Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

CM jagan May 6th Election campain Schedule: repalle macherla machilipatnam
సీఎం జగన్‌ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ ఇదే

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభల మే 6 వ తేదీ షెడ్యూల్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ ఆదివారం విడుదల చేశారు. సీఎం జగన్‌ సోమవారం ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు.    ఉదయం 10 గంటలకు  బాపట్ల  పార్లమెంట్ పరిధిలోని రేపల్లె నియోజకవర్గం కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని మాచర్ల నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస్ మహల్ సెంటర్‌లో  జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని మచిలీపట్నం టౌన్ వల్లూరి రాజా  సెంటర్లో  జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.

Land Titling Act: Cid Investigation On Tdp Fake Campaign
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్‌.. టీడీపీ ఫేక్‌ ప్రచారంపై సీఐడీ విచారణ

సాక్షి, విజయవాడ: టీడీపీ ఫేక్‌ ప్రచారంపై సీఐడీ విచారణ చేపట్టింది. చంద్రబాబు ఏ1గా, లోకేష్‌ ఏ2గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. టీడీపీ అసత్య ప్రచారంపై వైఎస్సార్‌సీపీ  ఈసీకి ఫిర్యాదు చేసింది.ఈసీ ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీఐడీ.. విచారణ చేపట్టింది. చంద్రబాబు, లోకేష్‌తో పాటు 10 మందిపై కేసు నమోదు చేసింది. ఐవీఆర్ఎస్‌ కాల్స్‌ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదైంది.కాగా, ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ తప్పుడు సమాచారంతో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీద ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్‌ 29న ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంగళగిరి సీఐడీ (సైబర్‌ సెల్‌) అడిషనల్‌ డీజీకి అడిషనల్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఎంఎన్‌ హరీంధర ప్రసాద్‌ ఆదేశించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో దురుద్దేశపూర్వకంగా లాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ప్రచారం చేస్తోందంటూ  వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన ఆధారాలనూ సమర్పించింది.వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల ఐవీఆర్‌ కాల్స్‌ వస్తున్నాయని.. వాటిని లిఫ్ట్‌ చేయగానే.. ‘వైఎస్‌ జగన్‌ అధికారంలోకొస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు, జగన్‌ కాజేస్తాడు, ఒరిజినల్స్‌ ఆయన దగ్గర ఉంచుకుంటాడు, మీకు జిరాక్స్‌ కాపీలు వస్తాయి, కాబట్టి జగన్‌కు ఓటు వేయకుండా తెలుగుదేశంకు ఓటు వేయండి’.. అంటూ రికార్డ్‌ మెసేజ్‌లు వస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.వీటికి సంబంధించిన వాయిస్‌ రికార్డులను వైఎస్సార్‌సీపీ ఈసీకి ఆధారాలుగా సమర్పించింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆమోదంలేకుండా ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని.. కానీ ఎటువంటి అనుమతుల్లేకుండా వివిధ చోట్ల నుంచి కాల్స్‌చేస్తూ ఇలా ప్రచారం చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని.. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది.ఎన్నికల సమరంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, ఈ విధంగా చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ తన ఫిర్యాదులో కోరింది        ‌              

Fake Surveys By Outdated Journalists On Ap Elections
కొత్త పగటివేషగాడు వచ్చాడు

ఎప్పుడో మూలబడిపోయి, నట్లు ఊడిపోయిన అంబాసిడర్ కారుకు కలర్ వేసి తీసుకొస్తే అది ఆడి కార్ అయిపోతుందా...ముసలమ్మకు మేకప్ వేసి చూపిస్తే ముద్దుగుమ్మ అయిపోతుందా..సంస్థను మోసం చేసి...చెక్కుబుక్కులు ఎత్తుకుపోయి వ్యవస్థనే మోసం చేసి కేసులపాలై ఏళ్లపాటు సమాజానికి మొహం చూపించలేక ఎక్కడో దూరంగా బతుకుతున్న వ్యక్తిని తీసుకొచ్చి రాత్రికిరాత్రి సర్వేలు అంటూ అవాస్తవాలు. చెప్పిస్తే ప్రజలు నమ్ముతారా ? అసలు ఈ కాలం జనం అలా ఉన్నారా? ఎవరో ఏదో చూపిస్తే అబ్బో...బ్రహ్మాండం అని నమ్మే తీరులో ఉన్నారా? అసలు ఇప్పుడు ఎక్కడో మారుమూల పల్లెల్లోని జనం కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతూ సోషల్ మీడియాలో అన్నీ చూస్తూ ఏ ఛానెల్..ఏ పత్రిక ఎవరిపక్షమో చెప్పగలుగుతున్నపుడు ఈ మాయమాటలు ఎవరు నమ్ముతారు.వాస్తవానికి చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ఊత కర్ర లేకపోయింది. అంటే ఏ అంశాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్లి నమ్మిస్తారు..ఆకట్టుకుంటారు..ప్రస్తుత వైఎస్‌ఆర్‌సీపీ జగన్ ప్రభుత్వం అన్నివర్గాలనూ ఆకట్టుకుంటూ అవినీతి రహిత పాలనా అందిస్తోంది. దానికితోడు చంద్రబాబు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయి గౌరవాన్ని కోల్పోయి ఏదో అలా బతుకుతున్నారు తప్ప ఆయన రాజకీయనాయకుడు స్టేచర్ ఏనాడో కోల్పోయారు. దీంతో ఈ ఎన్నికలవేళ తెలుగుదేశానికి కాళ్ళు చేతులు కట్టేసినట్లయింది. ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక కారణం..ఒక అంశం లేకుండా పోయింది.ఇక జగన్ ఐతే చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు. మాయలు ఉండవు...చేయలేనిది చేయలేను ఆయనే ఒప్పేసుకుంటాడు.. అలాంటపుడు మోసానికి కేరాఫ్ అయిన చంద్రబాబు నమ్మాల్సిన అవసరం ఏముందన్న ట్రెండ్ ప్రజల్లో నడిచింది . సినిమా ఫ్లాప్‌ అయిపోయి..జనాదరణ కోల్పోయి, ఇది చెత్త అని జనాల్లో టాక్ వచ్చినపుడు కొత్త మసాలా పాట కలిపి మళ్ళీ రిలీజ్ చేస్తుంటారు. అంతే ఆ పాట సినిమాను నిలబడుతుందన్న భ్రమ ఆ నిర్మాతలది. మొత్తం సినిమా దరిద్రం అయిపోయాక ఆ ఒక్క పాట సినిమాను నిలబెట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు కూడా తన పార్టీ మీదా ఆశ కోల్పోయి  బిక్కుబిక్కుమంటున్న పరిస్థితుల్లో రవి ప్రకాష్ అనే అవుట్ డేటెడ్ జర్నలిస్టును తీసుకొచ్చి నోటికొచ్చిన అంకెలు వేసి సర్వే అని విడుదల చేాశారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎవరికీ ఎక్కువ సీట్లు వస్తాయన్నది. ఎవరిపాలన బాగుందన్నది జనానికి తెలుసు. అలాంటిది ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చుని ఇష్టానుసారం అంకెలు వేసేసి ఇదే సర్వే అని జనాల్లోకి వదిలితే నమ్మే కాలం కాదని ఇలాంటి కుట్రదారులు తెలుసుకోవాలి. --సిమ్మాదిరప్పన్న-- 

IPL 2024: Punjab Kings Won The Toss And Elected To Bowl First, Here Are Playing XI Of Both Teams
IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్‌.. సీఎస్‌కే జట్టులో ఓ మార్పు

ఐపీఎల్‌లో ఇవాళ డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం సీఎస్‌కే ఒక మార్పు చేయగా.. పంజాబ్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించుతుంది. సీఎస్‌కే జట్టులో స్టార్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ స్థానంలో మిచెల్‌ సాంట్నర్‌ తుది జట్టులోకి వచ్చాడు.పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, రిలీ రోసౌ, శశాంక్ సింగ్, సామ్ కర్రన్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్‌), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండేసీఎస్‌కేకు చాలా కీలకం..ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే సీఎస్‌కే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. చెన్నై ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌తో కలిపి చెన్నై మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇతర జట్లతో పోటీ లేకుండా ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే చెన్నై ఇకపై ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది. చెన్నై మే 10న గుజరాత్‌, 12న రాజస్థాన్‌ రాయల్స్‌, 18న ఆర్సీబీతో తలపడాల్సి ఉంది.పంజాబ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్‌ ఈ మ్యాచ్‌తో పాటు తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది. టెక్నికల్‌గా పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్నప్పటికీ అనధికారికంగా కష్టమే అని చెప్పాలి. తదుపరి మ్యాచ్‌ల్లో పంజాబ్‌.. ఆర్సీబీ (మే 9), రాజస్థాన్‌ రాయల్స్‌ (మే 15), సన్‌రైజర్స్‌ (మే 19) జట్లను ఢీకొట్టాల్సి ఉంది.హెడ్‌ టు హెడ్‌ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. సీఎస్‌కే 15, పంజాబ్‌ 14 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు ఇదే సీజన్‌లో చివరిసారిగా తలపడ్డాయి. మే 1న జరిగిన ఆ మ్యాచ్‌లో పంజాబ్‌ సీఎస్‌కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  

CJI Chandrachud Shares He Was Caned with teacher In Class 5
స్కూల్‌లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్‌ జస్టిస్‌

ఖాట్మాండ్‌: పిల్లలను క్రమశిక్షణతో పెంచే క్రమంలో దండించడాన్ని ఈరోజుల్లో చాలా కఠిన పద్దతిగా భావిస్తున్నారు. అయితే కొన్ని దశాబ్దాల కింద పాఠశాలల్లో అందరూ ఉపాధ్యాయుల చేతిలో బెత్తం దెబ్బలు తిన్నావారే. అటువంటి చిన్ననాటి సంఘటనను భారత​ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్వయంగా పంచుకున్నారు. చిన్నతనంలో తాను ఓ చిన్న తప్పుకు బెత్తం దెబ్బలు తిన్నానని తెలిపారు. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేపాల్‌ పర్యటనలో భాగంగా ఖాట్మాండ్‌లో నిర్వహించిన ‘జువెనైల్ జస్టిస్’ అనే అంశానికి సంబంధించిన ఓ సెమినార్‌లో పాల్గోని మాట్లాడారు. ‘చిన్నారులతో మనం ప్రవర్తించే తీరు వారి మనసులో జీవితాంతం గుర్తుండిపోతుంది. నేను కూడా నా చిన్న తనంలో స్కూల్‌లో జరిగిన ఘటనను ఇప్పటికీ మర్చిపోలేదు. నా చేతులు బెత్తం దెబ్బలు తిన్న సమయంలో నేను ఏ నేరం చేయలేదు. క్రాఫ్ట్‌ నేర్చుకోవటంలో భాగంగా అసైన్‌మెంట్‌కు సరైన సూదిని తీసుకురాలేదు. దీంతో టీచర్‌తో బెత్తం దెబ్బలు తిన్నా. నా చెతులపై కొట్టవద్దని టీచర్‌ను  బతిమాలాడాను.  అయినా టీచర్‌ వినలేదు.బెత్తం దెబ్బ కారణంగా కుడి చేతికి అయిన చిన్న గాయం విషయాన్ని నా తల్లిదండ్రులకు పదిరోజుల పాటు చెప్పకుండా దాచిపెట్టాను. ఐదో తరగతిలో జరిగిన ఈ ఘటన సంబంధించి బెత్తం దెబ్బ భౌతికంగా అప్పుడే మానిపోయినప్పటికి దాని ప్రభావం నాపై చాలా పడింది. నేను ఏ పని చేసినా ఆ ఘటన గుర్తుకు వచ్చేది. చిన్నపిల్లల్లో ఇటువంటి ఘటనలు ప్రభవం వారి మనసుపై తీవ్రంగా ప్రభావం చూపుతాయి’ అని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ చెప్పారు.    

Ktr Counter To Revanth Reddy On Saree Comments
చీర కామెంట్స్‌... సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ స్ట్రాంగ్ కౌంటర్‌

సాక్షి,హైదరాబాద్‌: చీరకట్టుకొని జూబ్లీహిల్స్‌లో బస్‌ ఎక్కి టికెట్‌ తీస్కో.. హామీలు అమలవుతున్నయా.. లేదా చెప్పు అన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో కేటీఆర్‌ ఆదివారం(మే5) ట్వీట్‌ చేశారు. ‘చీర నువ్వు కట్టుకుంటావా లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా?తెలంగాణలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు నెలకు రూ.2500 ఏవి అని. వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెస్‌ని బొంద పెట్టేది కూడా తెలంగాణ ఆడబిడ్డలే. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం.కేసిఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్‌ కిట్‌ బంద్‌ అయింది. కళ్యాణ లక్ష్మి నిలిచింది.తులం బంగారం అడ్రస్ లేదు.ఫ్రీ బస్సు అని బిల్డప్,అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి.అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్‌కు మహిళల ఓట్లడిగే హక్కు లేదు. చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదు అని అందరికి తెలిసిపోయింది’ అని కేటీఆర్‌ రేవంత్‌కు చురకలంటించారు. 

AP Politics And Election Live Updates On May 5th
AP Election Updates May 5th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Andhra Pradesh Election Updates 5th May...04:50 PM, May 5th, 2024ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు ప్రయత్నిస్తున్నారు: సజ్జలచంద్రబాబు, రామోజీరావు వంటివాళ్లు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమలు కాకుండా రాక్షస ప్రయత్నం చేస్తున్నారుల్యాండ్‌ టైటిలింగ్‌  యాక్ట్‌  భూ మాఫియాకు ఊపిరాడకుండా చేస్తుందిప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం కావాలని 95 శాతం మంది కోరుకున్నారుసర్వే చేయించిన తర్వాతే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశఫెట్టాంపోలవరాన్ని సీఎం జగన్‌ పూర్తిచేసి చూపిస్తారు.. ఆ శక్తి ఉందికేంద్రం నిధులు సరిగ్గా ఇస్తే రెండేళ్ల కంటే ముందే పోలవరం పూర్తవుతుందిసీఎం జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ. 850 కోట్లు సేవ్‌ చేశారుపోలవరాన్ని చంద్రబాబు తన ఆదాయంగా మార్చుకున్నారని మోదీకి, అమిత్‌ షాకు తెలుసుకావాలంటే కేంద్ర ప్రభుత్వం లెక్కలు చూసుకోవాలిఏ  బ్యాంకు లెక్కలు తీసినా తెలుస్తుందికూటమిలో పార్ట్నర్‌ కాబట్టి అమిత్‌ షా ఏదో మాట్లాడారుచంద్రబాబు అవినీతిని చూసి సహించలేకే జనం తిరస్కరించారుపోలవరం ప్రాజెక్ట్‌ చంద్రబాబకు ఏటీఎం అని ఆనాడు మోదీ విమర్శించారు 04:30 PM, May 5th, 2024కాకినాడ:అధికారం కోసం ప్రజలను మోసం చేయాలన్న ఆశతో చంద్రబాబు ఉన్నాడు: ఎమ్మెల్యే ద్వారంపూడి పొత్తులో ఉన్న బీజేపీ పార్టీయే చంద్రబాబును నమ్మడం లేదుకాకినాడ పోర్టులో ఏది ఎగుమతి అవుతుందో చంద్రబాబుకు తెలియదా?కాకినాడ పేరుకు దేశంలో మంచి పేరు ఉంది2014 ఎన్నికల కు ముందు అప్పులు పాలైనపోయిన వ్యక్తి..మాజీ ఎమ్మెల్యే కొండబాబు.2019 నాటికి అవినీతితో ఆస్తులు  సంపాదించుకున్న వ్యక్తి కొండబాబుక్రికెట్ బుకీలో దిట్ట మీ కూటమీ ఎంపీ అభ్యర్ధి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ఒక సెంటు నేను కాకినాడలో కబ్జా చేశానని నిరూపిస్తే.. నా ఆస్ధి ప్రజలకు రాసిచ్చేస్తానుకొండబాబు అనే వ్యక్తి ఎమ్మెల్యే గా వస్తే మళ్ళీ కాకినాడలో గంజాయి , కబ్జాలు ,అవినీతి పెరిగిపోతుందిరూ.1,000 కోట్లు ఓఎన్జీసి నా ఎకౌంట్ లో నష్టపరిహారం సొమ్ములు వేసిందని మత్స్యకారులకు కొండబాబు మాయ మాటలు చెబుతున్నారు.ఓఎన్జీసి నుండి సమాచార హక్కు క్రింద సమాచారం తీసుకున్నాను. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానుఅలాగే దీనిపై కొండబాబుపై పరువు నష్ట దావా వేస్తున్నాను04:15 PM, May 5th, 2024తాడేపల్లిల్యాండ్ టైటిల్ యాక్ట్‌ని కేంద్ర ప్రభుత్వమే తీసుకువచ్చింది: ఎమ్మెల్యే  టీజేఆర్ సుధాకర్ బాబుఏపీలో 6 వేల పంచాయతీలలో భూ సర్వే జరిగింది.చంద్రబాబు,పవన్ కి ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు.వందల ఎకరాలు రామోజీ రావు ఫిల్మ్ సిటీ కోసం అక్రమంగా దోచుకున్నాడు.31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు జగన్.ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవుఏపీలో బీజేపీ కేంద్ర నాయకులు పర్యటన చేస్తున్నారుఈ యాక్టును అమలు చేయనివ్వద్దొని కేంద్ర పెద్దలను అడిగే దమ్ము చంద్రబాబు, పవన్ కి ఉందా?పురేందేశ్వరి ఈ యాక్టు కరెక్టే అని అన్నారు.పోలవరం గురించి మాట్లాడటానికి బీజేపీ నాయకులకి సిగ్గు ఉండాలిపోలవరం డబ్బును ఎటిఎంలా చంద్రబాబు వాడుకున్నాడని మోదీనే గతంలో అన్నారు 03:30 PM, May 5th, 2024చిత్తూరు జిల్లా:చిత్తూరులో పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారువిజయానంద రెడ్డి, చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొనుగోలుకు నగదు పంచుతున్న ఇద్దరినీ పట్టుకుని వన్ టౌన్ లో  లక్షన్నర నగదుతో అప్పగిస్తే వదిలేశారుఅందుకే స్టేషన్ ముందు అర్ధనగ్న నిరసన చేస్తున్నా500 మంది బెంగుళూరు,,అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ తిష్ట వేసి మద్యం, నగదు పంపిణీ చేస్తున్నారుపోలీసులు పట్టించుకోవడం లేదు 02:20 PM, May 5th, 2024తాడేపల్లి :,భూ సంస్కరణలను జగన్ తెస్తుంటే చంద్రబాబు, పవన్ భయపడితున్నారు: రావెల కిషోర్ బాబువారు ఆక్రమించుకున్న భూముల చిట్టా ఎక్కడ బయట పడుతుందోనని భయపడుతున్నారుమోదీ తెచ్చిన ఈ చట్టాన్ని కూటమిలోని చంద్రబాబు వద్దంటున్నారుదీనిపై మోదీ మాట్లాడాలి, నోరు విప్పాలిలేదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి మోదీ తెస్తున్న చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించాలిజనం ఛీ కొడుతున్నా చంద్రబాబు, పవన్ ఇంకా అసత్యాలు ప్రచారం చేస్తున్నారుప్రజలు తిరుగుబాటు చేస్తున్నా పట్టించుకోవడం లేదుప్రజల్ని తప్పుదారి పట్టించి రాజకీయంగా లబ్ది పొందాలని చంద్రబాబు కుట్ర పన్నారుపేదలకు భూములు పంచే వ్యక్తి సీఎం జగన్ఆసైన్డు ల్యాండ్ మీద హక్కులు కల్పించిన ఘనత జగన్‌దిచుక్కల భూమి సమస్యలను పరిష్కరించినది జగన్అలాంటి వ్యక్తి గురించి చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారుటీడీపీ ఐవిఆర్ఎస్ కాల్స్ పై సీఐడీ విచారణ చేస్తోందితప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు01:42 PM, May 5th, 2024ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్‌.. టీడీపీ ఫేక్‌ ప్రచారంపై సీఐడీ విచారణచంద్రబాబు ఏ1గా, లోకేష్‌ ఏ2గా ఎఫ్‌ఐఆర్ నమోదుల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో టీడీపీ దుష్ప్రచారంటీడీపీ అసత్య ప్రచారంపై   ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుఈసీ ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీఐడీచంద్రబాబు, లోకేష్‌తో పాటు 10 మందిపై కేసు నమోదుఐవీఆర్ఎస్‌ కాల్స్‌ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదు12:15 PM, May 5th, 2024చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు40 ఏళ్ల సీనియారిటీ అని చెప్పే చంద్రబాబుకి ఉన్న కన్ఫ్యూజన్ ఎవరికి లేదుల్యాండ్ టైటిలింగ్ మాట్లాడుతున్న బాబు.. ఆ చట్టం తీసుకొచ్చింది బీజేపీనే అనే సంగతి మరిచాడా ?సభల్లో వైఎస్సార్‌సీపీపై మాట్లాడుతున్న బాబు.. బీజేపీ గురించి ఎందుకు మాట్లాడం లేదుబీజేపీతో జోడి కట్టి ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తానంటే మోసం కదా?నాడు మోదీని తిట్టిన బాబు నేడు పొగుడుతున్నారు.. 4ఏళ్లలో మోదీ ఏం చేశాడో చెప్పాలిమోదీ రాష్టానికి చేసిన మేలు ఏంటో బాబు చెప్పాలికూటమి మ్యానిఫెస్టో విడుదలలో పురందేశ్వరి ఎందుకు లేదుకూటమి మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ నేతలు చెప్పడం దేనికి సంకేతంఅవకాశవాదం, స్వార్థంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు10:59 AM, May 5th, 2024సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్‌ వైఎస్‌ వివేకా హత్య కేసులో ఛార్జ్‌షీట్‌ తీసుకుని రండి..బహిరంగ చర్చకు సిద్ధమా.. ఎక్కడికైనా వస్తాఈ నెల 11 లోపు తన సవాల్‌పై స్పందించాలిషర్మిల స్పష్టంగా తెలుసుకుని వాస్తవాలు మాట్లాడాలినాడు షర్మిలను పాదయాత్ర చేయమని ఎవరూ అడగలేదువైఎస్‌ సోదరి విమలమ్మ మీ వెంట ఎందుకు లేరు?వైఎస్‌ సోదరులు సైతం మీకు మద్దతు ఇవ్వడం లేదువివేకా మృతి తర్వాత ఎన్నిసార్లు ఆయన సమాధి వద్దకు వెళ్లారుషర్మిల దుర్మార్గపు పనులు చేస్తున్నారు కాబట్టే.. కుటుంబం నుంచి కూడా ఆమెకు మద్దతు లేదురూ.వెయ్యి కోట్ల పని చేయనందుకే షర్మిల వ్యతిరేకంగా మారిందివైఎస్‌ పేరును చెడ్డగొట్టడానికి షర్మిల కుట్రలు చేస్తోందిసీఎం జగన్‌, పొన్నవోలుపై షర్మిల వ్యాఖ్యలు సరికాదుషర్మిల ప్రచారానికి స్పందన లేక ఫ్రస్ట్రేషన్‌కు గురవుతుంది. బాబు, పవన్‌ స్క్రిప్ట్‌ షర్మిల చదువుతుందివైఎస్‌ విజయమ్మ మాట పెడచెవిన పెట్టినప్పుడే షర్మిల అంశం ముగిసిందిషర్మిల మోసాలు, అక్రమాలు బయట పెట్టడానికి నేను ఒక్కడిని చాలుతెలంగాణలో షర్మిల వందల కుటుంబాలను మోసం చేశారు. జగన్‌, షర్మిల పెళ్లికి చంద్రబాబును వైఎస్‌ పిలిచారన్నది అబద్ధంబాబు ఆడుతున్న ఆటలో షర్మిల పాచిక అయిందివైఎస్‌ జగన్‌కు అద్ధం చూపడం దుర్మార్గంఒకసారి ఇంటికి వెళ్లి ఆ అద్ధంలో మీ ముఖం చూసుకోండి తెలంగాణలో ఏం మాట్లాడారు. ఏపీలో మాట్లాడారో ఒకసారి చూసుకోండిషర్మిలకు పిచ్చి ముదిరి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది10:59 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌పై బాబు, పవన్ విష ప్రచారం: ఎమ్మెల్యే మల్లాది విష్ణుప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారుఐవీఆర్ఎల్ సర్వేలో తప్పుడు ప్రచారం చేస్తున్నారుమా ఫిర్యాదు పై ఈసీ స్పందించింది చర్యలకు సీఐడీకి సిఫారసు చేసిందిప్రజల భూమికి భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయంసీఎం జగన్‌ను ఎదుర్కోలేక బాబు, పవన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు ఆపకపోతే క్రిమినల్ చర్యలు తప్పవుల్యాండ్ టైటిల్ యాక్ట్ మేం తెచ్చింది కాదునీతి ఆయోగ్ ద్వారా కేంద్రమే అన్ని రాష్ట్రాలకు సూచించింది టీడీపీ, జనసేన నేతలు మాట్లాడుతుంటే ఏపీ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు?కేంద్రం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ బీజేపీ శాఖ ఎందుకు నోరుమూసుకుంది? ఏపీల  ప్రచారానికి వస్తున్న మోదీ, అమిత్ షా సభల్లో చెప్పాలి10:51 AM, May 5th, 2024ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలుల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌పై కొన్ని పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయిభూ రికార్డుల డిజిటలైజేషన్‌తో సమస్యల పరిష్కరించడానికి ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారు.ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌తో ప్రజల ఆస్తులు లాగేసుకుంటారంటూ కావాలనే కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయిల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్ గురించి తెలియకపోతే మమ్మల్ని అడిగితే చెప్పేవాళ్లంఎన్నికల్లో మాతో భాగస్వామ్యం ఉన్న పార్టీలు ఇలా తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదుల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్ ఇతర రాష్ట్రాల్లో అమలవుతుందిఎలా అయినా గెలవాలన్న ఆలోచనతో ప్రజలను భయభ్రాంతులను చేయడం మంచిది కాదుఈ దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్ కూడా సీఐడీ దర్యాప్తు వేసిందిజనసేన, తెలుగుదేశం మేనిఫెస్టో మాకు సంబంధం లేదుచంద్రబాబు చెప్తున్నా సూపర్ సిక్స్ కోసం చాలా డబ్బులు కావాలిచంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిఆయన వాటిని అమలు చేయకపోతే ఆ నెపం మా పైకి వస్తుందిఅందుకే.. జనసేన, తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు8:56 AM, May 5th, 2024నేడు ఏపీకి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌ రాకశ్రీసత్యసా­యి జిల్లా ధర్మవరం పట్టణం బత్తలపల్లి రోడ్డులోని సీఎన్‌బీ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఎన్ని­క­ల ప్రచార బహిరంగ సభలో ప్రసంగించనున్న అమిత్‌షావైఎ­స్సా­ర్‌ జిల్లా జమ్మలమడుగు, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచా­ర సభల్లో పాల్గొననున్న రాజ్‌నాథ్‌ సింగ్‌ 8:51 AM, May 5th, 2024అవన్నీ అపోహలేల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంతో భూములకు మరింత రక్షణఈ చట్టం అమల్లోకి వస్తే భూములు, ఆస్తులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుందిఅన్ని పత్రాలూ యజమానుల వద్దే ఉంటాయి.. ప్రభుత్వం వద్ద కేవలం రికార్డులేఈ చట్టం కోర్టు ద్వారాలు మూసేయదు.. కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తుందిహక్కుల నిరూపణకు ఇప్పుడున్న చట్టాలు అంతిమ సాక్ష్యాలు కావుఅందుకే ఈ చట్టం అవసరమవుతోందిభూచట్టాల నిపుణుడు, నల్సార్‌ ప్రొఫెసర్‌ ఎం. సునీల్‌కుమార్‌7:37 AM, May 5th, 2024జనం.. జనం.. ప్రభంజనంసీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచార సభలకు పోటెత్తిన ప్రజానీకంహిందూపురంలో 43 డిగ్రీల ఎండనూ లెక్కచేయని జనంనియోజకవర్గ చరిత్రలో ఏ నాయకుడికి లేని రీతిలో బ్రహ్మరథంఈసారి హిందూపురం వైఎస్సార్‌సీపీదే అంటున్న రాజకీయ పరిశీలకులుపలమనేరులో వర్షాన్ని కూడా లెక్క చేయని ప్రజలునెల్లూరులో జననీరాజనం 7:25 AM, May 5th, 2024ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం వ్యవహారం.. టీడీపీపై ఈసీ కొరడాదుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తుప్రజలను భయాందోళనలకు గురిచేయడంపై ఈసీ సీరియస్‌ ఎన్నికల నిబంధనలకు పాతరేస్తున్నారని మండిపాటు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న కమిషన్‌తక్షణం దీనిపై దర్యాప్తుచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం7:16 AM, May 5th, 2024కళ్లు గద్దెపై.. బుద్ధి భూమిలోల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై బరితెగించి అబద్ధాలులేని వ్యక్తులకు అన్యాయం జరిగిందంటూ రామోజీ ఆక్రోశం కల్పిత పాత్రలను సృష్టించి, ఏదో జరిగిపోయిందని ఆక్రందనరిజిస్టరే లేనపుడు అందులో కొందరి పేర్లు లేకపోవటం సాధ్యమా?చట్టం దేవుడెరుగు... చట్టానికి సంబంధించిన రూల్సే రాలేదని తెలీదా?రూల్స్‌ వచ్చాక.. వాటిపై సమగ్ర చర్చ జరిగిన తరవాతే తుది రూపుపైపెచ్చు రీసర్వే పూర్తయ్యాకే ఈ చట్టాన్ని అమలు చేయటం సాధ్యంఇప్పటికి 4 వేల గ్రామాల్లోనే రీ సర్వే పూర్తి.. ఇంకా 13 వేల గ్రామాల్లో పెండింగ్‌అది పూర్తయి.. రూల్స్‌ ఖరారయ్యాక కదా చట్టం అమలు గురించి మాట్లాడేది..అయినా అన్ని రాష్ట్రాలనూ అమలు చేయమంటున్నది కేంద్రమే కదా!అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తేనే... ఇక్కడా చేస్తామని చెబుతున్న రాష్ట్రంమోదీ ముందు తల ఊపి.. బయట మాత్రం విష ప్రచారం చేస్తున్న బాబుబాబునెవరూ నమ్మటం లేదని గ్రహించి... మారీచుడి పాత్రలోకి రామోజీజనాన్ని భయపెట్టడానికి అబద్ధాలే అ్రస్తాలుగా మాయా యుద్ధంపోలింగ్‌ వరకూ ఈ ఒక్క అంశంమీదే మాట్లాడాలని ‘ఎల్లో’ తాఖీదుమిగతావన్నీ పక్కనబెట్టి విస్తృతంగా విష ప్రచారం చేస్తున్న పచ్చ మంద7:14 AM, May 5th, 2024బాబుకు భంగపాటు.. బెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంబెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించేందుకు కుతంత్రంలబ్ధిదారుల నమోదు పేరిట కుట్రఓటర్ల జాబితా వివరాల దుర్వినియోగంతీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్‌ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక7:12 AM, May 5th, 2024లాక్కునేవి కాదు..ఇచ్చే చేతులివి..నిషేధిత జాబితా నుంచి 35 లక్షల ఎకరాల తొలగింపుసీఎం జగన్‌ సంస్కరణలతో ‘రెవెన్యూ’లో సులభమైన పాలన  వందల ఏళ్ల నాటి చిక్కుముళ్లకు పరిష్కారంచుక్కల భూములు, సర్విస్‌ ఈనాం, షరతుల గల పట్టా భూములకు విముక్తి27.41 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులులంక భూములకు అసైన్‌మెంట్‌ పట్టాలుకుప్పలు తెప్పలుగా ఉన్న రెవెన్యూ సమస్యలన్నింటికీ పరిష్కారంనిరుపేదలకు 46 వేల ఎకరాల భూముల పంపిణీ  శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం 951 ఎకరాలుకొత్త రిజిస్ట్రేషన్ల విధానం.. ఆటో మ్యుటేషన్‌చరిత్ర సృష్టించిన 30.61 లక్షల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్‌  రెవెన్యూ శాఖ స్వరూపాన్ని మార్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం  అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు6:59 AM, May 5th, 2024మళ్లీ దోపిడీకి తెరపైకి..మాజీ ఎమ్మెల్యే అరాచకాలెన్నో!గోబెల్స్‌ ప్రచారంలో చంద్రబాబుకు తమ్ముడు   వక్ఫ్‌ ఆస్తులు చెరబట్టి దోచేసిన ఘనుడుటిప్పు షాపింగ్‌ కాంప్లెక్స్‌ కేటాయింపులో చేతివాటంప్రతి పనికీ రేటుగట్టి వసూలు చేసిన చరిత్ర  బెదిరింపులు, దౌర్జన్యాలు షరామామూలేఏకంగా పది క్రిమినల్‌ కేసులు 6:56 AM, May 5th, 2024మీ భూమికి భద్రత.. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్‌చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటుమీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ..రిజిస్ట్రేషన్‌ తర్వాత రైతులకే డాక్యుమెంట్లుఅన్నదాతలు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదుభూ తగాదాలకు శాశ్వత పరిష్కారంగా వందేళ్ల తర్వాత రీసర్వేపేదలకు భూములిచ్చేది జగన్‌.. లాక్కునేది చంద్రబాబే

మధ్యాహ్నం 12 గంటలకు.. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో నిర్వహించిన సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభకు మండుటెండను సైతం లెక్కచేయకుండా హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం
మీ భూమికి భద్రత.. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్‌

సాక్షి, పుట్టపర్తి: ‘చంద్రబాబునాయుడు అవగాహన రాహిత్యంతో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై అబద్ధాలు వల్లించడం సిగ్గుచేటు. జగన్‌ భూములు లాక్కుంటున్నాడంటూ దుష్ప్రచారం చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. పేదలకు భూములిచ్చేది జగన్‌ అయితే.. లాక్కునేది చంద్రబాబు అనే విషయం అందరికీ తెలుసు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌తో రైతులు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వందేళ్ల తర్వాత భూముల రీ సర్వే చేపట్టాం. రైతుల భూముల భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఎలాంటి వివాదం లేని టైటిల్స్‌ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలన్నదే మీ బిడ్డ లక్ష్యం. అందుకనే టైటిల్‌ ఇన్సూరెన్స్‌ కూడా చేస్తున్నాం. రిజిస్ట్రేషన్‌ తర్వాత రైతులకే డాక్యుమెంట్లు అందజేస్తాం. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడటం దుర్మార్గం’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శ్రీసత్య­సాయి జిల్లా హిందూపురంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌­లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ప్రచారంలో ఉన్న అపోహలను తొలగిస్తూ స్పష్టతనిచ్చారు.రిజిస్ట్రేషన్లపైనా చంద్రబాబు బురదరిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ఫిజికల్‌ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయ్యా చంద్రబాబూ..! ఇప్పటివరకు ఏకంగా 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. దేశ­వ్యాప్తంగా అమల­వుతున్న కార్డ్‌ 2 సాఫ్ట్‌వేర్‌ ద్వారా తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్లు చేయడమే కాకుండా ఆ తర్వాత డాక్యుమెంట్లు అన్నీ భూ యజ­మా­నులకే ఇచ్చాం.  దీన్ని మరింత సులభతరం చేస్తూ.. ఏ ఒక్కరికీ సమస్య ఉండకూడదని, పత్రాలు రాసుకునే­టప్పుడు తప్పులు ఉండకూడదని ఆ ఫార్మాట్‌ కూడా ఆన్‌లైన్‌లో అందు­బా­టులో ఉంచాం. ఎవరైనా అమ్మాలను­కున్నా, కొనాలనుకున్నా ఆ ఫార్మాట్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలు నింపి డాక్యు­మెంట్లతో వెళితే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల­యం­లో వేలి ముద్రలు లాంటి మిగతా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ పూర్తి అయిన తర్వాత ఫిజికల్‌ డాక్యుమెంట్లు రైతులకే ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతోందని చంద్రబాబు తెలుసుకోవాలి.  పెద్ద సంస్కరణ అవుతుంది..ఎన్నికల వేళ చంద్రబాబు యథేచ్ఛగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై అవగాహన లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. టీడీపీ నాయకులు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా మీ ఇళ్లకు ఫోన్లు చేసి మీ భూములన్నీ జగన్‌ లాక్కుంటాడంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా? మీ జగన్‌ భూములిచ్చేవాడే కానీ భూములు లాక్కునే వాడు కాదు. నీకు ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అంటే తెలుసా చంద్రబాబూ? ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు ఎల్లవేళలా రైతన్నలకు ఉండేటట్లు చేయడమే. చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ యాక్ట్‌ రాబోయే రోజుల్లో పెద్ద సంస్కరణ అవుతుంది. ఈరోజు ఎక్కడ భూమి కొనుగోలు చేయాలన్నా వివాదాలు తలెత్తుతు­న్నాయి. విస్తీర్ణం తక్కువ ఉండటం, సబ్‌ డివి­జన్,  సర్వే జరగకపోవడం, రికార్డులు అప్‌డేట్‌ కాకపోవడం తదితర సమస్యలు ఉత్పన్నమవు­తున్నాయి. వీటన్నింటి కారణంగా భూ వివాదాలు పెరిగి రైతన్నలు, ప్రజలు కోర్టులు, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.వివాదాలు లేకుండా.. టైటిల్‌ ఇన్సూరెన్స్‌రాబోయే రోజుల్లో ఏ రైతూ, ఏ ఒక్కరూ వాళ్ల భూములు కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదు. భూ వివాదాలకు సంబంధించి ఏ కోర్టుకూ వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ఆ భూముల మీద వారికి సంపూ­ర్ణ హక్కులు కల్పిస్తూ వాటిపై ఏవైనా వివాదాలు ఉంటే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఆ భూముల మీద ఎలాంటి వివాదం లేదని గ్యారంటీ ఇస్తూ ఒక సంస్కరణ తేవాలన్నదే మీ జగన్‌ ఆలోచన. అందుకనే టైటిల్‌ ఇన్సూరెన్స్‌ కూడా చేస్తున్నాం. ఎలాంటి వివాదం లేని టైటిల్స్‌ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాలన్నదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలంటే మొదట రాష్ట్రవ్యాప్తంగా జరుగు­తున్న సర్వే పూర్తి కావాలి. దేశంలో వందేళ్ల క్రితం ఆంగ్లేయుల హయాంలో భూముల సర్వే చేశారు. రైతుల కోసం ఈ రోజు మళ్లీ ప్రతి ఎకరా రీ సర్వే చేస్తున్నాం. 15 వేల మంది సర్వేయర్లను నియమించాం. ఉచితంగా సరిహద్దు రాళ్లను నాటి రికార్డులన్నీ అప్‌డేట్‌ చేస్తున్నాం. సబ్‌ డివిజన్‌ చేసి ఆ హక్కు పత్రా­లను పదిలంగా రైతన్నలకు అంద­చేస్తున్నాం. రాష్ట్రంలో 17 వేలకు పైగా రెవెన్యూ గ్రామాలకు­గానూ ఇప్పటివరకు 6 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయ్యింది. మిగతా చోట్ల ఒకటిన్నర, రెండేళ్లలో సర్వే పూర్తవుతుంది. 

Kovai Sarala Didn't Go To Her Father Funeral, Here The Reason
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్‌

కోవై సరళ.. ఈ పేరు చెప్పగానే తెలుగు సినీ ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఈ మధ్యకాలంలో ఆమె తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు కానీ.. ఒకప్పుడు ఏ సినిమా రిలీజైన అందులో కోవై సరళ ఉండాల్సిందే. బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్‌లో వచ్చే కామెడీని ఇష్టపడని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అలాగే పలు సినిమాల్లో కమెడియన్‌ అలీకి జోడిగా నటించి నవ్వులు పూయించింది.చాలా కాలం తర్వాత ఈ సీనియర్‌ నటి బాక్‌ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మే3న ప్రేక్షులకు ముందుకు వచ్చింది. ఇందులో హీరోకి మేనత్తగా నటించిన కోవై సరళ.. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించింది.ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన కోవై సరళ.. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఓ షోలో పాల్గొని తన పర్సనల్‌ లైఫ్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఒకప్పుడు కోయంబత్తూరుని షార్ట్‌కట్‌లో కోవై అని పిలిచేవారట. సరళ కోయంబత్తూరులోనే ఉండడంతో.. కోవై సరళ అని పిలవడం మొదలు పెట్టారట. అలా తనపేరు ఇండస్ట్రీలో కోవై సరళగా మారిందని ఈ స్టార్‌ కమెడిన్‌ చెప్పుకొచ్చింది. ఇక తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్‌ అయింది. ‘నాకు నలుగురు సిస్టర్స్‌, ఒక బ్రదర్‌ ఉన్నాడు. అప్పట్లో నేను వరుస సినిమాలతో బిజీగా ఉండేదాన్ని. ఓ సినిమా షూటింగ్‌ కోసం ఊటీకి వెళ్లగా.. మా నాన్నగారు చనిపోయారనే విషయం తెలిసింది. అక్కడ ఓ పాట షూటింగ్‌ జరుగుతోంది. అందరూ వచ్చారు. ఆ పాటలో నేను బ్యాండ్‌ కొడుతూ సందడి చేయాలి. నాన్న మరణ వార్త తెలిసినా నేను ఆ పాటకు డ్యాన్స్‌ చేశా. ఎందుకంటే అది చిన్న ప్రొడక్షన్‌. ఆర్టిస్టులంతా వచ్చారు. నేను వెళ్లిపోతే షూటింగ్‌ క్యాన్సిల్‌ చేయాల్సివస్తుంది. దాని వల్ల నిర్మాతకు చాలా నష్టం వస్తుంది. అందుకే ఆ పాట షూటింగ్‌ కంప్లీట్‌ చేసి వెళ్లాను. మా నాన్నగారిని చివరి చూపు చూసుకోలేకపోయాను. బంధువులంతా నన్ను విమర్శించారు. నాన్న కంటే డబ్బులే ముఖ్యమని తిట్టుకున్నారు. అసలు విషయం వాళ్లకు తెలియదు’ అంటూ కోవై సరళ ఎమోషనల్‌ అయింది.  

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all