Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page
Advertisement

ప్రధాన వార్తలు

Andhra Pradesh Lok Sabha And Assembly Election Results 2024 Live Updates
ఏపీ ఎన్నికల ఫలితాలు.. లైవ్‌ అప్‌డేట్స్‌

AP Election 2024 Counting And Results Updates9:01 AM, June 4th, 2024ఆత్మకూరులో మేకపాటి విక్రమ్‌రెడ్డి ముందంజకడప పార్లమెంట్‌ స్థానంలో వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఆధిక్యంనంద్యాల, కర్నూలు జిల్లాలో నెమ్మదిగా సాగుతున్న కౌంటింగ్‌8:53 AM, June 4th, 2024కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఆధిక్యంఅవినాష్‌రెడ్డి 4362(ఆధిక్యం)భూపేష్ వెనుకంజ 2,088షర్మిల-11018:51 AM, June 4th, 2024చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఆధిక్యంగజపతినగరంలో అప్పలనర్సయ్య ఆధిక్యంతిరుపతి ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంచంద్రగిరి అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం8:36 AM, June 4th, 2024కాకినాడ: పిఠాపురం పోస్టల్‌ బ్యాలెట్‌లో ఎక్కువ చెల్లని ఓట్లుపిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అభ్యర్థి పవన్‌ కల్యాణ్‌మొదట చెల్లని ఓట్లు వేరు చేస్తున్న సిబ్బంది8:27 AM, June 4th, 2024తూర్పు గోదావరిరాజమండ్రి రూరల్‌ పోస్టల్ బ్యాలెట్.. కూటమి అభ్యర్థి ముందంజ రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి లీడ్‌ 5,795 ఓట్లకు పైగా ఆధిక్యం8:25 AM, June 4th, 2024నంద్యాలనంద్యాల జిల్లా కు సంబంధించి ఆరు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంపటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికల కౌంటింగ్8:22 AM, June 4th, 2024పశ్చిమగోదావరిజిల్లాలోప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్.నర్సాపురం పార్లమెంట్ పరిధిలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ 13,340 ఓట్లు8:15 AM, June 4th, 2024పల్నాడు నరసరావుపేట లోని కాకాని కౌంటింగ్ కేంద్రం వద్ద కుప్పకూలిన పడిపోయిన తెలుగుదేశం ఏజెంట్ గట్టినేని రమేష్108 సాయంతో హాస్పిటల్ హాస్పిటల్ కి తరలింపు8:09 AM, June 4th, 2024అమలాపురం నియోజకవర్గ పరిధిలో చెయ్యేరు ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన కలెక్టర్ హ్యూమన్సు శుక్లా8:09 AM, June 4th, 2024ఏలూరు జిల్లాలో మొదలైన కౌంటింగ్ ప్రక్రియస్ట్రాంగ్ రూముల నుంచి కౌంటింగ్ సెంటర్లకు ఈవీఎంలు తరలింపుతొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభంఏలూరు జిల్లాలో 17,500 పోస్టల్ ఓట్లు 8:05 AM, June 4th, 2024పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభంఅభ్యర్థుల సమక్షంలో తెరుచుకున్న స్ట్రాంగ్‌ రూమ్‌లుపోస్టల్‌ల్‌ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు7:59 AM, June 4th, 2024అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరుస్తున్న అధికారులుకాసేపట్లో ప్రారంభం కానున్న పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్పోస్టల్‌ల్‌ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లుఎప్పడూ లేనంత హై అలర్ట్‌లో పార్టీల అభ్యర్థులుఏపీ వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్‌ కేంద్రాలుపోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసిన 4.61 లక్షల మంది ఓటర్లు7:43 AM, June 4th, 2024అమలాపురం కౌంటింగ్‌ సెంటర్‌లో పినిపే విశ్వరూప్‌అమలాపురంలో కౌంటింగ్ సెంటర్‌కి వచ్చిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్బాపట్ల కేంద్రానికి చేరుకున్న బాపట్ల ఎమ్మెల్యే కోనరఘుపతి7:43 AM, June 4th, 2024చిత్తూరు జిల్లా: కర్ఫ్యూను తలపిస్తోన్న కుప్పంకుప్పంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులుఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులుఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న పోలీసులుకుప్పంలో దుకాణాలు తెరవకూడదని పోలీసులు హెచ్చరించడంతో, దుకాణాలను మూసేసిన వైనం7:34 AM, June 4th, 2024కీలకంగా మారిన పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ ప్రక్రియఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ దాదాపు రెండున్నర గంటలు పట్టే అవకాశంపోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు7:22 AM, June 4th, 2024ఉమ్మడి చిత్తూరు జిల్లా.. ఒక పార్లమెంట్.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ చిత్తూరు 226 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 17 రౌండ్లుపలమనేరు 287 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 21 రౌండ్లుకుప్పం 243 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 18 రౌండ్లుపూతలపట్టు 260 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 19 రౌండ్లుజీడినెల్లూరు 229 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 17 రౌండ్లునగరి 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుపుంగనూరు 262 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 19 రౌండ్లుసత్యవేడు 279 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు 20 రౌండ్లుశ్రీకాళహస్తి 293 పోలింగ్ కేంద్రాలు 14 టేబుల్స్ 21 రౌండ్లుతిరుపతి 267 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు, 20 రౌండ్లుచంద్రగిరి 395 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 29 రౌండ్లుపీలేరు 281 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 21 రౌండ్లుతంబళ్లపల్లి 236 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు-17 రౌండ్లుమదనపల్లి 259 పోలింగ్ కేంద్రాలు 14 టేబుళ్లు- 19 రౌండ్లు7:22 AM, June 4th, 2024కోనసీమ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలురామచంద్రపురం మొత్తం ఓటర్లు 1,73, 91710 టేబుళ్లు 24 రౌండ్లుముమ్మిడివరం మొత్తం ఓటర్లు 2,05, 163, 14 టేబుళ్లు, 19 రౌండ్లుఅమలాపురం మొత్తం ఓటర్లు 1,75, 845,12 టేబుళ్లు, 20 రౌండ్లురాజోలు మొత్తం ఓటర్లు 1,56,40014 టేబుళ్లు, 15 రౌండ్లుపి. గన్నవరం మొత్తం ఓటర్లు 1,65, 749 12 టేబుళ్లు, 18 రౌండ్లుకొత్తపేట మొత్తం ఓటర్లు 2,14, 945 10 టేబుళ్లు-26 రౌండ్లుమండపేట మొత్తం ఓటర్లు 1,91,959 10 టేబుళ్లు-22 రౌండ్లు6:55 AM, June 4th, 2024గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియకౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బందితేలనున్న ఒక పార్లమెంట్ తో పాటు 7 నియోజకవర్గాల భవితవ్యంఉదయం 8 గంటలకు మొదలు కానున్న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు..లెక్కింపు కి 267 టేబుళ్లు ఏర్పాటు..23,633 పోస్టల్ ఓట్ల తో పాటు ఈవీఎంల ద్వారా నమోదైన 14,11,989 ఓట్ల లెక్కింపు..18 నుంచి 21 రౌండ్‌లో వెలువడనున్న ఫలితాలుమొదటిగా తేలనున్న గుంటూరు ఈస్ట్, తాడికొండ ఫలితం1075 పోలింగ్ సిబ్బందితో పాటు, 2500 మంది పోలీస్ సిబ్బంది వినియోగంకౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రతకౌంటింగ్ కేంద్రాలకు చేరుకొంటున్న అభ్యర్థులు..6:47 AM, June 4th, 2024కృష్ణాజిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధంమచిలీపట్నంలోని కృష్ణా యూనివర్శిటీలో ఓట్ల లెక్కింపుమచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన ఓట్లు - 12,93,9357 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లు - 12,93,948మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,5797 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 21,7288 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం8:30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభంపార్లమెంట్ తో పాటు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటుఒక్కో టేబుల్‌కు ఏఆర్ఓ,ఒక సూపర్‌వైజర్‌ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు,ఒక కౌంటింగ్ అబ్జర్వర్ నియామకంమచిలీపట్నం అసెంబ్లీ - 15 రౌండ్లుపెడన అసెంబ్లీ - 16 రౌండ్లుగుడివాడ, పామర్రు అసెంబ్లీ స్థానాలు - 17 రౌండ్లుఅవనిగడ్డ అసెంబ్లీ - 20 రౌండ్లుగన్నవరం ,పెనమలూరు అసెంబ్లీ - 22 రౌండ్లుమొదట ఫలితం మచిలీపట్నం అసెంబ్లీ నుంచి వెలువడయ్యే అవకాశంపోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటుపామర్రు అసెంబ్లీ - 2 టేబుల్స్పెడన అసెంబ్లీ - 3 టేబుల్స్గన్నవరం అసెంబ్లీ - 5 టేబుల్స్గుడివాడ,పెనమలూరు అసెంబ్లీలు -6 టేబుల్స్మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీలు - 8 టేబుల్స్మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో ఉన్న అభ్యర్ధులు -15 మందిఏడు అసెంబ్లీల నుంచి బరిలో నిలిచిన ఎమ్మెల్యేఅభ్యర్ధులు - 79 మంది అసెంబ్లీల వారీగాగన్నవరం అసెంబ్లీ - 12 మందిగుడివాడ అసెంబ్లీ - 12 మందిపెడన అసెంబ్లీ - 10 మందిమచిలీపట్నం అసెంబ్లీ - 14 మందిఅవనిగడ్డ అసెంబ్లీ - 12 మందిపామర్రు అసెంబ్లీ - 8 మందిపెనమలూరు అసెంబ్లీ - 11 మంది6:26 AM, June 4th, 2024తొలి ఫలితం ఏదంటే..ఉదయం 8 గంటలకే పోస్టల్‌ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభంపోస్టల్‌ బ్యాలట్‌ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్‌కు గరిష్ఠంగా 2.30 గంటల టైంఈవీఎంలలో ఒక్కో రౌండ్‌కు 20-25 నిమిషాల సమయంఒక్కోరౌండ్‌లో ఒక్కో టేబుల్‌పై 500 చొప్పున పోస్టల్‌ బ్యాలట్‌లుకొవ్వూరు, నరసాపురంలలో తొలి ఫలితంభీమిలి, పాణ్యం ఫలితాలు అన్నింటి కంటే ఆలస్యం13 రౌండ్లతో ఎంపీ స్థానాల్లో మొదట రాజమహేంద్రవరం, నరసాపురం27 రౌండ్లతో అమలాపురం స్థానం ఫలితం అన్నింటి కంటే చివర్లోమధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై స్పష్టతలోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్‌ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు వేర్వేరు కౌంటింగ్‌ హాళ్లలో6:25 AM, June 4th, 2024ప్రతి పోస్టల్‌ బ్యాలట్‌ టేబుల్‌ వద్ద ఒక ఏఆర్‌వోఈవీఎం ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్‌ దగ్గర ఒక సూపర్‌వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. పోస్టల్‌ బ్యాలట్‌ లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్‌ దగ్గర ఒక అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, కౌంటింగ్‌ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు.18 ఏళ్లు పైబడిన ఎవరినైనా సరే అభ్యర్థులు కౌంటింగ్‌ ఏజెంట్లుగా పెట్టుకోవచ్చు. ప్రతి టేబుల్‌కు ఒక ఏజెంటును నియమించుకోవచ్చు. మంత్రులు, మేయర్‌లు, ఛైర్‌పర్సన్‌లు, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వారు కౌంటింగ్‌ ఏజెంట్లుగా ఉండకూడదు.రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ వద్ద అభ్యర్థి లేదా వారి తరఫు ప్రతినిధి ఉండొచ్చు.6:20 AM, June 4th, 20241,985 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపురెండు మూడ్రోజులపాటు మద్యం దుకాణాలు బంద్‌. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల విచక్షణాధికారం మేరకు నిర్ణయంరాష్ట్ర వ్యాప్తంగా 1,985 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు. సమస్యలు సృష్టించే అవకాశమున్న 12 వేల మందిని గుర్తించి బైండోవర్‌కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు. మొదటి అంచెలో కేంద్ర బలగాలు, రెండో అంచెలో ఏపీఎస్పీ, మూడో అంచెలో సివిల్‌ పోలీసులుకౌంటింగ్‌ కోసం 25 వేల మంది సిబ్బంది. రాష్ట్రవ్యాప్తంగా 45 వేలమంది పోలీసులు వీరంతా మంగళవారం నాడు ఎన్నికల విధుల్లోనే ఉంటారు.కౌంటింగ్‌ సందర్భంగా భద్రత, బందోబస్తు కోసం రాష్ట్రానికి 25 కంపెనీల కేంద్ర బలగాలు . ప్రస్తుతం రాష్ట్రంలో 67 కంపెనీల కేంద్ర బలగాలుసామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవు6:15 AM, June 4th, 2024ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం ఓటర్ల తీర్పు వెల్లడికి కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై గత 21 రోజులుగా రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను, ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే విడుదలైన మెజార్టీ సర్వేల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వైఎస్సార్‌సీపీ రెండోసారి అధికారం చేపట్టనుందని తేల్చాయి.ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024 6:05 AM, June 4th, 2024మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టతనెల 13వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్‌ నిర్వహించడం, శనివారంతో చివరి దశ పోలింగ్‌ ముగియడంతో ఫలితాల కోసం జూన్‌ 4 వరకు వేచి చూడాల్సి వచ్చింది. సర్వే ఏదైనా ఫ్యాన్ దే ప్రభంజనం🔥ఎగ్జిట్ పోల్ అంచనాలు మించి గెలవబోతున్న వైయస్ఆర్‌సీపీ✊🏻సంబరాలకి సిద్ధమవ్వండి! 💫#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/jV2UdE7GzO— YSR Congress Party (@YSRCParty) June 3, 2024నేటి మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత వస్తుంది. అయితే ఈవీఎం కంట్రోల్‌ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్‌లలోని స్లిప్‌లను కూడా చివర్లో లెక్కించాల్సి ఉంటుంది. అందువల్ల అధికారికంగా ఫలితాల ప్రకటనకు కొంత జాప్యం అవుతుంది.

Lok Sabha Election Results 2024 Live Updates
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు.. ముందంజలో ఎన్డీయే కూటమి

Live Updates...👉లీడింగ్‌లో కేంద్రమంత్రులు అమిత్‌షా, కిరణ్‌ రిజుజు, Union Home Minister and BJP candidate from Gujarat's Gandhinagar Lok Sabha seat Amit Shah leading from the seat with a margin of 7311 votes. (file pic) #LokSabhaElections2024 pic.twitter.com/fWF987QsA8— ANI (@ANI) June 4, 2024 As per initial trends by ECI till 9 am, the BJP is leading on 75 seats, Congress leading on 25 seats, Samajwadi Party leading on 8 seats, AAP leading on 5 seats. #LokSabhaElections2024 pic.twitter.com/4CcM5XHaJh— ANI (@ANI) June 4, 2024 👉 ఇప్పటి వరకు రాష్ట్రాల్లో లీడ్‌ ఇలా..యూపీలో ఎన్డీయే కూటమి 53 స్థానాల్లో, ఇండియా కూటమి 24 స్థానాలు.మహారాష్ట్రాలో ఎన్డీయే కూటమి 25 స్థానాల్లో ఇండియా కూటమి 21 స్థానాలు.పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఐదు స్థానాల్లో, బీజేపీ మూడు స్థానాల్లోమధ్యప్రదేశ్‌లో బీజేపీ 25, కాంగ్రెస్‌ 2రాజస్థాన్‌ బీజేపీ 20, ఇండియా కూటమి 4కేరళలో ​యూడీఎఫ్‌ 14, ఎల్డీఎఫ్‌ 6, ఎన్డీయే-0కర్ణాటకలో ఎన్డీయే 22, కాంగ్రెస్‌-6అసోం ఎన్డీయే 9, ఇండియా-3బీహార్‌ ఎన్డీయే 26, ఇండియా-9 👉ఎన్డీయే కూటమి 300 స్థానాల్లో ఆధిక్యం👉ఇండియా 170 స్థానాల్లో ఆధిక్యం. ఈసీ ట్రెండ్స్‌ ప్రకారం ఇలా.. As per initial trends by ECI till 8.47 am, the BJP is leading on 42 seats, Congress leading on 17 seats, AAP leading on 4 seats, Samajwadi Party leading on 2 seats. #LokSabhaElections2024 pic.twitter.com/PqudCi2uZf— ANI (@ANI) June 4, 2024 👉ఇప్పటి వరకు ఎన్డీయే కూటమి 253, 135 స్థానాల్లో ముందుంజ.👉ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 8 స్థానాల్లో ముందంజ, బీజేపీ 6 ‍స్థానాల్లో ముందంజ.👉మండిలో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌ ఆధిక్యం As per initial trends by ECI, the BJP is leading on 17 seats, Congress leading on one seat.#LokSabhaElections2024 pic.twitter.com/7651efxe82— ANI (@ANI) June 4, 2024 👉తిరువనంతపురంలో కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ వెనుకంజ👉గునాలో బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింధియా ముందంజ 👉ఎన్డీయే కూటమి 231 స్థానాల్లో ముందంజ👉ఇండియా కూటమి 123 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 👉ఇతరులు 15 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 👉పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల్లో దూసుకుపోతున్న బీజేపీఇప్పటి వరకు 180 స్థానాల్లో బీజేపీ ముందుంజఇండియా కూటమి 90 స్థానాల్లో ముందంజఇతరులు 10 స్థానాల్లో ముందంజ 👉ప్రారంభ ఫలితాల్లో బీజేపీ దూకుడు👉100పైగా స్థానాల్లో బీజేపీలో ముందంజలో కొనసాగుతోంది. #WATCH | Uttarakhand | Counting of postal ballots started amid tight security in Haridwar. Visuals from a counting centre here.#LokSabhaElections2024 pic.twitter.com/zdeAuRkEYC— ANI (@ANI) June 4, 2024 👉పోస్టల్‌ బ్యాలెట్‌లో అమేథీలో బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ ముందుంజ.👉వయనాడ్‌లో ఆధిక్యంలో రాహుల్‌ గాంధీ. 👉రాయబరేలీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. #WATCH | Uttar Pradesh: Counting of postal ballots underway at a counting centre in Raebareli Parliamentary constituency. #LokSabhaElections2024 pic.twitter.com/Gm9abdEyzd— ANI (@ANI) June 4, 2024 👉పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలు వెలువడుతున్నాయి.. పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 100 స్థానాల్లో ముందంజఇండియా కూటమి 41 స్థానాల్లో ముందంజఇతరులు 10 స్థానాల్లో ముందుంజ. 👉 కౌంటింగ్‌ ప్రారంభం Counting of votes for the #LokSabhaElections2024 begins.The fate of candidates on 542 of the 543 Parliamentary seats is being decided today. BJP won the Surat seat unopposed. pic.twitter.com/qfuRFSn4xi— ANI (@ANI) June 4, 2024 #WATCH | Punjab: Counting of votes for the #LokSabhaElections2024 begins. (Visuals from a counting centre in Amritsar) pic.twitter.com/uqZUzcvbCK— ANI (@ANI) June 4, 2024 👉దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్‌ ప్రారంభమైంది. 542 పార్లమెంట్‌ స్థానాల్లో మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ‍ప్రారంభమైంది. ఏపీలో, ఒడిషాలో కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభం. Counting of votes for the #LokSabhaElections2024 begins. The fate of candidates on 542 of the 543 Parliamentary seats is being decided today. Postal ballot counting to begin first.Counting is also being done for Andhra Pradesh and Odisha Assembly elections as well as… pic.twitter.com/3tu7Opjasf— ANI (@ANI) June 4, 2024 👉గోరఖ్‌పూర్‌ బీజేపీ అభ్యర్థి రవికిషన్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. ఇది చారిత్రాత్మకం. రామరాజ్యం కొనసాగుతుంది. మోదీపై దేశ ప్రజలు నమ్మకం ఉంచారు. బీజేపీ గెలుపు ఖాయం. #WATCH | BJP MP and candidate from Gorakhpur, Ravi Kishan says, "This is historic, Ram Rajya will continue. The biggest leader of the world is going to be the Prime Minister for the third time...People of the country have made the country win and placed their trust in PM Modi..."… pic.twitter.com/5z2B7NAb6G— ANI (@ANI) June 4, 2024 👉ఢిల్లీ పార్లమెంట్‌ స్థానం బీజేపీ అభ్య‍ర్థి, సుష్మా స్వరాజ్‌ కూతురు భన్సూరి స్వరాజ్‌ మాట్లాడుతూ.. బీజేపీ అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు నమ్మకం ఉంచారు. బీజేపీని కచ్చితంగా గెలిపిస్తారనే నమ్మకం ఉంది. మూడోసారి ప్రధాని మోదీ ప్రధాని అవడం ఖాయం. #WATCH | BJP candidate from New Delhi Lok Sabha seat, Bansuri Swaraj says, "...I am completely confident that today the people of India will choose the public welfare policies of BJP, will choose the development policies of our Prime Minister Narendra Modi...I know Teesri Baar… pic.twitter.com/8VgHIrxDXj— ANI (@ANI) June 4, 2024 👉ఎన్నికల్లో విజయం మాదే అంటున్న కాంగ్రెస్‌ నేతలు. యూపీలో మధువా కాంగ్రెస్‌ అభ్యర్థి ముఖేష్‌ ధన్గర్‌ మాట్లాడుతూ.. ఇండియా కూటమి కచ్చితంగా గెలుస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. #WATCH | Uttar Pradesh: Congress candidate from Mathura, Mukesh Dhangar says, "...INDIA Alliance will form a government. There is no doubt about it...This victory (Dhangar's victory) will be of the people of Brij. This will 1000% be the victory of Banke Bihari and Maa Yamuna."… pic.twitter.com/IP6Def2u81— ANI (@ANI) June 4, 2024 👉దేశవ్యాప్తంగా తెరుచుకుంటున్న స్ట్రాంగ్‌ రూమ్స్‌ #WATCH | Karnataka: Strong room being opened in Bengaluru district ahead of the counting of votes for the #LokSabhaElections2024The counting of votes will begin at 8 am. pic.twitter.com/ACGhbarIbx— ANI (@ANI) June 4, 2024 👉మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో స్ట్రాంగ్‌ రూమ్‌ను తెరిచిన ఎన్నికల అధికారులు. స్ట్రాంగ్‌ వద్ద పార్టీల ఏజెంట్స్‌, అధికారులు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. #WATCH | Madhya Pradesh: Strong room being opened in Indore district ahead of the counting of votes for the #loksabhaelections2024phase5 Vote counting for #LokSabhaElections2024 to begin at 8 am. (Source: Madya Pradesh I&PR) pic.twitter.com/ntfmwhTEPC— ANI (@ANI) June 4, 2024 👉కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకున్న కాంగ్రెస్‌ అభ్యర్థి కార్తీ చిదంబరం. శివగంగ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నా కార్తీ చిదంబరం. #WATCH | Tamil Nadu: Congress candidate from Sivaganga Lok Sabha seat Karti Chidambaram arrives at a counting centre in Karaikudi, Sivaganga districtVote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/fKLk5uJf3u— ANI (@ANI) June 4, 2024 👉కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మనీష్‌ తివారీ కామెంట్స్‌.. ప్రజలు తీర్పు ఈవీఎం బ్యాలెట్స్‌ ఉంది. కాసేపట్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రజా తీర్పును ప్రతీ ఒక్కరూ గౌరవించాలి. #WATCH | Congress MP and party candidate from Chandigarh Manish Tewari says, "..It is Tuesday, Hanuman's day. People have expressed their opinions. The opinions are locked in the EVMs. The EVMs will open and the opinion will come out. Whatever the people's decision will be,… pic.twitter.com/yptpWNkKN4— ANI (@ANI) June 4, 2024 👉దేశంలో 543 లోక్‌సభ నియోజకవర్గాలకు 8,360 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1996లో అత్యధికంగా 13,952 మంది పోటీ చేశారు. 👉బరిలో 53 మంది మంత్రులు 53 మంది సిటింగ్‌ మంత్రులు ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. 17వ లోక్‌సభలో ఎంపీలుగా ఉన్నవారిలో 327 మంది మళ్లీ ఇప్పుడు పోటీ చేశారు. వారిలో 34 మంది పార్టీ మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 27% మంది ఇప్పటికే కనీసం ఒక్కసారైనా ఎంపీగా పనిచేసినవారే. 👉 దేశంలో బీజేపీ పార్టీ ఎన్నికలను లూటీ చేసింది. మేము గత ఆరు రోజులుగా ఇదే చెబుతున్నాం. కౌంటింగ్‌ అనేది కేవలం నామమాత్రమే. కాంగ్రెస్‌ నేతలు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే పోరాటం చేస్తారు. మేము ఓడినా, గెలిచినా ప్రజల్లోనే ఉంటాం. #WATCH | Delhi: Congress worker Jagdish Sharma says, "I have already said 6 days ago that the election has been looted, it (counting of vote) is just a formality because the people of the country believe in the Constitution system. All Congress party leaders will come but I will… pic.twitter.com/vzkn3YrKT4— ANI (@ANI) June 4, 2024 👉దేశవ్యాప్తంగా అన్ని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రత పెంపు.. హర్యానా, గుజరాత్‌, ఒడిషా, మహారాష్ట్రలో మోహరించిన పోలీసులు, భద్రతా బలగాలు #WATCH | Security heightened at a counting centre in Jind, Haryana. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/YXFo7YXRhU— ANI (@ANI) June 4, 2024 #WATCH | Security heightened at a counting centre in Raebareli, Uttar Pradesh. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/iq06WWob5Q— ANI (@ANI) June 4, 2024 #WATCH | Security heightened at a counting centre in Bhubaneswar, Odisha. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/NhoU4qURN0— ANI (@ANI) June 4, 2024#WATCH | Security heightened at a counting centre in Purba Medinipur, West Bengal. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/bgdJ3KPgou— ANI (@ANI) June 4, 2024 👉దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు నేడు రానున్నాయి. 80 రోజులకు పైగా ఏడు విడతల్లో సాగిన సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల క్రతువు తుది దశకు చేరింది. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. 👉కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్‌ కొట్టి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా నెహ్రూ రికార్డును సమం చేస్తారా? లేదంటే కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి అనూహ్యమేమైనా చేసి చూపించనుందా? సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించనుంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఓట్ల లెక్కింపు జరగనుంది. 👉ఏకగ్రీవమైన సూరత్‌ మినహా 542 లోక్‌సభ స్థానాలు, ఏపీలో 175, ఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాల్లో విజేతలెవరో తేలనుంది. కౌంటింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సూరత్‌లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఇక, ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. మధ్యాహా్ననికల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Telangana Lok Sabha Election Results 2024 Live Updates
తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు: కొనసాగుతున్న కౌంటింగ్‌

Updates కరీంనగర్ పార్లమెంట్‌లో బీజేపీ ఆధిక్యంమొదటి రౌండ్‌లో 1400 ఓట్లు ఆధిక్యంలో బండి సంజయ్ మహబూబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 10283 ఓట్ల మెజార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 5644 ఓట్ల మెజార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్: లీడ్ (బిజెపి): 1168నిర్మల్ నియోజకవర్గ: మొదటి రౌండ్ : బిజెపి 3872కాంగ్రెస్ 2643బీఆర్ఎస్ 585నిజామాబాద్ పార్లమెంటుపోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం వరంగల్ పార్లమెంట్ ( 1వ రౌండ్)బిజెపి లీడ్ : 240బీఆర్ఎస్ : 3870కాంగ్రెస్ :6494బీజీపీ : 6726మహబుబాబాద్నర్సంపేట నియోజకవర్గంలో మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ 1083 ఓట్ల ఆధిక్యం ఖమ్మం పార్లమెంట్ (1వ రౌండ్)కాంగ్రెస్ లీడ్ : 16702బీఆర్ఎస్ : 18794కాంగ్రెస్ :35496బీజీపీ :4351 మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ ఆధిక్యం భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 2000 పైచిలుకు ముందంజ నల్లగొండ మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ ముందంజ జహీరాబాద్: తొలి రౌండులో ఆదిత్యంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కార్ కరీంనగర్‌లో బండి సంజయ్‌ ఆధిక్యం యాదాద్రి భువనగిరిభువనగిరి సెగ్మెంట్‌లో మొదటి రౌండ్‌లో బూర నర్సయ్య గౌడ్ లీడ్తొలి రౌండ్ లో 117ఓట్ల ఆధిక్యంలో బీజేపీబీజేపీ 3976కాంగ్రెస్ 3859బీఆర్ఎస్ 2681 వరంగల్‌లో కడియం కావ్య ఆధిక్యం కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ప్రారంభమైన ఈవీఎం కౌంటింగ్ ప్రక్రియఆదిలాబాద్ పార్లమెంట్: ఖానాపూర్ నియోజకవర్గం:మొదటి రౌండ్: కాంగ్రెస్: 3,297బిజెపి : 3902బిఆర్ఎస్ : 859లీడ్ : 605(బీజేపీ) సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి ఆధిక్యం నల్లగొండ జిల్లానల్లగొండ లోక్ సభ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి ఆధిక్యం ఖమ్మంఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రాఘురం రెడ్డి ముందంజ ముషీరాబాద్ నియోజకవర్గం AV కాలేజీ లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తిబీజేపీ 4733 కాంగ్రెస్ 1318బీఆర్ఎస్ 10973325 ఓట్ల లీడ్ లో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్‌లో మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ లీడ్816 ఓట్ల తో ముందంజ మహబూబ్‌ నగర్‌లో డీకే అరుణ ఆధిక్యంఖమ్మంలో కాంగ్రెస్‌ ఆధిక్యంమల్కాజిగిరిమల్కాజిగిరి పార్లమెంట్ పరిధి ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెట్‌లో మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 6330 ఓట్లతో ఆధిక్యంబీజేపీ :-8811కాంగ్రెస్ :2581బిఆర్ఎస్ :1418కరీంనగర్ జిల్లా: బీజేపీ ముందంజమొత్తం పోస్టల్ బ్యాలెట్: 108479287 (ఎంప్లాయిస్ + సర్వీస్ ఓటర్లు)1560 (హోం ఓటింగ్) యాదాద్రి భువనగిరి జిల్లాభువనగిరి పట్టణ పరిధిలో అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైంన కౌంటింగ్ ప్రక్రియ ఖమ్మంలోని కిట్స్ కాలేజీలో ప్రారంభమైన కౌంటింగ్మంచిర్యాల జిల్లాలో ఐజ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ పెద్దపెల్లి జిల్లా :ప్రారంభమైన పెద్ద పెల్లి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది,పోస్టల్‌ బ్యాలెట్‌ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపునిజామాబాద్నిజామాబాద్ లోక్ సభ కౌంటింగ్ ప్రారంభంకౌంటింగ్ సెంటర్‌లో అపశ్రుతికౌంటింగ్ సూపర్ వైజర్‌కు అస్వస్థతకళ్ళుతిరిగి పడిపోవడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు నల్లగొండ జిల్లాలో మొదలైన కౌంటింగ్ ప్రక్రియనల్లగొండ పార్లమెంటుకు సంబంధించి దుప్పలపల్లిలోనే వేర్ హౌసింగ్ గోదాముల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపుమొదట పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఆ తర్వాత ఈవీఎం లలోని ఓట్లను లెక్కిస్తున్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్‌లో మొదలైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకరీంనగర్ జిల్లా:ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కిస్తున్న సిబ్బందిపోస్టల్‌ బ్యాలెట్‌ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పూజలుఅమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలుకేంద్రంలో మూడోసారి ఎన్డీయే కూటమిదే విజయంతెలంగాణలో బీజేపీ అధిక సీట్లు గెలుచుకుంటుంది#WATCH | Union Minister & BJP's Telangana President G Kishan Reddy says, "PM Narendra Modi will take oath in the second week of this month with the blessings of the people..."He says, "People from all over the world are watching our Lok Sabha elections. I have full faith that… pic.twitter.com/2a3r4wxlW8— ANI (@ANI) June 4, 2024మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుస్ట్రాంగ్ రూం నుంచి ఈవీఎం లను లెక్కింపు కేంద్రాలకు తరలింపు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించిన అధికారులుకోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం గ్రౌండ్స్, ఏవి కాలేజ్ మాసబ్ ట్యాంక్ లలో కౌంటింగ్ ప్రారంభించిన అధికారులుహైదరాబాద్:సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పార్లమెంట్ కౌంటింగ్ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కలు వేయనున్న అధికారులుఎనిమిదిన్నరకు ఈవీఎంల లెక్కలను ప్రారంభించనున్న సిబ్బందికంటోన్మెంట్ లో మాత్రం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో పాటు ఈవీఎంల లెక్కింపు ప్రారంభం నల్లగొండ జిల్లానల్లగొండ లోక్ సభ స్థానంలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుయాదాద్రి భువనగిరి జిల్లాభువనగిరి లోక్ సభ స్థానంలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునిజామాబాద్: ఓట్ల లెక్కింపు ప్రారంభం8హాళ్లలో మొదలైన కౌంటింగ్తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది నిజామాబాద్: డిచ్‌పల్లి సిఎంసిలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధంపార్లమెంట్ పరిధిలోనీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే చోట కౌంటింగ్.8 హళ్ల లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్న అధికారులునిజామాబాద్ రూరల్ & అర్బన్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 20 టేబుళ్ళుబోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్ల కు 18 చొప్పున టేబుళ్ళ ఏర్పాటు.15 రౌండ్లు లో మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తి.మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఫలితంఓట్ల లెక్కింపు కోసం 558 మంది కౌంటింగ్ సిబ్బంది,అభ్యర్థులు ఉదయం 6 గంటల వరకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలనీ అధికారుల సూచనరిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఎంట్రీ పాస్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి.మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.కౌంటింగ్ కేంద్రం చుట్టూ ,5 కిలో మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలుమూడు అంచెల్లో భద్రత ఏర్పాట్లు1000 మంది పోలీసులతో బందో బస్తుపోలైన పోస్టల్ ఓట్లు 7414మొత్తం సర్వీస్ ఓట్లు 724మొత్తం ఓట్లు 17,4867పోలైన ఓట్లు 12, 26 133పోలింగ్ శాతం. 71.9240 నిమిషాల్లో తొలి రౌండ్ పలితంఖమ్మంలోకసభ ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ఖమ్మం రూరల్ మండలం, పొన్నెకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రంఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంపోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక కౌంటింగ్ హాల్ఖమ్మం పార్లమెంటు పరిధిలో ని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లు7 అసెంబ్లీ సెగ్మెంట్ లలో తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ కోసం ప్రత్యేక కౌంటింగ్ హాల్ ఏర్పాటుప్రతి కౌంటింగ్ హాల్ లో 14 కౌంటింగ్ టేబుల్స్, ఏర్పాటుఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి 18 టేబుళ్లు ఏర్పాటుకౌంటింగ్ విధుల నిర్వహణకు ప్రతి కౌంటింగ్ హాల్ వద్దఒక్కో టేబుల్ కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో పరిశీలకులు ఉంటారుఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ లో 20 రౌండ్లుపాలేరు, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో 21 రౌండ్లుమధిర లో 19, వైరాలో 18, కొత్తగూడెం లో 18, అశ్వారావుపేట సెగ్మెంట్ లో 13 రౌండ్లు లెక్కింపు చేపడుతారుపోస్టల్ బ్యాలెట్ ఓట్లు తో కౌంటింగ్ మొదలు అవుతుంది.వీ వీ ప్యాట్ల స్లిప్ లు ప్రామాణికంగా తీసుకుంటారు.పోస్టల్ బ్యాలెట్ ఇటిపిబిఎస్ లతో కలిపి 2 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తారుకంట్రోల్ యూనిట్ల లోని ఓట్లు లెక్కించిన తరువాతగెలుపొందిన పార్టీ అభ్యర్థి ని కౌంటింగ్ సూపర్ వైజర్ నిర్ధారించాల్సి ఉంటుందిఅనంతరం సదరు అభ్యర్థి కి అర్ ఓ ద్రువపత్రం అందజేస్తారు..దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది కాసేపట్లో కౌంటింగ్‌ ప్రారంభంఫలితాలపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ లీడర్లలో టెన్షన్‌హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ కేంద్రాల్లో 14-15 రౌండ్లలో ఓట్ల లెక్కింపుచొప్పదండి, దేవరకొండ అసెంబ్లీ స్థానాల్లో 21 రౌండ్లలో కౌంటింగ్‌మంచిర్యాల, మంథని, పెద్దపల్లిలో 21 రౌండ్ల ఓట్ల లెక్కింపు కరీంనగర్‌:ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ అండ్‌ పీజీ కాలేజీలో ఓట్లు లెక్కింపునకు సర్వం సిద్ధంహైదరాబాద్మల్కాజీగిరి పార్లమెంట్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధంమొత్తం 158 టేబుల్స్19 లక్షల ఓట్ల లెక్కింపుపోస్టల్ బ్యాలెట్ కోసం మరో 20 అదనంగా టేబుల్స్ఏడు నియోజకవర్గాలకు 9 కౌంటింగ్ హాల్స్బోగారం హోలీ మేరీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రంమొత్తం 178 టేబుల్స్ ఏర్పాటువీటిలో 20 టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం ఏర్పాటు చేసారుమొత్తం 37 లక్షల 79 వేల 596 ఓటర్లు ఉండగా వీరిలో 19 లక్షల 19 వేల 131 ఓట్లు పోలయ్యాయిమొత్తంగా 50.78 శాతం ఓట్లు నమోదయ్యాయిఈ ఓట్లను 575 మంది సిబ్బంది లెక్కించనున్నారు నల్గొండ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధంనల్లగొండ స్థానానికి దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్స్‌లో కౌంటింగ్భువనగిరి స్థానానికి అరోరా కాలేజ్ లో కౌంటింగ్ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల ఏర్పాటునల్లగొండ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 17, 25, 465పోలైన ఓట్లు 12,77, 137నల్లగొండ లోక్ సభ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు: 22భువనగిరి లోక్ సభ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు: 39నల్లగొండ వివరాలుఅసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్ లు, రౌండ్లుమిర్యాలగూడ 264(19)సూర్యాపేట 271(20)నల్లగొండ288(21)కోదాడ296(22)హుజూర్ నగర్ 308(22)నాగార్జునసాగర్ 306(22)దేవరకొండ 328(24) నల్లగొండ లోక్ సభ పరిధిలో తొలుత పూర్తి కానున్న మిర్యాలగూడ నియోజకవర్గం ఓట్ల లెక్కింపుచివరగా పూర్తి కానున్న దేవరకొండ నియోజకవర్గ ఓట్లుభువనగిరి లోక్ సభ స్థానంమొత్తం ఓటర్లు 18,08, 585పోలైన ఓట్లు 13,88,680అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూతులు రౌండ్లుఇబ్రహీంపట్నం 348(18 రౌండ్లు, 20 టేబుల్స్)మునుగోడు 317(18 రౌండ్లు, 18 టేబుల్స్)తుంగతుర్తి 326 (19, 18 టేబుల్స్)భువనగిరి 257(19)నకిరేకల్ 311(23 రౌండ్లు)ఆలేరు 309(23)జనగామ 278(20)భువనగిరి స్థానంలో పోలింగ్‌ బూతులు ఎక్కువగా ఉన్నా తొలుత పూర్తికానున్న ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి, మునుగోడుహైదరాబాద్‌బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతఫలితాలు కోసం ఎదురు చూస్తున్నాబీజేపీ 400 సీట్లు గెలుస్తాం#WATCH | BJP candidate from Hyderabad, Madhavi Latha says, "I am pretty excited and all of them who have voted for BJP in the entire country are looking forward for especially this particular seat that we win and bring justice to Hyderabad. We all know that PM Modi in the entire… pic.twitter.com/tqz0YMhjwf— ANI (@ANI) June 4, 2024 నాగర్ కర్నూల్ జిల్లా:నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ఎర్పాట్లు పూర్తినాగర్ కర్నూల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్ కుమార్ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు7 అసెంబ్లీలో సెగ్మెంట్ లలో - 17,38,254 ఓటర్లు7 సెంబ్లీలలో 2057 పోలింగ్ కేంద్రాలుఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లు - 12,07,471 (69.46%)పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 14,491. (85.95%)ఉదయం. 8-00 గంటలనుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంమొదట పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుకౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన మూడంచెల భద్రతా ఏర్పాట్లుప్రతీ కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌కౌంటింగ్‌ అసిస్టెంట్‌, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటుపోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన 12455 ఓట్ల లెక్కింపుకు ప్రత్యేకంగా 14 టేబుల్స్‌ మహబూబ్ నగర్పాలమూరు యూనివర్సిటీలో మహబూబ్ నగర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు.ఏడు సెగ్మెంట్లలోని 1937 ఈవీఎంల కౌంటింగ్బరిలో 31 మంది అభ్యర్థులు.నాగర్ కర్నూల్వ్యవసాయ మార్కెట్ కమిటీ లో నాగర్ కర్నూల్ ఓట్ల లెక్కింపుఏడు సెగ్మెంట్లలోని 2057 ఈవీఎంల కౌంటింగ్బరిలో 19 మంది అభ్యర్థులు ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించి కౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుందిఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లోని మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయిఖమ్మం నియోజకవర్గం సంబంధించి మాత్రం 18 టేబుల్స్ ఏర్పాటు చేయగా మిగతా ఆరు నియోజకవర్గాలకు సంబంధించి 14 టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారుప్రతి టేబుల్ దగ్గర ముగ్గురు అధికారుల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో కౌంటింగ్ కోసం కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి..ఉదయం 8 గంట నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్..బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు..మొత్తం 17 లక్షల 97 వేల 150 మంది ఓటర్లు..పోలైన ఓట్లు 13 లక్షల 3 వేల 691..పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కు వేర్వేరుగా హాల్స్ ఏర్పాటు..కరీంనగర్ నియోజకవర్గానికి 18 టేబుల్స్ ఏర్పాటు..మిగిలిన 6 నియోజకవర్గాలకు 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు..రౌండ్స్ వారీగా కొనసాగనున్న లెక్కింపు ప్రక్రియ..కరీంనగర్ 22, చొప్పదండి 24, వేములవాడ 19, సిరిసిల్ల 21, మానకొండూరు 23, హుజూరాబాద్ 22, హుస్నాబాద్ 22 రౌండ్లవారీగా కొనసాగనున్న లెక్కింపు..ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభం కానున్న ప్రక్రియ..పోస్టల్ బ్యాలెట్ కోసం 14 టేబుల్స్ ఏర్పాటు..కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మొత్తం 9 వేల 287 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు..నేటి నుంచి రేపు ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షల కొనసాగింపు, 144 సెక్షన్ అమలు..ఒక్క రౌండ్ ఫలితం వెల్లడి కావడానికి అరగంట సమయం..మధ్యాహ్నం వరకు విజేత ఎవరనేది స్పష్టత వచ్చే అవకాశం..ఒక్కో నియోజకవర్గంలో ర్యాండమ్ గా 5 ఈవీఎంలకు సంబంధించిన 5 వీవీ ప్యాట్ల లెక్కింపు చేయనున్న అధికారులు..ఈవీఎంలు, వీవీప్యాట్లలో లెక్క సరిపోతేనే అధికారికంగా అభ్యర్థి ప్రకటన..ఒక్కో టేబుల్ కు ముగ్గురు సిబ్బంది చొప్పున 124 మంది కౌంటింగ్ సూపర్ వైజర్స్, 124 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్, 124 మంది మైక్రో అబ్జర్వర్స్ ఏర్పాటు.పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం(SC)అభ్యర్థులు 42 మందిఅసెంబ్లీ నియోజకవర్గం టేబుల్స్ రౌండ్స్ చెన్నూర్ నియోజకవర్గం 14 16 బెల్లంపల్లి నియోజకవర్గం 14 16మంచిర్యాల నియోజకవర్గం 14 21 ధర్మపురి నియోజకవర్గం 14 19రామగుండం నియోజకవర్గం 14 19మంథని నియోజకవర్గం 14 21పెద్దపల్లి నియోజకవర్గం 14 21పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్ టేబుల్స్ 98, రౌండ్స్ 132#WATCH | BJP candidate from Hyderabad, Madhavi Latha says, "I am pretty excited and all of them who have voted for BJP in the entire country are looking forward for especially this particular seat that we win and bring justice to Hyderabad. We all know that PM Modi in the entire… pic.twitter.com/tqz0YMhjwf— ANI (@ANI) June 4, 2024 రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని లోక్‌సభ సీట్లు సాధిస్తుందన్న ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది.మంగళవారం ఉదయమే ఓట్ల లెక్కింపు మొదలుకానుంది.ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ ప్రకటించారు.గత నెల 13న రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన విషయంతెలిసిందే.కంటోన్మెంట్‌ సీటు ఓట్లను సైతం మంగళవారం లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.మొత్తంగా 525 మంది అభ్యర్థులు పోటీపడగా.. 2,18,14,025 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.65.67శాతం పోలింగ్‌ నమోదైంది.లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో.. మొత్తం 139 కౌంటింగ్‌ హాల్స్‌ ఏర్పాటు చేశారు.ఇందులో 120 హాళ్లలో ఈవీఎం ఓట్లు, 19 హాళ్లలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించనున్నారు.ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఒక కౌంటింగ్‌ హాల్‌ ఉంటుంది. ఒక్కో హాల్‌లో 24 టేబుల్స్‌ ఉంటాయి.మహేశ్వరం స్థానం పరిధిలో 28 టేబుల్స్‌ ఏర్పాటు చేయాల్సి రావడంతో రెండు హాళ్లలో ఓట్లను లెక్కించనున్నారు.దీంతో ఈవీఎం ఓట్ల కౌంటింగ్‌ హాళ్ల సంఖ్య 120కి పెరిగింది. మొత్తం 10వేల మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొననున్నారు.చొప్పదండి, యాకూత్‌పుర, దేవరకొండ అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన లోక్‌సభ ఓట్లను అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కించనున్నారు.ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన ఓట్లను అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కిస్తారు.చాలా స్థానాల పరిధిలో 18 నుంచి 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది.ఒక్కో టేబుల్‌ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, ఒక ఏఆర్‌ఓ, ఇద్దరు సహాయకులు, అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లు ఉంటారు.ప్రతి రౌండ్‌ ఓట్ల లెక్కింపును మైక్రో అబ్జర్వర్‌ పర్యవేక్షిస్తారు. ఏకకాలంలో అన్ని టేబుళ్లలో నిర్వహించే లెక్కింపును ఒక రౌండ్‌గా పరిగణిస్తారు.అలా రౌండ్ల వారీగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి రౌండ్‌ వివరాలను కేంద్రం నుంచి వచి్చన పరిశీలకుడి పరిశీలనకు పంపిస్తారు.పరిశీలకుల ఆమోదం తర్వాత తదుపరి రౌండ్‌ లెక్కింపును ప్రారంభిస్తారు.అదే సమయంలో ఒక్కో రౌండ్‌ లెక్కింపు పూర్తయిన కొద్దీ.. స్థానిక ఆర్వో/ఏఆర్వో మీడియా రూమ్‌ వద్దకు వచ్చి ఫలితాలను ప్రకటిస్తారు.రౌండ్ల వారీగా ఫలితాలపై ఫారం–17సీ మీద కౌంటింగ్‌ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు.ప్రతి శాసనసభ స్థానం పరిధిలో ర్యాండమ్‌గా ఐదు పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేసి.. ఈవీఎంలలోని ఓట్లను, వీవీ ప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చి చూస్తారు.ఎన్నికల ఫలితాలను ప్రదర్శించడానికి 78 ప్రాంతాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు.కౌంటింగ్‌ కేంద్రంలోకి ఎన్నికల సంఘం అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే రానిస్తారు.నేడు మద్యం షాపులు బంద్‌లోక్‌సభ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం రోజున తెలంగాణలో మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.ఇక ఫలితాలు వచి్చన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదు.స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు ముందుగా అనుమతిస్తే ర్యాలీలు చేసుకోవచ్చు.ఉదయం 10.30 కల్లా ఆధిక్యతపై స్పష్టత!మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.2.18లక్షల పోస్టల్‌ బ్యాలెట్లు పోలైన నేపథ్యంలో లెక్కింపునకు ఎక్కువే సమయం పట్టే అవకాశం ఉంది.ఇక 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 గంటల కల్లా చాలా లోక్‌సభ స్థానాల్లో ఎవరు ఆధిక్యతలో ఉన్నారనేది తేలే అవకాశం ఉంది.మధ్యాహ్నం 12.30 గంటలకల్లా విజయావకాశాలపై స్పష్టత వచ్చే చాన్స్‌ ఉంది.

