Top Stories
ప్రధాన వార్తలు
టీడీపీ నేతల దౌర్జన్యాలు.. ఏపీలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం
ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్. ఓటమి భయంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగు దేశం నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు.. పల్నాడు ఉద్రిక్తతలపై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్ సారించింది.కృష్ణాపెనమలూరు నియోజకవర్గం పోరంకి హై స్కూల్ పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను ప్రలోభపెడుతున్న టీడీపీటీడీపీకి ఓటు వెయ్యాలని పార్టీ గుర్తు చూపిస్తున్న కార్యకర్తలుటీడీపీ ప్రలోభాల పై నిలదీసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలుటీడీపీ పై పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలుప్రకాశంఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ 10 వాహనాల కాన్వాయ్ తో హల్చల్,ఎన్నికల నిబంధనలు కు విరుద్ధంగా కాన్వాయ్పట్టించుకోని పోలీసులు ,ఎన్నికల అధికారులుఎస్పీ సుమిత్ కి పిర్యాదు చేసిన బాలినేనిబాపట్ల పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలం పెదనక్కలపాలెంలో టీడీపీ అరాచకంబాపట్ల వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ కారుపై దాడిదాడి సమయంలో కారులో లేని నందిగం సురేష్ఏజెంట్లు మాత్రమే కారులో ఉండడంతో కారుపై దాడి చేసి నందిగం సురేష్ ను దుర్భాషలాడిన టీడీపీ కార్యకర్తలుఏజెంట్ల ను బెదిరించిన టీడీపీ కార్యకర్తలుమూడురోజుల క్రితమే యద్దన పూడి మండలం చింతపల్లిపాడులో సురేష్ పై దాడి చేసిన టీడీపీ శ్రేణులుకాకినాడగొల్లప్రోలు టౌన్ లో ఉద్రిక్తత.మహిళలను ఏడిపించిన జనసేన కార్యకర్తలుఅడ్డుకోబోయిన వైఎస్సార్సీపీ కార్యకర్తలువైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు దాడిపరిస్తితి ఉద్రిక్తంప్రకాశందర్శి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలుదర్శి మండలం బొట్లపాలెం ఘర్షణ, వైస్సార్సీపీ ,టీడీపీ కార్యకర్తలు కొట్లాట, పరిస్థితి ఉద్రిక్తంఏజెంట్ల తలెత్తిన వివాదంకిందపడిన ఈవీఎంవైస్సార్సీపీ కార్యకర్తలు పై టీడీపీ కార్యకర్తలు దాడిదేవవరంలోనూ ఘర్షణ, ఏజెంట్ ల మధ్య గొడవప్రకాశందర్శి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలుదర్శి మండలం బొట్లపాలెం ఘర్షణ, వైస్సార్సీపీ ,టీడీపీ కార్యకర్తలు కొట్లాట, పరిస్థితి ఉద్రిక్తంఏజెంట్ల తలెత్తిన వివాదంకిందపడిన ఈవీఎంవైస్సార్సీపీ కార్యకర్తలు పై టీడీపీ కార్యకర్తలు దాడిదేవవరంలోనూ ఘర్షణ, ఏజెంట్ ల మధ్య గొడవపల్నాడుమాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ వద్ద టీడీపీ కార్యకర్తల దౌర్జన్యంపోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితాము లోపలికి వెళ్తామని టీడీపీ కార్యకర్తల ఆందోళనపోలింగ్ కేంద్రం గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నంఅడ్డుకున్న పోలీసులతో వాగ్వివాదంపోలీసులను నెట్టేసిన టీడీపీ కార్యకర్తలుఅనంతపురంగుత్తిలో టీడీపీ నేతల దౌర్జన్యంపోలింగ్ కేంద్రం లో ప్రచారం నిర్వహించిన టీడీపీ నేతలుప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలుకర్నూలుకర్నూలు 17వ వార్డు టిడిపి పార్టీ కార్పోరేటర్ పద్మలతా రెడ్డి ప్రలోభాలు...పోలింగ్ కేంద్రం వద్ద చేరుకొని టిడిపికి ఓటు వేయాలని ఓటర్లను ప్రభావితం చేస్తున్న కార్పొరేటర్..ఎన్నికల నిబంధన ఉల్లంఘించి ప్రచారానికి పాల్పడుతున్న టిడిపి కార్పొరేటర్ పద్మలత రెడ్డిచిత్తూరుకుప్పం నియోజవర్గంలో దొంగ ఓటర్లుకుప్పం మున్సిపాలిటీ పాతపేట 163 పోలింగ్ బూత్ లో తన ఓటు వేరే ఎవరో దొంగ ఓటు వేశారని ఆవేదన వ్యక్తం చేసిన గాయత్రీ అనే ఓటర్మొదటి సారి ఓటు హక్కు వినయోగించుకోవాలని చూసిన యువతీ తన ఓటు వేరొకరు వేసేయడంతో కన్నీళ్లు పెట్టుకొన్న యువతీకృష్ణాబాపులపాడులో జనసేన,టీడీపీ నాయకులు ఓవర్ యాక్షన్.పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న జనసేన,టీడీపీ నాయకులు.జనసేన నాయకుడు చలమలశెట్టి రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేత గోసుల శివ భరత్ రెడ్డి.ఏలూరు దెందులూరు నియోజకవర్గం పెదవేగి గ్రామంలో టిడిపి నాయకుల దౌర్జన్యం.పోలింగ్ బూత్ నెంబర్ 54 లోకి ఒక్కసారిగా చొచ్చుకుని వెళ్ళే ప్రయత్నం చింతమనేని అనుచరులు.ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భయభ్రాంతులకు గురైన ఓటర్లువిధుల్లో ఉన్న పోలీసుల అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడిన టిడిపి నాయకులుపారా మిలిటరీ బలగాలు రంగ ప్రవేశం చేయటంతో సద్దుమణిగిన పరిస్థితులు.నంద్యాలనందికొట్కూరు పట్టణంలోని 46,47,48 పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేత మాండ్రా శివనంద రెడ్డి హాల్ చల్ క్యూలైన్లో ఉన్న ఓటర్లపై ఒత్తిడి తెచ్చి ప్రలోభాల పర్వంక్యూలైన్లలో ఉన్న ఓటర్లను పక్కకు పిలిచి ఓటు వేయాలని భయబ్రాంతులకు గురి చేస్తున్న టీడీపీ నేత మాండ్రా శివానంద రెడ్డి,ఓటర్లను ప్రభావితం చేస్తున్న టీడీపీ శివానంద రెడ్డికి పోలీసుల వార్నింగ్ 100 మీటర్లు బయటఉండాలని సూచనపోలీసుల మాట లెక్క చేయకుండా నేను చీఫ్ ఎలక్షన్ ఏజంట్ అని బూత్ పరిశీలించి వెళ్తానని పోలీసులతో వాదించారు టీడీపీ నేత చిత్తూరు టీడీపీ గుండాల రౌడీయిజంమండికృష్ణాపురం పంచాయతీ లో టిడిపి గుండాల అరాచకంవైఎస్ఆర్సీపీ బూత్ ఏజెంట్స్ పై కత్తితో దాడి ఆపై పరారీ ఓటమి భయంతో నీచ రాజకీయాలకు తెరతీసిన చిత్తూరు టీడీపీ శ్రేణులువైఎస్సార్ జిల్లాబద్వేల్ టీడీపీ కార్యాలయం వద్ద కూటమి నాయకుల ఘర్షణ అగ్రహారం గ్రామానికి సంబంధించి ఓటర్లకు డబ్బు మేము పంచుతాము అంటే మేము పంచుతాము అంటూ గొడవ జనసేన నేత వేలును టీడీపీ నాయకుడు ఇరు వర్గాలు పోలీసుల అదుపులో
AP Elections 2024 Polling: ఏపీ పోలింగ్ డే అప్డేట్స్
AP Elections 2024 Polling Updatesఏపీ ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు..
మీ ఓటు పడిందా? ఇలా కన్మర్ఫ్ చేస్కోండి
మంగళగిరి పోలింగ్ బూత్‌లో పవన్ ఓవరాక్షన్
గుంటూరు, సాక్షి: జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కల్యాణ్ ఓవరాక్షన్‌కు దిగారు. సోమవారం ఉదయం తన భార్య అన్నా లెజినోవాను, కొందరు అనుచరులను వెంట పెట్టుకుని పోలింగ్ సెంటర్లోకి తీసుకెళ్లి హల్ చల్ చేశారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మి నరసింహ కాలనీలో 197వ బూత్‌లో పవన్ ఓటేసేందుకు వచ్చారు. ఆ సమయంలో తన భార్యను వెంటపెట్టుకుని బూత్‌లోకి తీసుకెళ్లారు. అలాగే.. అక్కడ సెంటర్లో ఓటే లేని అనుచరుల్ని వెంట తీసుకెళ్లారు. బూత్‌లో కలియ దిరుగుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. పవన్ భార్య అన్నా లెజినోవాకు సైతం అక్కడ ఓటు లేదని సమాచారం. అయినా అధికారులు వాళ్లను లోపలికి ఎలా అనుమతించారా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కొందరు.మరోవైపు పవన్ అలా వాళ్లందరినీ లోపలికి తీసుకెళ్తుంటే.. క్యూ నిల్చున్న కొందరు ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అక్కడే ఉన్న పోలింగ్ సిబ్బంది ఆ అభ్యంతరాల్ని పట్టించుకోకపోవడం గమనార్హం.
ఓటేయండి.. సెల్ఫీ పంపండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ, అలాగే తెలంగాణలోనూ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. తమ రాష్ట్రం కోసం, తమ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సవ్యంగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని ఎన్నికల సంఘాలు కోరుతున్నాయి. అలాగే.. సాక్షి సైతం తన వంతుగా ఓటర్లను చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలోనే సెల్ఫీ ఛాలెంజ్‌ను నిర్వహిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్‌కు (9182729310) మీ వివరాలతో వాట్సాప్ చేయడమే. అందులోంచి నాణ్యత ఉన్న ఫోటోలను ఎంపిక చేసి సాక్షి. కామ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ‘‘నా ఉనికి ఓటుతోనే.., నా ఓటు వజ్రాయుధం’’ అని మీరు సందేశం ఇస్తే.. మీ బాధ్యతను చూపించి మరో నలుగురిని ఓటేసేలా ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నం చేస్తాం.గమనిక: పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ను అనుమతించరు. సిబ్బంది కళ్లు కప్పి తీసుకెళ్లి అక్కడ సెల్ఫీలు దిగడం నేరం. కేసు పెడతారు.
TS Lok Sabha Polling 2024 Updates: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ అప్డేట్స్..
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ అప్డేట్స్
జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
నెల్లూరు, సాక్షి: పోలింగ్‌తో ఏపీలో జన జాతర నడుస్తోంది. దూర సుదూర ప్రాంతాల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో చెన్నై నుంచి కావలికి వచ్చిన ఓ దివ్యంగురాలి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విశ్వోదయ బాయ్స్ హై స్కూల్ లో పోలింగ్ స్టేషన్ వద్ద ఓటేయడానికి కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో ఆ దివ్యాంగురాలు భావోద్వేగంగా మాట్లాడారు. జగనన్న ద్వారా తాను లబ్ధి పొందానని.. అందుకే కృతజ్ఞతతో జగన్ అన్నకు ఓటు వేసేందుకు ఇక్కడికి వచ్చానని ఆమె తెలిపారు.అన్నా.. సాయం అంటే చాలూ.. అప్పటికప్పుడే అధికారుల్ని పిలిపించుకుని గంటల వ్యవధిలోనే సాయం అందేలా చూడడం సీఎం జగన్ నైజం. అలా ఈ 59 నెలల్లో లక్షల మంది వ్యధలను సీఎం జగన్ స్వయంగా విని.. వాళ్లకు ప్రభుత్వం తరఫున సాయం అందించడం చూశాం కూడా.
Lok sabha elections 2024: కొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్
Updatesనాలుగో విడత పోలింగ్ కొనసాగుతోందిఉదయం 11 గంటల వరకు 24.87 శాతం పోలింగ్ నమోదైందిఆంధ్రప్రదేశ్- 23.10 శాతంతెలంగాణ- 24.31 శాతంబిహార్- 22.54 శాతంజమ్మూ కశ్మీర్- 14.94 శాతంజర్ఖండ్- 27. 40 శాతంమధ్యప్రదేశ్- 32.38 శాతంమహారాష్ట్ర- 17.51 శాతంఒడిశా- 23.28 శాతంఉత్తరప్రదేశ్- 27.12 శాతంపశ్చిమ బెంగాల్- 32.78 శాతం#LokSabhaElections2024 | 24.87% voter turnout recorded till 11 am, in the fourth phase of elections. Andhra Pradesh 23.10%Bihar 22.54Jammu And Kashmir 14.94% Jharkhand 27.40% Madhya Pradesh 32.38% Maharashtra 17.51% Odisha 23.28% Telangana 24.31% Uttar Pradesh 27.12%… pic.twitter.com/Awy60bMdeG— ANI (@ANI) May 13, 2024 జార్ఖండ్:జార్ఖండ్ సీఎం చంపయ్ సోరెన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.జిలింగోరా పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Jharkhand CM Champai Soren shows the indelible ink mark on his finger after voting at a polling booth in Jilingora, Saraikela Kharsawan District.#LokSabhaElections2024 pic.twitter.com/qw6nn60JBf— ANI (@ANI) May 13, 2024 పశ్చిమ బెంగాల్:దుర్గాపూర్: బెంగాల్ ఘర్షణ చోటుచేసుకుంది.బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.అక్కడే ఉన్న పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.#WATCH Durgapur, West Bengal: A clash broke out between BJP and TMC workers in Durgapur.#LokSabhaElections2024 pic.twitter.com/alSiQy6ldv— ANI (@ANI) May 13, 2024 ఢిల్లీ:నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోందిఓటువేయడానికి భారిగా ప్రజలు తరలివస్తున్నారుఉదయం 9 గంటల వరకు మొత్తం 10. 35 శాతం పోలింగ్ నమోదైందిఆంధ్రప్రదేశ్- 9.05 శాతంతెలంగాణ- 9.51 శాతంబిహార్- 10.18 శాతంజమ్మూ కశ్మీర్- 5.07 శాతంజర్ఖండ్- 11. 78 శాతంమధ్యప్రదేశ్- 14. 97 శాతంమహారాష్ట్ర- 6.45 శాతంఒడిశా- 9. 23 శాతంఉత్తరప్రదేశ్- 11. 67 శాతంపశ్చిమ బెంగాల్- 15. 24 శాతం#LokSabhaElections2024 | 10.35% voter turnout recorded till 9 am, in the fourth phase of elections.Andhra Pradesh 9.05%Bihar 10.18%Jammu And Kashmir 5.07%Jharkhand 11.78%Madhya Pradesh 14.97%Maharashtra 6.45%Odisha 9.23%Telangana 9.51%Uttar Pradesh 11.67%West Bengal… pic.twitter.com/tmtjV4Aluw— ANI (@ANI) May 13, 2024 ఉత్తర ప్రదేశ్:యూపీ మంత్రి జితిన్ ప్రసాదా ఓటు హక్కు వినియోగించకున్నారు.షహజాన్‌పూర్ పోలింగ్ కేంద్రంలో ఓటు చేశారు.#WATCH | Uttar Pradesh Minister Jitin Prasada casts his vote at a polling booth in ShahjahanpurINDIA Alliance has fielded SP's Jyotsna Gond here. She faces BJP's sitting MP & candidate Arun Kumar Sagar & BSP's Dod Ram Verma. #LokSabhaElections2024 pic.twitter.com/a933KBvJWW— ANI (@ANI) May 13, 2024 జమ్మూ కశ్మీర్:శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా, వైఎస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Srinagar, J&K: JKNC Chief Farooq Abdullah and JKNC Vice President Omar Abdullah show their inked fingers after casting their votes for the #LokSabhaElections2024 pic.twitter.com/arYMBqgxBm— ANI (@ANI) May 13, 2024 యూపీ:ఉన్నావ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాక్షి మహారాజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Uttar Pradesh: BJP MP and candidate from Unnao, Sakshi Maharaj casts his vote at a polling booth in the constituency.Samajwadi Party (SP) has fielded Annu Tandon and BSP has fielded Ashok Kumar Pandey here. #LokSabhaElections2024 pic.twitter.com/gW1oFBrui7— ANI (@ANI) May 13, 2024 జమ్మూ కశ్మీర్:శ్రీనగర్‌లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోందిపెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారుLok Sabha elections 2024: Polling underway in SrinagarRead @ANI Story | https://t.co/gDgPtt9ffZ#JammuKashmir #Srinagar #LokSabhaElection2024 pic.twitter.com/2B9fFIibHg— ANI Digital (@ani_digital) May 13, 2024 తెలంగాణఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డిబర్కత్పూరా పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.నాలుగోవిడత పోలింగ్ కొనసాగుతోందిUnion Minister G Kishan Reddy casts his vote in Telangana's BarkatpuraRead @ANI Story | https://t.co/vmoYK3dewi#GKishanReddy #LokSabhaElection2024 #Telangana pic.twitter.com/Xiwl8pYjcJ— ANI Digital (@ani_digital) May 13, 2024 మధ్యప్రదేశ్మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఉజ్జయినిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Madhya Pradesh CM Mohan Yadav casts his vote at a polling station in Ujjain. #LokSabhaElections2024 pic.twitter.com/FxzdPbdYja— ANI (@ANI) May 13, 2024 ఢిల్లీ:కొనసాగుతున్న నాలుగో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్దేశవ్యాప్తంగా సాధారణ వాతావరణ పరిస్థితులు, హీట్ వేవ్ లేదని వెల్లడించిన ఐఎండిపోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లుపది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికలుఎన్నికల బరిలో 1717 మంది అభ్యర్థులుప్రతి పార్లమెంటులో సగటున 18 మంది అభ్యర్థులు1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న 17.7 కోట్ల మంది ఓటర్లు85 ఏళ్లు దాటిన ఓటర్లు12.49 లక్షల మంది, 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లుఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలుతెలంగాణలో పోలింగ్ సమయం పెంపు; ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న 19లక్షల మంది సిబ్బందిఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లు1016 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దులలో నిఘాపోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు తెలంగాణఓటు హక్కు వినియోగించుకున్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ#WATCH | Telangana: AIMIM candidate from Hyderabad, Asaduddin Owaisi shows his inked finger after casting his vote at a polling booth in Hyderabad. #LokSabhaElections2024 pic.twitter.com/aEg4psMI8A— ANI (@ANI) May 13, 2024 తెలంగాణకేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఈఓ వికాస్ రాజ్‌కు ఫిర్యాధు చేసిన కాంగ్రెస్ఓటు వేసి మీడియాతో మాట్లాడుతూ మోడీ పేరును ప్రస్తావించినందుకు ఫిర్యాధుపోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందన్న కాంగ్రెస్కిషన్ రెడ్డి పై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని ECని కోరిన కాంగ్రెస్ మహారాష్ట్ర:కేంద్ర మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఓటు హక్కు వినియోగించుకున్నారు.జాల్నా పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Union Minister and BJP's candidate from Jalna Lok Sabha seat, Raosaheb Patil Danve casts his vote at a polling booth in Jalna, Maharashtra Danve is sitting MP from this seat. INDIA alliance has fielded Congress leader Kalyan Vaijinathrao Kale from this seat.… pic.twitter.com/cRvRTK4B8b— ANI (@ANI) May 13, 2024 జమ్మూ కశ్మీర్:పుల్వామా పోలింగ్ కేంద్రంలో బారులు తీరిన ఓటర్లు#WATCH | Jammu and Kashmir: Voters queue up outside a polling booth in PulwamaNational Conference (NC) has fielded Aga Syed Ruhullah Mehdi from the Srinagar Lok Sabha seat, PDP fielded Waheed-ur-Rehman Para, and J&K Apni Party’s fielded Mohammad Ashraf Mir.… pic.twitter.com/VSgGZs9Vki— ANI (@ANI) May 13, 2024 తెలంగాణ:త్రిపురా గవర్నర్ ఎన్ ఇంద్రసేనా రెడ్డి ఓటు వేశారు.హైదరాబాద్ సలీంనగర్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కొనసాగుతోంది#WATCH | Telangana: Tripura Governor N Indrasena Reddy, along with his family, casts his vote at a polling booth in Saleem Nagar, Hyderabad. #LokSabhaElections2024 pic.twitter.com/tdl5oYHbrs— ANI (@ANI) May 13, 2024 తెలంగాణ:ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులుహైదరాబాద్లోని జూబ్లీహిల్స్‌లో ఓటు వేశారు.నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది#WATCH | Telangana: Former Vice President M Venkaiah Naidu and his wife Usha Naidu show the indelible ink mark on their fingers after casting their vote at a polling booth in Jubilee Hills, Hyderabad.#LokSabhaElections2024 pic.twitter.com/gUN3v2Ekf2— ANI (@ANI) May 13, 2024 ఢిల్లీ:ఓటు వేయటం ప్రజాస్వామ్య హక్కు: ప్రధాని మోదీకొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్Lok Sabha election: PM Modi calls for 'democracy duty' as voting begins in fourth phaseRead @ANI Story | https://t.co/6N8RRsDrTD#LokSabaElections2024 #PMModi #democracy pic.twitter.com/IhZJO6sRzR— ANI Digital (@ani_digital) May 13, 2024 తెలంగాణ: హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Telangana: BJP candidate from Hyderabad, Madhavi Latha casts her vote at a polling booth in the constituency.She faces sitting MP and AIMIM candidate Asaduddin Owaisi and BRS' Gaddam Srinivas Yadav here. #LokSabhaElections2024 pic.twitter.com/E7sMVEZOrj— ANI (@ANI) May 13, 2024 బిహార్:కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.లఖిసారి పోలింగ్ కేంద్రంలో ఓటు చేశారు.పోలింగ్ కేంద్రానికి ఓటర్లు తరలి వస్తున్నారు.#WATCH | Bihar: After casting his vote in Lakhisari, Union Minister and BJP candidate from Begusarai, Giriraj Singh says, "I want to appeal to the voters of Bihar that they must go out and vote. One vote can cause the fall of the Atal Bihari Vajpayee government and every vote can… pic.twitter.com/X6IiXHe8Qu— ANI (@ANI) May 13, 2024 యూపీ:ఉత్తరప్రదేశ్ మంత్రి సురేష్ ఖన్నా ఓటు హక్కు వినియోగించుకున్నారు.షహజాన్‌పూర్‌లో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేయడానికి ప్రజలు తరలి వస్తున్నారు.ఓటర్లు క్యూలైన్లో నిల్చుంటున్నారు. #WATCH | Uttar Pradesh Minister Suresh Khanna casts his vote at a polling booth in Shahjahanpur. INDIA Alliance has fielded SP's Jyotsna Gond here. She faces BJP's sitting MP & candidate Arun Kumar Sagar & BSP's Dod Ram Verma. #LokSabhaElections2024 pic.twitter.com/fpFLtROJ11— ANI (@ANI) May 13, 2024 ఒడిశా:నాబారంగాపూర్లో ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు.#WATCH | Nabarangpur, Odisha: An eco-friendly polling station has been established at the Dandamunda village in Chandahandi Block of the Nabarangpur Lok Sabha constituency.BJP's Balabhadra Majhi, BJD's Pradeep Majhi and Congress' Bhujabala Majhi are contesting the… pic.twitter.com/tWfKsAon3B— ANI (@ANI) May 13, 2024 ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.క్యూలైన్లో నిల్చున్న ఓటర్లుVoting for the fourth phase of #LokSabhaElections2024 begins. Polling being held in 96 constituencies across 10 states and Union Territories (UTs) today. 1717 candidates in fray. pic.twitter.com/GXFjsWMsdQ— ANI (@ANI) May 13, 2024 తెలంగాణతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన మాక్ పోలింగ్రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ17 పార్లమెంటు స్థానాలకు బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులుఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే ముగియనున్న పోలింగ్పోలింగ్ పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 525 మంది అభ్యర్థులు, 475మంది పురుషులు, 50 మంది మహిళా అభ్యర్థులుఎన్నికల విధుల్లో 2లక్షల 80వేల మంది సిబ్బంది విధుల నిర్వహణ160 కేంద్ర కంపెనీల CAPF బలగాలతో బందోబస్తుఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి 20వేల మంది పోలీస్ బలగాలురాష్ట్ర వ్యాప్తంగా 3కోట్ల 32లక్షల 32వేల మంది ఓటర్లుపురుష ఓటర్లు - 1కోటి 65లక్షల 28వేలు, 1కోటి 67లక్షల మహిళా ఓటర్లు18-19 ఏళ్ల వయసు కలిగిన యువ ఓటర్లు 9లక్షల 20వేలు, వికలాంగులు 5లక్షల 27వేలుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 808 పోలింగ్ కేంద్రాలుఅత్యధికంగా మల్కాజ్‌గిరిలో 3226 పోలింగ్ కేంద్రాలు1లక్ష 9వేల 941 బ్యాలెట్ యూనిట్లు, 44906 కంట్రోల్ యూనిట్లుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9900 ఉన్నట్లు గుర్తించిన ఈసీజూన్ 4వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు#WATCH | Hyderabad, Telangana: Mock polling begins at the Jubilee Hills Public School polling booth nos. 163, 164 and 165 from Secundrabad Lok Sabha Constituency. BJP's G Kishan Reddy, Congress' Danam Nagender and BRS' T. Padma Rao Goud are contesting elections from here. G… pic.twitter.com/Q50qyruJ3B— ANI (@ANI) May 13, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నాలుగో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. 1717 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రతి పార్లమెంటులో సగటున 18 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17.7 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లు12.49 లక్షలు ఉండగా, 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణలో పోలింగ్ సమయం పెంచడంతో ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియలో 19 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లను నియమించారు. 1016 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దులలో ఈసీ నిఘా ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు చేశారు.
అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉదయం 7.30 గంటలకే తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్ ఉదయం 7.30 గంటలకే ఓటేశాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చాడు. నంద్యాల అంసెబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్తి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తన స్నేహితుడని.. అందుకే ఆయనకు మద్దతుగా నంద్యాల వెళ్లాలని చెప్పాడు. ‘శిల్పా రవి నాకు 15 ఏళ్లుగా మిత్రుడు. అతనికి మద్దతు ఇస్తానని గతంలో మాట ఇచ్చాను. రాజకీయాలతో సంబంధం లేకుండా స్నేహితుడిగా మాత్రమే శిల్పారవికి మద్దతుగా నంద్యాల వెళ్లాను. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను’అని బన్నీ అన్నారు.
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్!
- నయవంచనకు చెక్ పెడదాం
- శ్రీనగర్‌లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్ శాతం?
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- జనస్వామ్యమా! జయీభవ!!
సినిమా
Lok sabha elections 2024: సామాన్యుడిలా క్యూలో నిలబడి ఓటేసిన సినీ స్టార్స్
లోక్ సభ నియోజకవర్గాలలో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే ఏపీలో 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచే సామాన్య ప్రజలతో పాటుగా పలువురు సీనీ సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ఉదయం 7 గంటలకే భార్య ప్రణతి, తల్లితో కలిసి ఓటింగ్‌లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి క్యూలైన్ లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్‌కు ఉదయం 7.30 గంటలకే వచ్చిన బన్నీ.. అందరితో పాటు క్యూలో నిలబడి తన వంతు రాగానే ఓటు వేశాడు. అనంతరం మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. #WATCH | Telangana: Actor Jr NTR arrives at a polling booth in Jubilee Hills, Hyderabad to cast his vote. #LokSabhaElections2024 pic.twitter.com/irFIjHVGVq— ANI (@ANI) May 13, 2024 #WATCH | Telangana: Actor Allu Arjun casts his vote at a polling booth in Jubilee Hills, Hyderabad. #LokSabhaElections2024 pic.twitter.com/M0yhR7XLeP— ANI (@ANI) May 13, 2024 మెగాస్టార్ చిరంజీవి కూడా తన భార్య సురేఖ, కూతురితో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ క్లబ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. Actor and former Union Minister K Chiranjeevi along with his wife surekha and daughter stand in the queue to cast their vote at Jubilee hills club in Hyderabad #Chiranjeevi @TOIHyderabad #ElectionDay #Hyderabad pic.twitter.com/V0tSJd4wu3— Sudhakar Udumula (@sudhakarudumula) May 13, 2024 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' సినిమాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, భార్య రమా రాజమౌళి, కొడుకు కార్తికేయతో కలిసి హైదరాబాద్ లోని షేక్ పేటలో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. Flew from Dubai… Rushed to the polling booth directly from the airport, hence the tired looks..🙂Done! YOU? pic.twitter.com/kQUwa1ADG6— rajamouli ss (@ssrajamouli) May 13, 2024 ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్ఎన్సీసీ పోలింగ్ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఎఫ్ ఎన్ సిసి లో ఓటు వేసిన దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు, కుటుంబ సభ్యులు.. #KRaghavendraRao #ElectionDay pic.twitter.com/OydpOtOBmj— Vamsi Kaka (@vamsikaka) May 13, 2024 హైదరాబాద్ లోని ఎఫ్ఎన్ సీసీలో ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వయసు సమస్యల కారణంగా మరో వ్యక్తి సాయంతో పోలింగ్ బూత్ లోకి వచ్చారు.Senior Versatile actor #KotaSrinivasaRao garu to cast his vote at FNCC pic.twitter.com/VOTzqZJg7W— Telugu Film Producers Council (@tfpcin) May 13, 2024టాలీవుడ్ నటులు మోహన్ బాబు, అతడి కొడుకు మంచు విష్ణు.. తిరుపతి జిల్లాలోని ఏ. రంగంపేటలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.Actor @chay_akkineni cast their vote 🗳️ #Elections2024 #NagaChaitanya pic.twitter.com/wS51UCYnGr— Suresh PRO (@SureshPRO_) May 13, 2024#ManchuManoj exercised his right to vote @HeroManoj1#Elections2024 #LokSabhaElections2024 pic.twitter.com/gX0ciNPiB6— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 13, 2024పద్మారావు నగర్ వాకర్స్ టౌన్ హాల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల pic.twitter.com/hgI4v69IhW— Telugu Film Producers Council (@tfpcin) May 13, 2024
హాలీవుడ్ కింగ్ ఆఫ్ కల్ట్ రోజర్ కన్నుమూత
హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ దర్శక–నిర్మాత, నటుడు రోజర్ విలియం కోర్మన్ (98) కన్నుమూశారు. 1926 ఏప్రిల్ 5న డెట్రాయిట్లో జన్మించారు రోజర్ కోర్మన్ . కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో ఈ నెల 9న ఆయన మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు హాలీవుడ్ మీడియా చెబుతోంది. దీంతో కాస్త ఆలస్యంగా ఆయన మరణవార్త వెలుగులోకి వచ్చింది. 1950లో స్టోరీ రీడర్‌గా ఆయన సినీ కెరీర్ మొదలైంది. కెరీర్ మొదట్లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న తర్వాత రోజర్ కోర్మన్ తొలిసారిగా ‘మాన్ స్టర్ ఫ్రమ్ ది ఓషియన్ ఫ్లోర్’ అనే ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ నిర్మించగా మంచి విజయం సాధించింది. రోజర్ 50కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. 350కిపైగా సినిమాలను నిర్మించారు. అలాగే 20కి పైగా సినిమాల్లో నటించారు. దాదాపు 30 సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ చేశారు. రోజర్ కెరీర్లో ‘ఫైవ్ గన్స్ వెస్ట్’, ‘డే ది వరల్డ్ ఎండెడ్’, ‘ది అన్ డెడ్’, ‘టార్గెట్స్’, ‘వార్ ఆఫ్ ది శాటిలైట్స్’, ‘ఎక్స్: ద మ్యాన్ విత్ ది ఎక్స్ రే ఐస్’, ‘డెత్ రేస్’ వంటి ఎన్నో హిట్ సినిమాలున్నాయి. హాలీవుడ్ పరిశ్రమ రోజర్‌ను ‘΄ోప్ ఆఫ్ ΄ాప్ సినిమా’, ‘ది కింగ్ ఆఫ్ కల్ట్’ వంటి పేర్లతో పిలుచుకుంటుంది. రోజర్‌కు భార్య జూలీ కోర్మన్, కుమార్తెలు కేథరీన్, మేరీ ఉన్నారు. ఆయన మృతిపట్ల హాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
నేనేం క్రికెట్ కోసం పుట్టలేదు!
రాజ్‌కుమార్ రావు, జాన్వీకపూర్ జంటగా నటించిన హిందీ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి శరణ్ శర్మ దర్శకుడు. ఈ సినిమాలో మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్ రావు, మహిమ పాత్రలో జాన్వీ కపూర్ నటించారని బాలీవుడ్ సమాచారం. జీ స్టూడియోస్, కరణ్ జోహార్, యశ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘నాకు ఇంకో ఏడాది అవకాశం కల్పించండి నాన్న.. నేను కచ్చితంగా సెలక్ట్ అవుతాను.. నా కలను బ్రేక్ చేయవద్దు నాన్న.. ప్లీజ్’, ‘మీ నాన్న కోసం నువ్వు (జాన్వీని ఉద్దేశిస్తూ..) డాక్టర్ అయ్యావు మహి.. కానీ నువ్వు ఏం కావాలనుకుంటున్నావు’ (రాజ్‌కుమార్ రావు), ‘నేనేం క్రికెట్ కోసం పుట్టలేదు’ (జాన్వీ కపూర్) వంటి డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. క్రికెటర్ కావాలనుకున్న ఓ యువకుడు తన లక్ష్యాన్ని సాధించలేకపోతాడు. ఆ తర్వాత అతను పెళ్లి చేసుకుంటాడు.వృత్తి రీత్యా డాక్టర్ అయిన తన భార్యలో క్రికెట్ ప్రతిభ ఉందని గ్రహించి, తన భార్యకు తానే క్రికెట్ కోచింగ్ ఇచ్చి, ఆమెను ్రపోత్సహించి క్రికెటర్‌ను చేయాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో ఆ భార్యాభర్తల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే నేపథ్యంలో ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమా కథనం ఉంటుందని బాలీవుడ్ టాక్.
The Marvels Movie Review: ది మార్వెల్స్ రివ్యూ.. 2 వేల కోట్ల లేడి సూపర్ హీరో మూవీ ఎలా ఉందంటే?
హాలీవుడ్ అంటేనే కళ్లు చెదిరే యాక్షన్ సీన్లతో దుమ్మురేపుతారు. అందులోనూ మార్వెల్ యూనివర్స్ చిత్రాలపై ప్రేక్షకుల అంచనాలు ఏ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రాంచైజ్‌లో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ సంబరపడిపోతుంటారు. ఇప్పటికే మార్వెల్స్ నుంచి వచ్చిన స్పైడర్ మ్యాన్, కెప్టన్ మార్వెల్,ది అవెంజర్స్,బ్లాక్ పాంథర్ లాంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి.ఈ క్రమంలో నవంబర్ 10 2023న విడుదలైన 'ది మార్వెల్స్' తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందేబాటులో ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ డీస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ముగ్గురు లేడి సూపర్ హీరోల కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాను రూ.2250 కోట్లతో నిర్మించారు. 2019లో వచ్చిన కెప్టెన్ మార్వెల్ సినిమాకు సీక్వెల్‌గా 'ది మార్వెల్స్'ఈ సినిమా వచ్చింది. ఇందులో బ్రీ లార్సన్ ప్రధాన పాత్రలో లీడ్ చేస్తే.. ఇమాన్ వెల్లని, టియోనా పార్రిస్లు లేడి సూపర్ హీరోలుగా చేశారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకురాలు నియో డకోస్టా తెరకెక్కించిన చిత్రమిది. యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..మార్వెల్‌కు చెందిన ఈ ముగ్గురు సూపర్ హీరోయిన్స్ విశ్వ రక్షణ కోసం పోరాడుతుంటారు. క్రీ అనే గ్రహం అంతరించిపోతున్న సమయంలో ఆ గ్రహాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని విలన్ పాత్రలో ప్రొటెక్టర్ డార్విన్ (జావే ఆష్టన్) పోరాడుతుంటాడు. ఇతర గ్రహాల్లో ఉన్న వనరులను తన గ్రహానికి తెచ్చుకునే పనిలే ఉంటాడు. అందుకోసం ఒక క్వాంటమ్ బ్యాండ్ సాయంతో ఈ పనిచేస్తుంటాడు. ఇలాంటి సమయంలో క్వాంటమ్ బ్యాండ్ నుంచి వచ్చే మాగ్నెటిక్ పవర్ వల్ల అనేక శక్తులతో కెప్టెన్ మార్వెల్ కారోల్ డార్విన్ (బ్రీ లార్సన్), కెప్టెన్ మోనికా ర్యాంబో (టియోనా పార్రిస్), కమలా ఖాన్ అలియాస్ మిస్ మార్వెల్ (ఇమాన్ వెల్లని) ఎంట్రీ ఇస్తారు. ఈ ముగ్గురిని టీం అప్ చేసే ‘నిక్ఫ్యూరి’ పాత్రలో సామ్యూల్ జాక్సన్ కనిపిస్తారు. తన శక్తులను లాక్కున్న క్రీ గ్రహం నుంచి వాటిని తిరిగి సాధించి తనపై ప్రతీకారం తీర్చుకుంటుంది మార్వెల్. కానీ కొన్ని కారణాల వల్ల క్రీ శక్తుల నుంచి విశ్వాన్ని కాపాడే బాధ్యతను తనపై వేసుకుంటుంది. ఇందులో కెప్టన్ మార్వెల్కి వెలుతురును స్వాధీనం చేసుకునే శక్తి ఉంటుంది. దాన్ని స్వయంగా చూసే శక్తి మోనికా రాంబోకి ఉంటుంది. వెలుతురునే ఒక వస్తువుగా మార్చే శక్తి మిస్ మార్వెల్కి ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ముగ్గురు తమ పవర్స్ ఉపయోగించిన ప్రతిసారి ఒకరి స్థానంలో మరొకరు ఉంటారు.ఈ ముగ్గురు కలిసి ‘ది మార్వెల్స్’గా మారడం.. ఆపై విశ్వాన్ని నాశనం చేస్తున్న ప్రొటెక్టర్ డార్విన్ (జావే ఆష్టన్)పై ఎలాంటి యుద్ధం చేస్తారనేది ఈ కథ. ఎలా ఉందంటేమార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సినిమా వస్తుందంటే చాలా అంచనాలు ఉంటాయి. అందుకోసం రూ. 2250 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ముగ్గురు లేడి సూపర్ హీరోల భారీ యాక్షన్ సీన్స్ మెప్పించినప్పటికీ కథలో కాస్త ఆసక్తిని తగ్గిస్తుంది. ఇప్పటికే ఇలాంటి కథలు రావడంతో అంతగా ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. 2022లో వచ్చిన మిసెస్ మార్వెల్ క్లైమాక్స్ సీన్‌తో ది మార్వెల్స్ స్టార్ట్ అవుతుంది. డార్బెన్ను పవర్ ఫుల్ విలన్‌గా మొదట్లో చూపించిన దర్శకులు.. క్లైమాక్స్ వచ్చేసరికి అంతలా మెప్పించలేకపోయారు. ఎడ్లాండా అనే కొత్త గ్రహాన్ని ది మార్వెల్స్లో చూపించారు. అది బాగానే ఉన్నప్పటికీ వార సంస్కృతిని చూపించిన విధానం అంతగా మెప్పించదు. ఇందులో ప్రదానంగా కెప్టెన్ మార్వెల్ ఫ్యాన్‌గా ఇమాన్ వెల్లని తన నటనతో దుమ్మురేపింది. సినిమా స్థాయికి తగ్గట్టుగానే గ్రాఫిక్స్, విజువల్స్ ఆకట్టుకుంటాయి. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లు హైలెట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి మరో సీక్వెల్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు. మార్వెల్స్ చిత్రాలను ఇష్టపడే వారందరినీ 'ది మార్వెల్స్' తప్పకుండా మెప్పిస్తుంది. హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
ఫొటోలు
క్రీడలు
Virat Kohli: నన్నే ఏడిపిస్తావా?.. ప్రతీకారం తీర్చుకున్న కోహ్లి!
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.ఇదిలా ఉంటే.. ఆర్సీబీ- ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి, ఢిల్లీ సీనియర్ పేసర్ ఇషాంత్‌ల ‘బ్రొమాన్స్’ హైలైట్‌గా నిలిచింది.కాగా చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. ఇక ఓపెనర్ విరాట్ కోహ్లి 13 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేశాడు.అయితే, ఆర్సీబీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో మొదటి బంతికి ఫోర్ బాదిన కోహ్లి.. ఇషాంత్‌ను టీజ్ చేశాడు. తదుపరి బంతికి స్లిప్‌లో ఫీల్డర్‌ను పెట్టు అంటూ ఆటపట్టించాడు. అంతేకాదు.. మరుసటి బాల్‌ను సిక్సర్‌గా మలిచాడు.దీంతో ఉడుక్కున్నా కామ్‌గా కనిపించిన ఇషాంత్.. నాలుగో బంతికి కోహ్లిని ఊరించగా.. అతడు బంతిని గాల్లోకి లేపాడు. అభిషేక్ పోరెల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోహ్లి ఇచ్చిన క్యాచ్ పట్టడంతో అతడు పెవిలియన్ చేరక తప్పలేదు.ఈ క్రమంలో తానే గెలిచానన్నట్లుగా ఇషాంత్ కోహ్లిని నవ్వుతూ కోహ్లి దగ్గరు వచ్చి.. ‘‘వెళ్లు వెళ్లు ’’ అన్నట్లుగా సైగ చేశాడు. ఇందుకు బదులుగా కోహ్లి కూడా నవ్వుతూ సరేలే అన్నట్లు మైదానాన్ని వీడాడు.వీళ్లిద్దరి ఫ్రెండ్లీ బ్యాంటర్కు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ‘‘పశ్చిమ ఢిల్లీ అబ్బాయిలు ఇదిగో ఇలా ఉంటారు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది.అయితే, పదకొండో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాంత్ శర్మ నాలుగు బంతులు ఎదుర్కొని సున్నా పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లి ఇషాంత్ శర్మ దగ్గరికి వెళ్లి ‘సర్లే పదా ఇంకా’ అంటూ టీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా కోహ్లి- ఇషాంత్ దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ప్రాతినిథ్య వహించారు. ఇక టీమిండియాలో కోహ్లి కెప్టెన్సీలో ఇషాంత్ ఆడిన విషయం తెలిసిందే.Kohli man I love him 🤣❤pic.twitter.com/65HxtsIwta— POTT⁷⁶⁵ (@KlolZone) May 12, 2024Wrapped up in style ⚡️High fives 🙌 all around as #RCB make it FIVE 🖐️ in a row 🔥A comfortable 4️⃣7️⃣-run win at home 🥳Scorecard ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/qhCm0AwUIE— IndianPremierLeague (@IPL) May 12, 2024
IPL 2024 RCB Vs DC: భళా బెంగళూరు...
బెంగళూరు: ‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా ఐదో విజయంతో ఆశలు సజీవం చేసుకుంది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో 47 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆర్సీబీ ఈ టోరీ్నలో ఆరో విజయం నమోదు చేసుకుంది. ముందుగా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), విల్ జాక్స్ (29 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. తర్వాత ఢిల్లీ 20 ఓవర్లలో 140 పరుగులకు కుప్పకూలింది. పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం కారణంగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించిన అక్షర్ పటేల్ (39 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. పటిదార్ ఫటాఫట్... డుప్లెసిస్ (6) విఫలమవగా, కోహ్లి (13 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఎంతో సేపు నిలువలేదు. ఢిల్లీ ఫీల్డర్లు పదేపదే క్యాచ్‌లు నేలపాలు చేయడంతో బతికిపోయిన జాక్స్, పటిదార్ ధాటిగా పరుగులు రాబట్టారు. దీంతో 9.1 ఓవర్లో బెంగళూరు 100 పరుగులకు చేరగా, పటిదార్ 29 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. కానీ స్వల్పవ్యవధిలో అతనితో పాటు జాక్స్ అవుటయ్యాక స్కోరు మందగించింది. గ్రీన్ (24 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మహిపాల్ సిక్స్‌లతో 17 ఓవర్లలో 169/4 స్కోరు చేసిన ఆర్సీబీ తర్వాత ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆఖరి 3 ఓవర్లలో 18 పరుగులే చేసి 5 వికెట్లను కోల్పోయింది. అక్షర్ ఒక్కడే! లక్ష్యఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు చెత్తగా ఆడటంతో ఆరంభం నుంచి ఆలౌట్ దాకా ఏ దశలోనూ గెలిచేలా కని్పంచలేదు. ఫ్రేజర్ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తర్వాత కెపె్టన్ అక్షర్ పటేల్ ఒంటరి పోరాటం చేశాడు. అతనికి షై హోప్ (23 బంతుల్లో 29; 4 ఫోర్లు) కాసేపు అండగా నిలిచాడు. మిగిలిన వారెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) అభిõÙక్ (బి) ఇషాంత్ 27; డుప్లెసిస్ (సి) ఫ్రేజర్ (బి) ముకేశ్ 6; జాక్స్ (సి) అక్షర్ (బి) కుల్దీప్ 41; పటిదార్ (సి) అక్షర్ (బి) రసిఖ్ 52; గ్రీన్ (నాటౌట్) 32; మహిపాల్ (సి) అభిషేక్ (బి) ఖలీల్ 13; దినేశ్ కార్తీక్ (సి) కుల్దీప్ (బి) ఖలీల్ 0; స్వప్నిల్ (సి) కుషాగ్ర (బి) రసిఖ్ 0; కరణ్ శర్మ (రనౌట్) 6; సిరాజ్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–23, 2–36, 3–124, 4–137, 5–174, 6–174, 7–176, 8–185, 9–187. బౌలింగ్: ఇషాంత్ 3–0–31–1, ఖలీల్ 4–0–31–2, ముకేశ్ 3–0–23–1, అక్షర్ 3–0–24–0, కుల్దీప్ 4–0–52–1, రసిఖ్ 3–0–23–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) జాక్స్ (బి) స్వప్నిల్ 1; ఫ్రేజర్ (రనౌట్) 21; అభిõÙక్ (సి) ఫెర్గూసన్ (బి) యశ్ 2; షై హోప్ (సి) కరణ్ (బి) ఫెర్గూసన్ 29; కుశాగ్ర (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 2; అక్షర్ (సి) డుప్లెసిస్ (బి) యశ్ 57; స్టబ్స్ (రనౌట్) 3; రసిఖ్ (సి) జాక్స్ (బి) గ్రీన్ 10; కుల్దీప్ (బి) యశ్ 6; ముకేశ్ (సి) మహిపాల్ (బి) ఫెర్గూసన్ 3; ఇషాంత్ శర్మ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 140. వికెట్ల పతనం: 1–8, 2–24, 3–24, 4–30, 5–86, 6–90, 7–127, 8–128, 9–135, 10–140. బౌలింగ్: స్వప్నిల్ 1–0–9–1, సిరాజ్ 4–0–28–1, యశ్ దయాళ్ 3.1–0–20–3, కరణ్ శర్మ 2–0–19–0, ఫెర్గూసన్ 4–0–23–2, గ్రీన్ 4–0–19–1, జాక్స్ 1–0–16–0.
ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం.. వరుసగా ఐదో గెలుపు
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి గెలుపు జెండా ఎగురవేసింది. 47 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. అయితే, మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆర్సీబీ బౌలర్లు ఆరంభంలోనే చుక్కలు చూపించారు.యశ్ దయాల్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఫెర్గూసన్ రెండు, స్వప్నిల్, సిరాజ్, గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో ఢిల్లీని 140 పరుగులకే ఆలౌట్ చేసిన ఆర్సీబీ విజయం సాధించింది.ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: ఢిల్లీ.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 187/9 (20)👉ఢిల్లీ స్కోరు: 140 (19.1)👉ఫలితం: 47 పరుగుల తేడాతో ఢిల్లీపై ఆర్సీబీ గెలుపురాణించిన విల్ జాక్స్, పాటిదార్.. ఆర్సీబీ స్కోరు ఎంతంటే! ఐపీఎల్- 2024 ప్లే ఆఫ్స్ రేసులో భాగంగా మరో రసవత్తర సమరం జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతోంది.సొంతమైదానంలో టాస్ ఓడిన ఆర్సీబీ.. ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లి(13 బంతుల్లో 27) ధాటిగా ఆరంభించగా.. మరో ఓపెనర్, కెప్టెన్ డుప్లెసిస్(6) మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.ఈ క్రమంలో విల్ జాక్స్(29 బంతుల్లో 41), రజత్ పాటిదార్ (32 బంతుల్లో 52) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు. వీరికి తోడు ఐదో నంబర్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్(24 బంతుల్లో 32 పరుగులు నాటౌట్) కూడా రాణించాడు.అయితే, లోయర్ ఆర్డర్ మహిపాల్ లామ్రోర్(13) ఒక్కడు డబుల్ డిజిట్ స్కోరు చేయగా.. దినేశ్ కార్తిక్, స్వప్నిల్ సింగ్ డకౌట్ అయ్యారు. కరణ్ శర్మ ఆరు పరుగులు చేసి రనౌట్ కాగా.. మహ్మద్ సిరాజ్ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 187 పరుగులు స్కోరు చేసింది.ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రసిఖ్ దార్ సలాం రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.
రాజస్తాన్‌ను చిత్తు చేసిన చెన్నై.. ప్లే ఆఫ్స్ రేసులో మున్ముందుకు
ఐపీఎల్ - 2024 ప్లే ఆఫ్స్ రేసులో చెన్నై సూపర్ కింగ్స్ మరో ముందడుగు వేసింది. రాజస్తాన్ రాయల్స్ ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకువచ్చింది.చెపాక్ వేదికగా రాజస్తాన్‌తో ఆదివారం తలపడిన చెన్నై టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. పేసర్ సిమర్జీత్ సింగ్ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్ (21) వికెట్లు పడగొట్టి శుభారంభం అందించాడు.వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ సంజూ శాంసన్(15)ను కూడా వెనక్కి పంపి రాజస్తాన్ టాపార్డర్‌ను దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రియాన్ పరాగ్(35 బంతుల్లో 47 నాటౌట్) పోరాడగా.. ధ్రువ్ జురెల్(18 బంతుల్లో 28) అతడికి సహకారం అందించాడు. మిగతా వాళ్లు చేతులెత్తేయగా నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.లక్ష్య ఛేదనకు దిగిన చెన్నైకి ఓపెనర్ రచిన్ రవీంద్ర(18 బంతుల్లో 27) మెరుపు ఇన్నింగ్స్‌తో శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆచితూచి ఆడాడు. 41 బంతులు ఎదుర్కొని 42 పరుగులు మాత్రమే చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో డారిల్ మిచెల్(22) ఫర్వాలేదనిపించగా.. మొయిన్ అలీ(10), శివం దూబే(18), రవీంద్ర జడేజా(5) విఫలమయ్యారు. ఏడో స్థానంలో వచ్చిన సమీర్ రజ్వీ ధనాధన్ ఇన్నింగ్స్(8 బంతుల్లో 15)తో చెన్నై సూపర్ కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.సొంతమైదానంలో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన చెన్నై ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు వెళ్లింది. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన సిమర్జీత్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచిన విషయం తెలిసిందే.
బిజినెస్
సూచీల స్థిరీకరణ కొనసాగొచ్చు
ముంబై: ద్రవ్యోల్బణ డేటా, క్యూ4 ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. ప్రపంచ పరిణామాలు, ఎన్నికల సరళిపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు తీరుతెన్నులపైనా దృష్టి సారించవచ్చు. వీటితో పాటు డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘సార్వత్రిక ఎన్నికల అనిశ్చితి దృష్ట్యా దేశీయ ఈక్విటీ మార్కెట్ ప్రస్తుత ట్రెండ్ స్వల్పకాలికానికి పరిమితమైంది. కావున సూచీలు స్థిరీకరణ కొంతకాలం కొనసాగొచ్చు. నిఫ్టీ సాంకేతికంగా 22,300 స్థాయిని చేధించి, కొంతకాలం ఈ స్థాయిని నిలుపుకుంటేనే అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. ప్రస్తుతానికి 21,900 వద్ద తక్షణ మద్దతు కలిగి ఉంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా కన్జూమర్ ద్రవ్యోల్బణ అంచనాలు (సోమవారం), జపాన్ మెషనరీ టూల్ ఆర్డర్ల డేటా, భారత రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు (మంగళవారం), యూరోజోన్ మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాలు (బుధవారం), విడుదల కానున్నాయి. జపాన్ క్యూ1 జీడీపీ, మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, ఈసీబీ ఆర్థిక స్థిరత్వ సమీక్ష, అమెరికా పారిశ్రామికోత్పత్తి, ఎగుమతి, దిగుమతుల డేటా(గురువారం) వెల్లడి కానున్నాయి. చైనా ఏప్రిల్ రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి, నిరుద్యోగ రేటు, యూరోజోన్ ఏప్రిల్ ద్రవ్యోల్బణ శుక్రవారం వెల్లడి కానున్నాయి. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ ఫలితాల సీజన్ ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు వెల్లడైన క్యూ4 ఫలితాలు అంచనాలకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ఈ వారంలో దాదాపు 200 కి పైగా కంపెనీలు తమ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. జొమాటో, ఐనాక్స్ ఇండెక్స్, వరుణ్ బేవరేజెస్, భారతీ ఎయిర్టెల్, పీవీఆర్ ఐనాక్స్, రాడికో ఖైతాన్, ఎడెలీ్వజ్ ఫైనాన్సియల్ సరీ్వసెస్, ఆంధ్రా సిమెంట్, పీఎఫ్సీ, ఆర్వీఎన్ఎల్, టిటాఘర్ వికాస్ నిగమ్ కంపెనీలు ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. పది రోజుల్లో రూ.17వేల కోట్లు వెనక్కి విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెల తొలి 10 రోజుల్లో రూ.17వేల కోట్ల దేశీయ ఈక్విటీలను విక్రయించారు. ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడంతో పాటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. గత ఏప్రిల్‌లో మొత్తం ఉపసంహరణ రూ.8,700 కోట్ల పోలిస్తే ఇది ఎక్కువ. ‘‘ఎన్నికల ఫలితాలతోపాటు గత ఆర్థిక సంవత్సరం కార్పొరేట్ సంస్థల మార్చి త్రైమాసికం ఆర్థిక ఫలితాలపై ఇన్వెస్టర్లు కేంద్రీకరించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందిస్తారు’’ అని ట్రేడ్జిని సీఓఓ త్రివేష్ డీ పేర్కొన్నారు.
గోల్డ్ ఈటీఎఫ్‌లలో అమ్మకాలు..
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లలో గత నెల (ఏప్రిల్) ఇన్వెస్టర్లు నికరంగా రూ. 396 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే, గోల్డ్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) మార్చి నెలాఖరున ఉన్న రూ. 31,224 కోట్ల నుంచి 5 శాతం పెరిగి రూ. 32,789 కోట్లకు చేరింది. రూపాయి మారకంలో చూస్తే పసిడి గత ఏడాది వ్యవధిలో మెరుగైన పనితీరే కనపర్చినప్పటికీ ఈక్విటీలతో పోలిస్తే తక్కువేనని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అనలిస్ట్ మెలి్వన్ శాంటారీటా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈటీఎఫ్‌లలో మదుపరులు కొంత లాభాలు స్వీకరించి ఉంటారని ఆయన పేర్కొన్నారు. దీంతో ధర పెరిగినా ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడులు నికరంగా తరలిపోయి ఉంటాయని వివరించారు. 2023 మార్చి తర్వాత గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం ఇదే ప్రథమం. మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) డేటా ప్రకారం గతేడాది మార్చిలో నికరంగా రూ. 266 కోట్లు తరలిపోయాయి. తాజాగా మార్చిలో రూ. 373 కోట్లు వచ్చాయి. ఇక, గోల్డ్ ఈటీఎఫ్‌ల ఫోలియోల సంఖ్య మార్చిలో 50.61 లక్షలుగా ఉండగా.. ఏప్రిల్‌లో సుమారు 1 లక్ష పెరిగి రూ. 51.94 లక్షలకు చేరింది. 2022లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ. 459 కోట్లు రాగా, 2023లో దానికి అనేక రెట్లు అధికంగా రూ. 2,920 కోట్లు వచ్చాయి. గతేడాది నెలకొన్న పరిస్థితుల కారణంగా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా, ద్రవ్యోల్బణానికి తగిన హెడ్జింగ్ సాధనంగా పసిడికి ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు పెరుగుతుండటం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారడం తదితర అంశాల వల్ల ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపారు.
పెట్టుబడి మొత్తం ఈక్విటీలకేనా?
సంపాదనను సంపదగా మార్చుకోవాలంటే అనుకూలమైన వేదికల్లో ఈక్విటీ ముందుంటుంది. రియల్ ఎస్టేట్ సైతం దీర్ఘకాలంలో మంచి సంపద సృష్టికి మార్గమవుతుంది. కానీ, ఈక్విటీ మాదిరి సులభమైన లిక్విడిటీ సాధనం రియల్ ఎస్టేట్ కాబోదు. మొత్తం పెట్టుబడిని ఒకటి రెండు రోజుల్లోనే వెనక్కి తీసుకోవడానికి స్టాక్ మార్కెట్ వీలు కలి్పస్తుంది. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఈ విభాగం వైపు అడుగులు వేయడానికి గల కారణాల్లో ఇదీ ఒకటి. అయితే, ఒకరి పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ పెట్టుబడులు ఎంత మేర ఉండాలి..? రిటైల్ ఇన్వెస్టర్లలో చాలా మంది దీనికి సూటిగా బదులు ఇవ్వలేరు. ఈక్విటీల జిగేల్ రాబడులు చూసి చాలా మంది తమ పెట్టుబడులు మొత్తాన్ని స్టాక్స్‌లోనే పెట్టేస్తుంటారు. ఇలా చేయడం ఎంత వరకు సబబు? అసలు ఈ విధంగా చేయవచ్చా? ఒకరి పెట్టుబడుల కేటాయింపులు ఎలా ఉండాలి? ఈ విషయాలపై స్పష్టత కోసం కొన్ని కీలక అంశాలను ఒకసారి మననం చేసుకోవాల్సిందే. మీరు ఎలాంటి వారు? బుల్ మార్కెట్లో రిస్క్ తీసుకునేందుకు వెనుకాడకపోవడం.. బేర్ మార్కెట్లో రిస్‌్కకు దూరంగా ఉండడం రిటైల్ ఇన్వెస్టర్లలో కనిపించే సాధారణ లక్షణం. సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ సూత్రానికి ఇది పూర్తి విరుద్ధం. ‘‘ఇతరులు అత్యాశ చూపుతున్నప్పుడు భయపడాలి.. ఇతరులు భయపడుతున్నప్పడు అత్యాశ చూపాలి’’ అన్నది బఫెట్ స్వీయ అనుభవ సారం. మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. పైగా తమ రిస్క్ స్థాయి ఎంతన్నది కూడా పరిశీలించుకోరు. పెట్టుబడిపై భారీ రాబడుల అంచనాలే వారి నిర్ణయాలను నడిపిస్తుంటాయి. దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లో రాణించాలంటే ఇలాంటి ప్రతికూల ధోరణలు అస్సలు పనికిరావు. అత్యవసర నిధి ఉన్నట్టుండి ఉపాధి కోల్పోయి ఏడాది, రెండేళ్ల పాటు ఎలాంటి ఆదాయం రాకపోయినా జీవించగలరా? ప్రతి ఒక్కరూ ఒకసారి ఇలా ప్రశ్నించుకోవాలి. లేదంటే ఏడాది, రెండేళ్ల జీవన అవసరాలు తీర్చే దిశగా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాల్సిందే. దీర్ఘకాలం కోసమేనా?దీర్ఘకాలం అంటే ఎంత? అనే దానిపై ఇన్వెస్టర్లలో భిన్నమైన అంచనాలు ఉండొచ్చు. కొందరు 2–3 ఏళ్లు, కొందరు 5–10 ఏళ్లను దీర్ఘకాలంగా భావిస్తుంటారు. కానీ, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే వారు స్వల్పకాలాన్ని మరిచి.. అవసరమైతే దశాబ్దాల పాటు ఆ పెట్టుబడులు కొనసాగించే మైండ్‌సెట్‌తో ఉండాలి. బేర్ మార్కెట్ తట్టుకున్నారా?కరోనా సమయంలో (2020 మార్చి) స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడం, కొన్ని నెలల వ్యవధిలోనే అంతా కోలుకోవడాన్ని ఇన్వెస్టర్లు చూసి ఉండొచ్చు. కానీ, మార్కెట్లు అన్ని సందర్భాల్లోనూ అంత వేగంగా కోలుకుంటాయని చెప్పలేం. చారిత్రక డేటాను పరిశీలిస్తే బేర్ మార్కెట్ ఆరంభం నుంచి రికవరీకి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. కనుక బేర్ మార్కెట్ ఎంత కాలం పాటు కొనసాగినా, ధైర్యంగా వేచి చూడాలి. సాహసంబేర్ మార్కెట్లో తమ పోర్ట్‌ఫోలియో స్టాక్స్ భారీ నష్టాల పాలవుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుంటారు. నిజానికి ఆ సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టాలే కానీ, ఉన్న పెట్టుబడులను వెనక్కి లాగేసుకోకూడదన్నది మార్కె ట్ పండితుల సూచన. ఇక్కడ చెప్పుకున్నట్టు అత్యవసరనిధి కలిగి, బేర్ మార్కెట్లో అదనంగా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు.. లేదంటే ఉన్న పెట్టుబడులను కొనసాగించే మనో ధైర్యం ఉన్నవారు 100% పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకున్నా నష్టం లేదన్నది నిపుణుల నిర్వచనం. నూరు శాతం కాదు..? ఎన్ని చెప్పుకున్నా.. మధ్యమధ్యలో అనుకోని ఆర్థిక అవసరాలు ఎదురవుతుంటాయి. కనుక సామాన్య మధ్యతరగతి ఇన్వెస్టర్లు నూరు శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకుకోవడం సమంజసం కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఇలాంటి వారు ఒకటి కంటే ఎక్కువ సాధనాల మధ్య పెట్టుబడులు వర్గీకరించుకోవాలి (అస్సెట్ అలోకేషన్). ఏ సాధనంలో ఎంతమేర అన్నది నిర్ణయించుకోవాలంటే.. విడిగా ఒక్కొక్కరి ఆరి్ధక అవసరాలు, లక్ష్యాలు, ఆశించే రాబడులు, రిస్క్ సామర్థ్యం, పెట్టుబడులు కొనసాగించడానికి ఉన్న కాల వ్యవధి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అస్సెట్ అలోకేషన్ అంటే? ఒకరు రూ.100 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ఇందులో ఈక్విటీకి ఎంత, డెట్‌కు ఎంత అన్నది నిర్ణయించుకోవడం. ఈ రెండు సాధనాలే కాదు, బంగారం, రియల్ ఎస్టేట్ తదితర సాధనాలు కూడా ఉన్నాయి. కానీ, ఎవరికైనా ఈ నాలుగు సాధనాలు సరిపోతాయి. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తుంటే ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. డెట్‌లో రిస్క్ డెట్‌లో రిస్క్ లేదా? అంటే లేదని చెప్పలేం. ఇందులో వడ్డీ రేట్లు, క్రెడిట్ రిస్క్ ఉంటాయి. అందుకే ఏఏఏ రేటెడ్ సాధనాల ద్వారా క్రెడిట్ రిస్‌్కను దాదాపు తగ్గించుకోవచ్చు. డెట్‌కు సింహ భాగం, కొంత శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ‘ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్’ను సైతం అరుణ్ కుమార్ సూచించారు.బేర్ మార్కెట్ తట్టుకున్నారా?కరోనా సమయంలో (2020 మార్చి) స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడం, కొన్ని నెలల వ్యవధిలోనే అంతా కోలుకోవడాన్ని ఇన్వెస్టర్లు చూసి ఉండొచ్చు. కానీ, మార్కెట్లు అన్ని సందర్భాల్లోనూ అంత వేగంగా కోలుకుంటాయని చెప్పలేం. చారిత్రక డేటాను పరిశీలిస్తే బేర్ మార్కెట్ ఆరంభం నుంచి రికవరీకి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుంది. కనుక బేర్ మార్కెట్ ఎంత కాలం పాటు కొనసాగినా, ధైర్యంగా వేచి చూడాలి. సాహసంబేర్ మార్కెట్లో తమ పోర్ట్‌ఫోలియో స్టాక్స్ భారీ నష్టాల పాలవుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడుతుంటారు. నిజానికి ఆ సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టాలే కానీ, ఉన్న పెట్టుబడులను వెనక్కి లాగేసుకోకూడదన్నది మార్కె ట్ పండితుల సూచన. ఇక్కడ చెప్పుకున్నట్టు అత్యవసరనిధి కలిగి, బేర్ మార్కెట్లో అదనంగా పెట్టుబడులు పెట్టే వెసులుబాటు.. లేదంటే ఉన్న పెట్టుబడులను కొనసాగించే మనో ధైర్యం ఉన్నవారు 100% పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకున్నా నష్టం లేదన్నది నిపుణుల నిర్వచనం. రాబడులు దీర్ఘకాలం పాటు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే కచి్చతంగా రాబడులే వస్తాయా? నిఫ్టీ 50 టీఆర్ఐ (రోలింగ్ రాబడులు) ఐదేళ్ల కాల పనితీరును గమనిస్తే ఒక్కో ఏడాది 47 శాతం పెరగ్గా, ఒక ఏడాది మైనస్ 1 శాతం క్షీణించింది. 2007 నుంచి 2023 మధ్య ఒక ఏడాది 52 శాతం, మరొక ఏడాది 25 శాతం వరకు నిఫ్టీ సూచీ నష్టపోయింది. కానీ, 55 శాతం, 76 శాతం రాబడులు ఇచి్చన సంవత్సరాలూ ఉన్నాయి.ఏ సాధనానికి ఎంత? సాధారణంగా ఈక్విటీలకు ఎక్కువ కేటాయించుకోవడం వల్ల దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు అవకాశాలు ఉంటాయని చెప్పుకున్నాం. కనుక 20–30 ఏళ్ల వయసు వారు ఈక్విటీలకు 70–80 శాతం వరకు కేటాయించుకున్నా పెద్ద రిస్క్ ఉండబోదు. ఎందుకంటే వారు తమ పెట్టుబడులను దీర్ఘకాలంపాటు అంటే 20 ఏళ్ల పాటు కొనసాగించే వెసులుబాటుతో ఉంటారు. అదే 30–40 ఏళ్ల వయసు వారు ఈక్విటీలకు 50–70 శాతం మధ్య కేటాయించుకోవచ్చు. అంతకుపైన వయసున్న వారు 50 శాతం మించకుండా ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించుకోవచ్చని నిపుణులు సూచిస్తుంటారు. 70 శాతం ఈక్విటీ కేటాయింపులు చేసుకునే వారు 20 శాతం డెట్‌కు, 10 శాతం బంగారంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. 50 శాతం ఈక్విటీలకు కేటాయించే వారు 30–40 శాతం డేట్‌కు, బంగారానికి 10 శాతం వరకు కేటాయించొచ్చు. ఈ గణాంకాలన్నీ సాధారణీకరించి చెప్పినవి. విడిగా చూస్తే, 30 ఏళ్ల వయసున్న వ్యక్తికి 5 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని అనుకుందాం. అటువంటప్పుడు పిల్లల ఉన్నత విద్యకు 10–15 ఏళ్ల కాలంలో నిరీ్ణత మొత్తం కావాల్సి వస్తుంది. అటువంటప్పుడు పెట్టుబడులకు 10–15 ఏళ్ల కాలం మిగిలి ఉంటుంది. కనుక ఈక్విటీలకు 70 శాతం వరకు, మిగిలినది డెట్, గోల్డ్‌కు కేటాయింపులు చేసుకోవచ్చు. పిల్లల వివాహం కోసం అయితే 20 ఏళ్లు, రిటైర్మెంట్ కోసం అయితే 30 ఏళ్ల కాలం ఉంటుంది. వీటి కోసం కూడా ఈక్విటీలకు గణనీయమైన కేటాయింపులు చేసుకోవచ్చు. ఒకవేళ ఐదేళ్లలోపు లక్ష్యాలు అయితే 80 శాతం డెట్‌కు, 20 శాతం ఈక్విటీలకు (ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్) కేటాయించుకోవచ్చు. మూడేళ్ల లక్ష్యాల కోసం అయితే పూర్తిగా డెట్‌కే పరిమితం కావడం శ్రేయస్కరం.3టీ కార్యాచరణ అస్సెట్ అలోకేషన్ విషయంలో మూడు ‘టీ’ల కార్యాచరణను ఫండ్స్ ఇండియా రీసెర్చ్ హెడ్ అరుణ్ కుమార్ తెలియజేశారు. మొదటిది కాలం (టైమ్). ‘‘చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలంలో డెట్ (ఫిక్స్డ్ ఇన్కమ్)తో పోలి్చనప్పుడు ఈక్విటీలే మెరుగైన పనితీరు చూపించాయి. కానీ స్వల్పకాలంలో 10–20 శాతం వరకు పతనాలు కనిపిస్తుంటాయి. అలాగే ఏడు–పదేళ్లకోసారి 30–60 శాతం వరకు పతనాలు కూడా సంభవిస్తుంటాయి. గత 40 ఏళ్ల చరిత్ర చూస్తే ఇదే తెలుస్తుంది. కానీ, ఈ 10–20 శాతం దిద్దుబాట్లు 30–60 శాతం పతనాలుగా ఎప్పుడు మారతాయన్నది ఎవరూ అంచనా వేయలేరు. ఇలాంటి పతనాలను ఎక్కువ మంది తట్టుకోలేరు. అందుకే పోర్ట్‌ఫోలియోలో డెట్‌ను చేర్చుకోవాలి. ఇది నిలకడైనది. దీర్ఘకాలంలో రాబడి 5–7 శాతం మధ్యే ఉంటుంది. కనుక ఈక్విటీలకు ఎంత కేటాయించాలన్న విషయంలో కాలాన్ని చూడాలి. ఎంత ఎక్కువ కాలం ఉంటే, ఈక్విటీలకు ఎక్కువ పెట్టుబడులు కేటాయించుకోవచ్చు. రెండోది టోలరెన్స్(టీ). అంటే నష్టాలను భరించే సామర్థ్యం. స్వల్పకాలంలో 10–20 శాతం పతనాలను తట్టుకునే సామర్థ్యం లేని వారు డెట్ కేటాయింపులు మరికాస్త పెంచుకోవచ్చు. ఈక్విటీలకు 50 శాతమే కేటాయించుకుంటే తరచూ వచ్చే పతనాల ప్రభావం తమ పోర్ట్‌ఫోలియోపై 10 శాతం, ఏడు–పదేళ్లకోసారి వచ్చే భారీ పతన ప్రభావాన్ని 25 శాతానికి తగ్గించుకోవచ్చు. మూడోది. ట్రేడాఫ్ (టీ). పెట్టుబడికి దీర్ఘకాలం ఉన్నప్పటికీ నష్టాల భయంతో రాబడుల్లో రాజీపడడం. ఏటా 12 శాతం రాబడి (ఈక్విటీల్లో దీర్ఘకాలం సగటు వార్షిక రాబడి) సంపాదిస్తే 20 ఏళ్లలో పెట్టుబడి 10 రెట్లు అవుతుంది. రాబడి ఏటా 10 శాతమే ఉంటే 20 ఏళ్లలో పెట్టుబడి ఏడు రెట్లే పెరుగుతుంది. 8 శాతం వార్షిక రాబడే వస్తే 20 ఏళ్లలో పెట్టుబడి ఐదు రేట్లే వృద్ధి చెందుతుంది. డెట్‌కు కేటాయింపులు పెంచుకున్నకొద్దీ అంతిమంగా నికర రాబడులు తగ్గుతుంటాయి’’ అని అరుణ్ కుమార్ వివరించారు. నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వారు 70–80 శాతం లార్జ్‌క్యాప్‌నకు, మిడ్‌క్యాప్ స్టాక్స్‌కు 10–15 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు 5–10 శాతం మధ్య కేటాయించుకోవచ్చని సూచించారు. ఫండ్స్ ద్వారా అయినా సరే ఇంతే మేర ఆయా విభాగాల ఫండ్స్‌కు కేటాయింపులు చేసుకోవచ్చు.
బెంగళూరులో నయా స్కాం.. ఫేక్ స్క్రాచ్ కార్డ్‌తో రూ.18 లక్షలు దోపిడీ
డిజిటలైజేషన్ అనేక మార్పులు తీసుకొచ్చింది. మనిషి జీవితాన్ని సులభతరం చేసింది. కానీ దానికి పెరుగుతున్న ఆదరణతో పాటు, నేరాలు, మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. సామాన్యులను దోపిడీ చేసేందుకు స్కామర్లు కొత్త ట్రిక్స్‌ను ఉపయోగిస్తున్నారు.బెంగళూరులో కొత్త స్కామ్ బయటపడింది. డెక్కన్ హెరాల్డ్ కథనం ప్రకారం.. అన్నపూర్ణేశ్వరి నగర్‌కు చెందిన 45 ఏళ్ల మహిళ ఈ మోసానికి గురై రూ. 18 లక్షలు పోగొట్టుకుంది. ఈ స్కామ్‌లో మోసగాళ్లు ప్రసిద్ధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల పేరుతో స్క్రాచ్ కార్డ్‌లను పంపుతారు. ఈ మహిళకు కూడా ఈ-కామర్స్ వెబ్సైట్ మీషో నుంచి పంపుతున్నట్లుగా స్క్రాచ్ కార్డ్ పంపారు.ఆమె కార్డును స్క్రాచ్ చేయగా, ఆమె 15.51 లక్షల రూపాయలను గెలుచుకున్నట్లు వచ్చింది. ఆమె బహుమతిని క్లెయిమ్ చేయడానికి అందించిన నంబర్‌ను వెంటనే సంప్రదించింది. అవతలి వైపు వ్యక్తి స్క్రాచ్ కార్డ్ ఫోటోలు, గుర్తింపు రుజువును కోరారు. వారు చెప్పినట్లే ఆమె వివరాలను అందించింది. ఆ తర్వాత కర్ణాటకలో లాటరీ టిక్కెట్ల అక్రమం కారణంగా 30 శాతం పన్నులు ముందుగా చెల్లించాలని కేటుగాళ్లు ఆమెను నమ్మించారు. దీంతో బాధితురాలు ఫిబ్రవరి, మే మధ్య అనేకసార్లు మొత్తం రూ. 18 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేసింది. అయితే ఆ తర్వాత ఆమెకు తదుపరి సమాచారం అందకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించి, పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం, ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వీడియోలు
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ప్రతి ఓటరు మీ హక్కును వినియోగించుకోండి: మురుగుడు లావణ్య
ప్రజలు ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా మంచి వైపే నిలబడతారు
ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న ఓటింగ్
ఓటు హక్కు వినియోగించుకున్న రోజా,కుమార్తె అన్షు
ఓటు లేని భార్యతో పోలింగ్ కేంద్రంలో కి పవన్ కళ్యాణ్
ఓటు హక్కు వినియోగించుకున్న అసదుద్దీన్ ఒవైసీ
నిబంధనలు ఉల్లంఘించిన బాలకృష్ణ పార్టీ కండువా తో పోలింగ్ స్టేషన్ కు..!
ఓటు హక్కు వినియోగించుకున్న బియ్యపు మధుసూదన్ రెడ్డి
ఓటు హక్కు వినియోగించుకున్న అంబటి దంపతులు..
ఫ్యామిలీ
ఆ దేవుడు పిలుస్తున్నాడు..నటి పవిత్ర ఆఖరి ఇన్‌స్టా పోస్ట్, వీడియో వైరల్
కన్నడ బుల్లితెర నటి పవిత్రా జయరామ్ అకాల మరణం పరిశ్రమ వర్గాలను, తోటి నటీనటులను సహోద్యోగులు,అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. త్రినయని తిలోత్తమ పాత్రతో తెలుగు వారికి దగ్గరైన పవిత్ర మరణంపై పలువురు సంతాపం ప్రకటించారు. అయితే చనిపోయిందన్న వార్త వెలుగులోకి రావడానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో జవిత్ర జయరామ్ చందర్ చివరి ఇన్‌స్టా పోస్ట్ ఒకటి వైరల్ మారింది. నటుడు, భర్త చందూతో కలిసి చేసిన రీల్ నెట్టింట్ చక్కర్లు కొడుతోంది.త్రినయని సీరియల్లో సోదరుడిగా నటించిన భర్త చల్లా చందుని ట్యాగ్‌ని చేస్తూ ఆమె చివరి ఇన్‌స్టా పోస్ట్ ఇది. "నా ప్రేమ ఎప్పుడూ నీదే పాపా @chandrakanth_artist మిస్ యూ పాపా ఎందుకు అంత ఏడుస్తున్నావు నన్ను నీతోనే వున్నారా పిచ్చోడా లవ్ యు మామా" అని క్యాప్షన్ ఉన్న పోస్ట్ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Pavithra Jayaram (@pavithrajayaram_chandar) అలాగే ‘‘ఆల్వేస్ మై లవ్ ఫర్ యూ మామా, లవ్ యూ సో మచ్.. చాలా సమయం నీతో గడపాలని అనుకున్నా.. కానీ, ఆ దేవుడు పిలుస్తున్నాడు.. నాన్నా, నువ్వ టైమ్‌కి తిను’’ అంటూ మరో పోస్ట్ ఉంది. దీంతో ఫ్యాన్స్ కమెంట్స్ వెల్లువెత్తాయి. ఆమె చనిపోయిన తరువాత పోస్ట్‌లు ఎలా పెడుతున్నారు అని కొంతమంది సందేహం వ్యక్తం చేయగా, ఆమె భర్త చందూనే పోస్ట్ చేస్తున్నాడు మరికొంతమంది కమెంట్ చేయడం గమనార్హం. మదర్స్ డే రోజు విషాదం ఆర్ఐపీ పవిత్ర అంటూ చాలామంది నెటిజన్లు స్పందించారు. కన్నడిగులు మిమ్మల్ని గుర్తుంచుకుంటూ ఉంటారు.. ఓం శాంతి పవిత్ర మామ్ అంటూ కన్నడ ఫ్యాన్స్ సంతాపం ప్రకటించారు. త్రినయని సీరియల్లో పవిత్ర ఆన్-స్క్రీన్ సోదరుడు పరశురామ్‌గా చంద్రకాంత్ నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Pavithra Jayaram (@pavithrajayaram_chandar)పవిత్రా జయరాం మృతిపై నటుడు సమీప్ ఆచార్య సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా తన విచారాన్ని వ్యక్తం చేశారు. “మీరు ఇక లేరనే వార్తతో మేల్కొన్నాను. ఇది నమ్మశక్యంగా లేదు. నా తొలి ఆన్‌స్క్రీన్ తల్లి, మీరు ఎప్పుడూ ప్రత్యేకమే.” అంటూ పోస్ట్ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని మెహబూబా నగర్ సమీపంలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో చంద్రకాంత్‌తో అపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్ తదితరులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మరో బ్యూటీ!..
గతేడాది 2023లో మిస్ యూఎస్ఏ విజేతగా ఎంపికైన నోలియా వోయిగ్ట్ సడెన్‌గా తన స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అది మరువకు మునుపే మరో బ్యూటీ తన కిరీటాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్‌కి గురి చేసింది. అందాల తారలు వరుస ప్రకటనలు అమెరికా అందాల పోటీల నిర్వాహకులను తీవ్ర గందరగోళంలో పడేశాయి. నోలియా రాజీనామా చేసిన రెండు రోజులకే 17 ఏళ్ల మిస్ టీన్ యూఎస్ఏ ఉమా సోఫియా తాను కూడా తన స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మెక్సికన్ ఇండియన్ అమెరికన్ అయిన ఉమా సోఫియా నా విలువలు సంస్థ తీరుతో పూర్తిగా సరిపోవడం లేదని అందువల్ల తాను తన స్థానం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాను ఈ అత్యున్నత టైటిల్‌ని గెలుకోవడంలో సహకరించిన తన కుటుంబం, తన రాష్ట్ర ప్రజలు, తన సహ మోడళ్లకు ఎంతగానో రుణపడి ఉన్నాను.వారందిరి ఆదరాభిమానానికి కృతజ్ఞతలు అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. జాతీయ స్థాయిలో తొలి మెక్సికన్ ఇండియన్ అమెరికన్‌గా తన రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించినందుకు గర్వంగా ఉందని పేర్కొంది. ఆమెకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు..ఉమా సోఫియా శ్రీవాస్తవ అమెరికా తొలి మెక్సికన్ ఇండియన్ అమెరికన్ మిస్ న్యూజెర్సీ టీన్. యూఎన్ అంబాసిడర్ కావలన్నది ఆమె కల. ఆమె భారతదేశంలోని అనగారిన పిల్లలకు చక్కటి విద్య, సరైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణను అందించడంలో సహాయపడటానికి లోటస్ పెటల్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తుంది. ఉమాసోఫియా తన దివైట్ జాగ్వర్ పుస్తకాన్ని రచించారు. ఆమె మొత్తం నాలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె ఒక పియానిస్ట్ దట్స్ ఫ్యాన్ బిహేవియర్‌ని నడుపుతోంది. ప్రస్తుతం ఆమె జూనియర్ కళాశాల విద్యను అభ్యసిస్తోంది.(చదవండి: తెల్లటి చీరలో మెరిసిపోతున్న మిల్కీబ్యూటీ..ధర వింటే నోరెళ్లబెడతారు!)
తెల్లటి చీరలో మెరిసిపోతున్న మిల్కీబ్యూటీ..ధర వింటే నోరెళ్లబెడతారు!
టాలీవుడ్ నటి తమన్నా ఎప్పటికప్పుడూ డిఫెరెంట్ లుక్‌తో ఉన్న ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ తన అభిమానుల ఆశ్చర్యపరుస్తుంటుంది. ఒకపక్క బాలీవుడ్ వెబ్ సీరిస్తో బిజీగా ఉన్నా కూడా ఎప్పటికప్పుడూ డిఫరెంట్ స్టయిల్ డిజైనర్ డ్రెస్‌లు ధరిస్తూ..తన క్యూట్ లుక్‌తో ఉన్న పోటోలను అభిమానులతో పంచుకుంటుంది. అలానే ఈ మిల్కీ బ్యూటీ తాజగా ఓ తెల్లటి చీరలో పాలరాతి శిల్పంలో మెరిపోతున్న ఫోటోలను షేర్ చేసింది. చూడటానికి దివి నుంచి భువికి వచ్చిన దేవతా మాదిరిగా అందంగా ఉంది. నిజానికి ఈ ఫోటో 2022 నాటిది. ఈ చీర సావన్ గాంధీ బ్రాండ్‌కి చెందిన సునేహ్రీ ఐవరీ పిట్టా కలెక్షన్స్‌కి సంబంధించిన డిజైనర్ శారీ. ఈ శారీ ప్రత్యేకత ఏంటంటే..శారీ బోర్డర్ అంతటా గోల్డ్ గొట్టా పట్టీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. నెక్‌లైన్‌ని కలిగి ఉన్న మ్యాచింగ్ గోల్డ్ బ్లౌజ్ ఆ చీరకు చక్కగా మ్యాచ్ అయ్యింది. దీనికి తగ్గట్టు గ్లిట్జీ పెర్ల్ చెవిపోగులు, కుందన బ్యాంగిల్స్ చాలా బాగా మ్యాచ్ అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే జుట్టుని చక్కగా ముడివేయడం మంచి అందాన్ని తెచ్చిపెట్టింది. ఈ చీర ఆర్గాన్జా సిల్క్ ఫ్రాబ్రిక్ కావడంతో శరీరంపై చక్కగా జాలువారుతున్నట్టు ఉంటుంది. అయితే ఈ చీర ధర ఏకంగా రూ. 1,28,000/-. ఈ బ్రాండ్ చీరలు డిజైన్వేర్కి తగ్గ రేంజ్లో కాస్టలీగా ఉంటాయి. ఇక తమన్నా ఇటీవలే తమిళ అరణ్మనై 4 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం పచ్చని చీరలో తళుక్కుమంది. ఆ చీర పల్లు చుట్టూ కూడా ఇలానే బంగారు బోర్డర్ ఉంది. ఆ ఈవెంట్లో తమన్నా ఈ చీరలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించింది. (చదవండి: హాట్‌టాపిక్‌గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!)
'ఆమె ధర్మపత్ని'! గృహస్థాశ్రమ వైశిష్ట్యం!!
అహం ఎప్పుడూ కూడా మనిషిని పాషాణం అయ్యేట్టు చేస్తుంది. కామం తీరలేదనుకోండి. శత్రుభావం పెంచుకుని అవతలి వాళ్ళమీద కఠినంగా వ్యవహరించేటట్లు చేస్తుంది. అయితే ప్రేమ మాత్రం కరిగిపోయే లక్షణాన్ని పొంది ఉంటుంది. అవతలివాళ్ళల్లో ఎన్ని లోపాలున్నా వారి నాశనాన్ని ప్రేమ కోరుకోదు. వారు బాగుపడాలి, సంస్కరింపబడాలి, జీవితంలో వృద్ధిలోకి రావాలి... అని కోరుకుంటుంది తప్ప వారిపట్ల ద్వేషం పెంచుకోదు. అందుకే ప్రేమ అవసరం. దానికి పూర్వ పరిచయం లేదు, భవిష్యత్తు మాత్రం ఉంది. దానికి పునాది ప్రేమలోనే ఉంది తప్ప కామంలో లేదు. అందుకే ఆమె ‘ధర్మపత్ని’ తప్ప కామపత్ని కాదు. ఇంత పెద్దప్రాతిపదికచేసి గృహస్థాశ్రమ ప్రవేశం చేయిస్తారు. కాబట్టి వివాహం నిర్ణయించేటప్పుడు పెద్దలు ముందుగా శీలం, వయసు, వృత్తి పరిశీలిస్తారు... తరువాత అభిజనం... అంటే రెండు పక్కల వంశాలు ఎంత గొప్పవి! ఆ వంశాలలో పూర్వీకులు ఎంత గొప్పగా ప్రవర్తించారో అన్న జిజ్ఞాసతో ఆ వంశానికి కీర్తిప్రతిష్ఠలు జోడించేలా ప్రవర్తించాలి. అందువల్ల వాటిని కూడా పెద్దలు పరిశీలిస్తారు.రామాయణంలో... రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేయగానే జనకమహారాజు వచ్చి సీతను అప్పగించాడు, రాముడు వెంట తీసుకెళ్ళాడు... అని చాలామంది అనుకుంటూంటారు. కానీ అది సరికాదు. బాలకాండను అయోధ్యకాండతో కలిపి చదివితే... ఆశ్చర్యపోతాం.. వారి సంస్కారం చూసి... శివధనుర్భంగం కాగానే జనకమహారాజు జలకలశంతో గబగబా వచ్చి..‘‘మొదట ఇచ్చిన మాట ప్రకారం శివధనుర్భంగం చేసినవారికి నా కూతురును ఇస్తానని చె΄్పాను... ఆ పని నీవు విజయవంతంగా చేశావు కాబట్టి ఇదుగో నా కుమార్తె..స్వీకరించు’’... అన్నాడు.దానికి రాముడు.... ‘‘ఒక పిల్ల నాకు భార్య కావాలంటే చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి మా తండ్రిగారు చూడాలి. మా పురోహితులు, పెద్దలు, బంధువులను సంప్రదించి ఆయన నిర్ణయిస్తారు. దానికి నేను కట్టుబడతాను. అందువల్ల మా తండ్రిగారికి కబురు పంపండి’ అన్నాడు. కబురందుకుని దశరథ మహారాజు వచ్చారు.‘నేను స్వయంవరం ఏర్పాటు చేస్తే భూమండలంలోని రాజులందరూ వచ్చిపోటీపడ్డారు. కానీ మీ రాముడు మాత్రమే శివధనుర్భంగం చేయగలిగాడు. ముందు చెప్పిన షరతు ప్రకారం నా కుమార్తెని ఇస్తున్నా. మీ కోడలిగా స్వీకరించండి’ అని జనకుడు కోరాడు. దశరథుడు వెంటనే ఎగిరి గంతేసి అంగీకరించలేదు. ఆయన అన్నాడు కదా... ‘ఈమె నా ఇంటి కోడలిగా రావడానికి ముందు మన రెండు వంశాలు సరిపోతాయా.. దానికి అర్హతలు మనకున్నాయా..’’ అంటూ మరో గొప్పమాటంటాడు..‘‘రాముడు గొప్పవాడు ... పిల్లనివ్వడం మా అదృష్టం’’ అంటూ వంగి మాట్లాడకండి, జనక మహారాజా! మీరు పిల్లనిస్తేనే కదా మా వంశం నిలబడేది. అప్పుడే కదా రుణవిమోచనం. ఇచ్చేవారు మీరు, పుచ్చుకునేవాడిని నేను. ఇప్పుడు వినయంగా ఉండాల్సింది నేను మహారాజా !’’ అన్నాడు. ఆ తరువాత దశరథ మహారాజు కోరికపై వశిష్ఠుడు, జనకుడి కోరికపై వారి పురోహితుడు వారి వారి వంశాలను వివరించారు. అలా ఒకరి నుంచి మరొకరు క్షుణ్ణంగా తెలుసుకుని నిర్ణయించిన వివాహాలు కాలంలో ఆదర్శంగా నిలిచిపోయాయి. అందుకే గృహస్థాశ్రమానికి రామాయణం ఆదర్శం – అని కంచి మహాస్వామి అంటూండేవారు. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం పట్ల ఎన్నికల సంఘం సీరియస్.. తక్షణం దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని సీఐడీకి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడి అరెస్ట్
వాషింగ్టన్/ఒట్టావా: ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు తాజాగా మరో భారతీయుడిని అరెస్ట్‌చేశారు. బ్రాంప్టన్ సిటీలో నివసించే 22 ఏళ్ల అమన్‌దీప్ సింగ్‌ను హత్య, హత్యకు కుట్ర నేరాల కింద అరెస్ట్‌చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఉదంతంలో గత వారమే ముగ్గురు భారతీయులను అక్కడి పోలీసులు అరెస్ట్‌చేశారు. అమన్దీప్ను ఒంటారియాలో మే 11న అరెస్ట్‌చేసినట్లు రాయల్ కెనడియన్ పోలీసులు ఆదివారం ప్రకటించారు. బ్రిటిష్ కొలంబియాలో 2023 జూన్ 18వ తేదీన గురునానక్ గురుద్వారా వద్ద 45 ఏళ్ల నిజ్జర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెల్సిందే. నిజ్జర్‌ను చంపిన ఇద్దరు షూటర్లలో అమన్‌దీప్ ఒకడని గ్లోబల్ న్యూస్ ఒక కథనం వెలువర్చింది.
మాట్లాడాలని పిలిపించి స్నేహితుడి హత్య
దొడ్డబళ్లాపురం: బార్లో ఉన్న స్నేహితుడిని మాట్లాడాలని తీసికెళ్లి మరో మిత్రుడు తన సహచరులతో కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దొడ్డ తాలూకా హుస్కూరు గ్రామం నివాసి శశికుమార్ కుమారుడు హేమంత్‌గౌడ (27) హత్యకు గురైన యువకుడు. రౌడీషీటర్ నరసింహమూర్తి తన సహచరులతో కలిసి హత్యకు పాల్పడ్డ నిందితుడు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో హేమంత్‌గౌడ తన స్నేహితులతో కలిసి బాశెట్టిహళ్లి వద్ద ఉన్న జేపీ బార్లో పార్టీ చేసుకుంటుండగా నిందితుడు నరసింహమూర్తి ఫోన్ చేసి మాట్లాడాలని బయటకు రమ్మని పిలిచాడు.హేమంత్ బార్లో నుండి బయటకు రాగానే నరసింహమూర్తితో వచ్చిన సుమారు 10 మంది సహచరులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గాయపడ్డ హేమంత్‌ను టెంపోలో వేసుకుని ఊరంతా తిప్పారు. చావుబతుకుల మధ్య పోరాడుతున్న హేమంత్‌ను చూసి పైశాచికానందం పొందారు. హేమంత్పై దాడి జరగగానే పక్కనే ఉన్న స్నేహితులు వెంటనే హేమంత్ తండ్రికి సమాచారం ఇచ్చారు. హేమంత్ తండ్రి, కుటుంబ సభ్యులు బార్ వద్ద వచ్చి చూడగా హేమంత్ జాడ లేదు.హేమంత్ ఊపిరి ఆగిపోయే వరకూ టెంపోలో ఊరంతా తిప్పిన నరసింహమూర్తి చివరకు శవాన్ని బెంగళూరు రోడ్డులో ఉన్న నవోదయ పాఠశాల వద్ద రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. మృతుడు హేమంత్ రియల్ ఎస్టేట్, సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. నిందితుడు నరసింహమూర్తి పేకాట క్లబ్బులు నడుపుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు. దీంతో అతడిపై పోలీసులు రౌడీషిట్ తెరిచారు. అయితే మృతుడు, హతుడు ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య ఎందుకు శత్రుత్వం పెరిగిందనేది తెలీడంలేదు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు అందరూ పరారీలో ఉన్నారు.
హైకోర్టు లాయర్ చైత్రా ఆత్మహత్య
యశవంతపుర: కేఏఎస్ అధికారి భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. సంజయనగర పోలీసుస్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న కేఏఎస్ అధికారి శివకుమార్ భార్య చైత్రా హైకోర్టు వకీలు. శుక్రవారం రాత్రి ఇంటిలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియటంలేదు. మృతురాలి సోదరుడు ఇచ్చి ఫిర్యాదు ఆధారంగా సంజయనగర పోలీసులు కేసునమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.మృతిపై అనుమానాలుచైత్ర భర్త శివకుమార్ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థలో సబ్ డివిజనల్ అధికారిగా ఉన్నారు. చైత్రతో ఆయనకు 2016లో వివాహమైంది, వారికి ఐదేళ్ల కుమార్తె ఉంది. శుక్రవారం రాత్రి ఆయన డ్యూటీ నుంచి ఇంటికి రాగా, భార్య అచేతనంగా పడి ఉంది. దీంతో వెంటనే స్థానిక సంజయనగర పోలీసులకు కాల్ చేశారు. చైత్ర హైకోర్టు లాయరుగా పనిచేస్తూ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందింది. ఆమె షటిల్ బ్యాడ్మింటన్ వంటి ఆటల్లోనూ ప్రావీణ్యురాలు. ఆమె మృతిని నమ్మలేకపోతున్నట్లు బంధుమిత్రులు తెలిపారు. ఎంతో చలాకీగా ఉండేదని, ఆత్మహత్య చేసుకుందంటే నమ్మశక్యంగా లేదని అనుమానాలను వ్యక్తం చేశారు. పోలీసులు కేసు విచారణ చేపట్టారు.
అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి
ఖమ్మం సహకారనగర్: బీటెక్ పూర్తిచేశాక బహుళజాతి కంపెనీలో ఉద్యోగం వచ్చినా కాదను కున్న యువకుడు ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఇటీవలే కోర్సు పూర్తికాగా, కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు తల్లి దండ్రులూ అమెరికా వెళ్లారు. పట్టా స్వీకరించిన సంతోషంలో స్నేహితులతో కలిసి విహారయాత్ర కు వెళ్లిన ఆ యువకుడు అక్కడి జలపాతంలో మునిగి మృతి చెందగా.. కొడుకు మృతదేహంతో స్వస్థలానికి వెళ్లాలని తెలిసిన ఆ తల్లిదండ్రుల రోదనకు అంతు లేకుండా పోయింది. ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంలోని మాంటిస్సోరి పాఠశాలల డైరెక్టర్ లక్కిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఏకైక కుమారుడు రాకేశ్ (24) రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తిచేయగా అమెజా న్లో ఉద్యోగం వచ్చింది. అయినా ఎంఎస్ చదవా లనే లక్ష్యంతో అమెరికా వెళ్లాడు. అక్కడ అరిజోనా యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తిచేసిన ఆయన వారం క్రితం పట్టా స్వీకరించారు. కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు చంద్రశేఖర్‌రెడ్డి దంపతులు అమెరికా వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అయితే, ఎంఎస్ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా అమెరికాలోని ప్రసిద్ధ ఫాసిల్ క్రీక్ జలపాతం వద్దకు రాకేశ్, ఆయన స్నేహితులు ఈనెల 8వ తేదీన వెళ్లారు.జలపాతం వద్ద సరదాగా గడుపుతుండగా రాకేశ్‌తో పాటు మరో యువకుడు ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోయారు. గాలింపు చర్యలు చేపట్టగా మరుసటిరోజు 25 అడుగుల లోతులో మృతదే హాలు లభించాయి. రాకేశ్‌తో పాటు మృతి చెందిన మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.