Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Elections 2024: May 15th Politics Latest News Updates Telugu
May 15th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 15th AP Elections 2024 News Political Updates8:51 AM, May 15th, 2024ఏలూరులోనూ టీడీపీ దౌర్జన్యకాండఏలూరు చేపల తూము సెంటర్ 40 డివిజన్ లో రెచ్చిపోయిన టీడీపీ మూకలువైఎస్ఆర్సిపి కార్యకర్తలపై కత్తులతో దాడిగణేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలుపోలింగ్ కేంద్రాల వద్ద ఇరువర్గాల మధ్య చెలరేగిన గొడవ.. తాజా కొట్లాటకు దారి తీసిన వైనంగాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అర్ధరాత్రి టెన్షన్ వాతావరణంప్రభుత్వ ఆసుపత్రి వద్ద మళ్లీ దాడిరంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులుకొనసాగుతున్న పోలీస్‌ పహారా 8:25 AM, May 15th, 2024కడపలో అభ్యర్థులకు హైసెక్యూరిటీవైయస్సార్ జిల్లా జమ్మలమడుగులో కొనసాగుతున్న 144 సెక్షన్పట్టణంలో జనాలు ఎక్కువగా గుమికూడి ఉండకూడదంటూ పోలీసుల ఆదేశాలువైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డితో పాటు కూటమి అభ్యర్ది ఆదినారాయణ రెడ్డి, కడప టిడిపి ఎంపీ అభ్యర్ది భూపేష్ రెడ్డి లకు 2+2 నుండి 4+4 భద్రత పెంపు7:59 AM, May 15th, 2024ఏపీలో పోలింగ్‌ శాతం మొత్తంగా ఇలా.. ఏపీలో మొత్తంగా 81.69 శాతం పోలింగ్ నమోదు.ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ నమోదు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతం నమోదు.అల్లూరి : 70.20అనకాపల్లి : 83.84అనంతపురం : 81.08అన్నమయ్య : 77.83బాపట్ల : 85.15చిత్తూరు : 87.09కోనసీమ : 83.84తూ.గో : 80.93ఏలూరు : 83.67గుంటూరు : 78.81కాకినాడ: 80.31కృష్ణా: 84.05కర్నూలు : 76.42నంద్యాల: 82.09ఎన్టీఆర్: 79.36పల్నాడు : 85.65పార్వతిపురం మన్యం : 77.10ప్రకాశం : 87.09నెల్లూరు : 79.63సత్యసాయి : 84.63శ్రీకాకుళం : 75.59తిరుపతి : 78.63విశాఖ : 68.63విజయనగరం : 81.33ప.గో : 82.59కడప : 79.58 7:45 AM, May 15th, 2024టీడీపీ నేతల దాడులు..పల్నాడు జిల్లామాచవరం గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ గుండాలు దాడి.మాచవరం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు చౌదరి సింగరయ్య పార్టీ నాయకుడు దారం లక్ష్మీ రెడ్డిపై టీడీపీ నాయకుల దాడి.ఇద్దరి కాళ్లు, చేతులపై దాడి. గాయపడిని వారిని స్థానిక ఆసుపత్రికి తరలింపు. 7:20 AM, May 15th, 2024శాంతి భద్రతలకు సహకరిస్తాం: కేతిరెడ్డి పెద్దారెడ్డిఅనంతపురం:ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్‌..టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాంతాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమన్వయంతో ఉండాలిశాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తాం. 7:00 AM, May 15th, 2024తాడిపత్రిలో ఉద్రిక్తతలు..అనంతపురం:తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాల మోహరింపుతాడిపత్రిలో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన జేసీ వర్గీయులుఅల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులుపోలీసుల విజ్ఞప్తితో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితాడిపత్రిని వీడిన టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో పరిస్థితి ని అదుపులోకి తెచ్చిన పోలీసులునగరంలో 144 సెక్షన్ కొనసాగింపు 6:45 AM, May 15th, 2024డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్ టీడీపీ దౌర్జన్యకారుల మీద చర్యలకు డిమాండ్ఏపీ డీజీపీ హరీష్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన వనిత. చంద్రగిరి, గురజాల, తాడిపత్రి, గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తల హింసాకాండ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని వనిత సీరియస్‌. దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు. 6:30 AM, May 15th, 2024విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్‌ గాలి బ్రహ్మాండంగా వీచింది: బొత్సఅన్ని ప్రాంతాల్లోని ఫ్యాన్‌ గాలి కనిపించిందిమహిళలు, పెద్ద ఎత్తున బారులు తీరి ఓటింగ్‌లో పాల్గొన్నారుతమకు గౌరవం పెరిగిందని వృద్దులు భావించి ఓటు వేశారు.ఎన్నికల్లో టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నిందిప్రజలు సంక్షేమ పథకాలను అడ్డుకుంది.ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయివైఎస్‌ .జగన్‌ గెలుస్తారు.. వైజాగ్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారుఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నెరవేర్చుతారుమాయ మాటలను ప్రలోభాలను ప్రజలు నమ్మలేదునేను రాజీనామా చేస్తున్నట్లు ఒక మాయ లేఖ సృష్టించిందిఈ లేఖ కూటమి దిగజారుడు రాజకీయాలకు ఒక పరాకాష్టమాయ మాటలతో అధికారంలోకి రావాలని చంద్రబాబు చూశారుచంద్రబాబు మాయ మాటలు ప్రజలు అందరికి తెలుసుమాట ఇస్తే మడమ తిప్పని నేతలు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్సీఎం జగన్ మీద నమ్మకంతో మళ్ళీ ప్రజలు ఓట్లు వేశారుటీడీపీ నేతలు సహనం కోల్పోయారుమా నాయకులు, కార్యకర్తలు ఉద్రేకపడొద్దని సూచన చేశాంఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు

AP Elections 2024: TDP Attacks YSRCP Cadre May 15 News Updates
టీడీపీ రాక్షస మూకల రక్తదాహం

హైదరాబాద్‌, సాక్షి: పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా తెలుగు దేశం పార్టీ రాక్షస మూకల రక్తదాహం తీరలేదు. మంగళవారం రెండో రోజూ రాష్ట్రంలో అనేక చోట్ల తీవ్ర స్థాయిలో హింసాకాండకు, విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులకు దిగారు. బుధవారం కూడా బీతావాహ వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు, తాడిపత్రి లాంటి చోట్ల తెలుగు దేశం ముఖ్య నేతలను ముందుండి.. తమ శ్రేణులను, అరాచక మూకలను రెచ్చగొడుతూ దాడులు చేయించి, బీభత్సం సృష్టించారు. ఎన్నికల్లో తమకు ఓటేయలేదన్న కక్షతో.. దొరికినవారిని దొరికినట్లుగా తీవ్రంగా కొట్టారు. రక్తాలు కారేలా గాయపరిచారు. ఆస్తులు ధ్వంసం చేశారు.టీడీపీ మూకలు పేట్రేగిపోవడంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో పాటు, స్థానిక ప్రజలూ భీతావహులయ్యారు. అంత విధ్వంసం జరుగుతుంటే... వారిని అడ్డుకోవడంలోనూ పోలీస్‌ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది.కాళ్లు చేతులు నరికేశారు!పల్నాడు మాచవరంలో టీడీపీ శ్రేణులు కత్తులతో విచక్షణా రహితంగా దాడులు చేశాయి. వైఎస్సార్‌సీపీ నేతలు సింగరయ్య, లక్ష్మీరెడ్డి కాళ్లు చేతులు నరికేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.తాడిపత్రిలోనూ ఉద్రిక్తతలుతాడిపత్రి లో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలు. జేసీ వర్గీయులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసుల విజ్ఞప్తి తో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. మరోవైపు పోలీసుల ఆదేశాల మేరకు.. టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం తాడిపత్రి వదిలి బయటకు వెళ్లారు. తాడిపత్రి లో 144 సెక్షన్ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. జేసీ దౌర్జన్యాల్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాంతాడిపత్రి ఉద్రిక్తతలకు కారణమైన జేసీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబంపై పెద్దారెడ్డి మండిపడ్డారు. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని, తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంయమనం పాటించలని పిలుపు ఇచ్చారు. అలాగే.. నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరిస్తామని తెలిపారాయన.పల్నాడులో 144పోలింగ్‌ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు కొనసాగుతుండడం.. విమర్శలు వెల్లువెత్తడంతో అధికార యంత్రాంగం కదిలింది. పల్నాడు వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలుకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్‌ పోలీసు శాఖకు ఉత్తర్వులిచ్చారు. నరసరావుపేట లోక్‌సభ స్థానంతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమికూడొద్దని, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు.

road accident at chilakaluripet palnadu district
పల్నాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం

పల్నాడు: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరి పేట-పర్చూరు జాతీయరహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట ఈవూరవారిపాలెంలో జరిగిన ఈ ప్రమాదంలో ట్రవెల్స్‌ బస్సును టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు, టిప్పర్‌ పూర్తిగా తగలబడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌, టిప్పర్‌ డ్రైవర్‌, నాలుగురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. 32 మందికి గాయాలు అయ్యాయి. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి ఉంది. గాయపడి వారిని గుంటూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.చినగంజాం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు బాపట్ల జిల్లా చినగంజాం మండలం నీలాయపాలెం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఎన్నికలలో ఓటువేసి తిరిగి హైదరాబాదు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రమాద ఘటన సమాచారాన్ని 108, పోలీసులకు చేరవేయటంతో వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. బైపాస్‌ పనులు జరుగుతుండటం.. తారురోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవటం వల్ల టిప్పర్‌ వేగంగా దుసుకువచ్చింది. టిప్పర్‌ డ్రైవర్‌ వేగాన్ని కంట్రోల్‌ చేయకపోవటమే ప్రమాదానికి కారమైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.మృతుల వివరాలు..అంజి (35) డ్రైవర్, చీరాల, బాపట్ల జిల్లాఉప్పుగుండూరు కాశీ (65), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లాఉప్పుగుండూరు లక్ష్మి (55), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లాముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ (8), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా

Daily Horoscope: Rasi Phalalu 15-05-2024 In Telugu
Today Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.సప్తమి ఉ.5.56 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: ఆశ్లేష సా.4.58 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.11.31 నుండి 12.19 వరకు, అమృతఘడియలు: ప.3.12 నుండి 4.55 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.32, సూర్యాస్తమయం: 6.19. మేషం: వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.వృషభం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.మిథునం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆలయదర్శనాలు.కర్కాటకం: వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం. విలువైన వస్తువులు సేకరిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనయోగం.సింహం: చేపట్టిన కార్యక్రమాలు మందగిస్తాయి. వ్యయప్రయాసలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.కన్య: ఆకస్మిక ధనలాభం. పనులు సజావుగా సాగుతాయి. బం«ధువుల కలయిక. విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి..తుల: కొత్త పనులు ప్రారంభం. శుభవార్తలు. దైవదర్శనాలు. విందువినోదాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.వృశ్చికం: ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.ధనుస్సు: .బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.మకరం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కుటుంబసభ్యులతో వివాదాల పరిష్కారం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.కుంభం: పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం. నూతన ఉద్యోగయోగం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకం.మీనం: పనులు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి.

KSR Comment On AP Elections After Poling
వైఎస్సార్‌సీపీలో ఉన్నంత కాన్ఫిడెన్స్‌.. కూటమిలో లేదు!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఘట్టం ముగియడంతో సర్వత్రా ఎవరు గెలుస్తారన్నదే చర్చగా సాగుతోంది. ఈ ఎన్నికలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రంగా జరిగిన ఎన్నికలు కావడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికలలో జగన్ విజయం సాధిస్తే అది దేశానికి ఒక మోడల్ అవుతుంది.జగన్ తీసుకువచ్చిన పలు వ్యవస్థలను దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి వివిధ రాష్ట్రాలు ముందుకు వస్తాయి.జగన్‌ను ఒంటరిగా ఓడించలేమన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కాళ్లావేళ్ల పడి జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుంది. అయినా ఎంతవరకు ప్రయోజనం కలిగిందన్నది ప్రశ్నార్దకమే. మూడు పార్టీల కూటమి కావడంతో బలం పెరిగిందని,తెలుగుదేశం పార్టీ నౌ ఆర్ నెవర్ అన్న చందంగా పని చేసిందని, ఆ పార్టీకి జీవన్మరణ సమస్య కావడంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు తమను తాము భ్రష్టు పట్టించుకుంటూ కూడా అబద్దాలు ప్రచారం చేశాయని, వాటన్నిటి పలితంగా గెలిచే అవకాశం లేకపోలేదన్నది ఆ పార్టీవారి భావనగా ఉంది.అయినా వైఎస్సార్‌సీపీలో కాన్ఫిడెన్స్ తెలుగుదేశం కూటమిలో కనిపించడం లేదన్నది సత్యం.. నిజంగానే టీడీపీ కూటమి గెలుస్తుందన్న నమ్మకం కలిగి ఉంటే ,ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అదే తరహాలో కూటమి గెలుపు ఖాయం అన్న శీర్షిక బ్యానర్‌ ఇచ్చేవని, అలా చేయకపోవడం కూడా టీడీపీ ఓటమికి ఒక సంకేతం అన్న విశ్లేషణ వస్తోంది.నిజానికి ఈనాడుకు ఉన్న నెట్ వర్క్ రీత్యా, సోమవారం సాయంత్రానికి జనాభిప్రాయ సేకరణ పూర్తి చేసి వాస్తవ పరిస్థితిని ఇచ్చి ఉండవచ్చు. అలా చేయలేదంటే వారికి కూటమి విజయంపై సందేహం కలిగి ఉండవచ్చని కొందరు అంటున్నారు. ఒకవేళ మంగళవారం ఏమైనా ఇస్తారేమో తెలియదు. కాని కేవలం టీడీపీ వర్గాల ధీమా పేరుతోనే కథనాలు ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వ పనితీరుకు ఒక రిఫరెండంగా పరిగణించే ఈ ఎన్నికలలో మహిళలు ,వివిధ సంక్షేమ పధకాల లబ్దిదారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమన్నది ఆయా వర్గాలలో వినిపిస్తున్నమాట.ఓవరాల్‌గా చూసినప్పుడు అత్యధికులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తుందనే విశ్వసిస్తున్నారు. దీనికి కొన్ని కారణాలు బలీయంగా కనిపిస్తున్నాయి. అవేమిటో చూద్దాం. టీడీపీ కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ, జనసేనలు కలిసి 31 నియో.జకవర్గాలలో పోటీచేశాయి. వారికి ఉన్న బలాబలాల రీత్యా, టీడీపీ నుంచి వచ్చే ఓట్ల బదలాయింపు వంటి అంశాల కారణంగా ఈ రెండు పార్టీలు కలిసి ఐదు నుంచి పది సీట్లు మాత్రమే గెలవవచ్చన్నది ఒక అంచనా. ఈ లెక్కన వైఎస్సార్‌సీపీ ఇరవై సీట్లను సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యత ఉంది.గత ఎన్నికలలో సైతం 52 సీట్లకు గాను నలభై తొమ్మిదింటిని వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. 2024 ఎన్నికలలో సైతం వైఎస్సార్‌సీపీ వేవ్ రాయలసీమ అంతటా ఉంది. అయినప్పటికీ కొన్ని సీట్లు తగ్గుతాయని అనుకున్నా, మినిమమ్ ముప్పై ఐదు నుంచి నలభై సీట్లు రావచ్చని అంతా అంగీకరిస్తున్నారు. అంటే ఇప్పటికి ఏభై సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుచుకున్నట్లు లెక్క అవుతుంది. ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ బలం బాగా ఉంది.అక్కడ ఉన్న ముప్పై నాలుగు సీట్లలో కనీసం పదిహేడు నుంచి ఇరవై సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుచుకోవచ్చు. అదే జరిగితే ఇక్కడికి డెబ్బై సీట్లు గెలిచినట్లు అవుతుంది. ఇక ఇరవై సీట్లు తెచ్చుకుంటే వైఎస్సార్‌సీపీ గెలిచినట్లే అవుతుంది.టీడీపీ పొత్తు పెట్టుకున్న కారణంగా ముస్లిం మైనార్టీలు కూటమికి దూరం అయ్యారు. వారు కనీసం నలభై నుంచి ఏభై నియోజకవర్గాలలో ప్రభావం చూపవచ్చు. ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని బీజేపీ చేసిన ప్రకటన కూడా ముస్లింలలో ఆగ్రహానికి కారణం అయింది. ఈ నేపధ్యంలో రాయలసీమలో అధిక శాతం ఉన్న ముస్లింలు వైఎస్సార్‌సీపీవైపు మొగ్గు చూపుతున్నారు. కోస్తా ఆంధ్రలో సైతం అదే పరిస్తితి ఉంది. నెల్లూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఉన్న ఆరు జిల్లాలలో నలభై సీట్లు రావడం కష్టం కాదు. అంటే ఈ లెక్కన కనీసం 110 సీట్లు వైఎస్సార్‌సీపీకి రావడం ,తిరిగి జగన్ ముఖ్యమంత్రి కావడం తధ్యం అనిపిస్తుంది. 2014లో ఉన్న కూటమి పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడు నరేంద్ర మోదీ హవా బాగా పనిచేసింది.అలాగే అప్పుడే పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని పెట్టడం, కాపు వర్గాన్ని బాగా ఆకర్షించడం కారణంగా టీడీపీ అధికారంలోకి రాగలిగింది.ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ మూడు పార్టీలు 2019 ఎన్నికల సమయంలో ఒకదానిని ఒకటి తిట్టుకున్నాయి. విమర్శించుకున్నాయి. బీజేపీతో పొత్తు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని తమ అవసరాలకు వాడుకోవడం, ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడం కోసమేనన్న సంగతి అందరికి అర్దం అయింది. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు దాదాపు నెరవేర్చడం , ఆయన ఒంటరిగా ధైర్యంగా ఎన్నికల గోదాలోకి దిగడం, ఒక సిస్టమాటిక్ గా సభలు నిర్వహించడం , ఆచరణ సాధ్యమైన హామీలనే ఇవ్వడం వంటి కారణాల వల్ల ప్రజలలో ఆయన పట్ల ఒక నమ్మకం కుదిరింది. ప్రత్యేకించి పేద, బలహీనవర్గాలలో అది బాగా ప్రస్పుటంగా కనిపించింది. సామాజికంగా కూడా జగన్ పలు ప్రయోగాలు చేసి బిసిలకు ఎక్కువ సీట్లు ఇవ్వగలిగారు.అది కూడా ప్లస్ పాయింట్ గా ఉంది. జగన్ ఎక్కువగా పాజిటివ్ ఓటుపై ఆధారపడితే విపక్ష కూటమి నెగిటివ్ ఓటుపైనే ఆధారపడింది. వారి మానిఫెస్టోని ఎవరూ విశ్వసించడం లేదు. తెలుగుదేశం కు ఓటు వేయాలని అనుకున్నవారు సైతం ఆ ఎన్నికల ప్రణాళిక అయ్యేది కాదని తెలిసినా, ఇతర కారణాల రీత్యానే ఓట్లు వేశారు.గతంలో జగన్ ఈ స్కీములను అమలు చేస్తుంటే శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేసిన చంద్రబాబు తన మానిఫెస్టోలో అంతకు మించి రెండు,మూడు రెట్లు సంక్షేమ పధకాలు అమలు చేస్తామని అనడంతో జగన్ గ్రాఫ్ బాగా పెరిగింది. అబద్దాల ప్రచారాన్ని నమ్ముకుని టీడీపీ పనిచేసింది. లేని లాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల భూములను జగన్ లాక్కుంటారంటూ తప్పుడు ప్రచారం చేశారు. అసెంబ్లీలో టీడీపీ మద్దతు ఇచ్చిన బిల్లునే మాటమార్చి వ్యతిరేకిస్తోందని చెప్పడంలో వైఎస్సార్‌సీపీ చాలా వరకు సఫలం అయింది.అది కూడా టీడీపీకి నష్టం చేసిందని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రెడ్లు, అగ్రవర్ణాలలోని అధికశాతం పేదలు జగన్‌కు మద్దతు ఇస్తున్నారు. ఆ ప్రభావం పోలింగ్ పై స్పష్టంగా కనబడింది. ఈకాంబినేషన్ అలాగే కొనసాగితే జగన్ ను ఓడించడం అసాద్యం. 2019 లో ఇవే సామాజికవర్గాలు జగన్ కు భారీ ఎత్తున మద్దతు ఇచ్చాయి. అవి ఇప్పటికీ అలాగే కొనసాగుతుండడం జగన్‌కు కలిసి వచ్చే పాయింట్. తమ కోసం లక్షల మంది కార్లు వేసుకుని హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చారని టీడీపీ వాదిస్తోంది. కార్లలో వెళ్లినవారు పెత్తందార్లకు ప్రతినిధులుగా ఉంటే, బస్‌లు, ట్రైన్లలో వెళ్లినవారు పేద ప్రజలకు ప్రతినిదులగా చెప్పవచ్చు. ఆ రకంగా చూసుకున్నా, ఇలా వెళ్లినవారిలో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులే ఎక్కువగా కనిపిస్తారు. సామాజికవర్గాల సమీకరణ రీత్యా చూసినా, ప్రాంతాల వారీగా పరిశీలించినా, రాజకీయ కోణాలలో అద్యయనం చేసినా, ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీ కూటమి ప్రభుత్వమేనన్న అభిప్రాయం కలుగుతుంది. పోటీ బాగా టైట్‌గా సాగితే వైఎస్సార్‌సీపీకి కనీసం 100 నుంచి 110 సీట్లు వస్తాయి.అది వేవ్‌గా మారితే వైఎస్సార్‌సీపీ గత ఎన్నికల మాదిరి 150 వరకు రావడం కష్టం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

CM YS Jagan Tweet On AP Election Polling
ఏపీ పోలింగ్‌పై సీఎం జగన్‌ ట్వీట్‌

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఘట్టం ముగిసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఏపీలో ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అత్యధికంగా 80 శాతానికిపైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.తాజాగా ఏపీలో నమోదైన పోలింగ్‌, ఓటర్లను ఉద్ధేశిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. మండుటెండల్లోనూ తనకు ఓటువేసి ఆశీర్వదించేందుకు సునామీల తరలివచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు సాగిన పాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇచ్చారు.నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు… pic.twitter.com/RQcsHZqWEO— YS Jagan Mohan Reddy (@ysjagan) May 14, 2024

Mural painter Sneha Chakraborty on her journey as an NFT artist
ప్రాణమున్నగోడలు

బయటి గోడలు ఎలా ఉంటే ఏంటి అనుకుంటారు చాలామంది.అరె.. ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనేలా చేస్తుంది స్నేహ చక్రవర్తి. ఎత్తుగా ఉండే గోడలపై భారీ మ్యూరల్స్‌ గీయడం సవాలు.మహిళా ఆర్టిస్ట్‌గా ఆ సవాలును ఎదుర్కొంది స్నేహ.దేశంలో గొప్ప కుడ్య చిత్రకారిణిగా ఉన్నఆమె జీవన విశేషాలు.కూర్గ్‌ కాఫీ తోటల్లో పనిచేసే కార్మికులు, కొచ్చిలో చేపలు పట్టే బెస్తవారు, బెంగళూరులో ఇడ్లీ హోటల్‌ నడిపే ముసలామె, తమిళనాడులో తిరిగే జడలు గట్టిన సాధువులు, కష్టజీవులు, శ్రామిక మహిళలు... వీరిని భారీ బొమ్మలుగా ఎప్పుడైనా గోడల మీద చూశామా? స్నేహ చక్రవర్తి ‘మ్యూరల్స్‌’ (కుడ్య చిత్రాలు– గోడ బొమ్మలు) చూస్తే వీరే కనపడతారు. ‘దేశంలో ఎవరూ గమనించని జీవన ΄ోరాట యోధులు వీరంతా. వీళ్లను బొమ్మల్లో చూపడమే నా లక్ష్యం’ అంటుంది స్నేహ చక్రవర్తి. గత సంవత్సరం ఆమె ‘ట్రావెల్‌ అండ్‌ పెయింట్‌ ఇండియా’ పేరుతో భారత దేశ యాత్ర చేసింది. కూర్గ్‌తో మొదలెట్టి హిమాచల్‌ ప్రదేశ్‌ వరకూ అనేక రాష్ట్రాల్లో తిరుగుతూ గోడల మీద భారీ చిత్రాలు గీసింది. వాటిలో ప్రధాన అంశం సామాన్యులు, సామాన్య జీవనం... దానిలోని సౌందర్యం. ‘దేశమంటే వీళ్లే’ అంటుంది స్నేహ.సొంత ఊరు ఢిల్లీఢిల్లీలో పుట్టి పెరిగిన స్నేహ అక్కడ చదువు పూర్తి చేసింది. ఆమె తండ్రి ఇంజినీర్, తల్లి గృహిణి. ‘నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు చేతుల మీద మెహందీ వేసే ఒక మహిళ వచ్చింది. ఆమె వేసిన డిజైన్లు నన్ను ఆకర్షించాయి. ఆమె మా పక్కింటికి వెళితే అక్కడకు కూడా వెళ్లి ఆమె మెహందీ వేయడం చూశాను. మరుసటి రోజే అమ్మను అడిగి మెహందీ తెచ్చి ట్రై చేశాను. నాకు మెహందీ వేయడం వచ్చేసింది. ఎనిమిదేళ్లకు మా ఏరియాలో గిరాకీ ఉన్న మెహందీ ఆర్టిస్ట్‌ను అయ్యాను. అయితే కళ అన్నం పెట్టదు అనే భావనతో ఏదైనా పని చేయమని నన్ను మా తల్లిదండ్రులు కోరారు. వారి కోసమని ఒక ఎయిర్‌లైన్స్‌ సంస్థలో ఇంటీరియర్‌ డిజైనర్‌గా చేశారు. కాని ఇలా ఒకరి కింద పని చేయడం నాకు నచ్చలేదు. నా మనసు అక్కడ లేదు. నేను రంగుల కోసం పుట్టాను. రంగుల్లో మునుగుతాను. నా బొమ్మలు అందరూ చూడాలి. అంటే నేను మ్యూరలిస్ట్‌గా, స్ట్రీట్‌ ఆర్టిస్ట్‌గా పేరు గడించాలి. ఆ విషయం ఇంట్లో చెప్పి 2018 నుంచి మ్యూరలిస్ట్‌గా మారాను’ అని తెలిపింది స్నేహ చక్రవర్తి.జటిలమైన చిత్రకళకాన్వాస్‌ మీద బొమ్మ గీయడం వేరు... ఒక పెద్ద గోడను కాన్వాస్‌గా చేసుకోవడం వేరు. కాగితం మీద వేసుకున్న బొమ్మను పదింతలు ఇరవై యింతలు పెంచి గోడ మీద గీస్తారు. దొంతీలు కట్టుకుని గోడ మీద బొమ్మ వేస్తే మళ్లీ కిందకు దిగి దూరం నుంచి చూసుకుంటూ బొమ్మను అంచనా కడుతూ గీయాలి. సాధారణంగా మగవారు ఈ ఆర్ట్‌లో ప్రావీణ్యం సం΄ాదిస్తారు. మ్యూరలిస్ట్‌లుగా ఉన్న మహిళలు తక్కువ. వారిలో స్నేహ చక్రవర్తి పేరు పొందింది. పూణె, ముంబై స్లమ్స్‌లో ఆమె గీసిన బొమ్మలు ఆ మురికివాడలకు జీవం, ప్రాణం ΄ోశాయి. ‘అందమైన బొమ్మ ఉన్న గోడ దగ్గర ఎవరూ చెత్త వేయడానికి ఇష్టపడరు. ఉమ్మివేయరు’ అని చెప్పింది స్నేహ. స్త్రీలు– సందేశాలు‘నా మ్యూరల్స్‌తో స్త్రీల సాధికారతను చూపిస్తుంటాను. స్వేచ్ఛాభావనను చూపుతుంటాను. సరైన సందేశాలు కూడా ఇస్తుంటాను. ఒకసారి ఒక పెద్ద స్త్రీ బొమ్మ గీచి ఫర్‌ సేల్‌ ఫర్‌ సేల్‌ అని చాలాసార్లు ఆ స్త్రీ బొమ్మ చుట్టూ రాశాను. ΄ోర్నోగ్రఫీ వల్ల స్త్రీ దేహం అమ్మకానికి సులువుగా దొరుకుతుందన్న భావన పురుషులలో ఉంటుంది. అలాంటి భావజాలం ఎంత దుర్మార్గమైనదో తెలిసొచ్చేలా ఆ బొమ్మ గీశాను. దానికి మంచి స్పందన వచ్చింది. గోడలు లేని ప్రపంచం లేదు. అందుకే నేను ప్రపంచమంతా తిరిగి బొమ్మలు వేస్తాను. నా బొమ్మ ప్రతి దేశం గోడ మీద మన ప్రజలను, సంస్కృతిని చూ΄ాలన్నదే నా కోరిక’ అని తెలిపింది స్నేహ.

Shamita Shetty Hospital Video And Disease Details
టాలీవుడ్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్‌పై అలా

తెలుగు సినిమాలో హీరోయిన్‌గా‌ చేసిన ఓ బ్యూటీ.. అరుదైన వ్యాధి బారిన పడింది. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాధ భరించలేకపోతున్నానని అని చెబుతూ అసలు తనకు ఏమైంది? ఈ వ్యాధి సంగతేంటి? అనే విషయాల్ని చెప్పుకొచ్చింది. అలానే మహిళలకు ఇలాంటివి సాధారణంగా వస్తుంటాయని కూడా చెప్పింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? అసలేమైంది?(ఇదీ చదవండి: హీరోతో వివాదం.. ఫేస్ బుక్ లో సినిమా పెట్టేసిన డైరెక్టర్‌!)హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లి షమితా శెట్టి తెలుగులోనూ 'పిలిస్తే పలుకుతా' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైంది. కాకపోతే అక్కలా పెద్దగా పేరు అయితే తెచ్చుకోలేకపోయింది. అలాంటిది ఇ‍ప్పుడు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు బయటపెట్టింది. దీని గురించి హాస్పిటల్ బెడ్‌పై ఉంటూనే వివరంగా చెప్పుకొచ్చింది.'మహిళలకు వచ్చే సమస్యలో ఇది సర్వ సాధారణమైనది. గర్భాశయంలో చాలా నొప్పిగా అనిపిస్తుంది. అలాంటిదే నాకు ఇప్పుడు వచ్చింది. దాదాపు 40 శాతం మంది మహిళలు ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. కాకపోతే మనలో చాలామందికి దీని గురించి తెలియదు. గత కొన్నాళ్ల నుంచి నేను దీని వల్ల నొప్పితో ఇబ్బంది పడ్డాను. కానీ డాక్టర్లు ఈ సమస్యకు మూలం ఏంటో గుర్తించారు. గర్భాశయంలో వచ్చిన ఈ సమస్యకు సర్జరీ ద్వారా పరిష్కారం దొరికింది' అని షమితా శెట్టి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్‌కు, నా భర్తకు ఆల్‌రెడీ బ్రేకప్‌!)Did you know that almost 40 % of women suffer from Endometriosis.. and most of us are unaware of this disease!!! I want to thank both my dr s my gynac dr Neeta Warty and my Gp dr Sunita Banerjee for not stopping til they found out the root cause of my pain!🧿❤️ pic.twitter.com/T7dmTC2Cv4— Shamita Shetty 🦋 (@ShamitaShetty) May 14, 2024

OpenAI Co founder Ilya Sutskever Leaving Company
పదేళ్ల తర్వాత.. చాట్‌జీపీటీ కంపెనీ కోఫౌండర్‌ సంచలన నిర్ణయం!

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అగ్రగామిగా పేరొందిన ఓపెన్‌ఏఐ (OpenAI) సహ వ్యవస్థాపకుడు ఇల్యా సుట్స్‌కేవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని స్థాపించిన ఇన్నేళ్లకు సంస్థను వీడుతున్నట్లు తాజాగా ప్రకటించారు."దాదాపు ఒక దశాబ్దం తర్వాత, నేను ఓపెన్‌ఏఐ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నాను" అని సుట్స్‌కేవర్ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ఒక పోస్ట్‌లో చెప్పారు. ఇతర కోఫౌండర్లు సామ్‌ ఆల్ట్‌మన్‌, గ్రెగ్‌ బ్రాక్‌మన్‌, సీటీవో మిరా మురాతి, జాకబ్‌ పచోకీల నాయకత్వంలో కంపెనీ మరింత పురోగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే తాను మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు.ఓపెన్‌ఏఐ అనేది ఇటీవల చాలా పాపులర్ అయిన చాట్‌బాట్ ‘చాట్ జీపీటీ’ నిర్వహణ సంస్థ. మైక్రోసాఫ్ట్ మద్దతు గల ఈ కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ.. ఓపెన్‌ఏఐ కంపెనీ నేడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం సుట్స్‌కేవర్ అని, ఆయన లేకుంటే సంస్థ ఇలా ఉండేది కాదని పేర్కొన్నారు. జాకుబ్ పచోకీ కంపెనీకి కొత్త చీఫ్ సైంటిస్ట్ అవుతారని చెప్పారు. పచోకి గతంలో ఓపెన్‌ పరిశోధన డైరెక్టర్‌గా పనిచేశారు. GPT-4, ఓపెన్‌ఏఐ ఫైవ్ అభివృద్ధికి నాయకత్వం వహించారు.After almost a decade, I have made the decision to leave OpenAI. The company’s trajectory has been nothing short of miraculous, and I’m confident that OpenAI will build AGI that is both safe and beneficial under the leadership of @sama, @gdb, @miramurati and now, under the…— Ilya Sutskever (@ilyasut) May 14, 2024

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement