Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Jagan Kosam Siddham YSRCP Taking Manifesto To Every House
YSRCP మరో అడుగు.. ఇక ఇంటింటికీ మేనిఫెస్టో

గుంటూరు, సాక్షి: పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో.. ఏపీలో ఎన్నికల  ప్రచారం జోరందుకుంది. జనంలోకి చొచ్చుకుపోయేలా.. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష కూటమికి వెన్నులో వణుకు పుట్టించేలా  ఉంటున్నాయి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రచార ప్రసంగాలు. మరోవైపు పార్టీ అధినేత ఆదేశాలనుసారం పార్టీ శ్రేణులు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.జగన్‌ కోసం సిద్ధం.. ఇదీ ఇప్పుడు వైఎస్సార్‌సీపీ చేపట్టిన కొత్త కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఇంటికి వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో-2024ను చేరవేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా.. సీఎంగా జగన్‌ ఉంటేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, పేదల భవిష్యత్తు మారుతుందని ప్రచారం చేయనుంది. ఇవాళ పార్టీ కీలక నేతలు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు   మొదటి నుంచి తన ప్రసంగాల్లో, ఎన్నికల ప్రచారంలోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సంక్షేమం పొందిన సామాన్యులే తన స్టార్‌ క్యాంపెయినర్లంటూ సీఎం జగన్‌ చెబుతూ వస్తున్నారు. దీంతో ఆ సామాన్యుల్నే ఇప్పుడు జగన్‌ కోసం సిద్ధం కార్యక్రమంలో భాగం చేయబోతోంది పార్టీ.మేనిఫెస్టోను దాదాపుగా పూర్తి స్థాయిలో(99 శాతం పైనే) అమలు చేసింది వైఎ‍స్సార్‌సీపీనే కాబోలు!. అలవుగాని హామీలను ఇవ్వబోమని, చేయగలిగింది మాత్రమే చెబుతామని, చెప్పిందే చేస్తామని, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇంకా ఎక్కువే చేస్తామని మేనిఫెస్టో ప్రకటన సమయంలో సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అంతేకాదు.. మేనిఫెస్టోను ఓ ప్రొగ్రెస్‌ రిపోర్టులాగా.. 58 నెలల కాలంలో ఎప్పటికప్పుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ వస్తున్నామంటూ పేర్కొన్నారాయన.  దీంతో ఈ హామీలనే జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని, తద్వారా మరోసారి ప్రజల ఆదరణ చురగొనాలని  వైఎస్సార్‌సీపీ భావిస్తోంది.

BJP Drops Brij Bhushan Amid Harassment Charge Fields His Son
బ్రిజ్‌భూషణ్‌కు హ్యాండ్‌ ఇచ్చిన బీజేపీ.. సిట్టింగ్‌ ఎంపీకి నో ఛాన్స్‌

పార్టీ సీనియర్‌ ఎంపీ, మాజీ రెజ్లింగ్‌ అధ్యక్షుడు బ్రిజ్‌భూషన్‌ శరణ్‌ సింగ్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఉత్తరప్రదేశ్‌లోని కైర్‌గంజ్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న ఆయనకు ఈసారి బీజేపీ మొండిచేయి చూపింది. గతంలో భూషన్‌పై జాతీయ స్థాయి రెజర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన్ను పోటీ నుంచి తప్పించింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కైర్‌గంజ్‌ నుంచి ఆయన కొడుకు కరణ్‌ భూషన్‌ సింగ్‌కు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది.లోక్‌సభ అయిదో విడతలో భాగంగా మే20వ తేదీన కైసర్‌గంజ్‌లో పోలింగ్‌ జరగనుంది. నామినేషన్‌ దాఖలు చేయడానికి తుదిగడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ  నేడు అభ్యర్థని ప్రకటించింది. కాగా బ్రిజ్‌భూషన్‌ సింగ్‌ ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. చివరి మూడు సార్లు పర్యాయాల్లో (2009, 2014, 2019) కైసర్‌గంజ్‌‌ ఎంపీగా గెలిచి హ్యాట్రిక్‌ విజయం సాధించారు. అయితే బ్రిజ్‌భూషన్‌ గత రెండేళ్లుగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై జాతీయ రెజర్లు చేసిన తీవ్ర ఆరోపణలు అప్పట్లో రాజకీయపరంగా ప్రకంపనలు సృష్టించాయి. దీంతో గతేడాది రెజ్లింగ్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే విజయవకాశాలను దెబ్బతీస్తాయనే ఆలోచనతో అభ్యర్థిని మార్చేందుకు మొగ్గు చూపింది. అయితే బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు స్థానికంగా ఉన్న రాజకీయ పలుకుబడిని దృష్టిలో పెట్టుకొని ఆయన కుమారుడిని బరిలో దింపింది.కరణ్‌ పేరుతోపాటు కాంగ్రెస్‌ కంచుకోటగా పేరొందిన రాయ్‌బరేలీ అభ్యర్థిని సైతం బీజేపీ ప్రకటించింది. రాయ్‌బరేలీలో ప్రతాప్‌ సింగ్‌ను బరిలో నిలిపింది. ఇప్పటికీ కాంగ్రెస్‌ తమ అభ్యర్థిని వెల్లడించలేదు. గతంలో ఇక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేశారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభకు వెళ్లారు.

Old People Problems For Pension Due To Chandrababu Conspiracies
చంద్రబాబు పగ.. ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు

ప్రతినెలా ఫస్ట్ తేదీ రాగానే పలకరిస్తూ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని పెద్దమ్మా బాగున్నావా.. తాతా  బాగున్నావా అని పలకరించే వాలంటీర్ రాలేదు... అయన వచ్చి డబ్బులిస్తే మందులు... పప్పు ఉప్పు...సరుకులు కొనుక్కుందాం అనుకున్నాను.. వాలంటీర్ రాలేదు... చేతిలోకి పైసలు పడలేదు... ఈ ఎండల్లో ఆటోల్లో పక్కూరు వెళ్లి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవాలట. ఈ మండుటెండలో ఎలా వెళ్లాలో ఏమో అంటూ వృద్ధులు.. వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు వేసిన ఎత్తులు, కుట్రల వల్ల వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు.అసలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం మనకు అవుతుందా ? ఆ బ్యాంకుల్లో క్యూలైన్లు.. నిలబడడం.. ఆ ఫారాలు నింపడం.. ఇదంతా పెద్ద సమస్య.. దానికితోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్ )లేకపోతె కొంత పెనాల్టీ విధిస్తాయి. కొన్నాళ్లపాటు ఆ ఖాతా యాక్టివ్‌గా లేకపోతే ఆ ఖాతాలను బ్యాంకులు మూసేస్తాయి. ఈ పేదల ఖాతాల్లో నిత్యం మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుందా అనేది సందేహమే... అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వీళ్ళ ఖాతాల్లోకి వచ్చిన మూడు వేలలో కొంత కోత విధిస్తే అది తమకు నష్టం అని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అని, వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్లు పంచడాన్ని అయన భరించలేక ... సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంచిపేరు రావడాన్ని సహించలేక ఇలాంటి కుట్రలకు దిగారని, రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు..మగ నంగనాచి చంద్రబాబు..ఊళ్లలో కొంతమంది నంగనాచి లేడీస్ ఉంటారు.. వాళ్ళో గదిలో మొగుణ్ణి చావచితక్కొట్టి మళ్ళీ వీధుల్లోకి వచ్చి.. అయ్యో నా మొగుడు నన్ను చంపేసినాడమ్మో... నా మొగుడు.. కొట్టీసినాడమ్మో అంటూ వీధిలోకి వచ్చి వీరంగం వేస్తారు... ఇప్పుడు చంద్రబాబు సైతం మగ నంగనాచి పాత్రలో జీవిస్తున్నారు... మార్చి వరకూ ప్రతి ఇంటికీ వెళ్లి పెన్షన్షన్లు అందించే వాలంటీర్లను కోర్టు ద్వారా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు అయ్యో వృద్ధులు అంటూ కన్నీళ్లు కారుస్తున్నారు.వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇస్తే అది సీఎం వైఎస్‌ జగన్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే అంశం అవుతుంది కాబట్టి.. ఆ డోర్ డెలివరీకి ఆపాలంటూ కోర్టులు, ఎన్నికల కమిషన్ ద్వారా అడ్డుకున్న చంద్రబాబుకు వెనువెంటనే విషయం అర్థమైంది. ఏప్రిల్లో ఇలాగే ఎండల్లో లబ్ధిదారులు బ్యాంకులు.. సచివాలయాలు వద్దకు వెళ్లి పెన్షన్లను తీసుకుంటూ... చంద్రబాబును తిట్టడం మొదలు పెట్టారు.. దీంతో ఇదేదో తనకు వ్యతిరేకత అయ్యేలా ఉందని గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఇదంతా జగన్ కుట్ర అని, పెన్షన్లు ఎగ్గొట్టేందుకే ఇవన్నీ చేస్తున్నారని ఎదురు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఈ మేలో కూడా మరింత మండుతున్న ఎండల్లో వృద్ధులు మళ్ళీ బ్యాంకులవద్ద పడిగాపులు కాయడం.. దీనికి చంద్రబాబే కారణం అని వాళ్ళు గుర్తించి ఆయన్ను తిడుతుండడంతో ఏమి చేయాలో తెలియక చంద్రబాబు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారు..-సిమ్మాదిరప్పన్న 

Ajit Agarkar Reveals Reason For Rinku Singhs Snub From T20 World Cup Squad
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్‌ చేయలేకపోయాం'

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు ప్ర‌క‌టించిన భార‌త జట్టులో న‌యా ఫినిష‌ర్ రింకూ సింగ్‌కు చోటు ద‌క్క‌కపోయిన సంగ‌తి తెలిసిందే. 15 మంది స‌భ్యుల‌తో కూడిన ప్ర‌ధాన జ‌ట్టులో రింకూకు ఛాన్స్ ఇవ్వ‌ని సెల‌క్ట‌ర్లు.. నామ‌మాత్రంగా స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. ప్ర‌స్తుతం ఇదే విష‌యం క్రీడా వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.  అద్బుత ఫామ్‌లో రింకూను ఎంపిక చేయ‌క‌పోవ‌డాన్ని చాలా మంది మాజీ క్రికెట‌ర్లు త‌ప్పుబడుతున్నారు.తాజాగా ఈ విష‌యంపై  బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జ‌ట్టులో అద‌న‌పు బౌల‌ర్ అవ‌స‌రం ఉండ‌టంతోనే రింకూను సెల‌క్ట్ చేయ‌లేద‌ని అగార్కర్ తెలిపాడు.రింకూ సింగ్‌ అద్బుతమైన ఆటగాడని మాకు తెలుసు. దురుదృష్టవశాత్తూ రింకూను సెలక్ట్ చేయలేకపోయాం. అతడిని ఎంపిక చేయకపోవడానికి వెనుక ఓ కారణముంది. మేము ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఎంపిక చేయాలనుకున్నాం. అందుకే రింకూకు ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. మా నిర్ణయం రింకూను బాధపెట్టవచ్చు. కానీ జట్టు బ్యాలెన్స్ కారణంగా అతడిపై వేటు వేయక తప్పలేదు. అయినప్పటికి అతడు ట్రావెలింగ్ రిజర్వ్‌గా జట్టుతో పాటు వెళ్తాడని ప్రెస్‌ కాన్ఫ‌రెన్స్‌లో  అగార్కర్ పేర్కొన్నాడు.

SSMB29: KL Narayana Interesting Comments On Rajamouli And Mahesh Babu
ఇచ్చిన మాట కోసం హాలీవుడ్‌ ఆఫర్‌ వదులుకున్న రాజమౌళి!

బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రాజమౌళి ఇమేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఆయనతో సినిమా అంటే హాలీవుడ్‌ హీరోలు కూడా రెడీ అంటారు. కానీ జక్కన్న మాత్రం తెలుగు హీరోలతో పాన్‌ ఇండియా సినిమా చేసి హిట్‌ కొడుతున్నాడు. అంతేకాదు తన సినిమాలను నిర్మించే అవకాశం టాలీవుడ్‌ ప్రొడ్యుసర్లకే ఇస్తున్నాడు. కెరీర్‌ తొలినాళ్లలో తనతో సినిమా చేయాలని ఒప్పందం కుదుర్చుకున్న నిర్మాతలకే అవకాశం ఇస్తున్నాడు. తాజాగా మహేశ్‌ బాబుతో చేయబోయే సినిమా విషయంలో కూడా రాజమౌళి ఇచ్చిన మాటకే కట్టుబడి ఉన్నాడు. పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నిర్మాణ బాధ్యలతను ప్రముఖ నిర్మాత కేఎల్‌ నారాయణకు అప్పగించాడు. 15 ఏళ్ల క్రితం తనకు ఇచ్చిన మాటను రాజమౌళి- మహేశ్‌ బాబు నిలబెట్టుకున్నారని నారాయణ అన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రాజమౌళి-మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో సినిమా చేయాలని 15 ఏళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నాం. అప్పుడే నా బ్యానర్‌(దుర్గా ఆర్ట్స్‌)లో సినిమా చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఇప్పుడు మహేశ్‌, రాజమౌళి ఇద్దరి స్థాయి పెరిగిపోయింది. వీళ్లతో సినిమా చేయడానికి చాలా మంది నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి నాతో సినిమా చేస్తున్నారు. నేను చెప్పకపోయినా.. ‘దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌’లో సినిమా చేస్తున్నామని వాళ్లే ప్రకటించారు. అందుకు వాళ్లకి కృతజ్ఞుడిని. రాజమౌళికి హాలీవుడ్‌ ఆఫర్లు కూడా వచ్చాయి. వాటిని రిజెక్ట్‌ చేసి మరీ నాతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. రెండు నెలల నుంచి ప్రీ ప్రొడక్షన్స్‌ వర్క్‌ జరుగుతోంది.   ఆగస్ట్‌ లేదా సెప్టెంబర్‌లో షూటింగ్‌ప్రారంభం అవుతుంది. బడ్జెట్‌ఎంత అనేది ఇంకా డిసైడ్‌ అవ్వలేదు. కానీ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను’  అన్నారు.

AP Politics And Election Live Updates May 2nd
AP Election Updates May 2nd: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Andhra Pradesh Election Updates 2nd May.. ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రెస్‌ మీట్‌5:24 PM, May 2nd, 2024 రాష్ట్ర వ్యాప్తంగా 4,13,33,702 ఓటర్లు ఉన్నారుపురుషులు- 2,02,74,144, మహిళలు-2,10,56,137దీనికి అదనంగా సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారురాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ బూత్‌లు ఏర్పాటుమోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ లపై 864 ఎఫ్ఐఆర్‌లు నమోదు సీ విజిల్ కి 16,345 ఫిర్యాదులు వచ్చాయికొన్ని చోట్ల హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. 6 మందికి గాయాలుఇప్పటి వరకు 203 కోట్లు విలువైన నగదు, మద్యం సీజ్రాష్ట్ర వ్యాప్తంగా 29,897 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్.. దాదాపు 64% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయబోతున్నాం14 నియోజకవర్గాలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్‌తో పాటు పోలింగ్ నిర్వహణకి సెంట్రల్ ఫోర్సెస్ఎండ వేడిమి అధికంగా ఉన్న కారణంగా టెంట్లు, కూలర్లు, తాగునీళ్లు, మెడికల్ కిట్ల వంటి ప్రత్యేక చర్యలు85 ఏళ్ల పైబడిన వృద్దులు, వికలాంగులు తదితరులు ఇంటి దగ్గర వినియోగించుకోవడానికి 7,28,484 మందిలో కేవలం 28,591మంది అంగీకరించారుహైకోర్టు తీర్పు తర్వాత ఏడు ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్ధానాలలో గాజు గ్లాసు కేటాయించిన అభ్యర్ధులకి వేరే గుర్తులు కేటాయించవలసి వచ్చింది\విశాఖ ఎంపీ స్ధానానికి 33 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్న కారణంగా మూడు ఈవీఎం అవసరమవుతాయితిరుపతి, మంగళగిరిలలో  మూడు బ్యాలెట్ యూనిట్లు..మరో 20 నియోజకవర్గాలలో రెండేసి బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతున్నాయిఇందుకోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా 15 వేల ఈవీఎంలు తెప్పించాంరాష్ట్రంలో 50 మంది జనరల్ అబ్జర్వర్లు, 25 మంది పోలీస్ అబ్జర్వర్లు, 25 పార్లమెంటరీ వ్యయ పరిశీలకులు,  అసెంబ్లీ స్ధానాలకి 50 వ్యయ పరిశీలకులు ఉన్నారుపోలీస్ శాఖ రిపోర్ట్ మేరకు 384 ఎమ్మెల్యే, 64 మంది ఎంపి అభ్యర్ధులకి ప్రత్యేక భద్రత  కల్పించాంపెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల‌కమీషన్ మేరకు కొన్ని ఆదేశాలు జారీ చేశాంబ్యాంకు అకౌంట్లు ఉన్నవారికి డిబిటి ద్వారా....అకౌంట్లు లేని వారికి నేరుగా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నాంపెన్షన్ల పంపిణీపై రాజకీయ పార్టీల ప్రచారాలపై నేను స్పందించలేనునామినేషన్ల ఉప సంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితా సిద్ధం అయ్యిందిఅలాగే ఎన్నికల్లో ఓటు వేయనున్న ఓటర్ల  తుది జాబితాను కూడా సిద్ధం చేశాంప్రస్తుతం 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారుగతంతో పోలిస్తే 5,94,631 మంది ఓటర్లు పెరిగారుఇక రాష్ట్ర వ్యాప్తంగా అదనం గా పోలింగ్ కేంద్రాలు కూడా పెరిగాయిమొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కోసం సిద్ధం చేశాంఅలాగే మోడల్ కోడ్ లో భాగం గా విస్తృత తనిఖీలు చేస్తున్నాంఇప్పటి వరకూ 203 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాంఈసారి 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తాంఅలాగే రాష్ట్రంలోని 14 నియోజక వర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించాంమాచర్ల, పెదకూరపాడు ఒంగోలు, అల్లగడ్డ్ , తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ళపల్లి ల్లలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాంప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయిఅందుకే పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేలా చర్యలు, మెడికల్ కిట్ లు, ఏర్పాటు చేస్తున్నాంరాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది హోం ఓటింగ్‌కు సమ్మతి తెలిపారుజనసేన పోటీ చేస్తున్న లోక్ సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు లో గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయింపు లేదుఅలాగే శాసన సభ నియోజక వర్గాల పరిధిలో ఉన్న లోక్ సభ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎవరికీ ఇవ్వంఇప్పటికే కేటాయించిన 7 లోక్ సభ, 8 శాసన సభ నియోజక వర్గాల్లో గుర్తును మార్పు చేసి ఇతర అభ్యర్థులకు ఇచ్చాంఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటింగ్ మొదలు పెట్టాంపెరిగిన అభ్యర్థుల కారణంగా అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్ లు అవసరం అయ్యాయి. వీటిని తెప్పించి జిల్లాకు పంపించాం చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల రామకృష్ణారెడ్డి4:43 PM, May 2nd, 2024 చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని ప్రజలకు తెలుసువైసీపీ బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తోందిరాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అమలు చేయగలిగినవే చెప్పాంకోవిడ్ సమయంలో ఆ రెండేళ్లు కూడా ఆగకుండా సంక్షేమం అమలు చేశాంజగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నారుఇప్పుడేమో మళ్ళీ అడ్డగోలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారుగతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారునిరుద్యోగులకు రూ.3 వేలు, రైతులకు రూ.20 వేలు సహాయం అని మేనిఫెస్టోలో పెట్టారుకానీ అర్హత ఏంటో చెప్పలేదుఅంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా?1999 లో కూడా కోటి మందికి ఉపాధి అని హామీ ఇచ్చారుకానీ అమలు చేయకుండా ఎగనామం పెట్టారుచంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వెయ్యి రూపాయలు చేశారుఅదికూడా సరిగా ఇచ్చారా అంటే అదీ లేదువృద్దులు, వికలాంగులకు ఏ ఇబ్బందీ లేకుండా జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారుఇప్పుడు కోర్టుకు వెళ్లి, ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకున్నారుచివరికి బ్యాంకులో పెన్షన్లు వేసేలా ఈసీ ద్వారా చేయించారుబ్యాంకుల దగ్గర పెన్షన్‌దారులు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోందిచంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఎలాంటి నరకం ఉంటుందో ముందే కనపడుతోందివృద్దులు, వికలాంగుల కష్టాలకు పూర్తి పాపం చంద్రబాబుదేవాలంటీర్ల వ్యవస్థను తొలగించి మళ్ళీ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తారు2019లో ప్రజలు చిత్తుగా ఓడించారన్న కోపం చంద్రబాబుకు ఉందిఅందుకే వారి జీవితాలతో చెలగాటమాడటానికి సిద్ధం అయ్యారుకూటమి మేనిఫెస్టోలో బీజేపీ ఫోటోలు ఎందుకు లేవు?అంటరానితనంగా ఎందుకు వ్యవహరించారు?సిక్కిం, అరుణాచలప్రదేశ్ లో కూటమి మేనిఫెస్టోలో మరి బీజేపీ, మోదీ బొమ్మలు ఎందుకు ఉన్నాయి?చంద్రబాబు హామీలు అమలు చేసేలా లేవని బీజేపీకి అర్థం అయిందిఅందుకే చంద్రబాబు మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పిందిల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విపరీతంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారుఆ యాక్టును బీజేపీ కేంద్ర  ప్రభుత్వమే అమలు చేయాలని చూస్తోందిఆ చట్టం మీద అనుమానాలు ఉంటే దానికి బాధ్యత బీజేపీదేతప్పుడు ప్రచారాలు చేసే చంద్రబాబు అసలు రాజకీయాలకే అనర్హుడుచంద్రబాబు మేనిఫెస్టో బూతుపత్రంల్యాండ్ టైటిల్ యాక్టు మీద బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలిబీజేపి రాష్ట్ర నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?చంద్రబాబు లెక్క ప్రకారం దేశంలోని భూములన్నీ మోదీ అమ్మకుంటున్నారా?దీనిపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు క్లారిటీ ఇవ్వాలిజనసేనకు ఈసీ ఝలక్‌1:45 PM, May 2nd, 2024ఏపీలో ఎన్నికల వేళ జనసేనకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల్లో గాజు గ్లాస్‌ గుర్తును రిజర్వ్‌ చేయలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు ఈసీ వెల్లడించింది.గాజు గ్లాస్‌ గుర్తును తమకు మాత్రమే రిజర్వ్‌ చేసేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో జనసేన పిటిషన్‌ దాఖలుఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఏపీవ్యాప్తంగా గాజు గ్లాస్‌ గుర్తును రిజర్వ్‌ చేయలేమని ఎన్నికల సంఘం.. హైకోర్టుకు తెలిపింది. అలాగే, ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్‌ మార్చలేమని ఈసీ కోర్టుకు వెల్లడించింది.జనసేన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఈసీ పేర్కొంది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని ఈసీ.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ బ్యాలెట్‌లను ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌కు పంపించినట్టు ఈసీ స్పష్టం చేసింది. అలాగే, జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై బుధవారమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకు ఈసీ పేర్కొంది.  బాబుపై అన్నా రాంబాబు ఫైర్‌12:30 PM, May 2nd, 2024ప్రకాశం జిల్లాచంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ మార్కాపురం అభ్యర్థి అన్నా రాంబాబు ఫైర్ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై చంద్రబాబు అనవసర అపోహలు సృష్టిస్తున్నాడుఅసలు లేని సమస్యను సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారుచంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితిలో జనం లేరు.14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకు ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నాడు.చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి  టీడీపీ మేనిఫెసో ఒక అబద్ధం: కైలే అనిల్‌ కుమార్‌11:30 AM, May 2nd, 2024పామర్రు నియోజకవర్గం నిడుమోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్ధి కైలే అనిల్ కుమార్అడుగడుగునా కైలేకు ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలుకైలే అనిల్ కుమార్ కామెంట్స్‌..ప్రజలంతా సీఎం జగన్‌ పాలనే మళ్లీ కావాలనుకుంటున్నారుఎంతమంది కలిసి వచ్చినా ముఖ్యమంత్రి జగన్‌ను ఏమీ చేయలేరని ప్రజలు విశ్వసిస్తున్నారుటీడీపీ మేనిఫెసో ఒక అబద్ధంజగన్ మోనిఫెస్టో నమ్మకంతో కూడిన ఒక నిజంఅబద్ధం, మోసంతో ఏదోరకంగా అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడుచంద్రబాబుపై బీజేపీకే నమ్మకం లేదుకలిసి ప్రయాణం చేస్తున్న బీజేపీనే నమ్మకపోతే.. ప్రజలు ఎలా నమ్ముతారుపామర్రులో నూటికి 99% శాతం ప్రజలకిచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాంమరో అవకాశం ఇస్తే మరింతగా పామర్రు ప్రజలకు సేవచేస్తాపామర్రులో నేను.. మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ అత్యధిక మెజార్టీతో గెలుస్తాం ‘జగన్‌ కోసం సిద్ధం’11:00 AM, May 2nd, 2024మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్‌సీపీ"జగన్ కోసం సిద్ధం" పేరుతో మరో ప్రచార కార్యక్రమంనేడు ప్రారంభించనున్న పార్టీ నేతలుమేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం  సిద్ధంపార్టీ స్టార్ క్యాంపెయినర్లతో కలిసి ఇంటిఇంటికీ మేనిఫెస్టో టీడీపీ నేతలకు దేవినేని అవినాష్ కౌంటర్‌10:00 AM, May 2nd, 202412వ డివిజన్‌ను 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాముస్థానిక టీడీపీ ఎంఎల్ఏ ఇంటి ముందు రోడ్ కూడా జగన్ ప్రభుత్వమే వేసిందిడివిజన్‌లో 20 కోట్లతో  సంక్షేమం చేసాముప్రతీ గడపలో సీఎం జగన్‌కే మా ఓటు అని చెబుతున్నారుజగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే అడ్డుకోవటానికి సిగ్గులేదా?స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు గద్దెకి పట్టవుతూర్పు నియోజకవర్గం ఏమైనా మీ జాగీరా?.ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాల చేయడం టీడీపీ నేతలకే దక్కిందిరెండుసార్లు ఎంఎల్ఏ ఒకసారి ఎంపీ అనుభవం అంటే ఇదేనా?రానున్న ఎన్నికలే గద్దెకు ఆఖరి ఎన్నికలుకాలనీల అభివృద్ధికి స్థానిక ప్రజల కాంట్రిబ్యూషన్ అడిగింది వాస్తవం కాదాప్రజానీకానికి మంచి చేస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గంప్రజలు మీ చిల్లర చేష్టలు గమనిస్తున్నారుఇంకా పూర్తి స్థాయిలో వృద్దులకు, వితంతువులకు పెన్షన్ అందలేదు  నేటి నుంచి కృష్ణా జిల్లాలో హోమ్ ఓటింగ్..9:30 AM, May 2nd, 2024ఇంటివద్దనే ఓటు హక్కు వినియోగించుకోనున్న వయోవృద్ధులు ,దివ్యాంగులుహోమ్ ఓటింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా 35 బృందాలు ఏర్పాటుగన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలలో 6 బృందాలు ఏర్పాటుపామర్రు నియోజకవర్గంలో 5 బృందాలు ఏర్పాటుమచిలీపట్నం, పెడన, గుడివాడ నియోజక వర్గాలలో 4 బృందాలు ఏర్పాటుఒక్కో హోమ్ ఓటింగ్ బృందంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ పోలింగ్ అధికారి, ఒక సూక్ష్మ పరిశీలకులు, ఒక వీడియో గ్రాఫర్,  పోలీస్ ఎస్కార్ట్ ఉండేలా చర్యలు ఉంటాయన్నారుహోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 9,114 మంది, దివ్యాంగులు 22,429 మంది  రెండు సార్లు జరుగనున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియ  నేటి నుంచి మే 6 వరకూ ఒకసారిమే 7 నుంచి 8 వరకూ రెండోసారి హోమ్ ఓటింగ్‌కు అవకాశం మహాసేన రాజేష్‌కు ఘోర అవమానం..8:20 AM, May 2nd, 2024అవనిగడ్డలో టీడీపీ నేత మహాసేన రాజేష్‌కు అవమానంఎన్నికల ప్రచారానికి మహాసేన రాజేష్‌తో పాటు అంబటి రాయుడిని ఆహ్వానించిన జనసేన నాయకులుమోపిదేవి నుంచి అవనిగడ్డ వరకూ ర్యాలీ.. బహిరంగ సభ ఏర్పాటు చేసిన జనసేన నాయకులుమోపిదేవి కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద స్వాగతం పలుకుతామని మహాసేన రాజేష్‌కు ఆహ్వానంమహాసేన రాజేష్ రాకుండానే అంబటి రాయుడితో కార్యక్రమం ప్రారంభించేసిన జనసేన నాయకులుతనను పిలిచి అవమానించడంతో జనసేన నేతల తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేష్చల్లపల్లి నుంచి వెనుదిరిగిన మహాసేన రాజేష్జనసేన పార్టీలో దళితులపై వివక్ష మారలేదని తన అనుచరుల వద్ద వాపోయిన రాజేష్తన సీటు విషయంలో జనసేన చేసిన యాగీ మరిచిపోయి పొత్తు ధర్మం కోసం జనసేన తరుపున ప్రచారానికి వస్తే అవమానించారని  సన్నిహితుల వద్ద వాపోయిన రాజేష్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెనుతిరిగిన రాజేష్రాజేష్‌ను పిలిచి అవమానించారంటూ జనసేన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు మధ్య తరగతికి మరింత భరోసా.. వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టో7:45 AM, May 2nd, 2024వైఎస్సార్‌సీపీ నవరత్నాలు ప్లస్‌ మేనిఫెస్టోతో మరోసారి అండగా సీఎం జగన్‌పట్టణ ప్రాంతాల్లోని మధ్య ఆదాయ కుటుంబాలకు సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు123 పట్టణాల్లో ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధిరూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసారూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సహాయంకాపు, ఈబీసీ నేస్తం ద్వారా ఒక్కో కుటుంబానికి ఐదేళ్లలో రూ.60 వేల సాయంప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విదేశీ విద్యా దీవెనతో తోడ్పాటురూ.10 లక్షల వరకు రుణానికి కోర్సు ముగిసే వరకు పూర్తి వడ్డీ చెల్లింపుఆప్కాస్, ఆశ, అంగన్‌వాడీ, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నవరత్న పథకాలుప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాలోనే 60 శాతం ప్రభుత్వ ఖర్చుతో ఇంటి స్థలం ‘భృతి’.. అంతా భ్రాంతి.. నిరుద్యోగులపై చంద్రబాబు మాయా వల7:20 AM, May 2nd, 2024నిరుద్యోగులపై చంద్రబాబు మరోసారి మాయా వలజాబు రావాలంటే బాబు రావాలంటూ 2014 ఎన్నికల్లో ప్రచారంకరపత్రాలు వేసి ఊరూరా పంపిణీ ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ.. అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లపాటు ఆ ఊసేలేదుప్రతిపక్ష నేత అసెంబ్లీలో బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తే అసలా పథకమే లేదన్న అచ్చెన్నఆ ఒత్తిడి తట్టుకోలేక 2017–18 బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి రూ.500 కోట్లు కేటాయింపుఅయినా అమలుచేయని చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ఆరునెలల ముందు ముఖ్యమంత్రి యువ నేస్తం పేరుతో పథకంనెలకు రూ.1,000 చొప్పున ఇస్తామని ప్రకటనసవాలక్ష ఆంక్షలతో కేవలం 12 లక్షల మంది నిరుద్యోగులకు అర్హతకానీ, 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల చివరికి 1.62 లక్షల మంది మాత్రమే అర్హులని తేల్చిన బాబు1.70 కోట్ల నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన బాబుఎన్నికలు రావడంతో మళ్లీ యువతకు గేలం.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలుబాబు గత చరిత్ర చూడండి.. ఆయన్ను నమ్మొద్దంటూ యువతకు విద్యావేత్తలు, మేధావులు హితవు వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం7:00 AM, May 2nd, 2024పాడేరు కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థితో మంతనాలతో స్పష్టీకరణచంద్రబాబు నాయుడుకు మేలు చేయడమే అజెండాఆడియో లీక్‌తో అడ్డంగా దొరికిపోయిన వైనంపాడేరు కాంగ్రెస్‌ టికెట్‌ తొలుత వంతల సుబ్బారావుకుఆ తర్వాత వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిన బుల్లిబాబుకి కేటాయింపుపాడేరులో కాంగ్రెస్‌ రెబల్‌గా వంతల పోటీపోటీ నుంచి తప్పుకోవాలని వంతలను ఆదేశించిన షర్మిలవైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు కోసమే తాను బాధ్యతలు తీసుకున్నట్లు వెల్లడి  పచ్చ మంద కుట్రలతో పెన్షన్‌దారులకు కష్టాలు.. 6:30 AM, May 2nd, 2024చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్‌దారులకు మరిన్ని కష్టాలుబ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వృద్దులు, వికలాంగులువాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఇవ్వడాన్ని అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ఎన్నికల సంఘం ఆదేశాలతో బ్యాంకు ఖాతాలో పెన్షన్ వేసిన ప్రభుత్వండబ్బులు డ్రా చేసుకోవటానికి పెన్షన్‌దారుల అవస్థలునిన్న అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో ఇద్దరు మృతిగత నెలలో 39 మంది వృద్దులు మృతిఇంటికే వచ్చే పెన్షన్ ను అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ వైఖరిపై మండిపడుతున్న పెన్షన్‌దారులు

Heavy Rains in Dubai Several Flights Cancelled
దుబాయ్‌లో మళ్లీ దంచికొడుతున్న వాన.. పలు విమానాలు రద్దు

రెండు వారాలకు ముందు దుబాయ్‌లో కుండపోత వర్షాలు కురిశాయి. ఆ ఘటన మరువకముందే మరోసారి ఎడారి దేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షం, ఉరుములు కారణంగా అనేక అంతర్జాతీయ విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.గత నెలలో కురిసిన వర్షాలతో పోలిస్తే ఈసారి కురుస్తున్న వర్షాలు తక్కువగా ఉంటాయని.. నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) అంచనా వేసింది. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గురువారం ఉదయం నుంచి వర్షం భారీగా పడుతూనే ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. రేపు (మే 3) వర్షం మరింత బలంగా ఉండే అవకాశం ఉంటుందని సంబంధిత శాఖ అంచనా వేసింది.ఇప్పటికే అబుదాబిలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బలమైన గాలుల వల్ల చెట్లు మాత్రమే కాకుండా విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. దీంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. అత్యవసర సమయంలో బయటకు వచ్చే ప్రజలు కూడా తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.1949 తరువాత భారీ వర్షం ఏప్రిల్ 14, 15వ తేదీలలో పడినట్లు అధికారులు పేర్కొన్నారు. గత నెలలో పడ్డ వర్షాల కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. వాహనాలు కూడా నీటిలో చిక్కుకున్నాయి. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందా అని ప్రజలు భయపడుతున్నారు.

gold price today rate down may 2
వామ్మో.. ఒక్క రోజులో ఇంత పెరిగిందా?

దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి. క్రితం రోజున భారీగా తగ్గి పసిడి ప్రియులకు ఆనందం కలిగించిన బంగారం ధరలు ఈరోజు (మే 2) భారీ స్థాయిలో పెరిగాయి. ఒక్క రోజులోనే రూ.870 మేర ఎగిశాయి.హైదరాబాద్‌, విశాఖపట్నం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ. 72,270 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లోి ఇలా..దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 ఎగిసి రూ.66,400 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.7600 పెరిగి రూ.72,420 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.760 పెరిగి రూ.72,270 వద్దకు ఎగిసింది.చెన్నైలో అయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.800 పెరిగి రూ.67,150 ల​కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం అత్యధికంగా రూ.870 పెరిగి రూ.73,250 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.66,250 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.760 ఎగిసి రూ.72,270 లకు చేరుకుంది.

AP Chief Electoral Officer Mukesh Kumar Meena On Voter List
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా

ఎన్టీఆర్‌, సాక్షి:  రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి(AP CEO) ఎంకే మీనా అన్నారు. గురువారం సాయంత్రం పోలింగ్‌ ఏర్పాట్లపై ఈసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.నామినేషన్ల ఉప సంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితా సిద్ధం అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,13,33,702 ఓటర్లు ఉన్నారు. గతంతో పోలిస్తే 5,94,631 మంది ఓటర్లు పెరిగారు. వీరిలో పురుషులు 2,02,74,144 మంది. మహిళా ఓటర్లు 2,10,56,137 మంది. అదనంగా సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారు. ఇక రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కోసం 46,389 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశాం అని తెలిపారాయన.ఎన్నికల కోడ్‌ అమలు దృష్ట్యా.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఇప్పటిదాకా 864 ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయి. సీ విజిల్ యాప్‌కి 16,345 ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి.  ఇద్దరు మృతి చెందగా..156 మందికి గాయాలు అయ్యాయి. ఇప్పటి వరకు రూ.203 కోట్ల విలువైన నగదు, మద్యం సీజ్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 29,897 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ అంటే.. దాదాపు 64% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయబోతున్నాం. అలాగే రాష్ట్రంలోని 14 నియోజక వర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించాం. మాచర్ల, పెదకూరపాడు ఒంగోలు, అల్లగడ్డ్ , తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ళపల్లి ల్లలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. పెరిగిన అభ్యర్థుల కారణంగా అదనం గా 15 వేల బ్యాలెట్ యూనిట్ లు అవసరం అయ్యాయి. వీటిని తెప్పించి జిల్లాకు పంపించాం.ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అందుకే పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే.. మెడికల్ కిట్లు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది హోమ్ ఓటింగ్ కు సమ్మతి తెలిపారు. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ ఓటింగ్ మొదలు పెట్టాం.జనసేన పోటీ చేస్తున్న లోక్ సభ, శాసన సభ నియోజకవర్గాల పరిధుల్లో ఎవరికీ గ్లాస్ గుర్తు కేటాయించలేదు. ఇప్పటికే కేటాయించిన 7 లోక్ సభ, 8 శాసన సభ నియోజక వర్గాల్లో గుర్తు ను మార్పు చేసి ఇతర అభ్యర్థులకు ఇచ్చాం అని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా తెలిపారు.

32 Year Old Man Dies After Fainting At Varanasi Gym
జిమ్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్‌

ఫిట్‌నెస్‌ కోసం వ్యాయామం చేస్తూ  కుప్పకూలి  ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆందోళన రేపుతోంది. జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తూ   అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు ఒక యువకుడు.  ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ విషాదం చోటు చేసుకుంది.వారణాసికి చెందిన దీపక్‌ గుప్తా (32)గత పదేళ్లుగా జిమ్‌లో రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తుండేవాడు.పలు ఫిట్‌నెస్ పోటీలలో చురుకుగా పాల్గొనేవాడు. ఫిట్‌నెస్‌ అంటే ప్రాణం పెట్టే దీపక్‌  రోజూలాగానే జిమ్‌కెళ్లి వ్యాయామం చేస్తుండగా తీవ్రమైన తలపోటుతో బాధపడినట్టుగా వీడియో ఫుటేజ్‌ని బట్టి తెలుస్తోంది.  నేలపై పడకముందే తన తలని చేతుల్లో పెట్టుకుని కూర్చున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కిందపడిపోయిన దీపక్‌ను  అక్కడున్న వారు లేపి కూర్చోబెట్టారు. నీళ్లు తాగించారు, వీపు, తలపై మసాజ్‌ చేశారు.అయినా గజ గజ వణికిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మెడికల్ రిపోర్టు వచ్చిన తర్వాత అతడి మృతికి ఖచ్చితమైన కారణం తెలియనుంది. 

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement


ఫోటో స్టోరీస్

View all