Top Stories
ప్రధాన వార్తలు
May 15th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 15th AP Elections 2024 News Political Updates9:40 AM, May 15th, 2024టీడీపీ నాయకుల దాష్టీకం..పల్నాడు జిల్లా..దాచేపల్లి మండలం మాదినపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాష్టీకంకర్రలు, ఇనుప రాడులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులుబత్తుల ఆదినారాయణ రెడ్డి అనే వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులుతీవ్ర గాయాల కారణంగా ఆసుపత్రికి తరలింపు.గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు 8:51 AM, May 15th, 2024ఏలూరులోనూ టీడీపీ దౌర్జన్యకాండఏలూరు చేపల తూము సెంటర్ 40 డివిజన్ లో రెచ్చిపోయిన టీడీపీ మూకలువైఎస్ఆర్సిపి కార్యకర్తలపై కత్తులతో దాడిగణేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలుపోలింగ్ కేంద్రాల వద్ద ఇరువర్గాల మధ్య చెలరేగిన గొడవ.. తాజా కొట్లాటకు దారి తీసిన వైనంగాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అర్ధరాత్రి టెన్షన్ వాతావరణంప్రభుత్వ ఆసుపత్రి వద్ద మళ్లీ దాడిరంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులుకొనసాగుతున్న పోలీస్ పహారా 8:25 AM, May 15th, 2024కడపలో అభ్యర్థులకు హైసెక్యూరిటీవైయస్సార్ జిల్లా జమ్మలమడుగులో కొనసాగుతున్న 144 సెక్షన్పట్టణంలో జనాలు ఎక్కువగా గుమికూడి ఉండకూడదంటూ పోలీసుల ఆదేశాలువైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డితో పాటు కూటమి అభ్యర్ది ఆదినారాయణ రెడ్డి, కడప టిడిపి ఎంపీ అభ్యర్ది భూపేష్ రెడ్డి లకు 2+2 నుండి 4+4 భద్రత పెంపు 7:59 AM, May 15th, 2024ఏపీలో పోలింగ్ శాతం మొత్తంగా ఇలా.. ఏపీలో మొత్తంగా 81.69 శాతం పోలింగ్ నమోదు.ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ నమోదు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతం నమోదు.అల్లూరి : 70.20అనకాపల్లి : 83.84అనంతపురం : 81.08అన్నమయ్య : 77.83బాపట్ల : 85.15చిత్తూరు : 87.09కోనసీమ : 83.84తూ.గో : 80.93ఏలూరు : 83.67గుంటూరు : 78.81కాకినాడ: 80.31కృష్ణా: 84.05కర్నూలు : 76.42నంద్యాల: 82.09ఎన్టీఆర్: 79.36పల్నాడు : 85.65పార్వతిపురం మన్యం : 77.10ప్రకాశం : 87.09నెల్లూరు : 79.63సత్యసాయి : 84.63శ్రీకాకుళం : 75.59తిరుపతి : 78.63విశాఖ : 68.63విజయనగరం : 81.33ప.గో : 82.59కడప : 79.58 7:45 AM, May 15th, 2024టీడీపీ నేతల దాడులు..పల్నాడు జిల్లామాచవరం గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గుండాలు దాడి.మాచవరం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు చౌదరి సింగరయ్య పార్టీ నాయకుడు దారం లక్ష్మీ రెడ్డిపై టీడీపీ నాయకుల దాడి.ఇద్దరి కాళ్లు, చేతులపై దాడి. గాయపడిని వారిని స్థానిక ఆసుపత్రికి తరలింపు. 7:20 AM, May 15th, 2024శాంతి భద్రతలకు సహకరిస్తాం: కేతిరెడ్డి పెద్దారెడ్డిఅనంతపురం:ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్..టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాంతాడిపత్రిలో వైఎస్సార్సీపీ శ్రేణులు సమన్వయంతో ఉండాలిశాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తాం. 7:00 AM, May 15th, 2024తాడిపత్రిలో ఉద్రిక్తతలు..అనంతపురం:తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాల మోహరింపుతాడిపత్రిలో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన జేసీ వర్గీయులుఅల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులుపోలీసుల విజ్ఞప్తితో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితాడిపత్రిని వీడిన టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో పరిస్థితి ని అదుపులోకి తెచ్చిన పోలీసులునగరంలో 144 సెక్షన్ కొనసాగింపు 6:45 AM, May 15th, 2024డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్ టీడీపీ దౌర్జన్యకారుల మీద చర్యలకు డిమాండ్ఏపీ డీజీపీ హరీష్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన వనిత. చంద్రగిరి, గురజాల, తాడిపత్రి, గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తల హింసాకాండ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని వనిత సీరియస్. దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు. 6:30 AM, May 15th, 2024విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచింది: బొత్సఅన్ని ప్రాంతాల్లోని ఫ్యాన్ గాలి కనిపించిందిమహిళలు, పెద్ద ఎత్తున బారులు తీరి ఓటింగ్‌లో పాల్గొన్నారుతమకు గౌరవం పెరిగిందని వృద్దులు భావించి ఓటు వేశారు.ఎన్నికల్లో టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నిందిప్రజలు సంక్షేమ పథకాలను అడ్డుకుంది.ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయివైఎస్ .జగన్ గెలుస్తారు.. వైజాగ్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారుఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చుతారుమాయ మాటలను ప్రలోభాలను ప్రజలు నమ్మలేదునేను రాజీనామా చేస్తున్నట్లు ఒక మాయ లేఖ సృష్టించిందిఈ లేఖ కూటమి దిగజారుడు రాజకీయాలకు ఒక పరాకాష్టమాయ మాటలతో అధికారంలోకి రావాలని చంద్రబాబు చూశారుచంద్రబాబు మాయ మాటలు ప్రజలు అందరికి తెలుసుమాట ఇస్తే మడమ తిప్పని నేతలు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్సీఎం జగన్ మీద నమ్మకంతో మళ్ళీ ప్రజలు ఓట్లు వేశారుటీడీపీ నేతలు సహనం కోల్పోయారుమా నాయకులు, కార్యకర్తలు ఉద్రేకపడొద్దని సూచన చేశాంఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు
టీడీపీ రాక్షస మూకల రక్తదాహం
హైదరాబాద్, సాక్షి: పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా తెలుగు దేశం పార్టీ రాక్షస మూకల రక్తదాహం తీరలేదు. మంగళవారం రెండో రోజూ రాష్ట్రంలో అనేక చోట్ల తీవ్ర స్థాయిలో హింసాకాండకు, విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులకు దిగారు. బుధవారం కూడా బీతావాహ వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు, తాడిపత్రి లాంటి చోట్ల తెలుగు దేశం ముఖ్య నేతలను ముందుండి.. తమ శ్రేణులను, అరాచక మూకలను రెచ్చగొడుతూ దాడులు చేయించి, బీభత్సం సృష్టించారు. ఎన్నికల్లో తమకు ఓటేయలేదన్న కక్షతో.. దొరికినవారిని దొరికినట్లుగా తీవ్రంగా కొట్టారు. రక్తాలు కారేలా గాయపరిచారు. ఆస్తులు ధ్వంసం చేశారు.టీడీపీ మూకలు పేట్రేగిపోవడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలతో పాటు, స్థానిక ప్రజలూ భీతావహులయ్యారు. అంత విధ్వంసం జరుగుతుంటే... వారిని అడ్డుకోవడంలోనూ పోలీస్ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది.పల్నాడుదాచేపల్లి మండలం మాదినపాడు లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాస్టికంకర్రలు ఇనుప రాడులతో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలపై దాడులుబత్తుల ఆదినారాయణ రెడ్డి అనే కార్యకర్తపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులుతీవ్ర గాయాలు హాస్పిటల్ తరలింపుకాళ్లు చేతులు నరికేశారు!పల్నాడు మాచవరంలో టీడీపీ శ్రేణులు కత్తులతో విచక్షణా రహితంగా దాడులు చేశాయి. వైఎస్సార్సీపీ నేతలు సింగరయ్య, లక్ష్మీరెడ్డి కాళ్లు చేతులు నరికేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.తాడిపత్రిలోనూ ఉద్రిక్తతలుతాడిపత్రి లో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలు. జేసీ వర్గీయులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసుల విజ్ఞప్తి తో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. మరోవైపు పోలీసుల ఆదేశాల మేరకు.. టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం తాడిపత్రి వదిలి బయటకు వెళ్లారు. తాడిపత్రి లో 144 సెక్షన్ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. జేసీ దౌర్జన్యాల్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాంతాడిపత్రి ఉద్రిక్తతలకు కారణమైన జేసీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబంపై పెద్దారెడ్డి మండిపడ్డారు. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని, తాడిపత్రిలో వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనం పాటించలని పిలుపు ఇచ్చారు. అలాగే.. నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరిస్తామని తెలిపారాయన.పల్నాడులో 144పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు కొనసాగుతుండడం.. విమర్శలు వెల్లువెత్తడంతో అధికార యంత్రాంగం కదిలింది. పల్నాడు వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్ పోలీసు శాఖకు ఉత్తర్వులిచ్చారు. నరసరావుపేట లోక్‌సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమికూడొద్దని, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు.
అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరికలపై స్పందించిన జైశంకర్
కోల్‌కతా: భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల గురించి విదేశీ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మండిపడ్డారు. భారత్‌లోని ఎన్నికల గురించి వ్యతిరేక కథనాలు ప్రచురిస్తోందన్నారు. తాను రాసిన ‘‘వై భారత్ మాటర్స్’’ బుక్ బంగ్లా ఎడిషన్‌ను జైశంకర్.. కోల్‌కతాలో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జైశంకర్ మాట్లాడారు.‘‘విదేశీ మీడియా మన దేశాన్ని ప్రభావితం చేయాలనుకుంటోంది. ఎందుకుంటే ఈ ప్రపంచాన్ని వాల్లు గత 70-80 ఏళ్ల నుంచి ప్రభావం చేస్తున్నామని భావిస్తున్నాయి. కొన్ని పాశ్చాత్య దేశాలు సైతం వాళ్లు ప్రపంచాన్ని 200 ఏళ్ల నుంచి ప్రభావితం చేస్తున్నామని భావిస్తున్నాయి. వాళ్లు తమ అలవాట్లను మార్చుకోవటం అంత సులువైన పని కాదు...విదేశీ మీడియా ఎందుకు భారత్‌కు వ్యతిరేకంగ కథనాలు ప్రచురిస్తోంది?. ఎందుకంటే దేశంలో ఒక వర్గం వారు పాలించాలని ఆరాటపడుతోంది. అందుకే ప్రభావితం చేయలానుకుంటోంది. కానీ, భారతీయ ప్రజలంతా అలా భావించటం లేదు. అదీకాక విదేశీ మీడియా రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సైతం బహిరంగంగా ఆమోదం తెలుపుతోంది. వారు తమ ప్రాధాన్యతను దాచుకోవటం లేదు. చాలా తెలివిగా ప్రవర్తిస్తోంది. కొంతమంది ఇలానే 300 ఏళ్ల నుంచి ప్రవర్తిస్తూ చాలా అనుభవం పొందారు. ..కొన్ని న్యూస్‌పేపర్లు తరచూ దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తుంటాయి. పలు ఇండెక్స్‌ల్లో తక్కువగా చూపుతారు. తమ ఎన్నికల ఫలితాలను నిర్ణయించుకోవడానికి కోర్టుకు వెళ్లే దేశాలు సైతం.. మనకు ఎన్నికలు నిర్వహించటం గురించి తెలియజేయటం చాలా విడ్డూరం’’ అని జైశంకర్ అన్నారు.ఇరాన్‌లోని చాబహార్ పోర్టుకు సంబంధించి భారత్ ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఒప్పందంపై అమెరికా చేసిన ఆంక్షల హెచ్చరికలపై మంత్రి శంకర్ స్పందించారు.‘ఈ ప్రాజెక్టు ఆ ప్రాంతం మొత్తం ప్రయోజనం చేకూర్చుతుంది. ఈ విషయంలో సంకుచితంగా ప్రవర్తించటం మానుకోవాలి. గతంలో ఇదే చాబహార్ పోర్టు గురించి అమెరికా ప్రశంసలు కురిపించింది. అమెరికా చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇది అందరీ ప్రయోజనం కోసం చేపట్టిన ఒప్పందం. ఈ విషయాన్ని కూడా సంకుచితం స్వభావంతో చూడవద్దు’ అని జైశంక్ అన్నారు.
రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
'లైగర్' దెబ్బకు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. 'డబుల్ ఇస్మార్ట్'తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయాడు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు? ఇంతకీ ఎలా ఉంది? హిట్ కొడతారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'దసరా' నటుడి హిట్ సినిమా)2019లో రిలీజైన 'ఇస్మార్ట్ శంకర్'.. ఊహించిన విధంగా హిట్ అయింది. పూరీ జగన్నాథ్‌కి చాన్నాళ్ల తర్వాత సక్సెస్ రుచి చూపించింది. రామ్ కూడా ఫుల్ ఖుషీ అయిపోయాడు. కానీ దీని తర్వాత పూరీకి 'లైగర్' రూపంలో ఘోరమైన డిజాస్టర్ ఎదురైంది. రామ్‌ది ఇదే పరిస్థితి. చేసిన సినిమా చేసినట్లే ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో వీళ్లిద్దరూ కలిసి 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ చేశారు. అదే 'డబుల్ ఇస్మార్ట్'. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.పూరీ జగన్నాథ్ సినిమాలంటే పంచ్ డైలాగ్స్, మాస్ మూమెంట్స్‌ని ఆడియెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈ టీజర్లో ఆ రెండూ మిస్ అయ్యాయి. టీజర్ అంతా కూడా పాత్రల పరిచయానికే ఉపయోగించినట్లు కనిపిస్తుంది. 'డబుల్ ఇస్మార్ట్'లో రామ్ తనదైన మేనరిజమ్ చూపించగా.. హీరోయిన్గా కావ్య థాపర్ కనిపించింది. అలీకి ఆది మానవుడి తరహా కామెడీ పాత్ర ఇచ్చినట్లు ఉన్నారు. సంజయ్ దత్ గన్స్‌తో కనిపించాడు. రామ్ రెండు డైలాగ్స్ చెప్పాడు గానీ వీటిలో పంచ్ అయితే లేదు. ఎప్పటిలానే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆకట్టుకోగా.. చివర్లో శివ లింగాన్ని చూపించి సినిమాలో డివోషనల్ టచ్ కూడా ఉందని చెప్పకనే చెప్పారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్‌పై అలా)
100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలందించేలా ఇండిగో సంస్థ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దానికోసం మూడు విమాన తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది.ఇండిగో సంస్థ ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. స్థానికంగా ప్రయాణికులకు రవాణా సేవలందించి లాభాలు పొందాలని యోచిస్తోంది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. అయితే వీటి తయారీకి ఏటీఆర్, ఎంబ్రాయిర్, ఎయిర్‌బస్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా 50 విమానాలకు ఆర్డరు పెట్టి, తర్వాత మరో 50 విమానాలు కొనుగోలు చేయాలనుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండిగో 45 ఏటీఆర్-72 విమానాలను నడుపుతోంది. అందులో ప్రతి విమానంలో 78 సీట్లు ఉంటాయి. ఈ ఏడాదిలో మరో 5 కొత్త విమానాలు కంపెనీలో చేరనున్నాయి.ఇదీ చదవండి: తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లపై ప్రభావంఏటీఆర్‌తోపాటు ఎయిర్‌బస్ ఏ220, ఎంబ్రేయర్ ఈ-175 రకం విమానాలను కంపెనీ పరిశీలిస్తోంది. ఇటీవల అంతర్జాతీయ మార్గాలను చేరుకునేందుకు వీలుగా ఏప్రిల్‌లో 30 ఎయిర్‌బస్ ఏ350-900 విమానాల కోసం ఆర్డర్ చేసింది.
సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ ఫలితంతో రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.ఇక సమిష్టి ప్రదర్శనతో లక్నోపై గెలుపుతో లీగ్ దశను ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఓవరాల్‌గా ఈ సీజన్లో ఏడు విజయాలు సాధించింది. వెళ్తూ వెళ్తూ లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ ఆశలను దాదాపుగా గల్లంతు చేసింది.వాళ్లిద్దరు పట్టుదలగా నిలబడ్డారుఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఢిల్లీ చేతిలో ఓటమిపై స్పందించాడు. ‘‘40 ఓవర్ల పాటు వికెట్ ఒకే విధంగా ఉంది. తొలి ఓవర్లోనే మేము జేక్ ఫ్రేజర్ మెగర్క్‌ను అవుట్ చేసి శుభారంభం అందుకున్నాం.అయితే, దానిని మేము నిలబెట్టుకోలేకపోయాం. షాయీ హోప్, అభిషేక్ పోరెల్ పట్టుదలగా నిలబడ్డారు. ఇక్కడ 200 పెద్ద స్కోరేమీ కాదు. అయినా, లక్ష్య ఛేదనలో మేము తడబడ్డాం.సీజన్ మొత్తం మాకు అదే సమస్యనిజానికి ఇది పూర్తి చేయదగిన టార్గెట్. ఈ సీజన్ ఆసాంతం పవర్ ప్లేలో త్వరగా వికెట్లు కోల్పోవడం మాకు ఇబ్బందికరంగా మారింది. బ్యాటింగ్ పరంగా మాకు ఎప్పుడూ శుభారంభం లభించలేదు.స్టొయినిస్, పూరన్‌లకు మేము సహకారం అందించలేకపోయాం. అందుకే మేము ఇప్పుడిలా విపత్కర పరిస్థితిలో కూరుకుపోయాం’’ అని కేఎల్ రాహుల్ విచారం వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడు. 3 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు.ఢిల్లీ వర్సెస్ లక్నో స్కోర్లు👉వేదిక: అరుణ్‌జైట్లీ స్టేడియం.. ఢిల్లీ👉టాస్: లక్నో.. బౌలింగ్👉ఢిల్లీ స్కోరు: 208/4 (20)👉లక్నో స్కోరు: 189/9 (20)👉ఫలితం: 19 పరుగుల తేడాతో లక్నోపై ఢిల్లీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్:ఇషాంత్ శర్మ(3/34).చదవండి: Virat Kohli: అదే జరిగితే.. ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే!A clinical win at home to finish off their season 🙌 @DelhiCapitals with a lap of honour for their roaring home fans to extend their gratitude for their love and support 🥳#TATAIPL | #DCvLSG pic.twitter.com/kekvx9uuZK— IndianPremierLeague (@IPL) May 15, 2024
వైఎస్సార్సీపీలో ఉన్నంత కాన్ఫిడెన్స్.. కూటమిలో లేదు!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఘట్టం ముగియడంతో సర్వత్రా ఎవరు గెలుస్తారన్నదే చర్చగా సాగుతోంది. ఈ ఎన్నికలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రంగా జరిగిన ఎన్నికలు కావడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికలలో జగన్ విజయం సాధిస్తే అది దేశానికి ఒక మోడల్ అవుతుంది.జగన్ తీసుకువచ్చిన పలు వ్యవస్థలను దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి వివిధ రాష్ట్రాలు ముందుకు వస్తాయి.జగన్‌ను ఒంటరిగా ఓడించలేమన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కాళ్లావేళ్ల పడి జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుంది. అయినా ఎంతవరకు ప్రయోజనం కలిగిందన్నది ప్రశ్నార్దకమే. మూడు పార్టీల కూటమి కావడంతో బలం పెరిగిందని,తెలుగుదేశం పార్టీ నౌ ఆర్ నెవర్ అన్న చందంగా పని చేసిందని, ఆ పార్టీకి జీవన్మరణ సమస్య కావడంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు తమను తాము భ్రష్టు పట్టించుకుంటూ కూడా అబద్దాలు ప్రచారం చేశాయని, వాటన్నిటి పలితంగా గెలిచే అవకాశం లేకపోలేదన్నది ఆ పార్టీవారి భావనగా ఉంది.అయినా వైఎస్సార్సీపీలో కాన్ఫిడెన్స్ తెలుగుదేశం కూటమిలో కనిపించడం లేదన్నది సత్యం.. నిజంగానే టీడీపీ కూటమి గెలుస్తుందన్న నమ్మకం కలిగి ఉంటే ,ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అదే తరహాలో కూటమి గెలుపు ఖాయం అన్న శీర్షిక బ్యానర్ ఇచ్చేవని, అలా చేయకపోవడం కూడా టీడీపీ ఓటమికి ఒక సంకేతం అన్న విశ్లేషణ వస్తోంది.నిజానికి ఈనాడుకు ఉన్న నెట్ వర్క్ రీత్యా, సోమవారం సాయంత్రానికి జనాభిప్రాయ సేకరణ పూర్తి చేసి వాస్తవ పరిస్థితిని ఇచ్చి ఉండవచ్చు. అలా చేయలేదంటే వారికి కూటమి విజయంపై సందేహం కలిగి ఉండవచ్చని కొందరు అంటున్నారు. ఒకవేళ మంగళవారం ఏమైనా ఇస్తారేమో తెలియదు. కాని కేవలం టీడీపీ వర్గాల ధీమా పేరుతోనే కథనాలు ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వ పనితీరుకు ఒక రిఫరెండంగా పరిగణించే ఈ ఎన్నికలలో మహిళలు ,వివిధ సంక్షేమ పధకాల లబ్దిదారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమన్నది ఆయా వర్గాలలో వినిపిస్తున్నమాట.ఓవరాల్‌గా చూసినప్పుడు అత్యధికులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తుందనే విశ్వసిస్తున్నారు. దీనికి కొన్ని కారణాలు బలీయంగా కనిపిస్తున్నాయి. అవేమిటో చూద్దాం. టీడీపీ కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ, జనసేనలు కలిసి 31 నియో.జకవర్గాలలో పోటీచేశాయి. వారికి ఉన్న బలాబలాల రీత్యా, టీడీపీ నుంచి వచ్చే ఓట్ల బదలాయింపు వంటి అంశాల కారణంగా ఈ రెండు పార్టీలు కలిసి ఐదు నుంచి పది సీట్లు మాత్రమే గెలవవచ్చన్నది ఒక అంచనా. ఈ లెక్కన వైఎస్సార్సీపీ ఇరవై సీట్లను సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిక్యత ఉంది.గత ఎన్నికలలో సైతం 52 సీట్లకు గాను నలభై తొమ్మిదింటిని వైఎస్సార్సీపీ గెలుచుకుంది. 2024 ఎన్నికలలో సైతం వైఎస్సార్సీపీ వేవ్ రాయలసీమ అంతటా ఉంది. అయినప్పటికీ కొన్ని సీట్లు తగ్గుతాయని అనుకున్నా, మినిమమ్ ముప్పై ఐదు నుంచి నలభై సీట్లు రావచ్చని అంతా అంగీకరిస్తున్నారు. అంటే ఇప్పటికి ఏభై సీట్లు వైఎస్సార్సీపీ గెలుచుకున్నట్లు లెక్క అవుతుంది. ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీ బలం బాగా ఉంది.అక్కడ ఉన్న ముప్పై నాలుగు సీట్లలో కనీసం పదిహేడు నుంచి ఇరవై సీట్లు వైఎస్సార్సీపీ గెలుచుకోవచ్చు. అదే జరిగితే ఇక్కడికి డెబ్బై సీట్లు గెలిచినట్లు అవుతుంది. ఇక ఇరవై సీట్లు తెచ్చుకుంటే వైఎస్సార్సీపీ గెలిచినట్లే అవుతుంది.టీడీపీ పొత్తు పెట్టుకున్న కారణంగా ముస్లిం మైనార్టీలు కూటమికి దూరం అయ్యారు. వారు కనీసం నలభై నుంచి ఏభై నియోజకవర్గాలలో ప్రభావం చూపవచ్చు. ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని బీజేపీ చేసిన ప్రకటన కూడా ముస్లింలలో ఆగ్రహానికి కారణం అయింది. ఈ నేపధ్యంలో రాయలసీమలో అధిక శాతం ఉన్న ముస్లింలు వైఎస్సార్‌సీపీవైపు మొగ్గు చూపుతున్నారు. కోస్తా ఆంధ్రలో సైతం అదే పరిస్తితి ఉంది. నెల్లూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఉన్న ఆరు జిల్లాలలో నలభై సీట్లు రావడం కష్టం కాదు. అంటే ఈ లెక్కన కనీసం 110 సీట్లు వైఎస్సార్సీపీకి రావడం ,తిరిగి జగన్ ముఖ్యమంత్రి కావడం తధ్యం అనిపిస్తుంది. 2014లో ఉన్న కూటమి పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడు నరేంద్ర మోదీ హవా బాగా పనిచేసింది.అలాగే అప్పుడే పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని పెట్టడం, కాపు వర్గాన్ని బాగా ఆకర్షించడం కారణంగా టీడీపీ అధికారంలోకి రాగలిగింది.ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ మూడు పార్టీలు 2019 ఎన్నికల సమయంలో ఒకదానిని ఒకటి తిట్టుకున్నాయి. విమర్శించుకున్నాయి. బీజేపీతో పొత్తు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని తమ అవసరాలకు వాడుకోవడం, ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడం కోసమేనన్న సంగతి అందరికి అర్దం అయింది. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు దాదాపు నెరవేర్చడం , ఆయన ఒంటరిగా ధైర్యంగా ఎన్నికల గోదాలోకి దిగడం, ఒక సిస్టమాటిక్ గా సభలు నిర్వహించడం , ఆచరణ సాధ్యమైన హామీలనే ఇవ్వడం వంటి కారణాల వల్ల ప్రజలలో ఆయన పట్ల ఒక నమ్మకం కుదిరింది. ప్రత్యేకించి పేద, బలహీనవర్గాలలో అది బాగా ప్రస్పుటంగా కనిపించింది. సామాజికంగా కూడా జగన్ పలు ప్రయోగాలు చేసి బిసిలకు ఎక్కువ సీట్లు ఇవ్వగలిగారు.అది కూడా ప్లస్ పాయింట్ గా ఉంది. జగన్ ఎక్కువగా పాజిటివ్ ఓటుపై ఆధారపడితే విపక్ష కూటమి నెగిటివ్ ఓటుపైనే ఆధారపడింది. వారి మానిఫెస్టోని ఎవరూ విశ్వసించడం లేదు. తెలుగుదేశం కు ఓటు వేయాలని అనుకున్నవారు సైతం ఆ ఎన్నికల ప్రణాళిక అయ్యేది కాదని తెలిసినా, ఇతర కారణాల రీత్యానే ఓట్లు వేశారు.గతంలో జగన్ ఈ స్కీములను అమలు చేస్తుంటే శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేసిన చంద్రబాబు తన మానిఫెస్టోలో అంతకు మించి రెండు,మూడు రెట్లు సంక్షేమ పధకాలు అమలు చేస్తామని అనడంతో జగన్ గ్రాఫ్ బాగా పెరిగింది. అబద్దాల ప్రచారాన్ని నమ్ముకుని టీడీపీ పనిచేసింది. లేని లాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల భూములను జగన్ లాక్కుంటారంటూ తప్పుడు ప్రచారం చేశారు. అసెంబ్లీలో టీడీపీ మద్దతు ఇచ్చిన బిల్లునే మాటమార్చి వ్యతిరేకిస్తోందని చెప్పడంలో వైఎస్సార్సీపీ చాలా వరకు సఫలం అయింది.అది కూడా టీడీపీకి నష్టం చేసిందని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రెడ్లు, అగ్రవర్ణాలలోని అధికశాతం పేదలు జగన్‌కు మద్దతు ఇస్తున్నారు. ఆ ప్రభావం పోలింగ్ పై స్పష్టంగా కనబడింది. ఈకాంబినేషన్ అలాగే కొనసాగితే జగన్ ను ఓడించడం అసాద్యం. 2019 లో ఇవే సామాజికవర్గాలు జగన్ కు భారీ ఎత్తున మద్దతు ఇచ్చాయి. అవి ఇప్పటికీ అలాగే కొనసాగుతుండడం జగన్‌కు కలిసి వచ్చే పాయింట్. తమ కోసం లక్షల మంది కార్లు వేసుకుని హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చారని టీడీపీ వాదిస్తోంది. కార్లలో వెళ్లినవారు పెత్తందార్లకు ప్రతినిధులుగా ఉంటే, బస్‌లు, ట్రైన్లలో వెళ్లినవారు పేద ప్రజలకు ప్రతినిదులగా చెప్పవచ్చు. ఆ రకంగా చూసుకున్నా, ఇలా వెళ్లినవారిలో వైఎస్సార్సీపీ సానుభూతి పరులే ఎక్కువగా కనిపిస్తారు. సామాజికవర్గాల సమీకరణ రీత్యా చూసినా, ప్రాంతాల వారీగా పరిశీలించినా, రాజకీయ కోణాలలో అద్యయనం చేసినా, ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ కూటమి ప్రభుత్వమేనన్న అభిప్రాయం కలుగుతుంది. పోటీ బాగా టైట్‌గా సాగితే వైఎస్సార్సీపీకి కనీసం 100 నుంచి 110 సీట్లు వస్తాయి.అది వేవ్‌గా మారితే వైఎస్సార్సీపీ గత ఎన్నికల మాదిరి 150 వరకు రావడం కష్టం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
పల్నాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పల్నాడు: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరి పేట-పర్చూరు జాతీయరహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట ఈవూరవారిపాలెంలో జరిగిన ఈ ప్రమాదంలో ట్రవెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు, టిప్పర్ పూర్తిగా తగలబడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్, నాలుగురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. 32 మందికి గాయాలు అయ్యాయి. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి ఉంది. గాయపడి వారిని గుంటూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.చినగంజాం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు బాపట్ల జిల్లా చినగంజాం మండలం నీలాయపాలెం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఎన్నికలలో ఓటువేసి తిరిగి హైదరాబాదు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రమాద ఘటన సమాచారాన్ని 108, పోలీసులకు చేరవేయటంతో వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. బైపాస్ పనులు జరుగుతుండటం.. తారురోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవటం వల్ల టిప్పర్ వేగంగా దుసుకువచ్చింది. టిప్పర్ డ్రైవర్ వేగాన్ని కంట్రోల్ చేయకపోవటమే ప్రమాదానికి కారమైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.మృతుల వివరాలు..అంజి (35) డ్రైవర్, చీరాల, బాపట్ల జిల్లాఉప్పుగుండూరు కాశీ (65), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లాఉప్పుగుండూరు లక్ష్మి (55), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లాముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ (8), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా
టాలీవుడ్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్‌పై అలా
తెలుగు సినిమాలో హీరోయిన్గా చేసిన ఓ బ్యూటీ.. అరుదైన వ్యాధి బారిన పడింది. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాధ భరించలేకపోతున్నానని అని చెబుతూ అసలు తనకు ఏమైంది? ఈ వ్యాధి సంగతేంటి? అనే విషయాల్ని చెప్పుకొచ్చింది. అలానే మహిళలకు ఇలాంటివి సాధారణంగా వస్తుంటాయని కూడా చెప్పింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? అసలేమైంది?(ఇదీ చదవండి: హీరోతో వివాదం.. ఫేస్ బుక్ లో సినిమా పెట్టేసిన డైరెక్టర్!)హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లి షమితా శెట్టి తెలుగులోనూ 'పిలిస్తే పలుకుతా' అనే సినిమాలో హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైంది. కాకపోతే అక్కలా పెద్దగా పేరు అయితే తెచ్చుకోలేకపోయింది. అలాంటిది ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు బయటపెట్టింది. దీని గురించి హాస్పిటల్ బెడ్‌పై ఉంటూనే వివరంగా చెప్పుకొచ్చింది.'మహిళలకు వచ్చే సమస్యలో ఇది సర్వ సాధారణమైనది. గర్భాశయంలో చాలా నొప్పిగా అనిపిస్తుంది. అలాంటిదే నాకు ఇప్పుడు వచ్చింది. దాదాపు 40 శాతం మంది మహిళలు ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. కాకపోతే మనలో చాలామందికి దీని గురించి తెలియదు. గత కొన్నాళ్ల నుంచి నేను దీని వల్ల నొప్పితో ఇబ్బంది పడ్డాను. కానీ డాక్టర్లు ఈ సమస్యకు మూలం ఏంటో గుర్తించారు. గర్భాశయంలో వచ్చిన ఈ సమస్యకు సర్జరీ ద్వారా పరిష్కారం దొరికింది' అని షమితా శెట్టి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్‌కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!)Did you know that almost 40 % of women suffer from Endometriosis.. and most of us are unaware of this disease!!! I want to thank both my dr s my gynac dr Neeta Warty and my Gp dr Sunita Banerjee for not stopping til they found out the root cause of my pain!🧿❤️ pic.twitter.com/T7dmTC2Cv4— Shamita Shetty 🦋 (@ShamitaShetty) May 14, 2024
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్
ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్లు, కస్టమర్లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్లెట్లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్లెట్లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.
తప్పక చదవండి
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్‌పూర్‌లో విచిత్రం
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- పదేళ్ల తర్వాత.. చాట్‌జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
సినిమా
మూడు వారాల తర్వాత కూలీగా...
జస్ట్ చిన్న బ్రేక్... ఆ తర్వాత కూలీగా కూల్‌గా సెట్లోకి అడుగుపెట్టడానికి రజనీకాంత్ ప్లాన్ చేసుకున్నారట. ‘వేట్టయాన్’ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూట్‌ని పూర్తి చేసిన రజనీకాంత్ ఓ మూడు వారాలు విరామం తీసుకుంటారని సమాచారం. ఆ తర్వాత జూన్ 6 నుంచి తన మరో చిత్రం ‘కూలీ’ షూటింగ్లో పాల్గొంటారట.లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కోసం చెన్నైలో భారీ సెట్ రూపొందించారట. ఆ సెట్లోనే కొత్త షెడ్యూల్ ఆరంభించనున్నారని కోలీవుడ్ టాక్. కాగా ఈ చిత్రంలో శ్రుతీహాసన్ నటించనున్నారు. రజనీ కుమార్తె పాత్రలో ఆమె కనిపిస్తారట. ఈ పాత్ర కథకి కీలకంగా ఉంటుందని తెలిసింది. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరకర్త.
హీరోతో వివాదం.. ఊహించని షాకిచ్చిన డైరెక్టర్!
మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వజక్కు. 2021లోనే ఈ చిత్రం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు థియేటర్లలో రిలీజ్ కాలేదు. దీనికి కారణం దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్, హీరో టొవినో థామస్ మధ్య వివాదమే. అయితే మూడేళ్ల పాటు ఓపికగా ఉన్న డైరెక్టర్ సడన్‌గా షాకిచ్చాడు. ఈ సినిమాను ఓ వీడియో ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేశాడు.తాజాగా వజక్కు చిత్రాన్ని వీమియో అనే ప్లాట్ఫామ్లో డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్ అప్లోడ్ చేశారు. ఈ ప్లాట్‌ఫామ్ కూడా దాదాపు యూట్యూబ్ లాగే ఉంటుంది. వీమియోలో ఈ చిత్రాన్ని యూజర్లు ఉచితంగా చూసేలా అందుబాటులోకి తెచ్చారు. అయితే మొదట వజక్కు చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు హీరో టొవినో థామస్ అంగీకరించలేదని శశిధరన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన కెరీర్‌పై ప్రభావం చూపుతుందనే కారణంతో థియేటర్లలోనూ.. ఓటీటీలోనూ ఈ మూవీని రిలీజ్ చేయకుండా థామస్ అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారుస్పందించిన టొవినో థామస్సనల్ శశిధరన్ చేసిన ఆరోపణలకు హీరో టొవినో థామస్ స్పందించారు. ఈ సినిమా నిర్మాణం కోసం తాను రూ.27లక్షలను ఖర్చు చేశానని.. తనకు ఎలాంటి లాభం రాలేదని అన్నారు. ఈ సినిమా విడుదల కాకపోవడానికి డైరెక్టరే కారణమని చెప్పారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించేందుకు కూడా ఆయన అంగీకరించలేదని టొవినో చెప్పారు. కాగా.. ఈ చిత్రంలో కునీ కుశృతి, సుదేవ్ నాయర్, అజీస్ నెడుమంగద్, బైజూ నీటో కీలకపాత్రలు పోషించారు. పారట్ మౌంట్ పిక్చర్స్, టొవినో థామస్ ప్రొడక్షన్స్ బ్యానర్లు నిర్మించిన ఈ మూవీకి పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందించారు.
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
కోలీవుడ్ హీరో ధనుశ్ తన మంచి మనసును చాటుకున్నారు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన భవనానికి రూ. కోటి విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్‌ను నటుడు నాజర్‌కు అందజేశారు. ఈ విషయాన్ని అసోసియేషన్ వెల్లడించింది.కాగా.. ప్రస్తుతం నటుడు నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా, కార్తి కోశాధికారిగా నడిగర్ సంఘంలో పని చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు భవనం కోసం విరాళాలు అందచేశారు. కమల్ హాసన్, విజయ్‌లు గతంలోనే రూ.కోటి సాయమందించారు. ప్రస్తుతం నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికి నిర్మాణం పూర్తి చేయనున్నారు. కాగా.. ధనుశ్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్నారు. అంతేకాకుండా స్వీయ దర్శకత్వంలో రాయన్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు.
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో వస్తోన్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో పూరి దర్శకత్వంలో రూపొందించిన బ్లాక్‌బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2019లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. డబుల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్ తేదీని ప్రకటించారు. రామ్ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రూపొందించారు. ఈనెల 15న టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఉదయం 10:03 నిమిషాలకు టీజర్ విడుదల చేయనున్నారు. తాజాగా రిలీజైన వీడియోలో ఇస్మార్ట్ శంకర్ సీన్స్‌ను జోడించారు. ఈ మూవీలోని సన్నివేశాలతో పాటు అప్పుడు థియేటర్స్‌లో అభిమానులు చేసిన సందడితో కూడిన సన్నివేశాలు మాస్ ఇమేజ్ను గుర్తుచేస్తున్నాయి. డబుల్ ఇస్మార్ట్ టీజర్‌తో రామ్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు మేకర్స్. A proud film of @PuriConnects which created a Never Before Mass Hysteria in every nook and corner🔥Here's a sizzling recap of a Mass phenomenon called #iSmartShankar before you experience the Madness of #DoubleISMART 😎𝗱𝗶𝗠𝗔𝗔𝗞𝗜𝗞𝗜𝗥𝗜𝗞𝗜𝗥𝗜 #DoubleISMARTTeaser… pic.twitter.com/n0kL1HkTbQ— Puri Connects (@PuriConnects) May 14, 2024
ఫొటోలు
నలుపు రంగు డ్రెస్‌లో 'పిచ్చెక్కిస్తున్న' సోషల్ స్టార్ దీప్తి సునైనా (ఫొటోలు)
Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
Ram Pothineni: ఇస్మార్ట్ రామ్ పోతినేని బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
తిరుపతి : తాతయ్యగుంట గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)
TS : కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా..రాజకీయ నేతలు (ఫొటోలు)
క్రీడలు
సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 19 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ ఫలితంతో రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.ఇక సమిష్టి ప్రదర్శనతో లక్నోపై గెలుపుతో లీగ్ దశను ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఓవరాల్‌గా ఈ సీజన్లో ఏడు విజయాలు సాధించింది. వెళ్తూ వెళ్తూ లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ ఆశలను దాదాపుగా గల్లంతు చేసింది.వాళ్లిద్దరు పట్టుదలగా నిలబడ్డారుఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఢిల్లీ చేతిలో ఓటమిపై స్పందించాడు. ‘‘40 ఓవర్ల పాటు వికెట్ ఒకే విధంగా ఉంది. తొలి ఓవర్లోనే మేము జేక్ ఫ్రేజర్ మెగర్క్‌ను అవుట్ చేసి శుభారంభం అందుకున్నాం.అయితే, దానిని మేము నిలబెట్టుకోలేకపోయాం. షాయీ హోప్, అభిషేక్ పోరెల్ పట్టుదలగా నిలబడ్డారు. ఇక్కడ 200 పెద్ద స్కోరేమీ కాదు. అయినా, లక్ష్య ఛేదనలో మేము తడబడ్డాం.సీజన్ మొత్తం మాకు అదే సమస్యనిజానికి ఇది పూర్తి చేయదగిన టార్గెట్. ఈ సీజన్ ఆసాంతం పవర్ ప్లేలో త్వరగా వికెట్లు కోల్పోవడం మాకు ఇబ్బందికరంగా మారింది. బ్యాటింగ్ పరంగా మాకు ఎప్పుడూ శుభారంభం లభించలేదు.స్టొయినిస్, పూరన్‌లకు మేము సహకారం అందించలేకపోయాం. అందుకే మేము ఇప్పుడిలా విపత్కర పరిస్థితిలో కూరుకుపోయాం’’ అని కేఎల్ రాహుల్ విచారం వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడు. 3 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు.ఢిల్లీ వర్సెస్ లక్నో స్కోర్లు👉వేదిక: అరుణ్‌జైట్లీ స్టేడియం.. ఢిల్లీ👉టాస్: లక్నో.. బౌలింగ్👉ఢిల్లీ స్కోరు: 208/4 (20)👉లక్నో స్కోరు: 189/9 (20)👉ఫలితం: 19 పరుగుల తేడాతో లక్నోపై ఢిల్లీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్:ఇషాంత్ శర్మ(3/34).చదవండి: Virat Kohli: అదే జరిగితే.. ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ కోహ్లినే!A clinical win at home to finish off their season 🙌 @DelhiCapitals with a lap of honour for their roaring home fans to extend their gratitude for their love and support 🥳#TATAIPL | #DCvLSG pic.twitter.com/kekvx9uuZK— IndianPremierLeague (@IPL) May 15, 2024
చరిత్ర సృష్టించిన మనిక బాత్రా.. తొలిసారి ఇలా!
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళా స్టార్ క్రీడాకారిణి మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్ మహిళల సింగిల్స్ విభాగంలో మనిక 24వ ర్యాంక్‌లో నిలిచింది. గతవారం సౌదీ స్మాష్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన మనిక ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్ నుంచి 24వ ర్యాంక్‌కు చేరుకుంది. తద్వారా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–25లో నిలిచిన తొలి భారతీయ టీటీ క్రీడాకారిణిగా మనిక గుర్తింపు పొందింది. మిగతా క్రీడాకారుల ర్యాంకులు ఇలాగతవారం 38వ ర్యాంక్‌లో నిలిచి భారత నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మూడు స్థానాలు పడిపోయి 41వ ర్యాంక్‌కు చేరుకోగా... యశస్విని రెండు స్థానాలు పడిపోయి 99వ ర్యాంక్‌లో నిలిచింది.పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు ఆచంట శరత్ కమల్ 40వ ర్యాంక్‌లో, మానవ్ ఠక్కర్ 62వ ర్యాంక్‌లో, హర్మీత్ దేశాయ్ 63వ ర్యాంక్‌లో, సత్యన్ 68వ ర్యాంక్‌లో ఉన్నారు
లక్నోపై ఢిల్లీ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సత్తాచాటింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఢిల్లీ ప్లే ఆఫ్స్ భవితవ్యం ఇతర జట్ల గెలుపోటములుపై ఆధారపడి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్(58), ట్రిస్టన్ స్టబ్స్(57) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వారిద్దరితో పాటు షాయ్ హోప్(38), కెప్టెన్ రిషబ్ పంత్(33) పరుగులతో రాణించారు. ఇక లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు పడగొట్టగా.. అర్షద్ ఖాన్, బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.చెలరేగిన ఇషాంత్..అనంతరం 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులకే పరిమితమైంది. లక్నో టెయిలాండర్ అర్షద్ ఖాన్ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. 7వ స్ధానంలో బ్యాటింగ్‌లో వచ్చిన అర్షద్.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. లక్ష్య చేధనలో 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అర్షద్ ఖాన్.. గెలుపు అంచుల దాకా తీసుకువచ్చాడు. 33 బంతులు ఎదుర్కొన్న అర్షద్.. 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(61) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ మూడు వికెట్లు, ఖాలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, స్టబ్స్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు.
టీమిండియా హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్..!?
టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌తో ముగుస్తుంది.. ఈ క్రమంలో హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 27గా బీసీసీఐ నిర్ణయించింది. అయితే టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.రాహుల్ ద్రవిడ్ వారసుడిగా ఫ్లెమింగ్ సరైనోడని బీసీసీఐ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అతడితో బీసీసీఐ పెద్దలు చర్చలు జరిపినట్లు సమాచారం. ఫ్లెమింగ్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. అతడికి కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది.అతడి నేతృత్వంలోనే సీఎస్కే ఐదు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచింది. అయితే బీసీసీఐ నిబంధనలను అతడు ఒప్పుకుంటాడో లేదే చూడాలి. బీసీసీ రూల్స్ ప్రకారం.. కొత్త ప్రధాన కోచ్ మూడు ఫార్మాట్లో భారత జట్టును ముందుకు నడిపించాలి.అదే విధంగా ఏడాదికి 10 నెలల పాటు జట్టుతో పాటు ఉండాలి. ఒకవేళ ఫ్లెమింగ్ భారత జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపడితే సీఎస్కే ఫ్రాంచైజీతో బంధం తెంచుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా హెడ్ కోచ్ రేసులో ఆసీస్ మాజీ ఆటగాడు జస్టిన్ లాంగర్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బిజినెస్
వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్.. డీహెచ్ఎఫ్ఎల్ ధీరజ్ వాధావన్ అరెస్ట్
రూ. 34,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవాన్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వాధవాన్‌ను సోమవారం సాయంత్రం ముంబైలో అదుపులోకి తీసుకున్నామని, మంగళవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు సీబీఐ అధికారులు ధృవీకరించారు. బ్యాంకులను రూ.34,615 కోట్ల మేర మోసం చేసిన కేసులో డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్రమోటర్లపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 17 బ్యాంకుల కన్సార్టియంలను మోసం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీబీఐ అధికారులు డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు ధీరజ్ వాధవాన్, కపిల్ వాధవాన్‌లపై కేసులు నమోదు చేశారు. ఎస్ బ్యాంక్ అవినీతి కేసులో అరెస్ట్ ఈ కేసుకు సంబంధించి 2022లో ధీరజ్‌ను సీబీఐ చార్జిషీట్లో చేర్చింది. ఎస్ బ్యాంక్ అవినీతి కేసులో వాధావాన్‌ను గతంలో సీబీఐ అరెస్ట్ చేస్తే బెయిల్‌పై విడుదలైనట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ లోన్ కుంభకోణంగా వాధావాన్ అరెస్ట్‌పై 17 బ్యాంకుల కన్సార్టియంను రూ.34,000 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై సీబీఐ డీహెచ్ఎఫ్ఎల్ కేసు నమోదు చేసిందని, ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ లోన్ కుంభకోణంగా నిలిచిందని సీబీఐ అధికారులు పేర్కొన్నారునేరపూరిత కుట్రకుయూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను మోసం చేయడానికి డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్లు కపిల్ వాధావన్, ధీరజ్ వాధవన్ ఇతర నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ఈ కుట్రలో భాగంగా వాధవాన్లు రూ. 42,871.42 కోట్ల భారీ రుణాలను మంజూరు చేసేందుకు కన్సార్టియం బ్యాంకులను ప్రేరేపించారని ఏజెన్సీ తెలిపింది.నిందితులు డీహెచ్ఎఫ్ఎల్ లెక్కల్ని తారుమారు చేసింది. ఆ నిధుల్ని వినియోగించడం, దుర్వినియోగం చేశారు. కన్సార్టియం బ్యాంకుల చట్టబద్ధంగా బకాయిలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని సీబీఐ అధికారులు వెల్లడించారు.
త్వరలో మస్క్‌కు ముప్పు.. భారత్ సంతతి సీఈవో సంచలన వ్యాఖ్యలు
టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ త్వరలో భారీ నష్టాల్ని చవిచూడనున్నారంటూ భారత సంతతి ఆంత్రప్రెన్యూర్ వివేక్ వాధ్వా హెచ్చరించారు. ఇటీవల టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ భారత్‌లో కాదని చైనాతో సంత్సంబంధాలు నెరపడంపై ఎక్స్ వేదికగా వివేక్ వాధ్వా మస్క్‌ను ప్రశ్నించారు.తన ఈవీ కార్యకలాపాల కోసం భారత్‌ను కాదని చైనాని ఎంచుకోవడం మస్క్ భారీ మొత్తంలో నష్టపోనున్నారని వివేక్ వాధ్వా అన్నారు. చైనాలో ప్రమాదం అంచున వ్యాపారాలపై మస్క్‌కు మెయిల్ చేసినట్లు వెల్లడించారు. చైనా మస్క్‌ను గుడ్డిగా దోచుకుంటుందని నేను అతనిని ముందే హెచ్చరించాను. కార్ల తయారీని చైనా నుంచి భారత్‌కు తరలించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ రష్యా యూరప్ ఆసియా స్టడీస్ డైరెక్టర్ థెరిసా ఫాలన్ పోస్ట్‌ను వివేక్ వాధ్వా ఉటంకించారు. థెరిసా ఫాలన్ తన పోస్ట్‌లో అమెరికా, యూరోపియన్ ఆటోమేకర్స్ చైనాలో ఎందుకు విఫలమవుతున్నారు. స్వల్ప కాలిక లాభాల కోసం టెక్, మేనేజ్మెంట్ టెక్నిక్ అంశాల్ని అక్కడ అమలు చేయడం ద్వారా చైనా ఎలాంటి ప్రయోజనాల్ని పొందుతుందని నివేదించారు. వాటి ద్వారా కార్ల తయారీ సంస్థలు ఎలా నష్టపోతున్నారని వివరించారు. ఆ అంశాన్ని ప్రధానంగా చర్చించిన వాధ్వా మస్క్ గురించి పై విధంగా వ్యాఖ్యానించారు.
మొబైల్ యూజర్స్‌కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
మొబైల్ ఫోన్ యూజర్లకు షాక్. త్వరలో ఫోన్ బిల్లలు తడిసి మోపెడు కానున్నాయి. దేశంలోని మొత్తం లోక్‌సభ స్థానాల ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే నాలుగో రౌండ్ టారిఫ్ ధరల్ని పెంచేందుకు టెలికం కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. టెలికం కంపెనీలు యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ఏఆర్పీయూ) ను పెంచుకునేందుకు కంపెనీలు తప్పుకుండా 25 శాతం టారిఫ్ ధరల్ని పెంచనున్నాయి. మార్కెట్లో కాంపిటీషన్, 5జీ టెక్నాలజీ కోసం భారీ పెట్టుపడులు ఇతరాత్ర కారణాల వల్ల టారిఫ్ ధరల పెంపు అనివార్యం కానుంది. వినియోగదారులపై ప్రభావం25 శాతం టారిఫ్ ధరల పెంపు భారీగా ఉన్నప్పటికీ.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల యూజర్లకు భరించే ఆర్ధిక సామర్ధ్యం ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా టెలికం సేవల్ని వినియోగించుకునేందుకు గాను ప్రస్తుతం పెట్టే ఖర్చు 3.2 శాతంతో పోలిస్తే పట్టణ గృహాల మొత్తం వ్యయంలో 3.6 శాతానికి పెరుగుతుందని అంచనా. అదేవిధంగా, గ్రామీణ చందాదారుల కోసం, ఈ సంఖ్య ప్రస్తుత 5.2 శాతం నుండి 5.9 శాతానికి పెరుగుతుందని అంచనా.టారిఫ్ ధరలు పెరిగితేటారిఫ్ 25 శాతం పెంచితే టెలికాం ఆపరేటర్ల ఏఆర్పీయూ 16 శాతం పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. ఎయిర్‌టెల్‌కు ఒక్కో యూజర్ నుంచి వచ్చే ఆదాయం అత్యధికంగా రూ.29, జియో 26 శాతం ఉందని యాక్సిస్ కేపిటల్ ఎస్టిమేట్ తెలిపింది. కంపెనీలకు లాభమేమార్చితో ముగిసిన త్రైమాసికంలో జియో ఏఆర్పీయూ రూ.181.7 గా ఉంది. ఎయిర్‌టెల్‌కు రూ.208, వొడాఫాన్ ఐడియాకు రూ.145 గా ఉంది. టారిఫ్ ధరలు పెరిగితే ఒక్కో యూజర్ నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఆ ప్రభావం కంపెనీ లాభాలు పెరిగేందుకు దోహదం చేస్తోంది.
పుంజుకున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 115 పాయింట్లు లాభపడి 22,215 వద్దకు చేరింది. సెన్సెక్స్ 330 పాయింట్లు పుంజుకుని 72,112 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో ఎం అండ్ ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీసుజుకీ, టైటాన్, టెక్‌మహీంద్రా, విప్రో, పవర్‌గ్రిడ్, టాటాస్టీల్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్సర్వ్, భారతీఎయిర్‌టెల్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
వీడియోలు
పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ
ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన
టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్
టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్
నాగబాబు నీతులు..!
బస్సులో అయిదుగురు సజీవదహనం...
పచ్చమూక దౌర్జన్యం
స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత
టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి
ఫ్యామిలీ
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ బాష్ : 800 మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
ఆసియా కుబేరుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన లేడీ లవ్ రాధిక మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేసేందుకు సన్నద్ధమవున్నాడు. వచ్చే నెల (జూలై 12న) అనంత్-రాధిక వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించేందుకు అంబానీ సిద్ధమ వుతున్నారు. ఈ క్రమంలో మార్చి మూడవ తేదీవరకు జామ్‌నగర్‌లో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకుల సందడి ఇంకా ముగియకముందే రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకకు సన్నద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 28 నుంచి 30 మధ్య దక్షిణ ఫ్రాన్స్‌లో క్రూయిజ్ షిప్లో రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుక జరగనుంది. క్రూయిజ్ ఇటలీ నుండి బయలుదేరి 2365 నాటికల్ మైళ్ల (4380 కి.మీ) దూరం ప్రయాణించి దక్షిణ ఫ్రాన్స్‌లోని గమ్యస్థానానికి చేరుకుంటుందని కూడా పేర్కొంది. ఈ వేడుక కేవలం పెళ్లి చేసుకోబోయే అనంత్-రాధికకు మాత్రమేకాదు అతిథులందరికీ కూడా అద్భుతమైన అనుభవంగా మిగలేలా సర్వ హంగులతో ఏర్పాట్లు చేస్తున్నాయిట ఇరు కుటుంబాలు. అతిధులు ఈ వేడుకలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్ సెలబ్రిటీలతో సహా మొత్తం 800 మంది అతిథులు హాజరుకానున్నారు. రముఖ్యంగా అనంత్ సోదరుడు ఆకాష్ అంబానీ శ్లోకా మెహతా జంటతో సన్నిహితంగా ఉంటే బాలీవుడ్ జంట రణబీర్ కపూర్ అలియా భట్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవబోతున్నారు. క్రూయిజ్ షిప్లో మొత్తం 600 మంది సిబ్బంది అతిథుల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారట. కాగా 2017లో డ్రైవ్‌లో పరస్పర స్నేహితుల ద్వారా పరిచయమైన వీరిద్దరూ లవ్‌బర్డ్స్‌గా మారిపోయారు. కొన్నాళ్ల డేటింగ్ తరువాత 2023లో రాజస్థాన్‌లోని నాథ్ద్వారాలోని శ్రీనాథ్జీ టెంపుల్లో రాధికకు పెళ్లికి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఆంటిలియాలో నిశ్చితార్థం వేడుక, 2024లో జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు ప్రీవెడ్డింగ్ హస్తాక్షర్ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే.
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అదనపు చక్కెర సంకలితాలతో వచ్చే ప్రోటీన్ సప్లిమెంట్లు వినియోగించొద్దని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషన్ ఇన్స్టిట్యూట్ఆప్ న్యూట్రిషియన్(ఐపీఎంఆర్-ఎన్ఐఎన్) పిలుపునిచ్చింది. వీటివల్ల మూత్రపిండాలకు ఎముకలకు హాని కలుగుతుందని, ఆరోగ్యకరమైన వ్యక్తులకు వీటి అవసరం లేదని పేర్కొంది. ప్రోటీన్ల అవసరాన్ని భర్తీ చేసుకునేలా సమతుల్యమైన ఆహార సరిపోతుందని తెలిపింది. పైగా అందుకోసం కొత్త ఆహార మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. చాలామంది సహజసిద్ధంగా సమతుల్య ఆహారంలో వచ్చే పోషకాలను వదిలిపెట్టే కృత్రిమంగా ప్రోటీన్ పౌడర్లు, ప్రోటీన్ సప్లిమెంట్లను ఆశ్రయిస్తున్నారని డైటీషియన్లు చెబుతున్నారు. నిజానికి ఈ ప్రోటీన్ సప్లిమెంట్లన్నీ గుడ్లు, పాలు, పాల విరుగుడు లేదా సోయా, బఠానీలు లేదా బియ్యం వంటి మొక్కల మూలాలతోనే తయారు చేస్తారని అన్నారు. ఈ చక్కెర సంకలితాలతో కూడిన ఈ ప్రోటీన్ సట్లు మూత్రపిండాలు, ఎముకల ఆరోగ్యానికి తీవ్రమైన హానిని కలిగిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పప్పుధాన్యాలు, పప్పులు, గింజలు, గుడ్లు, పౌల్ట్రీ, చేపలు మొదలైనవి అన్ని వయసుల వారికి కావాల్సిన ప్రోటీన్లను అందిస్తాయని అన్నారు. అలాగే ఏ రకమైన ప్రొటీన్ పౌడర్లు లేదా సప్లిమెంట్లను ఇవ్వడానికి ముందు ఒక వ్యక్తికి ప్రోటీన్ ఎంత మేర అవసరం అనేది అంచనా వేసి సదరు క్లినిక్ లేదా న్యూటీషియన్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. మంచి నాణ్యమైన ప్రోటీన్ పొందడానికి 3:1 నిష్పత్తిలో పప్పులతో కూడిన తృణధాన్యాల కలయిక శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు అందజేస్తాయని అన్నారు. ఆహారం ద్వారా తీసుకునే ప్రోటీన్ కండరాల నష్టాన్ని నివారిస్తుందని అన్నారు. అలాగే వినియోగించిన ప్రోటీన్‌ను సమర్థవంతంగా వినియోగించుకునేలా తగిన శారీరక శ్రమ కూడా ఉండాలని డైటీషియన్లు సూచించారు. సమతుల్య ఆహారం శరీర పనితీరుకు అవసరమైన 20 ముఖ్యమైన అమైనో ఆమ్లాల అవసరాన్ని తీరుస్తుందని చెప్పారు. ఇక మన శరీరం సంశ్లేషణ చేయలేని ఈ అమైనో ఆమ్లాలలో కొన్నింటిని పొందడానికి, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ప్రోటీన్ వంటి విభిన్న ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం అని ఐపీఎంఆర్-ఎన్ఐఎన్ పేర్కొంది. సాదారణ ఆరోగ్యవంతమైన వ్యక్తులకు ప్రోటీన్ సప్లిమెంట్లను సిఫార్సు చెయ్యకూడదని పేర్కొంది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగుల స్థితిని అనుసరించి వైద్య నిపుణులు ప్రోటీన్ సప్లిమెంట్లను సిఫార్సు చేయాలని నూట్రిషియన్లు చెబుతున్నారు.(చదవండి: ఇన్స్టంట్ నూడుల్స్ మంచివి కావా? తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా?)
Mothersday 2024 ‘బంగారం నువ్వమ్మా’! టాలీవుడ్ అమ్మల్నిచూశారా?
ఆకాశంలోకి నిప్పుల నిచ్చెన వైరల్ వీడియో
‘అరోరా బొరియాలిస్’ ఆకాశంలో అద్భుతం సృష్టించగా తాజాగా మరో అద్భుతం విశేషంగా నిలుస్తోంది. ఎర్రని నిప్పుల సెగ కక్కుతున్న నిచ్చెన మెట్ల వెలుగులు ఆకాశం వైపు దూసుకెళ్లడం నెట్టింట చక్కర్లు కొడుతోంది.విషయం ఏమిటంటే..ఈ వీడిలో పదేళ నాటిదట. చైనీస్ బాణసంచా కళాకారుడు కాయ్ గువో-కియాంగ్ దీన్ని రూపొందించారు. ఆకాశంలోకి సుమారు అర కిలోమీటర్ ఎత్తు వరకు నిప్పుల నిచ్చెన ఆకారంలో టపాసులు పేలుతూ అద్భుతంగా మారింది.As a tribute to his grandmother, a Chinese artist and pyrotechnic expert created this stairway to Heaven. Stunning. pic.twitter.com/aNmc7YGcKf— Juanita Broaddrick (@atensnut) May 13, 2024ఈ కళాకారుడి క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్టెయిర్ వే టు హెవెన్ పేరిట పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఓ చైనీస్ ఆర్టిస్ట్ క్రియేటివిటీకి మచ్చుతునక అంటూ నెటిజన్లు ప్రశంసించారు. కాయ్ తన అమ్మమ్మకు నివాళిగా దీన్ని తయారు చేశాడు. 1,650 అడుగుల ఎత్తు (లేదా 502 మీటర్లు) "స్కై ల్యాడర్" రాగి తీగలు, గన్‌పౌడర్‌తో తయారు చేశాడని వైస్ ఒక నివేదికలో తెలిపింది. అలా కళాకారుడిగా మారాలని కల నెరవేర్చుకోవడంతోపాటు, నివాళిగా కాయ్ గో క్వింగ్ అనే కళాకారుడు ఇలా నింగిలోకి టపాసులను కాల్చినట్లు వివరించింది. ఇలా కాయ్ ఎక్స్‌ప్లోజివ్ ఆర్టిస్ట్‌గా పేరొందాడు.1994లోనే తొలిసారిగా అతను ఈ తరహా ట్రిక్ కోసం ప్రయత్నించినప్పటికీ భారీ గాలుల వల్ల అది విజయవంతం కాలేదట. అలాగే 2001లో మరోసారి ప్రయత్నం చేయాలనుకున్నా అమెరికాలో జరిగిన 9/11 ఉగ్ర దాడుల నేపథ్యంలో చైనా ప్రభుత్వం అందుకు అనుమతి లభించలేదట. కాగా 1957లో ఫుజియాన్ ప్రావిన్స్‌లోని క్వాన్‌జౌ నగరంలో జన్మించారు కాయ్ గువో-కియాంగ్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్‌లో నివసిస్తున్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
భూమి లాక్కున్నట్లు ఒక్క రైతయినా చెప్పాడా అంటూ చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ సూటి ప్రశ్న.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
‘బుల్లెట్’ పేలిన ఘటనలో మరొకరి మృతి
హైదరాబాద్: బుల్లెట్ ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంక్ పేలిన ఘటనలోఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి షౌకత్ అలీ మంగళవారం మృతి చెందాడు. భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో దాదాపు 10 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు 80 శాతానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ.. సోమవారం ఉదయం మహ్మద్ నదీం మృతి చెందాడు. భవానీనగర్ ఇన్స్పెక్టర్ ఎం.బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. జహంగీర్‌నగర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీంఖాన్ ఈ నెల 10న బుల్లెట్ వాహనంపై తన భార్య నేహాతో పని నిమిత్తం బయటికి వెళ్తున్నాడు. నసీర్ ఫంక్షన్ హాల్ సమీపం వద్దకు రాగానే వాహనం నుంచి స్వల్పంగా మంటలు రాసాగాయి. దీంతో అబ్దుల్ రహీం ఖాన్ వాహనాన్ని స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయతి్నంచాడు. ఇంతలోనే బుల్లెట్ వాహనం కింద పడిపోవడంతో పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ ఘటనలో అబ్దుల్ రహీం ఖాన్‌తో పాటు మంటలను ఆర్పేందుకు సహాయం చేసిన స్థానికులు సలేహ, షేక్ అజీజ్, ఖాజా పాషా, చెరుకు బండి యజమాని మహ్మద్ నదీం, ఫలక్‌నుమా జహంగీర్‌నగర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి షౌకత్ అలీ, మహ్మద్ హుస్సేన్ ఖురేíÙ, షేక్ ఖాదర్, గౌస్ రహమాన్లు మంటల వ్యాప్తి కారణంగా గాయాలకు గురయ్యారు. మంటలను ఆర్పే ప్రయత్నంలో మొఘల్‌పురా పీఎస్ కానిస్టేబుల్ సందీప్ సైతం గాయాలకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహ్మద్ నదీమ్ సోమవారం మృతి చెందగా.. ఫలక్‌నుమా జహంగీర్‌నగర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి షౌకత్ అలీ మంగళవారం మృతి చెందాడు.
Bengal Tiger: అభిమన్యు వెళ్లిపోయాడు
బహదూర్‌పురా: నెహ్రూ జూ పార్క్‌లో అభిమన్యు అనే 8 ఏళ్ల తెల్లపులి కిడ్నీ సంబంధిత వ్యాధితో మంగళవారం మృతి చెందింది. నెహ్రూ జులాజికల్ పార్క్‌లో 2016 సంవత్సరం మే నెలలో బద్రి, సమీరాలకు రెండు తెల్లపులి కూనలు జని్మంచాయి. అందులో ఒకటైన అభిమన్యు జూలోనే పెరిగింది. ఇది మృతి చెందడంతో అధికారులు వీబీఆర్ఐ, లాంకోన్స్తో పాటు ఇతర విభాగాల శాస్త్రవేత్తలు, డాక్టర్లు జూలోనే పోస్టుమార్టం నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా నెహ్రూ జులాజికల్ పార్కులో కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో పులులు, సింహాలు, చిరుత పులులు మృతి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
మన పెళ్లికి ఒప్పుకోరు.. ఇద్దరం చనిపోదాం
బల్మూర్: బాలికను ప్రేమ పేరుతో వంచించాడు. పెళ్లికి పెద్దలు అడ్డు చెబుతారని ఆమెను నమ్మించి ఆత్మహత్యకు ప్రేరేపించాడు. చివరకు ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బల్మూర్‌కు చెందిన రాఘవేందర్ అదే గ్రామానికి చెందిన బాలిక(15) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.అయితే పెళ్లికి కుటుంబసభ్యులు అడ్డు చెబుతున్నారని రాఘవేందర్ ఈ నెల 11న గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం వద్దకు బాలికను తీసుకెళ్లాడు. నువ్వు మైనర్.. పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. ఇద్దరం కలిసి పురుగు మందు తాగి చనిపోదామని చెప్పా డు. వెంట తెచ్చిన పురుగు మందును మొదటగా ఆమెకు తాగించి, తాను కూడా తాగినట్టు నటించాడు. బాలిక అపస్మారక స్థితికి చేరుకోగానే మరో యువకుడి సహాయంతో బాలికను బైక్‌పై అచ్చంపేట ఆస్పత్రికి తరలించాడు.ఆపై బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంలో మెరుగైన వైద్యం కోసం ఆమెను నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ ఆ బాలిక సోమవారం రాత్రి మృతి చెందింది. అయితే తమ కూతురుతో బలవంతంగా పురుగు మందు తాగించాడని బాలిక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.పరిహారంగా రెండెకరాల భూమి బాలిక మృతిపై బల్మూర్‌లో పంచాయితీ పెట్టిన గ్రామపెద్దలు, కులస్తులు రెండెకరాల భూమి çపరిహారంగా ఇవ్వాలని తీర్మానించినట్టు తెలిసింది. రాఘవేందర్ తండ్రికి ఉన్న భూమిలో రెండు ఎకరాలు బాలిక తరఫున బంధువు పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని కాగితాలు రాసుకొని ధరణిలో స్లాట్ కూడా మంగళవారం బుక్ చేసినట్టు సమాచారం. భూమి మార్పిడి జరిగిన వెంటనే ఆస్పత్రిలో ఉన్న మృతదేహానికి ఆత్మహత్య కేసుగా నమోదు చేయించి ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపించాలని ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఎస్ఐ బాలరాజును వివరణ కోరగా బాలిక ఆత్మహత్యపై తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు.
దాడులు.. లూటీలు.. విధ్వంసం
సాక్షి, నరసరావుపేట/వినుకొండ(నూజెండ్ల)/కారెంపూడి/పెదకూరపాడు/మాచవరం : పల్నాడులో తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో చేస్తున్న అరాచకపర్వం రెండో రోజూ కొనసాగింది. సోమవారం పోలింగ్ రోజు వైఎస్సార్సీపీకి ప్రజలు భారీ స్థాయిలో ఓటు వేస్తున్నారని తెలుసుకొని మధ్యాహ్నం నుంచే దాడులు ప్రారంభించారు. మంగళవారం కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగాయి. ఓవైపు వైఎస్సార్సీపీ నేతలపై విచక్షణారహితంగా దాడులు జరుగుతున్నా పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జిల్లా ఎస్పీ వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వాపోతున్నారు. ఇన్ని దాడులు జరుగుతున్నా కేంద్ర బలగాలు ఏవని ప్రశ్నిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలంలోని పేటసన్నెగండ్ల గ్రామ శివారు బాలచంద్రనగర్ (పోతురాజుగుట్ట)లో నివాసం ఉంటున్న బేడ బుడగ జంగాలు తమకు ఓటు వేయలేదని ఆగ్రహించిన టీడీపీ గూండాలు సుమారు 70 మంది సోమవారం రాత్రి వారి ఇళ్లపై కర్రలు, రాళ్లతో దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు. మహిళలు, పిల్లలని కూడా చూడకుండా చావ బాదారు. ఇళ్లలోని సామాన్లు, ఫ్యాన్లు, బల్బులను పగులగొట్టారు. చిల్లర కొట్టునూ లూఠీ చేశారు. సామాన్లు, నగదును దోచుకెళ్లారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెల్లూరి కోటయ్యకు చెందిన స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెల్లూరి బిక్షంకు చెందిన బైక్‌ను, మక్కెన శేషుకు చెందిన బైక్‌ను మరో ఇద్దరి ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. గొర్ల సైదులు చేయి, కాలిపై కర్రలతో బాదారు. కత్తెర లక్ష్మి చేయి విరగ్గొట్టారు. రాళ్ల దాడితో అందరూ ప్రాణభయంతో ఇంటి నుంచి పారిపోయి వేరే చోట తల దాచుకున్నారు. ఏరా.. టీడీపీకి ఓటు వేయమంటే వేయకుండా వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారా.. నా కొడకల్లారా.. అంటూ తీవ్రంగా దూషిస్తూ అరాచకపర్వాన్ని కొనసాగించారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. జూన్ 4 తర్వాత తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు అంతు చూస్తామని బెదిరించారన్నారు. ‘ఇళ్ల మీద పడి కనపడిన వారిని కనపడినట్లు కర్రలతో కొట్టారు. ఇళ్లలోకి జొరబడి సామాన్లన్నీ చిందవందర చేశారు. నా చేయి, కాలుపై కర్రలతో కొట్టారు. ముసలోళ్లమని కూడా చూడలేదు. భయమేసింది. పిల్లలు పరారయ్యారు. ఎటూ పోలేని మమ్మల్ని చితకబాదారు. బూతులు తిట్టారు’ అంటూ గొర్ల సైదులు కన్నీటి పర్యంతమయ్యారు. ‘నా చేయి విరగ్గొట్టారు. నేను పని చేస్తేనే పిల్లలను పోషించుకునేది. ఇప్పుడు ఎలా పని చేయాలి? ఇన్నాళ్లూ మా బాగోగులు పట్టించుకున్నారా.. కష్టాల్లో ఉంటే ఆదుకున్నారా.. అలాంటి వారు మాపై దౌర్జన్యం ఏమిటి? మా లాంటి బీదోళ్లపై పడి కొట్టడం ఏమిటి? ఓటు వేయలేదని కొడతారా?’ అంటూ కప్పెర లక్ష్మి వాపోయింది. ముప్పాళ్లలో మైనార్టీలపై దాడులు » సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసినప్పటి నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి కొనసాగింది. తిరిగి మంగళవారం ఉదయం తొండపి గ్రామంలోని వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ముస్లింల ఇళ్లలోకి టీడీపీ సానుభూతి పరులు ఆడ, మగ బేధం లేకుండా మూకుమ్మడిగా చొరబడ్డారు.» మహిళలను, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తూ విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇంట్లోని సామగ్రి పగలకొట్టారు. రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలను భయబ్రాంతులకు గురి చేశారు. దాడికి పాల్పడుతున్న తరుణంలో ముస్లిం కుటుంబాల్లోని మగ వారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు పొలాల్లోకి పరుగులు తీశారు. మహిళలు, చిన్నారులు తలుపులు వేసుకొని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు.» ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి మండలంలోని తొండపి, మాదల గ్రామాలు భయం గుప్పిట్లోనే ఉన్నాయి. రెండు గ్రామాల్లోనూ ముస్లిం వర్గీయులే వైఎస్సార్సీపీ మద్దతు దారులుగా ఉండగా, టీడీపీకి మాత్రం బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. ముస్లిం వర్గీయులంతా గత ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లోను వైఎస్సార్సీపీ కి అండగా ఉంటున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో వైఎస్సార్సీపీకి మెజార్టీ లభిస్తుండటాన్ని జీర్ణించుకోలేక భౌతిక దాడులకు దిగుతున్నారు. కేసానుపల్లిలో వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడి » గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలంలోని కేసానుపల్లిలో వైఎస్సార్సీపీ నాయకులు బొల్లా శ్రీనివాసరావు, చుండు రామారావు ఇళ్లపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో టీడీపీ నాయకులు రాళ్లు విసిరారు. దీంతో కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఇళ్లలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. » వైఎస్సార్సీపీ నేత చుండు రామారావు తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి లచ్చమ్మతో పాటు మరో ఇద్దరిపై టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. చుట్టుపక్కల జనం భయంతో పరుగులు తీశారు. టీడీపీ నేతల దాడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని తంగెడ, ఇరికేపల్లి, దాచేపల్లి గ్రామాల్లో టీడీపీ, జనసేన నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎస్సీలపై దాష్టీకం » చిలకలూరిపేట మండలం కావూరు ఎస్సీ కాలనీలో పోలింగ్ సందర్భంగా సోమవారం రాత్రి వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ బూత్ 211లో ఉదయం 7.30 గంటలకు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి ఓట్లు కొన్ని పోల్ కావాల్సినవి మిగిలి ఉన్నాయి. దీనికోసం సమయం పెంచాల్సిందిగా వైఎస్సార్సీపీ తరుఫున బూత్ ఏజెంటుగా ఉన్న నలమాల కాంతయ్య అధికారులకు విజ్ఞప్తి చేశాడు. ఇది నచ్చని టీడీపీలో ఆధిపత్య సామాజిక వర్గానికి చెందిన కొందరు ఘర్షణకు దిగారు. కులం పేరుతో దూషిస్తూ కాంతయ్యపై దాడి చేశారు. దీంతో ఇతను తల పగిలి పడిపోయాడు. » దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కట్టెం ఆనందరావు, మరి కొందరికి కూడా గాయాలయ్యాయి. కాంతయ్య, ఆనందరావులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘర్షణ నేపథ్యంలో కావూరులోని మంచినీటి ప్లాంట్ నుంచి ఎస్సీ వర్గీయులు మంగళవారం మంచి నీరు తీసుకువెళ్లకుండా కట్టడి చేసి వారి దాష్టీకాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు గ్రామానికి వెళ్లి బాధితులకు అండగా నిలిచారు. కంభంపాడులో పచ్చ మూకల విధ్వంస కాండ» పెదకూరపాడు నియోజకవర్గంలోని కంభంపాడులో వైఎస్సార్సీపీకి పట్టున్న ఎస్సీ, బీసీ కాలనీలపై కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. సోమవారం పోలింగ్ కేంద్రాల వద్ద వీరంగం వేశారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ సర్పంచ్ ఆర్తిమళ్ల నాగేశ్వరరావు (నాగయ్య) సతీమణి, వైఎస్సార్సీపీ ఎంపీటీసీ ఆర్తిమళ్ల ఆంజమ్మ లక్ష్యంగా సోమవారం అర్ధరాత్రి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. » పోలింగ్ ముగిసిన తర్వాత ఒక్కసారిగా పదుల సంఖ్యలో వచ్చిన పచ్చమూకలు.. నాగేశ్వరరావు, అతని కుమారులు రాజశేఖర్, ప్రవీణ్, ఆర్తిమళ్ల తిరుపతిరావు, ఎస్సీ కాలనీకి చెందిన సురేష్, బీసీ కాలనీకి చెందిన బ్రహ్మం, పల్లపాటి కృష్ణవేణిలపై దాడులకు పాల్పడ్డారు. పలువురి తల, కాళ్లు, చేతులు, ఛాతీపై రక్త గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. టీడీపీ గూండాలు పలు మార్లు ఎస్సీ, బీసీ కాలనీల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. కారెంపూడిలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి» కారెంపూడిలో టీడీపీ గూండాలు మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు బీభత్సం సృష్టించారు. సుమారు 500 మంది రౌడీలు స్థానిక టీడీపీ నేతల నాయకత్వంలో బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని వైఎస్సార్సీపీ నాయకుడు షేక్ కరీంకు చెందిన వాచ్ షాపును ధ్వంసం చేశారు. కర్రలు, రాడ్లతో భయానక వాతావరణం సృష్టిస్తూ గ్రామం మొత్తాన్ని భయాందోళనలకు గురి చేశారు. » కారెంపూడి ఎంపీపీ బొమ్మిన సావిత్రికి చెందిన పాల కేంద్రాన్ని ధ్వంసం చేసి తగల బెట్టారు. తర్వాత మాచర్ల రోడ్డులో ఉన్న పోలిరెడ్డికి చెందిన టీస్టాల్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. అరుపులు, కేకలతో లూధరన్ చర్చి వద్ద ఎస్సీ కాలనీలో బీభత్సం సష్టించారు. తర్వాత వైఎస్సార్సీపీ కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అక్బర్ నివాసంపై దాడి చేశారు. » స్టేట్ బ్యాంక్ సెంటర్లో ఉన్న ఎంపీటీసీ సభ్యురాలు వేముల పద్మావతి భర్త నిర్వహిస్తున్న ఆటో కన్సల్టెన్సీపై దాడి చేశారు. అక్కడ ఉన్న 40 బైక్‌లకు నిప్పు పెట్టారు. బైక్‌లకు ఉన్న బ్యాటరీలు పేలడంతో దానికి ఆనుకుని ఉన్న నివాస ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇందిరా గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న అపార్ట్మెంట్లో నిలిపి ఉంచిన వైఎస్సార్సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు చిలుకూరి చంద్రశేఖరరెడ్డి కారును ధ్వంసం చేశారు. » టీడీపీ రౌడీ గ్యాంగ్ మరొకటి.. ఆర్య వైశ్య వీధి ముస్లిం ఏరియాలో ప్రజలను భయాందోళనకు గురి చేసింది. తర్వాత గ్రామ శివారులో ఉన్న ఆదినారాయణ కాలనీలో వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యదర్శి కొమ్ము చంద్రశేఖర్ నివాసానికి నిప్పు పెట్టారు. ఇదిలా ఉండగా, మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తుల రాళ్ల దాడిలో కారెంపూడి సీఐ నారాయణస్వామి తలకు బలౖమెన గాయం అయింది. జెడ్పీ హైస్కూల్ వద్ద పార్క్ చేసి ఉన్న టీడీపీ నాయకుని స్కార్పియోను దుండగులు ధ్వంసం చేశారు. » మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండల పరిధిలోని గోలి గ్రామంలో సోమవారం రాత్రి టీడీపీ వర్గీయులు దాడి చేయగా, వైఎస్సార్సీపీ వర్గీయులు ప్రతిఘటించారు. ఓ దశలో ఇరువర్గాలు రాళ్లు విసురుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడులలో వైఎస్సార్సీపీకి చెందిన మూఢావత్ మల్లయ్యనాయక్, మూఢావత్ కొండానాయక్, ఆర్.నాగేశ్వరరావునాయక్ , మూఢావత్ నాగేశ్వరరావు నాయక్ గాయపడ్డారు. క్షతగాత్రులు గురజాల, పిడుగురాళ్ల ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. నూజెండ్లలో టీడీపీ మూకల దాడులు» వినుకొండ నియోజకవర్గం నూజెండ్లలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. మంగళవారం పక్కా ప్రణాళిక ప్రకారం ప్రధాన సెంటరులోకి వస్తున్న వైఎస్సార్సీపీ నాయకులపై రాళ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో 15 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. మహిళలను వెంటాడి దాడి చేశారు. గ్రామంలో అందరూ కలసి కట్టుగా ఎన్నికల్లో పాల్గొన్నారనే అక్కసుతో టీడీపీ నాయకులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కాజా ఆదిశేషమ్మ, అమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జక్కిరెడ్డి గోవిందరెడ్డి, అమ్మిరెడ్డి సంజీవరెడ్డి, భవనం సంజీవరెడ్డి, మల్లంపాటి చెంచిరెడ్డి, నక్కా ఆదిలక్ష్మి, కాజా జయమ్మ, వంగూరి ప్రసాద్ సహా 15 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, గొడవను అదుపు చేయలేక పోవటం పలు విమర్శలకు తావిచ్చింది. క్షతగాత్రులను వినుకొండ ఆస్పత్రిలో స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. » బొల్లాపల్లి మండలం పేరూరుపాడులో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై టీడీపీ మూక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఏర్పడిన స్వల్ప వివాదంతో కావాలనే టీడీపీ నాయకులు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు.