Top Stories
ప్రధాన వార్తలు
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
సాక్షి, నెల్లూరు జిల్లా: ‘‘నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. ఓ వైపు ఎన్డీఏలో కొనసాగుతూ మరో వైపు మైనార్టీలపై దొంగప్రేమ కురిపిస్తున్నాడు’’ అంటూ చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మైనార్టీలకు ఎప్పటికీ అండగా ఉంటా.. తాము 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.‘‘వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా?. ఆరునూరైనా ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ముస్లింలకు మత ప్రాతిపదికన 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదు. వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇవి. మళ్లీ ముస్లింల కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడు. చంద్రబాబు ఓ ముదిరిపోయిన తొండ. ఇది కాదా ఊసరవెల్లి రాజకీయం, ముస్లిం రిజర్వేషన్లకు చంద్రబాబు కట్టుబడి ఉన్నారా?’’ అంటూ సీఎం జగన్ నిలదీశారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయని.. మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుందని సీఎం అన్నారు. బాబు మోసాలకు ఓడించేందుకు మీరంతా సిద్ధమా అంటూ పిలుపునిచ్చారు. లంచాలు, వివక్ష లేకుండా బటన్ నొక్కి డబ్బులు జమ చేస్తున్నాం. జగన్ పాలనలో అభివృద్ధి లేదని విష ప్రచారం చేస్తున్నారు.’’ అని సీఎం జగన్ ధ్వజమెత్తారు.‘‘కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం, ఇది కాదా అభివృద్ధి?. కొత్త 4 పోర్టులు నిర్మిస్తున్నాం, ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం.. ఇది కాదా అభివృద్ధి?. పిల్లలకు ట్యాబులు ఇస్తారని ఎవరైనా ఊహించారా?. క్వాలిటీ చదువులు అభివృద్ధి కాదా?. ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్. 14 ఏళ్లలో ఏరోజైనా ఇలాంటి అభివృద్ధి చేశారా?. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్తూ గ్రామ, వార్డు సచివాలయాలు. రైతులకు అండగా ఆర్బీకే వ్యవస్థను నెలకొల్పాం. ఉద్ధానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించాం. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం’’ అని సీఎం చెప్పారు.‘‘వెలిగొండలో రెండు టన్నెళ్లు పూర్తి చేశాం. ప్రకాశం జిల్లాకు నీళ్లు తరలిస్తాం. వెలిగొండ, శ్రీశైలం నుంచి నీళ్లు రాక ఫ్లోరైడ్‌తో జనం ఇబ్బంది పడుతుంటే ఏనాడైనా చంద్రబాబు పట్టించుకున్నాడా?. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్‌వన్‌గా నిలిచాం. మా పాలనలో రూ. 2లక్షల 70వేలు కోట్లను ప్రజల ఖాతాల్లో వేశాం. ఎంఎస్ఎంఈలకు తోడుగా ఉన్నాం. చంద్రబాబు హయాంలో రూ.32 వేల కోట్లు పెట్టబడులు వస్తే.. మీ బిడ్డ జగన్ హయాంలో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఈ అభివృద్ధి అంతా చంద్రబాబుకు కనిపించడం లేదా?’’ అంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు.
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
బెంగళూరు: మహిళ కిడ్నాప్, లైంగిక ఆరోపణల కేసులో కర్ణాటక మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణను బెంగళూరు పోలీసులు శనివారం(మే4) అరెస్టు చేశారు. రేవణ్ణ తన తండ్రి మాజీ ప్రధాని దేవెగౌడ నివాసంలో ఉండగా పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. కిడ్నాప్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని రేవణ్ణ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు కోర్టు తిరస్కరించిన గంటల వ్యవధిలోనే పోలీసులు రేవణ్ణను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ సంచలనం రేపిన సెక్స్ వీడియోల స్కాండల్ కేసులో కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణతో పాటు రేవణ్ణ కూడా నిందితుడిగా ఉన్నారు. కాగా, ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఈయనపై సెక్స్ స్కాండల్ కేసులో పోలీసులు ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
సాక్షి, విజయవాడ: టీడీపీపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నిరాధార ఆరోపణలు చేస్తోంది. దీనిపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.. విచారణకు సీఐడీని ఆదేశించింది. తక్షణమే నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.మా ఫిర్యాదుపై ఈసీ స్పందించింది: ఎమ్మెల్యే మల్లాది విష్ణుమార్కాపురం, ఒంగోలు సభల్లో సీఎం జగన్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబుకు జగన్‌పై అసూయ తారా స్థాయికి చేరిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై బాబు అండ్ కో విషం చిమ్ముతోంది. ఐటీడీపీ సైట్లో విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ విలువలు, విశ్వసనీయత కోల్పోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎల్ సర్వేలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. చర్యలకు సీఐడీకి సిఫారసు చేసింది. చంద్రబాబు, పవన్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’’ అని విష్ణు కోరారు.ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బాబు, పవన్ దుష్ప్రచారం: మనోహర్ రెడ్డిల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న విషప్రచారంపై ఈసీకి ఫిర్యాదు చేశామని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారు. భూ వివాదాల పరిష్కారం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మోదీ సభలో మాట్లాడే ధైర్యం బాబు, పవన్‌లకు ఉందా?. అబద్దాల ప్రచారానికి టీడీపీకి ఓ యూనివర్సిటీ నే ఉంది’’ అని మనోహర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.కాగా, అమల్లో లేని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లను తప్పుదారి పట్టిస్తోంది. ఇది ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధం. టీడీపీపై తగిన చర్యలు తీసుకోండి’ అని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదుతో పాటు తగిన ఆధారాలను అందజేశారు.
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ ఆరోపణలపై విచారణ కోసం తమ ముందు హాజరు కావాలని నలుగురు రాజ్‌భవన్ ఉద్యోగులకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సెట్)సమన్లు జారీ చేసింది. ఇంతేకాకుండా రాజ్‌భవన్‌లోని సీసీటీవీ వీడియోలను తమకు ఇవ్వాలని సెట్ అక్కడి అధికారులను కోరింది. ‘గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. ఈ బృందం రానున్న రోజుల్లో కొందరు సాక్షులను విచారించనుంది.లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కొన్ని వీడియోలు కావాలని రాజ్‌భవన్‌ను ఇప్పటికే కోరాం’అని ఒక పోలీసు అధికారి చెప్పారు. కాగా, రాజ్‌భవన్‌లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి గవర్నర్‌పై రాతపూర్వక ఫిర్యాదు చేసింది. తనను గవర్నర్ సివి ఆనంద్‌బోస్ లైంగిక వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొంది.అయితే గవర్నర్‌కు రాజ్యాంగపరమైన రక్షణ ఉండటం వల్ల పోలీసులు, కోర్టులు క్రిమినల్ చర్యలు ప్రారంభించడానికి వీలు లేదు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని గవర్నర్ స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లోకి పోలీసులను రానివ్వద్దని సిబ్బందికి ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు.
దుమ్మురేపుతున్న ‘హీరామండి’.. భన్సాలీకి భారీ రెమ్యునరేషన్?
బాలీవుడ్లో భారీ చిత్రాలకు కేరాఫ్ సంజయ్ లీలా భన్సాలీ. ఆయన సినిమాలన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. ఎంత భారీగా ఖర్చు చేస్తాడో అంతకు మించిన కలెక్షన్స్‌ను రాబడతాడు. అందుకు ఆయన తెరెక్కించిన ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలే నిదర్శనం. తాజాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెటిఫిక్స్‌లో ఈ భారీ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో ఈ వెబ్ సిరీస్‌ని తెరకెక్కించాడు భన్సాలీ. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల లాంటి భారీ తారాగణంతో పిరియాడిక్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించాడు.(చదవండి: 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ) స్వాతంత్య్రానికి పూర్వం ‘హీరామండి’ వేశ్యా వాటికలో చోటు చేసుకున్న పలు సంఘటనల ఆధారంగా తెరక్కించిన ఈ వెబ్ సీరిస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకెళ్తోంది. భన్సాలీ మేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సిరీస్ కోసం భన్సాలీ చాలా కాలంపాటు కష్టపడ్డారు. అందుకు తగ్గట్టే నెట్‌ఫ్లిక్స్ భారీ రెమ్యునేరేషన్ ఇచ్చిందట. ఈ వెబ్ సిరీస్ కోసం భన్సాలీ దాదాపు రూ. 70 కోట్ల వరకు పారితోషికంగా తీసుకున్నట్లు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన ఆరుగురు హీరోయిన్లకు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందింట. ఈ సిరీస్‌లో ఫరిదాన్ పాత్రను పోషించిన సోనాక్షి సిన్హాకు అత్యధికంగా రూ. 2 కోట్ల పారితోషికంగా అప్పగించిందట నెట్ఫిక్స్. అలాగే మల్లికా జాన్ పాత్రలో నటించిన మనిషా కొయిరాలాకి కోటి రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మరో కీలక పాత్రను అదితిరావు హైదరి పోషించింది. ఇందుకుగాను ఆమె రూ. కోటిన్నర వరకు తీసుకుందట. అలాగే లజ్జోగా నటించిన రిచా చంద్దా రూ. 1 కోటి, వహిదాగా నటించిన సంజీదా షేక్ రూ. 40 లక్షలు, ఆలంజేబుగా నటించిన షర్మిన్ సెగల్ రూ. 35 లక్షలు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
నాకు జాబ్ ఇవ్వండి.. నేనే రూ.40 వేలిస్తా!
ఓ వ్యక్తి చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం చేయాలని అనుకుంటాడు. అయితే చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగం రావడం అనేది ప్రస్తుత కాలంలో అసాధ్యమైపోతోంది. దీంతో కొందరు సొంతంగా బిజినెస్ చేస్తుంటే.. మరికొందరు ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. దీని కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.ఇటీవల వింగిఫై వ్యవస్థాపకుడు ఒక తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో ఓ వ్యక్తి వింగిఫైలో తనకు ఉద్యోగం కావాలని. ''ఉద్యోగం కోసం నేను 500 డాలర్లు (రూ. 41000 కంటే ఎక్కువ) చెల్లిస్తాను. వారం రోజుల్లో నా పనితనాన్ని నిరూపించుకుంటాను. ఆలా నిరూపించుకోని సమయంలో నన్ను ఉద్యోగం నుంచి తొలగించండి. ఆ డబ్బు కూడా మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా మీ టీమ్ సమయాన్ని వృధా చేయకూడదని చేస్తున్నాను'' అని పేర్కొన్నారు.ఈ పోస్టును వింగిఫై ఛైర్మన్ పరాస్ చోప్రా షేర్ చేసిన తరువాత నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగార్ధుల పరిస్థితి ఇది అని కొందరు కామెంట్ చేశారు. మరి కొందరు జాబ్ తెచ్చుకోవడానికి ఇది సరైన మార్గం కాదని పేర్కొన్నారు. అయితే చోప్రా మాత్రం ఇది అందరి దృష్టిని ఆకర్శించింది అని అన్నారు.This is how you get attention!(Obviously won’t take money but very impressed with the pitch) pic.twitter.com/mlJIL0154u— Paras Chopra (@paraschopra) May 3, 2024
పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఎన్నికల బరిలో తలపడుతున్న వైఎస్సార్సీపీ అభ్యర్ధి వంగా గీత చాలా వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆమె తన పార్టీ గురించి, తన గురించి, తన ప్రభుత్వ స్కీముల గురించి చెబుతున్నారే తప్ప పవన్‌ను ఏ విధంగాను విమర్శించడం లేదు. అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆమె తెలివిగా ప్రచారం చేపట్టారు. వంగా గీత.. గత మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నారు. విద్యార్ధి దశలో ఉన్నప్పుడే ఆమె రాజకీయాలపై ఆసక్తితో ఉండేవారు. సామాజిక స్పృహతో ఉండేవారు. పవన్‌తో పోల్చితే పెద్ద ధనికురాలు కూడా కాదు. అయినా స్వయంశక్తితో, రాజకీయాలలోకి వచ్చారు. 1994లో శాసనసభ సీటు కోసం ప్రయత్నించారు కాని సఫలం కాలేదు. తదుపరి కాలంలో జడ్పి చైర్ పర్సన్ గాను, రాజ్యసభ సభ్యురాలిగా, శాసనసభ సభ్యురాలిగా, 2019లో లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.ఆయా సందర్భంలో ఆమె ప్రజల సమస్యలపై శ్రద్ద వహించేవారు. సాధ్యమైన మేరకు ఆ సమస్యలను తీర్చే యత్నం చేసేవారు. ప్రజలలో కలిసిపోతుంటారు. ఆమె తమకు అందుబాటులో ఉండరన్న మాట రానివ్వరు. కరోనా సమయంలో జబ్బుబారిన పడ్డవారికి ఆమె భయపడకుండా సేవలందించారు. వ్యాధి సోకినవారిని స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే, వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రులకు పంపించడానికి కృషి చేసేవారు. ఇవన్ని ఆమెకు ఇప్పుడు పాజిటివ్ పాయింట్లుగా ఉన్నాయి. బాగా విద్యాధికురాలు. రెండు పీజీలు, న్యాయశాస్త్ర పట్టభద్రురాలుగా ఉన్నారు. ఆమె లాయర్‌గా కూడా పేదలకు సేవలందించారు. ఆమె భర్త విశ్వనాద్ కూడా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆమెకు చేదోడువాదోడుగా నిలబడడం కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎవరైనా ‘పవన్‌తో పోటీ పడుతున్నారు.. మరి గెలవడం సాధ్యమా?’ అని అడిగితే, 'ఆయనకు సినిమా రంగంలో పేరు ఉంది.. నాకు ప్రజాసేవ రంగంలో పేరు ఉంది. పవన్‌కు కూడా ప్రజా సేవ చేయాలని ఉండవచ్చు.. కాని ఆయనకు ఉన్న పరిస్థితులు అందుకు అవకాశం ఇవ్వవు" అని నేర్పుగా సమాధానం చెబుతున్నారు.పవన్ విద్య గురించి ఎవరైనా అడిగితే, దాని గురించి తాను మాట్లాడనని, ఆయన సినిమాలలో స్టార్ అయ్యారు కదా! అంటూ తనకు ఉన్న డిగ్రీలు, ఇతర అర్హతలను మాత్రమే వివరిస్తున్నారు. పవన్ చదువు తక్కువ అనే పాయింట్‌ను కూడా ప్రస్తావించడం లేదు. తాను ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తినని చెప్పడానికి పలు ఉదాహరణలు వివరిస్తుంటారు. ఎవరికైనా నియోజకవర్గ ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే, తాను పిఠాపురంలోనే అందుబాటులో ఉంటానని, అదే పవన్ అయితే ఎక్కడో షూటింగ్లలో బిజీగా ఉంటారని, అందువల్ల ఆయన చేయలేరని, ఆయన పీఏలను పెట్టుకున్నా ప్రజలకు సేవలందించడం కష్టమని అంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపట్ల ప్రజలు ఆకర్షితులయ్యారని, ముఖ్యంగా మహిళలు అయితే మరింతగా ఆదరిస్తున్నారని ఆమె చెబుతున్నారు. ప్రచారంలో ఎవరి ఇంటి వద్ద అన్నా ఆగకపోతే ప్రత్యేకించి పిలిచి మరీ తమ ఇళ్లవద్దకు తీసుకు వెళుతున్నారని ఆమె చెప్పారు. ఆయన ప్రచారానికి ఇప్పటికే నాగబాబు, జబర్దస్త్ టీమ్ తదితర నటులు వచ్చారని, బహుశా మెగాస్టార్ చిరంజీవి రాకపోవచ్చని అనుకుంటున్నానని గీత అభిప్రాయ పడ్డారు.లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని చెబుతున్న పవన్ వీరందరిని ఎందుకు తీసుకు వస్తున్నట్లు అని గీత ప్రశ్నిస్తున్నారు. మరో ఆసక్తికరమైన వాదన తెచ్చారు. పిఠాపురంలో ఏదైనా సమస్య ఉంటే తాను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించే అవకాశం ఉంటుందని, జనసేనకు ఆ అవకాశం ఉండదని, వారు వేరే పార్టీ వారి దగ్దరకు వెళ్లాల్సి ఉంటుందని, ఆ తేడాను కూడా ప్రజలు గుర్తించారని ఆమె చెబుతున్నారు. కాపు సామాజికవర్గం వారు పవన్ వైపు ఎక్కువగా ఉన్నారా అని ప్రశ్నిస్తే, అలా ఏమీ ఉండదని, తాను కాపువర్గానికి చెందిన వ్యక్తినే కదా అని అంటారు. తాను కాపు సామాజికవర్గానికి ఉపయోగపడే పనులు అనేకం చేయించానని, ప్రత్యేకించి కాపు కళ్యాణమండపాలు నిర్మించడానికి నిధులు సమకూర్చానని ఆమె గుర్తు చేస్తున్నారు. ఎవరైనా అన్ని సామాజికవర్గాల ఆదరణ పొందాలి తప్ప, ఏ ఒక్క వర్గమో సపోర్టు చేస్తే గెలిచే పరిస్థితి ఉండదని అన్నారు. కొంతమంది కావాలని బయట నుంచి వచ్చి అలజడులు సృష్టించడానికి యత్నిస్తున్నారని, ఇది చాలా ప్రశాంతమైన నియోజకవర్గమని, ప్రజలు వీటిని గమనిస్తున్నారని ఆమె అన్నారు.పవన్ కళ్యాణే పెద్ద సినిమా స్టార్ అయినప్పుడు, జబర్దస్త్ టీవీ నటులు వంటివారి ప్రచారంతో ఏమి అవసరం వచ్చిందోనని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా తాను విజయం సాధిస్తానన్న ధీమాను గీత వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో చాలామంది ఒక మాట చెబుతున్నారు. జగన్ చాలా తెలివిగా వంగా గీతను ఎంపిక చేసి పవన్‌ను ఆత్మరక్షణలో పడేశారని అంటున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వంటివారు ఆమెకు మద్దతు ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. పిఠాపురంలో సుమారు తొంభైవేల వరకు కాపుల ఓట్లు ఉండవచ్చని అంచనా. వాటి ఆధారంగా గెలవవచ్చన్న ఆశతో పవన్ అక్కడ పోటీలోకి దిగడం, వర్మ వంటి టీడీపీ నేతలను తనను గెలిపించాలని వేడుకున్న వైనం ఇవన్ని ఆయనకు కాస్త మైనస్ అయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తన అభ్యర్ధులను గెలిపించవలసిన నేత, తన గెలుపుకోసమే ఇతరులను అభ్యర్ధించవలసిన పరిస్థితి ఏర్పడడం చాలామందికి నచ్చడం లేదు.జనసేనకు స్వయంగా నియోజకవర్గం అంతటా పోల్ మేనేజ్ మెంట్ యంత్రాంగం లేదన్నది ఒక అభిప్రాయం. తెలుగుదేశం పార్టీవారి మద్దతు ఉన్నా, పిఠాపురాన్ని జనసేనకు ఇస్తారని ప్రకటన రాగానే, టీడీపీ శ్రేణులు భగ్గుమనడం కూడా పవన్‌కు నష్టం చేసింది. పవన్‌కు పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదని, అక్కడ ఉన్న సమస్యలు తెలియవని, తాను ఏమి చేస్తానో చెప్పలేకపోతున్నారని వైస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం సినిమా గ్లామర్ ఆకర్షణతో గెలవాలన్నది పవన్ వ్యూహం అయితే, ప్రజాసేవ ద్వారా వచ్చిన గ్లామర్‌తో పాటు జగన్ ప్రభుత్వం అమలు చేసిన స్కీముల ప్రభావంతో విజయం సాధించాలన్నది వంగా గీత వ్యూహంగా ఉంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్, శ్రీలంక బౌలర్ మతీశ పతిరణ టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ధోని తనకు తండ్రిలాంటి వాడని పేర్కొన్నాడు. తన కన్న తండ్రి మాదిరే ధోని కూడా తనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడని తెలిపాడు.కాగా ఐపీఎల్-2022కు సిసంద మగల దూరం కాగా అతడి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్‌లో అడుగుపెట్టాడు పతిరణ. ఆ మరుసటి ఏడాది అంటే 2023లో 12 మ్యాచ్‌లలో కలిపి 19 వికెట్లు పడగొట్టాడు.ధోని నాయకత్వంలో సీఎస్కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. బేబీ మలింగగా ప్రశంసలు అందుకుంటూ ప్రస్తుతం సీఎస్కే ప్రధాన పేసర్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు.అయితే, దీనకంతటికి కారణం ధోనినే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యువ పేసర్ ఆరంభంలో తడబడ్డా తలా అతడికి అండగా నిలిచాడు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్న సమయంలోనూ నైతికంగా మద్దతునిచ్చాడు.ఈ నేపథ్యంలో తాజాగా సీఎస్కే ‘లయన్స్ అప్‌క్లోజ్’ చాట్‌లో మతీశ పతిరణ మాట్లాడుతూ ధోనితో తన అనుబంధం గురించి వివరించాడు. ‘‘మా నాన్న తర్వాత నా క్రికెట్ లైఫ్‌లో తండ్రి పాత్ర పోషించింది ధోనినే.నన్నొక చిన్నపిల్లాడిలా చూసుకుంటారు. నా పట్ల శ్రద్ధ వహిస్తారు. అవసరమైన సమయంలో సలహాలు, సూచనలు ఇస్తుంటారు. నేను ఎప్పుడు ఏం చేయాలో చెబుతూ ఉంటారు.ఇంట్లో మా నాన్న నాతో ఇలా ఉంటారో ఇక్కడ ధోని కూడా నాతో అలాగే ఉంటారు. చిన్న చిన్న విషయాలను కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తలు చెబుతారు. నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగేలా మోటివేట్ చేస్తారు.మైదానం వెలుపల మేము ఎక్కువగా మాట్లాడుకోము. అయితే, నన్ను కలిసిన ప్రతిసారీ.. ‘‘ఆటను ఆస్వాదించు. ఫిట్నెస్ కాపాడుకో’’ అని చెబుతారు.మహీ భాయ్.. మీరు వచ్చే సీజన్లోనూ ఆడాలి. ప్లీజ్ మాతో కలిసి ఆడండి.. అప్పటికీ నేనిక్కడ ఉంటే(నవ్వుతూ)’’ అంటూ పతిరణ ధోని పట్ల అభిమానం చాటుకున్నాడు.కాగా ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా.. ధోని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక పతిరణ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు కూల్చాడు. సీఎస్కే ఆడిన 10 మ్యాచ్‌లలో ఐదు గెలిచి పట్టికలో ఐదో స్థానంలో ఉంది.The bond beyond the field 💛🫂#LionsupClose Full video 🔗 - https://t.co/xt5t6K9SjR #WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/odZdVvlrF6— Chennai Super Kings (@ChennaiIPL) May 4, 2024
AP Election Updates May 4th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 4th May...06:05 PM, May 4th, 2024టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు.కొద్దిరోజులుగా ఐివీఆర్ఎస్ కాల్స్ ద్వారా నిరాధార ఆరోపణలు చేస్తున్న టీడీపీ.దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ. వైఎస్సార్సీపీ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.విచారణ జరపమని సీఐడీని ఆదేశించిన ఎన్నికల సంఘం.తక్షణమే నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశం.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చేస్తున్న ప్రచారంపై ఈసీకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిర్యాదు .ఐవీఆర్ ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్న వైఎస్సార్సీపీ బృందంప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ఆధారాలు అందచేసిన వైఎస్సార్సీపీ బృందంఎన్నికల కోడ్‌కు విరుద్దంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన ఈసీ.ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఐడీకి ఆదేశాలు జారీ చేసిన అడిషనల్ సీఈవో హరేంధిరియ ప్రసాద్.06:05 PM, May 4th, 2024తాడేపల్లి :వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన ముస్లిం మైనారిటీల జేఏసీ నేతలుముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జలతో చర్చించిన జేఏసీ నేతలుసజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్స్ముస్లిం మత పెద్దలు నన్ను కలిశారుముస్లిం రిజర్వేషన్లపై వైఎస్సార్సీపీ వైఖరిని వారు మెచ్చుకున్నారువైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా జగన్ వ్యవహరిస్తున్నారువైసీపి డీఎన్ఏలోనే మైనారిటీలు ఉన్నారుసీఏఏ, ఎన్.ఆర్సి, యూసీసీలపై కూడా మా పార్టీ స్పష్టత ఇచ్చిందిదేశంలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారుఏడు సీట్లను జగన్ ముస్లింలకు ఇచ్చాంరాజ్యసభలో కూడా ముస్లింలకు సీటు కల్పిస్తాంముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పిందిచంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?ఈ విషయంలో కూటమి నేతలు స్పష్టత ఇవ్వాలిదీనిపై ముస్లింలు కూడా కూటమిని గట్టిగా నిలదీయాలివైఎస్సార్ హయాంలో వచ్చిన రిజర్వేషన్లను తొలగించటానికి వీల్లేదన్నదే మా డిమాండ్నసీర్ అహ్మద్, మత పెద్ద కామెంట్స్ముస్లింలకు అండగా నిలుస్తామని వైసీపి నేతలు చెప్పారు.మా సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు.వైఎస్సార్సీపీ మొదటి నుంచీ మాకు అండగా నిలిచింది.మునీర్ అహ్మద్, ముస్లిం మతపెద్దముస్లింలు వెనుకపడి ఉన్నారని వైఎస్సార్ గుర్తించారుఅందుకే రిజర్వేషన్ లు కల్పించారుదానివలన ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారుచంద్రబాబు మా విషయంలో ద్వంద్వ నీతి ప్రదర్శిస్తున్నారుఇలాగే ఉంటే మళ్ళీ ప్రజలు తగిన బుద్ది చెప్తారుసీఎం జగన్ సంక్షేమ పథకాలు మాకు ఎంతో ఉపయోగపడ్డాయిహుస్సేనీబాబా, ముస్లిం మతపెద్ద కామెంట్స్ముస్లింల అపోహలన్నీ వైసీపి మన ఏతలు తొలగించారువచ్చే ఎన్నికలలో రెండు ఓట్లు వైసీపికి వేయాలి175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లు గెలిపిస్తాం5:55 PM, May 4th, 2024నెల్లూరు , ప్రచారసభలో సీఎం వైఎస్ జగన్ స్పీచ్గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం మొదలు టోఫెల్, IB దాకా అంతర్జాతీయ విద్య వరకూ పిల్లల చదువుల్లో విప్లవాలు తెచ్చాం. నాడు నేడు, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, 6వ తరగతి నుండే డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన, బైజ్యూస్ కంటెంట్, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ క్లాసులు, బైలింగ్వల్ టెక్స్ట్‌బుక్స్ క్వాలిటీ చదువులు, సస్టెయినబుల్ డెవలప్మెంట్ ఇది కాదా అభివృద్ధివెలిగొండ నీళ్లు రాక, శ్రీశైలం నీళ్లు రాక ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్ బాధితులతో అతలాకుతలం అయినప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు.వెలిగొండ రెండు టన్నెళ్లు పూర్తిచేసాం. ఈ వర్షాకాలంలో వెలిగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకువస్తున్నాం.నెల్లూరు, సంగం బ్యారేజీలు పూర్తి చేసి జాతికి అంకితం చేశాం.చిత్రావతీ రిజర్వాయిర్, గండికోట రిజర్వాయిర్, పులిచింతల రిజర్వాయిర్ లలో R&R పూర్తి చేసి డ్యాముల్లో పూర్తి సామర్థ్యంతో నీళ్లు నింపుతున్నాం.5:25 PM, May 4th, 2024తాడేపల్లి :వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన ముస్లి మైనార్టీల జేఏసీ నేతలుముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జలతో చర్చించిన జేఏసీ నేతలుఅనంతరం సజ్జల మాట్లాడుతూ..ముస్లిం మత పెద్దలు నన్ను కలిశారుముస్లిం రిజర్వేషన్లపై వైఎస్సార్సీపీ వైఖరిని వారు మెచ్చుకున్నారువైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా జగన్ వ్యవహరిస్తున్నారువైఎస్సార్సీపీ డీఎన్ఏలోనే మైనారిటీలు ఉన్నారుసీఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీలపై కూడా మా పార్టీ స్పష్టత ఇచ్చిందిదేశంలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారుఏడు సీట్లను జగన్ ముస్లింలకు ఇచ్చారురాజ్యసభలో కూడా ముస్లింలకు సీటు కల్పిస్తాంముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పిందిచంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?ఈ విషయంలో కూటమి నేతలు స్పష్టత ఇవ్వాలిదీనిపై ముస్లింలు కూడా కూటమిని గట్టిగా నిలదీయాలివైఎస్సార్ హయాంలో వచ్చిన రిజర్వేషన్లను తొలగించటానికి వీల్లేదన్నదే మా డిమాండ్ 5:10 PM, May 4th, 2024విశాఖ :గంటా శ్రీనివాస్ కాపు ద్రోహి: తోట రాజీవ్, కాపునాడు అధ్యక్షుడు, విశాఖరియల్ ఎస్టేట్ వ్యక్తులను ఎన్నికలకు గంటా వాడుకుంటున్నారుగంటా పోటీ చేసిన నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చెయ్యడుఅక్కడి ప్రజలకు అందుబాటులో ఉండడుగంటా ఏ నాడూ చట్ట సభలకు వెళ్ళింది లేదుగంటాకు పొలిటికల్ బ్రోకర్ పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాంగంటా మాకు అవసరం లేదని భీమిలి ప్రజలు అంటున్నారుగంటా మంత్రిగా ఉండి విశాఖకు ఏం చేశాడుగంటాను పవన్ కళ్యాణ్ పలుమార్లు తిట్టాడుఅలాంటి గంటాకు ఎంత డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారునోటికాడ కూడు లాక్కోవడం గంటాకు అలవాటుగంటా రాజకీయ బంధిపోటు దొంగ 3:46 PM, May 4th, 2024నన్ను అంతమొందించే ప్రయత్నం సీఎం రమేష్ చేస్తున్నారు: బుడి ముత్యాల నాయుడుతనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పోతున్నారునా ఇంటి మీద డ్రోన్ ఎగరేయవలసిన అవసరమేముంది?డ్రోన్‌తో నా కదలికలను పరిశీలిస్తున్నారురౌడీయిజం గుండాయిజం చేయాలని సీఎం రమేష్ చూస్తున్నారుప్రజాక్షేత్రంలో తనపై గెలవలేనని చెప్పి నన్ను అంతమొందించే కుట్రలు చేస్తున్నారువచ్చిన వారు కూడా సీఎం రమేష్ పంపితేనే వచ్చామని చెబుతున్నారుసీఎం రమేష్ చెబితేనే డ్రోన్ తో విజువల్స్ తీశామని వచ్చిన వారు చెబుతున్నారువారు మా ప్రాంతానికి చెందిన వ్యక్తుల కాదుఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తులతో రెక్కీ నిర్వహించాల్సిన అవసరమే ఉంది3:15 PM, May 4th, 2024పలమనేరు ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ప్రత్యేకహోదాను అమ్మేసిన బాబు లాంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా?మోసగాళ్లతో మనం యుద్ధం చేస్తున్నాంకొత్త హామీలతో మోసం చేసేందుకు మళ్లీ ముగ్గురు కలిసి వస్తున్నారు14 ఏళ్లపాటు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క మంచైనా చేశాడా?అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు, మోసాలు..అధికారం దక్కిన తర్వాత చంద్రబాబు చంద్రముఖి మారిపోతాడుబాబు తన హయాంలో పేద ప్రజలకు ఒక్క సెంటు భూమైనా ఇచ్చాడా?ఈ 59 నెలల పాలనలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాంమేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే సాంప్రదాయాన్ని పూర్తిగా మార్చేశాంమేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి 99 శాతం అమలు చేశాం59 నెలల పాలనలో రూ.2.70 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయిచంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమేమరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందిగ్రామ సచివాలయాల్లో ప్రజలకు 600 రకాల సేవలు అందుతున్నాయివర్షం రూపంలో దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తున్నారని భావిస్తున్నా 2:50 PM, May 4th, 2024విజయవాడమేము అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేశాం: దేవినేని అవినాష్విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్‌లో వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్10ఏళ్లలో అనేక మార్పులు, చేర్పులు జరిగాయి.. అనేక అనుభవాలు నేర్పిందితూర్పు నియోజకవర్గంలో గత ప్రభుత్వాలు, గత పాలకులు చేయలేని అభివృద్ధి పనులు చేశాం..2వ డివిజన్ నుండి 22 వ డివిజన్ వరకు అన్ని పనులు చేశాంటీడీపీ అధికారంలో ఉండి, మేయర్ ప్రజా ప్రతినిధులు అన్ని ఉన్నా అభివృద్ధి శూన్యంకొండ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించాం2019, 2020లో వరదలు వచ్చాయికృష్ణ లంక కరకట్ట ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ పూర్తిచేశాంరూ. 150 కోట్లు మొదటి విడతలోనే ఇచ్చాంమేము చేసిన పనిని టీడీపీ వాళ్ళు చేసారని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? వీడియోలు ఎలా తీయించుకోగలుతున్నారు?గద్దె రామ్మోహlన్‌రావు ఒక అసమర్థ ఎమ్మెల్యేకేవలం మాటలు, షో రాజకీయాలతో ప్రజలను గద్దె మోసం చేశాడువైఎస్సార్సీపీ కార్పోరేటర్లు గెలిచిన చోట టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదుమేము ఏ పార్టీ అభ్యర్థులు గెలిచారా అని చూడలేదు.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేశాం4 సంవత్సరాల కాలంలో ప్రతి గడపను 4 సార్లు తిరిగానుటీడీపీ ఒక్కసారి కూడా ప్రజల గడప తొక్కలేదురోడ్లు, మంచినీళ్లు, పార్కు లు ,డ్రైనేజ్ నిర్మించామని ప్రజలే చెపుతున్నారు.. ఇదే గా అభివృద్ధి- ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకున్న అభివృద్ధికి అడ్డాగా తూర్పు నియోజకవర్గాన్ని చూపిస్తాం2:42 PM, May 4th, 2024అనంతపురం:అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో భగ్గుమన్న టీడీపీ అసమ్మతిటీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయుల మధ్య ఘర్షణఐక్యత కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో రసాభాసపరస్పరం వాగ్వాదం, తోపులాటకు పాల్పడ్డ ఇరువర్గాలుటిక్కెట్ రాకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తి గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు 1:00 PM, May 4th, 2024చంద్రబాబుది క్రిమినల్ మైండ్: జోగి రమేష్చంద్రబాబుపై జోగి రమేష్ సీరియస్ కామెంట్స్‌రాజకీయ హాంతకుడు బాబు.డీబీటీ ద్వారా వచ్చే పథకాలను ఆపేయమన్నాడు.ఈసీకి ఫిర్యాదు చేయించిన దుర్మార్గుడు చంద్రబాబు.ఆసరా, చేయూత, విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ పథకాలు ఆపేయాలని ఈసీని కోరారు.అవ్వాతాతలను పొట్టన పెట్టుకున్న వ్యక్తి బాబు.చంద్రబాబు రాక్షసుడు మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు.బాబు నిజస్వరూపం ప్రజలు గమనించాలి.రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు.కుప్పంలో చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడించాలి.మంచి చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నాడు.ముఖ్యమంత్రి జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. 12:40 PM, May 4th, 2024బుడి ముత్యాల నాయుడు ఇంటిపై రెక్కీ! బీజేపీ నేతల ఓవరాక్షన్..డ్రోన్‌తో విజువల్స్ తీస్తున్న బీజేపీ నేతలు.అనుమానం వచ్చి ఆరా తీసిన స్థానికులు.పొంతన లేని సమాధానాలు ఇచ్చిన బీజేపీ నేతలు.విజువల్స్ తీస్తున్న వారిని పట్టుకున్న స్థానికులు.పట్టుకున్న వారిని పోలీసులకు అప్పగింత.నిందితులను విచారిస్తున్న పోలీసులు.విజువల్స్ తీసిన వారు స్థానికులు కాదంటున్న వైఎస్సార్సీపీ నేతలు.సీఎం రమేష్ ఆదేశాలతోనే విజువల్స్ తీశారంటున్న వైఎస్సార్సీపీ నేతలు, స్థానికులుదేవరపల్లి పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులుముగ్గురిని విచారిస్తున్న దేవరపల్లి పోలీసులుడ్రోన్ కెమెరాను ఎందుకు ఇంటిపై ఎగురవేస్తున్నారు అని ప్రశ్నించిన పోలీసులుముగ్గురి వద్ద బీజేపీ పార్టీ కండువాలు గుర్తించిన పోలీసులు 12:20 PM, May 4th, 2024సుజనా చౌదరికి వైఎస్సార్సీపీ నేతల కౌంటర్..కేశినేని నాని కామెంట్స్‌మైనారిటీలను, బీసీలను మోసం చేసి పక్క దారిలో పశ్చిమ నియోజకవర్గానికి వచ్చాడు. 12ఏళ్ళు రాజసభ సభ్యుడిగా, మూడేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న నీ వల్ల ఏమైనా అభివృద్ధి జరిగిందా?రాజ్యసభ సభ్యుడిగా 60కోట్లు నిధులు వస్తే ఒక్క అర్ధ రూపాయి అయినా ఖర్చు చేశావా?. పశ్చిమని బెస్ట్ చేస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారుఅసిఫ్, వైస్సార్సీపీ వెస్ట్ అభ్యర్థిచంద్రబాబు ఎలా మాయమాటలు చెప్పాడో.. అలాగే సుజనా కూడా మాయ మాటలు చెపుతున్నాడు.విజయవాడ ప్రజలకు సుజనా చౌదరి మొహం తెలుసా?డబ్బుంటే ఏదైనా చేయొచ్చని సుజనా భ్రమలో ఉన్నాడు.పశ్చిమలో తెలుగుదేశం కండువా కప్పుకొన్నాడు.. ఒక్కడు కూడా సుజనా వెనక లేరు.జెండాలు జత కట్టి వచ్చిన మమ్మల్ని ఢీకొట్టలేరు.. మా జెండా ఏ జెండా రెండు ఒకటే. 12:00 PM, May 4th, 2024గద్దెకు దేవినేని కౌంటర్ దేవినేని అవినాష్ కామెంట్స్.. జగన్ ప్రభుత్వం శంకుస్థాపనలే కాకుండా ప్రారంభోత్సవాలు కూడా చేసింది.రిటేనింగ్ ప్రారంభంతో గద్దె ఓటమి మొదలైందికరకట్టవాసుల కష్టాలు పట్టని టీడీపీ నేతలుప్రతీ ఇంటికే పథకాలు పంపిన జగన్ ప్రభుత్వానికే మా మద్దతు అని ప్రజలు అంటున్నారుటీడీపీ చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారుటీడీపీ నేతల లాగా కాల్ మనీ సెక్స్ రాకెట్ మా పార్టీ నేతలు లేరు670 కోట్లతో తూర్పు నియోజకవర్గ అభివృద్ధి జరిగిందిగంజాయికి పునాదులు వేసింది టీడీపీ ఎమ్మెల్యే కాదా?.విశాఖలో దొరికిన డ్రగ్స్‌కు గద్దె రామ్మోహన్ కుటుంబానికి సంబంధాలున్నాయినిజానిజాలు వెలికితీయాలిజగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని టీడీపీగా చెప్పుకోడానికి సిగ్గులేదా?.చిల్లర రాజకీయాలు చేయడం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కే దక్కుతుందిఅసమర్థ ఎమ్మెల్యే మాకు వద్దు అని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు 11:20 AM, May 4th, 2024బాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గనటీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన అప్పు ఆయన కడతారా?.75 ఏళ్లు దాటిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. కోట్ల సూర్యప్రకాశ్ ఒక్కరోజు నాతో పాటు వచ్చి డోన్‌లో తిరగండి. పుష్కర కాలం ఎంపీ పదవి అనుభవించి మీరేం సాధించారో చెప్పండి.ప్రతీ దానికి ట్యాక్స్‌లు కట్టిన నేడు ఆర్థిక నేరుస్థుడినా? అయితే మరి మిమ్మల్ని ఏమనాలి. ఎన్నికల్లో వేసిన నామినేషన్‌ను కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటారా?. ఆస్తులు సహా అని వివరాలు, దానికి సంబంధించిన పత్రాలను పక్కాగా రిటర్నింగ్ ఆఫీసర్‌కి సమర్పించాం. అప్లికేషన్లో రాయనంత మాత్రాన తప్పుడు నామినేషన్ అవుతుందా?. నాకు సంబంధించిన వివరాలన్నీ జతపరిచాం. రైల్వే సహాయ మంత్రిగా ఉండి.. పేకాట ఆడటమేనా అందుబాటులో ఉండటం అంటే? స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ ప్రతిపక్షాలకు మేలు జరిగేది కాదా?. డోన్‌ను కర్నూలులో కలుపుతారా అని అంటున్నారే నంద్యాలలో కలుస్తున్నప్పుడు ఏం చేశారు. మిమ్మల్ని, చంద్రబాబును ప్రజలు నమ్మేపరిస్థితి లేదు. 10:40 AM, May 4th, 2024బాబు నీకు పేదల ఉసురు తగులుతుంది: ఎంపీ విజయసాయిమానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెలా ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఈసీకి ఫిర్యాదుమొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు పంచాయతీ సెక్రటేరియట్లో సైతం పెన్షన్లు పంపిణీని అడ్డుకున్నారు. బ్యాంకుల్లో పెన్షన్ సొమ్ము జమ చేయించడంతో బ్యాంకుల దగ్గర పడిగాపులుకాస్తూ వడదెబ్బతో వయోవృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. బాబు ముఖంలో పశ్చాతాపానికి బదులు మందహాసం కనిపిస్తోంది. పేదల ఉసురు నీకు తప్పక తగులుతుంది బాబూ.మానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెల ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు తన నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదులు చేయించాడు. మొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 4, 2024 9:20 AM, May 4th, 2024మళ్లీ తప్పులో కాలేసిన లోకేశం! మళ్లీ తప్పులో కాలేసిన మంగళగిరి మాలోకం!ఏపీలో పోలింగ్ ఎప్పుడో కూడా తెలియనివాడు @JaiTDPలో ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వెళ్లి మార్చి 13న ఓటు వేసుకో @naralokesh.. ఏపీ ప్రజలంతా మే 13న ఓటు వేస్తారు మంగళగిరి ప్రజలారా ఇలాంటి బుర్రతక్కువ వాళ్ళు మీకు అవసరమా?#TDPJSPBJPCollapse#EndOfTDP pic.twitter.com/b2a2Xj64CR— YSR Congress Party (@YSRCParty) May 4, 2024 ఏపీలో ఎన్నికలు ఎప్పుడో కూడా తెలియని వ్యక్తి నారా లోకేష్మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ కామెడీ ట్రాక్‌మే 13న పోలింగ్ అయితే మార్చి 13న ఓటు వేయమన్న లోకేష్లోకేష్ మాటలతో ఒక్కసారిగా నవ్వుకున్న ప్రజలు 8:50 AM, May 4th, 2024చంద్రబాబు మరో కుట్ర..టీడీపీ అధినేత చంద్రబాబు మరో దారుణ కుట్రపేదలకు ప్రభుత్వ పథకాలు అందకుండా మోకాలడ్డుఇప్పటికే వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వనీయకపోవటంతో వృద్దులు, వికలాంగుల అవస్థలుబ్యాంకుల చుట్టూ మండుటెంటలో తిరుగుతున్న పెన్షన్ దారులుతాజాగా వైఎస్సార్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, విద్యాదీవెన, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ నిధులను ఇవ్వనీయకుండా అడ్డుఇవన్నీ గత ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలేఐనాసరే టీడీపీ ఫిర్యాదుతో నిధులను రిలీజ్ చేయనివ్వని ఎన్నికల సంఘంఇప్పటికే అనేకసార్లు ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరిన ప్రభుత్వంటీడీపీ ఫిర్యాదుతో ఇంకా అనుమతి ఇవ్వని ఈసీ 7:45 AM, May 4th, 2024ఓటమి భయంలో కూటమి నేతల ఓవరాక్షన్..ఓటమి భయంతో టీడీపీ, జనసేన కూటమి నేతల కుట్ర రాజకీయాలువైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక పోతున్న కూటమి నేతలుప్రచారాలలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులకి తెగబడుతున్న టీడీపీ, జనసేన కార్యకర్తలుసీఎం జగన్‌పై వ్యక్తిగత దూషణలతో కార్యకర్తలని రెచ్చగొట్టేలా ప్రచారంలో బాబు, పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు.వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పుతున్న టిడిపి, జనసేన నేతలుమచిలీపట్నంలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి పేర్ని కిట్టు ప్రచార సమయంలో దాడికి పాల్పడ్డ జనసేన, టీడీపీ నాయకులుదెందులూరు నియోజకవర్గంలో ప్రచారంలో ఉండగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లతో, కర్రలతో చింతమనేని అనుచరుల దాడిచిలకలూరిపేట నియోజకవర్గంలో ఈవూరివారిపాలెంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా కావటి మనోహర్ నాయుడుపై దాడికి ప్రయత్నం.అదే సమయంలో ప్రచార రథం ధ్వంసంమంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా మేకా వెంకట్ రెడ్డిపై దాడి.ఎన్నికల ప్రచారంలో నిలదీసిన మహిళని చెప్పుతో కొడతానంటూ రెచ్చిపోయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిసీఎం సభలకి పెరుగుతున్న జనాదరణతో కూటమి నేతలలో ఓటమి భయంఅందుకే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు.. అసహనంతో ప్రజలపై తిట్ల పురాణం 7:00 AM, May 4th, 2024నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..నేడు పలమనేరు నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గొనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్నేడు హిందూపురం, పలమనేరు, నెల్లూరులో బహిరంగ సభల్లో పాల్గొనున్న సీఎం జగన్సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి 12.10 నిమిషాలకు హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎంమధ్యాహ్నం ఒంటి గంటకు పలమనేరుకు చేరుకోనున్న సీఎం జగన్మధ్యాహ్నం 1.30 నుంచి 2.05 వరకు పలమనేరు బహిరంగ సభలో పాల్గొంటారు.మధ్యాహ్నం 2.30 పలమనేరు నుంచి బయలుదేరి 3.50 గంటలకు నెల్లూరు చేరుకోనున్న సీఎం జగన్మధ్యాహ్నం 3.50 నుంచి 4.35 గంటల వరకు నెల్లూరులో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. 6:45 AM, May 4th, 2024ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం: కేశినేని నానిచంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై పొత్తులో ఉన్న బీజేపీకి నమ్మకం లేదుఅందుకే మేనిఫెస్టోలో బీజేపీ నేతల ఫోటో ఒకటి కూడా లేదు.చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానీ మానిఫెస్టోఅందుకే మేనిఫెస్టోని పట్టుకోడానికి కూడా బీజేపీ నేతలు ఇష్టపడలేదురానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా సీఎం జగన్‌ను మరోసారి గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారుఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, పార్టీ కార్యాలయానికి తాళం వేయడం ఖాయంటీడీపీని బీజేపీలో విలీనం చేసి చంద్రబాబు హైదరాబాద్‌లో తన ఇంటికి వెళ్లిపోతారుఈ ఎన్నికలలో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందిదేవినేని ఉమా ఒక చచ్చిన పాము.. అతని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ఉమాకు సీటు రాకపోతే ఇంటికి వెళ్లి పరామర్శించలేని ద్రోహి తంగిరాల సౌమ్య 6:30 AM, May 4th, 2024జూనియర్‌ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని ఓడించాలి: కొడాలి నానిగుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నానిజూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలిపెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలపై నాకు, సీఎం జగన్‌కు అమితమైన ప్రేమఅందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాముపార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబుఅన్న ఎన్టీఆర్ వారసులు.. అభిమానులెవరు టీడీపీలో ఉండరు, చంద్రబాబు వెంట నడవరుపదిమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకొని టిడిపి కార్యక్రమాలకు వెళితే... ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాంమన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబు, లోకేష్ తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదుఅభిమానులందరూ కష్టపడి టిడిపిని గెలిపిస్తే.. ఎన్టీఆర్‌ను తుంగలో తొక్కుతారు. లోకేష్‌ను అందలం ఎక్కిస్తారుఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు పట్టుకున్నప్పుడే.. అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలిచంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తూ చిత్తుగా ఓడిస్తేనే.. పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కి వస్తాయిఎవరైతే పెద్ద ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారో.. పార్టీని కాపాడుకోవడానికి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరికి వస్తారుపెద్ద ఎన్టీఆర్‌కు దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారునేను పెద్ద ఎన్టీఆర్ భక్తుడిని.. నందమూరి హరికృష్ణ నా గురువు.. నేను వైసీపీలో ఉన్నా నాకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెబుతాను.నేను తిరిగే కారుకు ఎన్టీఆర్.. వైఎస్సార్ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను.ఎన్టీఆర్ కుటుంబంతో నాకు ఉన్న బాంధవ్యం విడదీయరానిది.. వారికోసం నేను.. నాకోసం వారు అనేక త్యాగాలు చేశారుఎన్టీఆర్, వైఎస్సార్ నాకు రెండు కళ్లుతెలుగుదేశం పార్టీ గౌడ.. యాదవ.. మత్స్యకార.. ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది.. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి.సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటుచేసి.. అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక రాజ్యసభ స్థానాలు ఇస్తూ.. ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించారు.ప్రజలను నమ్ముకుని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్‌కు, నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి.
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
సినిమా
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా థియేటర్లలోకి వచ్చిన నెల నెలన్నర గ్యాప్‌లో ఓటీటీలోకి వచ్చేస్తోంది. కొన్నిసార్లయితే నెలలోపే స్ట్రీమింగ్ అయిపోతుంది. అలాంటిది ఓ మూవీ దాదాపు ఏడాది తర్వాత డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. బాలీవుడ్ సినిమా అయినప్పటికీ దీన్ని తీసింది తెలుగు దర్శకుడు కావడం విశేషం.(ఇదీ చదవండి: సంజయ్‌లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ)ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన 'మల్లేశం' సినిమాతో రాజ్ రాచకొండ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తర్వాత టాలీవుడ్ లో మరో మూవీ చేయలేదు. మధ్యలో ఓ మలయాళ మూవీ నిర్మించాడు. కానీ '8 ఏఎమ్ మెట్రో' మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది మే 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. కానీ ఓటీటీ రిలీజ్ ఊసే లేదు. ఇన్నాళ్లకు స్ట్రీమింగ్ ఫిక్స్ అయింది.దాదాపు ఏడాది తర్వాత అంటే మే 10 నుంచి '8 ఏఎమ్ మెట్రో' మూవీ జీ5 ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. మహారాష్ట్ర చెందిన ఐరావతి (సయామీ ఖేర్).. సోదరి ప్రసవం కోసం హైదరాబాద్ వస్తుంది. చిన్నప్పడు జరిగిన కొన్ని సంఘటనల వల్ల అప్పుడప్పుడు పానిక్ ఎటాక్‌కి గురవుతూ ఉంటుంది. అలాంటి ఈమెకు మెట్రోలో ప్రీతమ్ (గుల్షన్ దేవయ్య) పరిచయమవుతాడు. వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందనేదే మెయిన్ పాయింట్.(ఇదీ చదవండి: సమ్మర్ స్పెషల్.. ఈనెలలో ఓటీటీలోకి 100 సినిమాలు/ సిరీస్‌లు)
నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్‌పై స్పందించిన నటి
సినిమా నచ్చనప్పుడు బాలేదని విమర్శించడం తప్పు కాదు. కానీ కొందరు వారిని వృత్తిపరంగా కాకుండా వ్యక్తిగతంగా దూషిస్తుంటారు. లుక్కు బాలేదని, లావైపోయావని.. ఇలా ఎన్నో మాటలంటారు. మరీ ముఖ్యంగా నటీమణులపైనే విమర్శల బాణాలు ఎక్కుపెడుతుంటారు. దాదాపు ప్రతి హీరోయిన్, నటీమణులు ఎప్పుడో ఓసారి ఇలాంటి పరిస్థితుల బారిన పడినవారే!నటిపై ట్రోలింగ్తాజాగా మలయాళ నటి అన్నా రేష్మ రాజన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. నువ్వు ఎంత లావున్నావో తెలుసా? ఆ బరువుతో డ్యాన్స్ కూడా చేయలేకపోతున్నావ్.. నీకసలు స్టెప్పులేస్తూ రీల్స్ చేయడం అవసరమా? అని వెక్కిరించారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై నటి స్పందించింది. తాను ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది.వీడియో నచ్చకపోతే..ఇప్పటికే కీళ్లనొప్పులతో బాధపడుతున్నానని, ఇప్పుడిలాంటి కామెంట్స్ చేసి తనను మరింత బాధపెట్టొద్దని కోరింది. నేను లేదా నా డ్యాన్స్ వీడియో నచ్చకపోతే చెప్పండి.. అంతేకానీ హద్దులు దాటి కామెంట్స్ చేయొద్దని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విజ్ఞప్తి చేసింది. ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. అభిమానుల ప్రేమకు మురిసిపోయిన అన్నా మరో పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది. సరిగా డ్యాన్స్ చేయలేకపోయా..నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఓపక్క టైట్ డ్రెస్, మరోపక్క ఎండ వల్ల సరిగా డ్యాన్స్ చేయలేకపోయాను. అలాగే నేనేమీ పెద్ద ప్రొఫెషనల్ డ్యాన్సర్‌ని కూడా కాదు. కాకపోతే ఇలా స్టెప్పేయడమంటే ఇష్టం. అందుకే నాకు వచ్చినంతలో డ్యాన్స్ చేశాను. నెక్స్ట్ టైమ్ మరింత బాగా చేసేందుకు ప్రయత్నిస్తాను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అని రాసుకొచ్చింది. నటి కెరీర్..కాగా అన్నా రాజన్ 2017లో 'అంగమలి డైరీస్' చిత్రంతో మలయాళ చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'వేలిపడింతె పుస్తకం' సినిమాలో నటించింది. సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మూవీలో పృథ్వీరాజ్ భార్యగా యాక్ట్ చేసింది. ఇటీవల రండు, తిరిమలై సినిమాలు చేసింది. View this post on Instagram A post shared by Anna Reshma Rajan (@annaspeeks) చదవండి: ఓటీటీలో 100 సినిమాలు.. ఎంచక్కా ఇంట్లోనే చూసేయండి
సమ్మర్ స్పెషల్.. ఓటీటీలో 100 సినిమాలు/ సిరీస్‌లు
ఎండలు మండిపోతున్నాయి. అడుగు తీసి అడుగు వేయాలంటేనే జనం వణికిపోతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా సూరీడు అందరిపైనా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అత్యవసరమైతే తప్ప జనాలు బయటకు వెళ్లడం లేదు. వారందరికీ వినోదాన్ని పంచేందుకు ఓటీటీలు బోలెడంత కంటెంట్‌తో రెడీ అయ్యాయి. సినిమాలు, సిరీస్‌లతో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటున్నాయి. మరి మే నెలలో ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఏంటో చూసేద్దాం..నెట్‌ఫ్లిక్స్👉హీరామండి: ద డైమండ్ బజార్ (వెబ్ సిరీస్)👉షైతాన్👉ద హాలీడే👉ఎ మాన్ ఇన్ ఫుల్ (వెబ్ సిరీస్)👉టి- పిబన్ (వెబ్ సిరీస్)👉అన్ఫ్రాస్టెడ్👉ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో (ఎపిసోడ్ 6)(పైవన్నీ మే నెల ప్రారంభంలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి)👉సూపర్ రిచ్ ఇన్ కొరియా (వెబ్ సిరీస్) - మే7👉ఎక్స్ఎక్స్ఎక్స్: రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ (వెబ్ సిరీస్) - మే 7👉ద ఫైనల్: అటాక్ ఆన్ వెంబ్లీ - మే 8👉క్రేజీ రిచ్ ఆసియన్స్ - మే 8👉మదర్ ఆఫ్ ద బ్రైడ్ - మే 9👉లివింగ్ విత్ లియోపార్డ్స్ - మే 10👉బ్లడ్ ఆఫ్ జీయస్ (సీజన్ 2)- మే 10👉ద గ్రేడ్ ఇండినయ్ కపిల్ షో (ఎపిసోడ్ 7) - మే 11👉బ్రిడ్జర్టన్ (మూడో సీజన్- ఎపిసోడ్ 1)👉మేడ్మి వెబ్ - మే 14👉తెల్మా ద యునికార్న్ - మే 17👉అట్లాస్ - మే 24లయన్స్ గేట్ ప్లే📽️ బ్లాక్ మాఫియా ఫ్యామిలీ (సీజన్ 3) - మే 3📽️ ద మార్ష్ కింగ్స్ డాటర్ - మే 10📽️ కాప్షాప్ - మే 17📽️ వాంటెడ్ మ్యాన్ - మే 24📽️ విజిల్ (సీజన్ 2) - మే 31హాట్‌స్టార్🎞️ బ్లీచ్: థౌజండ్ ఇయర్ బ్లడ్ వార్🎞️షార్డ్లేక్🎞️వెల్కమ్ టు వ్రెక్జామ్🎞️ప్రామ్ డేట్స్🎞️స్టార్ వార్స్: టేల్స్ ఆఫ్ ద ఎంపైర్(మే ప్రారంభం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి)🎞️మాన్స్టర్స్ ఎట్ వర్క్ - మే 5🎞️మంజుమ్మెల్ బాయ్స్ - మే 5🎞️ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ - మే 8🎞️అండర్ ద బ్రిడ్జ్ - మే 8🎞️లెట్ ఇట్ బి - మే8🎞️డాక్టర్ హు - మే 11🎞️క్రాష్ - మే 13🎞️అంకుల్ సామ్సిక్ - మే 15🎞️క్వీన్ రాక్ మాంట్రియల్ - మే 15🎞️పాలైన్ - మే 22🎞️మార్వెల్ స్టూడియోస్ అసెంబ్ల్డ్: ద మేకింగ్ ఆఫ్ ఎక్స్ మెన్ 97 - మే 22🎞️ద కర్దాషియన్స్ - మే 23🎞️ద బీచ్ బాయ్స్ - మే 24🎞️కాండెన్ - మే 29🎞️జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ - మే 31అమెజాన్ ప్రైమ్📽️ అమెరికన్ ఫిక్షన్ - మే 14📽️ ద బ్లూ ఏంజెల్స్ - మే 23📽️ ద బాయ్స్ ఇన్ ద బోట్ - మే 28బుక్ మై షో స్ట్రీమ్👉 డేర్ డెవిల్ ముస్తఫా👉 ఆర్కెస్ట్రా మైసూరు👉 మిస్టర్ నట్వర్లాల్👉 కాంక్రీట్ ఉటోపియా👉 మాన్స్టర్👉 గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ద న్యూ ఎంపైర్👉 ఎండేవర్ సీజన్ 1👉 ఎండేవర్ సీజన్2👉 ఎండేవర్ సీజన్ 3👉 ఎండేవర్ సీజన్ 4👉 ఎండేవర్ సీజన్ 9👉 ఎండేవర్ - పైలట్అల్ట్రాజకాస్🎞️ రంగీత్🎞️ యాసిడ్🎞️ అభ్యూహమ్🎞️ డోంట్ లుక్ అవే🎞️ టైగర్ రాబర్స్📺 ఫ్యామిలీ కట్టా (షో)📺 కుకరీ షో📺 మహారాష్ట్రచీ హస్యజాతర (షో)📺 అనైతిక్ (వెబ్ సిరీస్)📺 ఉదర్ బైకో (వెబ్ సిరీస్)📺 నజరబండి (వెబ్ సిరీస్)📺 లైసా (వెబ్ సిరీస్)యాపిల్ టీవీ👉 అకాపుల్కో (సీజన్ 3) - మే 1👉 డార్క్ మ్యాటర్ - మే 8👉 హాలీవుడ్ కాన్ క్వీన్ - మే 8👉 ద బిగ్ సిగర్ - మే 17👉 ట్రైయింగ్ (సీజన్ 4) - మే 22అమెజాన్ మినీ టీవీ📽️ ద రిటర్న్ ఆఫ్ రెబల్ - మే 2📽️ మగధీర - మే 2📽️ మిడిల్ క్లాస్ అబ్బాయి - మే 2📽️ యు ఆర్ మై డెస్టినీ - మే 8📽️ 96 - మే 9📽️ దేవ్ - మే 9📽️ ప్రేమమ్ - మే 9📽️ అమర్ అక్బర్ ఆంటోని - మే 9📽️ డేంజరస్ ఖిలాడీ 2 - మే 9📽️ టర్న్ బ్యాక్ - మే 13📽️ అండర్‌కవర్ కౌంటర్ అటాక్ - మే 14📽️ ఐ బిలాంగ్‌డ్ టు యువర్ వరల్డ్ - మే 15📽️ మర్డర్ ఇన్ ద ఫస్ట్ - మే 15మ్యాక్స్👉 స్టాప్ మేకింగ్ సెన్స్ - మే 3👉 ద ఐరన్ క్లా - మే 10👉 మూవీపాస్, మూవీ క్రాష్ - మే 29హుళు🎞️ ప్రామ్ డేట్స్ - మే 3🎞️ ఈలెన్ - మే 10🎞️ బయోస్పియర్ - మే 10🎞️ బర్త్/ రీబర్త్ - మే 17🎞️ ద స్వీట్ ఈస్ట్ - మే 17🎞️ ద వెంట్ దట్ వే - మే 17🎞️ ఫెరారీ - మే 24🎞️ ద ప్రామిస్డ్ ల్యాండ్ - మే 30🎞️ సింపతీ ఆఫ్ ద డెవిల్ - మే 31చదవండి: అందరికీ నచ్చకపోయినా పర్లేదు.. మధ్యలో చై ఎందుకో!
సంజయ్‌లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
టైటిల్ : హీరామండి: ది డైమండ్ బజార్ (వెబ్‌సిరీస్)నటీనటులు: మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్, తదితరులునిర్మాణ సంస్థలు: భన్సాలీ ప్రొడక్షన్స్దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీసంగీతం: సంజయ్ లీలా భన్సాలీ,బెనెడిక్ట్ టేలర్,నరేన్ చందావర్కర్కథ: మొయిన్ బేగ్జానర్: చారిత్రక నాటకంఎపిసోడ్స్: 8 భాషలు: తెలుగుతో పాటు మొత్తంగా 14 భాషల్లో స్ట్రీమింగ్'హీరామండి: ది డైమండ్ బజార్' మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ పెద్ద సంచలనమే రేపుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా హీరామండి టాపిక్ నడుస్తూనే ఉంది. కథ నిడివి విషయం పక్కన పెడితే ఈ సిరీస్‌కు ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. బాలీవుడ్లో టాప్ డైరెక్టర్‌గా ముద్ర వేసిన సంజయ్ లీలా భన్సాలీ మొదటిసారిగా ఒక వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను తన నిర్మాణ సంస్థ నుంచే రూ. 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాడు. పీరియాడిక్ డ్రామా చిత్రాలకు పేరుగాంచిన సంజయ్ లీలా భన్సాలీ నుంచి ఇప్పటికే పద్మావత్, బాజీరావ్ మస్తానీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన తొలి వెబ్‌సిరీస్ 'హీరామండి' సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటంటే... బ్రిటీష్ పాలన సమయంలో లాహోర్‌లో ఉన్న వేశ్యావాటిక 'హీరామండి'లో ఎలాంటి ఆధిపత్య పోరు జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి సంఘర్షణ జరిగింది..? హీరామండిలో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరెన్ని కుట్రలు చేశారు..? స్వాతంత్య్ర ఉద్యమంలో వారి పాత్ర ఎంత..? ఈ కథలోకి వెళ్లాలంటే ముందుగా పాత్రల గురించి పరిచయం తప్పనిసరి. హీరామండిలో ఉండే షాహీ మహల్ నిర్వహణ మొత్తం మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) చేతిలో ఉంటుంది. ఆ ప్రాంతంలోని నవాబులంతా ఆమె కనుసన్నలలోనే ఉంటారు. అయితే అదే ప్రాంతంలో ఖ్వాభాగ్ అనే మరో మహల్ ఉంటుంది. అక్కడ ఫరీదాన్ (సోనాక్షి సిన్హా) ఉంటుంది. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో మరో మూడు పాత్రలు కీలకంగా ఉంటాయి. వహీదా (సంజీదా షేక్) మల్లికా జాన్‌కు సోదరి. బిబోజాన్ (అదితిరావ్ హైదరి), ఆలంజేబు (షర్మిన్ సెగల్) ఇద్దరూ కూడా మల్లికా జాన్‌కు కుమార్తెలు. లజ్జో (రిచా చద్దా) మల్లికా జాన్ దత్తత తీసుకున్న కూతురు.హీరామండిలో తన మాటకి తిరుగులేదనే స్థాయిలో మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) రాజ్యమేలుతూ ఉంటుంది. ఆమె కనుసన్నల్లో ఉన్న వేశ్యలపై ఆధిపత్యం చెలాయిస్తూ.. ఎవరైనా ప్రేమలో పడితే ప్రమాదంలో పడినట్టే అనే మాటతో హెచ్చరిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వేశ్యలుగా ఉంటూనే మల్లికా జాన్ మాట వినిపించుకోకుండా 'జొరావర్' అనే నవాబుతో లజ్జో, ఫిరోజ్ అనే నవాబుతో వహీదా, వలీ ఖాన్ అనే నవాబుతో బిబోజాన్ ప్రేమలో పడతారు. కానీ, మల్లికా జాన్ చిన్న కుమార్తె ఆలంజేబును కూడా వేశ్యలా మార్చాలని చూస్తుంది. అయితే, ఆమె బాలోచి నవాబు తాజ్దార్ (తాహా షా బహదూర్ షా)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మల్లికా జాన్‌తో పాటు తాజ్దార్ తండ్రికి నచ్చదు. ఆయన ఆంగ్లేయులకు బానిసగా ఉంటాడు. వారి నుంచి విముక్తి కోసం తాజ్ దార్ పోరాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆలంజేబును పెళ్లి చేసుకోవాలనే తాజ్ దార్ నిర్ణయాన్ని అతని తండ్రి వ్యతిరేకిస్తాడు. వేశ్య తమ ఇంటికి కోడలిగా రాలేదని తేల్చి చెబుతాడు. మరోవైపు కూతురు ప్రేమ వివాహాన్ని మల్లికా జాన్ కూడా వ్యతిరేఖిస్తుంది. ఈ క్రమంలో మల్లిక వ్యవహారశైలి నచ్చని తన సోదరి వహీదా ఆమెకు గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. దీంతో తన అక్కకు శత్రువుగా ఉన్న ఫరీదాన్ (సోనాక్షి సిన్హా)తో చేతులు కలుపుతుంది. ఇలా హీరామండిలో అనేక సంఘటనలు జరుగుతుండగా బిబోజాన్ (అదితిరావ్ హైదరి) బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జరిగే స్వాతంత్య్ర పోరాటంలో గూఢచారిగా ఉంటుంది. ఒక వేశ్యగా ఉన్న ఆమె ఈ పోరాటం ఎందుకు చేస్తుంది..? బ్రిటీషర్లతో సత్సంబంధాలు పెంచుకుని వారి రహస్యాలను ఎందుకు తెలుసుకుంటుంది..? ఫైనల్‌గా బిబోజాన్ ఒక గూఢచారి అని తెలిసిన తర్వాత బ్రిటీష్‌వాళ్లు ఏం చేశారు..? ఇదే సమయంలో షాహీ మహల్‌కు పెద్ద దిక్కుగా ఉన్న మల్లికా జాన్న్ అనచివేసేందుకు ఫరీదాన్ ఎలాంటి కుట్రలకు తెరలేపింది..? వేశ్య కుటుంబానికి చెందిన ఆరుగురు స్త్రీల చుట్టూ.. నవాబులు, బ్రిటీష్ పోలీస్ అధికారులు, తిరుగుబాటుదారుల మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయనేది తెలియాలంటే హీరామండి సిరీస్ చూడాల్సిందే..ఎలా ఉందంటే..పీరియాడిక్ డ్రామా చిత్రాలను డిఫరెంట్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. స్వాతంత్య్రానికి ముందు అంటే 1930, 1940ల కాలం బ్యాక్‌డ్రాప్‌లో హీరామండి వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాడు. 'హీరామండిలో తెల్లదొరల పెత్తనం కాదు.. మల్లికా జాన్ నాణేలు మాత్రమే చెలామణి అవుతాయి' అని మనీషా కొయిరాలా చెప్పిన ఒక్క డైలాగ్ చాలు.. ఈ సిరీస్ డెప్త్ ఏంటో చెప్పడానికి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఎందరో మహిళలు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ కొందరు చరిత్ర పుటల్లో కలిసిపోతే.. మరికొందరు మాత్రం నేటికి కూడా వినికిడిలో ఉన్నారు. లాహోర్ నగరంలోని హీరామండి ప్రాంతంలో పడుపు వృత్తి నిర్వహించే మల్లికా జాన్‌కు, బ్రిటీష్‌వాళ్లతో మొదలైన వైరాన్ని సంజయ్‌లీలా చక్కగా చూపించాడు. స్వాతంత్య్ర పోరాటంలో 'హీరామండి' పాత్ర ఎంతవరకు ఉందో చెప్పడానికి భారీగానే డైరెక్టర్ ప్లాన్ చేశాడు. మొత్తం 8 ఎపిసోడ్స్‌లలో తన విజువల్ ఫీస్ట్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. హీరామండిలో వేశ్యలుగా ఉన్న వారి జీవితాలను తెరపైన అద్బుతంగా క్రియేట్ చేశాడు. వేశ్యావృత్తితో సమాంతర వ్యవస్థను నడుపుతున్న ఆ మహిళలు స్వతంత్ర సంగ్రామంలోకి ఎందుకు దూకాల్సి వచ్చిందో అదిరిపోయే రేంజ్లో చూపించాడు. ఆంగ్లేయులపై తిరుగుబాటు జరిపి వాళ్ల వెన్నులో వణుకు పుట్టించిన వేశ్యలుగా వారందరినీ తెరపై చూపించి అద్భుతాన్ని ఆవిష్కరించడంలో సంజయ్‌లీలా భన్సాలీ సూపర్ సక్సెస్ అయ్యాడు.తన టేకింగ్, విజువల్ ఫీస్ట్‌తో ప్రతి ప్రేక్షకుడినీ హీరామండి ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఆ కాలంనాటి డిజైన్లను దృష్టిలో పెట్టుకుని అందంగా తీర్చిదిద్దిన భారీ సెట్లతో పాటు చక్కని ఫొటోగ్రఫీ తోడు కావడం ఆపై ప్రతి పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ఈ సిరీస్‌కు ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పచ్చు. ముఖ్యంగా పాటల చిత్రీకరణ మరిన్ని మార్కులు కొట్టేస్తుంది. ఒక వెబ్ సిరీస్ అంత భారీ స్థాయిలో పాటలు అవసరమా అనేలా ఉంటాయి. ప్రారంభంలో రెండు, మూడు ఎపిసోడ్స్‌లలో కథ పరంగా కాస్త నెమ్మదించినా చివరి రెండు ఎపిసోడ్స్ మాత్రం దుమ్మురేపుతాయి. మల్లికా జాన్ పాత్ర పరిచయం చేసిన ఒక ఎపిసోడ్ కూడా మెప్పిస్తుంది. సొంత కుమార్తెలతో సహా ఎవరిపైనా దయాదాక్షిణ్యాలు లేని కఠినాత్మురాలిగా ఆ పాత్రను క్రియేట్ చేసిన విధానం అందరినీ మెప్పిస్తుంది. వేశ్యల జీవితాల చుట్టూ తిరిగే కథనే అయినప్పటికీ, ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపించవు. ఈ వీకెండ్లో చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఈ సిరీస్ ఉంటుంది. బ్రిటీష్ పాలనను దిక్కరించిన హీరామండి చరిత్ర పుటల్లో పెద్దగా కనిపించదు. అలా కనుమరుగైన ఒక చాప్టర్‌ను 'హీరామండి'గా సంజయ్‌లీలా తీసుకొచ్చాడు.ఎవరెలా చేశారంటేరూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్‌లో టాప్ హీరోయిన్లను దర్శకుడు సెలక్ట్ చేసుకున్నాడు. మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్ వంటి స్టార్స్ ఇందులో ఉన్నారు. ఈ సిరీస్‌కు ప్రధాన బలం వారే అని చెప్పవచ్చు. షాహీమహల్‌కు పెద్ద దిక్కుగా మల్లికాజాన్ పాత్రలో మనీషా కొయిరాలా దుమ్మురేపిందని చెప్పవచ్చు. తన కడుపున పుట్టిన కూతుర్లను కూడా వేశ్యలుగా మార్చే అంత కఠినాత్మురాలిగా ఆమె చూపించిన నటన అద్భుతమని చెప్పవచ్చు. మరోవైపు ఫరీదాన్‌గా సోనాక్షి సిన్హా నెగెటివ్ పాత్రలో మెప్పించింది. వీరందరికీ ఏమాత్రం తగ్గకుండా అదితిరావు హైదరీ ఎలివేషన్ మామూలుగా ఉండదు. వేశ్యగా కనిపిస్తూనే గూఢచారిగా తన సత్తా ఎంటో చూపించింది. నటనలో ఆమె ఎక్కడా తగ్గలేదు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేసిందని చెప్పవచ్చు. ఈ సిరీస్‌కు ప్రధాన బలం విజువల్స్, కాస్ట్యూమ్స్,సినిమాటోగ్రఫీ. ఇవన్నీ కూడా ఓటీటీ స్థాయికి మించి ఉన్నాయి. కానీ, ఇందులో ఎక్కువగా యుద్ధ ఘట్టాలు లేకున్నా ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఆనాటి చరిత్రకు.. సమాజంలోని స్థితిగతులకు దర్పణం పట్టేలా సీన్స్ ఉన్నాయి. కాస్త నిడివి తగ్గించి ఉంటే బాగుండు అనే కామెట్లు కూడా వినిపిస్తున్నాయి.
ఫొటోలు
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
Pooja Hegde HD Photos: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
Priyamani: ట్రెడిషనల్ డ్రెస్‌లో కవ్విస్తున్న ప్రియమణి.. లేటెస్ట్ ఫోటోలు వైరల్
CM Jagan In Hindupuram: మీ భూములకు జగన్ గ్యారెంటీ.. హిందూపురం సిద్ధం ప్రచారంలో జనసందోహం (ఫొటోలు)
క్రీడలు
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. శుక్రవారం వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ముంబై సంక్లిష్టం చేసుకుంది. వాంఖడేలో కేకేఆర్ చేతిలో ముంబై జట్టు ఓడిపోవడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ క్రమంలో ముంబై జట్టును విజయం పథంలో నడిపించలేక విఫలమవుతున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం హార్దిక్ పాండ్యా కెప్టెన్స్‌పై మండిపడ్డాడు. "ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. పేపర్‌పై ముంబై జట్టు చాలా బలంగా ఉంది. కానీ మైదానంలో మాత్రం పూర్తిగా తేలిపోతున్నారు.ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురుస్తోంది. బౌలింగ్‌లో ముంబైకి మంచి ఆరంభం లభించింది. 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కేకేఆర్ కష్టాల్లో పడింది.అటువంటి సమయంలో 6వ బౌలర్‌గా నమన్ ధీర్ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? చావ్లాతో ఫుల్ ఓవర్ల కోటాను పూర్తి చేయలేదు. మనీష్ పాండే, వెంకటేష్ అయ్యర్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి కేకేఆర్‌కు మంచి స్కోర్ అందించారు. క్రికెట్లో ఏ జట్టుకైనా కెప్టెన్సీ చాలా ముఖ్యం. కాబట్టి కెప్టెన్సీ విషయంలో మేనేజ్మెంట్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం ముంబై జట్టు ఒక యూనిటీగా ఆడడం లేదు. హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించడం ముంబై ఆటగాళ్లకు సైతం ఇష్టం లేనట్లుందని" స్టార్‌స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2024లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన మార్క్‌ను చూపించలేకపోతుకున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం వాఖండే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ నిరాశపరిచాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన హిట్‌మ్యన్.. కేకేఆర్ బౌలర్లను ఎదుర్కోవడానికి తీవ్రంగా కష్టపడ్డాడు.ఈ క్రమంలో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాగా ఐపీఎల్లో నరైన్ బౌలింగ్‌లో రోహిత్ ఔట్ కావడం ఇది ఎనిమిదో సారి.దీంతో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔట్ అయిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అంతకుముందు రోహిత్ శర్మ స్పిన్నర్ అమిత్ మిశ్రా చేతిలో కూడా 7 సార్లు ఔటయ్యాడు. రోహిత్ పాటు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, రిషబ్ పంత్, రహానే కూడా 7 సార్లు ఒకే బౌలర్ చేతిలో ఔటయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్‌పై కేకేఆర్ 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్, శ్రీలంక బౌలర్ మతీశ పతిరణ టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ధోని తనకు తండ్రిలాంటి వాడని పేర్కొన్నాడు. తన కన్న తండ్రి మాదిరే ధోని కూడా తనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడని తెలిపాడు.కాగా ఐపీఎల్-2022కు సిసంద మగల దూరం కాగా అతడి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్‌లో అడుగుపెట్టాడు పతిరణ. ఆ మరుసటి ఏడాది అంటే 2023లో 12 మ్యాచ్‌లలో కలిపి 19 వికెట్లు పడగొట్టాడు.ధోని నాయకత్వంలో సీఎస్కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. బేబీ మలింగగా ప్రశంసలు అందుకుంటూ ప్రస్తుతం సీఎస్కే ప్రధాన పేసర్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు.అయితే, దీనకంతటికి కారణం ధోనినే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యువ పేసర్ ఆరంభంలో తడబడ్డా తలా అతడికి అండగా నిలిచాడు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్న సమయంలోనూ నైతికంగా మద్దతునిచ్చాడు.ఈ నేపథ్యంలో తాజాగా సీఎస్కే ‘లయన్స్ అప్‌క్లోజ్’ చాట్‌లో మతీశ పతిరణ మాట్లాడుతూ ధోనితో తన అనుబంధం గురించి వివరించాడు. ‘‘మా నాన్న తర్వాత నా క్రికెట్ లైఫ్‌లో తండ్రి పాత్ర పోషించింది ధోనినే.నన్నొక చిన్నపిల్లాడిలా చూసుకుంటారు. నా పట్ల శ్రద్ధ వహిస్తారు. అవసరమైన సమయంలో సలహాలు, సూచనలు ఇస్తుంటారు. నేను ఎప్పుడు ఏం చేయాలో చెబుతూ ఉంటారు.ఇంట్లో మా నాన్న నాతో ఇలా ఉంటారో ఇక్కడ ధోని కూడా నాతో అలాగే ఉంటారు. చిన్న చిన్న విషయాలను కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తలు చెబుతారు. నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగేలా మోటివేట్ చేస్తారు.మైదానం వెలుపల మేము ఎక్కువగా మాట్లాడుకోము. అయితే, నన్ను కలిసిన ప్రతిసారీ.. ‘‘ఆటను ఆస్వాదించు. ఫిట్నెస్ కాపాడుకో’’ అని చెబుతారు.మహీ భాయ్.. మీరు వచ్చే సీజన్లోనూ ఆడాలి. ప్లీజ్ మాతో కలిసి ఆడండి.. అప్పటికీ నేనిక్కడ ఉంటే(నవ్వుతూ)’’ అంటూ పతిరణ ధోని పట్ల అభిమానం చాటుకున్నాడు.కాగా ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా.. ధోని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక పతిరణ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు కూల్చాడు. సీఎస్కే ఆడిన 10 మ్యాచ్‌లలో ఐదు గెలిచి పట్టికలో ఐదో స్థానంలో ఉంది.The bond beyond the field 💛🫂#LionsupClose Full video 🔗 - https://t.co/xt5t6K9SjR #WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/odZdVvlrF6— Chennai Super Kings (@ChennaiIPL) May 4, 2024
పదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు
బెంగళూరు: భారత్‌లో దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు పర్యటన ఖరారైంది. వచ్చే జూన్, జూలైలో పూర్థిసాయి ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా భారత్‌తో దక్షిణాఫ్రికా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. ముందుగా బెంగళూరులో జూన్ 16న వన్డే సిరీస్ మొదలవుతుంది. 19న రెండో వన్డే, 23న మూడో వన్డేతో 50 ఓవర్ల ఫార్మాట్ ముగుస్తుంది. వన్డే సిరీస్ ముగిశాక ఏకైక టెస్టు పోరు జూన్ 28 నుంచి చెన్నైలో జరుగుతుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇది కేవలం మూడో టెస్టు కానుంది. దక్షిణాఫ్రికాలోని పార్ల్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు 2002లో... భారత్‌లోని మైసూరు వేదికగా రెండో టెస్టు 2014లో జరిగాయి. ఆ తర్వాత ఈ రెండు జట్లు టెస్టు ఫార్మాట్లో మరో మ్యాచ్ ఆడలేదు. దక్షిణాఫ్రికాతో ఆడిన రెండు టెస్టుల్లోనూ భారతే నెగ్గింది. ఏకైక టెస్టు ముగిశాక బెంగళూరులో ఈ రెండు జట్ల మధ్య జూలై 5, 7, 9 తేదీల్లో మూడు టి20ల సిరీస్ జరుగుతుంది.
బిజినెస్
Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలలో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడం వంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ ఒకటి వెల్లడైంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి టెక్ కంపెనీలు.layoffs.fyi ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. టెక్నాలజీ రంగంలోని 50 కంపెనీల నుండి ఒక్క ఏప్రిల్ నెలలోనే 21,473 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ఈ ఏడాది లేఆఫ్‌ల ధోరణికి ఏప్రిల్ నెల తొలగింపులు అద్దం పడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కనీసం ఇప్పటి వరకూ 271 కంపెనీలు 78,572 మంది ఉద్యోగులను తొలగించాయి. జనవరిలో 122 కంపెనీలలో 34,107 ఉద్యోగాల కోతలు జరిగాయి. ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 మందిని తొలగించాయి. ఇక మార్చిలో 37 కంపెనీల్లో 7,403 మంది ఉద్యోగాలను కోల్పోయారు. మార్చి నుంచి ఏప్రిల్‌కు ఒక్క నెలలో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ఏప్రిల్‌లో టెక్ తొలగింపులుయాపిల్ ఇటీవల 614 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొదటి ప్రధాన రౌండ్ ఉద్యోగ కోత.పైథాన్, ఫ్లట్టర్, డార్ట్‌లో పనిచేస్తున్న వారితో సహా వివిధ టీమ్‌లలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను గూగుల్ తొలగించింది.అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది ఉద్యోగాలను తగ్గించింది.ఇంటెల్ దాని ప్రధాన కార్యాలయంలోని దాదాపు 62 మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది. ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది.ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా అత్యధికంగా 14 వేల మందిని లేఆఫ్ చేసింది.ఓలా క్యాబ్స్ దాదాపు 200 ఉద్యోగాలను తొలగించింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీఫైమ్ దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించింది. గృహోపకరణాలను తయారు చేసే వర్ల్‌పూల్ సుమారు 1,000 మందిని లేఆఫ్ చేసింది.టేక్-టూ ఇంటరాక్టివ్ కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 5% మందిని తొలగించింది. నార్వేలోని టెలికాం కంపెనీ టెలినార్ 100 మంది ఉద్యోగులను తొలగించింది.
అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
రూ.లక్షలు ఖర్చుపెట్టి ఇల్లు కట్టుకుంటాం. నచ్చిన విధంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటాం. భద్రంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగితే విలువైన వస్తువులు కాలిపోవడంతోపాటు కొన్నిసార్లు మనుషుల ప్రాణాలు పోవచ్చు. ఫైరింజన్ సిబ్బందికి సమాచారం అందించినా వారు వచ్చేలోపు ప్రమాదం మరింత తీవ్రస్థాయికి చేరవచ్చు. అసలే వేసవికాలం ఇలాంటి ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇళ్లు నిర్మించుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మరింత రక్షణగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంటితోపాటు కంపనీలు, షాపింగ్‌మాల్స్, భవనాల్లో తప్పకుండా ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉపయోగించాలంటున్నారు. వీటికోసం చేసే చిన్నపాటి ఖర్చుతో ఇంటికి మరింత భద్రత కల్పించవచ్చని చెబుతున్నారు. వాటిని ఎంచుకునేముందు కనీస అవగాహన తప్పనిసరని అభిప్రాయపడుతున్నారు.మంటలను ఆర్పేందుకు ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు చాలా రకాలుగా ఉంటాయి.స్టాండర్డ్ వాటర్: కాగితం, కార్డ్బోర్డ్, ప్లాస్టిక్, కలప, ఫ్యాబ్రిక్‌కు అంటిన మంటలను అదుపు చేయవచ్చు.డ్రైవాటర్ మిస్ట్: నీటి రేణువులను పొడి సూక్ష్మకణాలుగా మార్చి మంటపై చల్లుతుంది.వెట్ కెమికల్: మంటలపై సబ్బు ద్రావణాన్ని చల్లుతుంది. కొవ్వులు, వంట నూనెల వల్ల సంభవించే మంటలను అదుపు చేయవచ్చు. పౌడర్: పెట్రోల్, డీజిల్, గ్యాసోలిన్ నుంచి వచ్చే మంటలు, మీథేన్, ప్రొపేన్, బ్యూటేన్ వంటి వాయువుల వల్ల ఏర్పడే వాటినిక ఆర్పవచ్చు. కార్బన్ డైయాక్సైడ్: పెట్రో ఉత్పత్తులు, విద్యుత్తు వల్ల కలిగే మంటలు తగ్గించవచ్చు.వాటర్ మిస్ట్ టైప్ ఫైర్: వరండాలు, వంట గదిలో వాడుకోవచ్చు. ఇది మంటపై నీటిని స్ప్రే చేస్తుంది.
రూ.194 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ తన ఇన్వెస్టర్లకు రూ.10 ముఖవిలువ కలిగిన ప్రతి షేరుకు రూ.194 డివిడెండ్ ప్రకటించింది.2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎంఆర్ఎఫ్ నికరలాభం రూ.2081 కోట్లుగా నమోదైంది. 2022-23 నికరలాభం రూ.769 కోట్లుగా కంపెనీ పోస్ట్ చేసింది. కార్యకలాపాల ఆదాయం కూడా రూ.23,008 కోట్ల నుంచి రూ.25,169 కోట్లకు వృద్ధి చెందినట్లు చెప్పింది.మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.341 కోట్లతో పోలిస్తే ఇది 16% ఎక్కువ. కంపెనీ తాజాగా ప్రకటించిన డివిడెండ్‌తోపాటు ఇప్పటికే మధ్యంతర డివిడెండ్‌ను రెండుసార్లు రూ.3 చొప్పున సంస్థ అందించింది.ఇదీ చదవండి: నేపాల్‌లో నిలిచిన ఇంటర్నెట్ సేవలు.. కారణం..బ్రిటానియా రూ.73.50 డివిడెండ్బ్రిటానియా ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసికంలో రూ.536.61 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాలంలో నమోదుచేసిన లాభం రూ.557.60 కోట్ల కంటే ఇది తక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.4023.18 కోట్ల నుంచి 1.14% పెరిగి రూ.4069.36 కోట్లకు చేరింది. రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.73.50 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.
Income tax: నెల రోజుల్లో 6 లక్షల ఐటీ రిటర్న్స్
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ స్వీకరణ ప్రారంభమైన నెల రోజుల్లో దాదాపు 6 లక్షల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిని ఆదాయపన్ను శాఖ అంతే వేగంగా ప్రాసెస్ చేయడం విశేషం. వెరిఫై చేసిన రిటర్న్స్‌లో దాదాపు మూడింట రెండు వంతులు ఇప్పటికే ప్రాసెస్ అయినట్లు బిజినెస్ లైన్ నివేదించింది.2024-25 అసెస్మెంట్ ఇయర్ (FY25) మొదటి నెలలో ఏప్రిల్ 29 నాటికి 5.92 లక్షలకు పైగా రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిలో 5.38 లక్షలకు పైగా వెరిఫై కాగా 3.67 లక్షల వెరిఫైడ్ రిటర్న్స్‌ను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున అంటే ఏప్రిల్ 1న ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించింది.ముందస్తుగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు త్వరగా రీఫండ్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పెనాల్టీ లేకుండా రిటర్న్స్‌ను రివైజ్ చేయడానికి లేదా సరిచేయడానికి తగినంత సమయం లభిస్తుంది. అయితే, ఉద్యోగులు మాత్రం కొంత సమయం వేచి ఉంటే మంచిదని సూచిస్తున్నారు. కా 2024-25 అసెస్మెంట్ ఇయర్‌కు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ.
వీడియోలు
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
ఫ్యామిలీ
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
మాస్టర్‌బ్లాస్టర్, సచిన్ టెండూల్కర్ కుమార్తె, Gen-Z సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సారా టెండూల్కర్ గురించి పెద్ద పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో భారీ అభిమానులను సంపాదించుకున్న సారా, తన లైఫ్ స్టయిల్, ఇతర విషయాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల టీనేజ్ అమ్మాయిగా తాను ఎదుర్కొన్న సమస్యల గురించి బహిరంగా మాట్లాడింది. ముట్టుకుంటే కందిపోయే సున్నితంగా, మెరిసిసోయే చర్మంతో కనిపించే సారా పీసీఓఎస్‌తో చాలా ఇబ్బందులు పడిందట. విపరీతమైన మొటిమలతో బాధపడేదట. యుక్తవయస్సులో PCOSతో తన పోరాటం గురించి ప్రముఖ మ్యాగజీన్ వోగ్‌తో మాట్లాడింది. పీసీఓఎస్, ఇతర సమస్యల నుంచి విముక్తి పొందేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేదని, చివరికి జీవన శైలి మార్పులతోనే పరిష్కారం లభించిందని చెప్పుకొచ్చింది. ‘‘యాసిడ్, రెటినాల్ నుండి లేజర్ల వరకు అన్నీ ప్రయత్నించా. కానీ ఏవీ పని చేయలేదు"- సారాసాధారణ శిక్షణ తర్వాత, బరువు తగ్గడం, ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడంతో పాటు ఎక్కువగా నీళ్లు తాగడం లాంటివి చేసింది. ఫలితంగా తన స్కిన్ అద్భుతంగా మారి, పీసీఓఎస్ సమస్య కూడా తగ్గిందని వెల్లడించింది. మెడిసిన్ రంగంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన సారా మోడల్‌గా ఫ్యాషన్ ప్రపంచంలో కూడా రాణిస్తోంది. పలు బ్రాండ్లతో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే.పీపీఓఎస్ అనేది నేడు చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. హార్మోన్ల అసమతుల్యత వల్ల మొటిమలు, బరువు పెరగడం, ముఖంపై అవాంఛిత రోమాలు, పీరియడ్స్ సమస్యలు, సంతాన లేమి మొదలైన సమస్యలు వస్తాయి.
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
ప్రకృతి అపూర్వమైన సంపద, మూలికలకు నిలయం. ప్రకృతిలో మమేకమైన పక్షులకు జంతువులే ఈ విషయాన్ని ఎక్కువగా పసిగడతాయి. మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు, మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయి అనడానికి నిదర్శనంగా ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి వెలుగులో వచ్చింది. ఇండోనేషియాలో పరిశోధకులు తొలిసారిగా ఈ విషయాన్ని రికార్డు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయిసుమత్రన్ ఒరాంగుటాన్స్ అనే జాతికి చెందిని రాకుస్ అనే మగ కోతి (ఒరంగుటాన్) తనకు తనే వైద్యం చేసుకుంది. సుమత్రన్ ఒరంగుటాన్ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోని గునుంగ్ ల్యూజర్ నేషనల్ పార్క్‌లో ఈ దృశ్యాలను రికార్డుచేశారు. ఇండోనేషియాలోని నేషనల్ యూనివర్సిటీ, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ సంస్థలకు చెందిన పరిశోధకులు కొన్ని రోజులుగా ఈ తోక లేని కోతులపై అధ్యయనం చేస్తున్నారు.సైంటిఫిక్ రిపోర్ట్స్‌లోని ఒక అధ్యయనం ప్రకారం ఒక మగ కోతికి మరో కోతితో జరిగిన కొట్లాటలో ముఖానికి గాయమైంది. ఒక చెట్టు ఆకులోని ఔషధ గుణాలను గుర్తించింది రాకూస్. ఫైబ్రేరియా టింక్టోరియా" అనే శాస్త్రీయ నామంతో పిలిచే మొక్కల ఆకులతో వైద్యం చేసుకున్నది. ఈ ఆకులు నమిలి, వాటి పసరును దవడ గాయంపై రాసుకుంది. తర్వాత నమిలిన ఆకులను గాయంపై పెట్టుకుంది. అంతేకాదు గాయం మానేందుకు ఈ కోతి ఎక్కువ సేపు నిద్రపోయిందని కూడా పరిశోధకులు గుర్తించడం విశేషం.ఒక అడవి జంతువు చాలా శక్తివంతమైన ఔషధ మొక్కను నేరుగా గాయానికి పూయడాన్ని గమనించడం ఇదే తొలిసారి అని జర్మనీలోని కాన్స్టాంజ్లోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్, జీవశాస్త్రవేత్, ఈ స్టడీ సహ రచయిత ఇసాబెల్లె లామర్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ మొక్కలో నిజంగానే ఔషధ గుణాలు ఉంటాయని, మలేరియా, విరేచనాలు, డయాబెటిస్ చికిత్సలో ఈ మొక్కలు వాడుతారని పేర్కొన్నారు.
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
ప్రజలకు దారి చూపినవాడు నాయకుడవుతాడు. ప్రజలు నడిచే దారిలో తానూ నడిచినవాడే నాయకుడవుతాడు. ప్రజలు నాయకుడి వైపు ఎందుకు చూస్తారు? మా దారిలో కష్టం ఉంది తొలగించు... మా గింజలకు వెలితి ఉంది పూరించు... మాకు జబ్బు చేస్తే వైద్యానికి దోవ లేదు చూపించు... మా పిల్లలకు చదువు చెప్పించు... మా నెత్తిన ఒక నీడ పరువు... మా పిల్లలకు ఒక ఉపాధి చూపించు... ఇలా చెప్పుకోవడానికే కదా.అవి విన్నవాడే నాయకుడవుతాడు. నేను ఉన్నానని అనేవాడే పాలకుడవుతాడు.ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు, రెండు రాష్ట్రాలుగా విడిపోయాక వర్తమాన పరిణామాలకు మూలాలు ఏమిటో తెలియడం తెలుగు ప్రజలకు అవసరం. ఎందుకంటే ప్రజల నొసట రాత పాలకులే రాస్తారు. నాటి మద్రాసు రాష్ట్రంతో మొదలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, హైదరాబాద్ స్టేట్ ఆవిర్భావం, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రకటన, తెలంగాణ ఉద్యమాల దరిమిలా తెలుగు రాష్ట్రాల విభజన... వీటన్నింటిలో పాలకుల ఎత్తుగడలకు, ప్రజల ఆకాంక్షలకు జరిగిన ఘర్షణ ఒక క్రమానుగతంగా చదివితే ఎక్కడెక్కడ నాయకుడనేవాడవసరమో అక్కడక్కడ తెలుగు జాతి ఒక నాయకుణ్ణి తయారు చేసుకోగలిగింది అనిపిస్తుంది. అయితే ముందే చెప్పుకున్నట్టుగా ఈ నాయకుల్లో ప్రజల కోసం నిలిచే నాయకులూ ఉన్నారు. ప్రజలను వంచించే నాయకులూ ఉన్నారు.సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల విషయంలో ప్రదర్శించిన అహం, ప్రోత్సహించిన ముఠా రాజకీయాల సంస్కృతి ఆంధ్రరాష్ట్రాన్ని ఒక అనిశ్చితిలోనే ఉంచాయి. స్థిరంగా నిలిచి, బలంగా కొనసాగే నాయకుడు ఉన్నప్పుడే జాతి ముందుకు వెళ్లగలదు. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్‌కు సమర్థమైన నాయకత్వం వహించినా కుర్చీ కింద పెట్టే మంటలు వారిని కుర్చీ వదులుకునేలా చేశాయి. అసలు తెలుగువారికి ఒక ఆత్మాభిమానం ఉందా అనే సందేహం కలిగించాయి.ఈ సందర్భమే ఎన్.టి.రామారావు పుట్టుకకు కారణమైంది. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన నాయకుడిగా, చరిష్మా కలిగిన పాలకుడిగా, పేదవాడి గురించి ఆలోచన చేసిన అభిమాన నేతగా ఎన్.టి.రామారావు ప్రజల మెప్పును పొందారు. కాని ఆయన అహం, తొందరపాటు చర్యలు కుట్రలకు తెరలేపాయి. చంద్రబాబు నాయుడు తెలుగుజాతి అవమానపడే రీతిలో ఎన్.టి.ఆర్‌ను వెన్నుపోటు పొడిచి దొడ్డి దారిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీతో పాటు పార్టీ ఫండ్ ఉన్న అకౌంట్‌ను కూడా హస్తగతం చేసుకున్న వార్త అందిన రోజున ఎన్.టి.ఆర్. తీవ్ర మనస్తాపం చెందారు. అదే ఆయన మృతికి కారణమైందన్న భావన ఉంది.‘దేశమంటే మట్టి కాదోయ్.. మనుషులోయ్’ అన్నాడు గురజాడ. ఒక రాష్ట్రాన్ని ప్రజల వారసత్వంగా చూడాల్సిందిపోయి దానినో కార్పొరెట్ ఆఫీసుగా మార్చి, దానికి తాను సి.ఇ.ఓగా భావించి పాలించడం మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు పాలనలో తెలుగు ప్రజలు చులకనను ఎదుర్కొన్నారు. గుండు దెబ్బలు తిన్నారు. నీతి, రీతులే వ్యక్తిత్వమని భావించే మన సంస్కృతిలో వంచనతో వచ్చిన నాయకుడిని నమ్మి మోసపోతున్నామని తెలుగు ప్రజలకు పదేపదే అనిపించిన ఉదంతాలు ఉన్నాయి. వై.ఎస్.రాజశేఖర రెడ్డి వచ్చి పెద్ద గీత గీసే వరకూ చంద్రబాబు ఎంత చిన్న గీతో ప్రజలకు అర్థమైందని విశ్లేషకులు అంటారు.ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల చేత... పాలన చేస్తే ఎలా ఉంటుందో వై.ఎస్.రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు చూపారు. విశాలమైన హృదయం, దయ, ఆర్ద్రత ఉన్న నాయకుడు తన పాలనలో ప్రతి వ్యక్తి ఉన్నతి కోసం తపన పడతాడని, పడాలని వై.ఎస్.రాజశేఖరరెడ్డి చూపారు. ఆరోగ్యశ్రీ, ఫీజ్ రియింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత కరెంట్, జలయజ్ఞం... రాష్ట్రం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతున్నదని ప్రజలు పూర్తి సంతృప్తితో, సంతోషంగా ఉన్న కాలమది.కాని రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తెలుగుజాతిని స్థాణువును చేసింది. రాజశేఖర రెడ్డిని చూసిన కళ్లు అలాంటి నాయకుడి కోసమే వెతుకులాడాయి. ఆ నాయకుణ్ణి వై.ఎస్.జగన్‌లో చూసుకున్నాయి. అయితే రాజకీయ కుయుక్తులు పన్నడంలో తలపండిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, జగన్‌కు మధ్య సైంధవుడిలా నిలిచారు. టక్కుటమార విద్యలు ప్రదర్శించి, అబద్ధాల మేడలు కట్టి మరోసారి జనాన్ని నమ్మించి సి.ఎం. అయ్యారు. కాని చంద్రబాబు పరిపాలనా కాలంలో రాష్ట్రం మన్నుతిన్న పాములా ఉండిపోయింది. చిన్నా చితక పథకాల ప్రయోజనాల కోసం కూడా ప్రజలు అల్లల్లాడారు. ఒక వర్గం ప్రజలు రాజధాని నిర్మాణం వల్ల లబ్ధి పొందుతున్నారని సామన్యులకు అవగతమైంది. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుని కోసం వారు తిరగబడ్డారు. వై.ఎస్.జగన్‌ని తమ ముఖ్యమంత్రిని చేసుకున్నారు.రాష్ట్ర విభజన వల్ల అనేక వెసులుబాట్లు కోల్పోయి, నిధుల లోటులో రాష్ట్రం ఉన్నప్పటికీ జగన్ తన విశిష్ట సమర్థతతో ప్రజాహిత పాలన కోసం నవరత్నాలతో ముందుకు వచ్చారు. రెండేళ్ల కరోనా కాలం ప్రపంచాన్ని స్తంభింపచేసినా తెలుగు రాష్ట్రం ముందంజలో ఉండేలా చూసుకున్నారు. విద్య నుంచి వికాసం, వైద్య ఖర్చు నుంచి విముక్తి ప్రధాన అజెండాగా చేసుకున్న జగన్ విస్తృత తెలుగు సమూహాలను గట్టున పడేశారు. తెలుగు ప్రజలు ఎన్నడూ చూడని విధంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణి జరిగింది. రాజధానిలో పేదలకూ చోటుండాలని భావించిన జగన్ వంటి ముఖ్యమంత్రి ఉన్నారా?దారులు స్పష్టం. ప్రజలు ఏ దారిని ఎంచుకోవాలో తమకు తాముగా నిర్ణయించుకోవాలని అంటారు దేవులపల్లి అమర్. ఆయన రాసిన ‘మూడు దారులు’ గ్రంథం ఆంధ్ర రాష్ట్ర అవతరణ నుంచి మొదలయ్యి ప్రభావవంతమైన ముఖ్యమంత్రులుగా పని చేసిన ఎన్.టి.రామారావు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి ధోరణులను తెలియచేస్తూ ఇప్పుడు వై.ఎస్. జగన్‌తో తల పడుతున్న చంద్రబాబు ‘యూ టర్న్’లను, వెన్నుపోట్లను, నమ్మించి వచించిన సంఘటలను విపులంగా తెలియచేసి పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది.అనుభవజ్ఞుడైన జర్నలిస్టుగా మాత్రమే కాదు, చేయి తిరిగిన జర్నలిస్టుగా కూడా దేవులపల్లి అమర్ ఎంతో సులభంగా, సరళంగా చరిత్రని, వర్తమానాన్ని, తెలుగు నేలకు సంబంధించిన రాజకీయ ఘటనలను ఒక వరుసలో ఉంచి పాఠకులకు గొప్ప అవగాహన కలిగిస్తారు. కొన్ని ఘటనలు జరక్కపోయి ఉంటే తెలుగు జాతి మరింత ముందంజలో ఉండేది కదా అనిపించే విషయాలన్నో ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇది నేటి రాజకీయ కార్యకర్తలకు, నిపుణులకే కాదు భావి విద్యార్థులకు కూడా కీలకమైన రిఫరెన్స్ గ్రంథం.‘చరిత్రదేముంది... చింపేస్తే చిరిగి పోతుంది’ అనేది సినిమాలో డైలాగ్. కాని చరిత్ర చిరిగిపోదు. అలాగే ఉంటుంది. మళ్లీ మళ్లీ ఉజ్జీవనం చెందుతూనే ఉంటుంది. చరిత్ర నిర్మింపబడే కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విభజన అయ్యాక కాళ్లూ చేతులు ఊనుకుని ఒక గొప్ప పురోగమనానికి సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ ఈ సమయంలో ఎటువంటి నాయకుణ్ణి ఎన్నుకోవాలో, తద్వారా ఎటువంటి ఘన చరిత్రకు తెలుగు జాతి ఆలవాలంగా ఉండాలో ఈ ఎన్నికల కాలంలో నిర్ణయించుకోవాలి. దారి స్పష్టం కావాలంటే ఈ గ్రంథం చదవండి.మూడు దారులు– రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు; రచన– దేవులపల్లి అమర్; ప్రచురణ– రూప బుక్స్; పేజీలు: 210; వెల–395; ప్రతులకు–రూప పబ్లికేషన్స్, హైదరాబాద్.– వి.ఎన్.ప్రసాద్ (చదవండి: మూడు దారులు– రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు)
అదిరే..అదిరే మాధురి స్టయిలే అదిరే!
క్రైమ్
కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
విదేశాల్లో బిడ్డ దగ్గరకు వెళ్లి ఆనందంగా ఉన్న సమయంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండియాకు చెందిన దంపతులు, వారి మూడు నెలల మనవడు దుర్మరణం చెందారు. ఆ కారులో ఉన్న చిన్నారి తల్లిదండ్రులు కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టొరంటోకు తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విట్బీలోని హైవే 401పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై విచారాన్ని వ్యక్తం చేసిన ఒట్టావాలోని భారత హైకమిషన్ మృతులకు సంతాపాన్ని తెలియజేసింది.ఏం జరిగిందంటే ఇండియాకు చెందిన మణివణ్ణన్(60) మహాలక్ష్మి(55) దంపతులు ఎజాక్స్‌లో ఉంటున్న మనవడిని చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అందరూ కలిసి బయటికి వెళ్లగా మృత్యువు వారిని కబళించింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం . బోమన్‌విల్లేలో మద్యం దుకాణంలో చోరీ చేసిన ఇద్దరు నిందితులను పోలిసులు వెంబడించారు. పోలీసులను నుంచి తప్పించు కునే క్రమంలో హైవేపై వ్యాన్‌లో రాంగ్రూట్లో వెళుతూ వారు పలు కార్లను ఢీకొట్టారు. ఇందులో బాధితుల కారు కూడా ఉంది. ఈ ఘటనలో నిందితుల్లో ఒకరు ఘటనా స్థలంలోనే మరణించాడు. చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ,తల్లి ఐసీయూలో ఉందని ఒంటారియో స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ యూనిట్ (SIU) తెలిపింది.‘‘ఎప్పటిలాగే ఆ హైవేపై కారులో వెళుతున్నాను ఇంతలో నిందితులు రాంగ్రూట్లో ఎదురుగా వచ్చారు. ఆరు కార్లను ఢీకొట్టారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆ క్షణం నా కళ్లను నేనే నమ్మలేకపోయాను’’ ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ ఓ ప్రత్యక్ష సాక్షి మరోవైపు ఘటనపై కెనడా పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందనేది ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలతో వివిధ కోణాలలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై టొరొంటోలోని భారతీయ కాన్సులేట్ విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి సంతాపం తెలియజేసింది. ఈ ఘటనపై కెనడా అధికారులతో టచ్‌లో ఉన్నామని బాధిత కుటుంబానికి అన్నిరకాలుగా అండగా ఉంటామని పేర్కొంది.
Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
బంజారాహిల్స్: జీహెచ్ఎంసీ స్ట్రీట్‌లైట్ విభాగం సిబ్బంది నిర్లక్ష్యం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. తనకు ఉద్యోగం వచి్చందన్న ఆనందాన్ని జీవిత భాగస్వామితో పంచుకునేందుకు వెళ్తున్న ఓ యువకుడిని కరెంటు స్తంభం రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన తుమ్మా భవానీ రుషి (35) హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆయన భార్య సుజాత స్లేట్ స్కూల్లో టీచర్. యూసుఫ్‌గూడ సమీపంలోని వెంకటగిరిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. గురువారం ఉదయం రుషి ఎక్కువ జీతంతో కూడిన మరో ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. సాయంత్రం తనకు కొత్త సంస్థలో ఉద్యోగం వచ్చిందని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. రాత్రి 10 గంటల సమయంలో కృష్ణానగర్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో మెయిన్ రోడ్డులోని మెట్రో ఫిల్లర్ నంబర్– 1546 వద్ద జీహెచ్ఎంసీ సర్కిల్– 19 వీధిదీపాల కరెంటు స్తంభానికి అతని చేయి తగిలింది. స్ట్రీట్‌లైట్ స్తంభానికి ఉన్న ఫ్యూజ్‌బాక్స్ ఓపెన్ చేసి ఉండడం, విద్యుత్ తీగలు వేలాడుతూ స్తంభానికి ఆనుకుని ఉండడంతో షాక్‌కు గురై రుషి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం కారణంగానే తన భర్త విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు పోలీసులకు రుషి భార్య సుజాత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ సర్కిల్–19 స్ట్రీట్‌లైట్ విభాగం అధికారులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. 2016 జనవరి 17వ తేదీన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి రోహిత్‌వేముల ఆత్మహత్యపై గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి శుక్రవారం పలు ఎల్రక్టానిక్, సోషల్ మీడియా చానళ్లలో రకరకాల వార్తలు, కథనాలు ప్రస్తారమయ్యాయి. దీనిపై స్పందించిన డీజీపీ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ‘ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా మాదాపూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన తుది నివేదిక గత సంవత్సరం అంటే నవంబర్ 2023 కన్నా ముందే నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా తయారు చేశారు. ఆ తుది నివేదికనే అధికారికంగా 21.03.2024న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంబంధిత కోర్టులో దాఖలు చేశారు. అయితే విచారణ, విచారణ జరిగిన విధానంపై రోహిత్ వేముల తల్లితోపాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో కేసు విషయంలో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించామని, తదుపరి దర్యాప్తును అనుమతించాలని మేజి్రస్టేట్‌ను అభ్యర్థిస్తూ సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం’అని డీజీపీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ముందస్తు బెయిల్ ఇవ్వండి: కోర్టులో రేవణ్ణ పిటిషన్
బెంగళూరు: ఒక మహిళ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి హెచ్డి రేవణ్ణ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. బెయిల్ కోసం బెంగళూరు సెషన్స్‌కోర్టులో శుక్రవారం(మే3) పిటిషన్ వేశారు. తన తల్లిని రేవణ్ణ ఎత్తుకుపోయారని రేవణ్ణ ఫామ్‌హౌజ్‌లో పనిచేసే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని కేఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో రేవణ్ణపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల(సెక్స్ స్కాండల్) వీడియోల కేసులో రేవణ్ణ శుక్రవారం సిట్ ముందుకు రావాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు.