Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

మధ్యాహ్నం 3 గంటలకు..  శ్రీకాకుళం జిల్లా  ఇచ్ఛాపురంలో జరిగిన సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభకు హాజరైన అశేష జనసందోహంలో  ఓ భాగం
పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్‌ జగన్‌

ఓటు అనే ఆయుధంతో ఢిల్లీ పీఠం కదలాలివీళ్లు ఎన్ని కుట్రలు చేసినా.. దేవుడు అంతా గమనిస్తున్నాడు. మీ బిడ్డకు ప్రజల దీవెనలున్నాయి. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నల చేతుల్లో ఓటు అనే బలమైన ఆయుధం ఉంది. ఆ ఓటు అనే ఆయుధంతో వీళ్లను కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కూడా కదులుతుందని గట్టిగా చెబుతున్నా.విశాఖలోనే ప్రమాణ స్వీకారం..జూన్‌ 4 తర్వాత మీ బిడ్డ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తాడు. అదే రోజు పరిపాలనా రాజధానిగా విశాఖ నుంచే పాలన చేయబోతున్నానని గర్వంగా చెబుతున్నా. మూడు రాజధానుల్లో విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నాం. మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తూ మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా చేసింది మీ బిడ్డ ప్రభుత్వమే.  ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు ఎస్పీలతో పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు పాలన చేరువ చేశాం. శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో ఫిషింగ్‌ హార్బర్లు వస్తున్నాయి. ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ వస్తోంది. రూ.4,400 కోట్లతో మూలపేట పోర్టు పనులు వాయువేగంతో జరుగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను శరవేగంగా చేస్తున్నాం, విశాఖ–భోగాపురం 6 లేన్ల రహదారిని నిర్మిస్తున్నాం. విశాఖలో అదాని డేటా సెంటర్, ఇన్ఫోసిస్‌ మొదలైంది కూడా మీ బిడ్డ పాలనలోనే.– ఇచ్ఛాపురం సభలో సీఎం జగన్‌సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, విశాఖపట్నం: ‘దేవుడి దీవెనలు, మీ ఆశీస్సులున్నంత వరకూ మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కరూ ఆపలేరు. జూన్‌ 4న మనందరి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుంది. మనం నొక్కిన బటన్లు అన్నీ వారం రోజుల్లోనే క్లియర్‌ చేస్తాం. ఢిల్లీతో కలిసి మీ బిడ్డ ప్రభుత్వాన్ని దెబ్బ తీసే కుట్రలు చేస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు సీఎంగా చేశానంటాడు. అన్నేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే పేదలకు ఒక్క స్కీమ్‌ అయినా గుర్తుకొస్తుందా? జగన్‌ అంటే పథకాలు.. చంద్రబాబు అంటే మోసాలు, కుట్రలు, కుతంత్రాలే గుర్తుకొస్తాయి’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలు, కుతంత్రాలకు ఓటు అనే వజ్రాయుధంతో మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. ఇంతలా దిగజారిపోయారు..కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ జగన్‌ నొక్కిన బటన్ల సొమ్ము నా అక్కచెల్లెమ్మలకు అందకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. సాక్షాత్తూ మీ జగన్‌ ఓ ముఖ్యమంత్రిగా కోర్టుకు వెళ్లి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కేసులు వేసే పరిస్థితిలోకి ప్రజాస్వామ్యం దిగజారిపోయిందంటే వీళ్లను ఏమనాలి? మీ జగన్‌ బటన్‌ నొక్కిన పథకాలన్నీ ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా తెచ్చినవి కాదు. గత ఐదేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా ఇస్తున్న పథకాలకే మీ జగన్‌ బటన్‌ నొక్కాడు. ఈ స్కీములు ఇవాళ ఏదో కొత్తగా తెచ్చినవి కాదు. ఇవన్నీ ఆన్‌ గోయింగ్‌ స్కీమ్స్‌. బడ్జెట్‌ కేటాయింపులున్నవే. అసెంబ్లీలో బడ్జెట్‌ ద్వారా ఆమోదం కూడా తెలిపినవే. 58 నెలలుగా ఇస్తున్న పథకాలకు అడ్డుపడుతూ జగన్‌ను కట్టడి చేసేందుకు ఢిల్లీతో కలసి కుట్రలు పన్నుతున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కిన సొమ్మును అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అందకుండా అడ్డు తగిలే దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వీళ్లు దిగజారిపోయారు. గత ఐదేళ్లుగా క్యాలండర్‌లో చెప్పిన విధంగా క్రమం తప్పకుండా ఇస్తూ పోతున్న మీ జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి కుట్రలు పన్నుతున్నారు. చివరిలో అడ్డుపడితే నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా? పెన్షన్‌ సొమ్ము ఇన్నేళ్ల పాటు మీ బిడ్డ ఇంటికే పంపించిన తర్వాత చివరి రెండు నెలలు ఆ డబ్బులు ఇంటికి రాకపోతే ఏం జరిగిందో ఆ అవ్వాతాతలు గ్రహించలేరనుకున్నారా? ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుతున్నా. జూన్‌ 4న అధికారంలోకి వచ్చిన వెంటనే ఓ వారం రోజుల్లోనే ఈ బటన్లు అన్నీ మీ బిడ్డ క్లియర్‌ చేస్తాడు. బాబు ఒక్క బటనూ నొక్కలేదు..మనపై ఇన్ని కుట్రలు చేస్తున్న చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మీ జగన్‌ మాదిరిగా ఎన్నడూ బటన్లు నొక్కలేదు. ఏ రోజూ ఏ ఒక్క అక్కచెల్లెమ్మకూ డబ్బులు, పథకాలు ఇవ్వలేదు. మీ బిడ్డ జగన్‌ ఈ 59 నెలల కాలంలో 130 సార్లు బటన్లు నొక్కి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపాడు. చంద్రబాబు దగ్గర ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఆ దోచేసిన సొమ్ముతో లోబర్చుకునేందుకు ఎన్నికల రోజు రూ.2 వేలు, రూ.3 వేలు, కొన్ని చోట్ల రూ.4 వేలు, రూ.5 వేలు కూడా ఇస్తాడు. చంద్రబాబు ఎన్నికల రోజు ఇచ్చే ఆ డబ్బంతా మనదే. మన దగ్గర దోచేసిన డబ్బే అది. కాబట్టి ఆయన ఇస్తే ఏ ఒక్కరూ వద్దు అనొద్దు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీకు, మీ కుటుంబానికి ఎవరి వల్ల మంచి జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ అభివృద్ధి, పథకాలను కొనసాగిద్దాం..మరో ఆరు రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపటమే. రాష్ట్రంలో గతంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ వచ్చాక ఏకంగా మరో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాడు. మేనిఫెస్టో హామీల్లో 99 శాతం అమలు చేసి చిత్తశుద్ధి చాటుకున్నాం. గడప గడపకూ మేనిఫెస్టోతో వెళ్లి మరోసారి ఆశీర్వదించాలని కోరాం. మన పథకాలు.. మచ్చుకు కొన్ని‘నాడు–నేడు’తో బాగుపడ్డ గవర్నమెంట్‌ బడులు, ఇంగ్లిష్‌ మీడియం, 6వ తరగతి నుంచే క్లాస్‌ రూముల్లో డిజిటల్‌ బోధన, 8వ తరగతికి రాగానే ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబ్‌లు, 3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, పిల్లల చేతుల్లో బైలింగ్యువల్‌ టెక్టŠస్‌ బుక్స్‌ (ద్విభాషా పాఠ్య పుస్తకాలు), బడులు తెరవగానే పిల్లలకు విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి, పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెన, ఖర్చులకు ఇబ్బంది పడకుండా వసతి దీవెన, అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఆన్‌లైన్‌ సర్టిఫైడ్‌ కోర్సులతో భాగస్వామ్యం, తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌... ఇలాంటి విద్యా విప్లవాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? మహిళా సాధికారత.. వినూత్న వ్యవస్థలుఅక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, 22 లక్షల గృహ నిర్మాణాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? అవ్వా­తాతలకు ఇంటికే రూ.3 వేలు పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు, రేషన్, పథకాలు.. ఇలా నేరుగా డోర్‌ డెలివరీ చేసిన ప్రభుత్వాలు గతంలో ఉన్నాయా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత పంటల బీమా, సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, పగటి పూటే 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకేలు, సచివాల­యాలు, వలంటీర్‌ వ్యవస్థలు గతంలో ఉన్నాయా?స్వయం ఉపాధికి అండగా..వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, చిరువ్యాపారులకు తోడు, చేదోడు, లా నేస్తం లాంటి పథకాలతో స్వయం ఉపాధికి అండగా నిలిచిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? రూ.25 లక్షల వరకూ విస్తరించిన ఉచిత ఆరోగ్యశ్రీ, జీవన భృతి అందిస్తూ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజల ఆరోగ్యంపై ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా? ఏ గ్రామానికి వెళ్లినా 600 రకాల సేవలందిస్తున్న సచివాలయం, ఫైబర్‌గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీలు, అక్కచెల్లెమ్మల భద్రత కోసం గ్రామంలోనే మహిళా పోలీసు, దిశా యాప్‌ లాంటివి ఇంతకు ముందెప్పుడైనా చూశారా? నాడూ నేడూ అదే రాష్ట్రం.. అదే బడ్జెట్‌. చంద్రబాబు ఏ రోజూ పేదల కోసం బటన్లు నొక్కలేదు. అప్పుల గ్రోత్‌ రేట్‌ కూడా గతంలో కంటే ఇప్పుడే తక్కువ. ఇది కాదా అభివృద్ధి..?మీ జగన్‌ పేరు చెబితే ఎన్నో పథకాలు గుర్తుకొస్తాయి. బాబు పేరు చెబితే ఏ స్కీమూ గుర్తు రాదు కాబట్టి జగన్‌ హయాంలో అభివృద్ధి లేదంటూ అబద్ధాలు చెబుతున్నాడు. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.32,000 కోట్లు అయితే మీ బిడ్డ జగన్‌ పాలనలో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయంటే అంటే ఇది అభివృద్ధి పాలన కాదా? మూడు ఇండస్ట్రియల్‌ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్‌ నోడ్స్‌ మీ బిడ్డ హయాంలోనే వస్తున్నాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీని వరుసగా ఏటా నంబర్‌ వన్‌గా నిలబెట్టాం. కొత్తగా 4 సీ పోర్టులు నిర్మిస్తున్నాం. 10 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం తీసుకొచ్చాం. 15,000 గ్రామ సచివాలయాలు, 11,000 విలేజ్, వార్డు క్లినిక్‌లు, 11,000 ఆర్బీకేలు నెలకొల్పాం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ డాక్టర్ల కొరత 61% ఉంటే మన రాష్ట్రంలో మాత్రం 3.95% మాత్రమే ఉంది. వైద్య ఆరోగ్యశాఖలో 54 వేల మందికిపైగా సిబ్బందిని నియమించాం. మీ బిడ్డ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు 11 కాగా కొత్తగా మరో 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది మన ప్రభుత్వమే.మన అభ్యర్థులను దీవించండి..నాకు సొంత తమ్ముడు లేడనే బాధ ఉండేది. రాజాను (రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా) చూశాక ఆ బాధ పోయింది. నా తమ్ముడిని గొప్ప మెజార్టీతో గెలిపించాలి. మీరు రాజాకు ఓటేస్తే గణేష్, అమ్మ (జక్కంపూడి విజయలక్ష్మి), రాజా భార్య అంతా కలిసి మీ మంచి కోసం ఇంకా ఎక్కువగా కృషి చేస్తారు. మంచి వైద్యుడిగా పేరున్న శ్రీను అన్న (రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌)ను గొప్ప మెజార్టీతో ఆశీర్వదించండి. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థి విజయమ్మ, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ను దీవించాలని కోరుతున్నా. గాజువాక ఎమ్మెల్యే  అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్, నాకు అక్క లాంటి విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని భారీ మెజార్టీతో గెలిపించండి.మీ కుటుంబంతో చర్చించండి..ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. అది క్లాస్‌ వార్‌. పేదవాడు ఒకవైపు, పెత్తందార్లు మరోవైపున నిలిచి ఈ యుద్ధం జరుగుతోంది. మీరంతా ఓటేసేముందు మీ కుటుంబంతో కలసి కూర్చొని చర్చించండి. చిన్న పిల్లల అభిప్రాయాన్ని కూడా తీసుకోండి. ఏ ప్రభుత్వం వల్ల, ఎవరి వల్ల మీ ఇంటికి, మీ కుటుంబానికి మంచి జరిగిందో ఆలోచించండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందో గమనించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. మంచి చేసే ఫ్యాను ఇంట్లో ఉండాలి. చెడు చేసే సైకిల్‌ ఎక్కడ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్‌ మారాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి చదువులు, వారి బడులు బాగుపడాలన్నా.. మన వ్యవసాయం, హాస్పిటళ్లు మెరుగ్గా ఉండాలన్నా రెండు బటన్లు ఫ్యాన్‌ మీద నొక్కాలి. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించాలి.ఉద్దానం కిడ్నీ కష్టాలకు విముక్తిదశాబ్దాలుగా ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ సమస్యల పరిష్కారం కోసం రూ.780 కోట్లతో హిరమండలం నుంచి తాగునీటిని తరలించింది మీ బిడ్డ ప్రభుత్వమే. రూ.80 కోట్లతో కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ను నిర్మించింది మన ప్రభుత్వమే. ఉత్తరాంధ్రలో కొత్తగా మెడికల్‌ కళాశాలలు కడుతున్నాం. పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇవి ఏర్పాటవుతున్నాయి. సాలూరులో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నది మన ప్రభుత్వమే. కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల కడుతున్నది మన ప్రభుత్వమే. ఐటీడీఏల పరిధిలో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయంటే కారణం మీ బిడ్డే. సెల్‌ఫోన్‌ కనెక్టివిటీ లేని గిరిజన ప్రాంతాల్లో రూ.400 కోట్ల వ్యయంతో టవర్లను ఏర్పాటు చేశాం. 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3,23,000 ఎకరాల పట్టాలిచ్చి వారికి  రైతు భరోసా అందిస్తూ  జీవనోపాధి చూపించింది కూడా మీ బిడ్డే.కోరుకొండ భూముల సమస్య పరిష్కరిస్తా..కోరుకొండ భూముల గురించి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గుర్తుచేశాడు. ఫైల్‌ ప్రాసెస్‌లో ఉన్న సమయంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. మళ్లీ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూముల సమస్యను పరిష్కరిస్తామని సవినయంగా తెలియజేస్తున్నా.తుప్పు సైకిల్‌.. ఢిల్లీ మెకానిక్స్‌!ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు గుప్పించే చంద్రబాబు వాటిని అమలు చేయకపోవడం వల్ల తమకు కలిగిన నష్టానికి ప్రతీకారంగా రైతన్నలు, నిరుద్యోగులు, అక్కచెల్లెమ్మలు, వివిధ సామాజిక వర్గాలు, పల్లెలు, పట్టణాల వాసులు అంతా కలసి సైకిల్‌ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్‌కు రిపేరు చేయాలని చంద్రబాబు తంటాలు పడుతున్నాడు. ముందుగా ఎర్రచొక్కాల దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఫలితం లేకపోవడంతో దత్తపుత్రుడి దగ్గరకు వెళ్లాడు. తుప్పు పట్టిన సైకిల్‌ కేరియర్‌ మీద మాత్రమే కూర్చుంటా! టీ గ్లాస్‌ పట్టుకుని తాగుతా! మిగిలింది నావల్ల కాదని దత్తపుత్రుడు చెప్పాడు. దీంతో వదిన­మ్మను ఢిల్లీకి పంపాడు. అక్కడి మెకానిక్స్‌ను ఇక్కడికి దింపి సైకిల్‌ను ఓ షేపులోకి తేవాలని కోరాడు. ఆ ఢిల్లీ మెకానిక్స్‌ ఇక్కడికి వచ్చి తుప్పు పట్టిన సైకిల్‌ను చూసి... హ్యాండిల్‌ లేదు! సీటు లేదు! పెడల్స్‌ లేవు! చక్రాలు, ట్యూబులు లేవు! మధ్యలో ఫ్రేమ్‌ కూడా లేదు! ఇంత తుప్పు పట్టిన సైకిల్‌ను ఎలా బాగు చేస్తాం చంద్రబాబూ! అని అడిగితే పిచ్చి చూపులు చూస్తూ.. ఇదొక్కటే మిగిలిందంటూ ట్రింగ్‌ ట్రింగ్‌మని బెల్లు మోగిస్తున్నాడు. ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో!2014లో బాబు ముఖ్యమైన మోసాలు..⇒ రైతులకు రూ.87,612 కోట్ల రుణమాఫీ జరిగిందా? ⇒ డ్వాక్రా సంఘాలకు రూ.14,205 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని రూపాయైనా మాఫీ చేశాడా?⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి స్కీమ్‌ కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తామన్నాడు. మరి ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి ఇచ్చాడా?⇒ ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నాడు. ఐదేళ్లలో ఏ ఇంటికైనా రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇల్లు ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా?⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత పవర్‌ లూమ్స్‌ రుణాల మాఫీ జరిగిందా? ⇒ ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాడా? ⇒ సింగపూర్‌ను మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మాణం జరిగిందా? ⇒ రాజానగరంలో ఎవరికైనా కనిపిస్తోందా? ⇒ ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. ⇒ అదే ముగ్గురు మరోసారి కూటమిగా ఏర్పడి సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్‌ అంటూ నమ్మబలుకుతున్నారు.  

Actual Truth Of Land Titling Act
ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం నిజాలివిగో..

సాక్షి, అమరావతి: ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండటంతో చంద్రబాబు గ్యాంగ్‌ పిచ్చెత్తిపోయి ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేక వైఎస్‌ జగన్‌పైన, ఆయన ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసి, ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రజల భూములపై వారికే హక్కులు కల్పించేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై నీచమైన ప్రచారం చేస్తోంది. భూముల వ్యవస్థను సమూలంగా మార్చడం ద్వారా ప్రజలకు.. తద్వారా సమాజానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ఈ చట్టాన్ని స్వలాభం కోసం వివాదాస్పదంగా మారుస్తోంది. అసలు ఈ చట్టంపై కూటమి నేతల ఆరోపణలు.., వాస్తవాలేమిటో తెలుసుకుందాం..కూటమి నేతల ఆరోపణలు–వాస్తవాలుఆరోపణ: ప్రజల ఆస్తులు లాక్కోవడానికే ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది.వాస్తవం: ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అసలు లక్ష్యమే ప్రజల ఆస్తులు కాపాడటం, వాటికి పూర్తి భద్రత కల్పించడం. ప్రభుత్వమే గ్యారెంటీ సర్టిఫికెట్‌ ఇవ్వడం. భూ యజమానులకు నష్టం కలిగితే పూర్తి పరిహారం చెల్లించడం. భూములు లాక్కోవడం అనేది ఈ చట్టంతో సాధ్యం కాదు.ఆరోపణ: భూ పత్రాలు ప్రభుత్వం వద్దే ఉంటాయి.వాస్తవం : భూ పత్రాలు ప్రభుత్వం చేతిలో ఉండవు. మీ వద్ద ఉన్న పత్రాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోదు. కేవలం రికార్డులు పరిశీలించి, ప్రజలకు గ్యారెంటీ సర్టిఫికెట్‌ ఇస్తుంది. ఇదే తుది కాపీ అవుతుంది. భవిష్యత్తులో 30 రకాల పత్రాల అవసరం ఉండదు.ఆరోపణ: కొత్త చట్టం అమల్లోకి వస్తే యాజమాన్య హక్కులను నిరూపించుకోవాలి.వాస్తవం : మీ వద్ద భూములు ఉంటే వాటి హక్కులను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వం వద్ద ఆ వివరాలు ఉంటాయి. ఆ వివరాల ప్రకారమే గ్యారెంటీ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. అందులో అభ్యంతరాలు ఉంటే రెండేళ్ల పాటు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్పీళ్లను పరిశీలించి శాశ్వత రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.ఆరోపణ: కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు.వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లను అప్పిలేట్‌ అథారటీ పరిష్కరిస్తుంది. అక్కడ న్యాయం జరగకుంటే హైకోర్టులోని ప్రత్యేక బెంచ్‌ని ఆశ్రయించవచ్చు. ఆ బెంచ్‌ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చు. కోర్టు ఇచ్చిన తుది తీర్పునే అప్పిలేట్‌ అథారిటీ అమలు చేస్తుంది. దీనిని మార్చే అధికారం మళ్లీ కోర్టుకే ఉంటుంది.ఆరోపణ: కోర్టుల్లో కేసులు వేసేందుకు టీఆర్‌ఓకు సమాచారమివ్వాలి.వాస్తవం : సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ, మీరు కోర్టులో కేసు వేసినట్లు సంబంధింత అధికారులకు తెలపాలి. తద్వారా మీ భూమి ఎక్కడికీ పోకుండా ఉంటుంది.ఆరోపణ: కొత్త చట్టం కింద భూహక్కుల నిర్ధారణ ఎవరు చేస్తారు?వాస్తవం : ఇప్పటికే ఉన్న భూమి వివరాలతో ఒక టైటిల్‌ రిజిస్టర్‌ మీ గ్రామానికి లేదా పట్టణానికి వస్తుంది. ఆ రిజిస్టర్‌లోని రికార్డులకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుంది. ఒకవేళ మీకు నష్టం కలిగితే ప్రభుత్వమే పూర్తి నష్ట పరిహారం చెల్లిస్తుంది. మీకు అధికారుల ద్వారా జరిగిన మార్పుల్లో అభ్యంతరాలుంటే కోర్టుల్లో సవాల్‌ చేయొచ్చు.ఆరోపణ: వారసత్వ హక్కుల వివాదాలు వస్తాయి.వాస్తవం : వారసత్వంగా సంక్రమించే ఆస్తులను టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ ద్వారా మీ పేరు మీద బదిలీ చేసుకోవచ్చు. వారసత్వం విషయంలో వివాదాలు ఉంటే కోర్టుకు వెళ్లాలి. కోర్టు తీర్పు ఆధారంగా రిజిస్టర్లో మీ పేర్లను నమోదు చేస్తారు.ఆరోపణ: ఈ చట్టం ఎక్కడా అమల్లో లేదు. ఏపీలోనే ఉంది.వాస్తవం : ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో అమల్లో ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, ఆఫ్రికా దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది. తద్వారా అక్కడి భూముల హక్కులకు భద్రత పెరిగింది. ఆయా దేశాల్లో ఈ వ్యవస్థ విజయవంతంగా నడుస్తోంది.ఆరోపణ: ఇది రాష్ట్ర ప్రభుత్వ చట్టమే. కేంద్రానిది కాదు.వాస్తవం : ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం కోసం 1986లో ప్రొఫెసర్‌ డి.సి.వాధ్వా ఏకసభ్య కమిషన్‌ను కేంద్రం నియమించింది. ఈ కమిటీ 1989లో టైటిల్‌ గ్యారెంటీ చట్టం అమలును సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత 2008, 2011, 2015, 2019లో నాలుగుసార్లు ఇందుకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని రాష్ట్రాలకు పంపారు. 2019లో నీతి ఆయోగ్‌ కమిటీ కొత్త ముసాయిదాను రాష్ట్రాలకు పంపింది. 2024 డిసెంబర్‌లోపు అమలు చేయాలని ఆదేశించింది.ఆరోపణ: కొత్త చట్టం ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చింది.వాస్తవం : ఇంకా అమల్లోకి పూర్తిస్థాయిలో రాలేదు. చట్టం అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇందుకు సంబంధించిన నిబంధనలు తయారు కావాలి. గెజిట్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ ఇంకా రూపొందించలేదు.ఆరోపణ: ఈ చట్టం వల్ల రైతులకు నష్టం.వాస్తవం : ఈ చట్టం వల్ల రైతులకు పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. 30 రకాల పత్రాల అవసరం ఉండదు. భూ వివాదాలు, సర్వే నంబర్లు, సరిహద్దుల సమస్యలు పరిష్కారం అవుతాయి. పోలీస్‌ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగాల్సిన అవసరం ఉండదు. మీ భూమిపై మీకు శాశ్వత హక్కులు వస్తాయి. భూకబ్జాల పీడ వదులుతుంది. మీ భూమిపై ఇతరులు దౌర్జన్యం చేసే అవకాశం ఉండదు. బ్యాంకులు సైతం సులువుగా లోన్లు జారీ చేస్తాయి.ఆరోపణ : ప్రజల వద్ద ఉన్న పాస్‌ పుస్తకాలు, రిజిస్టర్డ్‌ దస్తావేజులు చెల్లకుండా పోతాయి.వాస్తవం : ఈ చట్టం జాతీయ స్థాయిలో చర్చించి నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిన చట్టం. అసెంబ్లీలో కూడా ఆమోదముద్ర పడింది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా మద్దతు ఇచ్చింది. రాష్ట్రమంతటా ఈ చట్టం ఒక్కరోజే అమల్లోకి రాదు. భూముల సర్వే తర్వాత అభ్యంతరాలను పరిష్కరించాక తుది రిజిస్టర్‌ రూపొందించిన ప్రదేశాల్లో కాలానుగుణంగా చట్టం అమల్లోకి వస్తుంది. అప్పటివరకు రైతుల వద్ద ఉన్న పాస్‌ పుస్తకాలు, రిజిస్టర్డ్‌ దస్తావేజులు చెల్లుబాటులోనే ఉంటాయి. ఒక్కసారి తుది రిజిస్టర్‌ ద్వారా ప్రభుత్వం టైటిల్‌ గ్యారెంటీ ఇచ్చాక పాత రికార్డులు చెల్లవు.ఆరోపణ :  వందల చట్టాలు అమల్లో ఉండగా ఈ కొత్త చట్టం ఎందుకు?వాస్తవం : భూ రికార్డులకు సంబంధించి ఏపీలో 124 రకాల చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాలేవీ ఇవ్వని భరోసా కొత్త చట్టం ఇస్తుంది. ఆర్వోఆర్‌ చట్టం ద్వారా కేవలం రికార్డు మాత్రమే ఉంటుంది. ఆ రికార్డు ద్వారా సంక్రమించే హక్కులకు గ్యారెంటీ ఉండదు. కానీ కొత్త చట్టం హక్కులకు గ్యారంటీ ఇస్తుంది.ఆరోపణ : స్టాంపు కాగితాలకు బదులు జిరాక్సులు ఇస్తున్నారు.వాస్తవం : గత వంద సంవత్సరాలుగా స్టాంపు కాగితాలపైనే లావాదేవీలు నడిచాయి. కానీ, ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీ సర్టిఫికెట్‌ స్టాంపు కాగితాలకంటే విలువైనది. వీటిని జిరాక్స్‌ కాపీలు అని అనడం నీచమైన చర్య. ఒకవేళ గ్యారెంటీ సర్టిఫికెట్‌ పోగొట్టుకున్నా, టైట్లింగ్‌ ఆఫీసర్‌ వద్ద మీ వివరాలు పదిలంగా ఉంటాయి. మళ్లీ సర్టిఫికెట్‌ పొందవచ్చు.ఆరోపణ: న్యాయవాదులకు అన్యాయం జరుగుతుంది.వాస్తవం : ఈ చట్టం అమల్లోకి వస్తే భూ వివాదాలు తగ్గిపోతాయి. తద్వారా సివిల్‌ కేసులు కూడా భారీగా తగ్గుతాయి. అందువల్లే న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు. కానీ, ఈ చట్టం వల్ల పూర్తి పారదర్శకత లభిస్తుంది. ప్రజలకు మంచి జరుగుతుంది. హైకోర్టులో అప్పీల్‌ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక న్యాయవాదులకు సివిల్‌ కేసులు కూడా వస్తాయి.ఆరోపణ : పాస్‌ పుస్తకాలపై సీఎం బొమ్మ ఉంది కాబట్టి ఆ భూమి మీది కాదు.వాస్తవం : ఇది దిక్కుమాలిన వాదన. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, రాజకీయ లబ్ధి పొందేందుకు కొన్ని అరాచక శక్తులు చేస్తున్న ఆరోపణ ఇది. కొత్త పాస్‌ పుస్తకాలను ప్రభుత్వం గ్యారెంటీతో ఇస్తుంది. ఈ పుస్తకాల ద్వారా రైతు లేదా భూ యజమానికి పంట సాయం వస్తుంది. సబ్సిడీలు వస్తాయి. బ్యాంకుల ద్వారా రుణాలొస్తాయి. పరిహారం వస్తుంది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు ఈ పుస్తకం ఆధారం. చాలా ప్రభుత్వ పథకాల అమలు సందర్భంగా ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రుల బొమ్మలు పెడుతుంటారు. కరోనా వేక్సినేషన్‌ సర్టిఫికెట్ల మీద ప్రధాని బొమ్మ ముద్రించారు. ముఖ్యమంత్రి బొమ్మ ఉన్నంత మాత్రాన ఏమీ జరగదు.  

Untimely Rain Effects Paddy, Mango Farmers In Telangana
మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం

సాక్షి నెట్‌వర్క్‌: అకాల వర్షం పుట్టి ముంచింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యాన్ని ముంచేసింది. చెట్లపై ఉన్న మామిడి కాయలను రాల్చేసింది. ఈదురుగాలులతో విరుచుకుపడి పలువురి ప్రాణాలనూ బలిగొంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన వాన బీభత్సం సృష్టించింది. వరి ధాన్యం కొట్టుకుపోయింది. ఈదురుగాలుల ధాటికి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరంగల్‌: నీట మునిగిన ధాన్యం వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. జనగామ వ్యవసాయ మార్కెట్‌ వెయ్యి బస్తాల ధాన్యం తడిసిపోయింది. బచ్చన్నపేట, జనగామ రూరల్, పాలకుర్తి, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, దేవరుప్పుల తదితర మండలాల్లో విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, 33కేవీ లైన్లు నేలకొరిగాయి. చిల్పూరు, జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో వందల ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట, కిష్టాపూర్, మహాముత్తారం, కోనంపేటలలో ధాన్యం కొట్టుకుపోయింది. ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలంలో ధాన్యం తడిసింది. మహబూబాబాద్‌ జిల్లా కురవి, బయ్యారం, గంగారం, మహబూబాబాద్‌ రూరల్‌ మండలాల్లో పంటలకు నష్టం జరిగింది. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో ధాన్యం నీట కొట్టుకుపోయింది. కరీంనగర్‌: వడగళ్ల వాన మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు, మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. పలు గ్రామాల్లో ఇళ్లపై కప్పు రేకులు ఎగిరిపోయాయి. వడగళ్ల వానతో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో మామిడికాయలు రాలిపోయాయి. జమ్మికుంటలో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌: వాన తిప్పలు ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో ఈదురుగాలులతో కురిసిన వర్షంతో రైతులు తిప్పలు పడ్డారు. పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. సిరికొండ, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, తలమడుగు మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. నర్సాపూర్‌(జీ), నిర్మల్, లక్ష్మణచాంద మండలాల్లో తీవ్రంగా ఈదురుగాలులు వీయడంతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేల కూలయి. ఆసిఫాబాద్‌ మండలంలో కోతకు వచ్చిన వరిపంట నేలకొరిగింది.   ఉమ్మడి నల్లగొండ: దెబ్బతిన్న మామిడి నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు పడ్డాయి. వందల ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, బీబీనగర్, పోచంపల్లి, మోత్కూరు మండలాల్లో చాలాసేపు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. యాదాద్రి కొండపై ఈదురుగాలులు, వానతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చలువ పందిళ్లు నేలకూలాయి. క్యూకాంప్లెక్స్‌ పైకప్పు రేకులు ఎగిరి సమీపంలో ఉన్న వాహనాలపై పడ్డాయి. ఉమ్మడి నిజామాబాద్‌: వణికించిన ఈదురుగాలులు బలమైన ఈదురుగాలులు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాను వణికించాయి. నాలుగైదు గంటల పాటు గాలివాన బీభత్సం సృష్టించింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి రంగారెడ్డి: నీట మునిగిన కాలనీలు రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలుల వాన వణికించింది. పలుచోట్ల వడగళ్లు కురిశాయి. మామిడి నేల రాలింది. చేవెళ్ల, మొయినాబాద్, యాచారం మండలాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగింది. షాద్‌నగర్‌ పట్టణంలోని లోతట్టు కాలనీలు నీటమునిగాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా: ముంచెత్తిన వాన మెదక్‌ ఉమ్మడి జిల్లాను అకాల వర్షం ముంచెత్తింది. సిద్దిపేట పత్తి మార్కెట్‌ యార్డులో 3 వేల బస్తాలకుపైగా ధాన్యం మొత్తం తడిసింది. సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలంలో భారీగా ధాన్యం తడిసింది. పటాన్‌చెరు నియోజకవర్గంలో పలుచోట్ల చెట్లు విరిగిపడి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిన్నారం, హత్నూర మండలాల్లో వడగళ్లు పడ్డాయి. ధాన్యం తడిసిపోయింది. జిల్లాలో రెండు ఇళ్లు, ఓ హోటల్‌ పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మెదక్‌ జిల్లా చిలప్‌చెడ్‌ మండలంలో ధాన్యం నీట మునిగింది. హైదరాబాద్‌ ఆగమాగం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం హైదరాబాద్‌ నగరాన్ని ఆగమాగం చేసింది. మియాపూర్‌లో ఏకంగా 13.3 సెంటీమీటర్లు, కూకట్‌పల్లిలో 10.7 సెంటీమీటర్లు భారీ వర్షపాతం నమోదైంది. మూసాపేట గూడ్స్‌òÙడ్‌ రోడ్డులో పార్కింగ్‌ చేసిన లారీలు, కంటైనర్‌ లారీలు మట్టి దిగబడి ఓ వైపు ఒరిగి పోయాయి. చాలా ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు, హోర్డింగ్స్‌ కూలిపోయాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. అత్తాపూర్‌లో ఇళ్ల రేకులు ఎగిరిపోయి సమీపంలోని సబ్‌స్టేషన్‌లో పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో తీవ్రంగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ‘వాన’ దెబ్బకు ఆరుగురు బలి రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు, వర్షం ధాటికి చెట్ల కొమ్మలు విరిగిపడి, గోడలు కూలి, పిడుగులు పడి ఆరుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్‌ జిల్లా సంగెం మండలం ఇల్లందలో చెట్టు కొమ్మలు విరిగిపడి బీటెక్‌ విద్యార్థి ఆబర్ల దయాకర్‌ (22) మృతిచెందాడు. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్‌ (నాగ్సాన్‌పల్లి) శివారులోని మామిడితోటలోని కోళ్ల ఫారం గోడ కూలడంతో ఇద్దరు కూలీలు అక్కడిక్కడే మరణించారు. పిడుగుపాటుకు గురై సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండల ఎర్రారంలో గోవిందు పాపయ్య (52), సిద్దిపేట జిల్లాలో కుకునూరుపల్లికి చెందిన మల్లేశం (33)మృతి చెందారు. హైదరాబాద్‌ బాచుపల్లిలో గోడ కూలి.. భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనం రిటైనింగ్‌ వాల్‌ కూలిపోయింది. ఆ పక్కనే ఉన్న రేకుల ఇళ్లపై గోడ, మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో వాటిలో నివాసం ఉంటున్న ఏడుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద కొందరు కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. వేగంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. కూలీలు ఇచ్చిన వివరాల మేరకు 8 మంది వరకు శిథిలాల కింద కూరుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రికల్లా శిథిలాల కింద ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  

TDP leader Chandrababu does not care about poor people welfare
అప్పుడూ ఇప్పుడూ 'అంతే'

సాక్షి, అమరావతి: పేదలంటే ఏమాత్రం పట్టని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పదం వింటేనే అగ్గిమీద గుగ్గిలమవుతారు. ఇక వారికి ఏదైనా మేలు జరిగితే.. గుండెలు బాదుకోవడం.. గగ్గోలు పెట్టడం.. పెడబొబ్బలు.. ఆర్తనాదాలే. పుట్టుకతో సహజసిద్ధంగా ఆయనకు అబ్బిన ఈ లక్షణాలు ఇప్పుడు మరీ వికృతరూపం దాల్చి కరాళ నృత్యం చేస్తున్నాయి. పేదలకు అందాల్సిన పథకాలను ఎన్నికల కోడ్‌ ముసుగులో ఎన్నికల సంఘం ద్వారా అడ్డుకో­వ­డమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అసలు ఎన్నికల కోడ్‌ లేని సమయంలోనే పేదల చదువుల కోసం సీఎం వైఎస్‌ జగన్‌ సర్కారు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెడితే దానిపై ‘పచ్చ’ముఠా పెట్టిన గగ్గోలు అంతాఇంతా కాదు. ఆ విధా­నాన్ని అమలుచేయకుండా చేయని కుట్రలు­లేవు. అలాగే, అప్పట్లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూములను సేకరిస్తే వాటిపైనా న్యాయ­స్థానాలకు వెళ్లి అడ్డుకుంది. ఆఖరికి అమరా­వతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమ­తుల్యత దెబ్బతింటుందంటూ తమ పెత్తందారీ ధోరణిని  ప్రదర్శించింది. ఇలా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పేదలకు ఇళ్ల స్థలాలివ్వకుండా కోర్టు­ల్లో కేసులు వేసింది. కానీ, సీఎం జగన్‌ సర్కారు వీటన్నింటినీ ఛేదించుకుని తన యజ్ఞాన్ని నిర్వఘ్నంగా కొనసాగించింది. ఇందుకు సుప్రీంకోర్టుకూ వెళ్లి పచ్చ మాఫియాపై విజయం సాధించింది. కానీ, ఎల్లో గ్యాంగ్‌ ఇప్పుడు ఎన్నికల కోడ్‌ను అడ్డుపెట్టుకుని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వలంటీర్లు ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయకుండా అడ్డుకుంది. దీంతో మండుటెండల్లో వృద్ధులు, వికలాంగులు సచివాలయాల చుట్టూ, బ్యాంకులు చుట్టూ తిరిగేలా చేసి అనేకమంది మృతికి ఈ పెత్తందార్లు కారణమయ్యారు. తమ రాజకీయాల కోసం వృద్ధులు, వికలాంగుల ప్రాణాలుపోయినా పర్వాలేదనే ధోరణిలో చంద్రబాబు బ్యాచ్‌ వ్యవహరించింది.ఎప్పటినుంచో కొనసాగుతున్న పథకాలకూ బ్రేకులు..నిజానికి.. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ అన్నది కొత్త కార్యక్రమమేమీ కాదు. ఎప్పటి నుంచో వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సూర్యోదయంలోపే వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకను అందిస్తున్నారు. ఇలా కొనసాగుతున్న విధానానికి ఎన్నికల కోడ్‌ వర్తించకపోయినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘానికి బాబు బృందం ఫిర్యాదు చేసి వృద్ధులు, వికలాంగులు, వితంతవులును రోడ్డుపాల్జేసింది. అలాగే.. పేద విద్యార్థుల చివరి త్రైమాసికం విద్యాదీవెన, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందకుండా చేసింది. అసలివి ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీ పథకాలే. లబ్ధిదారులు సైతం పాత వారే తప్ప కొత్తగా ఎవ్వరినీ ఎంపిక చేయలేదు. అయినాసరే, చంద్రసేన ఒత్తిడితో పోలింగ్‌ పూర్తయ్యే వరకు ఇవి చెల్లించవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. వాస్తవానికి.. 2023లో కరువు కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడమనేది ఇప్పటికే కొనసాగుతున్న ప్రక్రియే. చంద్రబాబు కుట్రల కారణంగా.. కరువుతో పంటలు కోల్పోయిన రైతులు ఇప్పుడు ఖరీఫ్‌లో విత్తనాల కొనుగోళ్లకు, ఇతర ఖర్చులకు డబ్బుల్లేక అప్పులు పాలవుతారనే కనీస ఆలోచన కూడా లేకుండా రైతులపట్ల కర్కశంగా, నిర్దయగా వ్యవహరించింది. ఇలా బాబు నిర్వాకంతో రాష్ట్రంలో 6,95,897 కరువు బాధిత రైతులకు చెల్లించాల్సిన రూ.847.22 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులు నిలిచిపోయాయి.తెలంగాణలో ఓకే.. ఏపీలో మాత్రం నో..కానీ, తెలంగాణలో వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించేందుకు అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం ‘నో’ చెప్పింది. ఈ విషయంలో ఏపీపట్ల ఎన్నికల సంఘం వివక్ష చూపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, పేద విద్యార్థుల పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గత ఐదేళ్ల నుంచి విద్యాదీవెన పథకం కింద డీబీటీ రూపంలో బటన్‌నొక్కి ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోంది. విద్యాదీవెన కింద చివరి విడత కిస్తీని ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించకముందే ప్రభుత్వం ప్రారంభించింది. ఇది కూడా ఇప్పటికే కొనసాగుతున్న పథకం అయినప్పటకి చంద్రబాబు బృందం ఒత్తిడితో ఎన్నికల సంఘం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.610.79 కోట్ల విద్యాదీవెన చెల్లింపులను నిలుపుదల చేసింది. విద్యార్థులు కాలేజీలకు ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వరనే కనీస జ్ఞానం కూడా లేకుండా రాజకీయానికే బాబు బ్యాచ్‌ ప్రాధాన్యతనిచ్చింది. దీంతో అప్పులుచేసి పేద విద్యార్థులు ఫీజులు చెల్లించే స్థితికి బాబు తీసుకొచ్చారు.‘చేయూత’ నిధులకూ చెక్‌..ఇక మరోపక్క.. పేద అక్కచెల్లమ్మలకు ‘చేయూత’ కింద ఆఖరి విడత నిధులను ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించకముందే ప్రారంభించినప్పటికీ బాబు బృందం ఒత్తిడితో ఆ నిధుల చెల్లింపులకూ ఎన్నికల సంఘం మొకాలడ్డింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు పేద మహిళల జీవనోపాధికి సాయం అందించే ‘చేయూత’ పథకం అమలు కూడా ఎప్పుడో ప్రారంభమైంది. ఇప్పటికే మూడు విడతల్లో ప్రభుత్వం అమలుచేసింది కూడా. ఇప్పుడు చివరి విడత కింద 29 లక్షల మంది పేద మహిళలకు సాయం అందాలి. దీనికి కూడా బాబు బృందం ఒత్తిడితో కేంద్ర ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. గత ఐదేళ్ల నుంచి కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కోడ్‌ సాకుతో చంద్రబాబు కోటరీ పెత్తందారీ పోకడలతో అడ్డుకోవడం ద్వారా పేద విద్యార్థులు, రైతులు, మహిళల పొట్టకొట్టి తమ వికృతరూపాన్ని ఆ ముఠా చాటుకుంది.  

Allu Arjun celebrates the 20th anniversary of Arya
ఆర్య కథ వినగానే ఇది నా ఇడియట్‌ అనిపించింది: అల్లు అర్జున్‌

‘‘హీరో తరుణ్‌ నాకు మంచి ఫ్రెండ్‌. ‘దిల్‌’ సినిమా ప్రీమియర్‌కి తను పిలవడంతో వెళ్లాను. అక్కడ నన్ను చూసిన సుకుమార్‌గారు మరుసటి రోజు వచ్చి ‘ఆర్య’ కథ చెప్పారు.. మైండ్‌ బ్లోయింగ్‌గా నచ్చింది. ‘ఇడియట్‌’ మూవీ చూసి ఇలాంటి యూత్‌ సినిమా నాకు పడితే ఎలా ఉంటుంది? అనే కోరిక మనసులో ఉండేది. ‘ఆర్య’ కథని సుకుమార్‌గారు చెబుతున్నప్పుడు ఇది నా ‘ఇడియట్‌’ మూవీ కథ అనిపించింది’’ అని హీరో అల్లు అర్జున్‌ అన్నారు. ఆయన హీరోగా, అనూ మెహతా జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. ఈ మూవీ ద్వారా సుకుమార్‌ దర్శకునిగా పరిచయమయ్యారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ సినిమా 2004 మే 7న విడుదలైంది. ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు అయిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ‘ఆర్య 20 ఇయర్స్‌ సెలబ్రేషన్స్‌’ నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ–‘‘ఆర్య’ ఒక సినిమా మాత్రమే కాదు.. మా అందరి జీవితాలను మార్చింది. ఈ మూవీ 20ఏళ్ల వేడుకని నిర్వహించిన రాజుగారికి థ్యాంక్స్‌. నా జీవితాన్ని పూర్తీగా మార్చిన సినిమా ‘ఆర్య’. నా తొలి మూవీ ‘గంగోత్రి’ హిట్‌ అయింది. అయితే చూడ్డానికి నేనంత గొప్పగా లేనని ఆ తర్వాత మంచి సినిమాలేవీ రాలేదు. ఏడాది పాటు ఖాళీగా కూర్చున్నా. కానీ, రోజుకి మూడు కథలు వినేవాణ్ణి.. కానీ నచ్చేవి కాదు. ‘ఆర్య’ కథ బాగా నచ్చింది.. కానీ, సుకుమార్‌గారు సరిగ్గా తీయగలరా? లేదా? అనే చిన్న అనుమానం. వీవీ వినాయక్‌గారు ఇంటికొచ్చి.. నాన్నగారు(అల్లు అరవింద్‌), నాతో మాట్లాడి.. సుకుమార్‌ తీయగలడు.. అతన్ని నమ్మండి అన్నారు. ఆయన మాట నాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఆ తర్వాత వారం రోజులు ట్రైల్‌ షూట్‌ చేస్తే అద్భుతంగా తీశారు సుకుమార్‌గారు. ఆ తర్వాత ధైర్యంగా ముందుకెళ్లాం.. సినిమా అద్భుతంగా వచ్చింది.. బ్లాక్‌ బస్టర్‌ అయింది. ఇందుకు సుకుమార్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ–‘‘ఆర్య’ వచ్చి 20 ఏళ్లు అయింది. ఆ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల కళ్లల్లో ఇప్పటికీ ఓ ఆనందం కనిపిస్తోంది. అది చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ‘ఆర్య’ కి పనిచేసిన బన్నీ, నేను, సుకుమార్, దేవిశ్రీ, రత్నవేలు.. ఇలా అందరూ ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా టాప్‌ ΄÷జిషన్‌లో ఉన్నాం. ఒక సినిమాతో ఇంత మ్యాజిక్‌ జరగడం అనేది తెలుగు ఇండస్ట్రీనే కాదు ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనే ‘ఆర్య’ ప్రత్యేకమైన సినిమా. 20 ఏళ్ల తర్వాత కూడా అందరూ ఇలా సక్సెస్‌ఫుల్‌గా ఉండటం అనేది గ్రేట్‌ మూమెంట్‌.. దీనికి కారణం సుకుమార్‌. ‘ఆర్య’ ప్రయాణాన్ని మాత్రం ఎప్పటికీ మరచిపొలేను’’ అన్నారు. సుకుమార్‌ మాట్లాడుతూ–‘‘ఆర్య’ నా తొలి చిత్రం కాబట్టి ప్రతి మూమెంట్‌ నాకు గుర్తుంది. ప్రస్తుతం కొత్త డైరెక్టర్స్‌కి అవకాశాలు చాలా బాగున్నాయి. కానీ, అప్పట్లో లేవు. కొత్త డైరెక్టర్‌తో ఓ సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. ధైర్యం చేసి నాకు అవకాశం ఇచ్చిన రాజుగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి పునాది బన్నీనే.. దాన్ని ఎప్పుడూ మరచిపొలేను’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, కెమెరామేన్‌ రత్నవేలు, నటీనటులు అభినయశ్రీ, మధుమిత, శివ బాలాజీ, ‘చిత్రం’ శ్రీను, సుబ్బరాజు, బబ్లు, దేవి చరణ్, ‘ఆదిత్య’ మ్యూజిక్‌ నిరంజన్‌ పాల్గొన్నారు.

Rajamouli Comments On The Bahubali Animations Series
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్

దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈసారి బాహుబలి: క్రౌన్‌ ఆఫ్ బ్లడ్‌ అంటూ యానిమేషన్‌ సిరీస్‌ను పరిచయం చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ యానిమేషన్‌ సిరీస్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రాజమౌళి. ఈఈసందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. 'బాహుబలిని ముందుకుతీసుకెళ్లే బాధ్యతను మరొకరికి అప్పగించడం కఠినమైన నిర్ణయం. ఆ సినిమా తీసేటప్పుడే అనేక మార్గాల్లో బాహుబలిని ఆవిష్కరించాలనుకున్నాం. సరైన సమయంలో సరైన వ్యక్తులు, టీమ్‌ మాకు లభించింది. యానిమేషన్‌ సిరీస్‌పై వాళ్లు పంచుకున్న ఆలోచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది కేవలం పిల్లలనే కాదు.. అందరినీ అలరించేలా తీయొచ్చని తెలిపారు. ఈ ఫార్మాట్‌లో సిరీస్‌ చేయాలనుకున్నప్పుడు మరోసారి ‘బాహుబలి సినిమాను సమీక్షించాం. పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ ఇలా అనేక అంశాలు పరిశీలించాం. ఆ పాత్రలపై నాకున్న ప్రేమను వాళ్లు అర్థం చేసుకున్నారు. కథతో పాటు పాత్రలు చాలా చక్కగా క్రియేట్‌ చేశారు. అది చూసి నాకు సంతోషంగా కలిగింది.' అని అన్నారు.థియేటర్లో బాహుబలి చిత్రాన్ని చూసింది కేవలం 10 కోట్ల మంది మాత్రమేనని రాజమౌళి అన్నారు. అంటే మిగిలిన కోట్ల జనాభా ఏదో ఒక మాధ్యమం ద్వారా చూసి ఉంటారని తెలిపారు. కథలు చూసే విధానం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది.. అందరూ రెగ్యులర్‌ సినిమాలు మాత్రమే చూడరు. కేవలం యానిమేషన్‌ చిత్రాలు మాత్రమే చూసేవాళ్లు కూడా ఉంటారు. ఆ ఆలోచనతోనే బాహుబలి ఈ మాధ్యమం ద్వారా తీసుకొస్తున్నాం. సినిమా తీయాలంటే చాలా విషయాలు ఆలోచించాలి. డైలాగ్స్‌, ఫైట్స్‌, పాటలు ఇలా ఆలోచలన్నీ దాని చుట్టూనే ఉంటాయి. కానీ, యానిమేషన్‌లో అది వర్కవుట్‌ కాదు. సీజన్లు చూసే కొద్దీ మీరు యానిమేషన్‌ సిరీస్‌కు కనెక్ట్‌ అవుతారన అన్నారు.యానిమేషన్ సినిమా చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? అని ఈ సమావేశంలో రాజమౌళిని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. యానిమేషన్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో తనకు ఆలోచన ఉందని.. ఎప్పుడో ఒకసారి జరుగుతుందన్నారు. నేను సినిమాలు చేస్తూ నేర్చుకుంటూనే ఉంటానని.. దీని వల్ల రానున్న సినిమాల్లో కొత్త విషయాలు చేసేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈగ సినిమాలో కొంత భాగం యానిమేషన్ ఉందని వెల్లడించారు. భవిష్యత్‌లో చేసే అవకాశం వచ్చినప్పుడు ఈ సిరీస్‌ ద్వారా నేర్చుకున్న అంశాలు నాకు కచ్చితంగా ఉపయోగపడతాయన్నారు. కాగా.. రాజమౌళి తన తదుపరి చిత్రం ప్రిన్స్ మహేశ్‌బాబుతో తెరకెక్కించనున్నారు. బాహుబలి: క్రౌన్‌ ఆఫ్ బ్లడ్‌  యానిమేషన్‌ సిరీస్‌  డిస్నీప్లస్ మే 17న  డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది

IPL 2024 Good News For KKR: Star Player Set Rejoin Team Ahead Of Play Offs
Play Offs: స్టార్‌ ఓపెనర్‌ దూరం?... కేకేఆర్‌కు ఓ గుడ్‌న్యూస్‌!

ఐపీఎల్‌-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇప్పటికే ఆడిన పదకొండు మ్యాచ్‌లలో ఏకంగా ఎనిమిది గెలిచి పదహారు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది శ్రేయస్‌ అయ్యర్‌ సేన.కేకేఆర్‌ ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌, సునిల్‌ నరైన్‌ ‌విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఆల్‌రౌండర్‌ నరైన్‌ 11 ఇన్నింగ్స్‌లో 461, సాల్ట్ 429 పరుగులు సాధించారు.అతడు దూరం!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ స్టార్‌ ఫిలిప్‌ సాల్ట్‌ త్వరలోనే కేకేఆర్‌ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వదేశంలో పాకిస్తాన్‌తో మే 22 నుంచి టీ20 సిరీస్‌ నేపథ్యంలో.. అతడు ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ దశలో కేకేఆర్‌కు దూరమవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ నిజంగా అదే జరిగితే కేకేఆర్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లే! అయితే, ఇలాంటి సమయంలో అఫ్గనిస్తాన్‌ ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌  బ్యాటర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ శుభవార్తతో ముందుకు వచ్చాడు. త్వరలోనే తాను కేకేఆర్‌తో చేరనున్నట్లు వెల్లడించాడు.PC: IPLతల్లి అనారోగ్యం కారణంగానేకాగా 2023లో కేకేఆర్‌లో అడుగుపెట్టిన గుర్బాజ్‌ 11 మ్యాచ్‌లు ఆడి 227 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు కూడా ఉండటం విశేషం. ఇక ఈ ఏడాది సాల్ట్‌- నరైన్‌ జోడీ కారణంగా అతడికి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు.ఈ క్రమంలో ఇటీవలే గుర్బాజ్‌ స్వదేశానికి తిరిగి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎక్స్‌ వేదికగా క్లారిటీ ఇచ్చాడు రహ్మనుల్లా గుర్బాజ్‌.త్వరలోనే వస్తాను‘‘మా అమ్మ అనారోగ్యం దృష్ట్యా ఐపీఎల్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నాను. త్వరలోనే కేకేఆర్‌ కుటుంబాన్ని కలుస్తాను. మా అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. తనకోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు’’ అని గుర్బాజ్‌ పేర్కొన్నాడు.చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్‌ శర్మ.. వీడియో వైరల్‌

Techie Got Promoted in April Now She Loss Job
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన

అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా గత కొన్ని రోజులుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా కంపెనీలో సుమారు ఏడు సంవత్సరాలు పనిచేసిన ఓ ఉద్యోగిని ఒక్క ఈమెయిల్‌తో తొలగించినట్లు వెల్లడించింది.దాదాపు ఏడేళ్ల పాటు ఎంతో నమ్మకంగా పని చేసిన తన సోదరి లేఆఫ్‌కి గురైన తీరుపై ఆమె సోదరుడు జతిన్ సైనీ లింక్డిన్‌లో పోస్ట్ చేశారు. ఇందులో గత నెలలోనే ఆమె ప్రమోషన్ (పదోన్నతి) పొందినట్లు పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన తరువాత వారు న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్‌కు మకాం మార్చాలని కూడా అనుకున్నట్లు పేర్కొన్నారు.రోజు మాదిరిగానే జతిన్ సైనీ సోదరి మే 3న ఆఫీసుకు వెళ్తే తన కార్డు పనిచేయకపోవడాన్ని గమనించి విస్తుపోయింది. ఆశలన్నీ ఆవిరైపోవడంతో ఆమె చాలా బాధపడింది. ఆమెను మాత్రమే కాకుండా ఆమె టీమ్‌లో ఉండే దాదాపు 73 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఏడు సంవత్సరాలు ఎంతో నమ్మకంగా పనిచేసినప్పటికీ ఒక్క మైయిల్ పంపి తీసివేయడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది.పోస్ట్ చివరలో.. జతిన్ సైనీ తన సోదరి ఉద్యోగాన్ని కోల్పోవడంతో కార్పొరేట్ నిర్ణయాల వెనుక ఉన్న విలువలను గురించి వెల్లడించారు. టెస్లాలో ఏడు సంవత్సరాలు పనిచేస్తే.. కష్టాన్ని ఏ మాత్రం గుర్తించకుండా ఇప్పుడు బయటకు పంపారు. శ్రమ మొత్తం సున్నా అయిపోయిందని అన్నారు.టెస్లా కంపెనీ ఏప్రిల్ నెలలో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 10 శాతం కంటే ఎక్కువమందిని తొలగించింది. గ్లోబల్ మార్కెట్లో కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కారణంగా ఇప్పటికి నాలుగు సార్లు ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. దీంతో టెస్లాలో ఉద్యోగం గాల్లో దీపంలాగా అయిపోయింది.

Delhi Capitals beat Rajasthan Royals by 20 runs
IPl 2024: శాంసన్‌ ఇన్నింగ్స్‌ వృథా.. రాజస్తాన్‌పై ఢిల్లీ ఘన విజయం

ఐపీఎల్‌-2024లో రాజస్తాన్‌ రాయల్స్‌ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన హైస్కోరింగ్‌ మ్యాచ్‌లో 20  పరుగుల తేడాతో రాజస్తాన్‌ ఓటమి పాలైంది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులకు పరిమితమైంది. రాజస్తాన్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ సంజూ శాంసన్‌ 86 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్‌ ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. మిగితా బ్యాటర్ల నుంచి పెద్ద ఇన్నింగ్స్‌లు రాకపోవడంతో రాజస్తాన్‌ ఓడిపోయింది. ఇక ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, ఖాలీల్‌ అహ్మద్‌, ముఖేష్‌ కుమార్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. అక్షర్‌ పటేల్‌, రసిఖ్ దార్ సలామ్ చెరో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.ఢిల్లీ బ్యాటర్లలో ఓపెనర్లు జెక్‌ ఫ్రెజర్‌ మెక్‌ గర్క్‌(20 బంతుల్లో 50), అభిషేర్‌ పోరెల్‌(65) అదరగొట్టారు. వీరిద్దరితో పాటు ఆఖరిలో ట్రిస్టన్‌ స్టబ్స్‌ మెరుపులు మెరిపించాడు.20 బంతులు ఎదుర్కొన్న స్టబ్స్‌.. 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41 పరుగులు చేశాడు. రాజస్తాన్‌ బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడువికెట్లు పడగొట్టగా.. చాహల్‌, బౌల్ట్‌, సందీప్‌ శర్మ తలా వికెట్‌ సాధించారు.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all