Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Modi 3.0: Nda Govt To Hold Its First Cabinet Meeting Today
మోదీ 3.0 : కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు

సాక్షి, ఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ప్రధాన మంత్రి కేంద్రమంత్రులకు శాఖలను కేటాయించారు. ఆవాస్‌ యోజన పథకం కింద గ్రామీణ, పట్టణాల్లో 3కోట్ల గృహాలు నిర్మించేలా కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇక కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయిఅమిత్ షా : కేంద్ర హోం శాఖనిర్మల సీతారామన్ : ఆర్థిక శాఖజయశంకర్ - విదేశాంగ శాఖరాజ్ నాథ్ సింగ్ :రక్షణ శాఖమనోహర్ లాల్‌ కట్టర్‌ : పట్టణ అభివృద్ధి శాఖశివరాజ్ సింగ్ చౌహన్ : వ్యవసాయ శాఖ మంత్రి , పంచాయతీరాజ్ శాఖసీఆర్‌ పాటిల్ : జలశక్తిపీయూష్ గోయల్ : వాణిజ్య శాఖ మంత్రిఅశ్విని వైష్ణవ్ : సమాచార శాఖ మంత్రిధర్మేంద్ర ప్రధాన్ : మానవ వనరులు అభివృద్ది శాఖగజేంద్ర సింగ్ శేకావత్ : టూరిజం, సాంస్కృతిక శాఖ జేపీ నడ్డా : వైద్య ఆరోగ్య శాఖ మంత్రిజితిన్ రాం మాంజీ : సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమల శాఖ మంత్రిఅన్నపూర్ణ దేవి : మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిభూపేంద్ర యాదవ్ : అటవీ, పర్యావరణ శాఖకిరణ్ రిజిజు : పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిచిరాగ్ పాశ్వాన్: క్రీడా శాఖ మంత్రికుమారస్వామి : భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ : షిప్పింగ్ శాఖ మంత్రిజ్యోతి ఆదిత్య సింధియా: టెలికాం, ఈశాన్య రాష్ట్రాల శాఖప్రహ్లాద జోషి : రెన్యూవబుల్ ఎనర్జీరవణీత్ సింగ్ బిట్టు : మైనార్టీ శాఖ సహాయ మంత్రిహర్ష మల్హోత్ర - రోడ్లు జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రిసురేష్‌ గోపి : టూరిజం సహాయ శాఖ మంత్రితెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవేకిషన్ రెడ్డి : కేంద్ర గనుల శాఖ మంత్రిబండి సంజయ్‌ : హోంశాఖ సహాయ మంత్రిరామ్మోహన్ నాయుడు : కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రిశ్రీనివాస్‌ వర్మ : ఉక్కు, భారీ పరిశ్రమలు శాఖ సహాయ మంత్రిపెమ్మసాని చంద్రశేఖర్‌ : గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్‌ సహాయ శాఖ మంత్రి మరికొద్ది సేపట్లో కేంద్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. అయితే ఈ మంత్రి వర్గం సమావేశం లోపే నేతలకు శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులకు ఎవరికి ఏయే శాఖ కేటాయిస్తారని అంశంపై ఉత్కంఠ కొనసాగుతుండగా..సీనియర్ మంత్రులను అదే శాఖల్లో కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆదివారం కొలువుదీరిన మోదీ 3.0 కేబినెట్‌లో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు చేరారు. వారికి కీలక శాఖలు అప్పగించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. హోం,రక్షణ శాఖ, ఆర్ధిక శాఖ వంటి కీలక పదవులు బీజేపీ నేతలకేననే ప్రచారమూ కొనసాగుతుంది.ప్రాధన్యాత కలిగిన శాఖపై కిషన్‌ రెడ్డి పట్టుమరోవైపు తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతున్నాయనే అంశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఏపీ, తెలంగాణలకు రెండు కేబినెట్‌, మూడు సహాయమంత్రి పదవులు దక్కనున్నాయి. అయితే తెలంగాణ నుంచి గతంలో కిషన్ రెడ్డికి ప్రధాని మోదీ టూరిజం శాఖ అప్పగించాగా.. ఈ సారి మాత్రం ఈసారి ప్రాధాన్యత కలిగిన శాఖను కిషన్‌ రెడ్డి ఆశిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలపైనా ఇక క్యాబినెట్ సమావేశంలో పార్లమెంటు సమావేశాల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈనెల 15 నుంచి 22 వరకు పార్లమెంట్ సమావేశాలను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం కానుందని, 15 నుంచి మూడు రోజులపాటు ఎంపీల ప్రమాణస్వీకారం, ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉండనుంది. అనంతరం ఈనెల 22న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.

Savitri Thakur Minister Of State In Modi Led Government
ఎవరీ సావిత్రి ఠాకూర్‌? ఏకంగా కేంద్ర మంత్రి వర్గంలో..!

దేశ ప్రధానిగా నరేంద్రమోదీ జూన్‌ 09న మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌ వేదికగా ఆదివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. మోదీ కొత్త ప్రభుత్వంలని కేంద్ర మంత్రి వర్గంలో చోటు పొందడం అంటే ఒక అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లు లెక్క. చెప్పాలంటే దేశం అంతటని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి గొప్ప అవకాశాన్ని ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని గిరిజన నాయకురాలు సావిత్ర ఠాకూర్‌కి దక్కింది. ఇంతకీ ఎవరీమె..? ఆమెకు ఈ అవకాశం ఎలా దక్కిందంటే..నరేంద్ర మోదీ జూన్‌ 09న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన తోపాటు 72 మంత్రలు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ప్రభుత్వంలోని మంత్రి వర్గంలో మధ్యప్రదేశ్‌లోని ధార్‌కు చెందిన 46 ఏళ్ల సావిత్రి ఠాకూర్‌ అనే గిరిజన నాయకురాలు చోటు దక్కించుకుంది. రాష్ట్రపతి భవన్‌ వేదిక జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఠాకూర్‌ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె మధ్యప్రదేశ్‌లో దీదీ ఠాకూర్‌గా పేరుగాంచింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమె గులాబీ రంగు చీర తోపాటు సంప్రదాయ గంచాను ధరించి వచ్చారు.ఆమె ఎవరంటే..దీదీ ఠాకూర్‌గా పేరుగాంచిన సావిత్రి ఠాకూర్‌కి రాజకీయ నేపథ్యం లేదు. ఆమె తండ్రి రిటైర్డ్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కాగా, భర్త రైతు. పురుషాధిక ప్రపంచంలో అంచెలంచెలుగా పైకొచ్చింది. ఆమె సామాజికి కార్యకర్తలా మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌, ధార్‌ వంటి ప్రాంతాల్లోని గిరిజన మహిళలు, పేద మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. వారిని స్వయం సమృద్ధిగా మార్చడానికి రుణలు సేకరించడంలో తన వంతుగా సహాయసహకారాలు అందించింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి.. 2003లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరడం జరిగింది. అలా ఆమె జిల్లా పంచాయతీ మెంబర్‌గా ఎన్నికై.. అక్కడ నుంచి అంచెలంచెలుగా ప్రెసిడెంట్‌ స్థాయికి చేరుకున్నారు. ఆమె షెడ్యూల్డ్‌ తెగ(ఎస్టీ) రిజర్వడ్‌ సీటుపై ధార్‌ నుంచి పోటీ చేసి బీజేపీకి మహళా గిరిజన నాయకురాలయ్యింది. ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే 2019లో బీజేపీ టిక్కెట్‌ నిరాకరించడంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ పార్టీ పదవులను నిర్వహించింది. తదనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 2.18 లక్ష మెజార్టీ ఓట్లతో కాంగ్రెస్‌ అభ్యర్థి రాధేశ్యామ్‌పై విజయం సాధించారు. గతంలో ఠాకూర్‌ బీజేపీలో జిల్లా ఉపాధ్యాక్షుడిగా ఉన్నారు. 2013లో ఆమె కృషి ఉపాజ్ మండి ధమ్నోద్ డైరెక్టర్‌గా, ఆదివాసీ మహిళా వికాస్ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా పలు ఉన్నత పదవులును అలంకరించారు. గిరిజన నాయకురాలిగా ఆమె ప్రజలకు చేసిన సేవలకు గానూ బీజేపీ ఇలా కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఇచ్చి మరీ గౌరవించింది. కాగా, కేంద్ర మంత్రి మండలిలోని కొత్త మంత్రులు..కేంద్ర మాజీ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ ఎంపీలు అన్నపూర్ణా దేవి, శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకూర్, నిముబెన్ బంభానియా, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ తదితరులు. అయితే వారిలో సీతారామన్‌, దేవిలకు క్యాబినేట్‌లో చోటు దక్కగా, మిగిలిన వారు రాష్ట్ర మంతులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 18వ లోక్‌సభలో కొత్తమంత్రి మండలిలో కేబినేట్‌ పాత్రలో ఇద్దరు తోసహా ఏడుగురు మహిళలు చేరారు. అయితే గతంలో జూన్‌ 05న రద్దయిన మంత్రిమండలిలో మాత్రం దాదాపు 10 మంది దాక మహిళా మంత్రులు ఉండటం విశేషం. Savitri Thakur takes Oath of Office and Secrecy as Union Minister of State during the #SwearingInCeremony #OathCeremony #ShapathGrahan pic.twitter.com/E9NKSqQPET— PIB India (@PIB_India) June 9, 2024 (చదవండి: మోదీ ప్రమాణా స్వీకారోత్సవంలో పాల్గొననున్న మహిళా లోకో పైలట్‌లు వీరే..!)

YSRCP Leaders Meet YS Jagan Mohan Reddy
వైఎస్‌ జగన్‌ను కలిసిన పార్టీ నేతలు

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పార్టీ నేతలు సమావేశమయ్యారు. సోమవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌తో పలువురు పార్టీ నేతలు భేటీ అయ్యారు.వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్‌, పుష్ప శ్రీవాణితో పాటు వంగా గీత, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, ఎంపీ మోపీదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే డా. సుధ తదితరులు ఉన్నారు. ఎన్నికలు ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణతో పాటు పలు అంశాలపై చర్చించారు.

Rebal Star Prabhsa Kalki 2898 AD Trailer Out Now
వెయిటింగ్‌ ఇజ్ ఓవర్.. ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ వచ్చేసింది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌, బుజ్జి టీజర్‌ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇటీవలే భారీస్థాయిలో ఈవెంట్‌ నిర్వహించిన మేకర్స్‌.. బుజ్జిని ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. అయితే ఈ మూవీ ట్రైలర్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడా అని రెబల్ ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తోన్న కల్కి 2898ఏడీ ట్రైలర్‌ రానే వచ్చింది. ఇవాళ కల్కి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌ చూస్తే యంగ్‌ రెబల్ స్టార్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. మీరు కూడా కల్కి ట్రైలర్‌ను చూసేయండి. కాగా.. ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. 3 నిమిషాల నిడివితో ఉన్న కల్కి ట్రైలర్‌ రెబల్‌ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ట్రైలర్‌లో బ్యాగ్‌గ్రౌండ్‌ మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్‌ ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100కు పైగా థియేటర్స్‌లో కల్కి ట్రైలర్ ప్రదర్శించారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, తిరువనంతపురం, నార్త్ ఇండియా మెయిన్ సిటీస్‌లోని థియేటర్స్‌లో కల్కి ట్రైలర్‌ను ప్రదర్శించారు.

Manipur CM convoy attacked, one security person injured
మణిపూర్​ సీఎం కాన్వాయ్​పై దాడి

ఇంఫాల్​: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కాన్వాయ్‌పై సోమవారం అనుమానిత మిలిటెంట్లు దాడి చేశారు. కాంగ్‌పోక్పి జిల్లాలో జాతీయ రహదారి 37 వద్ద సోమవారం ఉదయం సాయుధ ఈ ఆకస్మికంగా దాడి జరిగింది. ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి గాయపడ్డాడు.కాగా జూన్​ 6న జిరిబామ్‌కు చెందిన ఓ రైతు హత్యతో అక్కడ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. గత కొన్ని రోజులుగా ఉద్రిక్తంగా మారిన ఇక్కడ పరిస్థితులను సీఎం బీరెన్​ సింగ్​ మంగళవారం సందర్శించేందుకు ప్లాన్​ చేశారు. ఈ క్రమంలోనే నేడు సీఎం కాన్వాయ్ ఇంఫాల్ ​నుంచి జిరిబ‌మ్ జిల్లాకు వెళ్తున్న స‌మ‌యంలో దాడి జ‌రిగింది. సెక్యూరిటీ ద‌ళాల‌పై మిలిటెంట్లు ప‌లుమార్లు ఫైరింగ్ జ‌రిపారు. అయితే ఆ దాడిని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు తిప్పికొట్టాయి.అయితే దాడి సమయంలో సీఎం సంఘటన ప్రాంతంలో లేనట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిరిబామ్‌లో వ్యక్తి హత్యతో కొందరు అరాచకవాదులు రెండు పోలీస్‌ అవుట్‌పోస్టులు, ఫారెస్టు బీట్‌ కార్యాలయంతోపాటు మేతీ, కుకీ తెగల వారికి చెందిన దాదాపు 70 ఇళ్లను తగలబెట్టారు. ఈ ఘటన అనంతరం మైతీ వర్గానికి చెందిన వందలాది మంది పౌరులు ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోయారు.

After NCP, Shiv Sena upset over Minister of State posts
మోదీ కేబినెట్.. సహాయ మంత్రి పదవిపై శివ‌సేన అసంతృప్తి

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ సహా 72 మందితో కేంద్ర క్యాబినెట్‌ కూడా ఏర్పాటైంది. వీరిలో 30 మంది కేబినెట్‌ మంత్రులు,36 మంది సహాయ మంత్రులు, 5 మంది స్వంతంత్ర్య మంత్రులు దక్కాయి.ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, జేడీఎస్​, శివసేన, ఎన్సీపీ, ఎల్జీపీ, ఆరెల్డీ పార్టీల నుంచి నేతలకు పలు మంత్రి పదవులు వరించాయి.అయితే మోదీ కేబినెట్​ కూర్పుపై మిత్రపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వంలో స్వతంత్ర బాధ్యతలు కలిగిన సహాయ మంత్రిత్వ పదవి దక్కడంపై ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన సోమవారం అసంతృప్తిని వ్యక్తం చేసింది. శివసేన పార్టీ కేబినెట్ మంత్రి ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఎన్డీయే ఇత‌ర భాగ‌స్వామ్య ప‌క్షాల‌కు ద‌క్కిన ప‌ద‌వుల‌ను ప్ర‌స్తావిస్తూ శివసేన చీప్ విప్ శ్రీరంగ్ బ‌ర్నే మాట్లాడుతూ.. ఐదుగురు ఎంపీలు క‌లిగిన చిరాగ్ పాశ్వాన్‌, ఒక ఎంపీ క‌లిగిన జిత‌న్ రాం మాంఝీ, ఇద్ద‌రు ఎంపీలు క‌లిగిన జేడీఎస్‌ల‌కు ఒక్కో క్యాబినెట్ మంత్రి ప‌ద‌విని కేటాయించార‌ని.. త‌మ‌ను మాత్రం ఒకే ఒక్క స‌హాయ మంత్రి ప‌ద‌వికి ప‌రిమితం చేశార‌ని వాపోయారు.ఏడు ఎంపీలు ఉన్నప్పటికీ ఒక్క పదవి మాత్రమే ఎందుకు లభించిందని ప్రశ్నించారు. తమకు కేబినెట్​ మంత్రిత్వ శాఖ వచ్చి ఉండాల్సిందని తెలిపారు. కాగా శివసేన నుంచి ప్రతాప్​ రావ్​ జాదవ్​కు స్వతంత్ర హోదా కలిగిన కేంద్ర పదవి దక్కింది. మరోవైపు ఎన్సీపీ అజిత్ ప‌వార్ వ‌ర్గం సైతం త‌మ‌కు స‌హాయ మంత్రి ప‌ద‌వితో స‌రిపెట్ట‌డంపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన విషయం తెలిసిందే. తమకు కూడా కేబినెట్ మంత్రి కావాలని డిమాండ్ చేసింది. ఆదివారం ప్రమాణస్వీకారానికి ముందు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర హోదా మంత్రి ప్రతిపాదనను తిరస్కరించింది.

Affordable 3D Printed Home Just Five Days
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!

సాధారణంగా ఓ ఇల్లు కట్టాలంటే బోలెడంత సమయం కావలి. ఇటుకలు, ఇసుక, సిమెంట్ ఇలా.. చాలా ముడిపదార్ధాలు కావాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కేవలం వారం రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఇల్లు కట్టే 3డీ టెక్నాలజీ వచ్చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..3డీ ప్రింటెడ్ హౌస్ అనేది వాతావరణ పరిస్థితులను, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఉంటుంది. ఇటీవల బీఎమ్ పార్ట్‌నర్ COBOD BOD2 మోడల్‌లలో ఒకదాన్ని ఉపయోగించి కేవలం ఐదు రోజుల్లోనే ఓ ఇల్లు నిర్మించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక్కడ కనిపించే ఇల్లు ఇటుకలతో నిర్మించిన ఇంటి కంటే తక్కువ ధరలోనే నిర్మించారు. ఈ ఇల్లు కజకిస్తాన్‌లోని అల్మాటీలో ఉన్నట్లు సమాచారం. దీనిని నిర్మించిన కంపెనీ ఇతర ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌ల మాదిరిగానే.. 3D ప్రింటర్ నాజిల్ నుంచి సిమెంట్ వంటి మిశ్రమాన్ని పొరలుగా పేర్చుతుంది. ఈ విధంగా గోడ నిర్మాణం జరిగింది. ఇది రిక్టర్ స్కెలు మీద 7.0 తీవ్రత నమోదు చేసే భూకంపాన్ని కూడా తట్టుకుని నిలబడగలదని చెబుతున్నారు.బీఎమ్ పార్ట్‌నర్ ఈ ఇంటిని బలమైన కాంక్రీట్ మిశ్రమాన్ని ఉపయోగించి నిర్మించింది. ఇది సాధారణ ఇటుకలు, రాళ్లతో నిర్మించిన ఇంటికంటే కూడా గట్టిగా ఉంటుంది. ఇందులో కిటికీలు, తలుపులు, ఫర్నిచర్‌ వంటి వాటిని కూడా బిల్డర్లు నిర్మించినట్లు సమాచారం.3డీ ప్రింటెడ్ ఇంటిని ఐదు రోజుల్లో నిర్మించినప్పటికీ ప్రింటర్ సెటప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫర్నిచర్ ఇన్‌స్టాల్ చేయడం ముగించే వరకు ప్రాజెక్ట్ పూర్తి కావడానికి రెండు నెలల సమయం పట్టిందని బిల్డర్స్ పేర్కొన్నారు. ఈ ఇంటిని నిమించడానికి సుమారు 21800 డాలర్స్ ఖర్చు అయినట్లు సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 18 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది.మన దేశంలో 3డీ ప్రింటెడ్ హౌస్‌భారతదేశంలో కూడా ఐఐటీ మద్రాస్ స్టార్టప్ కేవలం 5 రోజుల్లో మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ హౌస్‌ను నిర్మించింది. దీనిని కేంద్ర మంత్రి సీతారామన్ ప్రారంభించారు. ఈ ఇంటిని కాంక్రీట్ 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి పూర్తి చేశారు. హబిటాట్ ఫర్ హ్యుమానిటీ యొక్క టెర్విల్లిగర్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్‌తో కలిసి అభివృద్ధి చేశారు.

A video shows in which animal was seen strolling casually at the presidential palace during the swearing-in ceremony on Sunday.
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పులి?.. వీడియో వైరల్​

న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌ వేదికగా ఆదివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. దేశ, విదేశాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో సహా 8 వేల మంది అతిథులు హాజరయ్యారు.అయితే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో జరిగిన ఈ వేడుకలో ఆహ్వానం లేదని ఓ అతిథి ప్రత్యక్షమైంది. ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యప్రదేశ్​ బీజేపీ ఎంపీ దుర్గా దాస్​ ఉయికే.. రాష్ట్రపతి ముర్ముకు అభివాదం చేస్తుండగా.. స్టేజీ వెనక భాగంలో ఓ జంతువు అటుగా వెళుతూ కెమెరా కంటికి చిక్కింది. ప్రమాణ స్వీకార వేదికకు కాస్త దూరంలోనే సంచరించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సోషల్‌మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది. తొలుత ఫేక్‌ వీడియో లేదా ఏఐ జనరేటెడ్‌ వీడియో అని కొట్టిపారేశారు. తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నిన్న షేర్‌ చేసిన యూట్యూబ్‌ లైవ్‌ ఫీడ్‌ను పరిశీలించినప్పుడు.. ఓ జంతువు సంచరించడం నిజమేనని తేలింది.అది చూడటానికి పులిలా కనిపించింది. కానీ ఆ జంతువు పెంపుడు పిల్లి అని, లేదా కు అయి ఉండవచ్చిన పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక కొంతమంది ఈ దృశ్యాలను కూడా నమ్మడం లేదు, బ్యాగ్రౌండ్​లో ఎడిట్ చేసి చూపిస్తున్నారని చెబుతున్నారు. మరికొందరైతే అతి కచ్చితంగా చిరుతపులిలా కనిపిస్తుందని, అక్కడి వారు అదృష్టవంతులు దాని బారి నుంచి తప్పించుకున్నారని కామెంట్​ చేస్తున్నారు. దీనిపై రాష్ట్రపతి భవన్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.An animal was seen strolling back in the Rashtrapati Bhavan after MP Durga Das finished the paperwork~ Some say it was a LEOPARD while others call it some pet animal. Have a look 🐆 pic.twitter.com/owu3ZXacU3— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) June 10, 2024

Pakistan Eliminated? Full T20 World Cup Super 8 Qualification Scenario
పాకిస్తాన్‌ ఇక ఇంటికేనా.. సూపర్‌-8 చేరాలంటే ఇలా జరగాలి?

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో పాకిస్తాన్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. ఈ మెగా టోర్నీలో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో ఓట‌మి పాలైన పాకిస్తాన్‌.. త‌మ సూప‌ర్‌-8 ఆశ‌ల‌ను సంక్లిష్టం చేసుకుంది. తొలుత అమెరికా చేతిలో అనూహ్య ఓట‌మి చ‌విచూసిన పాకిస్తాన్‌.. తాజాగా త‌మ రెండో మ్యాచ్‌లో భార‌త్‌పై 6 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. దీంతో.. పాక్‌ సూపర్-8లో క్వాలిఫై అయ్యే అవకాశాలు స‌న్నగిల్లాయి. సూప‌ర్‌-8లో దాయాది పాక్ చోటు సంపాందించుకోవాలంటే ఏదైనా అద్భుతం జ‌ర‌గాలి.పాకిస్తాన్ సూప‌ర్‌-8 చేరాలంటే?ఈ మెగా టోర్నీలో గ్రూపు-ఎలో ఉన్న పాకిస్తాన్‌కు మ‌రో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. పాకిస్తాన్ త‌మ త‌దుప‌రి మ్యాచ్‌ల్లో జూన్ 11న కెన‌డా, 16న ఐర్లాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. కాగా పాకిస్తాన్ ప్ర‌స్తుతం పాయింట్ల టేబుల్‌లో నాలుగో స్థానంలో ఉంది. అయితే పాకిస్తాన్ సూప‌ర్‌-8కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ విజయం సాధించాలి. త‌మ రన్‌రేటును భారీగా మెరుగుపరుచుకోవాలి. మ‌రోవైపు పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్ధానంలో ఉన్న యూఎస్ఎ త‌మ త‌దుప‌రి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. అప్పుడు పాకిస్తాన్‌, యూఎస్ఎ పాయింట్లు స‌మం అవుతాయి. ఆ స‌మ‌యంలో అమెరికా కంటే పాక్ మెరుగైన ర‌న్ క‌లిగి ఉంటే సూప‌ర్‌-8 అర్హ‌త సాధిస్తోంది. అయితే అమెరికా ఒక్క మ్యాచ్‌లో గెలిచినా పాక్ ఇంటిముఖం ప‌ట్ట‌క త‌ప్ప‌దు. ప్రస్తుతం యూఎస్ఏ రన్‌రేట్ (+0.626) పాక్(-0.150) కంటే మెరుగ్గా ఉంది. మైన‌స్‌లో ఉన్న పాకిస్తాన్ మెరుగుప‌డాలంటే అంత ఈజీ కాదు. కెనడా, ఐర్లాండ్‌పై భారీ విజ‌యాలు సాధిస్తే త‌ప్ప ర‌న్‌రేట్ మెరుగుప‌డ‌దు. ఎలా చూసినా.. సూపర్-8లో చేరేందుకు పాకిస్తాన్‌కు చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయని చెప్పాలి. ఇక గ్రూపు-ఎ నుంచి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానంలో ఉన్న భార‌త్‌.. మ‌రో విజ‌యం సాధిస్తే సూప‌ర్‌-8కు అర్హ‌త సాధిస్తోంది.చదవండి: T20 WC: బుమ్రా సూపర్‌ బాల్‌.... దెబ్బకు రిజ్వాన్ ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో

Apple CEO Tim Cook Meets Indian Student Developer Akshat Srivastava
ఆశ్చర్యపోయాను!.. భారతీయ విద్యార్థిపై 'టిమ్ కుక్' ప్రశంసలు

యాపిల్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024' (WWDC 2024) జూన్ 10 నుంచి 14 వరకు కాలిఫోర్నియాలో జరుగుతుంది. అయితే ఈ ఈవెంట్‌ ప్రారంభం కావడానికి ముందు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ గోవాలోని బిట్స్ పిలానీ కేకే బిర్లా కాలేజీలో చదువుతున్న 22 ఏళ్ల అక్షత్ శ్రీవాస్తవను కుక్ కలిశారు.టిమ్ కుక్.. భారతీయ విద్యార్థి, డెవలపర్‌ అయిన అక్షత్ శ్రీవాస్తవతో జరిపిన పరస్పర చర్యను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో 'స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌'లో గెలిచిన విద్యార్థి డెవలపర్‌లతో మాట్లాడాను. వారి క్రియేటివిటీ, ప్రదర్శనను చూడటం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు.నేను గత సంవత్సరం భారతదేశాన్ని సందర్శించినప్పుడు చాలా మంది గొప్ప డెవలపర్‌లను కలిశాను. ప్రజల జీవితాలను మెరుగుపరిచే అనేక మార్గాలు వారిలో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఈ వారం అక్షత్‌ని కలవడం కూడా అంతే ఆశ్చర్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. క్లాసిక్ గేమ్‌ల పట్ల తనకున్న ప్రేమను తరువాత తరంతో పంచుకోవడానికి సరికొత్త మార్గాన్ని సృష్టించారు అని వెల్లడించారు.శ్రీవాస్తవ యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌లో భాగంగా మైండ్‌బడ్ అనే యాప్‌ను సమర్పించారు. ఇది తన మేనల్లుడితో పంచుకున్న ఉల్లాసభరితమైన క్షణాల నుంచి ప్రేరణ పొంది, ఈ యాప్‌ను రూపొందించినట్లు సమాచారం. మైండ్‌బడ్ పిల్లలు తమ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ఆనందించడానికి రూపొందించిన నాలుగు ఆకర్షణీయమైన చిన్న గేమ్‌లను కలిగి ఉంది.శ్రీవాస్తవ మైండ్‌బడ్‌ని సృష్టించడానికి స్విఫ్ట్‌యుఐ, ఎవికిట్ (ఆడియో), పెన్సిల్‌కిట్, ఫైల్‌మేనేజర్‌లను ఉపయోగించారు. కొత్త టెక్నాలజీలు అనుగుణంగా దీనిని రూపొందించారు.అక్షత్ శ్రీవాస్తవ కోవిడ్ సంక్షోభ సమయంలో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లోని సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పడకలను ట్రాక్ చేయడానికి ఒక యాప్‌ను అభివృద్ధి చేశారు. కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీల మీద ఆసక్తి కనపరిచిన శ్రీవాస్తవ యాపిల్ పార్క్‌లో జరిగే కార్యక్రమానికి 50 మంది విద్యార్థులలో ఒకరుగా వెళ్లారు.Kicking off #WWDC24 in the best way possible—meeting with student developers who won our Swift Student Challenge. It’s amazing to see their creativity and determination on full display! pic.twitter.com/b56k8kcGZs— Tim Cook (@tim_cook) June 9, 2024

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement