Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Watch Live AP CM YS Jagan Public Meeting at Palamaneru
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

Ksr Comments on Pawan kalyan Pithapuram Constituency Campaign
పవన్‌ వ్యూహానికి వంగా గీత కౌంటర్‌ వ్యూహమిదే..!

పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో ఎన్నికల బరిలో తలపడుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి వంగా గీత చాలా వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆమె తన పార్టీ గురించి, తన గురించి, తన ప్రభుత్వ స్కీముల గురించి చెబుతున్నారే తప్ప పవన్‌ను ఏ విధంగాను విమర్శించడం లేదు. అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆమె తెలివిగా ప్రచారం చేపట్టారు. వంగా గీత.. గత మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నారు. విద్యార్ధి దశలో ఉన్నప్పుడే ఆమె రాజకీయాలపై ఆసక్తితో ఉండేవారు. సామాజిక స్పృహతో ఉండేవారు. పవన్‌తో పోల్చితే పెద్ద ధనికురాలు కూడా కాదు. అయినా స్వయంశక్తితో, రాజకీయాలలోకి వచ్చారు. 1994లో శాసనసభ సీటు కోసం ప్రయత్నించారు కాని సఫలం కాలేదు. తదుపరి కాలంలో జడ్పి చైర్ పర్సన్ గాను, రాజ్యసభ సభ్యురాలిగా, శాసనసభ సభ్యురాలిగా, 2019లో లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.ఆయా సందర్భంలో ఆమె ప్రజల సమస్యలపై శ్రద్ద వహించేవారు. సాధ్యమైన మేరకు ఆ సమస్యలను తీర్చే యత్నం చేసేవారు. ప్రజలలో కలిసిపోతుంటారు. ఆమె తమకు అందుబాటులో ఉండరన్న మాట రానివ్వరు. కరోనా సమయంలో జబ్బుబారిన పడ్డవారికి ఆమె భయపడకుండా సేవలందించారు. వ్యాధి సోకినవారిని స్వయంగా ఆస్పత్రికి తీసుకువెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే, వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రులకు పంపించడానికి కృషి చేసేవారు. ఇవన్ని ఆమెకు ఇప్పుడు పాజిటివ్ పాయింట్లుగా ఉన్నాయి. బాగా విద్యాధికురాలు. రెండు పీజీలు, న్యాయశాస్త్ర పట్టభద్రురాలుగా ఉన్నారు. ఆమె లాయర్‌గా కూడా పేదలకు సేవలందించారు. ఆమె భర్త విశ్వనాద్ కూడా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆమెకు చేదోడువాదోడుగా నిలబడడం కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎవరైనా ‘పవన్‌తో పోటీ పడుతున్నారు.. మరి గెలవడం సాధ్యమా?’ అని అడిగితే, 'ఆయనకు సినిమా రంగంలో పేరు ఉంది.. నాకు ప్రజాసేవ రంగంలో పేరు ఉంది. పవన్‌కు కూడా ప్రజా సేవ చేయాలని ఉండవచ్చు.. కాని ఆయనకు ఉన్న పరిస్థితులు అందుకు అవకాశం ఇవ్వవు" అని నేర్పుగా సమాధానం చెబుతున్నారు.పవన్ విద్య గురించి ఎవరైనా అడిగితే, దాని గురించి తాను మాట్లాడనని, ఆయన సినిమాలలో స్టార్ అయ్యారు కదా! అంటూ తనకు ఉన్న డిగ్రీలు, ఇతర అర్హతలను మాత్రమే వివరిస్తున్నారు. పవన్‌ చదువు తక్కువ అనే పాయింట్‌ను కూడా ప్రస్తావించడం లేదు. తాను ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తినని చెప్పడానికి పలు ఉదాహరణలు వివరిస్తుంటారు. ఎవరికైనా నియోజకవర్గ ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే, తాను పిఠాపురంలోనే అందుబాటులో ఉంటానని, అదే పవన్‌ అయితే ఎక్కడో షూటింగ్‌లలో బిజీగా ఉంటారని, అందువల్ల ఆయన చేయలేరని, ఆయన పీఏలను పెట్టుకున్నా ప్రజలకు సేవలందించడం కష్టమని అంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపట్ల ప్రజలు ఆకర్షితులయ్యారని, ముఖ్యంగా మహిళలు అయితే మరింతగా ఆదరిస్తున్నారని ఆమె చెబుతున్నారు. ప్రచారంలో ఎవరి ఇంటి వద్ద అన్నా ఆగకపోతే ప్రత్యేకించి పిలిచి మరీ తమ ఇళ్లవద్దకు తీసుకు వెళుతున్నారని ఆమె చెప్పారు. ఆయన ప్రచారానికి ఇప్పటికే నాగబాబు, జబర్దస్త్ టీమ్ తదితర నటులు వచ్చారని, బహుశా మెగాస్టార్ చిరంజీవి రాకపోవచ్చని అనుకుంటున్నానని గీత అభిప్రాయ పడ్డారు.లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని చెబుతున్న పవన్‌ వీరందరిని ఎందుకు తీసుకు వస్తున్నట్లు అని గీత ప్రశ్నిస్తున్నారు. మరో ఆసక్తికరమైన వాదన తెచ్చారు. పిఠాపురంలో ఏదైనా సమస్య ఉంటే తాను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించే అవకాశం ఉంటుందని, జనసేనకు ఆ అవకాశం ఉండదని, వారు వేరే పార్టీ వారి దగ్దరకు వెళ్లాల్సి ఉంటుందని, ఆ తేడాను కూడా ప్రజలు గుర్తించారని ఆమె చెబుతున్నారు. కాపు సామాజికవర్గం వారు పవన్ వైపు ఎక్కువగా ఉన్నారా అని ప్రశ్నిస్తే, అలా ఏమీ ఉండదని, తాను కాపువర్గానికి చెందిన వ్యక్తినే కదా అని అంటారు. తాను కాపు సామాజికవర్గానికి ఉపయోగపడే పనులు అనేకం చేయించానని, ప్రత్యేకించి కాపు కళ్యాణమండపాలు నిర్మించడానికి నిధులు సమకూర్చానని ఆమె గుర్తు చేస్తున్నారు. ఎవరైనా అన్ని సామాజికవర్గాల ఆదరణ పొందాలి తప్ప, ఏ ఒక్క వర్గమో సపోర్టు చేస్తే గెలిచే పరిస్థితి ఉండదని అన్నారు. కొంతమంది కావాలని బయట నుంచి వచ్చి అలజడులు సృష్టించడానికి యత్నిస్తున్నారని, ఇది చాలా ప్రశాంతమైన నియోజకవర్గమని, ప్రజలు వీటిని గమనిస్తున్నారని ఆమె అన్నారు.పవన్ కళ్యాణే పెద్ద సినిమా స్టార్ అయినప్పుడు, జబర్దస్త్ టీవీ నటులు వంటివారి ప్రచారంతో ఏమి అవసరం వచ్చిందోనని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా తాను విజయం సాధిస్తానన్న ధీమాను గీత వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో చాలామంది ఒక మాట చెబుతున్నారు. జగన్ చాలా తెలివిగా వంగా గీతను ఎంపిక చేసి  పవన్‌ను ఆత్మరక్షణలో పడేశారని అంటున్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వంటివారు ఆమెకు మద్దతు ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. పిఠాపురంలో సుమారు తొంభైవేల వరకు కాపుల ఓట్లు ఉండవచ్చని అంచనా. వాటి ఆధారంగా గెలవవచ్చన్న ఆశతో పవన్‌ అక్కడ పోటీలోకి దిగడం, వర్మ వంటి టీడీపీ నేతలను తనను గెలిపించాలని వేడుకున్న వైనం ఇవన్ని ఆయనకు కాస్త మైనస్ అయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తన అభ్యర్ధులను గెలిపించవలసిన నేత, తన గెలుపుకోసమే ఇతరులను అభ్యర్ధించవలసిన పరిస్థితి ఏర్పడడం చాలామందికి నచ్చడం లేదు.జనసేనకు స్వయంగా నియోజకవర్గం అంతటా పోల్ మేనేజ్ మెంట్ యంత్రాంగం లేదన్నది ఒక అభిప్రాయం. తెలుగుదేశం పార్టీవారి మద్దతు ఉన్నా, పిఠాపురాన్ని జనసేనకు ఇస్తారని ప్రకటన రాగానే, టీడీపీ శ్రేణులు భగ్గుమనడం కూడా పవన్‌కు నష్టం చేసింది. పవన్‌కు పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదని, అక్కడ ఉన్న సమస్యలు తెలియవని, తాను ఏమి చేస్తానో చెప్పలేకపోతున్నారని వైస్సార్‌సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం సినిమా గ్లామర్ ఆకర్షణతో గెలవాలన్నది పవన్‌ వ్యూహం అయితే, ప్రజాసేవ ద్వారా వచ్చిన గ్లామర్‌తో పాటు జగన్ ప్రభుత్వం అమలు చేసిన స్కీముల ప్రభావంతో విజయం సాధించాలన్నది వంగా గీత వ్యూహంగా ఉంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

AP Elections 2024: CM YS Jagan Speech At Hindupur
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్‌

శ్రీసత్యసాయి, సాక్షి:  చంద్రబాబు చేసేవన్నీ మాయలు.. కుట్రలు అని, ఈ 59 నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చాడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  హిందూపురం అంబేద్కర్‌ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నాం జరిగిన ప్రచార భేరిలో సీఎం జగన్‌ ప్రసంగించారు.  మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతోంది. ఇవి కేవలం  ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు. మీ ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు.. ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడం. పొరపాటున మళ్లీ చంద్రబాబుకి ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. లేచి లకలకలక అంటూ మీ దగ్గరికి వస్తుంది. అందరూ గుర్తుపెట్టుకోండి.దేవుడి దయతో.. ప్రజల చల్లని దీవెనలతో 58 నెలల మీ బిడ్డ పాలనలో రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా, ప్రతీ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా రూ.2 లక్షల 70 కోట్ల వేల రూపాయలు అక్కచెల్లెమ్మల కుటుంబాలకు  డీబీటీ  ద్వారా బటన్‌లు నొక్కడం జమ చేశాడు. గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?. గతంలో ఎన్నడూ లేనంతగా, రాష్ట్ర చరిత్రలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే.. 2 లక్షల 30 వేల ఉద్యోగాలిచ్చాడు. మేనిఫెస్టోలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 99 శాతం హామీలు అమలు అయ్యింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. గతంలో.. ఎన్నికలప్పుడు మేనిఫెస్టో తీసుకొచ్చి.. తర్వాత చెత్త బుట్టలో వేస్తారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ.. మేనిఫెస్టో హామీలు నెరవేర్చి, ఇప్పుడు ఇదే మేనిఫెస్టోతో ప్రజల ఆశీస్సులు కోరుతున్న ప్రభుత​ం మీ బిడ్డ ప్రభుత్వమే.మొట్టమొదటిసారిగా ప్రభుత్వ బడుల పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపిస్తున్నాయి. గోరుముద్ద, అమ్మ ఒడి, పూర్తి ఫీజులతో ఇబ్బంది పడకూడదని జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన.. అక్కాచెల్లెమ్మలు తమ సొంత కాళ్ల మీద నిలబడేందుకు ఆసరా, వైఎస్సార్‌ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇళ్ల పట్టాలు.. అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్‌ కానుక.  ఇవేవైనా గతంలో జరిగాయా?. రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత బీమా, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, పగటి పూట 9గం. ఉచిత కరెంట్‌.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా?స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ.. ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేస్తం, చేదోడు, లాయర్లకు లా నేస్తం.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశామా?. పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతలా పట్టించుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదేమో. ఆరోగ్యశ్రీని ఉచితంగా రూ.25లక్షలకు విస్తరించడం, గ్రామంలోనే ఫ్యామిలీ క్లినిక్‌, విలేజ్‌ డాక్టర్‌, ఇంటికే సురక్ష.. ఇవేవైనా గతంలో జరిగాయా?..గతంలో ఎన్నడూ లేనివిధంగా..  ఏ గ్రామానికి వెళ్లినా సచివాలయం కనిపిస్తుంది. 600 రకాల సేవలు అక్కడే అందుబాటులోకి వచ్చాయి. వలంటీర్‌ వ్యవస్థ, ఆర్బీకే, విలేజ్‌ క్లినిక్‌, ఫైబర్‌ గ్రిడ్‌, నిర్మాణంలో ఉన్న డిజిటల్‌ లైబ్రరీ, గ్రామంలో ఓ మహిళా పోలీస్‌, అక్కచెల్లెమ్మల సంరక్షణ కోసం దిశా యాప్.. ఇవేప్పుడైనా గతంలో చూశారా?.. ఇవన్నీ 59 నెలల పాలనలో జరిగినవి వాస్తవమా కాదా?..మరో వంక.. 75 ఏళ్ల ముసలాయన. ‌14 ఏళ్లు సీఎంగా చేశాను అంటాడు. మరి ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటైనా ఆయన చేసిన మంచి గుర్తుకు వస్తుందా?. పిండి కొద్ది రొట్టే సామెత.. పిండి ఎక్కువ ఉంటే.. రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువైతే తగ్గుతాయి. కానీ, పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుది అయితే తాను, తన వారు తినేయడమే స్కీమ్‌గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన. పేదల ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా చంద్రబాబు వేశారా?.. అదే మీ బిడ్డ జగన్‌.. ఏకంగా రూ.2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా బటన్‌ నొక్కి.. అక్కాచెల్లెమ్మల ఖాతాలోకి నేరుగా వెళ్తున్నాయి. ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు.చంద్రబాబు హయాంలో ఇదే డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది. దత్తపుత్రుడు, ఈనాడు, టీవీ5, వీళ్ల జన్మభూమి కమిటీల జేబుల్లోకి ఎంత పోయిందో ప్రజలు నిలదీయాలి. అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అది ఎలా ఉంటుందంటే.. 2014లో చంద్రబాబు ప్రతీ ఇంటికి పంపిన మేనిఫెస్టో తెలుస్తుంది.స్వయంగా చంద్రబాబు సంతకం చేసి ముఖ్యమైన హామీలంటూ ప్రతీ ఇంటికి పంపించాడు. ఇందులో ఏ ఒక్కటైనా చేశారా? అని హిందూపురం ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రశ్నించారు(లేదు అనే సమాధానం జనం నుంచి వచ్చింది. రుణమాఫీ జరిగిందా?. పొదుపు సంఘాల రుణమాఫీ అన్నారు.. చేశారా?. ఇంటింటికీ ఉద్యోగం.. అది కుదరకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. మరి ఇచ్చారా?. అర్హులకు 3 సెంట్ల స్థలం.. పక్కా ఇళ్లు అన్నారు. కనీసం ఒక్కరికైనా సెంట్‌ స్థలం ఇచ్చారా?.  ప్రతీ నగరంలో హైటెక్‌ సిటీ.. సింగపూర్‌ను మించిన అభివృద్ధి అన్నారు. జరిగిందా?..మళ్లీ ఈ ముగ్గురు కలిశారు. మళ్లీ మేనిఫెస్టో అంట. మేనిఫెస్టో పేరుతో సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవెన్‌‌ అంట. ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్‌ కారు అంట. నమ్ముతారా?..మన బతుకులు బాగుపడాలన్నా. పేదల భవిష్యత్తు మారాలన్నా. లంచాలు లేని అవినీతి రహిత పాలన కొనసాగాలన్నా.. రెండు బటన్‌లు నొక్కాలి.  ఫ్యాన్‌ గుర్తుకే ఓటేయాలి. 175కి 175.. 25 ఎంపీ సీట్లకు 25 ఎంపీ సీట్లు.. ఒక్కటి కూడా తగ్గేది లేదు.. సిద్ధమేనా?..(సిద్ధం అనే బదులు ప్రజల నుంచి వచ్చింది). మంచి చేసిన ఈ ఫ్యాన్‌ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్‌.. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లోనే ఉండాలి. ఈ విషయాల్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మీలో ఒకరైన.. మీ బీసీ కులానికి చెందిన దీపిక నిల్చుంది. గెలిపిస్తే.. ఎప్పుడూ మీ దగ్గరే, మీతోనే ఉంటుంది. ఇంకా చాలా మంచి చేయిస్తా.  ఎంపీ అభ్యర్థిగా బోయ శాంత.. అన్ని రకాలుగా మంచి చేస్తుంది. అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది.. ఓటేసి గెలిపించాలని సీఎం జగన్‌ కోరారు. ఎండను లెక్క చేయకుండా నాపై ఆప్యాయతను చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు అనిరాజకీయాలు దిగజారిపోయాయి. భయంకరమైన అబద్ధాలు చూస్తున్నాం. ఇదే చంద్రబాబు తన మనుషులతో అవ్వాతాతలకు వలంటీర్ల ద్వారా పెన్షన్‌లు ఇంటికి రాకుండా చేశారు. ఆ అవ్వాతాతలు తిట్టుకుంటుంటే.. ఆ నెపాన్ని ప్రభుత్వం మీద నెట్టే యత్నం చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?. ఈ మధ్య ఇంకో అబద్ధం.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ చేస్తూ దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు. ⁠మీ బిడ్డ జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునే వాడు కాదు. దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు నువ్వు మనిషివేనా?. అసలు ఆ చట్టం ఏంటో చంద్రబాబు తెలుసుకోవాలి. భూమిమీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ⁠ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ అవుతుంది. ⁠భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలందరూ కూడా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి. కానీ, అలా ఎవరూ కూడా ఎవరి చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి రాకూడదు. ఇప్పుడు చేస్తున్న సర్వే పూర్తైన తర్వాత ⁠ఈ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. ఇలా ఇచ్చే ల్యాండ్ లైటిల్స్కు ఇన్సూరెన్స్కూడా చేస్తుంది. రైతులు తరఫున, భూ యజమానుల తరఫున ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది, వారి పక్షాన నిలబడుతుంది. ⁠ఇది చేయాలంటే  ⁠మొదటగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి కావాలి.  బ్రిటీష్‌ కాలం తర్వాత.. ఇప్పుడు వందేళ్ల తర్వాత మీ బిడ్డ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎకరాను సర్వే చేయిస్తున్నాడు. ⁠సరిహద్దు రాళ్లు పెడుతున్నాం.. రికార్డులన్నీ అప్డేట్ చేస్తున్నాం.   ⁠సబ్ డివిజన్ చేస్తున్నాం. రైతన్నలకే పదిలంగా హక్కు పత్రాలు పంపిణీచేస్తున్నాం. ⁠రాష్ట్రవ్యాప్తంగా 17 వేల రెవెన్యూ గ్రామాలు…. ఉన్నాయి.   ⁠ఇప్పటివరకు 6 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి అయ్యింది. ⁠రాబోయే రోజుల్లో పూర్తిగా 17 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తాం. అప్పుడు ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ల భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. ⁠పూర్తి హక్కులతో రికార్డ్స్ అప్డేట్ అవుతాయి, సబ్ డివిజన్లు కూడా అవుతాయి.  ఆ తర్వాత రైతులకు ఇచ్చే సంపూర్ణ హక్కులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది.ఇంకో అబద్ధం.. ఫిజికల్‌ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు కార్డ్-2 సాఫ్ట్ వేర్ తో 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత భూయజమానులకు డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కార్డ్-2  సాఫ్ట్ వేర్ అమలు జరుగుతోంది. పత్రాలల్లో తప్పులు ఉండకూడదని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఫార్మాట్ తీసుకొచ్చాం.    సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతోంది.కాబట్టి చంద్రబాబు చేసే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చెబుతున్నారు. ఇవన్నీ నమ్మొద్దు. మోసపోవద్దు. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే.. మీరు మీ బిడ్డకు సైనికులుగా నిలవండి అంటూ సీఎం జగన్‌ ప్రసంగం ముగించారు. 

No funding from Congress Sucharita Mohanty returns Puri Lok Sabha ticket
కాంగ్రెస్‌కు షాక్‌.. ‘ప్లీజ్‌ పోటీ చేయలేను’

లోక్‌సభ ఎన్నికలవేళ కాంగ్రెస్‌ పార్టీ ఎదురుదెబ్బలు తగులుతున్నా​యి. కొందరు నేతలు పార్టీ మారగా.. మరికొందరు పలు కారణాలతో పోటీ నుంచి వైదోలుగుతున్నారు. తాజాగా ఒడిషా రాష్టంలో పూరీ లోక్‌భ స్థానంలో బరిలో ఉన్న సుచరిత మొహంతి.. పోటి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి పార్టీ నుంచి తగిన నిధులు అందకపోవటంతో సుచరిత మొహంతి.. తనకు కేటాయించిన టికెట్‌ను తిరిగి ఇస్తున్నట్లు తెలియజేశారు. పబ్లిక్‌ డొనేషన్‌ డ్రైవ్‌ చేపట్టి, ఎంత ఖర్చ తగ్గించినా.. తాను ఆర్థికంగా  చాలా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.‘నాకు పార్టీ నుంచి రావాల్సిన ఎన్నికల ప్రచార నిధులు నిరాకరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలహీన అభ్యర్థులకు టికెట్లు కేటాయించారు. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీజేడీ చాలినంత నిధులు, ధన బలంతో ఉన్నారు. ఇది చాలా కష్టమైన పరిస్థితి. ప్రతిచోట చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. నేను వారిలా పోటీలో ఉండలేను. డబ్బుతో కాకుండా ప్రజలతో ప్రచారం చేయాలనుకున్నా. కానీ, అది కూడా నిధుల కొరతతో సాధ్యపడటం లేదు. కాంగ్రెస్‌ పార్టీ కూడా బాధ్యత తీసుకోవటం లేదు’ అని సుచరిత తెలిపారు.కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు రాసిన లేఖలో సుచరిత.. పార్టీ ప్రచార నిధుల నిరాకరించటంతో  తన నియోజకవర్గంలో ఎ‍న్నికల ప్రచారానికి చాలా ఇబ్బంది అవుతోదని తెలిపారు. ‘‘సాధారణ జర్నలిస్ట్‌గా పనిచేసిన నేను పదేళ్ల క్రితం రాజకీయాల్లో​కి వచ్చాను. అన్ని రకాలుగా నేను పూరీలో ప్రచారం చేస్తున్నా. నిధుల కోసం పబ్లిక్‌ డొనేషన్‌ డ్రైవ్‌ కూడా చేట్టాను. చాలా వరకు ప్రచార ఖర్చును కూడా తగ్గించాను.  కానీ, ప్రచార నిధుల కొరత కారణంగా విజయావకాశాలు ఉన్న పూరీ నియోజకవర్గంలో వెనకబడి ఉన్నాం. పార్టీ నిధులు లేకుండా ప్రచారం కొనసాగించలేకపోవటంపై చింతిస్తున్నా. అందుకే నాకు కేటాయించిన టికెట్‌ను తిరిగి ఇస్తున్నా’’ అని కేసీ వేణుగోపాల్‌కు రాసిన లేఖలో వివరించారు.

AP Politics And Election Live Updates On May 4th
AP Election Updates May 4th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Andhra Pradesh Election Updates 4th May...1:00 PM, May 4th, 2024చంద్రబాబుది క్రిమినల్ మైండ్: జోగి రమేష్చంద్రబాబుపై జోగి రమేష్‌ సీరియస్‌ కామెంట్స్‌రాజకీయ హాంతకుడు బాబు.డీబీటీ ద్వారా వచ్చే పథకాలను ఆపేయమన్నాడు.ఈసీకి ఫిర్యాదు చేయించిన దుర్మార్గుడు చంద్రబాబు.ఆసరా, చేయూత, విద్యా దీవెన, ఇన్‌పుట్‌ సబ్సిడీ పథకాలు ఆపేయాలని ఈసీని కోరారు.అవ్వాతాతలను పొట్టన పెట్టుకున్న వ్యక్తి బాబు.చంద్రబాబు రాక్షసుడు మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు.బాబు నిజస్వరూపం ప్రజలు గమనించాలి.రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు.కుప్పంలో చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడించాలి.మంచి చేస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నాడు.ముఖ్యమంత్రి జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు.  12:40 PM, May 4th, 2024బుడి ముత్యాల నాయుడు ఇంటిపై రెక్కీ! బీజేపీ నేతల ఓవరాక్షన్‌..డ్రోన్‌తో విజువల్స్ తీస్తున్న బీజేపీ నేతలు.అనుమానం వచ్చి ఆరా తీసిన స్థానికులు.పొంతన లేని సమాధానాలు ఇచ్చిన బీజేపీ నేతలు.విజువల్స్ తీస్తున్న వారిని పట్టుకున్న స్థానికులు.పట్టుకున్న వారిని పోలీసులకు అప్పగింత.నిందితులను విచారిస్తున్న పోలీసులు.విజువల్స్ తీసిన వారు స్థానికులు కాదంటున్న వైఎస్సార్‌సీపీ నేతలు.సీఎం రమేష్ ఆదేశాలతోనే విజువల్స్ తీశారంటున్న వైఎస్సార్‌సీపీ నేతలు, స్థానికులుదేవరపల్లి పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులుముగ్గురిని విచారిస్తున్న దేవరపల్లి పోలీసులుడ్రోన్ కెమెరాను ఎందుకు ఇంటిపై ఎగురవేస్తున్నారు అని ప్రశ్నించిన పోలీసులుముగ్గురి వద్ద బీజేపీ పార్టీ కండువాలు గుర్తించిన పోలీసులు  12:20 PM, May 4th, 2024సుజనా చౌదరికి వైఎస్సార్‌సీపీ నేతల కౌంటర్‌..కేశినేని నాని కామెంట్స్‌మైనారిటీలను, బీసీలను మోసం చేసి పక్క దారిలో పశ్చిమ నియోజకవర్గానికి వచ్చాడు. 12ఏళ్ళు రాజసభ సభ్యుడిగా, మూడేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న నీ వల్ల ఏమైనా అభివృద్ధి జరిగిందా?రాజ్యసభ సభ్యుడిగా 60కోట్లు నిధులు వస్తే ఒక్క అర్ధ రూపాయి అయినా ఖర్చు చేశావా?.  పశ్చిమని బెస్ట్ చేస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారుఅసిఫ్, వైస్సార్సీపీ వెస్ట్ అభ్యర్థిచంద్రబాబు ఎలా మాయమాటలు చెప్పాడో.. అలాగే సుజనా కూడా మాయ మాటలు చెపుతున్నాడు.విజయవాడ ప్రజలకు సుజనా చౌదరి మొహం తెలుసా?డబ్బుంటే ఏదైనా చేయొచ్చని సుజనా భ్రమలో ఉన్నాడు.పశ్చిమలో తెలుగుదేశం కండువా కప్పుకొన్నాడు.. ఒక్కడు కూడా సుజనా వెనక లేరు.జెండాలు జత కట్టి వచ్చిన మమ్మల్ని ఢీకొట్టలేరు.. మా జెండా ఏ జెండా రెండు ఒకటే. 12:00 PM, May 4th, 2024గద్దెకు దేవినేని కౌంటర్‌ దేవినేని అవినాష్‌ కామెంట్స్‌.. జగన్‌ ప్రభుత్వం శంకుస్థాపనలే కాకుండా ప్రారంభోత్సవాలు కూడా చేసింది.రిటేనింగ్ ప్రారంభంతో గద్దె ఓటమి మొదలైందికరకట్టవాసుల కష్టాలు పట్టని టీడీపీ నేతలుప్రతీ ఇంటికే పథకాలు పంపిన జగన్ ప్రభుత్వానికే మా మద్దతు అని ప్రజలు అంటున్నారుటీడీపీ చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారుటీడీపీ నేతల లాగా కాల్ మనీ సెక్స్ రాకెట్‌ మా పార్టీ నేతలు లేరు670 కోట్లతో తూర్పు నియోజకవర్గ అభివృద్ధి జరిగిందిగంజాయికి పునాదులు వేసింది టీడీపీ ఎమ్మెల్యే కాదా?.విశాఖలో దొరికిన డ్రగ్స్‌కు గద్దె రామ్మోహన్ కుటుంబానికి సంబంధాలున్నాయినిజానిజాలు వెలికితీయాలిజగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని టీడీపీగా చెప్పుకోడానికి సిగ్గులేదా?.చిల్లర రాజకీయాలు చేయడం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కే దక్కుతుందిఅసమర్థ ఎమ్మెల్యే మాకు వద్దు అని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు 11:20 AM, May 4th, 2024బాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గనటీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన అప్పు ఆయన కడతారా?.75 ఏళ్లు దాటిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. కోట్ల సూర్యప్రకాశ్‌ ఒక్కరోజు నాతో పాటు వచ్చి డోన్‌లో తిరగండి. పుష్కర కాలం ఎంపీ పదవి అనుభవించి మీరేం సాధించారో చెప్పండి.ప్రతీ దానికి ట్యాక్స్‌లు కట్టిన నేడు ఆర్థిక నేరుస్థుడినా? అయితే మరి మిమ్మల్ని ఏమనాలి. ఎన్నికల్లో వేసిన నామినేషన్‌ను కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటారా?. ఆస్తులు సహా అని వివరాలు, దానికి సంబంధించిన పత్రాలను పక్కాగా రిటర్నింగ్‌ ఆఫీసర్‌కి సమర్పించాం. అప్లికేషన్‌లో రాయనంత మాత్రాన తప్పుడు నామినేషన్‌ అవుతుందా?. నాకు సంబంధించిన వివరాలన్నీ జతపరిచాం. రైల్వే సహాయ మంత్రిగా ఉండి.. పేకాట ఆడటమేనా అందుబాటులో ఉండటం అంటే? స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ ప్రతిపక్షాలకు మేలు జరిగేది కాదా?. డోన్‌ను కర్నూలులో కలుపుతారా అని అంటున్నారే నంద్యాలలో కలుస్తున్నప్పుడు ఏం చేశారు. మిమ్మల్ని, చంద్రబాబును ప్రజలు నమ్మేపరిస్థితి లేదు.  10:40 AM, May 4th, 2024బాబు నీకు పేదల ఉసురు తగులుతుంది: ఎంపీ విజయసాయిమానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెలా ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు నిమ్మగడ్డ రమేష్‌ చౌదరి ద్వారా ఈసీకి ఫిర్యాదుమొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు పంచాయతీ సెక్రటేరియట్‌లో సైతం పెన్షన్లు పంపిణీని అడ్డుకున్నారు. బ్యాంకుల్లో పెన్షన్‌ సొమ్ము జమ చేయించడంతో బ్యాంకుల దగ్గర పడిగాపులుకాస్తూ వడదెబ్బతో వయోవృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. బాబు ముఖంలో పశ్చాతాపానికి బదులు మందహాసం కనిపిస్తోంది. పేదల ఉసురు నీకు తప్పక తగులుతుంది బాబూ.మానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెల ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు తన నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్‌ చౌదరి ద్వారా ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదులు చేయించాడు. మొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 4, 2024  9:20 AM, May 4th, 2024మళ్లీ తప్పులో కాలేసిన లోకేశం! మళ్లీ తప్పులో కాలేసిన మంగళగిరి మాలోకం!ఏపీలో పోలింగ్ ఎప్పుడో కూడా తెలియనివాడు @JaiTDPలో ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వెళ్లి మార్చి 13న ఓటు వేసుకో @naralokesh.. ఏపీ ప్రజలంతా మే 13న ఓటు వేస్తారు మంగళగిరి ప్రజలారా ఇలాంటి బుర్రతక్కువ వాళ్ళు మీకు అవసరమా?#TDPJSPBJPCollapse#EndOfTDP pic.twitter.com/b2a2Xj64CR— YSR Congress Party (@YSRCParty) May 4, 2024 ఏపీలో ఎన్నికలు ఎప్పుడో కూడా తెలియని వ్యక్తి నారా లోకేష్‌మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌ కామెడీ ట్రాక్‌మే 13న పోలింగ్‌ అయితే మార్చి 13న ఓటు వేయమన్న లోకేష్‌లోకేష్‌ మాటలతో ఒక్కసారిగా నవ్వుకున్న ప్రజలు 8:50 AM, May 4th, 2024చంద్రబాబు మరో కుట్ర..టీడీపీ అధినేత చంద్రబాబు మరో దారుణ కుట్రపేదలకు ప్రభుత్వ పథకాలు అందకుండా మోకాలడ్డుఇప్పటికే వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వనీయకపోవటంతో వృద్దులు, వికలాంగుల అవస్థలుబ్యాంకుల చుట్టూ మండుటెంటలో తిరుగుతున్న పెన్షన్ దారులుతాజాగా వైఎస్సార్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, విద్యాదీవెన, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ నిధులను ఇవ్వనీయకుండా అడ్డుఇవన్నీ గత ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలేఐనాసరే టీడీపీ ఫిర్యాదుతో నిధులను రిలీజ్ చేయనివ్వని ఎన్నికల సంఘంఇప్పటికే అనేకసార్లు ఎన్నికల‌ సంఘాన్ని అనుమతి కోరిన ప్రభుత్వంటీడీపీ ఫిర్యాదుతో ఇంకా అనుమతి ఇవ్వని ఈసీ 7:45 AM, May 4th, 2024ఓటమి భయంలో కూటమి నేతల ఓవరాక్షన్‌..ఓటమి భయంతో టీడీపీ, జనసేన కూటమి నేతల కుట్ర రాజకీయాలువైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక పోతున్న కూటమి నేతలుప్రచారాలలో వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకి తెగబడుతున్న టీడీపీ, జనసేన కార్యకర్తలుసీఎం జగన్‌పై వ్యక్తిగత దూషణలతో కార్యకర్తలని రెచ్చగొట్టేలా ప్రచారంలో బాబు, పవన్‌ వివాదాస్పద ‍వ్యాఖ్యలు.వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పుతున్న టిడిపి, జనసేన నేతలుమచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి పేర్ని కిట్టు ప్రచార సమయంలో దాడికి పాల్పడ్డ జనసేన, టీడీపీ నాయకులుదెందులూరు నియోజకవర్గంలో ప్రచారంలో ఉండగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాళ్లతో, కర్రలతో చింతమనేని అనుచరుల దాడిచిలకలూరిపేట నియోజకవర్గంలో ఈవూరివారిపాలెంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా కావటి మనోహర్ నాయుడుపై దాడికి ప్రయత్నం.అదే సమయంలో ప్రచార రథం ధ్వంసంమంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా మేకా వెంకట్ రెడ్డిపై దాడి.ఎన్నికల ప్రచారంలో నిలదీసిన మహిళని చెప్పుతో కొడతానంటూ రెచ్చిపోయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిసీఎం సభలకి పెరుగుతున్న జనాదరణతో కూటమి నేతలలో ఓటమి భయంఅందుకే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు.. అసహనంతో ప్రజలపై తిట్ల పురాణం  7:00 AM, May 4th, 2024నేడు సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం ఇలా..నేడు  పలమనేరు నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గొనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌నేడు హిందూపురం, పలమనేరు, నెల్లూరులో బహిరంగ సభల్లో పాల్గొనున్న సీఎం జగన్సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి 12.10 నిమిషాలకు హెలికాప్టర్‌లో బయలుదేరనున్న సీఎంమధ్యాహ్నం ఒంటి గంటకు పలమనేరుకు చేరుకోనున్న సీఎం జగన్మధ్యాహ్నం 1.30 నుంచి 2.05 వరకు పలమనేరు బహిరంగ సభలో పాల్గొంటారు.మధ్యాహ్నం 2.30 పలమనేరు నుంచి బయలుదేరి  3.50 గంటలకు  నెల్లూరు చేరుకోనున్న సీఎం జగన్మధ్యాహ్నం 3.50 నుంచి 4.35 గంటల వరకు నెల్లూరులో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. 6:45 AM, May 4th, 2024ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం: కేశినేని నానిచంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై పొత్తులో ఉన్న బీజేపీకి నమ్మకం లేదుఅందుకే మేనిఫెస్టోలో బీజేపీ నేతల ఫోటో ఒకటి కూడా లేదు.చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానీ మానిఫెస్టోఅందుకే మేనిఫెస్టోని పట్టుకోడానికి  కూడా బీజేపీ నేతలు ఇష్టపడలేదురానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా సీఎం జగన్‌ను మరోసారి గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారుఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, పార్టీ కార్యాలయానికి తాళం వేయడం ఖాయంటీడీపీని బీజేపీలో విలీనం చేసి చంద్రబాబు హైదరాబాద్‌లో తన ఇంటికి వెళ్లిపోతారుఈ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందిదేవినేని ఉమా ఒక చచ్చిన పాము.. అతని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ఉమాకు సీటు రాకపోతే ఇంటికి వెళ్లి పరామర్శించలేని ద్రోహి తంగిరాల సౌమ్య 6:30 AM, May 4th, 2024జూనియర్‌ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని ఓడించాలి: కొడాలి నానిగుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నానిజూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలిపెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలపై నాకు, సీఎం జగన్‌కు అమితమైన ప్రేమఅందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాముపార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబుఅన్న ఎన్టీఆర్ వారసులు.. అభిమానులెవరు టీడీపీలో ఉండరు, చంద్రబాబు వెంట నడవరుపదిమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకొని టిడిపి కార్యక్రమాలకు వెళితే... ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాంమన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబు, లోకేష్ తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదుఅభిమానులందరూ కష్టపడి టిడిపిని గెలిపిస్తే.. ఎన్టీఆర్‌ను తుంగలో తొక్కుతారు. లోకేష్‌ను అందలం ఎక్కిస్తారుఎన్టీఆర్‌ టీడీపీ పగ్గాలు పట్టుకున్నప్పుడే.. అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలిచంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తూ చిత్తుగా ఓడిస్తేనే.. పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కి వస్తాయిఎవరైతే పెద్ద ఎన్టీఆర్‌ను  వెన్నుపోటు పొడిచారో.. పార్టీని కాపాడుకోవడానికి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరికి వస్తారుపెద్ద ఎన్టీఆర్‌కు  దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఐటీడీపీ ద్వారా సోషల్‌ మీడియాలో తిట్టిస్తున్నారునేను పెద్ద ఎన్టీఆర్ భక్తుడిని.. నందమూరి హరికృష్ణ నా గురువు.. నేను వైసీపీలో ఉన్నా నాకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెబుతాను.నేను తిరిగే కారుకు ఎన్టీఆర్.. వైఎస్సార్‌ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను.ఎన్టీఆర్ కుటుంబంతో నాకు ఉన్న బాంధవ్యం విడదీయరానిది.. వారికోసం నేను.. నాకోసం వారు అనేక త్యాగాలు చేశారుఎన్టీఆర్‌, వైఎస్సార్‌ నాకు రెండు కళ్లుతెలుగుదేశం పార్టీ గౌడ.. యాదవ.. మత్స్యకార.. ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది.. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి.సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటుచేసి.. అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక రాజ్యసభ స్థానాలు ఇస్తూ.. ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించారు.ప్రజలను నమ్ముకుని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్‌కు, నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి.

CM Revanth Key Comments Over Rythu Bandhu
రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతుభరోసాపై సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతులకు శుభవార్త చెప్పారు. ఈనెల తొమ్మిదో తేదీలోపు రైతుభరోసా నిధులు జమ చేస్తామని రేవంత్‌ చెప్పారు.కాగా, ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ..‘ఎన్నికల వేళ సీఎం రేవంత్‌ కీలక ప్రకటన చేశారు. రైతులకు శుభవార్త అందించారు. ఈనెల తొమ్మిదో తేదీలోపు రైతుభరోసా డబ్బులు జమ చేస్తామన్నారు. అలాగే, ఆగస్ట్‌ 15వ తేదీలోపు రుణమాఫీ కూడా చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా ఏడు లక్షల 60 వేల మందికి ఇప్పటికే వేశాం. మిగిలిన నాలుగు లక్షల మందికి వేస్తాం’ అని కామెంట్స్‌ చేశారు.ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ నేతలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌..‘ఖమ్మం జిల్లా దేశ రాజకీయాలకు దిక్సూచి. కేసీఆర్ నామా నాగేశ్వరరావును బకరాను చేస్తున్నారు. ఏ సంకీర్ణంలో చేరుతావు. ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలితే కాల్చేస్తారు. నామాకు సూచన చేస్తున్నాను. కేసీఆర్ మాటలు వినకు. గత డిసెంబర్‌ మూడో తేదీన ఫలితాలు సెమీ ఫైనల్స్‌. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఫైనల్‌ తీర్పు రాబోతుంది. గుజరాత్‌ టీమ్‌ను ఇంటికి పంపించాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాబోతుంది. రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రి కాబోతున్నారు’ అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.అయితే, రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో సీఎం రేవంత్‌ ఇలాంటి ప్రకటన చేయడం కోడ్‌ ఉల్లంఘనకు కిందకు వస్తుందని ప్రతిపక్ష పార్టీల నేతలు కామెంట్స్‌ చేస్తున్నారు. అలాగే, ఎన్నికల్లో ఓట్లు పొందడం కోసమే రేవంత్‌ ఇలాంటి కామెంట్స్‌ చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రిజర్వేషన్ల రక్షణకు సీఎం రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. తప్పుడు కేసులతో ఢిల్లీకి పిలిస్తే భయపడతామా?. రాజ్యాంగాన్ని కాపాడతామని రాహుల్ గాంధీ చెప్పిన మాటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాలం చెల్లిన థర్మల్ పవర్ స్టేషన్లను తిరిగి వాడకంలోకి తెస్తాం. కార్మికులకు రావాల్సిన లాభాలు ఇవ్వకుండా, సింగరేణికి బొగ్గు బావులు తవ్వకుండా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మొద్దు నిద్రపోయింది.సింగరేణి పరిసరాల్లోని బొగ్గు బావులన్నీ ప్రైవేటు వ్యక్తులకు కాకుండా సింగరేణికే చెందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. కొత్తగూడెంలో స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ తెరిపించి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాం. రాబోయే ఐదేళ్లలో డ్వాక్రా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెప్పపాటుసేపు కూడా కరెంటు పోవడం లేదు. ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు పోతున్నాం. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆగిపోయే ప్రసక్తే లేదు. మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. రాహుల్‌ను ప్రధానిని చేయడానికి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రఘురామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని కామెంట్స్‌ చేశారు. 

Are These Players That Bad: Sehwag slams MI Usage of Hardik Tim David vs KKR
మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్‌ చురకలు

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ అనుసరించిన వ్యూహాలను భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తప్పుబట్టాడు. హార్దిక్‌ పాండ్యా, టిమ్‌ డేవిడ్‌ మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా అంటూ మేనేజ్‌మెంట్‌కు చురకలు అంటించాడు.ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే వేదికగా కేకేఆర్‌తో తలపడిన ముంబై ఓడిపోయిన విషయం తెలిసిందే. సొంత మైదానంలో 24 పరుగుల తేడాతో ఓటమి ఈ సీజన్‌లో ఎనిమిదో పరాజయాన్ని నమోదు చేసింది.ఛేదనలో తడ‘బ్యా’టు టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ముంబై.. కేకేఆర్‌ను 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్‌ చేసి ఫర్వాలేదనిపించింది. కానీ లక్ష్య ఛేదనలో మాత్రం తడ‘బ్యాటు’కు గురైంది. 18.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది.టాపార్డర్‌ మొత్తం చేతులెత్తేయగా.. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌(35 బంతుల్లో 56) ఒక్కడే రాణించాడు. మిగిలిన వాళ్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.ఇలాంటి తరుణంలో ​కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(1) ఏడు, టిమ్‌ డేవిడ్(24)‌ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. తర్వాత టెయిలెండర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ముంబై కథ ముగిసింది.మరీ అంత చెత్తగా ఆడతారా?ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్‌ క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఇండియన్స్‌ హార్దిక్‌ పాండ్యా, టిమ్‌ డేవిడ్‌ను ఎందుకు దాచిపెట్టిందో తెలియదు. అలా చేయడం వల్ల మీకు ఏం ప్రయోజనం చేకూరింది?ఇంకా బంతులు మిగిలే ఉన్నాయి. జట్టు మొత్తం ఆలౌట్‌ అయింది. నిజానికి హార్దిక్‌ పాండ్యా, టిమ్‌ డేవిడ్‌లను ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు పంపాల్సింది.కానీ ఛేజ్‌ చేస్తున్న సమయంలో వరుసగా వికెట్లు పడుతున్నా హార్దిక్‌ పాండ్యా, టిమ్‌ డేవిడ్‌లను ఏడు, ఎనిమిదో స్థానాల్లో ఎందుకు ఆడించారో అర్థం కాలేదు.లోయర్‌ ఆర్డర్‌లో వీళ్లు ఇంకాస్త ముందుగా వస్తే మరీ అంత చెత్తగా ఆడతారని అనుకున్నారా?’’ అని ముంబై మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో ఉన్నపుడు పాండ్యా నాలుగో స్థానంలో నిలకడగా రాణించిన విషయాన్ని సెహ్వాగ్‌ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.చదవండి: T20 WC: హార్దిక్‌ బదులు అతడిని సెలక్ట్‌ చేయాల్సింది: పాక్‌ దిగ్గజం

Heeramandi Web Series Telugu Review And Rating
సంజయ్‌లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంది..?

టైటిల్‌ : హీరామండి: ది డైమండ్‌ బజార్‌ (వెబ్‌సిరీస్‌)నటీనటులు: మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌,  తదితరులునిర్మాణ సంస్థలు: భన్సాలీ ప్రొడక్షన్స్దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీసంగీతం: సంజయ్ లీలా భన్సాలీ,బెనెడిక్ట్ టేలర్,నరేన్ చందావర్కర్కథ:    మొయిన్ బేగ్జానర్‌:     చారిత్రక నాటకంఎపిసోడ్స్‌: 8 భాషలు: తెలుగుతో పాటు మొత్తంగా 14 భాషల్లో స్ట్రీమింగ్‌'హీరామండి: ది డైమండ్‌ బజార్‌' మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ పెద్ద సంచలనమే రేపుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా హీరామండి టాపిక్‌ నడుస్తూనే ఉంది. కథ నిడివి విషయం పక్కన పెడితే ఈ సిరీస్‌కు ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. బాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా ముద్ర వేసిన సంజయ్ లీలా భన్సాలీ మొదటిసారిగా ఒక వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌ను తన నిర్మాణ సంస్థ నుంచే రూ. 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాడు. పీరియాడిక్‌ డ్రామా చిత్రాలకు పేరుగాంచిన సంజయ్ లీలా భన్సాలీ నుంచి ఇప్పటికే పద్మావత్‌, బాజీరావ్‌ మస్తానీ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను డైరెక్ట్‌ చేశాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన తొలి వెబ్‌సిరీస్‌ 'హీరామండి' సిరీస్‌ ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటంటే... బ్రిటీష్ పాలన సమయంలో లాహోర్‌లో ఉన్న వేశ్యావాటిక 'హీరామండి'లో ఎలాంటి ఆధిపత్య పోరు జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి సంఘర్షణ జరిగింది..? హీరామండిలో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరెన్ని కుట్రలు చేశారు..? స్వాతంత్య్ర ఉద్యమంలో వారి పాత్ర ఎంత..?  ఈ కథలోకి వెళ్లాలంటే ముందుగా పాత్రల గురించి పరిచయం తప్పనిసరి. హీరామండిలో ఉండే  షాహీ మహల్‌ నిర్వహణ మొత్తం మల్లికా జాన్‌ (మనీషా కొయిరాలా) చేతిలో ఉంటుంది.  ఆ ప్రాంతంలోని నవాబులంతా ఆమె కనుసన్నలలోనే ఉంటారు.  అయితే అదే ప్రాంతంలో ఖ్వాభాగ్‌ అనే మరో మహల్‌ ఉంటుంది. అక్కడ ఫరీదాన్‌ (సోనాక్షి సిన్హా) ఉంటుంది. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో మరో మూడు పాత్రలు కీలకంగా ఉంటాయి. వహీదా (సంజీదా షేక్‌) మల్లికా జాన్‌కు సోదరి. బిబోజాన్‌ (అదితిరావ్‌ హైదరి), ఆలంజేబు (షర్మిన్‌ సెగల్‌) ఇద్దరూ కూడా మల్లికా జాన్‌కు కుమార్తెలు. లజ్జో (రిచా చద్దా) మల్లికా జాన్‌ దత్తత తీసుకున్న కూతురు.హీరామండిలో తన మాటకి తిరుగులేదనే స్థాయిలో మల్లికా జాన్  (మనీషా కొయిరాలా) రాజ్యమేలుతూ ఉంటుంది. ఆమె కనుసన్నల్లో ఉన్న వేశ్యలపై ఆధిపత్యం చెలాయిస్తూ.. ఎవరైనా ప్రేమలో పడితే ప్రమాదంలో పడినట్టే అనే మాటతో హెచ్చరిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వేశ్యలుగా ఉంటూనే  మల్లికా జాన్‌ మాట వినిపించుకోకుండా 'జొరావర్' అనే నవాబుతో లజ్జో, ఫిరోజ్ అనే నవాబుతో వహీదా, వలీ ఖాన్ అనే నవాబుతో బిబోజాన్‌ ప్రేమలో పడతారు. కానీ, మల్లికా జాన్‌  చిన్న కుమార్తె ఆలంజేబును కూడా వేశ్యలా మార్చాలని చూస్తుంది. అయితే, ఆమె బాలోచి నవాబు తాజ్‌దార్‌ (తాహా షా బహదూర్‌ షా)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మల్లికా జాన్‌తో పాటు తాజ్‌దార్‌ తండ్రికి నచ్చదు. ఆయన ఆంగ్లేయులకు బానిసగా ఉంటాడు. వారి నుంచి విముక్తి కోసం తాజ్ దార్ పోరాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆలంజేబును పెళ్లి చేసుకోవాలనే తాజ్ దార్ నిర్ణయాన్ని అతని తండ్రి వ్యతిరేకిస్తాడు. వేశ్య తమ ఇంటికి కోడలిగా రాలేదని తేల్చి చెబుతాడు. మరోవైపు కూతురు ప్రేమ వివాహాన్ని మల్లికా జాన్‌ కూడా వ్యతిరేఖిస్తుంది. ఈ క్రమంలో మల్లిక వ్యవహారశైలి నచ్చని తన సోదరి వహీదా ఆమెకు గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. దీంతో తన అక్కకు శత్రువుగా ఉన్న ఫరీదాన్‌ (సోనాక్షి సిన్హా)తో చేతులు కలుపుతుంది. ఇలా హీరామండిలో అనేక సంఘటనలు జరుగుతుండగా బిబోజాన్‌ (అదితిరావ్‌ హైదరి) బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జరిగే స్వాతంత్య్ర  పోరాటంలో గూఢచారిగా ఉంటుంది. ఒక వేశ్యగా ఉన్న ఆమె ఈ పోరాటం ఎందుకు చేస్తుంది..? బ్రిటీషర్లతో సత్సంబంధాలు పెంచుకుని వారి రహస్యాలను ఎందుకు తెలుసుకుంటుంది..? ఫైనల్‌గా బిబోజాన్‌ ఒక గూఢచారి  అని తెలిసిన తర్వాత బ్రిటీష్‌వాళ్లు ఏం చేశారు..? ఇదే సమయంలో షాహీ మహల్‌కు పెద్ద దిక్కుగా ఉన్న మల్లికా జాన్‌న్‌ అనచివేసేందుకు ఫరీదాన్‌ ఎలాంటి కుట్రలకు తెరలేపింది..? వేశ్య కుటుంబానికి చెందిన ఆరుగురు స్త్రీల చుట్టూ.. నవాబులు, బ్రిటీష్‌ పోలీస్ అధికారులు, తిరుగుబాటుదారుల మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయనేది తెలియాలంటే హీరామండి సిరీస్‌ చూడాల్సిందే..ఎలా ఉందంటే..పీరియాడిక్‌ డ్రామా చిత్రాలను  డిఫరెంట్‌గా తెరకెక్కించడంలో డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. స్వాతంత్య్రానికి ముందు అంటే 1930, 1940ల కాలం బ్యాక్‍డ్రాప్‍లో హీరామండి వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాడు. 'హీరామండిలో తెల్లదొరల పెత్తనం కాదు.. మల్లికా జాన్‌ నాణేలు మాత్రమే చెలామణి అవుతాయి' అని మనీషా కొయిరాలా చెప్పిన ఒక్క డైలాగ్‌ చాలు.. ఈ సిరీస్‌ డెప్త్‌ ఏంటో చెప్పడానికి బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా ఎందరో మహిళలు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ కొందరు చరిత్ర పుటల్లో కలిసిపోతే.. మరికొందరు మాత్రం నేటికి కూడా వినికిడిలో ఉన్నారు. లాహోర్‌ నగరంలోని హీరామండి ప్రాంతంలో పడుపు వృత్తి నిర్వహించే మల్లికా జాన్‌కు, బ్రిటీష్‌వాళ్లతో మొదలైన వైరాన్ని సంజయ్‌లీలా చక్కగా చూపించాడు. స్వాతంత్య్ర   పోరాటంలో 'హీరామండి' పాత్ర ఎంతవరకు ఉందో చెప్పడానికి భారీగానే డైరెక్టర్‌ ప్లాన్ చేశాడు. మొత్తం 8 ఎపిసోడ్స్‌లలో తన విజువల్‌ ఫీస్ట్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు.  హీరామండిలో వేశ్యలుగా ఉన్న వారి జీవితాలను తెరపైన అద్బుతంగా క్రియేట్‌ చేశాడు. వేశ్యావృత్తితో సమాంతర వ్యవస్థను నడుపుతున్న ఆ మహిళలు స్వతంత్ర సంగ్రామంలోకి ఎందుకు దూకాల్సి వచ్చిందో అదిరిపోయే రేంజ్‌లో చూపించాడు. ఆంగ్లేయులపై తిరుగుబాటు జరిపి వాళ్ల వెన్నులో వణుకు పుట్టించిన వేశ్యలుగా వారందరినీ తెరపై చూపించి అద్భుతాన్ని ఆవిష్కరించడంలో  సంజయ్‌లీలా భన్సాలీ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు.తన టేకింగ్‌, విజువల్‌ ఫీస్ట్‌తో ప్రతి ప్రేక్షకుడినీ హీరామండి ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఆ కాలంనాటి డిజైన్లను దృష్టిలో పెట్టుకుని అందంగా తీర్చిదిద్దిన భారీ సెట్లతో పాటు చక్కని ఫొటోగ్రఫీ తోడు కావడం ఆపై ప్రతి పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ఈ సిరీస్‌కు ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పచ్చు. ముఖ్యంగా పాటల చిత్రీకరణ మరిన్ని మార్కులు కొట్టేస్తుంది. ఒక వెబ్‌ సిరీస్‌ అంత భారీ స్థాయిలో పాటలు అవసరమా అనేలా ఉంటాయి. ప్రారంభంలో రెండు, మూడు ఎపిసోడ్స్‌లలో కథ పరంగా కాస్త నెమ్మదించినా చివరి రెండు ఎపిసోడ్స్‌ మాత్రం దుమ్మురేపుతాయి. మల్లికా జాన్‌ పాత్ర పరిచయం చేసిన ఒక ఎపిసోడ్‌ కూడా మెప్పిస్తుంది. సొంత కుమార్తెలతో సహా ఎవరిపైనా దయాదాక్షిణ్యాలు లేని కఠినాత్మురాలిగా ఆ పాత్రను క్రియేట్‌ చేసిన విధానం అందరినీ మెప్పిస్తుంది.  వేశ్యల జీవితాల చుట్టూ తిరిగే కథనే అయినప్పటికీ, ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపించవు. ఈ వీకెండ్‌లో చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఎంజాయ్‌ చేసేలా ఈ సిరీస్‌ ఉంటుంది. బ్రిటీష్‌ పాలనను దిక్కరించిన హీరామండి చరిత్ర పుటల్లో పెద్దగా కనిపించదు. అలా కనుమరుగైన ఒక చాప్టర్‌ను 'హీరామండి'గా సంజయ్‌లీలా తీసుకొచ్చాడు.ఎవరెలా చేశారంటేరూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్‌లో టాప్‌ హీరోయిన్‌లను దర్శకుడు సెలక్ట్‌ చేసుకున్నాడు. మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌ వంటి స్టార్స్‌ ఇందులో ఉన్నారు. ఈ సిరీస్‌కు ప్రధాన బలం వారే అని చెప్పవచ్చు. షాహీమహల్‌కు పెద్ద దిక్కుగా మల్లికాజాన్‌ పాత్రలో మనీషా కొయిరాలా దుమ్మురేపిందని చెప్పవచ్చు. తన కడుపున పుట్టిన కూతుర్లను కూడా వేశ్యలుగా మార్చే అంత కఠినాత్మురాలిగా ఆమె చూపించిన నటన అద్భుతమని చెప్పవచ్చు. మరోవైపు ఫరీదాన్‌గా సోనాక్షి సిన్హా నెగెటివ్‌ పాత్రలో మెప్పించింది. వీరందరికీ ఏమాత్రం తగ్గకుండా అదితిరావు హైదరీ ఎలివేషన్‌ మామూలుగా ఉండదు. వేశ్యగా కనిపిస్తూనే గూఢచారిగా తన సత్తా ఎంటో చూపించింది. నటనలో ఆమె ఎక్కడా తగ్గలేదు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేసిందని చెప్పవచ్చు. ఈ సిరీస్‌కు ప్రధాన బలం విజువల్స్‌, కాస్ట్యూమ్స్‌,సినిమాటోగ్రఫీ. ఇవన్నీ కూడా ఓటీటీ స్థాయికి మించి ఉన్నాయి. కానీ, ఇందులో ఎక్కువగా యుద్ధ ఘట్టాలు లేకున్నా ఎమోషనల్‌ సీన్స్‌  ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఆనాటి చరిత్రకు.. సమాజంలోని స్థితిగతులకు దర్పణం పట్టేలా సీన్స్‌ ఉన్నాయి. కాస్త నిడివి తగ్గించి ఉంటే బాగుండు అనే కామెట్లు కూడా వినిపిస్తున్నాయి.

Over 21000 Employees Fired From Tech Companies In April
Tech Layoffs 2024: షాకింగ్‌ రిపోర్ట్‌: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలలో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్ట్‌లు తగ్గిపోవడం వంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌లకు సంబంధించి షాకింగ్‌ రిపోర్ట్‌ ఒకటి వెల్లడైంది. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే 21 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి టెక్‌ కంపెనీలు.layoffs.fyi ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. టెక్నాలజీ రంగంలోని 50 కంపెనీల నుండి ఒక్క ఏప్రిల్ నెలలోనే 21,473 మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ఈ ఏడాది లేఆఫ్‌ల ధోరణికి ఏప్రిల్‌ నెల తొలగింపులు అద్దం పడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కనీసం ఇప్పటి వరకూ 271 కంపెనీలు 78,572 మంది ఉద్యోగులను తొలగించాయి. జనవరిలో 122 కంపెనీలలో 34,107 ఉద్యోగాల కోతలు జరిగాయి. ఫిబ్రవరిలో 78 కంపెనీలు 15,589 మందిని తొలగించాయి. ఇక మార్చిలో 37 కంపెనీల్లో 7,403 మంది ఉద్యోగాలను కోల్పోయారు. మార్చి నుంచి ఏప్రిల్‌కు ఒక్క నెలలో ఉద్యోగుల తొలగింపులు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ఏప్రిల్‌లో టెక్ తొలగింపులుయాపిల్ ఇటీవల 614 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొదటి ప్రధాన రౌండ్ ఉద్యోగ కోత.పైథాన్, ఫ్లట్టర్, డార్ట్‌లో పనిచేస్తున్న వారితో సహా వివిధ టీమ్‌లలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను గూగుల్‌ తొలగించింది.అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో వందలాది ఉద్యోగాలను తగ్గించింది.ఇంటెల్ దాని ప్రధాన కార్యాలయంలోని దాదాపు 62 మంది ఉద్యోగులను లేఆఫ్‌ చేసింది. ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించింది.ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా అత్యధికంగా 14 వేల మందిని లేఆఫ్‌ చేసింది.ఓలా క్యాబ్స్ దాదాపు 200 ఉద్యోగాలను తొలగించింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీఫైమ్‌ దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించింది. గృహోపకరణాలను తయారు చేసే వర్ల్‌పూల్ సుమారు 1,000 మందిని లేఆఫ్‌ చేసింది.టేక్-టూ ఇంటరాక్టివ్ కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 5% మందిని తొలగించింది. నార్వేలోని టెలికాం కంపెనీ టెలినార్ 100 మంది ఉద్యోగులను తొలగించింది.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement


ఫోటో స్టోరీస్

View all