Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

YS Jaganmohan Reddy visit to Ongolu and Tanguturu on april 30
కాసేపట్లో టంగుటూరుకు సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ మూడు మూడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. తొలుత ఒంగోలు లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని కొండేపి నియోజకవర్గంలో పర్యటిస్తారు.టంగుటూరు బొమ్మల సెంటర్‌లో YSRCP నిర్వహించే ఎన్నికల  ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారాయన. ఇక సీఎం జగన్‌ రాక సందర్భంగా ఆప్రాంతంలో సందడి నెలకొంది. భారీగా పార్టీశ్రేణులు, ఆయన అభిమానులు టంగుటూరుకు చేరుకుంటున్నారు.టంగుటూరు సభ అనంతరం వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు నియోజక వర్గం పరిధిలోని మైదుకూరు జంక్షన్‌లో, ఆ తర్వాత సాయంత్రం రాజంపేట పరిధిలోని పీలేరు నియోజకవర్గం కలికిరి ప్రచార సభల్లో ప్రజల్ని ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగిస్తారు.

Tenth Class Results Out Today
నేడే టెన్త్‌ ఫలితాలు..

సాక్షి, హైదరాబాద్‌: పదవ తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలవుతాయి. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం 11 గంటలకు ఫలితాలను అధికారి కంగా విడుదల చేస్తారు. టెన్త్‌ పరీక్షల విభా గం డైరెక్టర్‌ కృష్ణారావు ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఫలితాలను  http:// results. bse.telangana.gov.in,   http://results.bsetela అనే వెబ్‌సైట్లలో చూడవచ్చని తెలిపారు.‘సాక్షి’లో వేగంగా ఫలితాలు ఇంటర్‌మీడియెట్‌ ఫలితాలను అందించిన విధంగానే టెన్త్‌ ఫలితాలను శరవేగంగా అందించేందుకు ‘సాక్షి’ దినపత్రిక ఏర్పాట్లు చేసింది. అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను అందిపుచ్చుకుంది.www.sakshieducation.com వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి ఫలితాలను చూడవచ్చు. 

46 degrees temperature registered in Nandyala district
సెగలు.. భగభగలు

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.  సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సింహాద్రిపురం (వైఎస్సార్‌)లో 45.9, రామభద్రపురం (విజయనగరం) 45.1, కోడుమూరు (కర్నూలు) 44.8, సాలూరు (పార్వతీపురం మన్యం) 44.5, రాపూరు (నెల్లూరు) 44.4, లక్ష్మీనర్సుపేట (శ్రీకాకుళం) 44.3, మార్కాపురం (ప్రకాశం)లో 44.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా 59 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 78 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. మంగళవారం 61 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 173 మండలాల్లో వడగాడ్పులు వీయనున్నాయి. వీటిలో శ్రీకాకుళంలో 13, విజయనగరం 24, పార్వతీపురం మన్యం 14, అనకాపల్లి 9, విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలంలోనూ తీవ్ర వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కోస్తా జిల్లాలోని పలు మండలాల్లో   వడగాడ్పులు వీస్తాయని వివరించింది.

Kadiri MLA Candidate Kandikunta Venkata Prasad Kabza
కబ్జాల కందికుంట

కదిరి: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ పేరు వినగానే కదిరి నియోజకవర్గ ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఆయన కన్ను పడితే విలువైన స్థలాలు, పొలాలు కబ్జా కావాల్సిందేనన్న విమర్శలు ఉన్నాయి. బాధితుల్లో ఎంతోమంది ముస్లింలు, ఇతర సామాజిక వర్గం వారు ఉన్నారు. కబ్జాలను ఎవరైనా ప్రశ్నిస్తే అనుచరులతో దాడులు, దౌర్జన్యాలు చేయించడం ఆయన నైజంగా ఉంది. ప్రజాకంఠకుడిగా ఉన్న ఈయనకే ప్రతి ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్‌ కేటాయిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. మీడియా ముందు మాత్రం కందికుంట నీతి సూక్తులు చెబుతుండడం చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు.బొరుగులమ్మి సంపాదించిన స్థలం.. కదిరి పట్టణంలోని జామియా మసీదు వీధికి చెందిన పి.ఖాజామోద్దీన్‌ అలియాస్‌ బొరుగుల ఖాజా కొన్నేళ్ల క్రితం ఊరూరా తిరిగి బొరుగులు అమ్మేవాడు. ఈ వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో కదిరి–హిందూపురం రోడ్‌లో అప్పట్లో సర్వే నంబరు 70/3–3లో 4.50 ఎకరాల పొలం కొన్నాడు. కుటుంబ అవసరాల కోసం అందులో 1.50 ఎకరాలు అమ్మేయగా.. మూడెకరాలు అలానే ఉంది. ఖాజామోద్దీన్‌కు ఐదుగురు సంతానం. ఆయన మరణానంతరం ఆ పొలాన్ని కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా సాగుచేస్తూ వచ్చారు. ఆడ పిల్లలందరూ పెళ్లీడుకు రావడంతో వారికి పెళ్లి చేసేందుకు ఆ మూడెకరాల భూమిని అమ్మాలని కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.డబ్బు చెల్లించకుండానే ఇతరులకు రిజిస్ట్రేషన్ఆ భూమిని అమ్ముతారనే విషయం తన అనుచరుల ద్వారా కందికుంటకు తెలిసింది. వెంటనే వారిని పిలిపించి సెంటు రూ.80 వేల చొప్పున బేరం కుదుర్చుకొని వెంటనే రూ.లక్ష అడ్వాన్స్‌గా ఇచ్చారు. తర్వాత ఆ మిగిలిన డబ్బు ఇచ్చి భూమి రిజి్రస్టేషన్‌ చేయించుకోండని ఖాజామోద్దీన్‌ కుటుంబ సభ్యులు కందికుంట ఇంటి దగ్గర వేచి ఉండటం దినచర్యగా మారింది. కొన్ని రోజులు గడిచాక ఓ రోజు ‘ఆ భూమితో మీకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆ భూమి మాది. ఇదిగో మా బంధువుల పేరు మీద ఆ భూమికి సంబంధించి కదిరి రెవెన్యూ వారు మంజూరు చేసిన పట్టాదారు పాసుపుస్తకం’ అంటూ కందికుంట తెలపడంతో వారికి గుండె ఆగినంత పనైంది. ప్రశ్నించే ధైర్యం లేక, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఇంటి దారి పట్టక తప్పలేదు. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.20 కోట్లు చేస్తుంది.బాధిత యువకుడిపై హత్యాయత్నం ఖాజామోద్దీన్‌ మనవడు అమీర్‌ఖాన్‌ 2018 జూలై 14న జేసీబీని తీసుకెళ్లి పొలం చదును చేయిస్తున్నాడు. ఈ విషయం కందికుంటకు తెలిసి వెంటనే తన అనుచరులను అక్కడికి పంపి ఆ యువకుడిపై రాళ్ల దాడి చేయించాడు. గుండెలపై బండ రాళ్లతో  కొట్టి చంపడానికి కూడా ప్రయత్నించారు. ఈలోగా వారి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ఏడుస్తుంటే జనం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆరోజు నుంచి ఈరోజు వరకు ఆ స్థలం వైపు బాధితులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడుతున్నారు.  కందికుంట మాత్రం ఆ స్థలం తమదేనని బుకాయించడంతో పాటు మీడియా ముందు తాను సచీ్చలుడినంటూ నీతి సూక్తులు వల్లిస్తున్నాడు.చిత్తుగా ఓడించండి అమాయక ప్రజల భూమిని ఆక్రమించి, దానికి తప్పుడు పత్రాలు సృష్టించి ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి అందులోకి ఇతరులెవ్వరూ ప్రవేశించకుండా కందికుంట ప్రస్తుతం దానికి పెద్ద గేట్‌ కూడా ఏర్పాటు చేయించాడు. ఆ స్థలం యజమానులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులే కాకుండా ఆ దారిగుండా వెళ్లే ప్రతి ఒక్కరూ కందికుంటకు శాపనార్థాలు పెడుతున్నారు. ఇలాంటి వ్యక్తికి     చంద్రబాబు ప్రతిసారీ ఎందుకు టికెట్‌ ఇస్తున్నాడో అర్థం కావడం లేదని జనం తప్పుబడుతున్నారు. పేదల స్థలాలు కబ్జా చేసే కందికుంటను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.  

Road Accident at Yanam Amalapuram Road
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టినరోజు వేడుక

అనుబంధం తెగిపోయి.. ఆనందం ఆవిరి.. ఆ ఘోర ప్రమాదం..  ఆశలను చిదిమేసింది.. అనుబంధాలను చెరిపేసింది.. జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఆ కుటుంబాలకు ఆసరా లేకుండా మార్చింది.. చేయి పట్టుకుని నడిచే పిల్లలకు తండ్రి లేకుండా చేసింది.. కట్టుకున్నవాడిని భార్యకు దూరం చేసింది.. తోడుగా ఉంటాడనుకున్న కుటుంబానికి కుమారుడిని లేకుండా చేసింది. అమలాపురం రూరల్‌ మండలం భట్నవిల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు మిగిలిన వేదన ఇది.అమలాపురం రూరల్‌/ మామిడికుదురు: వారంతా స్నేహితులు... హ్యాపీ హ్యాపీగా సహచరుడి ముందస్తు పుట్టినరోజు వేడుకకు బయలు దేరారు.. జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు.. కేక్‌ కట్‌ చేసుకుని సందడి చేశారు.. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో దారి కాచిన మృత్యువు లారీ రూపంలో వారి ఆనందాన్ని ఆవిరి చేసింది.. అమలాపురం రూరల్‌ మండలం భట్నవిల్లిలోని వనువులమ్మ ఆలయం వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం..  మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్‌ (26) పుట్టినరోజు సోమవారం కావడంతో ముందస్తు వేడుకలు జరుపుకొనేందుకు స్నేహితులు నిర్ణయించుకున్నారు. మొత్తం ఎనిమిది మంది పుదుచ్చేరి ప్రాంతం యానాంకు నెల్లి నవీన్‌కుమార్‌ ఆటోలో ఆదివారం రాత్రి 8 గంటలకు బయలు దేరారు. యానాంలో విందు ముగిశాక అర్ధరాత్రి సమయంలో తిరుగు పయనమయ్యారు. భట్నవిల్లి వచ్చేసరికి కాకినాడ వైపు ఒడిశాకు చేపల లోడుతో వెళుతున్న లారీ వారి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన సాపే నవీన్‌ (22), అదే గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్‌ (26), అదే మండలం పాశర్లపూడికి చెందిన నెల్లి నవీన్‌కుమార్‌ (27), పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్‌ (18) అక్కడికక్కడే చనిపోయారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి శివారు కొండాలమ్మ చింతకు చెందిన మల్లవరపు వినయ్‌బాబు (17), అదే గ్రామానికి చెందిన మార్లపూడి లోకేష్‌ (17), పెదపటా్ననికి చెందిన జాలెం శ్రీనివాసరెడ్డి (17), నగరం శివారు పితానివారి మెరక గ్రామానికి చెందిన మాదాసి ప్రశాంత్‌కుమార్‌ (17)లు  తీవ్రంగా గాయపడి అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో జాలెం శ్రీనివాసరెడ్డి, మాదిసి ప్రశాంత్‌కుమార్‌ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.  తరుక్కుపోయిన గుండెలుచేతికందివచ్చిన తమ పిల్లలు మృత్యవాత పడి విగత జీవులుగా పడి ఉండడం చూసి మృతుల తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. తన కుటుంబానికి దిక్కెవరంటూ జతిన్‌ భార్య ఆశాదేవి బంధువులను దీనంగా అడుగుతుంటే చూపురుల గుండెలు తరుక్కుపోయాయి. కువైట్‌లో ఉంటున్న తల్లులకు పిల్లల మృత్యు వార్త ఎలా చెప్పాలంటూ నవీన్, అజయ్‌ కుటుంబీకులు ఆందోళన చెందారు. ప్రమాద వార్త తెలియగానే మృతుల, క్షతగాత్రుల కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ కుటుంబాలన్నీ రొక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఆటో నడుపుకొంటూ, ఎల్రక్టీíÙయన్‌గా పనిచేస్తూ నవీన్‌కుమార్, జతిన్‌ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. మిగిలిన వారంతా డిగ్రీ, ఇంటరీ్మడియెట్‌ చదువుకుంటూ భవిష్యత్‌ కోసం బాటలు వేసుకుంటున్నారు. అమలాపురం రూరల్‌ సీఐ పి.వీరబాబు, రూరల్‌ ఎస్సై శేఖర్‌బాబు ప్రమాద స్థలిని తక్షణమే సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రికి తరలించి వేగంగా వైద్యం అందేలా సీఐ, ఎస్సైలు శ్రమించారు.పుట్టిన రోజునే పరలోకానికి..  నగరం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్‌ (26) ఎలక్ట్రీయన్‌గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సోమవారం అతని పుట్టిన రోజు. పుట్టిన రోజు వేడుకకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కొత్త దుస్తులు కొనుక్కున్నాడు. సరదాగా స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు ఆదివారం రాత్రి అంతా కలసి బయటకు వెళ్లారు. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చి తనువు చాలించాడు. జతిన్‌కు ఆరేళ్ల కిందట వివాహమైంది. అతనికి భార్య ఆశాదేవి, ఐదేళ్ల కుమార్తె ఆత్య, ఏడు నెలల కొడుకు ఉన్నారు. జతిన్‌ మృతితో భార్య ఆశాదేవి, తండ్రి వెంకటేష్‌, తల్లి దివ్య కన్నీరు మున్నీరవుతున్నారు. అభం, శుభం తెలియని పిల్లలకు నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలంటూ వారు విలపిస్తున్నారు.  ఒక్కగానొక్క కుమారుడి మృతితో.. నగరం కోటమెరకకు చెందిన సాపే నవీన్‌ (22) డిగ్రీ ఫైనలియర్‌ చదువుతున్నా డు. తండ్రి శ్రీనివాసు రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి రత్న కుమారి కువైట్‌లో ఉంది. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో అతని కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది. నవీన్‌ అమ్మమ్మ బత్తుల మేరీరత్నం తన మనవడి వద్దే ఉంటూ అతడిని అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. చదువుకుని ఎంతో ప్రయోజకుడవుతాడని ఆశించిన నవీన్‌ దుర్మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు.  కిరాయికి వెళ్లి.. మృత్యుఒడికి చేరి పాశర్లపూడి నెల్లివారిపేటకు చెందిన నెల్లి నవీన్‌కుమార్‌ (27) అవివాహితుడు. ఐదు నెలల కిందట కొత్త ఆటో కొనుక్కున్నాడు. తండ్రి ట్రక్కు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నవీన్‌కుమార్‌ తల్లి మంగాదేవి పదేళ్ల నుంచి మస్కట్‌లో ఉంటున్నారు. తండ్రి, కొడుకు ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. స్నేహితుడి పుట్టినరోజు, ఆటో కిరాయికి వెళ్లిన నవీన్‌కుమార్‌ రోడ్డు ప్రమాదంలో మ్యత్యువాత పడడం స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.సరదాగా వెళ్లి.. పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్‌ (18) ఇంటర్‌ పూర్తి చేశాడు. తండ్రి శ్రీనివాసరావు నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. అతను గల్ఫ్‌లో ఉంటున్నాడు. తల్లి కుమారి ఇటీవల గల్ఫ్‌ నుంచి వచ్చారు. కొడుకును ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అందివచ్చిన కొడుకు స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లి ఇలా విగతజీవిగా మారతాడని కలలో కూడా ఊహించలేదని ఆమె విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది.    

Daily Horoscope Rasi Phalalu April 30-04-2024 Telugu
Horoscope Today: ఈ రాశులవారు శుభవార్తలు వింటారు..

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.సప్తమి రా.2.52 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: ఉత్తరాషాఢ రా.1.39 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ఉ.10.13 నుండి 11.45 వరకు, తదుపరి తె.5.28 నుండి 6.56 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం: ఉ.8.08 నుండి 8.56 వరకు, తదుపరి రా.10.50 నుండి 11.38 వరకు, అమృతఘడియలు: రా.7.25 నుండి 8.46 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.39, సూర్యాస్తమయం: 6.14. మేషం: నూతన ఉద్యోగాలు. ఆకస్మిక ధనలాభం. వ్యవహారాలలో విజయం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.వృషభం: ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. పనుల్లో అవరోధాలు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు.మిథునం: వ్యయప్రయాసలు.. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు ముందుకు సాగవు. వృత్తి,వ్యాపారాలలో మార్పులు.కర్కాటకం: వ్యవహారాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలత.కన్య: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. సోదరులు, సోదరీలతో కలహాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.తుల: కుటుంబసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. అనారోగ్య సూచనలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.వృశ్చికం: శుభవార్తలు వింటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహమే.మకరం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.కుంభం: రాబడి నిరాశ పరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.మీనం: ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకర సమాచారం.  

Sundhara Travels Actress Radha attack on Real estate man
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని చితకబాదిన నటి రాధ

సుందరా ట్రావెల్స్‌ చిత్ర కథానాయకి మరో వివాదంలో చిక్కుకున్నారు. దీంతో పోలీసులు కేసు గురించి విచారణ జరుపుతున్నారు. వివరాలు చూస్తే.. చెన్నై, నెర్కుం  డ్రం, పల్లవన్‌నగర్‌ సమీపంలోని ఏరిక్కరై వీధికి చెందిన వ్యక్తి మురళీకృష్ణన్‌ (48) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో పాటు, ఎల్‌ఐసీ ఏజెంట్‌గానూ వ్యవహరిస్తున్నారు. మురళీకృష్ణన్‌ మాట్లాడుతూ ద్వారకేశ్‌ అనే తన మిత్రుడికి నటి రాధ పరిచయం చేశానన్నారు. దీంతో ఆమె రెండేళ్ల క్రితం 90 వేలు బిట్‌ కాయిన్స్‌ పె ట్టుబడి పెట్టారన్నారు. అయితే అప్పటినుంచి అత ను ఆ బిట్‌ కాయిన్స్‌ను నటి రాధకు తిరిగి చెల్లించలేదన్నారు. దీంతో నటి రాధ ద్వారకేశ్‌ను పరిచయం చేసిన తనను ఆ బిట్‌ కాయిన్స్‌ తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేశారన్నారు. అలా రాధ, ఆమె తల్లి పల్లవి, కొడుకు మరో ముగ్గురు స్థానిక చూలైమేడులోని తన కార్యాలయానికి వచ్చి గొడవ చేశారన్నారు. వాగ్వాదం తరువాత నటి రాధ తనను కిందకు పడేసి కొట్టారన్నారు. దీంతో తన అనుచరు లు స్థానిక రాయపేటలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్చారని, తన తలకు మూడు కుట్లు పడ్డాయని చె ప్పారు. అనంతరం తాను స్థానిక వడపళనిలో పోలీస్‌స్టేషన్‌లో నటి రాధ, ఆమె కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాగా పోలీసులు ఈ వ్యహారంపై విచారణ జరుపుతున్నారు.    

YSRCP complains to Chief Electoral Officer of AP
అమల్లోలేని ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారం

సాక్షి, అమరావతి: ‘అమల్లో లేని ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ గురించి తెలుగుదేశం పార్టీ ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లను తప్పుదారి పట్టిస్తోంది. ఇది ఎన్నికల మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌కు విరుద్ధం. టీడీపీపై తగిన చర్యలు తీసుకోండి’ అని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాకు వైఎస్సార్‌సీపీ సోమవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు ఎ.నారాయణ­మూర్తి, న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదుతోపాటు తగిన ఆధారాలను అందజేశారు. అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ నెల 28వ తేదీన కోడు­మూరు, మంత్రాలయంలలో జరిగిన ప్రచార సభల్లో ప్రసంగిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌పై వ్యక్తి­గతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఆయనపై తగిన చర్యలు తీసు­కోవాలని ఫిర్యాదు చేశారు.జనసేన అధ్య­క్షుడు పవన్‌కళ్యాణ్‌ ఈ నెల 28న ప్రత్తిపాడు నియో­జకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్నికల నియమావళికి విరు­ద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరి­స్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

IPL 2024: Kolkata Knight Riders beat Delhi Capitals by 7 wickets
ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్‌

ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మరో అద్భుత విజయం సాధించింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయభేరి మోగించింది.154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ కేవలం 3 వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(33), వెంకటేశ్‌ అయ్యర్‌(26) నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. విలియమ్స్‌ఒక్క వికెట్‌ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో టెయిలాండర్‌ కుల్దీప్‌ యాదవ్‌(35) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఇక కేకేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్‌ ఆరోరా, హర్షిత్‌ రానా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్టార్క్‌, నరైన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. కాగా కేకేఆర్‌ బౌలర్లు ఎక్స్‌ట్రాస్‌ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారు.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement