Top Stories
ప్రధాన వార్తలు
బదిలీలతో బరితెగింపు
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో విధ్వంస కాండను అరికట్టడం, అనంతరం కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులు విఫలమయ్యారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నిర్ధారించింది. నిందితులపై కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోవడాన్ని ప్రస్తావించింది. మూడు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలపై విచారించిన సిట్ బృందం ఇన్చార్జ్ వినీత్ బ్రిజ్‌లాల్ ప్రాథమిక నివేదికను సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాకు అందచేశారు. రెండు రోజుల పాటు విస్తృతంగా విచారణ నిర్వహించిన సిట్ అధికారుల బృందం పోలీసుల వైఫల్యాలపై నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. పూర్తి నివేదిక అందించేందుకు మరికొంత సమయం పడుతుందని పేర్కొంది. బదిలీ చేసిన జిల్లాల్లోనే హింసపోలింగ్‌కు ముందు చంద్రబాబు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల కమిషన్ (ఈసీ)పై ఒత్తిడి తెచ్చి పల్నాడు నుంచి అనంతపురం వరకు ఏకంగా 39 మంది పోలీసు అధికారులను బదిలీ చేయించిన విషయం తెలిసిందే. వారి స్థానాల్లో పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని అధికారులనే ఈసీ నియమించడం గమనార్హం. ఈ క్రమంలో పోలింగ్ రోజు మే 13న, అనంతరం టీడీపీ గూండాలు యథేచ్చగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు శాంతి భద్రతల పరిరక్షణలో దారుణంగా విఫలమయ్యారు. అనంతరం కేసుల నమోదు, దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.అదనపు సెక్షన్లు చేర్చండి..విధ్వంస కాండపై పోలీసుల దర్యాప్తు తూతూ మంత్రంగా ఉందని సిట్ స్పష్టం చేసింది. నిందితులను పట్టుకునేందుకు అదనపు బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు అదనంగా మరికొన్ని సెక్షన్లు జోడించాలని సూచించింది. అందుకోసం న్యాయస్థానాల్లో మెమో దాఖలు చేయాలని పేర్కొంది. నిందితులను త్వరగా అరెస్టు చేయడంతోపాటు ముందస్తు తేదీతో చార్జ్షీట్లను దాఖలు చేయాలని పేర్కొంది. పోలింగ్ సందర్భంగా దాడుల కేసుల దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని సిట్ స్పష్టం చేసింది.నాలుగు బృందాలు..పోలింగ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలపై సిట్ విస్తృతంగా దర్యాప్తు చేసింది. వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ నాలుగు బృందాలుగా ఏర్పడి శని, ఆదివారాల్లో విచారణ నిర్వహించింది. పల్నాడు జిల్లాలో రెండు బృందాలు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఒక్కో బృందం పర్యటించి హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రదేశాలను పరిశీలించాయి. బాధితులతో మాట్లాడి వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాయి. పోలీసు అధికారులను విచారించడంతోపాటు మొత్తం పరిస్థితిని సమీక్షించాయి.కుమ్మక్కుతో విధ్వంసకాండకాల్ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలిసిట్‌ను కోరిన వైఎస్సార్సీపీ నేతలుకొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారని వైఎస్సార్సీపీ పేర్కొంది. పోలింగ్ రోజు, అనంతరం టీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్ డేటా సేకరించి విచారణ నిర్వహించాలని కోరింది. ఈ కేసులపై విచారణ నిర్వహిస్తున్న సిట్ ఇన్చార్జ్ వినీత్ బ్రిజ్‌లాల్‌ను మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం సోమవారం కలిసింది. టీడీపీ నేతలు, ఆ పార్టీ గూండాలు పక్కా పన్నాగంతో ఎలా దాడులకు పాల్పడ్డారో వివరిస్తూ ఆధారాలను అందచేసింది. మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్‌తోపాటు వైఎసార్సీపీ నేతలు పేర్ని నాని, రావెల కిషోర్ బాబు, మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.బదిలీలు చిన్న విషయం కాదు: అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రిచంద్రబాబు, పురందేశ్వరి ఈసీపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ముందు పోలీసు అధికారులను మార్చి అల్లరి మూకలను దాడులకు పురిగొల్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న పోలీసు అధికారులను బదిలీ చేయించడంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. అధికారులను బదిలీ చేసిన ప్రాంతాల్లోనే దాడులు, విధ్వంసం చోటుచేసుకున్నాయి. అప్పటికప్పుడు ఐపీఎస్ అధికారులను మార్చడం చిన్న విషయం కాదు. టీడీపీ పన్నాగంలో పోలీసు అధికారులు పావులుగా మారడం దురదృష్టకరం.అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ పరిస్థితులు కుదుట పడలేదు. మా పార్టీ నేతలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు పెట్టడం లేదు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడమే తడవు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.ప్రజాబలంతో ఎదుర్కొలేక గూండాగిరి: మంత్రి జోగి రమేష్ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు కుట్రలకు బరి తెగించారు. ప్రజల మద్దతులేని టీడీపీ కూటమి ఎన్నికలను ఎదుర్కోలేక దౌర్జన్యాలకు తెర తీసింది. అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. టీడీపీ నిర్వాకంతో ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయాయి.హక్కులు కాలరాశారు: రావెల కిషోర్ బాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు టీడీపీ విధ్వంసకాండకు పాల్పడింది. వారిని గ్రామాల నుంచి తరిమేశారు. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ హక్కులను కాలరాసిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి. 33 కేసులు.. 1,370 మంది నిందితులుపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా దాడులు, దౌర్జన్యకాండపై ఇప్పటివరకు 33 కేసులు నమోదు చేశారు. పల్నాడు జిల్లాలో 22,అనంతపురం జిల్లాలో 7, తిరుపతి జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,370 మందిని నిందితులుగా పేర్కొనగా ఇప్పటివరకు 124 మందిని అరెస్ట్ చేశారు. మరో 94 మందికి సెక్షన్ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు.
May 21st: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 21st AP Elections 2024 News Political Updates8:40 AM, May 21st, 2024దుష్ప్రచారం చేయడం డాక్టర్ లోకేశ్‌కు అలవాటే: ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ వాసుదేవరెడ్డి వెల్లడికోర్టుల్లో తప్పుడు కేసులు వేయడంలో నేర్పరి చీవాట్లు పెట్టి జరిమానా విధించిన అమెరికా కోర్టుపలువురు రోగుల మరణానికి కారకుడయ్యాడని ప్రాక్టీస్ పైనా నిషేధంఏపీలో ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని మేధావిగా చలామణి అవుతున్నారుఅయితే అమెరికాలో 18 ఏళ్లుగా ఆయన ప్రాక్టీస్‌పై నిషేధం కొనసాగుతోందిగుంటూరు మెడికల్ కాలేజీలో 1983లో లోకేశ్ గ్రాడ్యుయేట్ అయ్యాడుగ్యాస్ట్రో విభాగంలో ఎండీ పూర్తిచేసిన ఆయన అమెరికాలోని వర్జీనియాలో తొలుత ప్రాక్టీస్ మొదలెట్టాడుఅప్పటి నుంచే ఎదుటి వ్యక్తులపై అవాస్తవ ఆరోపణలు చేయడం, కోర్టుల్లో తప్పుడు కేసులు ఫైల్ చేయడం లోకేశ్‌కు అలవాటుప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆస్పత్రి యాజమాన్యంపై, సహచర వైద్యులపై కోర్టులో కేసులు వేసి, ఆ ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమయ్యాడుఇదే తరహాలో 2022లో భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్, అదానీ మీద వాషింగ్టన్ డీసీ కోర్టులో కేసులు ఫైల్ చేశాడుఇండియా నుంచి కంటైనర్లలో డబ్బుతో పాటు, ఇజ్రాయిల్ నుంచి స్పైవేర్ కొనుగోలు చేసి అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశాడు. తప్పుడు ఆరోపణలతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నావని లోకేశ్‌కు కోర్టు చీవాట్లు పెట్టడంతో పాటు జరిమానా విధించిందివైద్య నిబంధనలకు విరుద్ధంగా రోగులకు చికిత్సలు అందించి పలువురి మరణానికి లోకేశ్ కారకుడయ్యాడు2006లో వర్జీనియా బోర్డ్ ఆఫ్ మెడిసిన్ లోకేశ్ మెడికల్ లైసెన్స్‌ను రద్దు చేసిందిఅనంతరం న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఆయా రాష్ట్రాల్లోనూ లైసెన్స్‌ను రీవోక్ చేశారుఅయితే ఈ వాస్తవాలను కప్పిపుచ్చి అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా చలామణి అవుతూ ఏపీ సీఎం జగన్‌పై అవాస్తవ ఆరోపణలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు వాస్తవాలను ఓ సారి తెలుసుకోవాలిమేధావులుగా చలామణి అవుతున్న లోకేశ్ వంటి కులోన్మాదులు సీఎం జగన్‌పై దాడులకు పాల్పడుతున్నారు.7:52 AM, May 21st, 2024సిట్ నివేదికలో సంచలన విషయాలుఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు150 పేజీల ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్సిట్ ప్రాథమిక నివేదికలో బయటపడిన పోలీసుల వైఫల్యాలుపల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తునాలుగు బృందాలుగా మూడు జిల్లాలలో పర్యటించిన సిట్33 ఘటనలలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, సీసీ కెమెరాలు పరిశీలనఈ అల్లర్లలో 1370 మంది నిందితులకి 124 మందినే అరెస్ట్ చేసిన పోలీసులుఇందులో 639 మంది నిందితులని ఇంకా గుర్తించాల్సి ఉందన్న సిట్1100 మందిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన సిట్దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించిన సిట్రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్రెండు గ్రూపుల మధ్య రాళ్ల దాడులు మరణాలకి కారణమయ్యాయని పేర్కొన్న సిట్ప్లీ ప్లాన్డ్‌గానే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తింపుదాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదికఎన్నికలకి ముందు పోలీస్ అధికారుల బదిలీలే ఘటనలకి కారణంగా సిట్ నివేదికపరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలని సిట్ సూచనకోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు జోడించాలన్న సిట్సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను ఆదేశించిన డీజీపీ7:16 AM, May 21st, 2024ఇట్లు.. ఇటలీకి!వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు చంద్రబాబు లీకులుఅబ్బే.. ఇటు రాలేదన్న టీడీపీ ఎన్నారై విభాగం నేతటీడీపీ అధినేత ఇటలీలో ప్రత్యక్షమైనట్లు సమాచారంగతంలో విదేశాల నుంచే షెల్ కంపెనీలకు అక్రమ నిధుల మళ్లింపుస్కిల్ స్కామ్‌లోనూ బాబు దుబాయ్ బంధంఈసారి అదే షెల్ దందాయేనా..!గోప్యంగా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు అదే 7:07 AM, May 21st, 2024కుమ్మక్కుతో విధ్వంసకాండకాల్ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలిసిట్‌ను కోరిన వైఎస్సార్సీపీ నేతలుకొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారుటీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలిదాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్ డేటా సేకరించి విచారణ నిర్వహించాలి 7:05 AM, May 21st, 2024పల్నాడులో మహిళలపై ఇంతటి దాడులా?మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఆగ్రహంనిందితులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు లేఖరాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా తమకు ఓట్లు వేయలేదనే కక్షతో ఎస్సీ, బీసీ మహిళలపై దాడులకు దిగడం దారుణంఎస్సీ, బీసీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని ఇంతలా దాడులు చేయడం దుర్మార్గం6:53 AM, May 21st, 2024బదిలీలతో బరితెగింపుఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ నివేదికదాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు విఫలంపోలింగ్‌కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్చగా విధ్వంసకాండదర్యాప్తు సక్రమంగా లేదు.. అదనపు సెక్షన్లు చేర్చాలి
కేంద్ర మంత్రికి బీజేపీ షోకాజ్ నోటీసులు
రాంచీ: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి జయంత్ సిన్హాపై బీజేపీ చర్యలు తీసుకుంది. ఆయన జార్ఖండ్‌లోని హజారీబాగ్ స్థానం నుంచి మనీష్ జైస్వాల్‌ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి.. పార్టీపరమైన సంస్థాతగ పనులు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరీ ఆదిత్య సాహూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు.. సోమవారం జరిగిన ఐదో విడత పోలింగ్‌లో జయంత్ సిన్హా తన ఓటు హక్కు వినియోగించుకోకపోవటంతో బీజేపీ అధిష్టానం ఆగ్రహించి ఆయనపై చర్యలకు పూనుకుందని పార్టీలో చర్చ జరుగుతోంది. మార్చిలో జయంత్ సిన్హా.. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నట్లు వెళ్లడించిన విషయం తెలిసిందే.‘‘లోక్‌సభ ఎన్నికల్లో భాగం పార్టీ అధిష్ణానం హజారీబాగ్‌లో మనీష్ జైశ్వాల్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటి నుంచి మీరు( జయంత్ సిన్హా) పార్టీ సంస్థాగత పనులు, ఎన్నికల ప్రచారానికి సైతం దూరంగా ఉన్నారు. కనీసం పోలింగ్‌లో ఓటు కూడా వేయలేదు. మీ ప్రవర్తనతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతింటోంది’’ అని నోటీసులో ఆదిత్య సాహు పేర్కొన్నారు. అదే విధంగా రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని బీజేపీ కోరింది. అయితే ఇప్పటివరకు ఈ నోటీసుకుల స్పందించకపోవటం గమనార్హం.మర్చి 2న జయంత్ సిన్హా.. తనను ప్రత్యక్ష ఎన్నికల విధుల నుంచి తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. భారత్, ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ మార్పులను ఎదుర్కొవడానికి తన వంతుగా కృషి చేయటంపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన హజారీబాగ్ స్థానంలో బీజేపీ అధిష్టానం మనీష్ జైశ్వాల్‌ను బరిలోకి దించింది. అయితే ఈసారి ఎన్నికల్లో హజారీబాగ్ స్థానంలో జయంత్ సిన్హాకు మరోసారి టికెట్ ఇవ్వకుండా పక్కనపెట్టాలని బీజేపీ భావించిందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
‘మళ్లీ తొలగింపులా?’, మస్క్ కఠిన నిర్ణయం..ఆందోళనలో ఉద్యోగులు
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఎలోన్ మస్క్ ఉద్యోగుల విషయంలో కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో 10 శాతం మంది వర్క్ ఫోర్స్‌ను తొలగించనున్నారనే ఊహాగానాలు ఆ సంస్థ ఉద్యోగుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.ఖర్చు తగ్గింపు, క్యూ1లో కంపెనీ పేలవమైన ప్రదర్శన, అనిశ్చితితో పాటు పలు అంశాలు లేఆఫ్స్‌కు కారణమని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఇప్పటికే కొంతమందిని తొలగించగా.. జూన్ నెల ముగిసే లోపు మరింత మందికి ఉద్వాసన పలకనుందని సమాచారం. దీనికి తోడు ఉద్యోగుల తొలగింపుకు పరోక్షంగా ఏఐ కారణమని తెలుస్తోంది. గత కొంత కాలంగా మస్క్ తన దృష్టిని ఈవీ వైపు కాకుండా ఏఐ, రోబోటిక్స్ వంటి టెక్నాలజీలకు సారించడం, ఈవీల తయారీ కంటే రోబోట్యాక్సీ వంటి ప్రాజెక్ట్‌లకు మస్క్ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే నైతికత క్షీణించిందని కొందరు ప్రస్తుత ఉద్యోగులు చెప్పారు.లేఆఫ్‌ల ముగింపుకు సంబంధించి మస్క్ నుండి స్పష్టమైన సూచన లేకపోవడం ఉద్యోగుల్లో ఆందోళనకు ఆజ్యం పోసింది. ఇక టెస్లా ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగులు సేల్స్, హెచ్ఆర్తో పాటు పలు విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రభావితం కానున్నారు.
ఇట్లు.. ఇటలీకి!
సాక్షి, అమరావతి: అడుగు తీసి అడుగేస్తే మీడియాలో ప్రచారం కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్‌చుప్‌గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులిచ్చింది.అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్‌లోని షెల్ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు? ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు ఏమిటన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.పోలింగ్ తర్వాత సైలెంట్‌చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం అంతా మీడియా ప్రచారంతోనే ముడిపడి ఉందన్నది బహిరంగ రహస్యమే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన మీడియా ద్వారా విపరీతమైన ప్రచారాన్ని కోరుకుంటారు. మూడు ప్రెస్మీట్లు, ఆరు మీడియా లీకులుగా ఆయన రాజకీయం కొనసాగింది. వారానికి కనీసం రెండు సార్లు మీడియా సమావేశాలు నిర్వహిస్తుంటారు. అలాంటిది ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కనీసం ప్రెస్‌మీట్ పెట్టలేదు. పార్టీ నేతలతో సమావేశం నిర్వహించలేదు. తన శైలికి భిన్నంగా ఒక్కసారిగా మౌనముద్ర దాల్చారు.మరోవైపు లోకేశ్‌కు మాట కూడా పెగల్లేదు. చంద్రబాబు కంటే ముందే ఆయన గప్‌చుప్‌గా విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో జనసేన వర్గాలే చెప్పలేకపోతున్నాయి. రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అలికిడే లేదు. పోలింగ్ ముగిసిన తర్వాత కూటమి నోట మాటే రావడం లేదు. పోలింగ్ సరళి తమకు వ్యతిరేకంగా ఉందని చంద్రబాబు కచ్చితమైన అంచనాకు రావడంతో ఒక్కసారిగా మౌనం దాల్చినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిశ్శబ్దంగా విదేశాలకు వెళ్లడం గమనార్హం. ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడంతో..చంద్రబాబు శనివారం అర్థరాత్రి శంషాబాద్ విమా¯éశ్రయం నుంచి దుబాయ్ వెళ్లారు. ఆయన విదేశీ పర్యటనలపై అధికారికంగా వెల్లడించే టీడీపీ ఈసారి అందుకు భిన్నంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారులు చంద్రబాబును కాసేపు అడ్డుకోవడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాల కేసులకు సంబంధించి చంద్రబాబుపై సీఐడీ గతంతో లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. సీఐడీ ముందస్తు అనుమతి లేకుండా ఆయన దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో చంద్రబాబును విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు సీఐడీని సంప్రదించారు. సీఐడీ ఆయనపై నాలుగు కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. సీఐడీకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదని ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేయనుంది. ఇదే విషయాన్ని సీఐడీ శంషాబాద్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలియచేసింది. దీంతో చంద్రబాబు విదేశీ పర్యటనపై అప్పటికప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా భావించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను వెళ్లనిచ్చారు. సాధారణంగా దుబాయ్ చేరుకుని అక్కడి నుంచి మరో విమానంలో అమెరికా లేదా ఐరోపా దేశాలకు వెళుతుంటారు. చంద్రబాబు మాత్రం దుబాయ్ నుంచి ఎక్కడికి వెళ్లారో వెల్లడించలేదు. తన పర్యటనను అంత గోప్యంగా ఎందుకు ఉంచారన్నది సందేహాస్పదంగా మారింది.స్కిల్ స్కామ్‌లోనూ దుబాయ్ బంధంచంద్రబాబు రహస్య పర్యటన నేపథ్యంలో గతంలో షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధుల మళ్లింపు వ్యవహారం తెరపైకి వచ్చింది. టీడీపీ హయాంలో యథేచ్ఛగా పాల్పడిన కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను ఆయన అక్రమంగా విదేశాలకు తరలించి అక్కడి నుంచి భారత్‌లోని షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. చంద్రబాబు 52 రోజులు రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న స్కిల్ స్కామ్‌లో కూడా నిధులను అక్రమంగా దుబాయ్‌కు చేర్చారు.ఆ కుంభకోణంలో పాత్రధారులైన ఆయన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, కిలారి రాజేశ్ దుబాయ్ నుంచే అక్రమ నిధులను సింగపూర్ మీదుగా హైదరాబాద్‌లోని షెల్ కంపెనీకి తరలించారు. అనంతరం ఆ నిధులు చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. అంటే ఆయన ఆర్థిక కుంభకోణాల్లో దుబాయ్ కీలక కేంద్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇటలీలో ప్రత్యక్షం..!గుట్టుగా విదేశాలకు వెళ్లిన చంద్రబాబు ఇటలీ చేరుకున్నట్లు సమాచారం. దుబాయ్ నుంచి చంద్రబాబు దంపతులు ఇటలీ వెళ్లినట్లు ఇమ్మిగ్రేషన్ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. లోకేశ్ దంపతులు కూడా అక్కడికే వెళ్లినట్లు భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్లినప్పుడు అధికారికంగా వెల్లడించారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా గోప్యత పాటించడం గమనార్హం. ఇటలీతోపాటు మరికొన్ని చిన్న చిన్న దేశాలకు వారు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ నుంచి సింగపూర్‌కు నిధులు మళ్లించి అనంతరం భారత్‌లోని షెల్ కంపెనీలకు చేరవేసే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనను పూర్తిగా గోప్యంగా ఉంచడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
Rasi Phalalu: ఈ రాశి వారు ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు
శ్రీ∙క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: శు.త్రయోదశి సా.4.43 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: స్వాతి పూర్తి (24 గంటలు), వర్జ్యం: ఉ.11.21 నుండి 1.06 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.03 నుండి 8.51 వరకు, తదుపరి రా.10.51 నుండి 11.39 వరకు, అమృతఘడియలు: రా.9.40 నుండి 11.23 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.22. మేషం: ఆర్థికాభివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.వృషభం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. భూసంబంధ వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.మిథునం: ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మధ్యలో ఆపివేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.కర్కాటకం: వ్యవహారాలు నిదానిస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.సింహం: నూతన ఉద్యోగాలు లబిస్తాయి. ఇంటాబయటా అనుకూలం. కొత్త కార్యక్రమాలు చేపడతారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.కన్య: కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యంగా ఉంటాయి.తుల: పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి పిలుపు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత కలసివస్తాయి.వృశ్చికం: పరిస్థితులు అంతగా కలసిరాదు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుండి ఆహ్వానాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.మకరం: రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.కుంభం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు కొద్దిగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు.మీనం: కుటుంబంలో ఇబ్బందులు. సమస్యలు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు. పనులు మధ్యలో నిలిపివేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.
IPL 2024: ఫైనల్ వేటలో ఎవరిదో జోరు!
అహ్మదాబాద్: గత రెండు నెలలుగా పది జట్ల పోరు ‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా సాగింది. మెరుపులు, ధనాధన్ ధమాకాలతో ఐపీఎల్ 17వ సీజన్ మరింత మజాను పంచింది. ఇప్పుడు నాలుగు జట్ల సమరం ఫైనల్ దిశగా జరగనుంది. ముందుగా మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్‌లో జోరు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... రెండుసార్లు (2012, 2014) చాంపియన్ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో తలపడనుంది. 2016లో ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సన్‌రైజర్స్ ప్రస్తుత సీజన్లో భీకరమైన ఫామ్ దృష్ట్యా టైటిల్ వేటలో ముందంజ వేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కోల్‌కతా తక్కువేం కాదు... తగ్గేలా లేనేలేదు! ఈ సీజన్లో కేవలం 3 మ్యాచ్‌లే ఓడిన నైట్‌రైడర్స్ ఎవరికి సాధ్యం కానీ 9 విజయాల్ని సాధించి పాయింట్ల పట్టికలో ‘టాప్’లో నిలిచింది. అటు బౌలింగ్, బ్యాటింగ్‌లో సమతూకంగా ఉన్న కేకేఆర్ రెండో క్వాలిఫయర్‌దాకా చాన్స్ తీసుకోకుండా ఫైనల్ బెర్త్ సాధించాలని ఆశిస్తోంది. సన్ తుఫాన్‌కు ఎదురేది? సన్‌రైజర్స్ కొట్టిన కొట్టుడు... దంచిన దంచుడు... 200 పైచిలుకు లక్ష్యమైనా మాకేంటని ఛేదించిన వైనం చూస్తే హైదరాబాద్‌కు ఎదురు నిలవడం ఏ జట్టుకైనా కష్టమే! దంచేసే ఓపెనర్ హెడ్ డకౌటైన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 215 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించి టాప్–2లోకి దూసుకొచ్చింది. అభిషేక్ శర్మ, ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు పదేపదే చుక్కలు చూపిస్తున్నారు. ఈ జట్టు బలం బ్యాటింగే! అయితే నిలకడ లేని బౌలింగ్‌తోనే అసలు సమస్యంతా! బౌలర్ల వైఫల్యం వల్లే 277/3, 287/3, 266/7 లాంటి రికార్డు స్కోర్లు నమోదు చేసినా భారీ తేడాతో ఏ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. కెపె్టన్ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ సహా బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తేనే సన్‌రైజర్స్‌కు విజయం సులువవుతుంది. ఫైట్ రైడర్స్ ఫిల్ సాల్ట్–సునీల్ నరైన్ ఓపెనింగ్ జోడీ మెరుపులతో కోల్‌కతా నైట్‌రైడర్స్ కాస్తా ఫైట్‌రైడర్స్‌గా మారింది. కీలకమైన మ్యాచ్‌లో సాల్ట్ (స్వదేశానికి తిరుగుముఖం) లేకపోయినప్పటికీ బ్యాటింగ్ బలం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే వెంకటేశ్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, రసెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్ ఇలా ఎనిమిదో వరుస వరకు తిరుగులేని బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు కోల్‌కతా. ప్రత్యేకించి రసెల్, రింకూ, రమణ్‌దీప్‌లైతే స్పెషలిస్టు హిట్టర్లు. టాప్–3 విఫలమైన ప్రతీసారీ జట్టును నడిపించారు. బౌలింగ్‌లో అనుభవజు్ఞడైన స్టార్క్, నరైన్, రసెల్‌లతో పాటు హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలు నైట్‌రైడర్స్ విజయాల్లో భాగమవుతున్నారు. ఇక నైట్‌రైడర్స్ మ్యాచ్ ఆడి పది రోజులవుతోంది. ఈ నెల 11న ముంబై ఇండియన్స్‌పై మొదట 157/7 స్కోరే చేసినా... ప్రత్యరి్థని 139/8కు కట్టడి చేసి 18 పరుగులతో గెలిచింది. తర్వాత గుజరాత్, రాజస్తాన్‌లతో జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. దీంతో ఆటగాళ్లంతా ‘మ్యాచ్ ఆకలి’ మీదున్నారు. తప్పకుండా ఇరుజట్ల మధ్య హోరాహోరీ సమరం గ్యారంటీ! జట్లు (అంచనా) హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), హెడ్, అభిõÙక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్, షహబాజ్, సమద్, సన్వీర్, భువనేశ్వర్, విజయకాంత్, నటరాజన్. కోల్‌కతా: శ్రేయస్ అయ్యర్ (కెపె్టన్), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్ రాణా, రింకూ సింగ్, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్, అనుకుల్/వైభవ్. పిచ్, వాతావరణం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆరు మ్యాచ్‌ల్ని పరిశీలిస్తే... పిచ్ బౌలర్లకు, బ్యాటర్లకు సమాన అవకాశాలు కల్పించింది. మూడు మ్యాచ్‌ల్లో 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. తక్కువ స్కోర్ల మ్యాచ్ (గుజరాత్ 89 ఆలౌట్; ఢిల్లీ 92/4) కూడా ఇక్కడే నమోదైంది. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.26: ఐపీఎల్లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్, నైట్‌రైడర్స్ జట్లు ముఖాముఖిగా 26 సార్లు తలపడ్డాయి. 17 మ్యాచ్‌ల్లో నైట్‌రైడర్స్... 9 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ గెలుపొందాయి. ఈ సీజన్లో ఈ రెండు జట్లు ఒకసారి పోటీపడగా నైట్‌రైడర్స్ నాలుగు పరుగుల తేడాతో నెగ్గింది. నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు 228, అత్యల్ప స్కోరు 116 కాగా... సన్‌రైజర్స్‌పై నైట్‌రైడర్స్ అత్యధిక స్కోరు 208, అత్యల్ప స్కోరు 101.
వారి ఫోన్ కాల్ కోసం ఎదరుచూస్తున్న పాయల్ రాజ్‌పుత్
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. తను నటించిన 'రక్షణ' సినిమా టీమ్‌పై ఆమె సంచలన ఆరోపణ చేసింది. నాలుగేళ్ల క్రితం నిర్మించిన సినిమాను ఇప్పుడు విడుదల చేస్తున్నారని చెప్పిన ఆమె.. ఆ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్లో కొంత తనకు చెల్లించాల్సి ఉందని తెలిపింది. అయితే, తనకు ఇవ్వాల్సిన బకాయిలు పక్కనపెట్టి సినిమాను విడుదల చేయడాన్ని ఆమె తప్పుబట్టింది. అగ్రిమెంట్ ప్రకారం తనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ చెల్లించకుండానే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని నాపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పింది. అలా చేయకుంటే తెలుగు పరిశ్రమ నుంచి తనను బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నట్టు కూడా ఆమె చెప్పుకొచ్చింది.ఈ విషయంపై చిత్ర యూనిట్ కూడా రియాక్ట్ అయింది. ప్రమోషన్స్‌కు వస్తే పాయల్‌కు చెల్లించాల్సిన రూ.6 లక్షలు ఇచ్చేందుకు నిర్మాత సిద్ధమయ్యారని.. కానీ పాయల్ పట్టించుకోలేదని వారు వెల్లడించారు. ఈ వివాదంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రెస్ నోట్లో పేర్కొన్నారు.సెటిల్మెంట్ కోరుకుంటున్న పాయల్తాజాగా పాయల్ రాజ్‌పుత్ మరోసారి తన సోషల్ మీడియాలో ఒక నోట్ రాసింది. 'నేను డైరెక్టర్, నిర్మాతకు చాలా గౌరవం ఇస్తాను. నా ఉద్దేశం వారిని బాధపెట్టాలని లేదు. నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సినిమా విడుదల చేయాలనుకోవడం బాధ అనిపిస్తుంది. 2020 నుంచి ఇప్పటికీ కూడా 'రక్షణ' టీమ్‌కు నేను సపోర్ట్ చేస్తున్నాను. ప్రేక్షకులను మెప్పించేందుకు దర్శకుడు, నిర్మాతల టీమ్ ఎంతకష్టపడుతారో నాకు తెలుసు. కాబట్టి వారిని నష్టపెట్టాలని నేను ఎప్పుడూ కోరుకోను. నేను అడిగింది ఒక్కటే నాకు చెప్పకుండా సినిమాను విడుదల చేయడం బాధ అనిపించింది. ఇదీ నా రిక్వెస్ట్.. నేను ఎవరికీ అపకారం చేయను. రక్షణ టీమ్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుందని నేను ఎదురుచూస్తున్నాను. నా టీమ్‌ను వారు తప్పకుండా సంప్రదిస్తారని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ సమస్యలను పరిష్కరించుకుందాం.' అని పాయల్ సెటిల్మెంట్ కోరుకుంటుంది. ఫైనల్లీ ఈ గొడవకు శుభం కార్డు పడినట్టే. ఇరువురు మధ్య సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా తెలిపింది. జూన్ 7న రక్షణ సినిమా విడుదల కానుంది. పాయల్ రాజ్‌పుత్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనకుండానే ఇలా భారీ ప్రమోషన్‌ను ఆ సినిమాకు తెచ్చిపెట్టిందని నెటిజన్లు అంటున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal)
దుష్ప్రచారం చేయడం డాక్టర్ లోకేశ్‌కు అలవాటే..
సాక్షి, అమరావతి: ప్రముఖులపై దుష్ప్రచారం చేయడం డాక్టర్ ఉయ్యూరు లోకేశ్‌కు అలవాటని ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ వాసుదేవరెడ్డి తెలిపారు. ఏపీలో ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని మేధావిగా చలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే అమెరికాలో 18 ఏళ్లుగా ఆయన ప్రాక్టీస్‌పై నిషేధం కొనసాగుతోందని తెలిపారు. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్ ఇటీవల గన్నవరం విమానాశ్రయంలో లండన్‌కు వెళుతున్న సీఎం జగన్‌ను అడ్డుకునేందుకు కుట్ర పన్నారు. ఈ సందర్భంగా అతని గురించి పలు విస్తుపోయే వాస్తవాలను డాక్టర్ వాసుదేవరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. గుంటూరు మెడికల్ కాలేజీలో 1983లో లోకేశ్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. గ్యాస్ట్రో విభాగంలో ఎండీ పూర్తిచేసిన ఆయన అమెరికాలోని వర్జీనియాలో తొలుత ప్రాక్టీస్ మొదలెట్టాడు. అప్పటి నుంచే ఎదుటి వ్యక్తులపై అవాస్తవ ఆరోపణలు చేయడం, కోర్టుల్లో తప్పుడు కేసులు ఫైల్ చేయడం లోకేశ్‌కు అలవాటు. ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆస్పత్రి యాజమాన్యంపై, సహచర వైద్యులపై కోర్టులో కేసులు వేసి, ఆ ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమయ్యాడు. ఇదే తరహాలో 2022లో భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్, అదానీ మీద వాషింగ్టన్ డీసీ కోర్టులో కేసులు ఫైల్ చేశాడు. ఇండియా నుంచి కంటైనర్లలో డబ్బుతో పాటు, ఇజ్రాయిల్ నుంచి స్పైవేర్ కొనుగోలు చేసి అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశాడు. తప్పుడు ఆరోపణలతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నావని లోకేశ్‌కు కోర్టు చీవాట్లు పెట్టడంతో పాటు జరిమానా విధించింది. ప్రాక్టీస్‌పైనా నిషేధం వైద్య నిబంధనలకు విరుద్ధంగా రోగులకు చికిత్సలు అందించి పలువురి మరణానికి లోకేశ్ కారకుడయ్యాడు. 2006లో వర్జీనియా బోర్డ్ ఆఫ్ మెడిసిన్ లోకేశ్ మెడికల్ లైసెన్స్‌ను రద్దు చేసింది. అనంతరం న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఆయా రాష్ట్రాల్లోనూ లైసెన్స్‌ను రీవోక్ చేశారు. అయితే ఈ వాస్తవాలను కప్పిపుచ్చి అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా చలామణి అవుతూ ఏపీ సీఎం జగన్‌పై అవాస్తవ ఆరోపణలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు వాస్తవాలను ఓ సారి తెలుసుకోవాలి. మేధావులుగా చలామణి అవుతున్న లోకేశ్ వంటి కులోన్మాదులు సీఎం జగన్‌పై దాడులకు పాల్పడుతున్నారు.
Fauzia Arshi: ఆకాశమే హద్దు
డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా బాలీవుడ్లో గుర్తింపు పొందిన ఫౌజియా ఆర్షి మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ పుస్తకాల రచయిత్రి, గిటారిస్ట్, సింగర్, మ్యూజిక్ కంపోజర్, డైలాగ్ రైటర్. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎంటర్ ప్రెన్యూర్‌గా కూడా విజయపథంలో దూసుకుపోతోంది. ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తాజాగా మరో సవాలును స్వీకరించనుంది.ఖాళీగా కూర్చోకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఫౌజియా ఆర్షి పెట్టింది పేరు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఫౌజియాకు టైమ్ అంటే కొత్త విషయం తెలుసుకోవడం. కొత్త కళలో అక్షరాలు దిద్దడం. కాలాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న ఆమె కృషి వృథా పోలేదు. ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ అని ప్రపంచం గుర్తించేలా చేసింది.‘హోగయా దిమాగ్ క దహీ’ బాలీవుడ్ సినిమాతో నవ్వులు పూయించింది. ఈ రోరింగ్ కామెడీ ఫిల్మ్‌లో ఓంపురి, రాజ్‌పాల్ యాదవ్‌లాంటి నటులు నటించారు. ఫస్ట్–జెనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా టీనేజ్లోనే తన వ్యాపారదక్షతను చాటుకుంది ఫౌజియా.‘ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్మెంట్’ పేరుతో ఆమె రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. మేనేజ్మెంట్ డిపొ్లమా కోర్సుల విద్యార్థులకు బాగా ఉపకరించే ఈ పుస్తకం ప్రపంచ మార్కెటింగ్‌కు సంబంధించిన ఆర్థిక, రాజకీయ, భౌగోళిక వాతావరణాన్ని కళ్లకు కడుతుంది. ‘ది సన్ రైజెస్ ఫ్రమ్ ది వెస్ట్’ అనేది దీనికి పూర్తిగా భిన్నమైన పుస్తకం. ‘ఏది వాస్తవం?’ అంటూ వాస్తవాన్ని గురించి లోతుగా విశ్లేషించే పుస్తకం. తాత్విక ఛాయలు కనిపించే ఈ పుస్తకం రకరకాల చుక్కలను కనెక్ట్ చేసి ఒక రూపాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది.ఎంత అలవోకగా పుస్తకం రాయగలదో అంతే అలవోకగా రాగం తీయగలదు. అప్పటికప్పుడు పదాలు అల్లుతూ పాట పుట్టించగలదు. కాన్వాస్‌పై కనువిందు చేసే చిత్రాన్ని సృష్టించగలదు. ఇక గిటారిస్ట్‌గా ఆమె నైపుణ్యం సరేసరి. మేనేజ్మెంట్ప్రొఫెషనల్గా ఎంత జటిలమైన విషయాలనైనా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించగలదు.ఫౌజియాకు చెందిన డైలీ మల్టీమీడియా లిమిటెడ్ (డిఎంఎల్)... సినిమాలు, టెలివిజన్ కంటెంట్, యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్, ఈవెంట్ ఆర్గనైజింగ్, పొలిటికల్ క్యాంపెయిన్‌కు సంబంధించిన కంపెనీ.సామాజిక సేవారంగంలో చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకొని ఫౌజియాను బ్రిటన్ పార్లమెంట్ సత్కరించింది. ఫౌజియాకు ఇంగ్లీష్ భాషలో ఇష్టమైన మాట ‘న్యూ ఛాలెంజ్’. ఎప్పటికప్పుడు కొత్త ఛాలెంజ్‌లను అధిగమిస్తూ తన సత్తా చాటుతోంది.తాజా విషయానికి వస్తే...ముంబైకి చెంది ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్ ్రపాంతీయ విమానయాన సంస్థ ‘ఫైబిగ్’ను కొనుగోలు చేసే ప్రక్రియ జరుగుతోంది. లావాదేవీలు పూర్తయిన తరువాత ‘ఫ్లైబిగ్’ను మరిన్ని విమానాలతో విస్తరించనున్నారు. ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్‌కు ఫౌజియా ఆర్షి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంది. ‘ఫ్లైబిగ్’ రూపంలో మరో సవాలు ఆర్షి ముందుకు రానుంది. ఈ సవాలును కూడా ఫౌజియా విజయవంతంగా అధిగమించగలరన్నది ఆమె గురించి తెలిసిన వారు కాస్త గట్టిగానే చెప్పేమాట.
తప్పక చదవండి
- AP: అంతా ప్రీ ప్లాన్డ్‌గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- ఐదో దశ ఓటింగ్‌పై ఎన్నికల సంఘం ఆందోళన?
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్‌కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
సినిమా
తెలుగులో ఫస్ట్ మూవీనే సూపర్ హిట్.. కానీ ఆ తర్వాతే.. ఈమెని గుర్తుపట్టారా?
ఈ చిన్నారి చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చేసింది. ఇక తెలుగులో స్టార్ హీరో అల్లు అర్జున్ హిట్ సినిమాతో హీరోయిన్ అయ్యింది. అది సూపర్ హిట్ అయ్యేసరికి ఈమె వరస ఛాన్సులు వచ్చాయి. కానీ ఈమెకు ఎందుకో తెలుగులో పెద్దగా లక్ కలిసి రాలేదు. దీంతో పక్కనే ఉన్న తమిళంలో సెటిలైపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమెని గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: నేనూ మనిషినే.. అలా అంటే తట్టుకోవడం కష్టం: యువ హీరోయిన్)పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు హన్సిక. హా అవును మీరు ఊహించింది కరెక్టే. 'దేశముదురు' మూవీతో హీరోయిన్ అయిన హన్సిక.. అంతకు ముందు హిందీలో 'కోయి మిల్ గయా'లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఇక తెలుగులో కంత్రి, బిల్లా, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ తదితర చిత్రాలతో సక్సెస్ అందుకుంది. కానీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. కానీ తమిళంలో మాత్రం స్టార్ హోదా సొంతం చేసుకుంది.ఇప్పుడు కూడా దాదాపు మూడు తమిళ సినిమాల్లో హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తోంది. వ్యక్తిగత విషయానికొస్తే 2022లో సొహైల్ కతూరియా అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. చాలామంది పెళ్లి చేసుకుంటే సినిమాలకు బ్రేక్ ఇస్తుంటారు. కానీ హన్సిక మాత్రం మరింత జోరుగా మూవీస్ చేస్తోంది. తాజాగా తల్లితో కలిసి ఓ వీడియో పోస్ట్ చేసిన ఈ వైట్ బ్యూటీ.. తన చిన్నప్పటి ఫొటోని షేర్ చేసింది. ఇందులో హన్సికని చూసి చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika)
ఓటేసేందుకు మూడు కోట్ల కారులో వచ్చిన హీరోయిన్!
సెలబ్రిటీలు అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఇక వాళ్ల లైఫ్ అంతా లగ్జరీ స్టైలే. సినీతారలు ఎక్కడికెళ్లినా కెమెరాల కళ్లన్నీ వారిపైనే ఉంటాయి. దీంతో వారు బయటికి వచ్చారంటే ఆ రేంజ్ వేరే లెవల్లో ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? ఇవాళ దేశవ్యాప్తంగా ఐదో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మహారాష్ట్ర, యూపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబయిలోని బాలీవుడ్ ప్రముఖులు అంతా ఓటు వేసేందుకు క్యూ కట్టారు. పలువురు అగ్రతారలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అయితే బాలీవుడ్ భామ శిల్పాశెట్టి సైతం తన ఓటును వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చింది. తన తల్లి సునంద, సోదరి షమితతో కలిసి ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్ కారులో ఓటు వేసేందుకు వచ్చారు. ఆమె ఇటీవలే ఆ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ లగ్జరీ కారు విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.కాగా.. శిల్పా చివరిగా రోహిత్ శెట్టి తొలి వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్‌లో కనిపించింది, ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా మరియు వివేక్ ఒబెరాయ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)
మొత్తం లుక్కే మార్చేసిన రీతూ.. అషూ రెడ్డి హాట్ హాట్!
సోయగాలతో చంపేస్తున్న హీరోయిన్ ఆషికా రంగనాథ్రోజురోజుకీ హీట్ పెంచేస్తున్న అషూ రెడ్డికొడుకు పుట్టినరోజు.. అనసూయ ఫుల్ హ్యాపీ పోస్ట్గుర్తుపట్టలేనట్లు లుక్ మార్చేసిన రీతూ వర్మవావ్ అనిపించేలా షాకింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో దక్ష నగర్కార్జిగేలు మనే డ్రస్సులో అందాలన్నీ చూపించేస్తున్న రీతూ చౌదరి View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rinku Asha Mahadeo Rajguru (@iamrinkurajguru) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Shwetha R Prasad 2.0 (@shwetharprasad) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by ESTHER ANIL (@_estheranil) View this post on Instagram A post shared by Jamie Lever (@its_jamielever) View this post on Instagram A post shared by Shivaji Storm Sen (@stormshivajisen) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Nivedhithaa Sathish (@nivedhithaa_sathish) View this post on Instagram A post shared by Asha Bhat (@asha.bhat) View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath)
సర్జరీలపై ట్రోలింగ్.. అర్థం చేసుకోకుండా తిడతారేంటి? మీ వల్ల..
ఆడవారు అందానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందులోనూ సెలబ్రిటీలు అందం కోసమే ఖర్చు చేస్తారు.. అందంగా కనిపించేందుకే ఎక్కువ తాపత్రయపడతారు. కొందరైతే ప్లాస్టిక్ సర్జరీల దాకా వెళ్తారు. ముఖంలో, శరీరంలో ఏమాత్రం తేడా కనిపించినా జనాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. పొరపాటున ఫేస్‌లో ఏదైనా మార్పు కన్పిస్తే చాలు నెటిజన్లు సెలబ్రిటీలను తెగ ట్రోల్ చేస్తుంటారు. ఈ వైఖరిపై బిగ్‌బాస్ బ్యూటీ జాస్మిన్ భాసిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.నెగెటివిటీ!'జనాలు ఎంత దారుణంగా ఉన్నారంటే ముఖం పట్టుకుని నానామాటలు అనేస్తున్నారు. నటీనటులుగా, సెలబ్రిటీలుగా మేము జనాల్లోనే ఉండాలి. అది నేను ఒప్పుకుంటాను. కానీ ఎందుకని ఎప్పుడూ నెగెటివిటీ ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. యాక్టర్స్‌గా అందంగా కనిపించడం మా బాధ్యత. అందవిహీనంగా కనిపించాలని ఎవరైనా అనుకుంటారా? మా ప్రొఫెషనల్‌లో అందానికి పెద్ద పీట వేస్తాం. ఎప్పటికప్పుడు అందాన్ని పెంపొందించుకోవాలనే చూస్తాం. అందుకోసం ఎంతగానో కష్టపడతాం.చదవండి: 'డబ్బు కోసమే 46 ఏళ్ల కమెడియన్‌తో పెళ్లి'.. నటి ఏమందంటే?నోటికొచ్చింది అనేస్తున్నారుశరీరంలోని మార్పుల వల్ల, హార్మోన్ల అసమతుల్యత వల్ల మేమెంత ఇబ్బందిపడుతున్నా అవి పైకి కనిపించనీయకుండా ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. అది అర్థం చేసుకోకుండా నోటికొచ్చింది తిడుతున్నారు. అప్పటికే మేమెంతో ఒత్తిడిలో ఉంటాం. దానికి తోడు మీ ట్రోలింగ్ వళ్ల ఇంకెంత హర్ట్ అవుతామో ఆలోచించారా? దీనివల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. ఇంత బాధపెట్టడం మీకు న్యాయమేనా?' అని జాస్మిన్ ప్రశ్నించింది.చదవండి: స్టార్ హీరోయిన్ను పట్టించుకోని డెలివరీ బాయ్.. నెటిజన్ల ప్రశంసలు!
క్రీడలు
World Para Championships: శభాష్ దీప్తి...
కోబే (జపాన్): ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్, తెలంగాణకు చెందిన దీప్తి జివాంజి పసిడి పతకంతో మెరిసింది. ప్రపంచ రికార్డుతో ఆమె స్వర్ణం సొంతం చేసుకోవడం విశేషం. సోమవారం జరిగిన మహిళల 400 మీటర్ల (టి20 కేటగిరీ) పరుగును దీప్తి 55.07 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది ఈ ఈవెంట్లో అమెరికాకు చెందిన బ్రియానా క్లార్క్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు (55.12 సెకన్లు)ను దీప్తి బద్దలు కొట్టింది. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో 56.18 సెకన్లతో రేసును ముగించన 20 ఏళ్ల దీప్తి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ టోరీ్నలో ప్రస్తుతం భారత్ ఖాతాలో 4 పతకాలు ఉండగా, శనివారం వరకు పోటీలు జరుగుతాయి. పేదరికం నుంచి పైకెగసి... పారా అథ్లెటిక్స్‌లో టి20 కేటగిరీ అంటే ‘మేధోలోపం’ ఉన్న ప్లేయర్లు పాల్గొనే ఈవెంట్. ఆమె స్వస్థలం వరంగల్ జిల్లా కల్లెడ. తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి రోజూవారీ కూలీలు. ఒకవైపు పేదరికం ఉండగా, మరో వైపు దీప్తిని ‘బుద్ధిమాంద్యం’ ఉన్న అమ్మాయిగా ఊర్లో అందరూ హేళన చేసేవారు. ఇలాంటి సమయంలో భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచారు. ఒక స్కూల్ మీట్లో దీప్తి రన్నింగ్ ప్రతిభ గురించి తన మిత్రుడి ద్వారా ఆయనకు తెలిసింది. దాంతో రమేశ్ ఆ అమ్మాయిని హైదరాబాద్‌కు రప్పించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) శిక్షణా కేంద్రంలో కోచింగ్ అందించే ఏర్పాట్లు చేశారు. మానసికంగా కొంత బలహీనంగా ఉండటంతో ఆమెకు శిక్షణ ఇవ్వడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది. భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ‘మైత్రా ఫౌండేషన్’తో కలిసి ఆరి్థకంగా సహకారం అందించారు. తన ప్రతిభ కారణంగా కెరీర్ ఆరంభంలో ఆమె అందరూ పాల్గొనే సాధారణ అథ్లెటిక్స్ ఈవెంట్లలోనూ పోటీ పడి విజయాలు సాధించడం విశేషం. 2019 ఆసియా అండర్–18 చాంపియన్íÙప్లో కాంస్యం, 2021 సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం సాధించిన దీప్తి 2022లో చివరిసారిగా రెగ్యులర్ పోటీల బరిలోకి దిగింది. రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం ద్వారా దీప్తికి ‘పారా క్రీడల’ లైసెన్స్ లభించింది. దాంతో పూర్తిగా పారా పోటీలపైనే ఆమె దృష్టి పెట్టింది. గత ఏడాది జరిగిన గ్వాంగ్జూ ఆసియా పారా క్రీడల్లో 400 మీటర్ల ఈవెంట్లోనే దీప్తి స్వర్ణం గెలుచుకుంది. ఆరి్థక సమస్యలతో ఒకదశలో తమ భూమిని అమ్ముకున్న తల్లిదండ్రులు దీప్తి ‘ఆసియా’ విజయం తర్వాత ప్రభుత్వం ఇచ్చిన రూ. 30 లక్షలతో మళ్లీ భూమి కొనుక్కోగలిగారు. ఇదే ప్రపంచ రికార్డు జోరులో మున్ముందు పారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించగల సత్తా దీప్తిలో ఉంది.
రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనుహ్యంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కావడంలో ఆ జట్టు పేసర్ యష్ దయాల్‌ది కీలక పాత్ర. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో దయాల్ సంచలన ప్రదర్శన కనబరిచాడు.గతేడాది సీజన్లో గుజరాత్ తరపున జీరోగా మారిన దయాల్ ఇప్పుడు ఆర్సీబీ తరపున హీరోగా మారాడు. సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను యశ్ దయాల్‌కు ఇచ్చాడు. క్రీజులో ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా వంటి డెంజరస్ ఆటగాళ్లు ఉండడంతో సీఎస్కే విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ అందరని అంచనాలను దయాల్ తారుమారు చేశాడు. తొలి బంతికి ధోనీ సిక్స్ కొట్టినా.. ఏమాత్రం భయపడకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మొత్తం ఏడు పరుగులే ఇచ్చి తన జట్టు ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు.ఈ మ్యాచ్‌లో దయాల్ సంచలన ప్రదర్శనతో అతని తండ్రి చంద్రపాల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకును ఆర్సీబీ రూ.5 కోట్లకు కొనుగోలు చేయడాన్ని చాలా మంది తప్పుబట్టారని చంద్రపాల్ చెప్పుకొచ్చాడు.'నేను ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్‌లో ఓ వ్యక్తి యష్‌ని ఎగతాళి చేస్తూ ఓ మీమ్‌ను షేర్ చేశాడు. యశ్ ఇచ్చిన ఐదు సిక్సర్లను ప్రస్తావిస్తూ హేళన చేసేలా ఆ మీమ్ ఉంది. అది నాకు ఇప్పటికి బాగా గుర్తు ఉంది. ఆ మీమ్‌లో 'ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ కథ ప్రారంభం కాకముందే ముగిసింది'అని రాసుకొచ్చారు. ఆ ఆన్లైన్ ట్రోలింగ్ అంతటితో అగిపోలేదు. మేము ఆ ట్రోలింగ్ చూడలేక మా ఫ్యామిలీ గ్రూప్ మినహా అన్ని వాట్సాప్ గ్రూప్‌ల్లో నుంచి నిష్క్రమించాం. ఈ ఏడాది సీజన్ వేలంలో ఆర్సీబీ రూ. 5 కోట్లకు యశ్‌ను సొంతం చేసుకున్నాక కూడా ట్రోలు చేయడం మొదలెట్టారు.ఆర్సీబీ ఫ్రాంచైజీ డబ్బును చెత్తలో పడేసిందంటూ విమర్శించారని" ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దయాల్ తండ్రి చంద్రపాల్ పేర్కొన్నాడు.
ఓటేసిన సచిన్, సూర్యకుమార్.. ఫోటోలు వైరల్
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఐదో దశలో భాగంగా మహారాష్ట్రతో పాటు ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్, వెటరన్ అజింక్యా రహానే, అర్జున్ టెండూల్కర్ సైతం ఓటు వేశారు. సచిన్ తన తనయుడు అర్జున్‌తో కలిసి ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్ బయట సిరాతో ఉన్న వేలిని చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. అదేవిధంగా సూర్యకుమార్ సైతం ఓటు వేసిన అనంతరం తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మన దేశ భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కును వినియోగించుకోవాలని సూర్య పిలుపునిచ్చాడు. Let’s shape the future of our nation by casting our vote today. ✌️ pic.twitter.com/ZYgT69zhis— Surya Kumar Yadav (@surya_14kumar) May 20, 2024
ధోని ఐపీఎల్ రిటైర్మెంట్పై బిగ్ అప్డేట్..
ఐపీఎల్-2024 లీగ్ దశలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఆర్సీబీ చేతిలో సీఎస్కే ఓడిపోయింది. రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటికి తమ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు.సీఎస్కే, ఆర్సీబీ 14 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికి.. రన్‌రేట్ పరంగా బెంగళూరు మెరుగ్గా ఉండడంతో ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. అయితే ఈ ఏడాది సీజన్ తర్వాత ధోని ఐపీఎల్‌కు విడ్కోలు పలకనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ధోని నుంచి అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్ వార్తలపై సీఎస్కే ప్రతినిథి ఒకరు స్పందించారు. ధోని తన రిటైర్మెంట్ గురించి ఫ్రాంచైజీకి ఇప్పటి వరకు తెలియజేయలేదని సదరు ప్రతినిథి తెలిపారు."ఐపీఎల్ రిటైర్మెంట్ గురుంచి ధోని ఇప్పటివరకు సీఎస్కేలో ఎవరితోనూ చర్చించలేదు. అతడు తన నిర్ణయాన్ని వెల్లడించడానికి కొంత సమయం తీసుకుంటాని మెనెజ్‌మెంట్‌తో ధోని చెప్పాడు. అతడు ఇంకా ఫిట్‌గానే ఉన్నాడు. అది మాకు కలిసొచ్చే అంశం. వికెట్ల మధ్య పరిగెత్తడంలో అతడు ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై చాలా మంది దిగ్గజ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ అభిమానులు అయితే వచ్చే సీజన్లో ఈ రూల్‌ను ఉపయోగించుకుని ధోనిని కేవలం బ్యాటింగ్‌కే దిగేలా చూడాలి కోరుతున్నారు. ఇది గానీ ధోని ఏమి నిర్ణయం తీసుకుంటాడో మాకు తెలియదు. తను ఏ నిర్ణయం తీసుకున్న మేము అంగీకరిస్తాం. అతను ఎల్లప్పుడూ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టకుని ఏ నిర్ణయమైన తీసుకుంటాడని" సీఎస్కే సీనియర్ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.
బిజినెస్
ఓటేసిన వ్యాపార ప్రముఖులు
ముంబై: లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాలకు సోమవారం ఎన్నికల పోలింగ్ జరిగింది. ముంబైలో పలువురు వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, వారి కుమారుడు ఆకాష్ అంబానీతో కలిసి ముంబైలోని మలబార్ హిల్‌లో ఓటు వేశారు. #WATCH | Reliance Industries Chairman Mukesh Ambani, Founder and Chairperson of Reliance Foundation Nita Ambani along with their son arrive at a voting centre in Mumbai to cast their vote for #LokSabhaElections2024 pic.twitter.com/R97TSDysam— ANI (@ANI) May 20, 2024 ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తన సహాయకుడు శంతను నాయుడుతో కలిసి ముంబైలోని కోల్బాలోని పోలింగ్ బూత్ వచ్చి ఓటు వేశారు. అనిల్ అంబానీ ముంబైలోని పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిలబడి ఓటింగ్ ప్రారంభమయ్యే వరకు ఎదురు చూసి మరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | Industrialist Anil Ambani stands in a queue at a polling booth in Mumbai, as he waits for the voting to begin.#LokSabhaElections2024 pic.twitter.com/UUCC9iOmyu— ANI (@ANI) May 20, 2024 ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పెద్దార్ రోడ్‌లోని పోలింగ్ బూత్‌లో కూతురు అనన్య బిర్లాతో కలిసి ఓటు వేశారు. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. The privilege of deciding who will govern us…It’s a blessing. Never turn your back on a blessing… pic.twitter.com/rkSAr2CQMh— anand mahindra (@anandmahindra) May 20, 2024 ముంబైలోని పెద్దార్ రోడ్డు సమీపంలో తన కుటుంబంతో కలిసి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఓటు వేశారు. జెట్ ఎయిర్వేస్ మాజీ ఛైర్మన్ నరేష్ గోయల్, హెచ్డీఎఫ్సీ మాజీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ ముంబైలోని పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు.VIDEO | Lok Sabha Elections 2024: "I, along with my family cast our votes together. It is a very proud moment for every Indian and it is a moment of pride to participate in an election of 140 crore people," says RBI governor Shaktikanta Das (@DasShaktikanta) after casting his… pic.twitter.com/YEPMHmKCqn— Press Trust of India (@PTI_News) May 20, 2024
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
ఆన్లైన్ పేమెంట్ యాప్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన 'గూగుల్ పే' (Google Pay) చాలా దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే ఈ సర్వీస్ (గూగుల్ పే) జూన్ నాలుగు తరువాత నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని గూగుల్ గతంలోనే వెల్లడించింది.ఇండియా, సింగపూర్ మినహా జూన్ 4 తరువాత గూగుల్ పే సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. దీని స్థానంలో గూగుల్ వాలెట్ వస్తుంది. అమెరికాలో గూగుల్ పే కంటే 'గూగుల్ వాలెట్' ఎక్కువమంది ఉపయోగిస్తున్న కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సేవలు భారత్, సింగపూర్ దేశాల్లో యధివిధాగా కొనసాగుతాయి. కాబట్టి గూగుల్ పే ఉపయోగించే భారతీయ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.2024 జూన్ 4 వరకు వినియోగదారులు గూగుల్ పే ఉపయోగించుకోవచ్చు, గడువు తీరిన తరువాత అమెరికన్ యూజర్లు అమౌంట్ సెండ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికిగానీ అవకాశం లేదు. కాబట్టి యూఎస్ఏలోని గూగుల్ పే యూజర్స్ దీనిని తప్పకుండా గమనించాలి.అమెరికాలోని గూగుల్ పే యూజర్లను గూగుల్ వాలెట్‌కి మారాలని కంపెనీ కోరింది. గూగుల్.. తన గూగుల్ వాలెట్‌ను చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'గూగుల్ పే'ను కంపెనీ సుమారు 180 దేశాల్లో గూగుల్ వాలెట్‌తో రీప్లేస్ చేసినట్లు సమాచారం.
రతన్‌టాటా.. అణువణువూ ఆదర్శమే..!
ముంబై: లోక్‌సభ ఎన్నికల ఐదో దశలో ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాలకు సోమవారం ఎన్నికల పోలింగ్ జరిగింది. భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబైలోని కోల్బాలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.అణువణువూ ఆదర్శమే..వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ ఈసారి 85 ఏళ్లు పైబడిన వారికి పోలింగ్ కేంద్రానికి వచ్చే పని లేకుండా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. కానీ 86 ఏళ్ల రతన్ టాటా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు. తన సహాయకుడు శంతను నాయుడుతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన రతన్‌టాటా అక్కడి పోలింగ్ సిబ్బందితో హుషారుగా ముచ్చటిస్తూ కనిపించారు.అందరూ ఓటేయాలని పిలుపుముంబైలో ఓటు వేయడానికి రెండు రోజుల ముందే రతన్ టాటా నగరంలోని ఓటర్లందరూ బాధ్యతాయుతంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. “ముంబయిలో సోమవారం ఓటింగ్ రోజు. ముంబైవాసులందరూ బయటలకు వెళ్లి బాధ్యతాయుతంగా ఓటు వేయాలని నేను కోరుతున్నాను” అని ఆయన శనివారం ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. Monday is voting day in Mumbai. I urge all Mumbaikars to go out and vote responsibly.— Ratan N. Tata (@RNTata2000) May 18, 2024
ఇన్సూరెన్స్ సేవల్లోకి ప్రముఖ సంస్థ
ప్రముఖ ఆన్లైన్ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అప్‌స్టాక్స్ ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. తమ కొత్త బిజినెస్‌ను టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో ప్రారంభిస్తున్నామని కంపెనీ వర్గాలు చెప్పాయి. త్వరలో హెల్త్, మోటార్, ట్రావెల్ సెగ్మెంట్లలో బీమా ఉత్పత్తులు మొదలుపెడుతామని కంపెనీ తెలిపింది.అప్‌స్టాక్స్‌తో మొదటి భాగస్వామిగా హెచ్డీఎఫ్సీ లైఫ్ జతైనట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా అప్‌స్టాక్స్ కోఫౌండర్ కవితా సుబ్రమణియన్ మాట్లాడుతూ..‘మా కంపెనీను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ ప్లాట్‌ఫామ్ సురక్షితంగా, వేగంగా పనిచేస్తోంది. వినియోగదారుల సంపదను సమర్థంగా నిర్వహించడంలో భాగంగా బీమా సేవలు ప్రారంభించాం. కొత్త బిజినెస్ మోడల్ వల్ల సంస్థకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’ అని అన్నారు.అప్‌స్టాక్స్ ఇప్పటికే స్టాక్ క్రయవిక్రయాలు, ఐపీఓలు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లు, కమోడిటీలు, కరెన్సీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పీర్-టు-పీర్ లెండింగ్, ప్రభుత్వ బాండ్లు, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు సహా అనేక రకాల సేవలందిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.1,000 కోట్లకు చేరినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కస్టమర్లకు సంబంధించి పది రెట్లు వృద్ధి నమోదు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.ఫోన్‌పే వంటి ఫిన్‌టెక్ కంపెనీలు సైతం బీమా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్‌స్టాక్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో మార్కెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2023, ఏప్రిల్ 24న వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్‌లో రూ.426 కోట్లు పెట్టుబడి పెట్టిన విషయం తెలిసిందే.
వీడియోలు
బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నటి హేమ
రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్
ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక
మా ఇంట్లోనే ఉన్నా.. దయచేసి ఎవరూ నమ్మొద్దు: హీరో శ్రీకాంత్
జూన్ 4 తరువాత చూసుకుందాం: పెద్దిరెడ్డి
సస్పెండ్ అయి స్థానంలో కొత్త అధికారులు
"సాధించాం” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క..
చరిత్ర సృష్టించిన హైదరాబాద్ యువ కెరటం అభిషేక్ శర్మ..
దొంగ ఓట్ల కోసం చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర..
అమెరికా పారిపోయిన అయ్యా.. కొడుకులు
ఫ్యామిలీ
కలబంద రసంతో.. ఉపయోగాలెన్నో..!
కలబందలో మొక్కలకు కావలసిన పోషకాలు, యాంటిఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. అమైనా ఆమ్లాలు, కాల్షియం, జింక్, మెగ్నీషియం వంటివి 75 రకాలపోషకాలుంటాయి.. ఇది మొక్కలను క్రిములు, వైరస్లు, శిలీంధ్రాల నుంచి కాపాడుతుంది. కలబంద ఆకు ముక్కలను మిక్సీలో వేస్తే రసం వస్తుంది. స్పూనుతో ఈ కింద చెప్పిన కొలతలో ఇంటిపంటలు / మిద్దెతోటల సాగులో వాడుకోవచ్చు..1. ఒక టీస్పూను కలబంద రసాన్ని ఒక లీటరు నీటితో కలిపి మొలక దశలో లేదా చిన్న మొక్కలు స్ప్రే చేయవచ్చు. వారానికి ఒక సారి చేస్తే సరి΄ోతుంది.2. ఒక టేబుల్ స్పూన్ రసాన్ని ఒక లీటరు నీటితో కలిపి మొక్క ఉన్న కుండీలోపోయాలి. ఇలా నెలకు ఒకసారి చేయాలి. దీనివలన మొక్కకు ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది.3. మొక్కను ఒక కుండీ నుంచి వేరే కుండీలోకి మార్చినప్పుడు లీటరు నీటికి ఒక టేబుల్ స్పూన్ రసాన్ని కలిపి కుండీలోపోయాలి. ఇలా చేస్తే మొక్క మార్పిడి వత్తిడికి గురికాదు.4. ఎరువుగా వాడాలి అన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల కలబంద రసాన్ని లీటరు నీటితో కలిపి మొక్క కుండీలోపోయాలి. ఇలా 15 రోజులకు ఒకసారి వాడాలి.5. స్ప్రే చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ వాడాలి లీటరు నీటికి. ఆకుల అడుగు భాగంలో మాత్రమే స్ప్రే చేయాలి. దీనివలన మొక్క తొందరగాపోషకాలను గ్రహిస్తుంది.6. రూటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఏదైనా మొక్క కొమ్మను విరిచి నాటుకోవాలంటే, నేరుగా కలబంద రసంలో అరగంట కొమ్మ చివరను నానబెట్టి, ఆ తరువాత నాటవచ్చు.7. ఇది బూడిద తెగులును అరికడుతుంది. గమనిక: కలబంద రసం తయారు చేసిన అర గంట లోపే వాడాలి. పులిస్తే అందులో ఉన్నపోషకాలు కొన్నిపోతాయి.– విజయలక్ష్మి, బెంగళూరు మిద్దెతోట బృందంఇవి చదవండి: ఫోన్ కనపడకపోతే.. ప్రాణం పోతోందా? అయితే మీకీ వ్యాధి ఉన్నట్లే!
ఫోన్ కనపడకపోతే.. ప్రాణం పోతోందా? అయితే మీకీ వ్యాధి ఉన్నట్లే!
ఒక్క నిమిషం.. ఫోన్ కనపడదు. చాలా భయం. చాలా ఆందోళన. చాలా కోపం. చాలా వణుకు. ఈ లక్షణాలన్నీ ఉంటే మీకు ‘నో మొబైల్ ఫోన్ ఫోబియా’ లేదా ‘నోమొఫోబియా’ ఉన్నట్టే. ఇది మీకు చేటు చేస్తుంది. దీన్నుంచి బయటపడమని సైకియాట్రిస్ట్‌లు సూచిస్తున్నారు.ఇంతకుముందు మనిషి రెండు చేతులు రెండు కాళ్లతో ఉండేవాడు. ఇప్పుడు అతని చేతికి అదనపు అంగం మొలుచుకుని వచ్చింది – మొబైల్ ఫోన్. అది లేకుండా గతంలో మనిషి బతికాడు. ఇప్పుడూ బతకొచ్చు. కాని మొబైల్ ఫోన్‌తో మన వ్యక్తిగత, కుటుంబ, వృత్తిగత, స్నేహ, సాంఘిక సమాచార సంబంధాలన్నీ ముడి పడి ఉన్నాయి కాబట్టి అది కలిగి ఉండక తప్పదు. అలాగని అదే జీవితంగా మారితే నష్టాలూ తప్పవు. ఐదు నిమిషాల సేపు ఫోన్ కనిపించకపోతే తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నా, సినిమాకు వెళ్లినప్పుడైనా మూడు గంటల సేపు ఫోన్ స్విచ్చాఫ్ చేయలేకపోయినా, రాత్రి ఫోన్ ఎక్కడో పడేసి మీరు మరెక్కడో నిద్రపోలేకపోయినా, ఎంత ఆత్మీయులొచ్చినా ఫోన్ వైపు చూడకుండా దానిని చేతిలో పెట్టుకోకుండా వారితో గడపలేకపోయినా మీకు ‘నోమొ ఫోబియా’ ఉన్నట్టు.కేస్‌స్టడీ.. 1ఆఫీస్ నుంచి హుషారుగా ఇల్లు చేరుకున్న సుందర్ కాసేపటికి బట్టలు మార్చుకుని ముఖం కడుక్కుని రిలాక్స్ అయ్యాడు. ఫోన్ గుర్తొచ్చింది. టీ పాయ్ మీద లేదు. టీవీ ర్యాక్ దగ్గర లేదు. కంగారుగా భార్యను పిలిచి ఆమె ఫోన్‌తో రింగ్ చేయించాడు. రింగ్ వస్తోంది కాని ఇంట్లో ఆ రింగ్ వినపడలేదు. సుందర్‌కు చెమటలు పట్టాయి. మైండ్ పని చేయలేదు. ఎక్కడ మర్చిపోయాడు. కారు తాళాలు తీసుకుని కిందకు వెళ్లి కారులో వెతికాడు. లేదు. మళ్లీ పైకి వచ్చి ఇల్లంతా వెతికాడు. దారిలో పెట్రోలు పోయించుకున్నాడు... అక్కడేమైనాపోయిందా? మరోచోట ఫ్రూట్స్ కొని ఫోన్‌పే చేశాడు. అక్కడ పడేసుకున్నాడా? ఫోన్.. మొబైల్ ఫోన్.. అదిపోతే... అదిపోతే... మైండ్ దిమ్మెక్కిపోతోంది. సరిగ్గా అప్పుడే అతని కూతురు వచ్చి రక్షించింది. ‘నాన్నా.. ప్యాంట్ జేబులో మర్చిపోయావు. వాల్యూమ్ లో అయి ఉంది’ అని. ఫోన్ కనపడకపోతే ప్రాణంపోతుంది ఇతనికి. అంటే నోమొ ఫోబియా ఉన్నట్టే.కేస్ స్టడీ.. 2ఇంటికి చాలా రోజుల తర్వాత గెస్ట్‌లు వచ్చారు. వారు ఎదురుగా కూచుని మాట్లాడుతున్నారు. ఇంటి యజమాని విజయ్ ఫోన్ చేతిలో పట్టుకుని వారితో మాట్లాడుతున్నాడు. ప్రతి నిమిషానికి ఒకసారి ఫోన్ చూస్తున్నాడు. వాళ్లతో మాట్లాడుతూనే ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్నాడు. వాళ్లతో మాట్లాడుతూనే వాట్సప్ చెక్ చేస్తున్నాడు. వాళ్ల వైపు ఒక నిమిషం ఫోన్ వైపు ఒక నిమిషం చూస్తున్నాడు. వాళ్లకు విసుగొచ్చి కాసేపటికి లేచి వెళ్లిపోయారు. విజయ్‌కు నోమొ ఫోబియా ఉంది.కేస్ స్టడీ.. 3దుర్గారావు ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్లి హోటల్లో దిగాడు. దిగాక గాని తెలియలేదు అక్కడ ఫోన్ సిగ్నల్స్ అందవని. కాల్స్ ఏమీ రావడం లేదు. డేటా కూడా సరిగ్గా పని చేయడం లేదు. ఆ ఊళ్లో వేరే మంచి హోటళ్లు లేవు. సిగ్నల్ కోసం హోటల్ నుంచి గంట గంటకూ బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇక అక్కడ ఉన్నంత సేపు దుర్గారావుకు అస్థిమితమే. చిరాకే. ఏ కాల్ మిస్సవుతున్నానో అన్న బెంగే. ఏ మెసేజ్ అందడం లేదో అన్న ఆందోళనే. ఇదీ నోమొ ఫోబియానే.నష్టాలు..1. నోమొఫోబియా ఉంటే మీ అనుబంధాలు దెబ్బ తింటాయి. ఎందుకంటే అనుబంధాల కంటే ఫోన్‌తో బంధం ముఖ్యమని భావిస్తారు కాబట్టి.2. నోమొ ఫోబియా మీ లక్ష్యాలపై మీ ఫోకస్‌ను తప్పిస్తుంది. మీరు ఎక్కువసేపు ఒక పని మీద మనసు లగ్నం చేయరు. దీనివల్ల చదువుకునే విద్యార్థి, పని చేయాల్సిన ఉద్యోగి, ఇంటిని చక్కదిద్దే గృహిణి అందరూ క్వాలిటీ వర్క్‌ను నష్టపోతారు. పనులు పెండింగ్‌లో పడతాయి.3. నోమొ ఫోబియా కలిగిన వారు తమను తాము నమ్ముకోవడం కన్నా ఫోన్‌ను నమ్ముకుంటారు. చివరకు ఫోన్ లేకుండా ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టడానికి కూడా ఇష్టపడరు.4. సోషల్ మీడియా సంబంధాలే అసలు సంబంధాలుగా భావించి అసలు సంబంధాలు కోల్పోతారు.5. ఫోన్ ఇతరుల చేతుల్లో పడితే వారు ఏమి ఆరా తీస్తారోనని అనుక్షణం ఫోన్‌ని కనిపెట్టుకుని ఉంటారు.ఎలా బయటపడాలి?1. ఖాళీ సమయాల్లో మెల్లమెల్లగా ఫోన్‌ను పక్కన పడేయడంప్రాక్టీస్ చేయండి.2. రోజులో ఒక గంటైనా ఏదో ఒక సమయాన ఫోన్ స్విచ్చాఫ్ చేయడం మొదలుపెట్టండి.3. సినిమాలకు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు ఫోన్ ఇంట్లో పడేయడమో, మ్యూట్ చేసి జేబులో పడేయడమో చేయండి.4. ఫోన్ నుంచి దృష్టి మరల్చే ఆటలు, పుస్తక పఠనం, ఇతర హాబీలపై దృష్టి పెట్టండి.5. యోగా, ప్రాణాయామం చేయడం మంచిది.6. ఫోన్లో మీ కాంటాక్ట్స్, ముఖ్యమైన ఫొటోలు, ఇతర ముఖ్య సమాచారం పర్సనల్ కంప్యూటర్లోనో మెయిల్స్లోనో నిక్షిప్తం చేసుకుని ఫోన్ ఎప్పుడుపోయినా మరో సిమ్ కొనుక్కోవచ్చు అనే అవగాహన కలిగి ఉంటే నోమొఫోబియాను దాదాపుగా వదిలించుకోవచ్చు.ఇవి చదవండి: Fauzia Arshi - ఆకాశమే హద్దు!
Fauzia Arshi: ఆకాశమే హద్దు
డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా బాలీవుడ్లో గుర్తింపు పొందిన ఫౌజియా ఆర్షి మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ పుస్తకాల రచయిత్రి, గిటారిస్ట్, సింగర్, మ్యూజిక్ కంపోజర్, డైలాగ్ రైటర్. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎంటర్ ప్రెన్యూర్‌గా కూడా విజయపథంలో దూసుకుపోతోంది. ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తాజాగా మరో సవాలును స్వీకరించనుంది.ఖాళీగా కూర్చోకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఫౌజియా ఆర్షి పెట్టింది పేరు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఫౌజియాకు టైమ్ అంటే కొత్త విషయం తెలుసుకోవడం. కొత్త కళలో అక్షరాలు దిద్దడం. కాలాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న ఆమె కృషి వృథా పోలేదు. ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ అని ప్రపంచం గుర్తించేలా చేసింది.‘హోగయా దిమాగ్ క దహీ’ బాలీవుడ్ సినిమాతో నవ్వులు పూయించింది. ఈ రోరింగ్ కామెడీ ఫిల్మ్‌లో ఓంపురి, రాజ్‌పాల్ యాదవ్‌లాంటి నటులు నటించారు. ఫస్ట్–జెనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా టీనేజ్లోనే తన వ్యాపారదక్షతను చాటుకుంది ఫౌజియా.‘ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్మెంట్’ పేరుతో ఆమె రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. మేనేజ్మెంట్ డిపొ్లమా కోర్సుల విద్యార్థులకు బాగా ఉపకరించే ఈ పుస్తకం ప్రపంచ మార్కెటింగ్‌కు సంబంధించిన ఆర్థిక, రాజకీయ, భౌగోళిక వాతావరణాన్ని కళ్లకు కడుతుంది. ‘ది సన్ రైజెస్ ఫ్రమ్ ది వెస్ట్’ అనేది దీనికి పూర్తిగా భిన్నమైన పుస్తకం. ‘ఏది వాస్తవం?’ అంటూ వాస్తవాన్ని గురించి లోతుగా విశ్లేషించే పుస్తకం. తాత్విక ఛాయలు కనిపించే ఈ పుస్తకం రకరకాల చుక్కలను కనెక్ట్ చేసి ఒక రూపాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది.ఎంత అలవోకగా పుస్తకం రాయగలదో అంతే అలవోకగా రాగం తీయగలదు. అప్పటికప్పుడు పదాలు అల్లుతూ పాట పుట్టించగలదు. కాన్వాస్‌పై కనువిందు చేసే చిత్రాన్ని సృష్టించగలదు. ఇక గిటారిస్ట్‌గా ఆమె నైపుణ్యం సరేసరి. మేనేజ్మెంట్ప్రొఫెషనల్గా ఎంత జటిలమైన విషయాలనైనా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించగలదు.ఫౌజియాకు చెందిన డైలీ మల్టీమీడియా లిమిటెడ్ (డిఎంఎల్)... సినిమాలు, టెలివిజన్ కంటెంట్, యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్, ఈవెంట్ ఆర్గనైజింగ్, పొలిటికల్ క్యాంపెయిన్‌కు సంబంధించిన కంపెనీ.సామాజిక సేవారంగంలో చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకొని ఫౌజియాను బ్రిటన్ పార్లమెంట్ సత్కరించింది. ఫౌజియాకు ఇంగ్లీష్ భాషలో ఇష్టమైన మాట ‘న్యూ ఛాలెంజ్’. ఎప్పటికప్పుడు కొత్త ఛాలెంజ్‌లను అధిగమిస్తూ తన సత్తా చాటుతోంది.తాజా విషయానికి వస్తే...ముంబైకి చెంది ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్ ్రపాంతీయ విమానయాన సంస్థ ‘ఫైబిగ్’ను కొనుగోలు చేసే ప్రక్రియ జరుగుతోంది. లావాదేవీలు పూర్తయిన తరువాత ‘ఫ్లైబిగ్’ను మరిన్ని విమానాలతో విస్తరించనున్నారు. ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్‌కు ఫౌజియా ఆర్షి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంది. ‘ఫ్లైబిగ్’ రూపంలో మరో సవాలు ఆర్షి ముందుకు రానుంది. ఈ సవాలును కూడా ఫౌజియా విజయవంతంగా అధిగమించగలరన్నది ఆమె గురించి తెలిసిన వారు కాస్త గట్టిగానే చెప్పేమాట.
చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్‌వేర్ ఫ్యాషన్ షో!
సౌదీ అంటూ ఉలా ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు అందరూ అభిప్రాయం మార్చుకునేలా సరికొత్త సంస్కరణలకు. శ్రీకారం చుడుతోంది. అసలు సౌదీలో మహిళలు మొత్తం శరీరం అంతా కంపి ఉంచేలా బట్టలు ధరించాలి. అలాంటి సంప్రదాయవాద దేశంలో తొలిసారి స్విమ్‌సూట్ ఫ్యాషన్ షోని భారీ ఎత్తున నిర్వహించింది. ఈ నిర్ణయం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొనవచ్చు. ఈ స్విమ్‌సూట్ ఫ్యాషన్ గత శుక్రవారమే సెయింట్ రెజిస్ రెడ్ సీ రిసార్ట్‌లోని రెడ్సీ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా జరిగింది. ఈ షోలో మెరాకో డిజైనర్ యాస్మినా క్వాన్జల్ వన్ పీస్ ఎరుపు రంగు స్విమ్‌సూట్, నీలరంగులో స్వీమ్సూట్లలో సందడి చేసింది. ఈ షోలో పాల్గొన్న చాలా మోడల్‌లు భూజాలు బహిర్గతమయ్యేలా స్విమ్‌సూట్ ధరించారు. ఈ క్రమంలో డిజైనర్ క్వాన్జల్ మీడియాతో మాట్లాడుతూ.."ఈ దేశం చాలా సంప్రదాయవాదంగా ఉంది. కానీ తాము అరబ్ ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించే సొగసైన స్విమ్‌సూట్‌లో కనిపించేందుకు యత్నం చేస్తున్నాం. ఇది తమ గౌరవంగా భావిస్తున్నాం." అని తెలిపింది క్వాన్జల్. అంతేగాదు నిజానికి సౌదీ అరేబియాలో స్విమ్‌సూట్ ఫ్యాషన్‌షో అనేది చరిత్రాత్మకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి షో నిర్వహించడం సౌదీలో ఇదే తొలిసారి. Red Sea Fashion Week లో భాగంగా సౌదీ అరేబియాలో ఓ రిసార్ట్‌లో ఈ షో నిర్వహించారు. Red Sea Globalలో భాగంగా ఏర్పాటు చేసిన రెడ్ సీ రిసార్ట్‌లో ఈ షో జరగడం మరింత ఆసక్తికరంగా మారింది. విజన్ 2030లో భాగంగా ఈ రిసార్ట్ని నిర్మించింది సౌదీ ప్రభుత్వం. అందరి దృష్టి పడేలా ఇక్కడే కావాలని ఈవెంట్స్ చేస్తోంది.ఎన్నో సంస్కరణలు..ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హయాంలో ఇలాంటి సంస్కరణలు ఎన్నో జరుగుతున్నాయి. 2017లో అధికారంలోకి వచ్చిన సల్మాన్ అప్పటి నుంచి సామాజిక సంస్కరణలను కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు సౌదీలో ప్రార్థన చేయకపోతే పోలీసులు వెంటపడి మరీ కొట్టేవాళ్లు. మాల్స్‌లో ఉన్నా సరే బయటకు ప్రేయర్ రూమ్‌కి తీసుకెళ్లి మరీ బలంవంతంగా ప్రార్థన చేయించే వాళ్లు. ఈ నిబంధనపై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. సల్మాన్ వచ్చిన తర్వాత నుంచి ఈ నిర్బంధపు ప్రార్థనల్ని పక్కన పెట్టేశారు. అంతే కాదు సినిమా హాల్స్‌ని మళ్లీ తెరిపించారు. మ్యూజిక్ ఫెస్టివల్స్‌లో పురుషులు, మహిళలు కలిసే కూర్చునే విధంగా నిబంధనలు సవరించారు. టూరిజం సెక్టార్లో రాణిస్తున్న సౌదీ అరేబియా ఫ్యాషన్ రంగంలోనూ అదే స్థాయిలో సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు మహమ్మద్ బిన్ సల్మాన్.2022 లెక్కల ప్రకారం సౌదీలో ఫ్యాషన్ ఇండస్ట్రీ విలువ 12.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ రంగంలో దాదాపు 2 లక్షల 30 వేల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. ఎవరైనా ఏమైనా ప్రశ్నించినా సరే..స్విమ్‌సూట్ ఫ్యాషన్ షో సౌదీలో ఎందుకు పెట్టకూడదు అని సల్మాన్ఎ దురు ప్రశ్న వేస్తున్నారు. ఈ ఏడాది జరగనున్న మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియాకి చెందిన రూమీ అల్ఖాతానీ పాల్గొననుంది. ఈ పోటీలో సౌదీ పాల్గొనడం ఇదే తొలిసారి.SAUDI ARABIA HOSTS A SWIMSUIT FASHION SHOW FOR THE FIRST TIME pic.twitter.com/eOcLRnv2K9— Sulaiman Ahmed (@ShaykhSulaiman) May 18, 2024 (చదవండి: బరువు తగ్గాలని రైస్‌కి దూరంగా ఉంటున్నారా? ఫిట్నెస్ కోచ్ ఏమంటున్నారంటే..)
న్యూస్ పాడ్‌కాస్ట్
దక్షిణాదిలో బీజేపీకే అత్యధిక లోక్‌సభ సీట్లు... ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ విశ్వాసం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
రూ.200 కోట్లు కొట్టేశారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు (టీఎస్‌సీబీ) మేనేజర్ భర్త, కుమారుడు కలిసి ఏర్పాటు చేసిన ప్రియాంక ఫైనాన్స్ సంస్థ రూ.200 కోట్లు మేర స్వాహా చేసి బిచాణా ఎత్తేసింది. అధిక వడ్డీ పేరుతో అనేక మంది నుంచి డిపాజిట్లు సేకరించి ఐపీ పిటిషన్ దాఖలు చేసింది. బాధితుల ఫిర్యాదుతో సోమ వారం కేసు నమోదు చేసుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు దర్యాప్తు బాధ్యతల్ని సిట్‌కు అప్పగించారు. సోమవారం సీసీఎస్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన నిమ్మగడ్డ వాణి బాల, నేతాజీ భార్యాభర్తలు. సైదాబాద్‌లో వీళ్లు నివసిస్తుండగా... వాణి బాల ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌లో విధుల్లో చేరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది టీఎస్సీబీగా మారగా ప్రస్తుతం వాణి బాల మేనేజర్ స్థాయిలో పని చేస్తున్నారు. 15 శాతం వడ్డీ ఇస్తామని చెప్పి.. దాదాపు 20 ఏళ్ల నుంచి వాణి బాల ఓ పథకం ప్రకారం బ్యాంక్‌కు వచ్చే వినియోగదారులను ఆకర్షిస్తూ వచ్చారు. టీఎస్సీబీలో డిపాజిట్ చేస్తే సాలీనా కేవలం 6 నుంచి 7% మాత్రమే వడ్డీ వస్తుందని, అబిడ్స్‌లోని టీఎస్‌సీబీ సమీపంలోనే తన భర్త నేతాజీ నెలకొలి్పన ఫైనాన్స్ సంస్థ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో డిపాజిట్ చేస్తే 15శాతం వడ్డీ వస్తుందని నమ్మబలికారు. బ్యాంకు కస్టమర్లతో పాటు సహోద్యోగులు, స్నేహితులను ఇందులో డిపాజిట్ చేసేలా ప్రేరేపించారు. చాలాకాలం చెల్లింపులు సక్రమంగా జరగడంతో అనేక మంది దృష్టి ఈ ప్రైవేట్ సంస్థపై పడింది.బ్యాంకులో భారీ మొత్తం డిపాజిట్ చేస్తే ప్రతి ఏడాదీ ఐటీ శాఖ వారికి లెక్కలు చూపాలని, తమ సంస్థలో ఆ ఇబ్బంది ఉండదంటూ మరికొందరిని ఆకర్షించారు. డిపాజిట్లుగా సేకరించిన మొత్తంతో ఏం చేస్తున్నారంటూ ఇటీవల కొందరు ప్రియాంక సంస్థ నిర్వాహకులను ప్రశ్నించారు. దీనికి నిర్వాహకులు తమకు జీడిమెట్ల, బెంగళూర్‌లో వ్యాపారాలు, కర్మాగారాలు ఉన్నాయంటూ చెప్పి నమ్మిస్తూ వచ్చారు. దీంతో వీరి వద్ద డిపాజిట్లు పెరిగాయి. గరిష్టంగా రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేసిన వాళ్లూ ఉన్నారు. కాగా, ఆ ఫైనాన్స్ సంస్థలో ఆమె కుమారుడు శ్రీహర్ష కీలకంగా వ్యవహరించాడు. ఆఫీసు, ఇంటికి తాళాలు: ఈ నెల 14న ఆఖరుసారిగా కార్యాలయం తెరిచిన నేతాజీ ఆయన కుమారుడు శ్రీహర్ష సిబ్బందిని హఠాత్తుగా పంపేసి తాళం వేశారు. ఈ విషయం తెలిసిన బాధితులు సైదాబాద్‌లోని ఇంటికి వెళ్లగా అక్కడా తాళమే కనిపించింది. దీంతో తాము మోసపోయామని భావించి అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ మొత్తంతో ముడిపడిన కుంభకోణం కావడంతో సీసీఎస్‌కు వెళ్లాల్సిందిగా అక్కడి అధికారులు సూచించారు. దీంతో వాళ్లు సోమవారం సీసీఎస్ డీసీపీ ఎన్.శ్వేతను కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బాధితుల్లో అనేక మంది వృద్ధులు ఉన్నారని, వీళ్లంతా తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రియాంక సంస్థలో పెట్టుబడిగా పెట్టారని అధికారులు చెప్తున్నారు. ఆర్నెల్లుగా వడ్డీల చెల్లింపుల్లో జాప్యం గతేడాది నవంబర్, డిసెంబర్ నుంచి వడ్డీల చెల్లింపులు సక్రమంగా జరగట్లేదు. అదేమని కొందరు ప్రశ్నించగా... ఎన్నికల సమయం కావడంతో డబ్బుల లావాదేవీలు తగ్గాయని అందుకే వడ్డీలు ఇవ్వడంలో ఆలస్యం అవుతోందంటూ నిర్వాహకులు చెప్పుకొచ్చారు. ఈ నెలాఖరుకు వాణి బాల సరీ్వసు పూర్తి కావస్తుండటంతో పదవీ విరమణ పొందాల్సి ఉంది. దీంతో ఈ నెల 3న ప్రియాంక సంస్థ నిర్వాహకులు సిటీ సివిల్ కోర్టులో దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేశారు.
Hyderabad: హిట్ అండ్ రన్ కేసు నమోదు
నల్లకుంట: మద్యం మత్తులో కారు నడిపి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి వీరంగం సృష్టించిన ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన యడవల్లి శ్రీనివాస్ సీతారమేష్(46)టీచర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 18న రాత్రి అతను బైక్‌పై విద్యానగర్ లక్కీ కేఫ్ సమీపంలోని ఐరావత్ ఐ క్లినిక్ రోడ్డులో వెళుతున్నాడు. అదే సమయంలో వేగంగా దూసుకువచి్చన కారు ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టడంతో రమేష్ కిందపడ్డాడు. ఈ ఘటనపై బాధితుడు రమేష్ ఈ నెల 19న నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై రమాదేవి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఎస్సై పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశామన్నారు. స్థానికులు కారును అడ్డుకుని కారు నడుపుతున్న వ్యక్తిని నిలదీస్తూ సెల్ ఫోన్లో వీడియో తీశారు. ప్రమాద సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.కారు కుడివైపు ముందు డోర్ పక్కన బీరు బాటిల్ ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌గా మారింది. కాగా ఘటన జరిగిన సమయంలో కారు నడుపుతున్న వ్యక్తి పక్కన ఓ చిన్నారి కూడా ఉండటం గమనార్హం.
భార్య కళ్ల ముందే భవనంపై నుంచి దూకి భర్త ఆత్మహత్య
బంజారాహిల్స్: భార్య కాపురానికి రావడం లేదనే బాధతో ఓ యువకుడు ఆమె కళ్ల ముందే మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివీ... కడప ఎర్రముఖపల్లి సర్కిల్లో నివసించే పసుపులేటి మణికంఠ (33) 2018 మే 10వ తేదీన బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–10లోని ఇబ్రహీంనగర్‌కు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఏడాది పాటు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–14లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం చేశారు. మణికంఠ పద్ధతులతో విసిగిపోయిన యువతి ఇబ్రహీంనగర్‌లోని తన పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి మణికంఠ తీవ్ర నిరాశా నిస్పృహలతో గడపసాగాడు. భార్యను తనతో పాటు రమ్మని పిలవడానికి ఆదివారం రోజు రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. తనతో పాటు రావాలని కోరాడు. నీ పద్ధతులు నచ్చకనే వేరుగా ఉంటున్నానని, నీవు మారవని రాలేనని భార్య తెగేసి చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తన భార్య ఎప్పటికీ ఇక రాదని, ఈ జీవితం వృథా.. బతికి వేస్ట్ అనుకుంటూ భార్య చూస్తుండగా మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడికక్కడే మణికంఠ మృతి చెందగా ఈ విషయాన్ని బాధిత యువతి మణికంఠ బాబాయి వెంకటరమణకు తెలియజేసింది. వెంకటరమణ ఇచి్చన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సవతి తల్లి కాదు రాక్షసి
యశవంతపుర: తల్లి లేని పాపను అమ్మలా చూసుకోవాల్సిన సవతి తల్లి ఈర్ష అసూయతో రాక్షసిలా మారింది. మూడేళ్ల చిన్నారిని కొట్టి చంపిన ఘటన బెళగావి జిల్లా కంగ్రాళి గ్రామంలో జరిగింది. వివరాలు.. సీఆర్పీఎఫ్లో జవాన్‌గా పని చేస్తున్న రాయణ్ణ మొదటి భార్య గతంలో చనిపోయింది. వీరికి ఒక పాప ఉంది. సప్నా అనే యువతిని రాయణ్ణ రెండో పెళ్లి చేసుకున్నాడు. అతడు వేరే రాష్ట్రంలో డ్యూటీలో ఉన్నాడు. ఇంటి వద్ద సప్నా పసిపాపను నిత్యం హింసించేది. ఇదే రీతిలో సోమవారం కూడా పాపను తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు విడిచింది. పాప వాంతులు చేసుకుంటూ చనిపోయిందని సప్నా నాటకం ఆడింది. ఆమె హత్య చేసిందని పాప అవ్వ, చిన్నాన్న కేసు పెట్టారు.