AP Elections Results Dominate Social Media On Elections Results Trend
ElectionsResults ఫీవర్‌.. ట్రెండింగ్‌లో AP హవా

ఇవాళ దేశం మొత్తం ఎన్నికల ఫలితాల గురించే చర్చ నడుస్తోంది. టీవీ ఆన్‌ చేస్తే కౌంటింగ్‌ అప్‌డేట్‌, ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు, చర్చలు.. ఆఖరికి సోషల్‌ మీడియాలో నవ్వులు పంచే మీమ్స్‌ సైతం ఎన్నికల రిజల్ట్స్‌ గురించే ఉంటున్నాయి. ఈ తరుణంలో ట్రెండింగ్‌లో ఎన్నికల ఫలితాల హవా కొనసాగుతోంది.ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే ఆయా పార్టీలు, పార్టీల సానుభూతిపరులు సోషల్‌ మీడియాలో చెలరేగిపోతున్నారు. దీంతో.. ఆయా హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి. అయితే 542 లోక్‌సభ స్థానాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల గురించి ఎక్కువ హ్యాష్‌ ట్యాగులు సోషల్‌ మీడియాలో నడుస్తుండడం గమనార్హం.ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బిగ్‌ విక్టరీ, వైఎస్‌ జగన్‌ అగెయిన్‌, ఏపీ ఎన్నికల ఫలితాలు, పిఠాపురంలో పవన్‌ భవితవ్యం ఏంటి?, ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?, కూటమికి వచ్చే సీట్లు ఎన్ని? టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ ఈసారైనా గెలుస్తారా?.. ఇలా రకరకాల హ్యాష్‌ ట్యాగ్‌లు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి.ఎన్డీయే-ఇండియా కూటమి గెలుపోటములు, ఒడిషా ఫలితం, దేశవ్యాప్తంగా పాతిక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు అన్నీ ఒక ఎత్తు అయితే.. కేవలం ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితంపై సోషల్‌ మీడియాలో కొనసాగుతున్న ట్రెండ్‌ ఆ ప్రత్యేకతను చెప్పకనే చెబుతోంది.

Counting of Votes for the Seven Seats in Delhi
ఢిల్లీ: 12కు స్పష్టత.. 4కు తుది ఫలితం?

ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఓట్లను లెక్కించేందుకు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఈవీఎంలు తెరవనున్నారు. 8.30 గంటల నుంచి ఎన్నికల ఫలితాల ట్రెండ్‌లు మొదలు కానున్నాయి.ఓట్ల లెక్కింపు సమయంలో దాదాపు వెయ్యి సీసీ కెమెరాలు కౌంటింగ్ కేంద్రంలోని ఈవీఎంలపై నిఘా ఉంచుతాయి. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, ఇతర బ్యాలెట్ పేపర్‌లను పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్‌లో 100కు పైగా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల ఎన్నికల ఫలితాలపై మధ్యాహ్నం 12 గంటలకల్లా ఒక స్పష్టత వస్తుందని ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని అన్నారు. మే 25న ఢిల్లీలో జరిగిన లోక్‌సభ పోలింగ్‌లో 58.70 శాతం ఓటింగ్ జరిగింది. రెండు అంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లో ఉంచారు. ఢిల్లీలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేశారు. 15 నుంచి 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.

Obstacles in postal ballot Vote Counting
కూటమితో కుమ్మక్కు!

కూటమి నేతలతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారా.. కౌంటింగ్‌కు తమకు అనుకూలమైన అధికారులను వేయించుకున్నారా..? నేడు జరగనున్న ఓట్ల లెక్కింపులో అక్రమాలు.. దౌర్జాన్యాలకు స్కెచ్‌ వేశారా..? అంటే జిల్లా వాసుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. కౌంటింగ్‌లో కూటమి అభ్యర్థులు పైచేయి సాధించేందుకు కొందరు అధికారులు అడ్డదారులు తొక్కేందుకు సిద్ధమైనట్టు స్పష్టమవుతోంది. సాక్షి టాస్‌్కఫోర్స్‌: కౌంటింగ్‌లో అక్రమాలు.. దౌర్జనాలకు కూటమి అభ్యర్థులు పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన ఆదేశాలను ఆసరాగా చేసుకుని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కూటమి నేతలు కొందరు అధికారుల సహకారంతో రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు స్వతంత్ర అభ్యర్థులు అడ్డొస్తారని వారికి ఏజెంట్లను కుదించడమే ఇందుకు నిదర్శనం. తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ, చిత్తూరు ఎస్వీ సెట్‌లో నేడు ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. కూటమికి ఓటమి తప్పదని భావించిన అభ్యర్థులు టీడీపీ సానుభూతిపరులైన అధికారుల ద్వారా మరికొందరు అధికారులను రకరకాల ప్రలోభాలతో లోబరుచుకున్నారు. వారందరికీ కౌంటింగ్‌ కేంద్రంలో డ్యూటీలు వేయించుకున్నట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. వారి సహకారంతో కౌంటింగ్‌ కేంద్రంలో అక్రమాలు, దౌర్జన్యాలకు దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తారుమారు చేసి.. కూటమికి అనుకూలంగా మార్చే కుట్ర అడ్డదారుల్లోనైనా గెలుపొందాలని కూటమి నేతలు అన్ని మార్గాలను ఎంచుకున్నారు. ఈవీఎంలో పోలైన ఓట్ల లెక్కింపు సమయంలో కూటమి ఏజెంట్లు రచ్చచేసి వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల దృష్టి మరల్చేందుకు పథకం వేసినట్లు తెలిసింది. ఈవీఎంలోని మొత్తం ఓట్ల లెక్కింపు విషయంలో తమకు అనుకూలంగా లెక్కలను తారుమారు చేసేందుకు స్కెచ్‌ వేసినట్లు సమాచారం. మొత్తంగా నేటి కౌంటింగ్‌ సమయంలో అడ్డదారులన్నింటినీ ఉపయోగించుకుని పైచేయి సాధించేందుకు కూటమి నేతలు కుట్రలకు పదునుపెట్టారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు కౌంటింగ్‌ కేంద్రంలో అక్రమాలు, దౌర్జనాలకు తావులేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులు, ఓటర్లు కోరుతున్నారు. వీలైనన్ని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లే లక్ష్యంగా.. అధికారులంతా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం చేసిన కూటమి నేతలు.. నేడు జరగనున్న కౌంటింగ్‌లో దాన్ని అవకాశంగా వినియోగించుకోవాలని కుయుక్తులు పన్నుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగా ఈసీ ఆదేశాలను బూచీగా చూపి వీలైనన్ని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను కూటమి అభ్యర్థికి అనుకూలంగా మలచుకునేందుకు పథకం వేసినట్టు సమాచారం. అందుకు అడ్డుగా ఉన్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను రెచ్చగొట్టి బయటకు పంపేందుకు స్కెచ్‌ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల విషయంలోనూ ముందే అడ్డుకట్ట వేశారు. టేబుల్‌కి ఒక ఏజెంట్‌ని నియమించుకునే అవకాశం అభ్యర్థి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే టేబుల్‌కి ఒక ఏజెంట్‌ని ఏర్పాటు చేసుకునే అవకాశం కలి్పంచారు. స్వతంత్ర అభ్యర్థుల విషయానికి వచ్చే సరికి కేవలం 5, 6 మంది ఏజెంట్లను మాత్రమే నియమించుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని స్వతంత్ర అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము అభ్యర్థే కదా? అన్నీ టేబుల్స్‌ వద్ద ఏజెంటు ఉండకపోతే ఎలా? అని ప్రశి్నస్తున్నారు. అయినా వారికి ఎన్నికల అధికారి ససేమిరా అన్నట్లు స్వతంత్ర అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలగం కోసం కొత్త ఎత్తుగడ కౌంటింగ్‌ కేంద్రలో అక్రమాలు, దౌర్జన్యాలకు బలగం ఉండేలా కూటమి అభ్యర్థులు కాంగ్రెస్‌ ఏజెంట్‌ ఫామ్స్‌ని కొనుగోలు చేసుకున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగైనా ఆ పార్టీ తరుఫున అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. జాతీయ పార్టీ కావడంతో కాంగ్రెస్‌ అభ్యరి్థకి టేబుల్‌కి ఒకరు చొప్పున ఏజెంట్‌ని నియమించుకునే అవకాశం ఉంది. పేరుకు మాత్రమే పోటీలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి తమ ఏజెంట్‌ ఫామ్స్‌ని కూటమి అభ్యర్థులకు విక్రయించి సొమ్ముచేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌ ఏజెంట్‌ ఫామ్స్‌తో కూటమి నేతలు కౌంటింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించనున్నారు. కౌంటింగ్‌ కేంద్రంలో కూటమి నేతలకు బలం ఎక్కువ ఉండడంతో అక్రమాలు, దౌర్జన్యాలు చేసేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బలగంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను వీలైనన్ని కూటమి అభ్యర్థి లెక్కలో వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో ఏ చిన్న పొరబాటు ఉన్నా.. కూటమి అభ్యర్థి అకౌంట్‌లో వేసేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు.

AP Elections Results 2024 Photos
కట్టుదిట్టంగా ఏపీ కౌంటింగ్‌ డే (ఫొటోలు)

BJP First Victory in Gujarat Surat
మొదలైన కౌంటింగ్.. బీజేపీ ఖాతాలోనే తొలి విజయం

లోక్‌సభ ఎలక్షన్ 2024 కౌంటింగ్ మొదలైంది. కానీ, బీజేపీ తొలి విజయాన్ని అందుకుందని మీకు తెలుసా?. అదేంటీ ఫలితం ఒక్క రౌండ్‌ కూడా పూర్తి కాకముందే ఈ గెలుపు ఎక్కడిది అంటారా?. నిజానికి ఎన్నికల కౌంటింగ్ మొదలవ్వకముందే.. బీజేపీ బోణీ కొట్టేసింది. నెల రోజులకు ముందే బీజేపీ అభ్యర్థి 'ముకేష్ దలాల్' సూరత్ నుంచి ఏకగ్రీవంగా గెలిచారు. అక్కడ నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ కొన్ని కారణాల వల్ల తిరస్కరించబడింది. అంతే కాకుండా ఇక్కడ నామినేషన్ వేసిన అభ్యర్థులంతా.. నామినేషన్ వెనక్కు తీసుకున్నారు. దీంతో ముకేష్ దలాల్ ఏకగ్రీవంగా విజయం సాధించారు. అలా.. బీజేపీ మొదటి విజయాన్ని సాధించింది.

Odisha Assembly Elections Results 2024
ఒడిషా తీర్పుపైనా దేశం నజర్‌

భువనేశ్వర్‌: నవీన్‌ పట్నాయక్‌ రికార్డు అధిగమిస్తారా? పవన్‌ చామ్లింగ్‌ మైలురాయి దాటుతారా?. లోక్‌సభ ఫలితాలతో పాటు యావత్‌ దేశం దృష్టి ఇప్పుడు ఒడిషా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా ఉంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుండగా బీజూ జనతా దళ్‌(బీజేపీ) విజయం సాధిస్తే నవీన్‌ చరిత్ర సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మంగళవారం ఓట్ల లెక్కింపు తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది తేటతెల్లమవుతుంది. ఒకవేళ బీజేడీకు అనుకూలంగా ఫలితాలు వస్తే జూన్‌ 9న నవీన్‌ ఆరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఇది వాస్తవమైతే మరో 70 రోజుల తర్వాత నవీన్‌ సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ రికార్డు అధిగమించి చరిత్ర సృష్టిస్తారు. సిక్కిం డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ నేత ఆయన చామ్లింగ్‌ 24 ఏళ్ల 165 రోజులు సీఎంగా విధులు నిర్వహించారు. ఆయన 1994 నుంచి 2019 మే వరకు సేవలందించారు. దీర్ఘకాలం సీఎంలుగా విధులు నిర్వహించిన ముఖ్యమంత్రులు అయిదుగురున్నారు. కాంగ్రెస్‌కు చెందిన వీరభద్రసింగ్‌ హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంగా 21 సంవత్సరాలు 13 రోజులు విధులు నిర్వహించారు. 1983 నుంచి 2017 వరకు (నాలుగుసార్లు) సేవలందించారు. మిజోరం కాంగ్రెస్‌ నేత లాల్‌ థధ్వాల్‌ 22 ఏళ్ల 60 రోజులు (1986 నుంచి 2018) ఆ రాష్ట్రాన్ని పాలించారు. అరుణాచల్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నాయకుడు గెగాంగ్‌ అపాంగ్‌ 22 ఏళ్ల 250 రోజులు (1980 నుంచి 2007) అధికారంలో ఉన్నారు. పశ్చిమబెంగాల్‌ సీఎంగా సీపీఎంకి చెందిన జ్యోతిబసు 23 సంవత్సరాల 137 రోజులు (1977 నుంచి 2000) ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు. నవీన్‌ అయిదుసార్లు (2000 నుంచి 2024 వరకు) సీఎంగా విధులు నిర్వహించి జ్యోతిబసు రికార్డును అధిగమించారు. ఈసారి (2024 జూన్‌ 9న) ఆరోసారి ప్రమాణ స్వీకారం చేస్తే పవన్‌ చామ్లింగ్‌ రికార్డును అధిగమించి చరిత్రలో నిలిచిపోతారు.బీజేడీ నేతల్లో ఆశాభావం: నవీన్‌ విధేయులుగా ముద్రపడిన నేతలంతా బీజేడీ అధికారంలోకి వస్తుందని, సీఎంగా నవీన్‌ ఆరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఆశాభావంతో ఉన్నారు. నవీన్‌కు ఆదరణ తగ్గలేదని ఎన్నికల ఫలితాలు రుజువుచేస్తాయని అంటున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల భవిష్యత్‌ మంగళవారం తేలనుంది. ఎన్నికలకు సంబంధించి వివిధ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటల నుంచి ప్రారంభించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సిద్ధమైంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో 69 స్ట్రాంగ్‌ రూముల్లో ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం), వీవీ ప్యాట్లను కట్టుదిట్టంగా భద్రపరిచారు. మూడంచెల భద్రత స్ట్రాంగ్‌ రూముల చుట్టూ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్‌ రూములను సీసీ కెమెరాల నిఘాలో ఉంచారు. వాటి రక్షణ కోసం 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్‌) మోహరించారు. పోలీసు బృందాలు రాత్రింబవళ్లు పహరా కాస్తున్నాయి. భువనేశ్వర్‌లోని బీజేబీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారు. సీఏపీఎఫ్‌ మరియు రాష్ట్ర సాయుధ పోలీసులు (ఓఎస్‌ఏపీ) ఇరువర్గాలు స్ట్రాంగ్‌రూమ్‌కు బాధ్యత వహిస్తారు. ఇదే తరహాలో బరిపద, బరంపురం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, ఉమా చరణ్‌ పటా్నయక్‌ ఇంజినీరింగ్‌ స్కూల్‌ ఆవరణలో స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేసి ఈవీఎం, వీవీప్యాట్‌లను కట్టుదిట్టమైన భద్రతలో ఉంచారు. ఫలితాల తదనంతరంపై నిఘా రాష్ట్రంలో ఫలితాల అనంతరం శాంతిభద్రతల పరిరక్షణపై భారత ఎన్నికల సంఘం ఉద్ఘాటించింది. ఎన్నికల తదనంతర పరిస్థితుల ప్రభావంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఈసీఐ మందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఈనెల 6 వరకు రాష్ట్రంలో 70కి పైగా సీఏపీఎఫ్‌ కంపెనీలు మోహరించబడతాయి. రాష్ట్రంలోని స్ట్రాంగ్‌రూమ్‌లు మరియు కౌంటింగ్‌ కేంద్రాలకు రక్షణగా 25 కంపెనీల సీఏపీఎఫ్‌ కొనసాగించాలని ఈసీఐ నిర్ణయించింది. రాష్ట్రం అంతటా శాంతిభద్రతల పరిస్థితిని నిర్వహించడానికి అదనంగా 70 సీఏపీఎఫ్‌ కంపెనీలను నియమించాలని నిర్ణయించారు. లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి జయపురం: సార్వత్రిక ఎన్నికల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జయపురం సబ్‌ డివిజన్‌ ఎన్నికల అధికారి, సబ్‌ కలెక్టర్‌ ప్రభాత్‌ కుమార్‌ పొరిడ తెలిపారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్‌ సభాగృహంలో విలేకరుల సమావేశం మంగళవారం నిర్వహించారు. జయపురం విక్రమదేవ్‌ విశ్వవిద్యాలయంలో జయపురం, కోట్‌పాడ్‌ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 20 టేబుల్స్‌ ఏర్పాటు చేశామని వెల్లడించారు. అలాగే బ్యాలెట్‌ పేపర్లు లెక్కించేందుకు 5 టేబుల్స్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. నవరంగపూర్, కొరాపుట్‌ లోక్‌సభ స్థానాల్లో అంతర్భాగమైన ఈ రెండు స్థానాల్లో లోక్‌సభ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా టేబుల్స్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం 58 మంది సిబ్బందిని, రెండు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 37 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. లెక్కింపు వివరాలు ప్రజలకు తెలిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో జయపురం బీడీవో శక్తి మహాపాత్రో, మున్సిపల్‌ కార్యనిర్వాహక అధికారి సిద్ధార్థ పటా్నయిక్, జయపురం తహసీల్దార్‌ డా.మనోలిస ఆచార్య, బొరిగుమ్మ బీడీవో అమృత లాల్‌ బెహర, కోట్‌పాడ్‌ అదనపు తహసీల్దార్‌ నీలాంబర పూజారి, జయపురం సబ్‌ డివిజన్‌ సమాచార ప్రజా సంబంధాల అధికారి యశోద గదబ, జయపురం పట్టణ పోలీసు అధికారి రమణీ రంజన్‌ దొళాయి, సదర్‌ పోలీసు అధికారి ఈశ్వర చంద్ర తండి, బీజేడీ ప్రతినిధి సుభాష్‌ పండ, కాంగ్రెస్‌ ప్రతినిధి తరణి ప్రసాద్‌ పాణిగ్రహిలు పాల్గొన్నారు.

CM YS Jagan Tweet On Counting Of AP Elections
పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్‌ సందేశం

తాడేపల్లి: ఏపీలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు(మంగళవారం) జరుగనున్న కౌంటింగ్‌ ప్రక్రియలో భాగంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సందేశాన్ని పంపారు. ఈ మేరకు‘ఎక్స్‌’ వేదికగా సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.‘ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement