఉన్నాయి. బాధితుల్లో ఎంతోమంది ముస్లింలు, ఇతర సామాజిక వర్గం వారు ఉన్నారు. కబ్జాలను ఎవరైనా ప్రశ్నిస్తే అనుచరులతో దాడులు, దౌర్జన్యాలు చేయించడం ఆయన నైజంగా ఉంది. ప్రజాకంఠకుడిగా ఉన్న ఈయనకే ప్రతి ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్‌ కేటాయిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. మీడియా ముందు మాత్రం కందికుంట నీతి సూక్తులు చెబుతుండడం చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు.బొరుగులమ్మి సంపాదించిన స్థలం.. కదిరి పట్టణంలోని జామియా మసీదు వీధికి చెందిన పి.ఖాజామోద్దీన్‌ అలియాస్‌ బొరుగుల ఖాజా కొన్నేళ్ల క్రితం ఊరూరా తిరిగి బొరుగులు అమ్మేవాడు. ఈ వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో కదిరి–హిందూపురం రోడ్‌లో అప్పట్లో సర్వే నంబరు 70/3–3లో 4.50 ఎకరాల పొలం కొన్నాడు. కుటుంబ అవసరాల కోసం అందులో 1.50 ఎకరాలు అమ్మేయగా.. మూడెకరాలు అలానే ఉంది. ఖాజామోద్దీన్‌కు ఐదుగురు సంతానం. ఆయన మరణానంతరం ఆ పొలాన్ని కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా సాగుచేస్తూ వచ్చారు. ఆడ పిల్లలందరూ పెళ్లీడుకు రావడంతో వారికి పెళ్లి చేసేందుకు ఆ మూడెకరాల భూమిని అమ్మాలని కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.డబ్బు చెల్లించకుండానే ఇతరులకు రిజిస్ట్రేషన్ఆ భూమిని అమ్ముతారనే విషయం తన అనుచరుల ద్వారా కందికుంటకు తెలిసింది. వెంటనే వారిని పిలిపించి సెంటు రూ.80 వేల చొప్పున బేరం కుదుర్చుకొని వెంటనే రూ.లక్ష అడ్వాన్స్‌గా ఇచ్చారు. తర్వాత ఆ మిగిలిన డబ్బు ఇచ్చి భూమి రిజి్రస్టేషన్‌ చేయించుకోండని ఖాజామోద్దీన్‌ కుటుంబ సభ్యులు కందికుంట ఇంటి దగ్గర వేచి ఉండటం దినచర్యగా మారింది. కొన్ని రోజులు గడిచాక ఓ రోజు ‘ఆ భూమితో మీకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆ భూమి మాది. ఇదిగో మా బంధువుల పేరు మీద ఆ భూమికి సంబంధించి కదిరి రెవెన్యూ వారు మంజూరు చేసిన పట్టాదారు పాసుపుస్తకం’ అంటూ కందికుంట తెలపడంతో వారికి గుండె ఆగినంత పనైంది. ప్రశ్నించే ధైర్యం లేక, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఇంటి దారి పట్టక తప్పలేదు. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.20 కోట్లు చేస్తుంది.బాధిత యువకుడిపై హత్యాయత్నం ఖాజామోద్దీన్‌ మనవడు అమీర్‌ఖాన్‌ 2018 జూలై 14న జేసీబీని తీసుకెళ్లి పొలం చదును చేయిస్తున్నాడు. ఈ విషయం కందికుంటకు తెలిసి వెంటనే తన అనుచరులను అక్కడికి పంపి ఆ యువకుడిపై రాళ్ల దాడి చేయించాడు. గుండెలపై బండ రాళ్లతో  కొట్టి చంపడానికి కూడా ప్రయత్నించారు. ఈలోగా వారి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ఏడుస్తుంటే జనం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆరోజు నుంచి ఈరోజు వరకు ఆ స్థలం వైపు బాధితులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడుతున్నారు.  కందికుంట మాత్రం ఆ స్థలం తమదేనని బుకాయించడంతో పాటు మీడియా ముందు తాను సచీ్చలుడినంటూ నీతి సూక్తులు వల్లిస్తున్నాడు.చిత్తుగా ఓడించండి అమాయక ప్రజల భూమిని ఆక్రమించి, దానికి తప్పుడు పత్రాలు సృష్టించి ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి అందులోకి ఇతరులెవ్వరూ ప్రవేశించకుండా కందికుంట ప్రస్తుతం దానికి పెద్ద గేట్‌ కూడా ఏర్పాటు చేయించాడు. ఆ స్థలం యజమానులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులే కాకుండా ఆ దారిగుండా వెళ్లే ప్రతి ఒక్కరూ కందికుంటకు శాపనార్థాలు పెడుతున్నారు. ఇలాంటి వ్యక్తికి     చంద్రబాబు ప్రతిసారీ ఎందుకు టికెట్‌ ఇస్తున్నాడో అర్థం కావడం లేదని జనం తప్పుబడుతున్నారు. పేదల స్థలాలు కబ్జా చేసే కందికుంటను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.  

Sundhara Travels Actress Radha attack on Real estate man
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని చితకబాదిన నటి రాధ

సుందరా ట్రావెల్స్‌ చిత్ర కథానాయకి మరో వివాదంలో చిక్కుకున్నారు. దీంతో పోలీసులు కేసు గురించి విచారణ జరుపుతున్నారు. వివరాలు చూస్తే.. చెన్నై, నెర్కుం  డ్రం, పల్లవన్‌నగర్‌ సమీపంలోని ఏరిక్కరై వీధికి చెందిన వ్యక్తి మురళీకృష్ణన్‌ (48) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో పాటు, ఎల్‌ఐసీ ఏజెంట్‌గానూ వ్యవహరిస్తున్నారు. మురళీకృష్ణన్‌ మాట్లాడుతూ ద్వారకేశ్‌ అనే తన మిత్రుడికి నటి రాధ పరిచయం చేశానన్నారు. దీంతో ఆమె రెండేళ్ల క్రితం 90 వేలు బిట్‌ కాయిన్స్‌ పె ట్టుబడి పెట్టారన్నారు. అయితే అప్పటినుంచి అత ను ఆ బిట్‌ కాయిన్స్‌ను నటి రాధకు తిరిగి చెల్లించలేదన్నారు. దీంతో నటి రాధ ద్వారకేశ్‌ను పరిచయం చేసిన తనను ఆ బిట్‌ కాయిన్స్‌ తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేశారన్నారు. అలా రాధ, ఆమె తల్లి పల్లవి, కొడుకు మరో ముగ్గురు స్థానిక చూలైమేడులోని తన కార్యాలయానికి వచ్చి గొడవ చేశారన్నారు. వాగ్వాదం తరువాత నటి రాధ తనను కిందకు పడేసి కొట్టారన్నారు. దీంతో తన అనుచరు లు స్థానిక రాయపేటలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్చారని, తన తలకు మూడు కుట్లు పడ్డాయని చె ప్పారు. అనంతరం తాను స్థానిక వడపళనిలో పోలీస్‌స్టేషన్‌లో నటి రాధ, ఆమె కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాగా పోలీసులు ఈ వ్యహారంపై విచారణ జరుపుతున్నారు.    

YSRCP complains to Chief Electoral Officer of AP
అమల్లోలేని ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారం

సాక్షి, అమరావతి: ‘అమల్లో లేని ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ గురించి తెలుగుదేశం పార్టీ ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లను తప్పుదారి పట్టిస్తోంది. ఇది ఎన్నికల మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌కు విరుద్ధం. టీడీపీపై తగిన చర్యలు తీసుకోండి’ అని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాకు వైఎస్సార్‌సీపీ సోమవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు ఎ.నారాయణ­మూర్తి, న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదుతోపాటు తగిన ఆధారాలను అందజేశారు. అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ నెల 28వ తేదీన కోడు­మూరు, మంత్రాలయంలలో జరిగిన ప్రచార సభల్లో ప్రసంగిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌పై వ్యక్తి­గతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఆయనపై తగిన చర్యలు తీసు­కోవాలని ఫిర్యాదు చేశారు.జనసేన అధ్య­క్షుడు పవన్‌కళ్యాణ్‌ ఈ నెల 28న ప్రత్తిపాడు నియో­జకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్నికల నియమావళికి విరు­ద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరి­స్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

10,000 freshers to be hired during this year, says HCLTech CEO Vijayakumar
టెకీలకు శుభవార్త.. ఈ ఏడాది 10వేల మందికి ఉద్యోగాలు

టెక్‌ కంపెనీలు జనరేటివ్‌ ఏఐపై దూకుడుగా పనిచేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో వీటిలో అపార అవకాశాలున్నట్లు గుర్తించి ఆదిశగా ముందుకుసాగుతున్నాయి. తాజాగా జనరేటివ్‌ ఏఐలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సీఈఓ విజయ్‌ కుమార్‌ తెలిపారు. మార్చి త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.కృత్రిమమేధ రంగంలో కంపెనీ చాలా మందికి శిక్షణ ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికే సుమారు 25,000 మందికి శిక్షణ ఇవ్వగా, మరో 50,000 మందికి ఈ ఏడాదిలో ట్రెయినింగ్‌ పూర్తి చేస్తామన్నారు. గడిచిన త్రైమాసికంలో కొత్తగా 2700 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు తెలిపారు. 2024-25లో పరిస్థితులను బట్టి నియామకాలుంటాయన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇలాగే కొనసాగిగే కనీసం 10,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామన్నారు. భవిష్యత్తులో ఏదైనా మార్పులు ఏదురైతే నియామకాల సంఖ్యలోనూ తేడాలుండవచ్చని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఏఐ టూల్స్‌ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థకంపనీ మార్చి త్రైమాసికంలో ఆదాయ వృద్ధి రేటు 5.4%గా నమోదైంది. టెక్‌ కంపెనీలకు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలపై క్లౌడ్‌, జనరేటివ్‌ఏఐ ప్రాజెక్టులు పెరుగుతాయని విజయ్‌ అంచనా వేశారు. అయితే ఆర్థిక సేవల విభాగంలో మాత్రం కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకావొచ్చన్నారు. రానున్న రోజుల్లో జనరేటివ్‌ ఏఐ ఆధారిత సైబర్‌ భద్రత, డేటా, క్లౌడ్‌ ఇమిగ్రేషన్‌, ప్రైవేటు ఏఐ స్టాక్‌ల నిర్మాణం తదితర విభాగాల్లో ఆర్డర్లు పెరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

IPL 2024, KKR vs DC: Phil Salt Breaks Ganguly's 14-Year-Old Record
చరిత్ర సృష్టించిన సాల్ట్‌.. గంగూలీ రికార్డు బ్రేక్‌

ఐపీఎల్‌-2024లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌ పరుగుల వరద పారించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతూ ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు.మిగతా బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బందిపడిన చోట.. సాల్ట్‌ 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో ఏకంగా 68 పరుగులు రాబట్టాడు. తద్వారా ఢిల్లీ విధించిన 154 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కేకేఆర్‌ 16.3 ఓవర్లలోనే ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.ఇక తన అద్భుత ఇన్నింగ్స్‌ ద్వారా ఫిలిప్‌ సాల్ట్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఐపీఎల్‌ సీజన్‌లో ఈడెన్‌ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సౌరవ్‌ గంగూలీ పేరిట ఉన్న రికార్డును సాల్ట్‌ బద్దలు కొట్టాడు.  ఢిల్లీ డైరెక్టర్‌గా ఉన్న గంగూలీ ముందే సాల్ట్‌ ఈ ఫీట్‌ నమోదు చేయడం విశేషం. ఐపీఎల్‌ సీజన్‌లో ఈడెన్‌ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు1. ఫిలిప్‌ సాల్ట్‌-  ఆరు ఇన్నింగ్స్‌లో 344 రన్స్‌- 20242. సౌరవ్‌ గంగూలీ- ఏడు ఇన్నింగ్స్‌లో 331 రన్స్‌- 20103. ఆండ్రీ రసెల్‌- ఏడు ఇన్నింగ్స్‌లో 311 రన్స్‌- 20194. క్రిస్‌ లిన్‌- తొమ్మిది ఇన్నింగ్స్‌లో 303 రన్స్‌- 2018.కేకేఆర్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోర్లువేదిక: ఈడెన్‌ గార్డెన్స్‌, కోల్‌కతా, సోమవారంటాస్‌: ఢిల్లీ.. బ్యాటింగ్‌ఢిల్లీ స్కోరు: 153/9 (20)కేకేఆర్‌ స్కోరు: 157/3 (16.3)ఫలితం: ఢిల్లీపై ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్‌ గెలుపుప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: వరుణ్‌ చక్రవర్తి(కేకేఆర్‌)- 4 ఓవర్ల బౌలింగ్‌ కోటాలో కేవలం 16 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు.టాప్‌ స్కోరర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ఫిలిప్‌ సాల్ట్‌(68).A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024

IPL 2024: Kolkata Knight Riders beat Delhi Capitals by 7 wickets
ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్‌

ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మరో అద్భుత విజయం సాధించింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయభేరి మోగించింది.154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ కేవలం 3 వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(33), వెంకటేశ్‌ అయ్యర్‌(26) నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. విలియమ్స్‌ఒక్క వికెట్‌ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో టెయిలాండర్‌ కుల్దీప్‌ యాదవ్‌(35) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఇక కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్‌ ఆరోరా, హర్షిత్‌ రానా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్టార్క్‌, నరైన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. కాగా కేకేఆర్‌ బౌలర్లు ఎక్స్‌ట్రాస్‌ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement