Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Cm jagan Reaction On TDP Janasena Manifesto Slams Chandrababu
టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

సాక్షి, అన్నమయ్య జిల్లా: టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హామీలన్నీ మోసమేనని బీజేపీ వైఖరితో అర్థమైందన్నారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో తమ ఫోటో వద్దని బీజేపీ గట్టిగా చెప్పిందని పేర్కొన్నారు. బాబు డిక్లేర్ చేసిన మేనిఫెస్టోలో మోదీ ఫోటో పెట్టొద్దని బీజేపీ తేల్చేసిందన్నారు. ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు.అవ్వాతాతలకు ఇంటివద్దకే అందే పెన్షన్‌ను ఆపిన దుర్మార్గుడు చంద్రబాబని ధ్వజమెత్తారు. మీ బిడ్డకు(జగన్‌) మంచి పేరు వస్తుందనే బాబు పెన్షన్లను అడ్డుకున్నాడని మండిపడ్డారు. తన మనిషిని నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పనెన్షన్‌ను అడ్డుకున్నాడని.. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో తన కుట్రలను మనపై నెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ పూర్తి ప్రసంగంఈ ఎన్నికలు.. రాబోయే అయిదేళ్ల భవిష్యత్‌.జగన్‌కు ఓటేస్తే..పథకాలు కొనసాగింపు.చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ముగింపే.పొరపాటున బాబుకు ఓటేస్తే..పసుపుపతి నిద్రలేస్తాడు.వదల బొమ్మాళి అంటూ పేదల రక్తం తాగుతాడు..బాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే.2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా?.రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?రూ. 87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పెట్టుబడి సాయం కింద బాబు ఏనాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు.బాబు ఏనాడైనా రైతుభరోసా కింద ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా.14 ఏళ్లలో బాబు ఏనాడు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు.డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు..చేశాడా?.రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?అక్కాచెల్లెమ్మలను మోసం చేసి రోడ్డుపై నిలబెట్టాడుఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా?గర్భిణీ స్త్రీలకు రూ. 10 వేలు ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 100 సబ్సిడీ ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు.. విడిపించాడా?ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తానన్నాడు.. చేశాడా?మీ బిడ్డ జగన్‌ రైతన్నకు అండగా నిలబడ్డాడు.పెట్టుబడి సాయం కింద మీ బిడ్డ ప్రతియేటా రూ. 13, 500 ఇచ్చాడు.జగన్‌కు, చంద్రబాబుకు ఉన్న తేడా గమనించండని కోరుతున్నా.అక్కా చెల్లెమ్మలకు మీ బిడ్డ జగన్‌ తోడుగా ఉన్నాడుఅక్కాచెల్లెమ్మల కోసం మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేర్చా.అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూతతో ఆదుకున్నాం.అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఆబీసీ నేస్తం తీసుకొచ్చా.31 లక్షల ఇళ్లపట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్‌.ఇంటి వద్దకే అవ్వాతాతలకు పెన్షన్‌ అందిస్తున్నాం.పెన్షన్‌ రూ. 3 వేల నుంచి రూ, ,500లకు పెంచుకుంటూ పోతాం.14 ఏళ్లలో చంద్రబాబు ఏనాడైనా పెన్షనర్లను పట్టించుకున్నాడా? చంద్రబాబు మోసాలను ఓడించడానికి మీరంతా సిద్ధమేనా.రైతుభరోసాగా ఏడాదికి రూ.16 వేలు.. ఐదేళ్లకు రూ.80 వేలు ఇస్తాడు మీ జగన్.చంద్రబాబు వల్ల రాష్ట్రంలోని మహిళలందరికీ కొన్ని రూ.వేల కోట్ల నష్టం జరిగింది. పిల్లలను బడులకు పంపే తల్లులకు ఇచ్చే అమ్మఒడిని రూ.17 వేలుకు పెంచాం.

Team India T20 World Cup Squad Announced
టీ20 వరల్డ్‌కప్‌ కోసం భారత జట్టు ‍ప్రకటన.. స్టార్‌ ఆటగాళ్లకు దక్కని చోటు

కరీబియన్‌ దీవులు, యూఎస్‌ఏ వేదికలుగా జూన్‌ 1 నుంచి జరుగబోయే టీ20 వరల్డ్‌‍కప్‌ 2024 కోసం భారత జట్టును ఇవాళ (ఏప్రిల్‌ 30) ప్రకటించారు. ముందుగా చెప్పినట్లుగానే ఈ జట్టుకు రోహిత్‌ శర్మ నాయకత్వం వహించనుండగా.. హార్దిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌ ప్రదర్శనల ఆధారంగా రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకోగా.. స్టార్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌పై వేటు పడింది. చాలాకాలం తర్వాత చహల్‌ టీ20 జట్టులోకి రాగా.. సిరాజ్‌, అర్ష్‌దీప్‌ తమ స్థానాలు నిలుపుకున్నారు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సెంచరీ మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయని యశస్వి జైస్వాల్‌పై సెలెక్టర్లు విశ్వాసముంచగా.. వరల్డ్‌కప్‌ బెర్త్‌పై గంపెడాశలు పెట్టుకున్న  రింకూ సింగ్‌ ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఎంపియ్యాడు.  శుభ్‌మన్‌ గిల్‌, ఖలీల్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌ కూడా ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఎం​పియ్యారు.టీ20 వరల్డ్‌కప్‌ కోసం టీమిండియా: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రాట్రావెలింగ్‌ రిజర్వ్‌: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

Ap: Bjp Distanced From The Alliance Manifesto
బాబు అలవికాని హామీలు.. మేనిఫెస్టోకు బీజేపీ దూరం

సాక్షి, విజయవాడ: చంద్రబాబు అలవికాని హామీలకు మేం బాధ్యులం కాదంటూ బీజేపీ తప్పించుకుంది. కూటమి మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉంది. మేనిఫెస్టోలో మోదీ, బీజేపీ ఫొటోలు వేయొద్దని ఆ పార్టీ అల్టిమేటం జారీ చేసింది.మోదీ, నడ్డా, అమిత్‌, పురేందేశ్వరి ఫొటోలు లేకుండా కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తామని ఇన్నాళ్లూ   టీడీపీ చెప్పింది. మీడియాను మూడు పార్టీల మేనిఫెస్టో అంటూ పిలిచారు. బీజేపీ ఒప్పుకోకపోవడంతో చంద్రబాబు, పవన్‌ ఫొటోలతో మేనిఫెస్టో విడుదల చేశారు.​మేనిఫెస్టో కాపీని ముట్టుకోవడానికి కూడా బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థనాథ్‌ సింగ్‌ ఒప్పుకోలేదు. కూటమి మేనిఫెస్టోకు టీడీపీ, జనసేనదే బాధ్యత అని చంద్రబాబు చెబుతున్నారు. 2014లో మేనిఫెస్టోలో చంద్రబాబు.. మోదీ ఫొటో పెట్టారు.. హామీలు అమలు కాకపోవడంతో మోదీకి చంద్రబాబు చెడ్డపేరు తెచ్చారని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ వద్దని గట్టిగా చెప్పడంతోనే మోదీ ఫొటో పెట్టేందుకు చంద్రబాబు సాహసించలేదు.తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ అగ్రనేతలు స్పష్టంగా ముస్లిం రిజర్వేషన్లపై ప్రకటనలు చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారు. ఆ విషయంలో బీజేపీ, టిడిపి మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు బీజేపీ అధికారికంగా దూరం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

Supreme Court Shock To Enforcement directorate in liquor case
కేజ్రీవాల్‌ అరెస్టు: ఈడీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి తొలిసారి షాక్‌ తగిలింది. కేజ్రీవాల్‌ను ఎన్నికల సమయంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు ఈడీని కోరింది. ఈ ప్రశ్నకు శుక్రవారం సమాధానంతో రావాలని ఈడీ తరపున వాదిస్తున్న అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ను ఆదేశించింది. లిక్కర్‌ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడం అక్రమమని కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం(ఏప్రిల్‌30) విచారించింది. అంతకుముందు కేజ్రీవాల్‌ తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి  వాదనలు వినిపించారు. లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌ కమ్యూనికేషన్స్‌ ఇంఛార్జ్‌ విజయ్‌నాయర్‌ను ఈడీ 2022లో అరెస్టు చేసిందని, కేజ్రీవాల్‌ను మాత్రం 2024 దాకా ఆగి ఇప్పుడు అరెస్టు చేసిందన్నారు.ఇంత సమయం ఎందుకు తీసుకున్నారనేదానిపై క్లారిటీ లేదన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్టేట్‌మెంట్‌ ఆధారంగా కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని చెప్పారు. అయితే ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన వెంటనే శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవకు ఈ కేసులో బెయిల్‌ వచ్చిందన్న విషయాన్ని సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో శ్రీనివాసులు రెడ్డి మొదట్లో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదని, తర్వాతే మాట మార్చారని వాదించారు.    

Ksr Comments On Revanth Reddy's Behavior To Support For Chandrababu
వీడని తీరుగా.. ఈ మాటల్లో గురు-శిష్యుల బంధం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూని గమనించారా? అందులో ఆయన ఒక అంశానికి ఇచ్చిన సమాధానం చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విధేయుడుగానే కొనసాగుతున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, రేవంత్ మనసు మాత్రం చంద్రబాబుపైనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని కనిపెట్టారు. ఓకే. ఏదో కాంగ్రెస్ పార్టీ నేత కనుక, ఆ పార్టీతో  వైఎస్సార్‌సీపీకి సంబంధం లేదు కనుక అలా మాట్లాడారులే అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఆశ్చర్యంగా బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చేలా చంద్రబాబుకు అనుకూలంగా అభిప్రాయాలు చెప్పడం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది.తెలుగుదేశం పార్టీని ఏపీలో భుజాన వేసుకుని మోస్తున్న ఒక పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఒక ప్రశ్న ఏమిటంటే?, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గెలుస్తున్నట్లు తమకు సమాచారం అందిందని కేసీఆర్‌, కేటీఆర్‌ అంటున్నారు.. ఇదేమైనా రాజకీయ వ్యూహమా? ఆ వ్యాఖ్య ప్రభావం తెలంగాణలో పడే అవకాశం ఉందా అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడిగారు. దానికి రేవంత్ ఏమి సమాధానం ఇచ్చారంటే.. చంద్రబాబునాయుడుపై ఉండే అసూయ, ద్వేషం.. అంతకంటే ఏమి ఉంటుంది? కేసీఆర్‌కు ఏదో ఓ బాధ, దుఃఖం. కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిల మధ్య అవగాహన ముందు నుంచి ఉన్నదే. చంద్రబాబు అరెస్టును కూడా సమర్దించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, కేసీఆర్‌ ఒక జట్టుగా వ్యవహరిస్తున్నారు.. అని రేవంత్ బదులు ఇచ్చారు. ఈ జవాబు ద్వారా తాను, బీజేపీ కూటమిలో ఉన్న చంద్రబాబు ఒక జట్టు అని రేవంత్ చెప్పకనే చెప్పేశారు.మరో ప్రశ్న ఏమిటంటే ఏపీ ఎన్నికల ఫలితాలపై మీ అంచనా అని అడిగారు..!?'ఎక్కడైనా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉంది. వాళ్లు చెప్పిన మాట నిలబెట్టుకోనందువల్ల ప్రతికూల వాతావారణం ఉంది. మేం షర్మిల నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ ఇన్నింగ్స్ ప్రారంభించాం. ఎన్ని సీట్లు గెలిపించుకోగలం? షర్మిల ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలపై ఎలా కొట్లాడుతున్నారు? ఆమెను ఎలా మద్దతుగా నిలబడాలి? అనేదే నా ప్రణాళిక. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనేదే మా రాజకీయ ప్రణాళిక. ఈసారి అక్కడ అన్ని సీట్లలో పోటీ దిగాం. మా దృష్టంతా కాంగ్రెస్‌కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికే'..."రేవంత్ సమాధానాలు చూస్తే ఏమనిపిస్తుంది! చంద్రబాబుపైన కేసీఆర్‌ కోపం ద్వేషం ఉన్నాయట. అదే నిజమైతే ఓటుకు నోటు కేసులో ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు నాయుడు పేరు కూడా కేసీఆర్‌ ప్రభుత్వం చేర్పించి ఉండేది కదా! ఆ కేసులో రేవంత్ నేరుగా దొరికిపోతే, చంద్రబాబు మొత్తం కథకు సూత్రధారి. ఏ కేసులో అయినా కుట్రదారులను పట్టుకోకుండా ఉంటారా? కేసు పెట్టకుండా ఉంటారా? ఇక కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక జట్టు అని రేవంత్ తేల్చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నడైనా తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టారా? నిజంగానే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కనుక తెలంగాణ రాజకీయాలలో కూడా తన పాత్ర పోషించడం ఆరంభిస్తే ఏ మేరకు ప్రభావం ఉంటుందో రేవంత్ ఊహించుకోలేని అమాయకుడు కాదు.చంద్రబాబు అరెస్టును కేసీఆర్‌ సమర్ధించారట. అప్పట్లో కేసీఆర్‌ ఆ ఉదంతంపై ఎక్కడా స్పందించలేదు. పైగా కేటీఆర్‌ కూడా చంద్రబాబు అరెస్టుపై సానుభూతి వ్యాఖ్యలే చేశారు. మరో మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఏకంగా ఖండించారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే చంద్రబాబు అవినీతి కేసులో ఉన్నా అరెస్టు చేయకూడదని రేవంత్ చెబుతున్నారా? అలాంటప్పుడు కేసీఆర్‌ పై నిత్యం అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయనతో పాటు, కేటీఆర్‌, హరీష్ రావులను కూడా జైలుకు పంపుతామని ఎలా అంటున్నారు. అంటే చంద్రబాబు తప్ప ఇంకెవరిపైన అయినా కేసులు పెట్టవచ్చని రేవంత్ చెబుతున్నారా. చంద్రబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని రేవంత్ వదులుకోలేకపోతున్నారని అనుకోవాలి.చంద్రబాబు పరోక్షంగా కాంగ్రెస్‌కు సహకరించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆయన నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయినా ఆయన కోసం సానుభూతి వచనాలు పలకడం ద్వారా రేవంత్ తన గురు, శిష్య సంబంధాన్ని వదలుకోలేకపోతున్నారని చెప్పాలి. తెలంగాణలో బీజేపీపై ఘాటైన విమర్శలు చేస్తున్న రేవంత్ ఏపీలో ఎందుకు మాట్లాడలేదు. బీజేపీ ఊసే ఎత్తలేదు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశంకు ఓటు వేయవద్దని అనలేదు. కాంగ్రెస్ గురించి ఏదో మొహమాటానికి మాట్లాడినట్లు అనిపించింది. పైగా ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉందని అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత గురించి నేరుగా అనకపోయినా, ఆయన ఉద్దేశం అర్థం అవుతూనే ఉంది.విశేషం ఏమిటంటే చంద్రబాబు నాయుడు అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్ తోను ఏకకాలంలో జట్టుకట్టి రాజకీయం చేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించడంలోను, ఆ తర్వాత ఆమె చేస్తున్న ప్రకటనలలోను చంద్రబాబు పాత్ర ఉందన్న సంగతి బహిరంగ రహస్యం. ఇందులో ఎవరిది తప్పు అంటే ఏమి చెబుతాం. కాంగ్రెస్ నేతలుగా ఉన్న రేవంత్, షర్మిలలు తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని భావిస్తున్నారు. అంతే తప్ప బీజేపీతో మద్దతు కట్టిన టీడీపీ అనుకోవడం లేదు. అందుకే తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు తరచుగా రేవంత్ పై ఒక ఆరోపణ చేస్తుంటారు. బీజేపీ అగ్రనేతలతో కూడా రేవంత్ సంబంధాలు పెట్టుకున్నారని, భవిష్యత్తులో ఈయన బీజేపీలోకి జంప్ చేయవచ్చని ప్రచారం చేస్తుంటారు. ఇందులో నిజం ఉండకపోవచ్చు. కానీ ఏపీ రాజకీయాలలో ఈయన అనుసరించిన ధోరణి గమనిస్తే మాత్రం ఈయనకు నిజంగా బీజేపీ సిద్దాంతం పైన, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీపైన వ్యతిరేకత లేదన్న భావన కలుగుతుంది.ఒకప్పుడు చంద్రబాబుతో తనకు సంబంధం లేదని పైకి అన్నప్పటికీ, అధికారం వచ్చాక రేవంత్ తన మనసులో మాట బయటపెట్టారని అనుకోవచ్చు. ఒక వైపు ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉందని చెబుతున్న ఆయన తన ప్రభుత్వం గురించి ప్రజలలో మంచి అభిప్రాయం ఉందని అంటున్నారు. పార్లమెంటు ఎన్నికలు తన పాలనకు రిఫరెండమ్ అని అంటున్నారు. రేవంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు గమనిస్తే, అచ్చం తన గురువు చంద్రబాబు మాదిరే చేస్తున్నట్లుగా ఉంది. ఆరు గ్యారంటీలలో ఐదు అమలు చేశామని అంటున్నారు. నిజంగా అలా చేసి ఉంటే గొప్ప విషయమే అవుతుంది. కానీ ఒక్కో గ్యారంటీలోని కొన్ని అంశాలను అమలు చేసి, మిగిలినవాటిని పక్కనబెట్టిన సంగతి ప్రజలు మర్చిపోతారని అనుకుంటున్నారు.ఉదాహరణకు ఆర్టీసీ బస్‌లలో మహిళల ఉచిత ప్రయాణం కల్పించిన మాట నిజమే. కానీ ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్న వాగ్దానం గురించి ఎందుకు చెప్పరు? గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలు ఎక్కడ అమలు అవుతున్నాయో ఎవరికి తెలియదు. పాతికవేల కోట్ల అప్పులు తీర్చామని చెప్పారు. బాగానే ఉంది. మరి 17వేల కోట్ల అప్పు ఎందుకు చేశారో వివరించాలి కదా? రైతు రుణమాఫీపై వాయిదాలు వేస్తూ ఆగస్టు పదిహేను అని అంటున్నారు. నిజంగా అప్పుడు చేస్తే గొప్ప విషయమే.కార్పొరేషన్ ఏర్పాటు చేసి, బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుంటామని అంటున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇలాంటి ప్రయత్నం చేయకపోలేదు. అప్పట్లో కేంద్రంలో ఉన్నది తన అనుకూల ప్రభుత్వమే అయినా, ఆయన ప్రతిపాదనకు రిజర్వు బ్యాంక్ ఒప్పుకోలేదు. ఇప్పుడు రేవంత్ ఎలా చేయగలుగుతారో చూడాలి. పలు ప్రాంతాలలో కరెంటు కోతలు ఇబ్బంది పెడుతున్నాయని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. పద్నాలుగు సీట్లు సాధిస్తామని అంటున్నారు. తన ప్రభుత్వంలో తప్పు చేయలేదని అంటున్నారు. మంచిదే. ప్రజలను నిరాశపరచలేదని, కనుక రిఫరెండంగా భావిస్తున్నామని రేవంత్ అన్నారు.ఇది పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ క్యాడర్‌లో ఒక విశ్వాసం నెలకొల్పడానికి చేసే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఒకవేళ రేవంత్ చెప్పినట్లు 14 సీట్లు సాధిస్తే కాంగ్రెస్‌లో తిరుగులేని నేత అవుతారు. అలాకాకపోతే ఆయన రిఫరెండమే ఆయనకు తలనొప్పిగా మారుతుంది. ఏది ఏమైనా ఏపీలో చంద్రబాబుకు మేలు చేకూర్చే పనిలో ఉన్న కాంగ్రెస్ నేతగా వ్యవహరిస్తారా? లేక బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీని వ్యతిరేకించి సిద్ధాంతానికి కట్టుబడి ఉండే నేతగా ఉంటారా! అన్నది ఆయనే తేల్చుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Allu Arjun Pushpa 2 First Single Release Date and Time Revealed
పుష్ప-2 ఫస్ట్‌ సింగిల్.. రిలీజ్‌ టైమ్ ఇదే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటిస్తోన్న పుష్ప-2 మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్‌ సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేశాయి. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా సుకుమార్‌ డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా పుష్ప-2 మరో క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్‌ డేట్‌ అండ్‌ టైమ్‌ను ప్రకటించారు మేకర్స్‌.మే 1వ తేదీన ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో రిలీజ్‌ చేయన్నట్లు ప్రకటించారు. ఏకంగా ఆరు భాషల్లో ఫస్ట్‌ సింగిల్‌ విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ ప్రత్యేక పోస్టర్‌ను షేర్ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.కాగా.. ఈ చిత్రంలో నేషనల్‌ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎర్రచందన సిండికేట్‌ నేపథ్యంలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప-2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.  S̶e̶n̶s̶a̶t̶i̶o̶n̶a̶l̶ s̶u̶r̶p̶r̶i̶s̶e̶Sensational song ✅🔥🔥#Pushpa2FirstSingle out tomorrow at 5.04 PM in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam & Bengali.#PushpaPushpa chant all the way 💥💥A Rockstar @ThisIsDSP Musical 🎵#Pushpa2TheRule Grand release worldwide on… pic.twitter.com/3fuyv9GFlA— Mythri Movie Makers (@MythriOfficial) April 30, 2024

Perni Nani Comments On Tdp And Janasena Manifesto
దొంగ హామీల ‘చంద్రబాబు’.. బీజేపీకి అర్థమైపోయింది: పేర్ని నాని

సాక్షి, మచిలిపట్నం: చంద్రబాబు, పవన్‌ చెప్పే మాటలు అమలయ్యేవి కావని బీజేపీకి అర్థమైపోయిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘అరచేతిలో వైకుంఠం చూపించే మాటలని కూటమిలోని ఒక సభ్యుడు దూరం జరిగాడు. కూటమి మేనిఫెస్టోలో కనిపించింది మూడు కాదు.. రెండు ఫొటోలే. కూటమి సర్కస్‌ మొదలైంది’’ అంటూ ఎద్దేవా చేశారు.‘‘చంద్రబాబు మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పేసింది. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేశారా?. ఇన్ని హామీలిచ్చాం.. ఇన్ని నెరవేర్చామని చెప్పే ధైర్యం కూడా లేదు. ఇద్దరు మోసగాళ్లకు పాత మేనిఫెస్టో చూపించే సత్తాలేదు. రాష్ట్రాన్ని ఉద్దరించడానికి కాదు.. అధికారం కోసమే ముగ్గురూ కలిశారు. రాష్ట్రాన్ని బాగు చేయడానికి మేనిఫెస్టోలో ఏం పెట్టారు?’’ అని  పేర్ని నాని ప్రశ్నించారు.‘‘2019లో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకున్నారు.. ఇప్పుడెందుకు కలిశారు. కళకళలాడుతుండే డ్వాక్రా గ్రూపులు చంద్రబాబు మూలంగా నాశనమయ్యాయి. ఇప్పుడు మళ్లీ దొంగ హామీలతో చంద్రబాబు జనం ముందుకొస్తున్నారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను సీఎం జగన్‌ నెరవేర్చారు’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.పేర్ని నాని ఇంకా ఏం మాట్లాడారంటే:⇒బాబూ...నీలో నిజాయితీ ఉంటే 2014 మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేశావో చెప్పు⇒జగన్‌ మేనిఫెస్టో విడుదల చేసిన తీరు చూడండి. 2019లో నా మేనిఫెస్టో ఇదిగో.. దీనిలో 99 శాతం నేను అమలు చేశానని ధైర్యంగా చెప్పారు.⇒రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో వివరిస్తూ..ఎన్ని ఇబ్బందులున్నా ఏటా రూ.71 వేల కోట్లు నేను పేదల కోసం ఖర్చు పెట్టానని చెప్పారు.⇒రెండు గంటల పాటు ఊకదంపుడు ఉపన్యాసం చెప్పిన చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటూ అదేమీ చెప్పలేకపోయాడు. ⇒చంద్రబాబునాయుడు నిజంగా నిజాయితీపరుడైతే 2014లో మూడు పార్టీలు కలిసి సంతకం పెట్టి ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమేమి అమలు చేశాడో చెప్పాల్సింది. ⇒ఇళ్లు లేని ప్రతి పేదవానికీ 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పాం..ఎవరికన్నా ఇచ్చాడా? ఎన్ని లక్షల మందికి ఇచ్చాడు? ⇒ఇంట్లో ఆడపిల్ల పుడితే ప్రతి ఆడపిల్లకు రూ.25వేలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తాను అన్నాడు. ఎంత మందికి చేశారు? ⇒డ్వాక్రా అక్కచెల్లెమ్మలు తీసుకున్న రూ.14వేల కోట్లు బేషరతుగా రుణమాఫీ చేస్తాం అన్నారు. చేశారా? రైతులకు రూ.85 వేల కోట్ల అప్పులను తీర్చి బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని కూడా తెప్పిస్తానన్నారు. ఎంత మందికి చేశారు?⇒పాత మేనిఫెస్టో చూపించి ఒక్క మాటంటే ఒక్క మాట మాట్లాడారా?⇒అదే ముగ్గురం మేం మళ్లీ వస్తున్నాం...ఇన్ని హామీలిచ్చాం..ఇన్ని నెరవేర్చాం..మళ్లీ హామీలు ఇస్తున్నాం..అని చెప్పే సత్తా లేకపోయింది⇒ఇదే మోసగాళ్లు ఈ రోజు మాట్లాడిన మాటలు కూడా మనం చూశాం⇒ఇప్పుడొచ్చి నేను పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఉద్దరిస్తానంటున్నాడు. 2014–19 మధ్యలో ఆ వ్యవస్థను సర్వనాశనం చేసింది ఎవరు? ⇒పంచాయతీల్లో సర్పంచ్‌లు, పాలకవర్గం ఉండగా..అధికారమంతా జన్మభూమి కమిటీలకు ఇచ్చి ఏ పథకం కావాలన్నా వారు టిక్‌ పెడితేనే కాని ఇవ్వకుండా ఆ పంచాయతీలను సర్వనాశనం చేసింది ఎవరు?మమ్మల్ని ఏం ఉద్ధరిద్దామని మీరు ముగ్గురూ కలిశారు?⇒నేను ఈ రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే బీజేపీతో కలిశాను అని చంద్రబాబు చాలా గర్వంగా చెప్పాడు. ⇒ఈ రోజు ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి నువ్వేం ఇచ్చావ్‌..? ⇒ప్రత్యేక హోదా ఇచ్చావా? రైల్వే జోన్‌ ఇచ్చావా? విభజన హామీల గురించి ఏమైనా రాశావా? ⇒కడప స్టీల్‌ ప్లాంట్‌ గురించి ఏమైనా రాశావా? విశాఖ స్టీల్స్‌ను అమ్మేయకుండా నిలబెడతాం అని ఏమైనా రాశారా? ⇒మరి మమ్మల్ని ఏం ఉద్ధరిద్దామని మీరు ముగ్గురూ కలిశారు? ⇒కేవలం అధికారం కోసమే మీరు ముగ్గురు జట్టు కట్టారు. ⇒ఈ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మేలు జరిగేది మీ మేనిఫెస్టోలో ఏముంది? ⇒2019లో మీరంతా తిట్టుకున్నారు కదా.? నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అంటూ ఒకరినొకరు తిట్టుకున్నారు కదా!⇒మీకు మీరే ఒకర్ని ఒకరు దొంగలు అన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు దొంగలు ఎందుకు కలిశారు?⇒అదేమంటే జనం కోసమే మేం ముగ్గురం కలిశాం అంటారు. మీరిచ్చిన మేనిఫెస్టోలో జనం కోసం ఏముంది? ⇒జగన్‌ అమ్మ ఒడి రూ.15వేలు ఇస్తున్నాడు కాబట్టి నేను రూ.20వేలిస్తానంటాడు. ⇒జగన్‌ మహిళలకు చేయూత ఇస్తున్నాడు కాబట్టి నేను కూడా పెంచి ఇస్తానంటాడు. ⇒జగన్‌ మత్స్యకారులకు రూ.10 వేలు ఇస్తున్నాడు కాబట్టి నేను రూ.15వేలు ఇస్తానంటాడు.⇒ ఇదే హామీలను 2014లో కూడా ఇచ్చారు కదా? అవేమయ్యాయి? ⇒ ఈ మేనిఫెస్టోలో 90 శాతం జగన్‌ గారి మేనిఫెస్టోను కాపీ కొట్టారు. 10 శాతం కర్నాటకలో కాంగ్రెస్‌ మేనిఫెస్టో కాపీ కొట్టారు.⇒జగన్‌  ఆదాయం గురించి చెప్పిన విధంగా మీకు చెప్పే దమ్ముందా? ⇒ మన రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత..నేను ఖర్చు పెట్టింది ఎంత అని స్పష్టంగా జగన్‌  చెప్పారు. ⇒ ఇన్ని కష్టాలు పడి జగన్‌ గారే రూ.71 వేల కోట్లు ఏటా ఖర్చు చేశారు. ⇒ మీ మేనిఫెస్టో ప్రకారం ఏటా రూ.2 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాలి. ⇒ 2014లో మూడు సెంట్లు స్థలం ఇస్తానని ఇవ్వకుండా..ఇప్పుడు రెండు సెంట్లు అంటున్నాడు. ⇒ జగన్‌ గారు 31 లక్షల మందికి స్థలాలు ఇస్తే ఎక్కడ జగన్‌ను గుర్తుపెట్టుకుంటారో అని రెండు సెంట్లు ఇస్తానంటున్నారు. ⇒ పాత మూడు సెంట్లు సంగతి ఏంటి? అది కూడా కలిపి ఐదు సెంట్లు ఇస్తావా? ⇒ పాత మూడు సెంట్లు బాకీ ఉన్నావు కదా? డ్వ్రాక్రా అక్క చెల్లెమ్మలకు రూ.14వేల కోట్లు బాకీ ఉన్నావు కదా? ⇒ నీ మూలంగా పచ్చగా ఉన్న డ్వాక్రా సంఘాలు నాశనం అయ్యాయి కదా?సంపద సృష్టించడానికి ఈ రాష్ట్రమేమన్నా అక్షయపాత్రా?⇒సరే హామీలిచ్చారు. ఈ హామీలకు ఎంత ఖర్చు అవుతుందని ఖర్చుల వివరాలు కూడా చెప్పాలి కదా? ⇒రాష్ట్ర ఖజానాలో డబ్బు ఎంత ఉంది? నువ్విచ్చిన హామీలకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తావ్‌? దొంగనోట్లు ముద్రిస్తావా? ⇒అప్పు తీసుకురాను అంటున్నాడు. మరి అప్పు తేకుండా రాబడి ఎంత?⇒ ఈ రోజుకీ ఉద్యోగుల జీతభత్యాలు, రిటైర్‌ ఉద్యోగుల పెన్షన్‌ కలిపి ఏటా రూ.80 వేల కోట్లు ఖర్చు అవుతోంది.⇒రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉన్న అప్పుల ఇన్‌స్టాల్‌మెంట్లు, వడ్డీలు అన్నీ కలిపి ఏటా రూ.55 వేలు కట్టాలి.⇒నీకు నిజాయితీ ఉంటే ఎంత ఆదాయం వస్తుంది..ఎలా ఖర్చు చేస్తావు అనేది చెప్పాల్సింది. ⇒అదేమంటే నేను సంపద సృష్టిస్తాను అంటాడు. ఆ సంపదలో నుంచి పథకాలు అమలు చేస్తాడట. ⇒సంపద సృష్టించాలంటే అదేమన్నా అక్షయపాత్రా? లంకెబిందెలా? రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ⇒ ఈ పథకాలన్నీ అమలు చేయడానికి నువ్వు డబ్బెక్కడి నుంచి తెస్తావో ప్రజలకు చెప్పాలి కదా? ⇒ 2014లో ఎలాగైతే పచ్చి దగా, మోసం చేశావో..మళ్లీ ఈ మేనిఫెస్టోను అదే దగాతో విడుదల చేశావు.ఎన్డీయేకి 400 సీట్లు దేనికీ..? ఎవరి పౌరసత్వాలు తీసేయబోతున్నారు?:⇒ఎన్డీయేకి 400 సీట్లు కావాలట. దేనికోసం? ఎంత మందిని కాల్చుకు తినడానికి? ⇒ మైనార్టీలను ఈ దేశంలో లేకుండా తరిమేస్తారా? అత్యధిక మెజార్టీ దేనికి మీకు? ⇒ అత్యధిక మెజార్టీ ఇవ్వడం వల్ల మీరు ఏమేం చేయబోతున్నారు? ⇒ ఎవరివైనా పౌరసత్వాలు, ఓట్లు తీసేయబోతున్నారా? ఏం దుడుకు చర్యలు చేయడానికి 400 సీట్లు అడుగుతున్నారు? ⇒ మీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? ⇒ నిజాయితీగా మాట్లాడటం అనేది చంద్రబాబు జన్మలో ఒక్కసారి కూడా జరగలేదు.⇒ ఎంత సేపు మోసం, దగా. అవసరం ఉన్నప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించడం..అవసరం తీరాక తగలబెట్టేయడం. ⇒ మనిషి అన్నాక వంద మాటలు చెప్తే కనీసం 90 మాటలన్నా అమలు చేయాలి కదా? ⇒ మనిషి అన్నాక కనీసం విశ్వసనీయత ఉండాలి కదా? ⇒ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, బీజేపీ లాంటి వల్లే కదా..దేశంలో, రాష్ట్రంలో రాజకీయ నాయకుల విలువ పోతున్నది? ⇒ అవసరం ఉంటే ఓట్ల కోసం ఎన్ని పచ్చి మోసపు మాటలైనా చెప్తారు అనే భావన ప్రజల్లో ఉన్నది మీలాంటి వాళ్ల వల్లనే.⇒ జగన్‌ పథకాలు అమలు చేయడానికి నువ్వెందుకు బాబూ?:⇒ మీ మేనిఫెస్టో అన్నీ జగన్‌ గారి పథకాలే కదా? జగన్‌ గారి పథకాలు అమలు చేయడానికి మీరు కావాలా? జగనే ఉన్నాడుగా..!⇒ మొన్నటి వరకూ వాలంటీర్లు అమ్మాయిలను అమ్మేస్తున్నారు..మిట్ట మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేనప్పుడు తలుపులు కొడుతున్నారు అన్నారు. ⇒ వాలంటీర్‌ వ్యవస్థను రద్దు చేస్తాం అన్న వాళ్లు ఇప్పుడు వాళ్లను కొనసాగిస్తాం..పదివేలు గౌరవ వేతనం ఇస్తాం అంటున్నారు. ⇒ మీకు అధికారం ఇస్తే వాలంటీర్‌ వ్యవస్థను ఏం చేస్తారో జనానికి తెలియదా? ⇒ ఈ రోజు చంద్రబాబుకు కొత్తగా ముస్లింలు, మైనార్టీలపై ప్రేమ వచ్చేసింది. ⇒ నీ ఐదేళ్ల పరిపాలనలో ఒక్కరంటే ఒక్క ముస్లిం మంత్రి లేడు.⇒ అధికారంలో ఉంటే రాజ్యాధికారంలో మైనార్టీలకు వాటా ఇవ్వవు. ⇒ ఇప్పుడు మాత్రం ఓట్ల కోసం ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీలకు సంక్షేమం చేసేస్తానంటూ చెప్పుకొస్తున్నాడు.⇒ 2014 మేనిఫెస్టోలో రజకులు, మత్స్యకారులను ఎస్సీలుగా, బోయలను ఎస్టీలుగా, కాపులను బీసీలుగా చేస్తానన్నాడు. ఎవరినన్నా చేశాడా? ⇒ ఎస్సీ వర్గీకరణ  చేస్తానంటూ మాల, మాదిగలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.⇒ 1999 నుంచి ఢిల్లీలో చక్రం తిప్పాను అంటావు..ఎస్సీల వర్గీకరణ చేశావా? ⇒ మళ్లీ ఇప్పుడు ఎన్నికలు రాగానే ఎస్సీల వర్గీకరణ చేస్తానంటున్నాడు.⇒ మొన్నటి వరకూ రజకులకు ఇస్త్రీ పెట్టె ఇస్తానన్నాడు..ఇప్పుడు కరెంట్‌ ఇస్త్రీ పెట్టె ఇస్తాడట.⇒ మొన్నటి వరకూ వడ్డెరలకు డ్రిల్లింగ్‌ మిషన్‌ ఇస్తానన్నాడు. ఇప్పుడు కరెంట్‌ డ్రిల్లింగ్‌ మిషన్‌ ఇస్తాడట. ⇒ చేనేతలకు మరమగ్గాలు ఇస్తాడట. మరి యాదవులకు కూడా కరెంట్‌ గొర్రెలను ఇస్తావా?⇒ ఎంత సేపూ వెనుకబడిన వర్గాలు చదువులు లేకుండా, ఉద్యోగాలు లేకుండా కులవృత్తులు చేసుకుంటూనే ఉండాలా? ⇒అసలు ఈ వెనుకబడిన వర్గాలకు చదువు ఎందుకు చెప్పించవు? ⇒ఇంగ్లీషులో చదువు చెప్పించి మీ జీవితాలు బాగుచేస్తానని చెప్పాలి కదా? ⇒ నాయీ బ్రాహ్మణులకు అంతకు ముందు కత్తెర్లు ఇస్తానన్నాడు. ఇప్పుడు ట్రిమ్మర్లు ఇస్తాడట. ⇒వాళ్లకు నాణ్యమైన ఇంగ్లీషు మీడియం విద్యను అందించి దమ్ముగా పెద్దింటి పిల్లలతో పోటీ పడేటట్లు చేయాలి కదా?⇒ఎందుకు ఒక్క రోజన్నా జగన్‌ గారిలా ఆలోచించలేకపోతున్నావ్‌..?నీలో నిజాయితీ ఉంటే నీ దగా మేనిఫెస్టోకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పు:⇒బుర్రకథ బ్యాచ్‌లా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, బీజేపీ తయారయ్యాయి. ⇒ఒకరు తానా అంటే మరొకరు తందానా అంటారు. ⇒ చంద్రబాబును నేను చాలెంజ్‌ చేస్తున్నా. నిజంగా నువ్వు నిజాయితీ గల రాజకీయ నాయకుడివైతే నా సవాల్‌ను స్వీకరించు.⇒ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత? నువ్వు చెప్పిన ఈ దగా మేనిఫెస్టోకు ఖర్చు ఎంతవుతుందో చెప్పాలి. ⇒ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తావో చెప్పే నిజాయితీ నీలో ఉందా?⇒అందుకే నువ్వు పింఛన్‌ 4వేలు ఇస్తానన్నా..జగన్‌ 3,500 ఇస్తానంటే జనం జగన్‌వైపే ఉన్నారు. ⇒ 4వేలు చెప్పినా ఇచ్చేది లేదని వాళ్లకి స్పష్టంగా తెలుసు.⇒ జగనంటే ఐదు పదుల నడుస్తున్న నమ్మకం. ⇒ ఈ బుర్రకథ బ్యాచ్‌ అంటే ఏడున్నర పదుల తిరుగాడే అపనమ్మకం. ⇒ మనకు వయసు ఎంత వచ్చిందనేది కాదు..ఒక్క రోజన్నా నిజాయితీగా బతికామా అన్నదే చూడాలి..⇒ దమ్ముగా జగన్‌ గారిలా దీనికి ఎంత ఖర్చు అవుతుందో నిజాయితీ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నా. ⇒పేదల్లో పేదరికం పోవాలంటే ఆ ఇంట్లో పిల్లల చదువుల ద్వారానే పోతుందనేది జగన్‌ గారు గట్టిగా నమ్ముతారు.⇒ అందుకే ఆయన చదువు మీద దృష్టి పెట్టి నాణ్యమైన చదువును అందిస్తున్నారు.⇒ అందుకే ఇప్పటి వరకూ విద్యపై జగన్‌ గారు రూ.73వేల కోట్లు ఖర్చు చేశారు.⇒ నిజాయితీగా గత ఐదేళ్లలో నేనేం చేశానో మళ్లీ అదే చేస్తాను అని జగన్‌ చెప్తున్నాడు. దానికి ఎంత గుండె ధైర్యం కావాలి? ⇒ మోసం చేయడానికి ధైర్యం అవసరం లేదు. ఏ వెదవైనా మోసం చేయగలడు.⇒ అమ్మ ఒడి గతంలో కంటే నేను రెండు వేలు పెంచగలను అని చెప్తున్నాడు. చెప్తే నిజాయితీగా అమలు చేయాలి కదా?మోసం చేయడం కంటే చచ్చిపోవడం మేలన్నారు జగన్‌..!:⇒ పింఛన్‌ రూ.3,500 ఒకే సారి చెప్పు అంటే లేదంటే లేదన్నాడు జగన్‌.⇒ దమ్ముగా నేను రూ.3,500 వేలే ఇవ్వగలను. అది కూడా రెండు విడుతల్లో పెంచుతాను అని ఖచ్చితంగా చెప్పాడు.⇒ మోసం చేసే మాటలు చెప్పడం కంటే చచ్చిపోవడం మేలన్నాడు. అలాంటి మోసపు మాటలు నేను చెప్పను అన్నాడు.⇒  అలా చెస్తే ప్రజలు నమ్మకం పెంచుకుంటారు. జగన్‌ చెప్తే చేస్తాడని ఆశలు పెంచుకుంటారు. అలా మోసం చేయలేను అన్నాడు.⇒  ఈ రాష్ట్రంలో 80 శాతం కుటుంబాలకు మేలు జరిగేలా నేను పరిపాలన చేశానని జగన్‌ చెప్తున్నారు. ⇒ మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని కూడా దమ్ముగా చెప్తున్న నాయకుడు వైఎస్‌ జగన్‌. ⇒ చంద్రబాబుకు అలాంటి ధైర్యం ఉందా? 2014–19లో తానే పరిపాలన చేశాడో అదే పరిపాలన తెస్తానని చెప్పే ధైర్యం, దమ్ము ఉందా? ⇒ 2014–19 మధ్య ప్రజలు మీకు అధికారం ఇస్తే మేం దిక్కుమాలిన పరిపాలన చేశాం అని మీ నోటితో మీరే సాక్ష్యం చెప్తున్నారు.⇒ 2014లో కోటి పేద, మద్యతరగతి కుటుంబాలున్నాయి. ఇంటికో ఉద్యోగం అన్నాడు..లేదంటే నిరుద్యోగ భృతి అన్నాడు.⇒ ఎంత మందికి ఇచ్చారు..కోటి ఉద్యోగాలు ఇచ్చాడా? నిరుద్యోగ భృతి అయినా ఇచ్చాడా? ⇒ నీ కొడుకు లోకేశ్‌కు ఉద్యోగం ఇచ్చుకున్నావు తప్ప ఎవరికి ఇచ్చావ్‌? ⇒ మళ్లీ ఇప్పుడు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాను..లేదంటే 3వేల నిరుద్యోగ భృతి అంటున్నాడు.⇒ అతని మేనిఫెస్టో అంతా పాపాల పుట్ట.. అసత్యాల బొంత.  

IPL 2024: KKR Bowler Harshit Rana Fined 100 Percent Of His Match Fees And Suspended For One Match
IPL 2024: కేకేఆర్‌ స్టార్‌ ప్లేయర్‌కు భారీ షాక్‌.. జరిమానాతో పాటు నిషేధం

కేకేఆర్‌ స్టార్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణాకు భారీ షాక్‌ తగిలింది. నిన్న (ఏప్రిల్‌ 29) ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను అతని మ్యాచ్‌ ఫీజ్‌లో 100 శాతం కోత విధించబడింది. ప్రస్తుత సీజన్‌లో రాణా రెండోసారి కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడటంతో అతనిపై ఓ మ్యాచ్‌ నిషేధం కూడా పడింది. ఢిల్లీతో మ్యాచ్‌ సందర్భంగా ఆ జట్టు బ్యాటర్‌ అభిషేక్‌ పోరెల్‌ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు రాణాపై కఠిన చర్యలు తీసుకున్నారు. అభిషేక్‌  ఔటైన తర్వాత రాణా శృతిమించిన సంబురాలు (అభిషేక్‌ను డగౌట్‌ వైపు వెళ్లాలని కోపంగా ఆదేశించాడు) చేసుకుని తగిన మూల్యం చెల్లించుకున్నాడు. రాణా కొద్ది రోజుల కిందట ​కూడా ఇలాగే ప్రవర్తించి జరిమానాను ఎదుర్కొన్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ను ఔట్‌ చేశాక ఓవరాక్షన్‌ (ఫ్లయింగ్‌ కిస్‌ ఇస్తూ కోపంగా చూశాడు) చేశాడు. అందుకు మ్యాచ్‌ ఫీజ్‌లో 60 శాతం జరిమానాను ఎదుర్కొన్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో రాణా అతి చేసినా బౌలింగ్‌లో ఆట్టున్నాడు. 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగా.. కేకేఆర్‌ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఫిలిప్‌ సాల్ట్‌ (68) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి కేకేఆర్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు కేకేఆర్‌ బౌలర్లు చెలరేగడంతో ఢిల్లీ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. కుల్దీప్‌ యాదవ్‌ (35 నాటౌట్‌) ఆ జట్టులో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వరుణ్‌ చక్రవర్తి 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా తలో 2 వికెట్లు, స్టార్క్‌, నరైన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.  

IPL 2024 LSG VS MI: LSG Won The Toss And Elected To Field, Here Are Playing XI
IPL 2024: లక్నో, ముంబై మ్యాచ్‌.. సంచలన ఫాస్ట్‌ బౌలర్‌ రీఎంట్రీ

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 30) లక్నో సూపర్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడుతున్నాయి. లక్నో హోం గ్రౌండ్‌ అయిన భారతరత్న శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఎఖానా క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఫాస్ట్‌ బౌలింగ్‌ సంచలనం మయాంక్‌ యాదవ్‌ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు. లక్నో జట్టులో మరిన్ని మార్పులు జరిగాయి. క్వింటన్‌ డికాక్‌ ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. అర్షిన్‌ కులకర్ణి జట్టులోకి వచ్చాడు. ముంబై విషయానికొస్తే.. లూక్‌ వుడ్‌ స్థానంలో గెరాల్డ్‌ కొయెట్జీ తిరిగి జట్టులోకి వచ్చాడు. లక్నో ఈ మ్యాచ్‌తో పాటు మిగతా మ్యాచ్‌లన్నీ గెలిస్తే ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంటుంది. ముంబై ప్లే ఆఫ్స్‌పై ఆశలు దాదాపుగా వదులుకుంది. ప్రస్తుతం లక్నో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. ముంబై చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.తుది జట్లు..ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్‌ ప్లేయర్స్‌: నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, డెవాల్డ్ బ్రెవిస్, నమన్ ధీర్, షమ్స్ ములానీలక్నో సూపర్ జెయింట్స్: కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌: అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్

Dk Shivakumar Asks Amit sha Why Bjp Is In Alliance With Jds
‘‘జేడీఎస్‌తో ఇంకా పొత్తెందుకు’’ బీజేపీకి డీకే శికుమార్‌ ప్రశ్న

బెంగళూరు: సంచలనం రేపిన జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ సెక్స్‌ వీడియోల వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ స్పందించారు. సెక్స్‌ స్కాండల్‌ వెలుగు చూసిన తర్వాత కూడా జేడీఎస్‌తో బీజేపీ ఇంకా ఎందుకు పొత్తులో ఉందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రేవణ్ణపై కర్ణాటక ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రశ్నపై డీకే మండిపడ్డారు. ‘జేడీఎస్‌ కాంగ్రెస్‌తో పొత్తులో లేదు. బీజేపీ పొత్తులో ఉందో లేదో అమిత్‌ షా చెప్పాలి’అని డీకే డిమాండ్‌ చేశారు. ప్రజ్వల్‌ రేవణ్ణ వీడియోల గురించి అతని డ్రైవర్‌ కార్తిక్‌ గౌడ తొలుత బీజేపీ నేతలకే సమాచారమిచ్చాడన్నారు.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement