Top Stories
ప్రధాన వార్తలు
పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన
సాక్షి, విజయవాడ: పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన చేశారు. ఆ వీడియోను మేము విడుదల చేయలేదని.. ఎన్నికల కమిషన్ నుండి బయటకు వెళ్లలేదు.. అది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటామని సీఈవో ముకేష్ కుమార్ మీనా అన్నారు.‘‘దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుండో బయటకు వెళ్లింది పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీవో, ఏపీవోలను సస్పెండ్ చేశాం. మాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదు. ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. టీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాం. బయట నాయకులు ఎవ్వరూ మాచర్లకు వెళ్లకూడదు ఎవ్వరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనీయొద్దని ఆదేశించాను’’ అని సీఈవో ముకేష్ కుమార్ మీనా చెప్పారు.
కిర్గిస్తాన్‌కు మన వాళ్లు ఎందుకు వెళ్తారంటే?
గత కొన్ని రోజులుగా భారతీయ విద్యార్థులు కిర్గిస్తాన్ దేశంలో జరుగుతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా వరకు ప్రశాంతంగా ఉంది. అయినా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు చేస్తున్నాయి కాలేజీలు. హాస్టళ్ల నుంచి బయటకు రావొద్దని తొలుత ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసినా.. తర్వాత పరిస్థితిలో మార్పువచ్చింది. అసలు భారతీయ విద్యార్థులు ఈ దేశానికీ ఎందుకు వెళ్తున్నారు? అక్కడి కరెన్సీ విలువ ఇండియా కరెన్సీతో పోలిస్తే ఎలా ఉంటుంది? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.కిర్గిస్తాన్‌లో జరిగింది చిన్న గొడవేకిర్గిస్తాన్లోని ఓ యూనివర్సిటీలో ముగ్గురు స్థానిక విద్యార్థులు ఈజిప్ట్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉండే హాస్టల్‌కు వెళ్లారు. అక్కడ చిన్న గొడవ జరగగా.. స్థానిక విద్యార్థులను ఈజిప్టు విద్యార్థులు కొట్టినట్టు తెలిసింది. దీంతో స్థానికంగా కొన్ని ఆందోళనలు జరిగాయి. అయితే కిర్గిస్తాన్ ప్రభుత్వ పెద్దలు అందరూ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. తమ దేశం శాంతి, సౌభాగ్యాలకు చిహ్నమని, విదేశీ విద్యార్థుల వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం ఉందని ప్రకటనలు చేశారు. కిర్గిస్తాన్‌కు మనవాళ్లు ఎందుకు వెళ్తున్నారు?కిర్గిస్తాన్.. మధ్య ఆసియా ప్రాంతం. భౌగోళికంగా జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి కిర్గిస్తాన్‌కు వెయ్యి కిలోమీటర్ల కంటే తక్కువ దూరం. చాలా కాలం పాటు సోవియట్ పాలనలో ఉండడం వలన కిర్గిస్తాన్‌లో యూరోపియన్ కల్చర్ కనిపిస్తుంది. అందమైన కొండలు, గల గల పారే నదులు, పచ్చిక బయళ్లు, వాటి మధ్య రాజప్రాసాదాలు... ఇలా అందమైన ఈ ప్రాంతం విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తోంది. విద్యార్థులు వారి సొంత దేశాలను వదిలి కిర్గిజిస్తాన్‌కు వెళ్లి చదువుకోవడానికి ప్రధాన కారణం.. అక్కడి చదువుకోవడానికి అయ్యే ఖర్చులు తక్కువగా ఉండటమే. మన దేశంలో మెడిసిన్ చేయాలంటే సంవత్సరానికి కనీసం రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కిర్గిజిస్తాన్‌లో అయితే ఏడాదికి సుమారు రూ. 15 నుంచి 20 లక్షలు (హాస్టల్.. ఫుడ్‌తో సహా) ఖర్చు పెడితే సరిపోతుందని చెబుతున్నారు.కిర్గిస్తాన్ కరెన్సీ విలువఇక కరెన్సీ విషయానికి వస్తే.. కిర్గిజిస్తాన్ కరెన్సీ విలువ, ఇండియన్ రూపాయి కంటే తక్కువ (1 INR = 0.95 KGS). దీన్ని బట్టి చూస్తే మనదేశం కంటే అక్కడ ఖర్చులు కొంత తక్కువని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆ దేశానికీ.. పలు దేశాల నుంచి విద్యార్థులు వెళ్లి చదువుకుంటున్నారు.కిర్గిస్తాన్‌కు ఆదాయం ఎలా?కిర్గిస్తాన్‌లో పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తక్కువ. అయితే ఇక్కడ విలువైన గనులు, ప్రకృతి వనరులు ఉన్నాయి. ఈ దేశానికి అత్యంత ఎక్కువ ఆదాయం వచ్చేది బంగారం నిల్వల నుంచే. బంగారంతో పాటు వెండి, యురేనియం, బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నాయి. అయితే వీటితో పాటు పర్యాటకం, విదేశీయుల విద్య ఇప్పుడు కిర్గిస్తాన్‌కు అత్యంత కీలకంగా మారాయి. ఇండియన్ మెడిసిన్ కేరాఫ్ కిర్గిస్తాన్కిర్గిస్తాన్లో పాతికేళ్ల క్రితమే భారతీయులు మెడిసిన్ విద్యకు బాట వేసుకున్నారు. ఇండియా నుంచే ఫ్యాకల్టీని తెస్తున్నారు. ఇక్కడి యూనివర్సిటీలు, కాలేజీల్లో చాలా వరకు ఇండియన్ డాక్టర్ల టీచింగ్ క్లాసులు ఉంటాయి. దీని వల్ల మన వాళ్లు భారీగా కిర్గిస్తాన్‌కు క్యూ కడుతున్నారు.ప్రస్తుతం కిర్గిస్తాన్‌లో 25వేల మంది భారతీయ విద్యార్థులు ఉండొచ్చని చెబుతున్నారు. వీరితో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్టు లాంటి దేశాల నుంచి కూడా భారీగా విద్యార్థులు వచ్చి కిర్గిస్తాన్‌లో చదువుతున్నారు. ఇక్కడ మెడిసిన్ చదివి, ఇండియాలో FMGE అంటే Foreign Medical Graduate Examination పరీక్ష రాయాలి. దీంట్లో అర్హత సాధిస్తే.. వైద్యుడిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇండియాలో మంచి ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ చదవాలంటే కోటి ఖర్చు. అదే కిర్గిస్తాన్‌లో అయితే పాతిక లక్షల్లో మెడిసిన్ పూర్తి చేసుకోవచ్చు. పైగా FMGE పరీక్షకు కూడా కిర్గిస్తాన్‌లోనే కోచింగ్ ఇస్తున్నారు. పెరిగిన విద్యార్థుల వల్ల ఇండియన్ హాస్టళ్లు, సెక్యూరిటీ, ట్రాన్స్పోర్ట్ ఇతర సౌకర్యాలు చాలా వరకు మెరుగుపరిచారు. అందుకే కిర్గిస్తాన్ వైపు ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు.
ఆ ఒక్క వీడియోనే లీకైందా?.. ఈసీకి సూటి ప్రశ్నలు సంధించిన సజ్జల
గుంటూరు, సాక్షి: మాచర్ల పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం ఉదంతంపై తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ వీడియో లీకేజీ వ్యవహారంలో ఎన్నికల సంఘం తీరుపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై స్పందిస్తూ ఎన్నికల సంఘానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ‘‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా?. వీడియో సరైందేనా? కాదా? అనేది నిర్దారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది?. ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుంది?.. A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 .. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ నాడు ఈవీఎంలకు సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.! అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తుంది?. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయటపెట్టదు?. 3. More importantly, in the videos attached below, there is clear evidence of TDP goons attacking innocent voters. Why has no action been initiated in these instances? pic.twitter.com/iYVvwO5nXj— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుంది కానీ.. ఒక చిన్న క్లిప్పింగ్‌ను మాత్రమే బయటకు ఎలా వస్తుంది?తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే.. అమాయక ఓటర్లపై టీడీపీ గుండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు? దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు? అని సజ్జల ప్రశ్నించారు. వీటికి సమాధానాలేవీ?13న జరిగితే 21వ తేదీన వీడియో బయటకు ఎందుకు వచ్చింది?గుర్తు తెలియని వ్యక్తులని ఎలా ఫిర్యాదు చేయగలిగారు?స్వయంగా ఎమ్మెల్యే ఉంటే ఇంత గోప్యత ఎందుకు? ఇన్నాళ్లూ టీడీపీ వాళ్లు గుర్తించలేదా?పిన్నెల్లి అనుచరులు తమను బెదిరించారనే టీడీపీ వాదన నమ్మేలా ఉందా?ఈ నెల 20న ఫిర్యాదు నమోదు అయ్యిందని ఈసీ వివరణ, అంటే.. ఇంతకాలం సీఈవో ఆఫీస్ ఆ ఫుటేజీని చూడలేదా?అసలు ఇంతకాలం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేశారు?మిగతా వీడియోల సంగతి ఏంటి? అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారనేది ఈసీ ఎందుకు దాస్తోంది?
IND vs PAK: ఒక్క టికెట్ రూ. 16 లక్షలా?.. ఐసీసీపై లలిత్ మోదీ ఫైర్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి సమయం సమీపిస్తోంది. జూన్ 1 ఈ ఐసీసీ ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక ఈ మెగా టోర్నమెంట్‌కు అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.వెస్టిండీస్‌తో కలిసి వరల్డ్‌కప్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న యూఎస్ఏ.. ఇప్పటికే మ్యాచ్‌లు జరిగే స్టేడియాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలో మునిగిపోయింది.చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆరోజేఇదిలా ఉంటే.. టీమిండియా ఈ ఈవెంట్లో తమ లీగ్ మ్యాచ్‌లన్నీ యూఎస్ఏలోనే ఆడనుంది. జూన్ 5 న ఐర్లాండ్‌తో మ్యాచ్ ద్వారా తాజా ఎడిషన్‌లో తమ ప్రయాణం మొదలుపెట్టనున్న రోహిత్ సేన.. జూన్ 9న తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.ఇక దాయాదుల పోరు అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఎప్పుడో రద్దు కాగా.. కేవలం ఆసియా కప్, ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లలో మాత్రమే టీమిండియా- పాక్‌లు ముఖాముఖి తలపడుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ హైవోల్టేజీ మ్యాచ్‌లకు మరింత ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో ఐసీసీ ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో మరీ దారుణంగా ప్రవర్తిస్తోందంటూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్త, మాజీ కమిషనర్ లలిత్ మోదీ మండిపడ్డాడు.లాభాలు దండుకోడానికి కాదుఇండియా- పాక్ మ్యాచ్‌కు వేదికైన న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ స్టేడియంలో టికెట్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు.. ‘‘వరల్డ్‌కప్‌లో ఇండియా- పాక్ మ్యాచ్ నేపథ్యంలో డైమండ్ క్లబ్ సీటు టిక్కెట్లను ఏకంగా 20000 డాలర్లకు అమ్ముతున్నారని తెలిసి షాకయ్యాను.అమెరికాలో వరల్డ్‌కప్ నిర్వహిస్తోంది క్రికెట్‌కు ఇక్కడ ఆదరణ పెంచడానికి, ఫ్యాన్ ఎంగేజ్మెంట్ కోసం మాత్రమే అనుకున్నాం. కానీ మీరు లాభాలు దండుకోడానికి కాదు’’ అంటూ ఐసీసీ తీరును లలిత్ మోదీ ఎక్స్ వేదికగా విమర్శించాడు. దాదాపు రూ. 16 లక్షలకు పైనే!కాగా 20 వేల అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ. 16 లక్షలకు పైనే! ఇక లలిత్ మోదీ ట్వీట్ చూసిన ఫ్యాన్స్ టికెట్ ధర తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, ఈ ధరలకు సంబంధించి ఇంత వరకు అధికారిక సమాచారం మాత్రం లేదు.కాగా క్యాష్ రిచ్ లీగ్‌ను సృష్టించిన లలిత్ మోదీ ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశం నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు లండన్‌లో తలదాచుకుంటున్నట్లు సమాచారం.Shocked to learn that @ICC is selling tickets for Diamond Club at $20000 per seat for the #indvspak WC game. The WC in the US is for game expansion & fan engagement, not a means to make profits on gate collections. $2750 for a ticket It’s just #notcricket #intlcouncilofcrooks pic.twitter.com/lSuDrxHGaO— Lalit Kumar Modi (@LalitKModi) May 22, 2024
మళ్లీ అధికారం వైఎస్సార్సీపీదే.. అంచనాలు ఇవే
రెండు రోజుల క్రితం జంగారెడ్డి గూడెం నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశారు. ఆయన ఆసక్తికరమైన విషయం చెప్పారు. అక్కడ ఒక గ్రామానికి చెందిన నలుగురైదుగురు యువకులు ఐఏఎస్ పరీక్షల కోసం సిద్ధం అవుతున్నారట. ఏపీలో శాసనసభ ఎన్నికలపై ఆసక్తితో వారు తమంతట తాము సర్వే చేపట్టారట. వారికి ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయట. వారి పరిశీలన ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఏభైఎనిమిది శాతం ఓటర్లు మద్దతు ఇస్తున్నారని తేలిందట. వారు ఆయా ప్రాంతాలలో ఈ స్టడీ చేశారట. వారు ప్రత్యేకంగా ఏ పార్టీపై అభిమానం ఉన్నవారు కాదు. ఇండిపెండెంట్ గా పరిశీలన చేశారు.⇒ ఇది విన్న నాకు కొద్ది రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రభంజనం వస్తుందని 151 సీట్లు మించి వస్తాయని అన్న విషయం గుర్తుకు వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వివిధ వర్గాలలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీలతో కూటమి కట్టిన తర్వాత వారి పరిస్థితి మెరుగైందని టీడీపీ అభిమానుల భావన కావచ్చు. కానీ ప్రజలు కూటమిని స్వీకరించారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అని చెప్పడం లేదు కానీ, దాదాపు అదే తరహాలో జరిగిన స్టడీలలో అత్యధిక భాగం వైఎస్సార్సీపీ విజయాన్ని అంచనా వేస్తున్నాయి. అందులో అంకెలు కొంచెం అటు, ఇటుగా ఉండవచ్చు కానీ, గెలుపుపై తేడా ఉండడం లేదు.⇒ ఈ నేపథ్యంలో కొన్ని ఫేక్ పోల్స్ సర్వేలు కూడా బయటకు వస్తున్నాయి. అలా చేసిన వాటిలో అత్యధికం తెలుగుదేశం పార్టీవే ఉండడం గమనించదగ్గ అంశం. ఉదాహరణకు హిందుస్తాన్ టైమ్స్ లో ఏదో సర్వే వచ్చిందని, అందులో టీడీపీ కూటమికి అనుకూల ఫలితాలు ఉన్నాయని ప్రచారం చేశారు. ఆ సంగతి తెలిసిన ఆ మీడియా తాము అలాంటి సర్వే ఏదీ ప్రచురించలేదని ఖండన ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు ఒక తెలుగు వార్తా చానల్ ఇచ్చిందంటూ ఇలాగే టీడీపీ గెలవబోతోందంటూ ప్రచారం చేస్తే, అది కూడా వాస్తవం కాదని వెల్లడైంది.వైఎస్సార్సీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేలలో అత్యధిక భాగం కాస్త, కూస్తో అందరికి తెలిసిన సంస్థలవే కావడం విశేషం.⇒ ఇండియా టుడే సీనియర్ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ ఆ మధ్య ఏపీలో పర్యటించారు. నాయకుల ఇంటర్వ్యూలతో పాటు జనంలో కూడా తిరిగారు. చివరిగా విశాఖ తీరంలో కూర్చుని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. మహిళలు, పేదలు ఎటు ఎక్కువ ఓట్లు వేస్తే వారిదే గెలుపు అని వ్యాఖ్యానించడం ద్వారా ఒక స్పష్టమైన పరోక్ష సంకేతం ఇచ్చారు. మహిళలు అత్యధికంగా ఓట్లు వేయడం, వారిలో పలువురు వైఎస్సార్సీపీ పట్ల సానుకూల ధోరణితో ఉండడం వంటి అంశాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ విజయాన్ని సూచిస్తున్నాయన్న భావన ఏర్పడింది.⇒ అలాగే మరో సీనియర్ పాత్రికేయుడు ఇండియా టుడే లో ఒక వ్యాసం రాస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు బాగా ప్రభావితం చేస్తున్నాయని, అవే ఎన్నికల ఫలితాలను నిర్దేశించనున్నాయని అభిప్రాయపడ్డారు. పివిఎన్ శర్మ అనే సీనియర్ జర్నలిస్టు డిల్లీ నుంచి ఒక పోస్టు పెడుతూ వలంటీర్ల వ్యవస్థ వైఎస్సార్సీపీకి బాగా ఉపకరించిందని పేర్కొన్నారు. టీడీపీ సృష్టించిన వివాదంతో రాజీనామా చేసిన వేలాది మంది వలంటీర్లు తమ పరిధులలోని వివిధ వర్గాల ప్రజలను ఉదయం, సాయంత్రం ఓటింగ్ నిమిత్తం సమీకరించారని తెలిపారు. సాయంత్రం వేళ పోలింగ్ పెరగడానికి వారే కారణమని ఆయనతో పాటు మరికొందరు విశ్లేషించారు.⇒ వివిధ ప్రాంతాల నుంచి కార్లలో వచ్చిన టీడీపీ మద్దతుదారుల హడావుడిని గమనించిన మీదట అప్పటి వరకు ఓటు వేయకుండా వేచి ఉన్న మహిళలు, పేదవర్గాల వారు సాయంత్రం పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓట్లు వేశారని, దానివల్లే ఓట్ల పోలింగ్ శాతం పెరిగిందని చెబుతున్నారు. ఒక సీనియర్ అధికారి అంచనా ప్రకారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దు పోయేవరకు జరిగిన పోలింగ్ శాతం పన్నెండు శాతం వరకు ఉండవచ్చట. ఇది కూడా నిర్ణయాత్మకంగా ఉండవచ్చని భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీ కూటమి పోటాపోటీగా ఓటింగ్ శాతం పెంచడానికి యత్నించాయి. కాగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారికన్నా పేద, బలహీనవర్గాలు అధికంగా ఉండడం వైఎస్సార్సీపీకి ప్లస్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.⇒ కాగా కొన్నిచోట్ల పోలింగ్ అధికారులలో కొంతమంది వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఉన్నారని, వారు కావాలని పోలింగ్‌ను ఆలస్యం చేస్తున్నారని గమనించిన ఓటర్లు ఎంతో ఓపికతో రాత్రి పొద్దు పోయేవరకు నిలబడి మరీ ఓట్లు వేసి వెళ్లారని కొందరు చెప్పారు. ఉదాహరణకు తెనాలి నియోజకవర్గంలో గుదిబండివారి పాలెంలో అర్ధరాత్రి అయినా ఒక్కరు కూడ కదలకుండా ఓట్లు వేసి మరీ వెళ్లారని ఆ గ్రామానికి చెందిన వ్యక్తి తెలిపారు. ఇక బెట్టింగ్‌ల వారిది మరో కథ. వారు కావాలని పందాలకు పలువురిని ఆకర్షించడానికి రకరకాల వ్యూహాలు అమలు చేశారని సమాచారం వస్తోంది. ఉదాహరణకు కొద్ది నెలల క్రితం ఈ బెట్టింగ్ నిర్వాహకులు వైఎస్సార్సీపీకి ఏభైమూడు సీట్లు వస్తాయని అంచనా వేస్తే, అది నిజమేనని నమ్మి టీడీపీకి చెందినవారు పందాలు కాయడానికి ఉత్సాహపడ్డారట. ⇒ ఆ తర్వాత క్రమేపి ఆ సంఖ్యను మార్చుతూ వైఎస్సార్సీపీకి 86-88 సీట్లు వస్తాయని వారు పేర్కొన్నారట. అంటే ఏమిటి దీని అర్ధం. వైఎస్సార్సీపీకి అధికారం వస్తుందని చెప్పడమే కదా! కడప జిల్లాలోని ఒక నియోజకవర్గంకు చెందిన మిత్రుడు ఒకరు కొద్ది రోజుల క్రితం కలిశారు. ఆయన ఇంకో విషయం చెప్పారు. ఆ నియోజకవర్గంలో పోటీ చాలా తీవ్రంగా ఉందని ప్రచారం జరిగింది. అక్కడ పరిస్థితి ఏమిటని అడిగితే అతను జవాబిస్తూ చాలా చోట్ల ఇలాగే ప్రచారం జరుగుతోందని, ఇదంతా బెట్టింగ్ రాయళ్ల పని అని అన్నారు.⇒ తమ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఇరవైవేలకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని, కానీ టైట్ అని ప్రచారం చేస్తే రెండు పార్టీలకు చెందినవారు పందాలు కాస్తారన్న ఉద్దేశంతో ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు. అది నిజమేనని అనిపించింది. ఎందుకంటే ఏపీలో పలు నియోజకవర్గాలపై ఇలాంటి పందాలు సాగుతున్నాయి. కాగా కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా? లేదా అన్నదానిపై కూడా బెట్టింగులు జరుగుతున్నాయని చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక నియోజకవర్గంలో ఓటు వేసిన ఒకరు మాట్లాడుతూ కాపు సామాజికవర్గం ఏకపక్షంగా టీడీపీ కూటమికి ఓటు వేశారన్న ప్రచారం వాస్తవం కాదని అబిప్రాయపడ్డారు.⇒ జనసేనను టీడీపీ అధినేత చంద్రబాబు కాళ్ల వద్ద పవన్ కల్యాణ్ పడేశారని బాధ పడుతున్నవారు కూడా గణనీయంగా ఉన్నారని అన్నారు. టీడీపీ నేతలు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజులు టీడీపీ గెలుపు ఖాయమని చెబుతున్నా, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి ఆ విషయాన్ని ఎందుకు ప్రకటించలేకపోయారని వైఎస్సార్‌సీపీవారు అడుగుతున్నారు. అంతేకాదు టీడీపీకి సలహాదారుగా పనిచేసిన రాబిన్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన సర్వే గురించి సోషల్ మీడియాలో వస్తున్న కధనాలను టీడీపీ ఎందుకు ఖండించలేకపోతోందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈయన బృందం టీడీపీ గెలుపుపై సందేహాలు వ్యక్తం చేసిందని ప్రచారం జరుగుతోంది. అది నిజమో, కాదో తెలియదు.⇒ ఇంతవరకు సుమారు ముప్పైకి పైగా పోస్ట్ పోల్ అంచనాలను ఇచ్చాయి. వాటిలో ఒకటి, రెండు తప్ప మిగిలినవన్నీ వైఎస్సార్సీపీనే గెలుస్తుందని చెబుతున్నాయి. అయినా పందాలు కాయవద్దని, అది చట్టరీత్యా నేరమని ఎవరైనా చెబితే తెలుగుదేశంకు చెందిన కొంతమంది బెట్టింగులు వద్దంటే టీడీపీ గెలిచే అవకాశం ఉన్నట్లే కదా అని వితండ వాదన తెస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల జనం నష్టపోతారు. గతంలో 2009లో ఒక వర్గం, 2014 లో మరో వర్గం, 2019 లో ఇంకో వర్గం బోగస్ సర్వేలను నమ్మి పందాలు కాసి కోట్ల రూపాయల మేర కోల్పోయారు. వీటిని దృష్టిలో పెట్టుకుని పందాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది.⇒ ఏది ఏమైనా ప్రజాభిప్రాయం వైఎస్సార్సీపీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు అనుకూలంగా ఉందన్నది ఎక్కువమంది నమ్మకం. బలహీనవర్గాలు, మహిళలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఓటు బ్యాంకు అయ్యారని వారు చెబుతున్నారు. ఎక్జిట్ పోల్‌ను పర్యవేక్షించిన ఒకరిని దీని గురించి ప్రశ్నిస్తే అలాంటి సమాధానమే ఇచ్చారు. కాగా తాము ఇచ్చిన సూపర్ సిక్స్ కు జనం కొంతైనా ఆకర్షితులు అయి ఉంటారని, అంతేకాక తాము లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేసిన అబద్దపు ప్రచారం కొద్దిగానైనా ప్రభావితం చేసి ఉండకపోతుందా అని టీడీపీ మద్దతుదారుడు ఒకరు పేర్కొన్నారు. ఈ మొత్తం ఎన్నిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలా? వద్దా? అనే దానిపైనే జరిగిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి vs చంద్రబాబు కాదని ఆయనే అభిప్రాయపడడం విశేషం. దీనిని బట్టి ఈ ఎన్నికలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా జరిగాయని, ఆయన స్కీములు, ఇతర కార్యక్రమాల చుట్టూనే జరిగాయని తేలుతోంది. అందుకే వైఎస్సార్సీపీ వర్గాలు గెలుపుపై అంత ధీమాతో ఉన్నాయని అనుకోవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కేటీఆర్
సాక్షి, వనపర్తి: కాంగ్రెస్ పార్టీ పేరుకే ప్రజాపాలన.. చేస్తుంది ప్రతీకార పాలన అంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. జూపల్లి కృష్ణారావు ప్రమేయంతోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. మంత్రి జూపల్లిని వెంటనే బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వరుస హత్యలపై జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ ప్రాంతాన్ని కల్లోల ప్రాంతంగా ప్రకటించాలన్నారు.వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి అంతిమయాత్రలో కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి హత్యలు ఎప్పుడు జరగలేదని తెలిపారు. తాము అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ఉండేదా అని ప్రశ్నించారు.రాజకీయ హత్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. ఈ హత్యలు జూపల్లి కృష్ణారావు సహకారం లేకుండ జరగవని అన్నారు. తెలంగాణలో ఎక్కడలేని ఫ్యాక్షని సంస్కృతి కొల్లాపూర్‌లో నెలకొందని, శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హత్యలను ఇలాగే కొనసాగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు కేటీఆర్. మా వాళ్ళని ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసని, ఎంతటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హత్యల సంస్కృతి తెలంగాణకి మంచిది కాదని, శ్రీధర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని హామీనిచ్చారు.
‘లొంగిపో.. లేదంటే’.. ప్రజ్వల్‌కు మాజీ ప్రధాని దేవేగౌడ వార్నింగ్
బెంగళూరు: లైంగిక దాడి కేసు నమోదైన తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ ప్రధాని దేవెగౌడ వార్నింగ్ ఇచ్చారు. ప్రజ్వల్ ఎక్కడ ఉన్నా వెంటనే భారత్‌కు వచ్చి పోలీసులకు లొంగి పోవాలన్నారు. లేకపోతే తన ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని దేవెగౌడ తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో ఓ లేఖ విడుదల చేశారు.‘‘ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నా వెంటనే ఇండియాకు తిరిగి రావాలి. పోలీసులకు లొంగిపోయి న్యాయ ప్రక్రియను ఎదుర్కొవాలి. ఇది విజ్ఞప్తి చేయటం కాదు. హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రజ్వల్ నా హెచ్చరికను లెక్క చేయకపోతే.. నా ఆగ్రహానికి, కుటుంబ సభ్యులు కోపానికి గురికావాల్సి వస్తుంది. ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణలను చట్టం చూసుకుంటుంది. కానీ కుటుంబం చెప్పిన మాట వినకపోతే ఒంటరిగా మిగిలిపోయేలా చేస్తుంది. నాపైన అతనికి గౌరవం ఉంటే వెంటనే భారత్‌కు తిరిగి రావాలి’’ అని దేవెగౌడ తాను విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.I have issued a warning to @iPrajwalRevanna to return immediately from wherever he is and subject himself to the legal process. He should not test my patience any further. pic.twitter.com/kCMuNJOvAo— H D Deve Gowda (@H_D_Devegowda) May 23, 2024 ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన లైంగిక దాడి కేసు, ఆయనకు సంబంధించిన అసభ్య వీడియోలై దర్యాప్తు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సీఎం సిద్ధరామయ్య ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టును రద్దు చేయాలని ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు.
పుష్ప 2 మూవీలో ఛాన్స్ వదిలేసుకున్నా: రవి కృష్ణ
మనుషుల మధ్య ప్రేమ ఎప్పుడూ ఉండేదే! అదే దెయ్యాన్ని ప్రేమిస్తే.. దెయ్యాన్ని చూస్తే భయపడతారు కానీ ఎవరైనా ప్రేమిస్తారా? అంటారేమో! ఈ సినిమాలో అంతే.. హీరో ఆశిష్ ఘోస్ట్‌తో లవ్‌లో పడతాడు. వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన ఈ మూవీ లవ్ మీ. ఇఫ్ యూ డేర్ అనేది క్యాప్షన్. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ ఈవెంట్లో నటుడు రవికృష్ణ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.'లవ్ మీ సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు నాకు పుష్ప 2లో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ డేట్స్ క్లాష్ అవడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాను. అంత పెద్ద సినిమా మిస్ చేసుకున్నప్పటికీ ఈ మూవీ నాకొక మైల్ స్టోన్‌గా ఉండిపోతుందన్న నమ్మకముంది. నన్ను నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్' అని పేర్కొన్నాడు. లవ్ మీ సినిమా మే 25న విడుదల కానుంది. చదవండి: పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
May 23rd: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 23rd AP Elections 2024 News Political Updates..7:30 PM, May 23rd, 2024పల్నాడు జిల్లాలో భారీగా అరెస్ట్లుపోలింగ్ రోజు, తర్వాత జరిగిన విధ్వంసం.. పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తల అరెస్ట్పిడుగురాళ్లకు చెందిన 47 మంది టీడీపీ నేతల అరెస్ట్తంగెడకు చెందిన 11 మంది టీడీపీ కార్యకర్తల అరెస్ట్వీరితో పాటు మరో 22 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు5:56 PM, May 23rd, 2024రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు: ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిసీఈవో ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ ఫిర్యాదుఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై టీడీపీ దాడులు చేసిందిపోలింగ్ రోజు నుంచి టీడీపీ అరాచకాలపై మేము ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాంమేము 60కి పైగా పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరపాలని కోరాంవెబ్ కెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపి రీపోలింగ్ జరపాలని కోరాంఈసీ స్పందించకపోతే రిగ్గింగ్‌పై హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు పోరాటం చేస్తాంఓటు వేసిన వారిని టీడీపీ వాళ్లు కొట్టి, చంపాలని చుస్తే పోలీసులు స్పందించలేదుఎన్నికలకు వారం రోజుల ముందు పోలీసులను మార్చారుదాని వల్లనే హింస చెలరేగిందిఈ హింసకి బీజేపీ, టీడీపీ, ఈసీ ఎవరు బాధ్యత వహిస్తారు?ఎన్ని చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసినా ప్రజలు మాత్రం జగన్‌ని గెలిపించాలని నిర్ణయించారుమాచర్లలో తుమ్రకోట, వెల్దుర్తి వంటి చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసిందిటీడీపీ రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదుఅయినా భద్రత చర్యలు తీసుకోలేదు: ఎమ్మెల్యే మల్లాది విష్ణుసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు ముందే ఈసీ దృష్టికి తీసుకుని వెళ్లాంముందస్తు భద్రత కల్పించమని అడిగాంఅయినా భద్రత చర్యలు తీసుకోలేదుపురందేశ్వరి అధికారులను మార్చమని ఒత్తిడి తెచ్చారుఆమె చేసిన ఒత్తిడి నిర్ణయంతో హింస జరిగింది4:54 PM, May 23rd, 2024పల్నాడులో హింసాత్మక ఘటనలపై సిట్ విచారణరెంటచింతల పీఎస్‌లో కొనసాగుతున్న సిట్ విచారణబెట్టిపాలెం, తమృకోట గ్రామస్తులను విచారిస్తున్న సిట్హింసకు పాల్పడిన కొంతమందిని గుర్తించిన సిట్4:19 PM, May 23rd, 2024ఈసీలో ఇంటిదొంగలెవరు?లోకేష్‌కు చేర్చింది ఈసీలోని ఇంటి దొంగలేనా?ఏపీ ఎలక్షన్ కమిషన్ తీరుపై అనుమానాలుఈసీ అనుమతి లేకుండా బయటకు వెళ్లిన వీడియో ఫుటేజ్రిటర్నింగ్ అధికారి పరిధిలో ఉండాల్సిన వీడియోను అమ్మేశారా?నారా, దగ్గుబాటి కుటుంబాలకు ఈసీ దాసోహమైందా?పచ్చ బ్యాచ్ కంప్లయింట్ చేయడంతో బయటకొచ్చి ప్రెస్‌మీట్ పెట్టిన ఎంకే మీనాలోకేష్ ట్విట్టర్‌కు వీడియో ఎలా చేరిందన్న దానిపై ఎంకే మీనా మౌనంతాజాగా వీడియో తాము విడుదల చేయలేదంటూ కూల్‌గా చెప్పిన సీఈవో మీనావీడియో ఎవరు రిలీజ్ చేశారో మాత్రం చెప్పని సీఈవో4:05 PM, May 23rd, 2024ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లిహైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికాసేపట్లో విచారణ జరపనున్న హైకోర్టు3:48 PM, May 23rd, 2024అంబటి రాంబాబు ట్వీట్‌వైరల్ అవుతున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో ఎన్నికల కమిషన్‌కు సంబంధం లేదని ప్రకటించింది అంటే పోలీసులు, అధికారులు టీడీపీతో ఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తోందిపిన్నెల్లిపై ఫేక్ వీడియోను ఎక్స్‌లో రిలీజ్ చేసిన నారా లోకేష్‌పై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలివైరల్ అవుతున్న మాచర్ల MLA Video ఎన్నికల కమిషన్ కు సంబంధం లేదని ప్రకటించిందంటే పోలీసులు, అధికారులు తెలుగు దేశంతోఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తుంది!— Ambati Rambabu (@AmbatiRambabu) May 23, 20242:15 PM, May 23rd, 2024పిన్నెల్లి వీడియో మేము విడుదల చేయలేదు: సీఈవో ముఖేష్ కుమార్ మీనాపిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటనఆ వీడియోను మేము విడుదల చేయలేదుఎన్నికల కమిషన్ నుండి బయటకు వెళ్లలేదుఅది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటాం. దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుండో బయటకు వెళ్లిందిపాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేశాంమాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదుఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చిందిటీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాంవాళ్లు వెళితే వైఎస్సార్సీపీ నేతలు కూడా వెళతామంటారుమళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశముంది. బయట నాయకులు ఎవ్వరూ మాచర్లకు వెళ్లకూడదుఎవ్వరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనీయొద్దని ఆదేశించాను. 2:00 PM, May 23rd, 2024అంబటి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టుసత్తెనపల్లిలో రిగ్గింగ్ జరిగిందని, రీపోలింగ్ జరపాలని పిటిషన్‌ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన అంబటిప్రతివాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదుగురిని చేర్చిన అంబటి 1:40 PM, May 23rd, 2024టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు చెప్పిన స్పందించలేదు: అనిల్ కుమార్ యాదవ్ఓటమి భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడింది 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక్కటే ఎందుకు బయటకు వచ్చింది ఈవీఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారుఈసీ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయిఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడి పై కూడా దాడులు చేశారుపల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలు పగలగొట్టారు తుమ్మురుకోట, వబుచెర్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు చింతపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు పాల్వాయిగేటు ప్రాంతంలో టీడీపీ నేతల విధ్వంసం చేశారు టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు? ఎస్సీ, ఎస్టీలను కొడుతున్న వీడియోలు ఈసీకి కనపడలేదా? టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట్ల రీపోలింగ్ పెట్టాలి ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తాం 1:15 PM, May 23rd, 2024లోకేష్, బాబు చెప్పిన దాన్ని పోలీసులు ఫాలో అవుతున్నారు: కోరముట్ల శ్రీనివాసులురైల్వేకోడూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు కామెంట్స్..ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఒక ప్రజానాయకుడుఅలాంటి నాయకుడిపై లుకౌట్ నోటీస్ జారీచేయడం దారుణంఒకరేమో జీవితఖైదు అని, ఇంకోరేమో కనీసం 10 ఏళ్లు శిక్ష పడుతుంది అంటూ పరిధులు దాటి మాట్లాడుతున్నారు..ఏ శిక్ష వేయాలో ఈనాడు, అంధ్రజ్యోతి నిర్ణయిస్తాయా?కూటమి అభ్యర్థి గుప్త గుంతకల్‌లో ఈవీఎంను పగలకొడితే ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.పిన్నెల్లిపై లుకౌట్ నోటీస్ జారీ చెయ్యడం కరెక్టా?వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన ప్రజానాయకుడు పిన్నెలిమాచర్ల రెంటచింతలలో జరిగిన సంఘటనపై నివేదిక తెప్పించుకోకుండానే లోకేష్, బాబు చెప్పిన దాన్ని పోలీసులు ఫాలో అవుతున్నారు.ఆ పోలింగ్ స్టేషన్ లో కూటమి రిగ్గింగ్ చేసింది.పోలింగ్ స్టేషన్లోకి వెళ్లి క్షణికావేశంలో ఈవీఎం పగలకొట్టి ఉండవచ్చుదానిపై పోలీసులు స్పందించే తీరు సరికాదు మొదటి నుండి కూటమి సభ్యులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నా ఒక్కరిపై కూడా ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదుఈసీ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోంది. 12:45 PM, May 23rd, 2024ఈసీకి సూటిగా ప్రశ్నలు సంధించిన సజ్జలమాచర్ల ఘటనపై స్పందించిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిఎన్నికల సంఘానికి సజ్జల రామకృష్ణారెడ్డి సూటి ప్రశ్నలుపాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా?వీడియో సరైందేనా కాదా అన్నది నిర్దారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది?ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుంది?మాచర్ల నియోజకవర్గంలో ఏడు ఘటనలు (ఈవీఎంలపై) జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.!అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తుంది?ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, ఏడు చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయటపెట్టదు?అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుందిఅంతే కానీ.. ఒక చిన్న క్లిప్పింగ్‌ను మాత్రమే బయటకు ఎలా వస్తుంది?తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే..అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు?దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు?. 3. More importantly, in the videos attached below, there is clear evidence of TDP goons attacking innocent voters. Why has no action been initiated in these instances? pic.twitter.com/iYVvwO5nXj— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 12:10 PM, May 23rd, 2024మచిలీపట్నంలో మాక్ డ్రిల్..కృష్ణాజిల్లా..మచిలీపట్నం కోనేరు సెంటర్ జిల్లా ఎస్పీ అద్నాన నయీం అస్మి ఆధ్వర్యంలో మాక్ డ్రిల్కౌంటింగ్ ప్రక్రియలో అల్లర్లకు పాల్పడితే జరిగే పరిణామాలను మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు చూపించిన పోలీస్ సిబ్బంది.ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కామెంట్స్..ప్రజలు ఎన్నికల ప్రక్రియలో సహకరించారుకౌంటింగ్‌లో కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాంకౌంటింగ్ సమయంలో డీజేలకు, టపాసులకు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవుఅల్లర్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు 10:22 AM, May 23rd, 2024సిట్ దర్యాప్తు.. కంటిన్యూఏపీలో కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ముమ్మరంగా తనిఖీలుపోలింగ్ టైంలో, తర్వాత అల్లర్లలో పాల్గొనవారిపై నిఘారాష్ట్రవ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపుఏపీలో ఘర్షణలపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తుతిరుపతి, తాడిపత్రి, పల్నాడులో సిట్ మకాంజిల్లాల పోలీసులు కేసులు విచారిస్తున్న తీరును పర్యవేక్షిస్తున్న సిట్ బృందాలుఅవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి వెళ్లే యోచన9:17 AM, May 23rd, 2024తిరుపతి చంద్రగిరిలో పోలీసుల అలర్ట్‌నారావారిపల్లి,శేషాపురంలో పోలీసుల పికెటింగ్‌చంద్రగిరిలో 144తో పాటు సెక్షన్ 30 అమలుసమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల కవాతుసభలు, సమావేశాలు, ఊరేగింపులను నో పర్మిషన్‌పోలింగ్ తర్వాత అల్లర్ల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు 8:10 AM, May 23rd, 2024పల్నాడులో మరో టెన్షన్‌నేడు చలో మాచర్లకు టీడీపీ పిలుపుటీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు మాచర్ల యాత్ర చేపట్టిన పచ్చ బ్యాచ్‌మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతి లేదని తేల్చి చెప్పిన పోలీసులు. 7:45 AM, May 23rd, 2024నేడు అంబటి పిటిషన్ విచారణఏపీ హైకోర్టులో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పిటిషన్‌పై నేడు విచారణసత్తెనపల్లిలో రిగ్గింగ్ జరిగిందని, రీపోలింగ్ జరపాలని అంబటి డిమాండ్ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన అంబటిప్రతివాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదుగురిని చేర్చిన అంబటి 7:20 AM, May 23rd, 2024‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్‌పాల్వాయి గేటులో ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్ వైఎస్సార్సీపీ ఏజెంట్లను చితకబాది బూత్‌ల నుంచి ఈడ్చివేతబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలపై పోలింగ్ బూత్‌లలో దౌర్జన్యం పార్టీ నేతల సమాచారంతో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రిగ్గింగ్‌ను ప్రతిఘటించి స్పందించాలని పలు దఫాలు ఎన్నికల అధికారులకు ఫోన్లు వెబ్ కాస్టింగ్ పరిశీలించి రిగ్గింగ్ అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఉదాశీనత.. పల్నాడులో ఏడు చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్క వీడియో మాత్రమే బహిర్గతం అవసరమైన మేరకు ఎడిటింగ్.. వారం తరువాత తాపీగా విదేశాల్లో ఉన్న లోకేశ్ ఎక్స్ ఖాతా నుంచి విడుదల భద్రంగా ఉండాల్సిన వెబ్ కాస్టింగ్ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు రిగ్గింగ్, ఏజెంట్లపై దాడులు, ఓటర్లని బెదిరించిన వారిని పట్టించుకోకుండా ప్రతిఘటించిన వారిపై కేసుల నమోదు పట్ల సర్వత్రా విస్మయం 7:00 AM, May 23rd, 2024ఓటమి బాటలో బాబుకుప్పంలో తప్పిన లెక్కలు.. వికటించిన వ్యూహాలుఇన్నాళ్లూ చంద్రబాబును గెలిపించింది 51 వేల దొంగ ఓట్లే రెండు విడతలుగా ఆ ఓట్ల తొలగింపు దీంతో ఓటమికి దగ్గరవుతూ వచ్చిన బాబుస్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలోనూ టీడీపీ ఘోర పరాజయం 35 ఏళ్లుగా కుప్పం ప్రజలను నమ్మించి మోసం చేసిన వైనం వైఎస్సార్సీపీ రాకతో ప్రతి ఇంటికీ సంక్షేమం, అభివృద్ది మారుతూ వచ్చిన ఓటర్ల తీర్పు.. గత ఎన్నికల్లో తగ్గిన మెజారిటీ ఈ దఫా ఓటమి ఖాయం అని తేలడంతో కుటుంబ సమేతంగా పరుగులు కుప్పంలో ఓటు, ఇల్లు లేని బాబు.. ఓటమి భయంతో ఇంటి నిర్మాణ పనులు ఓటుకు రూ.2 వేలు పంపిణీ చేసినా విఫల యత్నమే అంటున్న స్థానికులు 6:50 AM, May 23rd, 2024కుట్ర విఫలం వల్లే రాద్ధాంతం ఘోర ఓటమి భయంతో టీడీపీ నేతల దారుణకాండవైఎస్సార్‌సీపీకి దన్నుగా నిలిచే వర్గాల వారు ఓట్లు వేయకుండా అడ్డుకునే కుట్ర పల్నాడు, తాడిపత్రి, జమ్మలమడుగు, చంద్రగిరి సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ రోజున అల్లర్లు పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు నెట్టి రిగ్గింగ్ చేసిన టీడీపీ రౌడీలు వెబ్ కాస్టింగ్‌లో అరాచకపర్వం స్పష్టంగా కన్పిస్తున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులు టీడీపీ మూక రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపోలింగ్ రోజున తమ కుట్ర విఫలమవడంతో టీడీపీ అండ్ గ్యాంగ్ యాగీ 6:40 AM, May 23rd, 2024టీడీపీ రిగ్గింగ్.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్‌రెడ్డిమాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారుపిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తాంపిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోందిమొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి.ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్ చేశారు?రిగ్గింగ్ జరిగిందని చెప్తుంటే... ఎందుకు వీడియో రిలీజ్ చేయడం లేదు?మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలిమాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?బీసీలు, ఎస్టీలు వైఎస్సార్సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారుఅందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాంరిగ్గింగ్ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలిఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలిమమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారుదాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలిఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోందిమాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారుమిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదుఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం 6:30 AM, May 23rd, 2024మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు చేసింది టీడీపీ నేతలేమాచర్లలో టీడీపీ నేతల రిగ్గింగ్‌ఒక్కొక్కటిగా బయటపడుతున్న వీడియోలువైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్న టీడీపీ మూకలురెంటచింతల మండలం పాల్వాయి గేటులోని 201, 202 పోలింగ్ బూత్‌లో టీడీపీ రిగ్గింగ్‌టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులుఓటర్లను ఓటు వేయనివ్వని టీడీపీ నేతలుఓటర్లు బూత్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలుటీడీపీ నేతల రిగ్గింగ్‌పై పోలీసులు, ఎన్నికల అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదులుఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
తప్పక చదవండి
- బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- 'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
- SRH vs RR: ‘సన్‌రైజర్స్ కాదు!.. రాజస్తాన్‌కే గెలిచే ఛాన్స్’
- బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!
సినిమా
అదరగొడుతున్న హారర్ మూవీ.. ఏకంగా వంద కోట్లు..
హారర్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఏకంగా వంద కోట్లు రాబట్టింది. ఆ సినిమా మరేదో కాదు అరణ్మనై 4. సుందర్, తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మే 3న తమిళనాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో బాక్ పేరిట విడుదలైంది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టింది. ఈ ఏడాది సెంచరీ కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది.సెంచరీ..ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అరణ్మనై వంద కోట్లు వసూలు చేసిందంటూ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. అరణ్మనై ఫ్రాంచైజీలో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. అవన్నీ విజయం సాధించగా ఈసారి నాలుగో పార్ట్ తీశారు. గత చిత్రాలన్నింటికంటే అరణ్మనై 4 అద్భుత విజయం సాధించింది. నాలుగో పార్ట్‌లో మెయిన్ లీడ్..ఇక గత మూడు చిత్రాల్లో సహాయక పాత్రల్లో కనిపించిన ఈ సినిమా డైరెక్టర్ సుందర్ నాలుగో పార్ట్‌లో మాత్రం ప్రధాన పాత్రలో నటించడం విశేషం. కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్‌కుమార్‌కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో యోగిబాబు, కోవై సరళ, రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్ సహాయక పాత్రల్లో నటించారు. హిప్హాప్ ఆది సంగీతం అందించాడు. A celebration in theaters 🥳 A phenomenon at the box office 🔥 The 1st Tamil movie of 2024 to gross 100 crores worldwide 😍❤🔥And it's all from the love you've given us ✨ #Aranmanai4BlockbusterHitA #SundarC unstoppable blockbuster entertainer🥳A @hiphoptamizha… pic.twitter.com/VvrcKGT63g— KhushbuSundar (Modi ka Parivaar) (@khushsundar) May 22, 2024 చదవండి: పవిత్ర-చందు మరణం.. నటుడు నరేశ్ కీలక వ్యాఖ్యలు
ప్రభాస్ బుజ్జి.. ఎక్కడ తయారు చేశారో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. అత్యంత భారీ బడ్జెట్‌తో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలోని డిఫరెంట్ లుక్‌తో కారు(బుజ్జిని) అభిమానులకు పరిచయం చేశారు. ఇందుకోసం భారీ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. డిఫరెంట్ లుక్‌లో ఉన్న బుజ్జిని చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.అయితే ఇప్పుడు అందరిదృష్టిని ఆకర్షిస్తోన్న బుజ్జి గురించి నెట్టింట చర్చ మొదలైంది. అసలు బుజ్జిని ఎవరు తయారు చేశారు? డిఫరెంట్ లుక్‌లో ఉన్న బుజ్జిని ఎక్కడ తయారు చేశారు? అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. బుజ్జికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయి. బుజ్జిని తయారు చేసేందుకు ప్రముఖ కంపెనీలైన మహీంద్రా, జాయెమ్ ఆటోమోటివ్ సంయుక్తంగా రూపొందించారు.కల్కి సినిమా కోసం రూపొందించిన ఈ కారును తమిళనాడులోని కోయంబత్తూర్‌లో తయారు చేశారు. బుజ్జి బరువు దాదాపు ఆరు టన్నుల బరువుతో రూపొందించారు. ఈ కారు తయారికీ దాదాపు రూ.7 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ముందు రెండు, వెనుక భాగంలో ఒక టైరు మాత్రమే కలిగి ఉన్న బుజ్జి ఫ్యాన్స్‌కు విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ప్రత్యేకమైన కారును ప్రభాస్ స్వయంగా నడుపుకుంటూ వచ్చి అభిమానులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అమితాబ్, కమల్‌గారు లాంటి గ్రేటెస్ట్ లెజెండ్స్‌తో పని చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టమని అన్నారు. కాగా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదల కానుంది. Meet #Bujji - a 6 tonne monster of a machine built by Mahindra and Jayem AutmotiveFor the first time in the world #Kalki2898AD movie crew built a car completely from scratch just for a movie 🔥🔥Made Up with a Cost of 7Cr for Car which is INSANE pic.twitter.com/l534NTCrOU— Australian Telugu Films (@AuTelugu_Films) May 23, 2024
కాంతార హీరో ఇంట్లో శుభకార్యం.. ఫోటోలు షేర్ చేసిన నటుడు!
కాంతారా మూవీతో స్టార్డమ్ సొంతం చేసుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన కాంతార బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. దేశవ్యాప్తంగా సినీ ప్రియుల నుంచి విశేషమైన ఆదరణ దక్కించుకుంది. దీంతో రిషబ్ కాంతార ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇటీవలే ఆయన మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ను కలిశారు. దీంతో ఆయన కాంతార-2 కోసమే మోహన్‌లాల్‌ను కలిశాడని వార్తలొచ్చాయి. కాంతార 2 విషయానికొస్తే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇదిలా ఉండగా రిషబ్ శెట్టికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడీయాలో యాక్టివ్‌గా ఉండే రిషబ్ ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. తాజాగా తన కూతురు రాధ్యకు అక్షర అభ్యాస కార్యక్రమం నిర్వహించారు రిషబ్ దంపతులు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రముఖ శ్రీ శారదాంబ ఆలయంలో తమ ముద్దుల కూతురికి అక్షర అభ్యాసం పూర్తియిందంటూ రిషబ్ రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial)
'స్టార్ హీరోతో లవ్.. పేరెంట్స్ బలవంతం వల్లే పెళ్లి చేసుకున్నా'
లవ్ మ్యారేజ్.. అరేంజ్డ్ మ్యారేజ్.. దాదాపు ఈ రెండే అందరికీ తెలుసు.. అయితే సహజీవనం చేశాకే పెళ్లి చేసుకోమని సీనియర్ నటి జీనత్ అమన్ ఆ మధ్య కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీన్ని ఇప్పటికే కొందరు పాటిస్తుండగా ఓ బాలీవుడ్ స్టార్ జంట ఎప్పుడో ఫాలో అయింది. ఆమిర్ ఖాన్- కిరణ్ రావు.. వివాహానికి ముందు కలిసున్నారు.పేరెంట్స్ బలవంతం వల్లే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిరణ్ రావు మాట్లాడుతూ.. నిజాయితీగా చెప్తున్నా.. నేను, ఆమిర్ ఏడాదిపాటు సహజీవనం చేశాము. పేరెంట్స్ బలవంతం వల్ల పెళ్లి చేసుకున్నాం. వివాహం అనే ఇన్స్టిట్యూట్లో భార్యాభర్తలుగా, విడివిడిగానూ పని చేస్తే అది చాలా బాగా వర్కవుట్ అవుతుంది.కోతులుగా ఉన్నప్పుడు..కానీ ఈ పెళ్లి అనేది అమ్మాయిలను ఎంతగా అణిచివేస్తుందనేది మాత్రం ఎవరూ మాట్లాడరు. అమెరికన్ సైకాలిజస్ట్ ఎస్తర్ పెరల్ దీని గురించి అద్భుతమైన పుస్తకం రాశాడు. మనం కోతులుగా జీవించినప్పుడు కలిసున్నాం. తర్వాత కాలక్రమేణా మానవులు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పెళ్లి వల్ల మహిళలపై ఒత్తిడిదానివల్ల మహిళలపై ఒత్తిడి పెరిగింది. కుటుంబాన్ని చూసుకోవాలి. అందరూ కలిసుండేందుకు తోడ్పడాలి. పని చేయాలి. దీనికితోడు అత్తామామ, ఆడపడుచులు సహా భర్త వైపు కుటుంబీకులందరితో టచ్‌లో ఉండాలి. ఇలా ఆ మహిళ దగ్గరి నుంచి ఎన్నో ఆశిస్తూ తనపై ఒత్తిడి పెంచుతారు' అని చెప్పుకొచ్చింది.అప్పుడు పరిచయం మాత్రమేకాగా ఆమిర్.. కిరణ్ రావు 'లగాన్' సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. ఈ మూవీలో ఆమిర్ హీరోగా నటించగా కిరణ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించింది. అప్పుడు పరిచయం మాత్రమే ఏర్పడింది. ఆమిర్ మంగళ్ పాండే, కిరణ్ రావు స్వదేశ్ సినిమా చేస్తున్న సమయంలో కమర్షియల్ యాడ్స్‌కు కలిసి పని చేశారు. డేటింగ్.. పెళ్లిఅప్పుడు వీరి మధ్య ప్రేమ చిగురించింది. అలా 2004లో డేటింగ్ చేయగా 2005లో పెళ్లి చేసుకున్నారు. 2011లో సరోగసి ద్వారా ఆజాద్ అనే కుమారుడికి పేరెంట్స్ అయ్యారు. 2021లో ఆమిర్- కిరణ్ విడిపోయారు.చదవండి: పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
ఫొటోలు
రేవ్ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)
Dinesh Karthik: ఆ నవ్వే నన్ను ముంచేసింది!.. ఎల్లప్పుడూ నా వాడే!(ఫొటోలు)
పండంటి బాబుకు జన్మనిచ్చిన బుల్లితెర జంట (ఫోటోలు)
హైదరాబాద్ లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఎలా ఉందో చూడండి (ఫొటోలు)
వేలకోట్ల సామ్రాజ్యం.. చివరకు భార్య నగలు అమ్మాల్సి వచ్చింది: అనిల్ అంబానీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
క్రీడలు
IND vs PAK: ఒక్క టికెట్ రూ. 16 లక్షలా?.. ఐసీసీపై లలిత్ మోదీ ఫైర్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి సమయం సమీపిస్తోంది. జూన్ 1 ఈ ఐసీసీ ఈవెంట్‌కు తెరలేవనుంది. ఇక ఈ మెగా టోర్నమెంట్‌కు అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.వెస్టిండీస్‌తో కలిసి వరల్డ్‌కప్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న యూఎస్ఏ.. ఇప్పటికే మ్యాచ్‌లు జరిగే స్టేడియాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలో మునిగిపోయింది.చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆరోజేఇదిలా ఉంటే.. టీమిండియా ఈ ఈవెంట్లో తమ లీగ్ మ్యాచ్‌లన్నీ యూఎస్ఏలోనే ఆడనుంది. జూన్ 5 న ఐర్లాండ్‌తో మ్యాచ్ ద్వారా తాజా ఎడిషన్‌లో తమ ప్రయాణం మొదలుపెట్టనున్న రోహిత్ సేన.. జూన్ 9న తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.ఇక దాయాదుల పోరు అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఎప్పుడో రద్దు కాగా.. కేవలం ఆసియా కప్, ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లలో మాత్రమే టీమిండియా- పాక్‌లు ముఖాముఖి తలపడుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ హైవోల్టేజీ మ్యాచ్‌లకు మరింత ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో ఐసీసీ ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో మరీ దారుణంగా ప్రవర్తిస్తోందంటూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్త, మాజీ కమిషనర్ లలిత్ మోదీ మండిపడ్డాడు.లాభాలు దండుకోడానికి కాదుఇండియా- పాక్ మ్యాచ్‌కు వేదికైన న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ స్టేడియంలో టికెట్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు.. ‘‘వరల్డ్‌కప్‌లో ఇండియా- పాక్ మ్యాచ్ నేపథ్యంలో డైమండ్ క్లబ్ సీటు టిక్కెట్లను ఏకంగా 20000 డాలర్లకు అమ్ముతున్నారని తెలిసి షాకయ్యాను.అమెరికాలో వరల్డ్‌కప్ నిర్వహిస్తోంది క్రికెట్‌కు ఇక్కడ ఆదరణ పెంచడానికి, ఫ్యాన్ ఎంగేజ్మెంట్ కోసం మాత్రమే అనుకున్నాం. కానీ మీరు లాభాలు దండుకోడానికి కాదు’’ అంటూ ఐసీసీ తీరును లలిత్ మోదీ ఎక్స్ వేదికగా విమర్శించాడు. దాదాపు రూ. 16 లక్షలకు పైనే!కాగా 20 వేల అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ. 16 లక్షలకు పైనే! ఇక లలిత్ మోదీ ట్వీట్ చూసిన ఫ్యాన్స్ టికెట్ ధర తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, ఈ ధరలకు సంబంధించి ఇంత వరకు అధికారిక సమాచారం మాత్రం లేదు.కాగా క్యాష్ రిచ్ లీగ్‌ను సృష్టించిన లలిత్ మోదీ ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశం నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు లండన్‌లో తలదాచుకుంటున్నట్లు సమాచారం.Shocked to learn that @ICC is selling tickets for Diamond Club at $20000 per seat for the #indvspak WC game. The WC in the US is for game expansion & fan engagement, not a means to make profits on gate collections. $2750 for a ticket It’s just #notcricket #intlcouncilofcrooks pic.twitter.com/lSuDrxHGaO— Lalit Kumar Modi (@LalitKModi) May 22, 2024
Virat Kohli: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. సిటీలో కోహ్లి రెస్టారెంట్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కేవలం క్రికెటర్‌గానే కాకుండా వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో సంస్థలో పెట్టుబడులు పెట్టిన ఈ ఢిల్లీ బ్యాటర్.. వన్ 8 కమ్యూన్ పేరిట రెస్టారెంట్ చైన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఆతిథ్య రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తూ అద్బుతమైన మెనూతో ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్న వన్ 8 కమ్యూన్ ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది.కోహ్లికి హైదరాబాద్ అంటే కూడా చాలా ఇష్టంనగరంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో గల నాలెడ్జ్ సిటీలో ఈ రెస్టారెంట్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వన్ 8 కమ్యూన్లో కోహ్లి భాగస్వామి వర్తిక్ తిహారా మాట్లాడుతూ.. ‘‘సౌత్‌లో మొదట బెంగళూరులో మా రెస్టారెంట్ ఓపెన్ చేశాం.అక్కడి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఆ స్ఫూర్తితో హైదరాబాద్‌లోనూ ఆరంభించాం. కోహ్లికి హైదరాబాద్ అంటే కూడా చాలా ఇష్టం. ఐపీఎల్ కోసం ఇటీవలే ఇక్కడికి వచ్చాడు కూడా! ఇక్కడి ఫుడ్, సిటీ వైబ్.. అన్నీ తను చాలా ఎంజాయ్ చేస్తాడు. కుదిరితే మరో ఏడు నుంచి ఎనిమిది నెలల్లో ఇక్కడే మరో రెస్టారెంట్ కూడా ప్రారంభిస్తాం’’ అని ‘సాక్షి’కి తెలిపారు.అతడి ఫేవరెట్ డిష్ ఇదేఅదే విధంగా.. గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల స్థానిక రుచులతో తమ మెనూను నింపేశామని.. ప్రఖ్యాత హైదరాబాదీ బిర్యానీతో పాటు సోయా హలీం ఇక్కడ మరో స్పెషాలిటీ అని తెలిపారు. కోహ్లికి ఉన్న అభిమాన గణాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఫుడ్ ఎంజాయ్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వర్తిక్ తిహారా పేర్కొన్నారు.ఇక విరాట్ కోహ్లి వెజిటేరియన్ ఎక్కువగా ఇష్టపడతాడని.. మష్రూమ్ డిమ్సమ్ అతడి ఫేవరెట్ డిష్ అని తెలిపారు. పాన్ ఇండియా లెవల్లో అన్ని రకాల వంటకాలను కోహ్లి ఆస్వాదిస్తాడని పేర్కొన్నారు. రికార్డుల రారాజుగా పేరొందిన రన్‌మెషీన్ కోహ్లి ఫిట్నెస్, డైట్ విషయంలో పక్కాగా ఉంటాడన్న విషయం తెలిసిందే.భోజనం బాగుందంటూ కితాబులుఇదిలా ఉంటే.. వన్ 8 కమ్యూన్ ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు తదితర నగరాల్లో కొలువు దీరింది. ఇక హైదరాబాద్‌లోనూ ఇప్పటికే కింగ్ కోహ్లి అభిమానులు ఈ రెస్టారెంట్‌ను సందర్శిస్తున్నారు. ఫుడ్, పార్టీ ప్లేస్ అన్నీ ఆహ్లాదకరంగా ఉన్నాయని.. భోజనం కూడా చాలా రుచిగా ఉందని చెబుతున్నారు.చదవండి: విరాట్ కోహ్లి ఆర్సీబీని వీడాలి.. ఆ జట్టులో చేరాలి: ఇంగ్లండ్ స్టార్
బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
టీమిండియా హెడ్‌కోచ్ పదవిపై తనకు ఆసక్తి లేదని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రిక్కీ పాంటింగ్ స్పష్టం చేశాడు. తాను ఈ బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధంగా లేనని తెలిపాడు.ప్రధాన కోచ్‌గా ఉండాలంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి తనకు ఆఫర్ ఇచ్చిందని.. అయితే, తాను సున్నితంగా తిరస్కరించినట్లు పాంటింగ్ వెల్లడించాడు. కాగా టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రయాణం ముగియనున్న విషయం తెలిసిందే.వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాతే ద్రవిడ్ పదవీకాలం ముగియగా.. టీ20 ప్రపంచకప్-2024 ముగిసే వరకు జట్టుతో ఉండాలని బీసీసీఐ అతడిని కోరింది. ఇందుకు అంగీకరించిన ద్రవిడ్.. మెగా ఈవెంట్ తర్వాత తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు.ఈ క్రమంలో బీసీసీఐ ఇప్పటికే కొత్త హెడ్ కోచ్ కోసం వేట మొదలుపెట్టింది. ఇందుకు దరఖాస్తులు కూడా ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్‌తో పాటు జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తదితర విదేశీ కోచ్‌ల పేర్లు తెరమీదకు వచ్చాయి.ఈ విషయంపై రిక్కీ పాంటింగ్ తాజాగా స్పందించాడు. ఐసీసీ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా హెడ్‌కోచ్ నియామకం గురించి చాలా వార్తలు చూస్తున్నా. నిజానికి మన కంటే ముందు మన గురించి సోషల్ మీడియా యూజర్లకే అన్ని వివరాలు తెలిసిపోతాయి(నవ్వుతూ)!అది ఎలాగో మనకైతే అర్థం కాదు. నాక్కూడా జాతీయ జట్టుకు సీనియర్ కోచ్‌గా ఉండాలనే ఉంది. అయితే, అంతకంటే ఎక్కువగా నా కుటుంబంతో సమయం గడపాలని ఉంది.టీమిండియా కోచ్‌గా ఉండాలంటే ఐపీఎల్ జట్లతో సంబంధాలు తెంచుకోవాలన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. హెడ్ కోచ్ అంటే ఏడాదిలో దాదాపు 10 -11 నెలల పాటు బిజీగా ఉంటాం.నా ప్రస్తుత జీవనశైలి అందుకు ఏమాత్రం సరితూగదు. ఇప్పుడు నేను నా కెరీర్ పట్ల సంతృప్తిగానే ఉన్నా. ఐపీఎల్ సమయంలో చర్చలు జరిగిన మాట వాస్తవమే.నాతో పాటు జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్.. గౌతం గంభీర్.. ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, నేను మాత్రం ప్రస్తుతం ఈ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేను’’ అని రిక్కీ పాంటింగ్ స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌తో సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేసిన రిక్కీ పాంటింగ్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా ఉన్నాడు.
SRH vs RR: ‘సన్‌రైజర్స్ కాదు!.. రాజస్తాన్‌కే గెలిచే ఛాన్స్’
ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్.. ఆ తర్వాత చతికిల పడింది. వరుస ఓటములతో విమర్శలు మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమైంది.ఈ క్రమంలో అమీ తుమీ తేల్చుకోవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ రాజస్తాన్ గెలిచే అవకాశాల్లేవంటూ విశ్లేషకులు పెదవి విరిచారు. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ స్వదేశానికి వెళ్లిపోవడం.. యశస్వి జైస్వాల్ స్థాయికి తగ్గట్లు రాణించకపోవడం.. బౌలింగ్ విభాగంలోనూ లోపాలు అంటూ రాజస్తాన్‌ను విమర్శించారు.ఆర్సీబీని చిత్తుచేసి.. క్వాలిఫయర్-2లోఇక సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం ఆర్సీబీ- రాజస్తాన్ వార్ వన్‌సైడ్ అంటూ బెంగళూరు జట్టుకు మద్దతు పలికారు. ఈ క్రమంలో రాజస్తాన్ ఆర్సీబీకి ఊహించని షాకిచ్చింది. అహ్మదాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో బెంగళూరును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.ఫైనల్ రేసులో నిలిచే క్రమంలో చెన్నై వేదికగా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రాజస్తాన్ రాయల్స్ ఫేవరెట్సన్రైజర్స్- రాజస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. వాళ్లు ఇక్కడిదాకా చేరుకున్న తీరు అద్బుతం.చెన్నై పిచ్ పరిస్థితులు కూడా రాజస్తాన్ స్పిన్నర్లకు బాగా నప్పుతాయి. కాబట్టి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసేటపుడు ఆటగాళ్లు తమ మెదళ్లను బాగా ఉపయోగించాలి.అది హైదరాబాద్ వికెట్ కాదు. చెన్నైలో మీరు వికెట్లు తీయలేరు. అందుకే బ్యాటింగ్‌పై దృష్టి సారించాలి. నిజానికి చెన్నై పిచ్ మీద పరుగులు రాబట్టాలంటే కచ్చితంగా ఆచితూచి ఆడుతూ బ్యాట్స్‌మన్‌షిప్ చూపాలి’’ అని అంబటి రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఫైర్అయితే, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ రాయుడు వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారు. సన్‌రైజర్స్ ఆటగాళ్లను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని మండిపడుతున్నారు. రాజస్తాన్ మాదిరే సన్‌రైజర్స్ కూడా ఆది నుంచి దూకుడుగా ఆడుతూ ఇక్కడిదాకా వచ్చిందని పేర్కొంటున్నారు.హైదరాబాద్ జట్టులోనూ షాబాజ్ అహ్మద్, మయాంక్ మార్కండే, విజయకాంత్ వియస్కాంత్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అనుభవం లేకపోయినా మొమెంటమ్ తీసుకురావడంలో వీళ్లు సఫలమవుతారంటూ అంబటి రాయుడుకి కౌంటర్లు వేస్తున్నారు. కాగా రాజస్తాన్ రాయల్స్ జట్టులో చెన్నై దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు యజువేంద్ర చహల్ రూపంలో ఇద్దరు మేటి స్పిన్నర్లు ఉన్న విషయం తెలిసిందే.చదవండి: Hardik Pandya: భార్యతో హార్దిక్ పాండ్యాకు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్ వైరల్
బిజినెస్
టాప్ 5 దేశాలను వెనక్కి నెట్టిన భారత్!
ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ఉత్పత్తి చేసే టాప్ 5 దేశాలతో పోలిస్తే భారత్‌లోనే వృద్ధి నమోదైనట్లు ప్రపంచ స్టీల్ అసోసియేషన్(డబ్ల్యూఎస్‌ఏ) నివేదిక వెల్లడించింది. స్టీల్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న చైనా ఏప్రిల్ నెలలో 85.9 మిలియన్ టన్నులతో 7 శాతం క్షీణించినట్లు డబ్ల్యూఎస్‌ఏ తెలిపింది.డబ్ల్యూఎస్‌ఏ రిపోర్ట్ ప్రకారం..ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు చైనా ఉక్కు ఉత్పత్తి 343.7 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది 2023తో పోలిస్తే 3% తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న భారత్ ఏప్రిల్‌లో 3.6% పెరుగుదలతో 12.1 మిలియన్ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య 49.5 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి 8.5% వృద్ధి సాధించింది. జపాన్, అమెరికా, రష్యాలు మొదటి త్రైమాసికంలో 2-6% క్షీణించాయి. జనవరి-ఏప్రిల్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇండియా మినహా మిగతా నాలుగు అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి చేసే దేశాల్లో ప్రొడక్షన్ తగ్గింది.ఇదీ చదవండి: ఏఐతో మరింత అందంగా: రిలయన్స్ఇండియాలో స్టీల్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నప్పటికీ ప్రపంచ డిమాండ్ ఇంకా కోలుకోలేదని డేటా సూచిస్తుంది. క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ సెహుల్ భట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉక్కు వినియోగిస్తున్న రంగాల్లో డిమాండ్ తగ్గింది. 2023లో ఐరన్‌ఓర్(ముడి ఉక్కు) ఉత్పత్తిలో ఎలాంటి మార్పులులేవు. ఈ ట్రెండ్ 2024లోనూ కొనసాగుతుందని అంచనా. ఈ ధోరణి భారతీయ ఉక్కు తయారీదారుల మార్చి త్రైమాసిక ఆదాయాలపై ప్రభావం చూపింది. దేశంలో అధిక ఐరన్‌ఓర్ దిగుమతి కారణంగా ధరలు ప్రభావితమయ్యాయి’ అని చెప్పారు.
మెరుగైన ఉద్యోగం కోసం.. ఇవి నేర్చుకోవాల్సిందే
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో చాలా మంచి ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఉద్యోగాలు కోల్పోవడానికి ప్రధాన కారణం.. సాంకేతికతలలో ఉద్యోగులకు నైపుణ్యం లేకుండా పోవడమే అని తెలుస్తోంది. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా ఎవరైతే.. నైపుణ్యం పెంచుకుంటారో వారికే భవిష్యత్తు ఉంటుందని స్టేట్ ఆఫ్ అప్‌స్కిల్లింగ్ కన్స్యూమర్ సర్వే ద్వారా తెలిసింది.2023తో పోలిస్తే.. 2024లో ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నట్లు తెలిసింది. కెరీర్లో ముందుకు వెళ్ళటానికి ఇది చాలా అవసరమని ఉద్యోగులకు అర్థమవుతోంది. 97 శాతం మంది మెరుగైన కెరీర్ అవకాశాల కోసం నైపుణ్యం ఒక ముఖ్యమైన అంశం అని భావిస్తున్నారు.డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి వాటిలో నైపుణ్యం సంపాదిస్తున్నారు.ఎప్పటికప్పుడు మారుతున్న ల్యాండ్‌స్కేప్‌లో.. ఎదగాలంటే డేటా సైన్స్, ఏఐ, సైబర్‌సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో నైపుణ్యం అవసరమని సింప్లిలేర్న్ కో ఫౌండర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కశ్యప్ దలాల్ పేర్కొన్నారు. కాబ్బటి ఉద్యోగులు తమ రంగంలో ఉన్నతమైన నైపుణ్యాలను తప్పకుండా పెంపొందించుకోవాలి.లింక్డ్ఇన్ ప్రకారం ప్రస్తుత కార్పోరేట్ లైఫ్‌లో టాప్ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు దొరుకుతున్నాయని తెలిపింది. మంచి కమ్యూనికేషన్‌తో పాటు కస్టమర్ సర్వీస్ గురించి అవగాహన ఉన్నవాళ్లకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదని తెలిపింది. అలాగే టీంను నడిపించే నాయకత్వ లక్షణాలు/అనుభవం, కీలకమైన ప్రాజెక్టులను నిర్వహించిన సామర్థ్యం, వేర్వేరు టాప్ పొజిషన్లలో చేసిన నైపుణ్యం ఉన్నవారికి ఢోకా లేదని తెలిపింది.నెంబర్లను విశ్లేషించి వ్యూహాలను మార్చుకునే అనలిటిక్స్ స్కిల్, ఎలాంటి బృందంతోనైనా పని చేసే కలుపుగోలు మనస్తత్వం, దేన్నయినా విక్రయించే టాలెంట్, సమస్యలను వెంటనే పరిష్కరించగలిగే ట్రబుల్ షూటింగ్ పరిజ్ఞానం అలాగే లోతైన పరిశోధన అభ్యర్థులను అగ్రస్థానంలో ఉంచుతుందని తెలిపింది. (Image Source : LinkedIn Learning)
రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!
టీమిండియా లెజండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య బాలివుడ్ నటి అనుష్క శర్మలకు షేర్ మార్కెట్లో లాభాల పంట పండింది. వారు పెట్టుబడి పెట్టిన షేర్లు భారీ లాభాలను తీసుకొచ్చాయి.స్టాక్ మార్కెట్లో మే 23న అరంగేట్రం చేసిన గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్.. 2020 ఫిబ్రవరిలో ఈ బీమా సంస్థలో పెట్టుబడి పెట్టిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. కంపెనీ షేరు ధర రూ.300 మార్కును దాటడంతో, కంపెనీలో తమ వాటాలను కొనసాగిస్తూనే దంపతుల పెట్టుబడి నాలుగు రెట్లు పెరిగింది.బీమా కంపెనీ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) ప్రకారం.. విరాట్ కోహ్లీ గో డిజిట్లో ఒక్కొక్కటి రూ. 75 చొప్పున 2,66,667 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అలాగే అనుష్క శర్మ 66,667 షేర్లను రూ.50 లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో ఈ జంట మొత్తం పెట్టుబడి రూ.2.5 కోట్లకు చేరుకుంది. కంపెనీ షేర్ ధర రూ.300 దాటడంతో విరాట్ కోహ్లీ రూ.2 కోట్ల పెట్టుబడి రూ.8 కోట్లకు చేరుకోగా, అనుష్క శర్మ పెట్టుబడి రూ.2 కోట్లకు చేరుకుంది. వీళ్ల షేర్ల విలువ ఇప్పుడు రూ.10 కోట్లు.
రూ. 2,599 కోట్లు వడ్డీతో సహా 15 రోజుల్లో కట్టాలి..
నష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న అనిల్ అంబానీ నేతృత్వంలోని కంపెనీకి అనుకోని ఎదురు దెబ్బ తగిలింది. రూ.2,599 కోట్ల భారీ మొత్తాన్ని రీఫండ్ చేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) నుంచి తుది నోటీసు అందింది. ఎన్డీటీవీ ప్రాఫిట్ నివేదిక ప్రకారం.. రూ. 2,599 కోట్లను ఎస్బీఐ ప్రైమ్ లెండింగ్ రేటుపై అదనంగా 2 శాతం చొప్పున వడ్డీతో పాటు 15 రోజులలోపు తిరిగి చెల్లించాలని కోరుతూ రిలయన్స్ ఇన్ఫ్రాకు చెందిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (DAMEPL)కి డీఎంఆర్సీ నోటీసు జారీ చేసింది. చెల్లించడంలో విఫలమైతే కోర్టు ధిక్కార కేసును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.ఇదీ నేపథ్యం..న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి సెక్టార్ 21 ద్వారక వరకు నడిచే ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ రూపకల్పన, నిర్వహణ కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, అనిల్ అంబానీకి చెందిన డీఏఎంఈపీఎల్ మధ్య ఒప్పందం జరిగింది. అయితే తాము గుర్తించిన కొన్ని నిర్మాణ లోపాలను డీఎంఆర్సీ పరిష్కరించలేదని ఆరోపిస్తూ 2012లో డీఏఎంఈపీఎల్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.దీనికి సంబంధించి కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2017లో ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ రూ. 2,950 కోట్లు వడ్డీతో సహా డీఏఎంఈపీఎల్కి చెల్లించాలని ని ఆదేశించింది. దీంతో డీఎంఆర్సీ రూ. 2,599 కోట్లను యాక్సిస్ బ్యాంక్ వద్ద ఎస్క్రో ఖాతాలో జమ చేసింది. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడంతో తాము డిపాజిట్ చేసిన రూ. 2,599 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని అనిల్ అంబానీ సంస్థకు 15 రోజుల సమయం ఇచ్చింది.
వీడియోలు
పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన
ఏపీ పరువు తీశారు టీడీపీ వాళ్ళు..కృష్ణంరాజు సంచలన కామెంట్స్
కాంగ్రెస్ లీడర్లు నన్నేదో చేయాలనుకుంటున్నారు: మల్లారెడ్డి ఫైర్
లోకేష్ కి ఆ వీడియో ఎక్కడిది
ఈసీకి సజ్జల 10 ప్రశ్నలు
Eliminator: ఆర్సీబీని చిత్తు చేసిన రాజస్తాన్
దమ్ముంటే ఆ ప్రాంతంలో రీపోలింగ్ పెట్టాలి
చిన్నమ్మ స్వార్ధానికి మునిగిపోతున్న బీజేపీ..
ఏడు చోట్ల EVM ధ్వంసలు జరిగాయి..కృష్ణం రాజు రియాక్షన్
వీడియో రికార్డు చేస్తూ అధికారి లైంగిక వేధింపులు..
ఫ్యామిలీ
ఫిట్నెస్ విత్ బ్యూటీ : సమంతా లేటెస్ట్ ఫోటో వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. వ్యక్తిగత జీవితంలో ఒడి దుడుకులు, భర్తతో విడాకులు, ఆటో ఇమ్యూన్ డిసీజ్ బారిన పడటం లాంటి కారణాలరీత్యా తన ఫిట్‌నెస్‌కు ఇచ్చే ఇంపార్టెన్స్ మరింత పెరిగింది. దీనికి సంబంధించి అనేక వీడియోలను, ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)తాజాగా కండలు తిరిగి భుజాలతో కూడిన ఒక బ్యూటిఫుల్ ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అంతేకాదు మరిన్ని ట్రైసెప్స్ డిప్స్ రాబోతున్నాయనే హింట్ కూడా ఇచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే 3 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సుమంత బెస్ట్ ఫ్రెండ్, ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కూడా సమంతా ఫిట్ బాడీని ఫిదా అయిపోయింది. ‘నీ ఫిట్‌నెస్‌లో సగమైనా సాధించాలని ఆశపడుతున్నాను’ అంటూ కమెంట్ చేయడం గమనార్హం.
సక్సెస్ ఊరికే రాదు : వేలకోట్లతో నెక్ట్స్ లెవల్ అంతే! ఎవరీ బిలియనీర్ మహిళ
విజయవంతమైన వ్యాపార కుటుంబం నుంచి వారసులు చాలామంది వస్తారు. కానీ ఆ విజయాన్ని అంది పుచ్చుకుని అసాధారణ వృద్ధితో ఎదిగిన వ్యాపార దిగ్గజాలు కొంతమందే ఉంటారు. ప్రముఖ ఫుట్‌వేర్ కంపెనీ 'మెట్రో బ్రాండ్స్' మేనేజింగ్ డైరెక్టర్ ఫరా మాలిక్ భాంజీ కథ అలాంటిదే. బిలియనీర్ ఫరా మాలిక్ భాంజీ గురించి ఇంట్రస్టింగ్ సంగతులు ఈ కథనంలో తెలుసుకుందాం.దేశంలోనే సంపన్న ముస్లిం మహిళగా గుర్తింపు పొందారు. కంపెనీ సీఎండీగా ఫరా మాలిక్ భాంజీ రూ. 28,773 కోట్ల కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. మెట్రో బ్రాండ్స్ ఛైర్మన్ రఫీక్ మాలిక్ రెండో కుమార్తె. తన నలుగురు సోదరీమణుల మాదిరిగానే, లంచ్ టేబుల్ వద్ద షాప్ టాక్ వింటూ పెరిగింది. కానీ కంపెనీ పగ్గాలు చేపట్టిన తరువాత ఫరా మార్గదర్శకత్వంలో, గతంలో 'మెట్రో షూస్'గా పిలువబడే మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. డిసెంబర్ 8 నాటికి 35,117 కోట్ల చేరడం విశేషం.ముంబై కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తోంది ఈ కంపెనీ. ఫరా తాత మాలిక్ తేజాని 1955లో తిరిగి స్థాపించారు. మోచి, మెట్రో , వాక్‌వే వంటి విజయవంతమైన బ్రాండ్ల రాకకు పునాది. పాదరక్షల పరిశ్రమలో 20 ఏళ్ల చరిత్రను తిరగరాసి ఆధునిక యుగంలో గేమ్ ఛేంజర్‌గా నిలిచింది ఫరా. ఆమె వినూత్న విధానం , ఫార్వర్డ్-థింకింగ్ స్ట్రాటజీలు కంపెనీని నెక్ట్స్ లెవల్‌కి చేర్చాయి. ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువు చదివి కంపెనీలో మార్కెటింగ్ రంగంలో తన వృత్తిని ప్రారంభించింది. ఇదే ఆ తర్వాత మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ సరఫరా గొలుసును పునరుద్ధరించడానికి తోడ్పడింది.2010లో వెబ్సైట్ ఏర్పాటు చేసి, ఆన్లైన్ అమ్మకాలు ప్రారంభించారు. దేశీ సంస్థల ఉత్పత్తులను రిటైలింగ్ చేసిన మెట్రో విదేశీ పాదరక్షల జోడింపుతో ‘మెట్రో బ్రాండ్స్’గా అవతరించింది.మెట్రో బ్రాండ్స్ పాదరక్షల దిగ్గజం క్రాక్స్ ఇండియా లిమిటెడ్ (CIL)తో ఒప్పందం నిబంధనలు, మార్పులతో తన భాగస్వామ్యాన్ని కూడా విస్తరించింది. దీని ప్రకారం భారతదేశంలోని పశ్చిమ , దక్షిణ రాష్ట్రాలలో Crocs "ఫుల్ కాస్ట్ " దుకాణాలనిర్వహణకు మెట్రో బ్రాండ్లకు ప్రత్యేక హక్కులను మంజూరు చేస్తుంది. కంపెనీ భారతదేశం అంతటా 200కి పైగా ప్రత్యేకమైన క్రోక్స్ స్టోర్లను నిర్వహిస్తోంది.స్కేచర్స్, క్లార్క్స్ వంటి ఇతర గ్లోబల్ టైటాన్స్‌తో వ్యూహాత్మక ఒప్పందాలున్నాయి. 2021లో మెట్రోని ఐపీవోకు వచ్చింది. రూ.28 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. వ్యాపార రంగంలో ఫరా మాలిక్ భాంజీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతోపాటు, పరిశ్రమ దిగ్గజాలకు సైతం స్ఫూర్తిగా ఉన్నారు.
800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
బరువు తగ్గేందుకు, ఫిట్‌గా ఉండేందుక చాలామంది పలు రకాల వ్యాయామాలు చేస్తుంటారు. కొందరు ఏరోబిక్, సైక్లింగ్, కార్డియో వర్కౌట్లు, యోగా వంటివి చేస్తుంటారు. ఎవరికి వెసులుబాటుగా ఉండేవి వారు ఎంచుకుని మరీ క్రమతప్పకుండా చేస్తుంటారు. మరికొందరూ వేలు ఖర్చుపెట్టి మరీ ఫిట్నెస్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే కొన్ని రకాల అద్భుతమైన వ్యాయామాలు మన పూర్వీకాలం నుంచే ఉండేవి. ఐతే రాను రాను కొన్ని కనుమరుగయ్యిపోగా, మరికొన్నింటిని మనం గుర్తించకపోవడంతో తెలియకుండా పోయాయి. అలాంటి ఓ పురాతన వ్యాయామం తాజాగా వెలుగులోకి వచ్చింది. పైగా ఇది ఇప్పుడూ నెట్టింట తెగ ట్రెండింగ్‌గా మారింది. ఏంటా వ్యాయామం అంటే..చైనాకి సంబంధించిన 800 ఏళ్ల నాటి పురాతన వ్యాయామం ఇది. దీన్ని'బడువాంజిన్' అని పిలుస్తారు. ఈ వ్యాయామాన్ని సాధారణంగా వృద్ధులు ఎక్కువగా చేస్తుంటారు. అలాంటి వ్యాయామాన్ని ఇప్పుడు చైనా యువత ఆశ్రయిచడం విశేషం. దీన్ని వారు తమ రోజువారి దినచర్యలో భాగంగా చేసుకుని మరీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది తమ మాసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచి, అలసటను, ఒత్తిడిని దూరం చేస్తోందని చెబుతున్నారు. నిజానికి ఈ వ్యాయామం 960-1279ల నాటి సాంగ్ రాజవంశం కాలం నాటిది. చైనా ఆరోగ్యం అండ్ ఫిట్నెస్లకు సంబంధించిన పురాతన వ్యాయామాల్లో ఇది ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. ఇది ఎనిమిది ఆసనాలతో కూడిన వ్యాయామం. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన వ్యాయామాలకు అనుగుణంగా చేస్తుండాలి. అందువల్ల మనకు ఇది ఒకరకంగా ధ్యానం చేసినట్లుగా ఉండటమే గాక శరీరం శక్తిని, రక్తపోటుని నియంత్రించే చక్కటి శరీర సాగతీతలు ఉంటాయి. చైనాలోని షెన్జెన్, షాంఘై, బీజింగ్, గ్వాంగ్జౌ వంటి నగరాల్లో యువత దాదాపు 49 గంటలు పనిచేస్తారు. దీంతో యువత తీవ్రమైన అలసటకు, ఒత్తిడికి లోనవ్వడం జరుగుతుంది. అందువల్లే వారంతా ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఇప్పుడూ ఈ వ్యాయామాన్నే ఆశ్రయిస్తున్నారు. గతేడాది జర్మన్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ పమేలా రీఫ్ బడువాన్జిన్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే ఈ వీడియోకి ఒక్కసారిగా మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. పైగా ఈ వ్యాయామం నెట్టింట తెగ ట్రెండింగ్‌గా మారింది. అంతేగాదు నెటిజన్లు మెడనొప్పితో బాధపడుత్ను వారికి ఈ వ్యాయామం అద్భుతంగా పనిచేస్తుందని, నిద్రనాణ్యత మెరుగుపడి రిఫ్రెష్‌గా ఉంటారని చెబుతున్నారు. Agréablement surpris par @PamelaReifYT qui pratique aussi le Baduanjin (Huit pièces de brocart), vieille gymnastique chinoise qui fait du bien à la santé. Programme sportif du weekend de plus en plus varié alors🤭 pic.twitter.com/zidpZ9dtOz— Yi Lien (@YiLien000) August 27, 2023 (చదవండి: ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!)
ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!
ఇంతవరకు అవయవ మార్పిడులకు సంబంధించి..గుండె, కళ్లు, చేతులు, కిడ్నీ వంటి ట్రాన్స్ప్లాంటేషన్లు గురించి విన్నాం. ఇటీవల జంతువుల అయవాలను మనుషులకు మార్పిడి చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా చూశాం. అవి విజయవంతం కాకపోయినా..అవయవాల కొరతను నివారించే దృష్ట్యా వైద్యులు సాగిస్తున్న ప్రయాత్నాలే అవి. ఐతే తాజాగా ఓ మెడికల్ స్టార్టప్ కంపెనీ తొలిసారిగా తల మార్పిడి శస్త్ర చికిత్సను అభివృద్ధిపరిచే లక్ష్యాన్ని చేపట్టింది. ఇది సఫలం అయితే చికిత్సే లేని వ్యాధులతో పోరాడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించగలుగుతాం. ఇంతకీ ఏంటా వైద్య విధానం అంటే..యూఎస్‌లోని బ్రెయిన్‌బ్రిడ్జ్, న్యూరోసైన్స్, బయో మెడికల్ ఇంజనీరింగ్ స్టార్టప్ ప్రపంచంలోనే తొలిసారిగా తల మార్పిడి వ్యవస్థను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. ఐతే ఈ కంపెనీ ఇంతవరకు రహస్యంగా ఈ ప్రయోగాలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడూ ప్రపంచం తాము చేస్తున్న ఈ సరికొత్త వైద్య గురించి మరింతగా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో బహిర్గతం చేసింది. ముఖ్యంగా చికిత్స చేయలేని స్థితిలో.. స్టేజ్ 4లో ఉన్న కేన్సర్, పక్షవాతం, అల్జీమర్స్ , పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజనరేటివ్ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించడమే లక్ష్యంగా ఈ ప్రయోగానికి నాంది పలికినట్లు బ్రెయిన్ బ్రిడ్జ్ స్టార్టప్ పేర్కొంది. చిత్త వైకల్యంతో బాధపడుతున్న రోగి తలను ఆరోగ్యకరమైన బ్రెయిన్‌డెడ్ డోనర్ బాడీతో మార్పిడి చేయడం వంటివి ఈ సరికొత్త వైద్య విధాన ప్రక్రియలో ఉంటుంది. అందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తించింది.ఈ వీడియోలో రెండు రోబోటిక్ బాడీలపై ఏకకాలంలో శస్త్ర చికిత్స చేస్తున్న రెండు స్వయం ప్రతిపత్త రోబోలు కనిపిస్తాయి. ఇక్కడ ఒకరి నుంచి తలను తీసి మరో రోబోటిక్ శరీరంలోకి మార్పిడి చేస్తారు. ఇది చూడటానికి హాలీవుడ్ రేంజ్ సన్నివేశంలా అనిపిస్తుంది. ఇలాంటి అత్యధునిక శస్త్రచికిత్సపైనే న్యూరబుల్, ఎమోటివ్, కెర్నల్ అండ్ నెక్ట్స్ మైండ్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ వంటి కంపెనీలు కూడా వర్క్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెయిన్బ్రిడ్జ్లోని ప్రాజెక్ట్ లీడ్ హషేమ్ అల్-ఘైలీ మాట్లాడుతూ..తాము మెదడు కణాల క్షీణతను నివారించేలా అతుకులు లేకుండా తల మార్పిడి చేసేందుకు హైస్పీడ్ రోబోటిక్ సిస్టమ్‌ను వినియోగించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఉన్న అధునాతన ఏఐ అల్గారిథమ్‌లు శస్త్ర చికిత్సలో నరాలు, రక్తనాళాల తోపాటు వెన్నుపాముని కచ్చితంగా తిరిగి కనెక్ట్ చేయడంలో రోబోలకు మార్గనిర్దేశం చేస్తాయని అల్ ఘైలీ చెప్పారు. తాము ఈ కాన్సెప్ట్‌ని విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా రూపొందించమని తెలిపారు.ఇది వైద్య సరిహద్దులను చెరిపేసేలా.. ప్రాణాంతక పరిస్థితులతో పోరాడుతున్న వారికి ప్రాణాలను రక్షించేలా వినూత్న పరిష్కారాలను అందిచగలదని చెప్పారు. 🤖 BrainBridge, the first head transplant system, uses robotics and AI for head and face transplants, offering hope to those with severe conditions like stage-4 cancer and neurodegenerative diseases… pic.twitter.com/7qBYtdlVOo— Tansu Yegen (@TansuYegen) May 21, 2024 (చదవండి: వడదెబ్బకు గురైన నటుడు షారూఖ్! దీని బారిన పడకూడదంటే..!)
న్యూస్ పాడ్‌కాస్ట్
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు... ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
విపక్షాలది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి.. ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం
దక్షిణాదిలో బీజేపీకే అత్యధిక లోక్‌సభ సీట్లు... ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ విశ్వాసం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
ఫోన్ తీయనందుకే అంజలి హత్య
హుబ్లీ: నగరంలోని వీరాపుర ఓణిలో ఈ నెల 14వ తేదీ తెల్లవారు జామున జరిగిన అంజలి అంబిగేర హత్య కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ బృందం ఎదుట నిందితుడు నిజాలను చెప్పినట్లుగా తెలుస్తోంది. నిందితుడు గిరీష్ తాను మొదట అంజలిని మైసూరుకు రమ్మని పిలిచాను. అయితే ఆమె రాలేదు. హత్య చేయడానికి ముందు రోజు అంజలికి రూ.1000 ఫోన్ పే చేశాను. డబ్బులు పంపాక ఆమె తన ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేసింది. ఈ కారణంతోనే కోపం తట్టుకోలేక హత్య చేసినట్లుగా నిందితుడు గిరీష్ అలియాస్ విశ్వ సీఐడీ అధికారుల వద్ద విచారణ సందర్భంగా నోరు విప్పాడు. కాగా గత ఏప్రిల్ 18న విద్యార్థిని నేహా హిరేమఠ హత్య చేసిన మాదిరిగానే అంజలి హత్య కూడా జరిగిన సంగతి తెలిసిందే. కాగా అంతకు ముందు నిందితుడు అంజలిని నేహా మాదిరిగానే చంపుతానని బెదిరించేవాడని అంజలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంగట్లో అమ్మకానికి ఆడ శిశువు
మేడిపల్లి: ముక్కు పచ్చలారని మూడు నెలల పసికందును అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకునేందుకు యతి్నంచిన అమానవీయ ఘటన పీర్జాదిగూడలో బుధవారం కలకలం రేపింది. మూడు నెలల ఆడ శిశువును విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మేడిపల్లి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామకృష్ణా నగర్ కాలనీలో ఐతె శోభారాణి ఆర్ఎంపీగా పని చేస్తూ ప్రథమ చికిత్స కేంద్రాన్ని నిర్వహిస్తోంది. కొంత కాలంగా ఉప్పల్ ఆదర్శనగర్ కాలనీకి చెందిన చింత స్వప్న, రామకృష్ణా నగర్ కాలనీకి చెందిన షేక్ సలీం పాషాతో కలిసి నగరంతో పాటు విజయవాడ తదితర ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు చెందిన చిన్నారుల ఆచూకీ తెలుకుంటున్నారు. ఆయా కుటుంబాలకు డబ్బుల ఆశ చూపిస్తున్నారు. కొంత మొత్తం ముట్టజెప్పి వారి పిల్లలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన కొందరు మహిళలు తెలుసుకున్నారు. తమకు పిల్లలు లేరని పెంచుకోవడానికి ఆడపిల్ల కావాలని శోభారాణిని సంప్రదించారు. మూడునెలల పసికందును రూ.4.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ముందుగా రూ.10 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చి మిగతా డబ్బులు పాపను తీసుకున్న తర్వాత ఇస్తామని చెప్పారు. బుధవారం మధా్నహ్నం విజయవాడ నుంచి తీసుకు వచి్చన మూడు నెలల ఆడ శిశువును శోభారాణి, స్వప్న, సలీం పాషా స్వచ్ఛంద సంస్థ మహిళలకు చూపించారు. ఈ విషయాన్ని వెంటనే వారు మేడిపల్లి పోలీసులకు చేరవేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆర్ఎంపీ శోభారాణి, ఆమెకు సహకరించిన స్వప్న, సలీంలను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని శిశు విహార్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.
Bolarum Cantonment Hospital: బోర్డుదే బాధ్యత
రసూల్‌పురా: బొల్లారం కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిలో ఆవరణలో చెట్టు కూలి మృతి చెందిన తూంకుంట నివాసి రవీందర్ కుటుంబానికి కంటోన్మెంట్ బోర్డు అధికారులు న్యాయం చేయాలని కోరుతూ బంధువులు, కుటుంబ సభ్యులు బుధవారం ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఎండిన చెట్టు తొలగించడంలో బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం బలైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయ పడిన రవీందర్ సతీమణి సరళాదేవి ఆస్పత్రి ఆవరణలో అంబులెన్స్‌లోనే ఉండి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తిరుమలగిరి మండల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మద్దతు పలికి ఆందోళనలో పాల్గొన్నారు. దీనిపై సమాచారం అందుకున్న బోర్డు సీఈవో మధుకర్ నాయక్ తమ తరపున ప్రతినిధులుగా వాటర్‌వర్క్స్ సూపరిటెండెంట్ రాజ్‌కుమార్, నర్సింగ్ రావు, యాని, రమణ, రాములును ఆస్పత్రికి పంపించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ బోర్డు అధికారులు ఘటనకు బాధ్యత వహించి రవీందర్ ఇద్దరు కుమార్తెలకు న్యాయం చేయాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యంవల్లే రవీందర్ మృతి చెందాడని ఆరోపించారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని ఆస్పత్రి ముందు, మీటింగ్ హాల్లో, సూపరింటెండెంట్ రామకృష్ణ వద్ద నాలుగు గంటల పాటు నిరసనకు దిగారు. ఒక దశలో ఉపాధ్యాయులు అధికారి రాజ్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగారు. అధికారుల హామీతో ఆందోళన విరమణ ఈ విషయంలో నిర్ణయం తీసుకునే వీలు తమకు లేదని, బోర్డు పాలకమండలి సమావేశంలో చర్చించి రవీందర్ కుటుంబానికి, వారి ఇద్దరు కుమార్తెలకు న్యాయం చేసేందుకు తగిన నిర్ణయం తీసుకుంటామని వాటర్‌వర్క్స్ అధికారి రాజ్‌కుమార్ హామీచ్చారు. అదే విధంగా తీవ్రంగా గాయపడిన సరళాదేవికి కిమ్స్ హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందజేస్తామని, ఆ ఖర్చు మొత్తం బోర్డు భరిస్తుందని, బొల్లారం హస్పిటల్ నుంచి ఓ డాక్టర్‌ను కిమ్స్ ఆసుపత్రికి సరళాదేవితో పంపిస్తామని అధికారులు హామీచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.
అయినవాళ్లు సహకరిస్తలేరని.. తల్లీకూతుళ్ల విషాదం!
మహబూబ్‌నగర్: వారసత్వ భూమి విక్రయించగా వచ్చిన డబ్బుల్లో వాటా ఇచ్చి.. తమ బిడ్డ పెళ్లి, కుమారుడి చదువుకు సహకరించాలని అయిన వాళ్లను ప్రాధేయపడినా పట్టించుకోకపోవడంతో ఓ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. కూతురితో సహా భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డారు. మొదట తల్లీకూతురు పురుగు మందు తాగగా.. తండ్రి భయపడి మిన్నంకుండిపోయాడు.విషయం తెలుసుకున్న స్థానికులు తల్లీకూతురిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే కన్నుమూసిన విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఏ బూడిదపాడు గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. ఏ బూడిదపాడుకు చెందిన మాల హరన్నకు నలుగురు కుమారులు ఉండగా.. ఎకరా పట్టా పొలం, 30 గుంటల అసైన్డ్ (సీలింగ్) పొలాన్ని అన్నదమ్ముళ్లకు పంచారు.పట్టా పొలం రెండవ, మూడవ కుమారుడికి పంపకాల్లో రాగా.. పెద్ద కుమారుడైన నర్సింహులు, చిన్న కుమారుడికి 30 గుంటల సీలింగ్ భూమి వచ్చింది. కొన్నేళ్ల కిందట ఇద్దరు అన్నదమ్ములు పట్టా పొలాన్ని అమ్ముకున్నారు. సీలింగ్ పొలాన్ని ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో నర్సింహులు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కూతురి పెళ్లి, కుమారుడి చదువు వారికి భారంగా మారింది. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందులు తోడయ్యాయి. దీంతో అమ్మిన పట్టా పొలం డబ్బులను అందరికీ సమానంగా పంచాలని అన్నదమ్ముళ్లతో గొడవ పెట్టుకోవడంతోపాటు పెద్దలను ఆశ్రయించారు.తన బిడ్డ పెళ్లి, కుమారుడి చదువు కోసం డబ్బులు అవసరమని.. పట్టా పొలంలో తనకూ వాటా ఇవ్వాలని ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో నర్సింహులు, అతడి భార్య వరలక్ష్మి (39), కూతురు అనురాధ(18) పురుగు మందు తాగి, చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో మొదట వరలక్ష్మి, ఆమె కూతురు పురుగు మందు తాగారు. నరసింహులు పురుగుల మందు తాగడానికి భయపడి విరమించుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు.. తల్లీకూతురిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.కళ్ల ముందే భార్య, కూతురు చనిపోవడంతో నర్సింహులు కుప్పకూలిపోయాడు. తల్లీ కూతురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు శాంతినగర్ ఏఎస్ఐ అయ్యన్న తెలిపారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.