Top Stories
ప్రధాన వార్తలు
కౌంటింగ్‌లో ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడు. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారు. కాబట్టి మన వాళ్లు ఎక్కడా సంయమనం కోల్పోవద్దు అని సూచించి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.కాగా, ఎన్నికల కౌంటిగ్ నేపథ్యంలో వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జూమ్ మీటింగ్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..‘ఎన్నికల్లో నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన ప్రతీ ఓటు వచ్చేలా చూడాలి. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారు. ఎక్కడా సంయమనం కోల్పోవద్దు. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలి.పోస్టల్ బ్యాలెట్‌పై ఉన్న అధికారి సంతకం విషయంలో అనుమానుం ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ ఫోకస్‌ను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారు. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కచ్చితంగా మనం గెలుస్తున్నాం. నేషనల్ మీడియా ఇచ్చిన సర్వేలను చూస్తుంటే నవ్వు వస్తోంది. తమిళనాడులో 9 సీట్లలో పోటీ చేస్తే 14 చోట్ల గెలుస్తుందని చెప్పారు. ఇలా నాలుగైదు రాష్ట్రాల్లో తప్పుడు లెక్కలేసి బీజేపీ కూటమి గెలుస్తుందని చెబుతున్నారు.ఇలాంటి డ్రామాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడు. ఈసీనే బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అందుకే కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలి’ అని సూచనలు చేశారు.
చిల్లర రాజకీయాల కోసం కొందరు ఉద్యమాన్ని వాడుకున్నారు: కేసీఆర్
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణ రాష్ట్ర సాధన అసాధ్యమన్నారు. కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ ఖతమైంది అంటూ కొందరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మేము మళ్లీ అధికారంలోకి వస్తాం అంటూ వ్యాఖ్యలు చేశారు.కాగా, తెలంగాణభవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ దశాబ్ది ఉత్సవ వేడుకల శుభాకాంక్షలు. మనకు మనమే కాదు, ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పుకోవాలి. కొన్ని క్షణాల గొప్పగా ఉంటాయి, కొన్ని క్షణాలు బాధగా ఉంటాయి. ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేలా ఉంది. అన్ని పదవుల్లో నేను అనేక రోజులు చేశాను.1969 ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. మంచైనా చెడైనా మీతోనే ఉంటాము అని పనిచేసింది టీఎన్జీవో సంఘం. మన భాష మాట్లాడుతుంటే నవ్వుతారో ఏమో అనుకునే స్థాయి ఉండేది ఆనాడు. వలసలు పోతుంటే కనీసం ఆపలేదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు. స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ అయితేనే చేస్తా అని ఉద్యమంలోకి వచ్చాను. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణవాది. జయశంకర్ వంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు.మళ్ళీ ఉద్యమం నేను మొదలు పెట్టాను. చావనైనా చావాలి లేదంటే చంపాలి అని నేను ముందున్నాను. పాతాళంలో ఉన్న తెలంగాణపైకి తీసుకొచ్చాం. పాటతో మొత్తం తెలంగాణ చరిత్ర తెలిసేది. చరణంలోనే మొత్తం తెలువాలే. అందుకే తెలంగాణ పాటతో పుట్టింది. 25ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది. బీఆర్ఎస్ ఖతం అయితది అంటున్నాడు. ఖతం అయితదా?. మళ్ళీ నేను బస్సెక్కితే చూసారు కదా నా వెంట వచ్చారు మొత్తం. వందకు వంద శాతం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మొన్న నాదగ్గరికి ఒకరు వచ్చి చెప్పాడు ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 105 స్థానాలు వస్తాయని చెప్పారు.రైతు బంధు అనేది ఊరికనే ఇవ్వలేదు. స్థిరీకరణ కోసం ఇచ్చాం. చేప పిల్లలు, గొర్రెలు ఇస్తుంటే కూడా అవమానించారు. ఎన్ని చేసినా కొంత విష గాలి వస్తుంది. ఆ గాలికి జనం కొంత అటు వైపు మొగ్గు చూపారు. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పని చేయాలి. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పనులు, వెర్రిమొర్రి వేషాలు అన్ని కనిపిస్తున్నాయి. కరెంట్ విషయంలో ప్రభుత్వం తీరు బాధాకరం. కరెంట్ లేక జనం చనిపోతున్నారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఎక్కువ రోజులు ఉండవు. కాంగ్రెస్ ప్రభుత్వం స్టెప్ డౌన్ అవుతుంది. గత పదేళల్లో రైతులకు విత్తనాలను సక్రమంగా ఇచ్చాం. మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చి లైన్లో నిల్చోవాలన్సిన పరిస్థితి వచ్చింది.మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానం గెలిచాం. వరంగల్‌లో హీరో రాకేష్ రెడ్డి కూడా గెలుస్తున్నాడు. పార్లమెంట్లో ఎన్నైనా రావొచ్చు. ఎక్కువ సీట్లు వస్తే పొంగి పోయేది లేదు. తక్కువ వస్తే కుంగి పోయేది లేదు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పార్టీ ప్లీనరీ సమావేశం చేసుకోలేదు. పార్టీ వార్షికోత్సవాన్ని రెండు రోజులపాటు ఘనంగా అద్భుతంగా చేసుకుందాం’ అని కామెంట్స్ చేశారు.
అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు: 44 సీట్లలో బీజేపీ విజయం
Counting Updates అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయంఅరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 44 సీట్లలో విజయం2 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోందినేషనల్ పీపుల్స్ పార్టీ 5 సీట్లలో గెలుపు10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమేజిక్ ఫిగర్ స్థానాలు 30పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 సీట్లలో గెలుపునేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 1 స్థానం గెలుపు , 2 ముందంజ ఇండిపెండెంట్లు 3 గెలుపు సిక్కింలో అధికార కాంత్రికారి మోర్చా ఘన విజయంసిక్కింలో సిక్కిం కాంత్రికారి మోర్చా పార్టీ 26 సీట్లలో విజయం5 స్థానాల్లో సీకేఎం లీడింగ్మేజిక్ ఫిగర్ 17 సీట్లుసిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 1 స్థానం గెలుపుసిక్కిం సీఎం, ఎస్కేఎం చీఫ్ సీఎస్ ప్రేమ్ సింగ్ తమంగ్ రెనోక్ స్థానంలో 7044 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిక్కింలో సిక్కిం కాంత్రికారి మోర్చా పార్టీ దూసుకుపోతోంది11 సీట్లలో సీకేఎం పార్టీ విజయం20 స్థానాల్లో సీకేఎం లీడింగ్‌సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఒక్కస్థానంలో లీడింగ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది26 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోంది10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీనేషల్ పీపుల్స్ పార్టీ 6 స్థానాల్లో లీడిండ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ 18 సీట్లలో విజయం సాధించింది28 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతోందినేషల్ పీపుల్స్ పార్టీ 6 స్థానాల్లో లీడిండ్‌నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ముందంజపీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 స్థానాల్లో లీడింగ్10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీ#WATCH | Celebration begins at the BJP office in Itanagar as the party is set to return to power in Arunachal Pradesh The ruling BJP crossed the halfway mark; won 17 seats leading on 29. National People's Party is leading on 6 seats. The majority mark in the State Assembly is… pic.twitter.com/GEEfXggrEO— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోందిసిక్కిం క్రాంతికారి మోర్చా రెండు స్థానాల్లో గెలుపు29 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ఒక్క స్థానంలో లీడింగ్‌లో ఉంది.#WATCH | Sikkim: Pintso Namgyal Lepcha from the Sikkim Krantikari Morcha (SKM) wins from the Djongu Assembly constituency He says, "I thank all the voters who supported me and made me win with a huge margin. I also thank my party president who gave me the ticket..." pic.twitter.com/BHVMQJvwB2— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోందిఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్‌కేఎంసిక్కిం సీఎం, ఎస్కేఎం చీఫ్ సీఎస్ తమంగ్ గోలే.. సోరెంగ్-చకుంగ్, రెనోక్ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.తమంగ్ గోలే భార్య కృష్ణ కుమారి రాయ్ నామ్చి-సింగితాంగ్‌లో ముందంజలో ఉన్నారు.Sikkim CM and Sikkim Krantikari Morcha (SKM) chief Prem Singh Tamang, who is contesting the Assembly elections from Rhenock and Soreng-Chakung seats, is leading on both the seats.SKM crossed the halfway mark; leading on 29 seats. The majority mark in the Sikkim Assembly is 17… pic.twitter.com/1NIYCEmihZ— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్ లో దూసుకుపోతున్న కమలం10 స్థానాలు ఏకగ్రీవంగా గెలిచిన బీజేపీమిగిలిన 50 స్థానాల్లో 29 చోట్ల కమలం హవామొత్తం 39 సీట్లలో బీజేపీ ఆధిక్యం8 చోట్ల లీడింగ్ లో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీకాంగ్రెస్ ఒకచోట మాత్రమే ఆధిక్యంసిక్కింలో మరోసారి అధికారం దిశగా సిక్కిం క్రాంతికారి మోర్చాఏకపక్షంగా దూసుకుపోతున్న ఎస్‌కేఎంసిక్కింలో క్లీన్ స్వీప్ చేసే దిశగా క్రాంతికారి మోర్చా పార్టీమొత్తం 32 సీట్లకుగాను 29 స్థానాల్లో ఎస్కేఎం ఆధిక్యంఒక స్థానంలో ఎస్ డీఎఫ్ లీడింగ్ అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.సంగం సీట్లలో బీజేపీ ముందంజఇప్పటికే 10 సీట్లలో ఏకగ్రీవం, 27 స్థానాల్లో లీడింగ్‌నేషల్ పీపుల్స్ పార్టీ 8 స్థానాల్లో లీడిండ్‌నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ముందంజమ్యాజిక్ ఫిగర్ 31 స్థానాల్లో గెలుపు#WATCH | Arunachal Pradesh: Counting of votes for Assembly elections underway; visuals from a counting centre in Yingkiong The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 27. National People's Party is leading on 8 seats, Nationalist Congress Party on 3 seats.… pic.twitter.com/z53MEaw4aI— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 33 స్థానాల్లో ముందంజ నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్పీఈపీ) 8 సీట్లలో లీడింగ్‌పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాల్( పీపీఏ) 3 స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో లీడింగ్‌ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో లీడింగ్Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. The ruling BJP crossed the halfway mark; won 10 seats leading on 23. National People's Party is leading on 8 seats, People's Party of Arunachal on 3 seats. The majority mark in the State Assembly is 31… pic.twitter.com/b1buWSfVIo— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 23 స్థానాల్లో ముందంజ నేషనల్ పీపుల్స్ పార్టీ( ఎన్పీఈపీ) రెండు సీట్లలో లీడింగ్‌పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాల్( పీపీఏ) రెండు స్థానాల్లో లీడింగ్‌కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో లీడింగ్‌ఇండిపెండెంట్ ఒక స్థానంలో లీడింగ్Counting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, the BJP is leading on 13 seats. National People's Party is leading on 2 seats, People's Party of Arunachal on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.… pic.twitter.com/1gF6b7q5O9— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఎస్‌కేఏం భారీ లీడింగ్‌లో దూసుకుపోతోంది.సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఏం) 24 స్థానాల్లో ముందంజలో ఉంది.సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ఒక స్థానంలో లీడింల్ ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్‌లో కౌంటింగ్ కొనసాగుతోందిబీజేపీ ఆరు స్థానాల్లో ముందంజలో కొగనసాగుతోంది.నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీఈపీ) 2 సీట్లలో లీడింగ్‌లో ఉంది.స్వతంత్ర అభ్యర్థి స్థానం ఒకటి లీడింగ్‌లో కొనసాగుతోందిCounting of votes underway for the Arunachal Pradesh Assembly elections. As per ECI, BJP is leading on 6 seats. National People's Party is leading on 2 seats. The majority mark in the State Assembly is 31 out of 60 Assembly seats.The BJP has already won 10 seats unopposed. pic.twitter.com/ysB0JSFmQo— ANI (@ANI) June 2, 2024 సిక్కింలో కౌంటింగ్ కొనసాగుతోంది. సిక్కిం క్రాంతికారి మోర్చా( ఎస్‌కేఏం) ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది.ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 17 కాగా మొత్తం సీట్లు 32Counting of votes underway for the Sikkim Assembly electionsRuling Sikkim Krantikari Morcha (SKM) crosses the halfway mark; leading on 24 seats. The majority mark in the Sikkim Assembly is 17 out of 32 Assembly seats. pic.twitter.com/6cvVzrSsYl— ANI (@ANI) June 2, 2024 అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైందిCounting of votes underway for the Assembly elections in Arunachal Pradesh and Sikkim.In Arunachal Pradesh, the BJP has already won 10 seats unopposed in the 60-member assembly pic.twitter.com/Sq96QH4cnS— ANI (@ANI) June 2, 2024సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.ఆదివారం ఉదయం ఆరు గంటల కల్లా ఓట్ల లెక్కింపు మొదలయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది.60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈవీఎంలలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలనుంది. తక్కువ స్థానాలు కావడంతో ఆదివారం మధ్యాహ్నంకల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) పవన్‌కుమార్ సైన్ శనివారం చెప్పారు. సిక్కింలోనూ.. సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మరోసారి అధికారం చేపట్టాలని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) ఉవ్విళ్లూరుతుండగా ఎలాగైనా విజయం సాధించాలనిసిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్), బీజేపీ, కాంగ్రెస్, సిటిజెన్ యాక్షన్ పార్టీ–సిక్కిం ఆశపడుతున్నాయి. ఈసారి ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 146 మంది అభ్యర్థులు ఈసారి పోటీపడ్డారు.
వైఎస్సార్సీపీదే ఏపీ.. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తూ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సింహభాగం మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచి్చన విప్లవాత్మక మార్పులకు జనం జై కొట్టారని స్పష్టం చేశాయి. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కంటే మహిళలు 12 శాతం అధికంగా వైఎస్సార్సీపీకి ఓట్లు వేసి, ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడానికి దోహదం చేశారని ఆరా (మస్తాన్), చాణక్య (పార్థదాస్) తేల్చాయి. జాతీయ, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ సర్వేలను క్రోడీకరించి శనివారం ఫలితాలను వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆరా సంస్థ అధినేత మస్తాన్ నిర్వహించే సర్వే, ఎగ్జిట్ పోల్స్‌కు అత్యంత విశ్వసనీయత ఉంది. గతేడాది ఆఖర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని.. కామారెడ్డిలో అప్పటి సీఎం కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంతరెడ్డిలు ఇద్దరూ ఓడిపోతారని.. బీజేపీ అభ్యర్థి కె.వెంకటరమణారెడ్డి విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ సర్వేలో బల్లగుద్ది చెప్పారు. ఎన్నికల ఫలితాల్లో అదే వెల్లడైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ సర్వేను ఆరా మస్తాన్ విస్తృత స్థాయిలో నిర్వహించారు. 49.41 శాతం (మహిళలు 54.76 శాతం, పురుషులు 45.35 శాతం) ఓట్లతో 94 నుంచి 104 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్ సర్వేల్లో వెల్లడైందని ఆరా మస్తాన్ వెల్లడించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి 47.55 శాతం ఓట్లతో 71–81 శాసనసభ స్థానాలకే పరిమితం అవుతుందని తేల్చి చెప్పారు. లోక్‌సభ స్థానాల్లో 13–15 సీట్లలో వైఎస్సార్సీపీ, 10–12 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించారు. సీఎం జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలు.. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు అందించడం వైఎస్సార్సీపీ ఘన విజయానికి దోహదం చేశాయని ఆరా మస్తాన్ స్పష్టం చేశారు. మహిళలు సీఎం జగన్ నాయకత్వానికి బ్రహ్మరథం పట్టడం వల్ల ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చి చెప్పారు. ప్రతిష్టాత్మక చాణక్య సంస్థ అధినేత పార్థదాస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లోనూ అదే వెల్లడైంది. 50 శాతం ఓట్లతో 110–120 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి, అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమి 55–65 స్థానాలకే పరిమితమవుతుందని స్పష్టం చేశారు. ఆత్మసాక్షి, రేస్, ఆపరేషన్ చాణక్య, పోల్ స్ట్రాటజీ, అగి్నవీర్, పోల్ లాబొరేటరీ, జన్మత్ పోల్, సీపీఎస్ తదితర సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని వెల్లడైంది. కాగా, టైమ్స్ నౌ ఈటీజీ సంస్థ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లలో వైఎస్సార్సీపీ 11 సీట్లలో కూటమి విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 120కి పైగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని మరోమారు అధికారం చేపట్టడం ఖాయమని క్యూ మెగా అమేజీ పొలిటికల్ సొల్యూషన్స్ సీఈవో ఖాదర్ ఖాన్ పఠాన్ తెలిపారు. 22 పార్లమెంట్ స్థానాలు పక్కాగా కైవసం చేసుకుంటుందని.. మరో రెండు స్థానాల్లో గట్టి పోటీ ఉందని.. అవి కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీ ఎగ్జిట్ పోల్ సర్వే 2024 రిపోర్టును ఆయన వెల్లడించారు.ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పిన జాతీయ మీడియా లెక్కలు గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తప్పాయి. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా, ఎన్డీటీవీ, ఈటీజీ, జన్‌కీ భాత్, పోల్‌స్టార్, టుడేస్ చాణక్య, మ్యాట్రిజ్, సీ ఓటర్, సీఎన్ఎక్స్, దైనిక్ భాస్కర్ తదితర సంస్థలు తేల్చి చెప్పాయి. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. జాతీయ మీడియా సంస్థలు రాష్ట్రంలో ప్రజల నాడి పట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నది ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలతో నిరూపితమైంది. ఫలితాలు వెల్లడించొద్దంటూ సెఫాలజిస్ట్‌లపై ఒత్తిళ్లు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఏ పార్టీ బలం పుంజుకుంది.. ఏ పార్టీ విజయం సాధిస్తుందన్నది కచి్చతంగా అంచనా వేయగలిగే సెఫాలజిస్ట్‌లు పదుల సంఖ్యలో ఉన్నారు. వారు తమ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి, శనివారం ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. ఆ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడైందని తెలుసుకున్న టీడీపీ నేతలు.. వాటిని వెల్లడించవద్దంటూ సెఫాలజిస్ట్‌లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన ఓ సెఫాలజిస్టు ఫలితాలను తారుమారు చేసి వెల్లడించారు. వైఎస్సార్సీపీ 93 స్థానాల్లో, టీడీపీ కూటమి 80 స్థానాల్లో, ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధిస్తారని తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైతే.. టీడీపీ నేతల ఒత్తిడి తాళలేక వాటిని తారుమారు చేసి చెప్పాల్సి వచ్చిందని వాపోయినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే కౌంటింగ్ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడైనా సరే దొడ్డిదారిన విజయం సాధించడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని మరోసారి నిరూపితమైంది.బీజేపీ వాణి విన్పించిన జాతీయ మీడియా దేశ వ్యాప్తంగా పార్లమెంట్ స్థానాల్లో జాతీయ మీడియా బీజేపీ వాణి వినిపించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సింహభాగం స్థానాల్లో విజయం సాధిస్తుందని.. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పాయి. ఇండియా టుడే, ఎన్డీటీవీ, న్యూస్–18 వంటి జాతీయ మీడియా సంస్థలు ఎన్డీఏకే పట్టం కడుతూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎన్డీఏకు 400 లోక్‌సభ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తే.. ఒకట్రెండు జాతీయ మీడియా సంస్థలు ఎన్డీఏకు 401 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించడం గమనార్హం.
అది నమ్మక ద్రోహమే.. ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల కంప్లైంట్
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. సుమారు 2,000 మంది క్యాంపస్ రిక్రూట్మెంట్లకు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఈ ఐటీ కంపెనీ పదేపదే ఆలస్యం చేస్తోందని, ఇది ఉద్యోగులకు ఆర్థిక, మానసిక ఇబ్బందులను కలిగిస్తోందని యూనియన్ ఆరోపించింది.దీర్ఘకాలిక జాప్యంతో ఆర్థిక ఇబ్బందులుఇన్ఫోసిస్లో రెండేళ్లుగా ఆన్‌బోర్డింగ్ జాప్యం కొనసాగుతోందని, దీంతో బాధితులు అనిశ్చితి, ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని యూనియన్ పేర్కొంది. ‘‘ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లపై ఆధారపడి చాలా మంది ఇతర ఉద్యోగ ఆఫర్లను తిరస్కరించారు. ఇప్పుడు ఆదాయంతోపాటు స్పష్టమైన ఆన్‌బోర్డింగ్ టైమ్‌లైన్ లేకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు, అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు' అని ఎన్ఐటీఈఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ఫోసిస్ చర్యలు తీవ్రమైన నమ్మక ద్రోహాన్ని సూచిస్తున్నాయని, కంపెనీ ద్వారా తమ కెరీర్లు సజావుగా ప్రారంభమవుతాయని యువ నిపుణులు విశ్వసించారని యూనియన్ వాదిస్తోంది.ప్రభుత్వ జోక్యానికి విజ్ఞప్తినియామకాలకు మద్దతు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ఇన్ఫోసిస్ కు ఉందని, దీనిపై జోక్యం చేసుకోవాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఎన్ఐటీఈఎస్ కోరుతోంది. అనిశ్చితి వల్ల ఏర్పడిన మానసిక, భావోద్వేగ ఒత్తిడిని పరిష్కరించాలని, జాప్యం జరిగిన కాలానికి పూర్తి వేతనాలు చెల్లించాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. అంతేకాక, ఆన్‌బోర్డింగ్ ఇలాగే కొనసాగితే, సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కనుగొనడంలో నియామకాలకు ఇన్ఫోసిస్ బాధితులకు సహాయం అందించాలని ఎన్ఐటీఈఎస్ కోరుతోంది.ఇలాంటి అంశాల్లో ఐటీ సంస్థలపై ఎన్ఐటీఈఎస్ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. టీసీఎస్ 200 లేటరల్ రిక్రూట్మెంట్లను ఆలస్యం చేసిందని ఎన్ఐటీఈఎస్ దాఖలు చేసిన ఫిర్యాదుపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గత అక్టోబర్‌లో నోటీసులు జారీ చేసింది. కొత్త నియామకాల్లో జాప్యం దేశీయ ఐటీ సేవల పరిశ్రమలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తోంది. కంపెనీలు క్యాంపస్ నియామకాలను తగ్గించాయి. దీంతో యువ, తక్కువ వేతనంతో కూడిన ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో యువ ఉద్యోగుల నిష్పత్తి టీసీఎస్‌లో ఐదేళ్ల కనిష్టానికి, ఇన్ఫోసిస్‌లో దశాబ్ద కనిష్ఠానికి పడిపోయాయి.
Mahabubnagar MLC Bypoll Updates: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక: కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
counting Updatesమహౠబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయంబీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై గెలుపొందారు.111 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు.బీఆర్ఎస్ 763, కాంగ్రెస్ 652 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్-1 ఓటు వచ్చింది, 21 చెల్లని ఓట్లుగా నిర్ధారణమొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.దీంతో సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు.ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. హరీశ్ రావు శుభాకాంక్షలుమహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్ శుభాకాంక్షలు తెలిపారు. గెలుపుకు కృషి చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఘన విజయం సాధించిన @BRSparty అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. గెలుపుకు కృషి చేసిన బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. pic.twitter.com/6ZWaoUZFxV— Harish Rao Thanneeru (@BRSHarish) June 2, 2024 మహౠబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి విమహౠబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.మొత్తం 1437 మంది ఓట్లను ప్రాధాన్యత క్రమంలో లెక్కిస్తున్నారు.ముగ్గురు అభ్యర్దులు పోటీ పడుతున్నారు.పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మహౠబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది.విస్త్రత ఏర్పాట్లు చేసిన అధికారులుపోటీలో ముగ్గురు అభ్యర్దులుబీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి బరిలో నిలిచారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.గత మార్చి28న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మొత్తం 1437 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 14 మంది ఎమ్మెల్యేలు, 83 మంది జడ్పీటీసీలు, 888 మంది ఎంపీటీసీలు, 449 మున్సిపల్ కౌన్సిలర్లు ఓటేశారు.ఇద్దరు ఎంపీటీసీలు తమ వ్యక్తిగత కారణాలతో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.మార్చి 28నే పోలింగ్ జరిగినా.. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఫలితాలను నేటికి (జూన్ 2) వాయిదా వేసింది.దీంతో నేడు వెలువడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలపై ఇరు పార్టీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. ‘కల్కి’ ప్రపంచం ఇలా ఉంటుందా?
యావత్ సీనీ ప్రపంచం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘కల్కి 2989 ఏడీ’ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ మూవీ ప్రచారాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ వినూత్నంగా ప్లాన్ చేశాడు. ప్రధాన పాత్రలు..వాటి నేపథ్యాన్ని ముందే ప్రేక్షకులను తెలిసేలా చేస్తున్నాడు. ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న ‘బుజ్జి’(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆలోచించే మెషీన్) పరిచయం కోసం ఓ ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేయడమే కాకుండా.. బుజ్జిని దేశంలోని ప్రధాన నగరాలలో తిప్పుతూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నాడు. అంతేకాదు బుజ్జి, భైరవ(ప్రభాస్) ఎలా కలిశారనేది తెలియజేయడానికి ఓ యానిమేటెడ్ సిరీస్‌ని కూడా రూపొందించారు. ‘బుజ్జి అండ్ భైరవ’ పేరుతో తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్..ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 31 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ యానిమేటెడ్ సీరిస్ ఎలా ఉందో చూద్దాం.‘బుజ్జి అండ్ భైరవ’కథేంటంటే..కల్కి సినిమాలోని ప్రధాన పాత్రలైన ‘బుజ్జి’, ‘భైరవ’లను పరిచయం చేస్తూ ఈ సిరిస్ సాగుతుంది. BU- JZ- 1 అనే కోడ్ నేమ్‌తో ఉన్న ఏఐ మిషన్(కీర్తి సురేశ్) చాలా ఏళ్లుగా కార్గో వెహికల్లో పని చేస్తుంటుంది. సరైన గైడెన్స్ ఇస్తూ 99 మిషన్స్ విజయవంతంగా పూర్తి చేస్తుంది. అయితే చివరగా 100వసారి కార్గో డెలివరీ చేసేందుకు వెళ్తుండగా.. ఓ దాడి జరుగుతుంది. రెబల్స్ అటాక్‌లో బుజ్జి ఉన్న వెహికల్ ధ్వంసం అవుతుంది. దీంతో బుజ్జికి కాంప్లెక్స్ సిటీతో ఉన్న కనెక్షన్ కట్ అయిపోయి స్క్రాప్‌లోకి వెళ్లిపోతుంది. మరోపక్క భైరవ(ప్రభాస్) కాశీ పట్టణంలో సరదాగా తిరుగుతూ దొంగలను, దోపిడీదారులను పట్టుకొని యూనిట్స్(2898సంవత్సరంలో డబ్బు) సంపాదిస్తుంటాడు. ఎప్పకైనా కాంప్లెక్స్‌కు షిప్ట్ కావాలనేది అతని కోరిక. కానీ భైరవ ఏ పని చేసినా..నష్టాలే తప్ప లాభాలు రావు. అద్దె కూడా సరిగా చెల్లించకపోవడంతో యజమాని(బ్రహ్మానందం) ఇంటిని ఖాలీ చేయమని పోరు పెడుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో భైరవ చేతికి బుజ్జి దొరుకుతుంది. బుజ్జి ఇచ్చే సలహాలతో ఓ స్పెషల్ కారును తయారు చేస్తాడు? ఆ తర్వాత ఏం జరిగింది? ఆ స్పెషల్ కారుని బుజ్జి ఎందుకు రెడీ చేయించింది? కాంప్లెక్స్‌కి వెళ్లాలనే భైరక కోరిక నెరవేరిందా లేదా? భైరవను బుజ్జి ఎందుకు మోసం చేయాలనుకుంది? అనేది తెలియాలంటే అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో పూర్తి సిరీస్ చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ‘కల్కి’లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ ప్రేక్షకులకు అంత ఈజీగా అర్థం కావు. ఇందులోని పాత్రలు..వాటి నేపథ్యం గురించి ముందే కొంచెం తెలిసి ఉంటే..సినిమా చూసినప్పుడు వాటితో కనెక్ట్ అవుతూ ఎంజాయ్ చేస్తుంటాం. అందుకే ఇలాంటి లార్జర్ దేన్ లైఫ్ సినిమాల్లోని పాత్రలను, స్టోరీని ముందే చెబుతూ టీజర్, ట్రైలర్లను కట్ చేస్తుంటారు మేకర్స్. సినిమా ప్రమోషన్స్‌లో కూడా ప్రధాన పాత్రల ప్రవర్తన ఎలా ఉండబోతుందో చెప్పేస్తుంటారు. ‘బాహుబలి’సమయంలో రాజమౌళి ఇలానే చేశాడు. సినిమా కథ, అందులోని పాత్రలను ప్రేక్షకులను ముందే చేరువయ్యేలా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపట్టి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా అదే ఫాలో అవుతున్నాడు. ‘కల్కి’ సినిమా స్టోరీ ఏంటి? బుజ్జి, భైరవ పాత్రల స్వభావం ఏంటి? అనేది ముందే చెప్పేస్తున్నాడు. ప్రధాన పాత్రలపై ఎలాంటి సందేహాలు రాకుండా ముందే ఓ సిరీస్‌ని వదిలి మంచి పని చేశాడు. యానిమేటెడ్ రూపంలో తీసుకొచ్చిన ఈ సిరీల్లో బుజ్జి, భైరవ పాత్రలు..వాటి స్వభావం ఎలా ఉంటుందనేది వినోదాత్మకంగా చూపించారు. అంతేకాదు కల్కి ప్రపంచం ఎలా ఉండబోతుందనేది కొన్ని సీన్లలో చూపించారు. 2898 సంవత్సరంలో డబ్బుని యూనిట్స్ అంటారని చెబుతూనే.. ఆ కాలంలో నిర్మాణాలు ఎలా ఉండబోతున్నాయనేది చూపించారు. ప్రభాస్ పాత్రకు యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోడించడం బాగుంది. మధ్య మధ్యలో బ్రహ్మానందం చేసే కామెడీ డైలాగ్స్ నవ్వులు పూయిస్తుంది. మొదటి ఎపిసోడ్లో బుజ్జి, భైరవ పాత్రలను పరిచయం..వాటి నేపథ్యాన్ని చూపించి..రెండో ఎపిసోడ్లో వారిద్దరు కలిసి ఏం చేశారనేది చూపించారు. తన సినిమా కాన్సెప్ట్ ఏంటనేది ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ఇందులో కల్కి చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌ల గురించి ప్రస్తావననే లేదు. వారిద్దరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయనేది ఇందులో చూపించలేదు. కానీ ఓ సీన్లో భారీ విగ్రహాన్ని చూపించారు. అది కమల్ హాసన్‌ని పోలి ఉంది. ఆ విగ్రహం స్టోరీ ఏంటనేది ప్రమోషన్స్‌లో చెబుతారో లేదా డైరెక్ట్‌గా సినిమా చూసే తెలుసుకోమంటారో చూడాలి. టెక్నికల్ పరంగా కూడా ఈ సిరీస్ చాలా బాగుంది. సినిమాటోగ్రపీ, బీజీఎం అదిరిపోయింది. మొత్తానికి 28 నిమిషాల నిడివి ఉన్న ఈ యానిమేటెడ్ సిరీస్ ‘కల్కి 2898’ ప్రపంచం ఎలా ఉండబోతుందో తెలియజేస్తుంది.
ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా ఉద్వేగం
‘‘ఏదేమైనా యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత మనం అక్కడే ఉండి పోరాడాలి. ఒక్కోసారి జీవితం మనల్ని విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది.అయితే, నేను మాత్రం ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఆటను వదిలిపెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకున్నా. ఒకవేళ యుద్ధ రంగంలో వెన్నుచూపితే మనం అనుకున్న ఫలితాలు రాబట్టలేం కదా!ఇక్కడ కూడా అంతే.. ఆట ద్వారా మనమేం పొందాలనుకుంటున్నామో.. వాటిని సాధించాలంటే కాస్త ఓపికగా ఎదురుచూడాలి. ఒక్కోసారి అది చాలా కష్టంగా ఉంటుందన్న మాట వాస్తవం.అయితే, నేను ఎప్పుటికప్పుడు మా మనసుని తేలిక చేసుకుంటాను. అంతకు ముందు ఎలా ఉన్నానో.. క్లిష్ట పరిస్థితుల్లోనూ అలాగే ఉండేందుకు ప్రయత్నిస్తాను.జీవితంలో మంచి రోజులు, గడ్డు పరిస్థితులు.. వస్తూ పోతూ ఉంటాయి. నేను ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. వాటిని దాటుకుని విజయవంతంగా ముందడుగు వేశాను.నిజానికి నేను సక్సెస్‌ను అంత సీరియస్‌గా తీసుకోను. నేను బాగా ఆడిన రోజును మర్చిపోతాను. అదే విధంగా.. చేదు అనుభవాలను కూడా!అలా అని పరిస్థితుల నుంచి పారిపోను. ధైర్యంగా వాటిని ఎదుర్కొంటాను. ఏదో ఒకరోజు వాటి నుంచి బయటపడతాను. ఆట, నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ.. కఠిన శ్రమకోరుస్తూ ముందుసాగితే తప్పకుండా ఫలితం ఉంటుంది.అలాగే ఎల్లప్పుడూ చిరునవ్వును మాత్రం వీడకూడదు’’ అంటూ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ మధ్యలోనే గాయపడిన పాండ్యా మిగతా మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే.విమర్శల వర్షంఈ క్రమంలో ఐపీఎల్-2024 ద్వారా పునరాగమనం చేసిన ఈ బరోడా క్రికెటర్.. ముంబై కెప్టెన్‌గా కొత్త బాధ్యతలు చేపట్టాడు. అయితే, రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా రావడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు అతడిపై ఆగ్రహం వెళ్లగక్కారు.స్టేడియంలో, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ హార్దిక్ పాండ్యాపై విరుచుకుపడ్డారు. ఇక కెప్టెన్‌గానూ హార్దిక్ విఫలం కావడంపై అతడిపై విమర్శల వర్షం కురిసింది. అతడి సారథ్యంలో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిపోయింది.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 జట్టులో స్థానమే ప్రశ్నార్థకమైన వేళ.. బీసీసీఐ సెలక్టర్లు హార్దిక్ పాండ్యాపై నమ్మకం ఉంచి ఏకంగా వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.మొత్తంగా 23 బంతులు ఎదుర్కొని 40 పరుగులతో అజేయంగా నిలిచి ఈ పేస్ ఆల్‌రౌండర్.. తదుపరి ఒక వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా తాను ఫుల్ ఫామ్‌లోకి వచ్చినట్లేనని పాండ్యా సంకేతాలు ఇచ్చాడు.భార్యతో విభేదాలు.. విడాకులంటూ ప్రచారంకాగా ఐపీఎల్-2024లో చెత్త ప్రదర్శన ద్వారా విమర్శలపాలైన హార్దిక్ పాండ్యా.. వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. భార్య నటాషా స్టాంకోవిక్‌తో అతడికి విభేదాలు తలెత్తాయని.. ఈ క్రమంలో ఆమె విడాకులకు అప్లై చేసిందనే ప్రచారం జరుగుతోంది.అంతేకాదు భరణంగా హార్దిక్ పాండ్యా ఆస్తిలో డెబ్బై శాతం వాటా కూడా నటాషాకు లభించనుందని సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. కాగా సెర్బియా మోడల్ నటాషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా.ఈ జంటకు కుమారుడు అగస్త్య సంతానం. ఎంతో అన్యోన్యంగా ఉండే హార్దిక్- నటాషా విడిపోతున్నారనే వార్తలు అభిమానులను కలవర పెడుతున్నాయి. ఇక వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ షోలో పైవిధంగా ఉద్వేగ పూరితంగా మాట్లాడటం గమనార్హం.చదవండి: రోహిత్, విరాట్ భార్యలను గమనిస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి: సీఎం రేవంత్
Live Updates..👉 పరేడ్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్చపై దాడి జరిగింది.పాలనను ప్రజల వద్దకు తెచ్చాం.మన సంస్కృతి, చరిత్ర గొప్పది.ప్రతిపక్షాలకు గౌరవం ఇచ్చాం.తల్లిని ఆహ్వానించేందుకు అనుమతి కావాలా.తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన సోనియా, మన్మోహన్‌కు కృతజ్ఞతలు.ప్రజా ప్రభుత్వం జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది.బానిసత్వాన్ని తెలంగాణ భరించదు.ముళ్ల కంచెలు, ఇనుప గోడలను తొలగించాం.సచివాలయానికి సామాన్యుడు వచ్చేలా చేశాం.గత పదేళ్లలో స్వేచ్చపై దాడి జరిగింది.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. తెలంగాణ వచ్చి పదేళ్ల అయినా ఇప్పటి వరకు రాష్ట్ర గీతం లేదు.తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తున్నాను.రాష్ట్ర చిహ్నంలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించాలి.చిహ్నం ఓ జాతి చరిత్రకు అద్దం పడుతుంది. రాష్ట్ర అధికారిక చిహ్నన్ని రూపొందించే పనిలో ఉన్నాం. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తాం.ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసేందుకు అనుమతి ఇచ్చాం.ఆరోగ్యశ్రీని వైఎస్సార్ తరహాలో అమలు చేస్తాం. 👉నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. ఆరు దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధాన మంత్రి శ్రీ మన్మోహన్ సింగ్, నాటి యూపీఏ ఛైర్ పర్సన్ శ్రీమతి సోనియాగాంధీలకు తెలంగాణ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ.. అందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.👉స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం. ఆకలినైనా భరిస్తాం కానీ, స్వేచ్ఛను హరిస్తే సహించం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజాణే కానీ.. అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనకు ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు."ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమికొడతాం.. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతిపెడతాం" అన్న కవి కాళోజీ మాటలు అక్షర సత్యాలు.👉డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన ప్రజా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. ముళ్ల కంచెలు, ఇనుప గోడలు తొలగించాం. పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం. మున్సిపల్ కౌన్సిలర్ నుండి... ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం. మేం సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించాం. ప్రగతి భవన్‌ను మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా పేరు మార్చి.. ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. అక్కడ ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 👉 ప్రజల సమస్య నేరుగా విని, పరిష్కరిస్తున్నాం. సచివాలయంలోకి ఈ రోజు సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చాం. ఇందిరాపార్కులో ధర్నాచౌక్‌కు అనుమతి ఇచ్చాం. మీడియాకు స్వేచ్ఛను ఇచ్చాం. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే సర్వ జ్ఞానులం అన్న భ్రమలు లేవు. అందరి సలహాలను, సూచనలను స్వీకరించి, చర్చించి ముందుకు వెళుతున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వ ప్రాధాన్యత.👉జూన్ 2, 2014 నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరింది. అంతటితో మనం లక్ష్యాన్ని చేరినట్టు కాదు. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుంది. దశాబ్ద కాలం అన్నది ఒక మైలురాయి. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చడంలో మనం ఎక్కడ ఉన్నాం అన్నది సమీక్షించుకోవాల్సిన సందర్భం ఈ దశాబ్ది ఉత్సవం. నేను రాజకీయ విమర్శల జోలికి పోను కానీ, చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్‌కు పునాదులు వేసుకోగలం. తప్పొప్పులను గుర్తించి, దిద్దుబాటు చేసుకోవడం విజ్ఞుల లక్షణం.👉 పదేండ్ల పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైంది. భౌతిక విధ్వసం మాత్రమే కాదు. తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛ పై దాడి జరిగింది. సామాజిక న్యాయం మేడిపండు చందంగా మారింది. ప్రజలందరికీ చెందాల్సినరాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కర్లేదు. ఇది గతం. ప్రజలే, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. ప్రజా ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది.👉 తెలంగాణ ప్రదాత, మనకు మాతృ సమానురాలైన శ్రీమతి సోనియాగాంధీ గారిని ఈ పండుగకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాం. ఏ హెూదాలో సోనియాగాంధీ గారిని ఆహ్వానించారని అడుగుతున్నారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హెూదా కావాలా?! తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్ అవసరమా?! ఏ హెదా ఉందని, ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మనం జాతిపితగా గుర్తించుకున్నాం?! తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు శ్రీమతి సోనియాగాంధీని ఈ సమాజం తల్లిగా గుర్తించి, గౌరవిస్తుంది. ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీయాలకు అతీతం.👉 దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో... అమరుల ఆశయాలు, ప్రజల కలలు నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.1. సాంస్కృతిక పునరుజ్జీవనం2. ఆర్థిక పునరుజ్జీవనంఈ రెండు ఇప్పుడు తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి కీలకాంశాలు. ఆ దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తోంది.👉ఏ జాతికైనా తన సంస్కృతే తన అస్తిత్వం. ఆ సంస్కృతిని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. బోనం నుండి బతుకమ్మ వరకు... సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర ఉద్యమం వరకు మన సంస్కృతి, మన చరిత్ర గొప్పవి. సమ్మక్క సారలమ్మ నుండి జోగులాంబ వరకు... భద్రాద్రి రాముడు నుండి కొమురం భీం వరకు, అమరుల త్యాగాలు, హక్కుల ఉద్యమాల వంటి వాటితో తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ సంస్కృతికి, చరిత్రకు పునరుజ్జీవనం జరగాలి.👉తెలంగాణ వచ్చి పదేండ్లైన ఇప్పటికీ మనకు రాష్ట్ర గీతం లేదు. ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగిలించిన.. "జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం..." గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆ నాడు ఆశించాం. సహజ కవి అందెశ్రీ రచించిన ఈ గేయం మన రాష్ట్ర గేయంగా ఉంటుందని విశ్వసించాం. ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వదినాన "జయ జయహే తెలంగాణ..." గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నాం. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనానికి తొలి అడుగు.👉 చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దంపడుతుంది. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమే. తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలి. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది. వివిధ వర్గాల నుండి వచ్చిన సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుని నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నాం.👉 అదే విధంగా.. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు, సంస్థల సంక్షిప్త పేర్లు, వాహన రిజిస్ట్రేషన్ లో రాష్ట్రాన్ని సూచించే సంక్షిప్త అక్షరాలుగా TG ఉండాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యమ సమయంలో TG నే రాష్ట్ర సంక్షిప్త అక్షరాలుగా ప్రజలు నిర్ధారించుకున్నారు. యువత తమ గుండెలపై TG అక్షరాలను పచ్చబొట్లుగా పొడిపించుకున్నారు. వారి ఆకాంక్షల మేరకు TS స్థానంలో TG ని పునరుద్ధరిస్తు ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.👉జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ... అంటే, జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవి అని అర్థం. తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా ఉండాలి. ఆ తల్లిని చూస్తే... మన కన్నతల్లి యాదిలోకి రావాలి. సగటు తెలంగాణ గ్రామీణ మహిళ రూపమే... తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి... కరుణామూర్తి. ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలి. త్వరలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపం సిద్ధం అవుతుంది. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగం.ఈ నిర్ణయాలు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఒక జాతి ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమే.👉ఆర్థిక పునరుజ్జీవనం :రాష్ట్ర సంపద పెంచి, పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉంది. మేం అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై ఉంది. 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ ఉంది. శాసనసభలో శ్వేత పత్రం పెట్టి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాం. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే సంక్షేమం, అభివృద్ధిలో రాజీ పడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మొదటి తారీఖునే వేతనాలు ఇస్తున్నాం..👉గ్రీన్ తెలంగాణ 2050 స్వల్పకాలిక ఆలోచనలు కాదు... దీర్ఘ కాలిక ప్రణాళికలతో భవిష్యత్ కు పునాదులు వేస్తున్నాం. మొత్తం తెలంగాణకు "గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్” తయారు చేస్తున్నాం. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతం సబ్ అర్బన్ తెలంగాణ, రీజినల్ రింగ్ రోడ్డు నుండి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం. మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి... ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటిస్తాం.👉 మూసీ సుందరీకరణ..మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా తీర్చిదిద్దబోతున్నాం. దీని కోసం ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ఈ పథకం మరోస్థాయికి తీసుకువెళ్లుతుందనడంలో సందేహం లేదు. పర్యాటకం, ఆర్థికం, పర్యావరణం ఈ మూడు కోణాలు ఇందులో ఉన్నాయి. ఎగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలలో సాగునీటి వనరుగా కూడా మూసీ ఉపయోగపడుతుంది. ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో విస్తరణ ప్రణాళికను ప్రకటించాం. రీజినల్ రింగ్ రోడ్డు త్వరిత గతిన పూర్తికి ప్రయత్నిస్తాం. తక్కువ ఖర్చుతో, ఎక్కువ నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకుంటాం.👉 డ్రగ్స్ పై ఉక్కు పాదం...తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలు లేదని మేం సంకల్పం తీసుకున్నాం. డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. టీ న్యాబ్ కు పూర్తి సహకారం, స్వేచ్ఛ ఇస్తున్నాం. అవసరమైన నిధులు ఇస్తున్నాం. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారు ఉన్నా వదిలే సమస్యే లేదు. ఈ విషయంలో వ్యక్తిగతంగా నేను చాలా పట్టుదలతో ఉన్నాను. ఇది మన యువత భవిష్యత్ కు సంబంధించిన అంశం. అందుకే ఉక్కుపాదంతో అణచివేయాలని సంకల్పించాం. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు ప్రభుత్వ పరంగానే కాదు... వ్యక్తిగతంగా నేను ప్రాధాన్యత ఇస్తున్నాను.👉ఇది ప్రజా పాలన..పాలన ప్రజల వద్దకు చేర్చాలన్నది మా ఆలోచన. ఇందిరమ్మ గ్రామ సభల ద్వారా 2023 డిసెంబర్ 28 నుండి 2024 జనవరి 6 వరకు అభయ హస్తం గ్యారెంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించాం. మహాలక్ష్మీ, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత, రైతు భరోసా పథకాల కోసం ఒక కోటీ 28 లక్షల మంది ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. డూప్లికేట్ దరఖాస్తులు మినహాయించగా కోటి తొమ్మది వేల దరఖాస్తులు మిగిలాయి. ఈ దరఖాస్తులు కంప్యూటరీకరించి, పరిష్కరించే ప్రక్రియ నడుస్తోంది.👉48 గంటల్లో రెండు గ్యారెంటీలు..అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టాం. ఆడబిడ్డలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. పైసా ఖర్చు లేకుండా ఆడబిడ్డలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా వెళ్లే అవకాశం ఈ పథకం కల్పిస్తోంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాం.రాజీవ్ ఆరోగ్య శ్రీ అన్నది కాంగ్రెస్ పేటెంట్. ఈ పథకం ద్వారా తొలి సారి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ పథకం లక్షలాది మంది ప్రాణాలు కాపాడింది. ఈ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి ఐదు లక్షలు ఉన్న పరిధిని డిసెంబర్ 9, 2023 నుండి పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.యువత ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం. 70 రోజుల్లోనే 30 వేల మంది యువతకు ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ నెల తొమ్మిదిన ప్రాథమిక పరీక్ష జరగబోతోంది. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చాం. వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచాం. ప్రభుత్వంలో ఖాళీలను భర్తీ చేస్తాం.ఇందిరమ్మ ఇళ్లు..రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. ఈ ఒక్క ఏడాడే 22,500 కోట్ల రూపాయలు వెచ్చింది... పేదల కోసం 4,50,000 ఇళ్లు నిర్మించబోతున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇవ్వబోతున్నాం. ఇంటి స్థలం లేని వారికి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నాం.విద్యారంగ ప్రక్షాళనతెలంగాణను ఎడ్యూకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలని సంకల్పించాం. ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అధికారుల బృందం ఇప్పటికే ఢిల్లీ, ఒడిస్సా, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి, అధ్యయనం చేసింది.అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 26,825 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్లు నిర్మాణం, మంచినీరు, విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నాం. దీని కోసం 1135 కోట్ల రూపాయలు కేటాయించాం. రాష్ట్రంలోని 50 ఐటీఐలలో సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్ తో ఒప్పందం చేసుకున్నాం.👉రైతును రాజును చేయడం మా సంకల్పంరైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ప్రభుత్వం ఇది. గతంలో రైతుకు ఉచిత విద్యుత్, రుణమాఫీ చేసిన చరిత్ర మాది. ఆ ట్రాక్ రికార్డును ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తోంది. రైతుకు ఆర్థిక సాయం పథకంలో భాగంగా 69 లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం 7,500 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశాం. ఇటీవల అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇచ్చాం. ధాన్యం సేకరణ కోసం 7,245 కేంద్రాలు తెరిచాం. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యం కొంటున్నాం. తరుగు విషయంలో రైతు నష్టపోకుండా చూస్తున్నాం. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాం. వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. ధరణి పోర్టల్ పై స్పెషల్ డ్రైవ్ పెట్టి సమస్యలు పరిష్కరిస్తున్నాం.👉విద్యుత్ సరఫరాలో రికార్డు బ్రేక్రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ విషయంలో ఎవరికీ సందేహాలు అవసరం లేదు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి 6 న అత్యధికంగా 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాం. రికార్డు సృష్టించాం. పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం.👉 తెలంగాణకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు..తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీతెలంగాణ అమరవీరులకు నివాళులుపదేళ్ల కిందట మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ నేతృత్వంలో తెలంగాణ కల నిజమైందిప్రజా తెలంగాణ సాధనకు కట్టుబడి ఉన్నాంఅందరికీ న్యాయం, సమానత్వం, సాధికారత సాధించడమే లక్ష్యం 👉 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా సందేశం..సోనియా గాంధీ వీడియో సందేశం విడుదల చేసిన ప్రభుత్వం.సోనియా గాంధీ కామెంట్స్..తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సొంత రాష్ట్రం తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చింది.తెలంగాణ ప్రజల కళలు నెరవేర్చడం తక్షణ కర్తవ్యం.తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో వెనుకడుగు వేయదు. 👉పరేడ్ గ్రౌండ్లో కోలాహలం..పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి.పరేడ్ గ్రౌండ్లో ప్రారంభమైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుపాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులుహాజరైన సీపీఐ, సీపీఎం, టీజేఎస్ పార్టీల నేతలువేడుకలకు అమరుల కుటుంబ సభ్యులను పిలిచిన ప్రభుత్వంపరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిస్వాగతం పలికిన సీఎస్, డీజీపీ అధికారులుపరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డి 👉అమరులకు సీఎం రేవంత్ నివాళులు..తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు.👉తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులుకేటీఆర్ కామెంట్స్..తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న దశాబ్ది ఉత్సవాలు పండగలా జరుగుతున్నాయి.సీఎం రేవంత్‌కు అవగాహన, పరిపక్వత లేదు.ఛత్తీస్‌గఢ్ అవతరణ సందర్భంగా అక్కడ మూడు రోజులు నిర్వహించారు అక్కడి ముఖ్యమంత్రికానీ పది సంవత్సరాల తెలంగాణను ఒక్క రోజుకు పరిమితం చేశారు ఇక్కడి సీఎం రేవంత్.తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న చరిత్ర, త్యాగాల గురించి రేవంత్ రెడ్డికి తెలియదు.రేవంత్ రెడ్డి ఒక జాక్ పాట్ ముఖ్యమంత్రిఈ రోజు ఉదయం సీఎం రేవంత్ పెట్టిన మెసేజ్‌లో కనీసం జై తెలంగాణ అనని ఒక మూర్ఖుడుకి కేసీఆర్ గురించి, తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. 👉 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ… ఆ పిడికిలి విప్పిచూస్తే… త్యాగం… ధిక్కారం… పోరాటం కనిపిస్తాయి. ఆ స్ఫూర్తితో… ఈ దశాబ్ధ ఉత్సవాల వేళ… “పిడికిలి” బిగించి సంకల్పం తీసుకుందాం… ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతుందని… విశ్వ వేదిక పై సగర్వంగా నిలబడుతుందని… అందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. బిగించిన పిడికిలి లెక్క ఉంటుంది తెలంగాణ…ఆ పిడికిలి విప్పిచూస్తే…త్యాగం…ధిక్కారం…పోరాటం కనిపిస్తాయి. ఆ స్ఫూర్తితో…ఈ దశాబ్ధ ఉత్సవాల వేళ…“పిడికిలి” బిగించి సంకల్పం తీసుకుందాం…ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతుందని…విశ్వ వేదిక పై సగర్వంగా నిలబడుతుందని…అందరికి… pic.twitter.com/09sJMwlyFN— Revanth Reddy (@revanth_anumula) June 2, 2024 తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలువేడుకల్లో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్, కౌన్సిల్ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులుఅసెంబ్లీ కౌన్సిల్లో జాతీయ జెండా ఆవిష్కరణ 👉 తెలంగాణ సెక్రటేరియట్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలుజాతీయ జెండా ఆవిష్కరించిన సీఎస్ శాంతకుమారి,పాల్గొన్న ముఖ్య కార్యదర్శిలు కార్యదర్శిలు అధికారులు సిబ్బంది గాంధీభవన్‌లో ఘనంగా తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలు..హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్.జాతీయ జెండా ఎగరేసిన వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు.కాసేపట్లో గన్ పార్క్ వరకు ర్యాలీగా వెళ్లనున్న కాంగ్రెస్ శ్రేణులు..గన్ పార్క్ అమరవీరుల స్థూపానికి నివాళులు అరిపించనున్న కాంగ్రెస్ నేతలు.. 👉 తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ 13 ఏండ్ల ఉద్యమంతో స్వప్నం సాకారం.. 10 ఏండ్ల కేసీఆర్ పాలనతో ప్రగతి వికాసం.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ప్రయోజనాలను, పదేండ్ల ప్రగతి పాలన ఫలాలను పరిరక్షించుకునేందుకు మరో ఉద్యమ పంథాకు సిద్ధమవుదాంరాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.జై తెలంగాణ ✊… pic.twitter.com/WAmTHKgCEe— BRS Party (@BRSparty) June 2, 2024 👉 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు పలు కార్యక్రమాలు జరుగనున్నాయి.👉 ఆదివారం గాందీభవన్‌లో ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొంటారని వెల్లడించారు. 👉 ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించనున్నారు.👉 అనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం ఉండనుంది.
విజయం సరే... విలువలు?
ఈ నేల మీద భగవంతుడి ప్రస్థానమే రాజ్యం. సుప్రసిద్ధ జర్మన్ తత్త్వవేత్త హెగెల్ చేసిన సూత్రీకరణ ఇది. హెగెల్ నుంచి స్ఫూర్తి పొందిన వారిలో కార్ల్ మార్క్స్ వంటి తత్త్వవేత్తలే కాదు, మన ప్రధాని మోదీ వంటి వారు కూడా ఉన్నారు. ఇది నిన్న మొన్ననే నిగ్గుతేలినటువంటి ఒక నగ్నసత్యం. హెగెల్ సూత్రీకరణను మోదీ మరింత విప్లవీకరించారు.ఒక ప్రత్యేక కార్యం కోసం దేవుడు పంపగా వచ్చిన దూతను తానని ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ దేవుని తరఫున ఈ భూమ్మీద తన ప్రస్థానమే రాజ్యమని ఆయన భావన కావచ్చు. ఇందుకోసం ఆయన ఫ్రాన్స్ చక్రవర్తి పద్నాలుగో లూయీని అరువు తెచ్చుకున్నారు. ‘ఐయామ్ ది స్టేట్’ (నేనే రాజ్యం) అనే కొటేషన్‌తో పద్నాలుగో లూయీ చరిత్రలో నిలబడిపోయిన సంగతి తెలిసిందే.హెగెల్ గతితర్కాన్ని, లూయీ నిరంకుశత్వాన్ని గ్రైండర్లో వేయగా వచ్చిన సింథసిస్‌నే మోదీ తన దేవదూత కార్యంగా ప్రకటించారనుకోవాలి. తాను పొలిటికల్ సైన్స్‌తో ఎమ్మే చదివానని ఏదో సందర్భంలో ఆయనే చెప్పుకున్నారు. కనుక థామస్ హాబ్స్ తత్త్వధారను కూడా ఆయన అనివార్యంగా చదివుండాలి. హాబ్స్ ప్రతిపాదించిన సంపూర్ణ సార్వభౌమాధికార ప్రతిపాదన మోదీ మనసును రంజింపజేసి ఉండవచ్చు.‘‘నేను అందరిలానే పుట్టానని అమ్మ చనిపోయేంతవరకు అనుకునేవాడిని. కానీ, ఆ తర్వాత అర్థమైంది నాకు. దేవుడు ఏదో ప్రత్యేక కార్యం కోసం నన్ను పంపించాడు. నా ద్వారా ఆయన అమలు చేయానుకుంటున్న పథకం సమగ్ర స్వరూపం నాక్కూడా తెలియదు. ఆయన ఆదేశిస్తాడు, నేను అమలు చేస్తాన’’ని ప్రధానమంత్రి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బహుశా దేవుడు ఆశిస్తున్న సమగ్ర పథకాన్ని అమలు చేయాలంటే పార్లమెంట్లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలేమో! అంతవరకే దేవుడు చెప్పి ఉంటాడు. అందుకోసమే ఈ ఎన్నికల్లో ‘అబ్ కీ బార్... చార్ సౌ పార్’ అనే నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. ఆ నినాదం కేవలం దైవ సంకల్పం!అధికారంలోకి రావడానికి సాధారణ మెజారిటీ (272) చాలు. మరి ‘చార్ సౌ పార్’ కోసం ఎందుకింత ధ్యాస. ఎందుకిన్ని ధ్యానాలు, ఎందుకిన్ని దండాలు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాజ్యాంగాన్ని మార్చడానికేనా? రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను ఎత్తివేయడానికా? బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన రాజ్యాంగ ఆదేశాలను తుంగలో తొక్కడానికా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికా?... అవి ప్రతిపక్షాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తాయని కూడా అనుకోవచ్చు.భారీ మెజారిటీ ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉండవచ్చన్నది బీజేపీ నేతల తలపోత కావచ్చు. ఇప్పటికే పట్టుబిగించిన ప్రజాస్వామ్య వ్యవస్థలపై మరింత బిగువుగా పెత్తనం కొనసాగించవచ్చు. ప్రతిపక్షాలను నలిపేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థల స్థాయికి దిగజార్చి కేంద్ర సార్వభౌమాధికారాన్ని పటిష్ఠం చేయవచ్చు. ఏమో... దేవుడు ఆదేశిస్తే పార్లమెంటరీ వ్యవస్థ కొమ్మలు నరికి అధ్యక్ష పాలనను అంటుకట్టవచ్చు. ఈ రకమైన బృహత్కార్యాలను అమలు చేయాలంటే ఎన్డీఏ కూటమికి ఆ మాత్రం మెజారిటీ అవసరమవుతుంది.కానీ, ఎన్డీఏ 400 మార్కును దాటే అవకాశం కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం గతంలో ఉన్న బలాన్నే యధాతథంగా కాపాడుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇది మూడింట రెండొంతుల మెజారిటీకి ఓ రెండడుగుల దూరం. జాతీయ మీడియా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇచ్చిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రచార ఘట్టంలో ఎన్డీఏ నాయకత్వంలో కనిపించిన అసహనం, ప్రతిపక్షాలపై వారు అవధులు దాటి చేసిన ఆరోపణలు, మైనారిటీ మతాన్ని టార్గెట్‌గా చేసుకొని సాగించిన అనైతిక ప్రచారం వగైరాలు మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతాలుగా చాలామంది భావించారు.ప్రతిపక్షాలను నిందించడం కోసం మహాత్మాగాంధీ పేరును మోదీ వాడుకున్న తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ‘గాంధీ సినిమా (1982) వచ్చేవరకూ ఆయన గురించి ప్రపంచంలో పెద్దగా తెలియదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ప్రమోట్ చేయలేదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా కంటే గాంధీ ఏం తక్కువ? వాళ్లకొచ్చినంత పేరు గాంధీకి రాలేదంటే అప్పటి ప్రభుత్వాలే కారణమ’ని ఆయన ఏబీపీ ఇంటర్వ్యూలో ఆక్షేపించారు.ప్రతిపక్షాల మీద ప్రధాని విచక్షణా రహితంగా చేసిన దాడుల్లో భాగంగానే దీన్ని పరిగణించాలేమో! ఎందుకంటే గాంధీకి దేశదేశాల్లో ఉన్న ప్రాచుర్యం గురించి ప్రధానికి తెలియదనుకోవడం నమ్మశక్యంగా లేదు. గాంధీ మరణాన్ని ఆ రోజుల్లోనే సకల దేశాల్లోని వార్తా పత్రికలు బ్యానర్ వార్తగా ప్రకటించాయి. మోదీ ఉదాహరించిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాలే స్వయంగా తాము గాంధీ నుంచి స్ఫూర్తి పొందామని పలుమార్లు ప్రకటించారు. గాంధీ ప్రవచించిన అహింసాయుత ఆందోళనా పద్ధతులనే మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలో ఆచరణలో పెట్టారు.గాంధీ పుట్టిన భారతదేశాన్ని సందర్శించాలన్న ఆకాంక్షను కూడా ఆ రోజుల్లో కింగ్ వెల్లడించారు. పండిత్ నెహ్రూ ఆహ్వానంపై 1956లో ఆయన ఇండియాలో దిగిన వెంటనే చెప్పిన మాట ఎన్నటికీ మరపునకు రాదు. ‘నేను విదేశాలకు పర్యాటకునిగా వెళ్తుంటాను. కానీ, ఈ దేశానికి ఒక యాత్రికునిగా వచ్చాన’న్నారు. అన్యాయానికి, వివక్షకు గురయ్యే సకల దేశాల ప్రజానీకానికి సత్యాగ్రహమనే దివ్యాస్త్రాన్ని ప్రసాదించిన మహాత్మాగాంధీ పుట్టిన దేశం ఆనాటి మహోన్నతుల దృష్టిలో ఒక యాత్రాస్థలమే. నల్ల సూర్యుడు మండేలా కూడా తన స్ఫూర్తిప్రదాతగా గాంధీని పేర్కొన్నారు. ‘గాంధీ ఆఫ్ సౌతాఫ్రికా’గా తనను పరిగణించడాన్ని గర్వంగా భావించారు.రిచర్డ్ అటెన్‌బరో తీసిన సినిమా చూసేవరకూ ప్రపంచానికి గాంధీ తెలియదన్న మోదీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీపై ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ లాంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు, విజ్ఞానులు, దేశాధినేతలు చేసిన వ్యాఖ్యానాలను వారు ఉటంకిస్తున్నారు. ‘ఇటువంటి వ్యక్తి (గాంధీ) ఒకరు ఈ నేల మీద రక్తమాంసాలతో నడయాడాడంటే భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చ’ని ఐన్‌స్టీన్ చెప్పిన మాటలు మనకు సుపరిచితమైనవే. ప్రపంచంలోనే ఆల్‌టైమ్ అగ్రశ్రేణి నవలాకారుడు, రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్ – గాంధీల మధ్యనున్న స్నేహబంధం, నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కూడా ప్రపంచానికి తెలుసు.విఐ లెనిన్, విన్స్టన్ చర్చిల్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, మార్టిన్ లూథర్‌కింగ్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, అడాల్ఫ్ హిట్లర్, మావో జెడాంగ్, నెల్సన్ మండేలా, పండిత్ నెహ్రూ, మదర్ థెరిసా, మార్గరెట్ థాచర్ తదితర శక్తిమంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులు ఇరవయ్యో శతాబ్దాన్ని శాసించారు. వీరందరిలోకి అత్యంత శక్తిమంతుడిగా మహాత్మాగాంధీ గుర్తింపుపొందడమే కాకుండా ఈ జాబితాలోని పలువురి అభిమానాన్ని, గౌరవాన్ని కూడా ఆయన చూరగొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరవయ్యో శతాబ్దం – గాంధీ శతాబ్దం!అటువంటి గాంధీ మహాత్ముడిని సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయారని ప్రధాని వాపోవడం ఒక ప్రకృతి వైచిత్రి. కార్పొరేట్ శక్తులన్నీ కలిసి ప్రమోట్ చేసి గద్దెనెక్కించడానికి ఆయనేమన్నా గుజరాత్ మోడలా? గాంధీ పుట్టింది గుజరాతే. కానీ ఆయన భారతీయ ఆత్మకు ప్రతీక. భారతీయ సహజీవనానికి ప్రతీక. భారతీయ సంస్కృతికి, భారతీయ సమైక్యతకు ప్రతీక. పల్లె స్వరాజ్యాన్ని ప్రేమించినవాడు. ఈశ్వరుడూ – అల్లా ఒకరేనని భజనలు చేసినవాడు. విద్వేషాన్ని ప్రేమతో జయించినవాడాయన. ఆయనే ఒక మూర్తీభవించిన భారతీయత. ఆయనను ప్రభుత్వాలు ప్రమోట్ చేయడమేమిటి? ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంలో ప్రధాని వ్యాకులత చెందడం ప్రజలకు అసహజంగా అనిపించింది.మోదీజీ తీసిన ‘గాంధీ బాణం’ ఎన్నికల కోసమేనన్నది అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆయన ఊహించని కొత్త పుంతలు తొక్కారు. ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ ఊసే లేదు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌పై చర్చే లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని అటకపై నుంచి మళ్లీ కిందికి దించలేదు. విదేశాల నుంచి బ్లాక్ మనీని తీసుకొస్తానన్న పదేళ్ల కిందటి హామీని పొరపాటున కూడా మళ్లీ ప్రస్తావించలేదు. రైతులకు గిట్టుబాటు ధరలపై స్వామినా«థన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని పదేళ్ల కింద ఇచ్చిన హామీకి చెదలు పట్టాయి. కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనకు సమయం సరిపోలేదు.జనజీవన స్రవంతి నుంచి ముస్లిం మతస్థులను వేరు చేసే ప్రయత్నం ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ముమ్మరంగా చేశారు. ఈ విధ్వంసకర ధోరణికి సాక్షాత్తు ప్రధానే నాయకత్వం వహించారు. ప్రతిపక్షాలను ‘ముజ్రా’ డ్యాన్సర్లుగా అభివర్ణించారు. బీజేపీ గెలవకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలు లాగేసుకుంటారని రెచ్చగొట్టారు. ప్రతిపక్షాలు గెలిస్తే హిందువుల మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతారని దారుణమైన ఆరోపణలు చేశారు. సమాజాన్ని విభజించే విత్తన బంతులను య«థేచ్ఛగా వెదజల్లారు. ఈ పని చేసినందుకు యావత్తు భారతదేశం చింతించవలసిన రోజు రావచ్చు. ఇదంతా చేసింది ‘చార్ సౌ పార్’ కోసమేనా?ఒకవేళ ఎన్డీఏ కూటమి 400 సీట్ల మార్కు దాటినా, అందుకు కారణం ఈ విద్వేష ప్రచారం కాబోదు. ప్రత్యామ్నాయ కూటమి సమర్ధతపై జనానికి నమ్మకం కుదరకపోవడం కావచ్చు. ఈసారి కూడా గెలిస్తే నెహ్రూ తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ప్రధానిగా ఆయన రికార్డును మోదీ సమం చేస్తారు. కానీ, జనంలో నాటిన విద్వేష బీజాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయన్నదే బుద్ధిజీవుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com
తప్పక చదవండి
- T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
- వావ్ అనిపించినప్పుడల్లా రూ.500 చేతిలో పెడ్తాడు!
- టీడీపీ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న బాబుపై చర్యలు తీసుకోవాలి
- Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ఊహించని ఫలితాలు
- T20 WC: సిక్సర్ల సునామీ.. క్రిస్ గేల్ తర్వాత ఒకే ఒక్కడు!
- ఒక్క రాత్రిలో భయపెట్టే ది స్ట్రేంజర్స్ : ప్రే ఎట్ నైట్.. ఎలా ఉందంటే?
- ఐసీసీ అవార్డు అందుకున్న కోహ్లి.. వీడియో వైరల్
- ఎగ్జిట్ పోల్స్‌లోనూ వైఎస్సార్సీపీకి సానుకూలత : సజ్జల
- ఐటీలో మేటి..
- South Africa Elections 2024: దక్షిణాఫ్రికాలో వచ్చేది సంకీర్ణమే!
సినిమా
'ఆడిషన్ కోసం వెళ్లి స్వలింగ సంపర్కుడిని కలిశా'.. బిగ్‌బాస్ కంటెస్టెంట్!
బుల్లితెర నటుడు అభిషేక్ కుమార్ ఉదరియాన్ అనే సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది బిగ్‌బాస్ సీజన్-17 షో ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఖత్రోన్ కే ఖిలాడీ -14 అనే షో కనిపించనున్నారు. అయితే టీవీ షోలతో బిజీగా ఉన్న అభిషేక్ ముంబయిలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో జరిగిన షాకింగ్ ఘటనను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లు వివరించారు.అభిషేక్ కుమార్ మాట్లాడుతూ..'నేను 2018లో ముంబయికి వచ్చా. మా ఇంట్లో అబద్ధం చెప్పి వచ్చా. నేను నటుడిని కావాలని వారితో చెప్పినప్పుడు వారికి ఇష్టం లేదన్నారు. దీంతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ముంబయిలో జరిగిన ఆడిషన్లో పాల్గొన్నా. నేను చెత్త ప్రదర్శన ఇచ్చినా నన్ను ఎంపిక చేశాడు. అది చూసిన ఆశ్చర్యపోయా. బహుశా నా గ్లామర్ వల్ల అనుకున్నా. కానీ అదంతా ఫేక్ ఆడిషన్ అని తర్వాత తెలిసింది. అయితే అక్కడ ఓ స్వలింగ సంపర్కుడు నన్ను కలిశాడు. అతను నాతో అనుచితంగా ప్రవర్తించాడు. అతని వల్ల భయంతో ఇంటికి పరిగెత్తా. వెంటనే జనరల్ బోగిలో టికెట్ బుక్ చేసుకుని మరీ తిరిగొచ్చా' అని తన అనుభవాన్ని పంచుకున్నారు.
SSMB 29: మహేశ్ బాబుకి జోడీగా ఆ బాలీవుడ్ బ్యూటీ?
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమా మహేశ్‌బాబు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. మహేశ్‌బాబు లుక్‌ని కూడా మార్చేశాడు. ఈ సినిమా కోసం మహేశ్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. లాంగ్ హెయిర్‌తో హాలీవుడ్ హీరోలా మహేశ్ కనిపించబోతున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా..త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో మహేశ్ సరసన ఓ బాలీవుడ్ భామ నటించబోతుందట. ఆమె ఎవరో కాదు.. దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయ, అందాల తార జాన్వీ కపూర్. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ బ్యూటీ..ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై ఫోకస్ పెట్టింది. దేవర చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాగే రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా జాన్వీనే హీరోయిన్. ఇక ఇప్పుడు మహేశ్-రాజమౌళి చిత్రంలో నటించనుందని తెలుస్తోంది. మహేశ్‌కు జోడీగా జాన్వీ బాగా సెట్ అవుతుందని జక్కన్న భావిస్తున్నాడట. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి నిజంగానే మహేశ్ సరసన నటించే అవకాశం జాన్వీకి వచ్చిందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.
ఒక్క రాత్రిలో భయపెట్టే ది స్ట్రేంజర్స్ : ప్రే ఎట్ నైట్.. ఎలా ఉందంటే?
టైటిల్: ది స్ట్రేంజర్స్ : ప్రే ఎట్ నైట్నటీనటులు: బైలీ మాడిసన్, లెవిస్ పుల్మాన్, క్రిస్టియానా హెండ్రిక్స్, ఎమ్మా బెలోమి, మార్టిన్ హెండర్సన్, డామియన్ మాఫీ, లీ ఎన్స్లిన్ తదితరులుడైరెక్టర్: జోహన్నెస్ రాబర్ట్స్జోనర్: హారర్‌ఓటీటీ: అమెజాన్ ప్రైమ్రన్టైమ్: 1 గంట 25 నిమిషాలుసినీ ప్రేక్షకులు హారర్ చిత్రాలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సస్పెన్స్, క్రైమ్, మిస్టరీ జోనర్ చిత్రాలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా హాలీవుడ్లో హారర్ చిత్రాలకే కొదువే లేదు. ప్రస్తుతం ఓటీటీలు వచ్చాక నచ్చిన సినిమాను ఇంట్లోనే చూసేస్తున్నారు. దీంతో ఆడియన్స్‌కు ఒళ్లు గగుర్పొడ్చేలా లాంటి సినిమాలు సైతం ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటి ది స్ట్రేంజర్స్ ముందువరుసలో ఉంటుంది. అలా 2008లో వచ్చిన చిత్రం ది స్ట్రేంజర్స్. ఈ సినిమాకు సీక్వెల్‌గా 2018లో ది స్ట్రేంజర్స్: ప్రే ఎట్ నైట్ తెరకెక్కించారు. రియల్ స్టోరీ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంతవరకు భయపెట్టిందో రివ్యూలో చూద్దాం.కథంటేంటే..బైలీ మాడిసన్, లెవిస్ పుల్మాన్, క్రిస్టియానా హెండ్రిక్స్, మార్టిన్ హెండర్సన్ నలుగురు సభ్యులు ఓకే కుటుంబం. వీరంతా కలిసి విహారయాత్రకు వెళ్తారు. అక్కడికెళ్లిన వీరికి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఫ్యామిలీ కలిసి సరదాగా వేకేషన్ ఎంజాయ్ చేద్దామనుకున్న వీరిని ముసుగులు ధరించి ఉన్న ముగ్గురు వెంబడిస్తారు. అయితే ఆ ముగ్గురు ఎవరు? అసలు వీళ్లను ఎందుకు చంపడాయనికి వచ్చారు? వీరి నుంచి ఆ ఫ్యామిలీ తప్పించుకుందా? నలుగురు ప్రాణాలతో బయటపడ్డారా? తెలియాలంటే 'ది స్ట్రేంజర్స్ :ప్రే ఎట్ నైట్' చూడాల్సిందే.కథ విశ్లేషణ..హారర్ చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చేది దెయ్యం, భూతం లాంటివే. ఆ జోనర్లో చిత్రాలన్నీ దాదాపు అలాగే ఉంటాయని భావిస్తారు. కానీ ఇందులో మాత్రం ప్రేక్షకులకు సరికొత్త సస్పెన్స్ థ్రిల్‌ను అందించాడు. సినిమా ప్రారంభం నుంచే అసలు అవీ దెయ్యాలా? లేక మనుషులా అనే సస్పెన్స్ ఆడియన్స్‌కు కలిగేలా చూపించాడు. కథ మొత్తం ఆ నలుగురు కుటుంబ సభ్యులు, ముసుగులో ఉన్న ముగ్గురి చుట్టే తిరుగుతుంది.ఆ కుటుంబం వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వచ్చే వయొలెంట్ సీన్స్ వెన్నులో వణుకు పట్టిస్తాయి. క్షణం క్షణం ఏం జరుగుతుందో అనే ఆసక్తిని ఆడియన్స్‌కు కలిగించాడు. ఒకవైపు ప్రాణభయం.. మరోవైపు అంతా చీకటి.. సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్‌లో సస్పెన్స్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. ఈ సినిమా చూసేటప్పుడు ఒక్క రాత్రి ఇంత భయంకరంగా ఉంటుందా? అనే ఫీలింగ్ ఆడియన్స్‌కు రావడం ఖాయం. ఒక రాత్రిని ఓ యుగంలా మార్చిన డైరెక్టర్.. సరికొత్త హారర్ థ్రిల్‌ను అందించాడు. ఇది సీక్వెల్ కావడంతో.. ప్రీక్వెల్ చూసిన వారికి మరింత ఆసక్తిగా ఉంటుంది. చివరగా.. హారర్ జోనర్ ఇష్టపడే సినీ ప్రియులకు ది స్ట్రేంజర్స్: ప్రే ఎట్ నైట్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తక్కువ నిడివిలో హారర్ ఇష్టపడేవారు ఈ సినిమాను ట్రై చేయొచ్చు. అయితే ఈ సినిమా కేవలం ఇంగ్లీష్, హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. హారర్ చిత్రాల్లో ఎక్కువగా డైలాగ్స్ ఉండవు కాబట్టి.. సబ్‌టైటిల్స్‌తోనే చూసేయొచ్చు.
స్టార్ హీరోయిన్‌కు అలాంటి సమస్య.. షాకింగ్ న్యూస్ చెప్పిన భామ!
కోలీవుడ్ భామ శృతిహాసన్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అంతే కాదు క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇండియన్ సినిమాలో ఇక అన్నింటీకీ మించి లోకనాయకుడు కమలహాసన్ కూతురనే బ్రాండ్ కూడా ఉంది. ముఖ్యంగా టాలీవుడ్లో సక్సెస్‌పుల్ హీరోయిన్గా రాణిస్తున్న ఈమె త్వరలో సలార్–2 చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఈమె ప్రేమలోనూ మూడు సార్లు ఫెయిలయ్యారు ముద్దుగుమ్మ. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే శృతిహాసన్ గురించి మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. నటికి పీసీఓఎస్ అనే సమస్య ఉందన్న విషయం షాకింగ్‌కు గురిచేస్తోంది. తనకు బ్యాడ్ పీరియడ్స్ సమస్య ఉందని చెప్పి అందరికీ షాకిచ్చింది భామ. మొదటి పీరియడ్ సమయం నుంచే అది పెద్ద పోరాటంగా మారిందన్నారు. ఆ బాధను ఇప్పటికీ భరిస్తూనే జీవిస్తున్నానని చెప్పారు. బ్యాడ్ పీరియడ్ సమయంలో ఏ పని సరిగా చేయలేకపోతున్నానని చెప్పారు. ఈ కారణంగా చాలా విషయాలను కోల్పోయానని చెప్పారు.కోట్ల రూపాయల ఖర్చుతో చిత్రాలు చేస్తున్న దర్శకులకు తనకు పీరియడ్స్ సమస్య ఉంది షూటింగ్‌ను మరో రోజు పెట్టుకోండి అని చెప్పగలనా? అని శృతిహాసన్ ప్రశ్నించారు. పలువురు నటీనటుల కాల్షీట్స్తో, భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రాల్లో నటించడం వల్ల బాధను భరిస్తూ.. పాటల సన్నివేశాల్లో డాన్స్ చేస్తూ.. కామెడీ సన్నివేశాల్లో నవ్వుతూ నటిస్తున్నానని చెప్పారు.పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువనిజానికి ఇలాంటి సమస్య చాలా మంది స్త్రీలలో ఉంటుంది. వారంతా జీవితంలో సాధిస్తున్నారు. పాలిసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్ ( పీసీఒఎస్) వ్యాధి కారణంగా స్త్రీలు అధిక రక్త స్రావానికి గురవుతుంటారంటారు. ఈ వ్యాధి కలిగిన వారితో చా లామందికి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండదంటారు. ఏదేమైన ఇలాంటి అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు నటి శృతిహాసన్ చెప్పిన విషయం ఆమె అభిమానులను షాక్‌కు గురి చేసింది.
ఫొటోలు
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. సాంగ్స్‌తో జోష్ నింపిన కేటీ పెర్రీ (ఫోటోలు)
Anchor Suma: రెండు జళ్ల సీత.. టాప్ యాంకర్ సుమ కొత్త లుక్ (ఫోటోలు)
త్వరలో పెళ్లి.. వెకేషన్లో చిల్ అవుతున్న సిద్దార్థ్- అదితి (ఫోటోలు)
T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హైదరాబాద్ ఫ్యాషన్ డిజైనర్ అరుణా గౌడ్ (ఫొటోలు)
క్రీడలు
Paris Olympics: ఒలింపిక్స్ బెర్తు ఖరారు చేసుకున్న అమిత్
భారత బాక్సర్ అమిత్ పంఘాల్ పారిస్ ఒలింపిక్స్-2024కు అర్హత సాధించాడు. సెకండ్ వరల్డ్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో చైనా బాక్సర్ చువాంగ్ లియూను ఓడించి విశ్వ క్రీడల్లో పాల్గొనేందుకు బెర్తు ఖరారు చేసుకున్నాడు.బ్యాంకాక్ వేదికగా ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో చువాంగ్‌ను 5-0తో చిత్తు చేశాడు అమిత్ పంఘాల్. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో పోటీ పడేందుకు అర్హత సాధించాడీ వరల్డ్ చాంపియన్‌షిప్స్ రజత పతక విజేత.కాగా భారత్ నుంచి ఈసారి విశ్వ క్రీడల్లో పాల్గొనబోయే రెండో పురుష బాక్సర్‌గా అమిత్ పంఘాల్ నిలిచాడు. ఇక ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌కు నిషాంత్ దేవ్ 71 కేజీల విభాగంలో అర్హత సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు.. మహిళా బాక్సర్లు నిఖత్ జరీన్(50 కేజీలు), ప్రీతి పవార్(54 కేజీలు), లవ్లీనా బొర్గొహెయిన్(74 కేజీలు) ఒలింపిక్ బెర్తులు ఖరారు చేసుకున్నారు.
టీమిండియాతోనూ ఇలాగే ఆడతాం: యూఎస్ఏ కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా జట్టు అదరగొట్టింది. డలాస్ వేదికగా ఆదివారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్‌లో కెనడాను చిత్తుచేసి జయభేరి మోగించింది.వైస్ కెప్టెన్ ఆరోన్ జోన్స్ అద్భుత ప్రదర్శన కారణంగా ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో ఓడించగలిగింది. మెగా టోర్నీ అరంగేట్రంలో తమ తొలి మ్యాచ్‌లోనే దూకుడుగా ఆడి.. విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో యూఎస్ఏ గెలుపుపై ఆ జట్టు కెప్టెన్ మొనాక్ పటేల్ స్పందించాడు.ప్రత్యర్థి పాకిస్తాన్ అయినా.. టీమిండియా అయినా‘‘ఆరోన్ జోన్స్ ఎలా ఆడాతాడో మా అందరికీ తెలుసు. ప్రత్యర్థి ఎవరైనా తను మాత్రం దూకుడుగానే ఆడతాడు. ఈరోజు ఇక్కడ మమ్మల్ని సపోర్టు చేయడానికి చాలా మంది వచ్చారు.టోర్నీలో ఇక ముందు కూడా వారందరూ(ప్రేక్షకులు) మాకు ఇలాగే మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా. ఈ మెగా ఈవెంట్లో మున్ముందు కూడా మేము ఇలాగే ఫియర్లెస్ క్రికెట్ ఆడతాం.ప్రత్యర్థి పాకిస్తాన్ అయినా.. టీమిండియా అయినా మా ఆట తీరులో ఎలాంటి మార్పూ ఉండదు. దూకుడుగానే ముందుకువెళ్తాం’’ అని మొనాక్ పటేల్ చెప్పుకొచ్చాడు.గుజరాత్లో జన్మించిన మొనాక్ పటేల్ కాగా భారత్‌లోని గుజరాత్లో జన్మించిన మొనాక్ పటేల్ అమెరికాలో సెటిలయ్యాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 2019లో యూఎస్ఏ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.ఈ క్రమంలో కెప్టెన్‌గా ఎదిగి వరల్డ్‌కప్‌లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు మొనాక్ పటేల్. ఇక 31 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కెనడాతో మ్యాచ్‌లో తేలిపోయాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు 16 బంతులు ఎదుర్కొని కేవలం 16 పరుగులే చేశాడు. ఇదిలా ఉంటే.. ఇండియా, పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్‌లతో పాటు గ్రూప్-ఏలో ఉన్న యూఎస్ఏ తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్(జూన్ 6)తో తలపడనుంది.టీ20 ప్రపంచకప్-2024 అమెరికా వర్సెస్ కెనడా స్కోర్లు👉వేదిక: డలాస్👉టాస్:అమెరికా.. తొలుత బౌలింగ్👉కెనడా స్కోరు: 194/5 (20)👉అమెరికా స్కోరు: 197/3 (17.4)👉ఫలితం: ఏడు వికెట్ల తేడాతో కెనడాపై అమెరికా విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆరోన్ జోన్స్(40 బంతుల్లో 94 రన్స్, నాటౌట్).చదవండి: జీవితంలో కష్టాలు సహజం.. ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా View this post on Instagram A post shared by ICC (@icc)
పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్.. ఫొటో వైరల్
టీమిండియా క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ పెళ్లి పీటలెక్కాడు. తన చిరకాల ప్రేయసి శృతి రఘునాథన్ మెడలో ఆదివారం మూడు ముళ్లు వేశాడు. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నడుమ వెంకీ- శృతిల పెళ్లి సంప్రదాయ పద్ధతిలో వైభవోపేతంగా జరిగినట్లు తెలుస్తోంది.కాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 1994, డిసెంబరు 25న జన్మించాడు వెంకటేశ్ అయ్యర్. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. అంచెలంచెలుగా ఎదిగి టీమిండియాలో స్థానం సంపాదించాడు.టీమిండియా తరఫున అరంగేట్రంభారత్ వేదికగా 2021లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన వెంకీ.. మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు.తన అంతర్జాతీయ కెరీర్లో వెంకటేశ్ ఇప్పటి వరకు.. 2 వన్డే, 9 టీ20 మ్యాచ్‌లు ఆడి వరుసగా 24, 133 పరుగులు సాధించాడు. టీ20 ఫార్మాట్లో 5 వికెట్లు పడగొట్టాడు.ఇక ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన వెంకటేశ్ అయ్యర్.. రైటార్మ్ మీడియం పేసర్ కూడా! అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే హార్దిక్ పాండ్యా వారసుడంటూ ప్రశంసలు అందుకున్నాడు.రాణించలేక అవకాశాలు కరువుకానీ అంచనాలు అందుకోలేక చతికిలపడి.. నిరాశజనక ప్రదర్శనతో టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్లో కేకేఆర్ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు వెంకటేశ్ అయ్యర్. మొత్తంగా 13 ఇన్నింగ్స్ ఆడి 370 పరుగులు సాధించాడు.ఐపీఎల్-2024 ఫైనల్లో అదరగొట్టిముఖ్యంగా ఫైనల్లో ఒంటిచేత్తో కేకేఆర్‌ను గెలిపించి చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి 26 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు.ఆఖరి వరకు అజేయంగా నిలిచి కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు.ఈ క్రమంలో మరోసారి టీమిండియా తలుపులు తట్టే అవకాశం దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడిలా వ్యక్తిగత జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ఆరంభించాడు వెంకటేశ్ అయ్యర్. అతడి శ్రీమతి శృతి రఘునాథన్ నిఫ్ట్(NIFT) నుంచి ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నట్లు సమాచారం. కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో ఆమె పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గతేడాది నవంబరులో ఈ జంటకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.చదవండి: జీవితంలో కష్టాలు సహజం.. ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా
T20 WC: సిక్సర్ల సునామీ.. క్రిస్ గేల్ తర్వాత ఒకే ఒక్కడు!
టీ20 ప్రపంచకప్-2024లో యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు శుభారంభం చేసింది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో కెనడాపై సంచలన విజయం సాధించింది.డలాస్ వేదికగా ఆదివారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) జరిగిన ఈ మ్యాచ్‌లో కెనడాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. అంతర్జాతీయ టీ20లలో తమ అత్యధిక పరుగుల ఛేదనను నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. View this post on Instagram A post shared by ICC (@icc)ఇక ఈ విజయంలో యూఎస్ఏ వైస్ కెప్టెన్ ఆరోన్ జోన్స్దే కీలక పాత్ర. కెనడా విధించిన 195 పరుగుల లక్ష్య ఛేదనలో అమెరికా జట్టు ఆరంభంలోనే తడబడింది. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు స్టీవెన్ టేలర్(0), కెప్టెన్ మొనాక్ పటేల్(16) వికెట్లు కోల్పోయింది.ఆరోన్ జోన్స్ సంచలన ఇన్నింగ్స్ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్(46 బంతుల్లో 65)తో కలిసి ఆరోన్ జోన్స్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 40 బంతుల్లోనే 94 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక స్ట్రైకురేటు 235తో ఈ మేరకు పరుగుల విధ్వంసం సృష్టించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లతో పాటు ఏకంగా పది సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఆరోన్ జోన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) క్రిస్ గేల్ తర్వాత ఒకే ఒక్కడు!యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్‌గా ఆరోన్ జోన్స్ చరిత్రకెక్కాడు. కాగా యూఎస్ఏ విజయంలో కీలక పాత్ర పోషించి.. తొమ్మిదో ఎడిషన్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తొలి ఆటగాడిగానూ నిలిచాడు.టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు👉క్రిస్ గేల్- 11- ఇంగ్లండ్ మీద- 2016లో..👉క్రిస్ గేల్- 10- సౌతాఫ్రికా మీద- 2007లో..👉ఆరోన్ జోన్స్- 10- కెనడా మీద- 2024లో..👉రిలీ రొసోవ్- 8- బంగ్లాదేశ్ మీద- 2022లో. View this post on Instagram A post shared by ICC (@icc)చదవండి: జీవితంలో కష్టాలు సహజం.. ఏదేమైనా వదిలిపెట్టను: హార్దిక్ పాండ్యా
బిజినెస్
ప్రభుత్వానికి కాసుల వర్షం.. భారీగా జీఎస్టీ వసూళ్లు
కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. మే నెలలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. దేశీయ లావాదేవీల్లో బలమైన పెరుగుదల, దిగుమతులు మందగించడంతో మే నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 10 శాతం వృద్ధితో రూ.1.73 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్రం తెలిపింది.2024-25 ఆర్థిక సంవత్సరంలో మే వరకు స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.3.83 లక్షల కోట్లుగా ఉన్నాయని, ఇది వార్షిక వృద్ధికి 11.3 శాతం ప్రాతినిధ్యం వహిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది. రిఫండ్ల లెక్కింపు తర్వాత, 2024-25 ఆర్థిక సంవత్సరంలో నికర జీఎస్టీ ఆదాయం 2024 మే వరకు రూ .3.36 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 11.6 శాతం పెరిగింది.రిఫండ్ల లెక్కింపు తర్వాత మే నెలలో నికర జీఎస్టీ ఆదాయం రూ.1.44 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. కేంద్ర వస్తు, సేవల పన్ను (సీజీఎస్టీ) రూ.32,409 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.40,265 కోట్లు, ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ రూ.87,781 కోట్లుగా ఉన్నాయని, ఇందులో దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేసిన రూ.39,879 కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ తెలిపింది.
1.25 లక్షల కార్లకు రీకాల్.. టెస్లా సంచలన నిర్ణయం
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఏకంగా 1,25,000 కంటే ఎక్కువ కార్లకు రీకాల్ ప్రకటించింది. సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్ పనితీరులో లోపాలు ఉన్నట్లు గుర్తించి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.రీకాల్ ప్రకటించిన కార్లలో 2012 - 2024 మధ్య తయారైన టెస్లా ఎస్ మోడల్, 2015 - 2024 మధ్య విడుదలైన ఎక్స్ మోడల్, 2017-2023 మోడల్ 3, 2020-2023 మోడల్ Y వాహనాలు ఉన్నాయి. సీట్ బెల్ట్ ధరించని డ్రైవర్లకు రిమైండర్ సిగ్నెల్ అందించాలి, కానీ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్యల కారణంగా ఇది సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించారు. ఇది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది.సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్‌లో ఏర్పడిన లోపాన్ని సరిచేయడానికి టెస్లా ఈ రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు కంపెనీ కార్లలో ఈ సమస్య ఉన్నట్లు ఎక్కడా ఫిర్యాదులు అందలేదు. కానీ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఈ సమస్యను గురించినట్లు సమాచారం.
వెంటనే ఫోటో డిలీట్ చేయండి: ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్బీఐ
ఇటీవల ఓ వ్యక్తి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాళీగా ఉన్న బ్రాంచ్ ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలను వెంటనే డిలీట్ చేయాలని ఆ వ్యక్తిని ఎస్బీఐ హెచ్చరించింది.ఒక వ్యక్తి మధ్యాహ్నం 3 గంటల సమయంలో బ్యాంకుకు వెళ్ళాడు. ఆ సమయంలో బ్యాంకులో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో.. అసహనానికి గురయ్యాడు. దీంతో ఖాళీగా ఉన్న క్యాబిన్ ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపించారు. బ్యాంకులో ఒకేసారి మధ్యాహ్న భోజనానికి వెళితే.. కస్టమర్లు ఇబ్బంది పడతారని, ఆలా చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. కస్టమర్‌కు కలిగిన అసౌకర్యానికి ఎస్బీఐ చింతించింది.ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలను వెంటనే తొలగించాలని హెచ్చరించింది. బ్యాంకులో ఫోటోలు, వీడియోలు పూర్తిగా నిషిద్ధం. ఇవన్నీ భద్రతకు భంగం కలుగుతాయని పేర్కొంటూ.. జరగరానిది ఏమైనా జరిగితే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎస్బీఐ పేర్కొంది.User complains that the entire staff was out for lunch at an SBI branch.Instead of asking which branch it was, SBI official handle threatens user to delete it.😂"immediately." pic.twitter.com/xtPPXN11zg— Kanan Bahl (@BahlKanan) May 31, 2024
ఎస్‌బీఎమ్ బ్యాంక్‌కు రూ.88.70 లక్షలు ఫైన్: ఎందుకంటే?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ఎస్‌బీఎమ్ బ్యాంక్ (ఇండియా)కు భారీ జరిమానా విధించింది. ఇంతకీ ఈ బ్యాంకును జరిమానా ఎందుకు విధించింది? ఎంత జరిమానా విధించింది అనే వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.ఆర్బీఐ షరతులను పాటించనందుకు ఎస్‌బీఎమ్ బ్యాంక్ (ఇండియా)కు ఏకంగా రూ. 88.70 లక్షలు జరిమానా విధించారు. అంతే కాకుండా.. తక్షణమే అమల్లోకి వచ్చేలా సరళీకృత రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద లావాదేవీలను నిలిపివేయాలని ప్రత్యేక సూచనలను జారీ చేశారు.ఆర్బీఐ సూచించిన ఆదేశాలు పాటించడంలో ఎస్‌బీఎమ్ విఫలమైనందుకు బ్యాంకుకు రెండు వేర్వేరు నోటీసులు జారీ చేసింది. ఇందులో కారణాలను పేర్కొనాలని సూచించింది. పెనాల్టీ అనేది రెగ్యులేటరీ సమ్మతిలో లోపాలపై ఆధారపడి ఉంటుందని.. బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం చెల్లుబాటును ప్రభావితం చేయడానికి ఉద్దేశించినది కాదని ఆర్బీఐ తెలిపింది.
వీడియోలు
తిరుమలలో వైఎస్ఆర్ సీపీ నేతలు
కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు
ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఆర్కే రోజా రియాక్షన్
తెలంగాణ భవన్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం
తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో హోరాహోరీ పోరు
YSRCPదే ప్రభంజనం..
దశాబ్ది ఉత్సవాలకు సిద్ధం
చంద్రబాబుపై రెచ్చిపోయిన సజ్జల
ఫ్యామిలీ
ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటే?
వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడ్డప్పుడు జీర్ణ వ్యవస్థ ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ ఒకటి. ఇది రెండు రకాలు. ఒకటి అల్సరేటివ్ కొలైటిస్, రెండోది క్రోన్స్ డిసీజ్.జీర్ణవ్యవస్థలో వచ్చే ఈ సమస్యలోని ‘అల్సరేటివ్ కొలైటిస్’లో పెద్దపేగు లోపలి లైనింగ్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అప్పుడు అక్కడ పుండ్లు పడటం, కొన్నిసార్లు ఆ పుండ్ల నుంచి రక్తస్రావం కావచ్చు. ఆ భాగం మినహాయించి మిగతా జీర్ణవ్యవస్థలో మరెక్కడైనా ఇన్ఫ్లమేషన్ రావడాన్ని ‘క్రోన్స్ డిసీజ్’ అంటారు. అంటే నోరు మొదలుకొని, చిన్నపేగుల వరకు ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఒక్కోసారి ఆ భాగం సన్నగా మారడం లేదా పుండ్లు పడటం జరగవచ్చు.కారణాలు..ఈ సమస్యలకు కారణాలు నిర్దిష్టంగా తెలియదు గానీ వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనం కావడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. జన్యుపరమైన అంశాలతోనూ, పర్యావరణ కారణాలతోనూ రావచ్చు. పొంగతాగడం క్రోన్స్ డిసీజ్‌కు దారితీయవచ్చని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.అల్సరేటివ్ కొలైటిస్ లక్షణాలు..నీళ్లవిరేచనాలుకడుపునొప్పిజ్వరంబరువు తగ్గడంతరచూ మలద్వారం నుంచి రక్తం, బంక (మ్యూకస్) పడుతుండటంకొన్నిసార్లు మలబద్దకంఇవిగాక... కీళ్ల నొప్పులు, కీళ్ల వాపు వంటి లక్షణాలు కూడా ఉంటే వ్యాధి తీవ్రంగా ఉందని భావించాలి.క్రోన్స్ డిసీజ్ లక్షణాలు..నీళ్ల విరేచనాలుకడుపునొప్పితీవ్రమైన అలసటనీరసంనిస్సత్తువబరువు తగ్గడంనోటి పొక్కులుచర్మసమస్యలుకళ్లు ఎర్రబారడం, మండడంకొందరిలో మలద్వార సమస్యలైన ఫిస్టులా, మలద్వారం చీరుకు΄ోవడం, కుచించుకు΄ోవడం.నిర్ధారణ పరీక్షలు..కొలనోస్కోపీగ్యాస్ట్రో ఇంటస్టినల్ ఎండోస్కోపీ ∙రక్తపరీక్షలు, అవసరాన్ని బట్టి సీటీ స్కాన్, ఎమ్మారైలతోపాటు కొన్ని సందర్భాల్లో పెద్ద పేగు బయాప్సీ.చికిత్స..– అల్సరేటివ్ కొలైటిస్‌కు... కొన్ని మందులతో లక్షణాలు తగ్గించడంతోపాటు అవి మళ్లీ రాకుండా చూస్తారు. ఉదాహరణకు నొప్పి తగ్గడానికి వాడే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వంటి వాటి వాడకం– మందులు వాడినప్పటికీ లక్షణాలు తగ్గని కండిషన్‌ను రిఫ్రాక్టరీ అల్సరేటివ్ కొలైటిస్ అంటారు. వ్యాధినిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల ఇలా జరుగుతుందని గుర్తించినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ తాత్కాలికంగా మందగించేందుకు 6–మెర్కా΄్టోప్యూరిన్, అజాథియోప్రిన్ వంటి మందులూ, అప్పటికీ గుణం కనిపించక΄ోతే సైక్లోస్పోరిన్ వంటి మందులు వాడాలని సూచిస్తారుశస్త్రచికిత్స..– సమస్య ఎంతకీ తగ్గక΄ోతే అప్పుడు శస్త్రచికిత్స చేసి ప్రభావితమైన మేరకు పెద్దపేగు భాగాన్ని తొలగిస్తారు. అవసరమైతే దేహంలో మరెక్కడైనా (సాధారణంగా నడుము దగ్గర) మలద్వారం ఏర్పాటు చేసి, చిన్నపేగు చివరి భాగం అక్కడ తెరుచుకునేలా చూస్తారు.– క్రోన్స్ డిసీజ్‌కు... ఇందులో జీర్ణవ్యవస్థలోని ఏ భాగమైనా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి... నిర్దిష్టంగా ఏ భాగం ప్రభావితమైందన్న అంశాన్ని బట్టి చికిత్స అందిస్తారు.ఈ వ్యాధికి చేసే చికిత్సల్లో కొన్ని... – జీర్ణవ్యవస్థలోని వాపును తగ్గించడానికి 5–అమైనోశాల్సిలేట్స్ (5–ఏఎస్ఏ) అనే మందులూ, వాటితో ఫలితం కనిపించక΄ోతే అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్ ఇస్తారు– వీటితో గుణం కనిపించక΄ోతే అవసరాన్ని బట్టి పరిమిత కాలం పాటు ప్రెడ్నిసోన్, బ్యూడిసోనైడ్ వంటి స్టెరాయిడ్స్‌ను వైద్యులు సూచించవచ్చు– లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఇమ్యునో మాడ్యులేటర్స్ లేదా బయలాజిక్ రెస్పాన్స్ మాడిఫైయర్స్ అనే మందులను సూచిస్తారు.ఆహారంతో అదుపు ఇలా...– పాలు, పాల ఉత్పాదనలైన జున్ను, వెన్న, పెరుగు పుడ్డింగ్స్– చాక్లెట్లు, పేస్ట్రీలు, కేకులు– పల్లీలు ∙కృత్రిమరంగులు వాడిన ఆహారాలు– పుల్లటి పండ్లు, పండ్ల రసాలు ∙మసాలాలు– వేపుళ్లు, ఫాస్ట్‌ఫుడ్, చైనీస్ ఫుడ్స్– కెచప్ క్యాబేజీ, బ్రాకలీ, క్యాలీఫ్లవర్– బీన్స్, కందులు– వేటమాంసం– ఆల్కహాల్ కు పూర్తిగా దూరంగా ఉండాలి.ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (ఐబీడీ)తో పాటు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే మరో సమస్యా ఉంది. తినగానే విరేచనానికి వెళ్లడం, కొందరిలో మలబద్ధకంతో బాధించే ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)లో తినగానే వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సిరావడమనే ఇబ్బంది తప్ప పెద్దగా సమస్యలు బాధించక΄ోవచ్చు. ఐబీఎస్ (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్), ఐబీడీ (ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్) రెండూ వేర్వేరనీ, అందులో ఐబీడీ తీవ్రమైనదని గుర్తించాలి. (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వివరాలు పక్కనే...) – డా. కావ్య దెందుకూరి, కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ – గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
Beauty Tips: పాదాలు అందంగా కనిపించాలా? అయితే ఈ టూల్‌ని..
తల వెంట్రుక నుంచి కాలి గోరు వరకు ఆరోగ్యంగా ఉంటేనే అందం సొంతమవుతుంది. కేశ సౌందర్యం ముఖానికి ఆకర్షణ కాబట్టి.. దానిపట్ల ఎలాగూ శ్రద్ధ పెడతాం! పాదాలనే పెద్దగా పట్టించుకోం! పాదాలే కదా అని పెదవి విరవకుండా.. ఇదిగో ఈ టూల్‌ని తెచ్చుకోండి.. వాటిని చక్కగా సంరక్షించి.. ఆరోగ్యం, అందం రెంటినీ చేకూరుస్తుంది.చిత్రంలోని ఈ డెడ్ స్కిన్ రిమూవర్లో.. 2 లెవెల్స్‌లో స్పీడ్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. డివైస్‌తో పాటుగా రీప్లేసబుల్ గ్రైండింగ్ హెడ్స్ లభిస్తాయి. వాటిలో 2 స్క్రబ్ హెడ్స్‌తో పాటు.. ఒక రోలర్ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్‌తో పోర్టబుల్ డివైస్‌గా ఉన్న ఈ రోలర్.. యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది.హ్యాండిల్‌తో.. తేలికగా, ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుందీ డివైస్. తడి లేదా పొడి చర్మాలకు అనువైనది. అలాగే స్త్రీ, పురుషులు ఎవరైనా వాడొచ్చు. దీన్ని శుభ్రపరచడం తేలిక. కాళ్లు, గోళ్లు, గోళ్ల చుట్టూ ఉండే చర్మం.. ప్రతి భాగాన్ని శుభ్రపరచి మృదువుగా మారుస్తుంది.ఈ ఎలక్ట్రిక్ మేకప్ రిమూవర్ ఫుట్ స్క్రబ్ డెడ్ స్కిన్ ఎక్స్ఫోలియేషన్.. హై హీల్స్ వాడేవారికి.. పాదాలు కనిపించేలా డ్రెస్సులు వేసుకునేవారికి చక్కగా ఉపయోగపడుతుంది. అందమైన పాదాలను కోరుకునేవారికి.. ఇది చక్కటి బహుమతి అవుతుంది. ఈ ఫుట్ స్పా బ్యూటీ రోలర్ ఇంట్లో ఉంటే.. పెడిక్యూర్ కోసం పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ధర కేవలం 449 రూపాయలు. దీన్ని స్నేహితులకు, శ్రేయోభిలాషులకు గిఫ్ట్‌గానూ ఇవ్వచ్చు.ఇవి చదవండి: ఏకంగా శునకాలకై.. అమెరికన్ కంపెనీ 'కడీ' పేరుతో..
ఏకంగా శునకాలకై.. అమెరికన్ కంపెనీ 'కడీ' పేరుతో..
చాలామంది జంతుప్రేమికులు ఇళ్లల్లో శునకాలను పెంచుకుంటూ ఉంటారు. ఇళ్లలో అవి ఏ మూలనో పడుకుంటూ ఉంటాయి. అవి పడుకునే చోట పాత బొంతలో, దుప్పట్లో పరుస్తూ ఉంటారు. బాగా సంపన్నులైతే సోఫా కుర్చీలను పెంపుడు శునకాలకు మంచాలుగా మార్చేస్తుంటారు. అమెరికన్ కంపెనీ ‘థింకో ఎల్ఎల్సీ’ శునకాల కోసం ‘కడీ’ పేరుతో ఒక స్మార్ట్ మంచానికి రూపకల్పన చేసింది.దీని తయారీకి చైనీస్ కంపెనీ లావో ఇంటర్నేషనల్ ట్రేడ్ కంపెనీ సాంకేతిక సహకారం అందించింది. శునకాలకు అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించిన ఈ బెడ్ స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానమై యాప్ ద్వారా పనిచేస్తుంది. దీనిపై పడుకున్న శునకానికి ఆహ్లాదం కలిగించేలా సంగీతం వినిపిస్తుంది. ఒంటికి హాయి నిచ్చేలా ఉష్ణోగ్రతను సర్దుకుంటుంది.యాప్ ద్వారా కూడా దీని ఉష్ణోగ్రతను మార్చుకునే వీలు ఉంది. దీనిపై పడుకున్న శునకం నిద్ర తీరుతెన్నులను యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. అంతేకాదు, శునకం ఆరోగ్యంలో మార్పులను కూడా ఇది నిశితంగా గమనిస్తూ, అవసరమైన సందర్భాల్లో యాప్ ద్వారా యజమానులను హెచ్చరిస్తుంది. ఈ స్మార్ట్ బెడ్‌ను ‘థింకో ఎల్ఎల్సీ’ జూన్ నెలాఖరులోగా మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.బీపీ చెకింగ్ స్మార్ట్‌వాచీలు..జీవనశైలి వ్యాధుల్లో హై బీపీ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా హై బీపీ బాధితులు నానాటికీ ఎక్కువవుతున్నారు. బీపీ చెక్ చేయించుకోవాలంటే డాక్టర్ దగ్గరకు లేదా డయాగ్నస్టిక్స్ సెంటర్‌కు వెళ్లాలి. లేకుంటే, సొంతగా బీపీ మెషిన్ కొని ఇంట్లో పెట్టుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు ఈ మెషిన్‌ను వెంట తీసుకుపోవడం కుదిరే పని కాదు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే అమెరికన్ కంపెనీ వైహెచ్ఈ టెక్నాలజీ తాజాగా బీపీ చెకింగ్ స్మార్ట్ వాచీని అందుబాటులోకి తెచ్చింది.మిగిలిన స్మార్ట్‌వాచీల మాదిరిగానే ఇది కూడా రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ వాచీని చేతికి తొడుక్కుంటే, బీపీ ఎంత ఉందో ఎప్పటికప్పుడు నిరంతరాయంగా చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ బీపీ ఆందోళనకరమైన స్థాయిలో ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లి తగిన చికిత్స తీసుకునేందుకు దోహదపడుతుంది. బీపీ చెకింగ్‌ను సులభతరం చేసిన ఈ స్మార్ట్‌వాచీ కోసం ఆన్లైన్లో ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. దీని ధర 199 డాలర్లు (రూ.16,564) మాత్రమే!ఇవి చదవండి: నిద్దురలో బాగా గురక కొడ్తున్నారా! అయితే ఈ దిండు..
నిద్దురలో బాగా గురక కొడ్తున్నారా! అయితే ఈ దిండు..
కొందరు నిద్రపోయేటప్పుడు గురక తీస్తుంటారు. గాఢనిద్రలో ఎవరు తీసే గురక వారికి తెలియదు గాని, వారితో పాటు ఒకే గదిలో పడుకునేవారికి నిద్రాభంగమవుతుంది. రకరకాల శారీరక సమస్యల వల్ల ఇలా గురక వస్తుంటుంది. గురకను అరికట్టడానికి ఇప్పటి వరకు ప్రత్యేకమైన ఔషధాలు, చికిత్సలు ఏవీ లేవు. అయితే, ఈ స్మార్ట్ తలదిండు గురకను ఇట్టే అరికడుతుందని చెబుతున్నారు.ఈ స్మార్ట్ దిండును కెనడియన్ కంపెనీ డెరుక్కి తయారు చేసింది. ఇది యాప్ ద్వారా పనిచేస్తుంది. నిద్ర తీరు తెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, తేడాలు ఉన్నట్లయితే యాప్ ద్వారా సమాచారం అందిస్తుంది. గురక మొదలయ్యే సూచన రాగానే, తల భంగిమను మార్చుకునేలా చేస్తుంది. స్లీప్ ఆప్నియా వంటి వ్యాధులను అరికట్టడానికి ఈ స్మార్ట్ దిండు బాగా ఉపయోగపడుతుంది. ఈ యాంటీ స్నోర్ పిల్లో గురక బాధను 89 శాతం వరకు నివారిస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీని ధర 699 డాలర్లు (రూ.58,212).ఇవి చదవండి: Children's Story: ఉత్తమ శిష్యుడు! 'మేము సర్వసంగ పరిత్యాగులం'..
న్యూస్ పాడ్‌కాస్ట్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు కేరళకు నైరుతి రుతుపవనాల రాక.. రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నాయకులు చల్లే బురదలోనే కమలాలు విరగబూస్తాయి.. ప్రధాని మోదీ ధీమా.. ఇంకా ఇతర అప్డేట్స్
మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి గెలిస్తే హిందువులు రెండో తరగతి పౌరులే.. ప్రధాని మోదీ ఆందోళన.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
మ్యూల్ సిమ్‌కార్డుల ముఠాగుట్టు రట్టు
భవానీపురం (విజయవాడపశ్చిమ): సైబర్ నేరగాళ్లకు మ్యూల్ సిమ్‌కార్డులు సరఫరా చేస్తున్న ముఠాగుట్టును విజయవాడ సైబర్ పోలీసులు రట్టుచేశారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశా రు. నిందితుడి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. కోటిని స్తంభింపజేశారు. సైబర్ మోసంతో సీని యర్ సిటిజన్ పోగొట్టుకున్న రూ.30,37,627 ఆయనకు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్ జిల్లా సీపీ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. గతనెల 24వ తేదీన విజ యవాడ సూర్యారావుపేటకు చెందిన సీనియర్ సిటిజన్ తాను సైబర్ నేరానికి గురైనట్లు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. తనకు వాట్సప్ ద్వారా వీడియో కాల్ చేసి ముంబై సైబర్ క్రైమ్ డీసీపీగా పరిచయం చేసుకున్న వ్యక్తి.. తన పేరుమీద ముంబయిలో రెండు సిమ్‌కార్డులు, రెండు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, ముంబయిలో పలు కేసుల్లో నిందితుడైన రాజ్ కుంద్రా నిత్యం తనతో ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ముంబయిలో కేసు నమోదు అయిందంటూ ఎఫ్ఐఆర్, అరెస్ట్ వారెంట్ పత్రాలను వాట్స ప్లో పంపించాడని తెలిపారు. అతడి బెదిరింపులకు భయపడిన తాను అతడు చెప్పిన ఖాతాకు రూ.30,37,627 జమచేసినట్లు తెలిపారు. అయినా ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విశాఖలో తీసుకున్న సిమ్‌కార్డుల వినియోగం ఈ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.డి.తేజేశ్వరరావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ కోమాకుల శివా జి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఉపయోగించిన సిమ్ కార్డులు విశాఖపట్నంలో తీసుకున్నట్లు గుర్తించి ఎస్ఐ ఆర్.ఎస్.సీహెచ్.మూర్తి ఆధ్వర్యంలో ఒక బృందం విశాఖపట్నంలో దర్యాప్తు చేసింది. సిమ్‌కార్డులు అమ్మే ఎగ్జిక్యూటివ్‌లు.. వినియోగదారుల బొటనవేలి ముద్రలను ఉపయోగించి మరో మ్యూల్ సిమ్‌కార్డు తీసుకుని యాక్టివేట్ చేసి సంఘవ్యతిరేక శక్తులకు అమ్ముకుంటున్నట్లు గుర్తించారు. సైబర్ నేరస్తులకు మ్యూల్ సిమ్‌కార్డులు విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్టుచేసి వా రి వద్ద నుంచి 998 సిమ్‌కార్డులు, బయోమెట్రిక్ మెషిన్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన రేపాక రాంజీ, నంబాల నితిన్, బండి నారాయణమూర్తి అలియాస్ రవి, విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన తేలు ప్రణయ్‌కుమార్, నంద రూపేష్, కాగితాల సింహాద్రి, నిడమర్రు ఎండీఎల్ సూరయ్యగూడేనికి చెందిన పందిరి సత్యనారాయణలను అరెస్టు చేశారు. బాధితుడు డబ్బు జమచేసిన బ్యాంకు ఖాతాను గుర్తించి 1930 పోర్టల్ ద్వారా బ్యాంకు అధికారులను సంప్రదించి ఆ ఖాతాలో ఉన్న రూ.1,21,73,156.98ని నిలుపుదల చేశారు. బా ధితుడు పోగొట్టుకున్న రూ.30,37,627ను కోర్టు ద్వారా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేరస్తులు కాంబోడియా నుంచి ఈ మోసానికి పా ల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని సీపీ తె లిపారు.దోషుల్ని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.
ప్రాణం తీసిన ఒక్క రూపాయి
ఖిలా వరంగల్: వరంగల్‌లో దారుణం జరిగింది. ‘ఆ్రఫ్టాల్ నువ్వు ఒక ఆటోడ్రైవర్వు. ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివా’..? అంటూ ఇద్దరి మధ్య జరిగిన చిన్న ఘర్షణ చివరికి ఒకరి ప్రాణం తీసింది. శనివారం వరంగల్ క్రిస్టియన్ కాలనీ గాం«దీనగర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ మిల్స్‌కాలనీ గరీబ్‌నగర్ గొర్రెకుంటకు చెందిన ఇసంపెల్లి ప్రేమ్‌సాగర్ (38) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రేమ్‌సాగర్ గాందీనగర్‌లోని ‘నబీ రూ.59కే చికెన్ బిర్యానీ’సెంటర్‌కు వెళ్లాడు. ఆదే సమయంలో గాందీనగర్‌కు చెందిన జన్ను అరవింద్ అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు స్నేహితులే. ఈ క్రమంలో ప్రేమ్‌సాగర్ బిర్యానీ తీసుకుని రూ.59కి బదులు రూ.60 ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. పక్కనే ఉన్న అరవింద్ దీనిపై స్పందించి.. ‘ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివి అయ్యావా’అంటూ ప్రేమ్‌సాగర్‌ను హేళన చేస్తూ మాట్లాడాడు. దీంతో ప్రేమ్‌సాగర్ ఒక్కసారిగా ఆవేశానికిలోనై ‘నేను ఏమైనా అడుక్కు తింటున్నానా.. ఏం మాట్లాడుతున్నావు’అంటూ అరవింద్‌ను నిలదీశాడు. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. తోపులాటలో అరవింద్, బలంగా ప్రేమ్‌సాగర్‌ను నెట్టివేయగా రోడ్డుపై పడిపోయాడు. దీంతో అతని తలకు బలమైన గాయమై చిన్నమెదడు చిట్లి ముక్కు, చెవుల్లోనుంచి రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ప్రేమ్‌సాగర్ తమ్ముడు విద్యాసాగర్‌తోపాటు అరవింద్ కలసి ఆటోలో ప్రేమ్‌సాగర్‌ను ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 1 గంట సమయంలో ప్రేమ్‌సాగర్ మృతిచెందాడు. వెంటనే అరవింద్ ఎంజీఎం నుంచి నేరుగా మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు లొంగిపోయాడు. మృతుడి సోదరుడు విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు శనివారం అరవింద్‌పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మల్లయ్య తెలిపారు.
వందల కోట్ల గోల్మాల్!
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో రూ.వందల కోట్లు గోల్మాల్ అయినట్టు ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. ఓవైపు కీలక ఆధారాలు సేకరిస్తూ.. మరోవైపు వరుస అరెస్టులతో ఏసీబీ అధికారులు ఈ కేసులో వేగం పెంచారు. తాజాగా శుక్రవారం ఏసీబీ అధికారులు తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్ రాంచందర్, అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కల్యాణ్‌కుమార్‌ను అరెస్టు చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కుంభకోణం వెనక కీలక సూత్రధారులుగా ఈ ఇద్దరు వ్యవహరించినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులు గొర్రెల పంపిణీ పథకం అమలు వ్యవహారంలోకి తేవడంలో ఈ ఇద్దరు అధికారులది ముఖ్యపాత్ర అని నిర్ధారణ అయ్యింది. ఇంకా ఎన్ని రూ.కోట్లు మింగారో? తొలుత రూ.2.10 కోట్ల అవినీతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు.. దర్యాప్తులో ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారం రూ.700 కోట్లకుపైనే అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ ఇంకా ఎన్ని రూ.కోట్ల అవినీతి బయటికి వస్తుందోనన్న చర్చ జరుగుతోంది. శుక్రవారం అరెస్టయిన సబావత్ రాంచందర్, కల్యాణ్‌కుమార్‌ను జ్యుడీíÙయల్ కస్టడీకి తరలించారు. వీరిద్దరినీ తిరిగి పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఇద్దరు నిందితులను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది.ఆ ఇద్దరి వెనుక ఎవరైనా ఉన్నారా?కల్యాణ్‌కుమార్, రాంచందర్లే ఈ కుంభకోణానికి పాల్పడ్డారా..? వారి వెనుక ఇంకెవరైనా కీలక వ్యక్తులు ఉన్నారా..? అన్న కోణాల్లోనూ ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు అనుమతితో ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే ఇంకేవైనా కొత్త పేర్లు తెరపైకి వస్తాయా..?అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.
రూ.3లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్ఐ
కుషాయిగూడ: భూ వివాదంలో తలదూర్చి.. వక్రమార్గం పట్టిన కుషాయిగూడ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు ఏసీబీ అధికారులకు చిక్కారు. మధ్యవర్తి ద్వారా డబ్బులు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం కుషాయిగూడ పరిధిలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జోన్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ, చక్రిపురంలోని స్థల సరిహద్దు వివాదంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించాడంటూ కాప్రా డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కుషాయిగూడకు చెందిన సింగిరెడ్డి భరత్‌రెడ్డి అనే వ్యక్తిపై ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. దీనిపై కోర్టు ఆదేశాలతో పోలీసులు అతడికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే కుషాయిగూడకు చెందిన ఎల్.ఉపేందర్ అనే వ్యక్తి ఈ కేసులను కాంప్రమైజ్ చేసేందుకు పోలీసుల తరఫున మధ్యవర్తిత్వం వహించాడు. ఎస్ఐ షేక్ షఫీ ఆదేశాలతో సింగిరెడ్డి భరత్‌రెడ్డిని ఉపేందర్ ఆశ్రయించాడు. రూ.3 లక్షల ఇస్తే కేసులు లేకుండా చూస్తానంటూ భరత్‌రెడ్డికి ఆఫర్ ఇచ్చాడు. తనపై భరత్‌రెడ్డికి నమ్మకం కుదరకపోవడంతో ఉపేందర్ నేరుగా ఎస్ఐ షఫీతో మాట్లాడించాడు. మరి ఇన్స్పెక్టర్ విషయం ఏమిటంటూ భరత్‌రెడ్డి ఎస్ఐని ప్రశ్నించడంతో.. ఇన్స్పెక్టర్ వీరస్వామితోనూ కలిపించి రూ.3 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఒక్క కేసే క్లోజ్ చేస్తామని.. కానీ.. రెండు కేసులూ తప్పించడం సాధ్యం కాదని ఒక కేసు మాత్రమే క్లోజ్ చేస్తామని చెప్పారు. దీంతో సింగిరెడ్డి భరత్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన రంగారెడ్డి జోన్ ఏసీబీ అధికారులు శుక్రవారం ఓ ప్రైవేటు కార్యాలయంలో మధ్యవర్తి ఉపేందర్‌కు ఫిర్యాదుదారు భరత్‌రెడ్డి రూ.3 లక్షల నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షేక్ షఫీలను కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. సుమారు 5 గంటల పాటుగా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగింది. అలాగే గుర్రంగూడలోని ఇన్స్పెక్టర్ వీరస్వామి, దమ్మాయిగూడలోని ఎస్ఐ షఫీ ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. తమకు లభించిన పక్కా సాంకేతిక ఆధారాలతో ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షఫీ, మధ్యవర్తి ఎల్.ఉపేందర్‌లపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.