Top Stories
ప్రధాన వార్తలు
ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
సాక్షి, అమరావతి: ఏపీలో తుది పోలింగ్ శాతంపై ఎన్నికల కమిషన్ లెక్కలు తేలుస్తోంది. జిల్లాల నుంచి వచ్చిన సమాచారాన్ని ఈసీ వర్గాలు క్రోడీకరిస్తున్నాయి. ఈసారి పోలింగ్ 80 శాతం దాటే అవకాశం ఉంది. నేటి సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా రాష్ట్రంలో 81శాతం పోలింగ్ నమోదు కావొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో రాత్రి 12 వరకు 78.25 శాతం నమోదైనట్లు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్‌తో కలుపుకొని 79.40 శాతం పోలింగ్ నమోదైందని ఎంకే మీనా పేర్కొన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగిందని అన్నారు. పోలింగ్ పర్సంటేజ్‌పై సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయని చెప్పారు. అయితే 2019 ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు.
పోలింగ్ పూర్తయినా.. ఆగని టీడీపీ అరాచకాలు
హైదరాబాద్, సాక్షి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయినా.. టీడీపీ అరాచకాలు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలోని పలుచోట్ల వైఎస్సార్సీపీ ఏజెంట్లు, కార్యకర్తలపై.. అలాగే వైఎస్సార్సీపీకి ఓటేశారనే కారణంతో కొందరు అమాయకులపైనా భౌతిక దాడులకు దిగుతున్నారు. మరీ ముఖ్యంగా గత 59 నెలలుగా ప్రశాంతంగా ఉన్న పల్నాడులో అలజడులు సృష్టించేందుకు శతవిధాల యత్నిస్తున్నారు.»పల్నాడు జిల్లా కొత్తగణేషునిపాడులో ఉద్రికత్త నెలకొంది. వైఎస్సార్సీపీకి ఓటేసిన బీసీ మహిళల ఇళ్లపై టీడీపీ దాడులకు పూనుకుంది. బీసీ మహిళల ఇళ్లను టీడీపీ నేతలు కర్రలతో ధ్వంసం చేశారు. ఆటోను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు టీడీపీ గూండాలు.దీంతో బీసీ నేతలు రాత్రంతా గుడిలోనే తలదాచుకున్నారు.»కొత్తగణేషునిపాడులో పోలీసులు భారీగా మోహరించారు. గాయపడిన గ్రమస్తులను అనిల్ కుమార్ యాదవ్, కాసు మహేష్ పరామర్శించారు. గ్రామాన్ని చుట్టుముట్టిన టీడీపీ కార్యకర్తలు.. బాధితులను పరామర్శిస్తుండగా కాసు మహేష్ రెడ్డి, అనిల్ కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. కేంద్ర బలగాల సాయంతో కాన్వాయ్ తరలించారు. టీడీపీ గుండాల దాడులపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ మహిళలపై దాడులు జరుగుతుంటే ఎస్పీ ఏం చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. » పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులో ఈ ఉదయం వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొడుతూ టీడీపీ గుండాలు కవ్వింపు చర్యలకు దిగారు. రాత్రి పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ చోటు చేసుకోగా.. దానికి కొనసాగింపుగా ఇవాళ ఉదయం మళ్లీ టీడీపీ నేతలు గొడవకు దిగారు.» గురజాల నియోజకవర్గం మాచవరం మండలం కొత్త గణేషని పాడులో అర్ధరాత్రి టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీకి ఓటు వేశారని బీసీల ఇళ్లపైన పడి దాడులు చేశారు. మూడు గంటల పాటు ఏకదాడిగా రాళ్లు విసురుతూ.. కర్రలతో ఇళ్లపై దాడికి దిగారు. మహిళలు, చిన్న పిల్లలు అని కూడా చూడకుండా దాడి చేయబోయారు. అయితే వాళ్ల దాడి నుంచి తప్పించుకుని స్థానికంగా ఉన్న గుడిలో వాళ్లంతా తలదాచుకున్నారు. ఈ ఉదయం మీడియాతో మహిళలు మాట్లాడుతూ.. తమ ఇల్లు ధ్వంసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: మేం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు-మంత్రి అంబటి» నంద్యాల జిల్లా పగిడ్యాల (మ) పడమర ప్రాతకోట గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త చాకలి విజయ్ పై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ‘‘వైఎస్ఆర్సీపీ పార్టీకి నువ్వు కూడా ఓటు వేశావ్’’.. అంటూ దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తలకు గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు.» బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మిన్నెకల్లు గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ శ్రేణులు మూక దాడికి దిగాయి. వైఎస్సార్సీపీకి ఓటు ఎందుకు వేశారు? అంటూ తలలు పగలగొట్టారు టీడీపీ నేతలు. దాడిలో ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన వాళ్లను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. ఈ దాడుల్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం హనిమిరెడ్డి ఖండించారు.» కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో టీడీపీ గుండాలు రెచ్చిపోయారు. రావిచెట్టు సెంటర్లో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఒకరికి గాయాలయ్యాయి.» తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఎల్లో గ్యాంగ్ అరాచకాలు. కూచువారిపల్లిలో పచ్చమూకల దాడిలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఓ కారును తగలబెట్టారు.
మెడికల్ బోర్డు చీఫ్‌పై సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ: ఇండియన్ మెడికల్ అసోషియేషన్(IMA) అధ్యక్షుడు డా. ఆర్వీ అశోకన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తప్పు పట్టింది. భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించటంలో తాము అందిరికంటే ముందు ఉంటామని మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది.పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వ్యవహరిస్తున్న తీరుపై ఓ ఇంటర్వ్యూలో అశోకన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అమానుల్లా బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే పతంజలి నకిలీ ప్రకటనల కేసులో అశోకన్ పిటిషన్‌గా ఉన్నారని గుర్తుచేసింది.‘మీ (అశోకన్) నుంచి మరింత బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు ఆశించాం.కోర్టు తీర్పుకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఇలా హఠాత్తుగా మారటానికి కారణం ఏంటీ?’అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.ఈ విషయంలో సుప్రీం కోర్టుకు అశోకన్ క్షమాపణలు తెలియజేశారు. ‘మీరు చేసిన వ్యాఖ్యలపై మీ క్షమాపణలను ఒకవేళ కోర్టు అంగీకరిస్తే.. మిమ్మల్ని కించపరిచారని కోర్టు ఆశ్రయించారు. అలాంటప్పుడు మీకు ఎలాంటి పరీక్ష పెట్టాలి?’ అని కోర్టు నిలదీసింది. క్షమాపణల అఫిడవిట్‌పై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బహిరంగంగా ఎందుకు క్షమాపణలు చెప్పలేదని ప్రశ్నించింది. ‘మీరు నిజంగా క్షమాపణలు చెప్పాలనుకుంటే మీ అఫిడవిట్‌ను ఎందుకు సరిదిద్దుకోలేదు? ఇంటర్వ్యూ అనంతరం మిమ్మల్ని మీరు ఏవింధంగా సరిదిద్దుకున్నారో చెప్పండి’అని ధర్మాసనం ప్రశ్నించింది.‘భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించటంలో మేము ముందుంటాము. కానీ స్వీయ నియంత్రణ ఉండాల్సిన సందర్భాలు ఉంటాయి. మీకు నియంత్రణ ఉన్నట్లు ఆ ఇంట ఇంటర్వ్యూలో మాకు కనిపించలేదు’అని జస్టిస్ హిమకోహ్లి అన్నారు. ‘న్యాయమూర్తులుగా మేము విమర్శలు ఎదుర్కొంటున్నా. మేము స్పందించము. ఎందుకంటే మాకు వ్యక్తిగతంగా అహం ఉండదు. మేము ఉన్నతస్థానంలో ఉన్నాం. మేము చర్యలు తీసుకోవడానికి అర్హులం. చాలా అరుదుగా మాత్రమే చర్యలు తీసుకుంటాం’అని జస్టిస్ అమానుల్లా అన్నారు. ‘మీరు ఇలాంటి వ్యాఖ్యలతో కోర్టు గురించి ఏమి చెప్పలేరు. ఇలాంటి వ్యాఖ్యలే మీపైనే చేస్తే ఏం చేసేవారు’అని కోర్టు ప్రశ్నించింది. అశోకన్ సమర్పించిన అఫిడవిట్‌ను చాలా చిన్న, ఆలస్యంతో కూడినదిగా కోర్టు పేర్కొంది.ఈ విషయంలో ఉరట కల్పించాలని అశోకన్ తరుఫు న్యాయవాది కోరగా జస్టిస్ కోహ్లి స్పందింస్తూ. మీరు ప్రతిదీ చెప్పడానికి లేదు. అశోకన్ ట్రాప్‌లో చిక్కుకున్నారని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. ఈ కేసుపై విచారణను సుప్రీం కోర్టు జూలై 9వ తేదీకి వాయిదా వేసింది. ఇక.. పతంజలి నకిలీ ప్రకటనల కేసు విషయంలో బాబా రాందేవ్, బాలకృష్ణ ఇప్పటికే రెండుసార్లు క్షమాపణలు తెలిపినా కోర్టు తిరస్కరించింది.
కోహ్లి కాదు!.. అతడు 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్లో ఏదీ కలిసి రావడం లేదు. టీ20 ప్రపంచకప్-2022 సెమీస్‌లోనే భారత జట్టు నిష్క్రమించిన తర్వాత.. సుదీర్ఘకాలం అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్నాడు హిట్‌మ్యాన్.ప్లే ఆఫ్స్ చేర్చినాగతేడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన రోహిత్ బ్యాటర్‌గా స్థాయికి తగ్గట్లు రాణించలేదు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 16 మ్యాచ్‌లలో కలిపి 332 పరుగులు మాత్రమే చేశాడు. ఇక జట్టును ప్లే ఆఫ్స్ చేర్చి సారథిగా సఫలమైనా.. ముంబై ఫ్రాంఛైజీ అతడిపై ఈసారి వేటు వేసింది.గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన రోహిత్ శర్మ వచ్చే ఏడాది ఫ్రాంఛైజీని వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఫోకస్ చేయలేకఇక పాండ్యా ప్రవర్తనతో విసిగిపోయిన రోహిత్ బ్యాటింగ్‌పై కూడా ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నాడని గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. ఐపీఎల్-2024లో ఇప్పటి దాకా 13 మ్యాచ్‌లు ఆడి 349 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తర్వాత టీమిండియా జూన్ 1నుంచి మొదలుకానున్న ప్రపంచకప్-2024కు సన్నద్ధంకానుంది. ఇందుకోసం ఇప్పటికే రోహిత్ శర్మ సారథ్యంలో బీసీసీఐ 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది.అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత 37 ఏళ్ల రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. వయసు, ఫిట్నెస్ రీత్యా రెండు ఫార్మాట్లకు కూడా గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజం కాదుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ రోహిత్ శర్మ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. "అసలు వయసు గురించి ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు.40, 42.. 45 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్తో ఉండి.. బాగా ఆడుతుంటే.. ఆ ఆటగాడి రిటైర్మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మన దేశంలో చాలా మంది 40 ఏళ్ల వయసు వచ్చిందంటే.. పిల్లల పెంపకం గురించి ఆలోచిస్తూ కాలం గడిపేయాలనే ఆలోచనతో ఉంటారు. వయసు అయిపోయిందని.. ఆటకు పనికిరామని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడుటీమిండియా తొలిసారి వరల్డ్ కప్ గెలిచినపుడు మొహిందర్ అమర్నాథ్ వయసు 38 ఏళ్లు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే. అసలు ఏజ్ గురించి టీమిండియాలో చర్చ అనవసరం అంటాను.రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి గొప్ప ప్లేయర్లు ఫిట్నెస్ గురించి పెద్దగా అవసరం లేదు. ఒకవేళ రోహిత్ ఆడాలనుకుంటే 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడు" అని యోగ్రాజ్ సింగ్ అని స్పోర్ట్స్18తో చెప్పుకొచ్చాడు.కాగా ఫిట్‌నెస్‌కు మారుపేరైన విరాట్ కోహ్లి కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగించగలడన్న విశ్లేషణల నేపథ్యంలో అతడి పేరు ఎత్తకుండా యోగ్రాజ్ కేవలం రోహిత్, వీరూ పేర్లు చెప్పడం విశేషం.చదవండి: T20 WC: హార్దిక్‌ను సెలక్ట్ చేయడం రోహిత్‌కు ఇష్టం లేదు.. కానీ!
నా మాజీ భర్త గే.. అతడి గదిలో రాత్రి ధనుష్‌కు ఏం పని? సుచిత్ర సంచలన వ్యాఖ్యలు
సుచీలీక్స్‌తో సింగర్ సుచిత్ర అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి యావత్ సినీ ఇండస్ట్రీనే షేక్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి సెలబ్రిటీలపై విరుచుకుపడింది. ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ గురించి మాట్లాడుతూ.. వాళ్లు పెళ్లయినప్పటినుంచి ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూనే ఉన్నారు. పెళ్లయిన విషయాన్నే మర్చిపోయి మిగతావాళ్లతో డేటింగ్ చేశారు. ఐశ్వర్య కంటే ధనుషే నయంభర్త మోసం చేశాడని ఆరోపించిన ఐశ్వర్య ఏమైనా పద్ధతిగా ఉందా? తను కూడా వేరేవాళ్లతో డేటింగ్ చేసి మోసం చేయలేదా? ఆమె కంటే ధనుషే నయం.. అయినా ఐశ్వర్య తన పిల్లలను ఏనాడూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకే వారి కుమారులు యాత్ర, లింగ.. అమ్మమ్మ- తాతయ్యల వద్ద పెరిగితే బాగుంటుంది' అని సుచిత్ర చెప్పుకొచ్చింది.కార్తీక్ గేభర్త కార్తీక్‌తో విడాకుల గురించి మాట్లాడుతూ.. 'కార్తీక్‌తో పెళ్లయిన 11 ఏళ్లకు అతడు గే అని తెలిసింది. అది బయటకు చెప్పే ధైర్యం అతడికి లేదు. ఆ మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నాను. పూటుగా తాగిన తర్వాత ధనుష్, నా భర్త ఒకే గదిలో ఉండేవారు. రాత్రిపూట గదిలో నా భర్తతో ధనుష్‌కు ఏం పని?' అని ప్రశ్నించింది.అందుకే టార్గెట్‌కాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ మాజీ భర్త కార్తీక్.. సుచిత్ర మానసిక ఆరోగ్యం బాగోలేదని తెలిపాడు. అయితే తన మానసిక స్థితి బాగోలేదని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని సుచిత్ర ఆరోపించింది. ఎప్పుడైతే డ్రగ్స్ వాడేందుకు ఒప్పుకోలేదో అప్పుడే తనను ధనుష్, కార్తీక్ టార్గెట్ చేశారని వెల్లడించింది.చదవండి: బాలీవుడ్లో రాణిస్తున్న బ్యూటీ.. ఫస్ట్ సినిమా తెలుగులోనే!
మొబైల్ యూజర్స్‌కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
మొబైల్ ఫోన్ యూజర్లకు షాక్. త్వరలో ఫోన్ బిల్లలు తడిసి మోపెడు కానున్నాయి. దేశంలోని మొత్తం లోక్‌సభ స్థానాల ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే నాలుగో రౌండ్ టారిఫ్ ధరల్ని పెంచేందుకు టెలికం కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. టెలికం కంపెనీలు యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ఏఆర్పీయూ) ను పెంచుకునేందుకు కంపెనీలు తప్పుకుండా 25 శాతం టారిఫ్ ధరల్ని పెంచనున్నాయి. మార్కెట్లో కాంపిటీషన్, 5జీ టెక్నాలజీ కోసం భారీ పెట్టుపడులు ఇతరాత్ర కారణాల వల్ల టారిఫ్ ధరల పెంపు అనివార్యం కానుంది. వినియోగదారులపై ప్రభావం25 శాతం టారిఫ్ ధరల పెంపు భారీగా ఉన్నప్పటికీ.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల యూజర్లకు భరించే ఆర్ధిక సామర్ధ్యం ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా టెలికం సేవల్ని వినియోగించుకునేందుకు గాను ప్రస్తుతం పెట్టే ఖర్చు 3.2 శాతంతో పోలిస్తే పట్టణ గృహాల మొత్తం వ్యయంలో 3.6 శాతానికి పెరుగుతుందని అంచనా. అదేవిధంగా, గ్రామీణ చందాదారుల కోసం, ఈ సంఖ్య ప్రస్తుత 5.2 శాతం నుండి 5.9 శాతానికి పెరుగుతుందని అంచనా.టారిఫ్ ధరలు పెరిగితేటారిఫ్ 25 శాతం పెంచితే టెలికాం ఆపరేటర్ల ఏఆర్పీయూ 16 శాతం పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. ఎయిర్‌టెల్‌కు ఒక్కో యూజర్ నుంచి వచ్చే ఆదాయం అత్యధికంగా రూ.29, జియో 26 శాతం ఉందని యాక్సిస్ కేపిటల్ ఎస్టిమేట్ తెలిపింది. కంపెనీలకు లాభమేమార్చితో ముగిసిన త్రైమాసికంలో జియో ఏఆర్పీయూ రూ.181.7 గా ఉంది. ఎయిర్‌టెల్‌కు రూ.208, వొడాఫాన్ ఐడియాకు రూ.145 గా ఉంది. టారిఫ్ ధరలు పెరిగితే ఒక్కో యూజర్ నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఆ ప్రభావం కంపెనీ లాభాలు పెరిగేందుకు దోహదం చేస్తోంది.
May 14th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 14th AP Elections 2024 News Political Updates03:50 PM, May 14th, 2024విజయవాడసీఈవో ఎంకే మీనాతో మంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ నేతల భేటీపల్నాడు జిల్లాలో టీడీపీ అరాచకాలపై ఫిర్యాదునిన్న జరిగిన ఘటనలు చాలా దారుణం: మంత్రి అంబటి రాంబాబుపల్నాడు జిల్లాలో పోలీసులు దారుణంగా వ్యవహరించారుటీడీపీ నాయకులు ప్రజల పై దాడులు చేస్తున్న పోలీసులు పట్టించుకోలేదుకొత్త గణేశునిపాడు లో మహిళలపై టీడీపీ నేతలు దాడి చేశారుమహిళలు గుడిలో దాక్కుంటే టీడీపీ నేతలు దాడులు చేశారుఅనిల్ యాదవ్, కాసు మహేష్ రెడ్డి పరమర్శకి వెళితే వల్ల కార్ల పై దాడికి యత్నించారుపోలీసులు ఫైర్ ఓపెన్ చేసే పరిస్థితి టీడీపీ నేతలు కల్పించారునా నియోజకవర్గంలో 6 పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ చేశారువాటిలో రీ పోలింగ్ చెయ్యాలని కోరాంవెబ్ కాస్టింగ్ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరాంనిన్న పోలింగ్ జరుగుతున్నప్పుడే మేము ఫిర్యాదు చేశాంకన్నా లక్ష్మీనారాయణ రాడ్లు, కర్రలతో మనుషులను దించారుపల్నాడులో పోలీసులు ఘోరంగా విఫలం అయ్యారుప్రజల ప్రాణాలు కాపాడమంటే పోలీసులు స్పందించడం లేదు 02:24 PM, May 14th, 2024మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిఓటమి భయంతోనే జేసీ సోదరులు తమపై రాళ్ల దాడులకు పాల్పడ్డారుఅడిషనల్ ఎస్పీ రామకృష్ణ టీడీపీ నాయకులకు తొత్తుగా మారారురామకృష్ణపై ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాం02:02 PM, May 14th, 2024ఓటమి భయంతోనే టీడీపీ నేతల దాడులు: ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిటీడీపీ నేతల దాడుల్లో గాయపడిన బాధితులను పరామర్శించిన దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు: ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరినియోజకవర్గంలో వార్ వన్ సైడ్‌గా ఉందని.. చింతమనేని కనుసనల్లో గ్రామాల్లో దాడులక పాల్పడ్డారు.ఒక రౌడీ షీటర్‌కి బీఫామ్ ఇచ్చి దెందులూరు నియోజకవర్గంలో చంద్రబాబు అరాచకాలు నిద్రలేపాడువైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో దూసుకుపోతుందని వారు జీర్ణించుకోలేకపోతున్నారువైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్‌గా కర్రలు, కత్తులతో దాడులు చేశారుప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రౌడీయిజంతో గెలవలనుకున్నాడుదెందులూరు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిందిరానున్న ఫలితాల్లో టీడీపీ బంగాళాఖాతంలో కలవబోతోందిఈ సారి టీడీపీకి 23 సీట్లు కూడా రాని పరిస్థితి ఉందిదెందులూరులో భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ జెండా ఎగర వేయబోతున్నాం01:32 PM, May 14th, 202481 శాతం పోలింగ్ నమోదు కావచ్చు: ఏపీ సీఈవోమీడియాతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చిట్ చాట్కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగింది2019 ఎన్నికల్లో 79.2 శాతం పోలింగ్ నమోదైంది.0.6 శాతం పోస్టల్ బ్యాలెట్ తో కలిపి మొత్తం 79.8 శాతం నమోదుఈ ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకూ 78.25 నమోదైనట్లు అంచనా1.2శాతం పోస్టల్ బ్యాలెట్ తో 79.4 శాతం నమోదు.మధ్యాహ్నానికి పూర్తి వివరాలు వస్తాయిమా అంచనా ప్రకారం 81 శాతం పోలింగ్ నమోదు కావచ్చురాత్రి 12 తర్వాత కూడా కొనసాగిన పోలింగ్ కేంద్రాల్లో కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేశాంసుమారు 20 కేంద్రాల్లో కొత్త ఈవీఎంలకు మాక్ పోలింగ్ నిర్వహించాం.01:15 PM, May 14th, 2024మోసగాడిని ఓడించి, మొనగాడిని గెలిపించనున్నారు: మంత్రి అంబటి రాంబాబుఉదయం 6గంటల నుండి అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగిందిఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నికరాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఐదేళ్లపాటు పాలన చేసిన తర్వాత జరిగిన ఎన్నికచంద్రబాబు, జగన్ పాలన చూసినవారు ఓటు వేయడానికి పోటెత్తిన తీరు ఆశ్చర్యం కలిగిందిమహిళలు, వృద్ధులు తెల్లవారుజామునే బూత్ లకు చేరుకున్నారుతమ సంక్షేమ పాలన మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చారుఓట్లశాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకునేవాళ్లం, కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి కోసం తాపత్రయపడి ఓటు వేశారుఈ ఎన్నికల్లో మహిళలే ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారుమహిళలు 70శాతం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారుఅమ్మఒడి, ద్వాక్రా రుణమాఫీ, ఇళ్ల పట్టాలు మహిళలకు ఇచ్చి వారి సాధికారతకు కృషి చేసారుఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదుజగన్ కోసం ఓటర్లు పడిన తపన, తాపత్రయం స్పష్టంగా కనిపించిందిచంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా ఎవరు ప్రయత్నాలు చేసినా వైసీపీ వైపే ఉన్నారుసత్తెనపల్లి లోనూ నేను భారీ మెజారిటీ తో గెలవబోతున్నానుఏ ఎన్నికల్లోనూ జరగని హింస ఈ ఎన్నికల్లో జరిగిందిడీజీపీ, ఐజీ, ఐపీఎస్ లను మార్చారుఇంతమందిని మార్చినా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదులా అండ్ ఆర్డర్ ను పోలీసులు కాపాడలేదుగొడవలు జరిగినపుడు పోలీసులకు ఫోన్ చేసినా గంటల తరబడి రీచ్ కాలేదుపోలీసులు అట్టర్ ఫెయిల్ అయ్యారుదాడులు జరిగిన తర్వాత చాలసేపటికి పోలీసులు వచ్చారునకిరేకల్ ఎస్సై నన్ను అక్కడ తిరగటానికి వీల్లేదు అన్నారుఎస్పీకి కాల్ చేస్తే నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారుకానీ నియోజకవర్గంలో నీ చాలా ప్రాంతాల్లో కన్నా లక్ష్మీ నారాయణ తిరిగారుకన్నా కుమారుడు మీ అంతు తేల్చుతా అని ఓటర్లను బెదిరించారురూరల్ సీఐ రాంబాబు టీడీపీతో కలిసిపోయాడుటీడీపీ వద్ద డబ్బులు తీసుకుని వారికి పనిచేశాడుదమ్మాలపాడు బూత్ లో పోలీసులను మేనేజ్ చేసి ఓట్లు వేయించారుఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసానురీపోలింగ్ కి డిమాండ్ చేస్తున్నానునా అల్లుడు ఉమేష్ కారు పై దాడి చేశారుచీమలమర్రి, దమ్మాలపాడు, నాగనుపాడు, గుల్లపల్లి, మాదల సహా అనేక ప్రాంతాల్లో ఎలక్షన్ సక్రమంగా జరగలేదుఎలక్షన్ కమిషన్ ను అక్కడి కెమెరాలు పరిశీలించాలని కోరుతున్నానుకొన్నిచోట్ల పోలింగ్ ఆఫీసర్స్ కొల్యూడ్ అయిపోయారుఎవరి ఓటు వాళ్ళు వేస్తే సమస్య లేదుఅందరి ఓటు ఒక్కరే వేస్తే అది పద్ధతి కాదు.. ఎలక్షన్ అధారిటీస్ కి ఫిర్యాదు చేసానుచంద్రబాబు మోసగాడు.. ప్రజల్ని 14ఏళ్లు మోసం చేశాడుఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన నెరవేర్చిన మొనగాడు జగన్మోసగాడిని ఓడించి, మొనగాడిని గెలిపించనున్నారు 11:37 AM, May 14th, 2024జమ్మలమడుగులో బీజేపీ, టీడీపీ నేతల గూండాగిరిపట్టణ పరిధిలోని పోలింగ్ బూత్ 116,117లో బీజేపీ, టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో బూత్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై రాళ్ల దాడి.. వాహనంపైనా దాడిబీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, కడప టీడీపీ ఎంపి అభ్యర్ది భూపేష్ రెడ్డిల డైరెక్షన్లో దాడిరౌడిల్లా వ్యవహరించిన ఆదినారాయణరెడ్డి, భూపేష్ రెడ్డిపోలీసులు అడ్డుపడినా ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపైకి దూసుకొచ్చిన కడప టిడిపి ఎంపి అభ్యర్ది భూపేష్ రెడ్డిఅడ్డుపడిన పోలీసులపై భూపేష్ గూండాగిరి10:57 AM, May 14th, 2024టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు.. అనిల్‌కుమార్ ఆగ్రహంపల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందికొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల్లా వ్యవహరించారుటీడీపీ దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదుఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారుమాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారుపిన్నెళ్లి, ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారుపోలింగ్ బూత్ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారుపల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదుపోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారు టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?: గోపిరెడ్డికొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారుకొందరు పోలీసులు మాకు వ్యతిరేకంగా పనిచేశారునన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు 10:50 AM, May 14th, 2024కూచివారిపల్లిలో టీడీపీ నేతల దాష్టీకంచంద్రగిరి మండలం కూచివారిపల్లిలో టీడీపీ నేతల దాష్టీకంసర్పంచ్ చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి నిప్పు పెట్టిన టీడీపీ గూండాలుసర్పంచ్ ఇల్లు పూర్తిగా దగ్ధం, పలు కార్లు ధ్వంసంకూచివారిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు 9:43 AM, May 14th, 2024జేసీ కుటుంబంపై కేసు..టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ పై కేసు నమోదు చేసిన పోలీసులుపోలింగ్ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో విధ్వంసం సృష్టించిన జేసీ కుటుంబ సభ్యులుతాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి లపై ఎఫ్ ఐ ఆర్జేసీ కుటుంబ సభ్యులతో పాటు 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదుతాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేసిన టీడీపీ నేతలుఐదు వాహనాలు ధ్వంసం, ఇద్దరు కానిస్టేబుళ్లు సహా పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు గాయాలుఈ ఘటనలపై లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు9:20 AM, May 14th, 2024రెచ్చిపోయిన జనసేనకోనసీమ జిల్లాలో రెచ్చిపోయిన జనసేన కార్యకర్తలుకపిలేశ్వరపురం మండలం వల్లూరులో జనసేన కార్యకర్తల వీరంగంవైఎస్సార్‌సీపీ నేత పృథ్వీరాజ్ కారును ధ్వంసం చేసిన జనశ్రేణులుఅర్థరాత్రి విధ్వంసం సృష్టించిన జనసేన నేత లీలాకృష్ణలీలాకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు8:41 AM, May 14th, 2024పల్నాడు జిల్లాలో బరితెగించిన టీడీపీ నేతలుతమకు ఓట్లు వేయని వారిని టార్గెట్ చేసి దాడులు నిర్వహిస్తున్న టీడీపీ నేతలుసత్తెనపల్లి నియోజకవర్గం లోని మాదల, తొండపి గ్రామాల్లో రాత్రి విధ్వంసంగురజాల మండలం కొత్త గణేషని పాడులో తెలుగుదేశం విధ్వంసంకర్రలు రాళ్లతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడిపోలింగ్ అనంతరం మూడు గంటల పాటు నిరంతరాయంగా దాడులుకొత్త గణేష్ ని పాడు లో బీసీల పైన దాడి చేసిన తెలుగుదేశం గుండాలువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇల్లు ధ్వంసంసీఐ స్థాయి నుంచి డీఐజీ వరకు సమాచారం ఇచ్చిన పట్టించుకోని పోలీసులు7:48 AM, May 14th, 2024పోటెత్తిన ఓటర్లు: ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్ మీనాఉ.6 గంటల నుంచే భారీ క్యూలైన్లలో ఓటర్లుఎన్నడూలేని విధంగా పెద్దఎత్తున తరలి వచ్చిన మహిళలు, వృద్ధులుసా.6 తర్వాత కూడా 3,500 కేంద్రాల్లో కొనసాగిన పోలింగ్‌గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెరుగుతుందని అంచనాపలుచోట్ల ఈవీఎంల మొరాయింపు, గాలివాన బీభత్సంతో మందకొడిగా సాగిన పోలింగ్‌చెదురుమదురు సంఘటనలు తప్ప ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలుహింసాత్మక ఘటనల కారకులపై కేసు నమోదుఇప్పటివరకు ఎక్కడా రీపోలింగ్ కోరుతూ అభ్యర్థనలు రాలేదురాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా7:32 AM, May 14th, 2024పచ్చ ముఠాల విధ్వంస కాండఓటమి భయంతో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలురాళ్లదాడులు, కత్తులతో బీభత్సం, బాంబులతో భయోత్పాతంయథేచ్ఛగా విధ్వంసం సృష్టించిన టీడీపీ, జనసేనచంద్రబాబు పక్కా పన్నాగంతోనే ధ్వంస రచనఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసినా ఈసీ ఉదాసీనతశ్రీసత్యసాయి జిల్లా ఓడీ చెరువులో యువకుడికి కత్తిపోట్లువైఎస్సార్‌సీపీ కార్యకర్తపై కత్తెరతో ‘చింతమనేని’ అనుచరుల హత్యాయత్నం.. వైఎస్సార్ జిల్లాలో రెచ్చిపోయిన పచ్చ మూకలుఅన్నమయ్య జిల్లాలో బరితెగించి రౌడీయిజంవైఎస్సార్ జిల్లా మబ్బు చింతలపల్లెలో కారు అద్దాలు ధ్వంసంజంగాలపల్లి పోలింగ్ బూత్‌లో బరితెగించిన టీడీపీ కార్యకర్తలుచిత్తూరు జిల్లా పెరుమాళ్ల కండ్రిగలో ఇళ్లపై దాడులు, కార్లు ధ్వంసంకోనసీమ, కాకినాడ జిల్లాల్లో మితిమీరిన టీడీపీ నేతల ఆగడాలు 7:30 AM, May 14th, 2024పల్నాట పచ్చ మూక బీభత్సకాండఓటమి భయంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు.. ఓటర్లు, వైఎస్సార్సీపీ నేతలు, ఏజెంట్లపై దాడులుమాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే తనయుడు గౌతమ్, డ్రైవర్‌పై దాడితంగెడలో పెట్రోలు బాంబులతో దాడి.. 8 మందికి తీవ్ర గాయాలుపాల్వాయి, తుమృకోటల్లో ఈవీఎంలు ధ్వంసంముప్పాళ్లలో మంత్రి అంబటి అల్లుడు కారు అద్దాలు ధ్వంసంనూజెండ్ల మండలంలో దళితులపై అరాచకంకేశానుపల్లిలో ఇళ్లకు వెళ్లి వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడి.. చోద్యం చూసిన పోలీసులు 7:24 AM, May 14th, 2024ఆగని టీడీపీ అరాచకాలు దొంగ ఓట్లు వేయించేందుకు తీవ్ర యత్నాలుగణబాబు, శ్రీభరత్ చిత్రాలతో స్లిప్‌ల పంపిణీఅడ్డుకున్న వైఎస్సార్ సీపీ నాయకులుపోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు7:15 AM, May 14th, 2024ప్రజాస్వామ్యానికి పచ్చ బ్యాచ్ తూట్లుఅడుగడుగునా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలుసీఎం రమేష్ ఓవరాక్షన్.. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఎన్నికల ప్రచారంటీడీపీ ఏజెంట్లతో ఫొటో షూట్‌క్యూలో నిల్చున్న ఓటర్లకు ప్రలోభాల ఎర 7:17 AM, May 14th, 2024నిమ్మాడలో అచ్చెన్న కుటుంబం బరితెగింపువైఎస్సార్‌సీపీ ఏజెంట్ అప్పన్నను బెదిరించి మరీ రిగ్గింగ్ పలు గ్రామాల్లోని ఓటర్లు పోలింగ్ బూత్‌కు రాకుండా అడ్డుకున్న కింజరాపు కుటుంబం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ7:07 AM, May 14th, 2024మరోసారి ఫ్యాన్ సునామీ పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచే ఓటర్ల బారులుఉప్పెనలా కదలివచ్చిన వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలుపట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక శాతం ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు 68.04 శాతం పోలింగ్ నమోదుగంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించిన ఈసీపలుచోట్ల రాత్రి 10 వరకూ కొనసాగిన పోలింగ్.. 76.50 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వర్గాల వెల్లడిఫలితాలను నిర్దేశించేది మహిళలు, గ్రామీణులేనన్న ఇండియాటుడే టీవీ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్.. ప్రభుత్వ సేవలను బట్టే 80శాతం మహిళలు ఓట్లు వేస్తారన్న యాక్సిస్ మై ఇండియా సీఎండీ ప్రదీప్ గుప్తాసచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు ప్రభుత్వం సేవలుసంక్షేమాభివృద్ధి పథకాలతో ఇంటింటా వచ్చిన విప్లవాత్మక మార్పును ప్రతిబింబించిన పోలింగ్ సరళిప్రభుత్వ సానుకూలత సునామీలా ఓటెత్తిందంటున్న రాజకీయ పరిశీలకులు
టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
సాక్షి, నరసరావుపేట: పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల్లా వ్యవహరించారు.. టీడీపీ దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని.. పిన్నెళ్లి, ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారు. పల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదు పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారంటూ అనిల్ మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?: గోపిరెడ్డికొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారని గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొందరు పోలీసులు మాకు వ్యతిరేకంగా పనిచేశారు. నన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?’’ అంటూ గోపిరెడ్డి ప్రశ్నించారు.
వీడు మాములోడు కాదు.. 100 రోజులు, 200 విమానాలు కట్ చేస్తే..!
కేటుగాళ్లకే కేటుగాడు.. చోరకళలో మహాముదురు. గత ఏడాది కాలంలో200 విమానాలు ఎక్కి, 100 రోజుల పాటు దేశంలో వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. చేతివాటం చూపించి ఏకంగా లక్షలు కొట్టేశాడు. పోలీసులకు చుక్కలు చూపించాడు. కట్ చేస్తే.. పోలీసుల చేతికి చిక్కి కటకటాల వెనక్కి చేరాడు. అసలు స్టోరీ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతానికి చెందిన రాజేశ్ కపూర్ చోరీలోతనకు తానే తోపు అనుకున్నాడు. మొదట రైళ్లలో చోరీ చేసేవాడు. చాలాకాలానికి అక్కడ దొరికిపోవడంతో ఇక విమానాల్ని ఎంచుకున్నాడు. ఒకదాని తరువాత మరొకటి దర్జాగా లక్షల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను కొట్టేసేవాడు. కానీ ఎప్పటికైనా పాపం పండుతుంది అన్నట్టు. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ పోలీసుల పని అంత ఈజీగా అవ్వలేదు. ఢిల్లీ, హైదరాబాద్, అమృత్సర్ విమానాశ్రయాల్లోని కొన్ని గంటల సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసిన తర్వాత రాజేష్ కపూర్‌ను పట్టుకున్నట్టు వెల్లడించారు.ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఉషా రంగరాణి అందించిన సమాచారం ప్రకారం, లగ్జరీ ప్రయాణికుడిలాగా పోజు కొడుతూ విమానాల్లో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు, వృద్ధులును ట్రాప్ చేసి చోరీ చేయడంలో రాజేశ్ ఆరితేరిపోయాడు.కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో ప్రయాణించే వారిని టార్గెట్ చేసి చోరీలు చేసేవాడు. ప్రయాణికులతో మాటలు కలిపి వారికి సాయం చేస్తున్నట్టు నటించి నగలు, విలువైన వస్తువులు దోచేసేవాడు. ఏప్రిల్‌లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ మహిళ ఐజిఐ విమానాశ్రయం నుంచి యూఎస్‌కి కనెక్టింగ్ ఎయిరిండియా విమానంలో ఆమె బ్యాగు నుంచి రూ. 7 లక్షల విలువైన నగలు కొట్టేశాడు. అంతేకాదు అమెరికాకు చెందిన వర్జిందర్‌జిత్ సింగ్ కూడా ఇతని బాధితుడే. అమృత్సర్ నుంచి ఢిల్లీ వచ్చి కనెక్టింగ్ ఫ్లైట్‌లో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళుతున్న వర్జిందర్‌జిత్ సింగ్ క్యాబిన్ బ్యాగ్ నుండి రూ. 20 లక్షల విలువైన వస్తువులు దొంగిలించాడు.మోడస్ ఒపరాండీ అమాయకంగా కనిపించే వృద్ధులు, మహిళా ప్రయాణీకులే ప్రధాన టార్గెట్. వారి బ్యాగేజీ డిక్లరేషన్ స్లిప్‌లోని సమాచారాన్ని దొంగచాటుగా పసిగడతాడు. బోర్డింగ్ గేట్ వద్ద వారితో మాటలు కలుపుతాడు. విమానంలో వారి పక్కకే తన సీటు మార్పించుకుంటాడు. వారి లగేజీ సర్దడానికి సాయం చేస్తున్నట్టు నటించి, సమయం చూసి అక్కడి నుంచి జారుకుంటాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు టికెట్ బుకింగ్ సమయంలో అతడు నకిలీ ఫోన్ నంబర్ ఇచ్చాడని పోలీసులు గుర్తించారు.ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, చండీగఢ్, బెంగళూరు, ముంబై, అమృత్సర్ విమానాశ్రయాల్లోని అనేక మంది మహిళా ప్రయాణికుల బ్యాగుల్లోని దొంగిలించిన వస్తువులను కరోల్ బాగ్‌లోని శరద్ జైన్ అనే నగల వ్యాపారికి విక్రయించేవాడట. అంతేకాదు పహర్‌గంజ్‌లోని అతని ఇంటి నుండి పెద్ద మొత్తంలో బంగారం వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.గెస్ట్ హౌస్ ఓనర్న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఢిల్లీ పహర్గంజ్లో రాజేష్‌కి ‘రికీ డీలక్స్’ అనే గెస్ట్ హౌస్ ఉంది. ఇందులో మూడో అంతస్తులో అతడు నివసిస్తున్నాడు. మనీ క్స్చేంజ్ బిజినెస్‌తో పాటు ఢిల్లీలో మొబైల్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు.
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
సినిమా
అతి మంచి పనికిరాదని నాన్న నుంచే నేర్చుకున్నా: హీరోయిన్
ఐశ్వర్య రాజేశ్... దక్షిణాది సినిమాలో స్టార్ హీరోయిన్. చిన్నచిన్న పాత్రలతో అంచెలంచెలుగా ఎదిగి లేడీ ఓరియంటెెడ్ కథా చిత్రాలు చేసే స్థాయికి ఎదిగారు. యంగ్ ఏజ్‌లోనే కాక్కా ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి ఆ పాత్రకు జీవం పోశారు. ఆ చిత్రమే ఐశ్వర్య రాజేశ్ కేరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది.తండ్రి అతి మంచి వల్లఈ హీరోయిన్ ఇటీవల మాతృదినోత్సవం సందర్భంగా తన కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను, అమ్మ పడ్డ బాధలను వివరించారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడానికి తన తండ్రి ష్యూరిటీ ఇచ్చి రుణాలు ఇప్పించారన్నారు. అయితే ఆనారోగ్యం కారణంగా తన తండ్రి మరణిస్తే అప్పులు ఎగ్గొట్టిన వారి రుణ భారం అంతా తల్లిపై పడిందన్నారు. దీంతో తమకు ఉన్న ఒకే ఒక్క ప్లాట్‌ను విక్రయించి ఆ అప్పును తీర్చినట్లు చెప్పారు. అమ్మ ఏ లోటూ లేకుండాఅంత కష్టంలోనూ అమ్మ తమను మంచి పాఠశాలలో చదివించారని, ఏ లోటూ లేకుండా చూసుకున్నారన్నారు. తన అన్నయ్యలు ఇద్దరూ చదువు పూర్తి చేసి ఉద్యోగం చేయడానికి సిద్ధమైన సమయంలో ఒక ప్రమాదంలో మరణించారన్నారు. అప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్న అమ్మను ఆ సంఘటన మరింత కుంగదీసిందన్నారు. అయినా తను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని తెలిపారు. అమ్మ నుంచే నేర్చుకున్నావృత్తిపరంగా తాను ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నా, ధైర్యంగా ముందుకు సాగే గుణాన్ని తన తల్లి నుంచే నేర్చుకున్నట్లు చెప్పారు. అలాగే అతి మంచికి పోకూడదన్నది తన తండ్రి జీవితం నుంచి నేర్చుకున్నట్లు ఐశ్వర్య రాజేశ్ చెప్పారు.
కాన్స్‌లో కన్నప్ప
ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘కన్నప్ప’ టీమ్ సందడి చేయనుంది. విష్ణు మంచు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ‘మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.కాగా ఈ నెల 14 నుంచి 25 వరకూ జరగనున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో 20వ తేదీన ‘ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప’గా కన్నప్ప మూవీ టీజర్‌ని ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని విష్ణు మంచు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ‘‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘కన్నప్ప’ సినిమా టీజర్‌ను ఆవిష్కరించనుండటం ఆనందంగా ఉంది. మేం ఎంతో ఇష్టంగా రూపొందిస్తున్న కన్నప్పను ప్రపంచ ప్రేక్షకులకు చూపించేందుకు కాన్స్ అనువైన వేదికగా ఉపయోగపడుతుంది. మన భారతీయ చరిత్రను ప్రపంచ వేదికపైకి తీసుకురావడం, మన కథలు, సాంస్కృతిక వారసత్వం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని ట్వీట్ చేశారు విష్ణు మంచు.
డిప్రెషన్లో ఉపాసన, అత్తారింటికి వెళ్లిన రామ్‌చరణ్ (ఫోటోలు)
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. అయితే ఓటింగ్ ఎఫెక్ట్ వల్లనో ఏమో గానీ గత కొన్ని వారాల నుంచి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ రిలీజ్ కాలేదు. ఈ వారం కూడా లెక్కప్రకారం విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్ కావాలి. కానీ మే 31కి వాయిదా పడింది. దీంతో 'రాజు యాదవ్' అనే చిన్న మూవీ మాత్రమే రిలీజ్ అవుతోంది. 'అపరిచితుడు' సినిమా రీ రిలీజ్ అవుతోంది. ఇవి తప్పితే థియేటర్లు కళకళలాడే మూవీస్ అయితే ఏం లేవు. ఓటీటీలో మాత్రం 20కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు రాబోతున్నాయి.(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్)ఓటీటీల్లోకి వస్తున్న వాటిలో 22కి పైగా సినిమాలు- వెబ్ సిరీసులు ఉన్నాయి. అయితే వీటిలో చోరుడు, గ్లాడ్జిల్లా X కాంగ్ అనే డబ్బింగ్ సినిమాలతో పాటు జర హట్కే జర బచ్కే, బస్తర్ అనే హిందీ సినిమాలు మాత్రమే ఉన్నంతలో కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. మిగతా వాటి టాక్ రిలీజైతే గానీ తెలియదు. మరి ఓవరాల్‌గా ఏయే మూవీస్ ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ లిస్టు (మే 13 నుంచి 19 వరకు)నెట్ఫ్లిక్స్ఆష్లే మ్యాడిసన్: సెక్స్, లైస్ & స్కాండల్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 15బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 15బ్రిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - మే 16మేడమ్ వెబ్ (ఇంగ్లీష్ సినిమా) - మే 16పవర్ (ఇంగ్లీష్ మూవీ) - మే 17ద 8 షో (కొరియన్ సిరీస్) - మే 17థెల్మా ద యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) - మే 17 అమెజాన్ ప్రైమ్ఔటర్ రేంజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 1699 (ఇంగ్లీష్ సిరీస్) - మే 17హాట్స్టార్క్రాష్ (కొరియన్ సిరీస్) - మే 13చోరుడు (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 14అంకుల్ సంషిక్ (కొరియన్ సిరీస్) - మే 15బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్) - మే 17 జీ5బస్తర్: ద నక్సల్ స్టోరీ (హిందీ మూవీ) - మే 17తళమై సెయలగమ్ (తమిళ సిరీస్) - మే 17జియో సినిమాడిమోన్ స్లేయర్ (జపనీస్ సిరీస్) - మే 13C.H.U.E.C.O సీజన్ 2 (స్పానిష్ సిరీస్) - మే 14జర హట్కే జర బచ్కే (హిందీ సినిమా) - మే 17 బుక్ మై షోగాడ్జిల్లా X కాంగ్: ద న్యూ ఎంపైర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 13 (ఆల్రెడీ స్ట్రీమింగ్) సోనీ లివ్లంపన్ (మరాఠీ సిరీస్) - మే 16ఆపిల్ ప్లస్ టీవీద బిగ్ సిగార్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 17ఎమ్ఎక్స్ ప్లేయర్ఎల్లా (హిందీ సినిమా) - మే 17(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా)
ఫొటోలు
Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
Mothersday 2024 ‘బంగారం నువ్వమ్మా’! టాలీవుడ్ అమ్మల్నిచూశారా?
మదర్స్ డే 2024 : బీటౌన్ మామ్స్పై ఒక లుక్కేసుకోండి! (ఫోటోలు)
సరికొత్త ది ఎపిక్ న్యూ స్విఫ్ట్ కార్ ను ఆవిష్కరించిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య (ఫొటోలు)
Ashika Ranganath: అందాల వడ్డింపుతో హీటెక్కిస్తున్న ఆషిక రంగనాథ్..(ఫొటోలు)
క్రీడలు
వరల్డ్ కప్‌నకు బంగ్లా జట్టు ప్రకటన.. అనూహ్యంగా అతడికి చోటు!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి తమ జట్టును ప్రకటించింది. నజ్ముల్ హొసేన్ కెప్టెన్సీలో వరల్డ్ కప్‌లో ఆడబోయే 15 మంది సభ్యుల పేర్లను వెల్లడించింది. సీనియర్లు, ఇటీవల పునరాగమనం చేసిన ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.అయితే, గాయంతో బాధపడుతున్న మరో పేసర్ టస్కిన్ అహ్మద్ అనూహ్య రీతిలో జట్టులో చోటు సంపాదించడంతో పాటు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఫామ్‌లేమితో బాధపడుతున్న ఓపెనింగ్ బ్యాటర్ లిటన్ దాస్ సైతం చోటు దక్కించుకున్నాడు.కాగా 29 ఏళ్ల ఈ పేస్ బౌలర్ గతవారం జింబాబ్వేతో సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. అయితే, ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మాత్రం అదరగొట్టాడు. 4.56 ఎకానమీతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. షకీబ్ అల్ హసన్ 2007 నుంచి టీ20 ప్రపంచకప్ ఈవెంట్‌ను ఒక్కసారి కూడా మిస్ కాలేదు.ఇదిలా ఉంటే.. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ జూన్ 1 నుంచి ఆరంభం కానుంది. ఇందులో భాగంగా డల్లాస్‌లోని టెక్సాస్ వేదికగా జూన్ 7న బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. శ్రీలంకతో మ్యాచ్‌తో మెగా ఈవెంట్లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్- 2024కు బంగ్లాదేశ్ జట్టు:నజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), టస్కిన్ అహ్మద్ (వైస్ కెప్టెన్), లిటన్ కుమర్ దాస్, సౌమ్య సర్కార్, తన్జిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తవ్హిద్ హృదోయ్, మహమూద్ ఉల్లా రియాద్, జకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షేక్ మెహదీ హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజీమ్ హసన్ సకీబ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: అఫిఫ్ హుస్సేన్, హసన్ మహమూద్.
కోహ్లి కాదు!.. అతడు 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్లో ఏదీ కలిసి రావడం లేదు. టీ20 ప్రపంచకప్-2022 సెమీస్‌లోనే భారత జట్టు నిష్క్రమించిన తర్వాత.. సుదీర్ఘకాలం అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్నాడు హిట్‌మ్యాన్.ప్లే ఆఫ్స్ చేర్చినాగతేడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన రోహిత్ బ్యాటర్‌గా స్థాయికి తగ్గట్లు రాణించలేదు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 16 మ్యాచ్‌లలో కలిపి 332 పరుగులు మాత్రమే చేశాడు. ఇక జట్టును ప్లే ఆఫ్స్ చేర్చి సారథిగా సఫలమైనా.. ముంబై ఫ్రాంఛైజీ అతడిపై ఈసారి వేటు వేసింది.గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన రోహిత్ శర్మ వచ్చే ఏడాది ఫ్రాంఛైజీని వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఫోకస్ చేయలేకఇక పాండ్యా ప్రవర్తనతో విసిగిపోయిన రోహిత్ బ్యాటింగ్‌పై కూడా ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నాడని గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. ఐపీఎల్-2024లో ఇప్పటి దాకా 13 మ్యాచ్‌లు ఆడి 349 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తర్వాత టీమిండియా జూన్ 1నుంచి మొదలుకానున్న ప్రపంచకప్-2024కు సన్నద్ధంకానుంది. ఇందుకోసం ఇప్పటికే రోహిత్ శర్మ సారథ్యంలో బీసీసీఐ 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది.అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత 37 ఏళ్ల రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. వయసు, ఫిట్నెస్ రీత్యా రెండు ఫార్మాట్లకు కూడా గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజం కాదుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ రోహిత్ శర్మ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. "అసలు వయసు గురించి ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు.40, 42.. 45 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్తో ఉండి.. బాగా ఆడుతుంటే.. ఆ ఆటగాడి రిటైర్మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మన దేశంలో చాలా మంది 40 ఏళ్ల వయసు వచ్చిందంటే.. పిల్లల పెంపకం గురించి ఆలోచిస్తూ కాలం గడిపేయాలనే ఆలోచనతో ఉంటారు. వయసు అయిపోయిందని.. ఆటకు పనికిరామని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడుటీమిండియా తొలిసారి వరల్డ్ కప్ గెలిచినపుడు మొహిందర్ అమర్నాథ్ వయసు 38 ఏళ్లు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే. అసలు ఏజ్ గురించి టీమిండియాలో చర్చ అనవసరం అంటాను.రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి గొప్ప ప్లేయర్లు ఫిట్నెస్ గురించి పెద్దగా అవసరం లేదు. ఒకవేళ రోహిత్ ఆడాలనుకుంటే 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడు" అని యోగ్రాజ్ సింగ్ అని స్పోర్ట్స్18తో చెప్పుకొచ్చాడు.కాగా ఫిట్‌నెస్‌కు మారుపేరైన విరాట్ కోహ్లి కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగించగలడన్న విశ్లేషణల నేపథ్యంలో అతడి పేరు ఎత్తకుండా యోగ్రాజ్ కేవలం రోహిత్, వీరూ పేర్లు చెప్పడం విశేషం.చదవండి: T20 WC: హార్దిక్‌ను సెలక్ట్ చేయడం రోహిత్‌కు ఇష్టం లేదు.. కానీ!
నిఖత్ శుభారంభం..
అస్తానా (కజకిస్తాన్): ఎలోర్డా కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత స్టార్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన 52 కేజీల విభాగం తొలి రౌండ్లో నిఖత్ 5–0తో రఖీమ్బెర్దీ జన్సాయా (కజకిస్తాన్)ను ఓడించింది. భారత్‌కే చెందిన మీనాక్షి (48 కేజీలు), అనామిక (50 కేజీలు) కూడా తొలి రౌండ్లో విజయాలు అందుకున్నారు.మీనాక్షి 4–1తో గసిమోవా రొక్సానా (కజకిస్తాన్)పై గెలుపొందగా... అనామిక పంచ్‌ల ధాటికి ఆమె ప్రత్యర్థి జుమ్బయేవా అరైలిమ్ తట్టుకోలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. ఇస్మిత్ (75 కేజీలు), సోనియా (54 కేజీలు) తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. ఇష్మిత్ 0–5 తో అర్మాత్ (కజకిస్తాన్) చేతిలో, సోనియా 0–5తో చాంగ్ యువాన్ (చైనా) చేతిలో ఓడిపోయారు.ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ..రోమ్: ఇటాలియన్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ శుభారంభం చేసింది. తొలిరౌండ్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–2, 6–2తో అర్నాల్డి–పసారో (ఇటలీ) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో బొలెలీ–వావాసోరి (ఇటలీ)లతో బోపన్న–ఎబ్డెన్ తలపడతారు.
ఐపీఎల్ నుంచి స్వదేశానికి...
న్యూఢిల్లీ: ఐపీఎల్లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగింపు దశకు చేరగా... ఆయా జట్లకు కీలకమైన ఇంగ్లండ్ ఆటగాళ్లు తిరుగుపయనమయ్యారు. జోస్ బట్లర్ (రాజస్తాన్), లివింగ్‌స్టోన్ (పంజాబ్ కింగ్స్), విల్ జాక్స్, రీస్ టాప్లీ (బెంగళూరు)లు ఇంగ్లండ్‌కు బయలుదేరారు. వచ్చే నెల 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లలో జరిగే టి20 ప్రపంచకప్‌కు తుది సన్నాహంగా సొంతగడ్డపై ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్‌తో టి20 సిరీస్ ఆడనుంది.మే 22 నుంచి ఇరు జట్ల మధ్య నాలుగు టి20ల సిరీస్ జరుగుతుంది. 22, 25, 28, 30 తేదీల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. కాగా... ఈ ఐపీఎల్ సీజన్లో లివింగ్‌స్టోన్ ఆకట్టుకోలేకపోయాడు. బట్లర్ రాజ స్టాన్ స్టార్ ఓపెనర్. ఈ సీజన్లో ఒంటిచేత్తో కొన్ని మ్యాచ్‌ల్ని గెలిపించాడు. బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జాక్స్, టాప్లీలలో జాక్స్ది కీలకపాత్ర. బెంగళూరు వరుస విజయాల్లో భాగమైన అతను లేకపోవడం జట్టుకు లోటే! చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు... చెన్నైతో ఈ నెల 18న తలపడుతుంది.ఇవి చదవండి: మళ్లీ హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి?.. కొట్టిపారేయలేం!
బిజినెస్
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 22,162కు చేరింది. సెన్సెక్స్ 206 పాయింట్లు పెరిగి 72,972 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 83.44 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.48 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.02 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.29 శాతం లాభపడింది.అధిక వెయిటేజీ ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీవీఎస్ షేర్లు సోమవారం ఒక శాతానికి పైగా రాణించడంతో పాటు సూచీల రికవరీకి తోడ్పాటు అందించాయి. సర్వీసెస్, రియల్టీ, ఫార్మా, పారిశ్రామికోత్పత్తి, కమోడిటీస్, బ్యాంకింగ్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్, టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.జపాన్ మెషనరీ టూల్ ఆర్డర్ల డేటా, భారత రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు (మంగళవారం), యూరోజోన్ మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాలు (బుధవారం), విడుదల కానున్నాయి. జపాన్ క్యూ1 జీడీపీ, మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, ఈసీబీ ఆర్థిక స్థిరత్వ సమీక్ష, అమెరికా పారిశ్రామికోత్పత్తి, ఎగుమతి, దిగుమతుల డేటా(గురువారం) వెల్లడి కానున్నాయి. చైనా ఏప్రిల్ రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి, నిరుద్యోగ రేటు, యూరోజోన్ ఏప్రిల్ ద్రవ్యోల్బణ శుక్రవారం వెల్లడి కానున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
5% దిగువనే రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 5 శాతం దిగువనే కొనసాగింది. సూచీ సమీక్షానెల్లో 4.83 శాతంగా నమోదయ్యింది. మార్చిలో నమోదయిన 4.85 శాతంతో పోలి్చతే స్వల్పంగా తగ్గింది. ఇది 11 నెలల కనిష్ట స్థాయి. అయితే 2023 ఇదే నెలతో పోల్చితే (4.7 శాతం) అధికంగా ఉంది. నెలవారీగా చూస్తే, ఒక్క ఆహార ద్రవ్యోల్బణం 8.52 శాతం (2024 మార్చి) నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ 2తో 4 శాతంగా ఉండాలి.
భారీ నష్టాల్లోంచి లాభాల్లోకి..
ముంబై: భారీ నష్టాల నుంచి పుంజుకున్న స్టాక్ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్‌లో 798 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరికి 112 పాయింట్లు పెరిగి 72,776 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 234 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ఆఖరికి 49 పాయింట్లు బలపడి 22,104 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.., మిడ్ సెషన్ తర్వాత కోలుకున్నాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీవీఎస్ షేర్లు ఒక శాతానికి పైగా రాణించడంతో పాటు సూచీల రికవరీకి తోడ్పాటు అందాయి. సరీ్వసెస్, రియలీ్ట, ఫార్మా, పారిశ్రామికోత్పత్తి, కమోడిటీస్, బ్యాంకింగ్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్, టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లోకి ట్రేడవుతున్నాయి. ⇒ క్యూ4 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో టాటా మోటార్స్ షేరు ఎనిమిది శాతానికి పైగా నష్టపోయి రూ.960 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 9.44% క్షీణించి రూ.948 వద్ద నిలిచింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.29,016 కోట్లు కోల్పోయి రూ.3.19 లక్షల కోట్లకు దిగివచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. హెల్త్‌కేర్ టెక్ సంస్థ ఇండిజెన్ లిస్టింగ్ సక్సెస్ అయ్యింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.452)తో పోలిస్తే 45% ప్రీమియంతో 660 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో ఆరంభ లాభాలను కోల్పోయి 26% లాభంతో రూ.571 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.13,614 కోట్లుగా నమోదైంది.
నార్వే కంపెనీతో హైదరాబాద్ సంస్థ ఒప్పందం
హైదరాబాద్‌కు చెందిన గ్రీన్కో సంస్థ నార్వేకు చెందిన యారా క్లీన్ అమ్మోనియా పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద అమ్మోనియా పంపిణీదారుగా ఉన్న యారాక్లీన్ కంపెనీకు గ్రీన్కో పునరుత్పాదక అమ్మోనియాను సరఫరా చేయనుంది.ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో గ్రీన్కో సంస్థ అమ్మోనియా ఉత్పత్తి చేస్తోంది. ఈప్లాంట్ ప్రారంభం నుంచి కంపెనీ పునరుత్పాదక అమ్మోనియాను తయారు చేస్తోంది. దానికి సంబంధించిన పూర్తి కార్యకలాపాలు ఏఎం గ్రీన్ విభాగం పర్యవేక్షిస్తుంది. దాంతో టర్మ్‌షీట్‌పై ఏఎంగ్రీన్ సంతకం చేసింది.ఈ ఒప్పందంతో ఏంఎంగ్రీన్ ఫేజ్1 కేంద్రం ఉత్పత్తి చేస్తున్న పునరుత్పాదక అమ్మోనియా దాదాపు 50 శాతం యారాక్లీన్కే సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్ 2027 నాటికి 24 గంటలు కార్బన్ లేని కారకాల నుంచి అమ్మోనియాను తయారుచేయనుంది. ఏఎంగ్రీన్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి మాట్లాడుతూ..‘యారా క్లీన్ సంస్థ ఎరువుల తయారీ కంపెనీలకు, షిప్పింగ్, పవర్ ఇండస్ట్రీస్, ఇతర పరిశ్రమలకు పునరుత్పాదక అమ్మోనియా సరఫరా చేస్తోంది. అందులో గ్రీన్కో భాగమవ్వడం సంతోషకరం’ అని అన్నారు.యారా క్లీన్ అమ్మోనియా సీఈఓ హన్స్ ఒలావ్ రేన్ మాట్లాడుతూ..‘ఏఎంగ్రీన్ కాకినాడ ప్రాజెక్ట్‌లో తయారుచేస్తున్న పునరుత్పాదక అమ్మోనియాతో కంపెనీ పోర్ట్‌ఫోలియో విస్తరిస్తోంది. ఎరువుల ఉత్పత్తి, హైడ్రోజన్ ఎనర్జీలో ఉద్గారాలను తగ్గించడం, షిప్పింగ్ ఇంధనం, పవర్ పరిశ్రమల్లో హానికర ఉద్గారాలను తగ్గించేందుకు ఈ క్లీన్ అమ్మోనియా ఉపయోగపడుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.
వీడియోలు
ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR
టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..
అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు
ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్
కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..
వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..
అట్టహాసంగా మోడీ నామినేషన్
అక్కడ రీ-పోలింగ్ ?
పిఠాపురం ప్రజలంతా సీఎం జగన్ వైపు..
గుడివాడ గెలుపుపై కొడాలి నాని రియాక్షన్
ఫ్యామిలీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అదనపు చక్కెర సంకలితాలతో వచ్చే ప్రోటీన్ సప్లిమెంట్లు వినియోగించొద్దని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషన్ ఇన్స్టిట్యూట్ఆప్ న్యూట్రిషియన్(ఐపీఎంఆర్-ఎన్ఐఎన్) పిలుపునిచ్చింది. వీటివల్ల మూత్రపిండాలకు ఎముకలకు హాని కలుగుతుందని, ఆరోగ్యకరమైన వ్యక్తులకు వీటి అవసరం లేదని పేర్కొంది. ప్రోటీన్ల అవసరాన్ని భర్తీ చేసుకునేలా సమతుల్యమైన ఆహార సరిపోతుందని తెలిపింది. పైగా అందుకోసం కొత్త ఆహార మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. చాలామంది సహజసిద్ధంగా సమతుల్య ఆహారంలో వచ్చే పోషకాలను వదిలిపెట్టే కృత్రిమంగా ప్రోటీన్ పౌడర్లు, ప్రోటీన్ సప్లిమెంట్లను ఆశ్రయిస్తున్నారని డైటీషియన్లు చెబుతున్నారు. నిజానికి ఈ ప్రోటీన్ సప్లిమెంట్లన్నీ గుడ్లు, పాలు, పాల విరుగుడు లేదా సోయా, బఠానీలు లేదా బియ్యం వంటి మొక్కల మూలాలతోనే తయారు చేస్తారని అన్నారు. ఈ చక్కెర సంకలితాలతో కూడిన ఈ ప్రోటీన్ సట్లు మూత్రపిండాలు, ఎముకల ఆరోగ్యానికి తీవ్రమైన హానిని కలిగిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పప్పుధాన్యాలు, పప్పులు, గింజలు, గుడ్లు, పౌల్ట్రీ, చేపలు మొదలైనవి అన్ని వయసుల వారికి కావాల్సిన ప్రోటీన్లను అందిస్తాయని అన్నారు. అలాగే ఏ రకమైన ప్రొటీన్ పౌడర్లు లేదా సప్లిమెంట్లను ఇవ్వడానికి ముందు ఒక వ్యక్తికి ప్రోటీన్ ఎంత మేర అవసరం అనేది అంచనా వేసి సదరు క్లినిక్ లేదా న్యూటీషియన్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. మంచి నాణ్యమైన ప్రోటీన్ పొందడానికి 3:1 నిష్పత్తిలో పప్పులతో కూడిన తృణధాన్యాల కలయిక శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు అందజేస్తాయని అన్నారు. ఆహారం ద్వారా తీసుకునే ప్రోటీన్ కండరాల నష్టాన్ని నివారిస్తుందని అన్నారు. అలాగే వినియోగించిన ప్రోటీన్‌ను సమర్థవంతంగా వినియోగించుకునేలా తగిన శారీరక శ్రమ కూడా ఉండాలని డైటీషియన్లు సూచించారు. సమతుల్య ఆహారం శరీర పనితీరుకు అవసరమైన 20 ముఖ్యమైన అమైనో ఆమ్లాల అవసరాన్ని తీరుస్తుందని చెప్పారు. ఇక మన శరీరం సంశ్లేషణ చేయలేని ఈ అమైనో ఆమ్లాలలో కొన్నింటిని పొందడానికి, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ప్రోటీన్ వంటి విభిన్న ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం అని ఐపీఎంఆర్-ఎన్ఐఎన్ పేర్కొంది. సాదారణ ఆరోగ్యవంతమైన వ్యక్తులకు ప్రోటీన్ సప్లిమెంట్లను సిఫార్సు చెయ్యకూడదని పేర్కొంది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగుల స్థితిని అనుసరించి వైద్య నిపుణులు ప్రోటీన్ సప్లిమెంట్లను సిఫార్సు చేయాలని నూట్రిషియన్లు చెబుతున్నారు.(చదవండి: ఇన్స్టంట్ నూడుల్స్ మంచివి కావా? తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా?)
Mothersday 2024 ‘బంగారం నువ్వమ్మా’! టాలీవుడ్ అమ్మల్నిచూశారా?
ఆకాశంలోకి నిప్పుల నిచ్చెన వైరల్ వీడియో
‘అరోరా బొరియాలిస్’ ఆకాశంలో అద్భుతం సృష్టించగా తాజాగా మరో అద్భుతం విశేషంగా నిలుస్తోంది. ఎర్రని నిప్పుల సెగ కక్కుతున్న నిచ్చెన మెట్ల వెలుగులు ఆకాశం వైపు దూసుకెళ్లడం నెట్టింట చక్కర్లు కొడుతోంది.విషయం ఏమిటంటే..ఈ వీడిలో పదేళ నాటిదట. చైనీస్ బాణసంచా కళాకారుడు కాయ్ గువో-కియాంగ్ దీన్ని రూపొందించారు. ఆకాశంలోకి సుమారు అర కిలోమీటర్ ఎత్తు వరకు నిప్పుల నిచ్చెన ఆకారంలో టపాసులు పేలుతూ అద్భుతంగా మారింది.As a tribute to his grandmother, a Chinese artist and pyrotechnic expert created this stairway to Heaven. Stunning. pic.twitter.com/aNmc7YGcKf— Juanita Broaddrick (@atensnut) May 13, 2024ఈ కళాకారుడి క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్టెయిర్ వే టు హెవెన్ పేరిట పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఓ చైనీస్ ఆర్టిస్ట్ క్రియేటివిటీకి మచ్చుతునక అంటూ నెటిజన్లు ప్రశంసించారు. కాయ్ తన అమ్మమ్మకు నివాళిగా దీన్ని తయారు చేశాడు. 1,650 అడుగుల ఎత్తు (లేదా 502 మీటర్లు) "స్కై ల్యాడర్" రాగి తీగలు, గన్‌పౌడర్‌తో తయారు చేశాడని వైస్ ఒక నివేదికలో తెలిపింది. అలా కళాకారుడిగా మారాలని కల నెరవేర్చుకోవడంతోపాటు, నివాళిగా కాయ్ గో క్వింగ్ అనే కళాకారుడు ఇలా నింగిలోకి టపాసులను కాల్చినట్లు వివరించింది. ఇలా కాయ్ ఎక్స్‌ప్లోజివ్ ఆర్టిస్ట్‌గా పేరొందాడు.1994లోనే తొలిసారిగా అతను ఈ తరహా ట్రిక్ కోసం ప్రయత్నించినప్పటికీ భారీ గాలుల వల్ల అది విజయవంతం కాలేదట. అలాగే 2001లో మరోసారి ప్రయత్నం చేయాలనుకున్నా అమెరికాలో జరిగిన 9/11 ఉగ్ర దాడుల నేపథ్యంలో చైనా ప్రభుత్వం అందుకు అనుమతి లభించలేదట. కాగా 1957లో ఫుజియాన్ ప్రావిన్స్‌లోని క్వాన్‌జౌ నగరంలో జన్మించారు కాయ్ గువో-కియాంగ్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్‌లో నివసిస్తున్నారు.
మదర్స్ డే 2024 : బీటౌన్ మామ్స్పై ఒక లుక్కేసుకోండి! (ఫోటోలు)
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
కెనడా చర్రితలోనే భారీ చోరీ : 400 కిలోల గోల్డ్, విదేశీ కరెన్సీ భారత సంతతికి చెందిన వ్యక్తి అరెస్ట్
టొరంటోలోని ప్రధాన విమానాశ్రయంలో 36 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తి భారీచోరికి పాల్పడ్డాడు. భారత్ నుంచి ఇటీవల టొరొంటోకు వచ్చిన అర్చిత్ గ్రోవర్‌ను అధికారులు ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. కెనడా చరిత్రలోనే భారీ చోరీగా నమోదైంది. సుమారు 400 కిలోల బంగారం బిస్కెట్లు, విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో చోరీ కేసులో మరో ఐదుగురిని అరెస్టు చేసిన తర్వాత మరో భారత సంతతి నిందితుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఇతగాడిపై ఇప్పటికే అరెస్టు వారెంట్ జారీ అయింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది (2023) ఏప్రిల్ 17 22 మిలియన్లకు పైగా కెనడియన్ డాలర్ల విలువైన 400 కేజీల బంగారు బిస్కెట్లు, విదేశీ కరెన్సీని ఉన్న ఎయిర్ కార్గో కంటైనర్‌ని నకిలీ పత్రాలను ఉపయోగించి తస్కరించినట్టు పీల్స్ ప్రాంతీయ పోలీసులు తెలిపారు. జ్యూరిచ్ నుండి టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్ కెనడా విమానంలో బంగారం, కరెన్సీ తో కంటైనర్ వచ్చింది. దీన్ని చాకచక్యంగా ఓ ప్రత్యేక స్థలానికి తరలించారు. ఆ మరుసటి రోజే చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెనడా వ్యాప్తంగా వారెంట్ జారీ చేశారు. ఈ మేరకు అర్చిత్ గ్రోవర్‌ను టొరంటోలోని విమానాశ్రయంలో అరెస్టు చేసి అభియోగాలు మోపారు. ముఖ్యంగా భారత సంతతికి చెందిన పరమ్‌పాల్ సిధూ (54), అమిత్ జలోతా (40), అమ్మద్ చౌదరి (43), అలీ రజా (37), ప్రసత్ పరమలింగం (35)ను పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్ కెనడా సంస్థలో పనిచేసిన మరో భారత సంతతి వ్యక్తి సిమ్రన్ ప్రీత్ పనేసర్ (31), మిసిసాగా ప్రాంతానికి చెందిన అర్సలాన్ చౌదరి (42)లపై కూడా అరెస్టు వారెంట్ లు కూడా జారీ అయ్యాయి. ఈ చోరీలో ఎయిర్ కెనడాకు చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసులో నిందితులుగా ఉన్న సిధూ, పనేసర్లు తమ వద్ద పనిచేశారని ఎయిర్ కెనడా సంస్థ ప్రతినిధి వెల్లడించారు.
నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడి అరెస్ట్
వాషింగ్టన్/ఒట్టావా: ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు తాజాగా మరో భారతీయుడిని అరెస్ట్‌చేశారు. బ్రాంప్టన్ సిటీలో నివసించే 22 ఏళ్ల అమన్‌దీప్ సింగ్‌ను హత్య, హత్యకు కుట్ర నేరాల కింద అరెస్ట్‌చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఉదంతంలో గత వారమే ముగ్గురు భారతీయులను అక్కడి పోలీసులు అరెస్ట్‌చేశారు. అమన్దీప్ను ఒంటారియాలో మే 11న అరెస్ట్‌చేసినట్లు రాయల్ కెనడియన్ పోలీసులు ఆదివారం ప్రకటించారు. బ్రిటిష్ కొలంబియాలో 2023 జూన్ 18వ తేదీన గురునానక్ గురుద్వారా వద్ద 45 ఏళ్ల నిజ్జర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెల్సిందే. నిజ్జర్‌ను చంపిన ఇద్దరు షూటర్లలో అమన్‌దీప్ ఒకడని గ్లోబల్ న్యూస్ ఒక కథనం వెలువర్చింది.
మాట్లాడాలని పిలిపించి స్నేహితుడి హత్య
దొడ్డబళ్లాపురం: బార్లో ఉన్న స్నేహితుడిని మాట్లాడాలని తీసికెళ్లి మరో మిత్రుడు తన సహచరులతో కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దొడ్డ తాలూకా హుస్కూరు గ్రామం నివాసి శశికుమార్ కుమారుడు హేమంత్‌గౌడ (27) హత్యకు గురైన యువకుడు. రౌడీషీటర్ నరసింహమూర్తి తన సహచరులతో కలిసి హత్యకు పాల్పడ్డ నిందితుడు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో హేమంత్‌గౌడ తన స్నేహితులతో కలిసి బాశెట్టిహళ్లి వద్ద ఉన్న జేపీ బార్లో పార్టీ చేసుకుంటుండగా నిందితుడు నరసింహమూర్తి ఫోన్ చేసి మాట్లాడాలని బయటకు రమ్మని పిలిచాడు.హేమంత్ బార్లో నుండి బయటకు రాగానే నరసింహమూర్తితో వచ్చిన సుమారు 10 మంది సహచరులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గాయపడ్డ హేమంత్‌ను టెంపోలో వేసుకుని ఊరంతా తిప్పారు. చావుబతుకుల మధ్య పోరాడుతున్న హేమంత్‌ను చూసి పైశాచికానందం పొందారు. హేమంత్పై దాడి జరగగానే పక్కనే ఉన్న స్నేహితులు వెంటనే హేమంత్ తండ్రికి సమాచారం ఇచ్చారు. హేమంత్ తండ్రి, కుటుంబ సభ్యులు బార్ వద్ద వచ్చి చూడగా హేమంత్ జాడ లేదు.హేమంత్ ఊపిరి ఆగిపోయే వరకూ టెంపోలో ఊరంతా తిప్పిన నరసింహమూర్తి చివరకు శవాన్ని బెంగళూరు రోడ్డులో ఉన్న నవోదయ పాఠశాల వద్ద రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. మృతుడు హేమంత్ రియల్ ఎస్టేట్, సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. నిందితుడు నరసింహమూర్తి పేకాట క్లబ్బులు నడుపుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు. దీంతో అతడిపై పోలీసులు రౌడీషిట్ తెరిచారు. అయితే మృతుడు, హతుడు ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య ఎందుకు శత్రుత్వం పెరిగిందనేది తెలీడంలేదు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు అందరూ పరారీలో ఉన్నారు.
హైకోర్టు లాయర్ చైత్రా ఆత్మహత్య
యశవంతపుర: కేఏఎస్ అధికారి భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. సంజయనగర పోలీసుస్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న కేఏఎస్ అధికారి శివకుమార్ భార్య చైత్రా హైకోర్టు వకీలు. శుక్రవారం రాత్రి ఇంటిలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియటంలేదు. మృతురాలి సోదరుడు ఇచ్చి ఫిర్యాదు ఆధారంగా సంజయనగర పోలీసులు కేసునమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.మృతిపై అనుమానాలుచైత్ర భర్త శివకుమార్ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థలో సబ్ డివిజనల్ అధికారిగా ఉన్నారు. చైత్రతో ఆయనకు 2016లో వివాహమైంది, వారికి ఐదేళ్ల కుమార్తె ఉంది. శుక్రవారం రాత్రి ఆయన డ్యూటీ నుంచి ఇంటికి రాగా, భార్య అచేతనంగా పడి ఉంది. దీంతో వెంటనే స్థానిక సంజయనగర పోలీసులకు కాల్ చేశారు. చైత్ర హైకోర్టు లాయరుగా పనిచేస్తూ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందింది. ఆమె షటిల్ బ్యాడ్మింటన్ వంటి ఆటల్లోనూ ప్రావీణ్యురాలు. ఆమె మృతిని నమ్మలేకపోతున్నట్లు బంధుమిత్రులు తెలిపారు. ఎంతో చలాకీగా ఉండేదని, ఆత్మహత్య చేసుకుందంటే నమ్మశక్యంగా లేదని అనుమానాలను వ్యక్తం చేశారు. పోలీసులు కేసు విచారణ చేపట్టారు.