Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ceo Sensational Announcement On Pinnelli Video
పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన

సాక్షి, విజయవాడ: పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన చేశారు. ఆ వీడియోను మేము విడుదల చేయలేదని.. ఎన్నికల కమిషన్ నుండి బయటకు వెళ్లలేదు.. అది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటామని సీఈవో ముకేష్ కుమార్ మీనా అన్నారు.‘‘దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుండో బయటకు వెళ్లింది పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీవో, ఏపీవోలను సస్పెండ్ చేశాం. మాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదు. ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. టీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాం. బయట నాయకులు ఎవ్వరూ మాచర్లకు వెళ్లకూడదు ఎవ్వరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనీయొద్దని ఆదేశించాను’’ అని సీఈవో ముకేష్ కుమార్ మీనా చెప్పారు.

Sajjala Suspects EC Behaviour Over Macharla EVM Video Leak
ఆ ఒక్క వీడియోనే లీకైందా?.. ఈసీకి సూటి ప్రశ్నలు సంధించిన సజ్జల

గుంటూరు, సాక్షి: మాచర్ల పాల్వాయి గేట్‌ ఈవీఎం ధ్వంసం ఉదంతంపై తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ వీడియో లీకేజీ వ్యవహారంలో ఎన్నికల సంఘం తీరుపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై స్పందిస్తూ ఎన్నికల సంఘానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ‘‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్‌ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా?. వీడియో సరైందేనా? కాదా? అనేది నిర్దారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది?. ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్‌ మీడియాలోకి ఎలా వస్తుంది?.. A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 .. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌ నాడు ఈవీఎంలకు సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.! అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్‌ చేస్తుంది?. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్‌ వీడియోలను ఎందుకు బయటపెట్టదు?. 3. More importantly, in the videos attached below, there is clear evidence of TDP goons attacking innocent voters. Why has no action been initiated in these instances? pic.twitter.com/iYVvwO5nXj— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుంది కానీ.. ఒక చిన్న క్లిప్పింగ్‌ను మాత్రమే బయటకు ఎలా వస్తుంది?తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?. సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే.. అమాయక ఓటర్లపై టీడీపీ గుండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు? దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు? అని సజ్జల ప్రశ్నించారు. వీటికి సమాధానాలేవీ?13న జరిగితే 21వ తేదీన వీడియో బయటకు ఎందుకు వచ్చింది?గుర్తు తెలియని వ్యక్తులని ఎలా ఫిర్యాదు చేయగలిగారు?స్వయంగా ఎమ్మెల్యే ఉంటే ఇంత గోప్యత ఎందుకు? ఇన్నాళ్లూ టీడీపీ వాళ్లు గుర్తించలేదా?పిన్నెల్లి అనుచరులు తమను బెదిరించారనే టీడీపీ వాదన నమ్మేలా ఉందా?ఈ నెల 20న ఫిర్యాదు నమోదు అయ్యిందని ఈసీ వివరణ, అంటే.. ఇంతకాలం సీఈవో ఆఫీస్‌ ఆ ఫుటేజీని చూడలేదా?అసలు ఇంతకాలం ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ ఏం చేశారు?మిగతా వీడియోల సంగతి ఏంటి? అందులో ఎవరు ఇన్‌వాల్వ్‌ అయ్యారనేది ఈసీ ఎందుకు దాస్తోంది?

Startups Head Transplant Video Shocks Internet
ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్‌​ మూవీని తలపించేలా..!

ఇంతవరకు అవయవ మార్పిడులకు సంబంధించి..గుండె, కళ్లు, చేతులు, కిడ్నీ వంటి ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు గురించి విన్నాం. ఇటీవల జంతువుల అయవాలను మనుషులకు మార్పిడి చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా చూశాం. అవి విజయవంతం కాకపోయినా..అవయవాల కొరతను నివారించే దృష్ట్యా వైద్యులు సాగిస్తున్న ప్రయాత్నాలే అవి. ఐతే తాజాగా ఓ మెడికల్‌ స్టార్టప్‌ కంపెనీ తొలిసారిగా తల మార్పిడి శస్త్ర చికిత్సను అభివృద్ధిపరిచే లక్ష్యాన్ని చేపట్టింది. ఇది సఫలం అయితే చికిత్సే లేని వ్యాధులతో పోరాడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించగలుగుతాం. ఇంతకీ ఏంటా వైద్య విధానం అంటే..యూఎస్‌లోని బ్రెయిన్‌బ్రిడ్జ్, న్యూరోసైన్స్, బయో మెడికల్ ఇంజనీరింగ్ స్టార్టప్ ప్రపంచంలోనే తొలిసారిగా తల మార్పిడి వ్యవస్థను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. ఐతే ఈ కంపెనీ ఇంతవరకు రహస్యంగా ఈ ప్రయోగాలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడూ ప్రపంచం తాము చేస్తున్న ఈ సరికొత్త వైద్య గురించి మరింతగా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో బహిర్గతం చేసింది. ముఖ్యంగా చికిత్స చేయలేని స్థితిలో.. స్టేజ్‌ 4లో ఉన్న కేన్సర్‌, పక్షవాతం, అల్జీమర్స్‌ , పార్కిన్సన్స్‌ వంటి న్యూరోడెజనరేటివ్‌ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించడమే లక్ష్యంగా ఈ ప్రయోగానికి నాంది పలికినట్లు బ్రెయిన్‌ బ్రిడ్జ్‌ స్టార్టప్‌ పేర్కొంది. చిత్త వైకల్యంతో బాధపడుతున్న రోగి తలను ఆరోగ్యకరమైన బ్రెయిన్‌డెడ్‌ డోనర్‌ బాడీతో మార్పిడి చేయడం వంటివి ఈ సరికొత్త వైద్య విధాన ప్రక్రియలో ఉంటుంది. అందుకు సంబందించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో సంచలనం రేకెత్తించింది.ఈ వీడియోలో రెండు రోబోటిక్‌ బాడీలపై ఏకకాలంలో శస్త్ర చికిత్స చేస్తున్న రెండు స్వయం ప్రతిపత్త రోబోలు కనిపిస్తాయి. ఇక్కడ ఒకరి నుంచి తలను తీసి మరో రోబోటిక్‌ శరీరంలోకి మార్పిడి చేస్తారు. ఇది చూడటానికి హాలీవుడ్‌ రేంజ్‌ సన్నివేశంలా అనిపిస్తుంది. ఇలాంటి అత్యధునిక శస్త్రచికిత్సపైనే న్యూరబుల్‌​, ఎమోటివ్‌, కెర్నల్‌ అండ్‌ నెక్ట్స్‌ మైండ్‌, బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ ఫేస్‌ వంటి కంపెనీలు కూడా వర్క్‌​ చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెయిన్‌బ్రిడ్జ్‌లోని ప్రాజెక్ట్ లీడ్ హషేమ్ అల్-ఘైలీ మాట్లాడుతూ..తాము మెదడు కణాల క్షీణతను నివారించేలా అతుకులు లేకుండా తల మార్పిడి చేసేందుకు హైస్పీడ్‌ రోబోటిక్‌ సిస్టమ్‌ను వినియోగించేలా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఉన్న అధునాతన ఏఐ అల్గారిథమ్‌లు శస్త్ర చికిత్సలో నరాలు, రక్తనాళాల తోపాటు వెన్నుపాముని కచ్చితంగా తిరిగి కనెక్ట్‌ చేయడంలో రోబోలకు మార్గనిర్దేశం చేస్తాయని అల్‌ ఘైలీ చెప్పారు. తాము ఈ కాన్సెప్ట్‌ని విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా రూపొందించమని తెలిపారు.ఇది వైద్య సరిహద్దులను చెరిపేసేలా.. ప్రాణాంతక పరిస్థితులతో పోరాడుతున్న వారికి ప్రాణాలను రక్షించేలా వినూత్న పరిష్కారాలను అందిచగలదని చెప్పారు. 🤖 BrainBridge, the first head transplant system, uses robotics and AI for head and face transplants, offering hope to those with severe conditions like stage-4 cancer and neurodegenerative diseases… pic.twitter.com/7qBYtdlVOo— Tansu Yegen (@TansuYegen) May 21, 2024 (చదవండి: వడదెబ్బకు గురైన నటుడు షారూఖ్‌! దీని బారిన పడకూడదంటే..!)

Ksr Comments On Exit polls Win Predictions In AP Elections
మళ్లీ అధికారం వైఎస్సార్‌సీపీదే.. అంచనాలు ఇవే

రెండు రోజుల క్రితం జంగారెడ్డి గూడెం నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశారు. ఆయన ఆసక్తికరమైన విషయం చెప్పారు. అక్కడ ఒక గ్రామానికి చెందిన నలుగురైదుగురు యువకులు ఐఏఎస్ పరీక్షల కోసం సిద్ధం అవుతున్నారట. ఏపీలో శాసనసభ ఎన్నికలపై ఆసక్తితో వారు తమంతట తాము సర్వే చేపట్టారట. వారికి ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయట. వారి పరిశీలన ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు ఏభైఎనిమిది శాతం ఓటర్లు మద్దతు ఇస్తున్నారని తేలిందట. వారు ఆయా ప్రాంతాలలో ఈ స్టడీ చేశారట. వారు ప్రత్యేకంగా ఏ పార్టీపై అభిమానం ఉన్నవారు కాదు. ఇండిపెండెంట్ గా పరిశీలన చేశారు.⇒ ఇది విన్న నాకు కొద్ది రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ప్రభంజనం వస్తుందని 151 సీట్లు మించి వస్తాయని అన్న విషయం గుర్తుకు వచ్చింది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వివిధ వర్గాలలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలతో కూటమి కట్టిన తర్వాత వారి పరిస్థితి మెరుగైందని టీడీపీ అభిమానుల భావన కావచ్చు. కానీ ప్రజలు కూటమిని స్వీకరించారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అని చెప్పడం లేదు కానీ, దాదాపు అదే తరహాలో జరిగిన స్టడీలలో అత్యధిక భాగం వైఎస్సార్‌సీపీ విజయాన్ని అంచనా వేస్తున్నాయి. అందులో అంకెలు కొంచెం అటు, ఇటుగా ఉండవచ్చు కానీ, గెలుపుపై తేడా ఉండడం లేదు.⇒ ఈ నేపథ్యంలో కొన్ని ఫేక్ పోల్స్ సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. అలా చేసిన వాటిలో అత్యధికం తెలుగుదేశం పార్టీవే ఉండడం గమనించదగ్గ అంశం. ఉదాహరణకు హిందుస్తాన్ టైమ్స్ లో ఏదో సర్వే వచ్చిందని, అందులో టీడీపీ కూటమికి అనుకూల ఫలితాలు ఉన్నాయని ప్రచారం చేశారు. ఆ సంగతి తెలిసిన ఆ మీడియా తాము అలాంటి సర్వే ఏదీ ప్రచురించలేదని ఖండన ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు ఒక తెలుగు వార్తా చానల్ ఇచ్చిందంటూ ఇలాగే టీడీపీ గెలవబోతోందంటూ ప్రచారం చేస్తే, అది కూడా వాస్తవం కాదని వెల్లడైంది.వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేలలో అత్యధిక భాగం కాస్త, కూస్తో అందరికి తెలిసిన సంస్థలవే కావడం విశేషం.⇒ ఇండియా టుడే సీనియర్ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ ఆ మధ్య ఏపీలో పర్యటించారు. నాయకుల ఇంటర్వ్యూలతో పాటు జనంలో కూడా తిరిగారు. చివరిగా విశాఖ తీరంలో కూర్చుని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. మహిళలు, పేదలు ఎటు ఎక్కువ ఓట్లు వేస్తే వారిదే గెలుపు అని వ్యాఖ్యానించడం ద్వారా ఒక స్పష్టమైన పరోక్ష సంకేతం ఇచ్చారు. మహిళలు అత్యధికంగా ఓట్లు వేయడం, వారిలో పలువురు వైఎస్సార్‌సీపీ పట్ల సానుకూల ధోరణితో ఉండడం వంటి అంశాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్‌సీపీ విజయాన్ని సూచిస్తున్నాయన్న భావన ఏర్పడింది.⇒ అలాగే మరో సీనియర్ పాత్రికేయుడు ఇండియా టుడే లో ఒక వ్యాసం రాస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు బాగా ప్రభావితం చేస్తున్నాయని, అవే ఎన్నికల ఫలితాలను నిర్దేశించనున్నాయని అభిప్రాయపడ్డారు. పివిఎన్ శర్మ అనే సీనియర్ జర్నలిస్టు డిల్లీ నుంచి ఒక పోస్టు పెడుతూ వలంటీర్ల వ్యవస్థ వైఎస్సార్‌సీపీకి బాగా ఉపకరించిందని పేర్కొన్నారు. టీడీపీ సృష్టించిన వివాదంతో రాజీనామా చేసిన వేలాది మంది వలంటీర్లు తమ పరిధులలోని వివిధ వర్గాల ప్రజలను ఉదయం, సాయంత్రం ఓటింగ్ నిమిత్తం సమీకరించారని తెలిపారు. సాయంత్రం వేళ పోలింగ్ పెరగడానికి వారే కారణమని ఆయనతో పాటు మరికొందరు విశ్లేషించారు.⇒ వివిధ ప్రాంతాల నుంచి కార్లలో వచ్చిన టీడీపీ మద్దతుదారుల హడావుడిని గమనించిన మీదట అప్పటి వరకు ఓటు వేయకుండా వేచి ఉన్న మహిళలు, పేదవర్గాల వారు సాయంత్రం పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓట్లు వేశారని, దానివల్లే ఓట్ల పోలింగ్ శాతం పెరిగిందని చెబుతున్నారు. ఒక సీనియర్ అధికారి అంచనా ప్రకారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దు పోయేవరకు జరిగిన పోలింగ్ శాతం పన్నెండు శాతం వరకు ఉండవచ్చట. ఇది కూడా నిర్ణయాత్మకంగా ఉండవచ్చని భావిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ కూటమి పోటాపోటీగా ఓటింగ్ శాతం పెంచడానికి యత్నించాయి. కాగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారికన్నా పేద, బలహీనవర్గాలు అధికంగా ఉండడం వైఎస్సార్‌సీపీకి ప్లస్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.⇒ కాగా కొన్నిచోట్ల పోలింగ్ అధికారులలో కొంతమంది వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఉన్నారని, వారు కావాలని పోలింగ్‌ను ఆలస్యం చేస్తున్నారని గమనించిన ఓటర్లు ఎంతో ఓపికతో రాత్రి పొద్దు పోయేవరకు నిలబడి మరీ ఓట్లు వేసి వెళ్లారని కొందరు చెప్పారు. ఉదాహరణకు తెనాలి నియోజకవర్గంలో గుదిబండివారి పాలెంలో అర్ధరాత్రి అయినా ఒక్కరు కూడ కదలకుండా ఓట్లు వేసి మరీ వెళ్లారని ఆ గ్రామానికి చెందిన వ్యక్తి తెలిపారు. ఇక బెట్టింగ్‌ల వారిది మరో కథ. వారు కావాలని పందాలకు పలువురిని ఆకర్షించడానికి రకరకాల వ్యూహాలు అమలు చేశారని సమాచారం వస్తోంది. ఉదాహరణకు కొద్ది నెలల క్రితం ఈ బెట్టింగ్ నిర్వాహకులు వైఎస్సార్‌సీపీకి ఏభైమూడు సీట్లు వస్తాయని అంచనా వేస్తే, అది నిజమేనని నమ్మి టీడీపీకి చెందినవారు పందాలు కాయడానికి ఉత్సాహపడ్డారట. ⇒ ఆ తర్వాత క్రమేపి ఆ సంఖ్యను మార్చుతూ వైఎస్సార్‌సీపీకి 86-88 సీట్లు వస్తాయని వారు పేర్కొన్నారట. అంటే ఏమిటి దీని అర్ధం. వైఎస్సార్‌సీపీకి అధికారం వస్తుందని చెప్పడమే కదా! కడప జిల్లాలోని ఒక నియోజకవర్గంకు చెందిన మిత్రుడు ఒకరు కొద్ది రోజుల క్రితం కలిశారు. ఆయన ఇంకో విషయం చెప్పారు. ఆ నియోజకవర్గంలో పోటీ చాలా తీవ్రంగా ఉందని ప్రచారం జరిగింది. అక్కడ పరిస్థితి ఏమిటని అడిగితే అతను జవాబిస్తూ చాలా చోట్ల ఇలాగే ప్రచారం జరుగుతోందని, ఇదంతా బెట్టింగ్ రాయళ్ల పని అని అన్నారు.⇒ తమ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఇరవైవేలకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని, కానీ టైట్ అని ప్రచారం చేస్తే రెండు పార్టీలకు చెందినవారు పందాలు కాస్తారన్న ఉద్దేశంతో ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. అది నిజమేనని అనిపించింది. ఎందుకంటే ఏపీలో పలు నియోజకవర్గాలపై ఇలాంటి పందాలు సాగుతున్నాయి. కాగా కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా? లేదా అన్నదానిపై కూడా బెట్టింగులు జరుగుతున్నాయని చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక నియోజకవర్గంలో ఓటు వేసిన ఒకరు మాట్లాడుతూ కాపు సామాజికవర్గం ఏకపక్షంగా టీడీపీ కూటమికి ఓటు వేశారన్న ప్రచారం వాస్తవం కాదని అబిప్రాయపడ్డారు.⇒ జనసేనను టీడీపీ అధినేత చంద్రబాబు కాళ్ల వద్ద పవన్ కల్యాణ్ పడేశారని బాధ పడుతున్నవారు కూడా గణనీయంగా ఉన్నారని అన్నారు. టీడీపీ నేతలు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజులు టీడీపీ గెలుపు ఖాయమని చెబుతున్నా, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి ఆ విషయాన్ని ఎందుకు ప్రకటించలేకపోయారని వైఎస్సార్‌సీపీవారు అడుగుతున్నారు. అంతేకాదు టీడీపీకి సలహాదారుగా పనిచేసిన రాబిన్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన సర్వే గురించి సోషల్ మీడియాలో వస్తున్న కధనాలను టీడీపీ ఎందుకు ఖండించలేకపోతోందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈయన బృందం టీడీపీ గెలుపుపై సందేహాలు వ్యక్తం చేసిందని ప్రచారం జరుగుతోంది. అది నిజమో, కాదో తెలియదు.⇒ ఇంతవరకు సుమారు ముప్పైకి పైగా పోస్ట్ పోల్ అంచనాలను ఇచ్చాయి. వాటిలో ఒకటి, రెండు తప్ప మిగిలినవన్నీ వైఎస్సార్‌సీపీనే గెలుస్తుందని చెబుతున్నాయి. అయినా పందాలు కాయవద్దని, అది చట్టరీత్యా నేరమని ఎవరైనా చెబితే తెలుగుదేశంకు చెందిన కొంతమంది బెట్టింగులు వద్దంటే టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లే కదా అని వితండ వాదన తెస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల జనం నష్టపోతారు. గతంలో 2009లో ఒక వర్గం, 2014 లో మరో వర్గం, 2019 లో ఇంకో వర్గం బోగస్ సర్వేలను నమ్మి పందాలు కాసి కోట్ల రూపాయల మేర కోల్పోయారు. వీటిని దృష్టిలో పెట్టుకుని పందాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది.⇒ ఏది ఏమైనా ప్రజాభిప్రాయం వైఎస్సార్‌సీపీకి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు అనుకూలంగా ఉందన్నది ఎక్కువమంది నమ్మకం. బలహీనవర్గాలు, మహిళలు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు ఓటు బ్యాంకు అయ్యారని వారు చెబుతున్నారు. ఎక్జిట్ పోల్‌ను పర్యవేక్షించిన ఒకరిని దీని గురించి ప్రశ్నిస్తే అలాంటి సమాధానమే ఇచ్చారు. కాగా తాము ఇచ్చిన సూపర్ సిక్స్ కు జనం కొంతైనా ఆకర్షితులు అయి ఉంటారని, అంతేకాక తాము లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేసిన అబద్దపు ప్రచారం కొద్దిగానైనా ప్రభావితం చేసి ఉండకపోతుందా అని టీడీపీ మద్దతుదారుడు ఒకరు పేర్కొన్నారు. ఈ మొత్తం ఎన్నిక వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కావాలా? వద్దా? అనే దానిపైనే జరిగిందని, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి vs చంద్రబాబు కాదని ఆయనే అభిప్రాయపడడం విశేషం. దీనిని బట్టి ఈ ఎన్నికలు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్రంగా జరిగాయని, ఆయన స్కీములు, ఇతర కార్యక్రమాల చుట్టూనే జరిగాయని తేలుతోంది. అందుకే వైఎస్సార్‌సీపీ వర్గాలు గెలుపుపై అంత ధీమాతో ఉన్నాయని అనుకోవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Ap Elections 2024 May 23rd Political Updates Telugu
May 23rd: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 23rd AP Elections 2024 News Political Updates..4:54 PM, May 23rd, 2024పల్నాడులో హింసాత్మక ఘటనలపై సిట్‌ విచారణరెంటచింతల పీఎస్‌లో కొనసాగుతున్న సిట్‌ విచారణబెట్టిపాలెం, తమృకోట గ్రామస్తులను విచారిస్తున్న సిట్‌హింసకు పాల్పడిన కొంతమందిని గుర్తించిన సిట్‌4:19 PM, May 23rd, 2024ఈసీలో ఇంటిదొంగలెవరు?లోకేష్‌కు చేర్చింది ఈసీలోని ఇంటి దొంగలేనా?ఏపీ ఎలక్షన్‌ కమిషన్‌ తీరుపై అనుమానాలుఈసీ అనుమతి లేకుండా బయటకు వెళ్లిన వీడియో ఫుటేజ్‌రిటర్నింగ్‌ అధికారి పరిధిలో ఉండాల్సిన వీడియోను అమ్మేశారా?నారా, దగ్గుబాటి కుటుంబాలకు ఈసీ దాసోహమైందా?పచ్చ బ్యాచ్‌ కంప్లయింట్‌ చేయడంతో బయటకొచ్చి ప్రెస్‌మీట్‌ పెట్టిన ఎంకే మీనాలోకేష్‌ ట్విట్టర్‌కు వీడియో ఎలా చేరిందన్న దానిపై ఎంకే మీనా మౌనంతాజాగా వీడియో తాము విడుదల చేయలేదంటూ కూల్‌గా చెప్పిన సీఈవో మీనావీడియో ఎవరు రిలీజ్‌ చేశారో మాత్రం చెప్పని సీఈవో4:05 PM, May 23rd, 2024ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లిహైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికాసేపట్లో విచారణ జరపనున్న హైకోర్టు3:48 PM, May 23rd, 2024అంబటి రాంబాబు ట్వీట్‌వైరల్ అవుతున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో ఎన్నికల కమిషన్‌కు సంబంధం లేదని ప్రకటించింది అంటే పోలీసులు, అధికారులు టీడీపీతో ఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తోందిపిన్నెల్లిపై ఫేక్‌ వీడియోను ఎక్స్‌లో రిలీజ్‌ చేసిన నారా లోకేష్‌పై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలివైరల్ అవుతున్న మాచర్ల MLA Video ఎన్నికల కమిషన్ కు సంబంధం లేదని ప్రకటించిందంటే పోలీసులు, అధికారులు తెలుగు దేశంతోఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తుంది!— Ambati Rambabu (@AmbatiRambabu) May 23, 20242:15 PM, May 23rd, 2024పిన్నెల్లి వీడియో మేము విడుదల చేయలేదు: సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనాపిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటనఆ వీడియోను మేము విడుదల చేయలేదుఎన్నికల కమిషన్ నుండి బయటకు వెళ్లలేదుఅది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటాం. దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుండో బయటకు వెళ్లిందిపాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేశాంమాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదుఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చిందిటీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాంవాళ్లు వెళితే వైఎస్సార్‌సీపీ నేతలు కూడా వెళతామంటారుమళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశముంది. బయట నాయకులు ఎవ్వరూ మాచర్లకు వెళ్లకూడదుఎవ్వరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనీయొద్దని ఆదేశించాను. 2:00 PM, May 23rd, 2024అంబటి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ చేసిన ఏపీ హైకోర్టుసత్తెనపల్లిలో రిగ్గింగ్‌ జరిగిందని, రీపోలింగ్‌ జరపాలని పిటిషన్‌ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేసిన అంబటి‌ప్రతివాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదుగురిని చేర్చిన అంబటి 1:40 PM, May 23rd, 2024టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు చెప్పిన స్పందించలేదు: అనిల్ కుమార్ యాదవ్ఓటమి భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడింది 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక్కటే ఎందుకు బయటకు వచ్చింది ఈవీఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారుఈసీ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయిఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడి పై కూడా దాడులు చేశారుపల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలు పగలగొట్టారు తుమ్మురుకోట, వబుచెర్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు చింతపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు పాల్వాయిగేటు ప్రాంతంలో టీడీపీ నేతల విధ్వంసం చేశారు టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు? ఎస్సీ, ఎస్టీలను కొడుతున్న వీడియోలు ఈసీకి కనపడలేదా? టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట్ల రీపోలింగ్ పెట్టాలి ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తాం 1:15 PM, May 23rd, 2024లోకేష్‌, బాబు చెప్పిన దాన్ని పోలీసులు ఫాలో అవుతున్నారు: కోరముట్ల శ్రీనివాసులురైల్వేకోడూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు కామెంట్స్‌..ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఒక ప్రజానాయకుడుఅలాంటి నాయకుడిపై లుకౌట్ నోటీస్ జారీచేయడం దారుణంఒకరేమో జీవితఖైదు అని, ఇంకోరేమో కనీసం 10 ఏళ్లు శిక్ష పడుతుంది అంటూ పరిధులు దాటి మాట్లాడుతున్నారు..ఏ శిక్ష వేయాలో ఈనాడు, అంధ్రజ్యోతి నిర్ణయిస్తాయా?కూటమి అభ్యర్థి గుప్త గుంతకల్‌లో ఈవీఎంను పగలకొడితే ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.పిన్నెల్లిపై లుకౌట్ నోటీస్ జారీ చెయ్యడం కరెక్టా?వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన ప్రజానాయకుడు పిన్నెలిమాచర్ల రెంటచింతలలో జరిగిన సంఘటనపై నివేదిక తెప్పించుకోకుండానే లోకేష్‌, బాబు చెప్పిన దాన్ని పోలీసులు ఫాలో అవుతున్నారు.ఆ పోలింగ్ స్టేషన్ లో కూటమి రిగ్గింగ్ చేసింది.పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లి క్షణికావేశంలో ఈవీఎం పగలకొట్టి ఉండవచ్చుదానిపై పోలీసులు స్పందించే తీరు సరికాదు మొదటి నుండి కూటమి సభ్యులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నా ఒక్కరిపై కూడా ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదుఈసీ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోంది. 12:45 PM, May 23rd, 2024ఈసీకి సూటిగా ప్రశ్నలు సంధించిన సజ్జలమాచర్ల ఘటనపై స్పందించిన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిఎన్నికల సంఘానికి సజ్జల రామకృష్ణారెడ్డి సూటి ప్రశ్నలుపాల్వాయి గేట్‌ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా?వీడియో సరైందేనా కాదా అన్నది నిర్దారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది?ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్‌ మీడియాలోకి ఎలా వస్తుంది?మాచర్ల నియోజకవర్గంలో ఏడు ఘటనలు (ఈవీఎంలపై) జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.!అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్‌ చేస్తుంది?ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, ఏడు చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్‌ వీడియోలను ఎందుకు బయటపెట్టదు?అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుందిఅంతే కానీ.. ఒక చిన్న క్లిప్పింగ్‌ను మాత్రమే బయటకు ఎలా వస్తుంది?తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే..అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు?దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు?. 3. More importantly, in the videos attached below, there is clear evidence of TDP goons attacking innocent voters. Why has no action been initiated in these instances? pic.twitter.com/iYVvwO5nXj— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 12:10 PM, May 23rd, 2024మచిలీపట్నంలో మాక్‌ డ్రిల్..కృష్ణాజిల్లా..మచిలీపట్నం కోనేరు సెంటర్ జిల్లా ఎస్పీ అద్నాన నయీం అస్మి ఆధ్వర్యంలో మాక్ డ్రిల్కౌంటింగ్ ప్రక్రియలో అల్లర్లకు పాల్పడితే జరిగే పరిణామాలను మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు చూపించిన పోలీస్ సిబ్బంది.ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కామెంట్స్‌..ప్రజలు ఎన్నికల ప్రక్రియలో సహకరించారుకౌంటింగ్‌లో కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాంకౌంటింగ్ సమయంలో డీజేలకు, టపాసులకు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవుఅల్లర్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు 10:22 AM, May 23rd, 2024సిట్‌ దర్యాప్తు.. కంటిన్యూఏపీలో కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ముమ్మరంగా తనిఖీలుపోలింగ్‌ టైంలో, తర్వాత అల్లర్లలో పాల్గొనవారిపై నిఘారాష్ట్రవ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపుఏపీలో ఘర్షణలపై కొనసాగుతున్న సిట్‌ దర్యాప్తుతిరుపతి, తాడిపత్రి, పల్నాడులో సిట్‌ మకాంజిల్లాల పోలీసులు కేసులు విచారిస్తున్న తీరును పర్యవేక్షిస్తున్న సిట్‌ బృందాలుఅవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి వెళ్లే యోచన9:17 AM, May 23rd, 2024తిరుపతి చంద్రగిరిలో పోలీసుల అలర్ట్‌నారావారిపల్లి,శేషాపురంలో పోలీసుల పికెటింగ్‌చంద్రగిరిలో 144తో పాటు సెక్షన్‌ 30 అమలుసమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల కవాతుసభలు, సమావేశాలు, ఊరేగింపులను నో పర్మిషన్‌పోలింగ్‌ తర్వాత అల్లర్ల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు 8:10 AM, May 23rd, 2024పల్నాడులో మరో టెన్షన్‌నేడు చలో మాచర్లకు టీడీపీ పిలుపుటీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు మాచర్ల యాత్ర చేపట్టిన పచ్చ బ్యాచ్‌మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతి లేదని తేల్చి చెప్పిన పోలీసులు. 7:45 AM, May 23rd, 2024నేడు అంబటి పిటిషన్‌ విచారణఏపీ హైకోర్టులో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పిటిషన్‌పై నేడు విచారణసత్తెనపల్లిలో రిగ్గింగ్‌ జరిగిందని, రీపోలింగ్‌ జరపాలని అంబటి డిమాండ్‌ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేసిన అంబటి‌ప్రతివాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదుగురిని చేర్చిన అంబటి 7:20 AM, May 23rd, 2024‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్‌పాల్వాయి గేటులో ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్‌ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను చితకబాది బూత్‌ల నుంచి ఈడ్చివేతబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలపై పోలింగ్‌ బూత్‌లలో దౌర్జన్యం పార్టీ నేతల సమాచారంతో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రిగ్గింగ్‌ను ప్రతిఘటించి స్పందించాలని పలు దఫాలు ఎన్నికల అధికారులకు ఫోన్లు వెబ్‌ కాస్టింగ్‌ పరిశీలించి రిగ్గింగ్‌ అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఉదాశీనత.. పల్నాడులో ఏడు చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్క వీడియో మాత్రమే బహిర్గతం అవసరమైన మేరకు ఎడిటింగ్‌.. వారం తరువాత తాపీగా విదేశాల్లో ఉన్న లోకేశ్‌ ఎక్స్‌ ఖాతా నుంచి విడుదల భద్రంగా ఉండాల్సిన వెబ్‌ కాస్టింగ్‌ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు రిగ్గింగ్, ఏజెంట్లపై దాడులు, ఓటర్లని బెదిరించిన వారిని పట్టించుకోకుండా ప్రతిఘటించిన వారిపై కేసుల నమోదు పట్ల సర్వత్రా విస్మయం 7:00 AM, May 23rd, 2024ఓటమి బాటలో బాబుకుప్పంలో తప్పిన లెక్కలు.. వికటించిన వ్యూహాలుఇన్నాళ్లూ చంద్రబాబును గెలిపించింది 51 వేల దొంగ ఓట్లే రెండు విడతలుగా ఆ ఓట్ల తొలగింపు దీంతో ఓటమికి దగ్గరవుతూ వచ్చిన బాబుస్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలోనూ టీడీపీ ఘోర పరాజయం 35 ఏళ్లుగా కుప్పం ప్రజలను నమ్మించి మోసం చేసిన వైనం వైఎస్సార్‌సీపీ రాకతో ప్రతి ఇంటికీ సంక్షేమం, అభివృద్ది మారుతూ వచ్చిన ఓటర్ల తీర్పు.. గత ఎన్నికల్లో తగ్గిన మెజారిటీ ఈ దఫా ఓటమి ఖాయం అని తేలడంతో కుటుంబ సమేతంగా పరుగులు కుప్పంలో ఓటు, ఇల్లు లేని బాబు.. ఓటమి భయంతో ఇంటి నిర్మాణ పనులు ఓటుకు రూ.2 వేలు పంపిణీ చేసినా విఫల యత్నమే అంటున్న స్థానికులు 6:50 AM, May 23rd, 2024కుట్ర విఫలం వల్లే రాద్ధాంతం ఘోర ఓటమి భయంతో టీడీపీ నేతల దారుణకాండవైఎస్సార్‌సీపీకి దన్నుగా నిలిచే వర్గాల వారు ఓట్లు వేయకుండా అడ్డుకునే కుట్ర పల్నాడు, తాడిపత్రి, జమ్మలమడుగు, చంద్రగిరి సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ రోజున అల్లర్లు పోలింగ్‌ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు నెట్టి రిగ్గింగ్‌ చేసిన టీడీపీ రౌడీలు వెబ్‌ కాస్టింగ్‌లో అరాచకపర్వం స్పష్టంగా కన్పిస్తున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులు టీడీపీ మూక రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపోలింగ్‌ రోజున తమ కుట్ర విఫలమవడంతో టీడీపీ అండ్‌ గ్యాంగ్‌ యాగీ 6:40 AM, May 23rd, 2024టీడీపీ రిగ్గింగ్‌.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్‌రెడ్డిమాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారుపిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తాంపిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోందిమొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి.ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్‌ చేశారు?రిగ్గింగ్‌ జరిగిందని చెప్తుంటే... ఎందుకు వీడియో రిలీజ్‌ చేయడం లేదు?మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలిమాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?బీసీలు, ఎస్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారుఅందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాంరిగ్గింగ్‌ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలిఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలిమమ్మల్ని హౌస్‌ అరెస్ట్‌ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారుదాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలిఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోందిమాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారుమిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదుఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం 6:30 AM, May 23rd, 2024మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు చేసింది టీడీపీ నేతలేమాచర్లలో టీడీపీ నేతల రిగ్గింగ్‌ఒక్కొక్కటిగా బయటపడుతున్న వీడియోలువైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్న టీడీపీ మూకలురెంటచింతల మండలం పాల్వాయి గేటులోని 201, 202 పోలింగ్‌ బూత్‌లో టీడీపీ రిగ్గింగ్‌టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులుఓటర్లను ఓటు వేయనివ్వని టీడీపీ నేతలుఓటర్లు బూత్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలుటీడీపీ నేతల రిగ్గింగ్‌పై పోలీసులు, ఎన్నికల అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదులుఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

India stands out top steel producing nations in the world in april
టాప్‌ 5 దేశాలను వెనక్కి నెట్టిన భారత్‌!

ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తి చేసే టాప్‌ 5 దేశాలతో పోలిస్తే భారత్‌లోనే వృద్ధి నమోదైనట్లు ప్రపంచ స్టీల్‌ అసోసియేషన్‌(డబ్ల్యూఎస్‌ఏ) నివేదిక వెల్లడించింది. స్టీల్‌ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న చైనా ఏప్రిల్‌ నెలలో 85.9 మిలియన్‌ టన్నులతో 7 శాతం క్షీణించినట్లు డబ్ల్యూఎస్‌ఏ తెలిపింది.డబ్ల్యూఎస్‌ఏ రిపోర్ట్‌ ప్రకారం..ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు చైనా ఉక్కు ఉత్పత్తి 343.7 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది 2023తో పోలిస్తే 3% తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న భారత్‌ ఏప్రిల్‌లో 3.6% పెరుగుదలతో 12.1 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య 49.5 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి 8.5% వృద్ధి సాధించింది. జపాన్, అమెరికా, రష్యాలు మొదటి త్రైమాసికంలో 2-6% క్షీణించాయి. జనవరి-ఏప్రిల్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇండియా మినహా మిగతా నాలుగు అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి చేసే దేశాల్లో ప్రొడక్షన్‌ తగ్గింది.ఇదీ చదవండి: ఏఐతో మరింత అందంగా: రిలయన్స్‌ఇండియాలో స్టీల్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నప్పటికీ ప్రపంచ డిమాండ్ ఇంకా కోలుకోలేదని డేటా సూచిస్తుంది. క్రిసిల్‌ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ సెహుల్ భట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉక్కు వినియోగిస్తున్న రంగాల్లో డిమాండ్‌ తగ్గింది. 2023లో ఐరన్‌ఓర్‌(ముడి ఉక్కు) ఉత్పత్తిలో ఎలాంటి మార్పులులేవు. ఈ ట్రెండ్‌ 2024లోనూ కొనసాగుతుందని అంచనా. ఈ ధోరణి భారతీయ ఉక్కు తయారీదారుల మార్చి త్రైమాసిక ఆదాయాలపై ప్రభావం చూపింది. దేశంలో అధిక ఐరన్‌ఓర్‌ దిగుమతి కారణంగా ధరలు ప్రభావితమయ్యాయి’ అని చెప్పారు.

IPL 2024 Qualifier 2 RR Are Favorites: Ambati Rayudu on SRH vs Rajasthan
SRH vs RR: ‘సన్‌రైజర్స్‌ కాదు!.. రాజస్తాన్‌కే గెలిచే ఛాన్స్‌’

ఐపీఎల్‌-2024 ఆరంభం నుంచి వరుస విజయాలు సాధించిన రాజస్తాన్‌ రాయల్స్‌.. ఆ తర్వాత చతికిల పడింది. వరుస ఓటములతో విమర్శలు మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమైంది.ఈ క్రమంలో అమీ తుమీ తేల్చుకోవాల్సిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లోనూ రాజస్తాన్‌ గెలిచే అవకాశాల్లేవంటూ విశ్లేషకులు పెదవి విరిచారు. స్టార్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ స్వదేశానికి వెళ్లిపోవడం.. యశస్వి జైస్వాల్‌ స్థాయికి తగ్గట్లు రాణించకపోవడం.. బౌలింగ్‌ విభాగంలోనూ లోపాలు అంటూ రాజస్తాన్‌ను విమర్శించారు.ఆర్సీబీని చిత్తుచేసి.. క్వాలిఫయర్‌-2లోఇక సునిల్‌ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం ఆర్సీబీ- రాజస్తాన్‌ వార్‌ వన్‌సైడ్‌ అంటూ బెంగళూరు జట్టుకు మద్దతు పలికారు. ఈ క్రమంలో రాజస్తాన్ ఆర్సీబీకి ఊహించని షాకిచ్చింది. అహ్మదాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో బెంగళూరును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది.ఫైనల్‌ రేసులో నిలిచే క్రమంలో చెన్నై వేదికగా శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.రాజస్తాన్‌ రాయల్స్‌ ఫేవరెట్‌సన్‌రైజర్స్‌- రాజస్తాన్‌ మ్యాచ్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. వాళ్లు ఇక్కడిదాకా చేరుకున్న తీరు అద్బుతం.చెన్నై పిచ్‌ పరిస్థితులు కూడా రాజస్తాన్‌ స్పిన్నర్లకు బాగా నప్పుతాయి. కాబట్టి ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ చేసేటపుడు ఆటగాళ్లు తమ మెదళ్లను బాగా ఉపయోగించాలి.అది హైదరాబాద్‌ వికెట్‌ కాదు. చెన్నైలో మీరు వికెట్లు తీయలేరు. అందుకే బ్యాటింగ్‌పై దృష్టి సారించాలి. నిజానికి చెన్నై పిచ్‌ మీద పరుగులు రాబట్టాలంటే కచ్చితంగా ఆచితూచి ఆడుతూ బ్యాట్స్‌మన్‌షిప్‌ చూపాలి’’ అని అంబటి రాయుడు స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ ఫైర్‌అయితే, ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ రాయుడు వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారు. సన్‌రైజర్స్‌ ఆటగాళ్లను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని మండిపడుతున్నారు. రాజస్తాన్‌ మాదిరే సన్‌రైజర్స్‌ కూడా ఆది నుంచి దూకుడుగా ఆడుతూ ఇక్కడిదాకా వచ్చిందని పేర్కొంటున్నారు.హైదరాబాద్‌ జట్టులోనూ షాబాజ్‌ అహ్మద్‌, మయాంక్‌ మార్కండే, విజయకాంత్‌ వియస్కాంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వంటి స్పిన్నర్లు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అనుభవం లేకపోయినా మొమెంటమ్‌ తీసుకురావడంలో వీళ్లు సఫలమవుతారంటూ అంబటి రాయుడుకి కౌంటర్లు వేస్తున్నారు. కాగా రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టులో చెన్నై దిగ్గజం‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తో పాటు యజువేంద్ర చహల్‌ రూపంలో ఇద్దరు మేటి స్పిన్నర్లు ఉన్న విషయం తెలిసిందే.‌చదవండి: Hardik Pandya: భార్యతో హార్దిక్‌ పాండ్యాకు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్‌ వైరల్‌

Prabhas kalki 2898 AD Movie Interesting Facts About Bujji
ప్రభాస్‌ బుజ్జి.. ఎక్కడ తయారు చేశారో తెలుసా?

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తోన్న సైన్స్ ఫిక్షన్‌ చిత్రం టకల్కి 2898 ఏడీ'. అత్యంత భారీ బడ్జెట్‌తో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని డిఫరెంట్‌ లుక్‌తో కారు(బుజ్జని) అభిమానులకు పరిచయం చేశారు. ఇందుకోసం భారీ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. డిఫరెంట్‌ లుక్‌లో ఉన్న బుజ్జిని చూసి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు.అయితే ఇప్పుడు అందరిదృష్టిని ఆకర్షిస్తోన్న బుజ్జి గురించి నెట్టింట చర్చ మొదలైంది. అసలు బుజ్జిని ఎవరు తయారు చేశారు? డిఫరెంట్‌ లుక్‌లో ఉన్న బుజ్జిని ఎక్కడ తయారు చేశారు? అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. బుజ్జికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలు బయటకొచ్చాయి. బుజ్జిని తయారు చేసేందుకు ప్రముఖ కంపెనీలైన మహీంద్రా, జాయెమ్‌ ఆటోమోటివ్‌ సంయుక్తంగా రూపొందించారు.కల్కి సినిమా కోసం రూపొందించిన ఈ కారును తమిళనాడులోని కోయంబత్తూర్‌లో తయారు చేశారు. బుజ్జి బరువు దాదాపు ఆరు టన్నుల బరువుతో రూపొందించారు. ఈ కారు తయారికీ దాదాపు రూ.7 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ముందు రెండు, వెనుక భాగంలో ఒక టైరు మాత్రమే కలిగి ఉన్న బుజ్జి ఫ్యాన్స్‌కు విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ప్రత్యేకమైన కారును ప్రభాస్ స్వయంగా నడుపుకుంటూ వచ్చి అభిమానులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అమితాబ్, కమల్‌గారు లాంటి గ్రేటెస్ట్‌ లెజెండ్స్‌తో పని చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టమని అన్నారు. కాగా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 27న విడుదల కానుంది. Meet #Bujji - a 6 tonne monster of a machine built by Mahindra and Jayem AutmotiveFor the first time in the world #Kalki2898AD movie crew built a car completely from scratch just for a movie 🔥🔥Made Up with a Cost of 7Cr for Car which is INSANE pic.twitter.com/l534NTCrOU— Australian Telugu Films (@AuTelugu_Films) May 23, 2024

Karan Thapar Troubled Prashant Kishor Over Election Prediction
పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త

ఒకవైపు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడం లేదంటూనే.. మరోవైపు రాజకీయ వ్యూహకర్త హోదాలో ఎన్నికల ఫలితాలపై జోస్యాలు చెబుతున్నారు ప్రశాంత్‌ కిషోర్‌. అయితే ఆయన పలుకులు ఫలానా పార్టీలకే అనుకూలంగా ఉంటుండడంతో సోషల్‌ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. అంతెందుకు ఏపీ విషయంలోనూ ఆయన అలాంటి వ్యాఖ్యలే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పీకేకు క్రెడిబిలిటీకి సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. ఆ దెబ్బకు సహనం కోల్పోయారాయన.ఇంతకీ ఏం జరిగిందంటే.. సీనియర్‌ జర్నలిస్ట్‌ కరణ్‌థాపర్‌ ది వైర్‌ తరఫున ప్రశాంత్‌ కిషోర్‌ను ఇంటర్వ్యూ చేశారు. అయితే పీకే జోస్యాలపై కరణ్‌ థాపర్‌ ఓ ప్రశ్న సంధించారు. గతంలో హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతుందని ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పారని కరణ్‌ థాపర్‌ ప్రశ్నించారు. అయితే.. తానేమీ అలా జోస్యాలు చెప్పే వ్యాపారంలో లేనంటూ పీకే మాట్లాడారు. అందుకు.. హిమాచల్‌ విషయంలో పీకే వ్యాఖ్యలపై రికార్డులు ఉన్నాయని కరణ్‌ థాపర్‌ వివరించే యత్నం చేశారు. దీంతో.. ప్రశాంత్‌ కిషోర్‌ నీళ్లు నమలలేక అసహనం ప్రదర్శించారు. అలా తాను అన్నట్లు వీడియో రికార్డులు ఉంటే చూపించాలని, పత్రికలు-వెబ్‌సైట్‌లు ఇష్టానుసారం రాస్తాయని పీకే చిరాకుగా మాట్లాడారు. అయినా కరణ్‌ థాపర్‌ తన ప్రశ్నను వివరించే యత్నం చేస్తున్నప్పటికీ.. ప్రశాంత్‌ కిషోర్‌ వినలేదు. ‘మీరు తప్పు చేశారు’ అంటూ దాదాపు ఆగ్రహం ప్రదర్శించారు. దానికి కరణ్‌ థాపర్‌.. ‘‘హిమాచల్‌లోనే కాదు తెలంగాణలోనూ మీరు చెప్పిన జోస్యం(బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని) ఫలించలేదు, మీరు(పీకే) అలా అన్నట్లు రికార్డులు ఉన్నాయి’’ అని స్పష్టంగా వివరించబోయారు. అయినప్పటికీ.. కరణ్‌ థాపర్‌ను మాట్లాడనీయకుండా తాను అలా అన్నట్లు వీడియో చూపించాలంటూ పీకే పట్టుబట్టారు. అంతేకాదు ఇంటర్వ్యూ పేరుతో తనను టార్గెట్‌ చేయొద్దంటూ పీకే అసహనం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా కరణ్‌ థాపర్‌ను తనను తాను గొప్పగా ఊహించుకోవద్దంటూ పీకే అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆ సమయంలో కరణ్‌ థాపర్‌ తాను కేవలం ఎన్నికల ఫలితాల జోస్యాలు అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పగలరు అని మాత్రమే ప్రశ్నిస్తున్నానని అనగా.. మరో ప్రశ్నకు వెళ్లాలంటూ పీకే దాటవేయడం ఆ వీడియోలో చూడొచ్చు.Karan Thapar screwed Prashant Kishor to the extent that he lost his cool & showed his true colours.pic.twitter.com/inn8vuaFCx— ✎𝒜 πundhati🌵🍉🇵🇸 (@Polytikles) May 22, 2024

Virat Kohli Anushka Sharma Rs 2 5 cr investment turns into Rs 10 cr
రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!

టీమిండియా లెజండరీ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన భార్య బాలివుడ్‌ నటి అనుష్క శర్మలకు షేర్‌ మార్కెట్‌లో లాభాల పంట పండింది. వారు పెట్టుబడి పెట్టిన షేర్లు భారీ లాభాలను తీసుకొచ్చాయి.స్టాక్ మార్కెట్‌లో మే 23న అరంగేట్రం చేసిన గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్.. 2020 ఫిబ్రవరిలో ఈ బీమా సంస్థలో పెట్టుబడి పెట్టిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. కంపెనీ షేరు ధర రూ.300 మార్కును దాటడంతో, కంపెనీలో తమ వాటాలను కొనసాగిస్తూనే దంపతుల పెట్టుబడి నాలుగు రెట్లు పెరిగింది.బీమా కంపెనీ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) ప్రకారం.. విరాట్ కోహ్లీ గో డిజిట్‌లో ఒక్కొక్కటి రూ. 75 చొప్పున 2,66,667 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అలాగే అనుష్క శర్మ 66,667 షేర్లను రూ.50 లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో ఈ జంట మొత్తం పెట్టుబడి రూ.2.5 కోట్లకు చేరుకుంది. కంపెనీ షేర్ ధర రూ.300 దాటడంతో విరాట్ కోహ్లీ రూ.2 కోట్ల పెట్టుబడి రూ.8 కోట్లకు చేరుకోగా, అనుష్క శర్మ పెట్టుబడి రూ.2 కోట్లకు చేరుకుంది. వీళ్ల షేర్ల విలువ ఇప్పుడు రూ.10 కోట్లు.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement