Sakshi News home page
Advertisement

Top Stories

ప్రధాన వార్తలు

Ksr Comments On Pawan Kalyan's Crazy Words And His Behavior
Pawan Kalyan: దిగజారిన రాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌..

పిచ్చోడి గురించి వినడమే కాని, ఇంతవరకు చూడలేదు.. ఇప్పుడే చూస్తున్నా.. అని ఒక సినమా డైలాగు ఉంది. ఈ మధ్య కొందరు నేతల ప్రసంగాలు గమనిస్తే అలాగే అనిపిస్తుంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను పిచ్చోడని మనం అనజాలం కానీ, ఆయన స్పీచ్‌ల తీరు మాత్రం రాజకీయ అజ్ఞానాన్ని, ఆయన ప్రస్టేషన్‌ను స్పష్టంగా తెలియచేస్తుంది. మొత్తం మీద తన గెలుపు మీద తనకే అపనమ్మకం ఏర్పడిందో, లేక టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మపై అవిశ్వాసం ఏర్పడిందో కానీ, తన కుటుంబ సభ్యులందరిని ఎన్నికల ప్రచారంలోకి దించారు. అలాగే జబర్దస్త్ టీమ్ పై నమ్మకం పెట్టుకున్నట్లున్నారు.అఫ్ కోర్స్.. ఆయన సతీమణి అన్నాలెజోవా కనిపించడం లేదనుకోండి. ఆయన ప్రచారం ఆయన ఇష్టం. ఎందుకంటే పిఠాపురంలో తనను గెలిపించాలని వర్మను వేడుకున్న పవన్‌ కల్యాణ్‌ ఇతర నియోజకవర్గాలలో కూటమి అభ్యర్దులను గెలిపిస్తానని తిరుగుతున్నారు. పిఠాపురానికి, జిల్లాకు, రాష్ట్రానికి ఏమి చేస్తానో చెప్పకుండా ఊదరకొట్టుకుంటూ తిరిగుతున్న పవన్‌ను ఎవరైనా ఎందుకు నమ్ముతారు. సినిమా నటుడు కనుక కాసేపు వినోదం కోసం ఆయనను చూడడానికి వచ్చి, ఆయన పిచ్చి గంతులు, చిందులు చూసి, పనికిమాలిన డైలాగులు విని ఏదో సినిమా చూశాంలే అని జనం సరిపెట్టుకుంటున్నారు. గతంలో గాజువాక, భీమవరంలలో జరిగింది అదే.మరో చిత్రం ఏమిటంటే ఆయన కాకినాడ సిటీలో చంద్రశేఖరరెడ్డి, కాకినాడ రూరల్‌లో కన్నబాబుల అంతు చూడడానికే పిఠాపురంలో పోటీ చేస్తున్నారట. ఆయనే ఈ సంగతి చెప్పారు. నిజంగా వీరి అంతు చూడాలనుకుంటే ఆ నియోజకవర్గాలలో కదా ఆయన పోటీ చేయాల్సింది. అక్కడికి చంద్రశేఖరరెడ్డి ఒకటికి, రెండుసార్లు సవాల్ కూడా విసిరారు కదా? అయినా కాకినాడలో పోటీచేయకుండా పిఠాపురం ఎందుకు పవన్ కళ్యాణ్ చిత్తగించారు.రాజకీయాలలో కాస్త పద్దతిగా మాట్లాడాలి. అచ్చం టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరి నోటికి వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆయా చోట్ల పోటీ చేస్తున్న ప్రత్యర్ధి పార్టీల అభ్యర్దులను పరుష పదజాలంతో దూషిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నైతే పట్టరాని కోపంతో ఊగిపోతూ శాపనార్ధాలు పెడుతున్నారు. ఆయన వైఎస్సార్‌సీపీని, ముఖ్యమంత్రిని అధఃపాతాళానికి తొక్కేస్తారట. ఇది ఆయన సినిమాలో నటించడమనుకుంటున్నారు కానీ, ప్రజాసేవ అనుకోవడం లేదు. అందుకే ఇలాంటి పిచ్చి మాటలు వస్తున్నాయి.2019 లో రెండు చోట్ల పోటీచేసిన పవన్ కల్యాణ్‌ను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఓడించి ఆయన భాషలో చెప్పాలంటే పాతాళానికి తొక్కారు. ఇప్పుడు ఎన్నికలకు ముందుగానే పవన్‌ను చంద్రబాబు అధఃపాతాళానికి తొక్కేశారు. పవన్ కళ్యాణ్ గెలిచినా, ఓడినా పెద్ద తేడా లేకుండా చేసేశారు. ఒకప్పుడు తాను సీఎంను అంటూ ఊగిపోతూ మాట్లాడిన పవన్‌ను ఆ ఊసే ఎత్తనివ్వకుండా చంద్రబాబు తన పెరటి మనిషిగా మార్చుకున్నారు. జనసేనను రాష్ట్రంలో గౌరవప్రదమైన స్థానాలలో పోటీచేయనివ్వకుండా, ఓ ఇరవైఒక్క సీట్లు ఇచ్చి, అందులో డజను సీట్లలో టీడీపీ వాళ్లనే పెట్టి పవన్‌ను కేవలం తన కాళ్ల వద్ద పడి ఉండేలా చంద్రబాబు చేసుకోగలిగారు.చంద్రబాబు వద్ద ఊడిగం చేయడానికే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని భావించిన పలువురు జనసేన నేతలు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ సంగతి అర్ధం కాకో, లేక అర్దం అయినా, చంద్రబాబుకు సరెండర్ అయినందువల్లో నోరు మెదపకుండా ఆయన చెప్పినట్లు పవన్ చేస్తున్నారు. జనసేనను రాష్ట్ర వ్యాప్త పార్టీగా లేకుండా చేసి, కేవలం రెండు, మూడు జిల్లాలకే పరిమితం చేసి పవన్ స్థానం ఏమిటో చంద్రబాబు తెలివిగా చూపెట్టారు. ఇక ఎప్పటికీ జనసేన అధఃపాతాళంలోనే ఉండేలా చంద్రబాబు చేస్తే, ఈయనేమో ఎవరినో తొక్కుతానని ప్రగల్బాలు పలుకుతూ ఆత్మవంచన చేసుకుంటున్నారు.తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం టీడీపీ పిఠాపురం నేత వర్మ కూడా ఈయన ధోరణితో విసిగి చిరాకు పడుతున్నారట. ఆయన పవన్‌కు ఆశించిన రీతిలో సహకరించకపోతే ఇంతే సంగతులు అన్న పరిస్థితి పిఠాపురంలో ఏర్పడిందని చెబుతున్నారు. చంద్రబాబు కన్నా ఘోరంగా అబద్ధాలు చెబుతూ, ఒక్కోచోట ఒక్కో మాట చెబుతూ ప్రజలను, ముఖ్యంగా అభిమానులను బురిడి కొట్టించాలనుకుంటున్న పవన్ లీలలన్నీ ఇట్టే తెలిసిపోతున్నాయి. తాను ఇంటర్ చదివానని, అందులో కూడా ఆయా చోట్ల ఒక్కో గ్రూప్ చదివినట్లు చెప్పడం, తీరా చూస్తే ఆయన ఎస్ఎస్ఎల్‌సి అని బ్రాకెట్ లో 10 వ క్లాస్ అని పెట్టడంతో ఈయన ఏమిటో అర్దం అయింది.ఆస్తుల కొనుగోలు లావాదేవీలలో కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజకీయ జీవితంలోనే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా ఇంత మోసపూరితంగా ఉంటారా అన్న విమర్శకు అవకాశం ఇచ్చారు. పవన్ ఎక్కడా తమ కూటమి అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పడం లేదు. ఎంతసేపు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిను తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. కొన్ని ఉదాహరణలు చూడండి.. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల సొంత ఇళ్లను కూడా తాకట్టు పెట్టేస్తారట. ప్రజలను రోడ్డుపైకి లాగేస్తారట.. బుర్ర, బుద్ది ఉన్నవాళ్లెవరైనా ఇలాంటి పిచ్చి విమర్శలు చేస్తారా? ఏ ప్రభుత్వం అయినా అలా చేయగలుగుతుందా? మరి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అంత వెర్రివాళ్లు, వాళ్లకు ఏమి తెలియదని, ఈయన ఏమి చెబితే దానిని చెవిలో పువ్వు పెట్టుకుని వింటారని అనుకుంటున్నారా? ఆ జిల్లా ప్రజలు బాగా తెలివైన వాళ్లన్న సంగతి పవన్ కు తెలియదు.రేషన్ బియ్యం విక్రయాలలో 20 వేల కోట్ల కుంభకోణం చేశారట. అసలు ప్రభుత్వం ఇస్తున్నదే ఉచిత రేషన్ బియ్యం. అందులో స్కామ్ ఏమిటి? ఇంత అజ్ఞానమా? రీ సర్వే పేరుతో ప్రజల భూములను కంప్యూటరైజ్ చేస్తున్నారట. తద్వారా దోచేస్తారట. ఇది కేంద్రం తీసుకు వచ్చిన చట్టం అని తెలియకుండా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి రాసే తప్పుడు వార్తలను పట్టుకుని పిచ్చి ఉపన్యాసాలు చేస్తే ఏమి ప్రయోజనం. ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటీకరణ జరుగుతుంటే, భూముల వివరాలు కంప్యూటర్లలో ఎక్కించకూడదట. మరి భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్‌లు ఎప్పటి నుంచో అంటే చంద్రబాబు పాలన సమయం నుంచి కంప్యూటరైజ్ అవుతున్నాయి కదా? దాని వల్ల ఏ ప్రమాదం వచ్చిందో పవన్ చెప్పాలి కదా? అసలు ఇంతవరకు ఆ చట్టమే అమలులోకి రాలేదు. అయినా ఇలా వక్రీకరిస్తున్నారు.ఇక రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి, ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలపై కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. దానికి కారణం పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించడానికి మిధున్ ప్రత్యేక శ్రద్ద పెట్టడమే. రాజకీయాలలో ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా పవన్ ఎన్నికలలో పోటీచేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలలో చంద్రబాబుతో కలిసి తిరుగుతూ, వారిని ఓడిస్తా.. వీరిని ఓడిస్తా.. అని చెబుతుండే పవన్ తను పోటీచేసే నియోజకవర్గానికి వేరే పార్టీవారు వచ్చి బాధ్యత తీసుకోకూడదట. దీనిని బట్టే మిధున్ రెడ్డి అంటే పవన్ ఎంత భయపడుతున్నది అర్ధం చేసుకోవచ్చు.మాజీ మంత్రి కన్నబాబుకు చిరంజీవి రాజకీయ భిక్షపెట్టారట. అయినా చిరంజీవిని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అవమానిస్తే స్పందించలేదట. చివరికి తన అన్న విషయంలో కూడా అబద్ధాలు చెప్పడమేనా! చిరంజీవిని అంత చక్కగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రిసీవ్ చేసుకుంటే, చంద్రబాబు చెప్పమన్నాడని, పవన్ కళ్యాణ్ ఈ రకంగా అసత్యాలు చెబుతున్నారు. కన్నబాబు వైఎస్సార్‌సీపీలో ఉంటే ఈయనకు వచ్చిన బాధ ఏమిటి? మరి చిరంజీవి ప్రజారాజ్యంను కాంగ్రెస్‌లో ఎందుకు కలిపారు? పవన్ కల్యాణ్ కొంతకాలం బీజేపీ, టీడీపీలతో, మరికొంతకాలం బీఎస్‌పీ, సీపీఐ, సీపీఎంలతో ఎందుకుపొత్తు పెట్టుకున్నారు. మళ్లీ తాను గతంలో బండ బూతులు తిట్టిన టీడీపీ, బీజేపీల పంచన ఎందుకు చేరారు? ఏదైనా మాట్లాడే ముందు అర్ధం ఉండాలి.మిధున్ రెడ్డి ఏదో మద్యం వ్యాపారి అట. ఈయనేదో పవిత్రుడు మాదిరి కబుర్లు. ఒక పక్క అక్రమ సారా వ్యాపారం చేసి రాజకీయాలలోకి వచ్చిన సీ.ఎమ్‌.రమేష్ ను గెలిపించాలని చిరంజీవి, పవన్ కళ్యాణ్ కోరుతూ మరో పక్క మిధున్‌పై విమర్శలు చేయడం అంటే ఈయన సారా పైత్యం ఏమిటో తెలుస్తూనే ఉంది. ఒకపారి కాపులైనా తనకు ఓటు వేయాలని, మరోసారి తనకు కులం ఏమిటని, ఇలా రకరకాలుగా మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు శాసనసభ ఎన్నికలలో తన దత్తతండ్రి కళ్లలో ఆనందం చూడాలని తిరుగుతున్నారు. అందుకే ఆయనకు ప్రత్యర్థులు ప్యాకేజీ స్టార్ అని పేరు పెట్టారు.పొత్తు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. కానీ ఇంతగా దిగజారి చంద్రబాబుకు తెగ భజన చేస్తున్న తీరు మాత్రం సినీ నటుడుగా ఆయనకు ఏర్పడిన అభిమానులు సైతం భరించలేకపోతున్నారు. జనసేన మొత్తం దివాళా తీసినా పర్వాలేదు.. తాను ఒక్కడినైనా గెలవాలన్న వాంఛతో పిఠాపురంలో తంటాలు పడుతున్నారు. కోట్లు సంపాదించుకుంటూ రోడ్లపైకి ఎందుకు వచ్చానో ప్రజలు ఆలోచించాలి అని పవన్ అన్నారు. అవును!ప్రజలు కచ్చితంగా ఆలోచించాల్సిందే. ప్రస్తుతం రోడ్లపై ఈయన తిరుగుతాడు. ఆ తర్వాత తనను కలవడానికి వచ్చేవారిని రోడ్డుపై నిలబెడతారు! అంతకు మించి ఈయన గెలిచినా, ఓడినా ప్రజలకు చేసే సేవ ఏమీ ఉండదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

alliance facing setback for Allocation of Glass Symbol To Janasena Rebels
కూటమికి గుచ్చుకున్న గాజు గ్లాసు!

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి మరో తల నొప్పి మొదలైంది. టీడీపీ, జనసేన పార్టీ రెబల్స్‌ ఇస్తున్న షాక్‌కు కూటమికి గాజు గ్లాసు గుచ్చుకుంటోంది. గాజు గ్లాసుతో టీడీపీ, జనసేన రెబల్స్‌ పోటీలోకి దిగుతున్నారు. తాజాగా గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్‌గా వాడుకోవచ్చని ఈసీ వర్గాలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈసీపై.. టీడీపీ, బీజేపీ పార్టీల ఒత్తిడి ఫలించదు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వ్యవహరించింది.దీంతో  21 అసెంబ్లీ చోట్ల జనసేన అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తుండగా.. ఈసీ ప్రకటనతో మిగిలిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించే అవకాశం ఉంది. కాగా, టీడీపీ, జనసేన రెబల్స్‌.. గాజు గ్లాస్ గుర్తుతోనే కూటమికి ధమ్కీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విజయనగరం టీడీపీ రెబల్ మీసాల గీతకు, జగ్గంపేట జనసేన రెబల్ సూర్యచంద్రకు ఈసీ గాజు గ్లాస్ కేటాయించింది. ఇక.. ఎస్‌ కోటలో జనసేన రెబల్ కొట్యాడ లోకాభిరామకోటి గాజు గ్లాస్‌తో పోటీకి దిగుతున్నారు. మరోవైపు.. టీడీపీకి పలు నియోజకవర్గాల్లో రెబెల్స్ బెడద తప్పటం లేదు. విజయనగరం, ఉండి, పోలవరం, పెనుగొండ, హిందూపురంలో బరిలో రెబల్ అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు. సినీనటుడు బాలకృష్ణపై పరిపూర్ణానంద స్వామి, పరిటాల సునీతపై ప్రొఫెసర్ రాజేష్, అదితి గజపతిపై మీసాల గీత , జ్యోతుల నెహ్రూపై సూర్యచంద్ర,  రఘురామకృష్ణంరాజుపై ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివ రామరాజు, పోలవరంలో టీడీపీ రెబల్ మొడియం సూర్యచంద్రరావు బరిలో నిలుస్తున్నారు. 

Delhi Police Notices To Cm Revanth Reddy Over Amit Shah Fake Video
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు

న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా డీప్‌ఫేక్‌ వీడియో కేసులో మే 1న విచారణకు రావాలని ఆదేశించింది. తన వెంట గ్యాడ్జెట్స్‌ తీసుకురావాలని తెలిపింది.కాగా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను కాంగ్రెస్‌ వైరల్‌ చేసింది. దీనిపై బీజేపీ, హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేయగా.. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపైన స్పెషల్ సెల్  ఇంటెలిజెన్స్(IFSO) దర్యాప్తు చేస్తోంది.అయితే  తెలంగాణ పీసీసీ అధికారిక ట్విటర్‌ హ్యాండీలో అమిత్‌ షా వీడియో పోస్టు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ చీఫ్‌‌ రేవంత్‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఎంతోపాటు తెలంగాణ డీజీపీ, సీఎస్‌కు కూడా ఢిల్లీ నోటీసులు జారీ అయ్యాయి.కాగా దేవంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా కామెంట్స్‌ చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్‌ షా మాట్లాడినట్టుగా ఉంది. అయితే, అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్టు బీజేపీ స్పష్టం చేసింది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఏమీ మాట్లాడలేదని బీజేపీ తెలిపింది

Entire chiranjeevi family to campaign for Pawan kalyan
ఒక్కడి కోసం ఫ్యామిలీ మొత్తం దిగింది

పార్టీ పెట్టి పుష్కరం దాటినా అసెంబ్లీ  గేటును తాకలేకపోయిన పవన్ కళ్యాణ్ను ఈసారైనా గేటు దాటించేందుకు ఆ ఫ్యామిలీ మొత్తం శ్రమిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలుమార్లు పిఠాపురంలో పర్యటించారు. వర్మ కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువ.. మొత్తానికి  తనను అసెంబ్లీకి పంపే బాధ్యత వర్మదే అని పూర్తిగా సరెండర్ అయ్యారు పవన్. ఇక నాగబాబు.. ఇంకా జబర్దస్త్ టీమ్ ఆది, గెటప్ శ్రీను ఇలా చాలామంది అక్కడ ప్రచారం చేస్తూనే ఉన్నారు. దీంతోబాటు మొన్న వరుణ్ తేజ్ సైతం రాడ్ షో నిర్వహించి బాబాయ్‌ను గెలిపించాలని కోరారు.ఇది కూడా సరిపోవడం లేదని భావించిన పవన్ ఇక ఏకంగా తన పెద్దన్న చిరంజీవిని సైతం రంగంలోకి దించుతున్నారు. తానూ రాజకీయాలకు దూరమని, అసలు పక్క రాష్ట్ర పాలిటిక్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని, తానిప్పుడు పూర్తిగా సినిమాల మీద దృష్టిపెట్టానని, తనను పాలిటిక్స్‌లో ఇన్వాల్వ్ చేయవద్దని ఆమధ్య మీడియాముఖంగా ప్రజలకు వివరణ ఇచ్చారు. ఐతే ఇప్పుడు పవన్ పరిస్థితి దారుణంగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నా తరుణంలో చిరంజీవి ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబులతో కూర్చుని ఒక వీడియోను సైతం రిలీజ్ చేసారు.ఇక అవనీ కాదు కానీ నేనే వస్తాను అని ఫిక్స్ అయిన చిరంజీవి ఇప్పుడు పిఠాపురం వస్తున్నారు. త్వరలో అయన ప్రచారం చేస్తారు. వాస్తవానికి ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పవన్ మీద పోటీ చేస్తున్న వంగా గీత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచారు. అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా వర్మ పోటీ చేశారు. ఆనాడు చిరంజీవి వంగా గీతకు పిఠాపురంలో ప్రచారం చేశారు. అప్పుడు గీత ఏకంగా వర్మను ఓడించి అసెంబ్లీకి వెళ్లారు.  అయితే ఆ వంగా గీత ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మళ్ళీ అదే పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఐతే ఇప్పుడు అదే చిరంజీవి గీతకు వ్యతిరేకంగా తమ్ముడు పవన్ కోసం ప్రచారం చేస్తున్నారు. గతంలో గీతను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేసిన చిరంజీవి ఇప్పుడు అదే గీతను ఓడించాలంటూ తమ్ముడి కోసం ప్రచారం చేయబోతున్నారు. మొత్తానికి సీఎం వైఎస్ జగన్ ప్రభావంతో పవన్‌కు ఓటమి భయం పట్టుకుంది. దానికితోడు స్థానికురాలు అయిన గీతను ఓడించడం తనకు అసాధ్యం అని పవన్ కు అర్థం కావడంతో కనీసం జీవితంలో ఒకసారి అయినా ఎమ్మెల్యే అవ్వాలన్న జీవితాశయం నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.:::: సిమ్మాదిరప్పన్న

Ola Cabs Ceo Hemant Bakshi Quits In Three Months
చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్‌ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు

ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ఓలా క్యాబ్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే ఆ సంస్థ సీఈఓ పదవికి హేమంత్ బక్షి రాజీనామా చేసినట్లు సమాచారం.  దీంతో పాటు సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఓలా క్యాబ్స్‌ దాదాపు 200 మంది ఉద్యోగుల్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయిఐపీఓకి ఓలా ఓలా క్యాబ్స్‌ ఐపీఓ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్స్‌తో ఓలా క్యాబ్స్‌ ఇటీవలే చర్చలు నిర్వహించింది. మరో రెండు మూడు నెలల్లో సెబీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్‌ ఇప్పటికే ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది.ఈ తరుణంలో సీఈఓ రాజీనామా, ఉద్యోగుల తొలగింపు అంశం ఓలా క్యాబ్స్‌ చర్చాంశనీయంగా మారింది. కాగా, ఓలా క్యాబ్స్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 

కావ్యా మారన్‌ (PC: IPL)
ఎంత పనిచేశావు కమిన్స్‌!.. కావ్య రియాక్షన్‌ వైరల్‌

పవర్‌ హిట్టింగ్‌తో దుమ్ములేపుతూ ఐపీఎల్‌-2024లో రికార్డులు సృష్టించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతోంది. బారీ విజయాల తర్వాత తొలుత ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన ప్యాట్‌ కమిన్స్‌ బృందం.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో చిత్తైంది.చెపాక్‌ వేదికగా 78 పరుగుల తేడాతో ఓడి.. ఐపీఎల్‌ చరిత్రలోనే తమ భారీ పరాజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌ చూస్తున్నంత సేపు అసలు బ్యాటింగ్‌ చేసేది సన్‌రైజర్స్‌ జట్టేనా అనేంత మందకొడిగా బ్యాటింగ్‌ సాగింది. Batting 🤝 Bowling 🤝 Fielding @ChennaiIPL put on a dominant all-round performance & continue their good show at home 🏠 Scorecard ▶️ https://t.co/uZNE6v8QzI#TATAIPL | #CSKvSRH pic.twitter.com/RcFIE9d46K— IndianPremierLeague (@IPL) April 28, 2024 అదే విధంగా.. తొలుత ఫీల్డింగ్‌ చేసిన సమయలోనూ సన్‌రైజర్స్‌ ఏమాత్రం ఆకట్టులేకపోయింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ సహ యజమాని కావ్యా మారన్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.చెపాక్‌లో చెన్నైతో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు స్కోరు చేసింది.ఓపెనర్‌, కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్ 98 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. అయితే, గైక్వాడ్‌ 97 పరుగుల వద్ద ఉన్నపుడు రనౌట్‌ అయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది.కానీ సన్‌రైజర్స్‌ ఫీల్డర్ల తప్పిదం వల్ల అతడు బతికిపోయాడు. చెన్నై ఇన్నింగ్స్‌ పందొమ్మిద ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఉనాద్కట్‌ బౌలింగ్‌లో నాలుగో బంతిని అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ దిశగా.. ఆఫ్‌ కట్టర్‌గా సంధించగా..  గైక్వాడ్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు.బంతిని అందుకున్న కమిన్స్‌ వికెట్లకు గిరాటేయడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో గైక్వాడ్‌ రెండు పరుగులు తీసుకుని సింగిల్‌ తీసి రెండో పరుగు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కావ్యా మారన్‌ స్పందిస్తూ.. ‘‘నో.. దేవుడా ఎంత పనిపోయింది’’ అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.pic.twitter.com/eBuDpO6WgK— Cricket Videos (@cricketvid123) April 28, 2024

శివం దూబే (PC: IPL.com)
T20 WC: తుదిజట్టులో చోటివ్వాల్సిందే.. కెప్టెన్‌ కూడా కాదనలేడు!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ శివం దూబే మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 20 బంతుల్లో ఒక ఫోర్‌, నాలుగు సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(98), డారిల్‌ మిచెల్‌(52)తో కలిసి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు 212 పరుగుల భారీ స్కోరు అందించాడు. తద్వారా రైజర్స్‌పై 78 పరుగుల తేడాతో గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు.కాగా ఐపీఎల్‌-2024లో ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. సీఎస్‌కే తరఫున మిడిలార్డర్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగుతున్న దూబే.. తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 350 పరుగులు చేశాడు.ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టు ఇప్పటి దాకా సాధించిన ఐదు విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌-2024 ఆడనున్న టీమిండియాలో అతడికి తప్పక చోటివ్వాలని డిమాండ్లు పెరిగాయి.ఈ నేపథ్యంలో సీఎస్‌కే తాజా విజయం నేపథ్యంలో దూబే ఇన్నింగ్స్‌పై స్పందించిన భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పిల్లాడు సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతడిని కేవలం ప్రపంచకప్‌ జట్టుతో పంపించడమే కాదు.తుదిజట్టులోనూ అతడిని తప్పక ఆడించాలి. కేవలం ఎంపిక గురించి కాదు.. ప్లేయింగ్‌ ఎలెవన్‌లోనూ చోటివ్వాలని సెలక్టర్లు ఫిక్సైపోవాలి. కెప్టెన్‌గానీ.. మేనేజ్‌మెంట్‌ గానీ అతడిని విస్మరించడానికి వీల్లేదు.ప్రస్తుత టీమిండియా ప్లేయర్లలో అతడి కంటే బెటర్‌గా హిట్టింగ్‌ ఆడే బ్యాటర్‌ మరొకరు లేరు. ఒకవేళ అతడిని గనుక బెంచ్‌కే పరిమితం చేస్తే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌-2024 మొదలుకానుంది. ఈ నేపథ్యంలో జట్ల ప్రకటనకు మే 1 ఆఖరి తేదీగా పేర్కొంది ఐసీసీ.  

SC stays CBI probe against Bengal officials teachers recruitment case
సీఎం మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట

ఢిల్లీ: టీచర్ల నియామకాలకు సంబంధించిన కేసులో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. 24 వేల టీచర్ల నియామకాన్ని పూర్తిగా  రద్దు చేసి, సీబీఐ విచారణ చేపట్టాలని కోల్‌కతా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును టీఎంసీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో  సవాల్‌ చేసింది. ఈ క్రమంలో సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌కు చెందిన ప్రభుత్వ అధికారులపై లోతుగా దర్యాప్తు చేయాలన్న సీబీఐకి ఇచ్చిన ఆదేశాలపై తాజాగా స్టే విధించింది.2016 నాటి టీచర్లు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ రిక్రూట్‌మెంట్‌లో  అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అప్పటి మొత్తం రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేయాలని... ఇప్పటివరకు టీచర్లు తీసుకున్న జీతాలను వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు  ఇచ్చింది. ఇక ఈ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియపై పశ్చిమ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ను మరింత దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. కోల్‌కత హైకోర్టు తీర్పుపై దీదీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో తాజాగా సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసుపై సుప్రీం కోర్టు తదుపరి విచారణను మే 6 తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ వ్యవహరంలో సీబీఐ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ, పశ్చిమ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌లోని పలువురు అధికారులను సీబీఐ అరెస్ట్‌ చేయటం గమనార్హం.

IPL 2024 Dc vs KKR: Delhi capitals won the toss elected to bat First
ఢిల్లీతో ​మ్యాచ్‌.. కేకేఆర్‌ స్టార్‌ బౌలర్‌ రీ ఎంట్రీ! తుది జట్లు ఇవే

ఐపీఎల్‌-2024లో మరో కీలక పోరుకు తెరలేచింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు దూరమైన పృథ్వీ షా తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు కేకేఆర్‌ రెండు మార్పులు చేసింది. తుది జట్టులోకి మిచెల్‌ స్టార్క్‌, వైభవ్‌ ఆరోరా వచ్చారు. ఇక పాయింట్ల పట్టికలో కేకేఆర్‌ రెండో స్ధానంలో కొనసాగుతుండగా.. ఢిల్లీ ఆరో స్ధానంలో ఉంది.తుది జట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్‌ కీపర్‌), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్ సలామ్, లిజాద్ విలియమ్స్, ఖలీల్ అహ్మద్ 

Bjp Is Scared Of Mulayam Family, Shivpal Yadav Claimed
ములాయం సింగ్‌ కుటుంబం అంటే బీజేపీకి భయం

దివంగత సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబాన్ని చూసి అధికార పార్టీ బీజేపీ భయపడుతోందని సమాజ్‌వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ అన్నారు. బీజేపీ నేతలు ఎస్పీకి వ్యతిరేకంగా ఎంత ఎక్కువ మాట్లాడితే.. లోక్‌సభ ఎన్నికల్లో విజయం అదే స్థాయిలో ఉంటుందని తెలిపారు.సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తరుణంలో శివపాల్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. మూడో దశ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 10 స్థానాల్లో ఎస్పీ, ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.యూపీలో మొదటి రెండు దశల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పేలవమైన ఓటింగ్‌పై శివపాల్ యాదవ్ మాట్లాడుతూ.. మా ఓటర్లు కూలీలు, రైతులు. వారు, ఎండని వేడిని పట్టించుకోరు. ఓటర్లు వారి ఓటు హక్కును ఉపయోగిస్తున్నారు. కానీ బీజేపీ ఓటర్లు బయటకు రావడం లేదు. అందుకే బీజేపీ నేతల్లో ఆందోళన నెలకొందని అన్నారు.  శివపాల్ యాదవ్‌కు వృద్ధాప్యం వచ్చిందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ నేత శివపాల్‌ యాదవ్‌ స్పందించారు. నేను రోజుకు 40 సమావేశాలు నిర్వహిస్తున్నాను. యోగి మాత్రం రోజుకు నాలుగైదు సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారని తెలిపారు.యూపీలో 10లోక్‌సభ స్థానాలకు మే 7న మూడో దశ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. మెయిన్‌పురి, ఫిరోజాబాద్, సంభాల్, బుదౌన్  స్థానాలు ఉన్నాయి. ఈ దశలో ఓటింగ్‌కు వెళ్లే చాలా స్థానాలను ఎస్పీ కంచుకోటలుగా కొనసాగుతున్నాయి. 

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement