Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

TDP Try To Create Chaos Clashes Again With Chalo Macherla
మాచర్లలో మరో టెన్షన్‌.. భారీ కుట్రకు ప్లాన్‌!

ఎన్నికల పోలింగ్‌ హింసాత్మక ఘటనల నుంచి తేరుకోవడానికి.. ప్రశాంతత నెలకొనేందుకు పల్నాట నాలుగురోజుల సమయం పట్టింది. అలాంటి చోట మళ్లీ అల్లర్లకు తెలుగు దేశం పార్టీ కుట్రలు చేస్తోందా?. వద్దని పోలీసులు వారిస్తున్నా చలో మాచర్ల చేపట్టం వెనుక ఆంతర్యం ఏమిటి?. 👉టీడీపీ కీలక నేతల గృహనిర్బంధంమాచర్లలో టీడీపీ ‘చలో మాచర్ల’కు అనుమతి లేదని పోలీసుల స్పష్టీకరణఉద్రిక్తతలు తలెత్తకుండా సహకరించాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ విజ్ఞప్తిమాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతల గృహ నిర్బంధం గొల్లపూడిలో దేవినేని ఉమ, విజయవాడలో వర్ల రామయ్య, గుంటూరులో నక్కా ఆనంద్‌, కనపర్తిలో శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులుఅయినా మాచర్ల వెళ్లితీరతామంటూ టీడీపీ నేతల మొండిపట్టు.. ఉద్రిక్తత 👉మాచర్లలో భారీ పోలీసు బందోబస్తుపల్నాడు జిల్లాలో మరొక భారీ కుట్రకు ప్లాన్ చేసిన తెలుగుదేశం పార్టీ?పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు చలో పల్నాడు.. మాచర్ల పేరుతో తెలుగుదేశం నేతలు మరొక డ్రామాఉమ్మడి గుంటూరు ,కృష్ణా జిల్లాల నేతలతో చలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీజిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది అని చెబుతున్న పోలీసులునిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్న పోలీసులుపోలీసుల హెచ్చరికలను పట్టించుకోని తెలుగుదేశం పార్టీచలో మాచర్ల పేరుతో పల్నాడులో మరోసారి విధ్వంసం సృష్టించడానికి తెలుగుదేశం రెడీ అవుతున్న తెలుగుదేశం నేతలు 👉 పల్నాడులో టీడీపీ చలో మాచర్ల పిలుపుతో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు👉 మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేత దేవినేని ఉమా గృహ దిగ్భంధం.. మరికొందరు నేతల్ని సైతం అడ్డుకున్న పోలీసులు👉 మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతి లేదు: పోలీసులు👉 మాచర్లలో ఎలాగైనా పర్యటన చేపడతాం: టీడీపీ నేతలు తెలుగు దేశం పార్టీ ఇవాళ చలో మాచర్లకు పిలుపు ఇచ్చింది. ఈ ఉదయం మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, వర్ల రామయ్య, నక్క , ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, జీవీ ప్రకాష్ లాంటి కీలక నేతలు పాల్గొనేందుకు ప్రణాళిక రూపొందించారు. పోలింగ్‌ సందర్భంగా ఇక్కడ జరిగిన అల్లర్లపై ఈసీ సీరియస్‌ అయ్యింది. దీంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాచర్లలోఎలాంటి పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు. అయినా కూడా టీడీపీ సానుభూతిపరులకు పరామర్శ పేరిట చలో మాచర్ల నిర్వహించి తీరతామని టీడీపీ అంటోంది. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండగా.. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్‌ వాతావరణం నెలకొందక్కడ.

Operation Cambodia Success And 420 Indians Rescued
ఆపరేషన్‌ కంబోడియా సక్సెస్‌.. శభాష్‌ వైజాగ్‌ పోలీస్‌!

సాక్షి, విశాఖ: ఆపరేషన్‌ కంబోడియా విజయవంతమైంది. కంబోడియాలో మరో 60 మంది భారతీయులను ఇండియన్‌ ఎంబసీ అధికారులు కాపాడారు. దీంతో, కంబోడియా నుంచి సురక్షితంగా బయటపడిన వారి సంఖ్య 420కి చేరుకుంది.కాగా, భారత ఎంబసీ అధికారులు ఆపరేషన్‌ కంబోడియాను విజయవంతం చేశారు. సైబర్‌ నేరాల బారినపడి కంబోడియాలో చిక్కుకున్న భారతీయులను ఎంబసీ అధికారులు రక్షించారు. తాజాగా మరో 60 మంది భారతీయులను కాపాడారు. దీంతో, 420 మంది భారతీయులు ఈ వ్యవహారం నుంచి బయటపడ్డారు. కాగా, నిన్న(బుధవారం) 360 మందిని అధికారులు పోలీసుల చర నుంచి విడిపించారు. ఇక, 420 మందిలో ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారని సమాచారం.ఈ సందర్భంగా భారత రాయబారి దేవయాని ఖోబ్రగడే కంబోడియాలో ఇండియన్‌ కమ్యూనిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవయాని మాట్లాడుతూ.. మన భారతీయులను మనమే రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. భారతీయులకు మద్దతు ఇవ్వడం.. వారి భద్రత, శ్రేయస్సు కోసం రాయబార కార్యాలయం అంకితభావంతో పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలోనే కంబోడియా అధికారులకి ధన్యవాదాలు తెలిపారు.అయితే.. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్‌ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్‌’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్‌ విజయ్‌కుమార్‌ సోషల్‌ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్‌ల మీదుగా కంబోడియాకు పంపించారు.అక్కడ మరో గ్యాంగ్‌ బాధితులను రిసీవ్‌ చేసుకొని కంబోడియాలో పాయిపేట్‌ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్‌ వీసా చేయించి ఆ గ్యాంగ్‌ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్‌ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్‌ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సైబర్‌ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. విశాఖ సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయనుంది.

Karan Thapar Troubled Prashant Kishor Over Election Prediction
పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త

ఒకవైపు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడం లేదంటూనే.. మరోవైపు రాజకీయ వ్యూహకర్త హోదాలో ఎన్నికల ఫలితాలపై జోస్యాలు చెబుతున్నారు ప్రశాంత్‌ కిషోర్‌. అయితే ఆయన పలుకులు ఫలానా పార్టీలకే అనుకూలంగా ఉంటుండడంతో సోషల్‌ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. అంతెందుకు ఏపీ విషయంలోనూ ఆయన అలాంటి వ్యాఖ్యలే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పీకేకు క్రెడిబిలిటీకి సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. ఆ దెబ్బకు సహనం కోల్పోయారాయన.ఇంతకీ ఏం జరిగిందంటే.. సీనియర్‌ జర్నలిస్ట్‌ కరణ్‌థాపర్‌ ది వైర్‌ తరఫున ప్రశాంత్‌ కిషోర్‌ను ఇంటర్వ్యూ చేశారు. అయితే పీకే జోస్యాలపై కరణ్‌ థాపర్‌ ఓ ప్రశ్న సంధించారు. గతంలో హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతుందని ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పారని కరణ్‌ థాపర్‌ ప్రశ్నించారు. అయితే.. తానేమీ అలా జోస్యాలు చెప్పే వ్యాపారంలో లేనంటూ పీకే మాట్లాడారు. అందుకు.. హిమాచల్‌ విషయంలో పీకే వ్యాఖ్యలపై రికార్డులు ఉన్నాయని కరణ్‌ థాపర్‌ వివరించే యత్నం చేశారు. దీంతో.. ప్రశాంత్‌ కిషోర్‌ నీళ్లు నమలలేక అసహనం ప్రదర్శించారు. అలా తాను అన్నట్లు వీడియో రికార్డులు ఉంటే చూపించాలని, పత్రికలు-వెబ్‌సైట్‌లు ఇష్టానుసారం రాస్తాయని పీకే చిరాకుగా మాట్లాడారు. అయినా కరణ్‌ థాపర్‌ తన ప్రశ్నను వివరించే యత్నం చేస్తున్నప్పటికీ.. ప్రశాంత్‌ కిషోర్‌ వినలేదు. ‘మీరు తప్పు చేశారు’ అంటూ దాదాపు ఆగ్రహం ప్రదర్శించారు. దానికి కరణ్‌ థాపర్‌.. ‘‘హిమాచల్‌లోనే కాదు తెలంగాణలోనూ మీరు చెప్పిన జోస్యం(బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని) ఫలించలేదు, మీరు(పీకే) అలా అన్నట్లు రికార్డులు ఉన్నాయి’’ అని స్పష్టంగా వివరించబోయారు. అయినప్పటికీ.. కరణ్‌ థాపర్‌ను మాట్లాడనీయకుండా తాను అలా అన్నట్లు వీడియో చూపించాలంటూ పీకే పట్టుబట్టారు. అంతేకాదు ఇంటర్వ్యూ పేరుతో తనను టార్గెట్‌ చేయొద్దంటూ పీకే అసహనం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా కరణ్‌ థాపర్‌ను తనను తాను గొప్పగా ఊహించుకోవద్దంటూ పీకే అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆ సమయంలో కరణ్‌ థాపర్‌ తాను కేవలం ఎన్నికల ఫలితాల జోస్యాలు అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్పగలరు అని మాత్రమే ప్రశ్నిస్తున్నానని అనగా.. మరో ప్రశ్నకు వెళ్లాలంటూ పీకే దాటవేయడం ఆ వీడియోలో చూడొచ్చు.Karan Thapar screwed Prashant Kishor to the extent that he lost his cool & showed his true colours.pic.twitter.com/inn8vuaFCx— ✎𝒜 πundhati🌵🍉🇵🇸 (@Polytikles) May 22, 2024

Dinesh Karthik Retirement: RCB Finisher Best Records Emotional Send Off
Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్‌! అరుదైన రికార్డులు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభం నుంచి పదిహేడో ఎడిషన్‌ దాకా కొనసాగిన కొంత మంది ఆటగాళ్లలో దినేశ్‌ కార్తిక్‌ ఒకడు. తమిళనాడుకు చెందిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అరంగేట్ర సీజన్‌ నుంచి ఇప్పటి దాకా ఆరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.ఇక పదిహేడేళ్ల పాటు నిరంతరాయంగా క్యాష్‌ రిల్‌ లీగ్‌ ఆడుతున్న 38 ఏళ్ల డీకే.. తాజాగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఐపీఎల్‌-2024 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ‌చేతిలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఓటమి తర్వాత తన నిర్ణయాన్ని పరోక్షంగా తెలియజేశాడు.ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్లు, అభిమానులు డీకేకు శుభాకాంక్షలు చెబుతూ వీడ్కోలు పలికారు. ఇక సుదీర్ఘకాలంగా ఫ్రాంఛైజీ క్రికెట్‌ ఆడుతున్న డీకే తన ఆఖరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడి భారంగా మైదానాన్ని వీడాడు.ఒక్క టైటిల్‌...👉దినేశ్‌ కార్తిక్‌ 2008 నుంచి 2024 వరకు అన్ని ఐపీఎల్ సీజన్లలో ఆడాడు. 2008లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ రూ. 2.1 కోట్లకు డీకేను కొనుక్కుంది.👉మూడేళ్ల పాటు ఆ జట్టుతో కొనసాగిన దినేశ్‌ కా​ర్తిక్‌.. ఆ తర్వాత పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌తో జట్టుకట్టాడు. రెండేళ్ల పాటు పంజాబ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌.. 2013లో ముంబై ఇండియన్స్‌కు మారాడు.👉ఆ ఏడాది రోహిత్‌ శర్మ ట్రోఫీ గెలవడంతో డీకే ఖాతాలో తొలిసారి ఐపీఎల్‌ టైటిల్‌ చేరింది. నాటి ఫైనల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడిన ముంబై తుదిజట్టులో దినేశ్‌ కార్తిక్‌ కూడా ఉన్నాడు.👉అయితే, ముంబై ఇండియన్స్‌తో అతడి ప్రయాణం అంతటితో ముగిసిపోయింది. 2014 వేలంలో ఢిల్లీ ఫ్రాంఛైజీ మరోసారి డీకేను దక్కించుకుంది. ఏకంగా 12.5 కోట్లు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది.ఆర్సీబీ అప్పుడే తొలిసారి👉కానీ మరుసటి ఏడాదే డీకేను ఢిల్లీ విడిచిపెట్టింది. ఈ క్రమంలో 2015 ఐపీఎల్‌ వేలంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తొలిసారి దినేశ్‌ కార్తిక్‌ను సొంతం చేసుకుంది. ఈ వికెట్‌ కీపర్‌బ్యాటర్‌ కోసం ఏకంగా రూ 10.50 కోట్లు ఖర్చు పెట్టింది.👉అయితే, ఆ సీజన్‌లో డీకే 11 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 141 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో మరుసటి ఏడాది ఆర్సీబీ అతడిని వదిలించుకుంది.గుజరాత్‌ లయన్స్‌తో రెండేళ్ల ప్రయాణం👉ఈ క్రమంలో సురేశ్‌ రైనా సారథ్యంలోని గుజరాత్‌ లయన్స్‌ డీకేను కొనుగోలు చేయగా.. రెండేళ్ల పాటు అక్కడే కొనసాగాడు. ఆ తర్వాత గుజరాత్‌ లయన్స్‌ జట్టు కనుమరుగు కాగా.. 2018లొ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌లో చేరాడు దినేశ్‌ కార్తిక్‌.కేకేఆర్‌ కెప్టెన్‌గా నియామకం👉ఆ ఏడాది వేలంలో రూ. 7.4 కోట్లకు కేకేఆర్‌ యాజమాన్యం డీకేను కొనుక్కుంది. ఈ క్రమంలో గౌతం గంభీర్‌ జట్టు నుంచి నిష్క్రమించగా.. దినేశ్‌ కార్తిక్‌ను కెప్టెన్‌గా నియమించింది.👉ఇక కేకేఆర్‌ సారథిగా రెండున్నరేళ్ల పాటు కొనసాగిన డీకే 37 మ్యాచ్‌లలో జట్టును ముందుండి నడిపించాడు. అయితే, 2020 సీజన్‌ మధ్యలోనే కెప్టెన్సీ వైదొలగగా ఇయాన్‌ మోర్గాన్‌ ఆ బాధ్యతలను స్వీకరించాడు.మరోసారి ఆర్సీబీ చెంత.. ఇక్కడే వీడ్కోలు👉ఈ క్రమంలో ఐపీఎల్‌ మెగా వేలం-2022కు ముందు కేకేఆర్‌ కార్తిక్‌ను రిలీజ్‌ చేసింది. అయితే, ఆర్సీబీ ఫ్రాంఛైజీ మరోసారి డీకేపై నమ్మకం ఉంచి అతడిని రూ. 5.5 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.👉ఆ సీజన్‌లో ఆర్బీసీ తరఫున 183కు పైగా స్ట్రైక్‌రేటుతో డీకే 330 పరుగులతో రాణించాడు. ఫినిషర్‌గా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఈక్రమంలో టీ20 ప్రపంచకప్‌-2022 భారత జట్టులో చోటు కూడా సంపాదించాడు డీకే.👉అయితే, మెగా టోర్నీలో నిలకడలేమి ఆటతో విమర్శలపాలైన డీకే.. 2023 సీజన్‌లోనూ విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌లలో కలిపి కేవలం 140 పరుగులే చేశాడు. ఇక ఈ ఏడాది ఆర్సీబీ తరఫున 13 ఇన్నింగ్స్‌ ఆడిన డీకే 326 పరుగులు సాధించాడు.👉ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ చేతిలో బెంగళూరు పరాజయం నేపథ్యంలో ఓటమితో తన ఐపీఎల్‌ కెరీర్‌ను ముగించాడు దినేశ్‌ కార్తిక్‌. మొత్తంగా ఓవరాల్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో డీకే.. 257 మ్యాచ్‌లు ఆడి 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 అర్థ శతకాలు ఉన్నాయి. దినేశ్‌ కార్తిక్‌ ఐపీఎల్‌ రికార్డులు👉మహేంద్ర సింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, వృద్ధిమాన్‌ సాహా, మనీశ్‌ పాండేలతో పాటు 17 సీజన్ల పాటు ఐపీఎల్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆటగాడు.👉క్యాష్‌ రిచ్‌ లీగ్‌ పదిహేడేళ్ల చరిత్రలో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే అతడు మిస్సయ్యాడు.👉ధోని తర్వాత అత్యధిక ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు. ధోని 264 మ్యాచ్‌లు ఆడగా.. డీకే తన కెరీర్లో 257 మ్యాచ్‌లలో భాగమయ్యాడు.2018- 2020 మధ్య కేకేఆర్‌ కెప్టెన్‌గా 37 మ్యాచ్‌లు ఆడి 19 విజయాలు సాధించాడు. తద్వారా గంభీర్‌(61) తర్వాత కేకేఆర్‌ను అత్యధికసార్లు గెలిపించిన కెప్టెన్‌గా రికార్డు.👉దినేశ్‌ కార్తిక్‌ వికెట్‌ కీపర్‌గా 174 డిస్మిసల్స్‌లో భాగమయ్యాడు. ధోని(190) తర్వాత ఈ జాబితాలో రెండో స్థానం ఆక్రమించాడు. From #RCB to Dinesh Karthik ❤️ #TATAIPL | #RRvRCB | #TheFinalCall | #Eliminator | @RCBTweets | @DineshKarthik pic.twitter.com/p2XI7A1Ta6— IndianPremierLeague (@IPL) May 22, 2024 చదవండి: అదే మా ఓటమిని శాసించింది.. లేదంటే విజయం మాదే: డుప్లెసిస్‌

Ap Elections 2024 May 23rd Political Updates Telugu
May 23rd: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 23rd AP Elections 2024 News Political Updates..10:22 AM, May 23rd, 2024సిట్‌ దర్యాప్తు.. కంటిన్యూఏపీలో కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ముమ్మరంగా తనిఖీలుపోలింగ్‌ టైంలో, తర్వాత అల్లర్లలో పాల్గొనవారిపై నిఘారాష్ట్రవ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపుఏపీలో ఘర్షణలపై కొనసాగుతున్న సిట్‌ దర్యాప్తుతిరుపతి, తాడిపత్రి, పల్నాడులో సిట్‌ మకాంజిల్లాల పోలీసులు కేసులు విచారిస్తున్న తీరును పర్యవేక్షిస్తున్న సిట్‌ బృందాలుఅవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి వెళ్లే యోచన9:17 AM, May 23rd, 2024తిరుపతి చంద్రగిరిలో పోలీసుల అలర్ట్‌నారావారిపల్లి,శేషాపురంలో పోలీసుల పికెటింగ్‌చంద్రగిరిలో 144తో పాటు సెక్షన్‌ 30 అమలుసమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల కవాతుసభలు, సమావేశాలు, ఊరేగింపులను నో పర్మిషన్‌పోలింగ్‌ తర్వాత అల్లర్ల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు 8:10 AM, May 23rd, 2024పల్నాడులో మరో టెన్షన్‌నేడు చలో మాచర్లకు టీడీపీ పిలుపుటీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు మాచర్ల యాత్ర చేపట్టిన పచ్చ బ్యాచ్‌మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతి లేదని తేల్చి చెప్పిన పోలీసులు. 7:45 AM, May 23rd, 2024నేడు అంబటి పిటిషన్‌ విచారణఏపీ హైకోర్టులో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పిటిషన్‌పై నేడు విచారణసత్తెనపల్లిలో రిగ్గింగ్‌ జరిగిందని, రీపోలింగ్‌ జరపాలని అంబటి డిమాండ్‌ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేసిన అంబటి‌ప్రతివాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదుగురిని చేర్చిన అంబటి 7:20 AM, May 23rd, 2024‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్‌పాల్వాయి గేటులో ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్‌ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను చితకబాది బూత్‌ల నుంచి ఈడ్చివేతబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలపై పోలింగ్‌ బూత్‌లలో దౌర్జన్యం పార్టీ నేతల సమాచారంతో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రిగ్గింగ్‌ను ప్రతిఘటించి స్పందించాలని పలు దఫాలు ఎన్నికల అధికారులకు ఫోన్లు వెబ్‌ కాస్టింగ్‌ పరిశీలించి రిగ్గింగ్‌ అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఉదాశీనత.. పల్నాడులో ఏడు చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్క వీడియో మాత్రమే బహిర్గతం అవసరమైన మేరకు ఎడిటింగ్‌.. వారం తరువాత తాపీగా విదేశాల్లో ఉన్న లోకేశ్‌ ఎక్స్‌ ఖాతా నుంచి విడుదల భద్రంగా ఉండాల్సిన వెబ్‌ కాస్టింగ్‌ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు రిగ్గింగ్, ఏజెంట్లపై దాడులు, ఓటర్లని బెదిరించిన వారిని పట్టించుకోకుండా ప్రతిఘటించిన వారిపై కేసుల నమోదు పట్ల సర్వత్రా విస్మయం 7:00 AM, May 23rd, 2024ఓటమి బాటలో బాబుకుప్పంలో తప్పిన లెక్కలు.. వికటించిన వ్యూహాలుఇన్నాళ్లూ చంద్రబాబును గెలిపించింది 51 వేల దొంగ ఓట్లే రెండు విడతలుగా ఆ ఓట్ల తొలగింపు దీంతో ఓటమికి దగ్గరవుతూ వచ్చిన బాబుస్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలోనూ టీడీపీ ఘోర పరాజయం 35 ఏళ్లుగా కుప్పం ప్రజలను నమ్మించి మోసం చేసిన వైనం వైఎస్సార్‌సీపీ రాకతో ప్రతి ఇంటికీ సంక్షేమం, అభివృద్ది మారుతూ వచ్చిన ఓటర్ల తీర్పు.. గత ఎన్నికల్లో తగ్గిన మెజారిటీ ఈ దఫా ఓటమి ఖాయం అని తేలడంతో కుటుంబ సమేతంగా పరుగులు కుప్పంలో ఓటు, ఇల్లు లేని బాబు.. ఓటమి భయంతో ఇంటి నిర్మాణ పనులు ఓటుకు రూ.2 వేలు పంపిణీ చేసినా విఫల యత్నమే అంటున్న స్థానికులు 6:50 AM, May 23rd, 2024కుట్ర విఫలం వల్లే రాద్ధాంతం ఘోర ఓటమి భయంతో టీడీపీ నేతల దారుణకాండవైఎస్సార్‌సీపీకి దన్నుగా నిలిచే వర్గాల వారు ఓట్లు వేయకుండా అడ్డుకునే కుట్ర పల్నాడు, తాడిపత్రి, జమ్మలమడుగు, చంద్రగిరి సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ రోజున అల్లర్లు పోలింగ్‌ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు నెట్టి రిగ్గింగ్‌ చేసిన టీడీపీ రౌడీలు వెబ్‌ కాస్టింగ్‌లో అరాచకపర్వం స్పష్టంగా కన్పిస్తున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులు టీడీపీ మూక రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపోలింగ్‌ రోజున తమ కుట్ర విఫలమవడంతో టీడీపీ అండ్‌ గ్యాంగ్‌ యాగీ 6:40 AM, May 23rd, 2024టీడీపీ రిగ్గింగ్‌.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్‌రెడ్డిమాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారుపిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తాంపిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోందిమొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి.ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్‌ చేశారు?రిగ్గింగ్‌ జరిగిందని చెప్తుంటే... ఎందుకు వీడియో రిలీజ్‌ చేయడం లేదు?మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలిమాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?బీసీలు, ఎస్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారుఅందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాంరిగ్గింగ్‌ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలిఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలిమమ్మల్ని హౌస్‌ అరెస్ట్‌ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారుదాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలిఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోందిమాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారుమిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదుఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం 6:30 AM, May 23rd, 2024మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు చేసింది టీడీపీ నేతలేమాచర్లలో టీడీపీ నేతల రిగ్గింగ్‌ఒక్కొక్కటిగా బయటపడుతున్న వీడియోలువైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్న టీడీపీ మూకలురెంటచింతల మండలం పాల్వాయి గేటులోని 201, 202 పోలింగ్‌ బూత్‌లో టీడీపీ రిగ్గింగ్‌టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులుఓటర్లను ఓటు వేయనివ్వని టీడీపీ నేతలుఓటర్లు బూత్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలుటీడీపీ నేతల రిగ్గింగ్‌పై పోలీసులు, ఎన్నికల అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదులుఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

Pushpa 2 Second Single Sooseki Announcement Video Out
Pushpa 2 Sooseki Song: ‘శ్రీవల్లి’ సాంగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది.. రష్మిక ఎక్స్‌ప్రెషన్స్‌ అదుర్స్‌

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న పుష్ప 2 మూవీ నుంచి రెండో సాంగ్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియో వచ్చసింది. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’అంటూ సాగే ఈ కపుల్‌ సాంగ్‌ని ఈ నెల 29న విడుదల చేయనున్నారు. సాంగ్‌ రిలీజ్‌ డేట్‌ని పరిచయం చేస్తూ రష్మికతో ఓ స్పెషల్‌ వీడియోని షూట్‌ చేశారు మేకర్స్‌. అందులో ‘శ్రీవల్లి వదినా..పుష్ప 2 నుంచి సెకండ్‌ సింగిల్‌ రిలీజ్‌ చేస్తున్నారట కదా.. ఆ పాట ఏంటో చెబుతావా’ అని చిత్తూరు యాసలో ఓ వ్యక్తి అడగ్గా.. మేకప్‌ వేసుకుంటున్న రష్మిక వచ్చి ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అంటూ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తుంది. ఈ రొమాంటిక్‌ సాంగ్‌ని మే 29న ఉదయం 11.07 నిమిషాలకి రిలీజ్ చేయబోతున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఆగస్ట్‌ 15న ఈ చిత్రం విడుదల కానుంది.

Harish Rao Political Counter Attack To Congress
కాంగ్రెస్‌ హత్యారాజకీయాలకు భయపడేది లేదు: హరీష్‌ రావు ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాస్వామ్యంలో హత్యారాజకీయాలకు తావులేదు. ప్రశ్నించే గొంతుకలను బెదిరింపులతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదంటూ మాజీ మంత్రి హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ బెదిరింపులకు భయపడేది లేదు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.కాగా, కొల్లాపూర్‌లో బీఆర్‌ఎస్‌ నేత శ్రీధర్‌ రెడ్డిని కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీధర్‌ రెడ్డి హత్యపై హరీష్‌ రావు స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్‌ వేదికగా హరీష్‌ రావు..‘కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లిలో బీఆర్‌ఎస్‌ మండల నాయకులు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురికావడం దారుణం. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లిలో బి.ఆర్.ఎస్ మండల నాయకులు శ్రీధర్ రెడ్డి గారు దారుణ హత్యకు గురికావడం దారుణం. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5నెలల్లో ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలోనే ఇద్దరు బి.ఆర్.ఎస్ నాయకులు హత్యకు గురికావడం,… https://t.co/zyNPsWtIvr— Harish Rao Thanneeru (@BRSHarish) May 23, 2024 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లో ఒక్క వనపర్తి జిల్లాలోనే ఇద్దరు బీఆర్‌ఎస్‌ నాయకులు హత్యకు గురికావడం, పలుచోట్ల నేతలు, కార్యకర్తలపై దాడులు జరగటం దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో హత్యారాజకీయాలకు తావులేదు. ప్రశ్నించే గొంతుకలను బెదిరింపులతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దు. పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుంది. రాజకీయ ప్రేరేపిత హత్యపై తక్షణమే విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ కామెంట్స్‌ చేశారు.

Bengaluru Police Investigate Another Angle In Rave Party Case
బెంగళూరు: రేవ్‌పార్టీ ముసుగులో వ్యభిచార దందా?

బెంగళూరు, సాక్షి: తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ పార్టీ మాటున సెక్స్‌ రాకెట్‌ కూడా నిర్వహించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డ్రగ్స్ దొరకడం, పైగా డబ్బును విపరీతంగా ఖర్చు చేసి ఈ రేవ్‌ పార్టీ నిర్వహించడంతో ఈ కోణంలోనూ దర్యాప్తు చేయాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు. బెంగళూర్‌ ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్‌ పార్టీ జరిగింది. సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ పేరుతో బర్త్‌డే పార్టీ ముసుగులో ఈ పార్టీ నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు రూ.2 లక్షల ఎంట్రీ ఫీజు తీసుకుని 200 మందిని ఆహ్వానించారు. ఈ పార్టీలోతెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు(తెలుగు సినీ, సీరియల్‌ ప్రముఖులు సైతం) పాల్గొన్నారు. ఆదివారం ఉదయమే కొందరు రిసార్ట్‌ నుంచి వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లు అర్ధరాత్రి జరిగిన పార్టీలో పాల్గొన్నారు. మరోవైపు దొరికిన వంద మందిలో 30 మంది యువతులే ఉన్నారు. నిర్వాహకులే వాళ్ల కోసం టికెట్లు వేసి విమానాల్లో రప్పించినట్లు తెలుస్తోంది. దీంతో రేవ్‌ పార్టీలో వ్యభిచార దందా నిర్వహించి ఉంటారని, నిర్వాహకులు కూడా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నిర్వహకుల నేర చరిత్ర పై కూపి లాగుతున్నారు.ఇదీ చదవండి: బెంగళూరు రేవ్‌ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు!మరోవైపు.. ఈ కేసులో ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేసి ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఎండీఎంఏ, కొకైన్, హైడ్రో గంజా, ఇతర మాదకద్రవ్యాలను వినియోగించారు. దీంతో ఈ కేసును ఎలక్ట్రానిక్స్ పోలీస్ స్టేషన్ నుండి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ విభాగానికి బదిలీ చేశారు. శాంపిల్స్‌ ఫలితాలు ఇవాళేడ్రగ్స్‌ తీసుకున్నారనే అనుమానాల మధ్య పార్టీకి హాజరైన వాళ్ల నుంచి శాంపిల్స్‌ను సేకరించారు పోలీసులు. వీటి ఫలితాలు ఇవాళ సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ పార్టీలో తాను లేనని తెలుగు సినీ నటి హేమ చెబుతున్నప్పటికీ.. పోలీసులు మాత్రం ఆమె వాదనను ఖండిస్తున్నారు. ఆమె కూడా పార్టీలో పాల్గొన్నారంటూ ఓ ఫొటోను విడుదల చేశారు. అంతేకాదు ఆమె కూడా శాంపిల్స్‌ ఇచ్చారని ప్రకటించారు.

Nikesh Arora of Palo Alto is second highest paid CEO
ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అత్యధిక వేతనాలు పొందుతున్న సీఈవోల్లో భారత సంతతికి చెందినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓ, భారత సంతతికి చెందిన నికేశ్‌ అరోరా 2023లో అమెరికాలో అత్యధిక వేతనం పొందిన సీఈవోగా రెండో స్థానంలో నిలిచారు.బ్రాడ్‌కామ్‌ సీఈవో హాక్ టాన్ 162 మిలియన్‌ డాలర్ల వేతనంతో అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో ఉన్న నికేశ్‌ అరోరా వేతనం 151.43 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1,260 కోట్లు). వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన విశ్లేషణ ప్రకారం.. అత్యధిక వేతనం పొందిన టాప్ 500 సీఈవోలలో 17 మంది భారతీయ సంతతి వ్యక్తులు ఉన్నారు.అడోబ్‌కు చెందిన శంతను నారాయణ్ అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ సంతతికి చెందిన సీఈవోగా రెండవ స్థానంలో ఉన్నారు. మొత్తం మీద 11వ ర్యాంక్‌ను పొందారు. నారాయణ్ వేతనం 44.93 మిలియన్‌ డాలర్లు. ఇక మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 24.40 మిలియన్‌ డాలర్ల వేతనం పొందగా ఆల్ఫాబెట్ సీఈవో భారత్‌లో జన్మించిన సుందర్ పిచాయ్ 8.80 మిలియన్‌ డాలర్లు వార్షిక వేతనం అందుకున్నారు.ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న నికేశ్‌ అరోరా మొట్టమొదటిసారిగా గూగుల్‌లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. 2014లో సాఫ్ట్‌బ్యాంక్‌కు నాయకత్వం వహించారు. సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ అయిన పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌కు 2018 నుంచి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన వేతనం ముఖ్యంగా షేర్లు, ఈక్విటీ అవార్డులతో కూడి ఉంటుంది.

Karnataka: Family Of 4 Died Due To Suspected LPG Cylinder Leak In Mysore
అయ్యో పాపం.. గాఢ నిద్ర నుంచి శాశ్వత నిద్రలోకి కుటుంబం

మైసూరు: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వంట గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీ కావడంతో ఊపిరాడక మరణించిన ఘటన మైసూరు యరగనహళ్లిలో జరిగింది. చిక్కమగళూరు జిల్లా కడూరు సఖరాయపట్టణ నివాసులు కుమారస్వామి (45), భార్య మంజుల (39), వీరి పిల్లలు అర్చన (19), స్వాతి (17)లు మృతులు. ఈ కుటుంబం చిక్కమగళూరు జిల్లా సఖరాయపట్టణ గ్రామానికి చెందిన వారు. మైసూరు యరగనహళ్లిలో మూడేళ్ల నుంచి సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. రజక వృత్తితో జీవనం సాగిస్తున్నారు.చిన్న ఇంట్లో, కిటికీలు మూసేసివారిది 10 ఇన్‌ టు 20 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న చిన్న ఇల్లు. ఇంటి వెనుక, ముందు ఒక్కో కిటికీ ఉన్నాయి. దుస్తులను ఇసీ్త్ర చేసేందుకు గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. సొంతూర్లో పెళ్లికి వెళ్లి వచ్చి సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన వారు కిటీకీలు మూసేసి నిద్రించారు. ప్రయాణం చేసిన అలసటతో గాఢ నిద్రలో ఉన్నారు. ఈ సమయంలో ఒక సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీకేజీ అయింది. అది బయటకు వెళ్లే మార్గం లేక ఇల్లంతా దట్టంగా వ్యాపించడం, ఆ గ్యాస్‌ను పీల్చి స్పృహ తప్పినవారు కొన్ని గంటల తరువాత ప్రాణాలు వదిలారు. అందరి చెవులు, ముక్కులో నుంచి రక్తం వచ్చింది. ఇల్లు మొత్తం గ్యాస్‌ వాసన వస్తోంది.ఒక రోజంతా అలాగేసోమవారం రాత్రి ఇంట్లో పడుకున్న వారు మంగళవారం ఉదయానికి చనిపోయినట్లు భావిస్తున్నారు. ఆ ఇంట్లో ఏం జరిగిందో ఎవరూ చూసుకోలేదు. బుధవారం ఉదయం కుమారస్వామికి బంధువులు ఫోన్‌కాల్‌ చేసినప్పటికీ స్పందన లేదు. దీంతో వారు ఇంటి ఇరుగుపొరుగు వారికి బంధువులు తెలియజేయగా వారు ఫైర్‌, పోలీసులకు సమాచారమిచ్చారు.పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఈ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉండగా, అందులో రెండు ఖాళీగా ఉన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టమ్‌ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 3 గ్యాస్‌ సిలిండర్లను విచారణ కోసం సీజ్‌ చేశారు. ఫోరెన్సిక్‌ నిపుణులు ఆధారాలను సేకరించారు. నగర పోలీసు కమిషనర్‌ రమేశ్‌ బానోత్‌ ఆ ఇంటిని పరిశీలించారు. విషయం తెలిసి చుట్టుపక్కల నుంచి తండోపతండాలుగా జనం అక్కడికి చేరుకున్నారు. అనుకోకుండా గ్యాస్‌ లీక్‌ అయ్యిందా, లేక కావాలనే చేశారా? అనేది అనుమానాస్పదంగా ఉంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement