Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ap Assembly Elections 2024: TDP Cadre Goons Attacks On Polling Day
టీడీపీ నేతల దౌర్జన్యాలు.. ఏపీలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌. ఓటమి భయంతో పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద తెలుగు దేశం నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్‌ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు.. పల్నాడు ఉద్రిక్తతలపై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్‌ సారించింది.అనంతపురంతాడిపత్రి లో ఉద్రిక్తతవైఎస్సార్ సీపీ శ్రేణులపై జేసీ వర్గీయుల రాళ్ల దాడిమూడు వాహనాలు ధ్వంసంఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులుపల్నాడు: మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు వద్ద వైఎస్ఆర్సిపి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై టీడీపీ దాడికర్రలు రాడ్లు మారణాయుధాలతో దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలుపదిమంది వైఎస్ఆర్సిపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలుతలలు పగిలిపోవడంతో తీవ్ర రక్తస్రావంరోడ్డుపైన పడిపోయిన వైఎస్ఆర్సిపీ కార్యకర్తలుపిల్లలు రామకృష్ణారెడ్డి వాహన శ్రేణి పూర్తిగా ధ్వంసంపోలింగ్ బూత్ పరిశీలనకు వెళ్ళిన సమయంలో ఒక్కసారిగా పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి పై దాడి చేసిన టీడీపీ మూకలుకృష్ణాపెనమలూరు నియోజకవర్గం పోరంకి హై స్కూల్ పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను ప్రలోభపెడుతున్న టీడీపీటీడీపీకి ఓటు వెయ్యాలని పార్టీ గుర్తు చూపిస్తున్న కార్యకర్తలుటీడీపీ ప్రలోభాల పై నిలదీసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుటీడీపీ పై పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలుప్రకాశంఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ 10 వాహనాల కాన్వాయ్ తో హల్చల్,ఎన్నికల నిబంధనలు కు విరుద్ధంగా కాన్వాయ్పట్టించుకోని పోలీసులు ,ఎన్నికల అధికారులుఎస్పీ సుమిత్ కి పిర్యాదు చేసిన బాలినేనిబాపట్ల పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలం పెదనక్కలపాలెంలో టీడీపీ అరాచకంబాపట్ల వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ కారుపై దాడిదాడి సమయంలో కారులో లేని నందిగం సురేష్ఏజెంట్లు మాత్రమే కారులో ఉండడంతో కారుపై దాడి చేసి నందిగం సురేష్ ను దుర్భాషలాడిన టీడీపీ కార్యకర్తలుఏజెంట్ల ను బెదిరించిన టీడీపీ కార్యకర్తలుమూడురోజుల క్రితమే యద్దన పూడి మండలం చింతపల్లిపాడులో సురేష్ పై దాడి చేసిన టీడీపీ శ్రేణులుకాకినాడగొల్లప్రోలు టౌన్ లో ఉద్రిక్తత.మహిళలను ఏడిపించిన జనసేన కార్యకర్తలుఅడ్డుకోబోయిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలువైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై జనసేన కార్యకర్తలు దాడిపరిస్తితి ఉద్రిక్తంప్రకాశందర్శి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలుదర్శి మండలం బొట్లపాలెం ఘర్షణ, వైస్సార్సీపీ ,టీడీపీ కార్యకర్తలు కొట్లాట, పరిస్థితి ఉద్రిక్తంఏజెంట్ల తలెత్తిన వివాదంకిందపడిన ఈవీఎంవైస్సార్సీపీ కార్యకర్తలు పై టీడీపీ కార్యకర్తలు దాడిదేవవరంలోనూ ఘర్షణ, ఏజెంట్ ల మధ్య గొడవప్రకాశందర్శి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలుదర్శి మండలం బొట్లపాలెం ఘర్షణ, వైస్సార్సీపీ ,టీడీపీ కార్యకర్తలు కొట్లాట, పరిస్థితి ఉద్రిక్తంఏజెంట్ల తలెత్తిన వివాదంకిందపడిన ఈవీఎంవైస్సార్సీపీ కార్యకర్తలు పై టీడీపీ కార్యకర్తలు దాడిదేవవరంలోనూ ఘర్షణ, ఏజెంట్ ల మధ్య గొడవఅనంతపురంతాడిపత్రి లో ఎదురుపడ్డ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి - జేసీ ప్రభాకర్ రెడ్డితాడిపత్రి లో టీడీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అభ్యంతరంఅనుమతి లేకుండా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, టీడీపీ రౌడీషీటర్ పొట్టి రవిఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితాడిపత్రి పట్టణంలో జేసీ ఇరువర్గాల మొహరింపులాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులుపల్నాడుమాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ వద్ద టీడీపీ కార్యకర్తల దౌర్జన్యంపోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితాము లోపలికి వెళ్తామని టీడీపీ కార్యకర్తల ఆందోళనపోలింగ్ కేంద్రం గేట్ల‌ను తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నంఅడ్డుకున్న పోలీసులతో వాగ్వివాదంపోలీసులను నెట్టేసిన టీడీపీ కార్యకర్తలుఅనంతపురంగుత్తిలో టీడీపీ నేతల దౌర్జన్యంపోలింగ్ కేంద్రం లో ప్రచారం నిర్వహించిన టీడీపీ నేతలుప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలుకర్నూలుకర్నూలు 17వ వార్డు టిడిపి పార్టీ కార్పోరేటర్ పద్మలతా రెడ్డి ప్రలోభాలు...పోలింగ్ కేంద్రం వద్ద చేరుకొని టిడిపికి ఓటు వేయాలని ఓటర్లను ప్రభావితం చేస్తున్న కార్పొరేటర్..ఎన్నికల నిబంధన ఉల్లంఘించి ప్రచారానికి పాల్పడుతున్న టిడిపి కార్పొరేటర్ పద్మలత రెడ్డిచిత్తూరుకుప్పం నియోజవర్గంలో దొంగ ఓటర్లుకుప్పం మున్సిపాలిటీ పాతపేట 163 పోలింగ్ బూత్ లో తన ఓటు వేరే ఎవరో దొంగ ఓటు వేశారని ఆవేదన వ్యక్తం చేసిన గాయత్రీ అనే ఓటర్మొదటి సారి ఓటు హక్కు వినయోగించుకోవాలని చూసిన యువతీ తన ఓటు వేరొకరు వేసేయడంతో కన్నీళ్లు పెట్టుకొన్న యువతీకృష్ణాబాపులపాడులో జనసేన,టీడీపీ నాయకులు ఓవర్ యాక్షన్.పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న జనసేన,టీడీపీ నాయకులు.జనసేన నాయకుడు చలమలశెట్టి రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేత గోసుల శివ భరత్ రెడ్డి.ఏలూరు దెందులూరు నియోజకవర్గం పెదవేగి గ్రామంలో టిడిపి నాయకుల దౌర్జన్యం.పోలింగ్ బూత్ నెంబర్ 54 లోకి ఒక్కసారిగా చొచ్చుకుని వెళ్ళే ప్రయత్నం చింతమనేని అనుచరులు.ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భయభ్రాంతులకు గురైన ఓటర్లువిధుల్లో ఉన్న పోలీసుల అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడిన టిడిపి నాయకులుపారా మిలిటరీ బలగాలు రంగ ప్రవేశం చేయటంతో సద్దుమణిగిన పరిస్థితులు.నంద్యాలనందికొట్కూరు పట్టణంలోని 46,47,48 పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నేత మాండ్రా శివనంద రెడ్డి హాల్ చల్ క్యూలైన్లో ఉన్న ఓటర్లపై ఒత్తిడి తెచ్చి ప్రలోభాల పర్వంక్యూలైన్లలో ఉన్న ఓటర్లను పక్కకు పిలిచి ఓటు వేయాలని భయబ్రాంతులకు గురి చేస్తున్న టీడీపీ నేత మాండ్రా శివానంద రెడ్డి,ఓటర్లను ప్రభావితం చేస్తున్న టీడీపీ శివానంద రెడ్డికి పోలీసుల వార్నింగ్‌ 100 మీటర్లు బయటఉండాలని సూచనపోలీసుల మాట లెక్క చేయకుండా నేను చీఫ్ ఎలక్షన్ ఏజంట్ అని బూత్ పరిశీలించి వెళ్తానని పోలీసులతో వాదించారు టీడీపీ నేత చిత్తూరు టీడీపీ గుండాల రౌడీయిజంమండికృష్ణాపురం పంచాయతీ లో టిడిపి గుండాల అరాచకంవైఎస్ఆర్సీపీ బూత్ ఏజెంట్స్ పై కత్తితో దాడి ఆపై పరారీ ఓటమి భయంతో నీచ రాజకీయాలకు తెరతీసిన చిత్తూరు టీడీపీ శ్రేణులువైఎస్సార్‌ జిల్లాబద్వేల్ టీడీపీ కార్యాలయం వద్ద కూటమి నాయకుల ఘర్షణ అగ్రహారం గ్రామానికి సంబంధించి ఓటర్లకు డబ్బు మేము పంచుతాము అంటే మేము పంచుతాము అంటూ గొడవ జనసేన నేత వేలును టీడీపీ నాయకుడు ఇరు వర్గాలు పోలీసుల అదుపులో

Sajjala Ramakrishna Reddy Comments On Tdp
టీడీపీ నైరాశ్యంలోకి వెళ్లి హింసను ప్రేరేపిస్తోంది: సజ్జల

సాక్షి, గుంటూరు: టీడీపీ ఓటమి నైరాశ్యంలోకి వెళ్లిపోయి హింసను రెచ్చగొట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుప్పం, మాచర్ల, తాడిపత్రి, చిత్తూరు, దర్శి నియోజకవర్గాల్లో టీడీపీ హింసాత్మక ఘటనలను ఈసీ దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు.‘‘ఓటమి భయంతో టీడీపీ దాడులకు దిగుతోంది. వైఎస్సార్సీపీ శ్రేణులు వీటిని పట్టించుకోకుండా సంయమనంతో, శాంతియుతంగా వ్యవహరించి పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేందుకు సహకరించాలి. ఓటు వేసేందుకు వచ్చిన మహిళలపై దుర్భాషలు ఆడుతూ.. బెదిరిస్తూ.. దాడులకు దిగుతున్నారు. అయినా చెదరని సంకల్పంతో మహిళలు భారీగా ఓటు వేసేందుకు తరలివస్తున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు.గంగాధర నెల్లూరు, విశాఖ వెస్ట్ నియోజకవర్గాల్లో బౌన్సర్లతో టీడీపీ నేతల హల్చల్పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా బౌన్సర్లను దించిన చరిత్ర టీడీపీది. పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం లేదా నెమ్మదిగా పనియచేయడం వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లాం’’ అని సజ్జల తెలిపారు.‘‘ఎండ వేడిమి భరించలేక, క్యూలో నిలబడలేక వృద్ధులను ఇబ్బందులను పడుతున్నారన్నవిషయాన్ని ఈసీకి తెలిపాం. కొందరు సిబ్బంది నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నందున ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని సజ్జల చెప్పారు.

AP Assembly Elections 2024 Voting Live Updates And Highlights Telugu
AP Elections 2024 Polling: ఏపీ పోలింగ్‌ డే అప్‌డేట్స్‌

AP Elections 2024 Polling Updatesఏపీ ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు..

Information About How To Cast Vote
మీ ఓటు పడిందా? ఇలా కన్మర్ఫ్‌ చేస్కోండి

KTR Key Comments On AP Assembly Lok Sabha Election YS Jagan Winning
సీఎం జగన్‌ గెలుస్తారనే నమ్మకం ఉంది: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆయన సతీమణితో కలిసి హైదరాబాద్‌లోని నందినగర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధ్రప్రదేలో తనకు అనేకమంది మిత్రులు ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సోదరుడిలాంటివాడని, ఈ ఎన్నికల్లో ఆయన మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.కాగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్ రెండో సారి అధికారంలో వస్తారంటూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘వైఎస్‌ జగన్‌ ఏపీలో రెండోసారి సీఎం అవుతారనే సమాచారం నాకు ఉంది. షర్మిల వంటి వ్యక్తులతో ఏదీ సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా షర్మిల వంటి వారిని అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూసినా అవి ఫలించవు’ అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్‌ పేర్కొన్నారు.2019 ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తాం..తెలంగాణ లోక్‌సభ ఎన్నికలపై స్పందిస్తూ.. గతంలో ఇంతకంటే అనేక సవాళ్లతో కూడిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించిందని గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో సాధించిన సీట్ల కన్నా ఎక్కువ గెలుస్తామనే నమ్మకం ఉందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిపార్టీ తామే గెలుస్తామంటుంది కానీ ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు.పోలింగ్ స్టేషన్‌ల దగ్గర కరెంటు కోతలు లేకుండా జనరేటర్లు పెట్టి ముగ్గురు ముగ్గురు అధికారులతో తెలంగాణ ప్రభుత్వం కష్టపడుతుందని సెటైర్లు వేశారు. ఆరు గ్యారంటీల్లో తెలంగాణ ప్రభుత్వం ఒక గ్యారెంటీని సగం సగం అమలు చేసిందని విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తాను ముఖ్యమంత్రినని గుర్తించాలని, ఆయన ప్రభుత్వ పనితీరుపైన దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.ఎలాంటి వివక్ష లేకుండా నిధులను కేటాయించాలి..కరెంటు కోతలు నీటి కొరతల వంటి అసలైన సమస్యలపైన రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజా సమస్యలపైన ప్రభుత్వం పని చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామచంద్ర ప్రభువుకు చెప్పినట్టు రాజా ధర్మాన్ని పాటించాలి. అన్ని రాష్ట్రాల మధ్యన ఎలాంటి వివక్ష లేకుండా నిధులను కేటాయించడం లేదా ప్రాజెక్టులు కేటాయించడం చేయలేదు. భారతదేశం మొత్తం ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ప్రజలు ఎవరికి ఓటేస్తారో నాలుగో తేదీన తేలుతుంది. పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ ప్రజలని మోసం చేస్తుంటే.. వందరోజుల నుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారు. ఈరోజు కరెంటు కోతల పైన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చినట్టుగా ఉంది.తెలంగాణ తెచ్చిన నాయకుడికే ఓటు..ఇన్వర్టర్లు జనరేటర్లు, క్యాండిల్స్, పవర్ బ్యాంకులు, చార్జింగ్ లైట్, ఇవే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలని ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలు. ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశం. మన ప్రభుత్వాలని మనం నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు ఈరోజు ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదు. దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు వేయండి. మంచి ప్రభుత్వాలను మంచి నాయకులను మీ సమస్యలకు ప్రాతినిధ్యం వహించే వారికి ఓటు వేయండి. తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ తెచ్చిన పార్టీకి నాయకుడు కేసీఆర్ .తెలంగాణ కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం నేను ఓటు వేశాను

AP Elections 2024: Pawan With Wife At Polling Centre Over Action
మంగళగిరి పోలింగ్‌ బూత్‌లో పవన్‌ ఓవరాక్షన్‌

గుంటూరు, సాక్షి: జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్‌ ‍కల్యాణ్‌ ఓవరాక్షన్‌కు దిగారు. సోమవారం ఉదయం తన భార్య అన్నా లెజినోవాను, కొందరు అనుచరులను వెంట పెట్టుకుని పోలింగ్‌ సెంటర్‌లోకి తీసుకెళ్లి హల్‌ చల్‌ చేశారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మి నరసింహ కాలనీలో 197వ బూత్‌లో పవన్‌ ఓటేసేందుకు వచ్చారు. ఆ సమయంలో తన భార్యను వెంటపెట్టుకుని బూత్‌లోకి తీసుకెళ్లారు. అలాగే.. అక్కడ సెంటర్‌లో ఓటే లేని అనుచరుల్ని వెంట తీసుకెళ్లారు. బూత్‌లో కలియ దిరుగుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. పవన్‌ భార్య అన్నా లెజినోవాకు సైతం అక్కడ ఓటు లేదని సమాచారం. అయినా అధికారులు వాళ్లను లోపలికి ఎలా అనుమతించారా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కొందరు.మరోవైపు పవన్‌ అలా వాళ్లందరినీ లోపలికి తీసుకెళ్తుంటే.. క్యూ నిల్చున్న కొందరు ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అక్కడే ఉన్న పోలింగ్‌ సిబ్బంది ఆ అభ్యంతరాల్ని పట్టించుకోకపోవడం గమనార్హం.

AP Elections 2024: CM YS Jagan Cast Vote Message To AP Voters
ఓటేసిన సీఎం జగన్‌.. పోలింగ్‌ వేళ ఓటర్లకు సందేశం

వైఎస్సార్‌, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్‌ మొదలైంది. ఉదయాన్నే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వస్థలం పులివెందులలో ఓటేశారు.కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల భాకరాపురం 138 పోలింగ్‌ బూత్‌లో సీఎం జగన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సమయంలో క్యూ నిల్చున్న ఓటర్లకు ఆయన అభివాదం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఓటేయాలని కోరారాయన. మరోవైపు ఆయన సతీమణి వైఎస్‌ భారతి.. చిన్నారులు, అభిమానులతో ఫొటోలు దిగి సందడి చేశారు. అంతకు ముందు ఎక్స్‌ ఖాతాలోనూ ఆయన ఏపీ ఓటర్లకు పిలుపు ఇచ్చారు. అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి అని కోరారు. నా అవ్వాతాతలందరూ…నా అక్కచెల్లెమ్మలందరూ…నా అన్నదమ్ములందరూ…నా రైతన్నలందరూ…నా యువతీయువకులందరూ…నా ఎస్సీ…నా ఎస్టీ…నా బీసీ…నా మైనారిటీలందరూ…అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి!— YS Jagan Mohan Reddy (@ysjagan) May 13, 2024

Telangana Lok Sabha Elections 2024 Voting Live Updates And Highlights Telugu
TS Lok Sabha Polling 2024 Updates: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ అప్‌డేట్స్‌..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ అప్‌డేట్స్‌

Lok sabha elections 2024: 4th phase polling updates In Telugu
Lok sabha elections 2024: కొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్‌

Updates బిహార్‌:బిహార్‌ డిప్యూటీ సీఎం విజయ్‌ కుమార్‌ సిన్హా ఓటు హక్కు వినియోగించుకున్నారు.లాఖీసారాయ్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.#WATCH | Bihar Deputy CM Vijay Kumar Sinha casts his vote for the fourth phase of #LokSabhaElection2024 at a polling booth in Lakhisarai. pic.twitter.com/RgnqvmqvPX— ANI (@ANI) May 13, 2024 కొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్‌లోక్ సభ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంటవరకు 40.32% పోలింగ్ శాతం నమోదుఆంధ్రప్రదేశ్ - 40.26 %బీహార్ - 34.44%జమ్మూ-కాశ్మీర్- 23.57%జార్ఖండ్ - 43.80%మధ్యప్రదేశ్ - 48.52%మహారాష్ట్ర - 30.85%ఒడిస్సా - 39.30%తెలంగాణ - 40.38%ఉత్తరప్రదేశ్ - 39.68%పశ్చిమ బెంగాల్ - 51.87%ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన పోలింగ్ శాతం 36 శాతంఒడిస్సాలో 28 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన పోలింగ్ శాతం 39.30 బిహార్‌:నార్త్‌-ఈస్ట్‌ ఢిల్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారుబెగుసారాయ్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు#WATCH | Bihar: Congress candidate from North-East Delhi, Kanhaiya Kumar casts his vote at a polling booth in Begusarai. The constituency sees the contest between sitting MP-BJP candidate Giriraj Singh and CPI candidate Awadhesh Rai.#LokSabhaElections2024 pic.twitter.com/78holvi5FH— ANI (@ANI) May 13, 2024 మధ్య ప్రదేశ్‌:మాజీ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఇండోర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Madhya Pradesh: Former Lok Sabha Speaker Sumitra Mahajan casts her vote for the fourth phase of #LokSabhaElections2024 at a polling booth in Indore. pic.twitter.com/E8pffYvjnT— ANI (@ANI) May 13, 2024 ఉత్తర ప్రదేశ్‌కేంద్రమంత్రి లఖీంపూర్‌కేరీ బీజేపీ అభ్యర్థి అజయ్‌ మిశ్రా తేని ఓటు వేశారుబాన్‌వీర్‌పూర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు#WATCH | Uttar Pradesh: BJP candidate from Lakhimpur Kheri, Union Minister Ajay Mishra Teni casts his vote at Banveerpur Booth 202 for the #LokSabhaElections2024 Samajwadi Party's Utkarsh Verma and BSP's Anashay Kalra are contesting against him from here. pic.twitter.com/NnagzQ06R3— ANI (@ANI) May 13, 2024 నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతోందిఉదయం 11 గంటల వరకు 24.87 శాతం పోలింగ్‌ నమోదైందిఆంధ్రప్రదేశ్‌- 23.10 శాతంతెలంగాణ- 24.31 శాతంబిహార్‌- 22.54 శాతంజమ్మూ కశ్మీర్‌- 14.94 శాతంజర్ఖండ్‌- 27. 40 శాతంమధ్యప్రదేశ్‌- 32.38 శాతంమహారాష్ట్ర- 17.51 శాతంఒడిశా- 23.28 శాతంఉత్తరప్రదేశ్‌- 27.12 శాతంపశ్చిమ బెంగాల్‌- 32.78 శాతం#LokSabhaElections2024 | 24.87% voter turnout recorded till 11 am, in the fourth phase of elections. Andhra Pradesh 23.10%Bihar 22.54Jammu And Kashmir 14.94% Jharkhand 27.40% Madhya Pradesh 32.38% Maharashtra 17.51% Odisha 23.28% Telangana 24.31% Uttar Pradesh 27.12%… pic.twitter.com/Awy60bMdeG— ANI (@ANI) May 13, 2024 జార్ఖండ్‌:జార్ఖండ్‌ సీఎం చంపయ్‌ సోరెన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.జిలింగోరా పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Jharkhand CM Champai Soren shows the indelible ink mark on his finger after voting at a polling booth in Jilingora, Saraikela Kharsawan District.#LokSabhaElections2024 pic.twitter.com/qw6nn60JBf— ANI (@ANI) May 13, 2024 పశ్చిమ బెంగాల్‌:దుర్గాపూర్‌: బెంగాల్‌ ఘర్షణ చోటుచేసుకుంది.బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.అక్కడే ఉన్న పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.#WATCH Durgapur, West Bengal: A clash broke out between BJP and TMC workers in Durgapur.#LokSabhaElections2024 pic.twitter.com/alSiQy6ldv— ANI (@ANI) May 13, 2024 ఢిల్లీ:నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతోందిఓటువేయడానికి భారిగా ప్రజలు తరలివస్తున్నారుఉదయం 9 గంటల వరకు మొత్తం 10. 35 శాతం పోలింగ్‌ నమోదైందిఆంధ్రప్రదేశ్‌- 9.05 శాతంతెలంగాణ- 9.51 శాతంబిహార్‌- 10.18 శాతంజమ్మూ కశ్మీర్‌- 5.07 శాతంజర్ఖండ్‌- 11. 78 శాతంమధ్యప్రదేశ్‌- 14. 97 శాతంమహారాష్ట్ర- 6.45 శాతంఒడిశా- 9. 23 శాతంఉత్తరప్రదేశ్‌- 11. 67 శాతంపశ్చిమ బెంగాల్‌- 15. 24 శాతం#LokSabhaElections2024 | 10.35% voter turnout recorded till 9 am, in the fourth phase of elections.Andhra Pradesh 9.05%Bihar 10.18%Jammu And Kashmir 5.07%Jharkhand 11.78%Madhya Pradesh 14.97%Maharashtra 6.45%Odisha 9.23%Telangana 9.51%Uttar Pradesh 11.67%West Bengal… pic.twitter.com/tmtjV4Aluw— ANI (@ANI) May 13, 2024 ఉత్తర ప్రదేశ్‌:యూపీ మంత్రి జితిన్‌ ప్రసాదా ఓటు హక్కు వినియోగించకున్నారు.షహజాన్‌పూర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు చేశారు.#WATCH | Uttar Pradesh Minister Jitin Prasada casts his vote at a polling booth in ShahjahanpurINDIA Alliance has fielded SP's Jyotsna Gond here. She faces BJP's sitting MP & candidate Arun Kumar Sagar & BSP's Dod Ram Verma. #LokSabhaElections2024 pic.twitter.com/a933KBvJWW— ANI (@ANI) May 13, 2024 జమ్మూ కశ్మీర్‌:శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా, వైఎస్‌ ప్రెసిడెంట్‌ ఒమర్‌ అబ్దుల్లా ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Srinagar, J&K: JKNC Chief Farooq Abdullah and JKNC Vice President Omar Abdullah show their inked fingers after casting their votes for the #LokSabhaElections2024 pic.twitter.com/arYMBqgxBm— ANI (@ANI) May 13, 2024 యూపీ:ఉన్నావ్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాక్షి మహారాజ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Uttar Pradesh: BJP MP and candidate from Unnao, Sakshi Maharaj casts his vote at a polling booth in the constituency.Samajwadi Party (SP) has fielded Annu Tandon and BSP has fielded Ashok Kumar Pandey here. #LokSabhaElections2024 pic.twitter.com/gW1oFBrui7— ANI (@ANI) May 13, 2024 జమ్మూ కశ్మీర్‌:శ్రీనగర్‌లో నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతోందిపెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారుLok Sabha elections 2024: Polling underway in SrinagarRead @ANI Story | https://t.co/gDgPtt9ffZ#JammuKashmir #Srinagar #LokSabhaElection2024 pic.twitter.com/2B9fFIibHg— ANI Digital (@ani_digital) May 13, 2024 తెలంగాణఓటు హక్కు వినియోగించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిబర్కత్‌పూరా పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.నాలుగోవిడత పోలింగ్‌ కొనసాగుతోందిUnion Minister G Kishan Reddy casts his vote in Telangana's BarkatpuraRead @ANI Story | https://t.co/vmoYK3dewi#GKishanReddy #LokSabhaElection2024 #Telangana pic.twitter.com/Xiwl8pYjcJ— ANI Digital (@ani_digital) May 13, 2024 మధ్యప్రదేశ్‌మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఉజ్జయినిలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Madhya Pradesh CM Mohan Yadav casts his vote at a polling station in Ujjain. #LokSabhaElections2024 pic.twitter.com/FxzdPbdYja— ANI (@ANI) May 13, 2024 ఢిల్లీ:కొనసాగుతున్న నాలుగో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్దేశవ్యాప్తంగా సాధారణ వాతావరణ పరిస్థితులు, హీట్ వేవ్ లేదని వెల్లడించిన ఐఎండిపోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లుపది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికలుఎన్నికల బరిలో 1717 మంది అభ్యర్థులుప్రతి పార్లమెంటులో సగటున 18 మంది అభ్యర్థులు1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న 17.7 కోట్ల మంది ఓటర్లు85 ఏళ్లు దాటిన ఓటర్లు12.49 లక్షల మంది, 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లుఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలుతెలంగాణలో పోలింగ్ సమయం పెంపు; ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్న 19లక్షల మంది సిబ్బందిఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లు1016 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దులలో నిఘాపోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు తెలంగాణఓటు హక్కు వినియోగించుకున్న ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ#WATCH | Telangana: AIMIM candidate from Hyderabad, Asaduddin Owaisi shows his inked finger after casting his vote at a polling booth in Hyderabad. #LokSabhaElections2024 pic.twitter.com/aEg4psMI8A— ANI (@ANI) May 13, 2024 తెలంగాణకేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఈఓ వికాస్ రాజ్‌కు ఫిర్యాధు చేసిన కాంగ్రెస్ఓటు వేసి మీడియాతో మాట్లాడుతూ మోడీ పేరును ప్రస్తావించినందుకు ఫిర్యాధుపోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందన్న కాంగ్రెస్కిషన్ రెడ్డి పై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని ECని కోరిన కాంగ్రెస్ మహారాష్ట్ర:కేంద్ర మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఓటు హక్కు వినియోగించుకున్నారు.జాల్నా పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.#WATCH | Union Minister and BJP's candidate from Jalna Lok Sabha seat, Raosaheb Patil Danve casts his vote at a polling booth in Jalna, Maharashtra Danve is sitting MP from this seat. INDIA alliance has fielded Congress leader Kalyan Vaijinathrao Kale from this seat.… pic.twitter.com/cRvRTK4B8b— ANI (@ANI) May 13, 2024 జమ్మూ కశ్మీర్‌:పుల్వామా పోలింగ్‌ కేంద్రంలో బారులు తీరిన ఓటర్లు#WATCH | Jammu and Kashmir: Voters queue up outside a polling booth in PulwamaNational Conference (NC) has fielded Aga Syed Ruhullah Mehdi from the Srinagar Lok Sabha seat, PDP fielded Waheed-ur-Rehman Para, and J&K Apni Party’s fielded Mohammad Ashraf Mir.… pic.twitter.com/VSgGZs9Vki— ANI (@ANI) May 13, 2024 తెలంగాణ:త్రిపురా గవర్నర్‌ ఎన్‌ ఇంద్రసేనా రెడ్డి ఓటు వేశారు.హైదరాబాద్‌ సలీంనగర్‌ పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ కొనసాగుతోంది#WATCH | Telangana: Tripura Governor N Indrasena Reddy, along with his family, casts his vote at a polling booth in Saleem Nagar, Hyderabad. #LokSabhaElections2024 pic.twitter.com/tdl5oYHbrs— ANI (@ANI) May 13, 2024 తెలంగాణ:ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులుహైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓటు వేశారు.నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతోంది#WATCH | Telangana: Former Vice President M Venkaiah Naidu and his wife Usha Naidu show the indelible ink mark on their fingers after casting their vote at a polling booth in Jubilee Hills, Hyderabad.#LokSabhaElections2024 pic.twitter.com/gUN3v2Ekf2— ANI (@ANI) May 13, 2024 ఢిల్లీ:ఓటు వేయటం ప్రజాస్వామ్య హక్కు: ప్రధాని మోదీకొనసాగుతున్న నాలుగో విడత పోలింగ్‌Lok Sabha election: PM Modi calls for 'democracy duty' as voting begins in fourth phaseRead @ANI Story | https://t.co/6N8RRsDrTD#LokSabaElections2024 #PMModi #democracy pic.twitter.com/IhZJO6sRzR— ANI Digital (@ani_digital) May 13, 2024 తెలంగాణ: హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | Telangana: BJP candidate from Hyderabad, Madhavi Latha casts her vote at a polling booth in the constituency.She faces sitting MP and AIMIM candidate Asaduddin Owaisi and BRS' Gaddam Srinivas Yadav here. #LokSabhaElections2024 pic.twitter.com/E7sMVEZOrj— ANI (@ANI) May 13, 2024 బిహార్‌:కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.లఖిసారి పోలింగ్‌ కేంద్రంలో ఓటు చేశారు.పోలింగ్‌ కేంద్రానికి ఓటర్లు తరలి వస్తున్నారు.#WATCH | Bihar: After casting his vote in Lakhisari, Union Minister and BJP candidate from Begusarai, Giriraj Singh says, "I want to appeal to the voters of Bihar that they must go out and vote. One vote can cause the fall of the Atal Bihari Vajpayee government and every vote can… pic.twitter.com/X6IiXHe8Qu— ANI (@ANI) May 13, 2024 యూపీ:ఉత్తరప్రదేశ్‌ మంత్రి సురేష్‌ ఖన్నా ఓటు హక్కు వినియోగించుకున్నారు.షహజాన్‌పూర్‌లో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేయడానికి ప్రజలు తరలి వస్తున్నారు.ఓటర్లు క్యూలైన్‌లో నిల్చుంటున్నారు. #WATCH | Uttar Pradesh Minister Suresh Khanna casts his vote at a polling booth in Shahjahanpur. INDIA Alliance has fielded SP's Jyotsna Gond here. She faces BJP's sitting MP & candidate Arun Kumar Sagar & BSP's Dod Ram Verma. #LokSabhaElections2024 pic.twitter.com/fpFLtROJ11— ANI (@ANI) May 13, 2024 ఒడిశా:నాబారంగాపూర్‌లో ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్‌ ఏర్పాటు.#WATCH | Nabarangpur, Odisha: An eco-friendly polling station has been established at the Dandamunda village in Chandahandi Block of the Nabarangpur Lok Sabha constituency.BJP's Balabhadra Majhi, BJD's Pradeep Majhi and Congress' Bhujabala Majhi are contesting the… pic.twitter.com/tWfKsAon3B— ANI (@ANI) May 13, 2024 ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్‌పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు పోలింగ్‌ ప్రారంభమైంది.క్యూలైన్‌లో నిల్చున్న ఓటర్లుVoting for the fourth phase of #LokSabhaElections2024 begins. Polling being held in 96 constituencies across 10 states and Union Territories (UTs) today. 1717 candidates in fray. pic.twitter.com/GXFjsWMsdQ— ANI (@ANI) May 13, 2024 తెలంగాణతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన మాక్ పోలింగ్రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ17 పార్లమెంటు స్థానాలకు బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులుఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే ముగియనున్న పోలింగ్పోలింగ్ పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 525 మంది అభ్యర్థులు, 475మంది పురుషులు, 50 మంది మహిళా అభ్యర్థులుఎన్నికల విధుల్లో 2లక్షల 80వేల మంది సిబ్బంది విధుల నిర్వహణ160 కేంద్ర కంపెనీల CAPF బలగాలతో బందోబస్తుఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి 20వేల మంది పోలీస్ బలగాలురాష్ట్ర వ్యాప్తంగా 3కోట్ల 32లక్షల 32వేల మంది ఓటర్లుపురుష ఓటర్లు - 1కోటి 65లక్షల 28వేలు, 1కోటి 67లక్షల మహిళా ఓటర్లు18-19 ఏళ్ల వయసు కలిగిన యువ ఓటర్లు 9లక్షల 20వేలు, వికలాంగులు 5లక్షల 27వేలుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 808 పోలింగ్ కేంద్రాలుఅత్యధికంగా మల్కాజ్గిరిలో 3226 పోలింగ్ కేంద్రాలు1లక్ష 9వేల 941 బ్యాలెట్ యూనిట్లు, 44906 కంట్రోల్ యూనిట్లుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9900 ఉన్నట్లు గుర్తించిన ఈసీజూన్ 4వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు#WATCH | Hyderabad, Telangana: Mock polling begins at the Jubilee Hills Public School polling booth nos. 163, 164 and 165 from Secundrabad Lok Sabha Constituency. BJP's G Kishan Reddy, Congress' Danam Nagender and BRS' T. Padma Rao Goud are contesting elections from here. G… pic.twitter.com/Q50qyruJ3B— ANI (@ANI) May 13, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నాలుగో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 1717 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రతి పార్లమెంటులో సగటున 18 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17.7 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లు12.49 లక్షలు ఉండగా, 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.తెలంగాణలో పోలింగ్ సమయం పెంచడంతో ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియలో 19 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లను నియమించారు. 1016 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దులలో ఈసీ నిఘా ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు చేశారు.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all